WEBVTT

00:00:06.120 --> 00:00:07.920 align:center
కిల్లర్ రెండు కత్తులు వాడలేదు.

00:00:08.000 --> 00:00:09.720 align:center
రెండు బ్లేడులున్న ఒకే కత్తి.

00:00:09.800 --> 00:00:10.920 align:center
వాడు జిమ్మీ కుక్!

00:00:11.000 --> 00:00:12.000 align:center
నువ్వు దొబ్బేస్తావా?

00:00:12.080 --> 00:00:14.560 align:center
పైకి! పైకి లేపు! మళ్లీ పైకి లేపు!

00:00:15.040 --> 00:00:17.720 align:center
చెత్త కాదు, కానెల్.
అది కోడ్ బ్లాక్ వినాశనం.

00:00:17.840 --> 00:00:20.160 align:center
అనుమానితులను నా ముందుంచండి లేదా పోండి.

00:00:20.240 --> 00:00:21.760 align:center
జాబితాలో 27వ అంకె చూడు.

00:00:22.560 --> 00:00:23.840 align:center
శామ్ చనిపోయిన రాత్రి.

00:00:23.920 --> 00:00:24.920 align:center
మైక్ ఆమెకు స్పీడింగ్ టిక్కెట్ ఇచ్చాడు.

00:00:25.000 --> 00:00:25.840 align:center
పురుష
హంతకి

00:00:25.920 --> 00:00:26.840 align:center
కిల్లర్ డైక్!

00:00:28.520 --> 00:00:31.320 align:center
స్కై, మేము నీతో మాట్లాడాలి.

00:00:31.400 --> 00:00:33.200 align:center
ఒకళ్లను చచ్చేంతగా ద్వేషించినా

00:00:33.280 --> 00:00:36.000 align:center
వారి చావు కోరుకున్నా
చంపకుండా ఉండటం సాధ్యమే!

00:00:36.080 --> 00:00:39.520 align:center
మీ నాన్న చనిపోయిన రాత్రి
డెడ్‌లాక్‌కు ఎందుకు వచ్చావు?

00:00:39.600 --> 00:00:40.680 align:center
నో కామెంట్.

00:00:40.760 --> 00:00:42.960 align:center
తేదీ ముందే గుర్తు వచ్చుండేది నీకు,

00:00:43.040 --> 00:00:45.400 align:center
ఆ వారాంతం నువ్వు నాతో గడిపుంటే

00:00:45.480 --> 00:00:49.640 align:center
బదులుగా నువ్వు వేరేదానితో
సెక్స్ చేస్తున్నావు!

00:00:50.560 --> 00:00:52.240 align:center
ఇది పని అంతే, డల్సీ.

00:00:53.040 --> 00:00:55.960 align:center
ప్రస్తుతం, నా పని మనకన్నా ఎక్కువ, కాథ్.

00:00:56.040 --> 00:00:58.120 align:center
నీకన్నా ఎక్కువ.

00:01:02.440 --> 00:01:03.440 align:center
విందును ఆపండి!

00:01:03.520 --> 00:01:05.560 align:center
-నేను ఇప్పుడే అక్కడికి వెళ్లాలి!
-ఇక--

00:01:07.400 --> 00:01:09.200 align:center
అక్కడ శవాలు ఉన్నాయి!

00:01:32.520 --> 00:01:34.040 align:center
అది ఐదవ శవం.

00:01:34.120 --> 00:01:37.360 align:center
-ఆరవది.
-ఆరవది. మరీ... మరీ మంచిది.

00:01:49.760 --> 00:01:53.560 align:center
అయితే, శ్రీమతితో రాత్రి
ఎలా గడిచింది మరి?

00:01:53.640 --> 00:01:54.880 align:center
అంతా సర్దుకుందా?

00:01:54.960 --> 00:01:56.520 align:center
మాట్లాడాలనుందా?

00:01:56.600 --> 00:01:59.400 align:center
పద వైను తాగుతూ
నా కూలిపోతున్న కాపురాన్ని చర్చిద్దాం.

00:01:59.480 --> 00:02:01.760 align:center
-నిజంగానా?
-కాదు, అంత లేదు.

00:02:01.880 --> 00:02:03.720 align:center
మగవాళ్లకు గురి పెట్టిన కిల్లర్.

00:02:03.800 --> 00:02:06.120 align:center
-ఆరు శవాలు వరుసగా పెట్టారు...
-అవును.

00:02:06.200 --> 00:02:09.040 align:center
...క్రిస్టమస్ స్టాకింగ్స్ లాగా,
సరి చేద్దాం పద.

00:02:09.120 --> 00:02:10.480 align:center
అదే నా ఉద్దేశ్యం కూడా.

00:02:11.400 --> 00:02:13.600 align:center
శ్రీమతితో విడిపోయింది నేను కాదుగా.

00:02:13.720 --> 00:02:16.240 align:center
చూడు, మేము విడిపోయే విడిపోయామో తెలియదు.

00:02:16.320 --> 00:02:21.120 align:center
అదంతా అనవసరం. ఈ శవాలు మన పరిధిలో
ఉన్నాయో లేదో చూద్దాం, సరేనా?

00:02:21.160 --> 00:02:23.000 align:center
-అబ్బబ్బా.
-హా, విన్నానులే.

00:02:23.120 --> 00:02:25.080 align:center
చూడు, ఇది కంపరమే...

00:02:25.960 --> 00:02:29.400 align:center
కానీ ఇది మన ఉద్యోగం,
అతను మన సహోద్యోగి.

00:02:31.320 --> 00:02:32.400 align:center
జేమ్స్!

00:02:33.400 --> 00:02:34.320 align:center
హాయ్!

00:02:34.400 --> 00:02:36.040 align:center
-దేవుడా.
-సన్నాసి!

00:02:36.120 --> 00:02:38.600 align:center
అబ్బా, కాలిన్స్, కంపు కొడుతున్నావు.

00:02:38.680 --> 00:02:42.120 align:center
అవును. నేను శవం బట్టలు
వేసుకున్నాను కనుక.

00:02:42.160 --> 00:02:43.160 align:center
నువ్వే చెప్పు.

00:02:43.280 --> 00:02:44.480 align:center
సరే.

00:02:44.560 --> 00:02:46.000 align:center
-హాయ్.
-హాయ్, పెద్ద కళ్లు.

00:02:46.080 --> 00:02:47.120 align:center
ఏంటి సంగతి?

00:02:47.760 --> 00:02:50.440 align:center
హే, బేబ్. ఇది పట్టుకుంటావా.

00:02:54.520 --> 00:02:55.840 align:center
సరే.

00:02:56.320 --> 00:02:59.200 align:center
సరే. ఈ శవాల గుర్తింపులు ఏమన్నా తెలుసా?

00:02:59.280 --> 00:03:01.720 align:center
తెలియదు. అది నా పని కాదు కనుక.

00:03:01.800 --> 00:03:02.960 align:center
సరే.

00:03:07.360 --> 00:03:09.360 align:center
అందరికీ గొంతు నొక్కిన గుర్తులున్నాయి,

00:03:09.440 --> 00:03:12.520 align:center
నాలుక కోసేసుంది, ఇంజెక్షన్ మచ్చ,
ఇత్యాదివన్నీ ఉన్నాయి.

00:03:12.600 --> 00:03:14.040 align:center
ఎంతసేపైంది చనిపోయి?

00:03:14.120 --> 00:03:16.800 align:center
48 గంటలు దాటుండదు,
మిగతావి కూడా అంతే.

00:03:16.880 --> 00:03:19.760 align:center
-అది సరిగ్గా లేదు.
-ఆరుగురు 48 గంటలలో చనిపోయారు.

00:03:19.880 --> 00:03:22.360 align:center
లేదు, సారీ,
అది సరే, ఎందుకంటే చెప్పానుగా,

00:03:22.440 --> 00:03:24.960 align:center
ఈ శవం మిగతా ఐదిటిలాగే
ఇంకా కుళ్లే దశలోకి రాలేదు.

00:03:25.040 --> 00:03:28.000 align:center
ఆ చేయి లేనిది కూడా!

00:03:28.080 --> 00:03:31.760 align:center
-గ్లెనాయిడ్ కావిటీ సరిగ్గా ఉంది.
-ఆరుగురు కనిపించలేదంటే తెలిసేదిగా.

00:03:31.840 --> 00:03:34.240 align:center
-ఇంకేదన్నా వివరణ ఉండాలి.
-అస్సలు లేదు.

00:03:34.320 --> 00:03:37.760 align:center
మీకు ఎక్కువ పని కలిగిందంటే
నేనేం చేయలేను, ఇది ఉద్యోగం అంతే.

00:03:38.320 --> 00:03:41.440 align:center
నేను పోస్ట్-మార్టం చేయాలి,
పోలీసు నివేదిక ఫైలు చేయాలి

00:03:41.520 --> 00:03:44.760 align:center
నేను టెడ్ఎక్స్ పర్త్లో ఉన్నప్పుడు
లాకప్ పగలగొట్టారు.

00:03:44.880 --> 00:03:46.560 align:center
-ఏంటి?
-ఏం పగలగొట్టారు?

00:03:46.640 --> 00:03:49.840 align:center
అవును, అది నిజమే.
లాక్ నెస్సీ అవశేషాలు దొంగిలించారు.

00:03:49.920 --> 00:03:51.520 align:center
అదెలా జరిగింది?

00:03:51.600 --> 00:03:53.920 align:center
నేను తరువాత ఏం చేసానన్నది ముఖ్యం.

00:03:54.000 --> 00:03:55.800 align:center
నేను జిమ్మీ కుక్ శిలువను

00:03:55.880 --> 00:03:59.640 align:center
పరీక్ష చేసి అందులో వాడిన రసాయనం
పడవలకు వాడేదని నిర్థారించాను.

00:03:59.720 --> 00:04:00.960 align:center
నా సిద్ధాంతం ఇది.

00:04:01.040 --> 00:04:05.000 align:center
కిల్లర్ తెరచాప కొయ్య దొంగిలించి
దానితో జిమ్మీ కుక్ శిలువ చేసాడు.

00:04:05.120 --> 00:04:06.680 align:center
క్షమించు, ఏంటదంతా?

00:04:06.760 --> 00:04:10.800 align:center
"చాలా ధన్యవాదాలు, ఈ పరిశోధన
నువ్వు లేకపోతే అసంపూర్ణం."

00:04:11.720 --> 00:04:15.120 align:center
అది జోక్ అంతే.
మీరు థాంక్స్ చెపితేగా ఎప్పుడైనా.

00:04:18.080 --> 00:04:19.200 align:center
అది నా సిద్ధాంతం.

00:04:19.240 --> 00:04:23.760 align:center
అది నీ సిద్ధాంతం. దానిని
అతడు దొంగిలించాడని కూడా అందరికీ తెలుసు.

00:04:23.800 --> 00:04:26.240 align:center
-మరీ మెత్తగా ఉంది.
-ఆపు!

00:04:26.920 --> 00:04:29.640 align:center
-పుట్టగొడుగును వత్తినట్టుగా.
-నీ వేళ్లు తియ్యి.

00:04:29.720 --> 00:04:32.000 align:center
-గ్లౌజులు వేసుకున్నాను!
-ఆగు, ఆగు.

00:04:33.360 --> 00:04:34.720 align:center
"పుట్టగొడుగును నొక్కినట్టు."

00:04:36.800 --> 00:04:38.040 align:center
గతం గుర్తుకువస్తుందా?

00:04:38.120 --> 00:04:41.040 align:center
జేమ్స్ కాకుండా ఇంకెవరైనా
ఫోరెన్సిక్స్ నుండి వస్తారా?

00:04:43.120 --> 00:04:45.800 align:center
-పేర్ల ముఖాలు చూడటం బాగుంది.
-మాకూ అంతే, కేట్.

00:04:45.920 --> 00:04:47.440 align:center
-అయితే, ఈ శవాలు--
-అవును.

00:04:47.520 --> 00:04:50.160 align:center
అయితే, కణజాల పొరలు పూర్తిగా చిరిగిపోయాయి.

00:04:50.240 --> 00:04:52.120 align:center
కణజాల ద్రవం కారుతుంది.

00:04:52.200 --> 00:04:56.160 align:center
సరే, కూల్. అయితే, కణజాలద్రవం కారుతుంది,
అంటే దానర్థం...

00:04:56.240 --> 00:04:57.680 align:center
-గడ్డ కట్టించారని.
-అవును.

00:04:57.760 --> 00:05:00.920 align:center
కరెక్ట్! గత రెండు రోజులుగా
కరుగుతున్నారన్నమాట.

00:05:01.440 --> 00:05:04.760 align:center
సారీ, మేడమ్స్.
వారిని ఎలాగో నీళ్లల్లో ముంచినట్టున్నారు.

00:05:04.800 --> 00:05:08.360 align:center
నీరు సరైన ఉష్ణోగ్రతతో
వారిని మామూలు చేసుండవచ్చు.

00:05:08.440 --> 00:05:09.920 align:center
అవును, భలే కనిపెట్టావు.

00:05:10.000 --> 00:05:13.800 align:center
సరే, కేట్. అయితే, సైద్ధాంతికంగా,
మన హంతకి వీళ్ళల్లో ఎవరినైనా

00:05:13.920 --> 00:05:16.800 align:center
గత ఐదేళ్లలో ఎప్పుడైనా చంపి ఉండవచ్చు?

00:05:16.920 --> 00:05:19.920 align:center
కచ్చితంగా, చావు తరువాత
వాటిని విడిగా గడ్డ కట్టించారు.

00:05:20.000 --> 00:05:22.200 align:center
ఐడీలు చాలా త్వరగా తెలుసుకోవాలిక?

00:05:22.320 --> 00:05:24.200 align:center
-సరే, ధన్యవాదాలు.
-సరే, మంచిది.

00:05:24.680 --> 00:05:27.480 align:center
-కానిస్టేబుల్?
-నాకా? వద్దు, నేను... చేయలేను.

00:05:27.560 --> 00:05:30.280 align:center
-తనకు భలే ఇష్టం.
-గ్లౌజులు వేసుకో, పెద్ద కళ్లు, పో.

00:05:30.360 --> 00:05:31.240 align:center
సరే.

00:05:32.280 --> 00:05:33.400 align:center
ఓరి దేవుడా!

00:05:35.320 --> 00:05:37.560 align:center
కిల్లర్ శవాలను దాస్తుంది అంటే,

00:05:37.640 --> 00:05:40.120 align:center
ఎందుకు ఇప్పుడు
హఠాత్తుగా అందిస్తుంది?

00:05:40.200 --> 00:05:42.880 align:center
నాకు తెలియదు,
కాల ప్రాముఖ్యత ఉందేమో.

00:05:43.440 --> 00:05:46.760 align:center
ఆమె ఏం ప్లాన్ చేసిందో కానీ
ఈ శవాల కుప్ప కాస్త

00:05:46.840 --> 00:05:49.040 align:center
ఏ మప్పెట్స్ క్రిస్టమస్ కేరల్లాగా ఉంది.

00:05:49.120 --> 00:05:50.720 align:center
ఇది మనలోనే దాచుకోలేము.

00:05:50.880 --> 00:05:53.000 align:center
-జనాలకు తెలియాలి.
-అవును.

00:05:53.080 --> 00:05:56.240 align:center
స్కైని జైలులో వేసాము కనుక
అంతా సర్దుకుంటుంది, కదా?

00:05:57.680 --> 00:05:59.880 align:center
కాలిన్స్? కదా?

00:06:03.640 --> 00:06:09.600 align:center
డెడ్‌లాక్

00:06:26.120 --> 00:06:28.800 align:center
సీనియర్ సార్జెంట్ కాలిన్స్!
డిటెక్టివ్ కాలిన్స్!

00:06:28.880 --> 00:06:30.960 align:center
సీనియర్ సార్జెంట్, డిటెక్టివ్ కాలిన్స్!

00:06:31.040 --> 00:06:32.240 align:center
శుభోదయం.

00:06:32.880 --> 00:06:36.240 align:center
నిన్న రాత్రి, ఆరు శవాలను
డెడ్‌లాక్ సరస్సు నుండి వెలికితీసాం.

00:06:36.320 --> 00:06:38.880 align:center
వాటి గుర్తింపు చర్యలు జరుగుతున్నాయి.

00:06:39.000 --> 00:06:41.000 align:center
ఇది సంక్లిష్టమైన మార్పు,

00:06:41.080 --> 00:06:44.800 align:center
పోలీసులకు పూర్తి విషయం తెలిసేదాకా,
మేము సంఘ సభ్యులందరికీ

00:06:44.880 --> 00:06:46.920 align:center
చాలా జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం.

00:06:47.000 --> 00:06:49.720 align:center
ఈ చావులన్నీ డెడ్‌లాక్ రిప్పర్ పనులేనా?

00:06:49.800 --> 00:06:53.560 align:center
ఇది మీరు పెట్టిన కొత్త పేరు
నేను అస్సలు వాడను.

00:06:53.640 --> 00:06:55.960 align:center
కానీ ఈ సరస్సులోని వ్యక్తులే

00:06:56.120 --> 00:06:58.080 align:center
డెడ్‌లాక్ హత్యలను చేస్తున్నారని

00:06:58.160 --> 00:07:00.600 align:center
బలమైన సాక్ష్యాలున్నాయి.

00:07:00.680 --> 00:07:03.560 align:center
స్కై ఓడ్వాయర్ను అనుమానంతో
అరెస్టు చేసారన్నది నిజమేనా?

00:07:03.640 --> 00:07:05.120 align:center
ప్రస్తుతానికి విచారణలో ఉంది.

00:07:05.200 --> 00:07:07.960 align:center
డెడ్‌లాక్ విడో జైలులో ఉంటే
ఆరుగురు ఎలా చనిపోయా--

00:07:08.040 --> 00:07:11.000 align:center
-"డెడ్‌లాక్ రిప్పర్."
-డెడ్‌లాక్ విడో జైలులో ఉంటే.

00:07:11.080 --> 00:07:14.480 align:center
మేము అన్నీ పరిశీలిస్తున్నాం,
మేము ఆ పేర్లను వాడము.

00:07:14.560 --> 00:07:17.400 align:center
ఈ మగవారికి లింగం కాకుండా
ఇంకేమన్నా పోలికలు ఉన్నాయా?

00:07:19.480 --> 00:07:22.160 align:center
చెప్పానుగా,
మేము ఇంకా కేసు నిర్మిస్తున్నాం.

00:07:22.240 --> 00:07:24.080 align:center
పోలీసులు డెడ్‌లాక్ పురుషుల వేటను

00:07:24.160 --> 00:07:26.560 align:center
ఆపటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

00:07:26.640 --> 00:07:29.280 align:center
వారి భద్రతకు
మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

00:07:29.360 --> 00:07:31.640 align:center
నేను చెప్పానుగా, మేగన్, ఈ మధ్యలో,

00:07:31.720 --> 00:07:35.320 align:center
అందరూ చాలా జాగ్రత్తగా
మసులుకోవాలని సూచిస్తున్నాం--

00:07:35.400 --> 00:07:37.800 align:center
లేదు! మా మగవారికి జాగ్రత్త అక్కరలేదు.

00:07:37.880 --> 00:07:39.800 align:center
మగవాళ్లం సమస్య కాదు!

00:07:39.880 --> 00:07:41.400 align:center
ఇతను ఇందులో భాగం కాదు.

00:07:41.480 --> 00:07:45.280 align:center
మమ్మల్ని చంపేవాళ్లే సమస్య.
అదంత అర్థం కాని విషయమా?

00:07:45.400 --> 00:07:49.120 align:center
లేదు, నన్ను నమ్ము, ఫిల్. ఆడవాళ్లం
దానిని బాగా అర్థం చేసుకోగలం.

00:07:49.200 --> 00:07:51.720 align:center
ఈ ఆడమేళాలు సరిగ్గా
పని చేస్తే చాలు మాకు.

00:07:51.800 --> 00:07:54.200 align:center
-మీ సూచనలకు ధన్యవాదాలు.
-వాళ్లు చేయకపోతే?

00:07:54.280 --> 00:07:57.480 align:center
మంచివారికి జరిగిన అన్యాయానికి
మేమే పగ తీర్చుకుంటాం.

00:07:57.560 --> 00:07:58.760 align:center
లేదు, అలా చేయలేవు, ఫిల్.

00:07:58.840 --> 00:08:01.560 align:center
అది అక్రమం కనుక
నువ్వు అలా చేయలేవు?

00:08:01.640 --> 00:08:02.480 align:center
కమీషనర్ హేస్టింగ్స్
కాల్

00:08:02.560 --> 00:08:05.280 align:center
-నేనిక జవాబులు ఇవ్వట్లేదు.
-ఇంకొక ప్రశ్న.

00:08:09.480 --> 00:08:12.000 align:center
-ఇది ఇంకో శవమా?
-కాదు, అది గొర్రెది.

00:08:12.080 --> 00:08:14.720 align:center
జనాలు ఈ సరస్సును
మరీ చెత్తబుట్టలాగా వాడుతున్నారు.

00:08:17.600 --> 00:08:21.280 align:center
అయితే, నిన్న రాత్రి మీరు చేసిన
తేలే నీటి సెక్స్ బొమ్మలు,

00:08:21.360 --> 00:08:24.600 align:center
సెక్స్ ఫెస్ట్ అదేదో చెత్త చూసారుగా అప్పుడు

00:08:24.680 --> 00:08:27.040 align:center
ఏమన్నా శవాలను చూసారా?

00:08:27.120 --> 00:08:31.320 align:center
అవును, డిటెక్టివ్, నేను కుండలో
పూలలాగా తేలుతున్న ఆరు శవాలను చూసాం,

00:08:31.400 --> 00:08:35.680 align:center
కానీ వాటిని వదిలేసి
నాలుగు గంటల జోన్ రొమ్ముల సినిమా చూసాం.

00:08:36.400 --> 00:08:38.280 align:center
ఆ స్వరం నాకు తెలుసు. నియంతృత్వం.

00:08:38.760 --> 00:08:41.520 align:center
-వేళాకోళం అనా నీ ఉద్దేశ్యం?
-అవును.

00:08:41.640 --> 00:08:43.960 align:center
మేము పెట్టేటప్పుడు ఏ శవాలు లేవు.

00:08:44.040 --> 00:08:46.840 align:center
అవును, కొంచెం శాంతించు బంగారం.

00:08:46.880 --> 00:08:51.480 align:center
శామ్ ఓడ్వాయర్ శవం ఆ నగ్న విందోత్సవ
ఫోటో షూట్ అప్పుడు దొరికింది?

00:08:51.520 --> 00:08:55.320 align:center
అవును, కానీ జిమ్మీ పొదలలో
హస్త ప్రయోగం చేస్తుంటే తెలిసింది.

00:08:55.440 --> 00:08:58.000 align:center
-నువ్వు స్ట్రాతో రాస్తున్నావా?
-అవును.

00:08:59.880 --> 00:09:01.840 align:center
యాదృచ్ఛికం కదా?

00:09:01.880 --> 00:09:06.120 align:center
ఈ హత్యలన్నీ
మీ విందోత్సవం సమయంలోనే మొదలయ్యాయి.

00:09:06.200 --> 00:09:07.960 align:center
అవును, అంతే. విషయం ఏంటట?

00:09:08.040 --> 00:09:10.720 align:center
-రెడ్క్లిఫ్! ఒకటి గుర్తించాను.
-ఆబీ గుర్తించింది.

00:09:10.760 --> 00:09:11.760 align:center
అదృష్టం నాది!

00:09:12.720 --> 00:09:17.200 align:center
నీ ఈ సోది విందోత్సవం ఆపిక.
ఇక ముగిసింది.

00:09:21.480 --> 00:09:24.200 align:center
అయితే, ఇది నిజమేనా?
ఆమె ఇంకో ఆరుగురిని చంపింది.

00:09:24.280 --> 00:09:27.480 align:center
-అది మన కిల్లర్ పనిలాగానే ఉంది.
-మరీ చాలామంది మగవారు.

00:09:27.520 --> 00:09:30.600 align:center
చాలామంది మంచివారు,
మహానుభావులు, చెప్పాలంటే.

00:09:30.640 --> 00:09:34.760 align:center
వాళ్లను ఇంకా గుర్తించలేదు, కానీ అవును,
వాళ్లంతా కచ్చితంగా మంచివాళ్లే.

00:09:34.840 --> 00:09:36.360 align:center
ఎంత ధైర్యం దానికి.

00:09:36.440 --> 00:09:39.640 align:center
జనాల భద్రత దృష్ట్యా
నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను.

00:09:39.720 --> 00:09:43.000 align:center
-నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి.
-సార్, అదే చేసాను.

00:09:43.080 --> 00:09:45.760 align:center
నేను చేసేవాడినే,
కానీ మేము మెక్క్వైర్ ద్వీపంలో

00:09:45.880 --> 00:09:48.880 align:center
యువరాణి మేరీ
కంపు పిట్టలను చూస్తామంటే ఆగాము.

00:09:48.960 --> 00:09:51.400 align:center
అక్కడ చాలా కష్టాలున్నట్టున్నాయి.

00:09:51.480 --> 00:09:54.080 align:center
నేను చదవలేను.
అక్షరాలు మరీ చిన్నవి.

00:09:54.160 --> 00:09:55.840 align:center
-గట్టిగా చూడు.
-సారీ.

00:09:55.880 --> 00:09:57.320 align:center
నువ్వే నాకు చెప్పవచ్చుగా?

00:09:57.400 --> 00:09:59.760 align:center
సరే మరి, అబ్బా! జెఫ్రీ హ్యాడిక్.

00:10:00.720 --> 00:10:02.280 align:center
జెఫ్రీ హ్యాడ్-డిక్. హాడ్?

00:10:02.360 --> 00:10:03.480 align:center
ఆమెను ఖైదు చేసారుగా?

00:10:04.880 --> 00:10:07.520 align:center
అవును. అవును, చేసాము, సర్.
మేము... చేసాము.

00:10:07.640 --> 00:10:10.240 align:center
ఆ ఓడ్వాయర్ హంతకిని
అక్కడే ఉంచండి

00:10:10.320 --> 00:10:12.760 align:center
ఇంకే మగవాళ్లు చనిపోరిక, కదా?

00:10:14.760 --> 00:10:17.000 align:center
-స్కై జెఫ్ను చంపి ఉండదు.
-ఎందుకని?

00:10:17.120 --> 00:10:20.960 align:center
జెఫ్ హ్యాడిక్ మూడేళ్ల క్రితం పోయాడు,
అప్పుడు స్కై లండన్‌లో ఉంది.

00:10:21.040 --> 00:10:24.360 align:center
ఆమె శామ్ హత్య రాత్రి
డెడ్‌లాక్‌లో లేదు కానీ ఉంది.

00:10:24.480 --> 00:10:28.480 align:center
కానీ స్కై లండన్లో ఉందని చెప్పగలను,
కాథ్ నేనూ ఆమెను అక్కడ కలిసాం కనుక.

00:10:28.600 --> 00:10:32.760 align:center
జెఫ్ అదే సమయంలో కారు లోయలోకి
పడేలా నడిపాడు, సెటిలర్ హైవేలో,

00:10:32.880 --> 00:10:35.040 align:center
నేను స్కైతో మేడమ్ టుస్సాడ్స్లో

00:10:35.120 --> 00:10:37.320 align:center
విక్టోరియా బెక్హం మైనపు
బొమ్మను చూస్తున్నా.

00:10:37.400 --> 00:10:38.880 align:center
అది దరిద్రం కదా?

00:10:40.240 --> 00:10:42.520 align:center
అవును, పలు పలు విధాలుగా.

00:10:43.720 --> 00:10:44.520 align:center
అనిశ్చితంగా మూసివేయబడింది

00:10:44.640 --> 00:10:46.840 align:center
మీరు వింటున్నారు పింక్ ఫ్లాగ్.
నేను మేరీ.

00:10:46.880 --> 00:10:49.640 align:center
ఊరిలో లేని హేమిష్
బదులు నేను వచ్చాను.

00:10:49.760 --> 00:10:50.600 align:center
సారీ
మూసేసాము

00:10:50.640 --> 00:10:52.120 align:center
సరే, సంబంధిత వార్తలలో

00:10:52.200 --> 00:10:54.760 align:center
అధికారికంగా విందోత్సవ కార్యక్రమాలు
రద్దు అయ్యాయి.

00:10:54.880 --> 00:10:57.680 align:center
ఈరాత్రి పాటరీ స్టూడియోలో జరగాల్సిన
జెజ్తో పాటరీ

00:10:57.760 --> 00:10:58.920 align:center
ఇంకా వైన్ కూడా.

00:10:59.000 --> 00:11:01.400 align:center
విక్, ఇంకా తెరిచే ఉందామంటావా?

00:11:01.680 --> 00:11:04.840 align:center
అసలే పరిస్థితులు బాగాలేవు,
ఇంకా స్వీట్లు కూడా లేవనలేము.

00:11:04.920 --> 00:11:07.320 align:center
-కానీ ఇప్పుడు స్కై కస్టడీలో ఉంది...
-రే?

00:11:07.880 --> 00:11:09.360 align:center
అవును, తెలుసు.

00:11:24.120 --> 00:11:25.400 align:center
ఓడ్వాయర్.

00:11:26.280 --> 00:11:27.960 align:center
టామీ గయ్యాళి ఎక్కడ?

00:11:28.600 --> 00:11:30.960 align:center
-నేనింకా తీసుకోలేదు.
-రోనీ!

00:11:31.960 --> 00:11:34.640 align:center
కారు ఎక్కు.
నువ్వూ నాన్నా కలిసి లాంచెస్టన్ పోండి.

00:11:34.720 --> 00:11:37.280 align:center
తరువాత కలుస్తాను.
దారిలో మెక్‌డొనాల్జ్స్ కావాలి?

00:11:37.360 --> 00:11:40.280 align:center
సరే. కారు ఎక్కు. క్రైస్ట్!

00:11:40.360 --> 00:11:43.160 align:center
వీడియో సిద్ధం చెయ్యి
మేము ఆ టామీ అంతు చూసి

00:11:43.240 --> 00:11:45.120 align:center
ఆ వీడియోను ల్యూక్ క్యాడీకి పంపుతాం.

00:11:45.200 --> 00:11:46.560 align:center
ఆమె కెరీర్ నాశనం చేస్తాం.

00:11:46.640 --> 00:11:47.840 align:center
అబ్బా, హంటర్. శాంతించు!

00:11:47.920 --> 00:11:50.000 align:center
-సీరియల్ కిల్లర్, బాబు.
-అయితే?

00:12:01.160 --> 00:12:04.080 align:center
అడెల్ నాన్న ఆమెను
ఆరుగురు అన్నలను స్ట్రాన్ తీసుకెళ్లాడు

00:12:04.160 --> 00:12:05.440 align:center
ఇది భరించలేము.

00:12:05.520 --> 00:12:07.280 align:center
సరే మరి. అంతా పారిపోతున్నారు.

00:12:07.360 --> 00:12:10.840 align:center
ల్యూక్ క్యాడీ హత్యలు
ఆగేదాకా రానన్నాడు.

00:12:10.960 --> 00:12:11.960 align:center
అంతా సోది.

00:12:12.880 --> 00:12:16.040 align:center
మార్గరెట్ స్కాలర్షిప్
హోబార్ట్కు తీసుకొనుంటే బాగుండేది.

00:12:16.160 --> 00:12:19.000 align:center
అవును, దానికన్నా
సీరియల్ కిల్లర్ నయం.

00:12:19.080 --> 00:12:21.160 align:center
అడెల్ ప్రకారం కిల్లర్ లక్ష్యం మగవాళ్లే.

00:12:23.120 --> 00:12:26.200 align:center
-పదిహేడేళ్ల వాళ్లు పురుషుల కింద వస్తారా?
-తెలియదు.

00:12:26.280 --> 00:12:30.320 align:center
పదిహేడేళ్ల వాళ్లు, వాళ్ల అమ్మలు
బట్టల మీద వాళ్ల పేర్లు రాస్తారు,

00:12:30.440 --> 00:12:33.040 align:center
కానీ హంటర్ పోయిన టెర్మ్లో
ఎంబర్ బ్యాగులో స్ఖలించాడు.

00:12:33.120 --> 00:12:35.240 align:center
అది పెద్ద లైన్ బాలులా కనిపించేలా?

00:12:35.320 --> 00:12:37.080 align:center
"నేను మీ ఇంటిలో కత్తులు పెట్టాను.

00:12:37.160 --> 00:12:40.280 align:center
నీ మీద దాడి జరిగితే,
వారి పొట్టలో గట్టిగా పొడువు."

00:12:41.240 --> 00:12:42.480 align:center
అబ్బా సోది, అడెల్.

00:12:44.000 --> 00:12:46.720 align:center
ఆబీ, కేట్
ఇంకో నలుగురిని గుర్తించారు.

00:12:46.800 --> 00:12:48.920 align:center
కుటుంబాలు మిస్సింగ్ రిపోర్టు చేయలేదు.

00:12:49.000 --> 00:12:52.480 align:center
గునార్ జోర్గెన్సన్, హేమిష్ ఫెర్గుసన్,
రిచర్డ్ లోవాన్, కీరన్ బుచర్

00:12:52.560 --> 00:12:54.240 align:center
పోయిన చెయ్యి సంగతేంటి?

00:12:54.320 --> 00:12:56.960 align:center
ఇంకా దొరకలేదు, అది రిచర్డ్ లోవన్స్ శవానిది

00:12:57.040 --> 00:12:58.680 align:center
దానికి చెయ్యి లేదు కనుక.

00:12:58.760 --> 00:13:01.520 align:center
సరే. అలాగే,
ఈ నలుగురు మాయమయ్యారు

00:13:01.600 --> 00:13:05.000 align:center
2018 మరియు 2019 మధ్యలో.

00:13:05.080 --> 00:13:06.400 align:center
చుట్టాల ప్రకారం.

00:13:06.480 --> 00:13:07.720 align:center
అవును, సంబంధిత వార్తలు,

00:13:07.800 --> 00:13:11.240 align:center
ఇమ్మిగ్రేషన్ నుండి డెనిస్,
ఈమధ్యే మొదటి పాప పుట్టింది,

00:13:11.320 --> 00:13:14.040 align:center
సెప్టెంబర్ 2017 నుండి మే 2021 మధ్యలో

00:13:14.120 --> 00:13:16.640 align:center
స్కై ఆస్ట్రేలియా రాలేదని
ఆమె నిర్థారించింది

00:13:16.720 --> 00:13:20.200 align:center
అంటే, స్కైకి వీళ్లు తెలియకపోగా,

00:13:20.280 --> 00:13:23.080 align:center
వీళ్లకు ఫుట్బాల్ క్లబ్బుకు సంబంధం లేదు.

00:13:23.160 --> 00:13:26.560 align:center
అయితే, మగవారు,
తెల్లవాళ్లు, చచ్చారు, ఇవి తప్ప

00:13:26.640 --> 00:13:30.360 align:center
వీరికి మిగతా బాధితులతో ఉన్న పోలికలు
ఏంటో తెలియట్లేదు.

00:13:30.440 --> 00:13:33.000 align:center
అయితే, సంక్షిప్తంగా,
ఆరుగురు కొత్త బాధితులు

00:13:33.080 --> 00:13:36.680 align:center
మనకో కొత్త అనుమానితురాలు
ఇంకో కొత్త ఎంఓ కావాలి.

00:13:36.760 --> 00:13:39.480 align:center
-నా కళ్లల్లో పొడుస్తావా?
-అంత సులభంగా, కాదు.

00:13:39.560 --> 00:13:41.720 align:center
-అప్పుడు స్కైని వదిలేయనా?
-వద్దు...

00:13:41.800 --> 00:13:45.600 align:center
నదియా ఇంకా కాథ్ పొద్దున 6:00 నుండి
ఒకటే సందేశాలు ఇస్తున్నారు నాకు.

00:13:50.800 --> 00:13:54.160 align:center
నాకు తెలిసినంతవరకూ
శామ్ ఓడ్వాయర్ మొదటి బాధితుడు.

00:13:54.960 --> 00:13:56.800 align:center
కిల్లర్కు అతనికీ ప్రత్యేక బంధం,

00:13:56.880 --> 00:13:59.920 align:center
స్కై ఆ రాత్రి
ఏదో కారణంగా తిరిగి వచ్చింది.

00:14:01.720 --> 00:14:05.200 align:center
ఆ రాత్రి జరిగినది
మన కిల్లర్కు సంబంధించిన క్లూ కలిగుంది.

00:14:07.280 --> 00:14:09.280 align:center
అయితే, స్కైని ఏం చేయాలి?

00:14:09.360 --> 00:14:11.920 align:center
ఇంకొంచెంసేపు అలాగే ఉంచు.

00:14:12.000 --> 00:14:15.840 align:center
దానికి సంబంధించి
సమాచారం అందివ్వటం కొంచెం బాగుంటుంది.

00:14:15.920 --> 00:14:17.440 align:center
ప్రెస్తో మాట్లాడకు, స్వెన్.

00:14:17.520 --> 00:14:18.360 align:center
అనుమానిత వ్యక్తులు

00:14:18.440 --> 00:14:19.760 align:center
లేదు, అంటే కాథ్తో.

00:14:21.080 --> 00:14:23.440 align:center
అంటే, దానికి నేను ఏం చేయలేను.

00:14:24.360 --> 00:14:25.640 align:center
నువ్వు విడిపోయావు కనుక?

00:14:27.040 --> 00:14:31.920 align:center
అంటే, అది... సరే,
మేము సరిగ్గా విడిపోయామో లేదో, లేదంటే...

00:14:32.480 --> 00:14:33.400 align:center
కాదా?

00:14:33.480 --> 00:14:35.920 align:center
సరే. కాదు, పని కానిద్దాం.
మనం కొనసాగిద్దాం.

00:14:36.000 --> 00:14:37.960 align:center
సరే, ఇంకెవరిని ప్రశ్నలు అడగాలి?

00:14:39.080 --> 00:14:40.800 align:center
ఇంకెవరు? మేడమ్ చట్నీ?

00:14:40.920 --> 00:14:42.680 align:center
లేదంటే ఆ సోది విక్? విక్!

00:14:42.760 --> 00:14:45.640 align:center
మనం చూసాముగా.
మార్గరెట్ రియోమజియోరేలో ఉంది,

00:14:45.720 --> 00:14:47.880 align:center
విక్ నడుములో ఇబ్బంది ఉంది. స్వెన్?

00:14:47.960 --> 00:14:49.360 align:center
ఈ పోస్టర్ ఏంటి?

00:14:49.440 --> 00:14:50.680 align:center
అది నులిపురుగా?

00:14:50.760 --> 00:14:53.440 align:center
శామ్ ఓడ్వాయర్ నోటిలో జుట్టది.

00:14:53.520 --> 00:14:55.720 align:center
ఆఫీస్వర్క్స్లో ఏ-0 సైజు తీసాను,

00:14:55.800 --> 00:14:59.000 align:center
ఏ-0 సైజంటే
అతి చిన్న సైజు అనుకున్నాను, కానీ కాదది.

00:14:59.080 --> 00:15:02.280 align:center
దానర్థం అతి పెద్ద సైజని,
సున్నా అని పెట్టి పెద్ద సైజట.

00:15:02.360 --> 00:15:05.000 align:center
ఆ జుట్టుదానిని వదిలెయ్యి.
నీ విచిత్ర భార్య సంగతి?

00:15:05.080 --> 00:15:07.840 align:center
-నా "విడిచిపెట్టిన" భార్య.
-ఏదోలే. అర్థమైందిగా నీకు.

00:15:07.920 --> 00:15:09.440 align:center
కాథ్ రాత్రి హంతకి కాదు.

00:15:09.520 --> 00:15:12.520 align:center
ఆమె రాత్రి 9:00 కల్లా పడుకుంటుంది.
నా ఎద మీద చెయ్యేసి.

00:15:13.640 --> 00:15:16.320 align:center
ఈ మధ్య వరకు కూడా.

00:15:16.400 --> 00:15:19.240 align:center
అదేం పెద్ద విషయం కాదు.
అది... వదిలేయండి.

00:15:20.720 --> 00:15:22.960 align:center
-కాథ్.
-నన్ను చెప్పమం...

00:15:23.040 --> 00:15:24.560 align:center
మమ్మల్ని చెప్పమంటావా?

00:15:24.640 --> 00:15:26.800 align:center
వద్దు! ఏంటి? వద్దు! మీరలా చేయక్కరలేదు.

00:15:26.880 --> 00:15:29.920 align:center
లేదు. నేను చేయగలను.
నేనెక్కడున్నానన్నది అనవసరం.

00:15:30.000 --> 00:15:32.720 align:center
-సహాయం కావాలంటే ఇక్కడే ఉంటాం.
-సరే మరి.

00:15:32.800 --> 00:15:36.960 align:center
లేదు. హే, స్వెన్. శామ్ చనిపోయిన రాత్రి
స్త్రీల అలిబీలన్నీ చెక్ చెయ్యు.

00:15:37.080 --> 00:15:40.200 align:center
ఒకామె ఏదో రహస్యం దాస్తుంది.
నేను దాన్ని పిండుతాను.

00:15:40.280 --> 00:15:41.520 align:center
దేవుడా!

00:15:42.360 --> 00:15:44.560 align:center
కాథ్. హాయ్.

00:15:44.640 --> 00:15:47.520 align:center
ఓహ్, బంగారం,
ఇది తెచ్చినందుకు థాంక్స్.

00:15:47.600 --> 00:15:48.680 align:center
లేదు, ఇది స్కై కోసం.

00:15:49.520 --> 00:15:51.680 align:center
ఓజ్లో చూసాను.
జైలు తిండి చెండాలం.

00:15:51.760 --> 00:15:53.600 align:center
అది నీ కోసం. నీ సామాను.

00:15:53.680 --> 00:15:57.240 align:center
సరే, అలాగే. అలాగే,
కొంచెం దూరం మంచిదే.

00:15:57.320 --> 00:16:00.320 align:center
కుక్కల కోసం కస్టడీ ఒప్పందం రాసుకోవాలి.

00:16:01.440 --> 00:16:02.480 align:center
హాయ్, కాథ్.

00:16:04.200 --> 00:16:05.240 align:center
సరే.

00:16:06.240 --> 00:16:07.840 align:center
అంతా బాగానే ఉందా, మేడమ్?

00:16:08.680 --> 00:16:10.920 align:center
అవును. అవును. అంతా బాగుంది.

00:16:11.000 --> 00:16:13.040 align:center
-అంతా చక్కగా ఉంది. అదేంటి మరి?
-సరే.

00:16:13.440 --> 00:16:15.280 align:center
చివరి శవాన్ని గుర్తించాము.

00:16:15.360 --> 00:16:16.920 align:center
అతను డానియల్ టేట్.

00:16:17.000 --> 00:16:18.520 align:center
-డానీ టేట్?
-అవును.

00:16:18.600 --> 00:16:21.000 align:center
-లైంగిక హింస డానీ టేట్?
-అవును, మేడమ్.

00:16:25.720 --> 00:16:26.800 align:center
స్వెన్!

00:16:38.280 --> 00:16:40.720 align:center
హే, టాంబో,
మాకు కనిపిస్తావని తెలుసుగా.

00:16:40.800 --> 00:16:43.320 align:center
ఏం చేస్తున్నావు?
కిల్లర్ విచ్చలవిడిగా ఉన్నాడు.

00:16:43.400 --> 00:16:46.240 align:center
టామీ, నీకో విషయం చెప్పాలి.

00:16:46.640 --> 00:16:49.080 align:center
-తెలుసు. నన్ను ప్రేమిస్తున్నావు.
-అబ్బా!

00:16:49.200 --> 00:16:51.080 align:center
అబ్బాయిలతో తిరగటం ఇందుకే.

00:16:51.160 --> 00:16:52.320 align:center
-గుండె పగిలింది!
-అంతే.

00:16:52.400 --> 00:16:55.200 align:center
-కాదు-- నువ్వు గంజాయి తాగటం వీడియో తీసాను.
-సరదాకేగా.

00:16:55.280 --> 00:17:00.400 align:center
కాదు. హంటర్ అలా తీసి
ల్యూక్ క్యాడీకి పంపమన్నాడు,

00:17:00.480 --> 00:17:02.280 align:center
ల్యూక్ క్యాడీ నిన్ను చేర్చుకోకుండా.

00:17:04.400 --> 00:17:05.400 align:center
క్షమించు.

00:17:07.240 --> 00:17:10.040 align:center
హంటర్తో స్నేహం కోసం
నన్ను మోసం చేసావా?

00:17:10.080 --> 00:17:11.320 align:center
అది మరీ సిగ్గుచేటు.

00:17:11.920 --> 00:17:15.560 align:center
నేను అతనికేం వీడియో ఇవ్వట్లేదు,
అది ఎలాగు అంతగా పని చేయదులే.

00:17:15.680 --> 00:17:18.640 align:center
లేదు, నేను నీ స్థానంలో ఉంటే, పట్టించుకోను.

00:17:18.720 --> 00:17:22.240 align:center
నేను నీలా తెల్లదాన్ని అయ్యుంటే,
హంసను చంపి తిన్నా కానీ,

00:17:22.320 --> 00:17:24.520 align:center
ఎటువంటి పరిణామాలు ఎదుర్కోను.

00:17:24.680 --> 00:17:27.080 align:center
-గ్యాస్ వస్తుందేమే.
-గ్యాస్ వస్తుందేమో, అంతే.

00:17:27.160 --> 00:17:28.480 align:center
కానీ నేను నల్లదానిని.

00:17:28.560 --> 00:17:32.080 align:center
నీకు దొరికినట్టు వందల అవకాశాలు
నాకుండవు తప్పులు చేయటానికి.

00:17:32.160 --> 00:17:34.800 align:center
-అసలు అలా ఆలోచించావా?
-లేదు, ఆలోచించలేదు.

00:17:34.920 --> 00:17:37.320 align:center
అవును. నీ గురించే నువ్వు ఆలోచించి ఉంటావు.

00:17:37.400 --> 00:17:39.960 align:center
నీకు కావలసినదాని కోసం
నన్ను వాడుకున్నావు.

00:17:40.040 --> 00:17:42.080 align:center
కరివేపాకులాగా తీసేసావు. అబ్బా!

00:17:43.200 --> 00:17:45.320 align:center
క్షమించు. నీ స్నేహితుడిని అవుదామని.

00:17:45.440 --> 00:17:47.440 align:center
నాకు నీ అవసరం లేదు. స్నేహితులున్నారు.

00:17:47.520 --> 00:17:49.560 align:center
-ఒక్కరు.
-ఒకామె, మిరాండా.

00:17:50.200 --> 00:17:54.440 align:center
నీలాగా, ఆమె తెల్లది కనుక
ఆమెకు ఏదీ వివరించక్కరలేదు

00:17:54.520 --> 00:17:56.560 align:center
దానర్థం ఆమెనే ముఖ్యమని కాదు.

00:17:56.640 --> 00:17:59.320 align:center
-నేను తెల్లవాడిని కాదు.
-విషయం చెబుతున్నాను, ఎం.

00:17:59.400 --> 00:18:01.440 align:center
నీలాగా కాదు, మిరాండా మంచిది.

00:18:05.680 --> 00:18:06.880 align:center
పద.

00:18:06.960 --> 00:18:10.560 align:center
-ఇది మన ఇల్లు. అది...
-అవును, ఇది మా ఇల్లు. నువ్వే పో.

00:18:15.080 --> 00:18:16.960 align:center
ఇందులో నేనేం సహాయం చేయలేను, బాబు.

00:18:22.680 --> 00:18:26.520 align:center
డానీ టేట్, మానభంగం కేసులో అరెస్టు.
రిచర్డ్ లోవన్, వెంటపడటం, గృహ హింస.

00:18:26.560 --> 00:18:29.800 align:center
కీరన్ బుచర్, డీవీ.
హేమిష్ ఫెర్గుసన్, లైంగిక దాడి.

00:18:29.880 --> 00:18:32.320 align:center
గునార్ జోర్గెన్సన్, డీవీ ఇంకా లైంగిక దాడి.

00:18:32.400 --> 00:18:34.560 align:center
జెఫ్ హ్యాడిక్
భార్య మీద హత్యాయత్నం.

00:18:34.640 --> 00:18:37.520 align:center
గెవిన్ లేథమ్, ట్రెంట్ లేథమ్
గృహ హింస.

00:18:37.560 --> 00:18:40.560 align:center
జిమ్మీ కుక్, వెన్నాడటం,
అసభ్య బహిరంగ హస్తప్రయోగం.

00:18:40.640 --> 00:18:42.960 align:center
రాడ్ డిక్సన్, లైంగిక దాడి, మానసిక హింసల

00:18:43.040 --> 00:18:46.000 align:center
-నేపథ్యం.
-అవును. 11 మంది చచ్చారు.

00:18:46.080 --> 00:18:49.080 align:center
-మనం ఇక్కడ పద్ధతి చూస్తున్నాం.
-సరే, అయితే, ఏంటది?

00:18:49.200 --> 00:18:52.080 align:center
వారు తెల్ల మగవారు,
అంతా రకరకాల ఆలూ తొక్కల లాగున్నారు.

00:18:53.720 --> 00:18:54.800 align:center
ఒక్క నిముషం ఆగు.

00:18:54.960 --> 00:18:56.760 align:center
కిల్లర్ మగవాళ్లపై దాడి చేయట్లేదు.

00:18:56.800 --> 00:18:58.680 align:center
-హింసాత్ములే లక్ష్యం.
-వెధవలు!

00:18:58.760 --> 00:19:02.440 align:center
-అలా కూడా అనవచ్చు.
-కాలిన్స్, భలే. సాధించావు.

00:19:02.560 --> 00:19:04.080 align:center
-సారీ, మళ్లీ చెప్పు.
-లేదు.

00:19:04.160 --> 00:19:06.520 align:center
-ఇంకోసారి చేస్తాను.
-లేదు, పోగొట్టుకున్నావు.

00:19:06.560 --> 00:19:09.520 align:center
ఆగు, కాలిన్స్.
శామ్ ఓడ్వాయర్ సంగతేంటి?

00:19:09.960 --> 00:19:12.400 align:center
అతనేగా ఈ హత్యలకు ఆరంభం?

00:19:12.480 --> 00:19:16.320 align:center
భార్యను మోసం చేయటం అన్నది
వీటన్నింటితో పోలిస్తే అంత పెద్ద నేరం కాదు.

00:19:16.440 --> 00:19:17.640 align:center
సరే.

00:19:18.720 --> 00:19:22.280 align:center
అతని... అతని తిరుగుళ్లకు
పరిణామాలు ఉన్నాయి.

00:19:22.320 --> 00:19:24.880 align:center
విక్, స్కైలకైనా అనుకోవచ్చు.

00:19:24.960 --> 00:19:26.480 align:center
అది చాలదు.

00:19:26.560 --> 00:19:31.080 align:center
ఈ బాధితుల ప్రొఫైల్ చూస్తే నాకు
నాజిరేవ్ ఏంజెల్ మేకర్స్ గుర్తొస్తున్నారు.

00:19:31.160 --> 00:19:32.640 align:center
ఆ పాడ్కాస్ట్ విన్నారా?

00:19:32.720 --> 00:19:35.280 align:center
-లింక్ చేస్తాను. అది ఈ-కాస్ట్‌లో ఉంది.
-ఏంటి?

00:19:35.320 --> 00:19:36.200 align:center
అది వదిలేయ్.

00:19:36.280 --> 00:19:38.240 align:center
ముఖ్యంగా, 1920లలో హంగేరీలో,

00:19:38.320 --> 00:19:42.640 align:center
ఒక స్త్రీ ఇంకో స్త్రీకి హింసించే భర్త మీద
పోయటానికి యాసిడ్ ఇస్తుంది

00:19:42.720 --> 00:19:44.640 align:center
ఆ తరువాత అదంతా పెరిగిపోతుంది.

00:19:44.720 --> 00:19:47.000 align:center
ఎక్కడికి పెరిగిపోతుంది? ఏమంటున్నావు?

00:19:47.080 --> 00:19:51.560 align:center
ఆ స్త్రీ ఆ ఊరిలో చాలామంది భర్తల చేతిలో
బాధ పడుతున్నారని తెలుసుకుంటుంది.

00:19:51.680 --> 00:19:54.680 align:center
వాళ్లందరినీ చంపేసి సమస్యను
పరిష్కరిద్దామని అనుకుంటుంది.

00:19:54.800 --> 00:19:57.320 align:center
కానీ మిగతా స్త్రీలకు విషయం తెలుస్తుంది

00:19:57.400 --> 00:20:00.720 align:center
-వాళ్లంతా కలిసి చంపేద్దామనుకుంటారు--
-వారి చెత్త భర్తలను.

00:20:00.800 --> 00:20:05.000 align:center
అవును. 15 ఏళ్ల పాటు వారు
దొరికేదాకా దానిని రహస్యంగా ఉంచగలుగుతారు.

00:20:05.080 --> 00:20:10.000 align:center
అది స్త్రీలు పరిష్కారానికి చంపుతారు
జనాల దృష్టిలో పడడానికి కాదు.

00:20:10.080 --> 00:20:12.800 align:center
-సరిగ్గా చెప్పాను కదా, మేడమ్?
-అవును, అవును.

00:20:12.920 --> 00:20:15.080 align:center
స్త్రీ హంతకులకు పేరు అక్కరలేదు.

00:20:15.200 --> 00:20:18.000 align:center
వాళ్లు వారి చర్యలను
కప్పిపెట్టటానికి ప్రయత్నిస్తారు.

00:20:18.080 --> 00:20:20.960 align:center
ఇక్కడ చంపటం మొదలుపెట్టిన
స్త్రీ సంగతేంటి?

00:20:21.040 --> 00:20:23.520 align:center
వీళ్ళు ఏం చేస్తున్నారో ఆమెకు ఎలా తెలుసు?

00:20:23.560 --> 00:20:25.480 align:center
ఆమె ఆ ఊరి బ్యూటీషియనా?

00:20:25.560 --> 00:20:27.720 align:center
లేదు, మేడమ్. ఆమె ఆ ఊరి నర్సు.

00:20:27.800 --> 00:20:30.200 align:center
ఆమె అక్కడ
వాళ్లకు డాక్టరు స్థాయిలో ఉండేది.

00:20:30.320 --> 00:20:32.080 align:center
ఆ స్త్రీలంతా ఆమె రోగులా.

00:20:32.720 --> 00:20:37.160 align:center
డాక్టర్-మేయర్. పెద్ద కళ్లు,
మన మగవారికి సంబంధించిన ఆడవారి సంగతేంటి?

00:20:37.240 --> 00:20:38.880 align:center
మన బాధితుల బాధితులు.

00:20:39.680 --> 00:20:41.520 align:center
వాళ్లల్లో ఎవరైనా అలైనా రోగులా?

00:20:41.560 --> 00:20:43.680 align:center
దాదాపు అందరూ కావచ్చు, మేడమ్.

00:20:43.760 --> 00:20:46.200 align:center
ఇంకో డాక్టరు అంటే కార్నేజ్ బేలో ఉంటారు

00:20:46.280 --> 00:20:49.560 align:center
అతనికి స్త్రీ రోగులను
పర్యవేక్షణ లేకుండా చూసే అనుమతి లేదు.

00:20:49.640 --> 00:20:52.280 align:center
స్వెన్, డాక్టర్-మేయర్ అలిబీలు చూడు.

00:20:52.320 --> 00:20:53.640 align:center
నేను ఎప్పుడో చూసాను.

00:20:53.720 --> 00:20:55.320 align:center
శామ్ చనిపోయిన రాత్రి,

00:20:55.440 --> 00:20:57.800 align:center
అలైనా గ్లెన్వాలీ గ్లెన్లో
పని చేస్తుందట.

00:20:57.960 --> 00:21:00.960 align:center
అదేంటి? విస్కీ బారా?
పార్ట్ టైమ్ చేస్తుందా?

00:21:01.040 --> 00:21:02.320 align:center
లేదు, అది ఆసుపత్రి.

00:21:03.400 --> 00:21:05.800 align:center
డాక్టర్-మేయర్ ఆ అసుపత్రిలో పని చేస్తుంది.

00:21:05.960 --> 00:21:09.200 align:center
ఆసుపత్రికి కాల్ చేసాను,
లేదు, అలైనా ఆ రోజు పని చేయలేదు.

00:21:09.560 --> 00:21:11.760 align:center
కానీ నిజానికి, ఆమె పని చేస్తుంది.

00:21:11.800 --> 00:21:14.720 align:center
-ఏంటి?
-అంటే, ఆమె పని చేయకపోయినా సరే.

00:21:16.320 --> 00:21:17.480 align:center
అవును.

00:21:21.000 --> 00:21:23.080 align:center
అంటే, శుభ దినం, రే పైస్, నేను, ఎడ్డీని.

00:21:23.160 --> 00:21:24.960 align:center
సరే, రహస్యంగా ఉంచు,

00:21:25.040 --> 00:21:29.320 align:center
కిల్లర్ సోదిగాళ్లకు గురి పెట్టింది
ఇంకా ఆమె వేగం కూడా పెంచింది.

00:21:29.560 --> 00:21:32.760 align:center
నువ్వు హాయిగా
ఊపిరి పీల్చుకునే అవకాశం చాలా ఉంది.

00:21:33.440 --> 00:21:37.440 align:center
గత రాత్రి
నువ్వు నాతో సెక్స్ చేస్తూ ఏడ్చావు...

00:21:38.400 --> 00:21:41.440 align:center
ఈ మగవాళ్ళంతా చేసేవాటితో పోలిస్తే
అది సున్నా,

00:21:41.520 --> 00:21:44.440 align:center
నీ మీద గురి పెట్టటానికి
నువ్వు తోపువు కాదులే.

00:21:44.520 --> 00:21:46.920 align:center
మరీ చిరాకు అది. అప్పుడే చెప్పానుగా.

00:21:47.000 --> 00:21:50.680 align:center
అవి ఆనందభాష్పాలని తెలుసు,
కానీ నా మూడ్ పాడు చేసిందనుకో.

00:21:50.760 --> 00:21:55.320 align:center
అందుకే, జాగ్రత్తగా ఉండు
నేను ఇప్పుడే ఫిల్కు కాల్ చేయాలి,

00:21:55.400 --> 00:21:58.920 align:center
అతనిని హెచ్చరించాలి.
అతని అంగం గురించి కాదు, అది...

00:21:59.760 --> 00:22:01.360 align:center
సరే, ఏదోలే, బై.

00:22:06.600 --> 00:22:07.880 align:center
నేను రేతో పడుకున్నాను.

00:22:07.960 --> 00:22:09.320 align:center
అవునా, మేడమ్?

00:22:10.160 --> 00:22:11.200 align:center
సరే.

00:22:11.320 --> 00:22:13.480 align:center
సరే, నాకతను నచ్చాడు.

00:22:14.120 --> 00:22:15.720 align:center
అవును, చాలా మంచి విషయం.

00:22:17.080 --> 00:22:20.440 align:center
అయితే గ్లెన్‌వాలీ గ్లెన్ రాస్
జనరల్ హాస్పిటల్ ఎంత దూరం?

00:22:21.000 --> 00:22:22.680 align:center
మేడమ్, ఇంకో పది నిముషాలంతే.

00:22:22.960 --> 00:22:24.040 align:center
మంచిది.

00:22:26.280 --> 00:22:28.080 align:center
అరే, చూసుకో, ఆవు!

00:22:34.320 --> 00:22:35.800 align:center
కాథ్ నేను పాపను అనుకుంటుందా?

00:22:35.880 --> 00:22:37.960 align:center
నాకు తెలియదు. నాతో మాట్లాడట్లేదు.

00:22:38.800 --> 00:22:41.280 align:center
నీ కుటుంబం
నిన్ను సీరియల్ కిల్లర్ అనుకోవట్లేదు.

00:22:41.360 --> 00:22:43.320 align:center
అదెంత బాధాకరమో ఆలోచించు, మిత్రమా.

00:22:44.360 --> 00:22:48.600 align:center
కొద్ది రోజుల క్రితం, ఫోరెన్సిక్స్
మీ నాన్న దేహం నుండి జుట్టు ముక్క తీసారు.

00:22:49.080 --> 00:22:50.840 align:center
నీతో కూడా రోజూ ఇలానే చేస్తుందా?

00:22:52.600 --> 00:22:53.800 align:center
అది యోని జుట్టు.

00:22:55.800 --> 00:22:57.760 align:center
నిన్న రాత్రి నువ్వూ కాథ్ గొడవపడ్డారట.

00:22:57.840 --> 00:22:59.960 align:center
నీ జీవితానికి మంచి కుదుపునిచ్చిందా.

00:23:00.080 --> 00:23:01.400 align:center
ఆ జుట్టు నోటిలో ఉంది.

00:23:01.480 --> 00:23:04.240 align:center
తలకు దెబ్బ ఇంకా
ఆల్కహాల్ స్థాయిలు అధికం.

00:23:04.320 --> 00:23:07.960 align:center
అతని హత్య జరిగిన రోజు రాత్రి
అతను ఎవరితోనో సెక్స్ చేసాడు.

00:23:08.600 --> 00:23:11.160 align:center
ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా?

00:23:14.600 --> 00:23:15.720 align:center
స్కై,

00:23:16.640 --> 00:23:18.920 align:center
-అది నువ్వైతే, నేను--
-నోర్ముయ్యి, డల్స్!

00:23:19.000 --> 00:23:21.280 align:center
అసలు ఏం జరుగుతుందో చెపుతావా?

00:23:21.360 --> 00:23:25.320 align:center
నేను నీ ముందు క్లూ సినిమా చూపించాను, స్కై.

00:23:25.400 --> 00:23:27.840 align:center
నువ్వు రహస్యం దాస్తుంటే
నాకు తెలిసిపోతుంది.

00:23:27.920 --> 00:23:30.600 align:center
ఇప్పుడు మాట్లాడలేను, డిటెక్టివ్ కాలిన్స్.

00:23:31.000 --> 00:23:35.680 align:center
మంచి గుడ్డు తింటున్నాను.

00:23:42.200 --> 00:23:48.080 align:center
పుట్టినరోజు
శుభాకాంక్షలు

00:23:50.840 --> 00:23:52.200 align:center
ఈరోజు నా పుట్టినరోజు.

00:23:52.640 --> 00:23:54.080 align:center
-హ్యాపీ బర్త్డే.
-ధన్యవాదాలు.

00:23:54.880 --> 00:23:57.880 align:center
సరే, అయితే 2017 జూన్ 10న.

00:23:57.960 --> 00:24:01.920 align:center
మీ సహోద్యోగికి చెప్పానే, మేయర్ రామీ
ఆ రాత్రి పని షెడ్యూలులో లేదని,

00:24:02.000 --> 00:24:06.160 align:center
కానీ ఆమె వచ్చి ఒక స్త్రీని
వ్యక్తిగతంగా చూసింది.

00:24:06.240 --> 00:24:08.880 align:center
ఆ స్త్రీ వంధ్యత్వం వల్ల వచ్చింది.

00:24:08.960 --> 00:24:11.440 align:center
లేదు. సారీ, లంచులో షాంపేన్ తాగాను.

00:24:11.520 --> 00:24:13.400 align:center
"గాయాలు". ఇక్కడ "గాయాలు" అనుంది.

00:24:13.480 --> 00:24:15.800 align:center
-ఎలాంటి గాయాలు?
-నేను ఇప్పుడే చూస్తాను.

00:24:15.880 --> 00:24:20.160 align:center
మేడమ్, శామ్ ఓడ్వాయర్ హత్య జరిగిన రోజు
ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి.

00:24:20.240 --> 00:24:22.040 align:center
అది గొడవ వల్ల అయితే?

00:24:22.120 --> 00:24:23.280 align:center
ఆ జుట్టామెతోనా?

00:24:24.320 --> 00:24:26.720 align:center
అలైనా రోగి ఆ యోని జుట్టామె కావచ్చంటావా?

00:24:26.800 --> 00:24:27.680 align:center
అవ్వవచ్చు.

00:24:27.760 --> 00:24:31.160 align:center
సరే, అయితే, రోగి గృహహింస
గాయాలతో వచ్చి చేరింది.

00:24:31.240 --> 00:24:34.040 align:center
ఆమె ఆనా స్పానర్ అన్న పేరుతో
వచ్చి చేరింది.

00:24:34.120 --> 00:24:36.160 align:center
అదేం పేరు బాబు?

00:24:36.240 --> 00:24:38.960 align:center
-నకిలీ పేరు.
-ఫోటో ఏమన్నా ఉందా?

00:24:39.080 --> 00:24:40.120 align:center
ఇదిగో.

00:24:40.560 --> 00:24:43.360 align:center
-దీనిని త్వరగా చేసిచ్చినందుకు థాంక్స్.
-పర్వాలేదు.

00:24:43.440 --> 00:24:47.320 align:center
సరే, అయితే స్కై ఓడ్వాయర్ డీఎన్ఏ
ఆ యోని జుట్టుతో సరిపోలలేదు.

00:24:47.480 --> 00:24:49.000 align:center
ధన్యవాదాలు, కేట్.

00:24:49.080 --> 00:24:51.760 align:center
ధన్యవాదాలు, పరీక్ష రెండు ఫలితాలలో,

00:24:51.840 --> 00:24:53.960 align:center
ఇదే నా ఫేవరేట్.

00:24:54.080 --> 00:24:56.040 align:center
ఒప్పుకుంటాను. తమాషా.

00:24:56.600 --> 00:24:59.400 align:center
-తమాషానా?
-స్కై డీఎన్ఏ సిస్టంలో సరిపోలింది.

00:24:59.480 --> 00:25:00.880 align:center
బాధితులతోనా?

00:25:00.960 --> 00:25:03.240 align:center
కాదు, తేదీల ప్రకారం,

00:25:03.320 --> 00:25:06.640 align:center
ఈ డీఎన్ఏ నమూనా
మనం మగవాళ్లందరిది తీసుకున్న రోజుది.

00:25:06.720 --> 00:25:07.960 align:center
దీని మీద పేరు లేదు.

00:25:08.040 --> 00:25:12.720 align:center
అంటే, స్కై కొడుకుకు ఆ రోజు అనుకోకుండా
పరీక్ష జరిగింది. అతనిదే కావచ్చు.

00:25:12.800 --> 00:25:14.960 align:center
కాదు, మైటోకాండ్రియల్ డీఎన్ఏ కాదు.

00:25:15.960 --> 00:25:18.560 align:center
స్కై తల్లి కాదు.
మరేంటి సంబంధం?

00:25:18.640 --> 00:25:21.520 align:center
స్కై ఇంకా ఈ నమూనాలకు ఒకరే తండ్రి.

00:25:24.000 --> 00:25:27.120 align:center
అయితే, శామ్కు ఇంకో బిడ్డ ఉన్నాడా?

00:25:27.200 --> 00:25:28.680 align:center
అంటే. అలానే ఉంది.

00:25:29.760 --> 00:25:33.000 align:center
-అదెవరో చెప్పగలవా?
-లేదు. నమూనాలు కేవలం అంకెలే.

00:25:34.280 --> 00:25:37.200 align:center
ఒక పని చెయ్యి.
శామ్ నోటిలోని జుట్టు ఉంది చూడు,

00:25:37.280 --> 00:25:39.680 align:center
-దానిని నమూనాతో పోలిస్తే?
-సరే. మంచి ఆలోచన.

00:25:39.840 --> 00:25:40.960 align:center
ధన్యవాదాలు.

00:25:41.040 --> 00:25:43.720 align:center
-నేను హాస్పిటలు రానందుకు సారీ--
-కాలిన్స్,

00:25:43.840 --> 00:25:46.400 align:center
శామ్ ఓడ్వాయర్
ఎందుకు తొలి బాధితుడో తెలిసింది.

00:25:46.480 --> 00:25:48.560 align:center
అతడో పెద్ద వెధవ.

00:25:56.440 --> 00:25:57.960 align:center
నీ గాయాల ఫోటోలు.

00:25:58.440 --> 00:26:01.480 align:center
విరిగిన నడుం. మణికట్టు.

00:26:02.920 --> 00:26:04.320 align:center
మోచేయి విరిగింది.

00:26:05.800 --> 00:26:10.320 align:center
ఇది మరీ దారుణమైన హింస.

00:26:12.720 --> 00:26:14.120 align:center
శామ్ నిన్ను ఇలా కొట్టాడా?

00:26:19.360 --> 00:26:21.280 align:center
దానికన్నా ముందు హింసించేవాడా?

00:26:21.360 --> 00:26:23.400 align:center
ఇది మీ పరిశోధనకు అవసరమా?

00:26:23.480 --> 00:26:27.640 align:center
శామ్ విక్టోరియాకు చేసింది తెలుసుకొని
అతనిని ఆ కారణంగా చంపేసారు.

00:26:27.720 --> 00:26:29.920 align:center
అప్పటినుండి అలాంటి మగవారిని చంపుతున్నారు,

00:26:30.000 --> 00:26:31.560 align:center
అందుకే, కాథ్, అవసరమే.

00:26:32.680 --> 00:26:35.400 align:center
విక్, అలైనా నిన్ను ఆసుపత్రిలో చేర్చాక,

00:26:35.520 --> 00:26:37.720 align:center
ఆమె తిరిగి వచ్చి శామ్ను చంపిందా?

00:26:40.560 --> 00:26:42.800 align:center
లేదు, నేను చంపాను.

00:26:44.280 --> 00:26:46.520 align:center
-నేను శామ్ను చంపాను.
-విక్, ఆలోచించు--

00:26:46.600 --> 00:26:48.160 align:center
లేదు, కాథ్, భరించింది చాలు.

00:26:48.240 --> 00:26:50.960 align:center
ఎవరూ బంధించబడరు.
ఇది చాలా దూరం పోయింది.

00:26:52.440 --> 00:26:54.360 align:center
విక్, ఆ రాత్రి ఏం జరిగింది?

00:26:57.160 --> 00:26:59.120 align:center
శామ్ నేనూ మళ్లీ గొడవపడ్డాం,

00:27:00.160 --> 00:27:03.520 align:center
అతను నన్ను కొట్టటం మొదలుపెట్టాడు,

00:27:03.600 --> 00:27:06.400 align:center
నేను ఎదిరించాను. అతనిని చంపేసాను.

00:27:07.640 --> 00:27:08.920 align:center
తల వెనుక గాయమా?

00:27:09.000 --> 00:27:10.000 align:center
ఎలా?

00:27:10.880 --> 00:27:12.640 align:center
అతని తల మీద బలంగా కొట్టాను,

00:27:12.720 --> 00:27:14.680 align:center
చలిమంట దగ్గరి పారతోటి.

00:27:16.360 --> 00:27:17.760 align:center
ఆ తరువాత ఏమైంది?

00:27:18.680 --> 00:27:20.560 align:center
అతను బాల్కనీలోకి జారుకుంటూ వెళ్లి,

00:27:20.640 --> 00:27:21.480 align:center
గొంతు నులమడం?
నాలుక?

00:27:22.240 --> 00:27:23.760 align:center
సరస్సులో పడిపోయాడు.

00:27:25.080 --> 00:27:27.840 align:center
నువ్వు అతనిని ఇంకేమీ చేయలేదా?

00:27:28.000 --> 00:27:30.800 align:center
లేదు, అతనిని చంపింది అలాగే.

00:27:33.640 --> 00:27:35.600 align:center
బట్టలు - జాకెట్, జీన్స్?
యోని జుట్టు?

00:27:35.680 --> 00:27:37.520 align:center
ఆ రాత్రి శామ్ ఏం వేసుకున్నాడు?

00:27:40.960 --> 00:27:42.440 align:center
బాక్సర్స్ వేసుకున్నాడు.

00:27:45.760 --> 00:27:48.160 align:center
విక్ గొడవ దేనిగురించో చెపుతావా?

00:27:51.560 --> 00:27:52.960 align:center
నాకిప్పుడు గుర్తు లేదు.

00:27:54.200 --> 00:27:56.200 align:center
అతని కోపానికి కారణాలు అక్కరలేదు.

00:27:57.040 --> 00:27:59.680 align:center
ఆ రాత్రి నీతో పాటు
ఇంకెవరన్నా ఉన్నారా గుడిసెలో?

00:27:59.760 --> 00:28:00.600 align:center
జాక్స్?

00:28:00.680 --> 00:28:02.440 align:center
-లేరు.
-శామ్ను చూసిన వారెవరూ--

00:28:02.520 --> 00:28:05.080 align:center
-స్కై అక్కడ లేదు.
-స్కై గురించి అడగలేదు.

00:28:05.160 --> 00:28:07.680 align:center
అది నేను. నేనే చంపాను,
సరస్సు పారతో.

00:28:09.120 --> 00:28:10.840 align:center
అతనిని చంపాలని ప్లాన్ చేసావా?

00:28:11.400 --> 00:28:12.560 align:center
లేదు, అలా ఏం లేదు.

00:28:13.000 --> 00:28:16.200 align:center
నా విషాద క్షణాలలో కూడా,
శామ్ చావును కోరుకోలేదు.

00:28:18.080 --> 00:28:20.080 align:center
మంచివాడవ్వాలని కోరుకున్నాను.

00:28:20.320 --> 00:28:23.600 align:center
అతను తన తప్పును ఒప్పుకొని
నాకు, స్కైకి మా కుటుంబానికి

00:28:23.680 --> 00:28:25.480 align:center
క్షమించమనాలని ఆశించాను.

00:28:25.560 --> 00:28:29.280 align:center
అతను మనఃస్ఫూర్తిగా క్షమాపణలు కోరాలని
కోరుకున్నాను, మాకోసమే కాదు,

00:28:29.480 --> 00:28:31.000 align:center
శామ్ కోసం కూడా.

00:28:31.200 --> 00:28:35.840 align:center
ఎందుకంటే... పెద్ద పనికిమాలినవాడు.

00:28:37.320 --> 00:28:39.920 align:center
అయినా, లేదు, వాడి చావు కోరలేదు.

00:28:40.200 --> 00:28:41.640 align:center
నన్ను నమ్ము...

00:28:42.840 --> 00:28:45.960 align:center
డిటెక్టివ్, చావు నువ్వు కోరుకున్న
మనశ్శాంతిని నీకివ్వదు.

00:28:55.080 --> 00:28:56.760 align:center
అయితే శామ్ నీటిలో పడ్డాడు.

00:28:57.600 --> 00:28:59.200 align:center
గుడిసె వదిలి వచ్చేసావు.

00:28:59.520 --> 00:29:00.720 align:center
ఆ తరువాత ఏమైంది?

00:29:01.400 --> 00:29:04.040 align:center
నేను తలుపు తెరిచేసరికి
విక్ నా గడపలో ఉంది.

00:29:06.200 --> 00:29:08.400 align:center
-అక్కడికి ఎలా వచ్చింది?
-నాకు తెలియదు.

00:29:08.480 --> 00:29:12.080 align:center
ఆమె కాలి నిండా గాయాలు,
ఒకటే చెప్పు వేసుకొనుంది.

00:29:12.160 --> 00:29:14.440 align:center
-నడిచి వచ్చిందని అనుకున్నాను.
-సర్జరీకా?

00:29:14.520 --> 00:29:15.920 align:center
అది ఆరు కిలోమీటర్లు ఉంది.

00:29:16.000 --> 00:29:18.360 align:center
ఆమెను మ్యాప్ గీయమనలేదు,
సహాయం చేసానంతే.

00:29:18.560 --> 00:29:21.080 align:center
ఆమెను హాస్పిటలుకు తీసుకెళ్లాక ఏమైంది?

00:29:21.160 --> 00:29:22.320 align:center
నేను ఇంటికి వచ్చేసాను.

00:29:23.080 --> 00:29:25.600 align:center
అలా ఒకరు దెబ్బలు తినటం
చూడటం కష్టంగా ఉంటుందిగా?

00:29:25.680 --> 00:29:29.040 align:center
అవును. దురదృష్టవశాత్తు, అరుదేం కాదు.

00:29:29.120 --> 00:29:30.440 align:center
ఇది గృహహింస,

00:29:30.520 --> 00:29:33.680 align:center
నీ అంగంలోకి దూరే
అమెజాన్ చేప కాదు.

00:29:33.880 --> 00:29:36.840 align:center
నీకు సాక్ష్యంగా ఎవరైనా ఉన్నారా?

00:29:38.000 --> 00:29:40.720 align:center
అవును, నేను అక్కడే ఉన్నాను, డార్లింగ్.

00:29:40.800 --> 00:29:43.280 align:center
నేను, అలైనా
విందోత్సవం గురించి చర్చిస్తున్నాము.

00:29:43.360 --> 00:29:46.640 align:center
కానీ మేము ముగ్గురం విక్టోరియాను
లోపల చేర్చాక, నేను వెళ్ళాను.

00:29:46.760 --> 00:29:48.000 align:center
వెళ్లారా?

00:29:48.960 --> 00:29:51.760 align:center
అవును, అంటే, తెలుసుగా,
విక్, నేనూ అంత దగ్గర కాదు.

00:29:51.840 --> 00:29:53.360 align:center
శామ్ రాడ్ స్నేహితుడు.

00:29:53.480 --> 00:29:56.560 align:center
వారి వ్యవహారాలలో
తలదూర్చకుండా ఉంటే మంచిది.

00:29:56.680 --> 00:29:58.040 align:center
ఎవరికి మంచిది?

00:29:59.280 --> 00:30:01.600 align:center
-నీకా?
-సారీ, మార్గరెట్,

00:30:02.080 --> 00:30:03.880 align:center
"ముగ్గురం" అన్నావా?

00:30:03.960 --> 00:30:07.240 align:center
అవును, విక్ వచ్చేటప్పటికి
నేను అంతా శుభ్రం చేస్తున్నాను.

00:30:07.600 --> 00:30:10.160 align:center
శామ్ ఆమెను చితకక్కొట్టాడు, వెధవగాడు.

00:30:11.080 --> 00:30:12.560 align:center
ఆ తరువాత ఏమైంది?

00:30:13.680 --> 00:30:16.640 align:center
-నువ్వు ప్రతీకారంగా వాడిని చంపేసావా?
-అస్సలు కాదు.

00:30:16.720 --> 00:30:19.800 align:center
విక్ను లోపలికి తీసుకెళ్లి
అలైనా చికిత్సకు సహాయం చేసాను,

00:30:19.880 --> 00:30:22.160 align:center
ఇద్దరినీ అలైనా కారులో ఎక్కించాను.

00:30:22.240 --> 00:30:25.000 align:center
వాళ్లు వెళ్లాక,
నేను నేలంతా శుభ్రం చేసి...

00:30:26.200 --> 00:30:27.320 align:center
షరెల్, ఏం చేసావు?

00:30:28.520 --> 00:30:30.840 align:center
ఇంటికి వెళ్లాను. పడుకున్నాను.

00:30:31.520 --> 00:30:34.880 align:center
దానికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారా?
సరిగ్గానే అన్నానా?

00:30:35.000 --> 00:30:36.920 align:center
లేదు, లేదు. సరిగ్గా అనలేదు.

00:30:37.000 --> 00:30:40.520 align:center
అవును, గెవిన్. గెవిన్ సాక్ష్యం దానికి.
ఆ రాత్రి వాడితోనే ఉన్నాను.

00:30:40.680 --> 00:30:42.920 align:center
అతని నంబరు కావాలా? నేను ఇస్తాను.

00:30:43.000 --> 00:30:44.880 align:center
వాడు జవాబు ఇస్తాడని అనుకోను.

00:30:45.280 --> 00:30:47.360 align:center
ఆ రాత్రి ఇంకెవరినైనా చూసావా?

00:30:48.640 --> 00:30:51.120 align:center
అమ్మ నాకు కాల్ చేసి
నాన్నను వదిలేస్తున్నానంది.

00:30:51.200 --> 00:30:54.280 align:center
నేను వచ్చేవరకూ ఆగమన్నాను,

00:30:54.360 --> 00:30:58.200 align:center
కానీ అది 40 ఏళ్ల నుండి నానుతున్న
నిర్ణయం, ఆమెను ఆపేవారు లేరు.

00:30:58.760 --> 00:31:01.560 align:center
నాన్నను వెతుకుతూ
అమ్మ డోర్బెల్కు వెళ్లింది.

00:31:02.640 --> 00:31:05.960 align:center
జిమ్మీ అమ్మాయిలతో
గుడిసెలో ఉన్నాడని చెప్పాడు.

00:31:06.960 --> 00:31:10.440 align:center
అమ్మకు పూనకం వచ్చింది,
జిమ్మీకి ఆయనను చంపేస్తానని చెప్పింది.

00:31:10.520 --> 00:31:12.520 align:center
అందుకే జిమ్మీ బ్లాక్‌మెయిల్ చేసాడు.

00:31:12.600 --> 00:31:14.760 align:center
నువ్వు అమ్మను కాపాడటానికి డబ్బిచ్చావు.

00:31:14.840 --> 00:31:17.920 align:center
అతని బహిరంగ హస్తప్రయోగ
సేవలకైతే బహుమతి కాదు.

00:31:19.200 --> 00:31:20.960 align:center
ఆ రాత్రి ఏమైంది మరి?

00:31:21.040 --> 00:31:25.360 align:center
నేను విమానం దిగేసరికి, అలైనా షరెల్ల
నుండి కనీసం 50 మిస్స్డ్ కాల్లు.

00:31:25.440 --> 00:31:26.800 align:center
అమ్మ సురక్షితం అని తెలిసాక,

00:31:26.880 --> 00:31:29.640 align:center
నేను గుడిసెకు వెళ్లాను నాన్న కోసం.

00:31:30.560 --> 00:31:33.360 align:center
-మైక్ అప్పుడే నీకు టిక్కెట్ ఇచ్చాడు.
-అవును.

00:31:33.840 --> 00:31:36.680 align:center
కానీ అక్కడికి వెళ్లేసరికి, నాన్న లేడు.

00:31:38.000 --> 00:31:39.840 align:center
అతను పారిపోయాడనుకున్నాం,

00:31:39.920 --> 00:31:41.680 align:center
కానీ అతను తిరిగి రాకపోయేసరికి,

00:31:41.760 --> 00:31:44.720 align:center
అమ్మ తనే చంపేసాననుకుంది, ప్రమాదవశాత్తు.

00:31:44.800 --> 00:31:47.480 align:center
ఆయన మిస్సింగ్ రిపోర్టు
ఇవ్వటానికి ఎదురు చూసింది.

00:31:47.560 --> 00:31:52.160 align:center
అంటే, అంతా, తప్పిపోయాడనే అనుకున్నారు,
మేము దానిని సరి చేయలేదంతే.

00:31:53.280 --> 00:31:55.880 align:center
-ఆమెనే చంపింది అంటావా?
-నాకు తెలియదు.

00:31:56.880 --> 00:31:59.240 align:center
కానీ ఆమె చంపినా కానీ మీరు ఫోటోలు చూసారుగా,

00:31:59.320 --> 00:32:01.560 align:center
ఆ గాయాలు, విరిగిన నడుం.

00:32:02.600 --> 00:32:04.440 align:center
అలైనా, మార్గరెట్, షరెల్, నేను,

00:32:04.520 --> 00:32:07.840 align:center
ఆమె అభిమానం కోసం
అంత శిక్ష అనుభవించనక్కరలేదని భావించాము.

00:32:07.920 --> 00:32:10.440 align:center
అందుకే, మేము కూడబలుక్కొని
నోరు మూసుకున్నాం.

00:32:10.520 --> 00:32:11.840 align:center
ఏంటి, మీరు కూటమా?

00:32:12.640 --> 00:32:14.000 align:center
నాకెందుకు చెప్పలేదు?

00:32:14.800 --> 00:32:16.240 align:center
అది రహస్యం కనుక.

00:32:16.800 --> 00:32:19.280 align:center
ఆ గుడిసెలో అమ్మాయి ఉందని అన్నావు.

00:32:19.880 --> 00:32:22.400 align:center
-ఎవరో నీకేమన్నా తెలుసా?
-లేదు.

00:32:23.400 --> 00:32:24.520 align:center
చాలా చెప్పాను.

00:32:34.800 --> 00:32:36.040 align:center
చెప్పు, కేట్.

00:32:36.560 --> 00:32:37.560 align:center
నువ్వన్నది నిజమే.

00:32:37.760 --> 00:32:41.000 align:center
ఆ యోని జుట్టు శామ్
మరో బిడ్డ తల్లిదే.

00:32:41.080 --> 00:32:42.400 align:center
ఆ మరో బిడ్డ ఎవరు?

00:32:42.480 --> 00:32:45.760 align:center
మాకు తెలియదు.
డీఎన్ఏ టెస్టింగ్ రోజు నమూనా అది.

00:32:45.840 --> 00:32:46.720 align:center
ధన్యవాదాలు, కేట్.

00:32:46.800 --> 00:32:48.600 align:center
టీనేజర్లలో ఎవరైనా అయుంటారు.

00:32:48.680 --> 00:32:51.680 align:center
మనకు అనుమతి లేదు,
అందుకే వాటి మీద లేబుల్స్ లేవు.

00:32:51.760 --> 00:32:54.520 align:center
అక్కడ ఎవరెవరున్నారు?
వాళ్లంతా ముసలివాళ్లలాగున్నారు.

00:32:55.120 --> 00:32:59.200 align:center
-కాలమ్, హంటర్, డాల్ఫ్, టామ్.
-డైసన్, టైసన్, గ్రేసన్. బైసన్ ఏమో?

00:32:59.320 --> 00:33:01.760 align:center
కాలమ్ తమ్ముడు జాస్పర్ కూడా,

00:33:01.840 --> 00:33:05.080 align:center
అతను కడుపులో పడేనాటికి
శామ్ చచ్చాడు కూడా అనుకో.

00:33:05.160 --> 00:33:07.720 align:center
జాక్ స్కూటీని ఇష్టం వచ్చినట్టు నడిపేవాడు.

00:33:07.840 --> 00:33:10.120 align:center
పీటర్, రాఫెల్, ఆర్సన్ కవలలు...

00:33:10.240 --> 00:33:13.200 align:center
-సరే. వాళ్లు వాటేసుకున్నారు.
-వారు మరీ ప్రమాదకారులు.

00:33:15.360 --> 00:33:19.440 align:center
హలో? ఇంకా చెప్పాలా,
అసలు వింటున్నావా?

00:33:23.200 --> 00:33:25.480 align:center
బాబోయ్, కాలిన్స్.

00:33:27.960 --> 00:33:29.440 align:center
ఇది అసలైన ప్రతిబింబం.

00:33:31.560 --> 00:33:33.080 align:center
లాక్ నెస్సీ.

00:33:44.160 --> 00:33:46.720 align:center
వనెస్సా, ఈ పడవను గుర్తు పట్టావా?

00:33:49.800 --> 00:33:52.440 align:center
-అది శామ్ పడవ.
-దాని పేరేంటి?

00:33:52.520 --> 00:33:54.320 align:center
-లాక్ నెస్సీ.
-నెస్సీ.

00:33:55.200 --> 00:33:58.680 align:center
ఫిల్ ప్రెస్ వాళ్లతో
మాట్లాడేటప్పుడు నిన్ను పిలిచిన ముద్దుపేరు.

00:33:59.880 --> 00:34:01.800 align:center
శామ్ తన పడవకు నీ పేరు పెట్టాడా?

00:34:01.880 --> 00:34:04.920 align:center
నాకు తెలియదు. కావచ్చు.
అది 20 ఏళ్ల క్రితం. గుర్తు లేదు.

00:34:05.000 --> 00:34:06.280 align:center
ఇరవై ఏళ్ల క్రితం?

00:34:06.360 --> 00:34:08.280 align:center
ఇరవై, 24 ఏళ్లు, అలాగేమో.

00:34:10.680 --> 00:34:12.200 align:center
వనెస్సా, నీకప్పుడు 15 ఏళ్లు.

00:34:12.280 --> 00:34:14.520 align:center
అప్పుడు శామ్తో తిరిగావా?

00:34:14.600 --> 00:34:16.120 align:center
అది బాల్య మానభంగం.

00:34:16.160 --> 00:34:19.360 align:center
నీకు అది అర్థం కాదులే,
నువ్వు లెస్బియనువి కనుక,

00:34:20.640 --> 00:34:22.840 align:center
నువ్వేదీ కాదు కనుక.

00:34:23.200 --> 00:34:26.120 align:center
శామ్ అసంతుష్ట కాపురం చేస్తున్న
యువ రక్తపు మగవాడు.

00:34:26.520 --> 00:34:29.400 align:center
మా వయస్సులతో నిమిత్తం లేని
బంధం మాదని అన్నాడు.

00:34:29.480 --> 00:34:31.920 align:center
అతనిని బాగా అర్థం చేసుకొంది నేనే.

00:34:32.000 --> 00:34:33.440 align:center
వనెస్సా, నిన్ను దువ్వాడు.

00:34:33.520 --> 00:34:34.920 align:center
నా జుట్టా?

00:34:35.000 --> 00:34:37.360 align:center
తల్లి, అతనికి 40 ఏళ్ల పైమాటే.

00:34:37.680 --> 00:34:39.320 align:center
నువ్వు పదులలో ఉన్నావు!

00:34:39.400 --> 00:34:41.520 align:center
గృహ ఆర్థికశాస్త్రం క్లాసులో ఉండాల్సింది.

00:34:41.600 --> 00:34:44.960 align:center
నేను తొమ్మిదో తరగతి, అందరూ
నా వయస్సుకు మించి పరిణితి అంటారు.

00:34:45.080 --> 00:34:47.480 align:center
-ఆ అందరూ ఎవరు?
-శామ్, రాడ్ డిక్సన్.

00:34:47.560 --> 00:34:49.040 align:center
ముందే చెప్పానుగా.

00:34:49.120 --> 00:34:53.160 align:center
మగవాళ్లకు నేనంటే పిచ్చి.
అందుకే నాకు ఆడ స్నేహితులే లేరు.

00:34:53.280 --> 00:34:56.560 align:center
ఆడవాళ్లు అవన్నీ భరించలేరు.
మీ ఇద్దరికీ నేనంటే కుళ్లు.

00:34:58.360 --> 00:35:02.200 align:center
వనెస్సా, డాల్ఫ్
శామ్ ఓడ్వాయర్ కొడుకని తెలుసు.

00:35:07.200 --> 00:35:09.480 align:center
శామ్ మాయమయ్యే సమయాన
అతనితో ఉన్నావా?

00:35:11.440 --> 00:35:12.440 align:center
అంత ఎక్కువగా లేను.

00:35:13.560 --> 00:35:17.360 align:center
నేను ఆపేస్తానంటే చాలు
శామ్ ట్రెంట్కు చెపుతానని బెదిరిస్తాడు,

00:35:17.440 --> 00:35:20.040 align:center
ట్రెంట్ ఎలా తీసుకుంటాడో అని భయపడ్డాను.

00:35:20.480 --> 00:35:22.280 align:center
అతనికి కోపం ఎక్కువ.

00:35:23.000 --> 00:35:25.160 align:center
శామ్ మాయమైన రాత్రి
నువ్వు అతనితో ఉన్నావా?

00:35:27.640 --> 00:35:30.880 align:center
వనెస్సా, శామ్ ఓడ్వాయర్
నీపై మైనరుగా లైంగిక దాడి చేసాడు.

00:35:30.960 --> 00:35:33.280 align:center
నిన్ను సంబంధంలోకి బెదిరించి లాగాడు.

00:35:33.360 --> 00:35:36.960 align:center
వింటున్న కొద్దీ, రాడ్ డిక్సన్కు
తెలిసీ నీకే సహాయం చేయలేదు.

00:35:37.040 --> 00:35:39.920 align:center
ట్రెంట్ కొడతాడు,
గెవిన్, జిమ్మీ లైంగికంగా వేధించారు.

00:35:40.000 --> 00:35:43.480 align:center
ఓరి దేవుడా! మరీ అతి చేసి చెపుతున్నారు.

00:35:43.560 --> 00:35:44.640 align:center
పర్వాలేదు.

00:35:44.680 --> 00:35:48.040 align:center
మగవాళ్లు మగవాళ్లలాగా ప్రవర్తించటం అంతే?

00:35:49.080 --> 00:35:51.040 align:center
అవును, మాకు తెలుసు.

00:35:51.480 --> 00:35:53.080 align:center
అది పర్వాలేదు అనలేము.

00:35:53.160 --> 00:35:56.680 align:center
నీ యోని జుట్టు శామ్ నోటిలో ఉంది,
అతను మాయమైన రాత్రి.

00:35:56.800 --> 00:35:59.160 align:center
-అతను చచ్చిన రాత్రి.
-అయితే?

00:35:59.200 --> 00:36:01.360 align:center
అయితే నిన్ను అది నేర ఘటనలో చేరుస్తుంది.

00:36:03.360 --> 00:36:04.840 align:center
నేను శామ్ను చంపారంటారా?

00:36:06.880 --> 00:36:09.560 align:center
లేదు, నేను ఆ రాత్రి అక్కడున్నాను,

00:36:09.640 --> 00:36:12.120 align:center
కానీ విక్ రాగానే కిటికీలోంచి
దూకి పారిపోయాను.

00:36:12.160 --> 00:36:13.760 align:center
షరెల్ నన్ను తీసుకెళ్లింది.

00:36:13.840 --> 00:36:15.480 align:center
ఒట్టు, నేను తనను చంపలేదు!

00:36:16.760 --> 00:36:20.360 align:center
నేను ఎలాంటివారైనా
మనుషులకు ప్రాణం పోసే వృత్తిలో ఉన్నాను.

00:36:20.440 --> 00:36:21.600 align:center
నేను అతనిని చంపలేదు.

00:36:21.680 --> 00:36:24.280 align:center
లేదు, నాకు కారణం కూడా లేదు, డార్లింగ్.

00:36:25.120 --> 00:36:26.320 align:center
నేను అతనిని చంపలేదు.

00:36:26.400 --> 00:36:29.320 align:center
మనం మాట్లాడుకున్నాముగా.
నేను అతనిని చంపలేదు!

00:36:29.400 --> 00:36:31.000 align:center
అతనో పెద్ద రాక్షసుడు!

00:36:31.080 --> 00:36:32.440 align:center
కానీ నేను చంపలేదు.

00:36:32.600 --> 00:36:34.960 align:center
అవును, నేను అలాగే చంపాను.

00:36:39.120 --> 00:36:41.120 align:center
-విక్ వాడిని చంపలేదు.
-కచ్చితంగా.

00:36:41.160 --> 00:36:45.160 align:center
శామ్ ఓడ్వాయర్ తల గాయం
చావుకు కారణమైతే, నేరం విక్దే.

00:36:45.280 --> 00:36:46.680 align:center
అది కాదుగా జరిగింది.

00:36:46.800 --> 00:36:50.440 align:center
వారిలో ఎవరికీ గొంతు నొక్కటం,
నాలుకల గురించి తెలియదు,

00:36:50.520 --> 00:36:51.840 align:center
శామ్ బట్టల గురించి కూడా.

00:36:52.360 --> 00:36:54.600 align:center
విక్ను శామ్ కొట్టటం
గురించి ఇంకెవరికో తెలుసు.

00:36:54.680 --> 00:36:56.360 align:center
డైవర్లకు చెయ్యి దొరికింది.

00:36:56.480 --> 00:36:59.480 align:center
దేహ భాగాలను
అతికించే సమయం మనకు లేదు.

00:36:59.560 --> 00:37:02.160 align:center
-మనం అక్కడికే వెళదాం.
-సరే. వెళదాం.

00:37:02.280 --> 00:37:04.320 align:center
-వాళ్లకు ఖైదా లేక వదిలేయాలా.
-కాథ్.

00:37:04.400 --> 00:37:07.040 align:center
ఆ లాకప్పులో ముగ్గురు
మాత్రమే పడతారు.

00:37:07.120 --> 00:37:09.160 align:center
వారంతా కుక్కి కూర్చోవాలి.

00:37:09.200 --> 00:37:11.080 align:center
నేరం మోపు లేదా వదిలెయ్యి,

00:37:11.160 --> 00:37:13.640 align:center
లేదా కోర్డు ఆర్డరుకు
అప్లై చేస్తాను, డిటెక్టివ్.

00:37:20.400 --> 00:37:21.760 align:center
కానీ నేను అంగీకరించానుగా.

00:37:21.840 --> 00:37:23.160 align:center
నాకు అర్థం కావట్లేదు.

00:37:23.200 --> 00:37:25.920 align:center
నీకు చాలా జరిగింది.
నువ్వు నాతో రా.

00:37:26.280 --> 00:37:28.120 align:center
మీ నాన్నతో నా సంబంధం చెప్పావుగా.

00:37:28.160 --> 00:37:30.600 align:center
లేదు. నేను నీలా కాదు, రహస్యాలు చెప్పను.

00:37:30.760 --> 00:37:33.160 align:center
అలైనా, హాలు తాళాలు ఉన్నాయా?

00:37:33.320 --> 00:37:35.120 align:center
జెజ్, నాకు స్టూడియో తాళాలిచ్చాడు.

00:37:35.160 --> 00:37:36.800 align:center
-స్కై--
-వద్దు, నా వల్లకాదు!

00:37:36.880 --> 00:37:37.800 align:center
స్కై...

00:37:39.640 --> 00:37:43.000 align:center
మాకేం కావాలి? వారి చావు కావాలి!
ఎప్పుడు కావాలి? ఈ రాత్రే!

00:37:43.080 --> 00:37:45.120 align:center
ఆ సోదిగాళ్లు ఏం చేస్తున్నారు?

00:37:45.200 --> 00:37:46.600 align:center
-ఎప్పుడు కావాలి?
-ఈ రాత్రే.

00:37:46.640 --> 00:37:48.480 align:center
-మనకేం కావాలి?
-రాత్రిని పొందాలి.

00:37:48.560 --> 00:37:50.040 align:center
-ఎప్పుడు కావాలి?
-ఈ రాత్రే.

00:37:50.120 --> 00:37:52.040 align:center
-మనకేం కావాలి?
-రాత్రిని పొందాలి.

00:37:52.440 --> 00:37:53.840 align:center
ఏం చేస్తున్నారు, ఫిల్?

00:37:54.280 --> 00:37:56.560 align:center
మీ ఆడ పోలీసులు
ఓడ్వాయర్ను వదిలేస్తున్నారట.

00:37:56.640 --> 00:38:00.440 align:center
మీరు మమ్మల్ని రక్షించకపోతే,
మేము చట్టాన్ని చేతులలోకి తీసుకుంటాం.

00:38:00.800 --> 00:38:01.960 align:center
అవునా?

00:38:02.040 --> 00:38:05.080 align:center
మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు, ఫిల్?

00:38:05.160 --> 00:38:08.280 align:center
అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం, బంగారం.

00:38:08.360 --> 00:38:11.080 align:center
ఆ పురుష హంతకి ఓడ్వాయర్
ఇంకేం చేయకుండా

00:38:11.160 --> 00:38:13.200 align:center
మేము చూసుకుంటాం, కదా?

00:38:13.360 --> 00:38:14.960 align:center
లేదు, లేదు. ఫిల్, అలా చేయవు.

00:38:15.040 --> 00:38:20.320 align:center
అందినీ ఆదేశిస్తున్నాను అన్నీ పడేసి...
పనిముట్లన్నీ. ఇంటికి పోండి!

00:38:20.400 --> 00:38:23.520 align:center
లేదు! లేదు, లేదు.
మేము ఈ రాత్రి అంతు తేలుస్తాం.

00:38:24.160 --> 00:38:26.200 align:center
మేము చేతులు ముడుచుకొని కూర్చోము.

00:38:26.360 --> 00:38:28.160 align:center
భయంతో బతకబోము.

00:38:29.560 --> 00:38:31.960 align:center
అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో

00:38:32.360 --> 00:38:34.640 align:center
అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో

00:38:34.880 --> 00:38:36.120 align:center
అయ్యో, అయ్యో, అయ్యో

00:38:36.160 --> 00:38:38.680 align:center
మా స్వరాన్ని అర్థం చేసుకోండి

00:38:38.840 --> 00:38:42.360 align:center
స్పష్టంగా అరిచి చెప్పండి

00:38:46.960 --> 00:38:49.480 align:center
హే! హే, పక్కకు జరగండి!

00:38:49.560 --> 00:38:52.560 align:center
కదలండి! కదలండి, పోండి! పోండి!

00:38:52.640 --> 00:38:53.680 align:center
అరే!

00:38:55.040 --> 00:38:55.920 align:center
ఫిల్.

00:38:56.400 --> 00:38:57.800 align:center
పైకి లే!

00:39:00.800 --> 00:39:02.120 align:center
ఇది ప్రో బ్రో కారు.

00:39:02.160 --> 00:39:03.920 align:center
-వాళ్ల ముఖం చూసావా?
-లేదు! పద.

00:39:04.000 --> 00:39:05.640 align:center
ఏంటిదంతా!

00:39:12.200 --> 00:39:14.800 align:center
-కార్నేజ్ బే పోలీసులకు కలుపు.
-రేడియోలో చెప్పు.

00:39:14.880 --> 00:39:17.160 align:center
సావధాన్, యూనిట్లన్నీ,
టాస్మానియాలో అందరూ!

00:39:17.200 --> 00:39:19.160 align:center
గ్రీన్ ట్రక్ వెనకపడుతున్నాం,

00:39:19.200 --> 00:39:22.920 align:center
లాలీపాప్ కప్ప ఆకుపచ్చ ట్రక్
ఊరి బయటకు పోతుంది. మాకు బ్యాకప్ కావాలి.

00:39:23.040 --> 00:39:25.920 align:center
మళ్లీ, బ్యాకప్ కావాలి.
వేగంగా, కాలిన్స్, నడుపు!

00:39:26.040 --> 00:39:28.880 align:center
ఇక్కడంతా ప్యాడీమెలన్స్ ఉన్నాయి!
వాటిని తొక్కేయలేము.

00:39:29.440 --> 00:39:32.680 align:center
-కుడివైపు తిప్పు.
-అవును, తిప్పాను! అదే చేస్తున్నాను.

00:39:32.800 --> 00:39:33.960 align:center
ఎటు పోయింది?

00:39:34.040 --> 00:39:36.480 align:center
నువ్వు అంత గట్టిగా అరిస్తే
నాకు కనబడట్లేదు!

00:39:36.560 --> 00:39:38.320 align:center
దానికసలు అర్థం ఉందా!

00:39:39.120 --> 00:39:40.160 align:center
అదిగో అక్కడ!

00:39:40.280 --> 00:39:43.520 align:center
రెడ్క్లిఫ్ను. మాకు బండి
చాపెల్ వీధిలో దొరికింది.

00:39:43.600 --> 00:39:45.120 align:center
మాకు వెంటనే బ్యాకప్ కావాలి!

00:39:59.840 --> 00:40:01.160 align:center
-అబ్బబ్బా!
-అరే!

00:40:16.000 --> 00:40:18.800 align:center
-ఇది సరిగ్గా చెట్టు వేరులో దూరింది?
-అవును, అంతే.

00:40:18.880 --> 00:40:22.200 align:center
అది మరీ వెర్రి.
అక్కడ అసలు ఏమన్నా కనిపిస్తుందా?

00:40:22.320 --> 00:40:25.680 align:center
-పర్వాలేదులే.
-నేను మళ్లీ అందులో చేరుదామనుకుంటున్నాను.

00:40:25.800 --> 00:40:29.480 align:center
-కొన్ని రోజుల తరువాత అది అలా--
-స్వెన్? స్వెన్?

00:40:29.560 --> 00:40:30.920 align:center
-సారీ. ఏమిటి?
-స్వెన్.

00:40:31.960 --> 00:40:33.760 align:center
అక్కడ టో ట్రక్కు ఎందుకుంది?

00:40:34.600 --> 00:40:35.880 align:center
విన్స్-- తను విన్స్.

00:40:35.960 --> 00:40:37.640 align:center
-అతనిని ప్రేమిస్తున్నాను.
-సరే.

00:40:37.680 --> 00:40:39.600 align:center
అతను అక్కడ పెద్ద కారు తీసాడు.

00:40:39.640 --> 00:40:42.280 align:center
నాలుగు చక్రాల డ్రైవ్, ఏడు సీట్లు,
మంచి కండిషన్.

00:40:42.360 --> 00:40:45.760 align:center
ఈ సరస్సులో జనాలు
ఏమేమీ పడేస్తుంటారో కదా.

00:40:48.640 --> 00:40:50.880 align:center
అతను ఎలా ఉన్నాడంటావు? అంటే--

00:40:50.960 --> 00:40:53.640 align:center
-అతను చచ్చాడు, స్వెన్.
-వాడు కాదు. అది...

00:41:02.320 --> 00:41:04.320 align:center
అంతే. కదిలించండి, బాబులు.

00:41:04.400 --> 00:41:06.560 align:center
-అదీ అలాగే. రెండు బై రెండు.
-అలైనా!

00:41:06.640 --> 00:41:08.280 align:center
అరే. చేసేస్తున్నాం.

00:41:08.840 --> 00:41:09.800 align:center
ఏం జరుగుతుంది?

00:41:09.880 --> 00:41:12.920 align:center
ఫిల్ అత్యవసర పురుషులకు మాత్రమే
టౌన్ హాల్ మీటింగ్ పెట్టాడు

00:41:13.040 --> 00:41:16.480 align:center
అక్కడ అతనిని ఇన్ఛార్జి మేయర్‌ను చేసారు,
వాళ్లు కుక్కలు కనుక!

00:41:16.560 --> 00:41:17.840 align:center
అక్కడ పోలీసున్నాడేంటి?

00:41:17.920 --> 00:41:19.960 align:center
-అలైనా.
-అందులో అబద్ధమేముంది, జెజ్?

00:41:20.040 --> 00:41:22.000 align:center
గయ్స్, గయ్స్! అక్కడ బస్ ఎందుకుంది?

00:41:22.120 --> 00:41:25.640 align:center
ఎవరో మీటింగులో మగవాళ్లందరిని
టౌను బయటకు పంపాలని చెప్పారట.

00:41:25.680 --> 00:41:29.440 align:center
17 ఏళ్లా పైబడిన ప్రతి డెడ్‌లాక్
పురుషుడిని వాళ్లు ఎక్కడో రహస్య,

00:41:29.520 --> 00:41:33.320 align:center
సురక్షిత ప్రదేశానికి తీసుకెళతారట,
డెడ్‌లాక్ విడో/రిప్పర్ దొరికేదాకా

00:41:33.400 --> 00:41:35.360 align:center
లేదంటే చంపబడే వరకూ.

00:41:35.520 --> 00:41:38.600 align:center
-నువ్వు బస్సు ఎక్కుతున్నావా?
-చావాలని లేదు నాకు.

00:41:38.680 --> 00:41:42.120 align:center
సరే. విక్ నేనూ అది సరైన పని అనుకుంటున్నాం.

00:41:42.160 --> 00:41:44.160 align:center
-నేను ఉంటాను.
-సరే, బాబులు, ఎక్కండి.

00:41:44.200 --> 00:41:47.000 align:center
లేదు! జెజ్కు ఏమన్నా అయితే
నేను తట్టుకోలేను.

00:41:47.080 --> 00:41:49.440 align:center
నాకు పాస్వర్డ్లు అవేమీ తెలియవు.

00:41:49.520 --> 00:41:51.960 align:center
కానీ అంతకన్నా, నా గుండె నిండా నువ్వే.

00:41:52.480 --> 00:41:54.480 align:center
వెళ్లు. వెళ్లు అంతే!

00:41:58.400 --> 00:42:00.120 align:center
సరే మరి, మేము వెళ్లిపోతున్నాం.

00:42:00.160 --> 00:42:01.680 align:center
శుభాశీస్సులు, రే పైస్.

00:42:02.200 --> 00:42:05.360 align:center
హే, నువ్వు నన్ను
రే పైస్ అని పిలవటం ఆపవచ్చు?

00:42:05.560 --> 00:42:06.560 align:center
ఎందుకు?

00:42:06.640 --> 00:42:09.200 align:center
వేగంగా అను
ఏమంటున్నావో చూడు.

00:42:10.160 --> 00:42:14.400 align:center
రే పైస్. రే పైస్, రే పైస్,
రే పైస్, రే పైస్.

00:42:15.280 --> 00:42:17.400 align:center
-సరే. ధన్యవాదాలు.
-సరే.

00:42:19.760 --> 00:42:21.680 align:center
ఫిల్, నీతో నేనూ రావచ్చుగా?

00:42:21.800 --> 00:42:23.760 align:center
నాకు తనే మిగిలాడు.

00:42:24.360 --> 00:42:25.760 align:center
నువ్వు రాలేవు, వనెస్సా.

00:42:26.120 --> 00:42:28.320 align:center
ప్లీజ్. ఫిల్, నేను అడుగుతున్నాను.

00:42:29.360 --> 00:42:30.440 align:center
పురుషులు మాత్రమే.

00:42:34.640 --> 00:42:36.600 align:center
-ఫిల్.
-మంచిది, ఫిల్!

00:42:36.760 --> 00:42:39.880 align:center
లేదు, నీకే స్వాగతం, మిత్రమా.
ఇక్కడ మమ్మల్ని మేము చూసుకుంటాం.

00:42:40.520 --> 00:42:42.280 align:center
కంగారేం లేదు, సీనియర్ సార్జెంట్.

00:42:42.360 --> 00:42:45.000 align:center
మీ పని పంచుకున్నాము.
తరువాత ధన్యవాదాలు తెలుపు.

00:42:45.080 --> 00:42:46.360 align:center
బై, మైకీ. లవ్ యూ.

00:42:46.480 --> 00:42:47.760 align:center
"మేము" ఎవరు, ఫిల్?

00:42:48.320 --> 00:42:50.520 align:center
హే, ఇంకెవరు నా పని చేస్తున్నారు?

00:42:50.600 --> 00:42:52.560 align:center
నేను స్నేహితునికి కాల్ చేసాను, కాదా?

00:42:52.640 --> 00:42:55.040 align:center
ఎద్దు పొదుగులాగా పనికిరానిదానివి కనుక.

00:42:55.760 --> 00:42:56.840 align:center
అరే.

00:42:58.320 --> 00:42:59.360 align:center
డిటెక్టివ్?

00:43:01.680 --> 00:43:04.080 align:center
సరే. సరే.

00:43:05.120 --> 00:43:06.160 align:center
నిజంగా?

00:43:09.640 --> 00:43:13.960 align:center
సరే. డిటెక్టివ్,
మనం స్టేషనుకు వెళ్లాలి. అందుకే...

00:43:15.120 --> 00:43:16.320 align:center
బై, రే. సరే.

00:43:17.840 --> 00:43:18.880 align:center
డిటెక్టివ్!

00:43:21.520 --> 00:43:23.800 align:center
బై! డాల్ఫీ, నిన్ను ప్రేమిస్తున్నాను.

00:43:45.240 --> 00:43:49.320 align:center
ఏం జరుగుతుందిక్కడ? ఈ వెధవలంతా ఎవరు?
అడ్డు తప్పుకోండి.

00:43:51.240 --> 00:43:53.320 align:center
-కానెల్.
-కమీషనర్ హేస్టింగ్స్.

00:43:53.400 --> 00:43:55.000 align:center
నువ్వు హంతకులను వదిలేసావు.

00:43:55.080 --> 00:43:56.800 align:center
స్కై దేశంలోనే లేదు.

00:43:56.880 --> 00:43:59.600 align:center
ఓడ్వాయర్ సంగతి కాదు.
వాళ్లల్లో చాలా మందిని!

00:44:00.080 --> 00:44:02.960 align:center
నేను వచ్చి, నీ హత్యా బోర్డును చూసి,

00:44:03.040 --> 00:44:05.760 align:center
పదే పది నిముషాలలో
కనిపెట్టేసాను, లేడీస్.

00:44:05.840 --> 00:44:08.360 align:center
మీ కళ్ల ముందే ఉందిగా.

00:44:08.440 --> 00:44:11.760 align:center
ఈ ఊరంతా పురుష ద్వేషుల లెస్బియన్లే
హత్యా రుచి మరిగినవారు!

00:44:11.840 --> 00:44:12.680 align:center
ఆబీ నుండి కాల్

00:44:12.760 --> 00:44:15.080 align:center
స్త్రీలు ఇందులో భాగమని
మేము అనుకోవట్లేదు.

00:44:15.160 --> 00:44:17.560 align:center
కార్నేజ్ బే వాళ్లు నాకు చెప్పారు

00:44:17.640 --> 00:44:19.480 align:center
ఇక్కడ ఎవరో లొంగిపోయారని.

00:44:19.560 --> 00:44:20.760 align:center
నువ్వేం చేసావు?

00:44:20.840 --> 00:44:24.120 align:center
వాళ్లను వదిలేసావు,
వారిలో ఒకరు మగవారిని తొక్కేయబోయారు.

00:44:24.200 --> 00:44:25.880 align:center
-మీరు వింటే కనుక--
-లేదు!

00:44:25.960 --> 00:44:27.960 align:center
తక్షణమే అంతా నేనే చూసుకుంటాను.

00:44:28.080 --> 00:44:30.800 align:center
నువ్వూ నీ పార్టనరు
ఇకపై ఏ నిర్ణయాలు తీసుకోలేరు.

00:44:30.960 --> 00:44:33.280 align:center
-నువ్వలా చేయలేవు!
-ఆ స్త్రీలకు పొంతన లేదు.

00:44:33.360 --> 00:44:35.080 align:center
దేనికి పొంతన లేదో తెలుసా?

00:44:35.160 --> 00:44:37.200 align:center
నీ భార్య స్థానిక వెట్.

00:44:37.560 --> 00:44:40.800 align:center
ఆమెకు పెంటోబార్బిటాల్ చేతిలో ఉంది.
ఇన్వెస్టిగేట్ చేసారా?

00:44:41.000 --> 00:44:43.400 align:center
లేదు! ఆమె స్త్రీలకు ప్రతినిధి!

00:44:43.520 --> 00:44:47.400 align:center
మేయర్ రామీ, స్విమ్మర్, డాక్టర్,
ఆమె ఎందుకు జైలులో లేదు?

00:44:47.480 --> 00:44:49.600 align:center
వాళ్లందరికీ అలిబీలు ఉన్నాయి కనుక!

00:44:49.680 --> 00:44:51.960 align:center
అయితే? ఒకరు చేయలేకపోతే,
ఇంకొకరు చేస్తారు.

00:44:52.040 --> 00:44:53.000 align:center
భారం పంచుకుంటారు.

00:44:53.080 --> 00:44:56.040 align:center
స్కూల్ కార్పూల్ స్త్రీల గురించి
మాట్లాడట్లేదు ఇక్కడ.

00:44:56.120 --> 00:44:57.840 align:center
ఎవరు చేస్తున్నారంటావు?

00:44:57.920 --> 00:45:01.640 align:center
-అది మంచి ప్రశ్న.
-ప్రస్తుతానికి మా దగ్గర--

00:45:01.760 --> 00:45:03.440 align:center
మాకు తెలియదని కాదు--

00:45:03.520 --> 00:45:04.800 align:center
ఎవరు చేయలేదో తెలుసు.

00:45:04.880 --> 00:45:07.280 align:center
ఎంత మంచి వాదన.

00:45:07.360 --> 00:45:10.000 align:center
మాకు ఇంకొంచెం సమయం కావాలి,
మేము చాలా దగ్గరిగా--

00:45:10.080 --> 00:45:11.800 align:center
పదకొండు మంది చనిపోయారు.

00:45:11.880 --> 00:45:14.960 align:center
అక్కడ స్త్రీలు ప్లానులు వేస్తుంటే
పున్నమిరోజున

00:45:15.040 --> 00:45:18.320 align:center
మగవారి మారణహోమం చేస్తుంటే
చూస్తూ కూర్చోలేను.

00:45:18.400 --> 00:45:21.480 align:center
వెంటనే స్పందించాలి.
నేను ఆ సైకో స్త్రీలను బంధిస్తాను.

00:45:21.960 --> 00:45:23.200 align:center
-ఏంటి?
-ఏంటి?

00:45:23.280 --> 00:45:26.200 align:center
వాళ్లను అరెస్టు చేయటానికి
తగిన సాక్ష్యాలు లేవు, సార్.

00:45:26.280 --> 00:45:28.640 align:center
తెలుసు. అందుకే
మీరు కేసు చూడట్లేదిక.

00:45:28.760 --> 00:45:30.800 align:center
నేను వారెంటులతో ఇళ్లను రైడ్ చేస్తాను.

00:45:30.880 --> 00:45:31.960 align:center
వాళ్లు కాదు.

00:45:32.080 --> 00:45:36.280 align:center
మనలో ఎవరు సరో తేల్చుకుందాం,
చివరిసారిగా, చేద్దామా?

00:45:36.360 --> 00:45:40.600 align:center
బాయ్స్, గన్స్, ఎన్ఫోర్సర్స్,
బాలిస్టిక్ వెస్ట్స్ కానివ్వండి.

00:45:40.760 --> 00:45:42.200 align:center
సోది మగవాళ్లు. తగలెయ్య.

00:45:42.280 --> 00:45:44.640 align:center
-వాళ్లను హెచ్చరించాలి.
-హే, పిచ్చిగా చేయకు.

00:45:44.720 --> 00:45:46.400 align:center
నేను ఇక్కడ ఉండలేను.

00:45:46.520 --> 00:45:50.400 align:center
హేస్టింగ్స్ కేసులు తగిలిస్తాడు,
అది తప్పైనా సరే చేస్తాడు.

00:45:50.480 --> 00:45:54.320 align:center
కాలిన్స్, నువ్వు దూరావంటే,
హేస్టింగ్స్ నీ బాడ్జీ తీసుకుంటాడు.

00:45:54.400 --> 00:45:56.920 align:center
వాళ్లు కాదని నిరూపించి సహాయపడు.

00:45:57.480 --> 00:45:59.280 align:center
సరే మరి. వెళదాం పద!

00:46:09.160 --> 00:46:11.640 align:center
హాయ్, మేడమ్స్,
సారీ, మీరు బిజీగా ఉన్నారేమో,

00:46:11.720 --> 00:46:14.440 align:center
కానీ వాళ్లు సరస్సు నుండి
ఇప్పుడే కారు బయటకు తీసారు.

00:46:14.520 --> 00:46:18.640 align:center
కిల్లర్ రెండు రోజుల క్రితం
శవాలను కారులో పెట్టి ముంచేసింది,

00:46:18.720 --> 00:46:21.280 align:center
వారి ఉద్దేశ్యానికి తగినప్పుడు

00:46:21.360 --> 00:46:23.360 align:center
వాళ్లు అందులో దూకి
శవాలను వదులుతున్నారు.

00:46:23.440 --> 00:46:24.680 align:center
కాదు. అది కాదు.

00:46:24.760 --> 00:46:26.760 align:center
వాళ్లు అలా చేసారని ఎలా తెలిసిందంటే

00:46:26.840 --> 00:46:30.160 align:center
శవాలన్నింటికీ సీటు బెల్టు
గుర్తులున్నాయి కనుక.

00:46:30.840 --> 00:46:33.320 align:center
మేమింకా బండిని వెతకాలి,

00:46:33.400 --> 00:46:36.160 align:center
కానీ చేయలేకపోతున్నాం
ఎందుకంటే నా మాజీ సైకో కనుక.

00:46:36.240 --> 00:46:39.560 align:center
ఫోనులో బూతులకు మన్నించండి,
మేడమ్, సారీ. నేను అలసిపోయాను.

00:46:39.640 --> 00:46:42.000 align:center
ఇంకా నా మాజీ ఫియాన్సే సైకో.

00:46:43.080 --> 00:46:45.800 align:center
అయిపోయిందా? దాని యజమాని ఎవరో
మనకు తెలియాలి.

00:46:45.880 --> 00:46:48.040 align:center
అది మనం మిస్సవుతున్న లింక్ కావచ్చు.

00:46:49.040 --> 00:46:50.760 align:center
"మిస్సింగ్ లింక్".

00:46:50.840 --> 00:46:53.280 align:center
ఏదో పోలీసు ఆఫీసరులాగా ప్రవర్తిస్తున్నావు.

00:46:53.720 --> 00:46:56.160 align:center
ఏంటి? ఏంటది--

00:46:56.280 --> 00:46:59.680 align:center
జేమ్స్, నువ్వూ ఆ బస్సు
పట్టుకొని ఎక్కి వెళ్లాలేమో.

00:47:00.880 --> 00:47:03.680 align:center
లేదు, కిల్లర్ వెధవలకే
గురి పెట్టింది, జేమ్స్.

00:47:03.800 --> 00:47:07.320 align:center
వెధవలకే గురి పెట్టింది,
నువ్వో పెద్ద వెధవవు!

00:47:07.920 --> 00:47:10.320 align:center
అందరికన్నా అతి పెద్ద వెధవవు.

00:47:10.760 --> 00:47:13.480 align:center
-నువ్వు బస్సు ఎక్కాల్సింది!
-సరే, సరే,

00:47:13.560 --> 00:47:17.080 align:center
నీకు మూడ్ మార్చే బిళ్లలు
వాడటం గురించి మాట్లాడుకుందాం.

00:47:17.160 --> 00:47:20.080 align:center
మా అమ్మకు 30 రాగానే
నాన్న అదే పని చేసాడు.

00:47:20.160 --> 00:47:23.840 align:center
-ఆమెకు 24! ఆమెకు 24 ఏళ్లే.
-ఇరవై నాలుగు! నా వయసెంతో కూడా తెలియదా?

00:47:23.920 --> 00:47:25.120 align:center
ఇంటిలో కలుద్దాం, బేబీ.

00:47:25.200 --> 00:47:27.800 align:center
-నేను నీ బేబీని కాదు.
-ఆమె నీకన్నా చాలా నయం!

00:47:27.880 --> 00:47:29.360 align:center
మనం కలిసి కూడా లేము.

00:47:29.440 --> 00:47:30.360 align:center
నువ్వంటే అసహ్యం.

00:47:30.440 --> 00:47:31.800 align:center
ఫోరెన్సిక్స్ అయిపోయింది!

00:47:34.040 --> 00:47:35.640 align:center
అది అంటే-- అలా చేద్దాం.

00:47:35.760 --> 00:47:37.680 align:center
-నీకు పర్వాలేదా?
-బాగున్నాను.

00:47:40.360 --> 00:47:42.360 align:center
డెడ్‌లాక్ షైర్
టౌన్ హాల్ మరియు కౌన్సిల్ కార్యాలయాలు

00:47:42.440 --> 00:47:45.400 align:center
చూసావా, చెప్పానుగా
ఇవే మనకు కావాల్సింది.

00:47:46.000 --> 00:47:47.560 align:center
శభాష్, లేడీస్.

00:47:48.040 --> 00:47:49.560 align:center
ఇది భలే పసందుగా ఉంది.

00:47:49.640 --> 00:47:52.080 align:center
మన మెదళ్లకు సురక్షితం అని చెపుతున్నాం.

00:47:52.160 --> 00:47:53.800 align:center
కాథ్, నాకు వణుకు పుడుతుంది.

00:47:54.000 --> 00:47:55.560 align:center
అది అసాధ్యం, అలైనా.

00:47:55.680 --> 00:47:59.920 align:center
ఇలా పడుకొని, పాడుతూ
కళ్ల ధ్యానం చేయటం.

00:48:00.240 --> 00:48:03.680 align:center
మనం మన నాడీవ్యవస్థను శాంతపరుస్తున్నాం.

00:48:08.520 --> 00:48:10.680 align:center
లెన్నీ, నువ్వేం సహాయపడట్లేదు.

00:48:11.840 --> 00:48:13.720 align:center
-ఓరి దేవుడా!
-ఏంటి?

00:48:13.800 --> 00:48:15.320 align:center
మార్గరెట్ను ఖైదు చేసారు.

00:48:15.400 --> 00:48:16.440 align:center
దేనికి?

00:48:20.360 --> 00:48:21.400 align:center
లేదు!

00:48:42.200 --> 00:48:43.160 align:center
దయచేసి! వద్దు!

00:48:43.240 --> 00:48:44.520 align:center
హలో, లేడీస్.

00:48:45.840 --> 00:48:47.280 align:center
మీరంతా ఏం చేస్తున్నారు?

00:48:48.160 --> 00:48:49.640 align:center
హాయ్, ఆనీ, ఎలా ఉన్నావు?

00:48:51.720 --> 00:48:53.520 align:center
ఆరు నెలలు చేతనలో. దేవుడా.

00:48:53.800 --> 00:48:55.000 align:center
శభాష్ నీకు.

00:48:56.040 --> 00:48:58.520 align:center
లేదు, మరీ పంచుకోవటం కాదు.
నచ్చింది. బాగుంది.

00:48:58.600 --> 00:49:01.120 align:center
నా పేరు స్వెన్, నేను డెడ్‌లాక్ పోలీస్.

00:49:01.200 --> 00:49:03.920 align:center
నేను బండి గుర్తింపు నంబరు కోసం
ఫోన్ చేసాను,

00:49:04.000 --> 00:49:06.000 align:center
నువ్వేమైనా సహాయపడగలవా?

00:49:06.080 --> 00:49:07.760 align:center
అలాగే, సంతోషంగా ఉంటాను, ఆనీ,

00:49:07.920 --> 00:49:10.760 align:center
థాంక్స్. చీర్స్. మళ్లీ శుభాకాంక్షలు.

00:49:13.000 --> 00:49:14.640 align:center
సరే, నేనూ అనుభవించాను కనుక.

00:49:14.760 --> 00:49:17.840 align:center
కచ్చితంగా? సరే మరి, థాంక్స్, బంగారం.

00:49:59.160 --> 00:50:03.520 align:center
నువ్వు సరిగ్గా చూస్తే
దొరికేవి చూస్తే దిమ్మ తిరుగుతుంది కదా?

00:50:03.600 --> 00:50:04.600 align:center
విక్

00:50:06.960 --> 00:50:08.120 align:center
నాలుకలు.

00:50:10.520 --> 00:50:12.360 align:center
మీ స్నేహితురాళ్ల ఫ్రీజర్లలో.

00:50:12.880 --> 00:50:15.120 align:center
కాదు, కాదు, కాదు, ఇది సరి కాదు.

00:50:15.200 --> 00:50:16.800 align:center
ఇదే సరైనది.

00:50:16.880 --> 00:50:20.320 align:center
మీ అమ్మాయిలకు
ఆరంభించింది ముగించే తెగువ లేదు.

00:50:20.400 --> 00:50:22.280 align:center
అందుకే... స్వాగతం.

00:50:25.360 --> 00:50:27.160 align:center
పట్టేసుకున్నాం, అబ్బాయిలు!

00:50:27.680 --> 00:50:29.960 align:center
-భలే తెగువ చూపారు!
-చాలా ధన్యవాదాలు.

00:50:30.120 --> 00:50:31.240 align:center
సాధించాం!

00:50:32.880 --> 00:50:34.800 align:center
అబ్బా.

00:50:34.880 --> 00:50:40.000 align:center
ఇది దారుణం, కాలిన్స్.
మరీ దారుణమిది.

00:50:40.320 --> 00:50:43.440 align:center
ఆ స్త్రీలే కనుక అయితే. మనది పెద్ద తప్పు.
మనం తప్పు.

00:50:44.640 --> 00:50:47.920 align:center
లేదు. లేదు, స్త్రీలు కాదది.

00:50:48.640 --> 00:50:51.840 align:center
ఫ్రీజర్లలో నాలుకలన్నీ
ఎక్కడినుండి వచ్చాయి మరి?

00:50:51.920 --> 00:50:53.360 align:center
కావాలని పెట్టారా?

00:50:53.440 --> 00:50:56.840 align:center
వాళ్లను ఇరికిస్తున్నారా?
కిల్లర్ పనా ఇదంతా?

00:51:05.680 --> 00:51:08.680 align:center
శవాలను వదిలిన కారణంగానే
ఇది కూడా చేసారు.

00:51:09.280 --> 00:51:12.280 align:center
శామ్ను చూపించిన అదే కారణంగా.

00:51:12.360 --> 00:51:14.440 align:center
నీ బుర్రలో ఏం తిరుగుతుంది అసలు?

00:51:14.520 --> 00:51:16.320 align:center
అరే, నాకు చెప్పు. నాతో పంచుకో.

00:51:16.400 --> 00:51:19.320 align:center
-ఆ పెట్టె విక్ పేరు మీద ఉందా?
-అవును.

00:51:19.440 --> 00:51:23.640 align:center
ప్రతి స్త్రీ ఆమెను బాధించినవారి
నాలుకను కచ్చితంగా పొందుంటుంది.

00:51:25.640 --> 00:51:28.520 align:center
కిల్లర్ వాటిని స్త్రీలకు బహుమతిగా ఇచ్చారు.

00:51:28.600 --> 00:51:30.320 align:center
వాళ్లు చంపిన వారికోసం.

00:51:30.400 --> 00:51:31.840 align:center
అలా ఎందుకు చేస్తున్నారు?

00:51:31.920 --> 00:51:33.480 align:center
ధన్యవాదాలు కావాలా ఏంటి?

00:51:35.600 --> 00:51:36.800 align:center
అవును.

00:51:38.320 --> 00:51:40.200 align:center
అదే వారికి కావాల్సింది.

00:51:40.400 --> 00:51:42.600 align:center
శామ్ ఓడ్వాయర్ను అనుమానించాము,

00:51:42.680 --> 00:51:47.080 align:center
కిల్లర్ అతని శవాన్ని ఇచ్చారు,
శామ్ ప్రత్యేకం అని కాదు అక్కడ.

00:51:48.120 --> 00:51:50.120 align:center
వాళ్ల పనికి వారికే పేరు రావాలని.

00:51:51.520 --> 00:51:54.360 align:center
అందుకే సరస్సులో శవాలు తేలాయి.

00:51:54.520 --> 00:51:58.640 align:center
అక్కడ జనాలు ఉంటారని తెలుసు.
వాళ్లు అక్కడ పెద్ద ప్రదర్శన చేసారు వాటితో.

00:51:58.720 --> 00:52:00.440 align:center
మన స్త్రీలు రహస్యం దాచారు.

00:52:00.520 --> 00:52:03.840 align:center
వాళ్లకు అస్సలు ఎవరి దృష్టిలో పడాలని లేదు.

00:52:03.920 --> 00:52:05.560 align:center
కానీ... ఓహ్, కానీ ఈ కిల్లర్.

00:52:06.960 --> 00:52:08.760 align:center
వాళ్లకు వీపు చరవాలి.

00:52:09.680 --> 00:52:12.160 align:center
ఆడ హంతకులు పేరు కోసం పని చేయరు.

00:52:15.640 --> 00:52:17.160 align:center
కాలిన్స్...

00:52:19.360 --> 00:52:20.680 align:center
వాడు మగవాడు!

00:52:25.360 --> 00:52:29.120 align:center
మేడమ్స్! మేడమ్స్,
శవాల కారులో నాకు ఒకటి దొరికింది!

00:52:29.280 --> 00:52:30.520 align:center
ఏంటి? ఏంటి? ఏంటి?

00:52:30.600 --> 00:52:32.840 align:center
శవాలను కారులో పెట్టుంచారు.

00:52:32.920 --> 00:52:34.840 align:center
స్వెన్ యజమాని పేరు కనుక్కుంటున్నాడు.

00:52:34.920 --> 00:52:37.440 align:center
ఇది నాకు సీటు కింద దొరికింది.

00:52:37.520 --> 00:52:40.800 align:center
శామ్ విక్టోరియా మీద
దాడి చేసిన రోజు పడేసిన షూ ఇది.

00:52:40.920 --> 00:52:44.120 align:center
అవును, ఆనీ, నేనింకా ఉన్నాను.
అవును, ఉన్నాను. హలో.

00:52:45.440 --> 00:52:47.400 align:center
విక్ను కారులో ఎక్కించుకున్నాడు.

00:52:47.520 --> 00:52:49.040 align:center
అలైనా దగ్గర వదిలాడు

00:52:49.120 --> 00:52:51.880 align:center
తరువాత తిరిగి వెళ్లి
శామ్ అంతు చూసాడు.

00:52:51.960 --> 00:52:53.760 align:center
సరే, కానీ ఎవరు? ఎవరతను?

00:52:53.920 --> 00:52:54.920 align:center
నిజంగానా?

00:52:56.120 --> 00:52:59.480 align:center
ఈ శవాల కారు
విలియమ్ కరదర్స్దట.

00:53:00.440 --> 00:53:01.680 align:center
మార్గరెట్ తమ్ముడు?

00:53:01.760 --> 00:53:03.240 align:center
ఏంటిదంతా?

00:53:28.600 --> 00:53:30.360 align:center
టామీ నిన్ను ముంచింది, వెధవ.

00:53:30.440 --> 00:53:32.160 align:center
అబ్బా, హంటర్, నోరు మూసుకో!

00:53:32.240 --> 00:53:34.320 align:center
టామీ ఫుట్బాల్ మనకన్నా బాగా ఆడుతుంది.

00:53:34.400 --> 00:53:36.760 align:center
వెళ్లి థెరపీ చేయించుకో
నీ సమస్యలకు.

00:53:36.840 --> 00:53:38.280 align:center
నీ సోది భరించలేకపోతున్నాము.

00:55:33.920 --> 00:55:35.920 align:center
సబ్‌టైటిల్ అనువాద కర్త 'బిందు మాధవి'

