WEBVTT

00:06.120 --> 00:08.400
-శామ్ ఓడ్వాయర్.
-అతను మన తొలి బాధితుడు.

00:08.480 --> 00:10.800
కిల్లర్ స్లూప్‌ను
హత్యా గదిగా వాడుతున్నాడు.

00:12.480 --> 00:14.280
ఆబీ, నువ్వు మాకు చెప్పాల్సిందిగా

00:14.360 --> 00:15.200
లాక్ నెస్సీ

00:15.280 --> 00:17.040
శామ్ ఓడ్వాయర్ తిరుగుబోతని.

00:17.160 --> 00:19.240
నాన్న వెళ్లేనాటికి డెడ్‌లాక్‌లో లేను.

00:19.320 --> 00:21.840
సిడ్నీలో నీకూ, కాథ్‌కు పక్కనే ఉన్నానుగా.

00:21.920 --> 00:24.560
డల్సీ సంబంధం వల్ల
అందరూ ఉద్వేగంగా ఉన్నారా?

00:24.640 --> 00:28.200
"నేను ఎడ్డీ రెడ్‌క్లిఫ్.
నేను డార్విన్ మహారాణిని."

00:28.280 --> 00:29.920
-వాళ్లకు నేను వద్దట.
-ఎందుకని?

00:30.000 --> 00:32.120
నేను నా భాగస్వామిని చంపాను కనుక.

00:32.200 --> 00:33.960
జీసెస్ క్రైస్ట్, జిమ్మీ.

00:34.040 --> 00:36.680
మన కిల్లర్ మంచి
క్రిస్టియన్ మహిళ అనుకుంటాను.

00:36.760 --> 00:40.240
జిమ్మీ ఇంటిలో ఏమీలేవు.
పడవలకు సంబంధించిన చాలా ఫోటోలు ఉన్నాయంతే.

00:40.320 --> 00:41.160
అమ్మకానికి బోట్

00:41.240 --> 00:42.560
మీరిద్దరూ ఇంటిలో ఉన్నారా?

00:43.760 --> 00:44.720
అవును.

00:44.800 --> 00:48.640
స్కై 12,000 డాలర్లు
ఖర్చు పెట్టేసిందట, దేనికో చెప్పట్లేదట.

00:48.720 --> 00:51.160
ఈ ఊరి స్త్రీలు పురుషద్వేషులు.

00:51.240 --> 00:52.800
వారిలో ఆమె మొదటిది.

00:53.440 --> 00:55.080
అతని తిరుగుళ్ల గురించి తెలుసు.

00:55.160 --> 00:58.080
శామ్ పోయిన రాత్రి.
మైక్ ఆమెకు టిక్కెట్ వేసాడు.

00:58.160 --> 01:00.240
ఆమె డెడ్‌లాక్‌లో ఉంది. అబద్ధమాడింది!

01:00.320 --> 01:03.440
స్కై సోది ఓడ్వాయర్.

01:04.360 --> 01:05.360
సోది.

01:11.360 --> 01:13.120
24 గంటల విరామం తరువాత,

01:13.200 --> 01:14.040
డెడ్‌లాక్ - శీతకాల విందోత్సవం
రద్దు చేయబడినది

01:14.120 --> 01:16.680
అన్ని విందోత్సవ కార్యక్రమాలు
సమయానికే జరుగుతాయని

01:16.760 --> 01:19.280
చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.

01:19.360 --> 01:23.360
అంటే, మరీ సమయానుగుణంగా కాదు,
మేము కొన్ని చిన్న మార్పులు చేసాము,

01:23.440 --> 01:26.000
అవన్నీ ఈ పునశ్చరించిన
కార్యక్రమాలలో చూస్తారు

01:26.080 --> 01:29.080
దీనిని మేము పొద్దున 4:00 కు
మా ఇంటి ప్రింటరులో తీసాము,

01:29.160 --> 01:31.400
అది, మా పడగ్గదిలో ఉంటుంది మరి.

01:31.480 --> 01:34.400
ఈ రాత్రి డెడ్‌లాక్ సరస్సులో
చేయాల్సిన నీటి శిల్పం

01:34.480 --> 01:38.400
అది రద్దు చేయబడిండదన్నమాట.

01:38.480 --> 01:41.320
దాని స్థానంలో అది... జెజ్?

01:41.400 --> 01:44.040
-ఇంకా నిర్ధారించలేదు.
-నిర్ధారించలేదు. అద్భుతం.

01:46.080 --> 01:49.480
ఇదెలా చేద్దాం?
స్పీడింగ్ టిక్కెట్టు గురించి అడుగుదామా?

01:49.600 --> 01:52.520
శామ్ చనిపోయిన రాత్రి
ఆమె పనుల గురించి అడుగుదాం

01:52.600 --> 01:55.480
అప్పుడు మళ్లీ దాని గురించి
నా ముఖం మీదే అబద్ధమాడితే,

01:55.560 --> 01:57.760
అబద్ధాలకోరులాగా.

01:57.840 --> 02:00.400
అస్సలు కాదు.
అది మనకు గెలిపించే ముక్క.

02:00.480 --> 02:03.360
దేవుడా. నువ్వు
భలే వేడిమీద ఉన్నావు, కాలిన్స్.

02:03.440 --> 02:05.280
పర్వాలేదు. నాకేం... కాలేదు.

02:05.360 --> 02:09.600
అంత ఒత్తిడి వద్దు. నీ మెదడుకు
రక్త సరఫరా నిలిపివేస్తావు.

02:09.760 --> 02:12.040
అదిప్పుడు మిణుకుమిణుకు మంటుంది.

02:12.160 --> 02:15.280
మనం ఆ ఇంటర్యూ గదిలోకి
వెళ్లి మాట్లాడుదాం.

02:15.360 --> 02:16.720
-సరేనా?
-సరే.

02:17.160 --> 02:19.440
భగవంతుడా. ఆమె భోజనం తెచ్చిందా?

02:19.880 --> 02:22.560
దేవుడా, ఆమెకు అసలు ఇక్కడేం
జరుగుతుందో కూడా తెలియదు.

02:22.600 --> 02:24.880
-అయితే, ఇంకేం లేవా?
-లేదు.

02:24.960 --> 02:27.280
లేదు, లేదు, ఏం లేదని కాదు.

02:27.360 --> 02:29.680
అంటే-- చెప్పాలంటే చాలా ఉన్నాయి.

02:29.760 --> 02:32.280
నాకిప్పుడే ఒక ఫోను వచ్చింది

02:32.360 --> 02:36.600
దాని ప్రకారం ఈ రాత్రి డెడ్‌లాక్ సరస్సు
వద్ద తెర మీద సినిమా చూపించే

02:37.120 --> 02:40.240
ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పటానికి
సంతోషిస్తున్నాను.

02:40.320 --> 02:43.440
దాని సినిమా అక్వాటికా
లేదా ఫ్లోటింగ్ ఫ్లిక్స్ అంటారు.

02:43.520 --> 02:45.040
అవి రెండూ బాగున్నాయి.

02:45.120 --> 02:48.480
మేయర్ రామీ,
సీరియల్ కిల్లర్ భయంతో రాదలుచుకోని

02:48.560 --> 02:51.760
విందోత్సవం పాస్ ఉన్నవారికి ఏం చెబుతారు?

02:52.360 --> 02:54.960
ప్రెస్ సప్రెషన్ ఆర్డరు
పొద్దున 11:00 వరకూ ఉంది

02:55.040 --> 02:57.120
అది తెలుసుగా, జెరెమీ,

02:57.200 --> 03:00.040
అప్పటిదాకా విందోత్సవపు ప్రశ్నలు మాత్రమే.
దయచేసి.

03:00.120 --> 03:00.960
అవును,

03:01.040 --> 03:04.880
సరే, కానీ నా ప్రశ్న
విందోత్సవం పాస్ ఉన్నవారి గురించే కదా.

03:06.400 --> 03:11.840
అంటే, ఆ కిల్లర్ కేవలం
తెల్లజాతి మగవారినే గురి పెట్టారంటాను.

03:11.920 --> 03:14.040
ఇక మా పరిశోధనల ప్రకారం

03:14.120 --> 03:17.520
మా విందోత్సవం జనాల జాతి
దానికి చాలా దూరం అని కూడా అంటాను.

03:17.960 --> 03:21.200
బాధితుల జనజాతే
మామూలుగా హింసకు కారకులు కనుక,

03:21.280 --> 03:23.240
నేను చెప్పేది, ప్రస్తుతానికి

03:23.320 --> 03:26.040
డెడ్‌లాక్ చాలా సురక్షితమైన చోటు

03:26.120 --> 03:29.160
మన విందోత్సవం సంఘపు జనాలలో చాలామందికి.

03:29.240 --> 03:32.400
అయితే, జోన్, నిన్న నువ్వు
సమాచార బూత్‌కు వెళ్లావుగా.

03:32.480 --> 03:34.920
అక్కడెవరన్నా సంచి పెట్టటం చూసావా?

03:36.520 --> 03:38.280
లేదు, అలాంటి సంచి కాదు.

03:38.360 --> 03:40.040
ఆకుపచ్చ సంచి, జోన్.

03:40.600 --> 03:43.480
అబ్బా. కాదు, నేను వీటన్నింటినీ
బీస్ట్ క్రాస్ సమయంలో

03:43.560 --> 03:45.680
సెల్లార్‌లో పెట్టేసాను.

03:45.760 --> 03:48.640
ఏమైంది? హంతకుడు వచ్చి దోచుకెళ్లాడా?

03:50.000 --> 03:52.600
అవును. అంటే, అది వివరిస్తుంది ఎలా...

03:53.080 --> 03:55.560
అది నేర ఘటనలో భాగమయ్యిందో అని.

03:55.640 --> 03:58.200
-కదా, కాలిన్స్?
-అది వివరిస్తుంది.

03:58.760 --> 04:01.960
పరిస్థితిని బట్టి
జిమ్మీ చనిపోయిన రాత్రి ఏమి చేస్తున్నావో

04:02.040 --> 04:04.640
-మళ్లీ వివరించు.
-అలాగే. తప్పకుండా.

04:04.720 --> 04:05.680
సరే. అలాగే.

04:05.760 --> 04:08.920
బాగుంది. ఇంకా, మిగతా వాళ్లందరు
చనిపోయిన రాత్రులు కూడా.

04:09.840 --> 04:13.240
సరే, అంటే. నాన్న చనిపోయిన రాత్రి
అసలు నేను ఇక్కడ లేను.

04:13.320 --> 04:15.560
-నేను సిడ్నీలో--
-సరే. సూపర్-డూపర్, స్కై.

04:15.640 --> 04:18.520
అయితే నువ్వు వీటన్నింటికీ
అలిబీలు ఇట్టే ఇచ్చేస్తావు.

04:18.600 --> 04:21.800
సారీ, మేయర్. కేవలం తెల్లజాతి
మగవాళ్లు మాత్రమే

04:21.880 --> 04:24.560
చనిపోతున్నారు కనుక
ఏం పర్వాలేదు అంటున్నారా?

04:24.640 --> 04:27.920
కాదు, జెరెమీ. అది కాదు...
నా ఉద్దేశ్యం అది కాదు.

04:28.000 --> 04:31.640
అది నేను చెప్పినదాన్ని
తప్పుగా అర్థం చేసుకోవటం. నేను అలా అనలేదు,

04:31.720 --> 04:33.800
నేను అనేది, నేను సరిగ్గా వివరించలేదని.

04:33.920 --> 04:38.240
సరిగ్గా చెప్పలేదు. అంతే, ధన్యవాదాలు,
అందరికీ, వచ్చినందుకు.

04:38.360 --> 04:41.360
ఈ రాత్రి సినిమా అక్వాటికాను
అందరూ ఆస్వాదించండి.

04:41.440 --> 04:44.120
అది నీ పడవలో తేలుతుందనుకుందాం. జెజ్?

04:44.720 --> 04:46.160
-జెజ్.
-అవును?

04:47.720 --> 04:49.880
-జెజ్, అది నిజంగా జరిగిందా?
-అవును, బంగారం.

04:49.920 --> 04:54.680
సరే. నేను నోరు జారాను
కనుక నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

04:54.760 --> 04:55.600
సరే.

04:55.720 --> 04:58.240
ఆమెతో ఇంకో మాట మాట్లాడకు.

04:58.360 --> 05:01.120
-పర్వాలేదు.
-లేదు. నీ కళ్లు వేటగాడిలా ఉన్నాయి.

05:01.200 --> 05:03.200
-అవి పూర్తిగా నల్లగా--
-హే, డల్స్.

05:03.240 --> 05:05.720
నెస్సీ మీద నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి?

05:05.800 --> 05:07.720
నేను ఇన్సురెన్సు తీసుకోవాలి.

05:10.720 --> 05:12.320
నేను చూసుకుంటానులే. ఇక్కడినుండి.

05:12.360 --> 05:13.760
సరే, అలాగే. థాంక్స్, బాబు.

05:13.800 --> 05:16.320
మా నాన్నతో
నా మధుర జ్ఞాపకాలన్నీ ఆ పడవలోనే.

05:16.360 --> 05:19.640
-హలో?
-కాథ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?

05:19.720 --> 05:22.800
స్కైని చూద్దామని వచ్చాను,
ఏదో ఒక సాకుతో. ఓరి దేవుడా!

05:22.920 --> 05:24.720
-కిల్లర్ నీ ఇంటికి వచ్చాడా?
-హా.

05:24.800 --> 05:27.880
నదియా చెప్పింది, నీ సామాను గెలికాడట.
మాకు భయమేసింది.

05:27.960 --> 05:30.680
నిన్ను ప్రశ్నించటానికి
పిలిచారని అనుకున్నాను,

05:30.760 --> 05:34.640
నేనైతే నా లాయరు కోటు తీసి
నన్నే పెట్టుకో వాదనకు అని అడుగుదామనుకున్నా

05:34.720 --> 05:36.920
వెట్‌ను లాయరుగా ఎందుకు పెట్టుకుంటుంది?

05:37.000 --> 05:40.040
నేను ముందు లాయరునే.
వెట్ అవ్వకముందు.

05:40.120 --> 05:43.360
నాకు సగం రోజులే చాలు,
నేను అన్నీ బాగా చేస్తాను కనుక.

05:43.440 --> 05:44.560
ఓరి దేవుడా, సెక్సీ.

05:44.640 --> 05:48.280
ప్రెస్‌ కనుక నువ్వు స్కైని
తీసుకురావటం చూసుంటే. వాళ్లంతా,

05:48.360 --> 05:51.040
"స్కై ఓడ్వాయర్ సీరియల్ కిల్లర్" అనేవాళ్లు.

05:51.120 --> 05:54.760
స్కై, నీ వ్యాపారం, ప్రతిష్ట
అంతా మంటగలసిపోతాయి.

05:54.840 --> 05:56.440
నాతో ఇంటికి వస్తున్నావు.

05:57.560 --> 06:00.160
నా కారు వెనుకవైపు ఉంది.
ఎక్కి కూర్చొని దాక్కో.

06:00.320 --> 06:03.000
-చూడు, నేను వెళుతున్నాను--
-వెళ్లు. పో.

06:05.720 --> 06:08.880
సంక్షోభం ముగిసింది! ఓరి దేవుడా.

06:08.960 --> 06:12.280
నువ్వు స్కైని
అరెస్టు చేసుంటే అని ఊహించుకో.

06:13.560 --> 06:15.560
నీకు అక్కడే విడాకులు ఇచ్చేసేదానిని.

06:15.640 --> 06:18.080
నువ్వు ఆమె మూడో ప్రాణ స్నేహితురాలివి.

06:20.040 --> 06:22.120
బై, ఎడ్డీ. కలుస్తాను.

06:22.200 --> 06:23.400
బై, కాథ్.

06:26.160 --> 06:29.680
సరే మరి. ఆపరేషన్
వంటగత్తె హంతకురాలు నిరూపణ ఆరంభం.

06:29.840 --> 06:33.120
పెద్ద కళ్లు ఎక్కడ?
ఆమె ఈ డీఎన్ఏ నమూనాలు తీసుకురావాలి.

06:33.760 --> 06:39.680
డెడ్‌లాక్

06:53.360 --> 06:55.920
పాపా, నామీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసా?

06:56.000 --> 06:59.000
సీరియల్ కిల్లర్ కేసు చూడాలి.
పెళ్లి పనులు చేయాలి.

06:59.080 --> 07:03.800
ఇప్పుడు నా కాబోయే భార్య
అర్థరాత్రి మాయమవ్వటం కూడా భరించాలి.

07:03.880 --> 07:05.120
నేను మాయమవ్వలేదు.

07:05.240 --> 07:08.280
విష వాయువులు
పీల్చి ఆసుపత్రి పాలయ్యాను.

07:08.760 --> 07:11.360
జిమ్మీ శిలువ చెక్కను పరీక్షించాను.

07:11.440 --> 07:14.560
మండే స్వభావం కల రసాయనం దానికి పూసారు.

07:14.640 --> 07:18.000
ఆ రసాయనాన్ని సీసీఏ అనే పనికి వాడతారు.

07:18.080 --> 07:19.400
మండేదంటే నాకు తెలుసులే.

07:19.480 --> 07:21.720
పడవలు బాగు చేయటంలో వాడతారు.

07:21.800 --> 07:24.800
దానిని కాలిస్తే, జేమ్స్,
వెల్లుల్లి వాసనేస్తుంది.

07:24.880 --> 07:25.760
-అవునా?
-అవును.

07:25.840 --> 07:28.600
అందుకే నాకు వెల్లుల్లి
వాసన వచ్చిందనిపించింది.

07:28.680 --> 07:30.760
తరువాత శామ్ ఓడ్వాయర్ పడవ,

07:30.840 --> 07:34.560
లాక్ నెస్సీ కూడా శిలువలాగే
కాల్చబడింది అనిపించింది.

07:34.640 --> 07:37.720
నేను, అంటే,
ఆ చెక్క ఒకటే అయితే ఏంటి ఆని ఆలోచించాను?

07:37.800 --> 07:41.240
బేబ్, బేబ్, బేబ్.
నీ మాటలు నీకన్నా అర్థమవుతున్నాయా?

07:42.320 --> 07:46.720
హే, హే. ఇలా రా.
బేబ్. నీవి ప్రేలాపనలు.

07:47.080 --> 07:50.480
కానీ లాక్ నెస్సీ చెక్కను
పరీక్షించి చూడవచ్చుగా? అదెక్కడుంది?

07:50.560 --> 07:52.000
ల్యాబ్‌లో ఉంది.

07:52.080 --> 07:53.560
నువ్వు ఇంటికి పద, సరేనా?

07:53.640 --> 07:55.080
నిన్ను ఇంటికి తీసుకెళతాను.

07:55.160 --> 07:58.080
నువ్వు ముందు మంచి కునుకు తియ్యి,

07:58.200 --> 07:59.480
మనకోసం పంతులును వెతుకు.

07:59.560 --> 08:01.880
డబ్బు అవసరం ఉన్న నటుడు.

08:01.960 --> 08:04.240
-కానీ జేమ్స్--
-రసాయనిక యుద్ధంలో వాడే

08:04.320 --> 08:06.880
విషవాయువులు పీల్చావు, కదా?

08:06.960 --> 08:08.280
-అవును.
-అవును.

08:08.400 --> 08:10.720
నీ మతి పోయింది, సరేనా?

08:10.840 --> 08:12.120
-సరే.
-సరే.

08:12.760 --> 08:14.320
-సరే.
-కారులో కూర్చో పో.

08:14.400 --> 08:16.040
నేను ఒక కాల్ చేసి వస్తాను.

08:16.120 --> 08:17.320
-సరే.
-సరే.

08:29.800 --> 08:31.280
హే, బాబు, ఎలా ఉంది?

08:32.640 --> 08:35.280
సరే, అయితే, జేవ్,
పడవ గురించి చిన్న ప్రశ్న.

08:39.440 --> 08:41.960
సారీ, షరెల్.
ఇంతకుముందెప్పుడు పని చేయలేదు.

08:42.040 --> 08:43.760
తెలుస్తుంది. ఇలా ఇవ్వు.

08:44.640 --> 08:47.440
గట్టిగా చెయ్యి.
భయపడితే సోయాపాలకు తెలిసిపోతుంది.

08:55.840 --> 08:57.640
పెద్ద కళ్లు లేకుండానే పని చేయాలి.

08:57.720 --> 09:01.640
ఆదివారం పొద్దున విరేచనాలులాగా ఉంది.
నన్నెవరూ ఆపలేరు. అందుకే...

09:01.840 --> 09:05.880
స్కైకి ఈ హత్యలకు సంబంధం ఉన్నట్లు
గట్టి సాక్ష్యాలు కావాలి మనకు.

09:06.000 --> 09:09.880
మరీ ముఖ్యంగా మన ముసలిదాని భార్య
ఎరిన్ సోదిది తలదూరుస్తుంటేను.

09:10.000 --> 09:13.160
మనకింకా సాక్షులు, డీఎన్ఏ,
నిఘా ఫుటేజీ అన్నీ కావాలి,

09:13.240 --> 09:15.520
అదే అతినీలలోహిత కిరణాలలాంటివి.

09:15.640 --> 09:18.160
అరెస్టు చేసే ముందు
మనం చాలా పక్కాగా ఉండాలి.

09:18.240 --> 09:22.000
-లేదంటే నేరారోపణ నిలబడదు.
-డల్సీ జీవితం పణం ఇక్కడ.

09:22.080 --> 09:25.600
అవును. అంతా నాశనమవుతుంటే
కనీసం వీసమెత్తు ప్రయోజనం ఉండాలిగా

09:25.640 --> 09:28.760
కోలీన్స్ వణుకుతూ,
చలిలో తన కారులో పడుకోవాలంటే.

09:28.840 --> 09:32.960
సరే, కాలిన్స్, కాలానుగుణంగా చేద్దాం.
స్కై ఎలా చేసిందో చూద్దాం.

09:37.880 --> 09:41.640
సరే. అంటే,
నేను బోర్డు మీద రాస్తాను మరి.

09:41.760 --> 09:43.960
ఏంటి? వద్దు, వద్దు. అస్సలు కుదరదు.

09:44.040 --> 09:45.600
వద్దు, ఆ బోర్డును ముట్టుకోకు.

09:45.640 --> 09:48.440
నా తలరాత దరిద్రంగా ఉండవచ్చు,

09:48.520 --> 09:51.880
కానీ నా రాత మాత్రం
కోడి గెలికినట్టు ఉండదు.

09:52.040 --> 09:55.240
సరే. అయితే,
జిమ్మీ హత్య జరిగిన రాత్రి,

09:55.320 --> 09:59.520
నదియా ప్రకారం తనూ
స్కై రాత్రి 10:00 కు పడుకున్నారు

09:59.640 --> 10:02.600
కానీ అది
వేర్వేరు గదులలో అని నాకు తెలుసు,

10:02.640 --> 10:05.240
ఎందుకంటే మా ఆవిడ చెప్పింది కనుక,

10:05.320 --> 10:10.120
చారులో ఉల్లిపాయలాగా
నేను ఇందులో కలిసిపోయాను కనుక.

10:10.200 --> 10:12.640
-అయితే, నదియా అలిబీ స్కైకి--
-సందేహాస్పదం.

10:12.760 --> 10:13.600
పూస్!

10:13.640 --> 10:16.600
స్కైని తరువాత రోజు పొద్దున వ్యక్తిగతంగా

10:16.640 --> 10:18.520
చూసినవారు వేరే ఉన్నారు.

10:18.640 --> 10:20.840
ఆమె బుచ్‌స్మిత్ బుచరీ డోనాను కలిసింది

10:20.880 --> 10:23.440
17 కేజీల స్పానిష్ రక్తపు మాంసం
తీసుకోవటానికి.

10:23.520 --> 10:26.520
ఓహ్, మోర్సియా! ఖరీదెక్కువ చెత్తలా ఉంటుంది.

10:26.640 --> 10:29.200
సరే. స్పానియార్డుల రక్తంతో చేసేవి.

10:29.280 --> 10:31.200
సరే, ఇక జిమ్మీ సంగతి చూద్దాం.

10:31.840 --> 10:34.160
రాత్రి 11:00 కు చివరిగా కనబడ్డాడు.

10:34.240 --> 10:39.160
వనెస్సా లేథమ్‌కు ఆఖరి కాల్
రాత్రి 12.23 కు చేసాడు.

10:39.240 --> 10:43.520
ఇక, జిమ్మీ అటాప్సీ ప్రకారం,
అతను తెల్లవారుఝాము 4:00 కు ఉరేయబడ్డాడు

10:43.640 --> 10:47.080
రక్త పరీక్షల ప్రకారం
అతను రెండు గంటలపాటు అలా వేలాడాడు

10:47.200 --> 10:51.760
అలైనా పొద్దున 7:30 కు చూసేవరకు.

10:51.840 --> 10:53.240
ఎవరన్నా రాసుకుంటున్నారా?

10:53.320 --> 10:54.200
నువ్వే.

10:54.280 --> 10:56.840
-అదేగా చేస్తుంది.
-కాదు. లెక్క వేస్తున్నానంతే.

10:56.920 --> 10:57.800
ఆబీ ఎక్కడ?

10:57.880 --> 11:00.760
ఆమె నుండి పరమ విచిత్రమైన
సందేశం అందింది,

11:00.840 --> 11:03.680
-ఏదో పూసాన్ గురించి.
-పూసాన్?

11:03.800 --> 11:07.160
ఏదో వంటకం కావాలట వెన్ లైఫ్
గివ్స్ యు ప్రిజర్వ్‌డ్ లెమన్స్‌ది.

11:07.240 --> 11:08.920
ఈరాత్రి ఆబలోని ప్రయత్నిస్తాను.

11:09.000 --> 11:11.040
చాలా బాగుంది, స్వెన్.

11:11.160 --> 11:12.920
-భలే కదా. సరే.
-ధన్యవాదాలు.

11:13.000 --> 11:15.840
అక్కడకు కేవలం నీటిలోనే
వెళ్లగలము కాబట్టి,

11:15.920 --> 11:19.040
జిమ్మీని కిల్లర్ పడవలో చంపివుండవచ్చు,

11:19.120 --> 11:20.680
మిగతా బాధితులలాగానే.

11:20.760 --> 11:25.000
ఇక, నా అనుమానం ప్రకారం
వాళ్లు కొత్త హత్యా గది పడవను

11:25.080 --> 11:27.160
లాక్ నెస్సీ చోటులోనే నిలిపి ఉంటారు

11:27.240 --> 11:30.720
అంటే సీరియల్ కిల్లర్‌లకు
ఎందుకో దినచర్య భలే ఇష్టం మరి.

11:30.800 --> 11:32.120
పిల్లలలాగా.

11:32.200 --> 11:34.320
అయితే, స్కై ఇది చేసుంటే కనుక,

11:35.840 --> 11:38.400
పొద్దున ఎప్పుడో 5:30 అప్పుడు

11:39.560 --> 11:41.160
ఆమె జిమ్మీని శిలువ మీద వేసి,

11:41.240 --> 11:44.320
ఆమె తిరిగి ఆ హంతక పడవను
దాని రేవులో చేర్చుండాలి

11:44.400 --> 11:47.080
అక్కడినుండి ఆమె కారులో
డెడ్‌లాక్‌కు తిరిగి రావాలి

11:47.160 --> 11:50.760
అంతా కూడా ఆమె స్పానిష్ మాంసం
తీసుకొనేలా పొద్దున 7:00 లోపే చేయాలి.

11:52.360 --> 11:53.680
అయితే, తెలిసిపోయిందిగా.

11:55.640 --> 11:57.840
-అందులో డానా ఉందా?
-నరమాంసక సాసేజ్.

11:57.920 --> 11:59.360
-కాదు, కాదు.
-క్లూ ఇవ్వు.

11:59.440 --> 12:02.680
స్కై తిరిగి రావటానికి
90 నిముషాల సమయ పరిధే ఉంది.

12:02.760 --> 12:04.560
అదే మనకు ఆమె ఆ హంతక పడవను

12:04.720 --> 12:07.000
దాచిన చోటు విస్తీర్ణం చూపించే అవకాశం.

12:07.080 --> 12:08.440
మేడమ్, ఆలస్యమైంది.

12:08.600 --> 12:09.600
నాకు విషం ఎక్కింది.

12:10.160 --> 12:11.240
ఏంటి?

12:11.320 --> 12:13.520
సరే, అబ్బా. నేను లేకుండా మొదలెట్టారా?

12:42.040 --> 12:46.440
కిల్లర్

12:50.760 --> 12:52.480
స్వెన్, ఇక్కడ ఏం చూడాలి?

12:52.560 --> 12:55.920
ఇవన్నీ మత్స్య మరియు వన్యప్రాణుల వరకు
లంగరు ప్రాంతాలు.

12:56.000 --> 13:00.040
"పాక్స్ బే, స్క్వాటర్ బీచ్.
గ్రిమ్ క్రీక్, డీవాస్టేషన్ పాయింట్."

13:00.120 --> 13:02.000
ఈ పేర్లేంటి ఇంత భయానకంగా ఉన్నాయి.

13:02.080 --> 13:04.200
వీటిని మనం కుదించాలి.

13:04.280 --> 13:06.360
దీనికి మరీ సమయం పట్టేలా ఉంది.

13:08.720 --> 13:11.880
హే, ఏంటిది,
నెస్సీ శేషాలలో ఈ ఎర్రది?

13:11.960 --> 13:13.400
అది నేనూ గమనించాను, మేడమ్.

13:13.480 --> 13:15.480
-నువ్వు అక్కడ కూర్చో.
-బురదలో ఆగుందా?

13:15.560 --> 13:16.760
లంగరు వేసా?

13:16.840 --> 13:18.880
సరే, మనం మట్టి పరీక్ష చేయాలి.

13:18.960 --> 13:21.280
అప్పుడది మనం చోట్లు
కుదించటంలో సహాయపడవచ్చు.

13:21.360 --> 13:22.640
నన్ను చేయమంటారా?

13:22.760 --> 13:25.760
-నేను చేయగలను. సూప్ తాగాక చాలా బాగున్నాను.
-నేననుకోను.

13:25.840 --> 13:29.240
నువ్వింకా మత్తులో ఉన్నావు.
స్వెన్, మట్టి ఫోరెన్సిక్స్‌కు పంపు.

13:29.320 --> 13:33.560
వద్దు. అరే. మనం చాలా త్వరగా
ఈ పని చేయాలి. మనం కాలం వృథా చేయలేం.

13:33.640 --> 13:35.240
-నేను కారు నడపగలను.
-లేదు. వద్దు.

13:35.320 --> 13:37.040
-నేను నడిచిపోతాను.
-కాలిన్స్.

13:37.120 --> 13:38.680
-డల్సీ!
-మనం--

13:39.800 --> 13:41.400
ఇలా జరుగుతుందని చెప్పాను.

13:43.600 --> 13:45.440
పురుష
హంతకురాలు!

13:45.520 --> 13:49.080
-డిటెక్టివ్, స్కై ఓడ్వాయర్ అనుమానితురాలా?
-దారుణమిది.

13:49.160 --> 13:50.080
నో కామెంట్!

13:50.160 --> 13:53.840
ఇక్కడినుండి పోండి. సరేనా?
ఖాళీ చేయండి!

13:53.920 --> 13:56.160
నువ్వేనా పుకారు సృష్టించింది, చుంచు.

13:56.280 --> 13:58.440
-ఏదన్నా చెయ్యి--
-నీ పని నువ్వు చూసుకో.

13:58.520 --> 14:01.160
-మన్నించాలి.
-స్కై నీ ఫ్రెండ్‌ను చంపిందా?

14:01.240 --> 14:03.200
వనెస్సా, స్వలింగ ద్వేషి!

14:03.320 --> 14:05.440
-నిన్ను చంపేస్తాను!
-అరే, అరే, అరే.

14:05.520 --> 14:06.720
శాంతించు!

14:07.160 --> 14:09.480
నన్ను వదలండి,
లెస్బియన్ ముఖాల్లారా!

14:09.560 --> 14:12.120
నువ్వేందుకు ఆ పిచ్చి వాగుడు వాగుతున్నావు?

14:12.200 --> 14:13.800
శాంతించండి. జీసెస్.

14:13.880 --> 14:15.400
నెస్సీ ఏ తప్పూ చేయలేదు.

14:15.480 --> 14:18.080
-తల దూర్చకు.
-మేగన్ నాలుగు వైనులు ఇచ్చింది.

14:18.160 --> 14:19.440
తను ఏం చేసిందో తెలుసు.

14:19.520 --> 14:21.680
నువ్వేం తప్పు చేయలేదు.
నిజం చెప్పావు.

14:21.800 --> 14:24.920
మెక్‌గాంగస్, మీ టౌనులో
జరుగుతున్న దానిపై మీ అభిప్రాయం?

14:25.000 --> 14:27.000
అంటే, నా సంగతి తెలుసుగా, జెరెమీ.

14:27.080 --> 14:28.680
ఇది మా ఊరేనా అనిపిస్తుంది.

14:28.760 --> 14:30.320
-ఛీ పో!
-నా ఆప్తులు పోయారు.

14:30.400 --> 14:32.880
మేయరెట్ రామీ
ఏమంటున్నారు దీని గురించి?

14:32.960 --> 14:34.480
పోవే, సోదిదానా. లోపలికి పో.

14:34.560 --> 14:37.560
"తెల్లవాళ్లే కదా పోతుంది పర్వాలేదని."
ఎంత సిగ్గుచేటో?

14:37.640 --> 14:39.600
స్వెన్ పడవ వెతకటానికి
మనుషులని తెస్తాడు.

14:39.680 --> 14:41.280
డెడ్‌లాక్ స్వగ్రామస్తులు,

14:41.360 --> 14:45.560
మేయరేట్ రామీ ఇంకా ఆమె
స్త్రీల గుంపు చేసినది చాలు.

14:45.640 --> 14:47.000
ధన్యవాదాలు.

14:47.080 --> 14:50.880
అయితే, మనం చట్టం
చేతిలోకి తీసుకుంటున్నాం, కదా, నెస్?

14:51.680 --> 14:52.840
-అవును.
-అవును.

14:52.920 --> 14:55.960
-ఎలా, వనెస్సా?
-తెలియదు.

14:56.680 --> 14:59.360
ఇదంతా చిన్న ఊరి సోది గోల!

14:59.440 --> 15:01.640
మీరంతా మా ఇంటికి వస్తున్నారు.

15:01.720 --> 15:03.440
వద్దు, కాథ్, ఏం పర్వాలేదు.

15:03.560 --> 15:07.280
మాకు ఇంటిలో గడపాల్సిన
సమయం వచ్చింది... మా... పెద్ద గొడవ తరువాత.

15:07.360 --> 15:11.000
నదియా, ఇటుక తగిలి
నీ తల పగలవచ్చు,

15:11.080 --> 15:13.640
నీ రక్తం బండల మీద పడవచ్చు.

15:13.720 --> 15:15.840
డల్సీ, నువ్వే ఏదో ఒకటి చేయాలి.

15:17.720 --> 15:19.800
నేను వాయిస్-టు-టెక్ట్స్
వాడడానికి కారణం

15:19.880 --> 15:22.440
నా బుర్ర నా వేళ్ళకంటే వేగంగా పనిచేస్తోంది.

15:22.520 --> 15:26.160
నేను సరస్సు దగ్గరున్నాను
లాక్ నెస్సీ లంగరు వేసి ఉండే చోట

15:26.240 --> 15:28.920
ఆ చెక్క మరకలు
ఇక్కడి మట్టితో కలుస్తాయేమో అని

15:29.000 --> 15:31.440
కానీ అలా లేదు. సరస్సు మట్టితో కలవట్లేదు.

15:31.520 --> 15:36.160
గాలి పీల్చుకో, గాలి పీల్చుకో, అంతే.
శాంతించు, బంగారం. అంతే, అలానే.

15:36.280 --> 15:40.240
చెక్క మీద మరకలు
సరస్సు మట్టి కంటే ఎక్కువ ఎర్రగా ఉన్నాయి.

15:44.440 --> 15:47.160
ఆగు. మేడమ్, అదేంటో నాకు తెలుసు.

15:47.240 --> 15:48.400
నేను కాల్ చేస్తాను.

15:49.960 --> 15:52.800
అంతా శాంతించండి. కొంగే అంతే.

15:54.760 --> 15:58.120
వనెస్సా నా 17 ఏళ్లప్పుడే
నిజం చెప్పి నా జీవితం తగలెట్టింది,

15:58.200 --> 16:00.480
ఇప్పుడు మళ్లీ పాడు చేయాలని చూస్తోంది!

16:00.560 --> 16:02.760
అమ్మా, వనెస్సా బేకరీ
యూనిఫామ్ వేసుకుందేంటి?

16:02.840 --> 16:03.680
ఆబీతో టెక్స్టింగ్ (ఎస్ఎమ్‌ఎస్/ఎమ్‌ఎమ్‌ఎస్)

16:03.760 --> 16:05.680
ఉద్యోగం ఇచ్చాను.
తన మీద జాలేసింది.

16:05.760 --> 16:07.760
ఆ ఆర్టికల్ చదివావు, అమ్మా!

16:07.840 --> 16:10.920
ఆమె వల్ల
అందరూ నన్ను సైకోపాత్ అనుకుంటున్నారు, కదా?

16:11.000 --> 16:14.680
కాదు, కానీ నువ్వు షెఫ్ కదా,
అందుకే ఈ తికమకంతా.

16:14.760 --> 16:16.560
హా, అంతేగా. నీ పేరే కళంకిత.

16:17.200 --> 16:20.800
డల్స్, బాబు,
నువ్వు ఇదంతా తప్పని నిరూపించాలి.

16:20.880 --> 16:22.800
నా పేరు సరి చెసేలా, ప్రకటన ఇవ్వు.

16:22.880 --> 16:24.960
నువ్వు చేస్తావుగా. కదా, సెక్సీ?

16:25.040 --> 16:26.920
అవును, చేస్తాను, అంటే...

16:27.000 --> 16:30.360
దురదృష్టవశాత్తూ కాలిన్స్
చెప్పేదేంటంటే మేము ఈ పరిస్థితులలో,

16:30.440 --> 16:33.040
మేము ఏ వ్యాఖ్యా చేయలేమని

16:33.160 --> 16:36.840
ఈ సమయంలో మా పరిస్థితి ఇది...
అందుకే పాప, పద.

16:37.640 --> 16:39.280
-ఏంటిది?
-డల్సీ!

16:39.720 --> 16:42.520
అయ్య బాబోయ్,
అది మానసిక యుద్ధం.

16:42.600 --> 16:44.320
ఆ పడవ వెతుకుదాం పద.

16:44.400 --> 16:47.640
అది నిన్ను బయటపడేస్తుంది,
నువ్వు కుప్పకూలావంటే కష్టం.

16:47.720 --> 16:49.440
నువ్వు విషాద నర్తకిలా ఉన్నావు.

16:49.520 --> 16:51.480
ఆబీ పంపిన సందేశాలేంటి?

16:51.800 --> 16:53.000
ఆకుపచ్చ సంచా?

16:54.560 --> 16:56.880
కాదు, అలాంటిది కాదు. అంతకంటే ముదురు రంగు.

16:57.640 --> 16:59.400
ఓయ్! తెల్లవాళ్లు.

17:00.000 --> 17:01.400
ఏం జరుగుతుందిక్కడ?

17:01.480 --> 17:03.920
హంతకుల గదిని ఎందుకు వెతకట్లేదు?

17:04.000 --> 17:05.080
నేను జవాబిస్తాను.

17:05.120 --> 17:08.560
పరిశోధన ఆపేసాము ఎందుకంటే
ఉత్తరం నుండి ఎవరూ ఇటు రాలేదు,

17:08.640 --> 17:10.920
-ఆ రోజు ఉదయం సెటిలర్ హైవేలో.
-ఎందుకని?

17:11.000 --> 17:14.560
మలుపులో ఒక ట్రక్కు బోల్తా పడిందని
బంక్‌లోని మోనా చెప్పింది.

17:14.680 --> 17:18.720
రోడ్డంతా బ్లాకైంది
20 టన్నుల లాలిపాప్‌లు, పురుగులతో.

17:18.800 --> 17:22.000
-సోది గోల?
-జోక్ చేస్తున్నావా?

17:22.080 --> 17:25.040
నిజంగా? ఏంటిదంతా?
ఆ బాక్స్ ఇవ్వు నాకు.

17:25.080 --> 17:26.680
సరే మరి, ఉత్తరం వదిలేయాలిక.

17:26.760 --> 17:27.560
మూరింగ్‌కు సురక్షితం కాదు
మూరింగ్‌కు సురక్షితం కాదు

17:28.200 --> 17:30.800
కానీ డెడ్‌లాక్ దక్షిణ తీరమంతా

17:30.880 --> 17:34.480
అందులోనూ 90 నిముషాల
పరిధిలో అంటే అంతా రాళ్లమయం.

17:34.560 --> 17:37.720
-అక్కడెక్కడా పడవ నిలపలేరు.
-లంగరు! పడవ లంగరు.

17:37.800 --> 17:40.480
-సరే, మనమేదో మిస్సవుతున్నాం.
-సరే.

17:40.560 --> 17:42.440
ఇంకో మార్గమేమన్నా ఉందేమో.

17:42.520 --> 17:45.800
లేదంటే ఆమె బెర్ముడా ట్రయాంగిల్
చేస్తుందేమో కదా

17:45.880 --> 17:49.040
లేదంటే పడవ పెట్టే చోటే లేదు,
ఇంకో కోణం కలిపితే తప్ప!

17:49.200 --> 17:53.160
ఫోరెన్సిక్స్ వాళ్లు లాక్ నెస్సీ మీద
ఎరుపు మరకలు పోల్చి చూసారా?

17:53.240 --> 17:54.400
అది ఆబీకి చెప్పాను.

17:54.480 --> 17:56.440
-ఆమెకు విషం తగిలింది.
-ఏంటిది!

17:56.520 --> 17:58.040
ఆమె చేస్తానంది!

17:58.080 --> 18:00.560
నాకు సందేశం పంపింది,
స్వరం-నుండి-వాచ్యం,

18:00.720 --> 18:03.720
నీకు పంపాననుకొని నాకు పంపింది!
చూడు. సరే.

18:05.080 --> 18:11.080
"మన కారులో ఎర కూర్చొని ఉంది.
మన కారులో కూర్చొని ఉంది. మన కారు." ఏంటి?

18:11.160 --> 18:12.920
-మన కారు.
-"మన కారు!" ఏంటిది?

18:13.000 --> 18:16.200
-ఆమె యాస అర్థం చేసుకోలేదు అది.
-ఆ బీచ్ ఎరుపు.

18:17.960 --> 18:20.560
-అదెక్కడ?
-అది కరదర్స్ ద్వీపం.

18:22.320 --> 18:25.160
ఓకర్! ఓకర్.

18:25.960 --> 18:27.720
పడవ ఓకర్‌లో ఉంది.

18:29.080 --> 18:30.680
ప్యాడీమెలన్స్ పేరెందుకు?

18:32.320 --> 18:36.440
అంటే, ప్యాడీమెలన్స్
వాటినవి కాపాడుకోవటానికి పిల్లలను బలిస్తాయి

18:36.960 --> 18:38.320
నాకది తెలియదు.

18:38.440 --> 18:42.240
అవి ముద్దుగా ఉన్నా క్రూరమైనవి,
మా ఫుట్‌బాల్ టీములాగానే.

18:42.320 --> 18:45.240
నేను మీకు
మా మొట్టమొదటి అతి పెద్ద స్పాన్సర్ అయ్యే

18:45.320 --> 18:48.200
అవకాశం ఇస్తున్నాను, మార్గీ.

18:48.280 --> 18:50.520
ముందుగా ఎంతో కొంత అంటే 100 వేలైతే?

18:51.200 --> 18:52.520
-చాలా?
-అవును.

18:52.560 --> 18:55.560
పలావా స్త్రీలను చూసుకుంటున్నావు,
ఇక్కడ మా అక్క--

18:55.640 --> 18:58.040
తను మంచి పెట్టుబడే కదా, డార్లింగ్.

18:58.080 --> 18:59.960
అంటే, నా పాపలే నా కుటుంబం.

19:00.040 --> 19:02.800
సరే, బాగుంది!
ఈ టీమ్ కేప్టెన్,

19:02.920 --> 19:04.680
తను పలావా కనుక, అమ్మ వైపు,

19:04.760 --> 19:07.800
పాకంజీ ఇంకా విరాడ్జురీ
నాన్న వైపు నుండి. సూపర్‌స్టార్.

19:07.880 --> 19:10.400
తను అందగత్తె, మంచి జుట్టు, బాగా పాడుతుంది.

19:10.480 --> 19:13.160
-ఆమె తన గురించే చెపుతుంది.
-అర్థమైంది.

19:13.240 --> 19:15.200
ఏమంటారు, శ్రీమతి కరదర్స్?

19:15.280 --> 19:17.560
హైపర్‌బారిక్ చాంబర్‌కు మీ పేరు పెడతాం.

19:17.640 --> 19:20.960
ఓహ్, టామీ. అది... నీ ప్యాషన్ నచ్చింది.

19:21.800 --> 19:25.400
కానీ నేను ఇకపైన దాతృత్వ
కార్యక్రమాలు చేపట్టటం లేదు.

19:25.480 --> 19:28.320
వచ్చే ఏడాది విద్యా సంబంధ
స్కాలర్షిప్‌ అడగవచ్చుగా?

19:28.440 --> 19:29.640
నీ మార్కులు ఎలా ఉన్నాయి?

19:29.720 --> 19:31.640
అవి నా కిక్ అంత బాగుండవు, మిస్.

19:31.720 --> 19:35.880
ఆ స్కాలర్షిప్ ఇక్కడ మిరాండాలాంటి
అసామాన్య యువతుల కోసం

19:35.960 --> 19:37.280
ప్రత్యేకంగా సృష్టించాము.

19:37.800 --> 19:39.240
టామీ కూడా అసమాన్యమే.

19:39.320 --> 19:42.480
అవును, కానీ టామీకి సహాయం
చేసానంటే నీలాంటి ఇంకో అమ్మాయి,

19:42.560 --> 19:44.320
ఇంకో పలావా అమ్మాయి

19:44.440 --> 19:46.240
ఇంకా యోగ్యురాలైన అమ్మాయికి,

19:46.320 --> 19:48.680
నా సహాయం అందకపోవచ్చు కదా, అర్థమైందా?

19:48.760 --> 19:50.560
లేదు. అర్థం కాలేదు.

19:50.640 --> 19:55.080
సరే, నువ్వు సంపన్నురాలివేగా? ఇంకో
పిచ్చి పెయింటింగ్ అమ్మి సహాయం చేయవచ్చుగా?

19:55.160 --> 19:57.920
క్షమించు, నువ్వు ఆశించినది
ఇది కాదని తెలుసు,

19:58.000 --> 19:59.440
కానీ కొన్నిసార్లు, నమ్ము,

19:59.520 --> 20:02.080
ఒకరు "కాదు" అనటమే
నీకు చాలా మంచిది.

20:02.200 --> 20:04.560
-కానీ మార్గరెట్--
-పర్వాలేదు, డార్లింగ్.

20:04.640 --> 20:08.000
ఇంకోసారి నువ్వు కుటుంబాన్ని
తీసుకు రావాలంటే ముందే చెప్పు.

20:08.760 --> 20:12.000
నా ఇల్లు మరీ సత్రంలాగా తయారవుతుంది.

20:12.080 --> 20:14.440
ఈ ఊర ఉసిరి తీసుకో! నా దగ్గర చాలా ఉంది!

20:15.160 --> 20:17.320
డల్సీ, డార్లింగ్! అలాగే.

20:17.440 --> 20:19.400
నేనే స్వయంగా తీసుకెళతాను.

20:19.920 --> 20:21.720
ఊరేసిన ఉసిరి అంటే ఏంటి?

20:37.000 --> 20:39.520
నీకు పడవలు
అంతగా నచ్చవు కదా, కాలిన్స్?

20:39.560 --> 20:41.640
వాటికి నేనంటే ఇష్టముండదు.

20:41.720 --> 20:46.240
నేను ఒకసారి ఒక తెప్పను
నెలరోజులు పని చేయకుండా చేసాను.

20:46.320 --> 20:47.320
నాకు పడవలు ఇష్టం.

20:47.400 --> 20:50.200
నాకు డార్విన్‌లో
మంచి చిన్న స్పీడ్ బోట్ ఉంది.

20:50.280 --> 20:51.800
-ఓహ్, అవునా? బాగుంది!
-హా.

20:51.920 --> 20:54.080
దాని మీద ఎక్కమని అడగకే?

20:54.200 --> 20:56.280
ఇప్పుడప్పుడే వాడనది.

20:56.320 --> 20:57.320
ఎందుకని?

20:58.080 --> 20:59.320
బుషీ దాని మీదే పోయాడు.

21:00.440 --> 21:03.880
సరే. సరే, అంటే, సరే,
అది అంతా మారుస్తుంది, కదా?

21:05.080 --> 21:08.240
సరే. దాని గురించి నాతో మాట్లాడుతావా?

21:08.520 --> 21:11.520
-ఇప్పుడే మాట్లాడాము. చాలిక.
-సరే.

21:11.560 --> 21:14.800
మేడమ్ కరదర్స్ గారు
తీసుకువచ్చినందుకు థాంక్స్.

21:14.880 --> 21:16.320
నా అదృష్టం, డార్లింగ్.

21:16.920 --> 21:20.720
అందరూ దారిలో నడిచేలా
చూసుకోండి, సరేనా?

21:20.800 --> 21:23.440
ఇక్కడ నేలలు కొంచెం ప్రమాదకరం.

21:23.520 --> 21:25.640
అక్కడ శ్మశానానికి ఎలా వెళ్లగలం?

21:27.000 --> 21:29.800
ఏమనుకోకండి, అది నిషిద్ధ ప్రాంతం.

21:29.920 --> 21:31.960
-ఎందుకని?
-నాగుపాములు.

21:32.920 --> 21:35.640
అవి మనుషులను చూసి
చాలా రోజులైందిక.

21:35.720 --> 21:38.800
పెద్దవి, భయానకమైనవి,
వాతావరణం అస్సలు వాటినేం చేయలేదు.

21:38.880 --> 21:41.440
అవి సంయోగం చేసి
చాలా పిల్లలను కన్నాయి.

21:42.640 --> 21:45.800
సరే, అంటే,
మేము తీరం దగ్గరే ఉంటాము--

21:47.080 --> 21:48.680
-మన్నించాలి.
-పర్వాలేదు.

21:48.760 --> 21:53.280
నేను ఇక్కడే ఉండి
కెవిన్ వస్తే విసిగించకుండా చూసుకుంటాను.

21:53.360 --> 21:55.000
-సీల్?
-అవును.

21:55.080 --> 21:57.880
ఈ ద్వీపం దాని సొంతమని అనుకుంటుంది.

21:58.600 --> 22:00.000
అది వందలలో ఒకటి!

22:01.680 --> 22:02.880
నీకు పర్వాలేదా?

22:02.960 --> 22:06.160
నువ్వలా అడగకు,
అలా అడిగావంటే

22:06.240 --> 22:09.200
నాకు ఏదో అయ్యి
అంతా చెడుతుంది, అందుకే...

22:09.280 --> 22:11.560
ఆబీ? ఓకర్ బీచ్ ఎక్కడ?

22:11.640 --> 22:14.040
ఫే అది ఆగ్నేయ తీరంలో అంది.

22:14.720 --> 22:16.720
నిజానికి, నాకోసం మ్యాప్ గీసింది.

22:18.160 --> 22:19.440
అవి టిష్యూలు.

22:20.240 --> 22:22.080
-అవి టిష్యూలు.
-సరే, సరే.

22:22.160 --> 22:25.000
ఆబీ, నీలోంచి విషం పోవటానికి
ఇంకా ఎంత సమయముంది?

22:25.080 --> 22:26.760
ఇంకొన్ని గంటలంతే,

22:26.840 --> 22:30.440
కానీ ఈఆర్ డాక్టర్ చెప్పటం
నేను వారాలపాటు రసాయనాన్ని వదులుతానట.

22:35.760 --> 22:37.440
పురుష
హంతకురాలు

22:37.520 --> 22:40.320
కిల్లర్ ఓడ్వాయర్! నువ్వూ నీ అమ్మా కూడా!

22:44.600 --> 22:46.040
ఫుటీ అబ్బాయిలు
ట్రెంట్ కోసం వ్యాయామం?

22:59.040 --> 23:00.120
ట్రెంట్ లేథమ్ స్మారక బహిరంగ జిమ్

23:00.200 --> 23:01.760
అంతే, సీ-డాగ్. ఇంకా చెయ్యి.

23:01.840 --> 23:03.160
సీ-డాగ్ అని పిలవకు నన్ను!

23:03.560 --> 23:04.600
ఇంకొంచెం అంతే.

23:05.720 --> 23:07.120
హాయ్, గయ్స్. ఎలా ఉంది?

23:07.200 --> 23:08.360
ఏం చేస్తున్నావు?

23:08.440 --> 23:11.720
నేను గ్రూప్ చాట్‌లో సందేశం చదివాను?
అందుకే, నేనూ వచ్చాను.

23:11.840 --> 23:14.160
-నువ్వు వాడిని తీసేయలేదా?
-నేను అడ్మిన్ కాదు.

23:14.240 --> 23:15.880
-అడ్మిన్ ఎవరు మరి?
-రోనీ!

23:15.960 --> 23:16.840
వాడెక్కడ?

23:16.920 --> 23:19.120
డెంటిస్టు దగ్గర క్లిప్పులు చూపిస్తున్నాడు

23:19.200 --> 23:20.120
ఓయ్! ఓయ్!

23:20.480 --> 23:22.280
వాళ్ల అమ్మ హంతకురాలు బాబు!

23:22.360 --> 23:25.360
-హంటర్, శాంతించు!
-వాళ్ల అమ్మ ట్రెంట్, గావిన్‌లను చంపింది.

23:25.440 --> 23:28.160
-శామ్, జిమ్మీ ఇంకొకడిని చంపింది!
-చేసిందని తెలుసు.

23:28.240 --> 23:32.680
-అబ్బా, హంటర్!
-ఆమె పురుష ద్వేషి హంతకురాలు.

23:36.680 --> 23:39.920
సరే, ఈ టౌనులో ప్రతీ స్త్రీ
పురుష ద్వేషే, బాబు.

23:40.520 --> 23:41.880
మా అమ్మ సోదిది.

23:41.960 --> 23:45.120
రోనీ అమ్మ సోదిదే.
కాలమ్ అమ్మ ఇంకా ఘోరం.

23:45.200 --> 23:46.760
ఆమెకు స్లీపోవర్లే నచ్చవు.

23:46.840 --> 23:49.440
మన బామ్మలూ అంతే, మన టీచర్లు...

23:49.520 --> 23:53.320
క్యాంటీన్ ఆమె హాట్ డాగ్స్ నిషేధించింది,
అదో గయ్యాళి. ఇక టామీ!

23:54.080 --> 23:56.960
టామీ వాళ్లందరిలోకి పెద్ద సోదిది, కదా?

23:58.600 --> 24:00.440
అవును. తను అంతే.

24:00.560 --> 24:04.000
-హా, ల్యూక్ కాడీని దూరం చేసింది!
-ల్యూక్ క్యాడీ గురించి వద్దు.

24:04.080 --> 24:06.960
ల్యూక్ క్యాడీ ట్రెంట్ స్నేహితుడు,
అతను మన రిక్రూటర్!

24:07.040 --> 24:09.480
ఆ సోదిదాన్ని ఎలాగైనా ఆపాలి!

24:11.080 --> 24:13.160
ఇద్దరమ్మలు, మీకో పని ఇస్తాను.

24:15.440 --> 24:17.640
అయితే, ఆగు, ఆబీ, నువ్వనుకోవటం

24:17.720 --> 24:20.320
జిమ్మీ శిలువ లాక్ నెస్సీ
శేషాలతో చేసిందంటావా?

24:20.400 --> 24:23.840
-అది పిచ్చిగా అనిపించవచ్చు, మేడమ్.
-లేదు, అలా కాదు.

24:23.920 --> 24:27.400
సీరియల్ కిల్లర్‌లు
వారి తెలివి అందరికీ చూపించాలనుకుంటారు.

24:27.480 --> 24:30.280
గుర్తించినందుకు థాంక్స్.
నిజంగా చాలా సాంత్వన.

24:30.360 --> 24:32.360
జేమ్స్ నాకు మతి పోయిందన్నాడు.

24:32.440 --> 24:33.960
అంటే, నీకేం కాలేదు, ఆబీ.

24:34.040 --> 24:38.640
నువ్వు బాగా ఆలోచిస్తున్నావు.
కానీ ఆ ముక్కలు లాకప్‌లో ఉన్నాయి, కదా?

24:38.720 --> 24:40.840
అవును, జేమ్స్ ల్యాబ్‌లో ఉన్నాయన్నాడు.

24:40.920 --> 24:42.640
హలో, హత్యా గది!

24:46.920 --> 24:48.800
ఆబీ, ఫోరెన్సిక్స్‌కు కాల్ చెయ్యి.

24:50.160 --> 24:51.160
అలాగే, మేడమ్.

24:52.720 --> 24:53.760
తనను వదిలెయ్యి.

24:53.880 --> 24:55.200
టమారా, మాటలు!

24:55.280 --> 24:58.280
అలాంటి జాత్యంహకార స్త్రీ
సహకారమే వద్దు అసలు.

24:58.360 --> 25:00.960
జోయ్ ఆంటీ బీనీ స్టాండును
ఆ ఫుట్‌బాల్ పాడు చేస్తే,

25:01.040 --> 25:02.880
ఫోర్ట్‌నైట్ సభ్యత్వం రద్దే.

25:02.960 --> 25:05.240
అది బాటిల్ పాస్, టామ్‌ది వాడుతున్నాం.

25:05.320 --> 25:07.440
టామ్‌ను పాస్‌వర్డ్ మార్చమని చెపుతాను.

25:07.520 --> 25:11.120
అతను మాకు దొరకట్లేదు,
నువ్వన్నా కనీసం కలిసి మాట్లాడు.

25:11.200 --> 25:14.440
గంట నుండి పట్టుకొనే ఉన్నావు,
కింద పెడతావా దానిని?

25:14.520 --> 25:15.720
అది అంటే...

25:16.920 --> 25:19.920
ఎవరు అర్హులో నిర్ణయించే హక్కు
మార్గరెట్ కరదర్స్‌కు ఎక్కడిది?

25:21.200 --> 25:24.080
మనకేం కావాలో
మనకన్నా ఎక్కువ తనకు తెలియదు.

25:24.160 --> 25:26.160
ఆమెకు మాంసం పచ్చళ్లు పెట్టటం తెలుసు.

25:26.960 --> 25:30.880
ఆమె డబ్బు నాకు సహాయపడుతుందని
తెలుసు, కానీ ఆమె టామీతో మాట్లాడిన తీరు,

25:30.960 --> 25:35.680
ఆమె స్కూలుకు వెళ్లటమన్న ఆలోచనే
నాకు కంపరం పుట్టిస్తుంది.

25:39.320 --> 25:42.080
యూనిఫామ్ డయేరియాలాగా
ఉండటమే కాదు.

25:46.200 --> 25:49.000
బుజ్జీ, ఆ బాధ?

25:49.440 --> 25:50.760
నువ్వు విను అది.

25:51.440 --> 25:52.600
అది మన పూర్వీకుల గొంతు.

25:53.080 --> 25:54.880
అది వేల ఏళ్ల జ్ఞానం

25:55.000 --> 25:58.800
ఆదివాసీ స్త్రీగా నీ ఆత్మాభిమానం
పణంగా పెట్టక్కరలేదని చెపుతుంది.

25:58.880 --> 26:02.280
డబ్బు లేదంటే ఖరీదైన స్కూల్
వృద్ధి కార్యక్రమాలేవి ఎక్కువ కాదు.

26:02.360 --> 26:04.320
ఆమె మద్ధతు నీకు అవసరం లేదు.

26:04.440 --> 26:05.520
నీకు కాళ్లున్నాయి.

26:07.320 --> 26:09.080
ఒక కాలి ముందు ఇంకో కాలు పెట్టు,

26:09.880 --> 26:13.080
నీ స్వంత కాళ్ల మీద
సగర్వపడే జీవితం సంపాదిస్తావు, బుజ్జి.

26:16.360 --> 26:17.840
సరే.

26:35.280 --> 26:38.840
హే, అమ్మా? జాయ్ ఆంటీ
ఎంత త్వరగా అల్లుతుందంటావు?

26:39.680 --> 26:43.560
కొద్ది రోజులలో రిక్రూటర్లు వస్తున్నారు,
మాకు 18 ఫుట్‌బాల్ జంపర్లు కావాలి.

26:46.760 --> 26:47.880
హాయ్.

26:50.840 --> 26:52.080
హల్లో, భూతమా.

26:52.200 --> 26:53.640
నీ కొత్త స్నేహితులు లేరా.

26:57.240 --> 26:58.600
అన్నం తింటావా?

27:02.680 --> 27:06.200
సారీ, జేమ్స్, సిగ్నలు సరిగ్గా లేదు.
నేను పైకి వస్తాను.

27:06.280 --> 27:08.000
మాకిక్కడ ఫోరెన్సిక్స్ కావాలి.

27:08.080 --> 27:11.000
-పాపా, పంతులు సంగతేంటి?
-లేదు, నాకింకా దొరకలేదు.

27:11.120 --> 27:13.920
ఆబీ, నీ వంతు పనులు నువ్వు చేయాలి గదా.

27:14.000 --> 27:15.920
వారంలో మన పెళ్లి.

27:17.560 --> 27:19.920
మనం మన పెళ్లి రద్దు చేసుకుంటే మంచిదేమో.

27:22.680 --> 27:25.400
దేవుడా, నువ్వే అనటం నాకు సాంత్వనగా ఉంది.

27:25.920 --> 27:27.000
నిజంగానా?

27:27.080 --> 27:29.360
ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మన చుట్టూ.

27:29.440 --> 27:31.640
మనం కచ్చితంగా పెళ్లిని వాయిదా వేయాలి.

27:31.960 --> 27:33.600
వాయిదానా? కాదు, జేమ్స్--

27:33.680 --> 27:36.200
నిజంగా, ఆబ్స్,
నాకో విరామం కావాలి, సరేనా?

27:36.280 --> 27:39.400
ఈ పరిశోధన అంతా
కేవలం నీ అవసరాల గురించే.

27:39.480 --> 27:42.800
నామీద అదెంత దుష్ప్రభావం చూపిస్తుందో
నీకస్సలు తెలిసినట్టు లేదు.

27:42.880 --> 27:45.960
నువ్వు నన్ను పట్టించుకోవు,
నేను నన్ను పట్టించుకోకపోతే,

27:46.040 --> 27:47.600
ఇంకెవరు చేస్తారు, ఆబీ?

27:47.680 --> 27:50.880
-ఎవరూ లేరు అన్నదే జవాబు.
-పెళ్లి వాయిదా వేయాలనట్లేదు.

27:50.960 --> 27:52.480
నేను నిన్ను వదిలేస్తున్నాను.

27:52.560 --> 27:54.760
ఇక్కడేం చేస్తున్నావు, బంగారం?

27:54.840 --> 27:56.520
ఇక్కడికి రాకూడదని చెప్పానుగా.

27:56.600 --> 27:59.800
-క్షమించాలి, శ్రీమతి కరదర్స్.
-ఇది మెడుస్సా తల లాంటిది.

27:59.880 --> 28:02.400
ఏదైనా కాటేయకముందే
నువ్వు వెళ్లిపో ఇక్కడినుండి.

28:02.480 --> 28:04.400
-వెళ్లిక. అరే పో.
-సరే. క్షమించండి.

28:04.480 --> 28:06.360
లేదు, లేదు, పర్వాలేదు.

28:06.440 --> 28:07.920
మెట్ల దగ్గర జాగ్రత్త.

28:08.000 --> 28:09.680
-అవి జారవచ్చు.
-సరే.

28:30.080 --> 28:32.480
పలావా

28:42.360 --> 28:44.160
ఇది మంచి అందమైన పడవ!

28:45.360 --> 28:48.360
ఇది నేర ఘటనలో లేకపోతే
దీనిని ఏం చేస్తారు?

28:48.440 --> 28:52.360
ఎవరైనా బలగాల వాళ్లకు
"శభాష్" అని పడవ బోనస్ ఇస్తారు.

28:52.440 --> 28:53.640
-డిటెక్టివ్?
-ఏంటది?

28:56.360 --> 28:58.400
-నన్ను ఎత్తు.
-ఏంటి? లేదు. మనం అలా--

28:58.480 --> 29:01.160
నేను మళ్లీ పెట్టేస్తాను.
అరే కానివ్వు. అరే.

29:01.280 --> 29:02.800
ఒకటి, రెండు, మూడు, కానివ్వు.

29:03.720 --> 29:06.320
సరే, ఆగు. దొరికింది.

29:07.680 --> 29:09.360
కిందకు దించు. అబ్బా, నా నడుం.

29:09.440 --> 29:12.680
-భగవంతుడా! వదిలెయ్యి! అబ్బా!
-సరే. అలాగే.

29:16.720 --> 29:18.720
-అది జిమ్మీ జాకెట్.
-అవును.

29:19.480 --> 29:22.680
దానిని నీ స్నేహితురాలి డీఎన్‌ఏతో
పోల్చు, జతేమో చూద్దాం.

29:30.960 --> 29:32.360
ఆ చూపేంటి?

29:32.880 --> 29:35.600
ఏంటలా చచ్చిన కుక్క ముఖం పెట్టావు?

29:35.680 --> 29:37.120
ఏదీ సరిగ్గా లేదు.

29:37.200 --> 29:39.480
వద్దు, ఇప్పుడింకేం చెప్పవద్దు.

29:39.560 --> 29:43.440
స్కై ఇంత నిర్లక్ష్యంగా
జిమ్మీ జాకెట్‌ను ఇక్కడెందుకు వదిలేస్తుంది?

29:43.520 --> 29:46.800
మిగతా హత్యలను ఆమె ప్రణాళికాబద్ధంగా
పొల్లు పోకుండా చేయటానికి

29:46.880 --> 29:48.800
ఇది పూర్తిగా వ్యతిరేకం.

29:48.920 --> 29:51.280
ఆమె నిబద్ధతతో సరిపోలట్లేదు.

29:51.440 --> 29:52.960
అంటే, ఆమె పొరపాటు చేసింది.

29:53.040 --> 29:55.760
అయితే ఏంటి?
ఆమెకు హత్యల షెడ్యూల్ ఒత్తిడేమో.

29:55.840 --> 29:59.640
అంటే, స్కై అస్సలు మారదు,
సర్దుకోదు, చాలా పద్ధతిగా చేస్తుంది.

29:59.720 --> 30:03.040
ఆమె నాకు స్నేహితురాలవ్వటానికి
అవే కారణాలు.

30:03.160 --> 30:07.760
డెడ్‌లాక్‌లో నీ ఈ మంచి జీవితాన్ని
చెడగొట్టుకోవాలనుకోవట్లేదని తెలుసు,

30:07.840 --> 30:11.600
కానీ మగవాళ్ల నాలుకలు కోసి
వాళ్లను చంపేముందు,

30:11.680 --> 30:14.320
నీ షెఫ్ స్నేహితురాలు అది ఆలోచించాల్సింది.

30:14.400 --> 30:16.720
ఆమె ఇదంతా నాశనం చేసింది,
నువ్వు కాదు.

30:16.800 --> 30:20.320
కాలిన్స్, ఆమె పడవను ఇక్కడ పెట్టి

30:20.400 --> 30:24.240
డెడ్‌లాక్‌కు తిరిగి ఈదుకుంటూ వెళ్లిందా

30:24.320 --> 30:26.600
జలకన్యలాగా, సరేనా?

30:26.680 --> 30:30.480
ఆమె వంటల పుస్తకంలో చూసాముగా.
చిన్నప్పుడే చేసింది మళ్లీ చేస్తుంది.

30:30.560 --> 30:34.440
మేడమ్స్, ఈ పడవ కోసం
ప్రకటనను జిమ్మీ లాకరులో చూసాను.

30:48.920 --> 30:50.280
అది విండ్‌బ్రేకర్.

30:50.840 --> 30:53.720
అది రేచల్ హ్యాడిక్ పడవ.
ఆమె అమ్మేయనుంది.

30:53.800 --> 30:54.960
అదే విండ్‌బ్రేకర్!

30:55.040 --> 30:56.360
అదే విండ్‌బ్రేకర్.

30:56.920 --> 30:58.920
మేడమ్స్, ఇదే విండ్‌బ్రేకర్ కదా.

30:59.000 --> 31:00.840
-అవును, ఆబీ.
-అదే మేము అనేది.

31:00.920 --> 31:03.160
-అదెక్కడి నుండి తెచ్చారు?
-నాకు వినపడటం లేదు.

31:12.520 --> 31:14.680
సరే. ఒకప్పుడు జెఫ్ పడవ.

31:14.760 --> 31:18.000
అమ్మకానికి పెట్టి నెలలైనా,
ఎవరూ కొనలేదు.

31:18.080 --> 31:20.840
జెఫ్ వల్ల, అతను
ఉన్ని షెడ్డును తగలబెట్టటంతో.

31:20.920 --> 31:24.320
-నన్ను చంపటానికి.
-అయితే, విండ్‌బ్రేకర్‌ను అమ్మలేదా?

31:24.440 --> 31:28.160
లేదు, అమ్మాము. మూడు రోజుల క్రితం.
దానితోనే కాంపర్‌ను కొన్నాం.

31:28.320 --> 31:31.520
మేము ఆస్ట్రేలియాలోని
అన్ని జలపాతాలు చూసి వస్తాము,

31:31.600 --> 31:33.360
పర్యావరణ మార్పులతో అవి పోకముందే.

31:33.480 --> 31:37.080
నువ్వూ కాథ్ హాబీ పొలాన్ని కొనాలనుకోవటం
సరైన సమయంలో చేసారు.

31:37.160 --> 31:40.200
వాళ్లు మౌంట్ మౌంటేన్ పార్క్
మిణుగురుల దారిని సరి చేసారు.

31:40.280 --> 31:42.720
-సారీ, కాథ్ రేటు చెప్పిందా?
-అవును, అవును.

31:42.800 --> 31:44.720
లెస్బియన్లు, మిణుగురులు.

31:44.800 --> 31:46.440
ఆ పడవ ఎవరికి అమ్మారు?

31:46.520 --> 31:48.600
అతని పేరు జేమ్స్ అనుకుంటాను.

31:50.960 --> 31:54.880
కాదు, అతను జిమ్మీ. తెలుసుగా,
అదే చర్చిలో హస్తప్రయోగం చేసాడు.

31:55.000 --> 31:56.440
-ఆగు, జిమ్మీ కుక్?
-అవును.

31:56.600 --> 31:59.720
-నిన్న చంపబడ్డవాడా?
-చంపేసారా?

31:59.800 --> 32:02.440
ఓరి దేవుడా! మాకస్సలు తెలియదు.

32:02.520 --> 32:04.920
మేము ఈ కాంపర్ ట్రైలర్
గోలలో మునిగి పోయాము.

32:05.000 --> 32:07.360
అరలు భలే మెత్తగా ఉన్నాయి.
చూస్తారా ఏంటి?

32:07.440 --> 32:10.360
జిమ్మీ 12,000 డాలర్ల పడవ
ఎలా కొనగలడు?

32:10.440 --> 32:13.920
-వాడి దగ్గర చిల్లిగవ్వ లేదు.
-ఆగు. 12,000 డాలర్లన్నావా?

32:14.000 --> 32:16.600
-ఇప్పుడు నాకు కంగారేస్తుంది.
-ఆన్‌లైన్‌లో చూడు.

32:16.680 --> 32:18.280
డబ్బులు పడ్డాయో లేదో?

32:19.200 --> 32:21.320
రేచల్, పడవను ఎవరు కొన్నారు?

32:21.400 --> 32:23.480
కాదు, ఇది సరి కాదు.

32:24.120 --> 32:25.120
ఎవరది?

32:26.720 --> 32:29.760
స్కై. స్కై యాన్ ఓడ్వాయర్.

32:29.880 --> 32:32.120
ఆనే? ఆమె మధ్య పేరు ఆనే అని నాకు తెలియదు.

32:32.200 --> 32:33.960
అది దారుణమైన పేరు, కదా?

32:37.520 --> 32:41.680
ఈ సాయంత్రం ఇక్కడికి వచ్చిన
ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.

32:41.760 --> 32:44.120
కొంతమంది టిక్కెట్లు
కొన్నవారు రాలేకపోయారు.

32:44.720 --> 32:46.640
వాళ్లంతా ఆసుపత్రిలో ఉన్నారేమో,

32:46.720 --> 32:49.280
ఈ సోది నుండి విముక్తి కోసం
వాళ్లకై వాళ్లు

32:49.360 --> 32:52.440
చేసుకున్న కారు ప్రమాదం వల్ల.

32:52.520 --> 32:57.080
సరే గానీ, డెడ్‌లాక్ శీతకాల విందోత్సవం
సగర్వంగా ఈ సరికొత్త సినిమా కళాఖండాన్ని

32:57.160 --> 32:59.760
ప్రదర్శిస్తుంది.

32:59.840 --> 33:02.080
జోన్ లామంట్ స్థానిక దర్శకునిది.

33:02.280 --> 33:04.240
దీని పేరు పొసైడన్ యుటెరస్.

33:05.040 --> 33:07.960
ఇది జల దైవత్వ స్త్రీత్వానికి అంకితం,

33:08.040 --> 33:12.240
ఇది నాలుగు గంటల సినిమా.
బాబోయ్, జోన్. నిజంగా?

33:12.320 --> 33:14.760
నాన్స్, ఎవరైనా బూత్ దగ్గర
గొలుసులు, మేకులు

33:14.840 --> 33:16.640
పెట్టటం చూసావా అని?

33:16.760 --> 33:19.200
అవును, ఆకుపచ్చ సంచే.
ఎవరిదో తెలియదు.

33:19.280 --> 33:20.840
నేను బాత్రూంలో ఉన్నాను.

33:20.920 --> 33:23.040
లేదు, బాగున్నాను.
ధన్యవాదాలు, నాన్స్.

33:23.120 --> 33:25.200
నాకు మంచి సమీక్షలు ఇచ్చారు, నమ్ము.

33:25.280 --> 33:27.240
హలో, డిటెక్టివ్ కాలిన్స్ ఫోన్.

33:27.760 --> 33:29.360
హలో, శ్రీమతి కరదర్స్.

33:29.440 --> 33:31.560
నేను చెప్పేది అర్థమౌతుందిగా.

33:32.120 --> 33:34.280
సరే, రేపు పొద్దున వస్తాను.

33:34.360 --> 33:35.760
అలాగే, సరే, తెలుసు.

33:35.920 --> 33:38.280
-సరే.
-అలాగే, ఇప్పుడైనా పర్వాలేదు.

33:41.480 --> 33:44.880
అలైనాకు ఇవి కావాలట,
నేను "అస్సలు కుదరదు" అన్నాను.

33:44.960 --> 33:49.200
నా 400 డాలర్ల స్వయంచాలక పరుపు మీద
ఆ సిటీ వెధవలను కూర్చోనివ్వలేను.

33:49.280 --> 33:50.480
అస్సలు కుదరదు.

33:50.560 --> 33:51.440
తను నా...

33:54.040 --> 33:54.880
స్కై?

33:55.440 --> 33:59.400
నేను 200 డాలర్ల
ఇబేరికో హామ్ టోస్టీలు చేస్తున్నాను.

33:59.480 --> 34:01.680
రెస్టారెంట్ కావాలని అడగదనుకో.

34:02.440 --> 34:03.520
స్కై?

34:03.600 --> 34:06.080
వైనుకు మనకు ఎంత వస్తుందంటావు?

34:06.160 --> 34:09.760
అంటే, నేను అంతా ఒకేసారి
తాగేద్దామనుకుంటున్నాను,

34:09.840 --> 34:11.560
-నా కాలేయం అంతు చూద్దామని--
-స్కై!

34:14.920 --> 34:16.600
జిమ్మీ కుక్ హత్య జరిగిన రాత్రి,

34:17.760 --> 34:20.400
నువ్వు ఇంటిలోనే ఉన్నావని
పోలీసులకు చెప్పాను.

34:23.040 --> 34:27.960
కానీ 12.30 అప్పుడు నేను లేచి
చూస్తే నువ్వు లేవు.

34:28.040 --> 34:30.840
నేను ఇల్లంతా వెతికాను,
నువ్వు ఎక్కడా లేవు.

34:32.600 --> 34:33.640
అయితే?

34:35.800 --> 34:37.160
అయితే, నువ్వు అబద్ధమాడావు.

34:37.200 --> 34:40.040
జిమ్మీ కుక్ హత్య రాత్రి
నీకు అలిబీ లేదు.

34:41.920 --> 34:44.440
నదియా, ఆపిక.

34:45.960 --> 34:49.280
నువ్వు పోలీసులతో అబద్ధమాడావు.
మీ నాన్న గురించి మాట్లాడవు.

34:49.360 --> 34:54.440
టామ్ తాతను అసలు కలవనేలేదు
నువ్వేమో నాకేదీ చెప్పవు

34:54.520 --> 34:59.960
ఇక్కడి మగవాళ్లు ఇంకా ఈ ఊరంటే
నీకు ఎంత ద్వేషమో అన్నది తప్ప,

35:00.040 --> 35:03.920
మరీ ముఖ్యంగా, లేథమ్‌ల గురించి.
ట్రెంట్ హత్య తరువాత,

35:04.000 --> 35:08.960
నువ్వూ మీ అమ్మా అవిభక్త కవలల్లా
కలిసే తిరుగుతున్నారు.

35:09.040 --> 35:10.680
నేను ఏమనుకోవాలి అసలు?

35:12.160 --> 35:14.160
నాకేమన్నా చెపుతావా?

35:18.320 --> 35:19.760
ఇంకా, నేను గర్భవతిని.

35:20.160 --> 35:21.360
ఏంటి?

35:21.480 --> 35:25.120
నువ్వు సీరియల్ కిల్లర్‌వు అయితే కనుక

35:25.160 --> 35:26.840
నేను ఈ బంధాన్ని కొనసాగించలేను.

35:26.920 --> 35:28.800
నాకు చిన్న దుప్పటి చాలు, బంగారం.

35:28.880 --> 35:33.640
లేదు, విక్, మన దగ్గర పది అడుగు దుప్పట్లు,
సున్నా పై దుప్పట్లు అంటే ఒప్పుకోను.

35:34.040 --> 35:37.200
ఓహ్, సెక్సీ. ఈరాత్రి
ఆలస్యం అవుతుందని అన్నావు.

35:37.320 --> 35:39.840
స్కై, నీతో మాట్లాడాలి.

35:40.360 --> 35:42.480
డల్స్, ఇప్పుడు కుదరదు, బాబు.

35:42.560 --> 35:43.920
ఇది అభ్యర్థన కాదు.

35:49.360 --> 35:53.000
స్కై ఓడ్వాయర్ ఇంటర్వ్యూ.
రాత్రి 7:12 నుండి.

35:53.080 --> 35:55.560
నువ్వు తనను ఇంటర్వ్యూ చెయ్యలేవు.
ఆమె తాగుంది.

35:55.640 --> 35:57.440
చేయగలం, కాథ్. అది చట్టబద్ధమే.

35:57.520 --> 36:01.160
-ఆమె సాక్ష్యాన్ని ఏ జడ్జి అంగీకరించరు.
-అది ఇంకో రోజు ఆలోచిద్దాం.

36:02.480 --> 36:05.560
సరే మరి.
దీని గురించి ఏం చెపుతావు?

36:07.360 --> 36:10.640
అంటే, డిటెక్టివ్, దానిని పడవ అంటారు.

36:12.040 --> 36:14.640
మంచి ఆరంభం. భలే.

36:14.760 --> 36:16.440
-ఇంకేం లేదా?
-లేదు.

36:16.520 --> 36:20.480
అవునా? నువ్వు ఈ పడవకోసం
12,000 డాలర్లను, రేచల్ హ్యాడిక్ ఖాతాలో

36:20.560 --> 36:21.840
జమ చేసావు మరి.

36:21.960 --> 36:24.440
నువ్వు నదియాకు చెప్పకుండా
12,000 డాలర్లు

36:24.520 --> 36:26.520
ఖర్చు పెట్టావని కూడా తెలుసు.

36:26.600 --> 36:28.800
-అది యాదృచ్ఛికం అన్నానుగా.
-కాథ్!

36:29.200 --> 36:31.560
ఈ పడవను కరదర్స్ ద్వీపంలో

36:31.640 --> 36:33.960
జిమ్మీ జాకెట్‌తో సహా చూసాము.

36:34.040 --> 36:36.200
అతని హత్య జరిగిన రాత్రి
అదే వేసుకొన్నాడు,

36:36.360 --> 36:39.160
దాని మీద నీ డీఎన్‌ఏ ఉందని తెలిసింది.

36:41.600 --> 36:44.320
స్కై, నువ్వు ఈ పడవ కొని
దాని మీద జిమ్మీని చంపావా?

36:44.400 --> 36:46.960
-ఏంటి?
-నువ్వు దానిని హత్యా గదిగా వాడావు

36:47.040 --> 36:50.040
నెస్సీని వెతుకుతున్నామని
దానిని తగలబెట్టావు కనుక?

36:50.120 --> 36:52.160
లేదు. డల్స్, అది నా పడవ కాదు!

36:52.200 --> 36:53.640
మరి ఇది ఎవరిది స్కై?

36:53.760 --> 36:55.840
ఇది జిమ్మీ పడవ. వాడికోసం కొన్నాను.

36:55.920 --> 36:58.560
నువ్వెందుకు జిమ్మీ కుక్‌కు
పడవ కొనిస్తావు?

36:58.640 --> 37:00.160
నన్ను బ్లాక్‌మెయిల్ చేసాడు.

37:00.280 --> 37:03.000
అందుకే నా డీఎన్‌ఏ వాడి జాకెట్ మీదుంది,

37:03.080 --> 37:05.680
నేను డబ్బులిచ్చినప్పుడు
వాడితో గొడవ పడ్డాను మరి.

37:07.040 --> 37:08.440
ఎందుకు బ్లాక్‌మెయిల్ చేసాడు?

37:11.640 --> 37:14.000
నీకు ఆ చచ్చినవారికి
ఉన్న సంబంధాల గురించా?

37:24.480 --> 37:27.040
స్కై, మీ నాన్న తిరుగుళ్ల గురించి
నీకు తెలుసా?

37:28.440 --> 37:30.600
-అందుకే అతనిని చంపావా?
-డల్సీ!

37:40.360 --> 37:43.440
నా కుటుంబం ఎవరో నాకు తెలుసు.
వాళ్లకంటే నాకేదీ ఎక్కువ కాదు.

37:43.520 --> 37:45.520
నేను మీ స్కాలర్షిప్పును స్వీకరించలేను.
భవదీయ, మిరాండా హోస్కిన్స్

37:46.560 --> 37:48.640
ఆబీ, ఇంత రాత్రి వచ్చినందుకు థాంక్స్.

37:49.160 --> 37:50.200
పర్వాలేదు.

37:50.320 --> 37:51.400
ఇదిగో.

37:51.480 --> 37:53.600
ఇది మిరాండా కమ్మ అని నాకు తెలుసు,

37:53.640 --> 37:56.800
దానర్థం ఆమె నా చోటులో తిరుగుతుందని.

37:56.880 --> 37:58.920
అది అపార్థం అయుంటుంది.

38:01.480 --> 38:03.600
కానీ మీకు కావాలంటే నేను చెపుతాను తనకు?

38:03.640 --> 38:04.640
చెపుతావా?

38:05.520 --> 38:08.960
పోలీసులు కలిసి హెచ్చరిస్తే
ఆమెకు భయం తెలిసివస్తుంది,

38:09.640 --> 38:12.880
ఆమె ఆంటీలాగా, చెల్లిలాగా
అదుపు తప్పకముందే.

38:13.920 --> 38:15.400
అయితే నేను ఆమెతో మాట్లాడతాను.

38:15.520 --> 38:17.360
నువ్వు బంగారానివి. ధన్యవాదాలు.

38:17.880 --> 38:20.280
నేను ఈ కమ్మను తీసుకోవచ్చా?

38:20.400 --> 38:23.560
-సాక్ష్యం కోసం మాత్రమే. ఊ.
-కచ్చితంగా. నీకు అది కావాలి.

38:25.080 --> 38:27.920
-ఇక వెళ్లు.
-సరే. ధన్యవాదాలు, శ్రీమతి కరదర్స్.

38:28.040 --> 38:28.960
ధన్యవాదాలు.

38:31.360 --> 38:33.880
-ఊర ఉసిరి తీసుకో. చాలా బాగుంది.
-అలాగే!

38:37.040 --> 38:38.440
రెండు తీసుకో. బోలెడున్నాయి.

38:39.800 --> 38:40.800
ధన్యవాదాలు.

39:00.600 --> 39:03.960
నీ పాత స్నేహితులు
ట్రెంట్, గావిన్ లేథమ్ గురించి చెప్పు.

39:05.040 --> 39:07.640
ఫుట్‌బాల్ క్లబ్బులో
చాలా ఇబ్బంది పడుంటావు,

39:07.760 --> 39:11.400
టీములో ఏకైక అమ్మాయిగా,
ఆ స్వలింగ ద్వేషుల మధ్య.

39:11.480 --> 39:14.760
ఊర్లో నీ పైన రాసిన రాతలన్నీ చూసాము.
అది మరీ యాంటీ లెస్బియన్.

39:14.880 --> 39:17.600
అబ్బా. నా అతి పెద్ద రహస్యం తెలుసుకున్నారు.

39:18.360 --> 39:21.880
నేను గ్రామీణంలో రహస్య గే పిల్లను,

39:21.960 --> 39:25.120
అది నాకు నచ్చక
నేను హత్యలు చేసాను.

39:25.160 --> 39:26.400
మీరు భలే పని చేసారు!

39:26.480 --> 39:28.880
స్కై, డెడ్‌లాక్ ఎందుకు వదిలేసావు?

39:28.960 --> 39:30.280
వనెస్సా అంతా చెప్పాక,

39:30.360 --> 39:33.440
ట్రెంట్ ఇంకా ఫుట్‌బాల్ వాళ్లు
నన్ను బాగా గేలి చేసారు,

39:33.520 --> 39:37.360
ఇక పెద్దవాళ్లు, రాడ్ డిక్సన్,
మా నాన్నతో సహా అందరూ చేరారు.

39:37.440 --> 39:39.680
అందుకే, సరే, నేను అందుకే దూరంగా పోయాను!

39:39.800 --> 39:41.640
ఒక ఏడు ముందు, నువ్వు తిరిగి వచ్చావు.

39:42.360 --> 39:44.760
అవును, నేను అనుకున్నాను, "ఇక చాలని."

39:44.880 --> 39:47.760
ఆ వెధవలకు ఉన్నంత హక్కు
నాకు కూడా ఉందని.

39:47.840 --> 39:50.040
22 ఏళ్ల తరువాత
విజయవంతంగా తిరిగి వచ్చావు.

39:50.120 --> 39:52.160
-అవును.
-అంతకుముందు అసలు రానేలేదా?

39:52.280 --> 39:53.280
లేదు.

39:57.400 --> 40:00.480
అదేంటి? నాకు కనపడట్లేదు.
నా అద్దాలు మరిచిపోయాను.

40:00.560 --> 40:03.920
ఇది మైక్ న్యూజెంట్
స్కై ఆన్ ఓడ్వాయర్‌కు ఇచ్చిన టిక్కెట్

40:04.000 --> 40:05.920
2017 జూన్ 10న.

40:06.640 --> 40:09.840
సరే. అయితే, స్కై ఒక్క రోజు కోసం వచ్చింది.
అబ్బా! డల్స్.

40:10.000 --> 40:13.920
జూన్ 10, 2017 రాత్రే
శామ్ ఓడ్వాయర్ హత్య చేయబడ్డాడు.

40:14.440 --> 40:15.320
బాబు.

40:15.400 --> 40:17.280
నువ్వు సిడ్నీలో ఉన్నానన్నావు, స్కై.

40:18.040 --> 40:20.440
నాకు చాలా సార్లు అబద్ధం చెప్పావు!

40:20.520 --> 40:24.000
-ఇదంతా నువ్వనుకున్నట్టు కాదు.
-అయితే ఏంటిది? చెప్పు!

40:24.080 --> 40:27.400
-నువ్వేం చెప్పక్కరలేదు.
-కాథ్, లేదు, నేను చాలా చెప్పాలి--

40:27.480 --> 40:29.360
నీకు తెలియాలా? వనెస్సా అనేది నిజమే.

40:29.440 --> 40:32.080
నాకు ఆ మగవాళ్లంటే అసహ్యం.
మా నాన్న వెధవ.

40:32.160 --> 40:34.000
అలాగే రాడ్ డిక్సన్, ట్రెంట్, గావిన్.

40:34.080 --> 40:36.080
నా లెస్బియన్ జీవితాన్ని నరకం చేసారు

40:36.160 --> 40:38.960
అవును, అందుకే,
వారు చచ్చారని సంతోషం!

40:39.040 --> 40:40.040
సంతోషమే!

40:40.640 --> 40:42.920
కానీ నేను వాళ్లను చంపలేదు. లేదు.

40:43.000 --> 40:46.000
నాకు తెలిసిందేంటంటే,
ఎవరినైనా ఎంత దారుణంగా ద్వేషించినా

40:46.120 --> 40:49.480
వాళ్ల చావు ఎంత కోరుకున్నా

40:49.560 --> 40:51.440
వాళ్లను చంపలేమని!

40:51.520 --> 40:54.920
మీ నాన్న చనిపోయిన రాత్రి
నువ్వు డెడ్‌లాక్‌కు ఎందుకు వచ్చావు?

40:56.120 --> 40:57.120
నో కామెంట్.

41:02.040 --> 41:05.640
ఎంత కోపం వచ్చినా నువ్వు చంపలేవు.
అది నిజం, కదా?

41:05.680 --> 41:07.960
-అవును. చాలామంది చంపలేరు.
-అదే కదా.

41:08.040 --> 41:10.520
నేనూ అంగీకరిస్తున్నా.
బహుశా, తను చేయలేదేమో.

41:11.800 --> 41:13.320
-సరే.
-సరే, సరే.

41:13.440 --> 41:15.560
కానీ తను ఆ రాత్రి డెడ్‌లాక్‌కు వచ్చింది,

41:15.640 --> 41:17.840
ఏదో జరిగింది
ఆమె మనకు చెప్పట్లేదు.

41:18.160 --> 41:20.640
సరే, తను ఏం చేసిందో
అది జిమ్మీకి తెలుసు.

41:20.760 --> 41:22.920
సరే. ఇప్పుడు, వాడు చచ్చాడు, కదా? అయితే...

41:23.000 --> 41:25.880
సరే, సరే. వాడు చచ్చాడులే.
బాగా చచ్చాడు.

41:25.960 --> 41:26.960
సరే.

41:28.520 --> 41:31.000
ఇంటికి వెళ్లి
నదియా, విక్, టామ్‌లను చూస్తాను.

41:31.080 --> 41:33.880
స్కై జైలులో ఉందని
వాళ్లు కంగారుపడుతుంటారు,

41:33.960 --> 41:36.120
జైలులో ఒక్క టాయిలెట్ పేపరు రోలుతో.

41:36.160 --> 41:38.680
-కాథ్, నేను--
-డల్సీతో ఏకాంతంగా మాట్లాడాలి?

41:38.800 --> 41:42.280
నువ్వు పనిలో భాగస్వామివి,
కానీ నేను జీవిత భాగస్వామిని.

41:43.440 --> 41:44.760
అలాగే. పర్వాలేదు.

41:48.480 --> 41:49.680
-శుభాశీస్సులు.
-సరే.

42:06.480 --> 42:07.600
సరే.

42:13.440 --> 42:14.800
అంతా వృథా.

42:43.440 --> 42:44.480
హాయ్, ఎడ్డీ.

42:46.200 --> 42:49.160
కాథ్‌ను చూసావా?
తనకు కాల్ చేస్తుంటే కలవట్లేదు.

42:49.560 --> 42:52.840
అవును, తను స్టేషనులో ఉంది.

42:52.920 --> 42:57.160
అంటే, ఆమెకు దూరంగా ఉండాలి.
ఆమె పోరుకు సిద్ధమైంది.

42:57.800 --> 43:02.160
ఆమె ఆ ముళ్లపందులు ఉంటాయి చూడు
గొడవలో అలా ముళ్లు వదిలేవి...

43:03.080 --> 43:04.280
-తెలుసుగా?
-సరే.

43:07.400 --> 43:11.280
ఆమెను చూడక్కరలేదులే,
ఇప్పటికే ఆలస్యమైంది.

43:11.920 --> 43:13.000
లూ చనిపోయింది.

43:14.160 --> 43:15.920
అయ్యయ్యో!

43:16.840 --> 43:17.800
ఇంకొకరు వద్దు.

43:19.440 --> 43:20.680
లూ ఎవరు?

43:20.880 --> 43:24.080
బంగారు పళ్లున్న
ఆ చేపలు పట్టేవాళ్లలో ఒకడా...

43:24.160 --> 43:25.480
లూ నా గాడిద.

43:26.280 --> 43:28.640
-అది... అయ్యయ్యో.
-అవును.

43:29.680 --> 43:31.320
అది నా ఆప్త మిత్రురాలు.

43:32.360 --> 43:33.440
అయ్యో.

43:38.280 --> 43:39.440
నీకేం కాలేదుగా?

43:50.320 --> 43:52.800
అంటే, రే పైస్, విషయం ఏంటంటే,

43:54.560 --> 43:57.880
నా ప్రాణ స్నేహితుడు పోయాడు కనుక

43:58.800 --> 44:02.760
-నాకు ఆ బాధ తెలుసు.
-అవునా? అయ్యయ్యో.

44:05.800 --> 44:10.040
సరే, నా ప్రాణ స్నేహితుడు పోయాడు,
నీ గాడిద చచ్చింది ఇంకా...

44:10.920 --> 44:13.040
రే పైస్, మంచివాళ్లంతా పోతారు.

44:13.120 --> 44:15.360
-తెలుసు. తెలుసు.
-అంతే ఇక.

44:16.680 --> 44:17.640
సరే.

44:18.600 --> 44:22.080
నేను... నేను నీతో ఇంటికి రావచ్చా,
రే పైస్?

44:22.800 --> 44:25.920
-నాకు గ్రక్ కావాలి.
-నాకు అది ఇష్టమే. సరే.

44:26.040 --> 44:27.680
-సరే.
-గ్రక్ అంటే?

44:27.760 --> 44:29.080
విషాద సెక్స్, బాబు.

44:31.600 --> 44:33.160
-సరే.
-సరే, అలాగే.

44:33.520 --> 44:34.760
-ఎక్కు.
-సరే.

44:35.840 --> 44:37.000
సరే.

44:45.480 --> 44:46.920
నా కుటుంబానికి ధన్యవాదాలు,

44:47.480 --> 44:51.920
నా టీమ్‌మేట్లు,
ల్యూక్ క్యాడీ నాపై నమ్మకానికి.

44:53.680 --> 44:55.520
బ్రౌన్‌లోస్.

44:56.160 --> 44:58.560
నా అందమైన భార్య కెలానీ.

44:59.920 --> 45:01.960
మార్గరెట్ కరదర్స్
జాత్యంహకార కుక్క కనుక

45:02.760 --> 45:06.000
ఆమెకు ధన్యవాదాలు చెప్పనే చెప్పను.

45:07.400 --> 45:11.000
ఇక తప్పకుండా, ధన్యవాదాలు చెప్పాలి,

45:11.680 --> 45:14.200
నా అందమైన స్పోర్ట్స్ డ్రింక్ బాంగ్

45:14.280 --> 45:19.880
నేను ప్రో అవ్వకముందు ఆఖరిసారిగా
నాకు గంజాయి తాగే అవకాశమిచ్చినందుకు.

45:22.600 --> 45:25.080
ఇందులో నీరు ఉంటుందని తెలుసు కానీ,

45:25.160 --> 45:29.760
జోన్ ఎదలను ఇంతసేపు
చూడాల్సి వస్తుందనుకోలేదు.

45:29.840 --> 45:32.720
నేను చూడట్లేదు, జెజ్.
ఈమెయిల్స్ చూస్తున్నాను.

45:32.880 --> 45:34.520
అమాండా పామ్స్ సంబంధం వదిలేసింది.

45:34.600 --> 45:35.600
దయచేసి డీవిడీ పెట్టండి

45:36.800 --> 45:39.960
-అంతేనా? మరీ చిరాకు ముగింపు.
-ఏంటిదంతా? అయ్యో.

45:40.080 --> 45:42.640
మేయర్ రామీ
విందోత్సవం రద్దు చేయాలని డిమాండ్.

45:42.720 --> 45:43.920
కానివ్వండి.

45:44.000 --> 45:47.360
ఐదుగురు పురుషులు పోయారు. ఇక చాలు.
విందును ఆపండి.

45:47.440 --> 45:49.760
-అంతే. ఇంకా గట్టిగా.
-విందును ఆపండి.

45:49.840 --> 45:52.320
-గట్టిగా! విందులు ఆపండి!
-విందును ఆపండి!

45:52.400 --> 45:54.520
విందును ఆపండి! విందును ఆపండి!

45:54.640 --> 45:57.040
విందును ఆపండి? నన్ను ఒడ్డుకు తీసుకెళ్లు.

45:57.120 --> 45:59.400
-నా దగ్గర తెడ్డు లేదు.
-ఎందుకని?

46:01.760 --> 46:03.680
నా జీవితంలో మగవాళ్లంతా పోయారు!

46:03.800 --> 46:06.200
-తొయ్యి. అస్సలు మంచిది కాదు.
-తొయ్యి.

46:09.760 --> 46:14.080
గత ఐదేళ్లుగా, నేను నా తలలో
నువ్వు నన్ను ప్రేమించట్లేదన్న నిజాన్ని

46:14.160 --> 46:16.080
కప్పి పెట్టేలా చాలా ప్రయత్నించాను.

46:16.160 --> 46:18.080
-కాథ్, నేను--
-ఈమధ్య నీ ప్రవర్తన

46:18.160 --> 46:21.840
మన సంబంధం, కుక్కలు,
డెడ్‌లాక్‌లో మన జీవితం, స్నేహితులు

46:21.920 --> 46:26.440
వీటన్నింటిపై నీకు ఇసుమంత
అక్కర లేదని తెలిపేలా చేస్తుంది.

46:26.920 --> 46:32.000
స్కైతో మన స్నేహాన్ని ముక్కలు చేసావు,
ఆ విషయాలన్నీ గుర్తు చేసి తనకు.

46:32.080 --> 46:34.120
ఆమె నాన్న, ఇంకా ఆ సంబంధాలు--

46:34.200 --> 46:36.880
సరే, నేను ఎత్తానే అనుకో--
నువ్వేమన్నావు?

46:36.960 --> 46:40.240
-నువ్వు స్కైతో స్నేహం పాడు చేసావు.
-అది కాదు. దానికన్నా ముందు.

46:42.640 --> 46:44.760
శామ్ తిరుగుళ్ల గురించి నీకు తెలుసా?

46:47.440 --> 46:49.120
స్కైకి తెలుసని తెలుసా?

46:49.200 --> 46:51.400
-అంటే, అవును. తెలుసు.
-కాథ్!

46:52.400 --> 46:54.800
ఇక్కడ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవాలి.

46:54.880 --> 46:57.800
శామ్ హత్యతో
ఈ హత్యాకాండ ఆరంభమైంది.

46:57.920 --> 46:59.680
అదంతా నువ్వు...

46:59.760 --> 47:03.280
నాకు తెలియదు,
నాకు ఉపయోగపడవచ్చేమోగా?

47:03.400 --> 47:05.840
-అంటే, చెప్పాల్సింది నేను కాదుగా.
-నేను...

47:05.960 --> 47:07.880
నీకు ఎందుకు కోపమో తెలియట్లేదు?

47:07.960 --> 47:10.400
వీళ్లంతా నా స్నేహితులు!
నా జీవితాన్ని గెలకకు.

47:10.480 --> 47:13.080
అది, అంతే. అదే నిజం.
నీ జీవితం ఇది.

47:13.160 --> 47:14.440
ఇది నీ జీవితం.

47:14.560 --> 47:17.280
మనం ఎక్కడుండాలి, ఏం తినాలి,
హాబీ పొలపు డిపాజిట్

47:17.360 --> 47:20.080
అంతా నువ్వే నిర్ణయిస్తావు.

47:20.160 --> 47:21.680
సరే గానీ దాని గురించి తెలుసు.

47:21.800 --> 47:25.800
మన పెంపుడు జంతువులు కూడా నీ నిర్ణయమే.
నాకు కొత్త కుక్క వద్దు.

47:26.240 --> 47:29.160
ఇంకొకటి చెప్పనా?
నాకు కుక్కల సత్రం పెట్టాలని లేదు.

47:29.240 --> 47:31.800
మనం తిరిగి తీసుకోలేని పిచ్చి మాటలు అనకు.

47:31.880 --> 47:35.560
లేదు. అదో పిచ్చి ఆలోచన,
లోకానికి నిరుపయోగమది.

47:35.640 --> 47:39.720
ఇంకొకటి చెప్పాలి,
ఇది చాలా పెద్దది,

47:40.600 --> 47:42.880
నాకు డిటెక్టివ్ పదవి ఇష్టం.

47:44.080 --> 47:47.360
నువ్వు నన్ను పశ్చాత్తాపపడేలా
చేసావు కనుక నేను వదిలేసాను.

47:47.480 --> 47:50.360
నిజానికి, కాథ్, మన జీవితమంతా కూడా

47:50.480 --> 47:54.880
నీకు కావలసినదానికోసం
నన్ను ఏడిపించి చేసినవే అన్నీ!

47:55.000 --> 48:00.240
ఇది... ఈ జీవితం, నీ జీవితం,
నాకు చాలా అసంతృప్తిగా ఉంది!

48:01.120 --> 48:02.960
-నువ్వు సంతోషంగా లేవా?
-అవును!

48:04.080 --> 48:05.640
అది నాకెలా తెలుస్తుంది?

48:05.720 --> 48:08.800
నీకు సంతోషం లేదని నాకెలా తెలుస్తుంది,
నువ్వు ఏం చెప్పవు.

48:08.920 --> 48:11.200
అంతా నీ మనస్సులో
దాచి తాళం వేస్తే ఎలాగ!

48:11.280 --> 48:13.360
-నువ్వు నాకు చెప్పలేదు.
-నువ్వు అడగాలి.

48:17.440 --> 48:18.800
ఏం చేయమంటావు?

48:18.880 --> 48:23.200
మనం గొడవలు పడి ఒత్తిడి తెచ్చే
సిడ్నీలోకి వెళదామంచావా, ఆ కష్టాలలోకి?

48:23.280 --> 48:24.360
కాదు, కాదు.

48:24.440 --> 48:26.960
నీకేం కావాలి? ఇది కాదంటే--

48:28.040 --> 48:31.600
అంటే, నేను ఏర్పరచిన జీవితం కాదంటే

48:31.680 --> 48:35.160
మనిద్దరికీ కావలసినదని ఆలోచించి!
నీకేం కావాలసలు?

48:39.680 --> 48:42.200
-ఏం చేస్తున్నావు?
-ఈ ఫోటో ఎప్పటిది?

48:51.040 --> 48:52.280
కాథ్ ఇంకా టామ్ - సిడ్నీ హార్బర్
జూన్ 10 2017

48:52.360 --> 48:53.680
"జూన్ 10న, 2017."

48:55.280 --> 48:56.560
శామ్ చనిపోయిన రాత్రి.

49:01.720 --> 49:02.760
కాథ్?

49:07.640 --> 49:10.040
స్కై వాళ్ల నాన్న మాయమైన రాత్రి
డెడ్‌లాక్‌కు

49:10.120 --> 49:12.040
తిరిగి వచ్చిందని నీకు తెలుసా?

49:14.200 --> 49:16.240
-కాథ్?
-చూడు...

49:17.640 --> 49:20.200
జోక్ చేస్తున్నావా?

49:20.320 --> 49:22.960
నీకు ముందే ఆ తేదీ
గుర్తుకు వచ్చేదేమో, డల్సీ.

49:23.040 --> 49:27.080
నువ్వు ఇంటిలో టామ్‌ను చూసుకుంటూ
వారాంతం గడిపితే నాతోటి

49:27.160 --> 49:31.360
బదులుగా నువ్వు వేరే ఆమెతో
పనిలో సెక్స్ చేస్తున్నావు!

49:31.920 --> 49:33.000
సీనియర్ సార్జెంట్!

49:34.320 --> 49:35.880
ఇప్పుడు కాదు, కెన్!

49:36.480 --> 49:38.480
ఆ సంచితో పనై పోయిందా?

49:38.560 --> 49:41.040
నేను బూత్ దగ్గర వదిలిన ఆకుపచ్చ సంచితో.

49:42.120 --> 49:43.800
నాకు రేపు షాపుకు కావాలది.

49:46.200 --> 49:47.640
అక్కడికెళ్లావంటే చూడు.

49:49.080 --> 49:51.080
అది ఉద్యోగం అంతే, డల్సీ.

49:53.840 --> 49:56.520
నేను నా పని చేయకపోతే,
ఇంకొంతమంది చస్తారు.

49:58.160 --> 50:00.720
అందుకే, ప్రస్తుతానికి
నా ఉద్యోగం మనకన్నా ఎక్కువ.

50:02.360 --> 50:04.080
అది నీ కన్నా ఎక్కువ.

50:11.720 --> 50:14.800
ఆ సంచి ఖరీదు 90 సెంట్లు, డల్సీ.
నేను తీసుకెళతాను.

50:14.880 --> 50:16.640
గొలుసులు, మేకులు చూసావా?

50:16.760 --> 50:19.520
అవును. బీచ్‌లో,
నా మెటల్ డిటెక్టరుతో.

50:19.640 --> 50:22.400
జిమ్మీ నేర స్థలాన్ని శుభ్రం చేసాక.

50:22.480 --> 50:25.440
సారీ. అంటే, అది శుభ్రం చేసాక అన్నావా?

50:25.520 --> 50:28.000
అవును నిజమే.
అవి రాళ్ల మీద అలా పెట్టున్నాయి.

50:29.200 --> 50:30.520
ఎవరో కావాలని పెట్టారు.

50:30.600 --> 50:32.280
మొక్కలేమీ లేవే అక్కడ.

50:33.000 --> 50:35.240
నాచు కూడా మొక్కేనేమో మరి.

50:35.600 --> 50:37.840
-అలైనా?
-వనెస్సా లేథమ్ మతి పోయింది.

50:37.920 --> 50:42.000
నువ్విక్కడికి వెంటనే రావాలి, ఎందుకంటే
నా సినిమా అక్వాటికా మీద దాడి చేసారు.

50:42.080 --> 50:43.160
ఇది నీ ఇల్లా?

50:43.240 --> 50:45.840
స్నేహపూర్వక వన్య జీవులు కట్టించారా?

50:45.920 --> 50:47.840
ఇక్కడ అద్దె ఇళ్ళు ఇలానే ఉంటాయి.

50:52.120 --> 50:53.680
హే, ఒక్క క్షణం ఆగు.

50:54.200 --> 50:56.880
మనం లోపలికి వెళ్లేముందు...

50:58.120 --> 51:00.480
ఈ చిన్న పొదరింటిలోకి,

51:01.880 --> 51:03.400
నేను కొన్ని విషయాలు చెప్పాలి.

51:03.480 --> 51:04.640
సరే.

51:06.200 --> 51:10.280
నేను... నేను మంచిదాన్ని కాదు, రే పైస్.

51:11.480 --> 51:14.520
నేనంటే నీకు ఇష్టమని తెలుసు,
అది అర్థం చేసుకోగలను

51:14.600 --> 51:16.920
ఈ జుట్టు, రొమ్ములు చూసి ఎవరైనా పడతారు,

51:17.000 --> 51:19.720
కానీ నీ అంగానికి
విషయం తెలియాలిగా.

51:21.280 --> 51:22.320
సరే.

51:22.760 --> 51:26.080
నీకు బైకు రైడులు, ప్రేమలేఖలు,
లంచ్ బాక్సులు కావాలంటే

51:26.200 --> 51:30.880
తెలుసుగా, పిక్నిక్కుల లాంటివి
ఆకుకూరలు తినాలి అలా...

51:31.000 --> 51:33.080
-అంటే కాలీఫ్లవర్‌లా?
-ఏదో ఒకటిలే.

51:33.160 --> 51:35.560
అలాంటివి నీకు ఇష్టమైతే కనుక,

51:35.640 --> 51:37.440
ఇంకొకరిని చూసుకోమని చెప్పు.

51:37.520 --> 51:40.120
నాకలాంటివి పడవు, రే పైస్.

51:41.240 --> 51:42.840
నాకు అలాంటివి జరిగితే, నేను...

51:45.080 --> 51:46.280
నాశనం చేస్తాను.

51:47.960 --> 51:50.560
ఎడ్డీ, ఎందుకలా అంటున్నావు?

51:50.640 --> 51:53.040
నేను తేడా! బుషీ పోయాక.

51:53.120 --> 51:55.280
డార్విన్‌లో అందరికీ నేనంటే అసహ్యం.

51:55.360 --> 51:58.200
నాకింకో చోటు లేదు,
నాకు ఎవరూ లేరు, రే పైస్.

51:58.280 --> 52:02.880
అందుకే, నన్నిప్పుడు నువ్వు
వెళ్లమన్నా గానీ నేను అది--

52:02.960 --> 52:04.520
నేను పొదలలో పడుకుంటాను

52:04.600 --> 52:06.640
లేదంటే ముంగిసతో పోరాడుతాను.

52:06.720 --> 52:09.520
ఎడ్డీ, చూడు. హే. చూడు...
ఎవరూ పరిపూర్ణం కాదు.

52:09.600 --> 52:13.800
మనం సిగ్గుపడే పనులు చాలా చేసాం.
నేనూ ఆడవాళ్లతో చాలా తప్పలు చేసాను.

52:13.880 --> 52:18.000
సిడ్నీకి వెళ్లిన కొత్తలో నా కోరికలు
విచిత్రంగా ఉన్నాయి.

52:18.640 --> 52:22.880
డాగ్ కింగ్‌డమ్ అనే లాటిన్
సంగీత బ్యాండులో పని చేసాను.

52:22.960 --> 52:25.160
మేమంతా తెల్లవాళ్లం.

52:25.760 --> 52:27.880
-జటాజూటంతోనా?
-అవును.

52:28.640 --> 52:29.920
-దరిద్రం.
-తెలుసు.

52:31.040 --> 52:32.200
కానీ విషయం ఏంటంటే,

52:33.480 --> 52:36.760
అందరికీ తప్పు సరి చేసుకొనే
అవకాశం రావాలి.

52:36.840 --> 52:40.480
అందుకే, నిన్ను నువ్వు క్షమించుకో ఇక,
గతాన్ని వదిలెయ్యి,

52:40.560 --> 52:42.560
మళ్లీ మొదలుపెట్టు, ఈసారి సరిగ్గా చెయ్యి.

52:44.000 --> 52:46.120
అంతేనా-- ఇక ముద్దాడవచ్చా? అది...

52:46.200 --> 52:48.320
ఇక్కడేం జరుగుతుందసలు?

52:53.480 --> 52:55.400
బాబోయ్.

53:00.480 --> 53:04.080
ఇదేమన్నా గ్రహాంతరవాస షిప్పా?

53:04.680 --> 53:07.240
కాదు. అరోరా ఆస్ట్రేలిస్.

53:07.560 --> 53:09.360
-ఏంటి?
-దక్షిణపు కాంతులు.

53:11.160 --> 53:12.160
ఎవరు?

53:14.080 --> 53:15.280
అంటే, ఇది...

53:15.960 --> 53:19.600
సూర్యుడి అయస్కాంత కిరణాలనుకుంటాను.

53:20.360 --> 53:25.200
అనుకోను-- కాదు, సూర్యుడి గాలి
భూమి అయస్కాంత ప్రభావానికి లోనవుతుంది.

53:25.280 --> 53:27.960
ఆ తరువాత అది అలా
మారి దాని చుట్టూ...

53:28.800 --> 53:31.080
ఇక్కడ చాలా బాగుంది.

53:36.400 --> 53:38.080
నువ్వు అందంగా ఉన్నావు.

53:40.800 --> 53:41.800
సారీ.

53:44.160 --> 53:45.160
పర్వాలేదు.

53:55.840 --> 53:58.080
చూసుకో. మంచి దృశ్యం.

53:59.160 --> 54:00.440
ఇక కుమ్మెయ్యి, రే పైస్.

54:05.160 --> 54:06.440
శెభాష్, ఫిల్!

54:07.480 --> 54:08.640
ఆమెను వదలండి, పిల్లలు!

54:09.400 --> 54:12.280
దీనికి డబ్బులు కూడా ఇవ్వరు!
స్వతహాగా చేస్తున్నాను!

54:12.360 --> 54:15.720
జరుపు! నా ముఖం ముందు నుండి షార్కును తీయు!

54:15.800 --> 54:19.280
-నా పీతలు నాకివ్వు!
-నీకు పీతలు కూడా పెట్టను!

54:19.400 --> 54:20.680
సరే మరి. ఆపండిక!

54:20.800 --> 54:23.480
-అలైనా, వెనెస్సా, వదులు!
-వదలను!

54:23.560 --> 54:27.000
వదులు! అలైనా, ఆపు! ఆపిక!

54:27.080 --> 54:28.920
-నాకు ఈత రాదు!
-వనెస్సా!

54:29.640 --> 54:32.920
కాపాడండి! కాపాడండి! కాపాడండి!

54:33.000 --> 54:35.200
నా చెయ్యి పట్టుకో!
వనెస్సా, చెయ్యి ఇదిగో!

54:35.360 --> 54:38.880
ఆపు! నన్ను కొట్టకు!
నిన్ను కాపాడుతున్నాను.

54:45.320 --> 54:47.000
అవి శవాలు!

56:50.360 --> 56:52.360
సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి
