WEBVTT

00:21.939 --> 00:23.398
తను బతికే ఉన్నాడు!

00:25.359 --> 00:26.360
హేయ్!

00:29.863 --> 00:31.031
నువ్వు కూడా లోపలికి దిగు.

00:52.177 --> 00:53.637
పోలీస్! కదలద్దు!

01:01.103 --> 01:04.022
కలలో మనం పట్టుబడిపోవడం అనేది
ఒక రకమైన రిలీఫ్ కావడం

01:04.105 --> 01:05.899
చాలా దయనీయమైన పరిస్థితి.

01:11.321 --> 01:13.323
జైలులో జీవితకాలం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు

01:13.407 --> 01:14.533
మనలో ఏదో తెలియని మార్పు జరుగుతుంది.

01:14.616 --> 01:17.077
మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూడటం మొదలుపెడతాం,

01:17.160 --> 01:18.787
చాలా నిశితంగా ఇంకా చాలా సూక్ష్మంగా,

01:18.871 --> 01:21.206
మనం కోల్పోబోతున్న ప్రతి జ్ఞాపకాన్ని
మన మెదడు అప్పటికే నిక్షిప్తం చేయడానికి

01:21.290 --> 01:23.542
ఇంకా ఒక వరుసలో పొందుపర్చడానికి ప్రయత్నిస్తుంటుంది.

01:27.629 --> 01:29.923
ఆ తరువాత ప్రతి ఒక్కరూ మనల్ని భిన్నంగా చూడటం గమనిస్తాం.

01:33.135 --> 01:34.428
మీకు ఏమైనా సాయం చేయాలా, మిత్రులారా?

01:37.848 --> 01:39.141
ఈ రోజుని మంచిగా ఆస్వాదించండి.

01:57.284 --> 01:58.577
గుడ్ మార్నింగ్, మిస్టర్ కూపర్.

01:59.953 --> 02:00.996
లాడీ.

02:03.415 --> 02:05.626
నీ ఆట పూర్తయ్యాక ఆఫీసులో మనం కలిసి,

02:05.709 --> 02:06.835
ఒక క్షణం మాట్లాడుకోవాలి.

02:07.503 --> 02:09.630
- దేని గురించి?
- సారీ?

02:10.797 --> 02:14.176
అంటే, నేను ఈ క్లబ్ లో
దాదాపు పది సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నాను,

02:14.259 --> 02:15.844
నువ్వు ఇంతకుముందెప్పుడూ నన్ను ఆఫీసుకి రమ్మనలేదు.

02:15.928 --> 02:18.805
కాబట్టి అది దేని గురించి అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

02:20.641 --> 02:22.559
మనం ఈ సంభాషణని

02:22.643 --> 02:23.810
కాస్త వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలేమో.

02:25.771 --> 02:27.981
నాకు ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చావో
నాకు చెప్పచ్చు కదా, లాడీ?

02:29.233 --> 02:30.526
సరే, చూడు,

02:30.609 --> 02:32.361
ఇది సహజంగానే చాలా సున్నితమైన విషయం

02:32.444 --> 02:36.073
ఇంకా ఈ క్లబ్ లో నీ సభ్యత్వాన్ని ఎంతగా గౌరవిస్తామో
నీకు ఖచ్చితంగా తెలుసు.

02:36.156 --> 02:37.366
సరే, అది వినడానికి మంచిగా అనిపిస్తోంది.

02:37.449 --> 02:40.118
విషయం ఏమిటంటే, బోర్డు సమావేశం జరిగింది, ఇంకా…

02:41.912 --> 02:44.456
నీ ప్రస్తుత సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం మంచిదని భావించాం,

02:44.540 --> 02:45.916
ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ…

02:46.625 --> 02:48.168
పరిష్కారం అయ్యే వరకూ.

02:48.252 --> 02:50.921
- అర్థమైంది.
- అందుకు నిజంగా సారీ, కూప్.

02:51.004 --> 02:53.674
ఈ క్లబ్ లో ఏ బైలాస్ ప్రకారం
నా సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం

02:53.757 --> 02:56.134
మీ బోర్డుకి ఏ చట్టం కల్పిస్తోంది, నాకు చెప్పు?

02:56.218 --> 02:57.928
ఇలా చూడు, కూప్. ఇది నువ్వు అనుకుంటున్నది కాదు.

02:58.011 --> 03:01.181
ఎందుకంటే నాకు సరిగ్గా గుర్తున్నంత వరకూ,
నేను ఎలాంటి నేరాలయినా చేసినట్లయితే,

03:01.265 --> 03:04.560
నిజానికి నేను ఏమీ చేయలేదు, అప్పుడు
ఈ క్లబ్ లిఖితపూర్వకంగా నాకు తెలియజేయాలి

03:04.643 --> 03:06.395
ఇంకా అలాంటి మూడు నోటీసులు ఇచ్చిన తరువాత మాత్రమే

03:06.478 --> 03:08.605
నా సభ్యత్వాన్ని రద్దు చేయడానికి

03:08.689 --> 03:09.690
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

03:09.773 --> 03:11.149
ఒక హత్య కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు.

03:11.233 --> 03:12.359
నేను ఎవరినీ చంపలేదు.

03:12.442 --> 03:14.570
కానీ…ఆ విషయం నాకెలా తెలుస్తుంది?

03:16.864 --> 03:18.699
ఓహ్, నువ్వు చెప్పింది సరైనదే కావచ్చు, లాడీ.

03:18.782 --> 03:21.076
అది తెలుసుకునే అవకాశం లేనేలేదు.

03:21.743 --> 03:23.453
కానీ నువ్వు అనుకుంటున్నట్లు

03:23.537 --> 03:25.831
నేను కిరాతకమైన హంతకుడిని అయ్యే అవకాశమే ఉంటే,

03:26.957 --> 03:29.209
నువ్వు ఇప్పుడు నాతో ఇలా మాట్లాడగలవా?

03:32.796 --> 03:34.131
బకెట్లో బాల్స్ మొత్తం పూర్తి చేస్తాను.

03:34.214 --> 03:35.215
థాంక్స్, మిత్రమా.

05:02.052 --> 05:03.303
మెల్.

05:05.305 --> 05:07.182
హేయ్. ఓహ్, దేవుడా.

05:07.266 --> 05:08.684
ఇంకా నొప్పితో బాధపడుతున్నావా?

05:08.767 --> 05:10.602
నీకు తెలుసా, నేను రోజూ వైకొడిన్ మందులే భోజనంలా తింటున్నా.

05:10.686 --> 05:11.979
ఓహ్, బాగుంది.

05:12.062 --> 05:13.772
పెర్కొసెట్ మత్తుమందు వైకొడిన్ తో బాగా పని చేస్తుంది.

05:14.940 --> 05:16.024
నీ సంగతి ఏంటి?

05:17.317 --> 05:19.987
అంటే, కాస్త కోలుకున్నాను.

05:20.863 --> 05:21.864
సరే.

05:21.947 --> 05:23.240
మనం తినడానికి క్రూడైటెస్ తెప్పించాను.

05:23.323 --> 05:24.658
థాంక్యూ.

05:28.495 --> 05:32.207
చెప్పాలంటే, నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడు సర్ ప్రైజ్ అయ్యా.

05:33.834 --> 05:37.337
నీకు ఏం తెలుసా అని ఆలోచిస్తున్నాను.

05:37.880 --> 05:39.548
నాకు ఏం తెలుసా ఏంటి?

05:40.424 --> 05:43.343
నాకు తెలియదు. ఏ విషయమైనా.

05:44.219 --> 05:46.388
నువ్వు ఇక్కడ ఇంకాస్త స్పష్టంగా అడగాలి.

05:46.471 --> 05:48.640
దేవుడా, నువ్వు సాక్ష్యం చెప్పడం లేదు, బార్నీ.

05:54.813 --> 05:55.856
ఇది ఏంటి?

05:55.939 --> 05:57.649
ఇది మీ ఇంటి సేల్ డీడ్.

05:57.733 --> 05:59.735
తన సగం వాటాని నీ పేరున రాసి సంతకం చేశాడు.

05:59.818 --> 06:02.154
నేను దాన్ని నీకు అందించాలి అనుకున్నాను,
కానీ నువ్వే కలుసుకోవాలని అడిగేసరికి…

06:04.198 --> 06:05.532
తనకి జైలు శిక్ష పడుతుందని అనుకుంటున్నాడు.

06:05.616 --> 06:09.036
తను ముందుగా జాగ్రత్త పడుతున్నాడు,
ఆస్తులు నీ చేతుల్లో పెడితే భద్రంగా ఉంటాయని.

06:09.119 --> 06:11.705
- అది తెలివైన పని.
- జైలుకి వెళతానని తను అనుకున్నప్పుడు.

06:12.331 --> 06:14.041
ఏం జరుగుతుందో మనం చెప్పలేము, మెల్.

06:14.124 --> 06:16.668
- ఓహ్, దేవుడా, నా పిల్లల పరిస్థితి.
- పిల్లలు బాగానే ఉంటారు, సరేనా?

06:16.752 --> 06:17.961
నువ్వు కూడా బాగానే ఉంటావు.

06:18.045 --> 06:19.254
అతను గనుక జైలుకి వెళితే.

06:19.755 --> 06:21.006
మీ పిల్లల కాలేజీ నిధులు నీకు ఉంటాయి,

06:21.089 --> 06:22.591
రిటైర్మెంట్ ఆస్తులు అన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి.

06:22.674 --> 06:25.594
నీకు ఆర్థికంగా కష్టంగా ఉంటే,
మీ ఇంటి మీద అప్పు తీసుకోవచ్చు.

06:25.677 --> 06:26.887
విషయం ఏమిటంటే, నీకేం ఇబ్బంది లేదు.

06:34.353 --> 06:36.063
తను ఏదో సమస్యలో చిక్కుకున్నాడు.

06:36.146 --> 06:37.981
అది నాకు తెలుస్తోంది. తన గురించి నాకు తెలుసు.

06:39.733 --> 06:43.237
పాల్ చనిపోవడానికి ముందు నుండే ఏదో జరుగుతోంది.
నేను అది… అది తెలుసుకోలేకపోతున్నాను.

06:43.946 --> 06:46.365
తన ఉద్యోగం పోయినప్పటి నుండి తను ఏం చేస్తున్నాడు?

06:46.448 --> 06:47.741
దాని గురించి నీకు ఏమైనా చెప్పాడా?

06:47.824 --> 06:49.868
అవును. కానీ నాకు చెప్పకుండా దాచినది ఏంటి?

06:52.538 --> 06:54.623
అది నాకు తెలిసినా కూడా,
నేను నీకు చెప్పేవాడిని కానేమో.

06:54.706 --> 06:58.043
- నేను తనకి సాయం చేయాలని చూస్తున్నాను.
- ఆ అవకాశం జారిపోయింది, కాదంటావా?

06:58.126 --> 07:00.045
మన ఇద్దరం ఒప్పుకోవాల్సింది ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో

07:00.128 --> 07:03.090
కూప్ కి సాయం చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, కూప్ మాత్రమే.

07:11.056 --> 07:13.475
- నేను ఇక్కడి నుండి బయటపడాలి. నేను ఉండలేను…
- సరే.

07:14.142 --> 07:16.019
- నాకు విషయాలు చెబుతూ ఉండు.
- నువ్వు కూడా.

07:18.605 --> 07:19.648
బూ!

08:04.443 --> 08:08.197
ఈ గదిలో ఏదో నిరాశ ఆవహించినట్లు ఉంది.
ఎవరికైనా అది అనిపిస్తోందా?

08:10.908 --> 08:11.950
ఆలీ.

08:15.704 --> 08:18.248
ఇలాంటి పరిస్థితులలో, నాకు అనిపిస్తుంది,

08:18.332 --> 08:22.503
సంభాషణ మొదలుపెట్టడానికి
బైపోలార్ వ్యాధి ఉన్న వ్యక్తి ఈ గదిలో ఉండాలి.

08:23.795 --> 08:26.715
ఇప్పుడు, ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని నాకు తెలుసు
ఇంకా మనమంతా ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాం,

08:26.798 --> 08:29.801
కాబట్టి నేను ముందుగా ఒక విషయం బయటకి చెప్పేస్తాను…

08:31.929 --> 08:34.222
అవును, నా మాజీ ప్రియుడితో నేను సెక్స్ చేస్తున్నాను.

08:35.097 --> 08:36.140
సారీ, ఇప్పుడు ఏంటి?

08:37.017 --> 08:38.393
నేను బ్రూస్ తో శృంగారం చేస్తున్నాను.

08:38.477 --> 08:40.145
దేవుడా, ఆలీ.

08:40.229 --> 08:41.772
- నన్ను తప్పుపట్టకు.
- నిన్ను తప్పుపట్టడం లేదు.

08:41.855 --> 08:44.983
- అది చాలా ఘోరమైన ఆలోచన.
- కానీ శామ్ లెవిట్ తో సెక్స్ చేయడం గొప్ప పనా?

08:45.067 --> 08:46.151
నీకు బుద్ధిలేదా?

08:47.236 --> 08:48.904
ఏంటి, వీళ్లకి తెలియదు అనుకుంటున్నావా?

08:48.987 --> 08:51.448
ఈ ఊరిలో ఆ విషయం తెలియని వాళ్లు
ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నావా?

08:51.532 --> 08:53.242
- నీ మందులు వాడటం మానేశావా?
- దేనికి?

08:53.325 --> 08:55.118
నేను సెక్స్ చేయడం కోసం
నా మందులు వాడటం మానేశానంటావా?

08:55.202 --> 08:57.162
నువ్వు మందులు వాడటం లేదా?

08:57.246 --> 09:00.582
అవును! సెక్స్ చేయడం కోసం నా మందులు వాడటం ఆపేశాను!

09:01.416 --> 09:02.751
సరే, కనీసం అది మంచి సెక్స్.

09:04.503 --> 09:06.380
మంచి సెక్స్ కోసం మందులు వాడటం ఎందుకు మానేశావు?

09:06.463 --> 09:09.174
- దేవుడా, టోరీ.
- అది సహేతుకమైన ప్రశ్న.

09:11.510 --> 09:13.011
దీని గురించి నువ్వు కూడా మాట్లాడతావా?

09:13.095 --> 09:14.471
- మాట్లాడను.
- తెలివైన వాడివి.

09:16.473 --> 09:18.225
మందులు వాడితే నాకు భావప్రాప్తి కలగదు.

09:18.308 --> 09:20.185
- నాతో పరాచికాలు ఆడుతున్నావా?
- సరే, అర్థమైంది.

09:20.269 --> 09:22.020
- దాని గురించి మనం మాట్లాడుకోవాలి.
- నీ సెక్స్ జీవితం గురించా?

09:22.104 --> 09:24.022
నువ్వు జైలుకు వెళ్లడం గురించి!

09:31.947 --> 09:34.491
- దాని గురించి నువ్వు మాట్లాడవు.
- అందుకు సరైన కారణం ఉంది.

09:34.575 --> 09:36.243
- ఏంటి?
- ఎందుకంటే నాకు మాట్లాడటం ఇష్టం లేదు.

09:37.828 --> 09:39.913
సరే, అది చాలా గొప్ప నిర్ణయం, ఆండీ.

09:39.997 --> 09:42.332
- ఎక్కడికి వెళ్తున్నావు?
- నా ఉద్యోగానికి.

09:42.416 --> 09:45.294
- బ్రూస్ కూడా అక్కడికి వస్తున్నాడా?
- లేదు, తను నన్ను వదిలేశాడు.

09:45.794 --> 09:47.796
- చెత్తవెధవ.
- అవును.

09:48.922 --> 09:51.133
- నేను తరువాత కలుస్తాను.
- హేయ్, లేదు, ఆగు. నేను కూడా నీతో వస్తాను.

09:52.259 --> 09:53.719
అందరూ ఎక్కడికి వెళ్తున్నారు?

09:53.802 --> 09:55.179
నాన్నా, తను వాయిస్తుంటే చూడాలి అనుకుంటున్నా.

09:55.262 --> 09:56.638
- పద.
- అవును, నేను కూడా వెళతాను.

09:56.722 --> 09:57.890
వెళదాం పద.

09:59.391 --> 10:02.561
సరే, గొప్ప ఆలోచన. పిల్లల్ని బార్ కి తీసుకువెళదాం.

10:03.437 --> 10:09.151
ఎక్కువ కేక్ పొందే అమ్మాయిని కావాలని ఉంది

10:10.194 --> 10:13.530
అతను అలాంటివే ఇష్టపడతాడు
ఎందుకంటే అవి విరిగిపోతే చూడటం అతనికి ఇష్టం

10:13.614 --> 10:14.698
చాలా బాగా పాడుతోంది, కదా?

10:14.781 --> 10:15.908
తను గొప్పగా పాడుతోంది.

10:17.159 --> 10:23.290
అది నిజం అన్నట్లుగా నేను నమ్మిస్తాను,
నేను నమ్మించడంలో దిట్టని

10:23.790 --> 10:30.339
కానీ ఒక రోజు నేను బాధపడినట్లే
నువ్వు కూడా బాధపడతావు

10:30.422 --> 10:37.054
కానీ ఒక రోజు నేను బాధపడినట్లే
నువ్వు కూడా బాధపడతావు

10:37.137 --> 10:43.810
కానీ ఒక రోజు నేను బాధపడినట్లే
నువ్వు కూడా బాధపడతావు

10:43.894 --> 10:45.771
కానీ ఒక రోజు…

10:45.854 --> 10:47.439
సారీ. ఈ పాట…

10:47.523 --> 10:48.690
ఛ.

10:52.528 --> 10:54.071
నాకు పెళ్లి కావాల్సి ఉంది.

10:54.154 --> 10:55.656
ఓహ్, బాబు.

10:55.739 --> 10:57.282
ఇది చాలాకాలం కిందట జరిగిన విషయం.

10:57.366 --> 10:58.825
తను ఏం చేస్తోంది?

10:59.535 --> 11:00.702
తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతోంది.

11:00.786 --> 11:03.247
సరే, అతని పేరు బ్రూస్.

11:04.748 --> 11:06.041
విషయం ఏమిటంటే,

11:07.709 --> 11:10.921
నేను దాన్ని చెడగొట్టుకున్నాను
ఎందుకంటే నాలో ఏదో లోపం ఉంది.

11:11.463 --> 11:12.548
నా మెదడులో.

11:14.341 --> 11:18.637
నిజం చెప్పాలంటే, నేను సరిగ్గా లేను.

11:20.764 --> 11:24.184
కానీ ఈ మధ్య, నాకు ఏం అనిపిస్తోందంటే, బహుశా బ్రూస్ కూడా

11:24.268 --> 11:25.686
నేను అనుకున్నంత సరైన వాడు కాదేమో అని.

11:26.895 --> 11:29.898
ఎందుకంటే, సరైన వ్యక్తి అయి ఉంటే
అతను తిరిగి నా జీవితంలోకి వచ్చి

11:29.982 --> 11:30.983
తరువాత మళ్లీ వదిలేసేవాడు కాదు.

11:31.066 --> 11:33.819
సరైన వ్యక్తి అయితే

11:33.902 --> 11:36.280
అతనికి ఇష్టమైన 'హోల్, లివ్ త్రూ దిస్' రికార్డుని
తిరిగి తీసుకునే వాడు,

11:36.363 --> 11:39.825
దాన్ని నేను, అంటే, దాదాపు పది సంవత్సరాల పాటు
నా దగ్గరే భద్రంగా దాచుకున్నాను.

11:39.908 --> 11:43.495
ఆ పదేళ్ల కాలంలోనే నాకంటూ ఉన్నవన్నీ నేను కోల్పోయాను.

11:43.579 --> 11:44.872
ఒక్క నువ్వు తప్ప, ఆండీ.

11:49.751 --> 11:50.919
అతను నా అన్నయ్య.

11:56.758 --> 11:58.552
నువ్వు నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. ఒక్కసారి కూడా.

12:00.637 --> 12:01.763
నా ప్రాణాన్ని కాపాడావు.

12:03.056 --> 12:05.267
నన్ను నువ్వు చూసుకున్నంత భద్రంగా

12:05.350 --> 12:08.562
నిన్ను కూడా ఎవరైనా బాగా చూసుకునే ఒకరు దొరకాలని
కోరుకుంటున్నాను ఎందుకంటే

12:08.645 --> 12:09.855
ఇప్పుడు నీకు అవసరం.

12:13.567 --> 12:15.986
ఏది ఏమైనా, బ్రూస్ నా ఫోన్లకి బదులు ఇవ్వడం లేదు.

12:16.069 --> 12:17.988
అది సరైనది కాదు.

12:20.365 --> 12:21.742
అవును, నేను పిచ్చిదాన్ని కావచ్చు,

12:21.825 --> 12:27.289
కానీ భార్యా, పిల్లలు ఉన్న అతను బైపోలార్ రోగి అయిన
మాజీ ప్రియురాలితో ఆమె మేనల్లుడి మంచం మీద సెక్స్ చేయాలని

12:27.372 --> 12:28.540
నిర్ణయించుకున్న తనే నిజానికి పిచ్చివాడు.

12:28.624 --> 12:29.666
- ఓహ్, దేవుడా.
- ఏంటి?

12:29.750 --> 12:30.876
ఓహ్, చెత్త.

12:31.835 --> 12:34.421
అది అసహ్యంగా అనిపిస్తుందని
ఇంకా తప్పని కూడా నాకు తెలుసు,

12:34.505 --> 12:37.716
కానీ అది అతని నిజాయితీ అనీ, అతని ప్రేమ నిజం అనీ నమ్మాను.

12:38.467 --> 12:39.635
కానీ ఇప్పుడు నేను…

12:39.718 --> 12:41.553
అతను నన్ను వాడుకుంటున్నాడని నాకు అర్థమైంది.

12:44.139 --> 12:45.432
అది నేను భరించలేను.

12:51.605 --> 12:53.315
నేను ఎవరికీ ఉంపుడుగత్తెని కాను.

12:53.398 --> 12:56.318
- బ్రూస్ ఒక వెధవ.
- సరే.

12:57.402 --> 12:58.403
అవును.

12:58.487 --> 13:00.822
అవును, వాడిని వదిలేయ్!

13:00.906 --> 13:03.534
- వాడికి నిన్ను పొందే అర్హత లేదు! నువ్వు మంచిదానివి!
- బ్రూస్ ఒక వెధవ!

13:03.617 --> 13:06.119
అదే సరైనది. బ్రూస్ ని వదిలేయ్!

13:06.203 --> 13:08.038
- బ్రూస్ ని వదిలేయ్.
- బ్రూస్ ని వదిలేయ్.

13:08.121 --> 13:12.376
బ్రూస్ ని వదిలేయ్! బ్రూస్ ని వదిలేయ్! బ్రూస్ ని వదిలేయ్!

13:12.459 --> 13:15.212
బ్రూస్ ని వదిలేయ్! బ్రూస్ ని వదిలేయ్!

13:15.295 --> 13:17.965
బ్రూస్ ని వదిలేయ్! బ్రూస్ ని వదిలేయ్!

13:18.048 --> 13:19.174
బ్రూస్ ని వదిలేయ్!

13:25.055 --> 13:26.849
చూడు, నీ మంచం నాకు ఇవ్వనవసరం లేదు.

13:26.932 --> 13:29.309
- నేను సోఫాలో పడుకోగలను.
- ఫర్వాలేదు.

13:29.393 --> 13:31.061
ఎలాగైనా నేను సాధారణంగా చివరికి అక్కడే పడుకుంటాను.

13:31.144 --> 13:32.688
సరే. అయితే, నువ్వు ఎలా అంటే అలా.

13:34.940 --> 13:36.942
అయితే బార్ లో ఈ రాత్రి చాలా జరిగింది కదా, హా?

13:37.025 --> 13:38.735
అవును, గందరగోళం అయింది.

13:38.819 --> 13:40.362
నువ్వు బాగానే ఉన్నావా?

13:40.445 --> 13:42.239
అనుక్షణం మారిపోతుంటుంది.

13:49.621 --> 13:51.373
- నా మందులు వేసుకుంటాను.
- వేసుకోగలవా?

13:51.456 --> 13:52.457
ఇది స్వేఛ్చా దేశం.

13:55.586 --> 13:58.046
చూడు, ఆలీ, నా విషయంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు.

13:59.506 --> 14:02.092
భవిష్యత్తు ఆశాజనకంగా లేదు.

14:03.886 --> 14:06.930
నువ్వు బాగానే ఉంటావని నాకు తెలియాలి, ఇంకా పిల్లలు కూడా…

14:08.056 --> 14:09.433
వాళ్లకి నీ సాయం అవసరం.

14:12.060 --> 14:13.228
ఆండీ…

14:14.897 --> 14:15.898
నీ మందులు వాడు.

14:18.609 --> 14:19.693
ప్లీజ్.

14:48.138 --> 14:49.556
- హేయ్.
- హేయ్.

14:51.433 --> 14:52.684
ఆ మ్యూజిక్ నీ సొంతదేనా?

14:53.477 --> 14:55.604
అవును, ఆ పని మీదే ఉన్నాను.

14:57.481 --> 14:58.732
ముచ్చటగా ఉంది.

15:00.442 --> 15:01.777
ఈ రాత్రి నీకు సరదాగా గడిచిందా?

15:02.277 --> 15:04.446
అవును, తను అద్భుతంగా పాడింది.

15:06.114 --> 15:07.241
తను చాలా ప్రత్యేకం.

15:10.160 --> 15:11.620
నీకు ఒకటి చూపిస్తాను.

15:14.289 --> 15:15.457
ఈ వాచీ చూశావా?

15:17.042 --> 15:19.461
ఇది నువ్వు పుట్టిన సంవత్సరంలో కొన్నాను.

15:20.295 --> 15:21.713
అప్పుడు నీ వయసు సుమారు మూడు నెలలు.

15:24.132 --> 15:25.592
టోరీకి మూడేళ్లు…

15:26.927 --> 15:29.763
అప్పుడు ఉద్యోగంలో పరిస్థితులు బాగుండేవి కావు…

15:31.932 --> 15:35.435
అప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను

15:35.519 --> 15:38.313
ఎందుకంటే నా శక్తికి మించిన బాధ్యతల్ని
మోస్తున్నానేమో అనిపించింది.

15:38.397 --> 15:41.650
అంటే, అప్పుడే నేను ఇద్దరు అందమైన పిల్లల్ని
ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చాను

15:41.733 --> 15:45.487
ఇంకా వాళ్లకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి,

15:46.280 --> 15:48.991
ఎలా పోషించాలి, వాళ్లని భద్రంగా ఎలా చూసుకోవాలి,
అవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని.

15:49.074 --> 15:52.244
ఆ సమయంలో ఒక జ్యుయెలరీ స్టోర్ లో ఈ వాచీని చూశాను,

15:53.036 --> 15:57.499
ఇది చాలా చాలా ఖరీదైనది
ఇంకా ఈ వాచీని కొంటే మీ అమ్మ నన్ను చంపేస్తుందని తెలుసు

15:58.083 --> 16:00.419
కానీ, నేను కొన్నాను.

16:01.461 --> 16:05.215
నాకు భయం లేదనే ఫీలింగ్ కోసం, లేదా
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించాను.

16:06.383 --> 16:08.510
మనం సాధించేవరకూ ఆ భ్రమలోనే ఉండాలి,
నా ఉద్దేశం నీకు అర్థమైందా?

16:12.347 --> 16:15.267
ఏది ఏమైనా, ఈ రోజుల్లో పిల్లలు
వాచీలు పెట్టుకోవడం లేదని నాకు తెలుసు,

16:15.350 --> 16:18.103
కానీ ఏదో ఒక రోజు నువ్వు పెట్టుకుంటావేమో,
కాబట్టి నువ్వు ఇది తీసుకోవాలని నా కోరిక.

16:27.362 --> 16:29.698
కొన్నిసార్లు నేను కూడా నీలాగే చేస్తుంటాను.

16:29.781 --> 16:31.074
ఏంటి?

16:31.158 --> 16:34.494
- అంటే, ఏదైనా సాధించేవరకూ ఆ భ్రమలోనే ఉండాలి.
- అవును.

16:34.578 --> 16:36.163
కానీ, ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ

16:36.246 --> 16:38.749
దాదాపు అదే భ్రమలో ఉన్నారని
ఏదో ఒక రోజు నువ్వు గ్రహిస్తావు.

16:38.832 --> 16:40.667
అప్పుడు ఆ వాస్తవాలు నిన్ను చాలా భయపెడతాయి.

16:42.628 --> 16:43.629
ఆ వాచీ పెట్టుకో.

16:49.384 --> 16:50.385
ఇదిగో.

16:51.220 --> 16:52.387
నాకు నచ్చింది.

16:53.263 --> 16:55.516
మంచిది. నీకు పట్టేలా దీని సైజు తగ్గిద్దాం.

16:58.393 --> 17:00.270
- ఈ తలుపు మూసేయమంటావా?
- అవును.

17:00.854 --> 17:02.689
- గుడ్ నైట్, బుజ్జీ.
- గుడ్ నైట్.

17:25.878 --> 17:26.880
లోపలికి రా.

17:29.800 --> 17:31.218
- హేయ్.
- హేయ్.

17:32.094 --> 17:33.971
- ఇక్కడ ఎలా ఉంది?
- అంతా బాగానే ఉంది.

17:39.101 --> 17:40.143
అయితే మరి…

17:41.562 --> 17:44.982
ఇందాక విందు సమయంలో, మనం
ఒక విషయం గురించి మాట్లాడుకోవాలని ఆలీ అంది…

17:46.191 --> 17:48.193
దాని గురించి మనం మాట్లాడుకుందామా?

17:49.111 --> 17:50.195
ఆ హత్య నువ్వే చేశావా?

17:50.779 --> 17:52.239
పాల్ లెవిట్ ని నేను హత్య చేశాననా?

17:52.322 --> 17:53.574
లేదు, నేను చేయలేదు.

17:55.409 --> 17:57.327
కంగ్రాట్స్. మనం దాని గురించి మాట్లాడుకున్నాం.

18:00.163 --> 18:01.206
సరే.

18:06.670 --> 18:07.671
గుడ్ నైట్.

18:10.007 --> 18:11.091
గుడ్ నైట్.

18:17.055 --> 18:18.390
శభాష్, బాబు, అతడిని ఓడించావు.

18:19.183 --> 18:20.184
నువ్వు చెప్పింది నిజం, హెన్రీ.

18:21.059 --> 18:22.060
ఇది సరిపోదు.

18:25.814 --> 18:26.899
పోటీ దగ్గరగా వచ్చింది.

18:29.902 --> 18:32.905
సరే, మిత్రులారా. అందరూ ఇక్కడి నుండి త్వరగా వెళ్లండి.

18:32.988 --> 18:35.365
ఈ రాత్రి బోడ్రో హోటల్ లో ఎడీ నుంచి మీ వాటాల్ని తీసుకోండి.

18:41.288 --> 18:42.998
- బాగా చేస్తున్నావు జె.జె.
- నేను…

18:44.166 --> 18:45.167
ఇలా రా.

18:45.250 --> 18:47.419
మీరు లోపలికి వచ్చినప్పుడు
ఫెడరల్ పోలీసులు అనుకున్నాను.

18:47.503 --> 18:50.088
ఏమీ ఇబ్బంది లేదు, హెన్రీ.
స్నైడర్ చాలా గట్టిగా పోరాడాడు.

20:20.512 --> 20:22.639
కూప్, ఇక్కడ ఏం చేస్తున్నావు?

20:23.390 --> 20:24.641
నేరం ఒప్పుకునే ఒప్పందం గురించి చెప్పు.

20:28.604 --> 20:30.230
పొరబాటున చంపామని మనం ఒప్పుకుంటాం, సరేనా?

20:30.314 --> 20:33.358
సాధారణంగా ఆ నేరానికి పదేళ్లు జైలు శిక్ష పడుతుంది,
కానీ ప్రభుత్వ న్యాయవాది త్వరగా గెలవాలని చూస్తున్నాడు,

20:33.442 --> 20:35.110
కాబట్టి నేను ఎనిమిదేళ్లకి శిక్షాకాలాన్ని తగ్గించగలను.

20:35.194 --> 20:36.612
ఎనిమిది సంవత్సరాలా?

20:36.695 --> 20:38.030
నువ్వు ఆరు సంవత్సరాలకి బయటకి వచ్చేస్తావు.

20:38.947 --> 20:40.324
అది పెద్ద విషయమే కాదన్నట్లు చెబుతున్నావు.

20:40.949 --> 20:42.910
మనం దాన్ని పాతికేళ్లు
ఇంకా జీవితకాలపు జైలు శిక్షతో పోల్చి చూడాలి.

20:44.161 --> 20:46.413
చూడు, నువ్వు విచారణకి వెళ్లాలి అనుకుంటే,

20:46.496 --> 20:48.457
వాళ్ల వాదనల్ని తిప్పికొట్టడానికి నేను శాయశక్తులా పోరాడతాను.

20:48.540 --> 20:49.750
కానీ గెలుస్తామన్న ఆశ నీకు లేదు.

20:49.833 --> 20:52.127
హత్యకి మోటివ్, హత్య చేసే అవకాశం,
ఫోరెన్సిక్ ఆధారాలు వాళ్ల దగ్గర ఉన్నాయి

20:52.211 --> 20:53.921
ఇంకా ఆ చెత్త గన్ నీ కారులో దొరికింది.

20:54.630 --> 20:56.882
ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో,
విచారణ ఎదుర్కోవడం రిస్కుతో కూడిన వ్యవహారం.

20:56.965 --> 20:59.384
- ఈ కేసులో…
- సరే, గత ఇరవై ఏళ్లుగా

20:59.468 --> 21:00.761
జీవితాన్ని రిస్కు చేస్తూ గడిపాను.

21:00.844 --> 21:01.970
నేరం ఒప్పుకోవడం నీ పెట్టుబడి.

21:02.054 --> 21:04.681
అది శిక్ష తప్పించుకోవడానికి మార్గం కాదు,
కానీ శిక్ష తగ్గించుకోవడానికి మార్గం.

21:04.765 --> 21:06.642
నేను నిర్దోషిని అని ఎవరైనా గుర్తిస్తారా?

21:06.725 --> 21:07.726
లేదు.

21:09.853 --> 21:11.355
దేవుడా, నా పిల్లలు.

21:12.189 --> 21:14.066
అవును. అది నువ్వు తీసుకోవాల్సిన భయంకరమైన నిర్ణయం.

21:14.149 --> 21:16.360
కానీ, నిజానికి మరో అవకాశం లేదు, కదా?

21:24.493 --> 21:25.494
సరే.

21:26.662 --> 21:27.829
సరే, ఏంటి?

21:28.372 --> 21:29.456
మీటింగ్ ఏర్పాటు చేయి.

21:29.998 --> 21:32.251
మీ ప్రొఫెసర్ నీ గడువుని పొడిగిస్తుందా?

21:32.334 --> 21:34.586
అవును, మిసెస్ డగ్లస్ చాలా మంచి మనిషి.

21:34.670 --> 21:35.963
ఆమెతో రేపు మాట్లాడతాను.

21:36.046 --> 21:38.465
ఈ వారంలో ఆమె నీకు
గడువుని పొడిగించే అవకాశం ఉండదు,

21:38.549 --> 21:39.925
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో…

21:40.634 --> 21:41.927
అవును.

21:42.010 --> 21:44.096
- చక్కని వాచీ.
- థాంక్స్.

21:46.014 --> 21:47.015
హాయ్.

21:49.643 --> 21:51.687
- హాయ్.
- నా పేరు మెల్.

21:51.770 --> 21:53.146
నేను హంటర్ తల్లిని.

21:53.230 --> 21:55.899
- తన పేరు మోర్గన్.
- హాయ్, మోర్గన్.

21:55.983 --> 21:57.276
మోర్గన్.

21:57.359 --> 21:58.527
అడెరల్ మోర్గన్?

21:59.194 --> 22:00.696
- అమ్మా.
- సారీ.

22:00.779 --> 22:02.030
లేదు, ఫర్వాలేదు.

22:02.531 --> 22:04.366
నువ్వు డిన్నర్ కోసం ఉంటున్నావా?

22:05.200 --> 22:06.994
లేదు, థాంక్స్. నేను ఇంటికి వెళ్లాలి.

22:07.077 --> 22:09.913
నిజంగానా? నేను వెజ్ బర్గర్లని చిటికెలో రెడీ చేస్తాను.

22:09.997 --> 22:12.249
మరేం ఫర్వాలేదు. నేను కొద్ది నిమిషాలలో బయలుదేరతాను.

22:13.667 --> 22:15.085
నీ మణికట్టుకి పెట్టుకున్నది ఏంటి?

22:15.169 --> 22:17.337
ఇది నాన్న నాకు ఇచ్చిన వాచీ.

22:17.421 --> 22:19.798
మీ నాన్న నీకు తన డేటోనా వాచీ ఇచ్చాడా?

22:19.882 --> 22:22.050
- అవును.
- ఆయన అలా ఎందుకు చేశాడు?

22:22.801 --> 22:23.927
నాకు తెలియదు.

22:27.973 --> 22:29.516
వస్తున్నా.

22:35.355 --> 22:36.899
- హాయ్.
- నేను లోపలికి రావచ్చా?

22:37.566 --> 22:38.567
తప్పకుండా.

22:44.072 --> 22:45.073
ఏంటి సంగతి?

22:45.157 --> 22:47.367
నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు.

22:47.451 --> 22:50.746
ఈ గది అంతా చిందరవందరగా ఉన్నందుకు సారీ.
ఆలీ తీరు ఒక పెద్ద సమస్య.

22:50.829 --> 22:52.539
నీ డేటోనా వాచీని హంటర్ కి ఎందుకు ఇచ్చావు?

22:52.623 --> 22:54.041
ఎందుకంటే నాకు వేరే వాచీలు ఉన్నాయి.

22:54.124 --> 22:55.834
- నీకు బీరు కావాలా?
- వద్దు, నాకు బీర్ వద్దు.

22:55.918 --> 22:57.836
నువ్వు జైలుకి వెళ్లడం లేదని నా మీద ప్రమాణం చేయాలి.

22:57.920 --> 22:59.755
సరే, నేను చేయగలిగింది చేస్తున్నాను. సరేనా?

22:59.838 --> 23:01.715
దాని ఉద్దేశం ఏంటి? నువ్వు నిర్దోషివి.

23:01.798 --> 23:04.718
అయినా కూడా నీ ఇంట్లో సగం వాటాని నాకు రాసి ఇచ్చేస్తున్నావు.

23:04.801 --> 23:06.637
నీ విలువైన వస్తువుల్ని అందరికీ పంచేస్తున్నావు.

23:06.720 --> 23:07.721
అది పాత వాచీ.

23:07.804 --> 23:10.557
అవన్నీ చెప్పద్దు. నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రేమించి ఉంటే,
ఇప్పుడు నాకు అబద్ధం చెప్పకు.

23:12.976 --> 23:14.269
పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు.

23:16.063 --> 23:17.564
నేరం ఒప్పుకునే డీల్ ని పరిశీలిస్తున్నాం.

23:18.690 --> 23:20.901
- అది ఎలాంటి ఒప్పందం?
- పొరబాటున చంపానని చెప్పాలి.

23:22.194 --> 23:23.612
ఆరు సంవత్సరాలలో బయటకి వస్తాను.

23:23.695 --> 23:26.615
పరాచికాలు ఆడుతున్నావా? ఆరు సంవత్సరాలా?

23:26.698 --> 23:28.492
విచారణలో నేను కేసు ఓడిపోతే, జీవితకాలం శిక్ష అనుభవించాలి.

23:28.575 --> 23:30.744
నువ్వు ఎందుకు ఓడిపోతావు? నువ్వు అతడిని చంపలేదు కదా.

23:30.827 --> 23:33.455
ఎందుకంటే ప్రపంచం అలా ఆలోచించదు, మెల్!

23:34.790 --> 23:36.208
డామిట్!

23:37.918 --> 23:39.962
వాస్తవ ప్రపంచంలో దేనికీ గ్యారెంటీ ఉండదు.

23:40.838 --> 23:43.382
నీకు అర్థమవుతోందా? మనం ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నామా

23:43.465 --> 23:45.592
మొత్తం అంతా మారిపోతుంది.

23:45.676 --> 23:49.137
ఉన్న ఇంటిని, పిల్లల్ని కోల్పోతాం,
సొంత ఇంట్లోనే అపరిచితుల్లా మారిపోతాం,

23:49.221 --> 23:51.348
భార్యకి దూరం అవుతాం, మనల్ని మనమే కోల్పోతాం.

23:54.685 --> 23:56.103
సరే, నా మాట విను.

23:57.145 --> 23:59.898
డేవిడ్ గెల్సన్ తో మ్యాగీ తండ్రి గోల్ఫ్ ఆడుతుంటాడు.

23:59.982 --> 24:02.025
అతను దేశంలోనే అతిపెద్ద లాయరు.

24:02.109 --> 24:04.570
మెడికల్ నిపుణుల డి.ఎన్.ఎ. సాక్ష్యాల్ని తిప్పికొట్టడంలో

24:04.653 --> 24:05.863
ఆయనకి అద్భుతమైన విజయాలు ఉన్నాయి.

24:06.697 --> 24:08.490
ఆయనతో నీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని మ్యాగీ చెప్పింది…

24:08.574 --> 24:10.784
ఆయన కూడా క్యాట్ చేసిన పనినే చేస్తాడు.

24:10.868 --> 24:13.328
అది మనం చెప్పలేము కదా. దేవుడా.

24:13.871 --> 24:16.748
టోరీ ఇంకా హంటర్ జైలులో
నిన్ను సందర్శించాలని కోరుకుంటున్నావా?

24:18.166 --> 24:20.127
హత్య కేసులో జైలుకి వెళ్లిన తండ్రి పిల్లలుగా
అందరూ వాళ్లని చూడాలా?

24:20.210 --> 24:22.588
- అది వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తుంది.
- నాకు అది తెలియదు అనుకుంటున్నావా?

24:22.671 --> 24:24.464
- అయితే, ఆ విషయంలో ఏదో ఒకటి చెయ్యి!
- అదే ప్రయత్నిస్తున్నా!

24:24.548 --> 24:27.176
గట్టిగా ప్రయత్నించు, స్వార్థపరుడా!

24:31.180 --> 24:32.556
దేవుడా.

24:35.893 --> 24:38.145
ఒక సందర్భంలో నువ్వు మమ్మల్ని వదిలేశావు.

24:39.104 --> 24:40.898
లేదు. అలా ఎప్పుడు చేశానో నాకు కనీసం గుర్తులేదు,

24:40.981 --> 24:43.775
కానీ సరిగ్గా అదే సమయంలో

24:43.859 --> 24:45.485
నువ్వు గట్టిగా పోరాడి ఉండాల్సిందని నేను నమ్ముతాను.

24:48.488 --> 24:52.784
నిన్ను నేను నిందించను, నేను కూడా వదిలేశాను.
మన ఇద్దరం ఆ పని చేశాం. మనం విఫలం అయ్యాం, కూప్.

24:53.452 --> 24:55.746
ఇక జీవితాంతం మనం ఆ వేదనతో బతకవలసిందే.

24:56.580 --> 24:58.081
కానీ ఇది, సరిగ్గా ఇప్పుడు,

24:59.791 --> 25:03.420
అలాంటి ఒక సందర్భం ఇది,
నీకు చెబుతున్నాను, వేడుకొంటున్నాను,

25:03.504 --> 25:05.172
ఇప్పుడు నీకున్న శక్తినంతా కూడదీసి

25:05.255 --> 25:07.841
ఖచ్చితంగా పోరాడవలసిన ఈ సందర్భాన్ని వదిలి వెళ్లిపోవద్దు.

25:07.925 --> 25:10.093
- మెల్…
- వద్దు.

25:32.908 --> 25:36.828
అయితే నేను ఇప్పుడే ప్రభుత్వ అటార్నీతో మాట్లాడాను,
కాసేపు మల్లగుల్లాలు పడిన తరువాత,

25:36.912 --> 25:39.414
మనం ఆశించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అనిపించింది.

25:40.374 --> 25:41.458
అది నిజమా?

25:42.251 --> 25:43.919
చూడు, ఇది నీకు నిరాశ కలిగిస్తుందని తెలుసు.

25:44.002 --> 25:45.921
కానీ మనం ఉన్న పరిస్థితులు…

25:46.004 --> 25:47.297
పరిస్థితి ఎలా ఉందంటే

25:47.381 --> 25:50.509
నేను చేయని నేరానికి నన్ను జైలుకి వెళ్లమని
నా లాయరు నాకు సలహా ఇస్తోంది.

25:50.592 --> 25:52.219
నేను ఒక అవకాశాన్ని నీ ముందుంచుతున్నాను, నిజం.

25:52.302 --> 25:53.387
ఆ లోగా,

25:53.470 --> 25:55.514
మన ఇన్వెస్టిగేటర్లు ఈ కేసుని పరిశోధించి

25:55.597 --> 25:57.099
పోలీసులు ఏమైనా ఆధారాల్ని మిస్ అయ్యారేమో చూస్తారు,

25:57.182 --> 25:59.226
అయితే, డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు,
వనరుల కొరత ఉండటం వల్ల,

25:59.309 --> 26:00.310
ఆ ఆధారాలే మనకి కీలకం కావచ్చు.

26:00.394 --> 26:01.645
నేను ఈ ఒప్పందాన్ని ఒప్పుకోలేను.

26:03.730 --> 26:06.733
నువ్వు నన్ను నియమించుకున్న తీరు బట్టి
నేను సరిగ్గా ప్రయత్నించడం లేదని అనుకుంటే గనుక…

26:06.817 --> 26:08.610
ఇది దాని గురించి కాదు.

26:08.694 --> 26:09.778
అదేమీ కాదు.

26:10.988 --> 26:12.865
- నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నా, కూప్.
- నేను కూడా అంతే.

26:13.824 --> 26:16.869
ఈ ఒప్పందం చేసుకుంటే వాళ్లకి ఏం అర్థమవుతుంది?

26:16.952 --> 26:18.620
వాళ్ల కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేంతగా వాళ్లని ప్రేమిస్తావని…

26:18.704 --> 26:19.997
నేను దోషిని అని ఒప్పుకున్నట్లే.

26:20.747 --> 26:23.667
నేను చాలా విషయాలలో తప్పులు చేశాను,
కానీ ఈ హత్య కేసులో మాత్రం నిర్దోషిని.

26:25.169 --> 26:26.211
ఎలాంటి ఒప్పందాలూ వద్దు.

26:27.004 --> 26:28.422
- కూప్…
- ఒప్పందాలు ఏమీ వద్దు.

26:31.592 --> 26:32.718
సరే.

26:33.510 --> 26:35.304
అదే గనుక నీ నిర్ణయం అయితే, మనం అలాగే చేద్దాం.

26:37.055 --> 26:39.099
కానీ ఈ కేసుని వాదించాలంటే
నాకు మరిన్ని వివరాలు చెప్పాలి.

26:39.183 --> 26:40.601
సరే, మొదటి నుండి ప్రారంభిద్దాం.

26:41.685 --> 26:43.187
నేరం జరిగిన ప్రదేశంలో నీ డి.ఎన్.ఎ. ఎందుకు ఉంది?

26:45.522 --> 26:48.233
నేను అక్కడికి తరచు వెళ్తుండేవాడిని.
మా మధ్య సంబంధం ఉంది.

26:48.317 --> 26:50.027
- దాని గురించి అబద్ధం చెప్పావు.
- తను కూడా.

26:50.736 --> 26:52.404
ఆమెని ఎవరైనా ఎందుకు అనుమానించడం లేదు?

26:54.114 --> 26:55.490
ఇవి శామ్ ఫోన్ రికార్డ్స్.

26:55.574 --> 26:58.410
సరే. సెల్ ఫోన్ టవర్ల డేటా ప్రకారం

26:58.493 --> 27:00.370
పాల్ చనిపోయిన రాత్రి ఆమె బోస్టన్ లోనే ఉంది.
ఆమె పేరంట్స్ నిర్ధారించారు.

27:00.454 --> 27:02.039
హెన్రీ పుట్టినరోజు పార్టీ సందర్భంగా తీసిన ఫోటోలు ఉన్నాయి.

27:02.122 --> 27:04.416
ఆమె తన భర్తని చంపించడానికి
కిరాయి హంతకుడిని నియమించి ఉంటుంది.

27:04.499 --> 27:06.084
కానీ ఆ కిరాయి హంతకుడు నువ్వే కావచ్చు కదా.

27:07.294 --> 27:09.129
వాళ్ల మధ్య విడాకుల గొడవలు ఉన్నాయి,

27:09.213 --> 27:11.173
నీ డబ్బు సమస్యలు ఉన్నాయి, పైగా మీరిద్దరూ ప్రేమికులు.

27:11.256 --> 27:13.550
నా ఉద్దేశం, ఇది ఎలాంటి ఊహలకి దారిస్తుందో చూడు.

27:13.634 --> 27:15.302
అయితే ఇందులో నా ఫోన్ కాల్ వివరాలు ఎందుకు లేవు?

27:15.385 --> 27:16.845
ఏంటి?

27:16.929 --> 27:19.389
మేము ఆ సమయం అంతా
ఫోన్లు, మెసేజులు చేసుకుంటూనే ఉన్నాం.

27:19.473 --> 27:21.391
నా ఫోన్ నెంబరు ఇందులో లేదు.

27:23.310 --> 27:24.895
ఆమెకి సంబంధించి నీ దగ్గర ఏ నెంబరు ఉంది?

27:25.854 --> 27:27.105
రెండో ఫోన్ నెంబరా?

27:27.189 --> 27:28.941
అది నిజం. తను బోస్టన్ లో ఒక ఫోను వదిలేసి వచ్చినట్లుంది.

27:29.024 --> 27:31.485
అది తాత్కాలికమైన ఫోన్ నెంబరు,
పైగా ముఖం లేని అశ్లీల ఫోటోలు ఉండుంటాయి.

27:31.568 --> 27:33.904
అవి ఎవరి వక్షోజాలు అయినా కావచ్చు.
అది సరైన సాక్ష్యంగా చెల్లదు.

27:33.987 --> 27:35.656
ఇలా చూడు. ఇవి శామ్ వక్షోజాలు.

27:35.739 --> 27:37.366
దానికి నా సమాధానం, అయితే ఏంటి?

27:37.449 --> 27:40.202
నువ్వు తప్పుడు ఫోన్ నెంబరుతో
ఆమె వేరే చోట ఉందని నిర్ధారించావు.

27:40.285 --> 27:41.620
మేము ఆమె అకౌంట్ ని తనిఖీ చేశాము.

27:41.703 --> 27:43.747
ఆమె తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వివరాలు సరిచూసుకున్నాం.

27:43.830 --> 27:45.582
తల్లిదండ్రులు తమ కూతురి గురించి అబద్ధాలు చెప్పరనా?

27:45.666 --> 27:47.209
- వాళ్లు అబద్ధం చెప్పలేదు.
- కానీ, నేనూ చెప్పడంలేదు.

27:47.292 --> 27:49.670
నాకు గుర్తు చేయండి, ఆఫీసర్ హెర్నాండెజ్,
మీరు ఎన్ని హత్య కేసులు పరిశోధించారు?

27:49.753 --> 27:50.796
సరే, వినండి, మేడమ్…

27:50.879 --> 27:51.922
నన్ను మేడమ్ అని పిలవద్దు.

27:52.005 --> 27:53.215
మీరు రుజువు చేయగలరా…

27:54.508 --> 27:56.260
ఆ వేరే ఫోన్ నెంబరు సమంత లెవిట్ దే అని?

27:56.343 --> 27:57.469
సారీ, కానీ అది మీ పని కదా?

27:57.553 --> 28:00.055
మాకు తోచిన నెంబర్లన్నీ మేము చెక్ చేయలేము కదా.

28:00.138 --> 28:02.558
వారెంట్ తీసుకోవాలి అంటే మేము జడ్జ్ గారి అనుమతి కోరాలి.

28:02.641 --> 28:04.226
- మీ లాయర్ కి అది తెలుసు.
- అయితే వెళ్లి ఆ పని చేయండి!

28:04.309 --> 28:06.395
ఆ ఫోన్ గనుక నా దగ్గర ఉంటే
అప్పుడు అది ఆమెదే అని చెప్పి,

28:06.478 --> 28:09.356
తరువాత నేను ఒక కేసు తయారు చేసి జడ్జ్ నుండి
వారెంట్ తీసుకోగలను. కానీ నా దగ్గర ఆ ఫోన్ లేదు.

28:09.439 --> 28:11.483
నా క్లయింట్ జీవితం రిస్కులో ఉంది.

28:12.234 --> 28:13.443
మీ ఉద్యోగం మీరు చేయండి.

28:15.153 --> 28:16.822
- వెళదాం పద.
- మనం వెళ్తున్నామా?

28:16.905 --> 28:18.240
అవును.

28:19.533 --> 28:20.617
సరే.

28:25.080 --> 28:26.957
కానీ… హేయ్. మనం ఆ ఫోన్ ని సంపాదించాలి.

28:27.040 --> 28:28.959
మనం ఆ ఫోను చుట్టూ కథ నడిపించాం.
కానీ మన దారి మూసుకుపోయింది.

28:29.543 --> 28:31.003
అయితే, ఏంటి? ఇంక అంతేనా?

28:31.086 --> 28:33.255
చూడు, ఆ ఫోన్ మన దగ్గర ఉన్నా కూడా,

28:33.338 --> 28:35.966
ఆ ఫోను మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే
పాల్ ని శామ్ స్వయంగా హత్య చేసినప్పుడే.

28:36.049 --> 28:38.051
కానీ ఆ హత్యని నువ్వు చేశావంటే ఎలా నమ్మలేనో
తను చేసిందన్నా కూడా నమ్మను.

28:38.135 --> 28:41.346
మరి, శామ్ ఆ వేరే ఫోన్ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది?

28:41.430 --> 28:43.807
మీ మధ్య సంబంధం ఉందని మీరిద్దరూ అబద్ధం చెప్పిన
అదే కారణం వల్ల.

28:45.434 --> 28:48.437
చూడు, నేను మా పరిశోధకుల్ని రంగంలోకి దింపుతాను,
కానీ ఆ ఫోను దొరికే అవకాశాలు చాలా తక్కువ.

28:48.520 --> 28:49.521
నేను ఈ ఫోనుకి బదులివ్వాలి.

28:51.023 --> 28:52.024
హేయ్.

28:52.983 --> 28:54.109
అవును.

28:56.945 --> 28:58.780
లేదు, ఆ పైల్స్ నాకు ఇంకా అందలేదు.

29:04.369 --> 29:07.039
తలుపులు మూసుకునే సమయంలో
దారికి దయచేసి అడ్డులెండి.

29:15.506 --> 29:17.174
- ఎలీనా.
- దేవుడా, కూప్.

29:17.257 --> 29:18.967
- ఏంటి ఇది?
- నీతో మాట్లాడాలి, సరేనా?

29:19.051 --> 29:21.136
సారీ, నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను,
కానీ ఫోన్ చేయదల్చుకోలేదు, అందుకే…

29:21.220 --> 29:22.721
అది మంచి ఆలోచన. బహుశా నువ్వు ఆ పనే చేసి ఉండాలి…

29:22.804 --> 29:26.099
సరే! నాకు కేవలం నీ సాయం కావాలి అంతే. ప్లీజ్.

29:26.183 --> 29:27.351
నీకు నేను ఎందుకు సాయం చేయాలి?

29:27.434 --> 29:29.686
నాకు తెలియదు, కానీ ముందుగా,
నువ్వు నా దగ్గర నుంచి కాజేసిన

29:29.770 --> 29:31.188
లక్ష డాలర్ల పైగా డబ్బు గురించి మాట్లాడుకుందాం.

29:32.564 --> 29:35.275
నువ్వు ఈ కేసు నుంచి బయటపడకపోతే
వేరెవరికీ అది దొరకడం నాకు ఇష్టం లేదు.

29:35.359 --> 29:36.818
- నీకు తెలుసా?
- ఇది చాలా పేలవమైన క్షమాపణ.

29:36.902 --> 29:38.779
- నాకు డబ్బు కావాలని నీకూ తెలుసు.
- సరే, చూడు…

29:38.862 --> 29:40.781
నాకు తెలుసు, సారీ. నా పరిస్థితులు
కాస్త ఇబ్బందికరంగా మారాయి, కానీ…

29:40.864 --> 29:43.200
- నిన్ను హత్య కేసులో అరెస్ట్ చేశారు!
- నేను చెప్పినట్లు, కానీ చూడు, నేను…

29:43.283 --> 29:44.785
- హత్య చేశావా? అతడిని చంపావా?
- ఖచ్చితంగా చేయలేదు.

29:44.868 --> 29:47.246
- ఖచ్చితంగా చేయలేదా? నాకు తెలియదు.
- నేను వెళ్లేసరికి అక్కడ శవం ఉంది.

29:47.329 --> 29:48.705
- అయితే నువ్వు అక్కడే ఉన్నావా?
- సరేనా?

29:48.789 --> 29:50.791
- దేవుడా.
- సరే. ముందు ఇక్కడి నుండి వెళ్లిపో, కూప్.

29:59.383 --> 30:00.384
చెత్తవెధవ.

30:00.467 --> 30:02.010
ఏంటి ఇది?

30:04.054 --> 30:05.347
నా తలుపు విరగొట్టావు.

30:06.223 --> 30:07.558
అందుకు సారీ.

30:08.684 --> 30:09.726
నువ్వు బాగానే ఉన్నావా?

30:10.310 --> 30:12.104
దేవుడా, అది కనిపించే దానికన్నా చాలా గట్టిగా ఉంది.

30:12.187 --> 30:13.564
కానీ, నీకు తగిన శాస్తి జరిగింది.

30:17.568 --> 30:19.403
ఆ సమయంలో శామ్ ఇంట్లో ఏం చేస్తున్నావు?

30:20.320 --> 30:21.613
నువ్వు ఏం అనుకుంటున్నావు?

30:22.447 --> 30:23.824
కానీ నువ్వు నన్ను పిలవలేదు కదా?

30:23.907 --> 30:25.075
మనం భాగస్వాములం అనుకున్నాం కదా.

30:25.158 --> 30:28.078
కానీ, నీకు చెప్పానంటే, అది తప్పు అంటావని నాకు తెలుసు.

30:28.161 --> 30:29.413
అప్పుడు నేను చెప్పేది సరైనదే అయి ఉండేది.

30:30.497 --> 30:32.833
నీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనమా? అది చాలా దుర్మార్గం.

30:32.916 --> 30:34.751
కానీ, న్యాయంగా చెప్పాలంటే, తను అప్పటికే నన్ను వదిలేసింది,

30:34.835 --> 30:37.546
కాబట్టి మా మధ్య కాస్త దూరం పెరిగింది.

30:43.051 --> 30:44.052
ఏంటి?

30:47.848 --> 30:50.100
మరి, నువ్వు నాకు సాయం చేస్తావా చేయవా?

30:50.184 --> 30:51.185
అంటే…

30:53.729 --> 30:54.730
ఎలీనా, హాయ్.

30:54.813 --> 30:57.316
హాయ్, మిసెస్ లెవిట్. మీకు కలిగిన విషాదానికి చాలా బాధగా ఉంది.

30:57.399 --> 30:58.442
థాంక్యూ.

30:58.525 --> 31:01.904
నాకు సాయం చేయడానికి నువ్వు ముందుకు రావడం
నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.

31:01.987 --> 31:03.655
- అది…
- ఎస్పెరంజా చాలా షాక్ లో ఉంది

31:03.739 --> 31:05.115
పాల్ ని ఆ స్థితిలో చూసి.

31:05.199 --> 31:08.160
ఇంకా నేను… తనకి చెప్పాను… అంటే,
కోలుకోవడానికి తనకి కావాల్సినంత సమయం తీసుకోమని.

31:08.785 --> 31:11.622
ఇంకా, చూడు, పోలీసులు ప్రతి విషయాలూ ఆరా తీశారు.

31:12.539 --> 31:14.666
ఒక రోజుకి నువ్వు వెళ్లకపోతే నిక్ ఏమీ అనుకోడు అంటావా?

31:15.667 --> 31:17.252
నిక్ ఈ మధ్య ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదు.

31:17.336 --> 31:18.712
సరే.

31:20.506 --> 31:22.216
కొన్ని పనుల కోసం నేను బయటకి వెళ్తున్నాను.

31:22.299 --> 31:23.800
నేను కొద్ది గంటల్లో తిరిగి వచ్చేస్తాను.

31:23.884 --> 31:25.427
నీకు అంతా బాగానే ఉందా?

31:25.511 --> 31:27.721
- ఉంది, మిస్ లెవిట్. నాకేం ఇబ్బంది లేదు.
- సరే, నిన్ను తరువాత కలుస్తాను.

31:27.804 --> 31:29.765
- నీకు మళ్లీ థాంక్స్.
- సంతోషం.

31:44.947 --> 31:46.865
- ఎలా ఉంది?
- అంతా బాగుంది. మనకి కొద్ది గంటలే టైమ్ ఉంది.

31:46.949 --> 31:48.659
సరే. పని కానిద్దాం.

31:49.451 --> 31:51.870
ఆమె ఆ ఫోనుని పడేయకుండా ఉంచుతుందని
ఎలా అనుకుంటున్నావు?

31:51.954 --> 31:53.413
ఎందుకంటే అది ఒక్కటే నన్ను కాపాడుతుంది.

31:56.291 --> 31:57.417
నువ్వు మేడ మీద వెతుకు.

32:22.901 --> 32:24.152
హ్యారీస్ బర్గర్స్ కదా?

32:25.487 --> 32:27.739
"సాస్ ని పక్కన వేయండి" అని వాళ్లకి చెబుతుంటాను,

32:27.823 --> 32:29.408
కానీ అది చెవిటి వాళ్ల ముందు అరిచినట్లే ఉంటుంది.

32:29.491 --> 32:30.951
సాస కదా? అదే వాళ్ల ప్రత్యేకత.

32:31.618 --> 32:33.453
అవును, కానీ అది నా బర్గర్ ని పాడు చేస్తుంది.

32:33.537 --> 32:34.997
నీ డెస్క్ ని కూడా.

32:37.708 --> 32:38.709
ఏం వివరాలు సేకరించావు?

32:38.792 --> 32:40.878
పాల్ లెవిట్ కేసులో మెడికల్ ఎగ్జామినర్ నుండి
తాజా రిపోర్ట్ వచ్చింది.

32:41.670 --> 32:43.213
నేను టీవీ పోలీసులా మాట్లాడుతున్నాను.

32:43.297 --> 32:44.298
నువ్వు దాన్ని తెరవలేదా?

32:44.840 --> 32:46.300
అది నీకు ఉద్దేశించి రాసినది.

32:46.884 --> 32:48.343
నువ్వు దాని మీద కెచప్ అంటించేలా ఉన్నావు.

32:50.846 --> 32:52.389
- అది నీ వేళ్ల మీద ఉంది…
- నోరు మూయ్.

32:52.472 --> 32:53.473
సరే.

32:55.017 --> 32:57.102
మెడికల్ ఎగ్జామినర్
పరిశోధన నివేదిక

32:59.188 --> 33:01.565
- అందులో ఏమైనా కొత్త విషయం ఉందా?
- మూడు గన్ షాట్స్ లో రెండు

33:01.648 --> 33:02.649
చనిపోయాక కాల్చినవి.

33:02.733 --> 33:03.984
దాని అర్థం ఏంటి?

33:34.306 --> 33:35.599
జే మెక్ ఇనెర్నీ రాశాడు,

33:35.682 --> 33:38.477
"నువ్వు మోసగించబడిన తరువాత
ప్రతీదీ ఒక చిహ్నంగా విరుద్ధంగా మారుతుంది" అని.

33:38.560 --> 33:40.354
మీరు గనుక ఏదైనా సింబాలిజమ్ గురించి చూస్తుంటే,

33:40.437 --> 33:42.606
ఇదిగో నేను నా మాజీ ప్రియురాలి ఇంట్లో
దొంగతనం కోసం చొరబడ్డాను

33:42.689 --> 33:44.942
ఇక్కడ ఖచ్చితంగా లేని ఒక ఫోన్ వెతకాడనికి వచ్చాను

33:45.025 --> 33:48.111
శిక్ష నుండి తప్పించుకోవడం కోసం,
అందుకు నేను అర్హుడినో కానో నాకు తెలియదు.

33:50.405 --> 33:53.450
నాకు ఖచ్చితంగా కోపంగా ఉంది ఎందుకంటే
నా పరిస్థితి ఇప్పటికే ఘోరంగా మారినందుకు మాత్రమే కాదు,

33:53.534 --> 33:55.285
ఈ కష్టాన్ని నేను స్వయంగా కొనితెచ్చుకున్నందుకు కూడా.

34:27.025 --> 34:28.110
కూప్.

34:29.735 --> 34:31.487
కూప్. ఇక్కడికి రా.

34:42.748 --> 34:44.001
ఓహ్, దేవుడా!

34:44.083 --> 34:45.168
దేవుడా.

34:45.252 --> 34:46.420
కూప్.

34:46.503 --> 34:48.255
నువ్వు నన్ను చాలా భయపెట్టావు.

34:48.338 --> 34:50.549
పాల్ ని ఎవరూ చంపలేదు.

34:51.884 --> 34:53.051
ఏంటి?

34:53.135 --> 34:54.261
అతనే తనని తను కాల్చుకున్నాడు.

34:55.512 --> 34:56.513
చూడు…

34:56.597 --> 34:59.224
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు,
కానీ నువ్వు వెళ్లిపోవాలి.

34:59.308 --> 35:01.935
కానీ తరువాత నువ్వు అతని శవం మీద
కాల్పులు జరిపి ఉంటావు,

35:02.728 --> 35:04.396
అది హత్యగా కనిపించేలా చేయడం కోసం.

35:05.022 --> 35:06.356
సరే. నువ్వు మతి లేకుండా మాట్లాడుతున్నావు.

35:06.982 --> 35:07.983
ఇది గుర్తుందా?

35:11.403 --> 35:12.821
"డియర్ శామ్. నేను ఘోరమైన తప్పు చేశాను.

35:12.905 --> 35:16.408
నన్ను చులకనగా చూసినందుకు
నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి మాటలు చాలవు,

35:16.491 --> 35:18.577
మన పెళ్లిని పెటాకులు చేశాను,
మన కుటుంబం విడిపోయేలా చేశాను.

35:20.078 --> 35:22.831
ఒక భర్తగా, మగవాడిగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేశాను,
ఇంకా అది ఏదీ కాకపోయినా,

35:22.915 --> 35:24.791
నేను ఇవన్నీ చేయడానికి కారణం
నీ మీద ప్రేమ లేక కాదు.

35:24.875 --> 35:25.876
అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించాను,

35:25.959 --> 35:29.588
అందువల్ల నేను చేసిన తప్పులు
నన్ను విపరీతంగా బాధపెడుతున్నాయి.

35:29.671 --> 35:31.006
ఐ లవ్ యూ.

35:31.089 --> 35:32.090
పాల్."

35:34.301 --> 35:35.302
మనస్ఫూర్తిగా రాశాడు.

35:36.053 --> 35:38.555
చివరిలో తన తప్పు తను తెలుసుకున్నట్లున్నాడు.
పాపం పాల్.

35:38.639 --> 35:39.681
నా ఇంట్లోకి దొంగతనంగా వచ్చావా?

35:39.765 --> 35:42.476
నువ్వు నా కారులో గన్ పెట్టావు.
ఇది అందుకు సరిపోతుంది అనుకుంటా.

35:42.559 --> 35:45.521
నా అంచనా ప్రకారం పాల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో

35:45.604 --> 35:47.523
"ఆత్మహత్యకి బీమా లేదు" అనే షరతు ఏదైనా ఉండచ్చు కదా?

35:51.527 --> 35:55.155
అతను లెక్కలేనన్ని అందమైన మాటలు ఎన్ని చెప్పినా,

35:55.906 --> 35:57.908
పాల్ డబ్బు విషయంలో చాలా తప్పులు చేశాడని తెలిసింది.

35:58.617 --> 36:01.328
విడాకులు తీసుకునే వరకూ నాకు దాని గురించి
పూర్తి అవగాహన రాలేదు.

36:02.496 --> 36:05.582
నేను అనుకున్న దానికంటే
నాకు చాలా తక్కువ మొత్తం డబ్బు వస్తుందని అనిపించింది.

36:06.375 --> 36:07.876
ఇది ఇలాగే జరుగుతుంది.

36:08.627 --> 36:11.880
హై స్కూలులో నువ్వు ఒక అందగత్తెవి,
కానీ ఆరు సంవత్సరాల తరువాత, నువ్వు వెయిట్రెస్ వి

36:11.964 --> 36:14.007
ఎందుకంటే జీవితంలో ఎదగడానికి
ఉపయోగపడే రాయి నాకు బండరాయిగా మారింది.

36:14.675 --> 36:16.218
నేను నా బాస్ తో శృంగారం చేయడం మొదలుపెట్టాను.

36:16.718 --> 36:20.222
ఉద్యోగ భద్రత కోసం కావచ్చు,
లేదా జీవితంలో బోర్ కొట్టడం వల్ల కావచ్చు.

36:21.557 --> 36:23.350
తరువాత ఒక రోజు అతను నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు.

36:24.017 --> 36:25.102
అది నేను ఊహించని పరిణామం,

36:25.185 --> 36:27.771
కానీ నాకు కనిపించింది ఏమిటంటే ఒక సౌకర్యవంతమైన ఇల్లు,

36:27.855 --> 36:31.191
ఆర్థిక భద్రత, ఇంకా "తరువాత ఏంటి?" అని
నిరంతరం ప్రశ్నించే నా మనసుకి

36:31.275 --> 36:33.819
ఎట్టకేలకి కాస్త ప్రశాంతతని కల్పించే అవకాశం.

36:38.031 --> 36:40.409
నేను ఎప్పుడూ వినని ఒక ప్రత్యేకమైన చిన్న ప్రదేశం

36:40.492 --> 36:41.994
వెస్ట్ మాంట్ విలేజ్ లో ఇంటికి మారాం.

36:42.077 --> 36:44.621
దక్షిణ బోస్టన్ ప్రాంతంలో పుట్టి పెరిగితే,
గ్రామాల గురించి మనకి తెలియకపోవచ్చు.

36:44.705 --> 36:45.831
నేను వేరే వ్యక్తుల భార్యల్ని కలిశాను

36:45.914 --> 36:49.042
ఇంకా దక్షిణ బోస్టన్ యాసని వదిలించుకోవడానికి
విపరీతంగా కష్టపడ్డాను

36:49.126 --> 36:50.794
ఇంకా చిరిగిపోయిన జీన్స్ ని ఎలా షాపింగ్ చేయాలో నేర్చుకున్నాను

36:50.878 --> 36:53.672
దాని ధర నా పాత అపార్ట్మెంట్ నెల అద్దెకన్నా
ఎక్కువ అయినా కూడా.

36:54.506 --> 36:56.508
ఇంక ఆ తరువాత, ఆ జీన్స్ బిగుతుగా మారుతుంటాయి

36:56.592 --> 36:59.386
ఇంకా తొమ్మిది నెలల తరువాత: మొదటి బిడ్డ పుట్టింది.

36:59.469 --> 37:00.721
అది నేను ప్లాన్ చేసుకున్నది కాకపోవచ్చు,

37:00.804 --> 37:02.973
కానీ పాల్ తో సెక్స్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి

37:03.056 --> 37:04.349
నేను ప్లాన్స్ ని నమ్మడం మానేశాను.

37:04.433 --> 37:07.936
ఇంకా వేరెవరినీ ప్రేమించనంతగా
ఈ పసికందుని ప్రేమించడం మొదలుపెట్టాను,

37:08.020 --> 37:10.647
అలా కొన్ని సంవత్సరాల తరువాత ఇంకో బిడ్డ పుట్టింది.

37:10.731 --> 37:12.065
ఇంకా కొంత కాలానికి,

37:12.149 --> 37:14.943
నాకు ఒక కుటుంబం ఇంకా స్నేహితులు ఉన్నారు,
జీవితం పరిపూర్ణం అయింది అనిపించింది.

37:15.027 --> 37:17.696
కానీ నా ఆలోచనల్లో మాత్రం నిరంతరం
ఒక ప్రశ్న నన్ను దొలుస్తూ ఉండేది,

37:17.779 --> 37:21.200
కానీ చిన్న గ్జానెక్స్ టాబ్లెట్ ఇంకా రోజ్ వైన్ తో
మనసుకి ఊరట కలిగేది.

37:21.283 --> 37:25.746
కాబట్టి, ఊహలన్నీ ఘోరంగా విఫలమై
ఆత్మగౌరవం కోల్పోయాక,

37:25.829 --> 37:28.248
నేను నా అందరి ఫ్రెండ్స్ ఇంకా ఇరుగుపొరుగు వారి మాదిరిగానే

37:28.332 --> 37:29.917
సంతోషంగా ఉన్నానని నన్ను నేను సమర్థించుకున్నాను.

37:31.084 --> 37:34.963
కొన్ని సంవత్సరాల తరువాత నాకన్నా చిన్న వయసు అమ్మాయి కోసం
పాల్ నన్ను వదిలేశాడు.

37:36.798 --> 37:38.926
పాల్ లో లేని లక్షణాలన్నీ కూప్ లో ఉన్నాయి.

37:39.009 --> 37:44.223
అతను అందగాడు ఇంకా సెక్సీగా, సరదాగా ఉంటాడు,
ఇంకా అతను నన్ను ఎప్పటికీ ప్రేమించడు.

37:44.306 --> 37:46.642
కానీ చూడబోతే బ్రూనెలో క్యూసినెలో పోలో టీషర్టులు వేసుకున్న
మగవాళ్లు కూడా

37:46.725 --> 37:48.852
అందరిలాంటి వాళ్లే అని అర్థమయింది.

37:49.436 --> 37:52.189
కాబ్టటి నేను తిరిగి బోస్టన్ లో
మా అమ్మా, నాన్నల దగ్గరికి పరిగెత్తాను.

37:52.272 --> 37:54.191
ఈ సమస్యలన్నింటి నుంచి నాకు కాస్త బ్రేక్ అవసరమైంది.

37:54.775 --> 37:56.860
కానీ తరువాత నా తలలో ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి,

37:56.944 --> 37:59.112
ఈ సంతోషాల ప్రదేశంలో నేను సర్వస్వం కోల్పోతాననీ

37:59.196 --> 38:01.156
అందరికీ దూరమై గౌరవం కోల్పోతాననీ
నా ఆలోచనలు అరవడం మొదలుపెట్టాయి.

38:03.825 --> 38:08.330
ఆ తరువాత పాల్, విపరీతంగా విస్కీ తాగిన మైకంలో
ఇంకా యాంటీ సైకోటిక్స్ మందులు వాడిన మత్తులో

38:08.413 --> 38:09.748
నా ఇంట్లోకి జొరబడ్డాడు.

38:09.831 --> 38:12.459
ఒక వెయిట్రెస్ తో సెక్స్ చేయడం కోసం
తను వదిలి వెళ్లిపోయిన అదే ఇంట్లోకి ప్రవేశించాడు.

38:12.543 --> 38:14.294
మనం కలిసి ఉండటానికి మరొక అవకాశం ఇవ్వు! ప్లీజ్, బంగారం.

38:14.378 --> 38:15.629
నేను ఎప్పటికీ ఇంక నీతో కలిసి ఉండను.

38:15.712 --> 38:17.798
- నాకు నిన్ను చూడాలని ఉంది.
- నువ్వు నిద్రలేచాక,

38:17.881 --> 38:19.258
నన్ను నువ్వు ఎంతగా ద్వేషించావో ఇంకా, అంటే,

38:19.341 --> 38:21.468
ముప్పై ఏళ్లు పైబడిన ఆడవాళ్లని
ఎంతగా ద్వేషించావో నీకు గుర్తుండేలా చేస్తాను.

38:21.552 --> 38:24.012
నువ్వు నా ఇంట్లో ఉన్నావా? నా ఇంట్లో ఏం చేస్తున్నావు?

38:24.096 --> 38:26.473
- నేను నీ కోసం ఒక లేఖ రాశాను.
- దేని గురించి మాట్లాడుతున్నావు?

38:30.310 --> 38:31.603
ఆగు, పాల్.

38:31.687 --> 38:33.063
నేను ఇక్కడే ఈ పని చేస్తాను! దేవుడి మీద ఒట్టు!

38:33.146 --> 38:34.565
- ఆ గన్ కిందకి దించు.
- దేవుడి మీద ఒట్టు!

38:34.648 --> 38:36.567
ముందు ఆ గన్ ని కిందికి దించు!

38:39.695 --> 38:43.532
పదిహేనేళ్ల పాటు భర్తగా ఉన్న వ్యక్తి
ఫేస్ టైమ్ లో చూస్తుండగానే తలని పేల్చేసుకున్నాడు.

38:43.615 --> 38:45.200
పాల్?

38:45.284 --> 38:46.910
పాల్, ఫోన్ లో మాట్లాడు!

38:46.994 --> 38:48.954
పాల్, ఫోన్ లో మాట్లాడు!

38:50.914 --> 38:52.040
ఓహ్, దేవుడా.

38:56.336 --> 38:58.338
పాల్ కి రెండు కోట్ల డాలర్ల జీవిత బీమా పాలసీ ఉంది.

38:59.214 --> 39:01.508
నాకు ఆ విషయం తెలిసింది ఎలాగంటే
అతను కిందటి ఏడాది పాలసీని రెన్యూ చేయించాడు.

39:02.342 --> 39:05.137
అయితే ఆత్మహత్య చేసుకుంటే ఆ పాలసీ చెల్లదు అని కూడా
దాని వల్ల తెలిసింది.

39:05.804 --> 39:06.805
91

39:10.767 --> 39:13.770
ఆ తరువాత మూడు నాలుగు గంటల పాటు
నేను కదలకుండా ఉండలేకపోయాను

39:14.521 --> 39:17.524
ఎందుకంటే నేను కదలకుండా ఉండిపోతే
ధైర్యం కోల్పోతాననే విషయం నాకు తెలుసు.

39:18.734 --> 39:20.068
నేను నా తాత్కాలికమైన ఫోన్ ని వాడటం మొదలుపెట్టాను

39:20.152 --> 39:22.279
ఎందుకంటే రోజూ వాడే ఫోను ఇంకా పాల్ ప్లాన్ లోనే ఉంది

39:22.362 --> 39:24.656
అందుకే అసూయపడే ఆ పిచ్చివాడికి

39:24.740 --> 39:26.033
కూప్ గురించి తెలియకూడదని వేరే ఫోన్ వాడాను.

39:27.034 --> 39:29.828
ఇంకా ఇప్పుడు, ఆ తాత్కాలికమైన ఫోన్ నాకు ఉపయోపడుతోంది.

39:44.384 --> 39:47.596
అసలు విషయం ఏమిటంటే, ఇది ఆత్మహత్య కాకూడదు.

40:01.610 --> 40:03.445
కూప్
మెలకువగా ఉన్నావా?

40:20.128 --> 40:22.965
బోస్టన్ లో పిల్లలతో ఉన్నాను. గుర్తుందా?

40:46.738 --> 40:48.907
చనిపోతున్నప్పుడు కూడా,
మా డబ్బంతా నష్టపోయేలా చేయాలని చూశాడు.

40:50.075 --> 40:53.120
నేను అతడిని అలా చేయనివ్వలేదు.

40:53.203 --> 40:55.664
నువ్వు పోలీసులని ఆశ్రయించి వాళ్లకి నిజం చెప్పి ఉండాల్సింది.

40:55.747 --> 40:57.332
ఆ జీవిత బీమా నా పిల్లల భవిష్యత్తు.

40:57.416 --> 40:59.668
అందుకని నా జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నావు.

41:00.669 --> 41:02.337
నువ్వు నాతో ఇంకాస్త మంచిగా వ్యవహరించాల్సింది.

41:03.005 --> 41:04.423
ఇది నా జీవితం.

41:04.506 --> 41:05.924
నీకు ఆ అర్హత లేదు!

41:07.551 --> 41:10.137
నువ్వు ఇంకా మిగతా చాలామంది డబ్బు మనుషులు…

41:10.220 --> 41:12.472
మీరంతా చాలా గొప్ప వాళ్లలా తిరుగుతారు,

41:12.556 --> 41:14.433
అంత డబ్బు మీ చేతికి అందేసరికి

41:14.516 --> 41:16.351
ఆ డబ్బు మీ సమర్థతకి రుజువు అన్నట్లుగా వ్యవహరిస్తారు.

41:16.435 --> 41:21.523
కొన్ని సంవత్సరాల పాటు ఆ చెమట కంపు కొట్టే వెధవ
నాతో సెక్స్ చేస్తుంటే నేను భరించాల్సి వచ్చేది.

41:22.274 --> 41:26.403
కేవలం ఇక్కడ ఉండటం కోసం
నేను ప్రతి నిత్యం నా గౌరవాన్ని కోల్పోతూ గడిపాను,

41:26.486 --> 41:29.573
ఈ జీవితం కోసం, నా పిల్లల కోసం, ఇంకా నా కోసం.

41:30.324 --> 41:31.658
కానీ అవన్నీ నేను పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది

41:31.742 --> 41:34.453
ఎందుకంటే పాల్ తన డబ్బుని బ్యాంకులో దాచుకోలేదు

41:34.536 --> 41:35.871
ఇంకా తన పురుషాంగాన్ని అదుపులో పెట్టుకోలేదు.

41:39.708 --> 41:40.918
విషాదం ఏమిటంటే,

41:41.710 --> 41:45.756
నువ్వు ఎంతగా బాధపడుతున్నావో
నాకు తెలుసున్న విషయం నీకు కనీసం తెలియదు.

41:47.674 --> 41:48.800
నాకు తెలుసు.

41:49.551 --> 41:52.221
నువ్వు చెప్పింది నిజమే.
నేను నీతో ఇంకాస్త మంచిగా ఉండాల్సింది.

41:53.472 --> 41:54.932
అందుకు సారీ చెబుతున్నాను.

41:55.641 --> 41:57.267
కానీ నీ కోసం నేను జైలుకి వెళ్లలేను.

41:57.351 --> 42:00.145
ఆగు, మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి.

42:00.229 --> 42:01.855
మనం ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం.

42:02.606 --> 42:03.607
కూప్.

42:04.650 --> 42:05.692
కూ…

42:07.778 --> 42:09.029
కూప్!

42:10.697 --> 42:13.825
దేవుడా, ఇక్కడ అందరూ తుపాకులు వాడటం
ఎప్పటి నుంచి మొదలుపెట్టారు?

42:13.909 --> 42:16.328
- ఎవరో ఒకరు అతడిని చంపి తీరాలి.
- నువ్వు అలా మాట్లాడకూడదు.

42:16.411 --> 42:17.454
నా ఇంట్లో దొంగతనం చేయబోయావు.

42:17.538 --> 42:18.914
నా మీద దాడి చేశావు.

42:18.997 --> 42:21.583
నా భర్తని చంపిన వ్యక్తి నుండి
నన్ను నేను కాపాడుకోవాల్సి వచ్చింది.

42:23.961 --> 42:25.420
నువ్వు ఒక విషయం మర్చిపోయావు.

42:27.089 --> 42:28.090
ఏంటి అది?

42:28.882 --> 42:30.133
నువ్వు కూడా హంతకురాలివి కాదు.

42:32.302 --> 42:33.303
కూప్!

42:34.763 --> 42:36.849
ఆగు! కూప్!

42:37.558 --> 42:39.101
- కూప్!
- ఈ ఊరిలో

42:39.184 --> 42:40.727
ఏదీ ఇంకా ఎవరూ మనం ఏం అనుకున్నామో అది కాదు,

42:41.270 --> 42:44.439
కాబట్టి ఒక హత్య నిజానికి హత్య కాకపోవడంలో
పెద్ద ఆశ్చర్యం లేదు.

42:51.572 --> 42:55.367
నన్ను హత్య కేసులో ఇరికించాలని చూసిన మహిళని
చూసి జాలిపడటం విచిత్రంగా అనిపిస్తుంది…

42:55.993 --> 42:57.494
కుడి వైపు తిరుగు.

43:00.581 --> 43:03.166
కానీ శామ్ తన సొంత ఆస్తిని
దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది అంతే,

43:03.792 --> 43:06.378
ఇంకా ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నంతగా
ఇంకెవరూ అర్థం చేసుకోలేరు.

43:07.880 --> 43:09.965
మనం అందరం ఒకే కలని నమ్ముతాం,

43:10.048 --> 43:12.050
శివారు ప్రాంతాల విలాసాల జీవితాన్ని ఊహించుకుంటాం.

43:12.134 --> 43:14.636
ఇంకా ఒకసారి అక్కడ స్థిరపడిన తరువాత,
అదంతా మన సొంతమే అవుతుందని,

43:14.720 --> 43:15.762
మనం భ్రమపడతాం.

43:16.430 --> 43:18.640
మన పెద్ద దృఢమైన ఇళ్లు
ఎప్పటికీ శాశ్వతంగా మనకి సొంతం అవుతాయని

43:18.724 --> 43:21.226
మనల్ని భ్రమింపజేస్తాయి.

43:21.310 --> 43:24.479
కానీ ఆ కలల పునాదులు బలహీనపడిపోయాయని
తెలుసుకోవడానికి ఎక్కువ లోతుల్లోకి తవ్వనక్కరలేదు.

43:25.856 --> 43:27.566
అది ఒక విస్తారమైన భ్రమ,

43:27.649 --> 43:29.985
ఇక్కడ మెజీషియన్ మనమే, ప్రేక్షకులం కూడా మనమే.

43:30.903 --> 43:33.155
ఇంకా కొన్నిసార్లు ఏది నిజమో ఏది భ్రమో

43:33.238 --> 43:34.907
చెప్పడం కూడా చాలా కష్టమైపోతుంది.

43:47.544 --> 43:50.506
ఇంకా కొన్నిసార్లు చాలా తేలికగా చెప్పగలుగుతాం.

44:06.230 --> 44:07.314
దగ్గరకి రా.

44:25.874 --> 44:28.335
అతడిని నువ్వు శిక్షిస్తావని తెలుసు,
కానీ ముందు ఒప్పందం చేసుకో.

44:28.418 --> 44:29.419
ఒక వారం తరువాత

44:29.503 --> 44:31.338
నిన్ను మళ్లీ పిలవాల్సి రావడం
అతడిని లోలోపల చంపేసి ఉంటుంది.

44:31.421 --> 44:33.632
అతను లూయెన్బర్గర్ పెట్టుబడిని కోల్పోతే,
తరువాత అంతా పతనమైపోతుంది.

44:33.715 --> 44:35.926
తను తప్పు చేశాడని అతనికి తెలుసు.
నా ఉద్దేశం, వాళ్ల అంకెలే కేవలం…

44:36.009 --> 44:38.595
- నాకు ఆ లెక్కలు తెలుసు.
- అవును. సారీ.

44:41.974 --> 44:43.809
అతను వాల్టర్ ని వెర్మోంట్ నుండి ఇంత దూరం రప్పించాడా?

44:43.892 --> 44:45.269
నీకు చెబుతున్నాను…

44:46.228 --> 44:47.855
సరే, థాంక్యూ.

44:56.029 --> 44:57.990
బెయిలీ ఇంకా రసెల్ ఒకే గదిలో ఉన్నారు.

44:58.991 --> 44:59.992
ఇది నాకు దక్కిన గౌరవం.

45:00.993 --> 45:03.161
- నిన్ను చూడటం సంతోషంగా ఉంది, కూప్.
- నేను క్షమాపణలు అడగను.

45:03.245 --> 45:04.329
నీకు నువ్వే గొప్ప అనుకున్నావు.

45:04.413 --> 45:06.498
- నేను ఇక్కడికి నీ క్షమాపణ కోసం రాలేదు.
- మంచిది.

45:06.582 --> 45:07.791
మనం అసలు విషయానికి వద్దాం.

45:07.875 --> 45:09.042
మిస్ క్రాస్ నీకు ముందే చెప్పినట్లు,

45:09.126 --> 45:11.920
నువ్వు వెళ్లిపోయిన దగ్గర నుంచి
లూయెన్బర్గర్ తో మాకు గొడవలు వచ్చాయి.

45:12.004 --> 45:13.172
వాళ్లతో సయోధ్యకి ఎవరిని పంపించినా,

45:13.255 --> 45:16.592
వాళ్లు చేతులు ముడుచుకుని తిరిగి వచ్చేస్తున్నారు.

45:16.675 --> 45:18.886
ఆ స్విస్ వెధవలు కేవలం నీతోనే మాట్లాడతారట.

45:18.969 --> 45:21.138
నువ్వు వాళ్లని బాగా సంతృప్తి పరచాలి.

45:22.514 --> 45:25.893
నీ ఉద్యోగాన్ని మళ్లీ నీకు ఇస్తాము, నీ జీతం నీకు ఇస్తాము,

45:25.976 --> 45:28.520
ఉద్యోగంలో చేరడం కోసం ఇచ్చే బోనస్ ని ఉదారంగా,
నీకు ఎలా కావాలంటే అలా ఇస్తాము.

45:28.604 --> 45:30.397
నువ్వు ఉద్యోగంలో ఉన్నట్లే ఉంటుంది.

45:31.398 --> 45:36.028
కానీ నేను ఉద్యోగం వదిలి వెళ్లిపోయాను, వాల్టర్.
ఈ మనుషుల ముందే జాక్ నన్ను బయటకి గెంటేశాడు.

45:36.111 --> 45:37.654
ఓహ్, ఇంక ఆపు, కూప్.

45:37.738 --> 45:40.449
నేను మూర్ఖుడిని అని తెలియని వాళ్లు
ఇక్కడ ఒక్కరైనా ఉన్నారంటావా?

45:40.532 --> 45:43.660
నన్ను నమ్ము, నువ్వు నీ కష్టం నుంచి
కడిగిన ముత్యంలా బయటకి వచ్చావు.

45:43.744 --> 45:46.663
నాకు లూయిన్బర్గర్ తో లావాదేవీల్లో ఇరవై శాతం,
ఇంకా మొత్తం లాభాల్లో పాతిక శాతం వాటాలు కావాలి.

45:46.747 --> 45:49.041
నోరు మూయ్. స్విస్ లావాదేవీల మీద పన్నెండు శాతం ఇస్తాం.

45:49.124 --> 45:52.711
వాళ్లు మన సంస్థలోకి కొత్తగా పెట్టుబడులు పెట్టిన నాటి నుంచి
లాభాల్లో పదిహేను శాతం వాటా ఇస్తాం.

45:52.794 --> 45:55.756
సరే, లూయెన్బర్గర్ తప్పుకోవచ్చు. హెల్మన్ బెదిరిపోతాడు.

45:56.256 --> 45:58.467
టెక్సాస్ ఆయిల్ వ్యాపారులు ఇది ఒక అవకాశంగా భావిస్తారు,

45:58.550 --> 46:00.928
దాని వల్ల జరిగే నష్టాలు మీరు ఆపాలనుకునే లోపే
వేగంగా జరిగిపోతాయి

46:01.011 --> 46:02.804
అప్పుడు ఈ సంస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

46:02.888 --> 46:04.848
అప్పుడు మాతో పాటు నీ క్యాపిటల్ అకౌంట్ కూడా ఆవిరైపోతుంది.

46:05.349 --> 46:07.476
- నువ్వు సర్వం పోగొట్టుకుంటావు.
- నేను ఇప్పటికే అన్నీ పోగొట్టుకున్నాను.

46:08.602 --> 46:11.480
స్విస్ వాటాల్లో ఇరవై శాతం, మొత్తం లాభాల్లో పాతిక శాతం.

46:11.563 --> 46:14.566
బేరసారాలు ఎలా జరుగుతాయో నీకు అవగాహన లేదనుకుంటా.

46:14.650 --> 46:15.776
నేను బేరాలు ఆడటం లేదు.

46:15.859 --> 46:17.986
నోరు మూయి!

46:18.987 --> 46:20.697
ఇది నా కంపెనీ!

46:20.781 --> 46:23.075
నువ్వు నిలబెట్టుకోలేకపోతే ఇది నీ సొంతం అవ్వదు.

46:26.578 --> 46:30.332
సరే. ఇరవై ఇంకా పాతిక శాతం.
స్విస్ పెట్టుబడులు తెచ్చే షరతు మీదనే.

46:30.415 --> 46:31.416
వెంటనే.

46:31.500 --> 46:33.961
నువ్వు ఇంకా జాక్ ఈ రాత్రికే స్విట్జర్లాండ్ వెళ్లాలి.

46:34.670 --> 46:35.754
ఈ రాత్రి నాకు పని ఉంది.

46:35.838 --> 46:37.881
టేటర్బోరో ఎయిర్ పోర్ట్ నుండి
జెట్ విమానం రాత్రి 11 గంటలకి బయలుదేరుతుంది.

46:37.965 --> 46:39.633
విమానం వివరాల్ని మేరీ నీకు మెసేజ్ చేస్తుంది.

46:39.716 --> 46:42.219
నువ్వు, నేను మిగతా వివరాలు విమానంలో మాట్లాడుకుందాం.

46:42.302 --> 46:43.595
మనం ఈ ఒప్పందాన్ని ఖాయం చేసుకోవచ్చా?

46:49.893 --> 46:50.936
తప్పకుండా.

47:27.806 --> 47:30.517
గుటెన్బర్గ్ క్యాన్సర్ గాలా
ప్రతి సంవత్సరం క్యాన్సర్ పరిశోధన కోసం

47:30.601 --> 47:31.602
లక్షల డాలర్ల విరాళాలు సేకరిస్తుంది.

47:35.606 --> 47:37.941
పీటర్ ఇంకా డయాన్ మిల్లర్
కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థని నిర్వహిస్తున్నారు,

47:38.025 --> 47:40.235
టేబుల్స్ కొనమని, లాటరీ టికెట్లు కొనమని
మా మీద ఒత్తిడి తెస్తుంటారు.

47:40.319 --> 47:42.779
కొంత కాలానికి అది వెస్ట్ చెష్టర్ సోషల్ క్యాలెండర్ లో

47:42.863 --> 47:44.573
అతి పెద్ద వార్షిక వేడుకగా మారిపోయింది.

47:44.656 --> 47:46.950
ఈ వేడుకలో పాల్గొంటే చాలు
మనం చాలా ఉదారంగా ఉంటామని అందరికీ చెప్పినట్లు అవుతుంది,

47:47.034 --> 47:49.244
ఎంత ఉదారత అంటే దానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది,

47:49.328 --> 47:51.288
ఈ సామాజిక ఒత్తిడికీ ఇంకా అందరి మెప్పుపొందడానికి మధ్య
పడే తాపత్రయం వల్ల

47:51.371 --> 47:54.625
మెడికల్ సైన్స్ కూడా అభివృద్ధి చెందుతోంది.

47:54.708 --> 47:58.003
నువ్వు కేసు నుంచి బయటపడినప్పుడు
మేము ఎంత ఊపిరిపీల్చుకున్నామో నీకు తెలియదు.

47:58.086 --> 48:00.631
నువ్వు ఆ హత్య చేశావంటే మేము ఎవరమూ
నమ్మలేదని చెప్పలేను.

48:00.714 --> 48:02.674
పొరపాటున అలా అనేశాను.

48:02.758 --> 48:05.010
ఛ. నాకు దీని గురించి ఎలా మాట్లాడాలో తెలియదు.

48:05.093 --> 48:06.678
మనలో ఎవరికీ తెలియదు. ఫర్వాలేదు.

48:06.762 --> 48:08.555
మనం ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిదేమో?

48:08.639 --> 48:10.349
- సరే.
- అది మంచి ఆలోచన.

48:10.432 --> 48:12.059
- కూప్, హాయ్.
- హాయ్. థాంక్యూ.

48:18.690 --> 48:21.235
నువ్వు చాలా చక్కగా ఉన్నావు. ఓరి బాబోయ్!

48:21.318 --> 48:22.861
థాంక్యూ.

48:22.945 --> 48:24.905
ఇప్పుడు ఇది చూడముచ్చటగా ఉంది.

48:24.988 --> 48:26.573
- నిన్ను కలవడం సంతోషం.
- ఎలా ఉంది?

48:26.657 --> 48:28.033
- నిన్ను చూడు.
- చాలా కాలం అయింది.

48:28.116 --> 48:30.327
- నిన్ను చూడటం బాగుంది. బాగుంది.
- ఓహ్, అవును. గొప్ప టేబుల్.

48:30.410 --> 48:31.411
మంచి టేబుల్.

48:31.495 --> 48:33.205
హేయ్, ఎలా ఉన్నావు? బార్నీ ఎక్కడ?

48:33.288 --> 48:34.665
- ఎక్కడ ఉంటాడు అంటావు?
- ఓహ్, సరే. సరే.

48:34.748 --> 48:35.791
అవును. నిజం.

48:36.416 --> 48:37.960
ఇదిగో ఇక్కడ ఉన్నాడు.

48:38.585 --> 48:39.753
పదో నెంబరు టేబుల్.

48:39.837 --> 48:41.839
హాయ్, చెల్లెమ్మా. ఎలా ఉన్నావు?

48:41.922 --> 48:44.341
- నేను ఇప్పుడే వస్తాను. సరే.
- అలాగే.

48:45.384 --> 48:46.510
హాయ్, మిత్రమా.

48:48.095 --> 48:49.221
సరే,

48:49.304 --> 48:50.931
పార్టీలో అందరికంటే నువ్వే ప్రముఖుడివి అనుకుంట కదా?

48:51.014 --> 48:53.892
అవును. హంతకుడనే ముద్ర వేసి తరువాత
సంఘంలో గౌరవించడం గొప్పగా ఉంది.

48:54.685 --> 48:56.854
హంతకుడివి కానందుకు కంగ్రాట్స్.

49:01.483 --> 49:04.278
అయితే, జాక్ ని ఎప్పుడు కలుస్తున్నావు?

49:04.361 --> 49:05.654
ఇప్పటికే కలిశాను.

49:05.737 --> 49:06.905
నువ్వు కలిశావు.

49:06.989 --> 49:08.574
కానీ నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు?

49:08.657 --> 49:10.075
అంటే, ఇక్కడ నిన్ను కలుస్తామని తెలుసు.

49:10.158 --> 49:11.577
నోరు మూయ్. ఏం అన్నాడు?

49:11.660 --> 49:13.370
కాదనలేనంత మంచి ఆఫర్ అది.

49:14.079 --> 49:15.205
కాదనలేనంత అంటే ఎంత?

49:16.206 --> 49:18.000
- నేను దాని గురించి ఆలోచిస్తున్నా.
- ఆలోచిస్తున్నావా…

49:18.083 --> 49:19.501
అవును, అన్ని రకాలుగా.

49:19.585 --> 49:21.378
ఈ ఆఫర్ గురించి మనం తగినంత సమయం తీసుకుందాం,

49:21.461 --> 49:23.672
మంచి చెడులన్నీ ఆలోచించకుండా
నా పారితోషికంతో సహా అంత ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగంలో

49:23.755 --> 49:26.466
- నువ్వు ఊరికే చేరిపోకూడదు.
- కూప్.

49:26.550 --> 49:28.552
- హేయ్.
- నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది, బాబు.

49:28.635 --> 49:30.429
నిన్ను ఒక్క సెకను కూడా నేను అనుమానించలేదు.

49:30.512 --> 49:32.264
హేయ్. ఈ మనిషికి కొన్ని డ్రింక్స్ అందిద్దాం, హా?

49:32.347 --> 49:33.473
నా దగ్గర ఉంది.

49:33.557 --> 49:34.683
సరే, నీ ఉద్దేశం ఏంటి?

49:34.766 --> 49:36.435
హేయ్, మాకు ఇక్కడ మెకల్లన్ విస్కీ ఇవ్వు, సరేనా?

49:40.647 --> 49:42.232
- ఎక్స్ క్యూజ్ మీ, మిత్రులారా.
- చెప్పు.

49:43.609 --> 49:44.902
హాయ్, మిత్రులారా.

49:44.985 --> 49:46.486
- హలో. హలో.
- హాయ్, నాన్నా.

49:46.570 --> 49:48.113
- హాయ్.
- స్వాగతం. వచ్చినందుకు థాంక్స్.

49:49.239 --> 49:50.657
- హాయ్.
- మెల్.

49:50.741 --> 49:52.451
చాలా చక్కగా ఉన్నావు. హలో, నా పేరు ఆండ్రూ.

49:52.534 --> 49:54.119
- హాయ్.
- నిన్ను కలవడం సంతోషం.

50:11.428 --> 50:13.347
నాకు తెలియదు. అది… తను ఎవరో చూడు.

50:13.430 --> 50:14.890
- హాయ్.
- ఇదిగో ఇక్కడ…

50:14.973 --> 50:16.391
- హాయ్.
- హాయ్.

50:21.688 --> 50:22.689
నువ్వు బాగానే ఉన్నావా?

50:23.232 --> 50:24.274
బాగున్నాను.

50:28.445 --> 50:29.947
ఆ టెన్నిస్ టీమ్ గురించి మర్చిపో.

50:32.157 --> 50:34.368
ప్రిన్స్ టన్ యూనివర్సిటీ గురించి
ఆలోచించడానికి నీకు ఏడాది సమయం ఉంది.

50:39.331 --> 50:41.834
నీకు ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ కోచ్ దగ్గర నేర్చుకోవాలని ఉందా?

50:43.168 --> 50:44.461
నువ్వే నా కోచ్ వి.

50:45.838 --> 50:47.589
నేను ఊరికే అంటున్నాను. నేనే ఉండనక్కరలేదు.

50:48.674 --> 50:50.050
నేను చెబుతున్నాను, నువ్వే నా కోచ్ అని.

50:56.849 --> 50:57.933
థాంక్స్.

50:59.560 --> 51:01.854
చూడబోతే మన కుర్రవాడికి ఒక తోడు దొరికినట్లుంది.

51:07.359 --> 51:08.777
నీ సంగతి ఏంటి? ఎవరినైనా ప్రేమిస్తున్నావా?

51:11.280 --> 51:13.407
ఒకప్పుడు ప్రేమించా. అది పెద్ద చిక్కుముడి.

51:15.409 --> 51:16.618
నన్ను భరించడం కష్టం.

51:17.995 --> 51:19.746
భరించలేనంతగా ఉండటం మంచిదే.

51:19.830 --> 51:21.582
అతను నిన్ను భరించలేకపోతే, వదిలేయ్.

51:21.665 --> 51:23.083
అలాగే.

51:23.166 --> 51:24.418
వాడిని వదిలేయ్.

51:24.501 --> 51:25.502
అలాగే.

51:29.131 --> 51:30.257
సరే. నేను ఇంక వెళ్లాలి.

51:31.300 --> 51:32.593
కానీ నువ్వు ఇప్పుడే కదా వచ్చావు.

51:32.676 --> 51:33.927
వెళ్లిపోవడానికి ఇదే మంచి సమయం.

51:35.804 --> 51:36.972
హేయ్.

51:37.055 --> 51:39.099
తరువాత కలుస్తాను. కండోమ్ వాడు.

51:51.278 --> 51:52.905
- హేయ్.
- హేయ్.

51:52.988 --> 51:55.240
- నీ దగ్గర కూర్చోవచ్చా?
- తప్పకుండా. కూర్చో.

51:55.324 --> 51:57.451
- సరే.
- మేము మళ్లీ వస్తాము.

51:57.534 --> 51:58.619
సరే.

52:01.371 --> 52:03.040
నీతో మాట్లాడటానికి ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

52:03.123 --> 52:04.208
నాకు తెలుసు.

52:04.291 --> 52:06.210
నాకు కాస్త సమయం కావాలి అంతే.

52:06.710 --> 52:08.128
అవును.

52:11.507 --> 52:12.841
చాలా సారీ.

52:15.928 --> 52:17.596
నీకు ఇంకా మంచి వ్యక్తిని పొందే అర్హత ఉంది.

52:18.722 --> 52:19.723
అవును, నాకు అర్హత ఉంది.

52:20.641 --> 52:22.226
కానీ ఇదంతా నాకు నేను స్వయంగా చేసుకున్నదే.

52:26.063 --> 52:29.149
నేను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తోంది.

52:31.485 --> 52:32.653
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?

52:37.574 --> 52:38.575
ఏమీ లేదు.

53:09.982 --> 53:12.067
సరే. ఏమీ మాట్లాడకు. తను వస్తోంది.

53:13.694 --> 53:14.736
తీసేసుకో.

53:14.820 --> 53:16.446
ఏంటి? ఒక నిమిషం ఆగు.

53:16.947 --> 53:18.824
ఓహ్, లేదు. నువ్వు నాతోనే ఉండిపోయావు.

53:20.534 --> 53:21.577
వావ్.

53:25.539 --> 53:26.665
నువ్వు బాగున్నావు.

53:28.667 --> 53:30.544
అది నిజం కాబట్టే నువ్వు ఆ మాట అంటున్నావు.

53:35.674 --> 53:37.176
మీ మధ్య మాటలు ఎలా సాగాయి?

53:38.594 --> 53:40.137
నన్ను క్షమించాడు అనుకుంటా.

53:42.681 --> 53:43.849
అతను నాకంటే మంచివాడు.

53:43.932 --> 53:45.058
సహజంగా.

53:49.062 --> 53:51.773
ఏది ఏమైనా, నేను కొద్ది రోజులు
ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నా.

53:54.067 --> 53:55.277
నువ్వు, నేను, ఇద్దరం.

53:57.654 --> 54:01.200
అన్నట్లు గుర్తొచ్చింది, ఆ రోజు
నేను శామ్ షాపింగ్ చేస్తున్నప్పుడు కలిశాను

54:01.283 --> 54:03.202
అప్పుడు తను ఏమీ జరగనట్లే కనిపించింది.

54:04.703 --> 54:08.832
అంటే, నా ఉద్దేశం, ఆమె అతడిని చంపలేదు,

54:10.125 --> 54:11.877
ఇంకా తను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కూడా
దరఖాస్తు చేయలేదు,

54:11.960 --> 54:14.171
కాబట్టి టెక్నికల్ గా ఎలాంటి మోసం జరగలేదు.

54:15.464 --> 54:20.511
ఆమె లాయరు తనకి కొద్దిపాటి సమాజ సేవ,
ఇంకా జరిమానాతో సరిపెడతారని నా నమ్మకం.

54:22.054 --> 54:24.139
ఆమె నిన్ను జైలుకి పంపించాలి అనుకుంది కూడా.

54:26.016 --> 54:27.267
తనకి తగిన కారణాలు ఉన్నాయి.

54:28.769 --> 54:29.811
హాయ్. నువ్వు ఆమెని క్షమించావా?

54:31.605 --> 54:33.857
నన్ను క్షమించడానికి నీకు రెండేళ్లు పట్టింది.

54:35.734 --> 54:37.444
నేను ఆమెని ప్రేమించలేదు.

54:49.331 --> 54:51.166
నిన్ను ఇక్కడ ఇప్పుడు విడిచిపెట్టేస్తాను.

54:54.795 --> 54:56.505
వాళ్లు ఇంకా విందుని ఏర్పాటు చేయలేదు.

54:56.588 --> 54:58.215
వెళ్లిపోవడానికి ఇదే సరైన సమయం.

55:02.511 --> 55:03.512
హేయ్.

55:04.680 --> 55:05.973
ఎలాంటి సమస్యలు కొనితెచ్చుకోకుండా ఉంటావా?

55:13.647 --> 55:15.482
- నిన్ను మళ్లీ కలుస్తా.
- సరే.

55:15.566 --> 55:17.860
స్వేచ్ఛాజీవి. ఈ మనిషిని చూడు.

55:26.910 --> 55:29.496
- జూల్స్.
- ఓహ్, హేయ్, కూప్.

55:29.580 --> 55:32.165
నువ్వు కేసు నుండి బయటపడ్డావని తెలిసి
మేమంతా చాలా సంతోషించాం.

55:32.958 --> 55:35.169
నా ఉద్దేశం, మేము ఎప్పుడూ నమ్మలేదు, అయినా కూడా.

55:35.252 --> 55:37.880
అవును, జూదంలో నువ్వు అదరగొట్టావని విన్నాను.

55:40.716 --> 55:41.717
నా గురించి నీకు తెలుసు.

55:42.301 --> 55:44.136
నేను కష్టమైనది గెలవాలని కోరుకుంటా.

55:45.637 --> 55:48.390
అయితే, నా గురించి నీకు రహస్య సమాచారం
తెలియనందుకు నేను అదృష్టవంతుడిని అనుకుంటాను.

55:49.183 --> 55:50.601
అంటే, నువ్వు ఎస్.ఎ.టి. విషయంలో చేసిన మాదిరిగా.

55:53.145 --> 55:54.313
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?

55:54.396 --> 55:58.483
అంటే, నువ్వు జాగ్రత్తగా వ్యవహరించానని అనుకుని ఉంటావు
కానీ వార్తలు బయటకి వస్తాయి కదా.

56:00.319 --> 56:03.655
ఆ వార్త అసలైన వాళ్ల చెవిలో పడిందంటే,

56:04.281 --> 56:06.742
చెల్సియా మామూలు కమ్యూనిటీ కాలేజీలో చేరవలసి వస్తుంది.

56:07.826 --> 56:09.661
ఆ విషయం నీకెలా తెలిసింది?

56:11.997 --> 56:13.207
అది నీకు తెలిసే అవకాశం లేదు.

56:13.290 --> 56:15.042
నువ్వు దాన్ని దాచాలన్నా దాచలేవు, జూల్స్.

56:16.752 --> 56:19.338
తమకి ఏం తెలియదో అది తెలుసుకోలేకపోవడం కన్నా
దారుణమైన పరిస్థితి ఇంకేదీ ఉండదు.

56:19.421 --> 56:20.464
నీకు ఏమీ తెలియదు.

56:22.382 --> 56:25.636
కాబట్టి అమెరికాలో అన్ని కాలేజీలలో దేనినైనా ఎంపిక చేసుకో,

56:25.719 --> 56:27.638
కానీ మీ అమ్మాయి మాత్రం ప్రిన్స్ టన్ లో చేరదు.

56:28.430 --> 56:29.681
నన్ను బెదిరిస్తున్నావా?

56:29.765 --> 56:31.266
ఖచ్చితంగా అదే చేస్తున్నాను.

56:47.824 --> 56:48.825
థాంక్యూ.

56:55.832 --> 56:57.459
- థాంక్యూ.
- థాంక్యూ, సర్.

57:24.319 --> 57:25.737
ఇది ఇలాగే జరుగుతుంది.

57:25.821 --> 57:28.699
మనం కోరుకున్న జీవితాన్ని నిర్మించుకోవడానికి
ఎంతో కష్టపడతాం,

57:30.576 --> 57:32.619
కానీ ఆ తరువాత ఏదో ఒక రోజు
ఎవరో వచ్చి దాన్ని తన్నుకుపోతారు.

57:33.829 --> 57:35.664
అప్పుడు కష్టపడి పని చేయడానికీ,
జీవితం కోసం పోరాడటానికీ మధ్య

57:35.747 --> 57:38.083
చాలా వ్యత్యాసం ఉందని తెలుసుకుంటాం.

57:39.710 --> 57:42.880
అంతకుముందు వరకూ మనకి పోరాడే పరిస్థితి రాదు.
ఎలా పోరాడాలో మనకి కనీసం తెలియదు కూడా.

57:42.963 --> 57:45.966
అయినా కూడా మనం పోరాడతాం,
ఇంకా మనకి మనమే ఆశ్చర్యపోయేలా, గెలుస్తాం కూడా.

57:46.049 --> 57:47.176
అప్పుడు ఆ గెలుపు తియ్యగా ఉంటుంది.

57:47.259 --> 57:51.221
అది విముక్తి లాగా ఇంకా రుజువు లాగా
ఇంకా విజయం లాగా ఒకేసారి అనిపిస్తుంది.

57:51.305 --> 57:52.639
కానీ కొన్ని పరిస్థితులు మారిపోతాయి.

57:52.723 --> 57:55.642
నీ పాత జీవితాన్ని ఇంకెప్పుడూ ముందులా చూడలేవు,
దాన్ని ఆస్వాదించలేవు.

57:55.726 --> 57:58.437
అప్పుడు మనం తిరిగి చక్రాల మీద కూర్చుని

57:58.520 --> 57:59.771
మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తాం.

58:06.069 --> 58:09.156
బ్రూస్ ని వదిలేయ్

58:09.239 --> 58:10.616
చెత్త.

58:14.536 --> 58:15.787
సుసీ.

58:16.955 --> 58:18.248
నువ్వు ఏం చేశావు?

58:18.999 --> 58:20.501
- విను…
- వద్దు!

58:20.584 --> 58:22.169
నువ్వు అసలు ఏం చేశావు?

58:27.758 --> 58:29.593
కానీ మన పాత గాయాల్ని మనం తడిమి చూసుకున్న తరువాత

58:29.676 --> 58:33.680
ప్రపంచం మీద కోపం పెంచుకుని
ఇంకా మనకి ప్రియమైన వాళ్లని కాపాడుకునే ప్రయత్నం చేశాక,

58:33.764 --> 58:35.724
మనం అద్దంలో మనల్ని మనం చూసుకుని ప్రశ్నించుకోవాలి

58:35.807 --> 58:37.893
నువ్వు ఒకప్పటి మనిషిగా మళ్లీ ఉండగలవా అని.

58:42.189 --> 58:43.607
ఎందుకంటే కఠినమైన నిజం ఏమిటంటే,

58:43.690 --> 58:45.734
ఒకసారి పరదా వెనుక జరిగే గందరగోళాన్ని చూశాక,

58:45.817 --> 58:48.737
మనం ఏ ప్రదర్శనని కూడా
అంతకుముందులా చూసి ఆస్వాదించలేము.

58:54.368 --> 58:55.536
కానీ సరిగ్గా ఇప్పుడు…

58:56.453 --> 58:58.038
సరిగ్గా ఇప్పుడు,

58:59.623 --> 59:00.999
నేను తిరిగి పనిలో పడాల్సిన సమయం వచ్చింది.

01:00:02.853 --> 01:00:05.189
మీకు లేదా మీకు పరిచయం ఉన్నవారికి
సహాయం అవసరమైతే,

01:00:05.272 --> 01:00:08.609
apple.com/heretohelp వెబ్ సైట్ సందర్శించండి.

01:01:24.351 --> 01:01:26.353
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
