WEBVTT

00:07.174 --> 00:08.425
ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది.

00:09.301 --> 00:14.431
కూప్ ఇంకా శామ్ ఒక బార్ లో, లేదా పార్టీలోనో,
బార్బిక్యూలోనో కలిశారు.

00:15.015 --> 00:16.475
వాళ్లిద్దరి జీవితభాగస్వాములకీ అక్రమ సంబంధాలున్నాయి.

00:16.558 --> 00:18.560
అతను ఆకర్షణీయంగా ఉంటాడు. ఆమె అందంగా ఉంటుంది.

00:18.644 --> 00:20.854
ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు, తాగిన మైకంలో ఉన్నారు.

00:21.605 --> 00:22.773
ఊరికే వశమైపోయే మనిషి.

00:23.690 --> 00:26.527
వాళ్లిద్దరి మధ్య శృంగారం జరగలేదంటే ఆశ్చర్యపోవాలి.

00:27.611 --> 00:30.364
ఆ తరువాత ఎంత కాలం గడిచిందో, నాకు తెలియదు.
మూడు నెలలు, ఆరు నెలలు.

00:30.447 --> 00:34.284
వాళ్లు దాన్ని గోప్యంగా ఉంచారు, అంటే,
మెల్ లేదా పాల్, ఎవ్వరికీ తెలియనివ్వలేదు.

00:35.410 --> 00:36.828
కానీ తరువాత ఆ విషయం పాల్ కి తెలిసిపోయి ఉంటుంది.

00:37.704 --> 00:40.916
అతను కూప్ ని నిలదీసి ఉంటాడు దానితో
కూప్ అతడిని చంపేసి ఉంటాడు.

00:40.999 --> 00:43.460
ఆత్మరక్షణ. వాంఛ కోసం నేరం చేయడం. అలాంటి ఏదో…

00:43.544 --> 00:44.628
ఇది హాస్యాస్పదంగా ఉంది.

00:45.838 --> 00:48.173
ఎవరైనా నాకు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు చూపిస్తే తప్ప,

00:48.257 --> 00:50.425
కూప్ హంతకుడు అని నేను అసలు నమ్మను.

00:50.509 --> 00:52.636
నా ఉద్దేశం, ఇలా చూడు,
అతను మనకి కొన్ని సంవత్సరాలుగా పరిచయం.

00:52.719 --> 00:56.014
అవును, కానీ మరి మనలో ఎవరికీ
అతను శామ్ తో శృంగారం చేస్తున్న సంగతి తెలియదు, కదా?

00:56.098 --> 00:57.140
నేను ఊరికే అంటున్నాను.

00:57.224 --> 00:59.309
కూప్ గురించి అన్ని విషయాలూ మనకి తెలియవు.

00:59.393 --> 01:01.019
లేదా శామ్ కావచ్చు.

01:01.103 --> 01:02.980
పాల్ కొన్ని సంవత్సరాలుగా ఆమెని మోసం చేస్తున్నాడు.

01:03.063 --> 01:06.191
విడాకుల విషయంలో అతను దారుణంగా ప్రవర్తించాడు.
బహుశా ఆమె ఏదో క్షణికావేశంలో అతడిని చంపేసి ఉండచ్చు.

01:06.275 --> 01:09.194
లేదా, సంబంధం లేని వ్యక్తి ఎవరో ఈ పని చేసి ఉండచ్చు.

01:09.695 --> 01:11.280
నా ఉద్దేశం, పాల్ కి ఎవరితో
ఏ గొడవలున్నాయో ఎవరికి తెలుసు?

01:11.363 --> 01:13.490
ఈ సంఘటన జరిగినప్పుడు శామ్
బోస్టన్ లో తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంది.

01:13.574 --> 01:15.325
పోలీసులు ఖచ్చితంగా ఆ విషయం గురించి ఆరా తీసి ఉంటారు.

01:15.409 --> 01:16.493
గ్రేస్, నువ్వు మెల్ తో మాట్లాడావా?

01:16.577 --> 01:18.537
తనకి వాయిస్ మెయిల్ లో మెసేజ్ పెట్టాను.
తరువాత బిజీ అయిపోయాను.

01:18.620 --> 01:21.248
ఓహ్, దేవుడా. అది సరే. బార్నీ ఎలా ఉన్నాడు?

01:21.331 --> 01:24.668
అంటే, తను ఇంటికి వచ్చేశాడు, అది మంచి విషయం అనుకుంటా.

01:25.752 --> 01:28.714
భుజానికి గాయం, పక్కటెముకలో చీలిక, ఇప్పుడు ఇది.

01:28.797 --> 01:31.383
నేను మనశ్శాంతిగా ఉండటం కోసం
తనకి మత్తుమందు ఇస్తున్నాను.

01:32.009 --> 01:34.386
మన ప్రాంతంలో హింసాత్మక ఘటనలు
పెరుగుతున్న విషయం ఎవరైనా గుర్తించారా?

01:34.469 --> 01:35.345
నా ఉద్దేశం, ఎంత దారుణం?

01:35.429 --> 01:36.972
నిన్న రాత్రి నేను మెల్ తో మాట్లాడాను.

01:37.598 --> 01:39.975
అతని మీద ఆమె కోపం వెళ్లగక్కింది, కానీ
అతను నిర్దోషి అని ఆమె కూడా గట్టిగా నమ్ముతోంది.

01:40.058 --> 01:42.102
ఆమె పిల్లలకి అతను తండ్రి. సహజంగా తను నమ్ముతుంది.

01:42.186 --> 01:43.687
అరెస్టు చేసినప్పుడు అతను నిర్దోషిలా కనిపించలేదు.

01:43.770 --> 01:45.272
చేతులకి బేడీలు వేస్తే ఎవరూ నిర్దోషిలా కనిపించరు.

01:45.355 --> 01:48.901
నేను ముందే చెప్పినట్లు, వేరెవరో ఆ హత్య
చేసి ఉంటారు. లేదా ఏదో పొరపాటున జరిగి ఉంటుంది.

01:48.984 --> 01:50.360
హత్య అనేది ఎప్పుడూ పొరపాటుగానే జరుగుతుంది.

01:50.444 --> 01:53.155
రాత్రి భోజనం తరువాత మాట్లాడకూడని
ఏ పనినీ ఎవరూ చేయకూడదు.

01:53.989 --> 01:54.907
ఆస్కార్ వైల్డ్ ఆ మాట చెప్పాడు.

01:55.949 --> 01:57.159
ఏంటి?

01:57.242 --> 01:58.243
మీకు చెబుతున్నాను.

01:58.744 --> 02:01.455
వాళ్లు శృంగారం చేస్తున్నప్పుడు పాల్ చూసి ఉంటాడు,
కోపంతో గొడవపడి ఉంటాడు. అంతే.

02:01.538 --> 02:03.790
పాల్ ఒక చక్కని వెయిట్రెస్ ని ఉంచుకున్నాడు.
అతను ఎందుకు పట్టించుకుంటాడు?

02:03.874 --> 02:06.793
మగవారు హక్కుదారులు అనుకుంటారు.
కొన్ని నియమాలు అనుసరిస్తారు.

02:06.877 --> 02:09.670
అయితే నీ థియరీ ప్రకారం కూప్ ఇంకా శామ్
ఆమె ఇంట్లో సెక్స్ చేసుకుంటున్నారు,

02:09.755 --> 02:12.591
కానీ ఆమె దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో ఉందన్న వాస్తవాన్ని
నువ్వు పట్టించుకోవడం లేదు.

02:12.674 --> 02:16.178
అంత దూరం నుంచి కూడా భౌతిక సూత్రాలకి వ్యతిరేకంగా
వాళ్లు శృంగారం చేసుకుంటుండగా,

02:16.261 --> 02:19.181
ఆ ఇంట్లో నివసించని పాల్,
అక్కడికి వచ్చి వాళ్లని చూశాడంటావు.

02:19.264 --> 02:21.099
ఈ కట్టుకథని నువ్వు అల్లి మాకు చెబుతున్నావు.

02:21.183 --> 02:23.268
కూప్, జీవితంలో ఎప్పుడూ తుపాకీ పేల్చని వాడు,

02:23.352 --> 02:28.357
తనది కాని గన్ అతని దగ్గర ఉంది అంటావు
లేదా అతనికి దగ్గరలో ఉందంటావు ఎందుకంటే

02:28.440 --> 02:30.943
- ఆ సమయంలో అతను ప్యాంట్ వేసుకోలేదు కూడా.
- నా దగ్గర సమాధానాలు ఉన్నాయనలేదు.

02:31.026 --> 02:32.653
వాళ్లు సెక్స్ మిత్రులు.

02:33.153 --> 02:34.905
సెక్స్ మిత్రురాలి కోసం ఎవరూ హత్యలు చేయరు.

02:34.988 --> 02:36.406
అంతకు మించి వాళ్ల మధ్య ఏం ఉందో మనకి తెలియదు.

02:36.490 --> 02:38.075
కూప్, సమంత లెవిట్ ని ప్రేమించడం లేదు.

02:38.158 --> 02:39.409
అది నీకెలా తెలుసు?

02:40.160 --> 02:41.453
ఎందుకంటే అతనికి ఇప్పటికీ మెల్ అంటేనే ప్రేమ.

02:42.621 --> 02:47.292
కూప్ గనుక ఎవరినైనా చంపేవాడే అయితే,
అతను నిక్ ని చాలాకాలం కిందటే చంపి ఉండేవాడు,

02:47.376 --> 02:48.585
కానీ అతను అలా చేయలేదు. ఎందుకో తెలుసా?

02:48.669 --> 02:50.754
ఎందుకంటే కూప్ హత్యలు చేసే రకం కాదు.

02:50.838 --> 02:53.340
ఈ మొత్తం పరిస్థితి అంతుబట్టకుండా ఉంది.

02:53.423 --> 02:58.220
అతను పాల్ సంస్మరణ కార్యక్రమంలో అలా నిలబడి ఉన్నాడు,

02:58.303 --> 03:00.430
అంతా చక్కగా ఉంది అన్నట్లుగా.

03:00.514 --> 03:01.932
ఎందుకంటే అతను ఏ నేరమూ చేయలేదు గనుక.

03:02.015 --> 03:02.850
అది నిజం.

03:06.395 --> 03:07.646
లేదా అతను సంఘవ్యతిరేకి కావచ్చు.

03:08.146 --> 03:10.983
సరే, సుజ్, నిజంగా అంటున్నావా? ఏంటి ఇది… నేను…

03:12.734 --> 03:14.903
అయితే, మనం మిల్లర్ క్యాన్సర్ వేడుకకి
అందరం కలిసే వెళ్తున్నామా?

03:14.987 --> 03:16.864
- ఖచ్చితంగా. నిజం.
- సరే.

05:42.551 --> 05:43.844
మిస్టర్ కూపర్.

05:44.928 --> 05:46.180
మిస్టర్ కూపర్.

05:47.514 --> 05:48.724
ఆండ్రూ కూపర్.

05:49.933 --> 05:50.934
చెప్పండి, యూవర్ హానర్.

05:51.018 --> 05:53.729
మీ లాయరుని సమ్మతించడానికి
మీకు అవకాశం ఇవ్వడం జరిగింది,

05:53.812 --> 05:55.272
ఇంకా మీ మీద అభియోగాల గురించి అవగాహన ఉందా?

05:55.355 --> 05:56.231
ఉంది, యువర్ హానర్.

05:56.315 --> 05:57.816
ఇంకా మీరు నిర్దోషి అని మీరు కోర్టుకి నివేదిస్తున్నారు.

05:57.900 --> 05:59.610
- అవును, యువర్ హానర్.
- అదే రికార్డు అవుతుంది.

05:59.693 --> 06:03.071
లాయర్లూ, ఈ కేసు విచారణ తేదీ కోసం
పక్క గదిలో ఉన్న నా క్లర్క్ ని సంప్రదించండి.

06:03.155 --> 06:05.490
రెండు లక్షల యాభై వేల డాలర్లకి బెయిల్ పొందవచ్చు.

06:31.892 --> 06:32.893
మరి, ఇప్పుడు ఏం జరుగుతుంది?

06:32.976 --> 06:36.021
జడ్జ్ వుడ్ మనకి దాదాపు నెల రోజులు టైమ్ ఇస్తారు,
విచారణకి ముందు మనం ఆధారాలు సేకరించడం కోసం.

06:36.104 --> 06:38.982
ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అంత సమర్థుడు కాడు.
బహుశా ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంటుంది.

06:39.066 --> 06:40.025
నాకు ఎలాంటి ఒప్పందం వద్దు.

06:40.108 --> 06:41.068
నీ ఇష్టం వచ్చింది చేసుకో.

06:41.151 --> 06:43.237
- అతడిని నేను హత్య చేయలేదు, క్యాట్.
- నేను అడగలేదు.

06:43.320 --> 06:44.947
అయితే, మరి ఎందుకు అడగలేదు?

06:47.157 --> 06:48.200
మాకు ఒక నిమిషం టైమ్ ఇస్తారా?

06:53.455 --> 06:55.374
నువ్వు ఎందుకు అడగలేదు? ఎందుకు?

06:55.457 --> 06:56.500
ఎందుకంటే అది ముఖ్యం కాదు.

06:56.583 --> 06:58.877
నన్ను ఇరికించారు, సరేనా?

06:58.961 --> 07:00.963
నేను నీకు చెబుతున్నాను. చాలామంది పాల్ ని ద్వేషించేవారు.

07:01.046 --> 07:03.799
ఈ పనిని శామ్ చేసి ఉండచ్చు, లేదా
మా మధ్య సంబంధం ఉందని తెలిసిన ఎవరైనా చేసి ఉండచ్చు.

07:04.299 --> 07:06.552
నా ఉద్దేశం, నేను ఈ కేసులో పూర్తిగా బలిపశువుని.

07:06.635 --> 07:08.053
వాస్తవ జీవితంలో కేసుల్ని ఇలా గెలవలేము.

07:08.136 --> 07:09.513
- మరి ఎలాగ?
- అంటే, సంప్రదాయం ప్రకారం,

07:09.596 --> 07:11.014
నీ లాయర్ ని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అయితే కాదు.

07:12.057 --> 07:16.103
చూడు, మనం వాళ్ల వాదనని తిప్పికొడతాం,
వాళ్ల విధానాలని తప్పుబడతాం,

07:16.186 --> 07:18.689
సాక్ష్యాధారాల్ని, సాక్షుల విశ్వసనీయతని,
నిపుణుల వాంగ్మూలాలనీ వ్యతిరేకిస్తాం,

07:18.772 --> 07:21.149
అవన్నీ సరిగ్గా చేయగలిగితే,
నీ మీద సానుకూలమైన అభిప్రాయాన్ని ఏర్పరచగలుగుతాం.

07:21.233 --> 07:22.776
అయితే అవన్నీ నువ్వు చేయగలవు అనుకుంటున్నావా?

07:22.860 --> 07:24.653
నీ కారులో గన్ ఉండటం మనకి సమస్య కావచ్చు.

07:24.736 --> 07:26.029
క్యాట్.

07:26.113 --> 07:27.698
నేను కేసు ఓడిపోను, కూప్.

07:31.326 --> 07:32.661
నీ బెయిల్ విషయం పరిష్కారం అయింది.

07:32.744 --> 07:34.997
నేను ప్రాథమిక విచారణకి గురువారం నాడు హాజరుకావాలి.

07:35.080 --> 07:37.624
అంతవరకూ, దయచేసి, ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చకు.

08:02.566 --> 08:04.276
వీటితో పాటు నేను కారులో వెళ్లే అవకాశం ఉందా?

08:20.876 --> 08:21.877
ఆండీ.

08:28.967 --> 08:30.052
థాంక్స్, నాన్నా.

08:52.157 --> 08:54.493
ఇదిగో తీసుకో. నీకు ఆకలి వేస్తుందేమో అని తెచ్చాను.

08:54.576 --> 08:56.495
నీ కోసం టర్కీ శాండ్విచ్ చేశాను.

08:58.372 --> 09:01.959
ఈ మధ్య కాలంలో నువ్వు ఏం తింటున్నావో తెలియదు,
కానీ ఒకప్పుడు దీన్ని నువ్వు ఇష్టపడేవాడివి.

09:12.344 --> 09:13.595
అంతా బాగానే ఉంటుంది.

09:14.179 --> 09:15.556
నాన్నా, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను.

09:20.561 --> 09:23.230
సరే, ముందు ఇంటికి వెళదాం.

09:24.147 --> 09:26.942
నువ్వు స్నానం చేసి కాసేపు నిద్రపోవాలి.

09:29.152 --> 09:30.237
నన్ను మెల్ ఇంటి దగ్గర వదిలిపెట్టు.

09:45.294 --> 09:46.378
నన్ను వేచి ఉండమంటావా?

09:46.461 --> 09:47.963
వద్దు. మరేం ఫర్వాలేదు.

09:48.922 --> 09:51.133
హేయ్, బెయిల్ కి నీకు అంత డబ్బు ఎలా వచ్చింది?

09:51.216 --> 09:52.217
నా రిటైర్మెంట్ అకౌంట్ నుంచి.

09:53.177 --> 09:56.597
నాన్నా, నీ మీద పన్నుల భారం బాగా ఉంటుంది.

09:57.306 --> 09:58.515
అది ఏదైనా కానీ.

10:00.267 --> 10:02.227
సరే. అయితే, నేను ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను.

10:03.061 --> 10:06.815
హేయ్. నీకు అంతకన్నా ముఖ్యమైన పనులు ఉన్నాయి.

10:34.927 --> 10:35.886
ఇక్కడ ఏం చేస్తున్నావు?

10:35.969 --> 10:36.970
ఈ రోజు మంగళవారం.

10:39.431 --> 10:42.851
ఇలా చూడు, మెల్. నేను పిల్లలతో మాట్లాడాలి అనుకుంటున్నాను.

10:43.977 --> 10:45.103
- దేని గురించి?
- నాకు తెలియదు.

10:45.187 --> 10:46.522
బహుశా స్కూలు ఎలా జరుగుతోంది అని అడగచ్చు.

10:46.605 --> 10:48.649
బహుశా వాళ్ల నాన్న ఒక హంతకుడు కాడని చెప్పచ్చు.

10:49.399 --> 10:51.318
- ఇలా చూడు, మెల్. నా గురించి నీకు తెలుసు.
- ఇలా చూడాలా?

10:51.401 --> 10:53.237
నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయనని నీకు తెలుసు.

10:53.320 --> 10:54.488
నాకు ఏమీ తెలియదు.

10:56.448 --> 10:58.700
నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు.
ఎవరితో శృంగారం చేస్తున్నావో తెలియదు.

10:58.784 --> 10:59.952
- కొద్ది రోజుల కిందట…
- నిజంగానా?

11:00.035 --> 11:03.455
…నీ పిల్లలు, నేను చూస్తుండగానే
ఎవరో నిన్ను ఎందుకు కొట్టారో కూడా నాకు తెలియదు.

11:04.581 --> 11:06.416
ఒక హత్య కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావన్నదే నాకు తెలుసు.

11:09.419 --> 11:11.421
కాబట్టి వీటికి భిన్నమైన విషయం ఏదైనా నాకు తెలిసే వరకూ,

11:11.505 --> 11:13.090
నువ్వు ఈ చుట్టుపక్కలకి రావడం నాకు ఇష్టం లేదు.

11:13.173 --> 11:14.466
నువ్వు వాళ్లని ఇంతవరకూ పెట్టిన బాధ చాలు.

11:28.564 --> 11:30.357
ఒకప్పుడు ఇది నా ఇల్లు.

11:32.609 --> 11:35.112
అప్పుడు నా ప్రపంచం అంతా ఇదే.

11:39.950 --> 11:40.909
ఆ అద్భుతమైన ప్రపంచమే నిజానికి,

11:40.993 --> 11:44.162
ఎన్నోసార్లు మన హృదయాలని బాధపెట్టగలుగుతుంది.

11:49.376 --> 11:50.586
హలో?

11:50.669 --> 11:51.753
హలో?

11:53.046 --> 11:54.173
నువ్వు త్వరగా వచ్చేశావు.

11:55.215 --> 11:59.011
వీటిని ఒక మూలకు నెడితే శుభ్రంగా ఉంటుంది అనుకున్నాను,

11:59.094 --> 12:03.348
కానీ నాకు పాత రికార్డులు కనిపించాయి, ఇంకా…
అవును, అవి చాలా ఉన్నాయి.

12:05.309 --> 12:06.310
ఎలా ఉన్నావు?

12:06.935 --> 12:08.937
జైలులో ఒక రాత్రి గడిపినట్లు అనిపిస్తోంది.
నువ్వు ఎలా ఉన్నావు?

12:09.980 --> 12:11.398
నీకు తెలుసు, అదే కథ, అదే కథ.

12:12.399 --> 12:16.278
సరే, కొన్ని చెత్త సంచులు తీసుకుని
ఈ శుభ్రం చేసే పని మొదలుపెడదాం.

12:16.778 --> 12:17.779
సరే.

12:18.780 --> 12:21.658
బహుశా మనం బేస్మెంట్ నుంచి పని మొదలుపెట్టాలేమో
ఎందుకంటే పోలీసులు లోపల చాలా చిందరవందర చేశారు.

12:39.676 --> 12:42.804
పోలీసులకి గనుక ఆ డబ్బు దొరికి ఉంటే,
దాని గురించి పరిశోధన మొదలయ్యేది.

12:43.931 --> 12:47.309
ఆ డబ్బుని ఎవరు దొంగతనం చేశారో
ఆలోచించేంత సమయం నాకు లేదు.

12:47.809 --> 12:49.353
నాకు నా డబ్బు తిరిగి కావాలి.

12:51.939 --> 12:53.732
హేయ్. ఆమె ఎక్కడ ఉంది?

12:53.815 --> 12:56.360
- ఆమె బిజీగా ఉంది. హేయ్!
- లూ! లూ!

12:56.443 --> 12:57.528
నిన్ను కలవడం తనకి ఇష్టం లేదు.

12:57.611 --> 12:58.862
అదంతా లెక్కచేసేవాడిలా కనిపిస్తున్నానా?

12:59.571 --> 13:00.906
నాతో పరాచికాలు ఆడుతున్నావా?

13:00.989 --> 13:01.990
దమ్ముంటే రా.

13:02.491 --> 13:04.243
- రా! రా.
- రావాలా?

13:04.326 --> 13:05.827
దానితో ఏం చేయబోతున్నావు?

13:05.911 --> 13:07.371
దాన్ని కింద పెట్టేయ్, కూప్.

13:08.580 --> 13:10.999
లోపలికి రా. మనం మనుషుల్లా మాట్లాడుకుందాం.

13:12.251 --> 13:13.252
ఇదిగో.

13:18.924 --> 13:20.425
నాకు ఐదు నిమిషాలే సమయం ఉంది.

13:20.509 --> 13:23.720
- పొయ్యి మీద మాంసం ఉడుకుతోంది.
- నా డబ్బు దొంగతనం చేశావా?

13:27.266 --> 13:29.017
నేను ఎవరి డబ్బునీ దొంగతనం చేయను.

13:29.643 --> 13:32.688
నేను ఇక్కడ నా కుర్చీలో కూర్చుంటాను
ఇంకా నీలాంటి వాళ్లు వస్తువుల్ని తీసుకొస్తుంటారు.

13:32.771 --> 13:34.189
కానీ, నా డబ్బుని ఎవరో దొంగిలించారు.

13:34.273 --> 13:36.942
నువ్వు డబ్బు వ్యాపారం చేస్తున్నావు.
అలా జరుగుతుంటుంది.

13:39.069 --> 13:42.322
- క్రిస్టియన్ అంటావా?
- క్రిస్టియన్ తన వాటా తను తీసుకున్నాడు.

13:42.406 --> 13:44.533
- నేను ఎక్కడ ఉంటానో నువ్వు అతనికి చెప్పావు.
- అవును, చెప్పాను.

13:45.367 --> 13:47.536
నిన్ను చంపకుండా అతడిని ఒప్పించిన తరువాత.

13:47.619 --> 13:49.121
లేదంటే అదే జరిగి ఉండేది.

13:49.204 --> 13:51.540
నాకు తెలిసినంత వరకూ,
నువ్వు తక్కువ నష్టంతో బయటపడ్డావు.

13:51.623 --> 13:53.625
- నువ్వు నన్ను హెచ్చరించి ఉండాల్సింది.
- నేను వారించాను.

13:53.709 --> 13:57.462
కళల జోలికి వెళ్లవద్దని చెప్పాను,
కానీ నువ్వు ఏది వినాలి అనుకుంటావో అదే వింటావు.

13:57.546 --> 13:59.423
ఈ ఆటలో కొన్ని నియమాలు ఉంటాయి.

13:59.506 --> 14:01.091
నువ్వు ఆ నియమాలని నేర్చుకోవాలి.

14:01.175 --> 14:03.343
నువ్వు క్రిస్టియన్ ని అగౌరవపర్చావు.

14:03.427 --> 14:05.012
అతను ప్రతిస్పందించాడు.

14:05.095 --> 14:06.722
యాక్షన్ కి రియాక్షన్.

14:06.805 --> 14:08.432
అంతా సమసిపోయింది. అతను ఇంక వ్యాపారం చేసుకుంటాడు,

14:08.515 --> 14:11.268
కానీ నేను విన్న విషయం ఏమిటంటే,
నీకు ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.

14:12.895 --> 14:16.190
నువ్వు ఇప్పుడిప్పుడే
కాస్త డబ్బు గడిస్తున్న సమయంలో ఈ చిక్కుల్లో పడ్డావు.

14:19.234 --> 14:20.444
నా మాంసం మాడిపోతోంది.

14:21.028 --> 14:22.487
హేయ్, నేను ఎవరినీ చంపలేదు.

14:24.448 --> 14:27.075
అది నీ సమస్యని మరింత దయనీయంగా మారుస్తుంది.

14:28.619 --> 14:29.995
ఇక్కడికి మళ్లీ రావద్దు.

15:02.236 --> 15:03.278
ఎలా ఉన్నావు, ఫెలిక్స్?

15:03.779 --> 15:05.447
ఎక్వెడోర్ మనల్ని ఇబ్బంది పెడుతోంది.

15:06.949 --> 15:08.700
చీవో నీకు బాకీ పడిన మొత్తం డబ్బు అది.

15:17.042 --> 15:18.043
ఇది బాగుంది.

15:19.962 --> 15:21.797
పనిమనుషులకి ఇంత పెద్ద జీతాలు ఇస్తారని నాకు తెలియదు.

15:21.880 --> 15:23.841
కావాలంటే నీకు కూడా ఇంట్లో పని ఇప్పిస్తాను.

15:27.928 --> 15:28.929
మన లెక్క సరిపోయిందా?

15:30.681 --> 15:31.557
మళ్లీ కలిసే వరకూ.

15:31.640 --> 15:32.474
లేదు.

15:32.558 --> 15:33.725
మళ్లీ కలిసేది లేదు.

15:33.809 --> 15:35.310
చీవో ఇంక నీ దగ్గర పని చేయడు.

15:38.021 --> 15:40.691
నాకు బ్యాగు నిండా డబ్బు ఇచ్చావు.
అంతమాత్రాన నాతో ఇలా మాట్లాడతావా?

15:41.441 --> 15:42.276
ప్లీజ్, ఫెలిక్స్.

15:42.359 --> 15:44.236
నేను నీ డైపర్లు మార్చాను.

15:45.487 --> 15:47.948
నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు.

15:49.950 --> 15:51.660
నేను జాగ్రత్తగా మాట్లాడితేనే ఇలా ఉంది.

15:58.041 --> 15:59.751
మీ అమ్మకి హాయ్ చెప్పానని చెప్పు.

16:05.507 --> 16:07.217
హేయ్. నువ్వు బాగానే ఉన్నావా?

16:09.219 --> 16:15.392
మనల్ని జనం ఒక జంటగా చూడటం
ఈ మధ్యనే మొదలైంది అనుకున్నాను.

16:15.475 --> 16:16.476
అంతలోనే ఇలా జరిగింది.

16:16.560 --> 16:17.603
నువ్వు ధైర్యంగా తలెత్తుకుని ఉండు.

16:17.686 --> 16:19.229
నువ్వు ఏ తప్పూ చేయలేదు.

16:20.731 --> 16:22.691
పిల్లల్ని కాలేజీకి పంపకుండా ఉండాల్సింది అనిపిస్తుంది.

16:22.774 --> 16:24.526
కానీ, నువ్వు వాళ్లని పంపించలేదు. వాళ్లే వెళ్ళారు.

16:24.610 --> 16:25.986
ఇది కాఫీ షాప్.

16:26.486 --> 16:28.280
హై స్కూలులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు.

16:29.656 --> 16:31.533
వాళ్లని ఇంటికి వచ్చేయమని చెబుతాను.

16:31.617 --> 16:33.785
ఇంటికి రావాల్సి వస్తే, వాళ్లే వస్తారు.

16:43.128 --> 16:46.256
చూడు, చాలా సమయం పడుతోంది.
పద, ఫిల్ రెస్టారెంట్ కి వెళదాం.

16:46.340 --> 16:47.591
మనం దగ్గరగా వచ్చేశాం కదా.

16:47.674 --> 16:51.094
ఈ కాఫీ కోసం మనం ఇంకో పది నిమిషాలు ఎదురుచూడాలి.
పద, వెళదాం.

16:51.178 --> 16:52.596
సరే, సంతోషం.

16:52.679 --> 16:54.473
తను వచ్చింది. అవును.

16:55.557 --> 16:56.850
మిమ్మల్ని తరువాత కలుస్తాను.

17:00.437 --> 17:01.438
నేను కేవలం…

17:02.731 --> 17:06.276
దీని గురించి ఎలా మొదలుపెట్టాలో కూడా
నాకు తెలియడం లేదు.

17:06.359 --> 17:07.944
నేను కేవలం…
ఇది సంక్లిష్టంగా ఉంటుందని తెలుసు కానీ…

17:08.028 --> 17:09.070
ఇది సంక్లిష్టం అంటున్నావా?

17:10.239 --> 17:11.740
- అవును.
- నువ్వు కూప్ తో పడుకున్నావు.

17:12.699 --> 17:13.825
నేను నిక్ తో శృంగారం చేస్తున్నాను.

17:13.909 --> 17:15.536
నువ్వు నిక్ తో శృంగారం చేయాలేమో
ఇంకా నేను ఇంకెవరితో అయినా…

17:15.618 --> 17:17.871
- ఈ గొడవలో నీకు అర్థమైంది ఇదేనా?
- …ఎందుకంటే మనం ఇక్కడ అదే చేస్తాం.

17:17.954 --> 17:19.705
మెల్, కూప్ నా భర్తని హత్య చేశాడు.

17:19.790 --> 17:20.832
అతను ఎవరినీ హత్య చేయలేదు.

17:20.915 --> 17:22.125
నీకు తెలియదు.

17:22.209 --> 17:23.585
అతను నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు.

17:25.002 --> 17:27.422
నా మాజీ భర్తతో సెక్స్ చేసినంత మాత్రాన
అతని గురించి నీకు అన్నీ తెలుసు అనుకోకు.

17:27.506 --> 17:29.550
అది ఒప్పుకోవడం నీకు చాలా కష్టమైన విషయం అని
నేను అర్థం చేసుకోగలను,

17:29.633 --> 17:30.968
కానీ కూప్, నేను చాలా సన్నిహితులం.

17:31.051 --> 17:32.386
- అవునా?
- అవును.

17:32.469 --> 17:36.098
కానీ, నేను ఈ మధ్యనే అతనితో సెక్స్ చేశాను కాబట్టి
బహుశా నువ్వు అనుకున్నంతగా తనకి అంత దగ్గర కాలేదేమో.

17:36.181 --> 17:38.559
- సారీ, ఏంటి?
- అద్దాల మేడలు, నిక్.

17:38.642 --> 17:40.394
దాని అర్థం ఏంటి?

17:41.353 --> 17:43.230
- మరి నా మీద నీకెందుకు కోపం?
- నమ్మలేకపోతున్నా.

17:43.313 --> 17:44.982
ఏంటి? నువ్వు నాతో అబద్ధం చెప్పావు!

17:45.065 --> 17:46.567
నీకు చెప్పడానికి భయం వేసింది.

17:46.650 --> 17:48.068
- ఇది అలాంటిది కాదు.
- నాకు చెప్పడానికి భయపడటంలో

17:48.151 --> 17:49.820
- ఒక కారణం ఉంది.
- ఇంకెక్కడయినా మాట్లాడుకుందామా?

17:49.903 --> 17:51.405
నాకు చెప్పడానికి ఎందుకు భయపడ్డావు?

17:51.488 --> 17:53.866
మెల్, నేను ఇప్పటికీ నీ ఫ్రెండ్ నే.

17:53.949 --> 17:55.993
నువ్వు నా ఫ్రెండ్ వి కాదు.
అవకాశం కోసం ఎదురుచూసే భర్తలేని దానివి

17:56.076 --> 17:58.453
నువ్వు ద్వేషించే నీ మాజీ భర్త చనిపోవడంతో

17:58.537 --> 18:00.080
ఆ సానుభూతితో లాభం పొందాలని చూస్తున్నావు.

18:01.081 --> 18:02.082
ఓహ్, ఛ.

18:03.542 --> 18:04.710
వద్దు, మెల్.

18:04.793 --> 18:07.045
- నోరు మూయి!
- మెల్, ఆపు, ప్లీజ్.

18:12.718 --> 18:14.094
- నిక్.
- నోరు మూయి, మెల్.

18:24.730 --> 18:25.731
తలుపు?

18:29.151 --> 18:30.152
నువ్వే నన్ను తీసుకువెళ్లాలి.

18:31.653 --> 18:32.654
కూప్ కి ఫోన్ చేయి.

18:51.465 --> 18:52.716
ఏంటి? ఏం చూస్తున్నారు?

18:53.759 --> 18:54.760
ఏంటి? మా నాన్న గురించేనా?

18:57.012 --> 18:59.056
లేదు. మీ అమ్మ గురించి.

19:01.725 --> 19:03.936
…నువ్వు ద్వేషించే భర్త చనిపోతే సానుభూతి పొందుతున్నావు.

19:04.019 --> 19:05.229
ఓహ్, ఛ.

19:06.855 --> 19:08.232
వద్దు, మెల్.

19:08.315 --> 19:09.566
- నోరు మూయి.
- మెల్.

19:35.008 --> 19:36.009
ఆ వీడియో చూశావా?

19:36.635 --> 19:37.636
చూశాను.

19:40.514 --> 19:41.890
మా నాన్న బెయిల్ మీద బయటకి వచ్చాడు,

19:42.933 --> 19:45.102
మా అమ్మ కాఫీ షాపులలో గొడవలు పడుతోంది.

19:46.395 --> 19:48.981
కానీ, మంచి విషయం ఏమిటంటే,
గొప్ప కాలేజ్ వ్యాసం రాసేంత విషయం నీ దగ్గర ఉంది.

19:52.985 --> 19:54.778
నీకు ఓదార్పు కావాలి అంటే,

19:55.362 --> 19:58.198
ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఏదో రకంగా
సమస్యలతో సతమతం అవుతుంటారు.

20:00.325 --> 20:01.785
కానీ విషయం ఏమిటంటే, నీకేం సమస్య లేదు.

20:04.204 --> 20:05.205
నా గురించి నీకు తెలుసా?

20:12.045 --> 20:14.339
సారీ. నేను నీ గురించి అనుకున్నాను…

20:14.423 --> 20:15.424
ఇడియెట్.

20:35.569 --> 20:37.487
ఆలీ. ఏంటి ఇది?

20:37.571 --> 20:39.698
నేను ఇల్లు సర్దుతుంటే ఇది దొరికింది.

20:40.699 --> 20:41.700
ఇది నీదే.

20:42.618 --> 20:44.286
నీకు ఇచ్చిపోదాం అనుకున్నాను.

20:44.912 --> 20:46.830
ఇది నీ దగ్గర, అంటే, దాదాపు పదిహేను ఏళ్లుగా ఉంది.

20:47.623 --> 20:48.707
అవును.

20:48.790 --> 20:50.250
ఇంకా మనం మాట్లాడుకోవాలి అనుకున్నాను.

20:51.001 --> 20:53.795
మనం మాట్లాడుకోలేం. ఇక్కడ కాదు. నాకు ఫోన్ చేయి.

20:53.879 --> 20:55.380
నేను ఫోన్ చేస్తున్నాను.

20:55.964 --> 20:57.007
ఇంకా మెసేజులు పంపించాను.

20:58.300 --> 20:59.718
ఆలీ, నాకు ఒక కుటుంబం ఉంది.

21:00.302 --> 21:01.929
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊరికే అలా మాట్లాడలేను.

21:02.012 --> 21:04.139
నువ్వు నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు.

21:06.433 --> 21:07.643
సరే,

21:08.644 --> 21:10.020
నీ రికార్డు నీకు తిరిగి కావాలా?

21:10.521 --> 21:11.480
ఏంటి?

21:11.563 --> 21:13.607
లేదు, ఆ రికార్డు నీ దగ్గరే పెట్టుకో. ముందు…

21:14.691 --> 21:15.734
నీకు ఫోన్ చేస్తాను.

21:16.527 --> 21:17.819
కానీ మళ్లీ ఇక్కడికి తిరిగి రావద్దు.

21:44.638 --> 21:47.015
కిందటిసారి నిన్ను చంపేస్తానని ప్రమాణం చేశాను కదా,
గుర్తుందా, సలీ?

21:47.099 --> 21:48.934
అది నిజం, మ్యాట్రిక్స్! నువ్వు ప్రమాణం చేశావు!

21:49.017 --> 21:49.977
నేను అబద్ధం చెప్పాను.

21:55.649 --> 21:57.025
అయితే, నీ దగ్గర కారు లేదా?

22:06.618 --> 22:08.370
ఓహ్, నిక్. ఇక్కడ ఏం చేస్తున్నావు?

22:08.996 --> 22:12.332
అంటే నా పరిస్థితి చక్కబడిందని నేను అనుకున్న ప్రతిసారీ,
ఏదో ఒక సమస్య నా జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.

22:12.833 --> 22:15.294
- వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు?
- అవును.

22:15.377 --> 22:18.589
మనం ఎదిగాం అని గ్రహించినప్పుడు
ఆ అనుభవం చాలా భయంకరంగా అనిపిస్తుంది.

22:18.672 --> 22:21.049
కానీ నేను ఎదగలేదు. అదే నేను చెప్పేది.

22:21.133 --> 22:23.385
నా పేరెంట్స్ గా నాకు ఇప్పటికీ వాళ్లు కావాలి.

22:24.219 --> 22:27.598
వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగా తల్లిదండ్రులుగా
వాళ్లు బాధ్యతలు నిర్వర్తించడం లేదు అనిపిస్తుంది.

22:27.681 --> 22:30.601
దానికి తోడు మా నాన్న నేరగాడు అని
ఈ జనం అంతా అనుకోవడం ఇంకో బాధ.

22:31.101 --> 22:33.896
మా నాన్న పిచ్చిగా ప్రవర్తించొచ్చు,
కానీ హంతకుడు కాడు. నా ఉద్దేశం, దేవుడా!

22:38.108 --> 22:39.526
- ఏంటి?
- ఏంటి?

22:40.319 --> 22:41.820
- ఏంటి?
- ఆయన ఆ హత్య చేయలేదు.

22:42.321 --> 22:45.240
నువ్వు అలా అనుకోవడం చాలా సహజం

22:45.324 --> 22:46.950
కానీ వాస్తవం ఏమిటో నీకు తెలియదు, కదా?

22:47.034 --> 22:47.951
మా నాన్న గురించి నాకు తెలుసు.

22:48.035 --> 22:49.745
ఆయన ఆ హత్య చేసి ఉంటాడని
జనం ఎందుకు అనుకుంటున్నారో

22:49.828 --> 22:53.165
నువ్వు దానిని అర్థం చేసుకోవడం ముఖ్యం అంటాను.

22:53.248 --> 22:55.167
ఆ చనిపోయిన వ్యక్తి భార్యతో మీ నాన్న సెక్స్ చేస్తున్నాడు.

22:55.250 --> 22:56.960
సరే, మా నాన్న శృంగారం గురించి మనం మాట్లాడకుండా ఉందామా?

22:57.044 --> 22:59.838
ఏదో ఒక ఆధారం లేకుండా పోలీసులు
మీ నాన్న లాంటి ఒక తెల్లజాతి సంపన్నుడిని

22:59.922 --> 23:01.798
- అరెస్టు చేస్తారని అనుకోలేము.
- నువ్వు అలా మాట్లాడకు.

23:01.882 --> 23:04.593
పైగా, ఆయనకి గొడవలు పడతాడనే చరిత్ర ఉంది.

23:04.676 --> 23:05.844
ఆయన ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదు.

23:07.513 --> 23:09.139
ఆయన నా మర్మాంగం మీద కొట్టాడు.

23:11.683 --> 23:12.684
నిన్ను నమ్మలేకపోతున్నాను.

23:13.685 --> 23:14.686
ఇలా రా.

23:14.770 --> 23:16.522
- హేయ్, ఆయన మీ నాన్న.
- నా దారికి అడ్డు రాకు.

23:16.605 --> 23:20.776
నువ్వు ఆయనని సమర్థిస్తావు,
నేను నిన్ను సమర్థిస్తాను. నన్ను నమ్ము.

23:20.859 --> 23:22.945
అవును, హై స్కూలు అమ్మాయితో
డేటింగ్ చేసే కాలేజీ అబ్బాయిని నమ్మాలి.

23:23.028 --> 23:25.405
- నా దారికి అడ్డు లే.
- టోరీ, నాటకాల రాణిలా ప్రవర్తించకు.

23:41.922 --> 23:43.632
- హాయ్. టోరీ కోసమా?
- అవును.

24:06.321 --> 24:07.906
హేయ్, బాబు. నీ ముఖం మీద కొట్టినందుకు సారీ.

24:08.407 --> 24:11.535
మరేం ఫర్వాలేదు.
ఈ దెబ్బ కొట్టించుకునే అర్హత నాకు ఉందేమో.

24:12.411 --> 24:13.412
అవును.

24:17.457 --> 24:18.458
అది తెరిచే ఉంది!

24:23.046 --> 24:24.298
నిక్, ఇక్కడ ఏం చేస్తున్నావు?

24:25.382 --> 24:27.050
కూప్ మొహం మీద కొట్టడం కోసం వచ్చాను.

24:27.134 --> 24:28.468
నువ్వు, నేను, ఇద్దరం దానికే వచ్చాం.

24:29.136 --> 24:31.972
లేదు. అబద్ధం. నువ్వు వాడే చేతికి కట్టు ఉంది.

24:32.556 --> 24:34.099
నిన్ను కొట్టడానికి నా చేతికి దెబ్బ తగిలించుకోను.

24:37.561 --> 24:39.313
జెంటిల్మెన్, పరిస్థితులు అలా వచ్చాయి.

24:39.396 --> 24:43.192
మనం బయటకి వెళ్లి మంచిగా మాట్లాడుకుని
బాగా తాగాలని సూచిస్తాను.

25:12.304 --> 25:14.223
అవును, ఈ రాత్రి నమ్మలేనంత గొప్పగా ఉంది.

25:18.810 --> 25:20.062
మనం ఎక్కడికి వెళ్లినా ఇలాగే జరుగుతుంది.

25:20.812 --> 25:22.981
అతను ఎప్పుడూ మంచి ఉత్సాహంగా
ఎందుకు ఉంటాడో ఎప్పుడయినా ఆలోచించావా?

25:23.065 --> 25:23.899
అందుకే.

25:24.483 --> 25:26.777
- అయితే మీరు సమస్యలు పరిష్కరించుకున్నారా?
- ఏమీ లేదు.

25:26.860 --> 25:28.946
కానీ ఈ మధ్య నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు.

25:29.029 --> 25:30.697
బహుశా నువ్వు వాళ్లని కార్లతో ఢీ కొట్టించడం మానేయాలేమో.

25:36.078 --> 25:39.831
నేను చెప్పాలి, ఈ మద్యం నా వైకొడిన్ మందుతో
చక్కగా కలిసిపోతోంది.

25:39.915 --> 25:41.625
సరే. ఎక్స్ క్యూజ్ మీ.

25:41.708 --> 25:42.709
సరే, మిత్రులారా.

25:43.210 --> 25:44.461
- ఆహ్… ఓహ్.
- ఇదిగో తీసుకోండి.

25:44.545 --> 25:45.671
ఇవి వాళ్లు ఇచ్చారు.

25:45.754 --> 25:47.214
- థాంక్యూ, మహిళలూ.
- హలో, లేడీస్.

25:47.297 --> 25:48.507
హలో. థాంక్యూ.

25:49.174 --> 25:50.801
వీటిని పైకెత్తండి ఇంకా ఖాళీ చేయండి.

25:50.884 --> 25:52.135
సరే. ఇంక మొదలుపెడదాం.

25:54.263 --> 25:55.264
ఓహ్, సరే.

25:55.764 --> 25:56.849
బాగుంది.

25:56.932 --> 25:58.559
హేయ్ బి, ఆ బృందం గురించి కూప్ కి చెప్పావా?

25:59.393 --> 26:00.435
లేదు.

26:00.519 --> 26:02.938
- సారీ, అది ఏంటి?
- అది వినడానికి దీని కన్నా ఘోరంగా ఉంటుంది.

26:03.021 --> 26:04.731
- కూప్ నేరారోపణ బృందం ఒకటి ఉంది.
- వావ్.

26:04.815 --> 26:07.359
వాస్తవంగా, ఇప్పుడు అతను బయటకి చెప్పాడు కాబట్టి,
ఇది వినడానికి చాలా ఘోరంగా ఉంది.

26:07.442 --> 26:09.403
సరే. కార్యచరణ ప్రణాళిక ఏంటి?

26:09.486 --> 26:11.822
నాకు తెలియదు. నువ్వు నా ఫ్రెండ్ వి.
నేను దానికి దూరంగా ఉన్నాను.

26:11.905 --> 26:14.408
- బార్నీ?
- ఏంటి? అవును, నేను నిక్ తో ఉన్నాను.

26:16.118 --> 26:18.328
- సరే, కానీ అమాయకంగా నమ్మాను.
- అదీ అసలు విషయం.

26:18.412 --> 26:19.955
అయినా కానీ నాకు ఇంకా అనుమానంగానే ఉంది.

26:20.038 --> 26:22.332
- తెలివైన నిర్ణయం.
- నువ్వు హత్య చేశావని జూల్స్ నమ్ముతోంది.

26:22.416 --> 26:24.084
- దేవుడా.
- ఆ మహిళకి ధైర్యం ఉంది.

26:24.168 --> 26:27.754
- కూప్. నేను అది నమ్మలేను.
- ఓహ్, దేవుడా.

26:27.838 --> 26:28.797
ఇక్కడికి ఎవరు వచ్చారో చూడండి.

26:28.881 --> 26:31.175
హేయ్, కూప్. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది.

26:31.258 --> 26:32.176
ఎలా ఉన్నావు?

26:32.259 --> 26:33.886
ఓరి దేవుడా. నువ్వు నిక్ బ్రాండెస్ కదా.

26:33.969 --> 26:36.054
- అవును నేనే.
- టోబీ ఇంకా జోష్ నా దగ్గర పని చేసేవారు.

26:36.138 --> 26:38.307
కానీ నువ్వు లేక ఆ సంస్థ చెత్తలా మారింది, బాబు.

26:38.390 --> 26:39.808
ఓహ్, ఇంక ఆపు. అది నిజం కాదు.

26:39.892 --> 26:41.143
లేదు, అతను నిజంగానే అంటున్నాడు, బాబు.

26:41.226 --> 26:43.312
నువ్వు ఏం విన్నావో నాకు తెలియదు,
కానీ ఆ సంస్థ కష్టాల్లో ఉంది.

26:43.395 --> 26:44.605
స్విస్ పెట్టుబడిదారులు తప్పుకుంటున్నారు.

26:44.688 --> 26:45.522
- అది నిజమా?
- పూర్తిగా.

26:45.606 --> 26:47.524
జాక్ ఆ సమస్యతో సతమతం అవుతున్నాడు.

26:47.608 --> 26:48.775
బాబూ, ఇది గొప్పగా ఉంది.

26:48.859 --> 26:50.068
కాలేజీలో నీ నెంబరు జెర్సీని తొడుక్కునేవాడిని.

26:50.152 --> 26:52.029
- అవునా, నువ్వు ఆడేవాడివా?
- అవును, డి3, బాబు.

26:52.112 --> 26:53.488
నేను చాలా, చాలా బాగా ఆడేవాడిని.

26:53.572 --> 26:56.909
కానీ నేను మీ టాయిలెట్లు రెండు కొన్నాను.
అది నా జీవితాన్నే మార్చేసింది.

26:57.743 --> 26:58.827
భలేవాడివి.

26:59.870 --> 27:02.372
ఇక్కడికి ఎవరైనా వెయిటర్ వస్తారా? ఈ చెత్తవెధవలకి

27:02.456 --> 27:03.457
- కొన్ని డ్రింక్స్ కావాలి.
- మిత్రులారా.

27:03.540 --> 27:04.833
- ఇంకా తీసుకురా…
- హేయ్!

27:06.210 --> 27:09.588
మీ ప్రవర్తన చూస్తే నాకు అనుమానం వస్తోంది,
మీరు కొకైన్ డ్రగ్స్ తీసుకున్నారా?

27:14.843 --> 27:16.678
అవును, ఇది మంచిగా ఉంది.

27:16.762 --> 27:19.515
నా ఉద్దేశం, ఆమె నన్ను మోసం చేసిందన్న విషయాన్ని
నేను మర్చిపోగలను,

27:19.598 --> 27:23.310
కానీ నన్ను మోసం చేసిందంటే తనకి నా మీద
ఎంత కోపం ఉండాలి, నా ఉద్దేశం నీకు అర్థమైందా?

27:23.393 --> 27:24.561
ఓహ్. అవును.

27:25.062 --> 27:27.523
హేయ్, ఆ హత్య కేసులో నీ ఆరోపణల నుంచి బయటపడ్డావా, బాబు?

27:28.148 --> 27:29.149
ఆ పని మీదే ఉన్నాను.

27:29.233 --> 27:31.360
ఈ ఏవన్, పన్ను ఎగవేసినందుకు ఆరు నెలలు జైలుకెళ్లాడు.

27:31.443 --> 27:33.654
అక్కడ తొమ్మిది నెలలు ఉన్నాను కానీ ఆ అనుభవం బాగుంది.

27:34.154 --> 27:36.823
ఆ జైలు ఓటిల్విల్ లో ఉంది కానీ
చూడటానికి అది ఒక వేసవి శిబిరంలా అనిపించింది.

27:37.324 --> 27:38.534
అవును, అక్కడ నా టెన్నిస్ ఆటని

27:38.617 --> 27:40.953
మెరుగుపర్చుకున్నాను
ఇంకా కొన్ని మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నాను.

27:41.036 --> 27:43.455
అక్కడ అందరూ పలుకుబడి కలిగిన వాళ్లే.
అందులో ముగ్గురితో నేను డీల్స్ చేస్తున్నా.

27:43.539 --> 27:46.416
అది, నిజం, కూప్.
నువ్వు కూడా ఓటిస్విల్ కి వెళ్లాలి, బాబు.

27:46.500 --> 27:48.669
సరే. లేదా బహుశా నేను నిర్దోషిగా బయటపడతానేమో.

27:49.670 --> 27:52.005
చాలా ఏళ్ల తరువాత నాకు ఇది చాలా బాగా అనిపిస్తోంది.

27:52.756 --> 27:54.675
హేయ్, మిత్రమా. తేలికగా తీసుకో.

27:54.758 --> 27:56.218
తేలికగా తీసుకోవాలా? లేదు, లేదు.

27:56.301 --> 27:59.012
ఏదీ తేలికగా తీసుకోకూడదు.

28:01.014 --> 28:02.808
- నేను తిరిగి వచ్చేశాను.
- సరే.

28:02.891 --> 28:06.144
చోయ్ బాబు తిరిగొచ్చాడు, చోయ్ బాబు తిరిగొచ్చాడు.

28:06.228 --> 28:08.355
చోయ్ బాబు మళ్లీ తిరిగి వచ్చాడు.

28:08.438 --> 28:09.773
చోయ్ బాబు తిరిగి వచ్చాడు…

28:11.358 --> 28:12.442
ఛ, బార్నీ.

28:12.943 --> 28:14.278
మిత్రమా?

30:24.157 --> 30:25.993
అయితే, ఈ మొత్తం హత్య వ్యవహారం.

30:28.287 --> 30:30.831
- ఏంటి?
- నేను చెప్పాలి. ఇలా జరుగుతుందని ఊహించలేదు.

30:33.166 --> 30:35.752
నువ్వు ఈ కేసు నుంచి బయటపడగలను అనుకుంటున్నావా?

30:42.301 --> 30:43.343
బార్నీ.

30:44.887 --> 30:47.514
గోల్ఫ్ మైదానంలో మనం పూర్తిగా తాగిన మైకంలో ఉన్నాం
ఈ అర్ధరాత్రి వేళ,

30:47.598 --> 30:51.727
కాబట్టి నువ్వు ఏం అడగాలి అనుకున్నావో అది అడగచ్చు కదా.

30:51.810 --> 30:53.812
ఎందుకంటే నేను నిన్ను అడగాలి అనుకోలేదు.

30:55.147 --> 30:57.232
ఇంకో భయంకరమైన విషయం ఒకటి ఉంది.

30:59.318 --> 31:00.986
నేను నిజంగా పట్టించుకుంటానో లేదో నాకు తెలియదు.

31:04.531 --> 31:06.658
- కాబట్టి అది నువ్వే చేసినట్లయితే…
- సరే, నేను తనని చంపలేదు.

31:06.742 --> 31:08.952
సరే. సరే. అది మంచి విషయం.

31:09.036 --> 31:11.038
అది మంచి విషయం.

31:12.873 --> 31:16.043
కానీ, గుర్తుంచుకో. నేను నిన్ను అడగలేదు.

31:23.300 --> 31:24.468
నీకు భయంగా ఉందా?

31:25.928 --> 31:29.389
అది పిచ్చి ప్రశ్న, సారీ.

31:33.727 --> 31:34.895
నీ ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయి?

31:36.522 --> 31:38.941
అంటే, నేను మా ఇంటిని ఆ రాత్రి
దాదాపుగా తగులబెట్టేయబోయాను.

31:39.024 --> 31:41.443
ఆ ఇంటి పనుల విషయంలో ఇబ్బందుల్లో ఉన్నావా? ఏంటి?

31:42.903 --> 31:44.321
నిజానికి నేను అది చెప్పలేను.

31:45.030 --> 31:47.407
ఆ ఇంట్లో కొన్ని గదుల్ని మేము కనీసం
ఎప్పుడూ ఉపయోగించింది లేదు.

31:47.491 --> 31:48.700
ఇప్పుడు ఇంకొన్ని గదులు కడుతున్నాం.

31:51.119 --> 31:52.496
గ్రేస్ చాలా ఖర్చులు పెడుతుంది.

31:53.789 --> 31:56.333
నేను చాలా ఖర్చులు పెడుతున్నాను.
ప్రస్తుతం అది మాకు అలవాటైపోయింది.

31:56.416 --> 31:59.628
మేము తింటాము, తాగుతాము, ఖరీదైన వస్తువులు కొంటాము.

32:00.671 --> 32:02.005
తరువాత మేము కొన్న వాటి గురించి మాట్లాడతాం,

32:02.089 --> 32:04.466
ఆ తరువాత మేము కొనవలసిన
వస్తువుల గురించి చర్చించుకుంటాం,

32:04.550 --> 32:05.884
అప్పుడు వెళ్లి వాటిని కొంటాం.

32:10.848 --> 32:12.599
కొన్నిసార్లు ఊరికే ఇంటి చుట్టూ తిరుగుతాను ఇంకా నేను…

32:13.141 --> 32:18.564
నేను మాకున్న చాలా వస్తువుల్ని చూస్తుంటాను
ఇంకా అవి నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

32:19.273 --> 32:22.484
నా ఉద్దేశం, మేము ఇలా ఎందుకు తయారయ్యామో,
తెలుసా, అంటే ఎప్పుడు మేము ఇలా…

32:22.568 --> 32:26.530
మా జీవితాలలో ఎందుకు ఇంత శూన్యం ఆవరించిందో…

32:29.116 --> 32:32.202
ఆ శూన్యాన్ని నిరంతరం ఆ చెత్త వస్తువులతో నింపేస్తున్నాము.

32:38.500 --> 32:40.002
నాకు ఏం అయిందో నాకే తెలియడం లేదు.

32:40.085 --> 32:41.461
మనలో ఎవరికీ తెలియదు అనుకుంటా, మిత్రమా.

32:46.466 --> 32:49.011
నువ్వు ఏవో సమస్యలతో సతమతం అవుతున్నావు.
వాటి గురించి నాకు చెప్పనక్కరలేదు.

32:51.930 --> 32:56.268
కానీ అవి నాకు తెలుసు అన్న విషయం నీకు తెలిస్తే చాలు.

32:58.478 --> 33:00.022
నాకు ఏం తెలుసో నాకు తెలియదు.

33:03.442 --> 33:04.526
కానీ నాకు తెలుసు.

33:05.777 --> 33:07.404
నా విషయంలో ఏదో జరుగుతోంది, బాబు.

33:07.946 --> 33:10.407
అది వివరంగా చెప్పగలనో లేదో కూడా నాకు తెలియదు. అది…

33:10.490 --> 33:13.702
నా ఉద్యోగం పోయింది ఇంకా తరువాత
నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది.

33:13.785 --> 33:19.750
నా సొంతమైనవి స్థిరంగా, శాశ్వతంగా నావే
అనుకున్నవన్నీ, కేవలం అలా…

33:20.334 --> 33:22.044
నాకు తెలియదు.

33:23.170 --> 33:24.171
నాకు తెలియదు.

33:25.005 --> 33:26.632
అన్ని నియమాలనీ నేను తప్పుగా అంచనా వేశాను.

33:28.008 --> 33:29.426
చూడబోతే ఎలాంటి నియమాలూ లేవని అర్థమైంది.

33:35.432 --> 33:37.309
సరే ఏది ఏమైనా, నేను ఇళ్లల్లోకి దొంగతనంగా ప్రవేశించి

33:37.392 --> 33:38.519
వాళ్ల వస్తువుల్ని చోరీ చేస్తున్నాను.

34:02.084 --> 34:04.253
ఓహ్, చెత్త. నా కారు.

34:04.753 --> 34:05.754
అది ఎక్కడ ఉంది?

34:06.421 --> 34:07.589
దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

34:07.673 --> 34:09.591
నేను ఈ రోజు సిటీకి వెళ్లి క్యాట్ ని కలవాలి.

34:09.675 --> 34:12.511
అది మంచి విషయం. నన్ను దింపేశాక
నేను వాలీని నీతో పాటు పంపిస్తాను.

34:14.096 --> 34:15.097
నిజంగానా?

34:15.179 --> 34:16.431
వాలీ, ఈ రోజు పని చేయగలవా?

34:17.014 --> 34:18.891
- అలాగే, చేస్తాను, నిక్.
- సమస్య పరిష్కారం అయిపోయింది.

34:18.976 --> 34:20.018
దేవుడు నిన్ను దీపించు గాక.

34:20.518 --> 34:21.645
సరే, మిత్రులారా.

34:24.022 --> 34:27.400
థాంక్యూ. నిన్న రాత్రి చాలా గొప్పగా గడిచింది.

34:27.484 --> 34:29.570
అవును. ఇంకెప్పుడూ మనం అలా చేయద్దు.

34:56.096 --> 34:57.431
హంటర్ వయసు నాలుగేళ్ల అప్పుడు,

34:57.514 --> 34:59.808
అర్ధరాత్రి వేళ వాడు మా బెడ్ రూమ్ లోకి
పరిగెత్తుకుని వచ్చేవాడు,

34:59.892 --> 35:02.060
నాలుగేళ్ల పిల్లలకి వచ్చే భయంకరమైన కలలకి

35:02.144 --> 35:03.187
వాడు బెదిరిపోయేవాడు.

35:04.521 --> 35:07.441
నేను వాడిని మంచం మీదకి లాక్కునే వాడిని
అప్పుడు వాడు నా చేతుల మీద పడుకునేవాడు.

35:09.443 --> 35:11.403
వాడు భద్రంగా ఉన్నాడని చెప్పడానికి అది సరిపోయేది.

35:12.613 --> 35:14.114
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ,

35:14.198 --> 35:16.241
వాళ్లని భయపెట్టే విషయాల నుంచి
లేదా హాని కలిగించే విషయాల నుంచి

35:16.325 --> 35:17.451
వాళ్లని కాపాడటం కష్టమవుతుంది.

35:19.036 --> 35:20.329
కానీ ఎప్పుడూ మన ప్రయత్నాన్ని ఆపకూడదు.

35:21.288 --> 35:24.583
కానీ తరువాత ఏదో ఒక రోజు
వాళ్లని బాధపెడుతున్నది మనమే అని గ్రహిస్తాం.

35:25.792 --> 35:26.960
నీకు ఏం అయింది?

35:31.340 --> 35:32.382
రాత్రి చాలా జరిగింది.

35:34.218 --> 35:35.844
నీకు తెలుసా, నేను…

35:36.470 --> 35:38.138
నిన్న నిన్ను కలవడానికి వచ్చాను.

35:38.222 --> 35:39.348
అమ్మ చెప్పింది.

35:39.431 --> 35:40.641
సరే, అది తన మంచితనం.

35:41.225 --> 35:43.018
తను నిన్ను లోపలికి రానిచ్చి ఉంటే ఇంకా మంచిది అయి ఉండేది.

35:43.101 --> 35:44.394
చూడు, తను కేవలం…

35:46.396 --> 35:49.233
ఏది మంచిదని తను అనుకుంటుందో అదే చేస్తోంది, తెలుసా?

35:52.486 --> 35:54.446
కానీ హేయ్, బాబు.

35:54.530 --> 35:55.906
నీకు సారీ చెప్పాలి అనుకుంటున్నాను.

35:56.490 --> 35:58.283
ఈ గందరగోళం అంతటికీ.

35:58.367 --> 36:02.704
మొదట విడాకులు ఇంకా ఇప్పుడు ఈ సమస్యలు.

36:03.747 --> 36:05.916
ఇందులో ఏదీ జరగాలని నేను కోరుకోలేదు.

36:05.999 --> 36:07.793
కానీ అది నీకు స్వాంతన కలిగిస్తుందో లేదో నాకు తెలియదు,

36:07.876 --> 36:11.421
కాబట్టి నేను సారీ చెప్పాలి అనుకున్నాను.

36:11.505 --> 36:14.967
నాన్నా. నువ్వు జైలుకి వెళ్తావా?

36:16.802 --> 36:18.220
సరే, హంటర్.

36:19.513 --> 36:20.514
ఇది ముఖ్యమైన విషయం.

36:20.597 --> 36:23.392
ఆ తరువాత ఏది జరిగినా కూడా నువ్వు ఈ మాట వినాలి, సరేనా?

36:24.101 --> 36:28.689
నేను పాల్ ని హత్య చేయలేదు.
ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.

36:28.772 --> 36:29.690
నువ్వు చంపలేదని నాకు తెలుసు.

36:30.858 --> 36:32.568
ఆ విషయం నీతో చెబుదామనే ఇక్కడికి వచ్చాను.

36:34.152 --> 36:35.404
అది నేను మెచ్చుకుంటాను.

36:38.657 --> 36:42.536
నేను చేయని నేరానికి జైలుకి వెళ్లను.

36:43.161 --> 36:44.162
సరేనా?

36:44.705 --> 36:47.499
ఇంక, ఈ రోజు నాకు క్యాట్ రెస్నిక్ తో మీటింగ్ ఉంది,

36:47.583 --> 36:49.960
తన వృత్తిలో అత్యుత్తమ నిపుణురాలు.

36:51.920 --> 36:54.464
ఇంకా మేము ఈ కేసు నుండి బయటపడే మార్గం గురించి
ఆలోచిస్తాము. సరేనా?

36:56.884 --> 36:59.803
సరే, ముందు నువ్వు స్నానం చేయాలేమో.

37:00.721 --> 37:02.890
- నీ నుంచి దుర్వాసన వస్తోంది.
- థాంక్యూ. బాగా గమనించావు.

37:05.309 --> 37:06.310
ఇంకేమయినా చెప్పాల్సింది ఉందా?

37:08.395 --> 37:09.855
నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.

37:35.255 --> 37:37.633
- గుడ్ మార్నింగ్.
- చెత్త.

37:42.012 --> 37:43.013
రాత్రి బాగా తాగావా?

37:54.107 --> 37:56.693
ఈ కప్పు కాఫీ కోసం నీకు వెయ్యి డాలర్లు ఇస్తాను.

38:01.740 --> 38:03.408
ఇది ఘోరం, గ్రేస్.

38:03.992 --> 38:05.827
హాస్పిటల్ లో బాగా గాయపడినట్లు కనిపించావు.

38:17.464 --> 38:18.799
సరే, నువ్వు ఏం అనబోతున్నావో నాకు తెలుసు.

38:18.882 --> 38:20.676
ఆ మాటకి విలువ ఏమీ ఉండదు, కదా.

38:20.759 --> 38:23.011
అతను నా బెస్ట్ ఫ్రెండ్, గ్రేస్.

38:28.016 --> 38:29.935
నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఒక హత్య కేసులో
జైలు శిక్ష పడే అవకాశం ఉందని

38:30.018 --> 38:34.022
ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించడం మేలని నా అభిప్రాయం.

38:34.106 --> 38:35.107
అతను ఆ హత్య చేయలేదు.

38:35.190 --> 38:36.775
- ఆ విషయం నీకు తెలుసా?
- నీకు తెలియదా?

38:39.653 --> 38:41.113
మనకి అన్ని వాస్తవాలూ తెలియవు, బార్నీ.

38:41.613 --> 38:43.031
కానీ, నాకు చాలావరకూ తెలుసు.

38:48.495 --> 38:49.746
అది నీకు కూడా తెలుసు.

38:54.918 --> 38:56.587
నాకు కనీసం నీ గురించి కూడా పూర్తిగా తెలియదు.

38:57.254 --> 38:58.589
దాని ఉద్దేశం ఏంటి, హా?

39:07.931 --> 39:09.516
నీ స్వెటర్ డ్రాయర్ లో ఇది దొరికింది.

39:11.852 --> 39:14.062
దీనికి కూప్ తో సంబంధం లేదని దయచేసి చెప్పు.

39:24.781 --> 39:25.908
నువ్వు, నేను, అంతే కదా బార్నీ?

39:29.203 --> 39:32.789
అందరికంటే ఎక్కువగా నువ్వు, నేను ముఖ్యం.

39:34.666 --> 39:35.751
నువ్వు, నేను.

39:45.594 --> 39:47.012
తాగు.

39:55.020 --> 39:56.188
నీకు స్నానం చేయిస్తాను.

40:01.610 --> 40:02.736
- గుడ్ మార్నింగ్.
- గుడ్ మార్నింగ్, మెల్.

40:06.573 --> 40:08.242
- హాయ్.
- ఎలా ఉన్నావు, మెల్?

40:09.201 --> 40:10.202
బాగానే ఉన్నాను.

40:10.702 --> 40:11.954
మనం మాట్లాడుకోవాలి అనుకుంటా.

40:12.454 --> 40:14.790
నాకు పదకొండు గంటలకి సెషన్ ఉంది.

40:15.290 --> 40:17.125
నీ పదకొండు గంటల సెషన్ రద్దు అయింది.

40:18.961 --> 40:20.671
నీ పేషంట్లలో చాలామంది సెషన్లు రద్దు చేసుకున్నారు.

40:24.716 --> 40:25.717
ఎంతమంది?

40:30.097 --> 40:31.348
కూప్ కారణంగానా?

40:31.431 --> 40:33.892
లేదు. కూప్ కారణంగా కాదు.

40:35.727 --> 40:37.813
…నువ్వు ద్వేషించే చనిపోయిన భర్త కోసం.

40:37.896 --> 40:39.147
ఓహ్, అయ్యో.

40:40.816 --> 40:42.985
- వద్దు, మెల్. ఇంక ఆపు.
- నోరు మూయి!

40:43.694 --> 40:45.320
ఓహ్, దేవుడా. సరే. అలాగే.

40:45.404 --> 40:47.698
నువ్వు, నీ కుటుంబం ఎంత కష్టంలో ఉన్నారో,
ఎంత ఒత్తిడిలో ఉన్నారో,

40:47.781 --> 40:49.783
- నేను ఊహించలేను.
- నేను బాగానే ఉన్నాను, డెబ్.

40:49.867 --> 40:50.826
నువ్వు బాగున్నావని అనుకోను.

40:52.077 --> 40:53.161
నేను కొంత ఒత్తిడిలో ఉన్నాను,

40:53.245 --> 40:54.580
- కానీ నేను పూర్తిగా…
- ఆ మహిళని కొట్టావు.

40:54.663 --> 40:55.664
మొదట ఆమె నన్ను కొట్టింది!

40:55.747 --> 40:59.126
వోహ్. మన పేషంట్ల తల్లిదండ్రులకి
నేను ఆ విషయం చెప్పాలి అంటావా?

40:59.209 --> 41:01.879
"ఆమె మొదలుపెట్టింది" కాబట్టి తన తప్పులేదు అని చెప్పనా?

41:01.962 --> 41:03.255
అది ఆత్మరక్షణ.

41:03.338 --> 41:04.715
అది కావాలని ప్రదర్శించిన కోపం.

41:04.798 --> 41:05.966
- సరే, ఇంక అలా చేయద్దు.
- ఏంటి?

41:06.049 --> 41:07.467
నన్ను మానసిక రోగిలా చూడద్దు.

41:08.677 --> 41:10.220
నేను నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను.

41:10.304 --> 41:11.305
ఇలా చూడు, డెబ్.

41:12.347 --> 41:16.226
నీ మొత్తం జీవితంలో, ఎప్పుడూ,
ఎవరినైనా కొట్టాలని నీకు అనిపించలేదా?

41:16.310 --> 41:18.061
సహజంగానే నాకు కొట్టాలని ఉండేది. కానీ నేను కొట్టలేదు.

41:18.145 --> 41:19.271
కానీ, బహుశా నువ్వు కొట్టి ఉండాల్సింది.

41:19.354 --> 41:23.025
ఎందుకంటే నీకు చెబుతున్నాను, అది మనం పొందే
చికిత్స కన్నా ఎంతో స్వాంతన అందిస్తుంది.

41:23.817 --> 41:25.652
వాస్తవానికి, మనతో మనం మమేకం అయ్యే సందర్భం అది.

41:25.736 --> 41:27.988
ఇక్కడ మనం అదే చేస్తుంటాం కదా? మన పేషంట్లతో?

41:28.071 --> 41:30.532
- మెల్.
- ఆమె నా భర్తతో సంబంధం పెట్టుకుంది.

41:30.616 --> 41:31.700
ఇంకా అతడిని హంతకుడని నిందవేసింది.

41:31.783 --> 41:33.035
నీ మాజీ భర్త.

41:33.118 --> 41:34.119
ఏంటి?

41:34.203 --> 41:36.371
ఏదో ఒకటి?

41:36.455 --> 41:39.124
మెల్, నాకు ఇప్పుడు అనిపిస్తోంది, నీకు వైద్యసహాయం కావాలి.

41:39.958 --> 41:40.959
ఆహ్… హా.

41:43.003 --> 41:44.004
నిన్ను సెలవు మీద పంపిస్తున్నాను.

41:48.509 --> 41:49.510
సారీ.

41:52.888 --> 41:53.889
ఏంటి, ఇప్పుడేనా?

42:04.316 --> 42:05.609
"నేను ఓడిపోను" అనే మాట ఏమైంది?

42:05.692 --> 42:07.194
కొన్నిసార్లు నేరాలు ఒప్పుకోవడం కూడా గెలుపే.

42:07.277 --> 42:08.737
కానీ నేను చేయని నేరాన్ని ఒప్పుకోను.

42:09.321 --> 42:12.115
ఇలా చూడు, క్యాట్.
నిన్ను నేను బలవంతపెడుతున్నాను అనుకుంటే, అప్పుడు…

42:12.199 --> 42:13.951
నువ్వు బలవంతపెట్టడం లేదు,
నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు.

42:14.535 --> 42:18.830
కానీ, లేదు, నువ్వు ఎంత చెత్తవెధవవి అయినా
అలాగే నేను ఎంత తిరుగుబోతుని అయినా,

42:18.914 --> 42:21.959
మన పిల్లల్ని మనం కలిసి పెంచాము ఇంకా
పాల్ ని నువ్వు చంపావని నేను అనుకోవడం లేదు.

42:22.543 --> 42:24.837
కానీ నీకు ఉన్న అవకాశాల్ని చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది.

42:25.420 --> 42:27.297
- నేను కేసు వివరాల్ని పరిశీలించాను.
- ఇంకా?

42:27.381 --> 42:30.717
నీ లాయర్ గా, మనం నేరాన్ని ఒప్పుకోవాలని నీకు చెబుతున్నాను.

42:31.844 --> 42:34.638
నేరం జరిగిన ప్రదేశంలో నీ డి.ఎన్.ఎ. దొరికినట్లు
రెండు ల్యాబ్ లలో నిర్ధారణ అయింది.

42:34.721 --> 42:36.014
హత్య ఆయుధం నీ కారు డిక్కీలో దొరికింది.

42:36.807 --> 42:39.810
ఈ విషయాల గురించి నీ వివరణ ఏదైనా
నాతో పంచుకోవాలి అనుకుంటున్నావా?

42:42.312 --> 42:43.897
శామ్ తో నీకు ఉన్న సంబంధం గురించి అబద్ధం చెప్పావు.

42:43.981 --> 42:45.858
- ఆమె కూడా దాని గురించి అబద్ధం చెప్పింది.
- తను బోస్టన్ లో ఉంది.

42:45.941 --> 42:47.150
ఆ రోజు హెన్రీ పుట్టినరోజు.

42:47.234 --> 42:48.694
- ఏంటి?
- ఏమీ లేదు.

42:48.777 --> 42:49.611
కూప్.

42:50.654 --> 42:53.323
నేరాన్ని ఒప్పుకొంటే, కాలేజీలో హంటర్ చదువు
ముగించే లోపే నువ్వు జైలు నుంచి విడుదల కావచ్చు.

42:53.407 --> 42:54.449
నీకు నవ్వులాటగా ఉందా?

42:54.533 --> 42:55.742
నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

42:55.826 --> 42:57.119
నన్ను జైలులో పెట్టించడం ద్వారానా?

42:58.078 --> 42:59.788
ఇలా చూడు, క్యాట్, ఈ కేసులో నన్ను ఇరికించకు.

42:59.872 --> 43:01.331
అది నీకు నువ్వుగా చేసుకున్నావు.

43:09.548 --> 43:13.802
కూప్, ప్రతి రోజూ నాకు ఇలాంటి చర్చలు మామూలే,

43:14.303 --> 43:15.429
ఇంకా నేను నీకు చెప్పాలి,

43:16.013 --> 43:18.724
నువ్వు నిజాయితీపరుడవని జ్యూరీ కనిపెడుతుంది అనుకోను.

43:19.224 --> 43:21.476
- ఎందుకు కాదు?
- ఎందుకంటే నువ్వు నిజం చెప్పడం లేదు.

43:21.560 --> 43:23.020
- దేని గురించి?
- మొత్తం వ్యవహారం గురించి.

43:23.103 --> 43:24.813
ఆ నైట్ క్లబ్ లో నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నేను నమ్మను.

43:24.897 --> 43:27.649
ఆ తరువాత నీ చెల్లెలితో కలిసి గడిపావంటే నేను నమ్మను,

43:27.733 --> 43:31.361
ఇంకా కేవలం నువ్వు శామ్ తో శృంగారం చేస్తున్నావు కాబట్టి
ఆ నేల మీద నీ రక్తం ఉందంటే నేను నమ్మను.

43:32.279 --> 43:34.323
నువ్వు నాకు చెప్పనది ఏదైనా ఉంటే,

43:34.406 --> 43:36.491
అది నాకు చెప్పడానికి ఇదే మంచి సమయం.

43:41.538 --> 43:43.248
- అది సంక్లిష్టమైనది.
- సరే.

43:43.832 --> 43:46.126
ఎందుకంటే నేను మామూలుగా
చాలా సింపుల్ హత్య కేసులు వాదిస్తుంటాను.

43:48.003 --> 43:49.296
ఆ గన్ నీ కారులోకి ఎలా వచ్చింది?

43:49.379 --> 43:51.131
- నాకు తెలియదు.
- అబద్ధం, కూప్.

43:51.798 --> 43:53.091
ఏదో ఒకటి చెప్పు.

43:57.095 --> 43:58.138
నేను అతడిని చంపలేదని చెప్పాను కదా.

43:58.222 --> 43:59.598
కానీ అది ముఖ్యం కాదని నీకు చెప్పాను కదా.

44:03.101 --> 44:04.394
డామిట్.

44:28.544 --> 44:30.337
థాంక్స్, బాబు. సరే.

44:37.177 --> 44:38.220
హేయ్.

44:39.096 --> 44:40.514
- అది నిక్ కార్ కదా?
- అవును.

44:40.597 --> 44:45.477
నాకు వ్యతిరేకంగా సాక్ష్యాన్ని చూపించడం కోసం
నా కారుని స్వాధీనం చేసుకున్నారు.

44:47.896 --> 44:51.358
హేయ్, నాతో మాట్లాడటానికి హంటర్ వచ్చాడని
నీకు కోపం వస్తే గనుక, వాడిని నేను రమ్మనలేదు…

44:51.441 --> 44:53.861
ఆగు, హంటర్ నీతో మాట్లాడటానికి వచ్చాడా?

44:55.404 --> 44:56.446
లేదు.

44:59.074 --> 45:00.951
వాడు నాతో కనీసం రెండు ముక్కలు కూడా మాట్లాడడు.

45:02.077 --> 45:06.498
అవును. కానీ, నేను ఏం చెప్పగలను. అది నా ప్రతిభ.

45:18.427 --> 45:19.928
ఈ రోజు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు.

45:21.972 --> 45:23.140
అయ్యో. నా కారణంగానా?

45:24.016 --> 45:27.895
వాస్తవానికి నా ఉద్యోగం పోవడానికి నేనే కారణం.

45:29.313 --> 45:30.480
నేను…

45:32.316 --> 45:33.984
నేను శామ్ తో గొడవ పడ్డాను.

45:35.444 --> 45:36.862
అంటే, వాదులాడుకున్నారా?

45:37.988 --> 45:39.239
అవును, అలాంటిదే.

45:39.323 --> 45:40.657
ఆ తరువాత నేను ఆమె ముఖం మీద కొట్టాను.

45:44.703 --> 45:45.829
అవును, తెలుసు. ఆ వీడియో చూశాను.

45:45.913 --> 45:47.497
మరి అయితే, నన్ను ఎందుకు అడుగుతున్నావు?

45:47.581 --> 45:50.459
ఎందుకంటే అది నువ్వు చెబితే వినాలి అనుకున్నాను.

45:51.043 --> 45:52.044
నువ్వు నా పరువు కాపాడాలని చూశావా?

45:53.253 --> 45:54.588
ఆమె నిన్ను హంతకుడు అంది.

45:55.631 --> 45:58.175
అవును. ఈ చుట్టుపక్కల మన ఇద్దరి ముఖాలు చూపించే

45:58.258 --> 45:59.092
పరిస్థితి లేదు, హా?

46:05.849 --> 46:06.850
అది చేసింది నువ్వు కాదు, కదా?

46:07.434 --> 46:08.435
ఆ హంతకుడా?

46:09.645 --> 46:11.271
లేదు. నేను కాదు.

46:12.189 --> 46:13.190
అడిగినందుకు సారీ.

46:14.024 --> 46:15.025
నువ్వు అడగడం నచ్చింది.

46:16.777 --> 46:18.320
క్యాట్ ఏం అంటోంది, నువ్వు ఈ కేసుని గెలవగలవా?

46:18.403 --> 46:22.115
నేరం ఒప్పుకొని శిక్ష తగ్గించుకోమని సలహా ఇచ్చింది
కానీ దానికి నేను, "పిచ్చి సలహాలు ఇవ్వకు" అని చెప్పాను.

46:22.199 --> 46:23.283
మంచిది.

46:27.663 --> 46:30.624
మన జీవితాలు ఇలా అయిపోయాయి ఏంటి?

46:44.388 --> 46:46.932
మన జీవితాలని ఒక్క సంఘటనతో
నాశనం చేసుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది.

46:49.893 --> 46:53.188
సాధారణంగా కొంత కాలంగా
అనేక సంఘటనలు దానికి కారణం అవుతాయి.

46:55.983 --> 46:58.151
వాస్తవం అనేది హఠాత్తుగా నా కళ్ల ముందుకు దూసుకురావడంతో

46:58.235 --> 47:00.237
ప్రతి ఒక్క సంఘటన చక్కగా పేర్చినట్లుగా ఉండటం
నేను చూడగలిగాను,

47:00.320 --> 47:02.614
అదంతా నేనే స్వయంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది.

47:26.972 --> 47:29.391
కాబట్టి "ఇదంతా నా జీవితంలో ఎలా జరిగింది?"
అన్నది ప్రశ్న కాదు.

47:29.975 --> 47:32.769
అసలైన ప్రశ్న ఏమిటంటే
"ఇలా జరుగుతుందని ఎందుకు ఊహించలేకపోయాను?"

48:40.921 --> 48:42.923
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
