WEBVTT

00:18.101 --> 00:20.811
వజ్రాలకు స్వాభావికమైన విలువ ఏమీ ఉండదు.
అది మనకి తెలుసు.

00:20.812 --> 00:23.022
అయినా కూడా, వాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్ నెక్లెసు ధర

00:23.023 --> 00:26.442
ఒక రోల్స్ రాయిస్ కారు ధరతో సమానంగా ఉంటుంది.

00:26.443 --> 00:27.902
వజ్రాలు ఎందుకు అంత ఖరీదైనవి?

00:27.903 --> 00:30.863
ఆధునిక చరిత్రలో అత్యంత విజయవంతమైన
వజ్రవ్యాపారుల సమాజం

00:30.864 --> 00:32.990
షెర్మన్ చట్టాన్ని కూడా లెక్కచేయకుండా
వ్యాపారం చేసిన ఫలితం ఇది,

00:32.991 --> 00:34.534
దానితో పాటు ఎనభై ఏళ్లుగా వారు

00:34.535 --> 00:37.245
ఈ ఘనీభవించిన కార్బన్ ని
అనంతమైన ప్రేమకి చిహ్నంగా మార్కెటింగ్ చేయడం మరో కారణం.

00:37.246 --> 00:39.455
వజ్రం అనేది ఎప్పటికీ నిలిచిపోయేది అని చెబుతారు.

00:39.456 --> 00:43.418
కానీ ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే,
అది ఎప్పటికీ నిలిచిపోయేది కాదు అనిపిస్తుంది.

01:36.597 --> 01:38.140
ఇక్కడ ఏం చేస్తున్నావు?

01:38.765 --> 01:40.809
- మేము ఇక్కడే నివసిస్తాము.
- బ్రేక్ ఫాస్ట్ తింటావా, కూప్?

01:41.393 --> 01:42.477
ఇది నీ ఇల్లు కాదు కదా.

01:45.814 --> 01:47.316
ఇది నీ ఇల్లు కూడా కాదు.

01:57.784 --> 01:59.077
బేరాల బాబు.

02:03.624 --> 02:05.209
ఆ సిరప్ ఇలా అందివ్వు.

02:06.710 --> 02:07.835
- ఆ సిరప్.
- ఆ సిరప్.

02:07.836 --> 02:09.295
మీ సంగతి మీరు చూసుకోండి.

02:13.967 --> 02:16.053
పంచుకునే విషయంలో నువ్వు ఇంకా బాగా మెరుగుపడాలి.

02:16.637 --> 02:17.845
ఇక్కడి నుండి బయటకి పో.

02:17.846 --> 02:20.389
రిలాక్స్, కూప్. మనమంతా ఒక కుటుంబం.

02:20.390 --> 02:21.599
నేను నిన్ను చంపేస్తాను.

02:21.600 --> 02:23.310
నువ్వు నన్ను చంపలేవు, కూప్.

02:25.771 --> 02:27.272
ఎందుకంటే నువ్వు ఇప్పటికే చనిపోయావు.

02:35.280 --> 02:37.574
హేయ్. ఎవరు లేచారో చూడు.

02:39.743 --> 02:40.744
హాయ్, డాడీ.

02:41.578 --> 02:42.620
హేయ్, బుజ్జీ.

02:42.621 --> 02:44.206
ఇప్పుడు ఎలా ఉంది?

02:45.165 --> 02:46.707
చాలా నయంగా ఉంది, నిజానికి.

02:46.708 --> 02:50.211
అది ఎందుకంటే డాక్టర్లు నీకు ఎక్కువ మోతాదులో
మార్ఫీన్ మత్తుమందు ఇచ్చారు.

02:50.212 --> 02:54.090
- బంగారం.
- ఏంటి? నేను చూశాను. చాలా ఎక్కువ ఇచ్చారు.

02:54.091 --> 02:55.550
నీకు ఏమైనా తీసుకురమ్మంటావా?

02:55.551 --> 02:57.261
మంచి నీళ్లు కావాలి, ప్లీజ్. అది చాలు.

03:01.390 --> 03:03.307
డాక్టర్ నిన్ను చూడటానికి వచ్చారు,

03:03.308 --> 03:05.477
- కానీ నిన్ను నిద్రలేపాలని ప్రయత్నించలేదు.
- థాంక్స్, బుజ్జీ.

03:06.061 --> 03:07.436
నేను స్పృహ కోల్పోయి ఎంత సమయం అయింది?

03:07.437 --> 03:08.771
పన్నెండు గంటలు.

03:08.772 --> 03:11.358
దేవుడా. నేను తరచు ఇలాంటి దెబ్బలు తగిలించుకోవాలేమో.

03:12.192 --> 03:14.485
వాళ్ల దగ్గర చిప్స్ అయిపోయాయి, కానీ నేను కొన్ని...

03:14.486 --> 03:17.154
ఓహ్, అయ్యో. హేయ్, మిస్టర్ కూపర్.

03:17.155 --> 03:18.573
నువ్వు అతడిని వదిలేశావు అనుకున్నాను.

03:18.574 --> 03:19.658
నాన్నా.

03:20.242 --> 03:22.034
- ఆయన ఇంకా మత్తుమందు ప్రభావంలోనే ఉన్నాడు, కాబట్టి...
- సరే.

03:22.035 --> 03:24.162
- నేను బాగానే ఉన్నాను.
- మరేం ఫర్వాలేదు.

03:27.583 --> 03:28.667
హలో.

03:30.961 --> 03:31.961
తప్పు సమయంలో వచ్చానా?

03:31.962 --> 03:33.379
మీకు నేను ఏమైనా సాయం చేయగలనా?

03:33.380 --> 03:35.298
సారీ. నా పేరు డిటెక్టివ్ రెబెకా లిన్.

03:35.299 --> 03:38.010
మిస్టర్ కూపర్ తో ఒక రెండు నిమిషాలు
మాట్లాడాలి అనుకుంటున్నాను.

03:38.844 --> 03:40.470
మళ్లీ టెన్నిస్ గాయమా?

03:41.471 --> 03:42.471
అది కాదు.

03:42.472 --> 03:43.764
ఆమె నీకు తెలుసా?

03:43.765 --> 03:45.641
పాల్ గురించి ఆమె నన్ను ఇంటర్వ్యూ చేసింది.

03:45.642 --> 03:47.310
అతనికి ఏమైంది?

03:47.311 --> 03:50.188
నిన్న రాత్రి గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి.

03:50.189 --> 03:51.648
అందుకు మీరు సిద్ధంగా ఉంటేనే.

03:52.524 --> 03:54.776
లేదా నేను తరువాత మళ్లీ రానా?

03:56.612 --> 03:58.822
అయితే, పిల్లలూ, మీ తాతయ్య, బామ్మల్ని
లంచ్ కోసం బయటకి తీసుకువెళ్లచ్చు కదా?

03:59.489 --> 04:01.574
మిల్లీ రెస్టారెంట్ ని మధ్యాహ్నం వరకూ తెరవరు.

04:01.575 --> 04:03.784
అయితే అక్కడ మనమే మొదటగా వెళదాం.

04:03.785 --> 04:06.079
అందరూ వెళదాం. రండి.

04:18.007 --> 04:20.802
సాధారణంగా నేను ఈ ఇంటర్వ్యూలని
ఏకాంతంగా చేయడానికి ఇష్టపడతాను.

04:27.351 --> 04:28.644
నేను వెళ్లి బార్నీని పలకరిస్తాను.

04:29.228 --> 04:30.269
అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

04:30.270 --> 04:31.647
నీకు చెబుతాను.

04:36.985 --> 04:38.362
మీది చాలా అందమైన కుటుంబం.

04:38.946 --> 04:40.863
అది మీ మంచితనం. నేను మీకు ఎలా సాయపడగలను?

04:40.864 --> 04:42.908
నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు చెబుతారా?

04:43.408 --> 04:44.868
నాకు పెద్దగా ఏమీ గుర్తులేదు.

04:45.410 --> 04:46.787
సరే, మీకు ఏం గుర్తుంది?

04:47.704 --> 04:49.623
నేను దూకడం గుర్తుంది.

04:50.332 --> 04:52.960
కానీ అది విచిత్రమైనది, కదా?

04:53.710 --> 04:56.045
దాన్ని పోల్చేంతగా నాకేమీ గుర్తు లేదు, కాబట్టి...

04:56.046 --> 04:58.549
సరే, ముందుగా చెప్పాలంటే,
ఆ దుండగులు ఏ వస్తువునీ దొంగతనం చేయలేదు.

04:59.132 --> 05:00.508
అది కాస్త అసాధారణమైన విషయం.

05:00.509 --> 05:01.592
సరే.

05:01.593 --> 05:04.680
బహుశా బార్నీని కారు ఢీకొనడం వల్ల
వాళ్ల దొంగతనం పథకం మారి ఉండచ్చేమో?

05:05.264 --> 05:10.519
అయితే మీకు ఎంతో కొంత గుర్తుంది.
ఇంకా నేను తరువాత మిస్టర్ చోయ్ తో కూడా మాట్లాడతాను.

05:12.062 --> 05:13.771
నిజం చెప్పాలంటే, మిస్టర్ కూపర్,

05:13.772 --> 05:16.191
ఈ దాడి నాకు అనుకోకుండా జరిగినట్లుగా
అసలు అనిపించడం లేదు.

05:16.775 --> 05:18.402
మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది.

05:18.986 --> 05:20.611
నన్ను ఎవరైనా ఎందుకు చంపాలి అనుకుంటారు?

05:20.612 --> 05:22.113
ఎవరైనా పాల్ లెవిట్ ని ఎందుకు చంపాలి అనుకున్నారు?

05:22.114 --> 05:23.573
దానికీ దీనికీ నాకేమీ సంబంధం కనిపించడం లేదు.

05:23.574 --> 05:26.868
మీకు తెలుసు, నేను బ్రాంక్స్ ప్రాంతంలో పోలీసుగా పని చేశాను.

05:26.869 --> 05:29.078
అక్కడ హింసాత్మక నేరాలు డజన్ల కొద్దీ జరుగుతుంటాయి.

05:29.079 --> 05:32.748
కానీ ఇక్కడ అలా ఉండదు. ఇది ఒక ప్రశాంతమైన పట్టణం.

05:32.749 --> 05:35.377
ఇక్కడ హింసాత్మకమైన నేరాలు ఎక్కువగా జరగవు.

05:35.961 --> 05:40.256
కానీ గత కొద్ది రోజులలో,
ఒక వ్యక్తి తన ఇంట్లో దారుణంగా హత్య చేయబడ్డాడు.

05:40.257 --> 05:42.466
- మీరు ఈ మధ్య ఆ వ్యక్తితోనే గొడవ పడ్డారు.
- అది గొడవ కాదు.

05:42.467 --> 05:46.679
ఆ తరువాత సరిగ్గా అక్కడే మెయిన్ రోడ్డు మీద,
మీ మీద దాడి చేసి దారుణంగా కొట్టారు,

05:46.680 --> 05:48.514
అందుకు తగిన కారణం కూడా కనిపించలేదు.

05:48.515 --> 05:52.268
ఇంకా మీ ఫ్రెండ్ బార్నీ లోపల నుంచి
పేవ్మెెంట్ మీదకి పరుగున వచ్చాడు.

05:52.269 --> 05:54.979
మళ్లీ, ఇక్కడ కూడా నాకు ఏ సంబంధం కనిపించలేదు.

05:54.980 --> 05:56.607
అది మీరే, మిస్టర్ కూపర్.

05:57.524 --> 05:58.942
ఆ సంబంధం మీరే.

05:59.735 --> 06:03.654
మీకు ఫ్రెండ్ కావడం అనేది
చాలా ప్రమాదకరమైనదని నాకు అనిపిస్తోంది.

06:03.655 --> 06:05.908
అయితే మనం ఫ్రెండ్స్ కాలేము అని మీ ఉద్దేశమా?

06:10.996 --> 06:13.623
నెల కిందటే మీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని విన్నాను.

06:13.624 --> 06:15.082
అది చాలా మామూలుగా జరిగిన సంఘటన.

06:15.083 --> 06:18.545
బ్రాంక్స్ లో పోలీసుగా మీరు ఉద్యోగం మానేశారని చెప్పారు.
మీరెందుకు ఉద్యోగం మానేశారు?

06:19.505 --> 06:22.215
- జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసం.
- హేయ్. నేను కూడా అందుకే మానేశాను.

06:22.216 --> 06:23.633
కానీ మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేశారు.

06:23.634 --> 06:24.884
పదప్రయోగం.

06:24.885 --> 06:26.512
నిన్న రాత్రి మీరు ఎక్కడి నుండి తిరిగి వస్తున్నారు?

06:27.179 --> 06:30.807
జెర్సీ. కాలేజీ చూడటానికి మా పిల్లల్ని తీసుకుని వెళ్లాం.

06:33.810 --> 06:36.355
చూడండి, నేరుగా అసలు విషయానికి వచ్చేస్తాను.

06:37.940 --> 06:39.483
నాకు మీ గురించి ఎక్కువగా తెలియదు.

06:40.526 --> 06:45.030
మిమ్మల్ని చూసి నేను గ్రహించింది ఏమిటంటే
మీ పరిస్థితి ఈ మధ్యకాలంలో బాగా దిగజారిపోయింది.

06:45.697 --> 06:47.783
మీరు ఒక ప్రాణాధారం కోసం ఆరాటపడుతున్నారు.

06:49.368 --> 06:54.623
ఇప్పుడు, నేను మీకు ఒక ప్రాణాధారాన్ని అందించడానికి
సిద్ధంగా ఉన్నాను.

06:55.791 --> 07:00.921
మీరు ఎలాంటి తప్పులు చేసినా కూడా...
నేను మీకు సాయం చేయగలను.

07:10.931 --> 07:12.015
విషయం ఏమిటంటే...

07:13.809 --> 07:15.686
ఏదో ఒక సందర్భంలో మీరు గీత దాటుతారు

07:16.603 --> 07:18.772
అప్పుడు మీకు నేను ఏమీ సాయం చేయలేను.

07:19.773 --> 07:25.779
ఇంకా ఆ సమయం వచ్చినప్పుడు,
నేను చేయగలిగిందల్లా మిమ్మల్ని అరెస్టు చేయడమే.

07:30.659 --> 07:34.496
సరే, దాని గురించి ఆలోచిస్తాను.
మీరు వచ్చినందుకు థాంక్స్, డిటెక్టివ్.

07:35.247 --> 07:36.456
మీరు సమయం ఇచ్చినందుకు థాంక్యూ.

07:48.969 --> 07:50.052
మంచిగానే మాట్లాడుకున్నారా?

07:50.053 --> 07:54.224
అవును. నా ఉద్దేశం, చూడు,
లాంఛనమైన ప్రశ్నలు. కేవలం ఖాళీల్ని పూరించడమే.

07:56.185 --> 07:57.186
బార్నీ ఎలా ఉన్నాడు?

07:58.228 --> 07:59.897
అతనికి దెబ్బలు బాగా తగిలాయి, కానీ కోలుకుంటాడు.

08:01.356 --> 08:03.900
విను, నిన్న రాత్రి జరిగిన దాని గురించి
మనం మాట్లాడుకుందామా? నేను...

08:03.901 --> 08:06.737
- నేను కేవలం...
- బహుశా ఇప్పుడు వద్దులే.

08:11.491 --> 08:12.701
సరే. అలాగే.

08:15.287 --> 08:16.371
నేను ఇంక వెళతాను.

08:18.165 --> 08:19.957
నిన్ను డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు.

08:19.958 --> 08:21.417
నేను మళ్లీ వచ్చి నిన్ను తీసుకువెళతాను.

08:21.418 --> 08:25.422
వద్దు, ఇలా చూడు. కేవలం... ఆలీని రమ్మని అడుగుతాను.
నువ్వు పిల్లలతో ఉండు.

08:35.599 --> 08:36.683
హేయ్, మెల్లీ.

08:40.437 --> 08:44.066
మనం వేరువేరు దారుల్లో ప్రయాణిస్తూనే ఉంటామా, హా?

08:46.276 --> 08:47.486
కాస్త విశ్రాంతి తీసుకో.

10:15.908 --> 10:17.867
- ...వేరే. నేను ఏదో ఒకటి ప్రయత్నించాలి.
- అది మంచిది.

10:17.868 --> 10:19.203
- సారీ, నేను వెళ్లాలి...
- సరే.

10:21.288 --> 10:22.289
నీ దగ్గర అంత మంచి వాసన వస్తోంది?

10:23.207 --> 10:25.333
ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాను. నీకు నచ్చలేదా?

10:25.334 --> 10:27.877
లేదు, నేను ఆ మాట అనలేదు. మనకి ఏం సమాచారం దొరికింది?

10:27.878 --> 10:29.420
ల్యాబ్ రిపోర్టులు.

10:29.421 --> 10:32.757
హత్యకి ఉపయోగించిన ఆయుధం .38 గన్.
మూడు కాల్పులు, ఒకే తుపాకీ.

10:32.758 --> 10:34.592
కానీ హతుడి భార్య దగ్గర ఉన్నది .22 తుపాకీ కదా?

10:34.593 --> 10:37.888
అవును. అయితే ఆమె నిజమే చెప్పింది,
ఆమె గన్ తో ఇంతవరకూ కాల్పులు జరపలేదు.

10:39.223 --> 10:40.723
కానీ అది ఏంటి?

10:40.724 --> 10:42.808
- అది టారస్ టి.ఎక్స్.22 గన్.
- లేదు, లేదు.

10:42.809 --> 10:44.519
నువ్వు వాడిన సెంటు. అది ఘాటు వాసన వస్తోంది.

10:44.520 --> 10:48.272
బాల్సమ్ బ్రీజ్. అచ్చమైన బాల్సమ్ నూనెతో తయారు చేస్తారు.
ఇంకా కాస్త సీడర్.

10:48.273 --> 10:50.399
సరే. ఇంకా ఏంటి?

10:50.400 --> 10:52.361
ఇంకా పులుపు పదార్థాలు, అనుకుంటా.

10:54.112 --> 10:54.946
అవును.

10:54.947 --> 10:59.493
గన్ షాట్ రెసిడ్యూ రిపోర్ట్ ప్రకారం
బాధితుడు కూడా తుపాకీ కాల్చాడని తెలుస్తోంది.

11:00.035 --> 11:03.079
కానీ ఘటనాస్థలంలో అదనపు బులెట్లు కానీ
తూటాల గుళ్లు కానీ కనిపించలేదు.

11:03.080 --> 11:06.499
కాబట్టి అతను దేనినో కాల్చి ఉంటాడు
లేదా ఎవరైనా పారిపోయి ఉంటారు.

11:06.500 --> 11:07.417
లేదా...

11:08.752 --> 11:10.087
- మనం ఏదైనా మిస్ అవుతుండచ్చు.
- అవును.

11:10.838 --> 11:12.964
మన ఆఫీసు నుండి స్థానిక ఆసుపత్రులకి ఫోన్లు చేయించాను

11:12.965 --> 11:15.675
తుపాకీ కాల్పులకి గురైన పేషంట్లు
ఎవరైనా అడ్మిట్ అయ్యారేమో అని అడగమన్నాను.

11:15.676 --> 11:18.594
హంతకులు సాధారణంగా
తమకు తాముగా ఎమర్జెన్సీ రూములకి వెళ్లి చేరరు.

11:18.595 --> 11:20.430
నీకు కూపర్ మీద అనుమానం ఉందా?

11:21.181 --> 11:24.643
ఈ కేసులో అతడిని అనుమానించాలో లేదో నాకు తెలియదు,
కానీ ఇంకో విషయంలో అతడిని అనుమానిస్తాను.

11:27.062 --> 11:28.689
నీ దగ్గర క్రిస్మస్ చెట్టు వాసన వస్తోంది.

11:32.234 --> 11:34.819
కాబట్టి వాళ్లు సిటీలో ఉన్న ప్రతి బెస్ట్ బై దుకాణానికీ వెళ్తారు.

11:34.820 --> 11:37.071
అక్కడ వాళ్లు ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవులు కొంటారు.

11:37.072 --> 11:40.616
కొత్త వాటిల్లా కనిపించే పాత మోడళ్లని తీసుకువెళ్లి

11:40.617 --> 11:43.160
వాటిని తిరిగి ఇచ్చేస్తారు.

11:43.161 --> 11:47.331
తరువాత ఆ కొత్త హార్డ్ డ్రైవుల్ని మళ్లీ కొత్తగా ప్యాక్ చేసి
ఆన్ లైన్ లో అమ్మేస్తారు, పూర్తి ధరకి.

11:47.332 --> 11:51.127
అయితే ఈ కథ నీ స్నేహితుడు మిగ్గీ
తన తల్లికి ఒక కొత్త ఇల్లు కొనిపెట్టడంతో ముగుస్తుందా?

11:51.128 --> 11:53.296
లేదు, అలా ముగియదు.

11:53.297 --> 11:56.300
పోలీసులు వాటి సీరియల్ నెంబర్ల ద్వారా
అతని కార్డుల మీద జరిపిన లావాదేవీల్ని గుర్తించారు

11:57.009 --> 11:58.176
తరువాత అతడిని పట్టుకున్నారు.

11:58.177 --> 11:59.677
మరి నువ్వు ఆశ్చర్యపోయావా?

11:59.678 --> 12:01.596
అతను చాలా కాలం జైలులో ఉన్నాడు.

12:01.597 --> 12:03.347
విచిత్రమైన పరిస్థితులలో బయటపడ్డాడు.

12:03.348 --> 12:05.309
తన మూర్ఖత్వమే అతడిని పట్టించింది.

12:09.980 --> 12:11.315
ఛ. చచ్చాం.

12:18.822 --> 12:22.034
ఇప్పటికీ, నిజంగా, నువ్వు అందంగా కనిపిస్తున్నావు.

12:22.910 --> 12:23.910
ఏంటి సంగతి, ఎలీనా?

12:23.911 --> 12:24.995
లేదు.

12:25.621 --> 12:26.954
ఏంటి?

12:26.955 --> 12:29.081
రిలాక్స్. నేను ఊరికే అంటున్నాను.

12:29.082 --> 12:30.918
అయినా నువ్వు మంచిగా కనిపిస్తున్నావు.

12:32.377 --> 12:33.878
నీకు ఏం కావాలి, ఫెలిక్స్?

12:33.879 --> 12:35.589
ఏమీ వద్దు. నేను బాగానే ఉన్నాను.

12:36.465 --> 12:38.549
మన చిన్న మేక పిల్ల నుంచి నా డబ్బు తీసుకోవాలి,

12:38.550 --> 12:39.635
ఆ తరువాత నా పని పూర్తయిపోతుంది.

12:40.802 --> 12:42.053
అతను దేని గురించి మాట్లాడుతున్నాడు?

12:42.054 --> 12:43.888
నీకు తెలియదా?

12:43.889 --> 12:45.098
అయ్యో.

12:45.891 --> 12:48.351
నేను కొన్ని డ్రగ్స్ అమ్మాను. అంతే.

12:48.352 --> 12:50.603
అంటే, అంతే చేశాడు.

12:50.604 --> 12:52.939
కానీ మన కుర్రవాడు వాటిని ఇవ్వడంలో తడబడ్డాడు.

12:52.940 --> 12:54.650
దానితో పోలీసులు నా వెంట పడ్డారు.

12:57.069 --> 12:59.195
ఈ చెత్తవెధవ ఒక సైరన్ విని,

12:59.196 --> 13:02.740
వణికిపోయాడు, దాంతో మొత్తం డ్రగ్స్ ని కింద పడేశాడు.

13:02.741 --> 13:04.033
ఎక్కడ పడేశాడు?

13:04.034 --> 13:05.452
అదే అసలైన ఘట్టం.

13:06.411 --> 13:07.412
ఆమెకి చెప్పు.

13:07.996 --> 13:09.206
తూర్పు నదిలో.

13:10.374 --> 13:12.918
ఏ పెద్ద చేపో ఆ డ్రగ్స్ మింగి
మంచి మైకంలో ఎక్కడో పడి ఉంటుంది.

13:14.044 --> 13:15.754
విషయం ఏమిటంటే, అతని దగ్గర డబ్బు లేదు.

13:16.338 --> 13:17.922
సరే, ఎంత?

13:17.923 --> 13:20.425
నువ్వు చెబుతావా, లేదా నన్ను చెప్పమంటావా?

13:21.593 --> 13:23.178
లక్షా యాభై వేల డాలర్లు.

13:24.304 --> 13:25.930
ఓరి మూర్ఖుడా.

13:25.931 --> 13:29.016
నిజానికి, లక్షా డెబ్బై ఐదు వేలు.

13:29.017 --> 13:32.228
ఇంకా వచ్చే వారానికి అది రెండు వందలో
ఇంకా ఎక్కువో అవుతుంది.

13:32.229 --> 13:34.772
దానికి వడ్డీ చాలా ఎక్కువ.

13:34.773 --> 13:39.026
చూడు, అంత డబ్బు మీ దగ్గర ఉండదని
నాకు ఖచ్చితంగా తెలుసు.

13:39.027 --> 13:41.904
కానీ నేను దాన్ని ఊరికే అలా వదిలిపెట్టలేను.

13:41.905 --> 13:43.198
నేను విడిచిపెడతానా?

13:44.491 --> 13:45.993
- నేను విడిచిపెట్టగలనా?
- సరే.

13:47.953 --> 13:49.579
అది అంత సమస్య ఏమీ కాదు.

13:49.580 --> 13:51.331
దాని సంగతి నేను చూసుకుంటాను.

13:52.416 --> 13:55.169
- నువ్వు చూసుకుంటావా?
- అవును, అది నిజం.

14:01.758 --> 14:05.136
నీ గురించి చివరిసారిగా విన్నది, నువ్వు ఎక్కడో
ఊరి అవతల ఇళ్లలో టాయిలెట్లు కడుగుతున్నావని.

14:05.137 --> 14:07.180
నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?

14:07.181 --> 14:09.808
అది నీకు అనవసరం.

14:13.061 --> 14:16.314
నిన్ను ఎప్పుడూ ఇష్టపడతాను, ఎలీనా.

14:16.315 --> 14:18.817
నువ్వు చాలా సమర్థురాలివని మనవాళ్లంతా అంటారు.

14:22.196 --> 14:25.574
పైగా మనిద్దరికీ చాలాకాలంగా పరిచయం ఉంది కాబట్టి,
నేను వడ్డీని మినహాయిస్తున్నాను.

14:26.742 --> 14:28.785
నాకు అసలు మొత్తం...

14:30.078 --> 14:31.078
వచ్చే వారం కల్లా ఇచ్చేయాలి,

14:31.079 --> 14:34.833
అప్పుడు నేను మన బుజ్జి మేక పిల్లని విడిచిపెట్టేస్తాను.

14:43.008 --> 14:45.385
ఇవి ఇంత రుచిగా ఉన్నాయేంటి?

14:46.261 --> 14:49.973
వాళ్లు ఇవి, అంటే,
రోజుకి వెయ్యి కోట్లు తయారు చేస్తారని మీకు తెలుసా?

14:50.933 --> 14:53.560
ఎంత భారీగా ఉత్పత్తి చేస్తే అంత లాభం.

14:54.102 --> 14:55.687
అదీ సంగతి.

14:56.563 --> 14:58.022
సరే.

14:58.023 --> 15:00.734
నిన్ను కలుస్తుంటాను, మేక పిల్ల.

15:03.195 --> 15:05.196
ఇంకా ఎలీనా,

15:05.197 --> 15:08.783
నువ్వు నిజంగా బాగా డబ్బు గడించే పనులు చేయాలి అనుకుంటే

15:08.784 --> 15:10.953
నా దగ్గర నీ కోసం ఎప్పుడూ ఒక స్థానం
ఉంటుందనే సంగతి నీకు తెలుసు.

15:15.499 --> 15:16.500
ఆహ్... హా?

15:17.668 --> 15:19.211
నోరు మూసుకుని పో, ఫెలిక్స్.

15:32.724 --> 15:33.934
చెత్తవెధవ.

15:39.815 --> 15:41.441
లక్షా యాభై వేల డాలర్లా?

15:43.569 --> 15:47.864
నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? నీకు అసలు ఏమైంది?

15:47.865 --> 15:49.699
అయితే ఏంటి?

15:49.700 --> 15:52.285
నువ్వు చాలా ఏళ్ల పాటు జిసేల్ ఇంకా రాఫ్ కోసం
డ్రగ్స్ అమ్మావు.

15:52.286 --> 15:56.414
అది ఎప్పుడో శాంటియాగోలో ఉన్నప్పటి సంగతి, డామిట్.
ఇక్కడ మనకి వేరే అవకాశాలు ఉన్నాయి.

15:56.415 --> 15:57.582
అబద్ధం.

15:57.583 --> 15:59.877
బహుశా నీకు ఉన్నాయేమో.

16:32.826 --> 16:34.661
ఈ హాస్పిటల్ లో ఆహారం ఏమీ బాగాలేదు.

16:37.331 --> 16:39.124
- ఇది నువ్వు వండావా?
- నేను కాదు.

16:42.252 --> 16:44.963
ప్రిన్స్ టన్ యూనివర్సిటీ

16:53.597 --> 16:54.640
హేయ్, ఆండీ.

16:55.474 --> 16:58.267
హేయ్. వచ్చినందుకు థాంక్స్.

16:58.268 --> 16:59.519
పరాచికాలు ఆడుతున్నావా?

16:59.520 --> 17:02.898
నేను ఈ మధ్యకాలంలో డ్రైవ్ చేయలేదు.
అది ఎంత సరదాగా ఉంటుందో కూడా మర్చిపోయాను.

17:03.690 --> 17:05.650
- నీకు కనీసం లైసెన్స్ ఉందా?
- ఉంది.

17:05.651 --> 17:08.694
అంటే, టెక్నికల్ గా అది గడువు తీరిపోయింది, కానీ ఉంది.

17:09.363 --> 17:10.571
నీకు ఇంటికి వెళ్లాలని ఉందా?

17:11.240 --> 17:12.824
లేదు.

17:14.409 --> 17:17.454
కాస్త రోడ్డు మీద మాత్రమే నడపడానికి ప్రయత్నించు, సరేనా?

17:20.582 --> 17:22.751
- అయితే ఆ డిటెక్టివ్...
- లిన్, అవును.

17:23.502 --> 17:25.877
అవును, ఆమె ఇంటికి వచ్చింది.

17:25.878 --> 17:27.548
- ఆమె వచ్చిందా?
- అవును.

17:28.674 --> 17:31.801
పాల్ లెవిట్ చనిపోయిన రోజు రాత్రి
నువ్వు ఇంటికి వచ్చావని చెప్పాను.

17:31.802 --> 17:33.178
నువ్వు నాతోనే ఉన్నావని చెప్పాను.

17:33.929 --> 17:34.930
సరే.

17:35.931 --> 17:38.976
విను, పాల్ హత్య కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని
నీకు తెలుసు, కదా?

17:39.726 --> 17:41.854
తెలుసు. నువ్వు హంతకుడివి కావని నాకు తెలుసు.

17:43.564 --> 17:46.984
నువ్వు హంతకుడివే అయినా కూడా, నాకున్నది నువ్వు ఒక్కడివే.

17:51.697 --> 17:53.282
స్టాప్ చిహ్నం.

18:17.347 --> 18:19.182
- హేయ్.
- హాయ్.

18:19.183 --> 18:20.725
ఓహ్, దేవుడా. నువ్వు అబద్ధం ఆడటం లేదు.

18:20.726 --> 18:22.769
నాకు తెలుసు.

18:26.273 --> 18:29.108
ఒక మనిషిని పాతిపెట్టాలంటే
ఎంత పేపర్ వర్క్ చేయాలో ఆలోచిస్తే,

18:29.109 --> 18:30.610
ఆశ్చర్యం అనిపిస్తుంది.

18:30.611 --> 18:32.195
సరే, నాకు పని అప్పగించు.

18:32.196 --> 18:33.405
సరే, అంటే...

18:34.406 --> 18:36.533
- నీకు తాగడానికి ఏమైనా తెచ్చిపెట్టనా?
- హాయ్, నాకు కేవలం...

18:37.284 --> 18:38.576
తను తాగుతున్న డ్రింకే నాకు కూడా కావాలి.

18:38.577 --> 18:41.246
ఒక విషయం చెప్పనా? ఇవన్నీ తీసేసుకో.

18:41.914 --> 18:42.873
అవును.

18:43.498 --> 18:45.791
డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలన్న సంగతి నాకు తెలియదు.

18:45.792 --> 18:47.710
అవును. ఇదంతా గందరగోళంగా ఉంటుంది.

18:47.711 --> 18:50.421
నా ఉద్దేశం, విషాదంలో ఉన్న భార్యలకి
ఇదంతా మంచి కాలక్షేపం,

18:50.422 --> 18:54.300
కానీ నిజం చెప్పాలంటే, నేను విషాదంలో ఉన్నానో లేదో
ఖచ్చితంగా చెప్పలేను.

18:54.301 --> 18:57.094
అందులో తప్పు లేదు. నువ్వు ఇక్కడ ఇంకా
ఎంత కాలం ఉండాలి?

18:57.095 --> 18:58.889
ఈ ఇంట్లో పోలీసుల పరిశోధన ఇంకా పూర్తి కాలేదు.

19:01.808 --> 19:02.809
హేయ్.

19:04.019 --> 19:05.020
నువ్వు ఎలా ధైర్యంగా ఉంటున్నావు?

19:06.230 --> 19:07.563
నేను కేవలం... నేను...

19:07.564 --> 19:10.108
నాకు నిజానికి ఇదంతా పూర్తిగా అర్థం కావడం లేదు.

19:10.776 --> 19:17.658
నా ఉద్దేశం, నాకు, పాల్ కి మధ్య
సత్సంబంధాలు లేవని ప్రతి ఒక్కరికీ తెలుసు.

19:18.951 --> 19:22.495
కానీ ఇప్పుడు నేను అతని సంస్మరణ కార్యక్రమం నిర్వహించాలా?
జనం నా గురించి ఏం అనుకుంటారు?

19:22.496 --> 19:25.082
"అతడిని నువ్వు ద్వేషించేదానివని నాకు తెలుసు,
కానీ ఇదిగో ఈ వంటకం చూడు" అంటారా?

19:25.874 --> 19:27.583
నీకు తెలుసు, నాకు కాసరోల్ వంటకం అంటే చిరాకు.

19:27.584 --> 19:29.294
నేను గుర్తుంచుకుంటాను. కాసరోల్ వంటకం ఉండదు.

19:30.587 --> 19:31.754
- థాంక్యూ.
- సంతోషం.

19:31.755 --> 19:35.132
భర్త మరణించాక భార్యలు విషాదాన్ని నటించడం అనే జబ్బు
ఏదైనా ఉండచ్చు అంటావా?

19:35.133 --> 19:37.927
ఓహ్, అవును. నేను అనుకోవడం
ప్రతి విషయానికీ నటించే జబ్బు ఉంటుంది.

19:37.928 --> 19:40.596
- నా ఉద్దేశం, నేను కొంత బాధపడుతున్నాను, నిజంగా.
- అది సహజం.

19:40.597 --> 19:42.182
కానీ, చూడు,

19:43.058 --> 19:45.601
అందరూ నా మీద జాలి చూపించినప్పుడల్లా,

19:45.602 --> 19:48.480
నాకు ఏ బస్సునో ఢీకొట్టాలి అనేంత చిరాకు కలుగుతుంది.

19:49.147 --> 19:52.483
నా ఉద్దేశం, చివరిసారిగా కూడా నన్ను అగౌరవపర్చకుండా
అతను చనిపోలేకపోయాడు.

19:52.484 --> 19:55.570
నా ఉద్దేశం, నీకు చేతులెత్తి మొక్కాలి, పాల్.
గొప్పగా వ్యూహం పన్నావు.

19:55.571 --> 19:58.489
కానీ... సారీ, నా బాధంతా నీ దగ్గర వెళ్లగక్కాలి అనుకోలేదు.
నాకు తెలుసు ఎందుకంటే నేను విన్నాను...

19:58.490 --> 20:00.575
- సరదాగా అంటున్నావా?
- లేదు, నేను కూప్ గురించి విన్నాను.

20:00.576 --> 20:02.410
- పిచ్చిగా మాట్లాడకు.
- లేదు, అతను ఎలా ఉన్నాడు?

20:02.411 --> 20:05.329
అతను కొద్దిగా కష్టాల్లో ఉన్నాడు, కానీ బయటపడతాడు.

20:05.330 --> 20:07.373
దేవుడా. కూప్ ని ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకుంటారు?

20:07.374 --> 20:08.625
నేను కాకుండా అంటావా?

20:09.459 --> 20:10.752
ఆగు, అతను ఏం చేశాడు?

20:11.295 --> 20:12.337
ఊరికే అంటున్నాను.

20:12.921 --> 20:17.176
నిజానికి నాకు అతని గురించి ఆందోళనగా ఉంది.
అతను ఏదో సమస్యతో సతమతం అవుతున్నాడు అనిపిస్తోంది.

20:18.302 --> 20:19.802
దాన్ని నువ్వు పరిష్కరించాల్సిన అవసరం లేదు.

20:19.803 --> 20:21.429
నాకు తెలుసు,

20:21.430 --> 20:26.267
కానీ ఒక మనిషితో మనం చాలాకాలం గడిపిన తరువాత,
వ్యక్తిగతంగా ఒక అనుబంధం ఏర్పడుతుంది.

20:26.268 --> 20:28.519
కానీ ఇప్పుడు మేము విడాకులు తీసుకున్నాం కాబట్టి,

20:28.520 --> 20:32.774
అలా నిద్రలేచి అతనితో ఉన్న అనుబంధాన్ని
హఠాత్తుగా మర్చిపోవడం లాంటిది కాదు ఇది.

20:33.817 --> 20:36.611
మేము టోరీతో కలిసి కాలేజ్ టూర్ కోసం
ఈ మధ్యనే ప్రిన్స్ టన్ కి వెళ్లాం

20:36.612 --> 20:37.946
ఇంకా, నీకు తెలుసా, అది ఎలా ఉందంటే...

20:40.365 --> 20:45.329
చిన్న టైమ్ క్యాప్సూల్. "ఎస్ఎస్ఎ-721" మాదిరిగా ఉంది.

20:46.705 --> 20:48.247
కానీ... నాకు అర్థం కాలేదు.

20:48.248 --> 20:51.251
అంత్యక్రియల డైరెక్టర్...
ఇదంతా అంత్యక్రియల డైరెక్టర్ చేయాల్సిన పని కదా?

20:52.211 --> 20:56.548
అవును. అది ఆ కాగితాల మీదకి వెళుతుంది.
దాని పేరు 'ఇతర వ్యక్తుల చెత్త.'

20:58.759 --> 21:02.720
ఓహ్, దేవుడా. చూడు. సరిగ్గా ఇక్కడ.

21:02.721 --> 21:07.559
ఆస్తి హక్కు కోసం పిటీషను.
చట్టపరమైన భాషలో చెప్పాలంటే, మనకి ఇంకా చాలా వైన్ కావాలి.

21:08.769 --> 21:10.228
సరే, ఇప్పుడు నేను నిపుణురాలిని అయిపోయాను.

21:10.229 --> 21:11.396
ఎక్స్ క్యూజ్ మీ?

21:20.739 --> 21:23.283
యాభై డాలర్లు నష్టపోయాక
దానితో ఎవరూ ఆడలేరు అనే విషయం అర్థమైంది.

21:25.327 --> 21:27.828
నీ జుట్టుని ఏమైనా వేరేలా మార్చుకున్నావా?

21:27.829 --> 21:29.163
నేను తరువాత అదే పని చేయాలి.

21:29.164 --> 21:31.290
సరే, నువ్వు ఆ సెంటు వాడటం మానేసి మంచి పని చేశావు.

21:31.291 --> 21:32.667
నీకు అది నచ్చలేదని తెలుసు.

21:32.668 --> 21:33.836
అవును, నాకు నచ్చలేదు.

21:36.839 --> 21:39.215
అతని గర్ల్ ఫ్రెండ్ తో విచారణ ఎలా సాగింది? మిస్టీ కదా?

21:39.216 --> 21:43.594
అంత గొప్పగా ఏమీ జరగలేదు.
అందరు రెండో భార్యల్లాగే మాట్లాడింది.

21:43.595 --> 21:45.721
అతను చనిపోయినందుకు చాలా బాధలో ఉన్నట్లు కనిపించింది.

21:45.722 --> 21:50.309
అయితే, తన కొత్త రేంజ్ రోవర్ కారుని
ఇంక దక్కించుకోలేనన్న బాధే ఆమెలో ఎక్కువగా ఉంది.

21:50.310 --> 21:51.686
నీ సంగతి ఏంటి? నీకు ఏమైనా ఆధారాలు దొరికాయా?

21:51.687 --> 21:55.398
అమోనియాలో రక్తపు నమూనాలు దొరికాయని ఫోరెన్సిక్ వాళ్లు చెప్పారు.

21:55.399 --> 21:56.900
అవి పాల్ రక్తంతో సరిపోలడం లేదు.

21:57.651 --> 21:59.778
చూడబోతే మన వాడు అతనితో గొడవ పడినట్లు ఉన్నాడు.

22:01.071 --> 22:02.363
మరి హాస్పిటల్స్ సంగతి ఏంటి?

22:02.364 --> 22:03.657
తుపాకీ కాల్పులకి గురైన వారెవరూ లేరు.

22:05.200 --> 22:07.578
అయినా కూడా, ఈ నేరఘటనాస్థలంలో
ఎవరికో గానీ గాయాలు అయ్యాయి.

22:08.328 --> 22:09.663
ఆ తరువాత అతను దాన్ని తుడిచేశాడు.

22:12.416 --> 22:15.627
ఎవరికైనా పిల్లలు ఎందుకు పుడతారో
నాకు నిజంగా అర్థం కాదు.

22:17.337 --> 22:19.422
ఇలా చూడు. నువ్వు ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచించలేదా?

22:19.423 --> 22:20.631
లేదు.

22:20.632 --> 22:22.217
నాకు చాలామంది పిల్లల్ని కనాలని ఉంది.

22:23.093 --> 22:25.011
సరే, మొదటగా, నీతో కలిసి రెండు నెలలయినా గడపగలిగే

22:25.012 --> 22:26.095
అమ్మాయిని ఎవరినైనా వెతుకుదాం.

22:26.096 --> 22:29.224
అది అన్యాయం. కొన్నిసార్లు వాళ్లే నన్ను వదిలేసి వెళ్లిపోతారు.

22:31.351 --> 22:33.103
అది ఏంటి?

22:34.188 --> 22:36.481
దాన్ని కుచ్చు అంటారు అనుకుంటా.

22:42.070 --> 22:43.322
ఇది ఆయాల కోసం పెట్టే కెమెరా.

22:46.325 --> 22:47.742
అందులో ఏ ఆధారం దొరుకుతుంది అనుకుంటున్నావు?

22:47.743 --> 22:50.746
బహుశా ఏమీ ఉండకపోవచ్చు,
కానీ ఒకసారి చూడటంలో తప్పు లేదు.

23:06.637 --> 23:07.970
హలో, హెక్టర్.

23:07.971 --> 23:09.805
ఓహ్! మంచి దేవుడా!

23:09.806 --> 23:11.599
ఇక్కడ ఏం చేస్తున్నావు?

23:11.600 --> 23:13.601
నువ్వు నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వడం లేదు.

23:13.602 --> 23:15.770
నేను ఎలాంటి సమస్యల్లో ఉన్నానో నువ్వు కనీసం ఊహించలేవు.

23:15.771 --> 23:17.271
ఆ హత్య జరిగినప్పటి నుండి,

23:17.272 --> 23:19.649
అలారం పరికరాలని మెరుగుపర్చాలని
ఆగకుండా ఫోన్లు వస్తూనే ఉన్నాయి.

23:19.650 --> 23:21.234
అన్నీ వెస్ట్ మాంట్ విలేజ్ నుండే వస్తున్నాయి.

23:21.235 --> 23:23.737
ఈ వ్యాపారం బాగానే ఉన్నట్లుంది.

23:24.571 --> 23:26.989
మీజా, ఏదైనా ఘటన జరిగిందా?

23:26.990 --> 23:28.366
అంటే ఎలాంటిది?

23:28.367 --> 23:30.826
ఒక ఇంట్లో దొంగతనం కోసం చేసిన ప్రయత్నం
విఫలమైందని చెబుతున్నారు.

23:30.827 --> 23:32.912
నేను ఎప్పుడూ ఆ ఇంటి దగ్గరకి కూడా వెళ్లలేదు.

23:32.913 --> 23:36.416
నిజంగా, నేను ఎవరినీ చంపలేదు.
అది దారుణమైన ఆలోచన, హెక్టర్.

23:37.709 --> 23:39.085
ఆ జార్జ్ క్లూనీ సంగతి ఏంటి?

23:39.086 --> 23:40.169
అతను కూడా చేయలేదు.

23:40.170 --> 23:42.046
కూప్ కూడా ఏ నేరమూ చేయలేదు.

23:42.047 --> 23:43.506
అది నీకెలా తెలుసు?

23:43.507 --> 23:45.132
ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు.

23:45.133 --> 23:46.592
నువ్వు అతనితో శృంగారం చేస్తున్నావా?

23:46.593 --> 23:48.387
దేవుడా! ప్లీజ్ ఆపు.

23:49.304 --> 23:51.931
ఆ తెల్లవాడితో కలిసి నువ్వు ఏం చేస్తున్నావనే ఆలోచనలతో

23:51.932 --> 23:54.225
నాకు అసలు నిద్రపట్టడం లేదు.

23:54.226 --> 23:57.478
పైకప్పు కేసి చూస్తూ, ఎప్పుడు ఏ పొరపాటు చేసి
దొరికిపోతావో అని ఆందోళన పడుతుంటాను.

23:57.479 --> 23:59.605
నువ్వు నా గురించి ఆందోళనపడనక్కర లేదు.

23:59.606 --> 24:01.148
నేను నీ గురించి ఆందోళన పడటం లేదు.

24:01.149 --> 24:03.860
మాటల్లో పెట్టి అలాంటి నేరాల్లోకి
నన్ను కూడా లాగుతావేమో అని భయపడుతున్నాను.

24:03.861 --> 24:05.486
మనం క్రిమినల్స్ కాదు, ఎలీనా.

24:05.487 --> 24:07.238
చూడు, నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది.

24:07.239 --> 24:09.949
కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇది నేను చూసుకోగలను.

24:09.950 --> 24:12.201
లేదు, నేను మీతో కలవను.

24:12.202 --> 24:15.789
నేనే గనుక నీ స్థానంలో ఉంటే,
ఇప్పుడే నేను కూడా బయటపడేవాడిని.

24:17.374 --> 24:20.961
ఫెలిక్స్ కి చీవో లక్షా యాభై వేల డాలర్లు బాకీ పడ్డాడు.

24:21.545 --> 24:22.587
ఛ.

24:22.588 --> 24:26.008
పైగా ఆ విషయం నీకు తెలుసు.

24:27.176 --> 24:29.343
చీవో ఆ మనుషులతో కలిసి తిరుగుతున్నాడని విన్నాను.
నాకు అంతే తెలుసు.

24:29.344 --> 24:31.679
నాకు ముందే హెచ్చరించాలని నీకు అనిపించలేదా?

24:31.680 --> 24:33.639
నీ పరిస్థితి బాగుంది.
తన వల్ల నువ్వు నష్టపోకూడదని అనుకున్నాను.

24:33.640 --> 24:36.435
వాడి గురించి నాకు చెప్పి ఉంటే
ఆ నష్టాన్ని మొదటే ఆపి ఉండేదాన్ని.

24:37.186 --> 24:38.812
అయితే అది నా తప్పే అంటావా?

24:40.772 --> 24:42.733
ఇంటికి వెళ్లు, ఎలీనా.

24:58.540 --> 25:00.333
సరే, మిస్ లెవిట్,

25:00.334 --> 25:03.504
మీ వాంగ్మూలాన్ని సవరిస్తారని అనుకుంటున్నాను.

25:17.726 --> 25:20.687
ఆ కూప్ అనే మనిషి గురించి
మనం మరింత నిశితంగా పరిశీలించాలి.

25:21.188 --> 25:22.189
అలాగే.

25:26.944 --> 25:28.111
దేవుడా, ఈ మనుషులు.

25:28.737 --> 25:30.781
ఆమె చెబుతున్న దానికన్నా
ఆమెకి ఇంకా ఎక్కువ తెలుసు అనిపిస్తోందా?

25:33.116 --> 25:34.117
సరే.

25:45.379 --> 25:46.380
హేయ్.

25:52.344 --> 25:53.345
హేయ్.

26:22.332 --> 26:24.710
- హేయ్, గొప్ప ప్రదర్శన.
- థాంక్స్.

26:26.378 --> 26:27.671
నిన్ను ఇంటి వరకూ దిగబెట్టమంటావా?

26:32.134 --> 26:33.385
అలాగే.

26:37.472 --> 26:39.182
- నీ ఉద్యోగం ఎలా ఉంది?
- బాగానే ఉంది.

26:39.183 --> 26:40.267
- అవునా?
- అవును.

27:11.840 --> 27:12.758
బింగో.

27:21.183 --> 27:22.184
అవును.

27:22.684 --> 27:26.229
మొదటగా, అది వెస్ట్ లేక్. బైరమ్ హిల్స్ కాదు.

27:26.230 --> 27:28.564
- అదంతా నువ్వు ఎలా గుర్తుంచుకుంటావు?
- నువ్వు ఎలా గుర్తుంచుకోవు?

27:28.565 --> 27:29.983
నన్ను ఇంట్లో నిర్బంధించడం నాకు గుర్తుంది.

27:30.567 --> 27:33.236
సరే, నా వైపు చూడకు. దొరికిపొమ్మని నేను నీకు చెప్పలేదు.

27:33.237 --> 27:35.948
అమ్మ కారు టైర్లకి మొత్తం గడ్డి ఇంకా మట్టి అంటుకుపోయింది.

27:36.573 --> 27:38.617
కానీ, అదృష్టం కొద్దీ మీ అమ్మ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు.

27:39.201 --> 27:41.203
నేను నిన్ను చెడగొడుతున్నానని ఆమె ఎప్పుడూ అనుకునేది.

27:41.703 --> 27:43.287
ఆమె చెప్పింది సరైనదే కావడం నాకు చిరాకు కలిగిస్తుంది.

27:43.288 --> 27:44.747
హేయ్, ఆమె అనుకున్నది తప్పు.

27:44.748 --> 27:47.334
నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో...

27:49.086 --> 27:50.128
అది నీ తప్పు కాదు.

27:50.879 --> 27:52.130
ఆ మాట అనడం నీ మంచితనం.

27:53.173 --> 27:54.423
ఇంకా హేయ్, నువ్వు లేకపోయి ఉంటే,

27:54.424 --> 27:56.844
హై స్కూలులో నేను అంత సరదాగా గడిపి ఉండేవాడిని కాదు.

27:57.344 --> 27:59.513
నేను బోరింగ్ గా ఉండేవాడిని, ఫుట్ బాల్ ఆడుతుండేవాడిని.

28:00.222 --> 28:01.223
ఇంకా నువ్వు...

28:02.641 --> 28:03.641
నువ్వు దేనికీ భయపడే దానివి కాదు.

28:03.642 --> 28:05.268
అప్పట్లో నేను మందులు వాడేదాన్ని కాదు.

28:05.269 --> 28:06.478
నిన్ను ఆరాధించేవాడిని.

28:07.104 --> 28:08.105
ఇప్పటికీ నిన్ను ఆరాధిస్తాను.

28:08.605 --> 28:11.108
అందుకే నా షోస్ కి వస్తున్నావా? నన్ను ఆరాధించడానికా?

28:11.984 --> 28:13.318
నిన్ను ఆ వేదిక మీద చూడటం నాకు ఇష్టం.

28:13.986 --> 28:15.362
నువ్వు మళ్లీ నీలాగే కనిపిస్తున్నావు.

28:15.988 --> 28:17.281
కనిపించడం అంటే అది ఎలా ఉంటుంది?

28:19.908 --> 28:23.203
నేను చేయాలి అనుకుని చేయలేకపోయిన పనిని
తను చేయగలిగేలా ఉండటం.

29:01.325 --> 29:02.326
ఓహ్, బాబోయ్.

29:09.291 --> 29:10.375
ఓహ్, బాబోయ్.

29:14.046 --> 29:15.672
ఛ. డామిట్.

29:30.103 --> 29:32.688
అదీ. ఆ గిఫ్ట్ షాపులో అత్యంత ఖరీదైనది ఇదే ఉంది.

29:32.689 --> 29:34.775
అయితే ఇది లేదా ఒక బెలూన్ బొకే ఉంది, కాబట్టి...

29:42.533 --> 29:43.909
నీకు ఏమైనా తీసుకురమ్మంటావా?

29:44.743 --> 29:45.869
ఆ మనుషులు ఎవరు?

29:47.079 --> 29:48.287
నాకు తెలియదు.

29:48.288 --> 29:49.706
అబద్ధం చెప్పకు.

29:51.416 --> 29:54.252
బార్నీ, ఇలా చూడు. నన్ను నమ్ము.
ఆ వెధవలు ఎవరో నాకు తెలియదు.

29:54.253 --> 29:55.754
విషయం ఏమిటంటే, కూప్,

29:56.630 --> 29:57.631
నేను నిన్ను నమ్మను.

29:58.215 --> 29:59.465
నీ విషయంలో ఏదో జరుగుతోంది, బాబు.

29:59.466 --> 30:01.468
అది ఏమిటో, నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదో
నాకు తెలియడం లేదు.

30:02.135 --> 30:05.096
కానీ నేను నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను,
కానీ నువ్వు మాత్రం నాకు అబద్ధాలు చెబుతున్నావు.

30:05.097 --> 30:07.890
- హేయ్, చూడు, బార్న్, ఇది అలా కాదు.
- నువ్వు నాకు డబ్బు కట్ట చేతిలో పెట్టావు.

30:07.891 --> 30:10.018
- బార్నీ, ఇలా చూడు...
- నాకు అబద్ధాలు చెప్పకు!

30:17.651 --> 30:18.985
నేను నిన్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాను.

30:18.986 --> 30:20.070
సరే, మంచి పని చేశావు.

30:23.240 --> 30:24.283
నువ్వు ఇంక వెళ్లచ్చు.

30:24.867 --> 30:27.828
- నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?
- నువ్వు వెళ్లిపోతే సంతోషిస్తాను.

30:41.216 --> 30:44.093
గుడ్ మార్నింగ్. నాన్నా. హెర్నాండెజ్.

30:44.094 --> 30:46.263
- గుడ్ మార్నింగ్.
- నిన్న రాత్రి రేయన్ డేట్ కి వెళ్లాల్సి ఉంది తెలుసా?

30:46.805 --> 30:48.015
ఓహ్, తెలుసు. హెయిర్ జెల్ వల్ల తెలిసింది.

30:49.266 --> 30:50.267
అది ఎలా సాగింది?

30:51.393 --> 30:53.144
- అతను అందుకోలేకపోయాడు.
- మరేం ఫర్వాలేదు, ఆర్ట్.

30:53.145 --> 30:54.980
కొన్నిసార్లు మేము రాత్రి వరకూ పని చేయాలి, నాన్నా.

30:56.857 --> 30:58.066
మనం ఇంక పనికి బయలుదేరుదామా, ప్లీజ్?

30:59.359 --> 31:00.360
హేయ్.

31:00.861 --> 31:02.653
నేను కోడిగుడ్లు ఉడకబెట్టాను. కూర్చో.

31:02.654 --> 31:04.114
ఆయన కోడిగుడ్లు ఉడకబెట్టాడు.

31:08.744 --> 31:09.745
అయితే,

31:10.412 --> 31:12.955
ఆ చెత్త కుండీలోకి దూకి వెతికావు కదా,
ఏదైనా పనికొచ్చేది దొరికిందా?

31:12.956 --> 31:15.042
అవును, వాస్తవానికి. నాకు రక్తం శాంపిల్ దొరికింది.

31:16.043 --> 31:19.087
ఘటనాస్థలంలో అమోనియాలో దొరికిన రక్తపు నమూనాలతో
ఆండ్రూ కూపర్ రక్తం మ్యాచ్ అయింది.

31:21.840 --> 31:24.133
- అది మళ్లీ చెప్పు.
- ల్యాబ్ వాళ్లు ఇందాకే ఫోన్ చేశారు. ఆ రక్తం మ్యాచ్ అయింది.

31:24.134 --> 31:26.470
కానీ మనం ఇక్కడ కూర్చుని
నీ డేట్ గురించి మాట్లాడుకుంటున్నామా?

31:27.346 --> 31:28.639
మనం ఇంక వెళ్లాలి. ఇది చాలా పెద్ద విషయం.

31:29.723 --> 31:31.516
నేను వాస్తవానికి డేట్ కి వెళ్లలేదు.

31:31.517 --> 31:33.060
హెర్నాండెజ్, పద.

32:13.350 --> 32:14.685
మిసెస్ లెవిట్?

32:15.269 --> 32:16.687
అతిథులు రావడం మొదలయింది.

32:23.402 --> 32:26.029
హాయ్, బంగారం. చాలా సారీ.

32:26.864 --> 32:28.657
చాలా బాధగా ఉంది. మేము నిన్ను ఓదార్చడానికి వచ్చాము.

32:30.742 --> 32:32.703
ఈ రోజు సంతాపం పాటిద్దాం

32:37.332 --> 32:39.209
నిన్ను మిస్ అవుతున్నాం పాల్!

32:43.297 --> 32:45.215
నువ్వు ఇంతకన్నా ఎక్కువ పొందడానికి అర్హుడివి.

32:52.389 --> 32:54.098
- ఓహ్, బంగారం.
- నేను బాగానే ఉన్నాను.

32:54.099 --> 32:55.601
ఏదైనా మంచి మాట రాయి.

33:16.288 --> 33:18.540
- హేయ్.
- నువ్వు వచ్చావు సంతోషం.

33:20.459 --> 33:21.667
మేము చాలా బాధపడుతున్నాం, శామ్.

33:21.668 --> 33:23.002
- థాంక్స్, నిక్.
- ఎలా ఉన్నావు?

33:23.003 --> 33:24.962
నేను తాగడం ఇంకా మొదలుపెట్టలేదు.

33:24.963 --> 33:26.507
అయితే నువ్వు వెనుకబడిపోయావా?

33:27.007 --> 33:29.134
పాల్ వాళ్ల అమ్మ ఫ్లోరిడా నుంచి వచ్చింది.

33:29.718 --> 33:31.427
ఆమెకి వృద్ధాప్యం పైబడి అయినా ఉండాలి

33:31.428 --> 33:34.348
లేదా మేము విడాకులు తీసుకునే సంగతి
అతను ఆమెకి చెప్పకపోయి ఉండాలి.

33:35.182 --> 33:37.308
- ఏ రకంగా అయినా, అది చాలా ఘోరంగా ఇబ్బందికరంగా ఉంది.
- అయ్యో.

33:37.309 --> 33:38.392
అవును.

33:38.393 --> 33:40.561
కానీ, కనీసం నేను ఆ పరిస్థితిని
చాలామంది కంటే చాలా బాగా నిభాయిస్తున్నాను.

33:40.562 --> 33:41.980
థాంక్యూ.

33:43.565 --> 33:45.067
- మీరు చాలా మంచివారు.
- అవును.

33:46.235 --> 33:47.528
నేను మిస్టీని నిందించలేను అనుకుంటా.

33:48.111 --> 33:51.198
నా ఉద్దేశం, మంచి లక్ష్యాన్ని ఎంచుకోవడానికి
ఇది సరైన వేదిక కదా.

33:51.740 --> 33:54.909
నీ మనిషి ఇంకా మట్టిలో కలిసిపోవడానికి ముందే
ఇంకో మగవాడిని ఎందుకు లోబరుచుకోకూడదు?

33:54.910 --> 33:56.870
ఆమె సమర్థతని మనం మెచ్చుకోవాల్సిందే.

34:00.624 --> 34:03.334
ఒక విషయం తెలుసా,
నేను తాగడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటా.

34:03.335 --> 34:04.419
ఇంకేం మాట్లాడకు.

34:05.170 --> 34:06.463
సరే. మేము మళ్లీ కలుస్తాం.

34:10.634 --> 34:11.635
హేయ్.

34:57.054 --> 34:58.056
సరిగ్గా సరిపోయింది.

34:58.640 --> 34:59.641
లేదు, లేదు, లేదు.

35:00.475 --> 35:01.768
వాటిని అలాగే ఉంచేయ్.

35:47.189 --> 35:48.606
ఏర్పాట్లు అందంగా ఉన్నాయి.

35:48.607 --> 35:49.691
థాంక్స్.

35:51.026 --> 35:52.193
ఎలా ఉన్నావు?

35:52.194 --> 35:53.487
నేను చాలా బాగున్నాను, కూప్.

35:55.322 --> 35:56.572
నీకు ఏమైనా కావాలా?

35:56.573 --> 35:57.658
బేబీ.

35:58.450 --> 35:59.951
నీకు ఇంకా ఘాటు మద్యం కావాల్సి వచ్చినప్పుడు చెప్పు.

35:59.952 --> 36:01.036
- సరే.
- కూప్.

36:02.204 --> 36:04.039
నిన్ను తరువాత కలవనా? మనం మాట్లాడుకోవాలి.

36:06.792 --> 36:08.417
- మంచిది.
- వచ్చినందుకు చాలా థాంక్స్.

36:08.418 --> 36:10.003
వస్తున్నా.

36:11.839 --> 36:13.841
ఓహ్, దేవుడా. వస్తున్నా!

36:16.760 --> 36:18.011
మిస్ కూపర్.

36:18.971 --> 36:21.097
- డిటెక్టివ్.
- మిస్టర్ కూపర్ ఇంట్లో ఉన్నారా?

36:21.098 --> 36:22.349
లేదు, తను ఇంట్లో లేడు.

36:23.267 --> 36:25.727
మీ ఇల్లు తనిఖీ చేయడానికి మా దగ్గర వారెంట్ ఉంది.

36:27.396 --> 36:28.647
నేను ప్యాంట్ ఏదీ వేసుకోలేదు.

36:30.315 --> 36:31.650
అది నాకు కనిపిస్తోంది.

36:33.110 --> 36:35.070
- మరి మీరు ఎవరు?
- నేను కేవలం ఫ్రెండ్ ని.

36:36.071 --> 36:37.072
సరే.

36:42.828 --> 36:45.204
- అవును.
- ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా?

36:45.205 --> 36:46.999
- లేరు.
- సరే, అయితే.

36:48.250 --> 36:49.251
వెళదాం పదండి.

37:00.846 --> 37:02.638
ఫ్రెండ్స్ ని తీసుకురావచ్చంటే తప్ప నేను రాను.

37:02.639 --> 37:05.141
మొత్తం సూట్ తీసుకో. ఎలాగైనా ఆగస్టులో
మనం హాంప్టన్స్ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నాం.

37:05.142 --> 37:07.810
నువ్వు ఇంతవరకూ యాంకీ స్టేడియంకి
వెళ్లలేదంటే నమ్మలేకపోతున్నాను.

37:07.811 --> 37:08.936
నేను మెట్ టీమ్ కి ఫ్యాన్ ని.

37:08.937 --> 37:10.021
సారీ.

37:10.022 --> 37:11.189
అది మంచి పద్ధతి కాదు.

37:11.190 --> 37:12.481
- మిత్రులారా.
- కూప్.

37:12.482 --> 37:14.151
- హేయ్.
- ఓహ్, బాబు.

37:15.527 --> 37:16.861
నీ ఆరోగ్యం ఎలా ఉంది?

37:16.862 --> 37:18.404
ఒళ్లంతా నొప్పులు.

37:18.405 --> 37:19.864
అవును, పాపం.

37:19.865 --> 37:22.909
నాకు సిటీలో ఒక హాస్పిటల్ తెలుసు.
క్రయోథెరపీ. అద్భుతంగా ఉంటుంది.

37:22.910 --> 37:23.993
నీకు ఆ లింక్ పంపిస్తాను.

37:23.994 --> 37:25.661
అది ఏంటి? ఐస్ స్నానాలు చేయడం లాంటిదా?

37:25.662 --> 37:28.748
కాదు, అది అంతకన్నా మేలయిన చికిత్స.
నేను హొకైడాలో ఉన్నప్పుడు ఆ చికిత్స మొదలుపెట్టాను.

37:28.749 --> 37:30.417
ఒంట్లో అనారోగ్యాలు గురించి జపనీస్ కి తెలుసు.

37:31.585 --> 37:33.629
అన్నట్లు ఆ చెత్తవెధవలు ఎలా ఉన్నారు?

37:34.129 --> 37:36.339
ఇద్దరు మనుషులు నన్ను కొట్టడానికి వచ్చినట్లు ఉన్నారు.

37:36.340 --> 37:37.924
నీకు తెలుసా, మనం కట్టే పన్నుల కోసం

37:37.925 --> 37:39.967
పోలీసులు ఈ కేసుని వేగంగా పరిశోధిస్తారని అనుకుంటాం.

37:39.968 --> 37:41.512
మొదట పాల్, ఇప్పుడు ఇది.

37:42.179 --> 37:43.679
ప్రాపర్టీల ధరలు తగ్గిపోయేలా ఉన్నాయి.

37:43.680 --> 37:46.474
నాకు తెలుసు.
డయాన్ ప్రతి గంటకి జిల్లో వెబ్ సైట్ ని రిఫ్రెష్ చేస్తోంది.

37:46.475 --> 37:47.559
ఇప్పుడు ఆమెకి అదే కొత్త కాలక్షేపం.

37:48.060 --> 37:49.436
బార్నీ ఎలా ఉన్నాడో ఎవరైనా విన్నారా?

37:49.937 --> 37:52.022
- నువ్వు అతడిని కలిశావా, కూప్?
- అవును, ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు.

37:52.814 --> 37:54.315
సరే, జరిగింది పరిశీలిస్తే,

37:54.316 --> 37:57.778
సమంత ఆ పెద్ద ఇంట్లో ఇంక ఉండేలా లేదు.

37:58.362 --> 38:01.113
ఆమె ఆ ఇంటిని అమ్మేస్తుంది అనుకుంటున్నావా?
అది చాలా మంచి ఇల్లు, బాబు.

38:01.114 --> 38:06.118
నాకు తెలియదు, కానీ హత్యలు జరిగిన ఇళ్లు
మార్కెట్ ధరకన్నా పాతిక శాతం తగ్గిపోతాయి. ఇంకా తగ్గచ్చు కూడా.

38:06.119 --> 38:07.912
- దేవుడా.
- ఘోరం.

38:07.913 --> 38:11.208
నా ఉద్దేశం, వాళ్లు విడిపోవడానికి కొద్ది రోజుల ముందు
అతను బేస్మెంట్ లో మొత్తం రికార్డింగ్ రూమ్ ఏర్పాటు చేశాడు.

38:11.708 --> 38:14.127
హత్య జరిగిన ఇంట్లో ఉండటం అనేది
నాకయితే భయంగా అనిపిస్తుంది.

38:14.711 --> 38:17.464
మార్కెట్ ధరకన్నా పాతిక శాతం తక్కువకి కొంటే,
ఆ ఫీలింగ్ ని అధిగమించవచ్చు.

38:31.812 --> 38:33.187
- మెక్ నీల్, రుస్సో.
- యస్, మేడమ్.

38:33.188 --> 38:35.022
నాతో పాటు మేడ మీదకి రండి. బెడ్ రూమ్ తో మొదలుపెడదాం.

38:35.023 --> 38:36.775
- అలాగే.
- అర్థమైంది.

39:29.328 --> 39:30.329
ఇదిగో తీసుకో.

39:31.997 --> 39:33.290
దేవుడా, నువ్వు నన్ను ద్వేషిస్తుండచ్చు.

39:33.999 --> 39:35.459
నా ఉద్దేశం, నా మీద నాకే కోపంగా ఉంది.

39:38.086 --> 39:40.839
మీ ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి
అని తను చెప్పాడు. అందుకే నేను...

39:43.091 --> 39:45.677
నేను నిజంగా అతడిని ప్రేమించాను, తెలుసా?

39:46.261 --> 39:47.261
అవును.

39:47.262 --> 39:50.641
మా మిగతా జీవితకాలం అంతా కలిసే బతుకుతాం
అనుకున్నాను. కానీ ఇప్పుడు తను...

39:51.975 --> 39:53.477
అవును, అది చాలా కష్టం.

39:53.977 --> 39:55.395
హెన్రీ ఎలా ఉన్నాడు? నేను తనని చూడచ్చా?

39:56.146 --> 39:58.982
సమంత, ప్రొఫిటరోల్స్ దాదాపు అయిపోవచ్చాయి.

39:59.483 --> 40:01.817
పాల్ తన అతిథులకి డెజర్డ్ వడ్డించాలని కోరుకునేవాడు.

40:01.818 --> 40:03.778
అవును. థాంక్స్, పామెలా. నేను వాళ్లకి చెబుతాను.

40:03.779 --> 40:07.199
పామెలా! మొత్తానికి నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

40:08.492 --> 40:10.618
మీ అబ్బాయిని నేను చాలా ప్రేమించాను.

40:10.619 --> 40:13.204
మనం ఎట్టకేలకి కలుసుకున్నందుకు
మీ అబ్బాయి చాలా సంతోషిస్తాడు.

40:13.205 --> 40:14.289
సారీ, డియర్.

40:15.332 --> 40:16.332
నువ్వు ఎవరు?

40:16.333 --> 40:18.501
పామెలా, తన పేరు మిస్టీ,

40:18.502 --> 40:21.046
అతను చనిపోవడానికి ముందు
ఈ అమ్మాయితో అతను శృంగారం చేసేవాడు.

40:51.201 --> 40:52.618
బాస్, ఎక్కడ ఉన్నావు?

40:52.619 --> 40:53.704
బేస్మెంట్ లో.

40:54.204 --> 40:55.622
నువ్వు వచ్చి ఇది చూడాలి.

40:57.291 --> 40:58.625
డిటెక్టివ్ లిన్.

41:01.044 --> 41:02.045
ఏంటి?

41:09.094 --> 41:10.804
అదీ, సంగతి.

41:11.305 --> 41:12.306
అవును.

41:14.016 --> 41:15.017
- హేయ్, కూప్.
- హేయ్.

41:16.518 --> 41:17.519
నాతో పాటు నడుస్తావా?

41:19.188 --> 41:20.189
సరే.

41:25.527 --> 41:27.738
- ఆ డిటెక్టివ్ నాకు ఫోన్ చేసింది.
- దేనికి?

41:28.572 --> 41:30.073
అది డబ్బు కోసం జరిగిన దాడి అని ఆమె అనుకోవడం లేదు.

41:30.866 --> 41:31.867
అవును. నాకు తెలుసు.

41:33.035 --> 41:34.953
ఆ కారులో ఉన్న మనిషి ఎవరు, కూప్?

41:35.871 --> 41:37.706
- నాకు తెలియదు.
- సరే.

41:38.415 --> 41:39.999
నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ

41:40.000 --> 41:42.169
నాకు తెలియకుండా జరుగుతున్నట్లే అనిపిస్తోంది.

41:42.794 --> 41:45.296
థాంక్స్, కానీ నువ్వు నా గురించి
ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

41:45.297 --> 41:47.089
- నీ పిల్లలు...
- మన పిల్లలు.

41:47.090 --> 41:49.884
...ఈ మధ్యనే తమ తండ్రిని ఎవరో దారుణంగా కొడుతుంటే
ప్రత్యక్షంగా చూశారు.

41:49.885 --> 41:52.094
ఆ షాక్ నుంచి వాళ్లు కొద్దికాలం వరకూ కోలుకోలేరు.

41:52.095 --> 41:53.930
సరే, మరి, నా సంగతి ఏంటి? నా గాయాల గురించి ఏమనాలి?

41:53.931 --> 41:55.516
- అవును, నాకు చెప్పు.
- సరేనా?

41:56.475 --> 41:58.268
నాకు చెప్పు. ఏం జరుగుతోంది?

41:58.769 --> 42:01.230
ఈ విషయంలో నీకు తోడుగా ఉండాలి అనుకుంటున్నా,
కానీ నువ్వు ఏమీ చెప్పడం లేదు.

42:01.939 --> 42:02.940
మెల్...

42:04.942 --> 42:05.943
సరే.

42:08.570 --> 42:09.988
- నేను ఈ ఫోన్ కి బదులివ్వాలి.
- సరే.

42:11.114 --> 42:12.115
దేవుడా.

42:16.912 --> 42:18.789
హేయ్, ఆలీ. ఇలా చూడు, ఇది సరైన సమయం కాదు.

42:19.373 --> 42:21.041
నాకు ఏం చేయాలో తెలియలేదు. వాళ్లు లోపలికి వచ్చేశారు.

42:21.875 --> 42:23.876
ఎవరు వచ్చారు? దేని గురించి మాట్లాడుతున్నావు?
నిదానంగా చెప్పు.

42:23.877 --> 42:28.005
పోలీసులు. ఇంకా వాళ్లు వారెంట్ తో వచ్చారు
ఇంకా... ఛ. నాకు ఏం చేయాలో తెలియలేదు.

42:28.006 --> 42:30.466
ఏంటి? పోలీసులు ఎందుకు వచ్చారు?

42:30.467 --> 42:31.802
ఆండీ.

42:32.678 --> 42:33.679
వాళ్లు వస్తున్నారు.

42:39.768 --> 42:40.853
మీకు ఫిషర్ గురించి తెలుసా?

42:41.436 --> 42:42.937
అతను ఎందుకో తేడాగా కనిపిస్తున్నాడు.

42:42.938 --> 42:44.189
నేను అతని దవడకి ఆపరేషన్ చేశాను.

42:46.733 --> 42:47.734
చక్కగా ఉంది.

42:48.402 --> 42:50.528
హేయ్, క్యాట్, నీతో ఒక సెకను మాట్లాడచ్చా?

42:50.529 --> 42:52.864
నీ మీద జరిగిన దాడి గురించి విన్నాను.
బాగానే ఉన్నావా, కూప్?

42:52.865 --> 42:53.948
అవును, నేను కోలుకుంటున్నాను.

42:53.949 --> 42:56.952
- వాళ్లు నీ మీద గట్టిగానే దాడి చేశారు, హా?
- నిజంగా చేశారు. అవును.

42:58.370 --> 43:00.288
క్యాట్ త్వరగా వస్తావా?

43:00.289 --> 43:01.497
తప్పకుండా. ఏంటి సంగతి?

43:01.498 --> 43:03.083
ఇక్కడ కాదు.

43:08.839 --> 43:09.840
ఇది ఏంటి?

43:11.133 --> 43:12.134
నాకు ఒక లాయర్ కావాలి.

43:12.885 --> 43:14.678
పాల్ హత్య కేసులో నేను అనుమానితుడిని.

43:15.304 --> 43:16.305
అది ఎలా?

43:17.973 --> 43:19.099
అది కాస్త క్లిష్టమైన పరిస్థితి.

43:20.184 --> 43:22.102
- అది నా వృత్తి, కూప్.
- అవును.

43:23.896 --> 43:25.355
నేను శామ్ తో శృంగారం చేస్తున్నాను.

43:26.982 --> 43:27.982
ఇంకా నేను

43:27.983 --> 43:32.945
పాల్ చనిపోవడానికి ముందు అతనితో
అందరిలో బాహాటంగా విభేదించాను.

43:32.946 --> 43:35.072
నిక్ ఇంట్లో పార్టీ జరిగినప్పుడు.
డోమ్ దాని గురించి ఏదో చెప్పాడు.

43:35.073 --> 43:36.575
కాబట్టి నువ్వు నా లాయర్ గా ఉండాలి.

43:37.075 --> 43:39.076
ఏది ఏమైనా నేను నిర్దోషిని.

43:39.077 --> 43:41.245
- కూప్, నేను నీ కేసుని వాదించలేను.
- నువ్వు ఖచ్చితంగా వాదించగలవు.

43:41.246 --> 43:43.498
లేదు, లేదు, నిజంగానే. శామ్ ఇంకా నేను స్నేహితురాళ్లం.

43:44.416 --> 43:45.500
అయితే, మనం స్నేహితులం కాదంటావా?

43:45.501 --> 43:47.502
- ఖచ్చితంగా, కానీ...
- అయితే, మరి నా కేసు వాదించు.

43:47.503 --> 43:49.670
నీకు నేను సాయం చేస్తాను, తప్పకుండా.

43:49.671 --> 43:52.632
కానీ నేను వాదించను. సరే, రేపు నా ఆఫీసుకి ఫోన్ చేయి.

43:52.633 --> 43:54.842
నేను నీకు నా తోటి లాయర్ రాబ్ బ్యారోని పరిచయం చేస్తాను.

43:54.843 --> 43:56.344
లేదు, నువ్వే నా లాయర్ గా ఉండాలి.

43:56.345 --> 43:57.678
- కూప్...
- అది...

43:57.679 --> 43:59.055
అందరికన్నా నువ్వే సమర్థురాలివి.

43:59.056 --> 44:00.932
- నువ్వు ఈ కేసుని వాదించాలి.
- శామ్ కి స్నేహితురాలిగా,

44:00.933 --> 44:02.433
ఖచ్చితంగా అది విరుద్ధమైన ప్రయోజనాలకి దారి తీస్తుంది.

44:02.434 --> 44:03.560
సరే, క్యాట్...

44:04.478 --> 44:05.728
నేను స్పష్టంగా చెబుతున్నాను అనుకోను.

44:05.729 --> 44:09.106
నువ్వు ఈ కేసుని వాదించాలి అని నేను అంటే,
నేను నిన్ను అడగడం లేదు, నీకు చెబుతున్నాను.

44:09.107 --> 44:10.399
నువ్వు నా కేసుని వాదించాలి...

44:10.400 --> 44:11.484
ఎందుకంటే నువ్వు వాదించకపోతే,

44:11.485 --> 44:13.862
నువ్వు నీ కూతురు బాయ్ ఫ్రెండ్ తో
సెక్స్ చేస్తున్నావని డోమ్ కి చెప్పాల్సి వస్తుంది.

44:17.282 --> 44:20.285
అది అలీసాకి కూడా నచ్చే విషయం కాదనుకుంటా, అవునా?

44:24.373 --> 44:25.498
నువ్వు ఏం చేస్తున్నావు, కూప్?

44:25.499 --> 44:26.583
ఏం చేయాలో అదే చేస్తున్నాను.

44:29.169 --> 44:31.337
అలాగే నేను నీ రిటైనర్ ఫీజుని
ముందుగానే చెల్లించే పరిస్థితిలో లేను,

44:31.338 --> 44:33.047
కానీ కేసు ముగిసిన తరువాత
నీ బిల్ ఎంతయిందో నాకు చెప్పచ్చు.

44:33.048 --> 44:34.299
నోరు మూయి.

44:36.635 --> 44:38.136
నువ్వు యస్ అన్నట్లుగానే భావిస్తాను.

44:53.068 --> 44:56.321
హేయ్. అక్కడ ఉన్న స్కాచ్ లో కొద్దిగా నాకు పోయి.

44:58.866 --> 44:59.867
అందంగా ఉంది.

45:02.244 --> 45:03.245
చీర్స్.

45:39.448 --> 45:40.449
ఆండ్రూ కూపర్,

45:40.949 --> 45:43.827
పాల్ లెవిట్ హత్య కేసుకి సంబంధించి
నిన్ను అరెస్టు చేస్తున్నాం.

46:54.064 --> 46:55.232
కుడి వైపు తిరుగు.

47:17.421 --> 47:18.589
బ్రూస్

47:24.219 --> 47:25.762
వస్తావా?

47:32.811 --> 47:35.646
గత కొద్ది నెలలుగా ప్రతి వారం
ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నన్ను

47:35.647 --> 47:37.023
నేను చేయని నేరానికి

47:37.024 --> 47:39.233
నన్ను దోషిగా అరెస్టు చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది.

47:39.234 --> 47:40.359
హత్య కేసులో అనుమానితుడి అరెస్టు

47:40.360 --> 47:42.237
కానీ ఇటీవలి కాలంలో నాకు ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలుగుతోంది.

47:43.155 --> 47:44.155
ఇప్పుడు

47:44.156 --> 47:46.074
ఆ లెహ్మన్ వెధవలు 2008 సంవత్సరంలో ఎలా ఫీల్ అయ్యారో

47:46.742 --> 47:48.868
లేదా బ్యాంక్మన్-ఫ్రైడ్ పదిహేనేళ్ల కిందట
ఎలా ఫీల్ అయ్యారో ఊహించగలుగుతున్నాను,

47:48.869 --> 47:50.703
ఆర్థిక వ్యవస్థకి ఎనిమిది బిలియన్ డాలర్ల
నష్టం చేసిన వాళ్ల గురించి

47:50.704 --> 47:53.749
మనం ఒక పక్క వెతుకుతుంటే
వాళ్లు బహామస్ లో తల దాచుకున్నారు.

47:55.626 --> 47:58.003
క్యాట్ రెస్నిక్.
నేను మిస్టర్ కూపర్ తరపున వాదించబోతున్నాను.

48:01.131 --> 48:04.134
హతుడి సంస్మరణ సందర్భంగా
పోలీసుల కస్టడీలోకి ఆండ్రూ కూపర్

48:27.950 --> 48:31.202
ఇక్కడ మీరు చూపిస్తున్నది
కేవలం పరిస్థితుల ఆధారంగా సేకరించిన రుజువులు మాత్రమే.

48:31.203 --> 48:33.579
వాస్తవంగా చెప్పాలంటే
మీరు ఏ మహిళకి అయితే వారెంట్ చూపించారో

48:33.580 --> 48:37.083
ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది
ఇంకా వారెంట్ అందుకునే మానసిక స్థితి ఆమెకి లేదు.

48:37.084 --> 48:39.710
ఆమె ఆ ఇంట్లో లీజుకి లేదు.
ఆమె ఆ ఇంటికి అద్దె కూడా కట్టడం లేదు.

48:39.711 --> 48:42.005
ఈ వారంతం లోపే ఈ కేసుని కొట్టివేయడం జరుగుతుంది.

48:44.800 --> 48:46.885
మాకు ఇది కూపర్ కారులో దొరికింది.

48:48.929 --> 48:50.848
- అది నాది కాదు.
- ఇంకొక్క మాట కూడా మాట్లాడకు.

49:07.656 --> 49:10.826
నేను రేపు పిల్లల గురించి, మెల్ గురించి
ఆలోచిస్తానని నాకు తెలుసు,

49:11.326 --> 49:13.495
ఇంకా పాతికేళ్ల జైలు శిక్ష పడే అవకాశం గురించి ఆలోచిస్తాను.

49:14.121 --> 49:17.916
కానీ ఘోరమైన విషయం ఏమిటంటే
ఏది జరగాల్సి ఉందో అదే ఎట్టకేలకి జరిగింది.

49:19.209 --> 49:21.460
ఆ రాత్రి ఆ జైలు గదిలో గడపడం అనేది
నేను నిజాయితీగా చేసిన మొదటి పని.

49:21.461 --> 49:23.130
నేను ఈ మధ్యకాలంలో అలా గడిపిన సందర్భం గుర్తులేదు.

49:24.298 --> 49:27.467
లేదా బహుశా ఆ ప్రయత్నం చేసి
నేను అలసిపోయి ఉంటానేమో. నాకు తెలియదు.

49:30.470 --> 49:33.765
ఏది ఏమైనా, చాలా కాలం తరువాత ఆ రాత్రి
నాకు మొదటి రాత్రి...

49:36.018 --> 49:37.769
నేను కాసేపు నిద్రపోగలిగాను.

50:47.673 --> 50:49.675
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
