WEBVTT

01:07.526 --> 01:08.819
మూడు గన్ షాట్స్.

01:08.902 --> 01:11.405
ఒకటి తల మీద. రెండోది మొండెంలో.

01:13.615 --> 01:15.450
ఇంటిని దోచుకోవాలనే ప్రయత్నం బెడిసికొట్టి ఇలా జరిగిందంటావా?

01:16.702 --> 01:18.954
అప్పుడే ఏమీ చెప్పలేము, కానీ ఇంట్లో దొంగతనం కోసం

01:19.037 --> 01:21.123
ఇంతలా కాల్పులు జరగవు.
పైగా అవి గురి చూసి కాల్చినట్లుంది.

01:21.790 --> 01:25.919
రెండు తూటాలు ఒక పక్క, తలలో ఒక తూటా కాల్చారు.

01:27.754 --> 01:29.089
ఇది హత్య అనిపిస్తోంది.

01:29.673 --> 01:31.800
దీని విషయంలో ఎక్కువ ఉద్వేగానికి లోను కాకుండా ఉండగలవా?

01:34.803 --> 01:35.804
"పాల్ లెవిట్."

01:35.888 --> 01:37.681
ఉత్తరాల ప్రకారం అతనే ఈ ఇంటి యజమాని.

01:37.764 --> 01:39.683
కానీ అన్ని ఫ్యామిలీ ఫోటోలలో అతను కనిపించడం లేదు.

01:40.184 --> 01:41.185
విడాకులా?

01:41.810 --> 01:42.811
అలాంటిదే ఏదో.

01:42.895 --> 01:45.647
డిటెక్టివ్ లిన్, తూటా తునకలు ఇక్కడ పడి ఉన్నాయి అనుకుంటా.

01:45.731 --> 01:46.648
బాధితుడు కాల్చాడా?

01:46.732 --> 01:49.151
ఇంకా అప్పుడే చెప్పలేము, కానీ ఇది అలాగే కనిపిస్తోంది.

01:49.234 --> 01:50.152
కానీ గన్ లేదు.

01:50.235 --> 01:52.446
లేదు. నువ్వు రాకముందు మేము క్షుణ్ణంగా పరిశీలించాము.

01:53.113 --> 01:54.990
సాక్ష్యం

01:56.992 --> 01:57.993
నీకు ఆ వాసన వస్తోందా?

01:58.076 --> 02:01.121
- ఏంటి, మలం ఇంకా మరణమా?
- లేదు. అమోనియా.

02:08.794 --> 02:10.547
ఎవరో దీన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించారు.

02:17.596 --> 02:18.805
సిద్ధంగా ఉండు, హెర్నాండెజ్.

02:19.306 --> 02:20.891
మనం హత్య కేసుని పరిశోధించాల్సి వస్తుంది.

03:41.471 --> 03:43.307
మనం ఇంట్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిందంటే
నేను నమ్మలేకపోతున్నాను.

03:43.390 --> 03:45.058
మీరు ఏదైనా చూశారా లేదా విన్నారా

03:45.142 --> 03:47.311
అంటే రాత్రి ఆరు గంటల నుండి
ఈ ఉదయం ఆరు గంటల మధ్యలో?

03:47.394 --> 03:50.814
- మేము ఇంట్లో ఈ వైపు అసలు రాలేదు.
- మీ ఇంటి ముందుకా?

03:51.773 --> 03:53.317
సెక్యూరిటీ కెమెరాల సంగతి ఏంటి?

03:53.817 --> 03:54.860
మేము నిన్న రాత్రి ఇంట్లో ఉన్నాము.

03:54.943 --> 03:57.237
మేము ఇంట్లో ఉంటే సాధారణంగా
సెక్యూరిటీ సిస్టమ్ ని ఆన్ చేయము.

03:57.321 --> 03:58.780
ఈ ప్రాంతంలో సురక్షితంగానే ఉంటుంది.

04:00.157 --> 04:02.242
అయితే, మీరు మిస్టర్ లెవిట్ ని చివరిసారి ఎప్పుడు చూశారు?

04:02.326 --> 04:04.369
పాల్ కొద్ది నెలల కిందట ఇల్లు మారాడు.

04:04.870 --> 04:06.288
వాళ్లు విడాకులు తీసుకునే క్రమంలో ఉన్నారు.

04:06.788 --> 04:09.082
అయితే మీరు మిస్టర్ లెవిట్ ని చివరిసారి
ఆయన ఇల్లు మారుతున్నప్పుడు చూశారా?

04:09.166 --> 04:10.626
- లేదు. అతను తరచు కలుస్తాడు.
- లేదు.

04:10.709 --> 04:13.128
క్లబ్ లో అతను గోల్ఫ్ ఆడుతుంటాడు
ఇంకా అన్ని సామాజిక కార్యక్రమాలకీ హాజరవుతుంటాడు.

04:16.005 --> 04:17.925
సారీ, అతను ఎవరో చూడమంటారా?

04:18.007 --> 04:19.885
వద్దు. అతను కేవలం ఓయెస్టర్ గుల్లలు తెస్తాడు అంతే.

04:19.968 --> 04:21.720
- పెటాన్ కోర్టు కోసం.
- సరే.

04:21.803 --> 04:24.139
అయితే పాల్, అతను మీ స్నేహితుడా?

04:24.223 --> 04:25.766
మీరు అలా అనచ్చు అనుకుంటా.

04:26.934 --> 04:29.978
అతనికి హాని చేయాలనుకునే వారు లేదా బెదిరించిన వారు

04:30.062 --> 04:32.689
ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా?

04:32.773 --> 04:34.191
లేదు. నిజానికి ఎవరూ లేరు.

04:34.274 --> 04:36.276
ఆగు, నిక్ ఇంట్లో అతను ఎవరితోనో
గొడవ పడ్డాడని చెప్పావు అనుకుంట కదా?

04:36.360 --> 04:38.612
- అది పెద్ద గొడవేమీ కాదు.
- నిక్ ఎవరు?

04:38.695 --> 04:39.863
నిక్ బ్రాండెస్.

04:41.573 --> 04:42.824
ఆ ఎన్. బి. ఎ. ఆటగాడు?

04:44.451 --> 04:46.411
అవును, అతను కొన్ని ఇళ్ల అవతలే ఉంటాడు.

04:47.955 --> 04:51.250
అయితే, మిస్టర్ లెవిట్ తో ఆ నిక్ బ్రాండెస్ గొడవ పడ్డాడా?

04:51.333 --> 04:53.752
అది పెద్దగా గొడవ అనలేము.

04:53.836 --> 04:56.380
లేదు, నిక్ పార్టీ ఇచ్చాడు.

04:56.463 --> 05:00.425
సర్. అయితే, ఆ పార్టీలో మిస్టర్ లెవిట్ ఎవరితో గొడవ పడ్డాడు?

05:03.220 --> 05:05.055
ఇది జరగడానికి ఒకే ఒక కారణం కనిపిస్తోంది.

05:05.138 --> 05:06.640
- హేయ్.
- హేయ్, కూప్.

05:07.266 --> 05:09.643
నా ఉద్దేశం, శామ్ ఈ హత్య చేసిందని నా అనుమానం, కాదంటావా?

05:10.227 --> 05:12.187
వాళ్ల విడాకుల కేసులో ఒకరికొకరు బాగా గొడవ పడుతున్నారు,

05:12.271 --> 05:13.647
కానీ ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఆమెకే దక్కుతుంది.

05:14.481 --> 05:16.525
ఆమెకి ఒక ఉద్దేశం ఉంది, అవకాశం ఉంది…

05:16.608 --> 05:17.943
శామ్ ఊళ్లో లేదని గ్రేస్ చెప్పింది.

05:19.611 --> 05:22.781
నీకు తెలుసా, పాల్ రెస్టారెంట్లలో పెట్టుబడులు పెట్టినవారు
ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

05:22.865 --> 05:25.367
- అతను ఎవరికైనా కోపం తెప్పించి ఉంటాడు.
- లేదా అది అనుకోకుండా జరిగిన ఘటన కావచ్చు.

05:25.450 --> 05:27.578
బాగుంది. నిపుణుడు కాల్పులు జరిపాడు. సీరియల్ కిల్లర్.

05:28.370 --> 05:31.373
ఛ. నేను గన్ కొనుక్కుంటాను.

05:31.456 --> 05:32.416
ఏం అంటావు, కూప్?

05:32.499 --> 05:33.750
గోర్డీ గనుక గన్ కొనుక్కుంటే,

05:33.834 --> 05:35.878
తనని తానే కాల్చుకుంటాడని ఖచ్చితంగా చెప్పగలను.

05:38.881 --> 05:39.882
నోరు మూయ్.

05:40.716 --> 05:44.720
మిస్ లెవిట్, బోస్టన్ నుండి
త్వరగా ఇక్కడికి చేరుకున్నందుకు థాంక్యూ.

05:45.387 --> 05:47.306
ఫర్వాలేదు. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను బయలుదేరాను.

05:47.389 --> 05:48.891
మీకు జరిగిన విషాదానికి చాలా సారీ.

05:48.974 --> 05:51.101
నా పిల్లలకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు.

05:53.896 --> 05:57.441
పాల్ నిజానికి చాలా తిక్కమనిషి, అయినా,
అంటే, అతను ఆ పిల్లలకి తండ్రే కదా.

05:58.025 --> 05:59.651
అవును, నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడాను,

05:59.735 --> 06:04.948
మీరు ఇంకా మీ అబ్బాయిలు గత రాత్రంతా వాళ్లతోనే ఉన్నారని

06:05.032 --> 06:06.033
బర్త్ డే జరుపుకొన్నారని చెప్పారు.

06:06.617 --> 06:07.910
మేము వెళ్లడం వల్ల బతికిపోయాం.

06:07.993 --> 06:09.912
మేము మా ఇంట్లోనే ఉండి ఉంటే
ఏం జరిగి ఉండేదో ఆలోచించడానికే భయమేస్తోంది.

06:11.205 --> 06:15.209
అన్నట్లు, మిస్టర్ లెవిట్ మీ ఇంట్లో ఎందుకు ఉన్నారు?

06:15.292 --> 06:16.627
ఆయన అక్కడ నివసించడం లేదు, కదా?

06:17.211 --> 06:19.588
అతను పౌండ్ రిడ్జ్ ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాడు,

06:19.671 --> 06:21.965
కానీ అతను పూర్తిగా ఇల్లు మారిపోలేదు, తెలుసా?

06:22.049 --> 06:25.594
కాబట్టి, తరచూ, ఏదో ఒక వస్తువు
తీసుకువెళ్లడానికి అతను వస్తుండేవాడు.

06:25.677 --> 06:26.929
అయితే అది మీకు ఫర్వాలేదు అనిపించేదా?

06:27.930 --> 06:29.223
నిజానికి ఇబ్బందిగా ఉండేది, అవును.

06:30.307 --> 06:31.934
కానీ అతను రావడాన్ని నేనెలా కాదనగలను?

06:32.017 --> 06:33.560
నేను ఇంటి తాళాలు మారుస్తాను అని చెప్పినప్పుడు,

06:33.644 --> 06:36.230
అతను ఇంటి అప్పు వాయిదాలు
చెల్లించడం ఆపేస్తానని బెదిరించాడు.

06:36.730 --> 06:40.150
పిల్లల కోసం పరిస్థితుల్ని
వీలైనంత ప్రశాంతంగా ఉంచాలని చూశాను.

06:40.234 --> 06:42.569
అతను దాన్ని తేలికగా సాగనివ్వలేదు.

06:53.205 --> 06:55.123
మీ భర్త పేరు మీద ఉన్న రెండు కోట్ల డాలర్ల బీమా పాలసీకి

06:55.207 --> 06:57.918
మీరే ఏకైక లబ్ధిదారు అన్న విషయం మీకు తెలుసా?

06:59.378 --> 07:02.047
మా విడాకుల ఒప్పందం ద్వారా కూడా
నాకు ఎక్కువ డబ్బే వచ్చి ఉండేది.

07:02.714 --> 07:04.174
ఇప్పుడు మొత్తం ఆస్తి మీకే దక్కబోతోంది.

07:08.428 --> 07:11.306
నన్ను మన్నించండి. నేను ఈ ప్రశ్నలు అడగక తప్పదు.

07:11.390 --> 07:13.642
- అది ప్రశ్న కాదు.
- లేదు, ప్రశ్న కాదు.

07:15.477 --> 07:20.357
అయితే, మీ భర్త తక్కువ వయసున్న అమ్మాయి కోసం
మిమ్మల్ని వదిలేశారు.

07:20.440 --> 07:21.650
అది మీకు కోపం తెప్పించి ఉండచ్చు కదా.

07:21.733 --> 07:22.734
లేదు.

07:23.235 --> 07:24.778
నన్ను తిరిగి వచ్చేయమని అతను బతిమిలాడాడు.

07:24.862 --> 07:26.154
కానీ అతడిని మీరు తిరిగి కోరుకోలేదా?

07:27.406 --> 07:29.908
నాకు జరిగిన గొప్ప మంచి, ఈ విడాకులు.

07:30.951 --> 07:32.369
పాల్ తో కలిసి ప్రశాంతంగా ఉండలేము.

07:32.452 --> 07:35.581
నా ఉద్దేశం, ఒక మగవాడి గురించి నేను ఆలోచించకపోవడం
నా జీవితంలో ఇదే మొదటిసారి.

07:35.664 --> 07:37.082
మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా?

07:37.165 --> 07:40.627
ప్రస్తుతానికి, నా గురించి కంటే
నా పిల్లల మీద దృష్టి పెట్టడమే నాకు సంతోషంగా ఉంది.

07:40.711 --> 07:43.046
మీ భర్తతో మీరు చివరిసారి ఎప్పుడు మాట్లాడారు?

07:44.047 --> 07:47.217
- కిందటి రాత్రి.
- మీరు తరచు మాట్లాడుకునేవారా?

07:47.301 --> 07:50.095
అతను చాలాసార్లు ఫోన్లు చేస్తాడు.
నన్ను విడిచి ఉండటానికి ఇబ్బంది పడేవాడు.

07:50.596 --> 07:51.847
అతను ఎలా మాట్లాడేవాడు?

07:52.347 --> 07:56.226
తాగిన మైకంలో, విషాదంలో, కోపంతో మాట్లాడేవాడు.
అది అతనికి మామూలే.

07:57.936 --> 08:00.606
మీకు తెలిసి పాల్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా?

08:00.689 --> 08:01.899
పెద్దగా ఎవరూ లేరు, లేదు.

08:03.692 --> 08:06.236
ఆండ్రూ కూపర్ సంగతి ఏంటి?

08:07.905 --> 08:08.906
సారీ. ఏంటి?

08:08.989 --> 08:11.909
అంటే, నాకు తెలిసి పాల్ ఇంకా మిస్టర్ కూపర్

08:11.992 --> 08:13.660
కొన్ని వారాల కిందట ఒక పార్టీలో గొడవ పడ్డారట.

08:14.786 --> 08:16.747
మీరు ఆశ్చర్యపోతున్నట్లు కనిపిస్తున్నారు.

08:17.497 --> 08:20.334
కూప్ ఇంకా మెల్ మా పొరుగింటి స్నేహితులు.

08:22.169 --> 08:24.546
ఆ గొడవ గురించి నేను ఏమీ వినలేదు.

08:24.630 --> 08:27.257
కానీ మెల్, మిస్టర్ కూపర్ భార్య కదా?

08:27.341 --> 08:28.592
మాజీ భార్య.

08:28.675 --> 08:32.804
మీ భర్త వ్యాపారాల గురించి చెప్పండి. ఆ రెస్టారెంట్ల గురించి.

08:32.888 --> 08:35.432
లేదు. పాల్ తన వ్యాపారాల వ్యవహారాలకి
నన్ను దూరంగా ఉంచేవాడు.

08:35.515 --> 08:37.017
నేను ఆ వ్యవహారాలలో పాల్గొనేదాన్ని కాదు.

08:37.100 --> 08:39.645
బహుశా అతని పెట్టుబడిదారుల గురించి మీరు ఆరా తీయాలేమో?

08:39.727 --> 08:42.940
పాల్ వాళ్ల గురించి ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు.

08:43.023 --> 08:45.400
నాకు తెలిసిన సమాచారం ప్రకారం,
వాళ్లు కొద్దిగా కుట్రపూరితంగా ఉంటారు.

08:45.484 --> 08:46.693
పాల్ దగ్గర గన్ ఉండేదా?

08:46.777 --> 08:49.863
అవును. నేను చెప్పాను కదా, అతను భయపడుతూ ఉండేవాడు.

08:51.782 --> 08:52.783
అది ఏ రకమైన గన్ మీకు తెలుసా?

08:52.866 --> 08:55.160
లేదు. నాకు తుపాకుల గురించి ఏమీ తెలియదు.

08:56.662 --> 08:58.413
తన గన్ ని తన ఆఫీసులోనే పెట్టుకోమని చెప్పేదాన్ని.

08:58.497 --> 09:00.582
నా కోసం కూడా ఒక గన్ కొన్నాడు,
కానీ నేను దాన్ని ఎప్పుడూ వాడలేదు.

09:00.666 --> 09:02.668
అది ఇంట్లో లాకర్ లో భద్రంగా ఉంది.

09:04.169 --> 09:05.712
నేను మీకు ఆ లాకర్ అంకెలు కూడా చెబుతాను.

09:08.215 --> 09:10.509
మీరు చెక్ చేసుకోవచ్చు.
దానితో ఎప్పుడూ కాల్పులు జరపలేదు.

09:13.846 --> 09:17.140
అది చిన్నగా ఉండే గన్స్ లో ఒక రకం. నాకు పెద్దగా తెలియదు.

09:21.478 --> 09:22.479
మనం ఇంక ఇది ముగించినట్లేనా?

09:22.563 --> 09:24.314
సారీ. నేను మా అబ్బాయిల సంగతి చూసుకోవాలి.

09:25.232 --> 09:26.441
అలాగే, తప్పకుండా.

09:27.943 --> 09:29.111
డిటెక్టివ్ లిన్

09:31.947 --> 09:34.324
- నీకు ఆమె మీద నమ్మకం లేదా?
- నీకు ఉందా?

09:34.408 --> 09:36.785
ఆమె చెప్పిన కారణం సరిగ్గానే ఉంది.
తన తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడాను.

09:36.869 --> 09:38.745
కానీ, తన పాత్ర లేదని ఖచ్చితంగా చెప్పలేము.

09:39.454 --> 09:40.998
ఆ సేఫ్ లాకర్ లో ఉన్న గన్ ని చెక్ చేస్తావా?

09:41.790 --> 09:44.501
- అర్థమైంది.
- పాత భార్య వెళ్లింది, కొత్త ప్రియురాలు వచ్చింది.

09:45.419 --> 09:47.254
- ఆమె అతని గర్ల్ ఫ్రెండా?
- అవును.

09:47.963 --> 09:50.549
పాల్ నిజంగా మంచి రసికుడు. అది ఖచ్చితంగా చెప్పగలను.

09:50.632 --> 09:52.926
- అది కేవలం ఒక లావాదేవీ లాంటిది.
- అది నీకెలా తెలుసు?

09:53.010 --> 09:54.386
ఆమెని చూడు.

09:54.469 --> 09:56.680
నువ్వు చాలా అనుమానపు మనిషివి.
ఎవరైనా నీకు ఆ విషయం చెప్పారా?

09:56.763 --> 09:58.515
మరి నువ్వు ఏంటి, రొమాంటిక్ మనిషివా?

09:58.599 --> 10:00.517
నేను మనుషుల్లో మంచిని మాత్రమే చూడాలి అనుకుంటాను.

10:00.601 --> 10:02.477
ముఖ్యంగా వాళ్లు అలా అందంగా కనిపిస్తే.

10:02.561 --> 10:05.147
- ఆమెని నేను ప్రశ్నించవచ్చా?
- అది నీకు ఇష్టమా?

10:05.230 --> 10:06.607
వెళ్లి ఆ గన్ సంగతి చూడచ్చు కదా?

10:07.482 --> 10:10.068
నేను శామ్ కి మళ్లీ ఫోన్ చేయాలని ప్రయత్నించాను.
తను ఇంకా ఫోన్ తీయడం లేదు.

10:10.152 --> 10:12.446
అంటే, తనకి విపరీతంగా కాల్స్ వస్తుండచ్చు.
నీ కాల్ తను చూస్తుందిలే.

10:13.572 --> 10:16.783
తనని చూస్తే చాలా జాలేస్తోంది. ముఖ్యంగా ఆ పిల్లలు.

10:16.867 --> 10:19.912
నాకు తెలుసు. పాల్ ఒక రకంగా మూర్ఖుడు కావచ్చు,

10:19.995 --> 10:21.163
కానీ అతను చెడ్డ మనిషి కాడు.

10:21.246 --> 10:23.498
నిజంగానా?

10:25.042 --> 10:26.543
రేపు నీ ట్రిప్ కి రెడీగా ఉన్నావా?

10:26.627 --> 10:28.921
ఈ పరిస్థితులలో వెళ్లడం సరైనది కాదని అనిపిస్తోంది.

10:29.004 --> 10:30.797
టోరీ ఇంకా కూప్ ని వెళ్లమంటే
ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

10:30.881 --> 10:33.133
నా ఉద్దేశం, ఆ కాలేజీ నియామకాల ప్రయాణాలు
చాలా ముఖ్యమైనవి.

10:33.217 --> 10:34.635
టోరీ తన తల్లిదండ్రులు ఇద్దరూ

10:34.718 --> 10:37.012
తన మీద శ్రద్ధ చూపిస్తున్నారని సంతోషిస్తుంది అనుకుంటా,

10:37.095 --> 10:39.097
- ముఖ్యంగా, నీకు తెలుసు…
- తను మనల్ని ద్వేషిస్తుందనా?

10:39.181 --> 10:40.724
తను నిన్ను ద్వేషించదు.

10:41.975 --> 10:45.103
హేయ్, అక్కడికి కూప్ తో కలిసి వెళితే
ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటున్నావా?

10:45.938 --> 10:46.772
నీ ఉద్దేశం ఏంటి?

10:47.648 --> 10:49.107
మీరు అక్కడే కదా ప్రేమలో పడ్డారు.

10:49.816 --> 10:50.984
లేదు.

10:52.819 --> 10:54.947
రేపు ప్రయాణం అన్న సంగతి అతను మార్చిపోకుండా ఉంటే చాలు.

11:08.001 --> 11:11.380
మిస్టర్ కూపర్, నేను డిటెక్టివ్ లిన్ ని.
వెస్ట్ మాంట్ పోలీస్ డిపార్ట్మెంట్.

11:12.214 --> 11:13.465
మీకు ఏం సాయం చేయగలను, డిటెక్టివ్?

11:13.549 --> 11:14.550
మీరు వినే ఉంటారు

11:14.633 --> 11:16.885
మీ మిత్రుడు పాల్ లెవిట్ నిన్న రాత్రి కాల్పుల్లో మరణించాడని.

11:17.469 --> 11:20.097
అవును. అది దారుణం. మేమంతా ఇంకా షాక్ లోనే ఉన్నాం.

11:21.014 --> 11:22.516
ఒక నిమిషం లోపలికి వస్తే ఏమీ అనుకోరు కదా?

11:23.892 --> 11:25.727
లేదు, ప్లీజ్. తప్పకుండా రండి.

11:28.772 --> 11:30.858
మీకు ఏదైనా డ్రింక్ ఇమ్మంటారా?

11:31.358 --> 11:32.359
వద్దు.

11:33.235 --> 11:34.987
- మీరు ఒంటరిగా నివసిస్తున్నారా?
- అవును.

11:35.070 --> 11:37.906
అంటే, ఖచ్చితంగా ఒంటరిని కాను. ప్రస్తుతానికి కాదు.

11:37.990 --> 11:40.534
నా చెల్లెలు. తాత్కాలికంగా నాతోనే ఉంటుంది.
అందుకే ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది.

11:40.617 --> 11:42.411
సరే, మిస్టర్ లెవిట్ గురించి మాట్లాడుకుందాం.

11:42.953 --> 11:45.122
మీ ఇద్దరి మధ్య స్పర్థలు ఉండేవని విన్నాను.

11:46.331 --> 11:48.250
- నేను అలా చెప్పను.
- లేవా?

11:49.001 --> 11:51.003
ఒక పార్టీలో మీరిద్దరూ గొడవ పడ్డారని విన్నాను.

11:53.714 --> 11:54.715
అది.

11:55.841 --> 11:57.718
అంటే, అది నిజానికి పెద్ద గొడవేమీ కాదు.

11:57.801 --> 11:59.636
పాల్ కేవలం పాల్ మాదిరిగా వ్యవహించాడు అంతే.

11:59.720 --> 12:01.096
అంటే, ఇప్పుడు పాల్ చనిపోయాడు కాబట్టి,

12:01.180 --> 12:03.056
ఆ గొడవ దేని గురించి అని మిమ్మల్ని అడుగుతున్నాను.

12:03.932 --> 12:05.267
అంటే, నిజం చెప్పాలంటే నాకు గుర్తు లేదు.

12:06.101 --> 12:09.021
మేము ఇద్దరం తాగుతున్నప్పుడు,
నేను ఏదో అన్నాను, అది అతనికి నచ్చలేదు,

12:09.104 --> 12:10.105
అతను నన్ను తోశాడు.

12:11.523 --> 12:15.277
అంటే, నిజం చెప్పాలంటే,
మేము ఇద్దరం బాగా తాగిన మైకంలో ఉన్నాం.

12:15.360 --> 12:17.070
మీరు ఇలా చెప్పడానికి ఇంకా ఏమైనా కారణం ఉందా?

12:17.154 --> 12:18.822
- తాగి ఉన్నామనా?
- నిజం చెప్పడం గురించి.

12:18.906 --> 12:19.907
ఏమీ లేదు.

12:21.909 --> 12:23.744
మీరు ఎక్కువగా గొడవలు పడుతుంటారా, మిస్టర్ కూపర్?

12:23.827 --> 12:25.746
- లేదు.
- ఎందుకంటే మీ పిడికిలి మీద ఉన్న గాయాలు

12:25.829 --> 12:28.290
పాల్ తో గొడవ జరిగిన రోజుకంటే
ఈమధ్యనే తాజాగా గాయపడినట్లు కనిపిస్తున్నాయి.

12:28.373 --> 12:30.626
అవును, అంటే, నేను చెప్పినట్లు,
ఇవి గొడవ వల్ల కలిగిన గాయాలు కావు,

12:30.709 --> 12:32.044
ఇవి టెన్నిస్ ఆడటం వల్ల కలిగిన గాయాలు.

12:34.087 --> 12:34.922
టెన్నిస్.

12:36.715 --> 12:38.342
మీరు అనుకున్నట్లు కాకుండా తరచుగా గాయపడతాను.

12:38.425 --> 12:39.843
నిన్న రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో అడగచ్చా?

12:39.927 --> 12:41.970
- నిజంగా అడుగుతున్నారా?
- మిమ్మల్ని అనుమానితునిగా తప్పించడం కోసం.

12:44.431 --> 12:47.809
నేను మాన్హాటన్ లో క్యూ నైట్ క్లబ్ లో ఉన్నాను.

12:47.893 --> 12:49.353
క్యూ. యు. ఇ. యు. ఇ.

12:51.104 --> 12:53.315
- ఎవరితో అయినా కలిసి వెళ్లారా?
- లేదు.

12:53.398 --> 12:54.983
మీరు ఒక్కరే వెళ్లారా?

12:55.901 --> 12:57.861
మనం ఎవరితో అయినా కలిసి వెళ్లకపోతే

12:57.945 --> 12:59.404
మనం ఎవరితోనూ కలిసి వెళ్లలేదనే అర్థం కదా.

12:59.488 --> 13:01.490
- అయితే మీరు ఎవరితోనూ కలిసి వెళ్లలేదా?
- లేదు.

13:02.032 --> 13:04.034
- మీరు సాధారణంగా అలాగే చేస్తారా?
- చాలా తక్కువసార్లు.

13:06.954 --> 13:10.916
- మీరు ఎన్ని గంటలకి ఇంటికి తిరిగి వచ్చారు?
- అర్ధరాత్రి వేళ అనుకుంటా.

13:10.999 --> 13:13.585
మిగతా రాత్రంతా ఇక్కడే, మా చెల్లెలితో కలిసి గడిపాను.

13:14.962 --> 13:16.839
నైట్ క్లబ్ లకి వెళ్లడానికి మీది పెద్ద వయసు, కదా.

13:16.922 --> 13:19.341
ఛ ఛ. నేను ఈ మధ్యనే ఒంటరివాడినయ్యాను,

13:19.424 --> 13:22.594
పైగా నేను అక్కడికి ఎవరినో కలుసుకోవడానికి వెళ్లను.

13:22.678 --> 13:27.975
మీకు తెలుసు, సమంత లెవిట్ కూడా
ఈ మధ్యనే ఒంటరి అయ్యారు ఇంకా ఆమె చాలా అందగత్తె కూడా.

13:28.851 --> 13:31.103
- ఆమె ఎవరినైనా ప్రేమిస్తోందని మీరు అనుకుంటున్నారా?
- నాకు తెలియదు.

13:32.187 --> 13:33.438
ఆమె నా మాజీ భార్యతో స్నేహంగా ఉంటుంది.

13:33.522 --> 13:36.692
ఆమెకి ఇంకా పాల్ కి విడాకుల విషయంలో
గొడవలు ఉన్నాయని విన్నాను.

13:36.775 --> 13:38.360
మంచిగా విడాకులు తీసుకునే వాళ్లు మీకెవరైనా తెలుసా?

13:38.443 --> 13:41.113
అవును. అది మీకు కూడా తెలుస్తుంది అనుకుంటా.

13:42.781 --> 13:45.617
సారీ, డిటెక్టివ్ లిన్, నాతో మీకు ఏమైనా సమస్య ఉందా?

13:45.701 --> 13:46.702
లేదు.

13:47.578 --> 13:49.705
ఖచ్చితంగా సమస్య లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు?

13:49.788 --> 13:52.249
అనుమానించడం మీ నైజం అనుకుంటా.

13:52.332 --> 13:54.293
అవును, అంటే, నాకు ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది.

13:54.376 --> 13:55.961
మీరు సమయం ఇచ్చినందుకు థాంక్యూ, మిస్టర్ కూపర్.

13:56.044 --> 13:58.714
తప్పకుండా. మీకు బయటకి దారి చూపిస్తాను.

14:12.477 --> 14:17.733
చికిత్స ఉందని నువ్వు నమ్ముతున్నావు

14:19.193 --> 14:24.239
ఎట్టకేలకి ఆ విషయం తెలుసుకున్నావు

14:25.365 --> 14:30.746
ఒక డ్రింక్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు

14:31.914 --> 14:36.793
నువ్వు అజ్ఞాతంలోకి వెళ్లేవరకూ
అది నిన్ను మైకంలో ఉంచుతుంది

14:36.877 --> 14:38.253
ఇంకా నీ గతాన్ని మరిచేలా చేస్తుంది

14:38.337 --> 14:42.925
కానీ ఇది ఆగదు

14:44.259 --> 14:48.847
ఇది ఆగదు

14:49.515 --> 14:55.771
నువ్వు గ్రహించే వరకూ

14:57.648 --> 15:00.442
నీకు ఏం కావాలో ఒక జాబితా తయారు చేయి

15:00.526 --> 15:03.403
ఆ ఒప్పందం మీద సంతకం చేయడానికి ముందు

15:03.487 --> 15:06.198
కానీ ఇది ఆగదు…

15:09.159 --> 15:12.120
నీకు తెలుసా, నేను వీటిని చివరిసారి తాగినది
బహుశా నీతోనే అనుకుంటా.

15:12.704 --> 15:15.123
- నిజానికి ఇది ఎదిగిన వాళ్లు తాగే డ్రింక్ కాదు.
- కాదు.

15:15.207 --> 15:17.960
- హేయ్, నువ్వు నిజంగా చాలా గొప్పగా పాడావు.
- థాంక్యూ.

15:22.005 --> 15:23.632
అన్నట్లు, నువ్వు నిజంగా బాగా పాడావు.

15:23.715 --> 15:26.009
- జనం నిజంగా చాలా ఉల్లాసంగా ఉన్నారు.
- థాంక్స్.

15:28.095 --> 15:30.138
చూడు, నువ్వు ఇక్కడికి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

15:30.222 --> 15:32.474
నువ్వు పబ్ కి వచ్చే రోజులు పోయాయి అనుకున్నాను.

15:32.558 --> 15:34.184
నా ఉద్దేశం, ఇప్పుడు నీకు కుటుంబం ఉంది కదా.

15:34.268 --> 15:37.771
ఊరికే అంటున్నావా? ఇలాంటి సమయాల్లోనే
నేను నేనుగా ఉండగలను.

15:37.855 --> 15:39.481
మరి ఇలా వస్తే నీ భార్య ఊరుకుంటుందా?

15:41.024 --> 15:42.901
నేను ఎక్కడికి వెళ్లాననే విషయం
తను పట్టించుకుంటుందో లేదో తెలియదు.

15:45.779 --> 15:47.197
సారీ. ఎక్కువ చెప్పేస్తున్నాను.

15:47.281 --> 15:49.366
అవును, నిజంగానే నువ్వు ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నావు.

15:49.449 --> 15:50.868
- సారీ.
- నోరు మూసుకుని ముందు తాగు.

15:50.951 --> 15:51.952
సరే.

15:52.995 --> 15:53.996
చీర్స్.

15:57.666 --> 15:58.667
మౌనంగా ఉన్నావు.

15:59.168 --> 16:00.002
ఆకలిగా ఉంది అంతే.

16:01.420 --> 16:02.796
చేపల మార్కెట్ లో వ్యాపారం ఎలా నడుస్తోంది?

16:03.672 --> 16:06.300
వాళ్లు అక్కడ నన్ను గుర్తించడం మొదలుపెట్టారు,
కానీ ఇంకొంత సమయం పడుతుంది.

16:06.383 --> 16:08.177
కొన్నిసార్లు నన్ను లాగుతారు. కొన్నిసార్లు వదిలేస్తారు.

16:08.260 --> 16:09.094
హా, కానీ…

16:09.178 --> 16:10.470
అలా చేయగలిగితే బాగా డబ్బు వస్తుంది.

16:10.554 --> 16:11.847
కానీ అది చెమట వాసన వచ్చే డబ్బు.

16:13.098 --> 16:13.932
అమ్మకి ఫోన్ చేశావా?

16:14.224 --> 16:15.058
చేశాను.

16:16.226 --> 16:17.561
ఛ. ఉండు.

16:21.857 --> 16:23.692
ఓరి దేవుడా.

16:24.776 --> 16:26.528
- అంతా బాగేనా?
- ఛ…

16:26.612 --> 16:27.863
వెస్ట్ మాంట్ విలేజ్ ఇంట్లో ఒక వ్యక్తి హత్య

16:27.946 --> 16:28.947
అవును. కాదు.

16:30.240 --> 16:31.491
నేను ఒక ఫోన్ కాల్ చేయాలి.

16:32.492 --> 16:33.827
నేను నీతో ఏదో మాట్లాడాలని అనుకున్నాను.

16:33.911 --> 16:35.704
అవును. సారీ. నాకు కొన్ని నిమిషాలు టైమ్ ఇవ్వు.

16:42.628 --> 16:44.129
జార్జ్ క్లూనీ

16:45.797 --> 16:47.382
నా ఉద్దేశం, అది ఒక పీడకల లాంటిది.

16:47.466 --> 16:48.467
ఎలీనా బెనిటెజ్

16:48.550 --> 16:51.220
వాళ్లు నా మీద అభియోగాలు మోపలేదు,
కానీ ఎప్పుడూ భార్యనే అనుమానిస్తారని నీకు తెలుసు కదా.

16:51.303 --> 16:54.473
అంటే, వాళ్లు నన్ను కూడా అనుమానిస్తున్నారు అనుకుంటా,
పాల్ తో నేను గొడవ పడ్డాను కాబట్టి.

16:54.556 --> 16:56.183
అవును, దాని గురించి విన్నాను. అక్కడ ఏం జరిగింది?

16:56.767 --> 16:59.937
అది, అంటే,పెద్ద గొడవ ఏమీ కాదు, నిజానికి.

17:00.020 --> 17:02.898
నా మర్యాదని కాపాడాలని చూశావా? అది మంచి విషయం.

17:04.066 --> 17:05.233
ఆ మాట అంటే గుర్తుకొచ్చింది,

17:05.317 --> 17:07.277
నేను ఎవరితో అయినా ప్రేమలో ఉన్నానా అని పోలీసులు అడిగారు.

17:08.945 --> 17:11.656
- సరే, నువ్వు లేదని చెప్పావని ఆశిస్తాను.
- నేను లేదనే స్పష్టంగా చెప్పాను.

17:11.740 --> 17:14.242
మెల్ ఇంకా మిగతా అందరూ
నన్ను దూరం పెట్టడాన్ని నేను భరించలేను,

17:14.326 --> 17:15.911
కానీ నీకు నా మీద ఉన్న శ్రద్ధకి థాంక్స్.

17:15.993 --> 17:17.246
చూడు, నాకు నీ మీద శ్రద్ధ ఉంది.

17:17.329 --> 17:18.872
అవును, కేవలం నా మీద మాత్రమే కాదు.

17:18.955 --> 17:20.082
శామ్…

17:28.882 --> 17:30.759
లూ వర్గా

17:38.433 --> 17:39.518
హేయ్.

17:42.229 --> 17:43.230
వెనుక డోర్ తెరువు.

17:46.108 --> 17:47.109
ఉద్వేగంగా ఉందా?

17:47.192 --> 17:48.694
నువ్వు ఇంకా అమ్మ పడేంత ఉద్వేగంగా ఏమీ లేను.

17:48.777 --> 17:51.029
- నీకు అది నచ్చుతుంది.
- నన్ను ఇబ్బంది పెట్టకు.

17:51.613 --> 17:52.698
నేను ఎలాంటి హామీలూ ఇవ్వలేను.

17:52.781 --> 17:54.032
హేయ్, నాన్నా.

17:54.783 --> 17:57.035
- నువ్వు వచ్చావు సంతోషం.
- ఇది నా నిర్ణయం కాదు.

17:57.119 --> 17:58.203
అదీ అలా ఉండాలి.

17:58.287 --> 18:00.289
హేయ్, నువ్వు సస్పెండ్ అయ్యావు, బుజ్జీ.
నువ్వు మా సొంతం అయ్యావు.

18:00.372 --> 18:02.541
నన్ను నమ్ము, నువ్వు వచ్చినందుకు సంతోషిస్తావు.

18:02.624 --> 18:04.376
విహార యాత్ర!

18:05.627 --> 18:07.004
- నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు.
- ఎప్పుడూ.

18:07.671 --> 18:08.672
నిజంగానా?

18:12.634 --> 18:13.635
అదీ!

18:19.266 --> 18:21.226
- మనం దగ్గరకి వచ్చేశామా? సరే.
- నీ ముఖం మీద గుద్దుతా.

18:27.024 --> 18:30.068
మోర్గన్
నువ్వు ఉన్నావా?

18:33.447 --> 18:35.574
హేయ్, అమ్మా, పాల్ ని శామ్ చంపేసింది అంటావా?

18:35.657 --> 18:36.700
ఏంటి?

18:36.783 --> 18:38.285
పిచ్చిగా మాట్లాడకు.

18:38.368 --> 18:40.370
అందులో పిచ్చితనం ఏం ఉంది?
నాన్నని నువ్వు ఎప్పుడూ చంపాలని అనుకోలేదా?

18:40.454 --> 18:42.331
- అవును.
- హేయ్! థాంక్యూ.

18:42.414 --> 18:45.042
- కానీ విషయం ఏమిటంటే నేను అనుకోలేదు.
- ఇక్కడే ఉన్నాను.

18:45.125 --> 18:46.752
సరే. అవును, నువ్వు ఆయనకి విడాకులు ఇచ్చావు.

18:46.835 --> 18:48.295
- ఓహ్, దేవుడా. టోరీ, ఇంక ఆపు.
- అలాగే.

18:48.921 --> 18:50.631
నేను జేక్ తో వెళ్లి ఉండాల్సిందని నాకు తెలుసు.

18:50.714 --> 18:52.966
ఇది ఫ్యామిలీ ట్రిప్ గా ఎందుకు మారిందో
నాకు అర్థం కావడం లేదు.

18:53.050 --> 18:54.968
- ఎందుకంటే అది కాలేజ్, బంగారం…
- సరే.

18:55.052 --> 18:56.929
…ఇంకా పిల్లల్ని కాలేజీలో చేర్పించడానికి
తీసుకువెళ్లడం చాలా పెద్ద విషయం.

18:57.012 --> 18:58.680
ఒక బుర్రలేని బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి
ఈ ఆనందాన్ని వదులుకోలేవు

18:58.764 --> 19:00.224
ఇంకొన్ని ఏళ్లు పోతే
అతను మనతో పాటు ఉండనే ఉండడు.

19:00.307 --> 19:02.267
నువ్వు అతని గురించి ఎందుకు అంత ఘోరంగా మాట్లాడతావు?

19:02.351 --> 19:03.310
అలా అనిపిస్తుంది.

19:03.393 --> 19:05.604
సరే, కానీ, మీకు ఈ విషయం స్పష్టం చేయాలి,
జేక్ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు.

19:05.687 --> 19:07.397
- కానీ నువ్వు వెళ్లిపోతావు?
- దాని ఉద్దేశం ఏంటి?

19:07.481 --> 19:10.150
- మనం ఇంకోటి ఏదైనా మాట్లాడుకుందామా…
- దాని ఉద్దేశం ఏమిటంటే

19:10.234 --> 19:12.819
కాలేజీలో చేరిన రెండు వారాల తరువాత,
అతనితో విడిపోతావు, కుదిరితే ఇంకా త్వరగా.

19:12.903 --> 19:16.365
సారీ, ప్రేమించే మనుషుల్ని అందరూ
నీలా విడిచి వెళ్లిపోలేరు, నాన్నా.

19:16.448 --> 19:17.824
నీకు అతని మీద ప్రేమ లేదు.

19:17.908 --> 19:20.536
నిజంగానా? ప్రేమ గురించి నీకేం తెలుసు?

19:20.619 --> 19:21.453
ఓయ్!

19:21.537 --> 19:23.288
- లేదు, ఫర్వాలేదు. తనని మాట్లాడనివ్వు.
- ఇది బాలేదు.

19:23.372 --> 19:24.915
- లేదు, నేను వినాలి…
- లేదు, నిజంగా, నాన్నా.

19:24.998 --> 19:27.292
- ప్రేమ గురించి నీకేం తెలుసు?
- ఆ ప్రేమని పొందితే ఎలా ఉంటుందో నాకు తెలుసు,

19:27.376 --> 19:29.503
ఇంకా దాన్ని కోల్పోతే
ఎలా ఛిన్నాభిన్నం అయిపోతామో కూడా నాకు తెలుసు.

19:30.504 --> 19:33.632
ఇది వినడానికి నీకు పిచ్చిగా అనిపించవచ్చు,
కానీ కొన్నిసార్లు ప్రేమ గురించి

19:33.715 --> 19:35.634
దాన్ని పొందినప్పటి కంటే దాన్ని కోల్పోయినప్పుడే
బాగా తెలుస్తుంది.

19:35.717 --> 19:37.427
నా చిన్నారి కూతురు

19:37.511 --> 19:41.223
ఒకప్పుడు ప్రతి రోజూ నా చేయి పట్టుకుని తిరిగి
ఎదిగిన తరువాత తను నా వైపు విసుగ్గా చూస్తూ

19:41.306 --> 19:44.810
నాతో నిర్లక్ష్యంగా మాట్లాడితే ఊపిరి ఆడనంత
కష్టంగా ఉండటం ఏమిటో నాకు తెలుసు.

19:49.189 --> 19:50.190
నాన్నా, నేను…

19:54.611 --> 19:56.238
దేవుడా, బంగారం, సారీ.

19:58.156 --> 19:59.324
నాకు తెలియదు…

20:00.325 --> 20:02.744
నేను అలా ఎందుకు మాట్లాడానో నాకే తెలియదు.
నిజంగా, నిజంగా సారీ.

20:04.538 --> 20:07.749
మనం ఇంక… సారీ, బంగారం. సారీ.

20:20.554 --> 20:21.638
నాకు తెలుసు.

20:21.722 --> 20:23.765
- మీకు మంచి నీళ్లు కావాలా, పిల్లలూ?
- అక్కడ నీళ్లు ఉన్నాయి.

20:23.849 --> 20:24.850
- ఇది చాలా బాగుంది.
- వద్దా? సరే.

20:32.357 --> 20:34.151
మీరు ఏమీ అనుకోకపోతే, నేను మీతో లోపల మాట్లాడతాను.

20:34.234 --> 20:35.319
మరేం ఫర్వాలేదు.

20:35.402 --> 20:37.696
హ్యారీ నాకు ముందే చెప్పాడు.
మీరు పాల్ గురించి మాట్లాడటానికి వచ్చారు కదా.

20:37.779 --> 20:40.115
మీరు ఇక్కడ మంచి పార్టీ చేసుకున్నారని విన్నాను.

20:40.199 --> 20:41.658
లేదు.

20:42.659 --> 20:43.744
అది నిజానికి చాలా పేలవమైన పార్టీ.

20:43.827 --> 20:46.663
మీ అతిథులలో ఒకరిని అంబులెన్స్ లో
తీసుకువెళ్లాల్సి వచ్చిందని విన్నాను.

20:46.747 --> 20:48.874
అవును, అవును. అది నాకు కూడా బాధగా అనిపిస్తుంది.

20:48.957 --> 20:50.542
అంటే, కొన్నిసార్లు ఎవరితో ఆడుతున్నానో మర్చిపోతుంటాను.

20:50.626 --> 20:52.753
ఇంకా నేను విన్నది ఏమిటంటే

20:52.836 --> 20:54.922
మిస్టర్ లెవిట్ కీ, ఆండ్రూ కూపర్ కీ మధ్య
ఏదో గొడవ జరిగిందట కదా.

20:55.005 --> 20:56.632
లేదు, అది గొడవ కాదు.

20:56.715 --> 20:59.343
కేవలం ఇద్దరు మధ్యవయస్కులైన తెల్లజాతి మనుషులు
తమ ఒత్తిడిని దూరం చేసుకునే తీరు అది.

21:00.719 --> 21:02.012
అది దేని గురించో మీకు తెలుసా?

21:03.639 --> 21:05.015
లేదు. నాకు తెలియదు.

21:05.766 --> 21:08.393
కానీ పాల్, అతను ఎప్పుడూ ఉద్రేకంగానే ఉండేవాడు.

21:08.477 --> 21:10.646
- మరి మిస్టర్ కూపర్?
- కూప్?

21:12.147 --> 21:14.483
లేదు. లేదు, కూప్ ఫైటర్ కాదు.

21:15.943 --> 21:18.654
అతను గొడవ పడేవాడే అయితే,
చాలా కాలం కిందటే నాతో గొడవపడి ఉండేవాడు.

21:18.737 --> 21:21.490
- అలా ఎందుకు?
- నేను అతని భార్యతో డేటింగ్ చేస్తున్నా. మాజీ భార్య.

21:21.573 --> 21:22.824
అయితే అతను నీ పార్టీకి వచ్చాడా?

21:23.659 --> 21:25.619
అవును, నేను కూడా సర్ ప్రైజ్ అయ్యాను.

21:37.464 --> 21:38.298
జార్జ్ క్లూనీ

21:42.845 --> 21:44.972
హేయ్, నేను ఆండ్రూ కూపర్ ని.
నాకు మెసేజ్ పంపండి.

21:54.940 --> 21:56.483
పాల్ లెవిట్ హత్యకు గురయ్యాడు!

21:56.567 --> 21:59.820
అందరికీ హాయ్. ప్రిన్స్ టన్ యూనివర్సిటీకి స్వాగతం.

22:00.404 --> 22:01.321
కూప్.

22:02.489 --> 22:04.783
దారి తప్పిపోయిన ఒకరిద్దరి కోసం ఎదురుచూస్తున్నాం,

22:04.867 --> 22:06.368
ఆ తరువాత మనం సందర్శన మొదలుపెడదాం.

22:09.621 --> 22:11.874
హేయ్, మరి వాళ్లు నాకు టీమ్ సదుపాయాలు
చూపిస్తామని అంటున్నారు.

22:12.457 --> 22:14.376
కానీ, స్వీటీ, ఇది టూర్. మనం టూర్ లో పాల్గొనాలి.

22:14.459 --> 22:16.295
- సరే.
- వాళ్లు తరువాత చూపించచ్చు కదా?

22:16.378 --> 22:18.172
అంటే, సరే. కానీ కాసేపు అదంతా తిప్పి చూపిస్తాం అన్నారు.

22:20.340 --> 22:22.926
సరే. అయితే,
మమ్మల్ని కలవాలి అనుకున్నప్పుడు మాకు ఫోన్ చేయి.

22:23.010 --> 22:24.428
సరే. మంచిది. థాంక్స్.

22:27.347 --> 22:29.433
హా, తను మనల్ని మళ్లీ కలవదు అనుకుంటా, కదా?

22:29.516 --> 22:30.642
- లేదు.
- లేదు.

22:32.102 --> 22:34.771
కానీ హంటర్ కి ప్రిన్స్ టన్ టూర్
అప్పుడే అవసరం లేదు అనుకుంటా.

22:36.190 --> 22:37.608
- లేదా ఎప్పటికీ అవసరం ఉండదేమో.
- కంగారుపడకు.

22:37.691 --> 22:39.318
వాడి కోసం నేను వేరేది ప్లాన్ చేశాను.

22:40.068 --> 22:41.069
ఏంటి అది?

22:43.614 --> 22:44.615
ఏంటి?

22:44.698 --> 22:48.702
ప్రతి ప్రొఫెషనల్ రికార్డింగ్ స్టూడియోలో ఉండే
టెక్నాలజీ అంతా మా దగ్గర ఉంది.

22:48.785 --> 22:53.207
లాజిక్ ప్రో,
72 ఛానెల్ ఎనలాగ్ మిక్సింగ్ కన్సోల్,

22:53.290 --> 22:55.751
ప్రత్యేకంగా తయారు చేసిన గ్రిఫిన్ సబ్ వూఫర్స్ ఇక్కడ ఉన్నాయి.

22:55.834 --> 22:57.669
మీకు తెలిసిన ప్రతి వాయిద్యం మాకు అందుబాటులో ఉంది

22:57.753 --> 23:00.088
ఇంకా వేల కొద్దీ డిజిటల్ బ్యాంకులు మాకు ఉన్నాయి.

23:00.172 --> 23:02.799
అల్ట్రావయొలెట్ స్టూడియోలు
సాధారణంగా స్టూడెంట్స్ కోసం కేటాయిస్తారు,

23:02.883 --> 23:06.845
కానీ నాకు తెలిసి ఈ రోజు నుంచి నువ్వు వచ్చి,
నీ మ్యూజిక్ ని చేసుకోవచ్చు.

23:06.929 --> 23:07.930
నిజంగా అంటున్నావా?

23:08.013 --> 23:10.390
కొన్ని డెమోలు తయారు చేయడానికి
మేము రెండు బ్యాండ్లకి శిక్షణ ఇస్తున్నాం,

23:10.474 --> 23:12.434
నీకు కావాలంటే నువ్వు పూర్తిగా ఆ శిక్షణని చూడవచ్చు.

23:12.518 --> 23:15.020
ఇంకా ఆ తరువాత, నువ్వు వాయించడానికి
కొంత సమయం దొరకచ్చు.

23:15.103 --> 23:17.022
- వినడానికి బాగుంది కదా?
- వినడానికి బాగుంది.

23:17.105 --> 23:18.315
- సరే.
- వెళదాం రండి.

23:22.444 --> 23:25.072
- మేము తరువాత వచ్చి నిన్ను రాత్రి విందుకి తీసుకువెళతాం.
- బై.

23:30.953 --> 23:31.954
నేను ఒకరి సాయం అడిగాను.

23:33.413 --> 23:35.374
వాడు ఇక్కడ చేరడానికి ఎంతమందిని సాయం అడిగావు?

23:36.250 --> 23:38.001
వాడిని మనం ఎలాగైనా కాలేజీలో చేర్పించాలి. అంతే.

23:38.085 --> 23:39.628
తరువాత వాడే తెలుసుకుని
తన మనుషుల్ని వెతుక్కుంటాడు.

23:40.671 --> 23:41.505
మనం చేసినట్లు.

23:43.507 --> 23:44.508
అవును.

23:47.386 --> 23:49.012
అయితే మరి, ఈ రోజంతా మనమే గడపాలి అనుకుంటా.

23:49.096 --> 23:50.264
మనకి రోజంతా ఉందా?

23:50.347 --> 23:51.390
నీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?

23:53.809 --> 23:54.810
నన్ను అనుసరించు.

23:59.982 --> 24:01.775
ఎలీనా బెనిటెజ్
మిస్డ్ కాల్

24:07.865 --> 24:11.201
- అంతా బాగానే ఉందా?
- ఉంది. కేవలం ఆ డిటెక్టివ్ లు ఆరా తీస్తున్నారు.

24:12.160 --> 24:15.122
ఏమి జరిగి ఉండచ్చు?

24:15.622 --> 24:16.665
అప్పులు ఇచ్చిన వాళ్ల పని కావచ్చు.

24:16.748 --> 24:19.960
దేవుడా, అది చాలా దారుణం.
నేను కనీసం ఊహించలేకపోతున్నాను.

24:20.043 --> 24:22.504
అవును. మనం ఒక ఒప్పందానికి వద్దాం.

24:23.213 --> 24:26.925
మనం వాస్తవ జీవితం గురించి మాట్లాడుకోవద్దు.
అలాంటిదేమీ వద్దు. ఈ రోజుకి మాత్రం.

24:28.594 --> 24:29.636
ఒకవేళ నేను మాట్లాడితే?

24:30.470 --> 24:31.889
నువ్వు మాట్లాడితే, ఒక డ్రింక్ తాగాలి.

24:33.765 --> 24:34.600
అర్థమైంది.

24:35.350 --> 24:37.686
- అన్నట్లు, మనకి ఇంకొకటి కావాలి…
- లేదు, నేను ఇప్పటికే ఆ ఏర్పాటు చేశాను.

24:37.769 --> 24:38.812
థాంక్యూ.

24:40.522 --> 24:41.523
థాంక్యూ.

24:44.151 --> 24:47.654
విశ్రాంతి, ప్రయాణికుడా, విశ్రాంతి,
నీ ఆందోళనలన్నీ పక్కన పెట్టు.

24:47.738 --> 24:50.574
మీ స్నేహితుల కోసం తాగు
ఇంకా వాళ్లకి ఈ ప్రదేశాన్ని సిఫార్సు చేయి.

24:57.789 --> 24:58.874
ఇది విడ్డూరంగా ఉందా?

25:01.043 --> 25:02.085
ఇది కాలచక్రం.

25:03.420 --> 25:05.506
ఈ ప్రదేశం ఏ మాత్రం మారలేదంటే నమ్మలేకపోతున్నాను.

25:05.589 --> 25:06.840
నా ఉద్దేశం, అది గనుక విరిగిపోకుండా ఉంటే…

25:08.342 --> 25:11.220
హేయ్, థామస్ స్వీట్ లో ఇప్పటికీ
నా ఫైర్ బాల్స్ చాక్లెట్లు ఉంటాయంటావా?

25:11.303 --> 25:12.804
ఎందుకంటే నా పుట్టినరోజున

25:12.888 --> 25:15.098
- నువ్వు ఇచ్చిన చాక్లెట్లు అన్నీ తినేశాను.
- ఓహ్, దేవుడా.

25:15.182 --> 25:17.017
అందుకు నీకు థాంక్స్. అది మంచి కానుక.

25:18.060 --> 25:21.313
సంతోషం. అన్నట్లు, పార్టీలో జరిగిన దాని నుంచి
నిక్ కోలుకున్నాడా?

25:21.396 --> 25:24.024
ఇంకా రెండు నిమిషాలు కూడా కాలేదు,
నీ రూలునే నువ్వు ఉల్లంఘించావు.

25:24.107 --> 25:25.400
అవును, నేను ఉల్లంఘించా అనుకుంటా.

25:25.484 --> 25:28.654
ఎక్స్ క్యూజ్ మీ, మాకు జాగెర్మయిస్టర్ షాట్స్ ఇవ్వగలరా?

25:28.737 --> 25:30.197
- రెండా?
- నిజానికి, ఒక విషయం తెలుసా?

25:30.280 --> 25:31.782
- ఆ బాటిల్ తెచ్చేయ్.
- సరే, తప్పకుండా.

25:31.865 --> 25:34.618
- నేను జాగెర్మయిస్టర్ అని చెప్పలేదే.
- నాకు అది కావాలి. అది పైకి చెప్పనక్కరలేదు.

25:35.118 --> 25:36.370
ఓహ్, బాబు.

25:36.912 --> 25:40.415
- ఇదిగో తీసుకో.
- ఓహ్, సరే. థాంక్యూ.

25:40.499 --> 25:41.500
అలాగే.

25:47.714 --> 25:49.049
బాగుందా?

25:49.132 --> 25:50.551
- అవును.
- నిజంగానా?

25:50.634 --> 25:51.635
లేదు.

26:08.026 --> 26:08.861
అది…

26:18.704 --> 26:19.913
- బాగు… వావ్.
- ఐదు సెకన్ల రూల్.

26:19.997 --> 26:21.373
- ఐదు సెకన్ల రూల్.
- ఐదు సెకన్ల…

26:21.456 --> 26:24.835
వీటిలో ఒక్కటి కూడా సంచీలో వేయలేదు.
ఇది ఇలా పని చేయదు.

26:29.089 --> 26:31.425
- దీన్ని ఇంకా తెరువు.
- ఇది చిన్న బ్యాగ్.

26:32.426 --> 26:33.427
ఓహ్, దేవుడా.

26:35.262 --> 26:37.848
సరే, సరే. మనం తీసుకున్నాం.

26:38.682 --> 26:39.975
థాంక్యూ.

26:40.058 --> 26:41.185
బ్యాగ్ నిండా క్యాండీలు.

26:42.311 --> 26:44.104
ఒక బ్యాగు క్యాండీలు…

26:44.897 --> 26:47.357
బాబూ, ఇవి చూడటానికి చాలా బాగున్నాయి.

26:50.235 --> 26:51.069
ఒకటి తీసుకో.

26:52.738 --> 26:54.323
థామస్ స్వీట్ చాక్లెట్

26:56.825 --> 26:59.953
ఎక్స్ క్యూజ్ మీ! మేడమ్,
ఆ జామ్ కి మీరు డబ్బులు ఇవ్వడం మర్చిపోయినట్లున్నారు.

27:01.079 --> 27:01.914
ఏంటి అన్నారు?

27:01.997 --> 27:04.583
ఏదో చిన్న పొరపాటు అయి ఉంటుంది,

27:04.666 --> 27:07.711
కానీ మీరు ఆ జామ్ సీసాని తీసుకుని
డబ్బులు ఇవ్వకుండా బయటకి వచ్చేశారు.

27:08.712 --> 27:11.798
మేము ఇప్పుడే ఫైర్ బాల్స్ కొన్నాం. మేము తీసుకోలేదు…

27:12.382 --> 27:13.467
మీరు తీసుకోవడం నేను చూశాను.

27:14.134 --> 27:16.220
చూడండి, నేను గొడవ పెట్టుకోవాలని చూడటం లేదు,

27:16.303 --> 27:18.096
కాబట్టి మీరు నా వెంట లోపలికి వచ్చి అక్కడ మనం…

27:18.180 --> 27:20.724
హేయ్, హేయ్. మిత్రమా, తను మీ జామ్ సీసా తీసుకోలేదు.

27:21.808 --> 27:24.811
చూడండి, ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు,

27:24.895 --> 27:26.355
కానీ మీ పర్సులో ఏం ఉందో నాకు ఎందుకు చూపించరు?

27:26.438 --> 27:28.857
ఆమె ఏమీ తీసుకోలేదు. సరేనా?

27:29.816 --> 27:31.860
కాబట్టి మీరు ఇంక వెళ్లిపోవచ్చు,

27:31.944 --> 27:34.738
లేదా మీరు ఎందుకు ఈ పని చేశానా అని ఆలోచిస్తూ
వచ్చే ఆరు నెలలు జైలులో గడపచ్చు.

27:47.209 --> 27:48.460
నువ్వు ఎవరు?

27:51.088 --> 27:52.548
- ఎవరు కాల్ చేస్తున్నారు?
- నీ కొడుకు.

27:54.258 --> 27:55.467
- హాయ్, బేబీ.
- హేయ్.

27:56.176 --> 27:57.845
నేను చేసిన మ్యూజిక్ గ్రెటీకీ ఇంకా ఎక్స్ కీ బాగా నచ్చింది,

27:57.928 --> 27:59.555
దాన్ని వినిపించడానికి
వాళ్లు కొంతమంది ఫ్రెండ్స్ ని ఆహ్వానించారు.

27:59.638 --> 28:01.640
నేను విందుకి రాకపోయినా ఫర్వాలేదా?

28:01.723 --> 28:03.684
ఫర్వాలేదు, నువ్వు రానక్కరలేదు
కానీ నువ్వు ఏదైనా తిను, సరేనా?

28:04.434 --> 28:07.813
అలాగే. నేను అనుకోవడం
వాళ్లు ఫ్యాట్ శాండ్విచ్ అని ఏదో ఆర్డరు చేస్తున్నట్లున్నారు.

28:07.896 --> 28:09.064
ఫ్యాట్ శాండ్విచ్.

28:09.940 --> 28:12.234
అలాగే, బేబీ. అది చాలా రుచిగా ఉంటుంది.

28:12.317 --> 28:13.819
- మాకు తరువాత మెసేజ్ చేయి.
- తప్పకుండా.

28:20.158 --> 28:22.744
ఫ్యాట్ శాండ్విచ్.

28:23.871 --> 28:28.125
పోలీసులు ఇంటికి ఇంకా తాళాలు వేసి ఉంచారు,
కాబట్టి కొన్ని అత్యవసరమైన సరుకులు కొనడానికి వచ్చాను.

28:28.208 --> 28:29.501
సరే, మరి నువ్వు ఎక్కడ ఉంటావు?

28:29.585 --> 28:32.546
నేను ఓపస్ హోటల్ లో ఉంటున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు?

28:32.629 --> 28:34.965
వాళ్లు పెరటిలో అలసిపోయేలా ఆడుకున్నారు.

28:35.048 --> 28:36.884
మీ నాన్న వాళ్లకి ఇప్పుడు స్నానం చేయిస్తున్నాడు.

28:37.551 --> 28:39.094
థాంక్స్, అమ్మా. వాళ్లని మిస్ అవుతున్నా.

28:39.178 --> 28:40.512
వాళ్లు ఎక్కడికీ వెళ్లడం లేదు, బంగారం.

28:40.596 --> 28:42.598
నీ పనులు నువ్వు చూసుకో.

28:44.141 --> 28:45.559
మైఖేల్ తో మాట్లాడతావా?

28:45.642 --> 28:47.936
లేదు. తనకి నేను అబద్ధం చెబుతున్నట్లు అనిపిస్తుంది.

28:48.604 --> 28:50.480
- నేను ఇంక… నీకు రేపు ఫోన్ చేయనా?
- సరే.

28:50.564 --> 28:51.815
- సరే.
- బై.

28:51.899 --> 28:52.900
అలాగే. లవ్ యూ.

28:52.983 --> 28:55.319
హాయ్. మీకు ఏమైనా సాయం చేయమంటారా?

28:55.402 --> 28:57.196
లేదు, థాంక్స్. కేవలం కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నా.

28:57.279 --> 28:59.948
కానీ, మేము ఈ మధ్యనే
చాలా మంచి కొత్త ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చాం.

29:00.032 --> 29:01.909
మీకు ఈ రెటీనల్ ఐ ప్యాచ్ లు నచ్చుతాయి.

29:01.992 --> 29:04.745
కంటి కింద చారలకీ, ఉబ్బిన చర్మానికీ
అవి చాలా బాగా పని చేస్తాయి.

29:04.828 --> 29:06.163
నాకు అవసరం లేదు, థాంక్స్.

29:06.246 --> 29:07.247
సరే.

29:08.624 --> 29:12.211
మీ ఒంటి మీద చిన్నచిన్న మచ్చలంటే నాకు ఇష్టం.
సారీ. అవి చాలా ముచ్చటగా ఉంటాయి.

29:12.920 --> 29:14.922
మిమ్మల్ని చాలా, చాలా దగ్గరగా చూస్తే అవి కనిపిస్తాయి,

29:15.005 --> 29:17.341
ఇంకా అవి మీ వయసు కొద్దిగా పైబడినట్లు కనిపించేలా చేస్తాయి.

29:17.424 --> 29:20.511
ఇంకా ఒంగిన మీ గూడు, దాని గురించి
ఆందోళన పడకండి, అది నేను చూసుకుంటాను.

29:20.594 --> 29:22.137
సారీ. నీ పేరు ఏంటి?

29:22.221 --> 29:23.222
నా పేరు కీలీ.

29:23.305 --> 29:25.766
కీలీ, నేను కేవలం కొన్ని అవసరమైన వస్తువుల్ని
మాత్రమే తీసుకుంటున్నాను,

29:25.849 --> 29:26.934
కాబట్టి, చూడు, నాకు ఇవి చాలు.

29:27.017 --> 29:29.770
- మీరు వేరే ఊరి నుండి వచ్చారా?
- లేదు, నేను ఇక్కడే ఉంటాను.

29:29.853 --> 29:31.313
అయితే మరి సరుకులు కొద్ది రోజులకి మాత్రమే ఎందుకు?

29:32.940 --> 29:35.067
అంటే, కీలీ, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా,

29:36.068 --> 29:38.946
నా భర్త నిన్న రాత్రి మా ఇంటి
ముందు హాలులో హత్యకి గురయ్యాడు,

29:39.029 --> 29:40.614
ఇప్పుడు అది క్రైమ్ సీన్ అయింది,

29:40.697 --> 29:42.449
అందుకని నేను హోటల్ లో ఉంటున్నాను,

29:42.533 --> 29:44.535
అందుకని నేను కొన్ని వస్తువుల్ని కొత్తగా కొనాల్సి వస్తోంది,

29:44.618 --> 29:47.788
అందుకని, నువ్వు చాలా ముచ్చటగా గమనించావు కాబట్టి,

29:47.871 --> 29:51.041
నాకు రెటీనల్ ఐ ప్యాచ్ లు చాలా అవసరం కావచ్చు.

29:51.792 --> 29:55.003
మేము చాలా గందరగోళపు విడాకుల ప్రక్రియ మధ్యలో ఉన్నాం,

29:55.087 --> 29:56.797
కాబట్టి నాలో ఒక భాగం…

29:56.880 --> 30:00.384
చాలా వేదన పడుతున్న పెద్ద భాగం,
అతను చనిపోయాడని ఉపశమనం పొందుతోంది.

30:00.467 --> 30:04.012
కానీ, నా ఉద్దేశం, కీలీ, అలా స్వాంతన పొందుతున్నందుకు
నాకు ఒక పక్క అపరాధభావం కూడా ఉంది ఎందుకంటే…

30:05.013 --> 30:07.057
నా ఉద్దేశం, అతను నా పిల్లలకి తండ్రి.

30:07.140 --> 30:09.351
నా ఉద్దేశం, నేను ఎలాంటి మనిషిని అనిపిస్తుంది, తెలుసా?

30:09.434 --> 30:10.769
ఆ విషయాలన్నీ నీకు చెప్పడానికి
నాకు అభ్యంతరం లేదు

30:10.853 --> 30:12.688
ఎందుకంటే, నా ఉద్దేశం, నువ్వు అసలు ఎవరు, అవునా?

30:13.188 --> 30:14.064
విషయం ఏమిటంటే…

30:14.731 --> 30:18.318
నేను ఈ మధ్యనే విడాకులు ఇచ్చే స్వేచ్ఛని
ఆస్వాదించడం ప్రారంభించాను,

30:18.402 --> 30:20.571
కానీ అంతలోనే హఠాత్తుగా నేను విధవని అయిపోయానా?

30:21.071 --> 30:23.532
నా ఉద్దేశం, నాకంటూ ఉన్న గుర్తింపు పూర్తిగా పోయింది,

30:23.615 --> 30:24.950
ఆ కూబ్లర్ రాస్ భావోద్వేగాల ప్రక్రియతో సహా.

30:25.033 --> 30:28.203
కాబట్టి నా ఇంట్లోనే నేను వెళ్లలేని పరిస్థితికి తోడు,

30:28.704 --> 30:31.415
నాకు ఈ జెంగా టవర్ ఆటలాంటి, అంటే,

30:31.498 --> 30:35.377
అపరాధభావన ఇంకా విషాదం ఇంకా అయోమయం
ఇంకా కోపం కలగలసిన గందరగోళాన్ని నేను పరిష్కరించుకోవాలి,

30:35.460 --> 30:39.631
నువ్వు ఇక్కడకి ఎగురుకుంటూ వచ్చే సమయానికి
నేను ఆ ప్రయత్నం చేస్తూ ఘోరంగా విఫలమవుతున్నాను.

30:39.715 --> 30:43.886
కాబట్టి నేను నీ స్థానంలో ఉండి ఉంటే, ఏం చేస్తానంటే,
నేను ఆశ్చర్యంతో తెరిచిన నోరుని మూసుకుని,

30:43.969 --> 30:47.222
అదిగో అక్కడ లౌరా మెర్సియర్ మేకప్ సామాన్ల దగ్గరున్న
కస్టమర్ దగ్గరకి వెళతాను,

30:47.306 --> 30:49.349
ఎందుకంటే తనకి నిజానికి నీ సాయం అవసరం అనుకుంటా.

30:50.100 --> 30:52.519
- అవును. నేను బహుశా…
- అవును.

30:57.399 --> 30:58.442
అవును, కదా?

30:59.860 --> 31:02.362
చాలా బాగుంది. చాలా బాగుంది!

31:03.989 --> 31:05.282
చాలా బాగుంది.

31:06.658 --> 31:07.492
లేదు.

31:07.576 --> 31:09.244
వాయిస్ మెయిల్
ఎలీనా బెనిటెజ్

31:12.998 --> 31:14.374
- అది ఎవరు?
- వాస్తవ జీవితం.

31:14.458 --> 31:15.792
తను నీ గర్ల్ ఫ్రెండా?

31:17.169 --> 31:19.838
- ఆడ స్నేహితురాలా?
- ఆఫ్ చేశా.

31:22.382 --> 31:24.510
మన పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో,
నువ్వు ఫోన్ స్విచాఫ్ చేయడం నేను చూడలేదు.

31:24.593 --> 31:25.802
అది, ఎక్కువ కాలం కొనసాగేలా చేస్తుంది.

31:25.886 --> 31:27.513
- పెళ్లినా?
- బ్యాటరీని.

31:33.101 --> 31:35.062
చాలా ఏళ్ల తరువాత నీతో నేను
చాలా చక్కగా గడుపుతున్న క్షణాలు ఇవి.

31:35.687 --> 31:37.523
అది ఎందుకంటే, మిత్రమా, నువ్వు తాగిన మైకంలో ఉన్నావు.

31:37.606 --> 31:38.440
నేను మైకంలో ఉన్నాను.

31:40.526 --> 31:41.693
ఆ మైకంలో ఉన్నాను కాబట్టి…

31:43.612 --> 31:45.155
నేను ఒక విషయాన్ని ఒప్పుకోవాలి.

31:55.832 --> 31:57.042
హేయ్!

31:58.585 --> 32:01.171
- నేను ఆ మనిషి మీద కోప్పడ్డాను.
- తెలుసు. నువ్వు తెలివిగా ప్రవర్తించావు.

32:02.297 --> 32:03.298
దేనికి?

32:06.969 --> 32:08.387
నీకు ఎప్పుడూ ఏదీ దొంగతనం చేయాలనిపించలేదా?

32:51.680 --> 32:54.266
అదీ. అలాగ. నేను ఇంకా వినాలి అనుకుంటున్నా.

33:13.202 --> 33:14.494
నువ్వు కొత్తగా చేరావు.

33:15.245 --> 33:18.874
నాకు తెలుసు ఎందుకంటే మాకు కేవలం ఆరుగురు
నిజమైన అభిమానులు మాత్రమే ఉన్నారు.

33:18.957 --> 33:20.501
ఈ క్లబ్ మమ్మల్ని ఇక్కడ పాడటానికి అనుమతించింది

33:20.584 --> 33:23.170
ఎందుకంటే కిందటి వారం వాళ్ల సౌండ్ సిస్టమ్ పాడైపోయింది.

33:23.253 --> 33:25.130
నీ ఉద్దేశం ఏంటి? మీరంతా చాలా బాగా పాడారు.

33:26.423 --> 33:28.634
సరే. ఈ ఉత్సాహాన్ని అదుపు చేసుకోవాలి.

33:32.137 --> 33:36.016
ప్రతి ఒక్కరూ చెప్పే మంచి విషయాల వల్ల
హై స్కూలులో మనల్ని ఆకతాయిలు అల్లరి పెడతారు,

33:36.099 --> 33:37.476
అదే కాలేజీలో అయితే పక్క మీద పడుకోపెడతారు.

33:38.894 --> 33:40.145
నువ్వు అలా పడుకుంటున్నావా?

33:41.855 --> 33:43.690
కనీసం నన్ను ఆకతాయిలు ఎవరూ వేధించడం లేదు.

33:45.817 --> 33:48.403
- ఊరికే చూడు… ఇదిగో. దూరింది.
- ఓహ్, ఇది తల్లకిందులు అయింది.

33:48.487 --> 33:50.572
ఇప్పుడు, చూడు. దీన్ని ఇలా అంటే…

33:52.741 --> 33:57.371
నేను తాళం తీసుకుంటున్నాను
జీసెస్ ఇంటికి

34:03.961 --> 34:05.212
ఇది చర్చ్.

34:05.295 --> 34:07.422
ఇది ప్రార్థనా మందిరం. మనం చాలా గౌరవప్రదంగా ప్రవర్తించాలి.

34:07.506 --> 34:09.424
నువ్వు ఉండు.

34:09.507 --> 34:12.052
- కూర్చో. ఇక్కడ కూర్చో, సరేనా? అలా…
- మనం ఏం చేస్తున్నాం?

34:12.135 --> 34:13.344
నేను వెళ్తున్నా.

34:13.428 --> 34:15.764
నేను ఒక పని పూర్తి చేయాలి. ఉండు. ఇక్కడే ఉండు.

34:17.266 --> 34:18.600
ఏం చేస్తున్నావు?

34:31.071 --> 34:32.989
- నువ్వు నరకానికి పోతావు.
- అవును.

34:33.072 --> 34:34.658
నాకు తెలియని విషయం ఏదైనా చెప్పు.

34:34.741 --> 34:37.452
- నీ జామ్ తో పాటు తినడానికి క్రాకర్స్. సరేనా?
- నిన్ను అక్కడ కలుస్తాను.

34:37.536 --> 34:39.913
- నీకు బుర్ర పనిచేయడం లేదు.
- బహుశా పోయి ఉంటుంది.

34:53.635 --> 34:54.719
కదా?

35:08.358 --> 35:09.902
నీకో విషయం చెప్పనా?

35:11.612 --> 35:12.738
తప్పకుండా.

35:16.283 --> 35:18.785
నేను బెయిలీ సంస్థలో ఉద్యోగం మానేయలేదు. నన్ను తీసేశారు.

35:20.370 --> 35:21.371
ఏంటి?

35:23.248 --> 35:24.541
- దేనికి?
- అవును.

35:24.625 --> 35:27.544
నేను తప్పు చేశాను దానితో జాక్ నన్ను బయటకి గెంటేశాడు.

35:29.713 --> 35:30.923
ఒక అమ్మాయి ఉంది…

35:31.757 --> 35:33.884
లేదు, లేదు. అందుకు కాదు. అదీ…

35:34.676 --> 35:37.804
చూడు, అతను ఒక అవకాశం కోసం చూశాడు,
అదును చూసి దెబ్బకొట్టాడు.

35:40.724 --> 35:41.975
- వాడు ఒక చెత్తవెధవ.
- అవును.

35:42.059 --> 35:43.977
- వాడిని ఎప్పుడూ అసహ్యించుకునే వాడివి.
- నిజం చెప్పావు,

35:44.061 --> 35:45.270
కానీ ఆ డబ్బు ఖచ్చితంగా సాయపడి ఉండేది.

35:47.064 --> 35:49.107
ఎంత నష్టం జరిగింది?

35:50.192 --> 35:51.193
పెద్ద నష్టం ఏమీ లేదు.

35:52.236 --> 35:53.862
ఆర్థికంగా మనకి ఫర్వాలేదు కదా?

35:54.613 --> 35:55.697
హా, ఇది దాని గురించి కాదు.

35:55.781 --> 35:58.700
లేదు, నేను వేరే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను.

35:58.784 --> 36:00.327
అదీ… మనకేం ఫర్వాలేదు.

36:03.038 --> 36:05.249
- సారీ, కూప్.
- లేదు, అలా అనుకోకు.

36:06.959 --> 36:09.920
- నేను ఆలోచిస్తున్నాను.
- లేదు, నేను చేసిన తప్పులన్నింటికీ సారీ.

36:16.134 --> 36:17.386
అవును, నువ్వు పశ్చాత్తాపపడాలి.

36:18.262 --> 36:19.638
ఓయ్, ఒక విషయం తెలుసా…

36:20.681 --> 36:22.182
ఇది క్రీస్తు దేహం.

36:24.476 --> 36:25.686
నువ్వు జాగ్రత్తగా ఉండాలి.

36:29.648 --> 36:31.191
నిజంగా. సారీ.

36:34.444 --> 36:35.737
నేను కూడా సారీ చెప్పాలి.

36:39.491 --> 36:41.326
నేను నిన్ను పట్టించుకోవడం మానేశాను…

36:42.703 --> 36:44.580
నువ్వు, నిక్ సంబంధం పెట్టుకోక ముందే.

36:46.999 --> 36:49.293
ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పావు కాబట్టి,
నాలో అపరాధభావం చాలావరకూ తగ్గింది.

36:49.376 --> 36:50.794
- అలా అనిపిస్తోందా?
- అవును.

36:53.463 --> 36:54.506
అలా అయితే…

36:56.842 --> 36:58.260
నిన్ను నేను క్షమిస్తున్నాను.

37:27.080 --> 37:28.165
ఏం జరుగుతోంది?

37:30.417 --> 37:32.419
- నేను నా ఫోన్ మర్చిపోయాను…
- నేను… మేము ప్రార్థన చేస్తున్నాం…

37:32.503 --> 37:34.129
దొరికింది. తీసుకున్నా. థాంక్యూ.

37:34.213 --> 37:37.007
- థాంక్యూ, ఫాదర్.
- చాలా థాంక్స్. దీవెనలు.

37:37.090 --> 37:38.926
జార్జ్ వాషింగ్టన్ స్యూట్

38:44.867 --> 38:45.909
నేను వెళ్లాలి.

38:47.202 --> 38:48.453
హేయ్. ఉండు…

38:51.498 --> 38:54.042
మనం ఇప్పుడు తిరిగి వెళ్లకపోతే ఎలా ఉంటుంది?

38:54.126 --> 38:57.546
మన పిల్లల్ని తీసుకుని కారులో ఎక్కించుకుని

38:57.629 --> 38:59.590
మనం వ్యతిరేక దిశలో డ్రైవ్ చేసుకుంటూ

38:59.673 --> 39:02.259
ఏదైనా కొత్త ప్రదేశంలో మళ్లీ జీవితాన్ని
కొత్తగా ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?

39:06.054 --> 39:07.055
వినడానికి చక్కగా ఉంది.

39:10.225 --> 39:11.685
నాతో పాటు పారిపోయి వచ్చేయ్, మెల్.

39:20.235 --> 39:21.361
ఎప్పటికీ చాటుగా దాక్కుని ఉండలేను.

39:35.459 --> 39:36.627
అప్పుడే కాదు.

40:30.472 --> 40:32.099
ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి,
నువ్వు సెక్స్ చేయడం లేదు.

40:32.683 --> 40:34.184
- నువ్వు కన్యవా?
- బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

40:35.102 --> 40:37.271
- నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
- అది అంత అవసరమా?

40:39.106 --> 40:40.107
పెద్దగా అవసరం లేదు.

40:48.073 --> 40:49.825
ఇలా రా. నేను మర్యాదగా ప్రవర్తిస్తాను.

41:14.641 --> 41:16.268
- చూడు, నీ కోసం నేను పాట పాడగలను.
- దయచేసి వద్దు.

41:16.351 --> 41:17.352
సరే.

41:27.321 --> 41:28.822
నేను హస్తప్రయోగం చేసుకుంటే నీకేం ఫర్వాలేదా?

41:30.741 --> 41:32.618
ఇదిగో అయిపోయింది. ఓహ్, బాబు.

41:32.701 --> 41:35.078
అది… ఏదో రంగులో ఉంది.

41:37.080 --> 41:39.124
నిన్న రాత్రి నువ్వు బాగా తాగావు కదా, హా?

41:39.625 --> 41:41.251
నువ్వు సరైన ఎంపికలు చేసుకున్నావు అనుకుంటా.

41:46.006 --> 41:47.758
జేక్ తో నేను ఎక్కువ కాలం కొనసాగలేను అనుకుంటా.

41:48.634 --> 41:49.760
అవును, అది మంచి నిర్ణయం.

41:51.512 --> 41:52.387
- నాన్నా.
- మౌనంగా ఉండు.

41:52.471 --> 41:53.555
నాకు ఒక అవకాశం దొరికింది.

41:54.264 --> 41:55.807
అతడిని నువ్వు ఎందుకు అంతగా ద్వేషిస్తావు?

41:55.891 --> 41:57.935
నాకు అతనంటే ద్వేషం లేదు.
అతను నీకు సరిపోడని నాకు ముందే తెలుసు.

42:00.938 --> 42:03.106
- నువ్వు ఎవరి గురించి అయినా అదే అంటావు.
- అవును, అంటాను.

42:04.149 --> 42:06.193
కానీ విను, త్వరలో, నువ్వు ఎవరో ఒకరిని కలుసుకుంటావు,

42:06.276 --> 42:09.363
ఇంకా అతను పొడవుగా ఆకర్షణీయంగా ఇంకా తెలివిగా ఉంటాడు,

42:09.446 --> 42:11.949
ఇంకా సున్నితంగా మంచి లక్షణాలతో ఉంటాడు.

42:12.032 --> 42:13.534
- అన్ని లక్షణాలు… నీకింకా తనంటే ద్వేషం.
- అవును.

42:13.617 --> 42:15.369
- అవును.
- నేను ద్వేషిస్తూనే ఉంటానేమో.

42:16.453 --> 42:17.538
నా మాట విను.

42:18.872 --> 42:22.125
నీ జీవితం నిరంతరం కొత్తగా మారిపోతున్నట్లు
నీకు ఇప్పుడు అనిపిస్తూ ఉండచ్చు,

42:22.209 --> 42:25.170
ఇంకా అది నీకు భయం కలిగిస్తూ ఉండచ్చు,
కానీ నన్ను నమ్ము,

42:25.754 --> 42:27.172
యుక్తవయసులో ఉండే మంచి విషయం ఏమిటంటే

42:27.256 --> 42:30.092
నువ్వు సరిదిద్దుకోలేని విషయం ఏదీ ఉండదు.

42:35.097 --> 42:36.098
సరే.

42:36.640 --> 42:38.141
బహుశా అది ఎప్పటికీ నిజం కావచ్చు.

42:40.102 --> 42:42.688
బహుశా వయసు పెరిగాక
ఆ ప్రయత్నం మరింత కష్టంగా ఉంటుండచ్చు.

42:45.941 --> 42:47.860
నీ వయసుకి మించి వివేకం ఉన్నదానివని
నీకు ఎవరైనా చెప్పారా?

42:48.360 --> 42:49.403
ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ముందు,

42:49.486 --> 42:50.946
నీ దగ్గర వాంతి వాసన వస్తోందని గుర్తు చేస్తున్నా.

42:51.029 --> 42:52.447
- అవును.
- పద.

42:58.954 --> 43:03.125
డామ్
నేను నీ లవర్ ని అయితే బాగుండేది

43:08.338 --> 43:10.340
మోర్గన్
నువ్వు బాగానే ఉన్నావా?

43:19.516 --> 43:21.894
సారీ! మా అమ్మానాన్నాలు
నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడే తిరిగి తీసుకున్నా.

43:24.605 --> 43:26.481
సోమవారం నిన్ను కలవడానికి ఉత్సాహంగా ఉన్నా

43:38.702 --> 43:40.996
ఈ పాటలో అంత ఏం ఉందని
మీరిద్దరూ దీన్ని అంతగా ఇష్టపడుతున్నారు?

43:41.997 --> 43:43.040
ఇది చాలా ఘోరంగా ఉంది.

43:43.123 --> 43:44.416
- ఏంటి?
- ఓహ్, దేవుడా.

43:44.499 --> 43:46.543
వీడు ఒక రోజు రికార్డింగ్ స్టూడియోలో గడిపాడు,
ఇంక విమర్శకుడు అయిపోయాడు.

43:46.627 --> 43:48.587
ఓహ్, లేదు. దేవుడా. దయచేసి దాన్ని ఆపేయండి.

43:48.670 --> 43:50.714
- వినలేకపోతున్నాను. వాడు నిజం చెప్పాడు.
- సౌండ్ పెంచమంటావా? పెంచుదాం.

43:50.797 --> 43:52.049
- మరేం ఫర్వాలేదు. అదీ.
- వద్దు.

43:52.132 --> 43:53.967
- ఇదిగో, ఇంకా పెంచుతున్నా. ఇంకా కొద్దిగా.
- వద్దు, నాన్నా.

43:54.051 --> 43:55.511
వద్దు.

43:55.594 --> 43:58.138
అదీ. ఇప్పుడు మీకు నయంగా ఉంది, కదా?

44:04.603 --> 44:05.604
రోడ్డుకేసి చూడు.

44:09.691 --> 44:11.318
హేయ్, మనం డిన్నర్ తినడానికి ఆగాలి.

44:12.277 --> 44:13.946
మీరు డిన్నర్ చేస్తారా? యస్ అని చెప్పండి.

44:14.029 --> 44:15.197
- ఆకలిగా ఉంది.
- సరే.

44:18.283 --> 44:19.660
ఇది ఇలాగే జరుగుతుంది.

44:20.285 --> 44:21.578
ప్రపంచం మనల్ని బహిష్కరిస్తుంది

44:21.662 --> 44:23.830
దానితో మన జీవితాన్ని
అప్పటికప్పుడు గడుపుకుంటూ రావాల్సి వస్తుంది.

44:24.748 --> 44:29.419
ప్రేమ, సెక్స్, కుటుంబం, స్నేహితులు,
ఇళ్లు, కార్లు, అనుభవాలు.

44:29.503 --> 44:30.963
మనం వీటిని పొందే ప్రక్రియ ఎప్పటికీ ఆగదు.

44:31.839 --> 44:33.006
కానీ మనకి వయసు పెరిగినప్పుడు మాత్రమే

44:33.090 --> 44:35.968
మనం ఆ ప్రయత్నంలో ఏమేం కోల్పోతున్నామో
గమనించడం ప్రారంభిస్తాం.

44:36.051 --> 44:40.013
అప్పటి నుండి అది కడుపులో రాచపుండు మాదిరిగా
మనసులో పశ్చాత్తాపం వేధించడం మొదలువుతుంది.

44:41.807 --> 44:43.350
కానీ మన జీవితం మన కళ్ల ముందు కనిపించేలా

44:43.433 --> 44:45.352
స్పష్టమైన సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి.

44:45.435 --> 44:47.980
అన్నీ ఎగుడుదిగుడు చక్రాలు. మంచి చెడుల మలుపులు.

44:48.063 --> 44:49.815
గెలుపులు ఇంకా మానసిక వేదనలు.

44:49.898 --> 44:51.024
ఇంకా ఈ సందర్భాలలో,

44:51.108 --> 44:53.068
మనకి ముఖ్యమైనవి ఏవో వాటిని మనం గుర్తించగలం.

44:53.151 --> 44:54.486
మనల్ని పరిపూర్ణంగా చేయగల విషయాలు.

44:54.570 --> 44:56.488
అవి లేకపోతే, మన స్వర్గం

44:56.572 --> 44:58.699
తక్షణమే మనం సృష్టించుకున్న నరకంగా మారిపోతుంది.

45:00.701 --> 45:03.787
అటువంటి సందర్భాలలో, మనం ఏం చేయాలో
మన మనసుకి తెలుస్తుంది,

45:04.288 --> 45:07.958
మనం ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా…
వాటిని పదిలంగా దాచుకోవాలని అర్థమవుతుంది.

45:14.673 --> 45:15.841
హేయ్. ఎక్కడికి వెళ్తున్నావు?

45:16.341 --> 45:18.802
మెల్ కారులో నుంచి గొడుగు తెచ్చుకుందామని వెళ్తున్నా.
వర్షం బాగా పెద్దదయ్యేలా ఉంది.

45:20.137 --> 45:23.599
హేయ్, నిన్నూ, మెల్ నీ ఇలా కుటుంబంతో కలిసి
బయట తిరగడం చూస్తుంటే ఏదో కలలా అనిపిస్తోంది.

45:23.682 --> 45:26.435
- ఇదివరకు అలా ఉండేది కాదు.
- లేదు, అలా ఉండేది కాదు. కాబట్టి,

45:27.728 --> 45:30.147
- ఏదైనా మార్పు జరుగుతోందా?
- ఇది కేవలం డిన్నర్, బార్నీ.

45:32.024 --> 45:33.192
నువ్వు ఏది చెబితే అదే.

45:35.152 --> 45:37.279
నా కుటుంబంతో, మెల్ తో నేను గడిపిన ఈ సమయం,

45:37.362 --> 45:41.241
ఇంతవరకూ ఏం కోల్పోతున్నానో కూడా గ్రహించని నన్ను
మేలుకొలిపి ఒక విషయం స్పష్టం చేసింది.

45:41.825 --> 45:42.910
ఆశ.

45:44.411 --> 45:45.829
కమ్ముకున్న పొగమంచు తొలగిపోయినట్లు అనిపిస్తోంది.

45:47.539 --> 45:50.167
నేను ఏం కోల్పోయానో చూడగలిగాను,
ఇక దాన్ని తిరిగి నేను పొందబోతున్నాను.

45:51.919 --> 45:54.046
అది అంత తేలిక కాదు
కానీ నేను అది సాధించగలనని నాకు తెలుసు.

45:54.129 --> 45:55.088
హేయ్!

46:08.727 --> 46:09.728
త్వరగా 911 కి కాల్ చేయండి.

46:10.521 --> 46:11.939
ఓయ్!

46:13.065 --> 46:14.316
హేయ్!

46:17.778 --> 46:18.779
- ఉండు!
- పదండి!

46:18.862 --> 46:19.905
ఇక్కడి నుండి వెళదాం రండి!

46:20.405 --> 46:22.908
బార్నీ! బార్నీ!

46:22.991 --> 46:24.368
ఓహ్, దేవుడా.

46:26.537 --> 46:28.664
- నన్ను చూడు.
- కళ్లు తెరు. నా మాట వినిపిస్తోందా?

46:28.747 --> 46:30.207
- ఎక్కడ గాయమైంది?
- అయ్యో, దేవుడా.

46:30.290 --> 46:32.501
ప్లీజ్. ఓహ్, దేవుడా.

46:37.214 --> 46:39.424
ఎవరైనా రండి! ప్లీజ్!

46:42.302 --> 46:44.805
బార్నీకి ఏమీ కాకుండా చూడండి.
బార్నీకి ఏమీ కాకుండా చూడండి.

47:57.377 --> 47:59.379
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
