WEBVTT

00:28.362 --> 00:29.321
ఆగు!

01:11.864 --> 01:13.907
స్టామ్ ఫోర్డ్ ఇంకా న్యూ హావెన్ వరకూ

03:34.256 --> 03:35.257
ఎలీనా?

03:36.466 --> 03:38.343
కంగారుపడకు. నేనే. కూప్ ని.

03:40.345 --> 03:42.305
ఇది నువ్వు అనుకుంటున్నది కాాదు.

03:42.306 --> 03:46.101
నీ భార్యని కాజేసిన వ్యక్తి ఇంట్లోకి
నువ్వు దొంగతనం కోసం వచ్చినట్లు నాకు కనిపిస్తోంది.

03:50.397 --> 03:51.607
అది నిక్ గన్ కదా?

03:52.441 --> 03:53.442
ఇది నాది.

03:53.942 --> 03:55.110
నీకు గన్ తో ఏం పని?

03:55.611 --> 03:57.778
- నిక్ కి గన్ తో ఏం పని?
- సరే, నాకు గురి పెట్టకుండా ఉండగలవా?

03:57.779 --> 03:59.113
నేను హాని చేయనని నీకు తెలుసు.

03:59.114 --> 04:01.866
నాకేం తెలుసో నాకు తెలియదు. ఐదు నిమిషాల కిందటి వరకూ
నువ్వు దొంగవన్న సంగతి నాకు తెలియదు.

04:01.867 --> 04:03.284
నేను కేవలం ఆ ఉంగరాన్ని తీసుకోబోయాను.

04:03.285 --> 04:05.536
తన చాంపియన్షిప్ రింగ్ నిక్ కి కనిపించకపోతే,

04:05.537 --> 04:07.788
- అతను ఎవరిని నిందిస్తాడు?
- చూడు. నిక్ నిన్ను ప్రేమిస్తున్నాడు.

04:07.789 --> 04:09.624
నేను ఇల్లు తుడుస్తుంటే
నా పిరుదుల్ని చూడటం నిక్ కి ఇష్టం.

04:09.625 --> 04:10.542
అది...

04:12.669 --> 04:13.669
నిజం కావచ్చు.

04:13.670 --> 04:14.963
స్పెర్లింగ్ కుటుంబం ఆరియానాని ఇష్టపడింది.

04:16.048 --> 04:17.256
వాళ్లు ఆమెని కొద్ది రోజుల కిందట తీసేశారు.

04:17.257 --> 04:19.717
ఈ మధ్య మిస్టర్ స్పెర్లింగ్ వాచీ కనిపించకుండా పోయింది
దానికి ఆమెని నిందించారు.

04:19.718 --> 04:22.053
ఆమె వాస్తవంగా చెల్సియాని పెంచి పెద్ద చేసింది.

04:26.350 --> 04:27.351
ఆ పని చేసింది నువ్వేనా?

04:28.060 --> 04:29.101
నీ ఫ్రెండ్ ఉద్యోగం పోయినందుకు సారీ.

04:29.102 --> 04:32.438
కానీ, నీకు అంతకన్నా పెద్ద సమస్యలే ఉన్నాయి.
నిజం చెప్పాలంటే, ఆమె అంటే నాకు ఇష్టం లేదు.

04:32.439 --> 04:33.565
అలా అయితే, సంతోషం.

04:34.149 --> 04:35.858
ఏంటి, బ్యాంక్ లో నీకు తగినంత జీతం ఇవ్వడం లేదా?

04:35.859 --> 04:37.735
- అది హెడ్జ్ ఫండ్.
- ఏదో ఒకటి.

04:37.736 --> 04:41.072
నీ బాస్ నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు.
నా బాస్ నన్ను ఉద్యోగం నుండి తీసేశాడు.

04:41.073 --> 04:44.117
సరే. అయితే నీ ఉద్యోగం పోయింది, ఇంకా నీ...

04:44.785 --> 04:46.118
నీ మిత్రుడు, నీ భార్య నీకు దూరమయ్యారు.

04:46.119 --> 04:48.829
అది చాలా కష్టకాలం.

04:48.830 --> 04:51.959
అవును, కానీ, అది ఇంకా ఎంత కష్టంగా మారుతుందో
నువ్వు చెబుతావని ఎదురుచూస్తున్నాను.

04:52.459 --> 04:54.544
- ఆ ఉంగరంతో ఏం చేస్తావు?
- నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు.

04:54.545 --> 04:56.255
ఆ వ్యక్తి నిన్ను ఛీకొడతాడు.

04:56.839 --> 04:58.256
ఇది కార్టియర్ నెక్లెస్ లాంటిది కాదు.

04:58.257 --> 05:00.591
ఇలాంటి రింగ్ దొంగతనం జరిగిందని పోలీసులకి తెలిస్తే
ఆ దొంగ కోసం గట్టిగానే వేటాడతారు.

05:00.592 --> 05:02.426
నిక్ కొంతకాలం వరకూ దాన్ని గమనించడని నాకు తెలుసు.

05:02.427 --> 05:05.429
అతనికి ఇష్టమైన దానిని కాజేయాలన్నదే నీ ఉద్దేశం అనుకుంటా.

05:05.430 --> 05:06.514
అతను నీకు చేసినట్లుగా.

05:06.515 --> 05:08.892
వాళ్ల సంబంధం గురించి నీకు తెలుసు కదా.

05:09.935 --> 05:11.477
నాకంటే ముందే, అనుకుంటా.

05:11.478 --> 05:13.896
వాళ్లు శృంగారం చేస్తూ కంటపడింది
మొదటగా నీకు మాత్రమే కాదని తెలుసుకో.

05:13.897 --> 05:15.022
అది చాలా అవమానకరం.

05:15.023 --> 05:16.525
- వాళ్లకా?
- నాకు.

05:17.150 --> 05:19.069
నేను చెప్పాను కదా, నీకు పెద్ద సమస్యలే ఉన్నాయి.

05:20.863 --> 05:22.029
అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం?

05:22.030 --> 05:25.033
నువ్వు అనుకుంటే ఈపాటికే
పోలీసులకి ఫోన్ చేసి ఉండేదానివి. కాబట్టి...

05:33.458 --> 05:34.625
నీ రహస్యాన్ని నేను నాలోనే దాచుకుంటాను.

05:34.626 --> 05:37.170
థాంక్యూ. నీకు రుణపడి ఉంటాను.

05:37.171 --> 05:38.337
ఇంకా నా రహస్యాన్ని నువ్వు దాచాలి.

05:38.338 --> 05:40.089
సారీ. నీ రహస్యం ఏమిటో నాకు తెలియదు.

05:40.090 --> 05:41.717
అది కూడా నీ రహస్యం లాంటిదే.

05:43.010 --> 05:44.428
మనం ఇప్పుడు భాగస్వాములం.

07:14.935 --> 07:15.769
మెల్.

07:16.728 --> 07:19.189
హేయ్. రాన్.

07:20.399 --> 07:22.859
- మార్లీ.
- మా చక్కని మనవలు ఎలా ఉన్నారు?

07:22.860 --> 07:24.485
టెన్నిస్ టోర్నమెంట్ లో టోరీ గెలిచిందని విన్నారా?

07:24.486 --> 07:26.946
విన్నాం. దాని గురించి అంతా తెలుసుకున్నాం.
కంగ్రాట్యులేషన్స్.

07:26.947 --> 07:28.531
మేము చాలా గర్వపడుతున్నాం.

07:28.532 --> 07:31.618
తనలో అంత పోరాటపటిమ ఉండటం, నిజంగా,
చాలా గొప్ప విషయం.

07:32.870 --> 07:34.412
తన తరువాత మ్యాచ్ కి మీరు తప్పకుండా రావాలి.

07:34.413 --> 07:35.872
మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం.

07:35.873 --> 07:39.876
సారీ. మీ అబ్బాయి మీకు చెప్పాడని అనుకున్నాను.

07:39.877 --> 07:44.088
ఫర్వాలేదు. టోరీ ఆ మ్యాచ్ తరువాత మాకు ఫోన్ చేసి
ఒక ఫోటో పంపించింది.

07:44.089 --> 07:46.465
ఇక్కడ గందరగోళం నుంచి కాస్త దూరంగా ఉండాలి అనుకుంటే

07:46.466 --> 07:48.886
మా ఇంటికి ఎప్పుడయినా రావచ్చని తనతో చెప్పాను.

07:50.345 --> 07:51.345
ఏం గందరగోళం?

07:51.346 --> 07:52.638
గందరగోళం అంటే తన ఉద్దేశం అది కాదు.

07:52.639 --> 07:53.974
ఆమె ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే అంది.

07:57.019 --> 08:00.021
ఏం గందరగోళం, మార్లీ?
నాకు తెలియనిది నీకేమయినా తెలుసా?

08:00.022 --> 08:02.523
అంటే, దానికి నువ్వు ఉన్నంత దగ్గరగా నేను లేను.

08:02.524 --> 08:03.942
లేదు, నువ్వు లేవు.

08:06.528 --> 08:09.990
నువ్వు ఓట్ మీల్ తీసుకోవడం మర్చిపోయినట్లున్నావు.

08:13.619 --> 08:16.078
తను అన్నది నిజానికి ఏదీ ఉద్దేశించి కాదు.

08:16.079 --> 08:17.872
ఓహ్, అవును, ఆమె ఉద్దేశపూర్వకంగానే అంది.

08:17.873 --> 08:22.044
తను అలా అనడంలో ఏ దురుద్దేశం లేదని చెప్పడమే నా ఉద్దేశం.

08:26.173 --> 08:28.967
ఈ మనుషులు మూర్ఖులు. అందులో సందేహం లేదు.

08:29.468 --> 08:30.801
కానీ నువ్వు పని చేస్తున్న వృత్తి

08:30.802 --> 08:33.639
అలాంటి మూర్ఖుల్ని ఆకర్షించి
వాళ్లని క్రమంగా పెంచి పోషిస్తుంది కదా.

08:34.264 --> 08:36.599
నువ్వు చక్కని సూట్ వేసుకుని
నీకన్నా తక్కువ స్థాయి ఉద్యోగుల దగ్గరకి వెళ్లి

08:36.600 --> 08:39.018
వాళ్లని ఉద్యోగం అడగడం నీకు ఎంత నామోషీగా ఉంటుందో
నేను అర్థం చేసుకోగలను,

08:39.019 --> 08:42.606
కానీ చివరికి, నువ్వు, నేను సేల్స్ వృత్తిలోనే ఉన్నాం, కూప్.

08:43.357 --> 08:44.941
మనల్ని మనమే అమ్ముకుంటున్నాం.

08:44.942 --> 08:47.318
అందరూ ఏం అంటారో తెలుసా,
"వ్యాపారం దెబ్బతింటుంది. అమ్మకాలు తగ్గిపోతున్నాయి."

08:47.319 --> 08:49.780
ఈ లెక్చర్ ని వాయిదా వేసే అవకాశం ఏదైనా ఉందా?

08:50.364 --> 08:51.573
నేను ఇందాకే హార్వీ రాట్నర్ ని కలిశాను.

08:52.074 --> 08:53.866
నువ్వు మాట్లాడకుండా ఉండటం కోసం నీకు డబ్బు ఇస్తాను.

08:53.867 --> 08:54.952
దేనికి?

08:55.452 --> 08:58.538
రాట్నర్ కుటుంబం తమ వ్యాపారాన్ని పటిష్టం చేసుకుంటున్నారు,
వాళ్లు కొత్త సి.ఇ.ఓ. కోసం చూస్తున్నారు.

08:58.539 --> 09:00.289
రాట్నర్ కుటుంబమా? నేను ఇంకా చచ్చిపోలేదు, కదా?

09:00.290 --> 09:01.707
నాకు తెలుసు. అది మంచి విషయం కాదు.

09:01.708 --> 09:04.753
కానీ ప్రస్తుతం, అన్నిటికన్నా ముఖ్యంగా,
నువ్వు తిరిగి రంగంలోకి దిగాలి.

09:05.379 --> 09:06.797
నాకు కాస్త విరామం కావాలి.

09:07.965 --> 09:09.383
నువ్వు ఇప్పటికే విరామం తీసుకున్నావుగా.

09:10.175 --> 09:12.051
విశ్రాంతి తీసుకుంటూ దాని నుంచి విశ్రాంతి తీసుకోలేవు.

09:12.052 --> 09:14.888
కానీ, నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు?
నీ బాకీ తీర్చేశాను కదా.

09:15.472 --> 09:17.765
అవును, డబ్బుతో ఉన్న బ్రౌన్ సంచీ.

09:17.766 --> 09:20.102
కానీ దాని వల్ల నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా అనుకోకు.

09:20.727 --> 09:22.521
నువ్వు తిరిగి పనిలో చేరాలి, కూప్.

09:23.230 --> 09:24.480
నువ్వు తిరిగి నీ పని మొదలుపెట్టాలి.

09:24.481 --> 09:26.900
నాకు కాస్త ఆటవిడుపు కావాలి.

09:27.568 --> 09:28.569
ఖచ్చితంగా.

09:30.195 --> 09:32.573
లేదా, ఇక్కడ నీకు ఒక సలహా చెప్పదల్చుకున్నాను,

09:33.073 --> 09:36.034
బహుశా అది నిన్ను చాలా ఇబ్బంది పెట్టచ్చు.

09:37.202 --> 09:39.120
ఇప్పుడు ఇది నువ్వు విరామం తీసుకునే సమయం కాదు.

09:39.121 --> 09:41.832
బలమైన, మంద్రస్థాయిలో ఆందోళన కలిగించే విషయం ఇది.

09:42.499 --> 09:45.711
నువ్వు మ్యాసీ గురించి విన్నావు కదా.
ఈ కేసు ఎంతకాలం పడుతుందో దేవుడికే తెలియాలి.

09:46.503 --> 09:47.503
మీరు కూడా మాతో చేరడం చక్కగా ఉంది.

09:47.504 --> 09:49.547
సారీ, సారీ. దేవుడా.

09:49.548 --> 09:51.632
- టెన్ ఆఫ్టర్.
- కంగారుపడకు.

09:51.633 --> 09:53.843
పాత కాలపు ఆటగాళ్లు మమ్మల్ని ఇప్పటికే
చిత్తుగా ఓడించిన విషయం నీకు తెలుసు.

09:53.844 --> 09:57.222
సారీ. ఆ చెత్త కాంట్రాక్టర్ ఆట మధ్యలో
నాకు ఆటంకం కలిగించాడు.

09:57.723 --> 09:59.682
ఆ మనిషి నాకు బిల్లులు ఇచ్చినంత వేగంగా
పనులు చేసి ఉంటే,

09:59.683 --> 10:00.975
మా పనులు కొన్ని నెలల కిందటే పూర్తయ్యేవి.

10:00.976 --> 10:04.145
మేము కిందటసారి ఇంటికి చేసిన మరమ్మతులు
మా పెళ్లిని దాదాపు పెటాకులు చేయబోయింది.

10:04.146 --> 10:05.980
నీకు పెళ్లయిందా? నేను గమనించలేదే.

10:05.981 --> 10:07.232
ఇంక ఆపు.

10:07.733 --> 10:09.150
నువ్వు అనుకున్న బడ్జెట్ కి ఎంత ఎక్కువ అయింది?

10:09.151 --> 10:11.152
బడ్జెట్ ఉందా అంటున్నావా?
నా భార్యకి ఎవరైనా చెప్పండి.

10:11.153 --> 10:12.446
గ్రేస్ కి ఆడంబరంగా ఉండటం ఇష్టం.

10:13.030 --> 10:14.322
దాని గురించి చెప్పు.

10:14.323 --> 10:15.407
అదిగో అక్కడ పడింది.

10:17.784 --> 10:19.994
బ్రాడ్, మీ ఇంటి పనిమనిషిని ఉద్యోగంలో నుంచి
తీసేశావని విన్నాను నిజమేనా?

10:19.995 --> 10:22.538
తీసేయాల్సి వచ్చింది. నా రిచర్డ్ మిలె వాచీని ఎవరో కాజేశారు.

10:22.539 --> 10:23.748
తనే తీసుకుందని నీకెలా తెలుసు?

10:23.749 --> 10:26.792
ఖచ్చితంగా చెప్పలేను. కానీ తనకి మాత్రమే
ఆ గదిలోకి వెళ్లడానికి అనుమతి ఉంది.

10:26.793 --> 10:29.254
దానికి తోడు, ఆమె ఈ మధ్య కాలంలో
పని విషయంలో మరీ బద్ధకిస్తోంది.

10:33.467 --> 10:36.886
కొత్త పనివాళ్లని నియమించుకోవడానికి మంచి సాకు దొరికింది.

10:36.887 --> 10:39.681
ఆ వాచీ చాలా విలువైనది కదా.

10:40.224 --> 10:41.516
దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా?

10:41.517 --> 10:43.852
ఉండచ్చేమో, పోలీసులు గట్టిగా తల్చుకుంటే,
కానీ వాళ్లు పెద్దగా పట్టించుకోరు.

10:44.811 --> 10:47.522
నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయానని
ఆ డిటెక్టివ్ అనుకుంటోంది...

10:47.523 --> 10:51.235
అంటే పది లక్షల డాలర్ల విలువైన వాచీని
నేను ఎక్కడో పెట్టేసి ఉంటానని ఆమె ఆలోచన.

10:52.027 --> 10:53.236
అయితే నువ్వు పోలీసులకి చెప్పావా?

10:53.237 --> 10:56.615
అవును. ఇన్సూరెన్స్ కోసం నాకు పోలీస్ రిపోర్ట్ అవసరం.

10:58.283 --> 10:59.910
- బాగుంది.
- అయితే నీకు నష్టం లేదు.

11:01.286 --> 11:03.955
ఖచ్చితంగా, మాకు పెద్ద మొత్తమే వస్తుంది,

11:03.956 --> 11:05.916
కానీ అది చాలా అరుదైన తయారీ.

11:06.416 --> 11:07.416
మళ్లీ అలాంటిది దొరకదు.

11:07.417 --> 11:09.460
లీసా వాళ్ల అంకుల్ ఒకరు డైమండ్ డిస్ట్రిక్ట్ లో పని చేస్తారు

11:09.461 --> 11:11.546
ఆయన చోర్ బజారులో బహుశా
అలాంటిది ఒకటి సంపాదించి తీసుకురాగలడేమో.

11:11.547 --> 11:13.297
మెల్ పుట్టినరోజు వేడుకలో దాని గురించి ఆమెని అడగచ్చు.

11:13.298 --> 11:14.716
గోర్డీ...

11:16.927 --> 11:19.595
ఏంటి? మిత్రులారా, నాకు ఆహ్వానం అందింది. ఫర్వాలేదు.

11:19.596 --> 11:21.222
నిజంగానా?

11:21.223 --> 11:22.640
అవును.

11:22.641 --> 11:23.725
చూశావా?

11:25.769 --> 11:27.479
- బాగా కొట్టావు, బార్నీ.
- శభాష్.

11:35.362 --> 11:37.154
హేయ్, నిన్నటి ఎన్.ఎ.ఆర్. రిపోర్ట్ కాపీ ఒకటి నీ దగ్గర ఉందా?

11:37.155 --> 11:38.574
ఓహ్, ఉంది. చూస్తాను ఉండు.

11:46.248 --> 11:47.833
నాకు ఒక నిమిషం టైమ్ ఇవ్వు.

11:54.548 --> 11:57.175
- సరే, ఇంకో విషయం, మిత్రమా...
- తరువాత సారి...

11:57.176 --> 11:58.677
- నువ్వు.
- ...నువ్వు నాకు బాకీ తీర్చాలి.

11:59.303 --> 12:00.971
- ఈసారి నీ వంతు. అవును.
- లేదు.

12:04.433 --> 12:05.893
దాన్ని నీకు పంపించాను.

12:09.771 --> 12:13.065
సరే. బార్ దగ్గర టేబుల్స్ ని,
పూల్ దగ్గర డాన్స్ ఫ్లోర్ ని ఏర్పాటు చేస్తాం.

12:13.066 --> 12:16.569
కాబట్టి మేము లోపల, బయట కూడా
150 మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

12:16.570 --> 12:19.197
ఈ విషయంలో మనం ఏం చేయగలం?
ఇక్కడ కార్పెట్ మిడతలు ఉన్నాయి. వివరాలు అడగద్దు.

12:19.198 --> 12:20.281
- సరే.
- హేయ్! ఇలా రా!

12:20.282 --> 12:21.949
మనం ఇక్కడ నాలుగు అంతస్తులు పైకి ఎక్కాలి.

12:21.950 --> 12:25.870
మనం పురుగుల మందుని పూర్తిగా చల్లాలి.
వెనిగర్ సీల్స్ ఏర్పాటు చేయాలి. అవి పని చేయాలి.

12:25.871 --> 12:28.665
సరే. మనం ఇక్కడ పూలతో గోడని అలంకరించవచ్చు.

12:29.208 --> 12:33.337
ఈ మొత్తం భాగాన్ని కనిపించకుండా దాచేయచ్చు.
లేదా మనం ఏదైనా బోర్డుని ఏర్పాటు చేయచ్చు.

12:33.962 --> 12:35.421
నువ్వు ఏం అంటావు, అల్లరి పిల్లా?

12:35.422 --> 12:37.090
రెండూ పెట్టచ్చు కదా? ఎంత ఎక్కువైతే అంత మంచిది.

12:37.633 --> 12:39.550
నీకు ఏం తెలుసు? ఎంత ఎక్కువైతే అంత మంచిది.

12:39.551 --> 12:41.052
ఇక్కడ ఏం జరుగుతోంది?

12:41.053 --> 12:43.429
హేయ్! ఇది దాదాపుగా పుట్టినరోజు అమ్మాయి కోసం.

12:43.430 --> 12:45.640
నువ్వు ఇంకా అప్పుడే ఇంటికి రాకూడదు.

12:45.641 --> 12:47.600
మేలనీ, జేన్ ర్యూవెన్.

12:47.601 --> 12:48.851
ర్యూవెన్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్.

12:48.852 --> 12:51.020
- మిమ్మల్ని కలవడం సంతోషం.
- మిమ్మల్ని కలవడం సంతోషం.

12:51.021 --> 12:53.731
- నాకు పార్టీ వద్దని నీకు చెప్పాను కదా!
- నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం లేదు...

12:53.732 --> 12:56.359
- ఆ విషయంలో సారీ. దారి ఇవ్వండి. హేయ్.
- హేయ్, యోసే.

12:56.360 --> 12:57.944
చూడు, అమ్మా. నువ్వు ఇప్పుడు రద్దు చేయకు.

12:57.945 --> 13:00.446
అమ్మమ్మ ఇంకా తాతయ్య నిరాశపడతారు.

13:00.447 --> 13:02.031
బోకాలో ఉన్న మా తల్లిదండ్రుల్ని ఆహ్వానించావా?

13:02.032 --> 13:04.033
నిన్ను సర్ ప్రైజ్ చేయాలి అనుకున్నాను.
వాళ్లని విమానంలో రప్పిస్తున్నాను.

13:04.034 --> 13:05.952
- నా తల్లిదండ్రులు ఇక్కడికి రాకూడదు.
- ఏంటి... ఎందుకని?

13:05.953 --> 13:07.787
ఏంటి? ఇలా చూడు, అమ్మా. ఈ వేడుక బాగా జరుగుతుంది.

13:07.788 --> 13:09.872
- అమ్మా? అమ్మా?
- తాతయ్యలో ఇప్పుడు అంత వర్ణవివక్ష లేదు.

13:09.873 --> 13:11.457
ఆమె ఆ ఉబర్ డ్రైవర్ గురించి చెప్పింది గుర్తుందా?

13:11.458 --> 13:16.755
అమ్మా? అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. అది జరగని పని.

13:18.173 --> 13:19.799
- అంతా బాగానే ఉందా?
- బాగానే ఉంది. సరే. కానివ్వు.

13:19.800 --> 13:21.218
- తను మనసు మార్చుకుంటుంది.
- సరే.

13:21.718 --> 13:22.970
మా నాన్న అదే చెప్పాడు.

13:25.138 --> 13:31.519
ఇలా జరిగినందుకు సారీ. నాకూ, నిక్ కీ మధ్య
చిన్న అపార్థం చోటు చేసుకుంది అనుకుంటా.

13:31.520 --> 13:35.816
కానీ, ఇతను మీ కోసం చాలా ప్రయాస పడుతున్నాడు.

13:36.650 --> 13:38.819
నా భర్త కూడా ఇతనిలా ఆలోచిస్తే బాగుండేది అనిపిస్తోంది.

13:39.820 --> 13:41.613
మీ పెళ్లయి ఎంత కాలం అయింది?

13:51.498 --> 13:53.249
నీ అల్మారాలో చాలా షాపింగ్ బ్యాగులు ఉన్నాయి.

13:53.250 --> 13:54.877
అందులో సగం తిరిగి ఇచ్చేయాల్సినవే.

13:56.170 --> 13:59.046
లిల్లీ గుర్రపు స్వారీ చేయడం కోసం
కొత్త జీను ఇంకా పరికరాలు కావాలి.

13:59.047 --> 14:00.506
తన పాత జీనుకి ఏం అయింది?

14:00.507 --> 14:01.841
ఇది గుర్రపు స్వారీ నేర్చుకోవడం కోసం.

14:01.842 --> 14:05.262
మన అమ్మాయికి చాలా బలమైన పిరుదులు ఉన్నాయి.

14:05.971 --> 14:08.932
ఇది ప్రశంస అని తెలుసు,
కానీ ఇది అవమానంగా కూడా అనిపిస్తోంది.

14:10.684 --> 14:11.768
దేనికి?

14:12.811 --> 14:13.811
ఏం అయింది?

14:13.812 --> 14:18.316
ఇంటి పనులు ఇంకా మరమ్మతుల కారణంగా
మనం ఖర్చులు తగ్గించుకోవాలి.

14:18.317 --> 14:20.693
- కేవలం కొద్దికాలం పాటు.
- హేయ్, మనం బాగానే ఉన్నామా?

14:20.694 --> 14:23.363
అవును, కాస్త డబ్బు సర్దుబాటు కావాలి అంతే.

14:24.239 --> 14:25.239
మనకేం ఫర్వాలేదు.

14:25.240 --> 14:26.325
మంచిది.

14:27.451 --> 14:30.704
ఎందుకంటే మనం స్పెక్టర్ కారుని
ఎప్పుడయినా తిరిగి ఇచ్చేయచ్చు.

14:34.917 --> 14:41.798
లేదా, నాకు తెలియదు,
నేను ఈ ఖరీదైన పైజామాల్ని వేసుకోవడం మానేయాలేమో.

14:49.264 --> 14:50.265
ఇది నయం కదా?

14:55.729 --> 14:56.771
మళ్లీ ఒకసారి వేసుకుని చూపించు.

14:56.772 --> 14:58.232
ఓహ్, వద్దు, వద్దు, వద్దు.

15:12.037 --> 15:13.496
అక్టోబర్ 31, 1984.

15:13.497 --> 15:15.873
ఈ ప్రధానమంత్రిని ఇద్దరు హత్య చేశారు...

15:15.874 --> 15:16.959
ఎవరు...

15:17.459 --> 15:18.460
జాక్ బ్లాక్.

15:21.213 --> 15:23.048
హేయ్, మూవీ చూస్తావా?

15:24.716 --> 15:25.717
ఈ రాత్రి పని ఏమీ లేదా?

15:26.468 --> 15:27.344
ఏదో ప్రైవేటు వేడుక.

15:28.637 --> 15:32.098
ఇలా రా. నీకు ఇష్టమైన కుంగ్ ఫూ డ్రాగన్ సినిమాల్లో
ఏదైనా ఒకటి చూద్దాం.

15:32.099 --> 15:34.559
ఆ సినిమాల్లో నిజంగా ఎలాంటి డ్రాగన్లు ఉండవు, అవునా?

15:34.560 --> 15:35.643
అది నిరాశపరుస్తోంది.

15:35.644 --> 15:37.395
- "ఎస్.ఓ.ఎస్." అంటే ఏంటి?
- అనెట్.

15:37.396 --> 15:38.397
"ఎస్.ఓ.ఎస్." అంటే ఏంటి?

15:39.857 --> 15:41.941
నీ ఛాతిని పాత్రగా వాడుతున్నావా?

15:41.942 --> 15:45.988
అవును. ఇది మరింత అనువైన పాప్ కార్న్ డెలివరీ వ్యవస్థ.

15:46.572 --> 15:47.738
ఘోరంగా ఉంది.

15:47.739 --> 15:49.615
వచ్చింది ఎవరు?

15:49.616 --> 15:52.076
బహుశా అమ్మ వాక్యూమ్ క్లీనర్ తెచ్చి ఉంటుంది.

15:52.077 --> 15:54.037
నీ జీవిత లక్ష్యాల గురించి మనం మాట్లాడుకోవాలి.

15:54.621 --> 15:56.831
నువ్వు పిల్లల కన్నా ఘోరంగా ఉన్నావు. వస్తున్నా!

15:56.832 --> 15:58.332
ఈ షోమ్యాన్ రికార్డులు బద్దలుకొట్టాడు

15:58.333 --> 15:59.626
ఆలీస్ కూపర్ ఎవరు?

16:07.885 --> 16:10.179
- ఇక్కడ ఏం చేస్తున్నావు?
- నేను నీతో మాట్లాడాలి.

16:15.267 --> 16:16.392
నేను ఇక్కడికి రాకూడదు.

16:16.393 --> 16:17.977
అయినా వచ్చావు కదా.

16:17.978 --> 16:19.437
మ్యాసీ ఇప్పుడు జాక్ వైపు ఉన్నాడు.

16:19.438 --> 16:22.024
- ఏంటి?
- మ్యాసీ ఈ రోజు జాక్ ఆఫీస్ కి వచ్చాడు.

16:22.566 --> 16:25.902
అవును. నేను మాట్లాడుతుండగా నువ్వు ఫోన్ పెట్టేయకముందే
నీకు ఆ విషయం చెప్పాను.

16:25.903 --> 16:26.986
అతను నా లాయర్.

16:26.987 --> 16:28.655
వాళ్లు కలుసుకోవడం అలా కనిపించలేదు.

16:29.615 --> 16:32.033
- అయితే అది ఎలా కనిపించింది?
- మ్యాసీ ఇప్పుడు జాక్ తొత్తులా కనిపించాడు.

16:32.034 --> 16:33.409
అలా జరగకుండా చూడటానికి చట్టాలు ఉన్నాయి.

16:33.410 --> 16:36.121
నువ్వు రిటైనర్ ఫీజు చెల్లించావా?
ఒప్పందం మీద సంతకం చేశావా?

16:37.664 --> 16:39.790
తను తరువాత మాట్లాడతాను అన్నాడు.
ఛ. నువ్వు చెప్పేది నిజమేనా?

16:39.791 --> 16:42.920
జాక్ ఇంకా మ్యాసీ గురించి
నీకు తెలిసిన విషయాల గురించి ఆలోచించు.

16:44.671 --> 16:45.922
నేను వేరొక లాయర్ ని పెట్టుకుంటాను.

16:45.923 --> 16:47.716
అవును, నువ్వు ఆ పని చేయకపోతే బాగుంటుంది.

16:52.137 --> 16:54.222
జాక్ నీకు ఎంత ఇస్తున్నాడు?

16:54.223 --> 16:56.474
- ఏంటి?
- ఈ నాటకం ఆడటానికి? జాక్ ఎంత ఇస్తున్నాడు?

16:56.475 --> 16:57.559
చెప్పు.

16:58.977 --> 17:01.729
- మంచి పదవి.
- అర్థమైంది.

17:01.730 --> 17:04.022
- నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే నన్ను తీసేస్తాడు.
- నాకు తెలుసు.

17:04.023 --> 17:05.150
నేను మెచ్చుకుంటాను.

17:07.528 --> 17:08.694
నేను ఇంక వెళ్తాను.

17:12.281 --> 17:15.243
సరే, వచ్చినందుకు థాంక్యూ.

17:16.619 --> 17:18.413
నన్ను కలుసుకోకపోతే బాగుండేదని
నువ్వు అనుకుంటూ ఉండచ్చు.

17:19.039 --> 17:20.082
కానీ...

17:21.875 --> 17:23.167
ఆ వారాంతం చాలా సరదాగా గడిచింది.

17:25.503 --> 17:26.505
నిజంగా బాగా గడిచింది.

18:00.163 --> 18:01.874
ఆమె ఎవరు?

18:02.791 --> 18:04.125
అందరూ అలాగే ఉన్నారు.

18:04.126 --> 18:05.627
నీ జీవితంలో ఏం జరుగుతోంది?

18:13.343 --> 18:14.178
దేవుడా.

18:16.597 --> 18:17.681
ఒక క్షణం ఉండు.

18:18.974 --> 18:20.976
ఏంటి? హేయ్.

18:21.935 --> 18:22.769
అప్పుడేనా?

18:24.271 --> 18:25.105
అవును...

18:26.273 --> 18:28.358
అవును. నా ఉద్దేశం, తప్పకుండా.

18:30.319 --> 18:31.986
సరే. నేను అక్కడికి వస్తున్నాను.

18:31.987 --> 18:33.197
మంచిది.

18:35.032 --> 18:36.033
నేను వెళ్లాలి.

18:43.248 --> 18:45.041
తను కూడా నాతో భాగస్వామిగా ఉంటుందని
ఎలీనా చెప్పినప్పుడు,

18:45.042 --> 18:46.751
తను ఆ క్షణం నుంచే భాగస్వామ్యం ఆశించినట్లుంది.

18:46.752 --> 18:49.170
కాబట్టి ఇక నుంచి నా మాజీ భార్యతో సంబంధం ఉన్న వ్యక్తి

18:49.171 --> 18:51.255
ఇంటి పనిమనిషితో కలిసి నేరాలు చేస్తుండాలి.

18:51.256 --> 18:53.382
అది, చివరికి, నా చిరు వ్యాపారం
ఇప్పటికే అదుపు తప్పిపోయింది అనడానికి

18:53.383 --> 18:56.761
అది ఒక సంకేతంగా అనిపిస్తోంది.

18:56.762 --> 18:59.722
మరొక వంక, ఇంకో తోడు ఉంటే తప్పులేదని కూడా అనిపిస్తుంది.

18:59.723 --> 19:02.391
హేయ్. ఇది ఎవరి కారు?

19:02.392 --> 19:04.394
ఇది నిక్ కారు. ఇంటి పనుల కోసం.

19:04.937 --> 19:06.938
ఉబర్ ఈట్స్

19:06.939 --> 19:08.190
మంచి ఆలోచన.

19:09.483 --> 19:10.901
- అది ఏంటి?
- వై ఫై జామర్.

19:12.611 --> 19:13.904
కెమెరాల్ని పని చేయనివ్వదు.

19:14.488 --> 19:15.780
నీ దగ్గర మంచి పరికరాలు ఉన్నాయి.

19:15.781 --> 19:17.908
సరైన పనికి సరైన పనిముట్లు.

19:38.679 --> 19:40.305
నీకు ఖచ్చితంగా తెలుసా?

19:41.890 --> 19:46.310
ఆడవాళ్లు తమ నగల విషయంలో సెంటిమెంటల్ గా ఉంటారు కదా?

19:46.311 --> 19:47.728
పాంథర్ విషయంలో అలా ఉండదు.

19:47.729 --> 19:49.897
అది ఆమె మాజీ భర్త ఇచ్చినది.

19:49.898 --> 19:52.358
విడాకులు తీసుకున్న ద్వేషంతో
ఆమె దాన్ని ఇంకా ఉంచుకుందని ఆడ్రే నాకు చెప్పింది.

19:52.359 --> 19:55.361
- తను ఎప్పుడూ దాన్ని ధరించదట.
- కానీ ఆ విషయం తనకెలా తెలుసు?

19:55.362 --> 19:56.904
ఆడ్రేకి అన్నీ తెలుసు.

19:56.905 --> 19:59.365
చూడబోతే ఈ పనిమనుషుల ముఠా
నిజంగానే ఉందని అనిపిస్తోంది

19:59.366 --> 20:02.118
ఇంకా వాళ్లకి మా గురించి తెలియని విషయాలు అంటూ
ఏమీ లేవని అర్థమవుతోంది.

20:02.119 --> 20:03.911
అన్ని వర్గాల మాదిరిగా వాళ్ల సమాజానికి కూడా
ఒక వ్యవస్థ ఉంది.

20:03.912 --> 20:06.789
ఒకరికొకరు సాయంగా ఉంటారు,
ఒకరినొకరు కాపాడుకుంటూ ఉంటారు,

20:06.790 --> 20:09.917
డబ్బు చేతులు మారినట్లుగా
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు.

20:09.918 --> 20:13.129
ఈ ఆడవాళ్లు, చాలా మౌనంగా
ఇంకా ఏ అనుమానం రాకుండా మన జీవితాల్లో తిరుగుతూ

20:13.130 --> 20:15.966
మౌనంగా ఇంకా ఏ అనుమానం రాకుండా
ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు...

20:17.926 --> 20:20.762
ఇంకా ఆ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా
ఇంకా వీక్లీ కార్డ్ గేమ్స్ ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటారు.

20:21.430 --> 20:22.431
ఇక, ఎలీనా విషయానికి వస్తే,

20:22.931 --> 20:24.892
ఈ తతంగం అంతటికీ ఆమె కేంద్రబిందువు.

20:26.351 --> 20:28.144
మేము రెండు వారాల్లో నాలుగు దొంగతనాలు చేశాం.

20:28.145 --> 20:30.856
అన్నీ ఆకస్మికంగా, చాకచక్యంగా చేయగలిగాం,
దానికి కారణం ఎలీనానే.

20:31.356 --> 20:33.399
ఆమె ఎక్కడ ఏ వస్తువు ఉందని చెప్పిందో
అది సరిగ్గా అక్కడే ఉంది

20:33.400 --> 20:35.903
ఆ వస్తువుల్ని ఎవరూ కొంతకాలం పాటు గమనించరు.

20:37.070 --> 20:38.071
అసలంటూ గమనిస్తే.

21:45.931 --> 21:47.431
మా దొంగతనాలు బాగా సాగుతున్నాయి.

21:47.432 --> 21:50.811
మేము చేయవలసిందల్లా అత్యాశకి పోకుండా
మా ప్లాన్ ని అనుసరించడమే.

21:54.231 --> 21:56.899
సరే. అయితే మనం కలవబోతున్న ఈ వ్యక్తి...

21:56.900 --> 21:58.235
- హెక్టర్.
- హెక్టర్.

21:58.861 --> 22:01.195
- అతనితో పని ఏంటి?
- అతను చార్టర్ సెక్యూరిటీ సంస్థలో పని చేస్తాడు, అది...

22:01.196 --> 22:03.906
మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అలారాలు ఏర్పాటు చేస్తుంటారు,
కాబట్టి అతను సాయపడచ్చు.

22:03.907 --> 22:07.076
కానీ, ఇంకొక భాగస్వామికి వాటా పంచే
ఉద్దేశం ప్రస్తుతానికి నాకు లేదు.

22:07.077 --> 22:09.830
సరే. అతడు ఒక సలహాదారు అనుకో.

22:11.415 --> 22:12.499
సరిగ్గా ఇక్కడ.

22:14.251 --> 22:15.626
నిజంగానా?

22:15.627 --> 22:17.086
ఇది ఒక ఫ్యామిలీ డిన్నర్.

22:17.087 --> 22:20.006
అతడిని పరిచయం చేసుకోవడానికి
ఇది సరైన సమయం అనుకున్నావా?

22:20.007 --> 22:22.341
పరిచయమా? అతను నా కజిన్.

22:22.342 --> 22:23.552
సాలూడోస్.

22:25.220 --> 22:26.305
హేయ్!

22:27.347 --> 22:29.057
నువ్వు వస్తావని నేను అనుకోలేదు!

22:32.311 --> 22:33.896
తేలికగా తీసుకో.

22:34.646 --> 22:36.106
నిదానం! తేలికగా తీసుకో.

22:37.816 --> 22:38.817
ఈ జార్జ్ క్లూనీ ఎవరు?

22:39.401 --> 22:40.234
బాయ్ ఫ్రెండా?

22:40.235 --> 22:41.402
లేదు, ఇతను నా బాయ్ ఫ్రెండ్ కాదు.

22:41.403 --> 22:43.446
కూప్, ఇతను నా తమ్ముడు, చీవో.

22:43.447 --> 22:45.407
హేయ్, చీవో. ఎలా ఉన్నావు?

22:46.241 --> 22:47.826
- హాయ్, కజిన్.
- కజిన్.

22:50.120 --> 22:52.163
టిండర్ యాప్ లో పరిచయమైన వాడిని మా ఇంటికి తీసుకొచ్చావా?

22:52.164 --> 22:54.874
లేదు, ఇతను నా బిజినెస్ భాగస్వామి.

22:54.875 --> 22:56.793
మనం ఏకాంతంగా మాట్లాడుకుందామా?

22:58.378 --> 22:59.421
ఆ గ్రిల్ సంగతి చూడు, చీవో.

23:02.633 --> 23:03.883
రెడీ?

23:03.884 --> 23:05.636
సరే. వెళదాం పద.

23:07.221 --> 23:09.639
లేదు. కుదరదు. నేను ఇలాంటి చెత్త పనుల్లో తలదూర్చను.

23:09.640 --> 23:11.974
మీరు నన్ను ఇలా ఇబ్బందిపెట్టడం
మీకు కూడా మంచిది కాదు.

23:11.975 --> 23:15.937
సరే, నిజం చెప్పాలంటే,
నీకు తెలియదన్న విషయం నాకు తెలియదు.

23:15.938 --> 23:18.439
నాకు ముందే తెలిస్తే ఇలా కలవడానికి ఒప్పుకునేవాడినే కాదు.

23:18.440 --> 23:20.358
నువ్వు ఇందులో తలదూర్చడం లేదు, లేదు.

23:20.359 --> 23:23.069
నువ్వు కేవలం ఈ ప్రాంతంలోని అలారం కోడ్ లని
మాకు అందజేస్తే చాలు.

23:23.070 --> 23:25.613
- అంతేనా?
- ఒక్కొక్క కోడ్ కి మేము ఐదు వేల డాలర్లు ఇస్తాము.

23:25.614 --> 23:26.823
- ఏంటి?
- ఏంటి?

23:27.658 --> 23:28.491
కజిన్...

23:28.492 --> 23:30.785
నీకు ఏమైనా పిచ్చిపట్టిందా?
ఈ వ్యక్తితో కలిసి నువ్వు ఏం చేస్తున్నావు?

23:30.786 --> 23:32.703
నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. కంగారుపడకు.

23:32.704 --> 23:34.789
నువ్వు పట్టుబడితే, ఇతను నీకు లాయర్ ని ఏర్పాటు చేస్తాడు.

23:34.790 --> 23:37.291
కానీ నిన్ను తిరిగి మన దేశానికి పంపేస్తారు. అంతే.

23:37.292 --> 23:39.836
అతను నువ్వు ఊహించినదానికన్నా ఎక్కువ కోల్పోతాడు.

23:39.837 --> 23:41.922
- నువ్వు ఏం చేస్తున్నావు?
- అందరూ చేసేదే చేస్తున్నాను.

23:42.548 --> 23:46.384
చూడు, జూలియో వెన్నెముకకి గాయం అయినప్పటి నుండి
నువ్వు రెండు షిఫ్టులు పని చేస్తున్నావని నాకు తెలుసు.

23:46.385 --> 23:47.803
నువ్వు చాలా కష్టపడుతున్నావు.

23:48.554 --> 23:50.054
అందుకని ఈ పని చేయాలి అంటున్నావు.

23:50.055 --> 23:51.974
జీవితంలో నీకు కావాల్సింది నీకు దక్కదు,

23:52.474 --> 23:54.434
నువ్వు దేని కోసం ప్రయత్నిస్తావో అదే నీకు దక్కుతుంది.

23:56.395 --> 23:57.938
ఇది చీవో గురించి.

23:59.815 --> 24:00.858
నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

24:05.153 --> 24:06.780
నువ్వు చీవోతో మాట్లాడాలి.

24:09.908 --> 24:11.910
కోడ్ కి ఐదు వేల డాలర్లు. మనం డీల్ కుదుర్చుకుంటున్నామా?

24:17.666 --> 24:19.375
నాకు నగదు రూపంలో చెల్లించాలి. ముందుగానే.

24:19.376 --> 24:22.295
సరే. ఈ పారితోషికం గురించి,

24:22.296 --> 24:23.629
మేము ముందుగా చర్చించుకోలేదు.

24:23.630 --> 24:26.967
కాబట్టి మనం ఈ విషయం ప్రస్తుతానికి పక్కనపెట్టి
తరువాత మాట్లాడుకుందామా? నువ్వు...

24:38.770 --> 24:41.647
మీ కజిన్ ఇంట్లో డొమినికన్ రిపబ్లిక్ జెండాని చూశాను.

24:41.648 --> 24:42.857
మీది ఆ దేశమేనా?

24:42.858 --> 24:43.942
అవును.

24:45.110 --> 24:46.445
ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?

24:47.029 --> 24:52.451
నా ఇరవై మూడేళ్ల వయసులో చెడు సావాసాల నుంచి
దూరంగా ఉంచడం కోసం నా తల్లిదండ్రులు నన్ను పంపించారు.

24:54.953 --> 24:56.580
ఎలాంటి చెడు సావాసాలు?

24:57.956 --> 24:59.583
దాన్ని దాచి ఉంచుతున్నావా, హా?

25:00.626 --> 25:03.461
దాని వల్ల ఏం ప్రయోజనం? నేను ఇక్కడికి వచ్చి
పన్నెండేళ్లు అయింది కానీ ఇప్పుడు చూడు.

25:03.462 --> 25:05.004
ఒక బ్యాంకర్ తో కలిసి దొంగతనాలు చేస్తున్నా.

25:05.005 --> 25:08.383
అది ఒక హెడ్జ్ ఫండ్, కానీ ఏదో ఒకటి.

25:09.343 --> 25:10.802
నువ్వు పనిమనిషిని పెట్టుకోవచ్చు.

25:11.345 --> 25:13.180
నాకు ఒక పని మనిషి ఉంది. వారానికి రెండుసార్లు వస్తుంది.

25:15.307 --> 25:17.476
కానీ... వాళ్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదు.

25:19.019 --> 25:20.645
కానీ, చూడు, నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు

25:20.646 --> 25:22.606
నిక్ ఇంట్లో ఆ రాత్రి నన్ను ఎందుకు పట్టించలేదనే విషయం.

25:24.107 --> 25:27.277
- నేను కూడా నీతో చేతులు కలపాలి అనుకున్నా.
- అవును, సరే, కానీ ఎందుకు?

25:28.862 --> 25:30.613
అంటే, చూడు, మనం గనుక భాగస్వాములం అయినప్పుడు,

25:30.614 --> 25:33.575
ఒకళ్ల గురించి ఒకళ్లు కనీసం తెలుసుకోవాలి కదా.

25:36.662 --> 25:38.412
నేను పదేళ్లుగా ఇళ్లు శుభ్రం చేస్తున్నాను.

25:38.413 --> 25:40.665
డెబ్బై ఏళ్లలో కూడా పనిమనుషులుగా
పని చేస్తున్న ఆడవాళ్లు నాకు తెలుసు.

25:40.666 --> 25:41.750
వాళ్లు దేని కోసం పని చేస్తున్నారు?

25:43.544 --> 25:44.628
వాళ్లకి ఎంత డబ్బు వస్తుంది?

25:46.588 --> 25:49.841
ఒక దశలో ఏం అనిపిస్తుందంటే
అక్రమంగా సంపాదించడం కోసం

25:49.842 --> 25:51.968
పక్కదారి పట్టకపోవడమే
అసలు నేరంకన్నా పెద్ద నేరం అనిపిస్తుంది.

25:51.969 --> 25:53.511
కానీ, దీనికి ముగింపు ఏంటి?

25:53.512 --> 25:55.680
మొదటగా, నా తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకురావాలి.

25:55.681 --> 25:58.015
నాకు తెలిసిన ఒక ఇమిగ్రేషన్ లాయర్
అందుకు నీకు సాయం చేయగలడు.

25:58.016 --> 26:01.186
నేను సరైన పత్రాల మీద
సంతకం చేస్తే చాలు అన్నట్లు చెబుతున్నావు.

26:02.145 --> 26:06.024
ఇక్కడికి తీసుకురావడానికి చాలా డబ్బు ఖర్చు చేయాలి.
వాళ్లని ఇక్కడ ఉంచాలన్నా, వాళ్లు బతకాలన్నా...

26:07.693 --> 26:09.151
ఇంకా చాలా ఖర్చవుతుంది.

26:09.152 --> 26:10.152
అది నిజమే.

26:10.153 --> 26:13.699
ఇంకా చీవో కూడా నేను బయటకి తీసుకురాలేనంత
వేగంగా ఇబ్బందుల్లో పడుతున్నాడు.

26:14.283 --> 26:15.449
అది నీకు అర్థం కాదు.

26:15.450 --> 26:17.244
కానీ, నీ అభిప్రాయం సరైనదో కాదో నాకు తెలియదు.

26:18.996 --> 26:20.705
ఈ మధ్యనే నా చెల్లెలితో పాటు ఇల్లు మారాను.

26:20.706 --> 26:22.415
- ఇక్కడికా?
- అవును.

26:22.416 --> 26:23.708
అది నీకు ఫర్వాలేదా?

26:23.709 --> 26:25.501
అవును, నా ఉద్దేశం, అంటే... నాకు తెలియదు.

26:25.502 --> 26:28.547
మనుషులతో కలిసి బతకడానికి అలవాటు పడిపోతాం.

26:29.381 --> 26:30.715
తోడుగా ఉంటారు.

26:30.716 --> 26:33.552
అదే గదిలో లేకపోయినా లేదా మనం నిద్రపోయినా.

26:34.678 --> 26:38.723
ఇల్లు ఖాళీగా ఉంటే ఏదోలా అనిపిస్తుంది.
ఏదో సమాధిలాగా అనిపిస్తుంది, తెలుసా?

26:38.724 --> 26:41.768
ఆ తరువాత నుండి ఇంటికి రాకుండా ఉండటానికి
ఏదో సాకు వెతుకుతూ ఉంటాం.

26:42.519 --> 26:44.770
కానీ అది, నా వ్యక్తిగత అనుభవాల దృష్ట్యా చెబుతున్నాను,

26:44.771 --> 26:46.814
అది చాలా తప్పుడు నిర్ణయాలకి దారి తీస్తుంది.

26:46.815 --> 26:48.775
నేను నీకు డబ్బు తెచ్చిస్తాను.

27:06.710 --> 27:08.921
కిందటి రెండు దొంగతనాలలో నీ వాటా.

27:11.882 --> 27:13.133
లెక్కపెట్టుకోవా?

27:15.219 --> 27:18.472
- నిన్ను నమ్ముతున్నాను.
- లేదు, నువ్వు నమ్మవు. ఇంకా అప్పుడే నమ్మకపోవచ్చు.

27:19.097 --> 27:20.432
నేను ఇంటికి వెళ్లాక లెక్క పెట్టుకుంటాను.

27:21.183 --> 27:22.351
నేను కూడా అదే చేస్తాను.

27:27.272 --> 27:28.649
బీర్ ఇచ్చినందుకు థాంక్స్, కూప్.

27:32.110 --> 27:33.779
హెక్టర్ నిర్ణయం మంచిదే అంటావా?

27:34.404 --> 27:35.697
మనం ఈ పనులు చేయడం మంచిదే అంటావా?

27:39.326 --> 27:42.829
సరే. అయితే, మీ మొదటి ఎపిసోడ్
వార్షికోత్సవం త్వరలో జరగబోతోంది.

27:43.413 --> 27:44.540
వచ్చే వారం.

27:46.458 --> 27:48.126
నాకు పెళ్లయితే ఇప్పటికి పదకొండేళ్లు పూర్తయ్యేది.

27:50.295 --> 27:53.340
బ్రూస్ ని మళ్లీ కలవాలని కోరుకున్నావా?

27:54.258 --> 27:55.259
లేదు.

27:56.593 --> 28:02.431
స్టీల్ వార్షికోత్సవం జరిగి ఉంటే అతను నాకు
ఏం బహుమతి ఇచ్చేవాడా అని ఆలోచిస్తాను.

28:02.432 --> 28:04.100
లేదా టర్కోయిస్ వార్షికోత్సవం.

28:04.101 --> 28:05.727
ఇంటర్నెట్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

28:06.353 --> 28:09.731
అది ఆలోచించినప్పుడు నీ శరీరంలో నీకు ఎలా అనిపించేది?

28:11.984 --> 28:12.985
భారంగా అనిపిస్తుంది.

28:14.069 --> 28:15.320
నా కాళ్లలో.

28:16.572 --> 28:18.156
నేను ఏదో బురదలో కూరుకుపోయినట్లు ఉంటుంది.

28:21.243 --> 28:23.452
థాంప్సన్ ట్విన్స్ పాడిన "హోల్డ్ మీ నౌ" పాటని

28:23.453 --> 28:25.330
నేను పనికి వెళ్తుండగా దారిలో రేడియోలో విన్నాను.

28:26.039 --> 28:28.876
అది నా పెళ్లి పాట కావాలని అనుకున్నాం. ఇంకా...

28:31.128 --> 28:33.462
కానీ ఈసారి నేను మొత్తం పాటని విన్నాను.

28:33.463 --> 28:36.133
సాధారణంగా నేను మొదటి చరణం పూర్తి కాగానే ఆపేసేదాన్ని.

28:38.594 --> 28:39.969
నువ్వు పనికి వెళ్లగలిగావా?

28:39.970 --> 28:41.054
వెళ్లాను.

28:43.140 --> 28:44.183
ఇంకా...

28:45.100 --> 28:47.727
వాళ్లు నాకు ఒక నిర్ణీత సమయం ఇస్తామని అన్నారు.

28:47.728 --> 28:49.146
అది గొప్ప విషయం.

28:50.355 --> 28:52.273
ఆండీ ఎలా స్పందించాడు? అతను గర్వపడి ఉంటాడు.

28:52.274 --> 28:54.818
నేను ఇంకా తనకి చెప్పలేదు.
నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.

28:55.402 --> 29:00.657
నీలో కొన్ని బలమైన భావోద్వేగాల్ని
నువ్వు నీ కళలోకి మళ్లించావని నాకు అనిపిస్తోంది

29:01.241 --> 29:02.659
ఇంకా అందుకు సరైన ప్రతిఫలం పొందావు కూడా.

29:03.285 --> 29:05.370
దాన్ని నువ్వు వేడుక చేసుకోగలవా?

29:06.330 --> 29:09.750
నా చరిత్ర చూస్తే,
నేను వేడుక చేసుకున్నది ఏదీ సరిగ్గా సాగలేదు.

29:10.459 --> 29:11.919
దాని గురించి మాట్లాడుకుందాం.

29:14.046 --> 29:15.546
ఎలీనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసింది,

29:15.547 --> 29:18.716
ఇంకా హెక్టర్ మా మొదటి ఐదు వేల డాలర్ల
అలారం కోడ్ ని తెచ్చి ఇచ్చాడు.

29:18.717 --> 29:21.261
తొమ్మిది, ఆరు, రెండు, నాలుగు, రెండు, మూడు.

29:22.012 --> 29:24.973
ఛ. కానివ్వు. కానివ్వు.

29:28.727 --> 29:31.729
- హెక్టర్, భలేవాడివి.
- నువ్వు అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

29:31.730 --> 29:33.941
సారీ. ఇది కాస్త ఉత్కంఠని కలిగించింది.

29:37.486 --> 29:38.945
ఎలీనా, ఈ ఇంట్లో కుక్క ఉందా?

29:38.946 --> 29:41.614
కిందటి నెల చనిపోయింది. వాళ్లు దాని అంత్యక్రియల్ని
లోరెలై తో చేయించారు.

29:41.615 --> 29:43.074
హమ్మయ్య.

29:43.075 --> 29:45.827
నా ఉద్దేశం, హమ్మయ్య కాదు. అది దారుణం.

29:46.370 --> 29:48.539
దేవుడా, అంత్యక్రియల్ని చేయించారా?

29:49.122 --> 29:51.333
అది చేయడం కష్టం. హాస్యానికి అనడం లేదు.

29:53.919 --> 29:56.379
దానితో పోలిస్తే నిక్ నీతో చేయించే పనులు ఎలా ఉంటాయి?

29:56.380 --> 29:58.714
నిక్ తో సులభంగానే ఉంటుంది
ఎందుకంటే ఎక్కువ సమయం ఇంట్లో ఉండడు.

29:58.715 --> 30:01.176
- అవును, అందుకు సంతోషం.
- ఛ. సారీ.

30:01.844 --> 30:04.220
కానీ అతను చేసిన పని పాతబడిపోయినట్లు అనిపించడం లేదా?

30:04.221 --> 30:06.472
నువ్వు ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదంటావా?

30:06.473 --> 30:08.307
- ఎప్పుడూ మోసం చేయలేదు.
- వావ్. నిజంగానా?

30:08.308 --> 30:10.102
నువ్వు అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

30:12.062 --> 30:13.146
సరే.

30:14.648 --> 30:15.690
నాకు అది దొరికింది అనుకుంటా.

30:15.691 --> 30:18.109
సరే, అయితే మనం హెర్మెస్ వస్తువు కోసం వెతుకుతున్నాం కదా.

30:18.110 --> 30:20.403
మిసెస్ హేక్ సేల్స్ ఉద్యోగి కొత్త సీజనులో వచ్చే

30:20.404 --> 30:22.405
బర్కిన్ రంగు బ్యాగులు ఆమెకి ఇవ్వలేదో లేక ఇవ్వలేకపోయారు.

30:22.406 --> 30:24.490
అందుకు ఆమె ఆ బ్యాగులు వాడటం బాగా అవమానంగా భావించింది.

30:24.491 --> 30:26.702
ఈ ఐలాండ్ లో ఏదీ తప్పు కాదు.

30:28.370 --> 30:31.455
హెర్మెస్ బర్కిన్ బ్యాగులు ధరించడం కన్నా
అసహ్యకరమైన లేదా చాలా గొప్ప ఆడంబరం

30:31.456 --> 30:35.126
ఇంకేదీ ఉండదు, ఈ బ్యాగులకి
గాయని ఇంకా నటి జేన్ బర్కిన్ పేరు పెట్టారు.

30:35.127 --> 30:38.087
వీటిని ఫ్రాన్స్ లో హస్తకళాకారుల బృందం
చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు

30:38.088 --> 30:40.882
అది కూడా శతాబ్దాల కాలం నాటి వాణిజ్య పద్ధతులు
ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు.

30:40.883 --> 30:42.925
అత్యంత ప్రామాణికమైన తోలుని,
అరుదైన జంతు చర్మాల్ని ఉపయోగించి,

30:42.926 --> 30:45.136
ప్రత్యేకమైన పనిముట్లతో వాటిని కుట్టి తయారు చేస్తారు కాబట్టి,

30:45.137 --> 30:48.265
ఏ మహిళ హ్యాండ్ బ్యాగ్ సేకరణలో అయినా
బర్కిన్ బ్యాగ్ అనేది ముకుటాయమానంగా ఉంటుంది.

30:48.891 --> 30:52.351
ఇక్కడ విషయం ఏమిటంటే, ఎవరైనా అలా తేలికగా
హెర్మెస్ బోటిక్ లోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ కొనలేరు.

30:52.352 --> 30:54.312
మీరు హెర్మెస్ ఆట ఆడాల్సి ఉంటుంది,

30:54.313 --> 30:56.689
అంటే దాని అర్థం కేవలం వెయిటింగ్ లిస్టులో
చేరాలంటేనే వేల డాలర్లని ఖర్చు చేసి

30:56.690 --> 31:00.067
ఖరీదైన నగల్ని, ఇతర వస్తువుల్ని కొనాలి,
అంటే అది బర్కిన్ వేసే ఎర లాంటిది,

31:00.068 --> 31:03.071
అప్పుడే యాభై వేల డాలర్ల ఖరీదు చేసే ఒక బ్యాగుని
కొనగలిగే అర్హత ఎవరికైనా దక్కుతుంది.

31:03.739 --> 31:05.239
హెడ్జ్ ఫండ్స్ పెద్ద పెట్టుబడి అనుకుంటారేమో...

31:05.240 --> 31:07.033
అది ఏంటి?

31:07.034 --> 31:09.785
ఇక్కడ ఇంకో అలారం ఉంది. ఇంకో అలారం ఎందుకు ఉంది?

31:09.786 --> 31:11.495
- హలో?
- హౌస్ కోడ్ ప్రయత్నించి చూడు.

31:11.496 --> 31:14.373
ఇక్కడ ఎలాంటి కీప్యాడ్ లేదు. కీప్యాడ్ ఎలా వెతకాలి?

31:14.374 --> 31:16.459
- నీకు తెలుసా?
- సరే. అది అక్కడే ఎక్కడో ఉంటుంది.

31:16.460 --> 31:19.212
ఆగు. నాకు దొరికింది. లైన్ లో ఉండు.

31:19.213 --> 31:20.547
ఓరి దేవుడా.

31:22.424 --> 31:23.466
కూప్?

31:23.467 --> 31:25.343
ఇది పని చేయడం లేదు. ఇది పని చేయడం లేదు.

31:25.344 --> 31:26.552
కూప్.

31:26.553 --> 31:28.472
- ఛ! ఇది పని చేయడం లేదు... నేను ఏం చేయాలి?
- బయటకి వచ్చేయ్!

31:34.061 --> 31:36.438
ఇది ఎలాంటి సెక్యూరిటీ వ్యవస్థ?

31:37.523 --> 31:39.233
దేవుడా.

31:44.196 --> 31:46.447
కూప్, ఎక్కడ ఉన్నావు? బయటకి వచ్చేయ్.

31:46.448 --> 31:48.449
- సరే, కానీ నేను బయటకు రాలేను అనుకుంటా.
- ఎందుకని?

31:48.450 --> 31:50.244
ఎందుకంటే ఈ ఇంట్లో ఇంకో కుక్క ఉంది.

31:52.079 --> 31:53.162
మంచి కుక్క.

31:53.163 --> 31:54.872
హేయ్.

31:54.873 --> 31:56.041
హాయ్.

31:57.709 --> 31:58.877
నీకు ట్రీట్ కావాలా?

32:03.674 --> 32:04.675
ఛ!

32:11.974 --> 32:13.224
నేను ముందు గేటు నుండి వస్తున్నా.

32:13.225 --> 32:15.268
ముందు గేటు నుండి రావద్దు.
ముందు గేటు నుండి రావద్దు.

32:15.269 --> 32:17.020
నాకు మరో మార్గం లేదు.

32:23.861 --> 32:25.571
- కూప్?
- వదిలేయ్.

32:28.866 --> 32:31.159
వదిలేయ్! ఈ బ్యాగు తీసుకో.

32:37.165 --> 32:37.999
చెత్త.

32:38.000 --> 32:40.459
- నువ్వు ఎక్కడ ఉన్నావు?
- నేను వీధిలో ఉన్నాను.

32:40.460 --> 32:42.504
- వెళ్లు! తూర్పు వైపు పరిగెత్తు.
- తూర్పు ఎటు వైపు?

32:44.339 --> 32:46.258
అది నాకు ఎలా తెలుస్తుంది?

32:47.384 --> 32:49.887
నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియడం లేదు.
నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియడం లేదు.

32:53.724 --> 32:55.601
నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పు.

33:04.860 --> 33:08.113
కూప్, చుట్టూ పోలీసులు ఉన్నారు.
జాగ్రత్తగా చూసుకో, సరేనా?

33:10.616 --> 33:13.869
చెత్త! ఛ. సరే. సరే.

33:35.682 --> 33:37.017
నా చెత్త ఇయర్ పీస్!

33:38.310 --> 33:40.561
- నేను అతడిని గమనిస్తున్నాను.
- అతను వెనుక నుంచి వస్తున్నాడు! రండి.

33:40.562 --> 33:41.604
కదలకు.

33:41.605 --> 33:42.981
కూప్? కూప్?

33:44.316 --> 33:45.942
నా మాట వినిపిస్తుంటే గనుక బదులు ఇవ్వు.

33:45.943 --> 33:48.111
ఆగు! ఆగు! ఆగు!

33:52.449 --> 33:54.701
కూప్? హలో?

34:04.461 --> 34:05.462
హేయ్.

34:07.923 --> 34:08.924
వెళదాం పద.

34:17.431 --> 34:19.810
సరే, సరే. లైట్లు ఆఫ్ చేయి.

34:20.310 --> 34:22.813
అవును. సరే, లైట్లు ఆఫ్ చేయి. కారు ఇంజన్ ఆఫ్ చేయి.

34:23.772 --> 34:24.898
చచ్చాం.

34:30.862 --> 34:31.863
ఓరి దేవుడా.

34:31.864 --> 34:33.114
సరే.

34:36.326 --> 34:37.327
నువ్వు బాగానే ఉన్నావు కదా.

34:37.953 --> 34:39.329
మనం ఎక్కడ ఉన్నాం?

34:58.056 --> 34:59.600
హేయ్, నాకు నీ ఎయిర్ వ్రాప్ పరికరం కావాలి.

35:01.894 --> 35:04.979
అమ్మా. ఏంటి, నువ్వు ఇంకా ముస్తాబు కాలేదా?

35:04.980 --> 35:08.525
- అందరూ ఇప్పటికే వచ్చేశారు.
- నేను కేవలం మేకప్ వేసుకోవాలి అంతే.

35:17.993 --> 35:19.203
చాలా అందంగా ఉన్నావు.

35:21.955 --> 35:23.624
హేయ్, ఇలా రా. నీకు సాయం చేస్తాను.

35:24.249 --> 35:26.919
- ఓహ్, అలాగే. సారీ.
- అలా, అంటే, పైకప్పు వైపు చూడు.

35:27.628 --> 35:28.712
అలాగ.

35:50.359 --> 35:51.984
సరే. ప్లీజ్, కొద్దిగా చోటు ఇవ్వండి, ప్లీజ్.

35:51.985 --> 35:53.361
వచ్చేశావు.

35:53.362 --> 35:54.655
హ్యాపీ బర్త్ డే.

35:56.323 --> 36:00.327
- హ్యాపీ బర్త్ డే.
- టోరీ, ఎలా ఉన్నావు? చాలా అందంగా కనిపిస్తున్నావు.

36:01.620 --> 36:03.455
- బార్. వెంటనే.
- వెంటనే.

36:04.122 --> 36:05.999
- కానీ...
- నువ్వు ఇక్కడే ఉండు.

36:07.918 --> 36:09.335
హేయ్, మెల్. హ్యాపీ బర్త్ డే.

36:09.336 --> 36:10.837
హాయ్.

36:10.838 --> 36:12.713
- వావ్.
- కేవలం, ఇలా చూడు...

36:12.714 --> 36:15.801
ఇదంతా ఏంటి?

36:19.763 --> 36:20.931
- బేబీ.
- ఒక మెల్టీనీ.

36:21.640 --> 36:22.932
ఈ రాత్రికి ఇదే ప్రత్యేకమైన డ్రింక్.

36:22.933 --> 36:26.143
బేబీ, నాకు వోడ్కా మార్టీనీ కావాలి.
ఆలీవ్ జ్యూస్ బాగా వేసినది.

36:26.144 --> 36:28.230
అవును, అదే మెల్టీనీ డ్రింక్ అంటే.

36:28.814 --> 36:30.022
నీకు ఏది ఇష్టమో నాకు తెలుసు, బేబీ.

36:30.023 --> 36:34.611
హేయ్, అమ్మాయి. ఓహ్, దేవుడా.

36:35.153 --> 36:37.113
మన ఇద్దరివీ అగ్ని రాశులే.

36:37.114 --> 36:38.531
- నిజంగానా?
- అవును.

36:38.532 --> 36:40.324
మేము ఇక్కడ ఎనియాగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.

36:40.325 --> 36:43.078
- నీ ఉద్దేశం ఏమైనా పదాలతో ఆడే ఆటలా?
- అవును.

36:43.662 --> 36:45.122
- అవును, తప్పకుండా.
- అవును, పదాలు.

36:46.582 --> 36:48.916
- వావ్. నా ఉద్దేశం...
- సరే.

36:48.917 --> 36:50.084
హేయ్, శామ్.

36:50.085 --> 36:51.503
పాల్.

36:52.171 --> 36:53.171
నాకు ఒక నిమిషం టైమ్ ఇస్తావా?

36:53.172 --> 36:54.590
- ఇవ్వలేనేమో.
- మేము ముందు వచ్చాం.

36:57.176 --> 36:58.176
నా వాయిస్ మెయిల్స్ నీకు అందాయా?

36:58.177 --> 37:00.178
నువ్వు ఏం చెప్పదల్చుకున్నా మా లాయర్లతో మాట్లాడు.

37:00.179 --> 37:02.180
- మనం వాళ్లకి చాలా డబ్బు ఇస్తున్నాం.
- నేను చాలా డబ్బు ఇచ్చాను.

37:02.181 --> 37:06.100
అవును, నువ్వు అంత ఖర్చు భరించగలవు,
మిస్టీ మితిమీరి ఖర్చు చేస్తే తప్ప.

37:06.101 --> 37:08.644
ఫ్యాషన్ నోవాలో నువ్వు నిజంగానే అంత డబ్బు సంపాదించగలవా?

37:08.645 --> 37:10.147
మనం మాట్లాడుకోవలసింది ఇలా కాదు.

37:13.442 --> 37:14.734
నువ్వు తిరిగి అక్కడికి వెళ్లాలి.

37:14.735 --> 37:17.237
ఆ బార్ లో నీ గర్ల్ ఫ్రెండ్ వయసు వివరాలు
అడుగుతున్నట్లున్నారు చూడు.

37:21.116 --> 37:22.242
లేడీస్.

37:23.035 --> 37:24.244
బై, పాల్.

37:48.810 --> 37:51.270
ఏంటి ఇది? రెండో అలారం ఉందని హెక్టర్ కి ఎందుకు తెలియదు?

37:51.271 --> 37:53.940
- అది కూడా ఆ కంపెనీదే అయి ఉంటుంది.
- అతను దేని కోసం చూస్తున్నాడో అతనికే తెలియదు.

37:53.941 --> 37:55.483
ఐదు వేల డాలర్లకి, అతను మనల్ని మోసం చేశాడు!

37:55.484 --> 37:57.985
నువ్వు కూర్చుంటావా?
మనం ఈ గొడవని ఇంకా పెద్దది చేస్తున్నాం.

37:57.986 --> 37:59.570
నీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ ఉంది?

37:59.571 --> 38:01.907
- నా దగ్గర లేదు.
- సరే. వోడ్కా ఉందా?

38:02.491 --> 38:03.449
ఫ్రీజర్ లో ఉంది.

38:03.450 --> 38:04.450
నీ ఫోన్ ఇలా ఇవ్వు.

38:04.451 --> 38:06.577
- మిగిలినవి డోర్ డ్యాష్ యాప్ లో ఆర్డరు చేస్తాను.
- చెత్తవెధవ.

38:06.578 --> 38:08.037
సరే. నీ ముఖం ఇలా చూపించు.

38:08.038 --> 38:09.122
థాంక్యూ.

38:15.712 --> 38:17.547
సమంత లెవిట్ నీకు నగ్నంగా ఫోటోలు ఎందుకు పంపిస్తోంది?

38:17.548 --> 38:20.092
ఓహ్, దేవుడా. అది సంక్లిష్టమైన విషయం, సరేనా?

38:20.592 --> 38:21.801
సమంత లెవిట్ నీకెలా తెలుసు?

38:21.802 --> 38:23.970
ఈ ఊరిలో అందరూ అందరికీ ఎలా తెలుసు?

38:23.971 --> 38:26.013
అవును, అందరికీ అందరూ తెలుసు.

38:26.014 --> 38:28.099
అందుకేనా నిక్ ఇంట్లో నువ్వు ఆమె భర్తతో గొడవ పడ్డావు?

38:28.100 --> 38:31.520
లేదు. పాల్ ఒక దద్దమ్మ, సరేనా?
మనం ఈ విషయం గురించి మాట్లాడటం ఆపేద్దామా?

38:35.649 --> 38:36.650
సరే.

38:38.318 --> 38:39.653
- రెడీ?
- అవును.

38:43.282 --> 38:46.367
మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.
జనం దీని గురించి వింటారు.

38:46.368 --> 38:48.202
- నీ గురించి ఇంకా శామ్ గురించా?
- కాదు.

38:48.203 --> 38:51.455
పోలీసులు ఇంకా కుక్క నన్ను వెంటాడటం గురించి.

38:51.456 --> 38:53.541
హేయ్. అది ఎవరూ పట్టించుకోరు.

38:53.542 --> 38:54.959
అవును.

38:54.960 --> 38:57.712
అయితే ఇది గట్టిగా కొరికినట్లు కాకుండా
చిన్నగా గీరుకున్నట్లుగా కనిపిస్తోంది,

38:57.713 --> 38:59.964
అయినా కూడా నేను కొన్ని యాంటీ బయాటిక్ మందుల్ని
ఈ గాయాల మీద పూస్తాను.

38:59.965 --> 39:02.383
ఇది నయం అయిపోతుంది.
హెక్టర్ విషయంలో మనం ఏం చేద్దాం?

39:02.384 --> 39:03.718
నేను హెక్టర్ తో తేల్చుకుంటాను.

39:03.719 --> 39:05.803
- సరేనా?
- సరే.

39:05.804 --> 39:10.183
చూడు, నేను బాగానే కోలుకుంటాను. నాకేం ఫర్వాలేదు.
నేను వెళ్లాలి. ఇప్పటికే ఆలస్యం అయింది.

39:10.184 --> 39:11.976
ఆలస్యమా? దేనికి ఆలస్యం?

39:11.977 --> 39:14.896
మెల్ పుట్టినరోజు వేడుక. నేను దుస్తులు మార్చుకోవాలి.

39:14.897 --> 39:16.023
నిజంగానే అంటున్నావా?

39:17.774 --> 39:19.150
నువ్వు చాలా సంక్లిష్టమైన మనిషివి, కూప్.

39:19.151 --> 39:21.612
నాకు తెలుసు. కొన్నిసార్లు నాకు నేనే అర్థం కాను.

39:22.237 --> 39:24.989
- ఈ చెత్తదానికి ఇంకో షాట్ ఇవ్వండి.
- టకీలా షాట్స్. డబుల్స్, ప్లీజ్.

39:24.990 --> 39:27.241
హేయ్, మాకు డాన్ జూలియో ఇస్తావా?
మిగతా చౌకబారు మద్యం మాకు వద్దు.

39:27.242 --> 39:28.159
- ఆహ్... హా.
- అవును.

39:28.160 --> 39:29.827
- ఎదిగిన ఆడపిల్లలు.
- వాటిని వరుసలో పెట్టు.

39:29.828 --> 39:32.622
- స్ట్రాంగ్.
- ఇదిగో తీసుకోండి.

39:32.623 --> 39:34.665
- థాంక్యూ.
- థాంక్యూ.

39:34.666 --> 39:37.544
- హ్యాపీ బర్త్ డే.
- సరే. శభాష్ అమ్మాయి!

39:39.421 --> 39:40.422
ఆలీ?

39:42.090 --> 39:43.634
హ్యాపీ బర్త్ డే, మెల్లీ.

39:44.843 --> 39:45.927
వచ్చినందుకు థాంక్స్.

39:45.928 --> 39:47.678
అవును. నేను మిస్ కాలేను.

39:47.679 --> 39:49.639
ఆలీ, నిన్ను చూసి చాలా రోజులైంది.

39:49.640 --> 39:51.933
నీకు వయసు మీద పడటం లేదు. చాలా అద్భుతంగా ఉన్నావు.

39:51.934 --> 39:54.018
- అవును, నిజంగానే తను చాలా అందంగా ఉంది.
- అవును.

39:54.019 --> 39:56.522
చనుబాలు తాగే వయసు పిల్లలు తనకి లేరు కదా.

39:57.606 --> 40:01.526
ఈ రాత్రి వాళ్లు ఏదో ఒక సందర్భంలో ఎలాంటి మాటలు
మాట్లాడినా నీకు ముందుగానే క్షమాపణలు చెబుతున్నాను.

40:01.527 --> 40:03.361
దయచేసి వెళ్లిపోకు.

40:03.362 --> 40:05.280
వెళ్లి నీ పని చూసుకో, పాల్!

40:07.574 --> 40:08.866
- నన్ను వదిలేయ్!
- అయ్యో, పాపం.

40:08.867 --> 40:10.661
ఎవరైనా సమయానికి నిద్రని మిస్ అయ్యారా?

40:14.706 --> 40:16.083
- సరే, మనం డాన్స్ చేద్దాం.
- సరే.

40:16.834 --> 40:19.753
మెల్, ఇలా రా. బర్త్ డే అమ్మాయి డాన్స్ చేయాలి.
బర్త్ డే అమ్మాయి డాన్స్.

40:42.860 --> 40:43.861
హేయ్, సర్.

41:05.632 --> 41:06.841
హాయ్, కూప్.

41:06.842 --> 41:08.259
కూప్, ఏంటి సంగతి?

41:08.260 --> 41:09.928
- హాయ్, కూప్.
- హేయ్.

41:10.470 --> 41:11.471
సారీ.

41:12.222 --> 41:14.807
హేయ్, క్యాట్. ఎలా ఉన్నావు?

41:14.808 --> 41:16.101
అందంగా కనిపిస్తున్నావు.

41:28.947 --> 41:30.157
చూడముచ్చటగా ఉంది.

41:32.367 --> 41:33.576
నువ్వు ఏమైనా చేయబోతున్నావా?

41:33.577 --> 41:34.660
నేను మంచం మీద లేను, కదా?

41:34.661 --> 41:36.872
ఈ మధ్య కాలంలో నువ్వు ఎక్కువ సమయం
మంచం మీదనే గడుపుతున్నావు కదా.

41:38.498 --> 41:40.124
సరే. ఇది ఆ అమ్మాయి గురించేనా?

41:40.125 --> 41:42.543
వావ్. మొదటి మాటకే పసిగట్టేశావు.

41:42.544 --> 41:44.545
- మగవాళ్లు బుద్ధిహీనులు అని అంటారు.
- శామ్...

41:44.546 --> 41:46.756
కానీ నువ్వు వాళ్లకన్నా తెలివైన వాడివని ఇప్పుడే గ్రహించాను.

41:46.757 --> 41:48.508
అవును, పాల్ కన్నా నయం, కనీసం.

41:48.509 --> 41:50.718
కానీ, నేను ఒప్పుకోవాలి, అతనికి అంత స్థాయి లేదు.

41:50.719 --> 41:53.679
సరే. తను నా మాజీ సంస్థలో తోటి ఉద్యోగి.

41:53.680 --> 41:55.640
తను కొన్ని విషయాలు చెప్పడం కోసం మా ఇంటికి వచ్చింది.

41:55.641 --> 41:57.183
ఆమె ఇంతవరకూ ఎప్పుడూ లోపలికి రాలేదు.

41:57.184 --> 42:00.020
ఆమె నీతో శృంగారం చేసినంత చనువుగా
నిన్ను ముద్దుపెట్టుకుంది.

42:00.771 --> 42:04.816
అంటే, బహుశా కొందరు ఆడవాళ్లు అలా ముద్దుపెట్టుకుంటారేమో.

42:20.499 --> 42:24.043
ఇక్కడ ఉన్నావా! టోరీ, ఒక నిమిషం ఇటు వస్తావా?

42:24.044 --> 42:26.546
- దేనికి?
- ఫ్యామిలీ ఫోటో కావాలని నిక్ అడుగుతున్నాడు.

42:26.547 --> 42:28.006
నేను అతని కుటుంబ సభ్యురాలిని కాదు.

42:31.885 --> 42:33.762
నేను దాని గురించే మాట్లాడుతున్నాను.

42:34.388 --> 42:35.513
అది నీకు సంబంధించినది కాదు.

42:35.514 --> 42:36.974
కానీ, అది నా కోసమే అన్నట్లుగా భావిస్తాను.

42:40.143 --> 42:42.061
- నువ్వు ఆలస్యంగా వచ్చావు.
- అవును. సారీ.

42:42.062 --> 42:44.356
దయచేసి నన్ను నిందించడం ఆపు. సరేనా?

42:46.400 --> 42:47.568
ఏంటి?

42:49.194 --> 42:51.445
సరే, ఏం అయిందో నాకు చెబుతావా
లేదా అక్కడే అలా చేతులు కట్టుకుని

42:51.446 --> 42:54.116
- నిలబడి ఉంటావా?
- నాన్నా, నీకు తిట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేం.

42:54.908 --> 42:58.119
ఒక చెత్త తండ్రిగా, చెత్త భర్తగా నిన్ను నిందించాలి,
ఏది ఏమైనా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా.

42:58.120 --> 42:59.204
ఇలా చూడు.

42:59.872 --> 43:01.957
నా జీవితమే ఒక పెద్ద పరిణామం.

43:03.292 --> 43:05.960
చూడు, నువ్వు చేసిన తప్పుకి
నేను నీ మీద జాలిపడాలని కోరుకుంటున్నావు.

43:05.961 --> 43:09.046
హేయ్, నిజం చెబుతున్నాను,
ఈ పరిస్థితులు నేను ఎంచుకున్నవి కావు.

43:09.047 --> 43:10.716
కానీ, నువ్వు పోరాడలేదు, నాన్నా.

43:11.466 --> 43:14.302
అమ్మ కోసం, మా కోసం పోరాడాల్సిన బాధ్యత నీదే.

43:14.303 --> 43:17.139
సరేనా? అలా పోరాడగలిగింది నువ్వు ఒక్కడివే,
కానీ నువ్వు మమ్మల్ని అలా వదిలేసి వెళ్లిపోయావు.

43:19.224 --> 43:21.602
కానీ, అది నువ్వు చెప్పినదాని కన్నా
చాలా సంక్లిష్టమైన పరిస్థితి.

43:22.352 --> 43:24.645
సరే. కానీ నువ్వు చాలా తేలికగా వదిలేసి
వెళ్లిపోయావని అనిపించేలా చేశావు.

43:24.646 --> 43:26.898
హేయ్, హేయ్, హేయ్.

43:26.899 --> 43:28.441
- జేక్.
- హేయ్. నేను చూసుకుంటా, మిస్టర్ కూపర్.

43:28.442 --> 43:30.109
- నాకు తెలుసు. నాకు ఒక సాయం చేయగలవా?
- చేస్తాను.

43:30.110 --> 43:31.653
నా దారికి అడ్డు రాకు.

43:32.154 --> 43:33.322
తప్పకుండా.

43:33.906 --> 43:34.948
హేయ్.

43:48.921 --> 43:51.006
- హేయ్.
- హేయ్. నువ్వు వచ్చావు.

43:51.798 --> 43:54.675
అవును. ఇప్పుడే మన అమ్మాయి నన్ను నానా మాటలు అంది.

43:54.676 --> 43:57.261
సరే, ఈ రోజు తన నిందల నుంచి నాకు విరామం దొరికింది.

43:57.262 --> 43:58.346
నా పుట్టినరోజు గనుక.

43:58.347 --> 44:00.307
సరే, హ్యాపీ బర్త్ డే, మెల్.

44:03.060 --> 44:05.062
వావ్. నువ్వు పూర్తిగా తయారై వచ్చావు.

44:05.729 --> 44:06.563
మరేం ఫర్వాలేదు.

44:07.105 --> 44:10.025
హలో, హలో. టెస్టింగ్.

44:11.109 --> 44:12.319
- అది నాకు సంకేతం.
- హలో.

44:14.238 --> 44:16.197
అదీ, మీకు నా మాట వినిపిస్తోంది. సరే, మంచిది.

44:16.198 --> 44:18.116
- మెల్ ఎక్కడ ఉంది?
- హేయ్.

44:20.035 --> 44:22.663
ఎక్కడ ఉన్నావు, మెల్? ఇదిగో ఇక్కడ ఉంది.

44:24.831 --> 44:27.250
ఇలా రా, బేబీ. ఈ వేడుకలో నువ్వు నా పక్కన ఉండాలి.

44:27.251 --> 44:29.086
ముచ్చటగా వచ్చేయ్.

44:32.506 --> 44:34.590
ఇలా రా. ఇలా రా.

44:34.591 --> 44:36.676
పద. అతడిని ఆ పని చేయనివ్వు.

44:36.677 --> 44:38.595
నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు,
నువ్వు చేయగలవు. పద.

44:41.890 --> 44:46.227
హా! హ్యాపీ బర్త్ డే!

44:46.228 --> 44:48.521
అదీ. నువ్వు ఇక్కడికి నడిచి రావాలి.

44:48.522 --> 44:50.022
హ్యాపీ బర్త్ డే!

44:50.023 --> 44:51.232
నీ కోసం ఒక డ్రింక్ తాగుతాను.

44:51.233 --> 44:53.777
ఓహ్, నా మెల్. థాంక్యూ.

44:54.611 --> 44:56.697
ఈ వేడుక చేయడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ...

44:57.447 --> 45:01.076
నేను దీన్ని చెడగొట్టకుండా ఎలా ఉండగలను?
నా ఉద్దేశం, నిన్ను చూడు.

45:03.871 --> 45:05.956
నన్ను అలా కొట్టకు. అది నిజం, కదా?

45:07.291 --> 45:09.751
ప్రతి రోజూ నువ్వు నాకు
ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూ ఉంటావు.

45:10.294 --> 45:13.462
నేను నీతో ఉంటే అత్యుత్తమంగా ఉంటాను
ఎందుకంటే నీ కోసం అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటాను.

45:13.463 --> 45:16.090
స్పేస్ గుండా టైమ్ గుండా నువ్వు నాకు దారి చూపిస్తావు.

45:16.091 --> 45:18.426
నువ్వు నా ఆత్మతో సంభాషిస్తావు.

45:18.427 --> 45:20.345
ఐ లవ్ యూ, బేబీ.

45:21.346 --> 45:22.347
సర్.

45:23.724 --> 45:24.766
థాంక్యూ.

45:25.559 --> 45:30.355
కాబట్టి అందరూ ఈ పుట్టినరోజు అమ్మాయి కోసం
మీ మెల్టీనీలతో అభినందించండి.

45:38.697 --> 45:40.323
ఏదైనా మాట్లాడచ్చుగా?

45:40.324 --> 45:41.450
ఏదైనా ఒక చిన్న మాట.

46:06.934 --> 46:08.601
లోపలి నుంచి నా కోసం ఒక గిటార్ తీసుకువస్తావా?

46:08.602 --> 46:09.686
తెస్తాను.

46:15.192 --> 46:20.030
సారీ. ప్రతి ఇబ్బందికరమైన మౌనాన్ని
భర్తీ చేసే వాళ్లలో నేను ఒక మనిషిని.

46:20.614 --> 46:22.031
చాలా అందంగా మాట్లాడావు, నిక్.

46:22.032 --> 46:25.368
నిజంగా కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. అవును.

46:25.369 --> 46:28.704
నిజంగా ఇది మా అందరికీ చాలా భావోద్వేగభరితమైన సందర్భం.

46:28.705 --> 46:32.459
నిక్ ని అభినందిస్తూ చప్పట్లు కొట్టండి! అవును.

46:34.294 --> 46:39.591
నిక్. స్ట్రాంగ్ యాస్ జిమ్.

46:40.259 --> 46:42.677
దీని తరువాత కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని.

46:42.678 --> 46:46.305
కానీ నేను ఇక్కడి నుండి ఈ స్టూల్ ని కాసేపు తీసుకుంటాను...

46:46.306 --> 46:49.560
సారీ, డిజె నుండి. మరి...

46:52.479 --> 46:54.313
నేను సంతోషంగా...

46:54.314 --> 46:59.361
మన పుట్టినరోజు అమ్మాయి గౌరవార్థం
ఒక పాటని పాడాలని అనుకుంటున్నాను.

47:01.196 --> 47:02.030
అలాగే.

47:02.531 --> 47:03.407
ఇంకా...

47:04.366 --> 47:08.954
మీరు వినాలి అనుకుంటే నేను రాత్రివేళల్లో
టాప్ ఆలెహౌస్ లో పాటలు పాడుతుంటాను.

47:15.627 --> 47:16.753
ఇంక ప్రారంభిద్దాం.

47:20.257 --> 47:21.842
నా దగ్గర ఒక చిత్రం ఉంది

47:22.467 --> 47:24.969
నాకు ఈ పాట అంటే ఇష్టం.

47:24.970 --> 47:27.472
అది నా గోడకి అమర్చి ఉంది

47:28.140 --> 47:31.100
నువ్వు, నేను కలిసి ఉన్న చిత్రం

47:31.101 --> 47:36.523
మనం నవ్వుతూ ఉన్నాం
మనం ప్రేమలో ఉన్నాం

47:38.984 --> 47:41.987
కానీ ఇప్పుడు మన జీవితాలని చూడు

47:43.530 --> 47:45.949
అంతా ఛిద్రమై చెల్లాచెదురై ఉన్నాయి

47:48.035 --> 47:52.288
మనం తిట్టుకుంటాం కొట్టుకుంటాం
ఇంకా కన్నీళ్లు కార్చినందుకు ఆనందిస్తాం

47:52.289 --> 47:55.375
తెల్లవారే వరకూ ఏడుస్తాం

47:56.668 --> 47:57.710
ఓహ్, వోహ్

47:57.711 --> 48:02.089
నన్ను గట్టిగా పట్టుకో, వోహ్

48:02.090 --> 48:04.760
నా హృదయాన్ని ఓదార్చు

48:06.345 --> 48:08.597
నాతో పాటు ఉండు

48:10.140 --> 48:15.103
ప్రేమించడం ప్రారంభించు
ప్రేమించడం ప్రారంభించు...

48:30.744 --> 48:33.372
- నీ కాలికి ఏమైంది?
- నువ్వు ఎందుకు మాట్లాడలేదు?

48:33.997 --> 48:35.749
ఇప్పుడు నాతో గొడవ పడకు.

48:38.293 --> 48:39.253
హేయ్.

48:41.964 --> 48:42.881
నువ్వు బాగానే ఉన్నావా?

48:48.554 --> 48:50.389
పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో...

48:51.765 --> 48:53.475
నువ్వు ఒక్కసారి కూడా ఇలా అడగలేదు.

48:55.143 --> 48:58.856
సరే, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు,
నేను అడిగి ఉండాల్సింది.

49:11.034 --> 49:12.452
అది నీకు ఎక్కడిది?

49:13.370 --> 49:15.539
వీటిని ఈ మధ్య దుకాణాలలో అమ్ముతున్నారు.

49:16.373 --> 49:19.500
కానీ ఇది నాకు హంటర్ గదిలో దొరికింది.

49:19.501 --> 49:20.919
సరే, గొప్ప విషయం.

49:22.296 --> 49:23.838
ప్లీజ్. వాడి గురించి ఇప్పుడు ఆందోళనపడకు.

49:23.839 --> 49:25.548
దాన్ని వాడు బాగా దాచగలిగిన రోజు
వాడి గురించి ఆందోళన పడు.

49:25.549 --> 49:26.674
ఈ విషయం మీ అమ్మకి చెప్పు.

49:26.675 --> 49:30.012
నేను పనికిమాలిన తల్లిని అంటూ ఆ రోజు
ఆమె సూపర్ మార్కెట్ లో నన్ను తిట్టిపోసింది.

49:30.888 --> 49:34.308
తను నిన్ను మిస్ అవుతోందని
తన శైలిలో చెప్పింది అనుకుంటా.

49:35.392 --> 49:36.977
బహుశా ఆమె నిజమే చెప్పిందేమో.

49:38.937 --> 49:40.688
బహుశా మనం పిల్లల్ని పట్టించుకోవడం లేదేమో.

49:40.689 --> 49:43.941
అవును, తనకి అది తెలుస్తుంది. పిల్లల్ని ఘోరంగా పెంచడంలో
ఆమె అత్యున్నతమైన ప్రమాణాల్ని నెలకొల్పింది.

49:43.942 --> 49:45.194
కూప్!

49:45.694 --> 49:46.528
సరే.

49:47.779 --> 49:49.447
బహుశా మనం వాళ్ల జీవితాల్ని పాడు చేస్తున్నామేమో.

49:49.448 --> 49:52.659
కానీ ప్లీజ్, నిన్ను నువ్వు అంతగా తిట్టుకోకు.

49:54.620 --> 49:59.458
మనం వాళ్లని నిర్లక్ష్యం చేయడం అనేది
విడాకులకు ముందు నుంచే జరుగుతోంది, కాబట్టి...

50:14.681 --> 50:17.142
నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, నా మనసు బాగాలేదు.

50:20.229 --> 50:21.939
నాకు ఏదీ ఇప్పుడు నిజం అనిపించడం లేదు.

50:25.234 --> 50:27.528
నేను ఎప్పుడూ స్తబ్దుగా ఉంటున్నాను.

50:29.738 --> 50:32.365
ప్రతి రోజూ నేను తిరిగి పొందలేని ఎన్నో సందర్భాల్ని
మిస్ అవుతున్నాను.

50:32.366 --> 50:34.034
పిల్లలతో గడిపే సమయాలు...

50:36.119 --> 50:40.082
నా పేషంట్లతో గడిపే సమయాలు. దేవుడా. ఇప్పుడు
నేను ఘోరమైన థెరపిస్టుని అయిపోయాను.

50:40.958 --> 50:42.291
నువ్వు ఘోరమైన థెరపిస్టువి కావు.

50:42.292 --> 50:44.628
లేదు, లేదు. నన్ను నమ్ము. నువ్వు అక్కడ ఉండవు కదా.

50:45.546 --> 50:49.174
బహుశా నా పిల్లల్ని పాడు చేసింది చాలదనుకుంటా.
మిగతా పిల్లల జీవితాల్ని కూడా నేను నాశనం చేస్తున్నాను.

50:49.842 --> 50:51.385
జీవితంలో గొప్ప లక్ష్యాలు ఉండటంలో తప్పు లేదు.

51:01.520 --> 51:03.563
నేను చాలా కాలంగా కోపంతో రగిలిపోతున్నాను అనిపిస్తోంది.

51:03.564 --> 51:08.861
నీ మీద కోపంతో ఉన్నాను అనుకున్నాను,
కానీ నువ్వు వెళ్లిపోయాక కూడా, నాకు ఇంకా కోపంగానే ఉంది.

51:12.447 --> 51:14.366
నేను పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయాను.

51:17.619 --> 51:18.745
నువ్వు దాన్ని బాగా దాచిపెట్టావు.

51:31.049 --> 51:33.969
నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని అడుగుతావు

51:35.512 --> 51:39.057
కానీ, నేను ఏం చెప్పగలను?

51:40.642 --> 51:45.479
నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు
ఇంకా ఇది కేవలం ఒకటి మాత్రమే

51:45.480 --> 51:49.484
నువ్వు ఆడే ఆటల్లో

51:50.110 --> 51:55.032
కాబట్టి నీ కోసం ఒక కొత్త పాట పాడతాను

51:55.908 --> 51:59.036
దయచేసి ఇంక ఏడవకు

52:01.038 --> 52:05.374
నిన్ను క్షమించమని కూడా నేను అడుగుతాను
నాకు తెలియకపోయినా

52:05.375 --> 52:09.795
ఎందుకోసం నిన్ను క్షమాపణలు అడుగుతున్నానో

52:09.796 --> 52:11.672
వోహ్

52:11.673 --> 52:17.136
ఇప్పుడు నన్ను గట్టిగా పట్టుకో, వోహ్

52:17.137 --> 52:19.890
నా హృదయాన్ని ఓదార్చు

52:22.267 --> 52:26.437
నాతోనే ఉండు

52:26.438 --> 52:31.734
ప్రేమించడం ప్రారంభించు
ప్రేమించడం ప్రారంభించు

52:31.735 --> 52:33.027
వోహ్

52:33.028 --> 52:37.532
నన్ను గట్టిగా పట్టుకో ఇప్పుడు, వోహ్

52:37.533 --> 52:39.826
నా హృదయాన్ని ఓదార్చు

52:42.663 --> 52:46.874
నాతోనే ఉండు

52:46.875 --> 52:51.880
ప్రేమించడం ప్రారంభించు
ప్రేమించడం ప్రారంభించు...

52:53.090 --> 52:54.842
హాయ్.

53:04.142 --> 53:05.143
డామిట్.

53:11.066 --> 53:13.652
- బహుశా దాన్ని బాగు చేయించాలి అనుకుంటా.
- అది లిస్టులో ఉంది.

53:18.657 --> 53:21.076
నా హృదయాన్ని ఓదార్చు

53:23.245 --> 53:26.081
నాతో పాటు ఉండు

53:27.916 --> 53:32.920
ప్రేమించడం ప్రారంభించు
ప్రేమించడం ప్రారంభించు

53:32.921 --> 53:37.176
వోహ్

54:07.748 --> 54:09.458
అటామిక్ ఫైర్ బాల్

55:56.064 --> 55:58.066
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
