WEBVTT

00:10.886 --> 00:12.261
ఇదంతా ఏంటి?

00:12.262 --> 00:13.971
నేను ఈ ఇంట్లో ఉండటం కోసం పని చేస్తున్నాను.

00:13.972 --> 00:15.307
నువ్వు ఇప్పటికే ఆ పని చేశావు కదా.

00:16.015 --> 00:17.309
ఇలా రా, అందగత్తె.

00:19.144 --> 00:20.145
వెళదాం పద.

00:21.897 --> 00:23.481
ఉండు, టోర్. నీ కోసం ప్లేట్ రెడీ చేశాను.

00:23.482 --> 00:24.982
నన్ను టోర్ అని పిలవకు, నికీ.

00:24.983 --> 00:26.526
- హేయ్.
- నా దురదృష్టం.

00:26.527 --> 00:27.985
టోరీ.

00:27.986 --> 00:31.030
కానీ చూడు, నువ్వు ఒక క్రీడాకారిణివి.
మరింత బలం రావాలంటే నీకు ప్రొటీన్ కావాలి.

00:31.031 --> 00:32.698
కిలోకి 1.7 గ్రాములు.

00:33.325 --> 00:35.076
ఇదిగో ఇక్కడ ఉన్నది చాంపియన్స్ తినే బ్రేక్ ఫాస్ట్.

00:35.077 --> 00:36.661
అది బ్రేక్ ఫాస్ట్ కాదు.

00:36.662 --> 00:37.955
అది మెటాఫర్.

00:44.086 --> 00:45.920
ఫిల్. ఖర్చు అంచనాకన్నా మించితే నేను అర్థం చేసుకోగలను.

00:45.921 --> 00:48.965
కానీ కేవలం భూమిని చదువు చేయడానికే
అరవై వేల డాలర్లు ఖర్చు ఎలా అవుతుంది?

00:48.966 --> 00:51.467
వెనుక వైపు నేలని చదును చేసి
ఇంకొన్ని చెట్లు నాటమని మీ భార్య చెప్పింది.

00:51.468 --> 00:54.220
- దాని వల్ల చాలా నీడ వస్తుంది.
- గ్రేస్.

00:54.221 --> 00:56.473
- గ్రేస్!
- ఇక్కడ కాస్త బిజీగా ఉన్నాను, బేబీ.

00:57.266 --> 00:58.516
మనం ఆ చెట్లని క్యాన్సిల్ చేయచ్చా?

00:58.517 --> 01:00.184
- హేయ్, ఫిల్!
- ట్రక్ ఇప్పటికే వచ్చేసింది.

01:00.185 --> 01:01.686
- ట్రక్ ఇప్పటికే వచ్చేసింది.
- ఫిల్.

01:01.687 --> 01:03.647
- ఏంటి?
- రిగ్ మీద నువ్వు ఉండాలట.

01:04.815 --> 01:06.607
హేయ్, చూడండి, అక్కడ బోలెడన్ని చెట్లు ఉన్నాయి, కదా?

01:06.608 --> 01:08.025
అవును, అవి మనకి చాలా నీడ ఇస్తాయి.

01:08.026 --> 01:09.652
హేయ్. ఈ చెట్ల విషయంలో...

01:09.653 --> 01:10.862
అవును, మనకి నీడ కావాలి.

01:10.863 --> 01:12.321
- కానీ మనకి అవసరమా?
- సారీ, ఆలస్యం అవుతోంది.

01:12.322 --> 01:15.116
- సరే. ఈ రోజు మీకు మంచిగా సాగాలి.
- బై. నేను... బై, అమ్మాయిలు. బై.

01:15.117 --> 01:16.534
- పద. వెళదాం.
- బై. బై.

01:16.535 --> 01:18.078
- హేయ్, కూప్.
- హేయ్. బై.

01:21.123 --> 01:22.123
నడిచావా, డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా?

01:22.124 --> 01:23.666
నడిచి వచ్చాను. నువ్వే నడవమని చెప్పావు కదా.

01:23.667 --> 01:25.586
సరే. నా కారులో వెళదాం.

01:26.837 --> 01:27.838
పద.

01:28.881 --> 01:29.840
సరే.

01:39.683 --> 01:41.685
దేవుడా, బార్నీ. అది స్పెక్టర్ కదా?

01:42.811 --> 01:44.729
స్పెషల్ ఎడిషన్. పూర్తిగా ఎలక్ట్రిక్.

01:44.730 --> 01:46.647
కొద్ది వారాల కిందట గ్రేస్ నా కోసం కొన్నది.

01:46.648 --> 01:47.815
పుట్టినరోజు కానుక.

01:47.816 --> 01:50.067
- బాగుంది, ఆమె మంచిపని చేసింది.
- ఓహ్, లేదు.

01:50.068 --> 01:52.028
అది రాజకీయం.

01:52.029 --> 01:53.946
చూడు, నేను ఈ రోల్స్ రాయిస్ కారు నడుపుతూ

01:53.947 --> 01:55.489
తను చేసే ఖర్చుల గురించి నేను ఏమీ అనలేను.

01:55.490 --> 01:57.117
ఓహ్, ఇంక ఆపు. ఇది నీకు ఇష్టం కదా.

01:58.660 --> 02:00.078
ఇది చాలా చక్కని కారు.

02:01.079 --> 02:03.540
చాలా గొప్ప ఎంపిక.

02:04.208 --> 02:05.292
నేను డ్రైవ్ చేస్తాను.

02:07.419 --> 02:08.294
అలాగే.

02:35.572 --> 02:37.491
ఏంటి ఇది?

04:07.289 --> 04:08.706
అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం?

04:08.707 --> 04:10.458
ఒక లాయర్ ని కలవడానికి వెళ్తున్నాం.

04:10.459 --> 04:12.960
బార్నీ, బెయిలీ రసెల్ మీద కేసు వేయలేను.
వాళ్లు నన్ను పురుగుని నలిపినట్లు నలిపేస్తారు.

04:12.961 --> 04:15.088
సారీ. నేను మరింత స్పష్టంగా చెప్పాల్సింది.

04:15.631 --> 04:17.882
మనం రిక్ మ్యాసియేలో ని కలవడానికి వెళ్తున్నాం.

04:19.885 --> 04:22.428
నీకు మ్యాసీ అపాయింట్మెంట్ దొరికిందా?
మ్యాసీ అపాయింట్మెంట్ నీకెలా దొరికింది?

04:22.429 --> 04:23.513
అది ముఖ్యం కాదు.

04:23.514 --> 04:26.808
విషయం ఏమిటంటే, బెయిలీ గనుక అతని పేరు వింటే,
వాళ్లు బేరానికి వస్తారు.

04:27.518 --> 04:28.893
జాక్ దేనికి భయపడతాడంటే

04:28.894 --> 04:31.562
మ్యాసీ రంగంలోకి దిగితే
అతని పెట్టుబడిదారులు కంగారుపడిపోతారు.

04:31.563 --> 04:33.022
అతను చాలా ఖరీదైన లాయర్ కదా.

04:33.023 --> 04:35.149
కానీ, అతను అవసరానికి చేస్తాడు.

04:35.150 --> 04:37.860
- అలా అని అతను నీతో చెప్పాడా?
- అది చెప్పలేదు, కానీ నువ్వు అతడిని ఒప్పించాలి.

04:37.861 --> 04:40.029
- అతను సగం వాటా తీసుకుంటాడు.
- కావచ్చు.

04:40.030 --> 04:42.615
కానీ ఆ మిగతా సగం వాటా
నీ దగ్గర ఉన్నదానికన్నా చాలా ఎక్కువ.

04:42.616 --> 04:44.825
నువ్వు చాలా బాకీలు చెల్లించాలి, మిత్రమా.
నా బాకీతోనే మొదలుపెట్టాలి.

04:44.826 --> 04:46.161
నిక్ బ్రాండెస్.

04:48.622 --> 04:49.705
నిక్! హేయ్.

04:49.706 --> 04:50.831
ఏంటి సంగతి, బార్నీ?

04:50.832 --> 04:53.376
నా జిమ్ కి మళ్లీ రుణం దొరుకుతుందేమో
కనుక్కుందామని ఫోన్ చేశాను.

04:53.377 --> 04:55.795
రెండు చోట్ల కొత్తగా పెట్టబోయే జిమ్ లకి
రుణం ఇస్తామని డాబ్స్ సంస్థ చెబుతోంది

04:55.796 --> 04:57.713
అది కూడా నా ఆస్తులు ఏవీ అమ్మకుండానే
రుణం ఇస్తామంటున్నారు.

04:57.714 --> 04:59.173
సరే. హేయ్, సారీ, నిక్.

04:59.174 --> 05:00.675
నేను కూప్ తో కలిసి కారులో ఉన్నాను.

05:00.676 --> 05:02.093
- స్పీకర్ లో నా మాట వినిపిస్తోందా?
- అవును.

05:02.094 --> 05:03.761
హేయ్. ఏంటి సంగతి, కూప్?

05:03.762 --> 05:06.514
ఈ రోజు రాత్రి ఆడవాళ్లకి
ఆత్మరక్షణ కార్యక్రమం ఉందన్న విషయం మీకు తెలుసా?

05:06.515 --> 05:08.724
- అది ఈ రాత్రేనా?
- నాకు అలాగే చెప్పారు.

05:08.725 --> 05:10.935
ఈ రాత్రి మనం బ్యాచిలర్స్, మిత్రులారా.

05:10.936 --> 05:14.146
కాబట్టి నేను కొద్దిగా మాంసం ఇంకా మద్యం తెచ్చి
సరదాగా గడపడానికి అందరినీ ఆహ్వానిస్తాను.

05:14.147 --> 05:15.731
- మీరు కూడా వస్తారా?
- వినడానికి బాగుంది.

05:15.732 --> 05:17.358
అలాగే, సర్. నీ సంగతి ఏంటి, కూప్?

05:17.359 --> 05:18.360
కష్టం, నిక్.

05:19.111 --> 05:23.656
సరే. కానీ, ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే
ఈ ఆహ్వానం అలాగే ఉంటుంది.

05:23.657 --> 05:25.617
సరే, నేను రాలేను. కానీ థాంక్స్.

05:28.996 --> 05:30.872
సరే, ఇది ఇంకా ఇబ్బందికరంగా మారేలోపే నేను ఫోన్ పెట్టేస్తాను.

05:30.873 --> 05:32.707
- ఈ రాత్రికి కలుద్దాం, నిక్.
- అలాగే, బార్నీ.

05:32.708 --> 05:34.418
"రుణం" గురించి మాట్లాడటానికి మళ్లీ కాల్ చేయి.

05:38.130 --> 05:40.131
- ఏంటి?
- టీమ్ కూప్ ఏమైంది?

05:40.132 --> 05:41.966
ఎలాంటి టీమ్స్ లేవని చెప్పావు కదా.

05:41.967 --> 05:44.510
ఒకవేళ ఉన్నా కూడా, నేను సహజంగా నీ వైపే ఉంటాను.

05:44.511 --> 05:47.180
- నిక్ ని వదిలేస్తాను.
- కానీ నువ్వు అతని ఇంటికి వెళ్తావు కదా.

05:47.181 --> 05:48.723
ఆ మనిషి మంచి పార్టీ ఇస్తాడు.

05:48.724 --> 05:50.308
తప్పకుండా వెళ్లాలి.

05:50.309 --> 05:51.602
నువ్వు వెళ్లకూడదు.

05:52.728 --> 05:54.812
సరే, కొద్ది రోజుల వరకూ
నాకున్న క్లయింట్లలో నిక్ చాలా పెద్ద క్లయింట్,

05:54.813 --> 05:56.522
కాబట్టి నేను కాదనలేను.

05:56.523 --> 05:57.774
వావ్.

05:58.358 --> 05:59.942
ఈ కారుకి ఏదైనా జరిగితే తర్వాత బాధపడతావు.

05:59.943 --> 06:01.862
సరదాకి కూడా అలా మాట్లాడకు.

06:06.617 --> 06:07.783
మీరు ఈ కేసు గెలవలేరు.

06:07.784 --> 06:09.452
నేను అది మీకు ముందే చెప్పాలి.

06:09.453 --> 06:12.581
నువ్వు తెలివైనవాడివి, కూప్. ఆ మనుషులతో
నువ్వు ఎక్కువ కాలం పోరాడలేవు.

06:14.374 --> 06:15.416
సరే, నీ సమయానికి థాంక్స్.

06:15.417 --> 06:17.543
గుడ్ న్యూస్ ఏమిటంటే నువ్వు గెలవనక్కరలేదు.

06:17.544 --> 06:19.170
మనం సమ్మరీ జడ్జ్ మెంట్ వరకూ వస్తే చాలు

06:19.171 --> 06:21.672
అప్పటికే బెయిలీ అధికారులు
మనతో బేరాలు ఆడటం మొదలుపెడతారు.

06:21.673 --> 06:23.591
అప్పుడు మనం చర్చించుకుంటాం.

06:23.592 --> 06:25.551
నేను చాలా మంచి బేరగాడిని.

06:25.552 --> 06:27.596
ఈ కేసుని పారితోషికం లేకుండా వాదిస్తావా?

06:28.430 --> 06:29.514
లేదు.

06:29.515 --> 06:31.516
ఈ కేసులో నేను పూర్తి పారితోషికాన్ని తీసుకుంటా, మిత్రమా.

06:31.517 --> 06:34.310
మీ కేసు పూర్తి కాలం వాదించడానికి రెండు లక్షల డాలర్లు.
ఈ కేసు కొంత కాలం పడుతుంది.

06:34.311 --> 06:36.522
కొంత కాలం అంటే ఎంత? మూడు నెలలా? ఆరు నెలలా?

06:37.231 --> 06:38.898
రెండు, మూడేళ్లు.

06:38.899 --> 06:40.942
- దేవుడా.
- అవును. సదరన్ డిస్ట్రిక్ట్.

06:40.943 --> 06:42.486
ఇక్కడ ఇలాగే నడుస్తుంది.

06:44.154 --> 06:45.488
ఈ కేసు పోరాడటానికి మీ దగ్గర అంత డబ్బు ఉందా?

06:45.489 --> 06:46.615
తన దగ్గర ఉంది.

06:49.868 --> 06:52.411
సరే. చూడు, నేను కోర్టుకి తిరిగి వెళ్లాలి.

06:52.412 --> 06:53.871
మీ కాఫీని ఆస్వాదించండి. బిల్లు నేనిస్తాను, హా?

06:53.872 --> 06:55.541
అయితే నువ్వు ఈ కేసుని వాదించబోతున్నావా?

06:56.250 --> 06:57.667
అంటే, నేను దాని గురించి ఆలోచిస్తాను.

06:57.668 --> 06:58.960
షెడ్యూల్ చూసుకోవాలి.

06:58.961 --> 07:00.295
నేను టచ్ లో ఉంటాను, సరేనా?

07:01.839 --> 07:04.090
- రెండు లేదా మూడు సంవత్సరాలా?
- మనం అంచనాలు పెట్టుకోకుండా చేస్తున్నాడు.

07:04.091 --> 07:05.216
నేను అతని ఫీజుని భరించలేను.

07:05.217 --> 07:08.804
చూడు, నువ్వు రిటైనర్ ఫీజు చెల్లించు
ఆ తరువాత దాని ప్రకంపనలు ఎలా ఉంటాయో చూడు.

07:09.346 --> 07:11.639
నువ్వు ఎప్పుడూ లేనంత ఆశావాదిలా మారావు.

07:11.640 --> 07:13.517
నా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూశావు కదా.

07:14.017 --> 07:15.644
ఆశావాదం ఒక్కటే మనకి ఉన్న అవకాశం.

07:17.145 --> 07:18.105
పద.

07:18.689 --> 07:20.648
మనం కాస్త అసలైన కాఫీ తాగుదాం.

07:20.649 --> 07:21.692
నువ్వే కొనివ్వాలి.

07:23.402 --> 07:24.819
మీ ఇంట్లో కార్పెట్ మిడతలు ఉన్నాయి.

07:24.820 --> 07:26.237
- కార్పెట్ మిడతలా?
- అవును.

07:26.238 --> 07:27.613
అవి మీ రగ్గులలో గుడ్లు పెడతాయి.

07:27.614 --> 07:29.532
ఇక్కడ ప్రతి గదిలో నాకు వాటి లార్వా కనిపించింది.

07:29.533 --> 07:30.700
దేవుడా.

07:30.701 --> 07:32.368
మీరు చూడగానే నన్ను పిలిపించడం మంచిది అయింది

07:32.369 --> 07:34.370
లేదంటే మీ ఇంట్లో అవి కాలనీలు పెట్టి ఉండేవి.

07:34.371 --> 07:36.455
- వాటిని పోగొట్టగలవా?
- అవును.

07:36.456 --> 07:38.833
అందుకు కొన్ని ట్రీట్మెంట్లు చేయాలి.
వచ్చే నెలలో మూడుసార్లు చేయాల్సి ఉంటుంది.

07:38.834 --> 07:40.502
అందుకు తొమ్మిది వేల డాలర్లు ఖర్చవుతుంది.

07:41.044 --> 07:42.712
- తొమ్మిది వేల డాలర్లా?
- అవును.

07:42.713 --> 07:45.840
విషపదార్థాలు లేని రసాయనాలతో చేయాలంటే
పదివేల ఐదొందల డాలర్లు అవుతుంది.

07:45.841 --> 07:48.301
ఇంకా మీ అల్మారా వెనుక ఉన్న గోడని కూల్చేయాల్సి వస్తుంది.

07:48.302 --> 07:50.136
అది ఒకటి, కనీసం.

07:50.137 --> 07:51.554
- నిజంగానే అంటున్నావా?
- అవును.

07:51.555 --> 07:53.306
చూడండి, అవి ఆ లోపల ఉన్నాయి ఇంకా ఇల్లంతా వ్యాపిస్తున్నాయి.

07:53.307 --> 07:56.475
మొదటి దశలో ఉన్నాయి, అది ఖచ్చితంగా చెప్పగలను,
కానీ వాటిని ఇప్పుడే మీరు నాశనం చేయకపోతే.

07:56.476 --> 07:58.728
లోపల ప్రతి గోడ వెనుక
అవి కాలనీలు ఏర్పాటు చేసుకుని విస్తరిస్తాయి.

07:58.729 --> 08:00.354
ఇంక మీరు ఎప్పటికీ వాటిని నిర్మూలించలేరు.

08:00.355 --> 08:01.898
మీరు ఎప్పుడు మొదలుపెట్టగలరు?

08:01.899 --> 08:04.318
కొద్ది రోజుల్లో మా సిబ్బంది ఇక్కడికి వస్తారు.

08:19.833 --> 08:22.252
- నన్ను తీసుకువెళ్లి తీసుకొచ్చినందుకు థాంక్స్, బార్నీ.
- సంతోషం.

08:26.924 --> 08:27.925
హేయ్!

08:28.467 --> 08:29.593
కూప్.

08:31.053 --> 08:32.762
ఈ రాత్రి నిక్ ఇంటికి రా.

08:32.763 --> 08:34.806
చూడు. నువ్వు కాస్త సరదాగా గడపడానికి ఇదొక అవకాశం.

08:35.390 --> 08:38.433
ఆ గొడవ జరిగి ఏడాది దాటింది.
ఇంక క్షమించి అన్నీ మర్చిపోయే సమయం వచ్చింది.

08:38.434 --> 08:40.187
అతను నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు.

08:41.313 --> 08:43.565
అది నిజం, కానీ అది ఇంక వదిలేయచ్చు, కాదంటావా?

08:44.274 --> 08:46.150
చూడు, నిక్ తప్పు చేయలేదని నేను అనడం లేదు.

08:46.151 --> 08:48.653
అతను తప్పు చేశాడు. ఆమె కూడా తప్పు చేసింది.

08:48.654 --> 08:51.405
కానీ బహుశా అందులో నీ తప్పు కూడా ఉండి ఉంటుంది, కదా?

08:51.406 --> 08:52.823
కొద్దిగా అయినా?

08:52.824 --> 08:54.283
పెళ్లిళ్లు సంక్లిష్టమైనవి.

08:54.284 --> 08:55.660
అయితే అది నా తప్పు అంటున్నావా?

08:55.661 --> 08:58.496
అది ఎవరి తప్పు అనేది ముఖ్యం కాదు అంటున్నాను.

08:58.497 --> 09:00.831
మనం ఇంకా కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి.

09:00.832 --> 09:02.751
ఆ విషయం మర్చిపోయి నీకు నువ్వు మేలు చేసుకో.

09:03.544 --> 09:04.545
నువ్వయితే అలాగే చేస్తావా?

09:06.088 --> 09:07.089
అలా నటిస్తాను.

09:08.048 --> 09:09.466
కానీ, ఈ రాత్రి నా పిల్లలు వస్తున్నారు, కాబట్టి...

09:10.092 --> 09:11.467
సరే. మంచిది.

09:11.468 --> 09:13.177
నిన్ను తరువాత కలుస్తాను, బార్నీ.

09:13.178 --> 09:14.513
కలుద్దాం, కూప్.

09:22.896 --> 09:25.606
ఓహ్, దేవుడా. తను చాలా చక్కగా ఉంది.

09:25.607 --> 09:28.025
ఎస్టీ? అది ఒక పిల్ల రాక్షసి.

09:28.026 --> 09:29.735
తను ఒక దేవదూతలా కనిపిస్తోంది.

09:29.736 --> 09:31.487
తను అలాగే మనల్ని మాయ చేస్తుంది.

09:31.488 --> 09:33.574
తనకి భయంకరమైన తెలివితేటలు ఉన్నాయి.

09:34.533 --> 09:36.200
ఓహ్! హేయ్, ఆండీ. నీ ఫ్రెండ్ వచ్చింది.

09:36.201 --> 09:37.661
హలో, కూప్.

09:39.538 --> 09:40.621
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

09:40.622 --> 09:42.249
నేను ఈ పొరుగు ప్రాంతానికి వచ్చాను.

09:43.000 --> 09:45.335
- ఈ పొరుగు ప్రాంతానికా?
- ఒకసారి కలిసి పోదామని వచ్చాను.

09:45.961 --> 09:47.838
వ్యాపారం చేయడానికి నీకింకా ఆసక్తి ఉందా లేదా తెలుసుకుందామని.

09:52.551 --> 09:57.054
సరే, నేను షవర్ చేయడానికి వెళ్తున్నాను
కాబట్టి మీరు ఇంక మీ వ్యాపారం చేసుకోండి.

09:57.055 --> 09:58.764
మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, లూ.

09:58.765 --> 09:59.892
నిన్ను కూడా, ఆలీ.

10:00.559 --> 10:02.185
ఈ రాత్రి వేడుక చేసుకో.

10:02.186 --> 10:03.896
థాంక్యూ.

10:07.149 --> 10:08.274
మంచి అమ్మాయి, నీ చెల్లెలు.

10:08.275 --> 10:09.483
నా ఇంట్లో ఏం చేస్తున్నావు?

10:09.484 --> 10:10.651
నేను వాచీ కోసం వచ్చాను.

10:10.652 --> 10:12.612
దాన్ని అమ్మలేనని చెప్పావు అనుకుంట కదా.

10:12.613 --> 10:14.989
నువ్వు పోలీసువి కాదని ఖరారు చేసుకోవాలి అనుకున్నా.

10:14.990 --> 10:16.199
కాబట్టి నీ గురించి ఆరా తీశాను.

10:16.200 --> 10:17.700
నా గురించి ఆరా తీశావా?

10:17.701 --> 10:21.078
ఒక సంపన్నుడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు
దానితో పాటు అతని భారీ హెడ్జ్ ఫండ్ ని కూడా.

10:21.079 --> 10:24.081
హఠాత్తుగా అతనికి డబ్బు కొరత ఏర్పడింది.

10:24.082 --> 10:27.376
నీ మాసరాటీ కారుని అమ్మేసి ఉండచ్చు
కానీ ఇరుగుపొరుగు ఏం అనుకుంటారు

10:27.377 --> 10:30.963
ఆండ్రూ కూపర్ గనుక హఠాత్తుగా
చౌకబారు కారుని నడుపుతుంటే?

10:30.964 --> 10:35.092
కాబట్టి, ప్రిన్స్ టన్ ఆర్థిక సూపర్ స్టార్ నిపుణుడు
చిల్లర దొంగగా మారాడు.

10:35.093 --> 10:37.220
నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు.

10:37.221 --> 10:39.472
ఆ రిచర్డ్ మిలె వాచీ.

10:39.473 --> 10:42.391
అది నీది కాదు, కానీ అది ఈ చుట్టుపక్కల నుంచే వచ్చింది.

10:42.392 --> 10:44.519
బ్రాడ్లీ స్పెర్లింగ్.

10:44.520 --> 10:46.688
ఇక్కడికి రెండు మూడు వీధుల అవతల.

10:47.648 --> 10:51.526
ఒక్క ఫోన్ కాల్ తో నేను ఆ వాచీ మీద ఉన్న
సీరియల్ నెంబరు కనుక్కోగలిగాను,

10:51.527 --> 10:54.362
దాన్ని ఎవరు కొన్నారు, వాళ్లు ఎక్కడ ఉంటారు
అనే వివరాలు తెలుసుకోగలిగాను.

10:54.363 --> 10:57.949
మనకి తెలియని వాళ్ల గురించి తెలుసుకోకపోవడం కన్నా
ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు.

10:57.950 --> 10:59.159
నేను సరిగ్గానే చెప్పానా?

10:59.743 --> 11:02.913
కానీ నువ్వు ఎక్కడ ఉంటావో
నాకు తెలుసన్న విషయం నీకు తెలిసింది.

11:03.872 --> 11:05.707
నీ కుటుంబం ఎక్కడ నివసిస్తుందో నాకు తెలుసు.

11:08.210 --> 11:09.377
నువ్వు నన్ను బెదిరిస్తున్నావా?

11:09.378 --> 11:11.212
దీన్ని బెదిరింపుగా అనుకోవద్దు.

11:11.213 --> 11:14.715
ఇది దాదాపు ఒక ఒప్పందం లాంటిది,

11:14.716 --> 11:19.262
ఒకవేళ నువ్వు గనుక పట్టుబడితే
నీ కొత్త ఫ్రెండ్, లూ గురించి నువ్వు మాట్లాడకూడదు.

11:19.263 --> 11:22.391
ఒకవేళ నువ్వు నా గురించి చెబితే, అందుకు శిక్షలు ఉంటాయి.

11:23.183 --> 11:24.643
దొంగల మధ్య గౌరవం.

11:25.769 --> 11:27.311
నేను దొంగని కాను.

11:27.312 --> 11:29.690
నువ్వు ఏం చేయబోతున్నావో నాకు ఇంకా తెలియదు.

11:30.357 --> 11:32.401
నాకు తెలిసి బహుశా అది నీకు కూడా తెలియకపోవచ్చు.

11:39.741 --> 11:42.202
ఇంక నువ్వు వెళ్లి ఆ వాచీని తీసుకురావచ్చు కదా?

12:09.813 --> 12:10.938
నేను నీతో మాట్లాడలేను.

12:10.939 --> 12:12.815
నా ఫోన్లు వాయిస్ మెయిల్ కి వెళ్లేలా ఎందుకు చేస్తున్నావు?

12:12.816 --> 12:14.442
నీ ఫోన్ కట్ చేయడం కన్నా అది మర్యాదకరమైన పని కాబట్టి.

12:14.443 --> 12:16.068
- అవునా?
- ఇప్పుడు అదే చేయబోతున్నాను.

12:16.069 --> 12:18.362
జాక్ రేపు నిన్ను తన ఆఫీసుకి రమ్మని అడుగుతాడు.

12:18.363 --> 12:20.198
నేను మ్యాసీని లాయర్ గా పెట్టుకున్నానని నీకు చెబుతాడు.

12:20.199 --> 12:22.074
ఛ, కూప్.

12:22.075 --> 12:24.035
జాక్ నన్ను నాశనం చేశాడు, లివ్.
అతను ఏం చేశాడో నీకు తెలుసు.

12:24.036 --> 12:25.704
మ్యాసీ నన్ను ఆ కేసులోకి లాగుతాడు.

12:27.080 --> 12:28.456
నా పేరు రేపు పత్రికల్లో వస్తుంది.

12:28.457 --> 12:30.374
నేను అలా జరగనివ్వను,
కానీ నువ్వు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది.

12:30.375 --> 12:32.126
ఈ కథలో నన్ను ఒక వేశ్యగా ముద్రవేస్తారు.

12:32.127 --> 12:34.420
- జాక్ నిన్ను అబద్ధం చెప్పమంటాడు.
- అది చెప్పద్దని నాకు చెబుతున్నావు.

12:34.421 --> 12:37.716
ఏది సరైనదో అదే చేయమని నిన్ను అడుగుతున్నాను.

12:38.550 --> 12:40.718
అతను నా నుంచి అన్నీ లాక్కున్నాడు, లివ్.

12:40.719 --> 12:42.094
ఇప్పుడు నువ్వు నాకు అదే చేయబోతున్నావు.

12:42.095 --> 12:43.262
ఇది నీ గురించి కాదు.

12:43.263 --> 12:44.681
అవును, నిజంగా అది నా గురించి కాదు.

12:45.766 --> 12:46.766
నేను ఫోన్ పెట్టేస్తున్నాను.

12:46.767 --> 12:48.143
లివ్, ప్లీజ్...

12:49.811 --> 12:51.271
దేవుడా. ఛ.

12:52.314 --> 12:54.233
- హాయ్, పిల్లలూ.
- హేయ్, నాన్నా.

12:54.900 --> 12:56.484
- హేయ్, నాన్నా.
- కాలేజీలో ఎలా గడిచింది?

12:56.485 --> 12:57.693
అదే పాత కథ, అదే పాత కథ.

12:57.694 --> 13:00.364
- మంచి వాసన వస్తోంది.
- అవును. నేను పాస్తా వండుతున్నాను.

13:01.406 --> 13:03.699
నేను జేక్ తో కలిసి బయటకి వెళ్తున్నాను.
నీకు మెసేజ్ చేశా అనుకుంటా.

13:03.700 --> 13:04.993
లేదు, నువ్వు...

13:07.287 --> 13:08.120
నువ్వు చేశావు. అవును.

13:08.121 --> 13:10.332
నేను కేవలం నా సామాన్లు పెట్టుకోవడానికి వచ్చాను.

13:11.041 --> 13:14.043
తను నన్ను స్కాట్ ఇంటికి తీసుకువెళుతోంది
ఎందుకంటే మేము త్వరగా సౌండ్ చెక్ చేసుకోవాలి.

13:14.044 --> 13:15.545
స్కాట్ ఎవరు?

13:15.546 --> 13:16.755
మెక్ గ్రెగర్.

13:17.422 --> 13:18.965
ఈ రాత్రి పార్టీలో మేము మ్యూజిక్ వాయించబోతున్నాం.

13:18.966 --> 13:20.425
నీకు గుర్తులేదా?

13:21.009 --> 13:23.803
సరే. మంచిది. అయితే డిన్నర్ చేయరా?

13:23.804 --> 13:26.305
- సరే. రండి, వెళదాం.
- మిగిలిన వంటకాలు నేను తరువాత తింటాను.

13:26.306 --> 13:27.640
ఆగు.

13:27.641 --> 13:29.851
మీరు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తారు?

13:29.852 --> 13:30.935
రాత్రి పదకొండు, పన్నెండు గంటలకి.

13:30.936 --> 13:32.020
అవును, నేనూ అదే సమయానికి వస్తా.

13:32.646 --> 13:34.398
మీ ఇద్దరికీ రేపు కాలేజీ ఉందని తెలుసు కదా?

13:36.108 --> 13:37.108
అది నిజం.

13:37.109 --> 13:38.568
మాకు తెలుసు. అవును, తను చెప్పింది నిజమే.

13:38.569 --> 13:39.735
తండ్రిగా గొప్పగా ఉన్నావు, నాన్నా.

13:39.736 --> 13:40.988
పద.

13:50.497 --> 13:51.664
దేవుడా.

13:51.665 --> 13:53.082
హేయ్.

13:53.083 --> 13:54.751
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావని నాకు తెలియదు.

13:55.627 --> 13:57.545
ఏం చేస్తున్నావు? కూర్చో. ఒక డ్రింక్ తాగు.

13:57.546 --> 13:59.964
బెల్జియం గొప్ప కళాకారుడిని చూడు.

13:59.965 --> 14:02.425
కుదరదు. నాకు పని ఉంది.

14:02.426 --> 14:03.510
మళ్లీనా?

14:04.094 --> 14:05.553
అంత ఆశ్చర్యం నటించకు.

14:05.554 --> 14:07.805
సరే, నేను శుభ్రం చేసేస్తాను.

14:07.806 --> 14:08.891
నేను వచ్చి వింటాను.

14:09.558 --> 14:12.686
నువ్వు నా ఉత్సాహాన్ని చంపి నేను నెర్వస్ అయ్యేలా చేస్తావు.

14:13.353 --> 14:14.354
సరే.

14:15.355 --> 14:16.480
పిల్లలు ఎక్కడ ఉన్నారు?

14:16.481 --> 14:17.481
నన్ను వదిలేసి వెళ్లిపోయారు.

14:17.482 --> 14:18.983
సారీ, ఆండీ.

14:18.984 --> 14:21.027
- నేను ఉంటే బాగుండేది, కానీ...
- హేయ్, నేను బాగానే ఉన్నాను.

14:21.028 --> 14:23.112
ప్లీజ్. నీ పని చేసుకో.

14:23.113 --> 14:25.448
నిన్ను ఇలా వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు.

14:25.449 --> 14:26.532
అంటే ఎలా?

14:26.533 --> 14:30.579
నా దగ్గర పాస్తా, స్కాచ్, ఇంకా
జీన్-క్లౌడ్ వాన్ డామ్ ఉన్నారు.

14:31.914 --> 14:33.080
ఇది చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది.

14:33.081 --> 14:35.416
సరే. అయితే, నిన్ను తరువాత కలుస్తాను.

14:35.417 --> 14:36.667
- బై!
- బై.

14:36.668 --> 14:38.753
బై.

14:38.754 --> 14:40.087
- బాగా అదరగొట్టు.
- థాంక్యూ.

14:40.088 --> 14:41.840
- నువ్వు చాలా చక్కగా కనిపిస్తున్నావు.
- చాలా థాంక్యూ.

14:50.557 --> 14:51.974
- హేయ్.
- హేయ్.

14:51.975 --> 14:54.101
ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు వస్తావా?

14:54.102 --> 14:55.978
నేను రాలేను. నాకు ఆత్మరక్షణ శిక్షణ ఉంది.

14:55.979 --> 14:57.064
దేవుడా. నీకు కూడానా?

14:57.856 --> 14:59.357
ఎదురుతిరిగి ఎలా పోరాడాలో ఆడదానికి తెలియాలి.

14:59.358 --> 15:01.567
ఖచ్చితంగా ఎవరితో పోరాడాలి?

15:01.568 --> 15:02.652
అది తెలియదు,

15:02.653 --> 15:04.988
- కానీ అలాంటి పరిస్థితి ఎదురైతే నేను సిద్ధంగా ఉంటాను.
- శామ్, ఆగు.

15:05.739 --> 15:06.781
హేయ్, నేను వెళ్లాలి.

15:06.782 --> 15:08.450
- తరువాత కాల్ చేస్తావా?
- అలాగే.

15:19.378 --> 15:22.463
నాకు తెలిసిన వాళ్లంతా ఆ రాత్రి బయటే ఉన్నారు
కానీ ఈ మధ్య ఒంటరితనం అనేది

15:22.464 --> 15:25.007
ఎందుకనో చెడ్డ విషయంగా కాకుండా
మంచి విషయంగా కనిపిస్తోంది.

15:25.008 --> 15:26.510
వదిలేయ్.

15:29.263 --> 15:31.055
- హేయ్.
- అయితే నువ్వు చూశావు, కదా?

15:31.056 --> 15:34.059
- నువ్వు వెళ్లావా?
- అవును. వెళ్లాను.

15:34.977 --> 15:36.185
- హాయ్.
- హేయ్.

15:36.186 --> 15:38.145
- హేయ్, అమ్మాయిలు.
- హేయ్.

15:38.146 --> 15:40.523
- చాలామంది వచ్చారు.
- థాంక్యూ. ఎవరికి తెలుసు?

15:40.524 --> 15:41.941
వీళ్లందరికీ ఇది ఒక సాకు

15:41.942 --> 15:43.776
ఎందుకంటే నీ ఇంటి అలంకరణ ఐడియాల్ని
వాళ్లు కాజేయడానికి వచ్చారు.

15:43.777 --> 15:45.486
అన్నట్లు, ఈ ఇల్లు చాలా గొప్పగా ఉంది.

15:45.487 --> 15:48.114
నిజంగానా? నేను దీన్ని మార్చాలని ఆలోచిస్తున్నాను.

15:48.115 --> 15:50.199
ఓహ్, ఏది ఏమైనా.

15:50.200 --> 15:52.703
అక్కడ గంజాయి ఉంది. నేను కాసేపు తరువాత తీసుకుంటాను.

15:53.328 --> 15:54.538
ఇవి గ్లూటెన్ లేనివేనా?

15:55.205 --> 15:56.874
- సహజంగా.
- సరే, అయితే.

15:59.418 --> 16:01.502
సరే, లేడీస్!

16:01.503 --> 16:03.297
రేప్ కావాలని ఎవరు కోరుకుంటున్నారు?

16:06.383 --> 16:08.509
అది సరైన జవాబు.

16:08.510 --> 16:11.305
కాబట్టి మీ కేకులు పక్కన పెట్టి ఇంక దృష్టి సారించండి.

16:15.559 --> 16:18.394
అందరి భార్యలూ మ్యాగీ ఇంకా సుజాన్ దగ్గర
తాగిన మైకంలో కుంగ్ ఫూ నేర్చుకుంటున్నారు,

16:18.395 --> 16:20.354
ఇంకా భర్తలంతా నిక్ ఇంట్లో మద్యం తాగుతున్నారు,

16:20.355 --> 16:23.150
దాని అర్థం ఏమిటంటే ఖాళీగా ఇళ్లని
నేను ఎంచుకునే అవకాశం వచ్చింది.

16:25.444 --> 16:26.611
గతంలో నాకు, మెల్ కి పెళ్లయిన కొత్తలో,

16:26.612 --> 16:29.740
రెస్నిక్స్ కుటుంబం ఎప్పుడు డిన్నర్ కోసం ఆహ్వానించినా
మేము ఎప్పుడూ కాదనలేదు.

16:31.325 --> 16:35.162
డోమ్ ఒక ప్రొఫెషనల్ వంటవాడు
అందుకే ఆ విందు ఎప్పుడూ గొప్పగా ఉండేది.

16:37.706 --> 16:39.374
ముందు తలుపు తెరుచుకుంది.

16:41.919 --> 16:43.127
సురక్షితం.

16:43.128 --> 16:45.922
క్యాట్ రెస్నిక్ న్యూ యార్క్ మ్యాన్హాటన్ లోనే

16:45.923 --> 16:47.298
ఎంతో పేరున్న క్రిమినల్ డిఫెన్స్ అటార్నీ.

16:47.299 --> 16:50.260
గంటకి రెండు వేల డాలర్ల పారితోషికం తీసుకునే ఆమె,
కోర్టు రూమ్ లో షార్క్ చేపలా చెలరేగిపోతుంది.

16:52.429 --> 16:54.723
ఆ సాయంత్రం ఆమె కూడా బయటకి వెళ్లాల్సి ఉంది.

16:55.557 --> 16:56.600
కానీ అతను...

16:57.559 --> 16:59.228
అతను డోమ్ కాదు.

17:40.102 --> 17:41.979
ఆ కుర్రవాడి పేరు బ్లేక్ ఫార్కస్,

17:42.980 --> 17:45.356
టోరీ కన్నా ఒక ఏడాది పెద్దవాడు ఇంకా,
నాకు గుర్తున్నంత వరకూ,

17:45.357 --> 17:47.025
క్యాట్ కూతురు, అలీసాతో డేటింగ్ చేస్తున్నాడు.

18:02.958 --> 18:05.501
డొమైన్ డావునే
షెవలియర్-మోంట్రాషెట్ గ్రాండ్ క్రూ.

18:05.502 --> 18:07.337
2013 వింటేజ్ వైన్.

18:08.255 --> 18:09.882
షెవలియర్-మోంట్రాషెట్ 2013

18:11.508 --> 18:16.262
ఇది బర్గుండీ రాణి లాలౌ బీజె-లెరోయ్ మానసపుత్రిక.

18:16.263 --> 18:18.681
బయోడైనమిక్ వైన్ తయారీలో ఆమె మార్గదర్శి,

18:18.682 --> 18:20.600
ఆమె తన వైన్ ఉత్పత్తుల్ని సెయింట్ రోమన్ లో

18:20.601 --> 18:22.895
సొంత వ్యక్తిత్వాలు ఉండే
మనుషుల మాదిరిగా చూసుకుంటుందని అంటారు.

18:23.979 --> 18:25.813
చెత్త పదార్థాలన్నీ పులియబెట్టి చేసిన ఈ రకమైన మద్యాన్ని

18:25.814 --> 18:27.231
ఆడంబరాలకు పోయే వైన్ ప్రేమికులు ఇష్టపడతారు,

18:27.232 --> 18:30.359
కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే,
ఆడంబరాలకు పోని వైన్ ప్రేమికులు ఎవరైనా ఉంటారా?

18:30.360 --> 18:34.864
అందుకే వాళ్లు ఎంతో సంతోషంగా
ఒక సీసా కోసం 32 వేల డాలర్లు ఖర్చు చేయగలుగుతున్నారు.

18:34.865 --> 18:37.825
అంత వెల ఉన్న ఈ బాటిల్ దొరికింది కాబట్టి,
బహుశా ఈ రాత్రి పెద్దగా నష్టం లేదనుకోవచ్చు.

18:37.826 --> 18:39.745
ఇక్కడి నుండి బయటపడే మార్గం దొరికితే తప్ప.

19:12.110 --> 19:13.986
బార్నీ చోయ్

19:13.987 --> 19:15.989
ఓహ్, దేవుడా.

19:20.410 --> 19:21.662
కూప్.

19:23.205 --> 19:25.706
- చెప్పు.
- కూప్, ఎక్కడ ఉన్నావు?

19:25.707 --> 19:26.791
బయట.

19:26.792 --> 19:28.668
అందరూ నిక్ ఇంటికి వచ్చారు.

19:28.669 --> 19:29.752
నువ్వు తప్పకుండా ఇక్కడికి రావాలి.

19:29.753 --> 19:31.546
మనం దాని గురించి మాట్లాడుకున్నాం.

19:31.547 --> 19:33.381
అవును, కానీ అప్పుడు నేను పద్ధతిగా ఉన్నాను.

19:33.382 --> 19:36.008
అంటే, ముందు... వచ్చేయ్. నీకు ఇంకేం పని ఉంది?

19:36.009 --> 19:39.804
ఖాళీగా ఉన్న నీ ఇంటికి వెళ్లి
నీకు నువ్వే ఏడుపుగొట్టు పార్టీ చేసుకుంటావా?

19:39.805 --> 19:41.430
దాని గురించి ఆలోచిస్తేనే నాకు నిరుత్సాహం వస్తుంది.

19:41.431 --> 19:43.432
విను, నా కోసం ఇక్కడికి రా, సరేనా?

19:43.433 --> 19:44.518
ఇక్కడికి రా. వచ్చేయ్...

19:48.063 --> 19:50.440
నేను అక్కడికి వచ్చే అవకాశం లేనే లేదు.

19:52.901 --> 19:54.570
- మిస్టర్ కూపర్.
- ఎలీనా.

19:55.404 --> 19:56.404
నన్ను చూసి ఆశ్చర్యపోయావా?

19:56.405 --> 19:57.489
అవును.

19:58.615 --> 20:00.116
సారీ. నా ఉద్దేశం...లేదు.

20:00.117 --> 20:01.952
మీరు వస్తున్నారని నాకు తెలియదు.

20:03.287 --> 20:04.537
వాళ్లు కింద అంతస్తులో ఉన్నారు.

20:04.538 --> 20:05.956
మంచిది. థాంక్స్.

20:13.505 --> 20:16.132
2004 అమెరికా పురుషుల బాస్కెట్ బాల్
ఒలింపిక్ టీమ్ ప్రకటన

20:16.133 --> 20:18.802
బ్రాండెస్

20:29.229 --> 20:30.229
ఇరవై రెండు.

20:30.230 --> 20:32.398
వీటిలో ఒకటి ఇప్పుడే తీసుకోవాలి.

20:32.399 --> 20:34.692
ఎందుకంటే ఇది గనుక మార్కెట్ లోకి వస్తే,
మనకి అందుబాటులో ఉండదు.

20:34.693 --> 20:36.445
నేను మీకు అబద్ధం చెప్పడం లేదు.

20:39.489 --> 20:41.950
నేను చెబుతున్నానుగా, ఇది భవిష్యత్తు టాయిలెట్.

20:42.451 --> 20:44.619
ఇది పర్యావరణానికి అనుకూలమైనది,
ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తుంది.

20:44.620 --> 20:47.872
మీరు మలవిసర్జనకి వెళ్లిన ప్రతిసారీ ఇది మీ లెవెల్స్ చెక్ చేసి
మీ పిరుదుల్ని ఇంకా వృషణాల్ని కడుగుతుంది.

20:47.873 --> 20:49.374
అవును, నీకు కూడా, జూల్స్.

20:50.667 --> 20:53.753
దీనికి బ్లూటూత్ ఇంకా వై-ఫై కనెక్షన్ ఉంది,
కాబట్టి మనం మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు.

20:53.754 --> 20:58.674
ఇంకా ఇది యూరిన్ టెస్ట్ ఫలితాల్ని
నేరుగా డాక్టర్ కి పంపించేస్తుంది.

20:58.675 --> 21:00.885
కాబట్టి ప్రభుత్వం మన మూత్రం మీద మలం మీద
నిఘా ఉంచగలుగుతుందన్న మాట.

21:00.886 --> 21:02.220
నేను దాచడానికి ఏమీ లేదు.

21:02.221 --> 21:03.346
సరే, మంచిది. నాకు ఉంది.

21:03.347 --> 21:05.556
నేను లక్సోస్ ఎమ్.టి. సంస్థతో భాగస్వామిని అయ్యాను.

21:05.557 --> 21:07.642
వీటి రిటైల్ ధర 30 వేల డాలర్లుగా నిర్ణయించారు

21:07.643 --> 21:10.019
ఇంకా నేను పది సెంట్లు కూడా ఖర్చు చేయకుండా
ఇరవై శాతం వాటా పొందబోతున్నాను.

21:10.020 --> 21:11.897
నేను చెబుతున్నానుగా, బాబు, ఇది...

21:12.481 --> 21:14.774
ఇది నాకు జార్జ్ ఫోర్మాన్ గ్రిల్ కాబోతోంది.

21:14.775 --> 21:16.609
అంత ధరకి, నేను నీ వంటవాడిగా చేరిపోతాను.

21:16.610 --> 21:17.985
నీకు భావప్రాప్తి కూడా కలిగిస్తా.

21:17.986 --> 21:19.445
క్యాట్ నీకు అది కలిగించడం లేదా?

21:19.446 --> 21:21.656
- హేయ్.
- ఓహ్, దేవుడా.

21:21.657 --> 21:24.450
ఈ సిగ్గులేని, జూదమాడే మూర్ఖుల గుంపుని చూడండి.

21:24.451 --> 21:26.202
- వావ్.
- హేయ్.

21:26.203 --> 21:27.662
- హేయ్, కూప్.
- కూప్!

21:27.663 --> 21:29.957
- ఏంటి సంగతి, బాబూ?
- మొత్తానికి వచ్చావు.

21:31.333 --> 21:32.917
వావ్. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం.

21:32.918 --> 21:35.586
- నిజంగా.
- దీన్ని అంత పెద్ద విషయం చేయకు.

21:35.587 --> 21:36.672
అవును. లేదు.

21:38.715 --> 21:39.715
వావ్. గ్రాండ్ క్రూ.

21:39.716 --> 21:41.592
- ఇది చాలా చక్కని బాటిల్.
- ఫర్వాలేదు.

21:41.593 --> 21:43.302
దీన్ని బార్ దగ్గర ఓపెన్ చేసి కాస్త ఊపిరి తీసుకోనిస్తాను.

21:43.303 --> 21:44.470
- అలాగే.
- సరే.

21:44.471 --> 21:45.722
నువ్వు వచ్చినందుకు సంతోషం.

21:48.141 --> 21:49.810
కెప్టెన్ కర్క్ టాయిలెట్ కదా?

21:50.644 --> 21:52.687
ఇది చక్కని పరిణామం.

21:52.688 --> 21:55.481
ఇంక నువ్వు నా మాట వినాలి
అలాగే ఈ గొడవని పక్కన పెట్టాలి.

21:55.482 --> 21:56.691
నేను ఏదీ పక్కన పెట్టబోవడం లేదు.

21:56.692 --> 21:59.652
ఆ వెధవ నా భార్యని కాజేశాడు.
వాడు నా ఫ్రెండ్స్ ని కూడా కాజేయాలని చూస్తే ఊరుకోను.

21:59.653 --> 22:01.195
- అదీ, అలా ఉండాలి.
- దేవుడా.

22:01.196 --> 22:02.822
నువ్వు ఎంత తాగావు?

22:02.823 --> 22:04.365
సరే, చూద్దాం పద.

22:04.366 --> 22:07.451
మా ఇంటి మరమ్మత్తు పనుల బడ్జెట్ ఏడు అంకెలు దాటిపోతోంది,

22:07.452 --> 22:10.121
నా అత్తమామలు మాకు దగ్గరగా ఉండటం కోసం
అమెరికా వచ్చేస్తున్నారు,

22:10.122 --> 22:14.835
ఇంకా నా అతిపెద్ద, చాలా లాభదాయకమైన క్లయింట్
తన కెరీర్ ని తనే పాడు చేసుకున్నాడు,

22:15.377 --> 22:16.377
అతను బాకీలు చెల్లించడం లేదు.

22:16.378 --> 22:19.006
కాబట్టి, నేను బాగా తాగేసి ఉన్నాను.

22:21.175 --> 22:23.427
నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఎందుకు తాగలేదు?

22:24.428 --> 22:25.721
నువ్వు మంచి పాయింట్ మాట్లాడావు.

22:36.231 --> 22:37.566
ఇది ఏంటి?

22:38.192 --> 22:40.234
మీ జీవితం ప్రమాదంలో ఉంది.

22:40.235 --> 22:41.819
- అవును.
- అవునా?

22:41.820 --> 22:43.613
- అవును.
- అవును.

22:43.614 --> 22:44.781
కాబట్టి...

22:46.575 --> 22:48.701
- విరగ్గొట్టండి! గొంతు మీద కొట్టండి.
- సరే.

22:48.702 --> 22:51.329
- ఒకటి, రెండు లెక్క పెడతాను. అర్థమైందా?
- అర్థమైంది.

22:51.330 --> 22:53.372
- సరే.
- నువ్వు, ఇక్కడికి రా.

22:53.373 --> 22:54.999
- నేనా?
- అవును, ఇలా రా.

22:55.000 --> 22:58.920
మెల్! మెల్!

22:58.921 --> 23:00.714
నువ్వు చేయగలవు.

23:03.467 --> 23:04.842
చేయి! కానీ. తనకి ఊపిరాడనివ్వకు.

23:04.843 --> 23:05.928
సరే.

23:12.518 --> 23:14.061
ఓహ్, లేదు. నేను నవ్వడం లేదు. రండి.

23:14.978 --> 23:16.063
సరే.

23:16.772 --> 23:17.605
నువ్వు...

23:17.606 --> 23:19.690
- ఓహ్, సరే. సరే.
- విరగ్గొట్టు.

23:19.691 --> 23:21.567
కొట్టు. సారీ.

23:21.568 --> 23:23.361
- సరే.
- మోకాలు.

23:23.362 --> 23:24.695
తరువాత కొట్టాలి కదా?

23:24.696 --> 23:26.656
గట్టిగా! మళ్లీ చేయి!

23:26.657 --> 23:28.241
- సారీ. ఇది ఫర్వాలేదా?
- కానివ్వండి!

23:28.242 --> 23:30.618
నిజంగా జరిగినట్లు చేయండి!

23:30.619 --> 23:34.330
సరే. ఇప్పుడు, నీ విలువైన వస్తువుల్ని
ఆమె కాజేయాలని చూస్తోంది.

23:34.331 --> 23:35.791
నువ్వు ప్రేమించేవన్నీ!

23:36.375 --> 23:38.001
ఇప్పుడు, నువ్వు ఏం చేస్తావు?

23:43.507 --> 23:44.507
హంటర్!

23:44.508 --> 23:46.343
ఓయ్, హంటర్!

23:47.302 --> 23:49.221
- ఏంటి?
- ఇలా రా!

23:51.265 --> 23:52.849
హా. ఇతని పేరు హంటర్.

23:52.850 --> 23:53.975
ఇతను మన డ్రమ్స్ వాద్యగాడు.

23:53.976 --> 23:56.185
ఇతను ఒక పిచ్చోడు.

23:56.186 --> 23:59.189
- ఇతని మ్యూజిక్ మీరు వినాలి.
- నువ్వు ఏ కాలేజ్ లో చదువుతున్నావు?

24:00.065 --> 24:02.693
- ఏంటి?
- ఏ కాలేజీలో చదువుతున్నావు?

24:03.360 --> 24:04.778
మేఫీల్డ్. నువ్వు చదివే కాలేజీలోనే.

24:05.696 --> 24:07.947
నిజంగానా? సారీ.

24:07.948 --> 24:09.198
ఫర్వాలేదు.

24:09.199 --> 24:10.908
అయినా నేను మీకన్నా ఒక తరగతి తక్కువ.

24:10.909 --> 24:13.370
అయితే నీ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను.

24:14.913 --> 24:16.414
మష్రూమ్స్.

24:16.415 --> 24:17.624
నీకు కావాలా?

24:18.375 --> 24:19.751
వద్దు. ఫర్వాలేదు.

24:20.502 --> 24:22.421
అది నా డ్రమ్మింగ్ ని పాడు చేస్తుంది.

24:23.422 --> 24:25.591
లేదా అది నిన్ను ఇంకో స్థాయికి తీసుకువెళ్లచ్చు.

24:29.386 --> 24:30.637
వదిలేయ్. సరే.

24:36.643 --> 24:38.145
తిను. బాగుంటుంది.

24:38.937 --> 24:42.315
స్కాట్లాండ్ లో నేను ఈ వైన్ బాటిల్స్ ని ఎవరి నుంచి కొంటానో
అతడిని మీకు పరిచయం చేయాలి.

24:42.316 --> 24:44.859
అతను వాడేసిన షెర్రీ పీపాల్ని సంపాదించి
తన సొంత పీపాల్ని తయారు చేస్తాడు.

24:44.860 --> 24:46.903
అందువల్లే దీనికి ఈ తియ్యని రుచి
ఇంకా మహోగనీ వాసన వస్తాయి.

24:46.904 --> 24:48.237
ఆ మనిషి ఒక కళాకారుడు.

24:48.238 --> 24:49.864
ఆ షెర్రీ పీపాలే దీనికి ఇంత రుచిని అందిస్తాయి.

24:49.865 --> 24:52.326
ఇక్కడ ఈ ప్రదేశంలో, స్కాచ్ ఒక మతం మాదిరిగా ఉంటుంది.

24:53.243 --> 24:54.577
ఎవరైనా మనకి డ్రింక్ పోసిన ప్రతిసారీ,

24:54.578 --> 24:56.913
స్కాచ్ గురించి వాళ్లు ఒక ఉపన్యాసం ఇస్తుంటారు.

24:56.914 --> 24:58.623
అప్పుడు ఇంకొకరు అనివార్యంగా రంగంలోకి దిగి

24:58.624 --> 25:01.375
ఒకప్పుడు వాళ్లు తాగిన గొప్ప బాటిల్స్ గురించి చెప్పి
అవి ఇప్పుడు దొరకడం లేదంటారు

25:01.376 --> 25:02.920
ఇంకా ఏదో, ఏదో, ఏదో చెబుతారు.

25:03.754 --> 25:07.508
ఇంక అది భరించలేమని ఏదో ఒక దశలో
అందరూ గ్రహిస్తారు అనుకుంటా.

25:08.133 --> 25:10.593
ఈ ఇళ్లు, ఈ పెళ్లాలు, ఈ ఉద్యోగాలు.

25:10.594 --> 25:12.720
వాళ్ల జీవితాల మొత్తం సారం అదే.

25:12.721 --> 25:14.764
వాళ్ల భవిష్యత్తు రాతలు ఇప్పటికే ఖరారు అయిపోయాయి.

25:14.765 --> 25:17.266
కాబట్టి వాళ్ల డొల్లతనాన్ని దూరం చేసుకునే ప్రక్రియ
ఇప్పటికే మొదలయింది.

25:17.267 --> 25:21.771
స్కాచ్, సిగార్లు, వేయించిన మాంసాలు,
ప్రత్యేకమైన గోల్ఫ్ క్లబ్ లు, ఖరీదైన ఎస్కార్టులు.

25:21.772 --> 25:25.733
ఈ సంపన్న, మధ్యవయస్కులైన మగవారి
మౌన నిస్పృహని సొమ్ము చేసుకోవడానికి

25:25.734 --> 25:27.986
ఒక పెద్ద వ్యాపారమే అభివృద్ధి చెందింది.

25:37.621 --> 25:38.914
కూప్.

25:39.790 --> 25:42.167
నువ్వు బెయిలీ రసెల్ సంస్థ నుండి
బయటకి వచ్చేశావని విన్నాను నిజమేనా?

25:44.586 --> 25:48.840
అవును. దుబాయ్ లో ఒక సంస్థతో కలిసి
నేను సొంతంగా ఒక సంస్థని నెలకొల్పుతున్నాను.

25:48.841 --> 25:50.049
అది పెద్ద పరిణామం.

25:50.050 --> 25:51.133
కంగ్రాట్స్, కూప్.

25:51.134 --> 25:52.760
హా. థాంక్స్.

25:52.761 --> 25:53.970
నీ పెట్టుబడి ఉంటుందా?

25:53.971 --> 25:55.805
నేను ఈ మధ్య తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నాను.

25:55.806 --> 25:58.975
- మనం మాట్లాడుకోవాలి.
- అలాగే, మేము ఇంకా పత్రాలు రాసుకుంటున్నాం.

25:58.976 --> 26:00.518
బెయిలీలో నా పెట్టుబడుల సంగతి ఏంటి?

26:00.519 --> 26:01.894
నేను బయటకి వచ్చేయాలా?

26:01.895 --> 26:03.939
- నేను అదే చెబుతాను.
- లేదు.

26:04.565 --> 26:05.607
వద్దు.

26:14.408 --> 26:15.659
పాడదాం రండి!

26:22.291 --> 26:26.794
నన్ను నువ్వు ఎలా కదిలిస్తావో నీకు తెలియదు

26:26.795 --> 26:30.590
నన్ను విచ్ఛిన్నం చేసి స్వాహా చేస్తావు

26:30.591 --> 26:33.634
నేను పూర్తిగా నీ వశం అయిపోయాను

26:33.635 --> 26:35.720
నా అదృష్టాన్ని కోల్పోయాను

26:35.721 --> 26:37.847
నేను నీ అభిమానిని అయ్యాను

26:37.848 --> 26:41.392
కానీ నీ కళ్లలో ఏదో ఉంది

26:41.393 --> 26:44.604
అది నాలో ఆశని ఇంకా సజీవంగా నిలుపుతోంది

26:44.605 --> 26:46.522
కానీ నాకు నా మీదే విసుగుపుడుతోంది

26:46.523 --> 26:48.649
నేను నిన్ను చూసినప్పుడు

26:48.650 --> 26:52.945
ఏదో చాలా అందమైనది ఇంకా నిజమైనది

26:52.946 --> 26:56.866
వికృతంగా అబద్ధంగా ఉండే ఈ ప్రపంచంలో

26:56.867 --> 27:00.411
ప్రయత్నించడం కూడా చాలా కష్టమైపోతుంది

27:00.412 --> 27:02.581
కానీ నేను ఆలోచించడం మొదలుపెట్టాను...

27:35.989 --> 27:38.200
హంటర్, ఏం అయింది, బాబూ?

28:20.200 --> 28:21.951
- కొట్టు. ఇంకా గట్టిగా.
- నేనా?

28:21.952 --> 28:23.035
అవును, ఇంకా గట్టిగా!

28:23.036 --> 28:24.704
నువ్వే.

28:24.705 --> 28:26.372
అది ఏంటి? అలా కాదు. అది రేప్.

28:26.373 --> 28:28.833
నిన్ను రేప్ చేశారు! ఇది నవ్వే విషయం కాదు.

28:28.834 --> 28:30.960
నువ్వు. నిన్ను చంపేశారు. నువ్వు చనిపోయావు.

28:30.961 --> 28:32.295
నువ్వు చనిపోయావు!

28:32.296 --> 28:34.131
ఇంకాస్త ముందుకు. కానివ్వు!

28:35.132 --> 28:38.217
అది చెత్త. నువ్వు ఒక బాధితురాలిగా కొట్టాలి.

28:38.218 --> 28:40.469
నువ్వు చేసేది అంతేనా? నువ్వు బాధితురాలివి కదా?

28:40.470 --> 28:42.263
- కాదు.
- కాదా? ఎందుకు నవ్వుతున్నావు?

28:42.264 --> 28:45.309
చేయి! కొట్టు! కానివ్వు!

28:46.643 --> 28:49.563
బాగుంది. అదీ!

28:50.272 --> 28:52.983
అదీ!

28:54.526 --> 28:56.403
అదీ.

29:03.619 --> 29:10.250
నా బాధని సున్నితంగా స్పృశిస్తాను
నా లోలోపలే దాచుకుంటాను

29:10.751 --> 29:17.216
వాటి అన్నింటినీ నేను స్వీకరించగలను
కానీ నాకు కొంత సమయం కావాలి

29:17.799 --> 29:24.306
గడ్డి ఆకుపచ్చగా పెరిగితే
అవతలి వైపు

29:24.806 --> 29:31.771
నువ్వు కోరుకుంటే, నేను ఎదురుచూస్తాను
కానీ నాకు కొంత సమయం కావాలి

29:31.772 --> 29:38.320
నాకు మరో రెండు రోజులు గడువు ఇవ్వు
నిన్ను ప్రేమిస్తాను

29:41.281 --> 29:42.699
హేయ్.

29:43.575 --> 29:44.742
నువ్వు చాలా బాగా పాడావు.

29:44.743 --> 29:45.993
థాంక్స్.

29:45.994 --> 29:47.245
నీ కోసం ఒక డ్రింక్ తీసుకోనా?

29:47.246 --> 29:48.997
నేను ఇక్కడ డ్రింక్ ఉచితం.

29:49.665 --> 29:51.082
అది మా మధ్య ఒప్పందంలో ఒక భాగం.

29:51.083 --> 29:55.420
సరే. అయితే, నా డ్రింక్ నేనే కొనుక్కుంటాను
కానీ నాకు తోడు ఉంటావా?

29:56.505 --> 29:57.714
అన్నట్లు, నా పేరు టామ్.

29:58.799 --> 30:00.174
నువ్వు చూడటానికి మంచి కుర్రవాడిలా ఉన్నావు, టామ్,

30:00.175 --> 30:03.970
పైగా నీ భుజాలు గొప్పగా ఉన్నాయి,
కానీ నీతో నిజాయితీగా ఒక మాట చెప్పాలి.

30:03.971 --> 30:05.930
- నా గురించి ప్రయత్నించడం వృథా.
- అది మంచి విషయం.

30:05.931 --> 30:07.974
బయటపడే మార్గాలన్నీ నాకు తెలుసు.

30:07.975 --> 30:10.059
హంటర్

30:10.060 --> 30:11.436
ఒక్క క్షణం ఉండు.

30:12.729 --> 30:14.898
హేయ్, బుజ్జీ. ఏంటి సంగతి? ఎలా ఉన్నావు...

30:16.525 --> 30:18.318
ఆగు. లేదు. ఆగు. నిదానించు.

30:19.027 --> 30:20.236
నిదానించు.

30:20.237 --> 30:21.321
ఎక్కడ ఉన్నావు?

30:31.206 --> 30:33.500
హేయ్, బాబు. హంటర్ ఎక్కడ ఉన్నాడో తెలుసా?

30:34.293 --> 30:35.294
ఎవరు?

30:37.671 --> 30:39.298
డ్రగ్స్ తీసుకోకు.

30:42.676 --> 30:44.761
ఇలా చూడు, బాబు. నేను మూత్రం పోసుకోవాలి. ఏం అయింది?

30:50.851 --> 30:52.769
హంటర్! నేను, ఆలీ.

31:11.747 --> 31:12.955
హేయ్, బాబు.

31:12.956 --> 31:14.791
ఇంకొకరు రావడానికి సరిపడా చోటు ఉందా?

31:29.932 --> 31:31.391
ఇది ఖరీదైనదిలా ఉంది.

31:33.727 --> 31:35.103
అయితే నువ్వు ఏం మత్తుపదార్థాలు తీసుకున్నావు?

31:35.604 --> 31:37.064
ఒక స్టెమ్ ఇంకా క్యాప్సూల్.

31:37.981 --> 31:39.273
వావ్.

31:39.274 --> 31:40.692
నీకు ఇంకా తల తిరుగుతోందా?

31:41.818 --> 31:44.363
పరిస్థితి బట్టి. మనం బాత్ టబ్ లో కూర్చుని ఉన్నామా?

31:51.203 --> 31:54.331
నన్ను ఎవరూ పట్టించుకోరు, తెలుసా.

31:55.582 --> 31:56.833
అది ఎందుకో నాకు తెలియదు.

31:56.834 --> 31:59.001
నేను అలా ఉంటానేమో.

31:59.002 --> 32:00.963
నేను దానికి అలవాటుపడిపోయాను.

32:01.797 --> 32:05.884
కానీ ఈ రోజు, ఈ బ్యాండ్ తో, నన్ను అందరూ చూశారు.

32:07.219 --> 32:08.762
అది నాకు మంచిగా అనిపించింది.

32:11.306 --> 32:13.517
కానీ నేను దాన్ని చెడగొట్టేశాను.

32:14.393 --> 32:15.227
నాకు అర్థమైంది.

32:16.061 --> 32:17.271
నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాను.

32:19.314 --> 32:21.024
నేను ఇంకా ఆ స్థితిలోనే ఉన్నాను.

32:22.276 --> 32:23.652
నిజానికి నేను అక్కడే ఉండిపోయాను.

32:24.862 --> 32:26.655
ఆ విషయంలో మన ఇద్దరిదీ ఒకేలాంటి పరిస్థితి.

32:27.364 --> 32:29.907
మనం బయట ప్రపంచానికి కనిపించాలంటే భయపడతాము,
కానీ అలా కనిపించకూడదని మనకి ఉండదు.

32:29.908 --> 32:31.493
లేదా ఆ అవసరం లేదు అనుకోము.

32:32.286 --> 32:34.203
బహుశా అందుకే మనం మ్యుజీషియన్లు అయి ఉంటాము.

32:34.204 --> 32:36.539
- మనం కనిపించడానికి అదొక అవకాశం.
- ఓయ్, నేను మూత్రం పోయాలి.

32:36.540 --> 32:38.708
నరికేస్తాను వెధవా!

32:38.709 --> 32:41.043
- బయటకి పో!
- ఇలా చూడు.

32:41.044 --> 32:42.796
త్వరగా తీయి!

32:44.464 --> 32:46.716
ఏది ఏమైనా, ప్రస్తుతం ఈ విషయంలో,

32:46.717 --> 32:48.342
నువ్వు దేని గురించీ ఆందోళన పడే అవసరం లేదనుకుంటా

32:48.343 --> 32:50.887
ఎందుకంటే అక్కడ ఏం జరిగినా

32:50.888 --> 32:54.140
ఆ పిల్లలు విపరీతమైన మైకంలో ఉన్నారు,
కాబట్టి రేపు వాళ్లకి ఏమీ గుర్తుండదు.

32:54.141 --> 32:56.185
- అంతే అంటావా?
- అవును.

32:57.811 --> 32:59.062
నువ్వు ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నావా?

33:00.230 --> 33:02.191
- అవును.
- సరే.

33:04.234 --> 33:07.403
సరే, ముందుగా నువ్వే లేవాలి,

33:07.404 --> 33:10.157
ఎందుకంటే దీని లోపల నుంచి బయటకి రావాలంటే
నాకు నీ సాయం కావాలి.

33:17.831 --> 33:20.917
ఇంత అందంగా ఉండే పనిమనిషిని
నేను ఎప్పటికీ నియమించను.

33:20.918 --> 33:23.920
నా ఉద్దేశం, నిక్ ఆమెతో శృంగారం చేస్తుంటాడేమో.

33:23.921 --> 33:26.380
- నేనయితే చేస్తాను.
- అవును, నువ్వు చేస్తావని నాకు తెలుసు.

33:26.381 --> 33:27.966
ఆమె చేస్తుందా?

33:28.634 --> 33:29.550
ఒప్పుకుంటాను.

33:29.551 --> 33:31.093
అది చాలా చక్కని ఆభరణం.

33:31.094 --> 33:32.387
కావాలంటే చూడు.

33:34.765 --> 33:35.766
ఇదిగో తీసుకో.

33:37.351 --> 33:38.477
దీనిని చూడు, బాబు.

33:39.436 --> 33:41.562
నువ్వు పట్టుకోవచ్చు.
కానీ దీన్ని నీ వేలుకి మాత్రం పెట్టుకోకు.

33:41.563 --> 33:42.855
ఎందుకని?

33:42.856 --> 33:45.442
ఎందుకంటే నువ్వు ఇప్పుడు
ఆ గొప్ప చాంపియన్షిప్ గెలవలేదు, కదా, పీటర్?

33:58.455 --> 34:00.414
బాబోయ్, పాల్.

34:00.415 --> 34:02.417
- ఈమె భలే ఉంది.
- ఘోరంగా లేదు కదా, హా?

34:03.043 --> 34:05.461
ఓహ్, అవును. చాలా చక్కగా ఉంది.

34:05.462 --> 34:07.880
నీ రెస్టారెంట్లు ఒకదానిలో ఈమె వెయిట్రెస్ కదా?

34:07.881 --> 34:10.633
పని చేసే చోట ఇలాంటి సౌకర్యాలు ఉండటం ఎప్పుడూ మంచిదే.

34:10.634 --> 34:11.926
నీ సంగతి ఏంటి, డోమ్?

34:11.927 --> 34:13.553
అందరూ పడుచు వయసు వెయిట్రెస్ లేనా, హా?

34:13.554 --> 34:15.137
మొదటగా ఎంచుకునే అవకాశం చెఫ్ కే ఉంటుంది కదా.

34:15.138 --> 34:16.638
చెప్పు.

34:16.639 --> 34:18.559
- వాళ్ల కోసం పెళ్లి చెడగొట్టుకోలేను.
- లేదా?

34:19.184 --> 34:20.853
క్యాట్, నేను చాలా అన్యోయంగా ఉన్నాం.

34:24.857 --> 34:26.692
నేను ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలి.

34:27.317 --> 34:30.151
హేయ్, అన్నట్లు, శామ్ తో నీ సంబంధం ఎలా ఉంది?

34:30.152 --> 34:32.655
మీరు చట్టపరమైన విడాకుల ప్రక్రియని వద్దనుకుంటున్నారా?

34:32.656 --> 34:34.490
ఆ అవకాశం లేదు.

34:34.491 --> 34:37.827
తనకి చాలా ద్వేషం, అసూయ ఇంకా లోభత్వం బాగా ఉన్నాయి.

34:37.828 --> 34:39.495
ఆ చెత్తది నన్ను నాశనం చేయాలని చూస్తోంది.

34:39.496 --> 34:40.663
ఆమెకి ఉదారమైన ప్రతిపాదన చేశాను,

34:40.664 --> 34:44.917
కానీ ఆమె చెత్త లాయర్లు తనకి ఇంకా
ఎక్కువ మొత్తం వస్తుందని తనని ఒప్పించారు.

34:44.918 --> 34:46.878
మీకు ఒక విషయం చెప్పనా, తనకి అది దక్కదు.

34:46.879 --> 34:48.797
దేవుడా, పాల్. కాసేపు దాని గురించి మాట్లాడటం ఆపు.

34:49.505 --> 34:50.506
నీ సమస్య ఏంటి, కూప్?

34:50.507 --> 34:52.884
ఆమె నీ బిడ్డలకి తల్లి.
ఆమె గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు?

34:52.885 --> 34:54.135
మేము తేడాగా ఉంటాం అనుకుంటా.

34:54.136 --> 34:55.887
నిక్ అక్కడ నీ బిడ్డల తల్లితో శృంగారం చేస్తున్నాడు,

34:55.888 --> 34:57.847
కానీ అతని కోసం నువ్వు ఖరీదైన వైన్ బాటిల్ తీసుకొచ్చావు.

34:57.848 --> 34:59.724
- పాల్, కాస్త స్వరం తగ్గించి మాట్లాడు.
- సభ్యతగా మాట్లాడు.

34:59.725 --> 35:02.685
ఆ చెత్త వేశ్య నా ఆస్తినంతా గుంజాలని చూస్తోంది.

35:02.686 --> 35:05.938
కానీ, అయ్యో, పాల్. నాకు తెలియదు. శామ్ గనుక

35:05.939 --> 35:07.899
నీ చిన్న, చిట్టి పురుషాంగంతో
నిన్ను శృంగారం చేయనిచ్చిందంటే,

35:07.900 --> 35:09.693
- బహుశా తనకి నీ ఆస్తిని పొందే అర్హత ఉందేమో.
- చెత్తవెధవ!

35:10.485 --> 35:11.528
వెధవ!

35:13.363 --> 35:15.865
నిన్ను చంపేస్తాను. తప్పకుండా చంపేస్తాను.

35:15.866 --> 35:17.033
నువ్వు...

35:17.034 --> 35:18.451
- ఇంక ఆపండి!
- నిన్ను చంపేస్తాను.

35:18.452 --> 35:20.287
ఓయ్, శాంతించండి.

35:21.413 --> 35:22.955
సరే.

35:22.956 --> 35:25.416
సరే, అందరూ వినండి, ఇప్పుడు ఇదీ పార్టీ.

35:25.417 --> 35:27.126
ఒక విషయం తెలుసా?

35:27.127 --> 35:29.670
నాతో బాస్కెట్ బాల్ ఆడి గెలిస్తే
ఎవరికైనా సరే వెయ్యి డాలర్లు ఇస్తా.

35:29.671 --> 35:32.215
- అదీ.
- అవును. ఆ అదృష్టం ఎవరికి ఉంది?

35:32.216 --> 35:33.424
నాకు ఉంది!

35:33.425 --> 35:35.594
అదీ. కిందకి వెళదాం రండి.

35:37.638 --> 35:39.431
షెవలియెర్ మోన్రాషే 2013

36:27.521 --> 36:28.981
గోల్ చేయి, బాబు. గోల్ చేయి.

36:32.442 --> 36:34.902
ప్రవేశం లేదు. బంతికి ప్రవేశం లేదు.

36:34.903 --> 36:36.946
ఈ రోజు కాదులే, చెత్తవెధవ.

36:36.947 --> 36:39.156
- నేను అదే చెబుతున్నాను.
- ఎప్పటికీ గెలవలేవు. నా ఇంట్లో నన్ను గెలవలేవు.

36:39.157 --> 36:41.450
సరే. తరువాత ఎవరు? ఎవరైనా వస్తారా?

36:41.451 --> 36:44.495
జెరీ. జెరీ. జెరీ!

36:44.496 --> 36:47.416
జెరీ? సరే. ఇంక చాలు ఆపండి.

36:48.083 --> 36:49.292
జెరీ, నువ్వు డివిజన్ వన్ ఆడావు, అవునా?

36:49.293 --> 36:50.586
- అవును ఆడాను.
- సరే.

36:51.086 --> 36:52.795
- నీ అత్యుత్తమ ఆటని ఆడతావని ఆశిస్తాను.
- అలాగే.

36:52.796 --> 36:54.380
జెరీ మీద వంద డాలర్ల పందెం. పదికి ఒకటి.

36:54.381 --> 36:56.174
- ఎవరు పందెం కాస్తారు?
- నేను పందెం కాస్తాను.

36:56.175 --> 36:58.092
ఓహ్, బాబు.

36:58.093 --> 37:00.052
- అదరగొట్టు, జెరీ.
- ఇంక మొదలుపెడదాం.

37:00.053 --> 37:01.637
- ఓహ్, దేవుడా!
- బాగా ఆడు.

37:01.638 --> 37:03.264
ఇక్కడ నన్ను దాటేద్దామని చూస్తున్నావా?

37:03.265 --> 37:05.725
నీ ప్లాన్ అదేనా?
ఇది వై.ఎమ్.సి.ఎ.లో ఆటగాళ్ల ఎంపిక పోటీ అనుకున్నావా?

37:05.726 --> 37:07.935
నాతో తలపడండి. పిల్ల ఆటగాళ్లు.

37:07.936 --> 37:09.353
ఆడు, నిక్.

37:09.354 --> 37:12.023
నాతో తలపడండి. పిల్ల ఆటగాళ్లు.

37:12.024 --> 37:14.025
నీ సత్తా చూపించు.

37:14.026 --> 37:17.361
అది నాకు ఇవ్వు, జెరీ.
అదీ, నేను డిఫెన్స్ కూడా ఆడగలను.

37:17.362 --> 37:20.823
- ఈ జనానికి కావాల్సింది ఇదే.
- జెరీ! ఆడు, జెరీ!

37:20.824 --> 37:22.408
జనానికి ఇదే కదా కావాలి.

37:22.409 --> 37:23.869
జెరీ!

37:25.871 --> 37:29.790
- ఓహ్, ఛ. ఓహ్, అయ్యో. డామిట్.
- ఓహ్, లేదు.

37:29.791 --> 37:32.001
- ఓహ్, ఛ.
- సారీ, జెరీ.

37:32.002 --> 37:33.294
ఆగు. నన్ను ఒకసారి చూడనివ్వు.

37:33.295 --> 37:34.629
ఏంటి ఇది?

37:34.630 --> 37:36.506
ఎముక విరిగింది.

37:36.507 --> 37:38.382
హేయ్, 911 కి ఫోన్ చేయండి.

37:38.383 --> 37:40.259
- ఇది దారుణం.
- నీకు త్వరగానే నయం అవుతుంది, బాబు.

37:40.260 --> 37:41.969
- చెత్త!
- ఛ, సారీ, జెరీ.

37:41.970 --> 37:43.304
- డామిట్.
- మరేం ఫర్వాలేదు.

37:43.305 --> 37:45.307
- నాకు ఇలాంటివి చూడాలంటే అసహ్యం.
- దాన్ని ముట్టుకోకు.

38:00.989 --> 38:02.990
పాల్ తనకన్నా సగం వయసు అమ్మాయితో
సెక్స్ చేసినా భరించగలను.

38:02.991 --> 38:06.203
నా ఉద్దేశం, అది చెత్త ఇంకా ఘోరం ఇంకా దారుణం,

38:06.995 --> 38:09.914
కానీ ఆ యువతి అతడిని చూసి ఆకర్షితురాలైనట్లు నటిస్తుంటే

38:09.915 --> 38:11.374
అది తెలుసుకోలేనంత నార్సిస్ట్ దద్దమ్మ అతను.

38:11.375 --> 38:14.627
కానీ ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు.

38:14.628 --> 38:16.879
నా ఉద్దేశం, అది నాకు బాగా కోపం తెప్పిస్తుంది.

38:16.880 --> 38:18.965
అతను నాకు సుఖవ్యాధులు అంటించకపోవడం
నిజంగా నా అదృష్టం.

38:18.966 --> 38:20.634
ఆ వెయిట్రెస్ కి హెర్పిస్ సుఖవ్యాధి ఉందా?

38:21.176 --> 38:22.593
లేదు. నాకు తెలియదు.

38:22.594 --> 38:24.178
నేను ఊరికే అంటున్నాను, ఊహాత్మకంగా.

38:24.179 --> 38:25.680
సుఖవ్యాధి గురించి థియరీలు.

38:25.681 --> 38:29.476
ఈ అమ్మాయి కేవలం బ్యాండ్ ఎయిడ్ లాంటిదని
ప్రతి ఒక్కరికీ తెలుసు.

38:29.977 --> 38:33.354
నా ఉద్దేశం, ఏదో ఒక రోజు అతను నిద్రలేచి
అద్దంలో మొహం చూసుకునేసరికి

38:33.355 --> 38:37.818
అతను ఎంత మంది జీవితాల్ని నాశనం చేశాడో,
అతను గ్రహిస్తాడు, అది అతడిని పీడిస్తుంది.

38:39.444 --> 38:43.197
పైగా నన్ను మోసం చేసిన తరువాత కూడా,
అది ఎన్నిసార్లో దేవుడికి తెలుసు,

38:43.198 --> 38:46.785
ఆ నేరం నేను చేసినట్లుగా అతను కేసు వేస్తున్నాడు.
నా ఉద్దేశం...

38:49.663 --> 38:51.540
కూప్ తో నేను తేలికగా విడాకులు తీసుకున్నా అనిపిస్తుంది.

38:52.207 --> 38:54.250
అంటే, అవును. మా కేసు మీలాగ కాదు.

38:54.251 --> 38:56.628
నా ఉద్దేశం, మా కేసుని పోల్చి చూస్తే
మీ కేసులో నీది పాల్ పాత్ర, కదా?

38:57.504 --> 38:58.838
- ఏంటి?
- లేదు, సారీ.

38:58.839 --> 39:01.007
నువ్వు పాల్ మాదిరిగా ఉంటావని
నేను చెప్పాలని ప్రయత్నించడం లేదు.

39:01.008 --> 39:03.593
మీ ఇద్దరిలో ఎఫైర్ ఉన్నది నీకే అన్నదే నా ఉద్దేశం.

39:03.594 --> 39:05.344
అంటే, నిన్ను తప్పు పడుతున్నాను అనుకోకు.

39:05.345 --> 39:06.638
అంటే, అది కానేకాదు.

39:07.639 --> 39:09.682
- నేను ఇంక మాట్లాడటం ఆపేస్తాను.
- ఓహ్, దేవుడా. నేను పాల్ ని.

39:09.683 --> 39:11.559
- లేదు, నువ్వు పాల్ వి కాదు.
- లేదు. నువ్వు నిజమే చెప్పావు.

39:11.560 --> 39:14.104
- నా ఉద్దేశం అది కాదు.
- మోసం చేసింది నేనే కదా.

39:16.523 --> 39:20.277
కానీ అది చాలా ఏళ్లు... చాలా ఏళ్ల తరువాత...

39:21.403 --> 39:26.909
మా అనుబంధం మీద కూప్ దృష్టి పెట్టడం కోసం
నేను ప్రయత్నించి విఫలమయ్యాక చేశాను.

39:29.244 --> 39:30.287
నన్ను పట్టించుకోవాలని.

39:35.083 --> 39:39.670
కానీ నేను ఎంత ప్రయత్నించినా,
మా మధ్య అగాధం ఇంకా ఇంకా పెరిగింది

39:39.671 --> 39:42.758
ఇంకా, ఒకానొక దశలో,
నేను ఇంక ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసింది.

39:43.425 --> 39:45.719
కాబట్టి అతని బెస్ట్ ఫ్రెండ్ తో నువ్వు శృంగారం చేశావు.

39:46.929 --> 39:48.263
- సారీ.
- వావ్.

39:48.805 --> 39:50.181
- సారీ. ఇది ఆ మత్తుపదార్థాల ప్రభావం.
- శామ్.

39:50.182 --> 39:51.265
అది మత్తుపదార్థాల ప్రభావం.

39:51.266 --> 39:54.310
ఇందాక నేను నిన్ను బాగా కొట్టినందుకు
నువ్వు ద్వేషం పెంచుకోలేదుగా?

39:54.311 --> 39:57.438
ఏంటి? ఓహ్, దేవుడా. అక్కడ జరిగినదానికి
నేను కోపంతో ఉన్నాను అనుకోవడం ముచ్చటగా ఉంది.

39:57.439 --> 39:59.357
- అది నిజంగా భ్రమ.
- వాళ్లు గనుక నన్ను ఆపకపోయి ఉంటే,

39:59.358 --> 40:01.859
- నేను నిన్ను గోడకేసి తోసేసేదానిని.
- నువ్వు చాలా క్రేజీ మనిషివి.

40:01.860 --> 40:03.694
నేను నీ గట్టి, చిన్న ఐవీ లీగ్ పిరుదుల్ని

40:03.695 --> 40:05.571
- చాలా వేగంగా తన్నేదాన్ని...
- ఇది చూడు.

40:05.572 --> 40:07.031
- నాతో పరాచికాలా? ఏంటి?
- నా కండలు చూడు.

40:07.032 --> 40:09.116
- ఏం చూడాలి? ఏం కండలు?
- నా కండలు చూడు, చెత్తదానా.

40:09.117 --> 40:11.786
- అది... అక్కడ ఏమీ లేవు.
- ఇక్కడ చూడు. ఇది చూడు.

40:11.787 --> 40:14.247
- దీన్ని చూడు. నొక్కి చూడు. నొక్కి చూడు.
- సరే. ఆగు. నన్ను నొక్కి చూడనివ్వు.

40:14.248 --> 40:16.374
ఇంతేనా? నన్ను ఇలా చేయమంటావా?

40:16.375 --> 40:19.961
- ఓహ్, దేవుడా. హేయ్.
- అదీ. సరే, మెల్.

40:19.962 --> 40:22.965
- నువ్వు ఏం చేస్తున్నావు?
- అదీ, భరించు.

40:23.549 --> 40:25.342
నువ్వు కాసేపు...

40:31.682 --> 40:33.140
లేదు.

40:33.141 --> 40:34.350
ఇంక చాలు.

40:34.351 --> 40:37.980
- విరమించుకుంటున్నా. దేవుడా.
- విరమించుకోవడం అంటే ఇలా కాదు.

40:40.607 --> 40:42.359
ఓహ్, దేవుడా.

40:54.121 --> 40:55.581
నేను అదృశ్యం అయిపోతూ వచ్చాను.

40:56.456 --> 41:00.878
అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండే బదులు
క్రమంగా చిన్న భాగాన్ని అయిపోయాను.

41:02.171 --> 41:06.258
అతని మనసులో కొంత మాత్రమే చోటు ఉందని,
కానీ నేను చాలా ఎక్కువ ఆశిస్తున్నానని అనిపించేది.

41:08.594 --> 41:12.264
కూప్ మనసులో అంత చోటు ఉందని నేను అనుకోను.

41:15.559 --> 41:18.270
బహుశా అతనికి గతంలో ఉండేదేమో,
కానీ ఇప్పుడు ఇంక లేదు.

41:20.480 --> 41:22.106
నీలో చాలా కోపం పేరుకుపోయి ఉంది.

41:22.107 --> 41:24.067
నువ్వు నిజంగానే త్వరగా సెక్స్ లో పాల్గొనాలి.

41:25.986 --> 41:28.322
అవును. నాకు తెలుసు.

41:30.574 --> 41:31.909
సరే. నేను ఇంక వెళ్లాలి.

41:35.162 --> 41:36.330
అవును. నేను కూడా వెళ్లాలి.

41:43.504 --> 41:45.463
ఆ డబ్బు సంచీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నావా?

41:45.464 --> 41:46.882
లేదు.

41:50.594 --> 41:53.639
చాలా కాలంపాటు చాలా దగ్గరగా చూసినది...

41:55.474 --> 41:59.394
కానీ చాలా కాలం కిందట నుంచి దాన్ని చూడటం లేదని
హఠాత్తుగా గమనించడం గురించి ఎప్పుడైనా ఆలోచించావా?

42:00.312 --> 42:02.064
మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం?

42:03.774 --> 42:04.816
నా జీవితం.

42:09.821 --> 42:10.822
ఓహ్, చెత్త.

42:15.160 --> 42:16.495
అయ్యో, బార్నీ.

42:19.831 --> 42:21.666
చాలా సారీ.

42:21.667 --> 42:22.917
ఆ టాయిలెట్ ఒక నమూనా.

42:22.918 --> 42:24.711
చాలా సారీ...

42:27.130 --> 42:29.091
మీరు మెటాఫర్ల కోసం వెతుకుతుంటే గనుక...

42:30.384 --> 42:33.970
ఒక మనిషి ముప్పై వేల డాలర్ల టాయిలెట్ లో
వాంతులు చేసుకోవడాన్ని మించి ఇంకేదీ చూడకండి

42:33.971 --> 42:35.514
పైగా ఆ టాయిలెట్ కి ఇంకా ఎలాంటి గొట్టాలూ బిగించలేదు.

42:38.976 --> 42:41.686
అయినా, ఒకసారి మనకి ఒక అభిప్రాయం ఏర్పడిన తరువాత,

42:41.687 --> 42:44.439
ఈ ఊరిలో ప్రతీదీ ఒక మెటాఫర్ లా అనిపిస్తుంది,

42:45.440 --> 42:49.778
అందువల్ల ఏది నిజమో పోల్చుకోవడం
నిజంగా చాలా కష్టం అయిపోతుంది.

43:17.222 --> 43:18.473
ఈ రోజు నీకు బాగుండాలి.

43:22.644 --> 43:23.812
హేయ్, హంటర్.

43:50.422 --> 43:51.714
హేయ్, నువ్వే.

43:51.715 --> 43:52.840
హేయ్.

43:52.841 --> 43:54.008
నీ ఇంటి దగ్గర ఆగాను.

43:54.009 --> 43:56.260
ఆలీని కలిశాను. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది.

43:56.261 --> 43:58.012
తను ఇప్పుడు నీతో పాటు ఉంటోందా?

43:58.013 --> 43:59.514
అవును. తను కొన్ని సమస్యల్లో ఉంది.

43:59.515 --> 44:01.307
తను ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు.

44:01.308 --> 44:03.017
అది చాలా పెద్ద భారం.

44:03.018 --> 44:04.770
అవును, తనకంటూ ఉన్నది నేను ఒక్కడినే.

44:06.188 --> 44:08.732
తనకి నేను కూడా ఉన్నాను, కూప్.
అది నీకు తెలుసు అనుకుంటా.

44:12.069 --> 44:14.237
నువ్వు బెయిలీ ఉద్యోగంలో లేవని నిక్ చెప్పాడు నిజమేనా?

44:14.238 --> 44:17.658
అవును. నేను యు.ఎ.ఇ. సంస్థ
పెట్టుబడితో కొత్త సంస్థ ప్రారంభిస్తున్నాను.

44:18.367 --> 44:19.742
బాధ్యత తక్కువ, లాభం ఎక్కువ.

44:19.743 --> 44:20.826
అంత తేలికా?

44:20.827 --> 44:22.745
మార్పు కోరే సమయం ఇది.

44:22.746 --> 44:24.121
నువ్వు బెయిలీ సంస్థలో చాలాకాలం పని చేశావు.

44:24.122 --> 44:26.165
అవును, కానీ, నువ్వు కూడా నాతో పాటు
చాలా కాలం ఉన్నావు, కాదంటావా?

44:26.166 --> 44:27.792
సరే, కూప్.

44:27.793 --> 44:29.210
కంగారుపడకు. నీ రావాల్సిన బాకీలు వస్తాయిలే.

44:29.211 --> 44:30.503
ఓహ్, ఇంక ఆపు.

44:30.504 --> 44:32.421
నా నుంచి ఏం ఆశిస్తున్నావు, హా?

44:32.422 --> 44:34.049
ఏంటి? నాకు చెప్పు.

44:34.675 --> 44:36.259
ఈ క్షణం నుంచి నీతో మాట్లాడటం ఇంక అసాధ్యం అనిపిస్తోంది.

44:36.260 --> 44:38.804
అయినా కూడా, నువ్వు ఇక్కడికి వచ్చావు,
ఇంకా నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావు.

44:40.973 --> 44:43.725
టోరీకి ప్రొఫెషనల్ కోచ్ ని నియమించాలని
నేను ఆలోచిస్తున్నాను.

44:44.351 --> 44:46.894
అందుకు వారానికి వెయ్యి డాలర్లు ఖర్చు అవుతుంది.
అది నీతో చర్చిద్దామని వచ్చాను.

44:46.895 --> 44:49.689
నేనే తన కోచ్ ని, ఇంకా
ఇక్కడ తను ఎడీతో ఆడి నేర్చుకుంటుంది.

44:49.690 --> 44:50.815
- తను బాగా ఆడుతుంది.
- తెలుసు.

44:50.816 --> 44:52.942
- ఒక ప్రొఫెషనల్ గురించి మాట్లాడుతున్నాను.
- నిక్ ఫ్రెండ్స్ లో ఒకరా, హా?

44:52.943 --> 44:55.736
ఇది నిక్ గురించి కాదు.
ఇది టోరీకి ఏది మంచిదో అది చేయడం గురించి.

44:55.737 --> 44:57.238
వచ్చే కొద్ది నెలలు చాలా కీలకమైనవి,

44:57.239 --> 44:59.532
ప్రిన్స్ టన్ తరపున ఆడే అవకాశం కోసం
తను ఎంతగా ఆరాటపడుతోందో నీకు తెలుసు.

44:59.533 --> 45:01.826
- తనకి ప్రొఫెషనల్ కోచ్ అవసరం లేదు.
- మన కారణంగా...

45:01.827 --> 45:04.036
కనీసంలో కనీసం, తనకి నేర్పించడానికి
మనిషి అంటూ రావాలి కదా.

45:04.037 --> 45:05.371
- నేను వస్తాను.
- లేదు, కూప్.

45:05.372 --> 45:06.956
- నువ్వు చివరి నిమిషంలో వస్తావు...
- ఓహ్, చెత్త.

45:06.957 --> 45:09.292
- ...నీకు నువ్వు సమాధానం చెప్పుకోవడానికి వస్తావు.
- మళ్లీ ఈ చెత్త మొదలుపెట్టకు.

45:09.293 --> 45:11.043
మనం మళ్లీ మళ్లీ దీని గురించి మాట్లాడుకోవడం లేదు.

45:11.044 --> 45:12.920
నువ్వు నా గురించి రాకపోయినా ఫర్వాలేదు,

45:12.921 --> 45:14.964
కానీ నువ్వు తన కోసమైనా వస్తే బాగుంటుంది.

45:14.965 --> 45:17.176
- నీకు అర్థమైందా?
- ఇంకేమైనా మాట్లాడేది ఉందా?

45:42.284 --> 45:44.827
మీ దగ్గర చాలా వాచీలు ఉన్నాయి, మిస్టర్ స్పెర్లింగ్.

45:44.828 --> 45:47.413
దొంగ కేవలం ఒక వాచీని మాత్రమే ఎందుకు దొంగిలిస్తాడు?

45:47.414 --> 45:51.250
ఆ ఒక్క వాచీ విలువ రెండు లక్షల పాతిక వేల డాలర్లు.

45:51.251 --> 45:53.669
అయితే, ఆ దొంగకి అంత అత్యాశ లేదంటారా?

45:53.670 --> 45:56.172
మిగతా వాచీలన్నీ ఇక్కడే ఉన్నాయన్నది వాస్తవం కాబట్టి

45:56.173 --> 45:59.676
మీరే దాన్ని ఎక్కడయినా పెట్టేసి మర్చిపోయుంటారేమో అనిపిస్తోంది.

46:00.385 --> 46:02.554
అంత ఖరీదైన వాచీని ఎవరు ఎక్కడయినా పెట్టి మర్చిపోతారు?

46:03.222 --> 46:06.098
నాకు తెలియదు. దాన్ని ఎవరు కొన్నారో
వారే ఎక్కడయినా పెట్టేసి ఉండచ్చు కదా?

46:06.099 --> 46:07.184
ఏంటి?

46:08.769 --> 46:10.603
- ఆ వాచీ ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా?
- ఉంది.

46:10.604 --> 46:12.898
ఇంకా దాన్ని కొనుగోలు చేసిన పత్రాలు. నేను ఇప్పుడే వస్తాను.

46:17.110 --> 46:19.028
ఈ మనిషి మీద నీకేమైనా అనుమానమా?

46:19.029 --> 46:20.488
ఆ వాచీ అతనికి దొరకాలని సాయం చేస్తున్నాను.

46:20.489 --> 46:21.906
ఆ వాచీ మనకి దొరుకుతుంది అనుకుంటున్నావా?

46:21.907 --> 46:24.117
నాకు తెలియదు, కానీ మనం దాన్ని వెతకడానికి
ప్రాధాన్యం ఇద్దాం.

46:25.035 --> 46:27.704
- నిజంగానా?
- లేదు. నిజంగా లేదు.

46:44.930 --> 46:47.265
పేపర్ క్లిప్ ని
బ్యాటరీ ప్యాక్ కి వైర్ ద్వారా కలిపితే,

46:47.266 --> 46:48.934
అది టెన్షనర్ కింద పని చేస్తుంది.

46:50.102 --> 46:53.397
ఇప్పుడు, మీ టెన్షనర్ ని దానికి కేటాయించిన చోటులో పెట్టండి.

46:54.940 --> 46:56.400
కేవలం సెంటీమీటరు లోపలికి.

46:57.025 --> 46:58.276
దాన్ని బలంగా దూర్చకండి.

46:58.277 --> 47:00.737
అది ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.

47:01.446 --> 47:03.907
ఇప్పుడు, మన వోల్టేజ్ గురించి చెప్పబోతున్నాను.

47:06.076 --> 47:11.290
ఆహా. ఒకవేళ ఇది పని చేయని పక్షంలో,
బలంగా పగులగొట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

47:18.797 --> 47:20.506
నా మానసిక వైద్యుడు ఈ రోజు పండుగ చేసుకుంటాడు

47:20.507 --> 47:24.553
నా భార్యతో శృంగారం చేసిన వ్యక్తి సొత్తుని
నేను దోచుకుంటున్నాను అనే నిజం తెలిసి.

47:28.056 --> 47:29.641
కానీ నాకు ఏ మానసిక వైద్యుడూ లేడు.

47:30.309 --> 47:32.643
నాకు ఉన్నదల్లా ఒక యూట్యూబ్ ట్యుటోరియల్ మాత్రమే.

47:32.644 --> 47:34.687
నిక్ గెలుచుకున్న చాంపియన్షిప్ ఉంగరం,

47:34.688 --> 47:36.689
ఇంకా అన్ని పరిస్థితుల దృష్ట్యా పరిశీలిస్తే,

47:36.690 --> 47:38.525
నేను ఈ దొంగతనాలన్ని చేయడంలో
మంచి నైపుణ్యం సాధించాను.

47:44.448 --> 47:45.449
లేదా కాకపోవచ్చు.

48:58.188 --> 49:00.190
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
