WEBVTT

00:09.635 --> 00:12.971
కాబట్టి, సరే, ఇక్కడ మా పనితీరు
బెయిలీ కన్నా మరింత పద్ధతిగా ఉంటుంది.

00:13.055 --> 00:16.265
మేము క్లయింట్లతో వారి వ్యాపార రంగాల ప్రకారం కాకుండా,
వారితో ఉన్న అనుబంధం ప్రకారం వ్యవహరిస్తాం.

00:16.350 --> 00:18.018
రాబడి తెచ్చిన వారికే లాభం పంచుతాం,

00:18.101 --> 00:20.854
కానీ ఒక్కోసారి నేను మేనేజరుతో భాగస్వామిగా పని చేసి

00:20.938 --> 00:23.649
వాళ్లకి నిర్దిష్టమైన లక్ష్యాల్ని నిర్ణయిస్తాను,
దాని వల్ల ప్రయోజనం ఉంది అనిపిస్తే.

00:23.732 --> 00:26.360
- కాబట్టి, ఆఫీసులో పారదర్శకత ఉంటుంది.
- అవును, అది మంచి విషయం.

00:26.443 --> 00:27.444
ఆహ్… హా.

00:27.528 --> 00:30.656
విలువైన సమాచారాన్ని ఎవరితోనూ పెంచుకోవని
నాకు తెలుసు, కూప్,

00:30.739 --> 00:34.159
కానీ నీకో విషయం చెప్పాలి,
ఆ అలవాటు మా సంస్థకి బాగా పనికొస్తుంది.

00:34.993 --> 00:36.078
మాక్స్. చెప్పు, లోపలికి రా.

00:36.161 --> 00:38.872
- కూప్, నీకు మాక్స్ కోన్ పరిచయమా?
- మనకి పరిచయం లేదు, కదా?

00:38.956 --> 00:40.082
కిందటి ఏడాది రాబిన్ హుడ్ డిన్నర్ లో.

00:40.165 --> 00:42.084
వేలంలో నాకన్నా ఎక్కువ పాట పాడి
టేలర్ స్విఫ్ట్ సూట్ ని గెలుచుకున్నారు.

00:42.167 --> 00:44.336
- అవును. అందుకు సారీ. నిజం.
- ఫర్వాలేదు.

00:44.419 --> 00:47.089
నాకు పదిహేడేళ్ల కూతురు ఉంది,
నేను తన పోరుని భరించలేకపోయి ఉండేవాడిని.

00:47.172 --> 00:49.216
- ఖచ్చితంగా.
- మాక్స్ ఒక సూపర్ స్టార్.

00:49.299 --> 00:51.760
కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్ల మీద
అతనికి మంచి అవగాహన ఉంది.

00:52.344 --> 00:54.263
అవును, ఆ విశేషాలన్నీ వినాలని
నేను ఆసక్తిగా ఉన్నాను.

00:54.972 --> 00:57.850
నాన్ సొలిసిట్ ఒప్పందం గురించి విన్నావా?

00:57.933 --> 00:59.101
మా లీగల్ టీమ్ పట్టించుకోదు.

00:59.184 --> 01:01.895
బెయిలీ లాంటి పెద్ద సంస్థ అయినా కూడా,
కేసు వేస్తే కోర్టు ఖర్చుల్ని భరించలేదు.

01:05.732 --> 01:09.778
సరే, నా క్లయింట్ల సంగతి నేనే చూసుకుంటాను,
కానీ పారదర్శకంగా ఉంటాను, సందేహం లేదు.

01:09.862 --> 01:11.029
నాకు ఇచ్చే పారితోషికం,

01:11.113 --> 01:13.156
రాబోయే లాభాలలో కొంత శాతం వాటా.

01:13.240 --> 01:14.241
అంతే అంటారా?

01:15.576 --> 01:16.910
అలా కాదు, లేదు.

01:18.161 --> 01:19.621
నీ క్లయింట్ల సంగతి మాక్స్ చూసుకుంటాడు.

01:20.205 --> 01:23.208
క్లయింట్లని వెతకడం, వాళ్లని సంప్రదించడం కోసం
నిన్ను నియమించుకుని, నీకు ఫీజు చెల్లిస్తాం.

01:23.292 --> 01:24.501
అది ఎలా పని చేస్తుందో చూద్దాం.

01:24.585 --> 01:26.795
అవును, పెట్టుబడి మూలధనాన్ని
రాబట్టడంలో మనిద్దరం కలిసి పని చేస్తాం.

01:27.629 --> 01:29.339
అయితే ఈ కుర్రవాడికి నేను క్లయింట్లని పరిచయం చేస్తే,

01:29.423 --> 01:31.633
అతను వాళ్లతో లావాదేవీలు జరుపుతాడు,
తరువాత మీరు నన్ను తీసేస్తారు, అంతేగా?

01:31.717 --> 01:33.510
వోహ్, నాకు ఎవరి సాయం అవసరం లేదు.

01:33.594 --> 01:36.096
తప్పుగా అనుకోకు, మాక్స్,
నీకు సాయం అవసరం అని మీ బాస్ అనుకుంటున్నాడు,

01:36.180 --> 01:38.390
లేకపోతే మన మధ్య అసలు ఈ చర్చ
వచ్చి ఉండేది కాదు, అవునా?

01:38.473 --> 01:39.558
కూప్.

01:39.641 --> 01:41.935
త్రీ యాంకీస్ సంస్థ కిందటి సంవత్సరం
కేవలం ఏడు శాతం వ్యాపారం చేసింది, బెన్.

01:42.019 --> 01:44.730
ఆ ముందు సంవత్సరం మీ వ్యాపారం ఇరవై శాతం తగ్గింది,
మిగతా కంపెనీలన్నీ బాగా లాభాలు గడించాయి.

01:44.813 --> 01:46.315
ఇండెక్స్ స్టాక్స్ మొత్తంలో మా షేర్లు లాభాలు గడించాయి.

01:46.398 --> 01:49.151
మాక్స్, మాట్లాడకు.
ఇండెక్స్ స్టాక్స్ గురించి ఎవరూ పట్టించుకోరు.

01:49.234 --> 01:51.486
- అతని తండ్రి ఎవరు?
- ఏంటి?

01:51.570 --> 01:54.114
అతను వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు,
అతను ఎవరికో వారసుడని నేను పసిగట్టాను.

01:55.782 --> 01:56.950
మా అక్క కొడుకు.

01:57.951 --> 01:59.494
సరే, అంకుల్ బెన్,

01:59.578 --> 02:02.539
న్యూ జెర్సీలో ఇల్లు అమ్మడానికి
నువ్వు ఒక్క నిర్ణయం దూరంలో ఉన్నావు,

02:02.623 --> 02:05.042
కానీ ఆ వ్యాపారం బాధ్యతల్ని
నువ్వు అప్పగించబోయే ఆ కుర్రకుంక…

02:05.125 --> 02:06.710
- ఓయ్.
- …అదృష్టం కొద్దీ వారసుడిగా పుట్టాడు.

02:06.793 --> 02:08.878
- బ్రో, నువ్వు ఇలా మాట్లాడకూడదు…
- నోరు మూసుకో, మాక్స్.

02:08.961 --> 02:10.047
కూప్.

02:10.130 --> 02:12.591
బెన్, నీ వ్యాపారం మునిగిపోయే పడవలాంటిది.

02:13.634 --> 02:15.385
విందు పార్టీలలో నీ మీద జోకులు వేస్తారు.

02:15.928 --> 02:18.889
సరే, నేను విన్నదాని ప్రకారం,
నిన్ను అక్కడ మాత్రమే కలుసుకోవాలి అనుకుంటారు.

02:20.474 --> 02:22.017
నీ గురించి ఏం అనుకోవాలి?

02:24.269 --> 02:25.437
గుడ్ లక్.

02:25.521 --> 02:29.274
రెండో త్రైమాసికంలో రికార్డు వేగంతో
పుంజుకున్న టెక్ కంపెనీల షేర్లు

02:37.241 --> 02:39.493
నాకు ఉద్యోగం లేదు ఇంకా,
చూడబోతే, నన్ను ఎవరూ తీసుకునేలా లేరు,

02:39.576 --> 02:41.411
కానీ నేను రెండు లక్షల డాలర్ల ఖరీదైన కారులో కూర్చుని,

02:41.495 --> 02:43.997
ఒక మంచి సూట్ తొడుక్కుని,
దొంగిలించిన వాచీని పెట్టుకుని ఉన్నాను.

02:44.665 --> 02:47.251
ఏదీ అర్థం కావడం లేదు, మరి ఇలాంటి పరిస్థితిలో,

02:47.835 --> 02:50.420
వేరే అవకాశాల గురించి ఆలోచించడం
మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది.

03:04.935 --> 03:07.521
పాటెక్ ఫిలీప్ నాటిలస్, 18 కారెట్.

03:08.981 --> 03:10.065
ఇది చక్కని వాచీ.

03:10.941 --> 03:12.234
ఒకసారి చూసి చెబుతాను,

03:12.317 --> 03:16.238
కానీ నేను అనుకోవడం లక్షా 75 వేల డాలర్లు ఇవ్వగలనేమో.

03:17.030 --> 03:18.949
అవును, వీటికి మంచి సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది.

03:19.032 --> 03:20.033
రెండు లక్షల డాలర్లు.

03:20.742 --> 03:22.327
నూట ఎనభై ఐదు.

03:22.411 --> 03:23.704
ఇదే బెస్ట్ ఇంకా చివరి మాట.

03:26.206 --> 03:27.875
- అమ్మేశాను.
- మంచిది.

03:28.667 --> 03:30.752
నాకు బాక్స్ ఇంకా పేపర్లు కావాలి.

03:34.631 --> 03:35.674
ఇది కొత్తది కాదు.

03:35.757 --> 03:37.843
అవును, తెలుసు, కానీ దీనికి ఒక సీరియల్ నెంబర్ ఇంకా

03:37.926 --> 03:40.304
ఒక ధ్రువీకరణ పత్రం ఉంటాయి, అవి నాకు ఇవ్వాలి.

03:42.055 --> 03:43.515
కానీ, అవేవీ నా దగ్గర లేవు.

03:43.599 --> 03:46.018
అది నాకు బహుమతిగా ఇచ్చింది.

03:47.060 --> 03:48.061
సరే.

03:48.145 --> 03:49.605
సారీ, మిత్రమా.

03:49.688 --> 03:51.523
పత్రాలు లేనిదే, కొనలేను.

03:52.191 --> 03:54.443
సరే, నేను ధర తగ్గిస్తే కొంటావా?

03:59.531 --> 04:00.532
ఇదిగో.

04:01.992 --> 04:04.036
బ్రాంక్స్ లో ఈ చోటికి వెళ్లు.

04:04.119 --> 04:05.454
లూ గురించి అడుగు.

04:06.413 --> 04:07.414
- లూ?
- అవును.

04:07.497 --> 04:09.041
లిప్సిట్జ్ పంపించాడని లూకి చెప్పు.

04:09.124 --> 04:10.250
వర్గాస్ పాన్ షాప్
అమ్మకం కొనుగోలు వ్యాపారం

04:18.466 --> 04:20.219
వర్గాస్ పాన్ షాప్

04:54.253 --> 04:55.546
లూ అంటే నువ్వేనా?

04:56.630 --> 04:57.881
నువ్వు ఎవరు?

04:59.591 --> 05:01.218
సారీ, నన్ను లిప్సిట్జ్ పంపించాడు.

05:01.301 --> 05:02.344
నా పేరే లూ.

05:04.638 --> 05:07.266
- నీకు లిప్సిట్జ్ ఎలా తెలుసు?
- మేము ఇందాకే కలిశాము.

05:08.308 --> 05:11.728
ఎక్కడ కలిశారు? బార్ లోనా,
చర్చ్ లోనా, మద్యం తాగుతూ కలిశారా, ఎక్కడ?

05:12.312 --> 05:13.689
అతని దుకాణంలో. నేను కేవలం…

05:13.772 --> 05:15.440
నేను ఇది అమ్మాలని చూస్తున్నాను.

05:18.986 --> 05:20.696
మనం వెనుక వైపు వెళదాం, రాకో.

05:20.779 --> 05:22.573
పద, అదేమిటో చూద్దాం.

05:37.671 --> 05:42.676
నాయనమ్మ వ్యాపారంచేసుకోవాలి,
మీరు మేడ మీదకి వెళ్లి టీవీ చూడండి, సరేనా?

05:42.759 --> 05:44.636
- సరే.
- అలాగే.

05:47.556 --> 05:51.685
సరే, ఇది మరీ ఆడంబరంగా ఉందని నా భార్య అనుకుంటోంది.

05:52.769 --> 05:54.521
మరీ ఆడంబరంగానా, హా?

05:56.899 --> 05:59.610
అందుకేనా నీ వేలుకి వెడ్డింగ్ రింగ్ లేదు?

05:59.693 --> 06:01.737
నువ్వు వాచీ కొంటావా లేక నా గురించి ఆరా తీస్తావా?

06:01.820 --> 06:04.031
నేను ఒకే సమయంలో రెండూ చేయగలను.

06:08.702 --> 06:10.245
దీనికి 65 వేల డాలర్లు ఇస్తా.

06:10.329 --> 06:12.080
లిప్సిట్జ్ నాకు లక్షా 85 వేలు ఇస్తా అన్నాడు.

06:12.164 --> 06:13.332
తరువాత నిన్ను నా దగ్గరకి పంపించాడు.

06:13.999 --> 06:15.792
సక్రమంగా అమ్మేటట్లయితే,
నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు.

06:18.253 --> 06:19.254
తొంభై ఐదు వేలు.

06:23.717 --> 06:26.428
నీలాంటి వ్యక్తులు ఇక్కడికి తరుచుగా రారు.

06:26.512 --> 06:28.597
నువ్వు ఏంటి, వ్యాపారివా? స్టాక్ బ్రోకర్?

06:29.598 --> 06:30.682
ఏదో ఒకటి.

06:31.183 --> 06:36.104
విషయం ఏమిటంటే, నువ్వు ముట్టని వాటిని
అమ్మడం కొనడం చేసే వ్యక్తివి.

06:36.188 --> 06:38.482
వాటికి నువ్వు విలువని కల్పిస్తావు.

06:39.107 --> 06:42.903
వాటి విలువని పెంచి మిగతా సంపన్నులకి
అమ్మడంలో నువ్వు నిపుణుడివి.

06:43.737 --> 06:47.449
కానీ ఇప్పుడు, నీ దగ్గర ఉంచుకోగలిగిన వస్తువుని
నాకు అమ్ముతున్నావు.

06:47.533 --> 06:48.951
ఇది నీకు కొత్త.

06:49.034 --> 06:53.163
ఈ మార్కెట్ నీకు అర్థం కాదు,
అయినా బేరాలు ఆడాలని చూస్తున్నావు.

06:55.290 --> 06:57.376
అది తెలివైన పని కాదు, మూర్ఖత్వం.

06:59.211 --> 07:01.129
బహుశా అది ఆత్రుత కావచ్చు.

07:03.966 --> 07:05.843
నువ్వు నిజాయితీగా చెప్పిన మొదటి మాట ఇదే.

07:06.343 --> 07:08.303
ఇప్పుడు మనం వ్యాపారం చేయచ్చు.

07:08.387 --> 07:09.638
నీకు అరవై వేల డాలర్లు ఇస్తాను.

07:11.181 --> 07:12.432
ఇప్పుడే 65 అన్నావు కదా.

07:12.516 --> 07:13.767
డీల్.

07:13.851 --> 07:15.936
నేను ఇందాక చెప్పిన ధరకే తీసుకొచ్చావు.

07:16.019 --> 07:18.272
భలే బేరం ఆడావు.

08:53.742 --> 08:54.743
ఓహ్, బేబీ.

09:07.256 --> 09:08.382
ఇంక టైమ్ అయింది, బుజ్జీ.

09:11.093 --> 09:12.344
ఇంక టైమ్ అయింది.

09:12.970 --> 09:14.471
- గుడ్ మార్నింగ్.
- మనం ఆలస్యం అయ్యాం.

09:14.555 --> 09:17.224
హేయ్, మీ నాన్నకి తిరిగి మెసేజ్ చేశావా?

09:17.307 --> 09:18.350
హాస్యం ఆడుతున్నావా?

09:18.433 --> 09:20.644
ఆయనకి తిరిగి మెసేజ్ చేయి, ప్లీజ్, నా కోసం.

09:21.603 --> 09:22.938
అలాగే, మంచిది.

09:23.021 --> 09:24.147
హేయ్.

09:28.819 --> 09:30.070
ఉంటా, అమ్మా.

09:32.447 --> 09:36.618
ఊపిరి తీసుకుంటూ మీ చేయిని
ఆకాశం వైపు చాచండి, కుడి చేయి నేల వైపు చాచండి.

09:36.702 --> 09:38.036
ఎడమ చేతిని తిరిగి కిందికి దింపండి…

09:38.120 --> 09:39.955
నా లోదుస్తులు లోపలికి దూరిపోయాయి.

09:40.998 --> 09:41.999
తీసుకోండి.

09:44.084 --> 09:44.918
హాయ్.

09:48.589 --> 09:49.590
నాటిలస్

09:49.673 --> 09:51.341
వెల్నెస్ అండ్
కౌన్సెలింగ్ సెంటర్

09:51.425 --> 09:52.426
థాంక్యూ.

09:54.428 --> 09:58.473
మా అమ్మ బాయ్ ఫ్రెండ్ ని వెధవ అని తిట్టడానికి
తను రకరకాల మార్గాలు కనిపెట్టడంలో దిట్ట.

09:58.557 --> 10:01.476
అది కేవలం ఒక సెల్ఫీ ఇంకా
దానిని నా బాయ్ ఫ్రెండ్ కి షేర్ చేశాను,

10:01.560 --> 10:03.395
తరువాత అతను తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు…

10:04.521 --> 10:06.190
రోబోటిక్స్ క్లబ్ నుండి నేను తప్పుకున్నాను.

10:06.273 --> 10:07.524
ఏం జరిగిందో నాకు చెప్పు.

10:07.608 --> 10:09.735
నన్ను మాట్లాడించలేవు.

10:11.320 --> 10:12.905
లేదు, చూడు, అతను పూలు పట్టుకుని కిందకి వచ్చాడు,

10:12.988 --> 10:16.366
నాకు పెద్దగా, చాలా సేపు నాలుకతో ముద్దు పెట్టాడు

10:16.450 --> 10:18.160
జీవితంలో అలాంటి ముద్దుని మనం చూడలేము…

10:20.621 --> 10:21.955
మార్క్.

10:22.039 --> 10:24.750
అవును, మా అమ్మ ఎప్పటిలాగే నా మీద కోప్పడింది.

10:24.833 --> 10:28.378
ఆమె నా గురించి చెప్పింది సరైనదేనని
నేను, అంటే, ఒక వెయ్యిసార్లు రుజువు చేశా అనిపిస్తుంది.

10:28.462 --> 10:29.588
సరే, ఒక నిమిషం ఆగు.

10:29.671 --> 10:32.007
కారుని కీతో గీకడం, అలాగే స్కూల్లో

10:32.090 --> 10:35.511
డిటెన్షన్ లో ఉండటం మధ్య
తేడా ఉందని మనం గ్రహిద్దామా?

10:35.594 --> 10:37.429
అవును, నాకు తెలుసు.

10:38.263 --> 10:40.974
అలాంటి పనిని చేయడం అదే మొదటిసారా?

10:41.058 --> 10:42.184
నేను మొదటిసారి పట్టుబడ్డాను.

10:44.770 --> 10:47.856
- ఆ కారు యజమాని ఎవరో నీకు తెలుసా?
- తెలియదు, ఇది అలాంటిది కాదు.

10:47.940 --> 10:49.149
అయితే మరి ఎందుకు చేశావు?

10:49.233 --> 10:51.985
నా ఉద్దేశం, నీకు తెలియకపోవచ్చు,
కానీ నేను ఏం ఆలోచిస్తున్నానంటే,

10:53.695 --> 10:55.030
నువ్వు ఏం ఆలోచిస్తున్నావా అని?

10:56.240 --> 10:59.034
నాకు చాలా కోపం వస్తుంది అనుకుంటా.

11:00.202 --> 11:03.163
అది నిజానికి కోపం కాదు,
అది నిజానికి ఒక ఎనర్జీ లాంటిది,

11:03.872 --> 11:06.708
అది క్రమంగా పెరుగుతుంటుంది ఇంకా
అది నా లోపల ఉంటుంది,

11:06.792 --> 11:08.460
నన్ను ఆందోళన పెడుతుంటుంది.

11:08.544 --> 11:11.755
ఒక దశలో అది నన్ను నిలకడగా ఉండనివ్వదు,

11:11.839 --> 11:16.093
అప్పుడు నేను ఏదైనా చేయకపోతే,
నేను పేలిపోతాను అనిపిస్తుంది, తెలుసా?

11:18.512 --> 11:20.597
ఆ తరువాత నేను కిటికీని బద్దలకొడతా లేదా,

11:20.681 --> 11:22.057
కారుపై గీకడమో ఇంకేదైనా చేస్తా.

11:23.642 --> 11:25.060
అది ఎలా అనిపిస్తుందంటే…

11:25.853 --> 11:29.523
అది నా నుండి బయటకి తన్నుకొస్తుంది,
అప్పుడు నేను సరిగ్గా ఊపిరి తీసుకోగలుగుతాను.

11:40.325 --> 11:43.704
మనందరికీ ఒక కల ఉంటుంది,
మనం ఊహించుకునే ఒక నిర్వాణ స్థితి.

11:43.787 --> 11:45.080
మనం చేరుకోవాలి అనుకునే ప్రదేశం

11:45.163 --> 11:47.207
ఆ ప్రదేశంలో నివసించగలిగితే,

11:47.291 --> 11:49.668
సక్సెస్, సంతోషం, మనశ్శాంతి అన్నీ
మనం చివరికి సాధించామనే అనుభూతి కలుగుతుంది.

11:50.878 --> 11:52.671
నా దృష్టిలో అలాంటి ప్రదేశం, వెస్ట్ మాంట్ విలేజ్,

11:52.754 --> 11:57.050
అక్కడ ఖరీదైన ఇళ్లు, చక్కని పచ్చికబయళ్లతో,
ప్రత్యేకమైన క్లబ్బులతో ఉంటాయి.

11:57.968 --> 11:59.303
కానీ నాకు ఏం సందేహం కలుగుతోందంటే

11:59.386 --> 12:01.889
నా కలలన్నీ నా మాదిరిగానే

12:01.972 --> 12:03.140
పిచ్చి కలలని నాకు అనిపిస్తోంది.

12:16.153 --> 12:17.279
హేయ్, కూప్!

12:25.454 --> 12:26.705
ఓక్ వుడ్ కంట్రీ క్లబ్,

12:26.788 --> 12:28.624
ఏడాదికి లక్ష డాలర్లు కడితే

12:28.707 --> 12:30.167
మార్కెట్ ధరకన్నా నలభై శాతం ఎక్కువగా

12:30.250 --> 12:32.961
వాళ్లు సర్వ్ చేసే సలాడ్ లు, బర్గర్లు, కాఫీ ఇంకా కాక్ టైల్ ని
కొనుక్కునే 'హోదా'ని కల్పిస్తుంది.

12:33.712 --> 12:34.963
కానీ అందులో చేరకపోతే,

12:35.047 --> 12:37.424
నీకు అంత సత్తా లేదన్నట్లుగా మిగతా అందరూ చూస్తారు.

12:37.925 --> 12:40.427
అది పురాతన కాలం నుంచి వస్తున్న
సమాజపు బలవంత వసూళ్ల వ్యవహారం

12:40.511 --> 12:43.180
కానీ దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్న నేను

12:43.263 --> 12:44.681
మిగతా మూర్ఖులతో చేరకుండా ఉండలేకపోయాను.

12:45.307 --> 12:46.433
చక్కగా ఉంది.

12:48.268 --> 12:49.645
నువ్వు నన్ను కొద్దిగా ఆట ఆడిస్తున్నావు.

12:49.728 --> 12:51.188
తను నిక్ తో ఎందుకు ఆడుతోంది?

12:51.688 --> 12:52.773
నువ్వు ఆలస్యం చేశావు కాబట్టి.

12:53.357 --> 12:54.191
బాగా ఆడావు.

12:55.400 --> 12:56.401
టెన్నిస్ నేను ఆడే ఆట.

12:56.485 --> 12:59.863
అతను తనతో ఆడకుండా చూడగలవా, ప్లీజ్?

12:59.947 --> 13:01.156
సరే, అది ప్లాన్ చేసుకున్నది కాదు, కూప్.

13:01.240 --> 13:03.534
నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియలేదు
పైగా రేపే టోర్నమెంట్ ఉంది.

13:03.617 --> 13:05.077
తను బాగానే ఆడుతోంది.

13:05.160 --> 13:09.248
ఆమె దరఖాస్తుని ప్రిన్స్ టన్ లో కనీసం పరిశీలించాలంటే
తనకి టెన్నిస్ రేటింగ్ తొమ్మిది వరకూ రావాలి.

13:09.331 --> 13:10.791
తను తొమ్మిది దగ్గరే ఉంది అనుకుంట కదా.

13:10.874 --> 13:12.459
లేదు, తన ర్యాంకింగ్ 8.7 మాత్రమే.

13:12.543 --> 13:14.169
ఆమె వరుసగా రెండు మ్యాచ్ లు గెలవాలి

13:14.253 --> 13:16.171
కానీ ఆ టోర్నమెంట్ లో ఫోర్ లేదా ఫైవ్ స్టార్ ఆటగాళ్లతో
తను తలపడుతోంది.

13:16.255 --> 13:18.382
అయితే, ఒక బాస్కెట్ బాల్ ఆటగాడు
తనకి ఎలా సాయం చేయగలడు?

13:18.465 --> 13:21.051
అతను టైమ్ కి వచ్చాడు.

13:25.264 --> 13:26.431
నువ్వు చెప్పింది సరైనదే.

13:26.515 --> 13:27.724
ఇంక వెళదాం పద.

13:28.600 --> 13:29.810
హేయ్.

13:30.978 --> 13:33.063
హేయ్, కూప్, తనతో ఆడుతున్నందుకు సారీ,
ఏదో సాయం చేయాలని ప్రయత్నిస్తున్నా.

13:33.146 --> 13:35.691
సరే, సరే. ఎవరి భార్యకయినా శృంగారం కావాల్సి వస్తే,

13:35.774 --> 13:37.067
నీకు చెబుతాను.

13:40.279 --> 13:42.531
సరే, కొద్దిగా నెట్ దగ్గర ఆడదాం, హా?

13:42.614 --> 13:43.824
నెట్ దగ్గరకి పరిగెత్తవద్దని కోచ్ చెబుతాడు.

13:45.117 --> 13:47.369
అవును, అతనికి ఎప్పుడు ఏది చెప్పకూడదో…

13:48.829 --> 13:49.955
…అదే చెబుతాడు.

13:52.374 --> 13:54.209
రేపే టోర్నమెంట్ ఉంది.
ఇప్పుడు నేర్చుకునే టైమ్ లేదు.

13:55.127 --> 13:57.129
ఇవి టెన్నిస్ లో ప్రాథమిక పాఠాలు.
చూడు, ఎలా ఆడాలో నీకు చూపిస్తాను.

13:57.212 --> 13:58.297
కొట్టు. గట్టిగా కొట్టు.

14:06.680 --> 14:07.514
బాగానే ఉన్నావా?

14:08.265 --> 14:09.391
బాగున్నా. మంచి షాట్.

14:10.726 --> 14:12.352
నా బాయ్ ఫ్రెండ్ ని వృషణాల మీద కొట్టావు.

14:13.562 --> 14:15.272
అవును, కానీ, అలా చేయడం ఇప్పటికీ మంచిదే.

14:15.898 --> 14:16.899
హేయ్, టోరీ.

14:17.524 --> 14:19.735
- హేయ్, చెల్స్.
- రేపటికి నీకు గుడ్ లక్.

14:19.818 --> 14:20.819
నీకు కూడా. చెత్తదానా.

14:23.947 --> 14:26.325
- మీరిద్దరూ ఫ్రెండ్స్ అనుకున్నాను.
- అవును, మేము ఫ్రెండ్సే, కానీ

14:26.408 --> 14:28.243
టెన్నిస్ జట్టులో ఒకరికి మాత్రమే అవకాశం ఉంది.

14:28.327 --> 14:30.621
కానీ, అందులో మంచిని వెతుకు,
తనకి ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో సీటు రాకపోవచ్చు.

14:30.704 --> 14:31.914
బహుశా నాకే రాకపోవచ్చు.

14:32.789 --> 14:34.082
నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు.

14:34.833 --> 14:36.793
పద, తిరిగి బేస్ లైన్ దగ్గరకి వెళ్లు.

14:36.877 --> 14:38.003
ఆడదాం పద.

15:08.116 --> 15:09.952
నీకు ఇంకా నిక్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయా, హా?

15:10.035 --> 15:11.119
బాగానే ఉన్నాయి.

15:13.872 --> 15:15.415
ఇంకా తొలి రోజులే కదా.

15:15.499 --> 15:18.168
తొలి రోజులా? అతను నీతో సహజీవనం చేస్తున్నాడు కదా.

15:18.252 --> 15:19.378
ఏంటి? లేదు, తను నాతో ఉండడు.

15:19.461 --> 15:21.421
అతడిని ఎప్పుడూ తన ఇంటికి పంపేస్తాను.

15:21.505 --> 15:23.590
నాకు ఒంటరిగా పడుకోవడమే ఇష్టం.

15:23.674 --> 15:26.426
నా దగ్గరకి పంపించు. నా గరాజ్ లో
గడ్డి కోసే యంత్రంలా ఉంచుకుంటాను,

15:26.510 --> 15:28.428
నాకు కోరిక కలిగినప్పుడు బయటకి తీసి వాడుకుంటాను.

15:29.263 --> 15:30.264
దాని అర్థం ఏంటి?

15:30.347 --> 15:32.349
- మ్యాగీ ఇంకా నేను అతని జిమ్ లో చేరాం.
- అవును.

15:32.432 --> 15:34.059
- మంచి క్లాసులు.
- బాగుంటాయి.

15:35.269 --> 15:36.812
నేను ఈక్వినాక్స్ ని ఇష్టపడతాను.

15:37.688 --> 15:38.939
అది ఎందుకంటే మెల్ కి కాస్త ఏకాంతం కావాలి…

15:39.022 --> 15:40.023
- ఏదో ఒకటి.
- …అవును కదా?

15:40.649 --> 15:42.568
- ఛ. చూడండి.
- ఏంటి?

15:42.651 --> 15:43.986
పాల్ వచ్చాడు.

15:46.905 --> 15:49.950
ఓహ్, డియర్, తను వెయిట్రెస్ కదా?

15:50.033 --> 15:51.618
అవును, నిజంగా తనే.

15:52.953 --> 15:54.788
అక్షరాలా, అది ఆమె ఒళ్లే.

15:54.872 --> 15:56.790
ఆమెని అతను ఇక్కడికి తీసుకువచ్చాడంటే నమ్మలేకపోతున్నా.

15:56.874 --> 15:58.125
అలాంటివి నిషేధించేలా ఏదైనా రూల్ పెట్టాలి.

15:58.208 --> 15:59.168
ఆమెని వదిలేయండి.

15:59.251 --> 16:00.252
అవును, ఆమెని వదిలేయాలి.

16:00.335 --> 16:02.087
ఆమె వయసు ఎంత, పదహారా, పదిహేడా?

16:02.171 --> 16:03.380
ఇరవై నాలుగు.

16:04.631 --> 16:06.216
- ఆమె పేరు మిస్టీ.
- దేవుడా.

16:06.300 --> 16:10.888
నేను సవానా వస్తుంది అనుకున్నాను
కానీ మిస్టీ రావడంలో ఆశ్చర్యం లేదు.

16:10.971 --> 16:11.930
అవును.

16:12.014 --> 16:14.057
కానీ, అతని రెస్టారెంట్లకి నువ్వు వెళ్లావు కదా.

16:14.141 --> 16:16.268
అతని హోటళ్లలో వెయిట్రెస్ లు అందరూ
దాదాపుగా ఆమె మాదిరిగానే ఉంటారు.

16:16.351 --> 16:17.644
హేయ్. హేయ్.

16:17.728 --> 16:18.854
ఏంటి?

16:20.856 --> 16:23.317
ఇక్కడ ఉన్నవారిని మినహాయించి.

16:23.400 --> 16:24.693
ఫర్వాలేదు.

16:25.569 --> 16:28.572
అతను నన్ను పదిహేనేళ్ల కిందట ఎంచుకున్నాడు,
అప్పట్లో నేను ఆ మాదిరిగా బికినీలు వేసుకునే దాన్ని.

16:28.655 --> 16:31.074
అలా అనుకోకు, శామ్. నువ్వు ఇప్పటికీ అందంగానే ఉన్నావు.

16:31.658 --> 16:33.202
నువ్వు రెడీ అంటే చాలు,

16:33.285 --> 16:36.413
నీకు తగిన జోడీని మేమే కుదర్చడానికి సిద్ధంగా ఉన్నాం.

16:36.496 --> 16:37.414
అవును.

16:37.497 --> 16:39.833
ఓహ్, అవును, శామ్, చాలామంది మగవాళ్లతో
శృంగారం చేసే సత్తా నీకు ఉంది.

16:39.917 --> 16:41.043
సరే.

16:41.126 --> 16:42.920
మగవాళ్లతో శృంగారం గురించి నీకేం తెలుసు?

16:43.003 --> 16:45.422
థాంక్యూ, మిత్రులారా, కానీ
ఆమె అతడిని పొందడంలో తప్పు లేదు.

16:47.799 --> 16:49.343
కానీ అతని డబ్బుని నువ్వు పొందచ్చు.

16:49.426 --> 16:51.178
హేయ్. హేయ్, విను, విను!

16:54.139 --> 16:57.267
మనం ఈ క్లబ్ లో అల్పాహారం తినచ్చు,
ఇక్కడ వంటకాలు బాగుంటాయి,

16:57.351 --> 17:01.688
మంచి కాలక్షేపం ఉంటుంది, ఇంకా లెక్కలేనంతగా
ఖరీదైన వస్తువుల వాడకం కనిపిస్తుంది.

17:01.772 --> 17:05.901
నేను ఎప్పుడూ గమనించలేదని కాదు, కానీ
ఇప్పుడు నేను వాటిని వేరేలా చూస్తున్నాను.

17:07.819 --> 17:09.154
హేయ్, మిత్రులారా, ఎలా నడుస్తోంది?

17:09.780 --> 17:11.406
హాయ్, కూప్. మాతో కలిసి కూర్చుంటున్నావా?

17:12.241 --> 17:14.034
చెప్పలేను. హంటర్ ని చూశావా?

17:14.117 --> 17:16.537
- ఎవరైనా చూశారా?
- వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి.

17:17.037 --> 17:18.454
జేక్, హేయ్.

17:18.539 --> 17:21.124
- హేయ్.
- ఛ.

17:21.834 --> 17:23.961
హేయ్, జేక్. ఎలా ఉన్నావు, బాబు?

17:24.545 --> 17:25.462
మిస్టర్ కూపర్.

17:26.672 --> 17:28.006
ఆ రోజు జరిగిన దానికి సారీ.

17:28.089 --> 17:29.424
నువ్వు నన్ను హఠాత్తుగా ఆశ్చర్యపరిచావు.

17:29.508 --> 17:32.010
అవును. అవును, అది నాకూ ఆశ్చర్యంగా అనిపించింది.

17:32.511 --> 17:33.345
అది నిజం.

17:33.887 --> 17:35.264
సరే, నీకు పెద్దగా…

17:36.348 --> 17:38.016
శాశ్వతంగా నష్టం ఏమీ జరగలేదు అనుకుంటా.

17:38.100 --> 17:40.561
మరీ ముఖ్యంగా, నా మీద కోపం పెట్టుకోకు.

17:41.812 --> 17:43.564
- అలాగే, ఎలాంటి కోపం లేదు.
- మంచిది.

17:43.647 --> 17:45.065
మంచిది. ఇలా రా, వచ్చి కూర్చో, ఏదైనా తిను.

17:45.148 --> 17:46.567
అవును, జేక్, రా… నువ్వు తినడానికి…

17:46.650 --> 17:48.610
- ఇది ఎలా ఉంది?
- నువ్వు నిజాయితీగా చెప్పి ఉంటే బాగుండేది…

17:48.694 --> 17:51.113
కానీ, అతను ప్యాంట్ వేసుకుని ఉంటేనే నాకు నచ్చుతుంది.

17:51.196 --> 17:52.739
నీకు నేను చెప్పేది అర్థమైందా? పద.

17:52.823 --> 17:56.410
సరే. నీకు హంటర్ కనిపిస్తే,
వాడి కోసం నేను వెతుకుతున్నానని చెప్పు.

17:57.411 --> 17:58.453
థాంక్యూ.

18:00.581 --> 18:02.040
- హాయ్.
- హేయ్.

18:02.124 --> 18:04.084
- ఎలా ఉన్నావు?
- అంటే, నీ మీద నాకు ఇంకా కోపంగానే ఉంది.

18:04.168 --> 18:06.628
నాకు తెలుసు, కానీ నిజాయితీగా చెప్పాలంటే,
ఎందుకో నాకు ఖచ్చితంగా గుర్తులేదు.

18:06.712 --> 18:08.797
- ఆపు, కూప్.
- హేయ్, హేయ్, ఊరికే అంటున్నా.

18:08.881 --> 18:10.591
ఊరికే అన్నాను. ఊరికే అన్నాను. సారీ.

18:10.674 --> 18:11.842
శామ్, ఇలా చూడు.

18:11.925 --> 18:13.969
ఆ రాత్రి జరిగిన దానికి సారీ, నేను ఏదో ధ్యాసలో ఉన్నాను.

18:14.052 --> 18:16.054
సరే, మామూలుగా నీ మీద నాకు కోపం వస్తే
అది ఎక్కువ కాలం ఉంటుంది,

18:16.138 --> 18:18.265
కానీ పాల్ తన వెయిట్రెస్ ని తీసుకొచ్చాడు
దానితో నేను మానసికంగా కుంగిపోయాను

18:18.348 --> 18:20.893
అది నన్ను ఇబ్బంది పెడుతోంది, కాబట్టి అవును.

18:20.976 --> 18:22.352
ఆమె ఏ దుస్తులు వేసుకుందో చూశావా?

18:23.020 --> 18:24.396
నేను గమనించలేదు.

18:24.479 --> 18:26.690
ఎందుకంటే ఆమె చాలా కురచ దుస్తులు వేసుకుంది కాబట్టి.

18:26.773 --> 18:29.318
విషయం ఏమిటంటే, చాలా త్వరగా నేను సెక్సీగా తయారవ్వాలి,

18:29.401 --> 18:30.736
కాబట్టి నీతో శృంగారానికి ఒప్పుకుంటున్నాను.

18:30.819 --> 18:33.030
- నీ ప్రయత్నం వృథా పోనివ్వను.
- నువ్వు ఖచ్చితంగా చేయాలి.

18:33.113 --> 18:34.615
- హేయ్, అమ్మాయిలు.
- ఓయ్, అందరూ.

18:34.698 --> 18:36.074
ఎలా ఉన్నారు?

18:36.158 --> 18:37.576
హలో, లేడీస్.

18:37.659 --> 18:39.286
- హేయ్.
- బ్రాడ్, జూల్స్, ఏం చేస్తున్నారు?

18:39.369 --> 18:41.038
హేయ్, కూప్. ఆసక్తి కలిగించే కొత్త విశేషాలు ఏంటి?

18:41.121 --> 18:43.999
ఓహ్, దేవుడా, అవే పాత విశేషాలు.
బ్యాంక్ లో పని ఎలా నడుస్తోంది?

18:44.082 --> 18:46.585
వడ్డీ రేట్లు పెరిగినందుకు కోపంతో ఉన్నారు.

18:46.668 --> 18:49.505
- కానీ మేము దాన్ని అధిగమించగలం.
- ప్లీజ్, చూడండి, ఆఫీసు విషయాలు మాట్లాడకండి.

18:49.588 --> 18:51.215
చెల్సియా, ఇంతకుముందు నీ ఆట చూశా.

18:51.298 --> 18:52.382
నువ్వు చాలా బాగా ఆడుతున్నావు.

18:52.466 --> 18:54.218
థాంక్యూ, మిస్టర్ కూపర్.

18:54.301 --> 18:55.844
టోరీ, నిక్ తో ఆడుతుంటే చూశాను.

18:55.928 --> 18:58.388
నువ్వు పెద్ద ఆటగాళ్లని రంగంలోకి దింపుతున్నావా, హా?

18:58.972 --> 19:00.974
కూప్ పెద్ద ఆటగాడు, బంగారం.

19:01.058 --> 19:02.601
అతను ప్రిన్స్ టన్ యూనివర్సిటీ తరపున ఆడాడు.

19:03.185 --> 19:04.228
అది నాకు తెలుసా?

19:04.311 --> 19:05.771
అది ఎప్పుడో చాలా ఏళ్ల కిందట.

19:05.854 --> 19:10.067
సరే, కిందటి ఏడాదిలాగే ఈసారి కూడా
మన పిల్లలు ఫైనల్ వరకు చేరుకుంటారని ఆశిస్తున్నాను.

19:10.150 --> 19:12.236
- నువ్వు ఏం అనుకుంటున్నావు?
- అది మంచి అంచనా.

19:12.736 --> 19:14.696
హాయ్. ఎలా ఉన్నావు?

19:14.780 --> 19:15.656
హాయ్.

19:15.739 --> 19:17.824
బాగున్నాం, అందరికీ హాయ్. హ్యాపీ వీకెండ్.

19:17.908 --> 19:20.452
- హేయ్, బంగారం. పూల్ లో ఈత ఎలా ఉంది?
- గొప్పగా ఉంది.

19:20.536 --> 19:21.870
మంచి అంచనా అంటే గుర్తొచ్చింది,

19:22.579 --> 19:24.665
నీకు త్రీ యాంకీస్ ఇంటర్వ్యూ ఇప్పించడానికి
నేను చాలామందిని కదిలించాల్సి వచ్చింది.

19:24.748 --> 19:26.208
చూడు, అది ఒక పిచ్చి ఉద్యోగం.

19:26.291 --> 19:27.960
ఆ పిచ్చి ఉద్యోగమే నీది అయి ఉండేది.

19:28.877 --> 19:30.420
చూడు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, మిత్రమా.

19:30.504 --> 19:31.964
నువ్వు తిరిగి నీ హోదాని సంపాదించుకోవాలంటే,

19:32.047 --> 19:33.549
ముందు ఏదో సంస్థలో ఉద్యోగంలో చేరాలి.

19:33.632 --> 19:34.800
నేను ఆ అవకాశాన్ని కల్పించాను.

19:34.883 --> 19:36.635
నేను ఎవరి మేలు కోసమో పని చేయలేను, బార్నీ.

19:36.718 --> 19:38.428
ఆరు నెలల తరువాత కూడా
ఇదే మాట మాట్లాడతావో లేదో చూద్దాం.

19:39.263 --> 19:41.515
నువ్వు నీ ఐదు శాతం కమిషన్ కోసం
ఆందోళన పడుతున్నావు అనుకుంటా.

19:41.598 --> 19:44.643
ఖచ్చితంగా ఆందోళన పడుతున్నా, దానితో పాటు
నువ్వు నాకు చెల్లించాల్సిన 40 వేల బాకీల గురించి కూడా.

19:46.186 --> 19:49.064
- నేను ఊరికే చెబుతున్నాను.
- సరే, అంటే, నేను కూడా చెప్పాలి నేను…

19:49.147 --> 19:50.983
- నేను ఇంక వెళ్లాలి.
- నువ్వు ఇప్పుడేగా వచ్చావు.

19:51.066 --> 19:52.359
తెలుసు. కానీ నేను వెళ్లాలి. హేయ్.

19:54.361 --> 19:55.529
- హాయ్, నాన్నా.
- హేయ్.

19:56.280 --> 19:57.281
డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా?

19:58.532 --> 19:59.575
లేదు.

20:00.951 --> 20:02.578
- కొద్దిగా కూడా తీసుకోలేదు.
- హంటర్.

20:02.661 --> 20:04.037
అదేం కాదు, కేవలం ఒక్క హిట్ మాత్రమే తీసుకున్నా.

20:04.121 --> 20:06.039
దాన్ని ఇక్కడితో ఆపు.

20:06.707 --> 20:08.458
అలాంటి వ్యసనాలకి నీది ఇంకా చిన్న వయసే.

20:09.501 --> 20:10.961
నువ్వు నాకు డ్రమ్స్ కొంటున్నావా లేదా?

20:12.087 --> 20:13.755
అది పెద్ద కథ. అవి నా ఇంట్లో ఉన్నాయి.

20:14.965 --> 20:16.133
సరే, మనం వెళ్లి వాటిని తెచ్చుకుందామా?

20:16.758 --> 20:18.051
మనం అమ్మ కారు వాడుకోవచ్చు.

20:20.095 --> 20:21.680
నిజానికి, అది చాలా మంచి ఆలోచన.

20:21.763 --> 20:23.265
నీకో విషయం చెప్పనా? నేను మొదటగా ఒక పని పూర్తి చేయాలి,

20:23.348 --> 20:24.725
ఆ తరువాత ఇంటికి వెళ్లి డ్రమ్స్ తెచ్చుకుందాం.

20:24.808 --> 20:25.809
డీల్.

20:25.893 --> 20:30.522
సరే, నువ్వు వెళ్లి కార్లు మార్చుతావా?

20:32.482 --> 20:33.483
నువ్వు చేయగలవా?

20:34.318 --> 20:35.903
డ్రగ్స్ తీసుకున్నానని తెలిస్తే అమ్మ నా మీద అరుస్తుంది.

20:35.986 --> 20:38.238
కానీ, పరిస్థితులు ఎదుర్కోలేకపోతే, నేరం చేయకూడదు.

20:39.990 --> 20:41.533
వెళ్లి తీసుకురా. వెళ్లు.

21:07.476 --> 21:09.728
- ఎలా జరిగింది?
- అనుకున్న దానికంటే బాగా జరిగింది.

21:09.811 --> 21:12.272
అవునా? ఇదిగో. నీకు ఇది అవసరం.

21:15.526 --> 21:17.361
నిక్స్ స్ట్రాంగ్ ఆస్ జిమ్

21:17.444 --> 21:19.154
అది ఏంటి?

21:19.863 --> 21:21.281
నువ్వు ఇంతవరకూ యాస్ మొబైల్ చూడలేదా?

21:22.241 --> 21:23.367
అది నిక్ ది.

21:23.450 --> 21:24.910
అతను దాన్ని చూసుకుని చాలా గర్వపడతాడు.

21:26.995 --> 21:28.121
అది నిజం.

21:31.333 --> 21:32.543
- థాంక్యూ.
- ఏం ఫర్వాలేదు.

22:08.829 --> 22:10.122
- అది తీసుకో.
- అలాగే.

22:10.622 --> 22:11.456
సారీ.

22:12.708 --> 22:14.793
హలో, హలో. లోపలికి రండి.

22:14.877 --> 22:17.296
మనకి కొత్త కాఫీ మెషీన్ వచ్చింది.

22:18.380 --> 22:20.174
మనందరి కోసం నేను కాఫీ చేస్తాను.

22:22.342 --> 22:23.635
వాళ్లు నిన్ను బయటకి గెంటేశారా?

22:23.719 --> 22:25.554
- అమ్మా.
- లేదు, వాళ్లు నన్ను గెంటేయలేదు.

22:25.637 --> 22:26.597
నేను ఊరికే అడుగుతున్నాను.

22:26.680 --> 22:29.391
ఆ ఇల్లు కూలిపోయేలా ఉంది,
తన కోసం ఇంకో మంచి ఇల్లు వెతికే పనిలో ఉన్నాం.

22:29.474 --> 22:31.935
- అయితే, తను నీతో ఎందుకు ఉండటం లేదు?
- అయ్యో, చాలా సంతోషం, అమ్మా.

22:32.019 --> 22:34.313
కానీ, నేను ఊరికే అంటున్నాను,
ఇది నిజానికి రిట్జ్ హోటల్ అంత గొప్ప వసతి కాదు.

22:34.396 --> 22:36.023
నువ్వు ఇక్కడికి తిరిగి రావాలని ఎందుకు అనుకున్నావు?

22:36.106 --> 22:37.232
మా ఇంట్లో ఖాళీ బెడ్ రూమ్ ఇంకొకటి లేదు.

22:38.400 --> 22:41.153
నువ్వు ఆ పెద్ద ఇంట్లో ఉండటం లేదనే
విషయాన్ని మర్చిపోతున్నాను.

22:42.571 --> 22:44.656
చూడు, ఇది నీకు సమస్యగా అనిపిస్తే, నేను వేరే…

22:44.740 --> 22:46.575
లేదు, ఖచ్చితంగా సమస్య లేదు.

22:47.659 --> 22:48.952
నేను ఊరికే అడుగుతున్నాను.

22:49.620 --> 22:51.038
నువ్వు ఊరికే అడుగుతున్నది స్పష్టంగా ఏంటి?

22:52.164 --> 22:55.083
నేను ఊరికే అంటున్నాను, మీరు ఇద్దరూ
మీ జీవితాల్ని అల్లకల్లోలం చేసుకోవాలని

22:55.167 --> 22:57.419
- ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారో తెలుసుకుందామని.
- దేవుడా. చెత్త.

22:57.503 --> 22:59.171
కెఫైన్ లేని కాఫీ ఎవరికి కావాలి?

22:59.254 --> 23:01.048
- నాకు కావాలి.
- మన దగ్గర డికాఫ్ లేదు, రాన్.

23:01.131 --> 23:05.260
- ఆ వెండి డబ్బాల్లో ఉన్నది డికాఫ్ కదా.
- కాదు, నీలం డబ్బాలు కానీ అవి అయిపోయాయి.

23:05.886 --> 23:06.887
అయినా కూడా కాఫీ కావాలా?

23:06.970 --> 23:09.848
నా ఆందోళనని పెంచుకోవడానికి
ఇది మంచి సమయం అనుకుంటా.

23:12.476 --> 23:14.603
నీ బ్యాగ్స్ ని మేడ మీద పెట్టి వస్తాను.

23:14.686 --> 23:16.271
ఆండీ, నీ కాఫీ.

23:16.355 --> 23:18.190
అలాగే, నాన్నా, నేను తరువాత తీసుకుంటాను.

23:40.420 --> 23:44.466
స్టాప్ అండ్ షాప్ లో
బ్రూస్ ఇంకా అతని కుటుంబాన్ని చూశాను.

23:44.550 --> 23:48.929
అతనికి ఇద్దరు ముచ్చటైన పిల్లలు,
అందమైన చర్మ సౌందర్యంతో ఉన్నారు.

23:49.012 --> 23:52.224
బ్రూస్ కన్నా తెల్లగా ఉన్నారు
ఎందుకంటే అతని భార్య తెల్లగా ఉంటుంది.

23:52.307 --> 23:53.308
అది గొప్ప విషయం, అమ్మా.

23:53.392 --> 23:56.979
ఏది ఏమైనా, మన మధ్య ఏం ఉన్నా కూడా,
అతను నన్ను చూసి చాలా సంతోషించాడు.

23:57.062 --> 24:00.649
అప్పట్లోనే నువ్వు అతడిని పెళ్లి చేసుకుని ఉంటే
పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉండేవా అని

24:00.732 --> 24:02.192
నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను.

24:02.276 --> 24:04.111
పెళ్లయినా నేను నేనులాగే ఉండేదాన్ని.

24:04.194 --> 24:06.488
- నీకు అతడితో పెళ్లి కుదిరిందా?
- అదొక పెద్ద కథ.

24:06.572 --> 24:08.323
తన పెళ్లి నుంచి తనే పారిపోయింది.

24:08.407 --> 24:10.367
- నాకు మతిస్థిమితం పోయింది.
- నాకు తెలుసు.

24:10.450 --> 24:13.287
నేను నిన్ను నిందించడం లేదు. ఊరికే అంటున్నాను.

24:14.788 --> 24:15.914
మన ప్లాన్ మారిపోయింది.

24:16.874 --> 24:18.208
- మనం వెళ్తున్నాం.
- సరే.

24:18.292 --> 24:19.501
ఒక క్షణం ఆగు, ఏం అయింది?

24:19.585 --> 24:20.586
ఎక్కడికి వెళ్తున్నారు?

24:20.669 --> 24:22.754
నువ్వు తన గదిని సర్దలేకపోయావా? పక్క కూడా సర్దలేదా?

24:22.838 --> 24:24.131
నేను చేయాలి అనుకుంటున్నాను.

24:24.214 --> 24:25.591
సరే.

24:25.674 --> 24:27.384
పద, వెళదాం.

24:29.970 --> 24:31.013
ఐ లవ్ యూ, అమ్మా.

24:32.472 --> 24:33.807
లవ్ యూ, నాన్నా.

24:34.516 --> 24:35.517
పదండి.

24:36.393 --> 24:37.394
ఈ వైపు.

24:42.983 --> 24:44.359
ఎవరూ కాఫీ తాగలేదు.

24:53.076 --> 24:55.913
నాయనమ్మ బాగా చిరాకు పెట్టిస్తుంది.

24:55.996 --> 24:57.414
బుజ్జీ, నీకు అసలు ఏమీ తెలియదు.

24:57.497 --> 24:58.957
నువ్వు నా గదిలోకి వచ్చేయ్, ఆలీ.

24:59.833 --> 25:03.170
అది ముచ్చటైన మాట, బాబూ,
కానీ నేను నీ ఏకాంతాన్ని భగ్నం చేయను.

25:03.253 --> 25:04.588
మరేం ఫర్వాలేదు.

25:04.671 --> 25:06.131
నేను అక్కడ ఎక్కువగా ఉండను.

25:11.803 --> 25:12.804
చెత్త.

25:22.231 --> 25:24.191
తలుపు దగ్గర అలా నిలబడకు, భయమేస్తుంది.

25:26.401 --> 25:27.444
సారీ.

25:27.528 --> 25:30.405
ఇదిగో, ఇదే చివరిది.

25:30.489 --> 25:31.949
మంచిది. థాంక్స్.

25:32.533 --> 25:34.409
చూడు, నిన్ను ఇలా ఇల్లు మార్పించినందుకు సారీ.

25:34.493 --> 25:35.536
ప్లీజ్. నాకేం బాధ లేదు.

25:35.619 --> 25:37.746
నా కాళ్ల మీద నేను మళ్లీ నిలబడటానికి
నాకు కాస్త సమయం పడుతుంది,

25:37.829 --> 25:39.456
ఆ తరువాత నీకు వేరే చోట మకాం ఏర్పాటు చేస్తాను, సరేనా?

25:39.540 --> 25:41.959
ఆండీ, నువ్వు చాలా ఏళ్ల నుంచి నన్ను చూసుకుంటున్నావు.

25:42.042 --> 25:43.752
నన్ను ఎంత ఇబ్బంది పెట్టావని అనుకున్నా,

25:43.836 --> 25:45.754
నువ్వు ఎప్పుడూ సగటు అన్నకన్నా ఎక్కువే చేశావు.

25:48.048 --> 25:49.424
నువ్వు లేకపోతే నేను ఎటో వెళ్లిపోయేదాన్ని.

25:52.886 --> 25:53.887
దేవుడా.

25:55.848 --> 25:57.724
సమంత లెవిట్
ఎటాచ్మెంట్ 1 ఇమేజ్

26:00.978 --> 26:03.564
నేను కొన్ని పనులు చేసుకోవాలి.

26:04.106 --> 26:06.275
కాసేపు ఒక్కదానివే ఉండగలవా?

26:06.358 --> 26:07.776
నన్ను ఎవరూ చూసుకోనక్కరలేదు.

26:07.860 --> 26:09.695
- వెళ్లు. నీ బతుకు నువ్వు బతుకు.
- సరే.

26:10.362 --> 26:12.364
ఇదంతా శుభ్రం చేసుకో. ఇవన్నీ తీసేయ్. కానివ్వు.

26:14.032 --> 26:16.410
ఎనభై ఏళ్ల కిందట ఎప్పుడో,
హిట్లర్ నుండి తప్పించుకుని హెర్షెల్ లెవిట్

26:16.493 --> 26:18.078
అమెరికాకి వలసి వచ్చి,

26:18.161 --> 26:20.455
కొంత డబ్బు సంపాదించి ఒక చిన్న హొటల్ కొన్నాడు

26:20.539 --> 26:22.749
అది న్యూ యార్క్ సంపన్నుల ప్రదేశంలో
ఇంటర్ స్టేట్ రహదారికి దగ్గరగా ఉండేది.

26:22.833 --> 26:26.086
మధుమేహ వ్యాధిగ్రస్తుడైన అతని మనవడు పాల్,
సమంత భర్త,

26:26.170 --> 26:27.629
ఆ కుటుంబ వ్యాపారం బాధ్యతల్ని తీసుకున్న సమయానికి,

26:27.713 --> 26:30.465
తొమ్మిది రెస్టారెంట్లుగా ఇంకా మరికొన్ని ఖరీదైన హోటళ్లుగా
వాళ్ల వ్యాపారం విస్తరించింది.

26:31.091 --> 26:32.551
ఇంక ఇప్పుడు, హెర్షెల్ వ్యాపార సామ్రాజ్యం,

26:32.634 --> 26:34.386
దాదాపుగా అతని కుటుంబాన్ని వందేళ్లుగా పోషించి,

26:34.469 --> 26:37.264
న్యూ యార్క్ ప్రభుత్వ విడాకుల చట్టంలోని
లొసుగుల కారణంగా కూలిపోబోతోంది

26:37.931 --> 26:41.268
అదంతా ఎందుకంటే పాల్
తన స్త్రీలోలత్వాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్ల.

26:42.436 --> 26:43.437
హేయ్.

26:45.022 --> 26:46.273
సారీ. అది ఏంటి?

26:47.441 --> 26:48.317
అది నిక్ ది.

26:48.942 --> 26:50.777
అవును. మంచి అభిరుచి ఉన్నవాడు అనుకుంటా.

26:50.861 --> 26:52.321
నిక్ కారుని నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు?

26:52.404 --> 26:53.697
అంటే, మేము కార్లు మార్చుకున్నాం

26:53.780 --> 26:55.407
ఎందుకంటే హంటర్ కోసం
డ్రమ్ కిట్ తీసుకువెళ్లాల్సి వచ్చింది.

26:55.490 --> 26:57.159
నాకు ఆ కారుని తిరిగి ఇచ్చే టైమ్ లేకపోయింది. అది…

26:57.242 --> 26:58.327
చాలా హడావుడి అయింది.

26:58.410 --> 27:00.162
దాన్ని గరాజ్ లో పెట్టమంటావా?

27:01.538 --> 27:02.873
లేదు, నాకు ఇంకో మంచి ఆలోచన తట్టింది.

27:05.584 --> 27:07.920
ఆగు. ఆగు, నా పిరుదులు తాకు.

27:08.420 --> 27:12.007
అదీ. కానివ్వు. ఓహ్, దేవుడా.

27:12.591 --> 27:13.592
అదీ.

27:13.675 --> 27:16.011
అదీ. కానివ్వు. దేవుడా.

27:20.015 --> 27:23.060
ఆగు. కానివ్వు.

27:24.645 --> 27:25.646
కానివ్వు!

27:26.522 --> 27:28.440
ఈ కొత్త కారు వాసన నిక్ కి నచ్చుతుంది.

27:29.858 --> 27:31.818
మరి, ఈ రోజు నువ్వు క్లబ్ నుంచి చాలా త్వరగా వెళ్లిపోయావు.

27:32.486 --> 27:34.446
అవును, నేను కొన్ని కుటుంబ పనులు చేయాల్సి వచ్చింది.

27:34.530 --> 27:36.240
- సరే, అంతా బాగానే ఉందా?
- హా.

27:36.323 --> 27:38.075
అదీ… నిజంగా. అంతా బాగుంది.

27:39.284 --> 27:42.454
నీకు తెలుసా, ఈ రోజుల్లో క్లబ్ కి వెళ్లడం
రానురానూ కష్టం అయిపోతోంది.

27:42.538 --> 27:44.122
అక్కడ నాకు నచ్చే విషయం నిన్ను చూడటం

27:44.206 --> 27:47.000
ఇంకా మన మధ్య ఏమీ లేదన్నట్లుగా మనం నటించాల్సి రావడం.

27:47.084 --> 27:48.836
అవును. కానీ, క్లబ్ లో నా చుట్టూ ఇంకో గొడవ జరగడాన్ని

27:48.919 --> 27:51.421
నేను భరించే పరిస్థితుల్లో లేను.

27:51.505 --> 27:53.423
ఓహ్. దేవుడా, లేదు. నీ విషయం ఇప్పటికే పాతబడిపోయింది.

27:53.507 --> 27:55.592
నా వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది.

27:55.676 --> 27:57.970
నీకు తెలుసా, అతని గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు
నాతో మాట్లాడాలని ప్రయత్నించింది

27:58.053 --> 27:59.888
హెన్రీ ఆందోళనపడే మనస్తత్వం గురించి.

27:59.972 --> 28:01.139
ఆ చర్చ ఎలా సాగింది?

28:01.223 --> 28:03.058
ఆమె ఆశించినంత మంచిగా జరగలేదు.

28:03.141 --> 28:06.603
నిజాయితీగా చెప్పాలంటే, ఆమెని ద్వేషించాలో
లేక తనని చూసి జాలిపడాలో నాకు తెలియడం లేదు.

28:08.188 --> 28:10.107
అయితే, అతడిని ద్వేషించు. ఆమెని చూసి జాలిపడు.

28:12.442 --> 28:13.443
నీతో శృంగారం చేయాలి.

28:13.527 --> 28:14.736
ఖచ్చితంగా.

28:17.322 --> 28:19.491
దేవుడా, హెన్రీ ఆందోళనపడే
రోగి అని తెలిసి ఇప్పుడు నాకు కంగారుగా ఉంది.

28:20.075 --> 28:22.327
- ఆమె గురించే ఆలోచిస్తున్నావు, హా?
- అవును.

28:22.411 --> 28:23.912
నాకు తెలుసు. అది చాలా ఆందోళన పెడుతోంది.

28:24.913 --> 28:26.206
నువ్వు వెళ్లిపోతున్నావా?

28:27.124 --> 28:30.711
కానీ, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను.

28:30.794 --> 28:32.379
పిల్లలు మేలుకొనే లోపే వెళ్లిపోవచ్చు అనుకున్నాను.

28:35.007 --> 28:36.258
అది గొప్ప ఐడియా.

28:37.801 --> 28:39.928
మనం పాడ్ కాస్ట్ వినచ్చు.

28:41.597 --> 28:42.806
ఒక మంచి పాడ్ కాస్ట్ ఉంది.

28:44.308 --> 28:47.769
అది ఇంటిని చక్కబెట్టుకోవడం గురించి.

28:47.853 --> 28:49.479
- ఇంకా…
- సరే.

28:50.480 --> 28:53.567
…మనం డబ్బాల మీద మూతల్ని ఎలా తీయాలనే దాని గురించి.

28:53.650 --> 28:55.527
సరే. అది తెలివైన పని.

28:56.445 --> 28:57.905
అవును, ఇంకా తరువాత…

28:58.864 --> 29:01.950
ఒక గది నుండి మన సామాన్లు
ఎలా సర్దుకోవాలి అనే దాని గురించి.

29:03.535 --> 29:04.786
మనకి ఒక లగేజ్ గది ఉంటుంది.

29:04.870 --> 29:06.413
అది చాలా సౌకర్యంగా ఉంటుంది.

29:35.526 --> 29:36.777
వద్దా? సరే.

29:39.112 --> 29:41.365
ఈ రోజు మీ నాన్నతో ఎలా గడిచింది?

29:41.949 --> 29:42.908
బాగా గడిచింది.

29:42.991 --> 29:44.284
మీరిద్దరూ కలిసి ఏదైనా సరదా పని చేశారా?

29:47.663 --> 29:49.748
మీ నాన్నతో సరదాగా గడపడంలో తప్పు లేదు, తెలుసా.

29:49.831 --> 29:51.875
అది నాకు ఎలాంటి బాధ కలిగించదు, ప్రామిస్.

29:53.252 --> 29:54.253
నాకు తెలుసు.

29:58.215 --> 29:59.591
ఆయనని మిస్ అయినా ఫర్వాలేదు.

30:00.801 --> 30:03.136
నిజం చెప్పాలంటే, గతానికి ఇప్పటికీ
పెద్దగా తేడా ఏమీ అనిపించడం లేదు.

31:34.186 --> 31:35.187
ఎందుకు?

31:45.322 --> 31:46.865
నేను మూత్రం పోసుకున్నాను.

31:53.288 --> 31:54.289
నాకు అర్థమైంది.

31:56.708 --> 31:58.418
నన్ను పడుకోపెడతావా?

31:58.502 --> 31:59.628
తప్పకుండా, బుజ్జీ.

31:59.711 --> 32:01.129
మనం ఎక్కడికి వెళ్లాలి?

32:01.213 --> 32:03.340
- అక్కడికి.
- సరే, మంచం మీదకి ఎక్కు.

32:03.423 --> 32:04.842
ఇదిగో.

32:04.925 --> 32:07.553
నీకు దుప్పటి కప్పనివ్వు. ఇదిగో ఇలా.

32:07.636 --> 32:09.555
సరే, గుడ్ నైట్. గుడ్ నైట్.

32:11.265 --> 32:12.766
నాకు నా డ్రాగన్ కావాలి.

32:12.850 --> 32:14.935
- అది ఎక్కడ ఉంది?
- ఆ డ్రెసింగ్ టేబుల్ మీద ఉంది.

32:16.854 --> 32:18.772
ఓహ్, అవును, అదిగో ఇక్కడ ఉంది.

32:20.858 --> 32:23.151
ఇదే కదా, హా? సరే.

32:24.194 --> 32:26.321
సరే, బుజ్జీ, ఇదిగో నీ డ్రాగన్.

32:30.367 --> 32:32.995
నాకు నిద్రవచ్చే వరకూ నాతో ఉండగలవా?

32:43.255 --> 32:44.715
తప్పకుండా, బుజ్జీ, తప్పకుండా.

32:44.798 --> 32:46.341
నేను ఇక్కడే ఉంటాను, సరేనా?

32:47.134 --> 32:49.219
ఇక్కడే కూర్చుంటాను, మన ఇద్దరం నిద్రపోదాం.

32:49.303 --> 32:50.304
సరే.

32:50.387 --> 32:51.763
ఇదిగో కూర్చున్నాను, బుజ్జీ.

32:58.729 --> 33:00.314
ఇలాంటి సంఘటనలు నాకు ఎదురయ్యాయి,

33:00.397 --> 33:02.191
వేరొకరి ఇళ్లలో అర్ధరాత్రి వేళల్లో

33:02.274 --> 33:05.110
నేల మీద కూర్చుని, వేరొకరి పిల్లల్ని నిద్రపుచ్చినప్పుడు,

33:05.819 --> 33:08.780
నేను వాస్తవంగా ఎటూ వెళ్లకుండానే
నా సొంత జీవితం నుండి ఎంత దూరంగా వెళ్తున్నానో

33:09.406 --> 33:10.991
నేను గ్రహించగలిగాను.

33:29.218 --> 33:30.052
హలో?

33:31.178 --> 33:32.471
గుడ్ మార్నింగ్.

33:33.263 --> 33:35.807
నీ వంటగదిలో వస్తువులు వెతుక్కోవడంలో
నేను కాస్త ఇబ్బంది పడ్డాను,

33:35.891 --> 33:40.479
అందుకని నేను బయటకి వెళ్లి
చిన్నప్పుడు మనకు ఇష్టమైనవన్నీ తెచ్చాను.

33:41.688 --> 33:42.814
పాలు తీసుకువచ్చావా?

33:42.898 --> 33:44.274
అయ్యో.

33:44.358 --> 33:46.443
ఊరికే అంటున్నాను. పాలు ఉన్నాయి. అనుకుంటా.

33:46.527 --> 33:47.778
వెధవ.

33:52.282 --> 33:54.910
సరే, శామ్ లెవిట్.

33:54.993 --> 33:55.911
అవును.

33:56.411 --> 33:58.413
అంటే, నువ్వు ఇప్పుడు చెబుతున్నావు కాబట్టి,
నాకు అర్థం అవుతోంది.

33:59.081 --> 34:02.167
మీరిద్దరూ అందంగా ఉంటారు ఇంకా
తాజాగా ఒంటరివాళ్లు అయ్యారు.

34:02.251 --> 34:03.335
ఇక్కడ ఇంకెవరూ సింగిల్ గా లేరు.

34:03.418 --> 34:06.463
కాబట్టి, అది శామ్ లెవిట్ అయినా కావాలి
లేదా, చూడు, వ్యభిచారం అయినా కావాలి.

34:06.547 --> 34:08.632
నేను ఆ విషయం నీకు చెప్పకుండా ఉండాల్సిందని
ఇప్పుడు అనిపిస్తోంది.

34:08.715 --> 34:09.925
నా ఉద్దేశం, నన్ను తప్పుగా అనుకోకు.

34:10.759 --> 34:12.052
శామ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

34:12.135 --> 34:13.387
నాకు గుర్తున్నంత వరకూ.

34:14.388 --> 34:15.514
నువ్వు చాలా చేయచ్చు.

34:17.724 --> 34:19.560
- కదా?
- ఫర్వాలేదు.

34:19.643 --> 34:20.643
ఏంటి?

34:22.855 --> 34:25.983
నా ఉద్దేశం, మనం వాళ్లని డిన్నర్ కి పిలిచేవాళ్లం.

34:26.065 --> 34:27.442
మేము అక్కడికి వెళ్లేవాళ్లం.

34:27.525 --> 34:29.820
నిక్ ఇంకా ఐవీ కూడా. ఇప్పుడు నిక్, మెల్ తో ఉన్నాడు.

34:30.404 --> 34:33.239
నేను శామ్ తో శృంగారం చేస్తున్నాను,
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను.

34:33.322 --> 34:35.742
ఈ విశ్వాన్ని అంతా ఎవరో కుదిపేసినట్లు

34:35.826 --> 34:38.036
ఆ కుదుపులో నేను ఎక్కడో తప్పిపోయినట్లు అనిపిస్తోంది.

34:40.038 --> 34:41.373
నా జీవితంలోకి స్వాగతం.

34:44.793 --> 34:45.878
నేను ఇదంతా శుభ్రం చేస్తాను.

34:47.212 --> 34:49.590
- నువ్వు చేస్తావా?
- బహుశా చేయనేమో.

34:52.050 --> 34:54.428
నిక్ బ్రాండెస్
హేయ్ బేబీ. ఎక్కడ ఉన్నావు?

34:54.511 --> 34:59.266
సరుకులు. ఆలస్యం అయింది.
టోరీ కోసం క్లబ్ దగ్గర కలుస్తాను

35:02.102 --> 35:03.187
నీ వయసు ఎంత, టోనీ?

35:04.938 --> 35:06.815
నేను ఈ మధ్యనే 41 దాటాను.

35:06.899 --> 35:08.192
నలభై ఒకటి.

35:08.692 --> 35:10.402
చాలా మంచి వయసు. ఆ వయసు నాకు గుర్తుంది.

35:10.485 --> 35:14.907
ముప్పైల వయసులో మనుగడ కోసం చాలా కష్టాలు పడి

35:15.908 --> 35:18.368
అప్పుడే ఎదుగుతున్నట్లు ఫీల్ అయ్యే వయసు అది.

35:18.452 --> 35:20.495
తరువాత మనం ముసలివాళ్లం అయిపోతాం,
ఇంక ఎదగడానికి ఏమీ ఉండదని గ్రహిస్తాం.

35:20.579 --> 35:22.289
మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు.

35:23.415 --> 35:25.375
బార్ లో పగటి పూట తాగుతూ ఉంటాం.

35:25.459 --> 35:27.127
దేని కోసమో ఆశగా ఎదురుచూస్తుంటాం.

35:28.253 --> 35:29.713
నువ్వు బాగానే ఉన్నావా?

35:30.672 --> 35:31.715
బాగున్నాను.

35:32.466 --> 35:33.592
నన్ను పట్టించుకోకు.

35:33.675 --> 35:34.843
చూడు,

35:36.220 --> 35:38.263
నేను నీకంటే పెద్దవాడిని అని ఎప్పుడూ అనుకుంటాను.

35:38.347 --> 35:39.598
ఘోరంగా అబద్ధం చెబుతావు.

35:40.807 --> 35:41.808
నీకు ఇంకొకటి కావాలా?

35:42.434 --> 35:44.019
అవును, కానీ నేను తాగబోవడం లేదు.

35:49.024 --> 35:50.317
థాంక్యూ, యువకుడా.

35:51.401 --> 35:52.486
ఈ రోజుని బాగా ఆస్వాదించు.

36:28.230 --> 36:30.732
బ్రాడ్ ఇంకా జూలీ స్పెర్లింగ్ ఇంట్లో లేరు.

36:31.483 --> 36:32.317
అదీ!

36:32.401 --> 36:35.195
అది నాకు తెలుసు ఎందుకంటే
వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు ఖచ్చితంగా తెలుసు.

36:40.284 --> 36:44.663
అది నాకు తెలుసు ఎందుకంటే
నేను కూడా వాళ్లతో పాటు ఉండాల్సింది.

36:57.593 --> 37:00.596
అవుట్, 30, 40.

37:11.064 --> 37:12.024
డ్యూస్.

37:19.823 --> 37:20.908
బింగో.

37:32.461 --> 37:33.879
హలో?

37:36.965 --> 37:39.176
జూల్స్ ఒక పెద్ద జపనీస్ బ్యాంక్ కి
విలీనాలు, స్వాధీనాల విభాగంలో పని చేసింది

37:39.259 --> 37:42.346
ఇంకా ఆమె తన చాలామంది పురుష పోటీదారుల్ని
ఓడించి మరీ విజయాలు సాధించింది.

37:43.347 --> 37:45.349
ఆమె భర్త బ్రాడ్
న్యూ ఇంగ్లండ్ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి

37:45.432 --> 37:48.268
ఇంకా అతని వంశవృక్షం మేఫ్లవర్ వారసత్వంగా చెప్పబడుతుంది.

37:49.186 --> 37:50.270
నేను చెప్పగలిగినంత వరకూ,

37:50.354 --> 37:53.232
బ్రాడ్ తన సమయం అంతా గోల్ఫ్ ఆడుతూ
యుద్ధాల గురించి పుస్తకాలు చదువుతూ గడిపాడు.

37:54.024 --> 37:55.817
అవకాశం ఉంటే అంతకన్నా మంచి పని లేదు.

37:55.901 --> 37:57.903
చెల్సియా, వాళ్ల కుమార్తె చక్కని చిన్నారి

37:57.986 --> 38:00.531
సరిగ్గా ఇప్పుడు టెన్నిస్ కోర్టులో నా కూతురి చేతులో

38:00.614 --> 38:02.407
బహుశా ఓడిపోయే పరిస్థితిలో ఉంటుంది.

38:46.660 --> 38:49.413
రిచర్డ్ మిలె ఫిలిప్ మాసా ఆటోమాటిక్ క్రోనోగ్రాఫ్

38:49.496 --> 38:51.707
ప్రత్యేకమైన రోజ్ గోల్డ్ ఇంకా టైటానియమ్
అంచుతో తయారు చేయబడింది

38:51.790 --> 38:56.003
దాని విలువ రెండు లక్షల పాతిక వేల డాలర్ల పైనే ఉండచ్చు.

38:56.086 --> 38:57.921
బ్రాడ్ ఈ వాచీ పెట్టుకోవడం నేను చూసి చాలా ఏళ్లయింది,

38:58.005 --> 39:00.090
కాబట్టి అతను ఈ వాచీని పెద్దగా మిస్ కాకపోవచ్చు.

39:00.174 --> 39:02.009
అతనికి ఈ వాచీ ఉందన్న విషయం
బహుశా మర్చిపోయి ఉంటాడు కూడా.

39:16.190 --> 39:18.358
అవుట్! గేమ్, సెట్, మ్యాచ్.

39:18.442 --> 39:20.485
టోరీ కూపర్ ఫైనల్ కి వెళుతుంది.

39:44.301 --> 39:45.719
ప్రశ్న ఇంకా సమాధానం సేవ

39:45.802 --> 39:48.931
జూల్స్ ఇంకా బ్రాడ్
ఏ అవకాశాన్నీ వదులుకునేలా లేరు.

39:49.014 --> 39:53.060
వచ్చే నెల జరిగే అంచనా పరీక్ష ప్రశ్నపత్రాన్ని ముందే కొని,
వాటి జవాబులతో సహా సిద్ధం చేశారు.

40:09.535 --> 40:10.994
థర్టీ ఆల్.

40:22.923 --> 40:24.216
సారీ, సారీ, అందరికీ.

40:24.299 --> 40:27.010
ఎక్స్ క్యూజ్ మీ.

40:27.094 --> 40:28.929
సారీ. సారీ, అందరికీ.

40:29.513 --> 40:30.639
నిజంగానా?

40:30.722 --> 40:32.307
సరే. నాకు తెలుసు, సారీ.

40:32.391 --> 40:34.351
ఇంతకన్నా ముఖ్యమైన పని నీకు ఇంకోటి ఏం ఉంది?

40:34.434 --> 40:36.520
- నువ్వు రెండు మ్యాచ్ లు మిస్ అయ్యావు.
- ఏదో పని పడింది, సరేనా?

40:36.603 --> 40:37.896
చూడు, తను బాగానే ఆడినట్లుంది.

40:37.980 --> 40:39.940
పరాచికాలా? తను అదరగొట్టేసింది.

40:41.441 --> 40:43.443
నీ కూతురి ఆట చూడటానికి రమ్మని నేను చెప్పానంటే,

40:43.527 --> 40:44.778
సరైన సమయానికి రమ్మని అర్థం.

40:46.613 --> 40:48.115
నువ్వు ఒక హాస్య చిత్రంలా మారిపోతున్నావు.

40:48.198 --> 40:49.241
నేను ఇప్పటికే సారీ చెప్పాను కదా.

40:49.324 --> 40:51.410
నువ్వు క్షమాపణలు చెప్పాల్సింది నాకు కాదు.

40:51.493 --> 40:53.912
- సరే, ఇంక ఆపేద్దామా?
- సరే.

41:04.715 --> 41:06.884
- ఫోర్టీ, థర్టీ.
- శభాష్ అమ్మాయి.

41:19.938 --> 41:21.190
- అవుట్! డ్యూస్.
- అదీ.

41:22.941 --> 41:24.359
శభాష్, చెల్స్.

41:32.034 --> 41:34.578
ఇది ఒక విచిత్రమైన అనుభూతి
ఎందుకంటే మనం ఎవరితో ఉన్నామో

41:34.661 --> 41:37.456
వాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్ల వస్తువుల్ని చూసి,

41:37.539 --> 41:41.502
వాళ్లకి చెందిన రెండు లక్షల పాతిక వేల డాలర్ల వాచీని
మన జేబులో పెట్టుకుని ఉంటే, వాళ్లకి అది తెలియకపోవడం.

41:41.585 --> 41:42.586
అడ్వాంటేజ్, టోరీ…

41:42.669 --> 41:45.255
నేను నిజాయితీగా చెప్పాలంటే,
నేనీ అనుభూతిని ద్వేషించడం లేదు.

41:52.095 --> 41:53.639
- బాంగ్. అదీ, అదీ, అదీ!
- అదీ!

41:55.098 --> 41:56.433
గేమ్, సెట్, మ్యాచ్.

41:56.517 --> 41:58.018
శభాష్ అమ్మాయి!

41:59.394 --> 42:01.313
అదీ, అదీ, అదీ!

42:02.564 --> 42:03.899
నువ్వు నెట్ వైపు దూసుకెళ్లావు.

42:03.982 --> 42:05.359
అవును, అది టెన్నిస్ లో మామూలు విషయం.

42:07.361 --> 42:08.403
ఇలా రా.

42:10.364 --> 42:13.408
చిన్న చిన్న దొంగతనాలు నా సమస్యలకి పరిష్కారాలని

42:13.492 --> 42:14.493
నేను అనుకున్నానని కాదు.

42:14.576 --> 42:17.621
కానీ లూ ఎలాంటి ప్రశ్నలు అడగకుండా
నాకు 65 వేల డాలర్లు ఇచ్చేసింది.

42:17.704 --> 42:18.956
ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో

42:19.039 --> 42:22.334
పన్ను చెల్లించే అవసరం లేని పెట్టుబడి గురించి
వాదించడం కూడా కష్టమైన విషయం.

42:22.417 --> 42:24.378
హేయ్, రాకో, కదా?

42:24.461 --> 42:25.462
లూ ఉందా?

42:29.424 --> 42:30.717
అవును, ఎవరో నీ గురించి అడుగుతున్నారు.

42:32.094 --> 42:35.472
లేదు, అతను ఆ తెల్ల జాతీయుడు,
తన జుట్టుని బాగా దువ్వుకుంటాడు అనుకుంటా.

42:36.473 --> 42:37.599
సరే.

42:56.785 --> 42:57.995
ఆ బేరం ఆడేవాడు.

42:58.495 --> 43:00.080
నిన్ను మళ్లీ కలవడం సంతోషం.

43:05.335 --> 43:06.503
రిచర్డ్ మిల్.

43:08.714 --> 43:09.798
చాలా ఆకర్షణీయంగా ఉంది.

43:13.218 --> 43:15.679
నీ భార్య దీనిని కూడా అమ్మేయమందా?

43:15.762 --> 43:18.849
- నేను విడాకులు తీసుకున్నాను.
- అబద్ధం ఆడకు.

43:21.226 --> 43:23.770
నన్ను ఊహించనివ్వు,
నువ్వు దీనికి కూడా పత్రాలు పోగొట్టుకున్నావు కదా?

43:27.900 --> 43:29.067
ఇంటికి వెళ్లు, బేరం ఆడేవాడా.

43:29.151 --> 43:31.069
- ఏంటి?
- పత్రాలు లేకపోతే, కొనుగోలు చేయం.

43:31.153 --> 43:32.988
ఇలాంటివి నువ్వు అమ్మగలవని
గతంలో నాకు చెప్పావు అనుకుంటా.

43:33.071 --> 43:34.448
ఇప్పుడు నీకు చెబుతున్నాను

43:34.531 --> 43:36.283
- నువ్వు ఆ ప్రయత్నం విరమించుకో.
- …నాకు అమ్మారు…

43:36.366 --> 43:37.701
- నాకు అర్థం కాలేదు.
- …నీకు డబ్బు కావాలని.

43:37.784 --> 43:39.203
- నా సమస్య కాదు.
- నా రింగ్ ఇవ్వు.

43:39.286 --> 43:41.330
- నీకు రింగ్ ఇవ్వను.
- ఆ రింగ్ ఇవ్వు!

43:41.413 --> 43:44.541
- ముందు ఆ రింగ్ నాకు ఇచ్చేయ్!
- నేను ఈ పనిని ఎప్పుడో చేయాల్సింది.

43:44.625 --> 43:46.710
- ఇక్కడి నుండి బయటికి వెళ్లు.
- ఆ రింగ్ నాకు ఇవ్వు, రాకో!

43:46.793 --> 43:47.753
అది మా అమ్మ ఉంగరం!

43:47.836 --> 43:49.671
ఇక్కడ నా మీద కత్తి దూస్తావా?

43:49.755 --> 43:50.923
దేవుడా.

43:51.006 --> 43:53.175
చెత్తవెధవ. నువ్వు చెత్తవెధవవి, డోనీ.

43:53.258 --> 43:55.135
- ఇలా చూడు!
- నిన్ను మీ అమ్మనీ నాశనం చేస్తాను.

43:55.219 --> 43:57.679
- ఇంక చాలు, డోనీ.
- చూడు, నా ఉంగరం నాకు కావాలి, లూ.

43:57.763 --> 43:59.389
"నా ఉంగరం నాకు కావాలి, లూ."

43:59.473 --> 44:01.183
- నోర్మూయ్, రాకో.
- తన దగ్గర 200 తక్కువ అయ్యాయి.

44:01.266 --> 44:03.393
ఇలా చూడు, రాకో. బాబూ, అది మా అమ్మ ఉంగరం.

44:03.477 --> 44:04.603
ఎవరికి అబద్ధాలు చెబుతున్నావు?

44:04.686 --> 44:07.314
ఆ కత్తి కిందపడేసి నా దుకాణం నుండి బయటకి వెళ్లు.

44:14.363 --> 44:15.614
నువ్వు బయటకి వెళ్లచ్చు.

44:15.697 --> 44:19.618
లేదా వచ్చే ఆరు నెలలు నరకంలో ఉన్నట్లు గడపచ్చు.

44:23.747 --> 44:26.708
సరే, లూ. చూడు, నేను…
వదిలేయ్. సారీ, లూ. సరేనా? సారీ.

44:26.792 --> 44:29.127
- అది మా అమ్మ ఉంగరం.
- ఇంక, మళ్లీ రానని హామీ ఇవ్వు.

44:31.213 --> 44:32.464
ఇలా చూడు, లూ.

44:32.548 --> 44:33.715
ఆ మాటలు చెప్పు, డోనీ.

44:41.056 --> 44:42.599
నేను మళ్లీ రాను.

44:42.683 --> 44:44.184
నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే,

44:44.685 --> 44:46.770
నీ శరీరంలో పెద్ద రంధ్రంతో తిరిగి వెళతావు, అర్థమైందా?

44:51.859 --> 44:53.360
అలాగే, అలాగే.

44:53.443 --> 44:54.903
నువ్వు ఒక చీడపురుగువి, డోనీ.

45:11.086 --> 45:12.379
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు.

45:16.967 --> 45:19.469
హేయ్, చూడు, నేను కష్టాలలో ఉన్నాను.

45:20.137 --> 45:21.805
లేదు, నువ్వు కష్టాలలో లేవు.

45:22.306 --> 45:23.557
నువ్వు అలా అనుకుంటున్నావు అంతే.

45:24.808 --> 45:25.976
నేను నీకు సాయం చేయలేను.

45:26.059 --> 45:28.270
చూడు…ధర ఎంతో నువ్వే నిర్ణయించు.

45:31.356 --> 45:34.234
నిన్ను బయటకి పంపించమని రాకోకి చెప్పమంటావా?

45:52.336 --> 45:53.545
ఛ!

46:04.014 --> 46:05.057
నేను లూ మాట్లాడుతున్నాను.

46:05.766 --> 46:07.226
నేను ఒక కారు నెంబరు పంపిస్తున్నాను.

46:09.061 --> 46:11.021
అతని గురించి నాకు అన్ని వివరాలూ సేకరించాలి.

47:31.518 --> 47:33.520
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
