WEBVTT

00:19.269 --> 00:20.270
దేవుడా.

00:24.816 --> 00:25.859
దేవుడా.

00:39.957 --> 00:41.208
సరే.

00:46.004 --> 00:47.005
చెత్త.

00:48.632 --> 00:49.633
ఛ.

00:53.011 --> 00:54.054
క్లియర్ అమోనియా

01:11.822 --> 01:12.823
సరే.

01:14.825 --> 01:16.034
సరే.

01:22.499 --> 01:24.251
ఛ. ఛ.

01:32.926 --> 01:35.762
మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు:
ఈ కొలను ఒక మెటాఫర్.

01:36.680 --> 01:40.559
అలాగే ఇది చాలా నిజం ఇంకా చాలా చల్లగా ఉంది.

01:40.642 --> 01:43.854
సాధారణంగా బాగా ఆత్మపరిశీలన చేసుకునే రకం
మనుషుల లాంటివాడిని కాను నేను.

01:43.937 --> 01:45.397
నిజానికి, ఈ మధ్యకాలం వరకూ,

01:45.480 --> 01:47.357
వేరొకరి ఇంట్లో చనిపోయిన ఒక మనిషి తాలూకు

01:47.441 --> 01:49.568
రక్తంతో నిండిపోయిన నేల మీద

01:49.651 --> 01:52.154
నిద్రలేచే రకం మనిషిని కాను నేను,
కానీ ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం.

01:52.946 --> 01:53.947
కానీ ఆ సమయంలో కూడా,

01:54.031 --> 01:56.033
అల్లకల్లోలంగా మారిన నా జీవితాన్ని,

01:56.116 --> 01:57.492
నా కంటి కొన అంచుతో

01:58.243 --> 02:00.412
నేను పరికించి చూసుకోకుండా ఉండలేకపోయాను,

02:00.913 --> 02:05.083
ఇంకా నా జీవితంలో పరిణామాలన్నీ ఇంత వేగంగా
ఎలా జరిగిపోయాయా అని ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను.

02:08.002 --> 02:09.545
ఇది ఇలాగే జరుగుతుంది…

02:13.675 --> 02:14.510
లాయడ్, ఇలా రా.

02:14.593 --> 02:15.594
నాలుగు నెలల కిందట

02:15.677 --> 02:17.387
- షాట్స్ తాగుదాం రా. షాట్స్.
- ఇంకో రౌండా?

02:17.471 --> 02:18.514
అవును, బార్టెండర్.

02:18.597 --> 02:20.516
- మీకు ఏ షాట్స్ కావాలి?
- రమ్ తాగుదాం.

02:20.599 --> 02:22.684
ఆమె ఏం తాగుతోంది? మేము కూడా అదే తాగుతాం.
ఇది చూడటానికి బాగుంది.

02:23.477 --> 02:25.896
నువ్వు చూడటానికి బాగున్నావు.
నీకు ఏమైనా డ్రింక్ ఇవ్వమంటావా?

02:25.979 --> 02:27.231
పెద్ద ప్రమోషన్, బాబు!

02:27.314 --> 02:29.399
పెద్ద ప్రమోషన్. నువ్వు ఎంత సంపాదించావు?

02:29.483 --> 02:30.817
ఎంత సంపాదించావు?

02:36.907 --> 02:40.327
మెకల్లన్ 25. బార్టెండర్ నాకు కానుకగా ఇచ్చాడు.

02:41.787 --> 02:43.372
చాలా ఖరీదైన డ్రింక్.
ఇది తాగే అర్హత నాకు ఉంటే బాగుండు.

02:43.455 --> 02:45.165
దాని గురించి ఆలోచించకు. నువ్వు కొంటున్నావు.

02:46.166 --> 02:47.042
లివ్ క్రాస్.

02:47.125 --> 02:48.460
- ఆండ్రూ కూపర్.
- నాకు తెలుసు.

02:48.544 --> 02:50.003
నేను మైక్ షెపర్డ్ గ్రూపులో పని చేస్తున్నాను.

02:50.087 --> 02:51.922
సారీ. నిన్ను గుర్తుపట్టలేకపోయాను.

02:52.005 --> 02:54.591
ఫర్వాలేదు. మైక్ మమ్మల్ని ఎప్పుడూ
ఏడో అంతస్తు దాటి పైకి వెళ్లనివ్వడు.

02:56.260 --> 02:59.179
అక్కడ ఉన్న పాట్రిక్ బేట్మెన్ అభిమానుల అల్లరి
శ్రుతి మించుతోంది.

02:59.263 --> 03:01.348
నేను ఎవరితో అయినా ఉంటే మేలు అనుకున్నాను.

03:01.431 --> 03:02.307
నీకు సాయం చేయడం సంతోషం.

03:02.391 --> 03:04.810
అక్కడ ఉండగా ఒక క్షణం
నువ్వు నా దగ్గరకి రాబోతున్నావు అనిపించింది,

03:04.893 --> 03:05.727
కానీ నేను ఆగలేకపోయాను.

03:06.812 --> 03:11.108
అవును, అంటే, నేను చాలా కాలం తరువాత
ఈ మధ్యనే ఒంటరివాడిని అయ్యాను,

03:11.191 --> 03:12.651
ఆకట్టుకునే ఆటలో వెనుకబడ్డానేమో అని సందేహించా.

03:12.734 --> 03:14.653
ఆ ఆటలో వెనుకబడ్డాను అనడమే, నీ ఆట.

03:15.320 --> 03:18.073
- ఎంత పేలవంగా ఉందో చూడు. నా ఉద్దేశం తెలిసిందా?
- నీకు పెళ్లయిందా?

03:18.156 --> 03:19.908
అవును, పద్దెనిమిదేళ్లు.

03:19.992 --> 03:21.785
- అయితే అది నిన్ను…
- నీ దృష్టిలో ముసలివాడిని అవుతానేమో.

03:21.869 --> 03:23.495
నేను వయసుని ఆ రకంగా చూడను.

03:24.538 --> 03:26.623
- అది ఎందుకంటే, నీ వయసు, ఏంటి, ఇరవే ఏడా?
- ఇరవై ఎనిమిది.

03:26.707 --> 03:28.876
- కాబట్టి అది నీ ఆట.
- కావచ్చు.

03:30.127 --> 03:32.588
లేదా బహుశా వివాహం తాలూకు
సంప్రదాయాల చట్రంలో ఇరుక్కుపోయి ఉంటావు

03:32.671 --> 03:34.089
- ఇంకా పిల్లలు…
- ఇద్దరు.

03:34.173 --> 03:37.509
…చాలా కాలం పాటు, పెళ్లయి పిల్లలు ఉన్న
మిగతా చాలామంది దంపతుల మధ్య జీవించడం వల్ల,

03:37.593 --> 03:40.220
జనాభాలో చాలామంది వేరే విధంగా ఆలోచిస్తారని
వారి ఎంపికలు భిన్నంగా ఉంటాయని

03:40.304 --> 03:42.681
బహుశా మీ వర్గం గమనించకుండా ఉండిపోయి ఉంటుంది.

03:44.349 --> 03:45.350
అయితే నీ లక్ష్యాలు ఏంటి?

03:45.934 --> 03:47.352
ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ,

03:47.436 --> 03:48.812
గాఢమైన, ఆరోగ్యకరమైన సెక్స్,

03:48.896 --> 03:50.230
ఆర్థిక సుస్థిరత,

03:50.314 --> 03:52.149
మానసిక ప్రశాంతత, ఆనందం.

03:52.232 --> 03:54.776
- అందరి లక్ష్యాలు అవే అనుకుంట కదా.
- అయితే వాటిల్లో నువ్వు ఎన్ని సాధించావు?

03:56.069 --> 03:58.864
నేను ఊరికే అంటున్నా, కానీ బహుశా
నువ్వు ఆ రూల్సు గురించి కాస్త పునరాలోచించాలేమో.

04:00.824 --> 04:01.825
నేను నీకు తండ్రిని కాగలను.

04:01.909 --> 04:03.994
నాకు ఇప్పటికే ఒక తండ్రి ఉన్నారు. మిల్ట్.

04:04.077 --> 04:05.662
మంచి వాడు, నీకంటే కొద్దిగా పెద్ద వయసు.

04:05.746 --> 04:09.249
- విచిత్రంగా, ఇదొక విజయంలా అనిపిస్తోంది.
- అయితే నువ్వు బయట మరింత తిరగాలి.

04:09.333 --> 04:11.084
నేను ఇప్పుడు బయటే ఉన్నానుగా.

04:11.168 --> 04:13.253
లేదు, నువ్వు లేవు. నిజానికి లేవు. ఇంకా బయటకి రాలేదు.

04:14.046 --> 04:16.339
ఏమీ అనుకోకు, కానీ అందరితో నువ్వు ఇలాగే మాట్లాడతావా?

04:16.423 --> 04:18.634
- నాకు పెళ్లయిందో లేదో నువ్వు అడగలేదు.
- నీకు పెళ్లయిందా?

04:18.716 --> 04:20.135
అయింది. రెండేళ్ల కిందట.

04:20.219 --> 04:22.137
- కానీ, నీ వయసు మరీ చిన్నది.
- అప్పుడు చిన్నతనమే.

04:23.096 --> 04:24.806
తరువాత, అతనికి లావుగా ఉండే వేశ్యలంటే ఇష్టమని తెలిసింది.

04:24.890 --> 04:26.475
భిన్నమైన ఆలోచనాధోరణులు.

04:26.558 --> 04:29.019
విచిత్రం ఏమిటంటే,
టీనేజ్ వయసులో నేను చాలా లావుగా ఉండేదాన్ని,

04:29.102 --> 04:30.687
కానీ అది అతను నన్ను కలిసిన చాలా కాలం ముందు.

04:31.396 --> 04:33.357
ఇప్పటికీ, అతని బ్రౌజింగ్ హిస్టరీని
నేను అనుకోకుండా చూసినప్పుడు,

04:33.440 --> 04:36.777
నాలో ఒక లావుపాటి అమ్మాయి ఉందని
అతను గ్రహించి ఉంటాడని,

04:36.860 --> 04:38.070
అందుకే నన్ను ఇష్టపడ్డాడని అనిపించింది.

04:38.904 --> 04:41.406
నన్ను నమ్ము, నిన్ను ఇష్టపడటానికి అది కారణం కాదు.

04:41.490 --> 04:43.492
అదిగో ఇదే నీ ఆట.

04:47.496 --> 04:48.497
చూడు,

04:50.123 --> 04:53.627
నాకు అర్థం అయింది, చాలా వరకూ,
నీ వయసు కుర్రాళ్లు బుద్ధిహీనులు.

04:54.419 --> 04:56.463
అదిగో అక్కడ ఉన్నారు చూడు,

04:56.547 --> 04:58.799
ఆ… విస్కీ తాగిన మైకంలో కామవాంఛతో అల్లాడుతున్నారు.

04:59.967 --> 05:02.719
తమ మగతనం గురించి మురిసిపోయే ఆ కుర్రాళ్లకి
నీకున్న వివేకంలో కొంచెం కూడా ఉండదు,

05:02.803 --> 05:04.346
అది మాట్లాడటంలో అయినా మంచం మీద అయినా.

05:04.429 --> 05:08.308
కాబట్టి, వాళ్లతో పోల్చితే, నా వయసు మగవారు
మంచి ఎంపిక అనిపిస్తుంది, కదా?

05:08.392 --> 05:10.894
నేను ఆలోచిస్తాను. వివేకం ఉన్నవాడిని.
మగవాడిగా ఎక్కువ అనుభవం ఉన్నవాడిని,

05:10.978 --> 05:12.396
ఈ రోజుల్లో దాని అర్థం ఏదైనా సరే.

05:12.479 --> 05:13.814
- కానీ నీ వయసు ఇరవై ఏడు కదా?
- ఇరవై ఎనిమిది.

05:13.897 --> 05:16.066
ఇరవై ఎనిమిది, అంటే నువ్వు నాకన్నా వయసులో
ఇరవై ఏళ్లు చిన్నదానివి.

05:16.149 --> 05:18.694
ఇంకా ఇలాంటి సమయాలలో, అది పనికొస్తుంది, కదా?

05:18.777 --> 05:20.571
నా దగ్గర డబ్బు ఉంది, నీకు స్వేచ్ఛ ఉంది,

05:20.654 --> 05:23.031
మన ఇద్దరం కలిసి ప్రపంచం అంతా తిరగచ్చు,
ఒకరి నుంచి ఒకరం చాలా నేర్చుకోవచ్చు.

05:23.115 --> 05:26.201
- మాటలలో అయినా మంచంలో అయినా.
- అవును. నిజం.

05:26.285 --> 05:27.494
నేను నీకు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాను

05:27.578 --> 05:29.872
ఎందుకంటే నీకంటే ఎక్కువగా
నా దగ్గర రెండు దశాబ్దాల కథలు ఉంటాయి,

05:29.955 --> 05:32.499
నాకు నువ్వు ఆసక్తికరంగా కనిపిస్తావు
ఎందుకంటే అనుక్షణం నీ జీవితాన్ని ఆస్వాదిస్తావు

05:32.583 --> 05:36.086
అది కూడా కొన్ని సంవత్సరాలుగా నేను కోల్పోయిన
నిర్లక్ష్యపు ఉత్సాహంతో.

05:36.670 --> 05:38.797
కాబట్టి ఒకరితో ఒకరం వినోదంగా ఉండటంలో
ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

05:38.881 --> 05:41.175
ఇంకా అది కొంతకాలం వరకూ బాగానే ఉంటుంది, కదా?

05:42.092 --> 05:45.554
తరువాత ఒక పదేళ్లు ముందుకు వెళితే,
నీకు ముప్పై ఎనిమిదేళ్లు. నాకు యాభై ఎనిమిది వస్తాయి.

05:45.637 --> 05:47.431
సరిగ్గా అప్పుడే పరిస్థితులు కొద్దిగా మారడం మొదలవుతాయి.

05:47.514 --> 05:49.224
నీకు పిల్లలు కావాలి అనిపిస్తుంది,
నాకు అప్పటికే పిల్లలుంటారు.

05:49.308 --> 05:51.059
నీలో ఒక ఆలోచన మొదలుకావచ్చు,
"జీవితంలోనే

05:51.143 --> 05:52.769
అతి గొప్ప అనుభూతిని నేను మిస్ అవుతున్నానేమో?" అని.

05:52.853 --> 05:54.980
- అప్పటికి నువ్వు ఆకర్షణీయంగా ఉంటావు…
- నేను ఆకర్షణీయంగా ఉన్నానంటావా?

05:55.063 --> 05:56.565
నాకు వయసు మీద పడుతుంది.

05:56.648 --> 05:58.192
సరే, నువ్వు వయసు మళ్లినా బాగానే ఉంటావని చెప్పగలను.

05:58.275 --> 06:00.319
నువ్వు అది చెప్పగలవు ఎందుకంటే
వయసు మళ్లడం ఇప్పటికే మొదలైంది కాబట్టి.

06:00.402 --> 06:03.030
విషయం ఏమిటంటే అప్పటికి మనకి
సెక్స్ తగ్గిపోతుంది ఇంకా వైన్ తాగడం ఎక్కువవుతుంది,

06:03.113 --> 06:05.532
అయితే అలా కూడా కొంతకాలం వరకూ కొనసాగవచ్చు.

06:05.616 --> 06:07.117
నువ్వు ఎక్కువ మాట్లాడతావని నీకు ఎవరైనా చెప్పారా?

06:07.201 --> 06:11.413
అంటే, నాలో నేను మాట్లాడుకోవడాన్ని ఇంకా నా భార్యని
దాదాపు ఒకేసారి కోల్పోయాను.

06:11.496 --> 06:13.373
ఏది ఏమైనా, మనం ఇంకో పదేళ్లు ముందుకు వెళదాం.

06:13.457 --> 06:15.876
- అది అవసరమా?
- అప్పటికి నాకు అరవై ఎనిమిది వస్తాయి.

06:15.959 --> 06:18.045
నా ఆరోగ్యాన్ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే,

06:18.128 --> 06:20.839
నా ప్రోస్టేట్ దాని పని అది చేస్తుంది
ఇంకా నా జుట్టు పల్చబడుతుంది,

06:20.923 --> 06:22.341
ఇంకా నేను పోయాక నీ జీవితం ఎలా ఉంటుందా అని

06:22.424 --> 06:24.426
ఆ ఆలోచనలతో నువ్వు రోజులు గడుపుతుంటావు.

06:24.510 --> 06:26.762
ఆ సమయంలో, నువ్వు ఇల్లు వదిలి వెళ్లిన ప్రతిసారి

06:26.845 --> 06:29.806
నువ్వు ఏ యువకుడితో శృంగారం చేస్తుంటావో అని
నేను ఆందోళన పడుతుంటాను.

06:29.890 --> 06:31.725
నిజంగానా? నీకు అభద్రతాభావం ఉందా?

06:31.808 --> 06:33.185
అంటే, ఇంకా లేదు, కానీ తరువాత అలా ఉంటాను.

06:33.268 --> 06:35.354
- సరే, మరి వ్యక్తిత్వం సంగతి ఏంటి?
- నీదా నాదా?

06:35.437 --> 06:38.357
- నేను మోసం చేస్తానని నీకు అంత నమ్మకమా?
- లేదు, నేను అలా ఆలోచిస్తా అంటున్నాను.

06:38.440 --> 06:40.734
నీలో విచిత్రంగా అటు ఆత్మవిశ్వాసమూ
ఇంకా ఆత్మన్యూనతాభావం కలిసి ఉన్నాయి.

06:40.817 --> 06:42.528
కాబట్టి, నేను అసూయపడే, ముసలివాడిని

06:42.611 --> 06:44.988
ఇంకా నువ్వేమో యవ్వనంలో ఉండి
చంచలస్వభావం ఉన్న మహిళగా ఉంటావు,

06:45.072 --> 06:47.032
దానితో మన ఇద్దరిలోనూ నిరంతరం ఒక భయం వెన్నాడుతుంటుంది

06:47.115 --> 06:49.368
అదేమిటంటే మన జీవిత చరమాంకాలు చాలా కఠినంగా సాగుతాయని,

06:49.451 --> 06:51.995
ఇంకా ఆ చరమాంకాన్ని
మనం పూర్తిగా ఒంటరిగా గడపాల్సి వస్తుందని భయపడుతుంటాం.

06:52.079 --> 06:53.080
వావ్.

06:53.580 --> 06:56.625
చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఎప్పుడు ఆలోచించావు?

06:57.626 --> 07:00.671
నువ్వు ఆ స్టూలు నుంచి ఇక్కడికి
నడిచి వచ్చిన పది సెకన్ల వ్యవధిలో ఆలోచించా.

07:02.756 --> 07:05.217
సరే, నేను ఇక్కడ కూర్చుని
నీ ఆలోచనల్ని పూర్తిగా ఖండించగలను,

07:05.300 --> 07:08.011
కానీ నిజం చెప్పాలంటే, బాబూ,
నేను కేవలం శృంగారం చేయాలని చూస్తున్నాను.

07:08.971 --> 07:11.181
దానితో నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి?

07:14.518 --> 07:15.727
నా బుర్రకి ఏమీ తోచడం లేదు.

07:20.816 --> 07:21.817
కానిద్దాం!

07:21.900 --> 07:24.152
మూడు నెలల తరువాత

07:53.182 --> 07:54.892
ఇది ఇలాగే జరుగుతుంది…

08:01.565 --> 08:04.109
కాలేజీ నుండి బయటకి రాగానే
ఒక పెద్ద సంస్థలో ఉద్యోగంలో చేరతావు.

08:04.193 --> 08:05.903
చాలా పెద్ద చట్రంలో నువ్వు ఒక చిన్న భాగం అవుతావు,

08:05.986 --> 08:07.946
కానీ నీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.

08:09.781 --> 08:12.367
సిటీలో ఒక చెత్త అపార్ట్మెంట్ తీసుకుంటావు
ఇంకా దాని అద్దెని నువ్వు భరించగలుగుతావు

08:12.451 --> 08:14.203
ఎందుకంటే ముందు ముందు డబ్బు గడిస్తావని నీకు తెలుసు.

08:14.286 --> 08:16.830
నువ్వు పెళ్లి చేసుకుంటావు ఎందుకంటే, నీకు తెలుసు…

08:18.207 --> 08:20.042
తరువాత ఆమె నీ అపార్ట్మెంట్ కి మారిపోతుంది.

08:22.336 --> 08:24.296
నువ్వు అప్పుల పాలవుతావు,
కానీ ఇప్పుడు మీరు ఇద్దరు అయ్యారు.

08:24.922 --> 08:26.840
మీరు ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి
ఆ ఫీలింగ్ బాగుంటుంది.

08:29.384 --> 08:33.972
చిన్న విషయం, ఆ చెత్త అపార్ట్మెంట్ లో
నీతో అంతలా ఇంకెవరూ శృంగారం చేయరు.

08:35.557 --> 08:37.142
ఆమెతో సహా.

08:39.227 --> 08:41.772
కాబట్టి నువ్వు కష్టపడి పని చేస్తావు
ఇంకా నీ అప్పుల ఊబి నుండి బయటపడతావు.

08:41.855 --> 08:43.690
కష్టంగా, సులభంగా నువ్వు సంపాదించగలిగినంత సంపాదిస్తావు.

08:43.774 --> 08:45.984
అవును, ఇది క్యాన్డ్ ఫుడ్ ఇంకా షాట్ గన్స్ మాదిరిగా ఉండదు.

08:47.694 --> 08:49.738
హేయ్. అవును.

08:51.240 --> 08:52.866
ఆ తరువాత, నీ పరిస్థితులు బాగున్నాయి అనిపించినప్పుడు,

08:52.950 --> 08:55.911
నీకు అన్నీ, అంటే, చాలా అనుకూలంగా ఉన్న సమయంలో,
నీకు మొదటి సంతానం కలుగుతుంది.

08:55.994 --> 08:57.162
ఊపిరి, ఊపిరి పీల్చుకో.

09:00.624 --> 09:03.919
నువ్వు ఒక ఇల్లు కొంటావు, 30 శాతం డౌన్ పేమెంట్,
ముప్పై ఏళ్ల అప్పు ఇంకా నాలుగున్న శాతం వడ్డీ.

09:04.002 --> 09:05.879
దానితో నువ్వు మళ్లీ అప్పుల పాలవుతావు.

09:09.299 --> 09:11.468
- ఆహ్… హా.
- దానితో నువ్వు కష్టపడి, ఎక్కువ సమయాలు పని చేస్తావు.

09:11.552 --> 09:13.387
- నువ్వు ఎక్కువ డబ్బు గడించడం మొదలుపెడతావు…
- మంచిది.

09:13.470 --> 09:15.848
…దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే
నువ్వు ఇంకా ఎక్కువ డబ్బు గడించాలని

09:15.931 --> 09:16.932
నీకు అర్థం అవుతుంది.

09:18.392 --> 09:19.518
రెండో సంతానం.

09:20.644 --> 09:21.603
రెండో ఇల్లు.

09:22.396 --> 09:23.438
మళ్లీ అప్పులపాలు.

09:26.942 --> 09:28.902
కానీ ఇది వేరే రకమైన అప్పు.

09:29.695 --> 09:31.738
నీకు ప్రయోజనాలు దక్కుతాయి,
అంటే నీ కష్టానికి తగిన ఫలితాన్ని

09:31.822 --> 09:33.657
నువ్వు ప్రదర్శించుకోవచ్చు అని మరోలా చెప్పడం.

09:33.740 --> 09:35.784
పెద్ద ఇల్లు, కార్లు, ఇంకా అలాంటివి.

09:38.871 --> 09:40.163
అయితే అప్పటికి, ఏ లక్ష్యాలు పెట్టుకున్నావో

09:40.247 --> 09:42.124
వాటి గురించి ఆలోచించడం మానేసి ఉంటావు,

09:42.207 --> 09:44.501
లేదా నీ ప్రారంభదశలో నువ్వు ముఖ్యం అనుకున్నవి
ఇంక పక్కన పెట్టేస్తావు.

09:44.585 --> 09:48.255
అటువంటి కఠినమైన ప్రశ్నల్ని నీకు నువ్వు అడగడానికి కూడా
సమయం లేనంత వేగంగా జీవితం గడుపుతావు,

09:48.338 --> 09:49.381
"సరిపోతుంది అని ఎప్పుడు అంటావు?"

09:49.464 --> 09:51.550
ఇంకా, "నిజానికి, ఇంత కష్టపడటంలో అర్థం ఏం ఉంది?"

09:56.430 --> 09:58.432
మూడో ఇల్లు.

10:03.020 --> 10:05.230
ఆపై ఒక రోజు, ఆ ఇంటిని నువ్వు కొన్న
ఐదు సంవత్సరాల తరువాత,

10:05.314 --> 10:07.191
నిన్ను నువ్వు చూసుకుని,

10:07.274 --> 10:09.067
నీ జీవితంలో మొదటిసారి,
ఒక గౌరవనీయమైన హోదాని సంపాదించావని,

10:09.151 --> 10:11.486
ఇంక నీ సొంత జీవితాన్ని గడిపే స్థితికి వచ్చావని గ్రహిస్తావు.

10:11.570 --> 10:13.906
జీవితంలో చాలా కష్టపడ్డాననీ ఇంకా ఆ ప్రయాణంలో

10:13.989 --> 10:16.825
నిరంతరంగా ఎదురైన సంక్లిష్టమైన సవాళ్లని
దాటాను అనుకునే ఒక మిశ్రమ భావనలో ఉండగా,

10:17.701 --> 10:21.246
సాధారణంగా ఆ సమయంలోనే పద్దెనిమిదేళ్లుగా
నీతో సంసారం చేసిన నీ భార్య నీ మంచం మీద…

10:21.330 --> 10:22.623
ఓహ్, చచ్చాం.

10:23.123 --> 10:25.083
…నీ ప్రాణమిత్రుడితో శృంగారం చేస్తూ కనిపిస్తుంది.

10:41.308 --> 10:42.809
నాలుగో ఇల్లు.

10:42.893 --> 10:43.810
అద్దె ఇల్లు.

10:44.561 --> 10:47.189
ఇది చిన్నది, కానీ ఆందోళన పడకు,
ఇది నైరాశ్యం కలిగిస్తుంది.

11:21.598 --> 11:23.267
మనం ఇంకా ప్యాక్-ప్రో కంపెనీ షేర్లని ఎందుకు ఉంచుకున్నాం?

11:23.350 --> 11:24.518
మనం దాదాపుగా అమ్మేశాం.

11:24.601 --> 11:26.728
- దాదాపుగానా? అతను ఆ మాటే అన్నాడా?
- ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది.

11:26.812 --> 11:29.231
వినండి, నేను మీకు చెబుతూనే ఉన్నాను,
మనం షేర్ల మీద డబ్బు సంపాదిస్తాం,

11:29.314 --> 11:31.358
కానీ ఆధునిక టెక్నాలజీ కారణంగా మనం నష్టపోకూడదు.

11:31.441 --> 11:32.776
ఆ సంస్థ నుండి బయటకి వచ్చేయండి, ఈ రోజే.

11:32.860 --> 11:34.570
అయిపోతుంది, బాస్.

11:35.612 --> 11:37.322
- ఇతనికి ఏం అయింది అసలు?
- నాకా? ఏం కాలేదు.

11:37.906 --> 11:38.907
ప్రియురాలు వదిలేసింది.

11:38.991 --> 11:40.993
- అది ఏమైనా వార్తా?
- ఆమెని లవ్ చేస్తున్నా, బాబు.

11:41.660 --> 11:42.494
లేదు, లవ్ చేయడంలేదు.

11:42.578 --> 11:43.829
నువ్వు ప్రేమని ప్రేమిస్తున్నావు, అంతే.

11:43.912 --> 11:47.666
- అది అంటే, ఏం చేయాలో నాకు తెలియడం లేదు.
- నాకు తెలుసు. ప్యాక్-ప్రో షేర్లు వదిలించుకో.

11:47.749 --> 11:48.750
థాంక్యూ.

11:50.419 --> 11:52.087
- గుడ్ మార్నింగ్, కూప్.
- జాక్.

11:52.171 --> 11:53.088
జెంటిల్మెన్.

11:53.172 --> 11:54.464
ఈ రోజు స్క్వాష్ ఆడుతున్నామా?

11:55.048 --> 11:56.800
ఆడుతున్నామా? మేరీ నాకు ఈమెయిల్ పంపిందా?

11:56.884 --> 11:58.552
బహుశా నా పొరపాటే కావచ్చు. నీ బ్యాగ్ ఇక్కడే ఉందా?

11:58.635 --> 11:59.803
ఉంది.

11:59.887 --> 12:01.847
- మంచిది. మధ్యాహ్నం?
- మధ్యాహ్నం.

12:01.930 --> 12:02.806
అద్భుతం.

12:07.603 --> 12:09.396
అవుట్. అవుట్. ఆడు, బాబు. బాగా ఆడు.

12:17.613 --> 12:19.448
సర్వ్ చేయి. డామిట్.

12:26.872 --> 12:27.706
పిల్లలు ఎలా ఉన్నారు?

12:27.789 --> 12:28.790
వాళ్లు బాగానే ఉన్నారు.

12:28.874 --> 12:30.792
- భార్య?
- మాజీ భార్య.

12:30.876 --> 12:34.046
సరే, తను ఇంకా ఆ వెధవతోనే ఉందా?
ఆ బాస్కెట్ బాల్ ఆటగాడు, అతని పేరేంటి?

12:34.129 --> 12:36.173
నిక్. అవును.

12:36.256 --> 12:38.342
వాడికి తగిన శాస్తి జరుగుతుంది. కర్మ, అవునా?

12:39.134 --> 12:41.595
ఆ మాటంటే గుర్తొచ్చింది, నీకు ఒక దుర్వార్త చెప్పాలి.

12:41.678 --> 12:44.389
దేవుడా, జాక్, నీకు క్యాన్సర్ తిరిగి వచ్చిందా, ఏంటి?

12:44.473 --> 12:45.766
ఏంటి? లేదు. దేవుడా, లేదు.

12:45.849 --> 12:49.895
లేదు, మిగిలి ఉన్న నా ఏకైక వృషణం
చక్కగా పని చేస్తోంది. చాలా ఆరోగ్యంగా ఉంది.

12:50.854 --> 12:53.148
లేదు, విషయం ఏంటంటే, కూప్,
నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం.

12:54.191 --> 12:55.442
గొప్ప విషయం.

12:55.526 --> 12:57.861
లేదు, నిజంగానే చెబుతున్నాను.
నిన్ను ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది.

12:59.863 --> 13:00.697
ఏంటి?

13:01.365 --> 13:03.033
ఆ అమ్మాయి, ఒలీవ్… ఆమె పేరేంటి?

13:03.116 --> 13:05.827
- ఒలీవియా లేదా ఇంకేదో పేరు ఉంది.
- ఆగు. ఆగు. అమ్మాయా? ఏ అమ్మాయి?

13:05.911 --> 13:08.372
- నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?
- క్రాస్. ఒలీవియా క్రాస్. ఒలీవియా క్రాస్.

13:08.455 --> 13:09.706
ఒలీవ్…

13:09.790 --> 13:10.832
లివ్ క్రాస్?

13:11.834 --> 13:14.670
ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఒక అసోసియేట్ తో శృంగారం చేయడం అనేది…

13:14.753 --> 13:16.296
ఒక నిమిషం ఆగు, లేదు, తను నా దగ్గర పని చేయలేదు.

13:16.380 --> 13:18.257
తను షెపర్డ్ గ్రూప్ లో ఉంది. ఇంకా…

13:18.340 --> 13:19.967
ఆమెని అంతకుముందు కలిసినట్లుగా కూడా నాకు గుర్తులేదు.

13:20.050 --> 13:23.262
నువ్వు ఆమెని కలిశావా లేదా అన్నది ముఖ్యం కాదు.
ఆమెతో శృంగారం చేశావా లేదా అన్నదే ముఖ్యం.

13:23.345 --> 13:24.680
నువ్వు ఆమెతో శృంగారం చేశావు, కదా?

13:26.431 --> 13:27.599
ఇంకా చేయి!

13:28.225 --> 13:31.353
అవును, కానీ అది, ఎలాగంటే, ఒక వారాంతంలో,
అంటే, మూడు నెలల కిందట జరిగింది.

13:31.436 --> 13:32.688
పూర్తిగా ఇద్దరి అంగీకారంతో జరిగింది.

13:32.771 --> 13:34.898
- నా ఉద్దేశం, తనే నా దగ్గరకి వచ్చింది.
- అది విషయం కాదు.

13:34.982 --> 13:35.983
నువ్వు ఆమె పై అధికారివి.

13:36.900 --> 13:39.069
నీకు చెప్పాను, నాకు తనెవరో కూడా తెలియదు.

13:39.152 --> 13:41.071
కానీ తను షెపర్డ్ దగ్గర పని చేస్తోందని నీకు తెలుసు, కదా?

13:42.281 --> 13:45.993
చూడు, కూప్, విషయం ఏమిటంటే, ఆమె దృష్టిలో,
తను వైస్ ప్రెసిడెంట్ హోదాకి అర్హత సాధించింది.

13:46.076 --> 13:48.203
వైస్ ప్రెసిడెంటా? ఆమె వయసు ఇరవై ఏడేళ్లు.

13:48.287 --> 13:50.664
లేదు, ఆమె వయసు ఇరవై ఎనిమిది,
ఇంకా నేను ఆమె కేసు గురించి మాట్లాడటానికి రాలేదు.

13:50.747 --> 13:52.541
నన్ను ఉద్యోగం నుంచి నువ్వు తీయలేవు, జాక్.

13:52.624 --> 13:57.212
కానీ, పరిచయాల గురించి మన సంస్థలో చాలా కఠినమైన
నియమాలు ఉన్నాయి, లేదా అలా అని నేను విన్నాను.

13:57.296 --> 14:00.007
కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు,
నన్ను ఉద్యోగం నుంచి పీకేయడానికా?

14:02.176 --> 14:05.053
నీ కంప్యూటర్ ని స్వాధీనం చేసుకోవడానికి
హెచ్.ఆర్. ఉద్యోగులు నీ ఆఫీసులోకి వెళ్లాల్సి వచ్చింది.

14:05.137 --> 14:06.597
సంస్థ సమాచారం కోసం, ఆ తతంగం నీకు తెలుసు కదా.

14:06.680 --> 14:07.764
వాళ్లు నా క్లయింట్లు.

14:07.848 --> 14:10.851
కానీ, నువ్వు సంతకం చేసిన నాన్-సొలిసిట్ ఒప్పందం ప్రకారం,

14:10.934 --> 14:13.020
కనీసం మరో రెండేళ్ల వరకూ వాళ్లు సంస్థకే చెందుతారు.

14:13.103 --> 14:15.314
నువ్వు నిజంగానే నిన్ను ఇలా సమాధి చేయబోతున్నావా?

14:15.397 --> 14:16.648
ఇది ఎలా ఉంటుందో నీకు తెలుసు.

14:18.275 --> 14:19.610
మరి నా క్యాపిటల్ అకౌంట్ సంగతి ఏంటి?

14:20.485 --> 14:22.696
అది నా డబ్బు, జాక్. అది మీకు చెందదు.

14:22.779 --> 14:24.656
- చూడు, జాక్. అంత పని చేయకు.
- ఒక కారణంతో నిన్ను తీసేశాం.

14:24.740 --> 14:28.035
నా దగ్గర ఉన్న డబ్బంతా ఆ అకౌంట్ లోనే ఉంది.
నన్ను నాశనం చేస్తావు, జాక్.

14:28.118 --> 14:30.829
ఇలా జరుగుతున్నందుకు బాధగా ఉంది,
కానీ ఇది ఇలాగే జరుగుతుంది.

14:32.122 --> 14:32.956
నేను కేసు వేస్తాను.

14:33.665 --> 14:35.834
నువ్వు కేసు వేయకపోతే నీకు ఆరు నెలల జీతం ఇస్తారు.

14:35.918 --> 14:37.127
దారుణమైన మనిషివి.

14:37.211 --> 14:39.213
అవును. కానీ…

14:41.131 --> 14:43.091
నువ్వు నిర్ణయించుకోవడానికి కొద్ది రోజులు టైమ్ ఇస్తున్నాను.

15:32.766 --> 15:33.809
హంటర్.

15:47.906 --> 15:48.991
ఇక్కడ ఏం చేస్తున్నావు?

15:50.284 --> 15:52.119
త్వరగా పని అయిపోయింది,
నిన్ను తీసుకువెళదాం అని వచ్చాను.

15:52.953 --> 15:54.413
- ఈ రోజు మంగళవారం కాదు.
- నాకు తెలుసు.

15:55.205 --> 15:57.040
మనం కాసేపు కలిసి గడపచ్చు అనుకున్నాను.

15:57.124 --> 15:59.084
- ఏదైనా ఐస్ క్రీమ్ తినచ్చు.
- నేను ఏమైనా సమస్యలో ఉన్నానా?

15:59.168 --> 16:00.460
దేవుడా, హంటర్, లేదు.

16:00.544 --> 16:05.883
ఒక తండ్రి తన కొడుకుతో ఖాళీ సమయంలో
కాసేపు గడపకూడదా ఏంటి?

16:15.475 --> 16:16.685
స్కూలు ఎలా ఉంది?

16:19.146 --> 16:21.023
- స్కూలు ఎలా ఉంది?
- బాగుంది.

16:23.358 --> 16:25.027
నీ ట్యూటర్ ఎలా చెబుతోంది? ఆమె సరిగ్గా చెబుతోందా?

16:26.111 --> 16:27.112
ఫర్వాలేదు.

16:29.239 --> 16:30.240
నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?

16:31.533 --> 16:33.202
- లేదు.
- ఏమైనా అవకాశాలు ఉన్నాయా?

16:33.285 --> 16:34.286
లేవు.

16:37.831 --> 16:40.209
ఈ రోజు ఎప్పుడయినా కేవలం రెండు పదాలతో కాకుండా
కాస్త సుదీర్ఘమైన మాటల ద్వారా

16:40.292 --> 16:42.002
నాకు సమాధానాలు చెప్పగలుగుతావా?

16:43.587 --> 16:44.588
చెప్పచ్చు.

17:00.979 --> 17:03.982
- లోపలికి వస్తున్నావా?
- అవును, టోరీ ఇక్కడే ఉంది. తనకి హాయ్ చెబుతాను.

17:05.483 --> 17:06.984
- హాయ్, బబ్.
- హేయ్, అమ్మా.

17:07.069 --> 17:08.694
- ఈ రోజు ఎలా గడిచింది?
- ఫర్వాలేదు.

17:13.282 --> 17:14.701
ఇక్కడ ఏం చేస్తున్నావు?

17:14.785 --> 17:16.869
ఏంటి… నేను హంటర్ ని ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకువెళ్లా.

17:16.954 --> 17:17.871
ఈ రోజు మంగళవారం కాదు కదా.

17:18.579 --> 17:19.665
అలాగని నాకు చెప్పారు.

17:20.457 --> 17:22.542
- టోరీ లోపల ఉందా?
- తను ఇంకా ఇంటికి రాలేదు.

17:25.253 --> 17:26.171
- ఏంటి?
- ఏంటి?

17:26.255 --> 17:27.506
ఆ చూడటం ఏంటి?

17:28.423 --> 17:30.551
- నీకు నేను ఎలాంటి లుక్ ఇవ్వలేదు.
- నన్ను చూసి మొహం ఎలా పెట్టావంటే…

17:30.634 --> 17:32.719
నా వైపు చూడకూడదు అన్నట్లుగా చూశావు.

17:32.803 --> 17:34.054
అయితే, ఏంటి సమస్య?

17:37.224 --> 17:40.310
నువ్వు పిల్లల్ని చూసే రోజు కాకుండా ఈ రోజు వచ్చావంటే
ఏదో సమస్య ఉందని నాకు అనిపించింది.

17:40.394 --> 17:42.729
నేను వాడిని ఐస్ క్రీమ్ కోసం తీసుకువెళ్లాను, దేవుడా.

17:42.813 --> 17:45.440
అది వాడికి అయోమయంగా ఉంటుంది.
హద్దులు ఉండటానికి ఒక కారణం ఉంటుంది.

17:45.524 --> 17:47.818
హద్దులా? నీ ఉద్దేశం, అంటే ఒకే భార్య ఉండటమా?

17:48.402 --> 17:49.236
నిజంగా అంటున్నావా, కూప్?

17:49.319 --> 17:52.155
మనం విడిపోయి రెండేళ్లు అవుతోంది.
ఇదే మాటని ఇంకా ఎంతకాలం చెబుతావు?

17:52.239 --> 17:55.492
నాకు తెలియదు, భార్య మోసం చేసినప్పుడు భర్త ఎంతకాలం
బాధపడాలో చట్టపరంగా ఎలాంటి పరిమితులు ఉంటాయి?

17:55.576 --> 17:58.704
బహుశా నువ్వు విషాదంలో ఉన్నట్లు నటించిన కాలంకన్నా
తక్కువ కాలమే ఉండచ్చు.

17:58.787 --> 18:00.664
- నటిస్తున్నానని ఎవరు చెప్పారు? నువ్వు ఎవరు?
- నీకు తెలుసా?

18:00.747 --> 18:02.708
నీకు గనుక ఆత్మపరిశీలన ఏ మాత్రం ఉన్నా,

18:02.791 --> 18:04.835
ఇలాంటి పరిస్థితులు శూన్యం నుండి పుట్టవని
గ్రహించగలిగి ఉండేవాడివి,

18:04.918 --> 18:07.838
ఇంకా బహుశా అందులో నీ బాధ్యత కూడా
కనీసం కొంతయినా ఉందని అర్థం చేసుకునేవాడివి.

18:07.921 --> 18:11.758
సరే, సారీ, కానీ నువ్వు నిక్ తో పడుకున్నావు,
నన్ను ఈ ఇంటి నుండి గెంటేశావు,

18:11.842 --> 18:14.136
ఈ అరాచకం కోసం నా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది,

18:14.219 --> 18:15.637
అయినా నేను బాధ్యతగా లేను అంటున్నావా?

18:15.721 --> 18:16.930
నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడలేను.

18:17.014 --> 18:19.016
సరే, నేను ఒక్కడినే మాట్లాడటం నాకేమీ సరదా కాదు.

18:21.268 --> 18:22.352
- హేయ్!
- ఏంటి?

18:23.061 --> 18:24.813
వాడికి కొత్త డ్రమ్ కిట్ కావాలని నీతో చెప్పాడా?

18:24.897 --> 18:26.982
వాడికి కొత్త డ్రమ్ కిట్ కావాలా? పాత కిట్ కి ఏం అయింది?

18:27.065 --> 18:28.942
నాకు తెలియదు, అది పాతబడి ఒంగిపోయింది.

18:29.026 --> 18:31.195
అన్నట్లు, వాడు వాయిస్తున్న మ్యూజిక్ బృందం,
చాలా బాగా మ్యూజిక్ చేస్తున్నారు,

18:31.278 --> 18:32.487
అందుకే తనకి కొత్త కిట్ కావాలని చెప్పాడు.

18:32.571 --> 18:33.697
- దేవుడా.
- నిక్ కొనిస్తా అన్నాడు…

18:33.780 --> 18:37.409
వద్దు, నా… నా బిడ్డకి కొత్త డ్రమ్ కిట్ ని
నిక్ కొనివ్వనక్కరలేదు.

18:37.492 --> 18:40.078
- నేను ఊరికే చెబుతున్నాను, నువ్వు నిజంగా బిజీ అయితే…
- నేను చూసుకుంటాలే.

18:41.121 --> 18:42.539
ఆగు. కూప్.

18:43.165 --> 18:44.917
నేను టోరీని చర్మ వ్యాధి డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లాను.

18:45.417 --> 18:47.711
- తన చర్మం బాగానే ఉంది.
- అవును, ఆ విషయం దానికి చెబుతావా?

18:48.295 --> 18:51.798
అది కొత్త లేజర్ చికిత్స చేయించుకోవాలని అంటోంది.
అది మూడుసార్లు చేయించుకుంటే సరిపోతుంది,

18:51.882 --> 18:53.175
సెషన్ కి 1500 డాలర్లు.

18:54.176 --> 18:55.719
వాళ్లు బిల్లుని నీకు ఈమెయిల్ చేస్తారు.

18:55.802 --> 18:57.763
నిన్ను కలిసినప్పుడల్లా నాకు చాలా ఖర్చు అవుతోంది.

18:57.846 --> 18:59.556
మంగళవారాలకే పరిమితం అవ్వు.

19:01.517 --> 19:03.393
టోరీకి నాన్న హాయ్ చెప్పాడని చెప్పు.

19:05.979 --> 19:06.980
దేవుడా.

19:08.899 --> 19:11.443
ఓరి దేవుడా. ఇలా జరిగిందేంటి?

19:14.696 --> 19:17.991
ఓహ్, ఛ. సారీ. ఇది పూర్తిగా నా పొరపాటే, బాబు.

19:18.075 --> 19:19.243
అవును, అది నీ తప్పే.

19:19.326 --> 19:22.246
- ఇదిగో, నా వివరాలు ఇస్తాను.
- టోరీ?

19:22.329 --> 19:23.288
హాయ్, డాడీ.

19:24.498 --> 19:25.499
జేక్, ఆయన మా నాన్న.

19:25.582 --> 19:27.376
డాడీ, ఇతని పేరు జేక్.

19:28.669 --> 19:29.837
మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం, సర్.

19:29.920 --> 19:32.256
మీ కారుని ఢీ కొట్టి ఇలా కలిసినందుకు సారీ.

19:32.339 --> 19:33.590
ఆగు, నువ్వు ఎవరు?

19:34.174 --> 19:35.175
జేక్ వెస్టన్.

19:35.259 --> 19:36.760
సరే, కానీ అందులో ఏమీ సమాచారం లేదు.

19:36.844 --> 19:38.220
అతను నా బాయ్ ఫ్రెండ్.

19:38.804 --> 19:41.223
- సారీ, నీ వయసు ఎంత?
- నాకు ఇరవై ఏళ్లు, సర్.

19:42.015 --> 19:43.809
నన్ను సర్ అని పిలవకు. నీ మర్యాదని ఎవరూ నమ్మరు.

19:43.892 --> 19:45.936
- సారీ.
- సరే, నీకు ఇరవై…

19:46.019 --> 19:48.647
తన వయసు పదిహేడేళ్లు.
ఈ రాష్ట్రంలో చట్టాల గురించి మీకు అవగాహన ఉందా?

19:48.730 --> 19:50.190
- ఇది అలాంటిది కాదు, సర్.
- డాడీ.

19:50.274 --> 19:51.650
సరే. నీ పేరు జేక్, కదా?

19:51.733 --> 19:53.610
నన్ను ఇంకోసారి సర్ అన్నావంటే,
నీ మర్మాంగం మీద గుద్దుతా.

19:53.694 --> 19:55.904
నాన్నా, నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు.
అమ్మా, నాన్న పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.

19:55.988 --> 19:57.656
- నీకు ఇది సమ్మతమేనా?
- మీరు లోపలికి వెళ్లి

19:57.739 --> 19:59.241
- ఏదైనా తినచ్చు కదా?
- వీళ్ల గురించి నీకు తెలుసా?

19:59.324 --> 20:00.158
దీనిని నువ్వు ఒప్పుకున్నావా?

20:00.242 --> 20:03.620
- కారు విషయంలో సారీ.
- సరే, వెళ్లు, జేక్. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో.

20:05.664 --> 20:07.332
- నీ సమస్య ఏంటి?
- నీ సమస్య ఏంటి?

20:07.416 --> 20:09.459
నీ కూతురుని చట్టం దృష్టిలో రేప్ చేయడం నీకు సమ్మతమేనా?

20:09.543 --> 20:10.669
- ఓహ్, ఇంక చాలు.
- ఏంటి?

20:10.752 --> 20:13.130
- అది అతనిని లవ్ చేస్తోంది.
- అది చిన్నపిల్ల. అతనికి ఇరవై ఏళ్లు.

20:13.213 --> 20:14.590
నీ ప్రపంచంలో అది ఎలా ఒప్పుకోగలవు?

20:14.673 --> 20:15.507
- బేబీ.
- ఓహ్, దేవుడా.

20:15.591 --> 20:17.176
వాళ్లిద్దరినీ అలా వదిలేస్తావా…
బాగుంది, నిక్ కూడా వచ్చాడు.

20:17.259 --> 20:19.678
- హాయ్.
- హేయ్, కూప్.

20:19.761 --> 20:20.762
ఈ సమస్యని అతను పరిష్కరిస్తాడు.

20:22.264 --> 20:25.225
ఈ మనిషిని కలవడానికి నేను బయటకి వస్తాను.

20:25.309 --> 20:26.310
- హేయ్.
- హాయ్.

20:26.393 --> 20:28.145
సరే. సరే. అలాగే.

20:28.228 --> 20:32.399
నీకు తెలుసా, నేను తెచ్చిన మంచి స్కర్ట్ స్టీక్స్ ని
ఇప్పుడే వేయించబోతున్నాను.

20:32.482 --> 20:34.943
నా ఉద్దేశం, నువ్వు కూడా రావచ్చు కదా?

20:36.403 --> 20:37.654
నేను ఎందుకు రాకూడదు?

20:39.198 --> 20:40.449
నేను ఎందుకు రాకూడదు?

20:40.532 --> 20:43.410
నేను ఎందుకు రానంటే బహుశా

20:43.493 --> 20:44.828
నా ఇంటి పెరటిలోకి వెళ్లి

20:44.912 --> 20:47.581
నా ఐదు వేల డాలర్ల గ్రిల్ పొయ్యి మీద

20:47.664 --> 20:49.917
నా భార్యతో శృంగారం చేసే మనిషి వేయించిన స్టీక్స్
తిన్నప్పుడు నాకేం అనిపిస్తుందంటే…

20:50.000 --> 20:52.169
- వావ్.
- …నా షన్ ఫ్యూజీ స్టీక్ కత్తి తీసుకుని

20:52.252 --> 20:54.046
నా గుండెని నేనే నరుక్కోవాలి అనిపిస్తుంది.

20:54.129 --> 20:56.590
బహుశా అందుకే నాకు రావడం ఇష్టం లేదు.

20:56.673 --> 20:58.634
కాబట్టి, నేను వెళ్తాను.

20:59.676 --> 21:01.220
చూడు, నాకు అర్థమైంది, కూప్.

21:02.054 --> 21:03.347
నీ బాధని అర్థం చేసుకోగలను, బాబు. నిజంగా.

21:03.430 --> 21:06.391
ఈ సమస్యని పరిష్కరించే మార్గం కోసం చూస్తున్నాను, తెలుసా?

21:06.475 --> 21:07.518
మన అందరి కోసం.

21:08.268 --> 21:09.770
సరే, అందుకు నీకు గుడ్ లక్.

21:11.146 --> 21:13.190
నా కారు బిల్లుని పంపిస్తానని ఆ కుర్రవెధవకి చెప్పు.

21:14.441 --> 21:15.776
నీ కాలి వేళ్లని చూసుకో, బేబీ.

21:28.789 --> 21:31.375
నేను డ్రైవ్ చేస్తే హాస్కెల్ మొద్దునిద్రపోయాడు.

21:32.251 --> 21:35.045
కొద్దిసేపు తరువాత నాకు కూడా నిద్రమత్తు ఆవహించింది.

21:36.046 --> 21:37.464
ఇతర విత్ డ్రాయల్స్
ఫీజులు ఇంకా ఛార్జీలు.

21:37.548 --> 21:38.632
రోజువారీ ముగింపు బ్యాలెన్స్

21:38.715 --> 21:40.092
త్వరలో నేను మళ్లీ స్యూని కలుస్తాను.

21:40.759 --> 21:42.302
- మా లాంగ్ ట్రిప్ దాదాపు ముగిసింది…
- చెత్త.

21:42.386 --> 21:44.388
…ఇంక ఆ కాంక్రీట్ అరణ్యంలో నడిచే ప్రసక్తి లేదు.

21:45.848 --> 21:46.932
భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలెట్టా

21:47.975 --> 21:50.936
నియాన్ లైట్లతో దాన్ని జత కలపకపోయి ఉంటే
అది అంత వెలుగునిచ్చేది కాదు.

21:51.854 --> 21:53.897
స్యూ ఉన్నతంగా ఎదుగుతుందనేది మంచి ఆలోచన.

21:57.317 --> 21:58.569
బహుశా అది నాకు కూడా వర్తిస్తుందేమో.

21:59.194 --> 22:00.779
నేను పట్టుబడిపోతే ఆ కారు ఇంకా వస్తువుల్ని

22:00.863 --> 22:02.739
నేను ఎక్కడి నుండి తెచ్చానో
వాళ్లు ఆరా తీస్తారని తెలుసు కదా.

22:02.823 --> 22:05.617
- ఆ తరువాత నా మీద హత్య కేసు నమోదు చేస్తారు.
- నువ్వు తెలివైనవాడివి అయితే దొరకవు.

22:07.244 --> 22:08.245
హేయ్.

22:09.997 --> 22:10.998
ఏం చేస్తున్నావు?

22:14.042 --> 22:15.711
- హాయ్.
- హాయ్.

22:15.794 --> 22:17.838
అదీ! అలా చేయి! కానివ్వు.

22:17.921 --> 22:20.632
సమంత భర్త, పాల్,
హోటళ్ల వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు.

22:20.716 --> 22:22.676
- అతనికి తొమ్మిది హోటళ్లు ఉన్నాయి, 44 అంగుళాల ఛాతి…
- ఓహ్, దేవుడా.

22:22.759 --> 22:25.053
…ఇంకా తీవ్రమైన అంగస్తంభన లోపం ఉంది.

22:25.137 --> 22:27.556
అదీ! డామిట్! అలాగ!

22:27.639 --> 22:30.350
వాళ్లు విడిపోయినప్పటి నుంచి,
ఆమె తను కోల్పోయింది దక్కించుకునే పనిలో పడింది.

22:35.355 --> 22:36.440
దేవుడా.

22:38.317 --> 22:40.152
నీకు తెలుసా, నా చర్మం చీలేలా చేశావు.

22:40.235 --> 22:42.821
ఓహ్, మంచిదే,
నేను నటించలేదని అలాగయినా నీకు తెలుస్తుంది.

22:44.281 --> 22:45.449
అంతా బాగానే ఉందా?

22:45.532 --> 22:46.533
ఆహ్… హా. బాగుంది.

22:49.161 --> 22:50.454
నువ్వు వెళ్లాలా?

22:50.537 --> 22:51.413
లేదు.

22:52.915 --> 22:54.750
దేనికి? నేను వెళ్లిపోవాలి అనుకుంటున్నావా?

22:54.833 --> 22:55.834
లేదు, నేను ఊరికే అడిగాను…

22:55.918 --> 22:58.879
నువ్వు ఏదో సమస్యలో ఉన్నట్లు కనిపించావు…

23:00.255 --> 23:01.673
- ముఖ్యమైన పని.
- లేదు.

23:03.884 --> 23:04.885
కానీ ఫర్వాలేదు. ఏం కాదు.

23:06.470 --> 23:10.474
- హేయ్, ఇప్పుడు ఏం అయింది?
- ఏంటి? అంతా చక్కగా ఉంది.

23:10.557 --> 23:13.477
లేదు. నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే,
ప్లీజ్ అదేమిటో చెప్పు.

23:13.560 --> 23:16.063
నా ఉద్దేశం, ఒక నిమిషం కిందట
నువ్వు నా లోపలికి దాదాపుగా వచ్చేశావు,

23:16.146 --> 23:17.648
ఇంకా ఇప్పుడు నన్ను అంత వేగంగా పంపించలేవు.

23:18.148 --> 23:19.066
శామ్, దేవుడా.

23:19.149 --> 23:21.068
లేదు, నిజంగా, ఫర్వాలేదు.
లేదు, మరేం ఫర్వాలేదు. నేను వెళ్తాను.

23:21.151 --> 23:23.320
నిజంగా, నా ఉద్దేశం, ఇదంతా శారీరకమే, కదా?

23:23.403 --> 23:25.489
అది భావప్రాప్తి జరిగిన తరువాత డోపమీన్ కోల్పోవడం.

23:25.572 --> 23:27.783
నీ పిల్లల విషయంలో ఏదో సమస్య ఉందని అనుకున్నాను.

23:27.866 --> 23:30.244
లేదు, నా పిల్లలు నిద్రపోతున్నారు,
కానీ నీ ఆదరణకి చాలా థాంక్స్.

23:30.327 --> 23:32.621
సరే, చూడు, నేను… బహుశా ఇక్కడ ఏదో అపార్థం జరిగింది.

23:32.704 --> 23:34.331
నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదనిపిస్తోంది. చూడు…

23:34.414 --> 23:37.668
లేదు, నిజాయితీగా చెప్పాలంటే
ఇది కాస్త ఇబ్బందిగా అనిపించింది, ఇంకా…

23:37.751 --> 23:39.711
నా ఉద్దేశం, నువ్వు నాకు కాల్ చేసి పిలిచావు, కదా?

23:39.795 --> 23:42.548
కానీ తరువాత నేను శృంగారాన్ని కోరుకున్నాను, ఇంకా…

23:42.631 --> 23:45.092
- శామ్. శామ్. శామ్. శామ్.
- …నేను ఒక ఆయాని మాట్లాడుకుని ఇక్కడ బయటపడ్డాను.

23:45.634 --> 23:46.468
శామ్.

23:46.552 --> 23:47.553
నన్ను క్షమించు.

23:48.762 --> 23:51.223
సరేనా? నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు.

23:55.936 --> 23:57.354
నాకు నిజం చెప్పు.

23:57.437 --> 23:59.857
మన బంధం దీనికన్నా ఎక్కువగా ఉండవచ్చని
ఎప్పుడైనా అనుకున్నావా?

24:03.318 --> 24:04.820
ఇలా చూడు, శామ్.

24:07.030 --> 24:07.865
ఇలా రా.

24:20.043 --> 24:22.421
మేము దాదాపు అర్ధ సంవత్సరంగా ఇలాగే
కలవడం ఇంకా గొడవలు పడటం చేస్తున్నాం,

24:23.922 --> 24:25.716
కానీ ఇంకా ఆమెతో ప్రేమబంధాన్ని ఏర్పరుచుకోలేకపోతున్నాను.

24:28.343 --> 24:31.054
చూడు, బెయిలీలో నేను ఎలాంటి లావాదేవీలు జరిపానో
ఆ అంకెలు నీకు తెలుసు, కదా?

24:31.138 --> 24:32.806
వాటిల్లో సగం వ్యాపారం నేను ఇక్కడికి తీసుకురాగలను,

24:32.890 --> 24:34.975
వాటిని మనం టెక్సాస్ ఆయిల్ వ్యాపారులతో జోడించవచ్చు.

24:35.058 --> 24:38.228
నేను ఏడాది లోగా యాభై కోట్ల డాలర్ల వ్యాపారం చేయగలను.
ఇలా చూడు. అది ఇద్దరికీ ఉపయోగమే.

24:38.312 --> 24:39.855
నువ్వు మా అసోసియేట్స్ ఎవరితోనూ శృంగారం చేయలేదు కదా.

24:41.231 --> 24:43.317
చూడు, జాక్ ఫోన్లు చేస్తున్నాడు.
నీకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరు.

24:43.400 --> 24:45.861
ఇలా చూడు, మాంటీ, నీకు ఈ ఉద్యోగం నేను ఇప్పించాను.
నన్ను లోపలికి రానివ్వు.

24:45.944 --> 24:47.154
అతను ఫోన్లు చేస్తున్నాడు, బాబు.

24:47.237 --> 24:49.656
చూడు, జాక్ ఫోన్లు చేస్తున్నాడని నాకు తెలుసు.

24:49.740 --> 24:51.825
జాక్ సంగతి వదిలేయ్. అతనికి ఇక్కడ ఎవరూ ఫ్రెండ్స్ లేరు.

24:51.909 --> 24:53.827
అది మంచి విషయం.

24:53.911 --> 24:55.245
చూడు, నేను జాక్ కి కోపం తెప్పించలేను.

24:55.329 --> 24:57.748
ఇప్పుడు కాదు, ఈ ఏడాది టెక్ రంగంలో
మాకు వస్తున్న నష్టాలతో అది సాధ్యం కాదు.

24:57.831 --> 24:59.583
నిన్ను తీసుకోవాలని కొంతకాలం నేను ప్రయత్నించాను.

24:59.666 --> 25:02.753
- సరే…
- నీ నాన్-సొలిసిట్ ఒప్పందం గడువు ఎంత, తొంభై రోజులా?

25:02.836 --> 25:05.005
ఇదే సీటులో ఒకప్పుడు నువ్వు ఉన్నావు, మాంటీ,
నేను నీ స్థానంలో ఉన్నాను.

25:05.088 --> 25:07.049
- అవును, నాకు తెలుసు.
- రెండేళ్లు గడిచిందా?

25:07.132 --> 25:08.967
నువ్వు సంతకం చేసేటప్పుడు లాయర్ కి చూపించలేదా?

25:09.051 --> 25:11.428
కానీ, ఆ సంస్థ నాకు తగిన ప్రయోజనాలు కల్పించింది,
నేను ఇంకేం అనగలను?

25:11.512 --> 25:12.471
నీకు ఒక సలహా చెప్పనా?

25:12.554 --> 25:13.514
నిజానికి అవసరం లేదు.

25:13.597 --> 25:15.474
చూడు, కూప్. నీ ఒప్పందం గడువు
పూర్తి కాకుండా తీసుకోలేను.

25:15.557 --> 25:19.645
కాస్త సమయం తీసుకో, ఆ మచ్చ మర్చిపోయేవరకూ ఆగు
ఎందుకంటే నీకు ప్రస్తుతం ఎవరూ ఉద్యోగం ఇవ్వరు.

25:19.728 --> 25:22.564
ఈ లోగా నువ్వు దుబాయ్ లో
కొన్ని పెద్ద సంస్థల్ని సంప్రదిస్తే మేలు.

25:22.648 --> 25:25.275
నీ నాన్-సొలిసిట్ ఒప్పందం లేదా ఆ అమ్మాయి విషయం గురించి
వాళ్లు ఏమీ పట్టించుకోరు.

25:25.359 --> 25:26.777
ఆ అమ్మాయి విషయం అసలు సమస్యే కాదు.

25:26.860 --> 25:29.196
ఏది ఏమైనా వాళ్లు పట్టించుకోరు అంటున్నాను.

25:29.863 --> 25:32.616
కూప్, ఇలా చూడు, అలా ప్రవర్తించకు.

25:53.303 --> 25:54.388
ఆలస్యంగా వచ్చినందుకు సారీ.

25:55.013 --> 25:56.014
నాకు ఇది మామూలే.

25:58.559 --> 26:00.310
రేపు ఆ మిల్లర్ కార్యక్రమానికి వెళ్తున్నావా?

26:01.144 --> 26:02.396
నన్ను ఆహ్వానించారు, ఎందుకు వెళ్లను?

26:04.022 --> 26:05.107
కారణం ఏమీ లేదు.

26:05.190 --> 26:08.610
మెల్ ఇంకా నిక్ వస్తున్నారని ప్రతి కార్యక్రమానికీ
నేను వెళ్లకుండా ఉండిపోతే,

26:08.694 --> 26:11.488
- నేను నా ఇంటి నుంచి బయటకే రాలేను.
- హేయ్, నేను కూడా కూప్ పక్షమే.

26:12.197 --> 26:14.867
- ఏ టీమ్స్ లేవు.
- అబద్ధం.

26:21.331 --> 26:23.208
సరే, ఏంటి సమస్య?

26:23.292 --> 26:24.293
ఏంటి?

26:25.335 --> 26:26.461
నువ్వు నీ ఫోన్ చూసుకోవడం లేదు.

26:26.545 --> 26:28.422
భోజనం చేయడానికి తొందరపడటం లేదు.
ఏదో సమస్య ఉంది.

26:35.512 --> 26:37.055
నేను కొద్ది రోజులు ఉద్యోగం చేయకపోతే ఎలా ఉంటుంది?

26:39.099 --> 26:40.434
కానీ, అలా ఎందుకు చేయకుండా ఉంటావు?

26:40.517 --> 26:43.645
నాకు తెలియదు, నా పిల్లల్ని చూసుకోవడానికి కావచ్చు.
నాకు తెలియదు, పుస్తకం చదువుకుంటాను.

26:44.771 --> 26:46.106
అయితే, కొద్ది వారాల గురించి మాట్లాడుకుంటున్నాం,

26:46.190 --> 26:47.774
- బహుశా ఒక నెల?
- ఖచ్చితంగా.

26:48.901 --> 26:49.902
లేదా, అంటే, ఒక ఏడాది కావచ్చు.

26:52.988 --> 26:56.783
కూప్, ప్రతి సంభాషణలోనూ ఒక సందర్భం ఉంటుంది

26:56.867 --> 26:59.244
అప్పుడు ఆ వ్యక్తి అబద్ధాలు చెప్పడం ఆపి
అసలు విషయం చెప్పాల్సి వస్తుంది.

27:01.246 --> 27:02.789
నా ఉద్యోగం పోయింది.

27:08.212 --> 27:09.421
- ఎవరితో శృంగారం చేశావు?
- ఓయ్.

27:09.505 --> 27:11.632
- నువ్వు నేరుగా అలా ఎందుకు ఆలోచిస్తావు…
- లేదు, లేదు, లేదు, లేదు.

27:11.715 --> 27:13.967
నువ్వు తాగుబోతువి కావు లేదా జాత్యాహంకారివి కావు
ఇంకా నీ లావాదేవీలు బాగున్నాయి,

27:14.051 --> 27:15.052
కాబట్టి శృంగారం ఒక్కటే మిగిలింది.

27:15.135 --> 27:16.970
దేవుడా, బార్నీ, విను.

27:18.889 --> 27:21.517
జాక్ నాతో ఎందుకు అలా ప్రవర్తించాడో
నాకు అర్థం కావడం లేదు.

27:21.600 --> 27:23.393
నా ఉద్దేశం, తెగే వరకూ లాగాడు.

27:23.477 --> 27:26.063
జాక్ నిన్ను ఉద్యోగం నుంచి తప్పించి నీ వ్యాపారాన్ని
తనతోనే ఉంచుకోవాలని చూశాడు. నిజం అదే కదా?

27:26.146 --> 27:28.190
- నిజంగా అదేనా సమస్య?
- తెగే వరకూ లాగాడు.

27:29.358 --> 27:31.026
అంటే, ఆమె పూర్తిగా వేరే అంతస్తులో పని చేసేది.

27:31.109 --> 27:32.653
- ఆమె ఎవరో నాకు తెలియదు.
- నీకు ఇంకెవరూ దొరకలేదా?

27:32.736 --> 27:34.321
- వేరే ఎవరూ?
- తనే నా దగ్గరకి వచ్చింది.

27:34.404 --> 27:36.532
- అది ముఖ్యం కాదు.
- సరే, అదే ఇక్కడ ముఖ్యం.

27:37.324 --> 27:39.326
అదే ముఖ్యం. అదే ముఖ్యం కావాలి.

27:46.750 --> 27:48.043
బెయిలీ ఈ సమస్యని పరిష్కరిస్తాడు.

27:48.126 --> 27:49.044
ఏంటి?

27:49.127 --> 27:50.671
బెయిలీ రసెల్ మీద కేసు వేయి. వాళ్లు పరిష్కరిస్తారు.

27:51.255 --> 27:52.256
వాళ్లు అలా ఎందుకు చేస్తారు?

27:52.339 --> 27:54.883
ఎందుకంటే నువ్వు తాగబోతువి కావు లేదా జాత్యాహంకారివి కావు
ఇంకా నువ్వు వ్యాపారం బాగా చేశావు.

27:55.634 --> 27:57.594
ఇది జడ్జ్ దాకా వెళ్లాలని వాళ్లు కోరుకోవడం లేదు.
వాళ్ల మీద కేసు వేయి.

27:57.678 --> 27:59.930
నువ్వు నా బిజినెస్ మేనేజర్ వి, నా లాయర్ వి కావు.

28:00.013 --> 28:01.306
కానీ నీ బిజినెస్ మేనేజర్ గా చెబుతున్నాను,

28:01.390 --> 28:03.517
ఒక లాయర్ ని నియమించుకోమని నీకు గట్టిగా చెబుతున్నాను.

28:03.600 --> 28:06.228
నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఎంతకాలం
బతకగలనో నాకు తెలియాలి.

28:09.773 --> 28:10.858
నువ్వు పిచ్చోడివా?

28:11.608 --> 28:13.402
ఆరు నెలలు. లేదంటే ఏడు నెలలు.

28:13.485 --> 28:14.444
అది నిజం కాదు.

28:14.528 --> 28:18.031
భరణం, పిల్లల ఖర్చులు, రెండు ఇళ్లు,
కార్లు, ప్రైవేటు స్కూలు ఫీజులు,

28:18.115 --> 28:20.993
మీ సిస్టర్ కి ఇవ్వాలి, నాకు ప్రస్తుతం ఇవే గుర్తున్నాయి.

28:22.578 --> 28:23.537
జాక్ నీ సమస్యని పరిష్కరిస్తాడు.

28:23.620 --> 28:27.583
జాక్ నన్ను తొక్కేస్తాడు.
వాళ్లకి ఎదురెళ్లి పోరాడే సత్తా నాకు లేదు.

28:27.666 --> 28:29.418
నువ్వు పోరాడకుండా ఉండలేవు.

28:32.838 --> 28:34.464
నాకు చాలా అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను.

28:36.592 --> 28:39.511
నీకు ఉండేవి. కానీ తరువాత టెక్ సంస్థల షేర్లు పడిపోవడంతో
నీ సంపద తగ్గిపోయింది.

28:39.595 --> 28:41.722
టెక్ షేర్ల వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోయారు.

28:41.805 --> 28:44.391
ప్రతి ఒక్కరూ తమ భార్యలకి విడాకులు ఇవ్వలేదు
లేదా తోటి ఉద్యోగితో శృంగారం చేయలేదు.

28:45.058 --> 28:47.394
- నువ్వు వెళ్లి మాంటీని కలవాలి.
- కలిశాను. లాన్స్ ని కూడా కలిశాను.

28:48.812 --> 28:52.316
- ఫలితం లేదా?
- నాకు రెండేళ్ల పాటు నాన్-సొలిసిట్ ఒప్పందం ఉంది.

28:55.235 --> 28:56.236
నాకు తెలుసు.

29:09.958 --> 29:11.668
కూప్, ఏం తాగుతున్నావు?

29:12.920 --> 29:13.754
అది వదిలేయ్.

29:13.837 --> 29:16.423
నా దగ్గర ఉన్న పదిహేనేళ్ల పాత జపనీస్ విస్కీ రుచి చూడు.

29:16.507 --> 29:17.716
రెండు.

29:22.095 --> 29:23.013
లెహాయిమ్.

29:27.017 --> 29:28.477
ఎంత మృదువుగా ఉందో, కదా?

29:29.186 --> 29:30.270
అవును.

29:31.188 --> 29:32.606
అయితే…

29:34.858 --> 29:35.859
ఒంటరి జీవితం ఎలా ఉంది?

29:37.236 --> 29:40.030
అంటే, దాని లాభాలు దానికి ఉన్నాయి.

29:40.697 --> 29:44.076
అబద్ధం. నీకు చాలామంది ఆడవాళ్లు
అందుబాటులో ఉండి ఉంటారు.

29:44.159 --> 29:45.953
చూడు, ఏదో ఒకటి చెప్పు. మంచి వార్త చెప్పు.

29:47.079 --> 29:51.083
హేయ్, నేను ఈ ఏడాది కూడా
ఆ క్యాన్సర్ బెనిఫిట్ కార్యక్రమానికి నేను అధ్యక్షుడిగా ఉన్నా,

29:51.166 --> 29:53.460
ఇంకా కిందటి సంవత్సరం మాదిరిగానే,
రెండు టేబుల్స్ కోసం నీ పేరు సిఫార్సు చేశాను.

29:53.544 --> 29:55.003
టేబుల్స్ విలువ ఈసారి ఎంత?

29:55.087 --> 29:56.713
ముప్పై వేలు. రెండు కలిపి అరవై వేలు.

29:58.340 --> 29:59.925
చూడు, కిందటి ఏడాది నువ్వు రెండు టేబుల్స్ కొన్నావు.

30:00.008 --> 30:02.678
అవును, అంటే, కిందట ఏడాది
నేను విడాకులు తీసుకోలేదు, పీటర్.

30:04.471 --> 30:05.973
అవును, నువ్వు చెప్పింది నిజమే. సారీ.

30:07.057 --> 30:08.058
నేను ఆలోచించలేదు.

30:08.141 --> 30:10.143
నిన్ను ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది.

30:13.397 --> 30:15.107
ఆ టేబుల్స్ సంగతి నేను చూసుకుంటా ఇంకా నీ పేరు తీసేస్తా.

30:15.190 --> 30:16.149
అలా వదిలేయ్.

30:17.818 --> 30:19.820
- నిజంగానా?
- అవును, ఫర్వాలేదు. ఫర్వాలేదు.

30:20.696 --> 30:22.281
నువ్వు మొహమాటపడటం లేదు కదా.

30:23.198 --> 30:25.534
కొంతమందిలో అది సహజంగా ఉంటుంది అనుకుంటా.

30:26.743 --> 30:27.744
ఇంక ఆపు.

30:32.666 --> 30:34.084
హేయ్…

30:35.169 --> 30:36.420
అది ఫర్వాలేదు, కదా?

30:37.171 --> 30:38.297
మనం అందరం పరిణితి చెందిన వాళ్లమే.

30:40.007 --> 30:43.468
- అవును. మరేం ఫర్వాలేదు.
- మంచి మాట.

30:49.975 --> 30:52.144
అక్కడ జీవితం ప్రమాదకరంగా ఉంది.

31:00.110 --> 31:01.320
- మెకల్లన్ 25 విస్కీ, ప్లీజ్.
- ఇస్తున్నా.

31:01.403 --> 31:02.404
థాంక్యూ.

31:09.786 --> 31:12.873
మూడుసార్లు ఎన్.బి.ఎ. ఆల్-స్టార్. నువ్వు ఏం చేయగలవు?

31:15.626 --> 31:17.044
అవును.

31:18.712 --> 31:20.214
అతను ఏం తాగుతున్నాడో అదే ఇవ్వు, కానీ ఎక్కువ పోయి.

31:20.297 --> 31:21.381
ఇస్తున్నా.

31:23.550 --> 31:24.384
టీమ్ కూప్?

31:39.691 --> 31:40.901
ఇంకొకటి.

31:42.027 --> 31:43.946
అయితే, నేను పీటర్ కి చెప్పాను,

31:44.029 --> 31:46.406
మనం పిల్లల్ని పంపించేయాలి అని, తెలుసా,

31:46.490 --> 31:49.326
వాళ్లకి మనతో ఇంక పని లేదు అనిపించడానికి ముందే
మనం ఆ పని చేయగలగాలి

31:49.409 --> 31:52.412
ఎందుకంటే తరువాత మనం చేయగలిగేది ఏం ఉంటుంది?
ఒకరితో ఒకరం మాట్లాడుకోవడమేగా?

31:53.247 --> 31:55.457
అలా మాట్లాడుకోవడానికి మాకు పెళ్లయి చాలా ఏళ్లు అయింది.

32:12.891 --> 32:15.894
కాబట్టి, శనివారం రోజు, మేము బెలీజ్ కి బయలుదేరి వెళ్తున్నాం.

32:15.978 --> 32:18.939
నేను అక్కడ ఒక విల్లా చూశాను,
సముద్రతీరం అక్కడ నుంచి అందంగా కనిపిస్తుంది.

32:19.022 --> 32:20.774
పక్కనే పిల్లలకి ప్రత్యేకంగా ఇంకో విల్లా ఉంది

32:20.858 --> 32:22.734
- కాబ్టటి ఇరుకుగా ఉండాల్సిన అవసరం లేదు.
- ఇప్పుడే వస్తాను.

32:22.818 --> 32:25.779
కానీ వాళ్లని మేము కలుస్తామని మాకు తెలుసు
ఎందుకంటే చెఫ్ ఇంకా డైనింగ్ రూమ్

32:25.863 --> 32:27.573
మా దగ్గరే ఉంటాయి, కాబట్టి వాళ్లకి ఆకలేస్తే…

32:28.407 --> 32:31.618
నా ఉద్దేశం, టర్టల్ ఇన్ లో
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

32:31.702 --> 32:33.245
ఎలా ఉన్నావు, కూప్? బాగానే ఉన్నావా?

32:33.954 --> 32:35.706
నేను బాగానే ఉన్నాను, మెల్. నువ్వు ఎలా ఉన్నావు?

32:37.124 --> 32:38.125
బాగున్నాను.

32:41.545 --> 32:44.506
హేయ్, మీ ఇద్దరూ వినండి, నేను ఒక మాట చెప్పచ్చా,

32:44.590 --> 32:46.508
మీ ఇద్దరూ అంత స్నేహపూర్వకంగా విడాకులు తీసుకోవడం
నాకు నచ్చింది.

32:46.592 --> 32:47.843
డయాన్.

32:47.926 --> 32:49.970
లేదు, నిజంగా చెబుతున్నా, తెలుసా.

32:50.053 --> 32:52.764
మైక్ ఇంకా గేల్ విడాకులు తీసుకున్న తీరు గుర్తుందా?
ఏదో బీభత్సం జరిగినట్లు అనిపించింది.

32:52.848 --> 32:54.016
అది నీకు గుర్తుందా?

32:54.099 --> 32:55.475
వాళ్లిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండలేకపోయేవారు.

32:55.559 --> 32:57.060
వాళ్లు ఒకే ఊరిలో ఉండలేకపోయారు.

32:57.144 --> 32:58.145
అవును కదా?

32:58.937 --> 33:02.399
శామ్, నువ్వు ఇంకా పాల్ ఇదే స్నేహాన్ని కొనసాగించగలరా?

33:03.192 --> 33:04.568
ఆ అవకాశమే లేదు,

33:04.651 --> 33:07.696
కానీ ఇలా అందరి ముందు అడిగావు, చూడు,
అందుకు నీకు థాంక్స్.

33:07.779 --> 33:11.950
నేను కేవలం… మీరిద్దరూ ఎంతో హుందాగా
విడాకులు తీసుకున్న తీరుని నేను మెచ్చుకుంటాను.

33:12.034 --> 33:15.120
చూడు, బేబ్, మనం విడాకులు తీసుకున్నప్పుడు,
వాళ్లలాగే తీసుకోవాలి అనుకుంటా.

33:15.204 --> 33:16.622
చాలు. నిన్ను ఇక తాగనివ్వను.

33:16.705 --> 33:17.664
నేను కేవలం…

33:19.708 --> 33:20.667
ఇది గొప్ప విషయం అనుకుంటా…

33:24.713 --> 33:26.757
మనమంతా ఇంతగా జ్ఞానం తెచ్చుకోగలిగాం…

33:27.758 --> 33:29.134
- చూశావా?
- …కదా?

33:29.968 --> 33:33.180
నా ఉద్దేశం, మెల్… అవును, మెల్ ఇంకా నిక్
ప్రేమించుకున్నారు ఇంకా మా పెళ్లి పెటాకులు అయింది,

33:33.263 --> 33:36.934
కానీ మా పిల్లలు ఎంతగా నష్టపోయారో కాలమే చెబుతుంది,

33:37.017 --> 33:41.438
కానీ, చూడండి, మా విడాకుల గురించి
మీరంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.

33:44.399 --> 33:45.776
నా ఉద్దేశం, నాకు అది తెలిసి ఉంటే గనుక…

33:54.034 --> 33:55.327
నేను వెళ్లి మూత్రం పోసుకోవాలి.

35:06.273 --> 35:07.608
అయ్యో.

36:20.097 --> 36:23.809
ఆమె ఎలా చంపబడిందో మనకి తెలియదు.
నేను అనుకోవడం ఆ ఆయుధం…

36:23.892 --> 36:25.352
ఆమెని క్యాండిల్ స్టిక్ తో కొట్టారు.

36:26.353 --> 36:28.355
క్యాండిల్ స్టిక్ తోనా? ఖచ్చితంగా చెప్పగలవా?

36:28.856 --> 36:30.023
ఒక భారీ వెండి కొవ్వొత్తు స్టాండు.

36:30.858 --> 36:32.734
- అది నీకెలా తెలుసు?
- మైక్రోస్కోప్.

36:40.325 --> 36:41.827
ఇదిగో. అలా…

36:51.086 --> 36:53.172
మీలో ఎవరైనా కొద్దిసేపు నాతో కార్లు మార్చుకుంటారా?

36:53.255 --> 36:54.089
అలాగే.

36:56.633 --> 36:59.678
జాగ్రత్తగా పట్టుకోండి
సున్నితమైన వస్తువులు

37:54.900 --> 37:55.734
- చెత్త!
- దేవుడా.

37:55.817 --> 37:59.196
- నాన్నా!
- ఏంటి ఇది… దేవుడా!

37:59.279 --> 38:01.156
ఇది నమ్మశక్యం కావడం లేదు.

38:08.914 --> 38:10.874
- మిస్టర్ కూపర్.
- వెళ్లిపో, జేక్.

38:10.958 --> 38:13.377
సారీ, సర్. మీరు ఇక్కడికి వస్తారని మాకు తెలియదు,

38:13.460 --> 38:15.003
దేవుడి మీద ప్రమాణం… ఛ.

38:15.087 --> 38:17.798
డాడీ! ఏం చేశావు? అయ్యో, దేవుడా.

38:17.881 --> 38:19.842
- నన్ను సర్ అని పిలవద్దని చెప్పాను.
- నీకేం కాలేదు కదా?

38:21.176 --> 38:22.970
నీకు అసలు ఏం అయింది?

38:23.053 --> 38:24.930
- ఓహ్, దేవుడా. నాన్నా.
- నేను ఈ ఫోన్ మాట్లాడాలి. హేయ్.

38:25.722 --> 38:28.183
- ఇక్కడ గుద్దాడు…
- లేదు, బ్రూస్. సారీ. ఏంటి?

38:28.976 --> 38:31.478
- నేను ఏం చేయాలి? నీకు ఏం కావాలి?
- ఓహ్, దేవుడా. అవును.

38:31.562 --> 38:33.814
- నా ఉద్దేశం, నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను.
- నీకు ఏమైనా పిచ్చా?

38:33.897 --> 38:35.732
అవును, ఇలా కొట్టినందుకు సారీ. బై.

38:35.816 --> 38:39.695
కేవలం… దాని మీద ఐస్ లేదా ఏదైనా పెట్టు.
అదే సర్దుకుంటుంది.

38:43.907 --> 38:47.452
ఇది నిజమైనది అనిపిస్తుంది

38:50.372 --> 38:54.877
నువ్వు నిజం అన్నట్లు ఉంటావు

38:55.752 --> 39:01.008
నా నకిలీ ప్లాస్టిక్ ప్రేమ

39:06.013 --> 39:07.014
హేయ్, బ్రూస్.

39:07.097 --> 39:08.932
- వచ్చినందుకు థాంక్స్, కూప్.
- అది నీకు తెలుసు.

39:09.016 --> 39:12.352
కానీ ఈ ఫీలింగ్ ని నేను అణచుకోలేను

39:14.897 --> 39:19.318
నేను పైకప్పు గుండా ఎగిరిపోగలను

39:20.611 --> 39:26.241
నేను వెనక్కి తిరిగి పారిపోగలిగితే

39:28.243 --> 39:29.119
హేయ్, ఆండీ.

39:30.329 --> 39:31.538
బ్రూస్ నాకు ఫోన్ చేశాడు.

39:31.622 --> 39:32.873
అవును, అతను ఫోన్ చేస్తాడని అనుకున్నాను.

39:33.874 --> 39:35.459
ఇలాగయినా మా ఇంటి వరకూ నీతో వస్తాను.

39:36.126 --> 39:37.127
ఇక్కడికి ఎలా వచ్చావు?

39:37.211 --> 39:38.295
నడిచి వచ్చాను.

39:38.921 --> 39:39.880
మందులు వాడటం మళ్లీ మానేశావా?

39:40.756 --> 39:42.633
నాకు ఏదైనా ఒక అనుభూతిని ఆస్వాదించాలని ఉంది, తెలుసా?

39:43.425 --> 39:44.259
ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

39:45.427 --> 39:46.637
ఘోరంగా ఉంది, నిజానికి.

39:47.804 --> 39:48.805
నీ రోజు ఎలా గడిచింది?

39:49.890 --> 39:51.099
నాకు కూడా అలాగే ఉంది.

39:51.683 --> 39:54.144
నువ్వు ఆరోగ్యంగా కనిపించడం లేదు,
ఆ మాట నేను అనాల్సి వస్తోంది.

39:54.770 --> 39:56.021
పద. నిన్ను ఇంటి దగ్గర దింపుతాను.

40:05.113 --> 40:06.448
అతను ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు, కదా.

40:06.532 --> 40:08.200
బంగారం, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

40:08.283 --> 40:09.701
అవును, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది.

40:10.202 --> 40:12.454
అక్కడ ఏం పాట పాడుతున్నావు?
స్మాషింగ్ పంప్కిన్స్ పాటేనా?

40:13.455 --> 40:15.332
రేడియోహెడ్, మూర్ఖుడా.

40:16.500 --> 40:19.253
సరే, సరే. నిజమే. పద.

40:24.091 --> 40:25.092
హేయ్.

40:28.637 --> 40:29.638
నువ్వు కోలుకుంటావు.

40:32.975 --> 40:34.601
ఇది నాకు ఇవ్వు. లోపల కూర్చో.

40:38.313 --> 40:39.940
- కొత్త కారా?
- లోన్ తీసుకున్నాను.

40:40.440 --> 40:41.692
నన్ను ఉడికించకు.

40:56.707 --> 40:58.000
నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఆలీ.

40:59.793 --> 41:00.627
ఎంత తీవ్రమైన ఇబ్బందులు?

41:02.462 --> 41:05.716
నువ్వు అపార్ట్మెంట్ ని ఖాళీ చేసి నాకు ఇచ్చేసి
అమ్మా, నాన్నల దగ్గరకి వెళ్లిపోవాలి.

41:07.509 --> 41:08.510
కానీ, వాళ్లకి అది సమస్య అవుతుంది.

41:10.888 --> 41:12.598
అవును. నువ్వు మందులు వాడకపోతే
వాళ్లకి సమస్య అవుతుంది.

41:12.681 --> 41:14.474
నేను ఎలాంటి హామీలు ఇవ్వలేను.

41:17.227 --> 41:19.354
- ఈ కారు చెత్త కంపు కొడుతోంది.
- దేవుడా, నాకు తెలుసు.

41:19.438 --> 41:20.981
ఇందులో ఏదో చచ్చిపోయినట్లు వాసన వస్తోంది.

41:43.128 --> 41:45.047
లివ్. లివ్.

41:46.006 --> 41:48.425
ఉండు ప్లీజ్… నీతో ఒక సెకను మాట్లాడనివ్వు.

41:48.509 --> 41:51.553
చూడు… చూడు, నీకు జరిగిన దానికి
నేను నిజంగా చాలా బాధపడుతున్నాను.

41:51.637 --> 41:52.888
నిన్ను ఉద్యోగం నుంచి తీసేయడం దారుణం.

41:54.890 --> 41:57.267
- నువ్వు నిజంగా అలా బాధపడుతున్నావా?
- నిజంగా నాకు బాధగా ఉంది.

41:57.351 --> 41:59.770
సరే అయితే, దయచేసి నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకోగలవా?

42:00.354 --> 42:03.273
నా ఉద్దేశం, నువ్వు… ఫిర్యాదు ఉపసంహరించుకుని
కేసు వేసినందుకు బెయిలీ మీద నష్టపరిహారం దావా వేయచ్చు.

42:03.357 --> 42:05.150
- అప్పుడు నా ఉద్యోగం నాకు తిరిగి వస్తుంది.
- ఏంటి?

42:05.234 --> 42:09.071
చూడు, నీ విషయంలో నేను ఏ విధంగా అయినా
పొరపాటుగా వ్యవహరించి ఉంటే సారీ.

42:09.154 --> 42:10.781
మన ఇద్దరం ఆనందంగా గడుపుతున్నామనే అనుకున్నాను.

42:10.864 --> 42:12.908
ఆగు. ముందు ఆగు. నేను…

42:12.991 --> 42:14.701
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు.

42:16.495 --> 42:18.497
నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

42:31.802 --> 42:33.470
కూప్. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు.

42:33.554 --> 42:34.680
ఏం ఫర్వాలేదు, మేరీ.

42:36.598 --> 42:39.268
- నా మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
- కూప్. నువ్వు ఇక్కడికి రాకూడదు.

42:39.351 --> 42:40.936
లివ్ క్రాస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

42:41.019 --> 42:42.729
అది హెచ్.ఆర్. విషయం. నాకు ఏం చెప్పారో అదే నాకు తెలుసు.

42:42.813 --> 42:43.981
అబద్ధం, జాక్. నువ్వే ఇదంతా చేశావు.

42:44.064 --> 42:46.233
నువ్వు కంపెనీ నియమాలు ఉల్లంఘించావు.
నా చేతుల్లో ఏమీ లేదు.

42:46.316 --> 42:48.527
నా క్లయింట్లని కాజేసే అవకాశం ఉందని గ్రహించి
నన్ను ఉద్యోగం నుంచి తప్పించావు.

42:49.528 --> 42:50.571
నీకు నువ్వే పోగొట్టుకున్నావు.

42:50.654 --> 42:51.697
మనం ఫ్రెండ్స్ అనుకున్నాను.

42:55.033 --> 42:57.160
కనీసం నా క్యాపిటల్ అకౌంట్ అయినా నాకు వదిలేయ్.

42:57.911 --> 42:59.872
నిన్ను వేడుకొంటున్నాను.
అది నా డబ్బు. నాకు ఆ డబ్బు కావాలి.

42:59.955 --> 43:01.582
లేదు, అది నీది కాదు.

43:03.292 --> 43:06.879
ఇవన్నీ ఎప్పటికీ నీవే అనుకోవడమే
నువ్వు చేసిన అతి పెద్ద తప్పు.

43:07.754 --> 43:08.964
సరే, సరే.

43:13.093 --> 43:15.095
నువ్వు కాపాడుకోలేకపోతే అది నీది కాదు.

43:35.866 --> 43:38.118
ఆ అందమైన మోటారుని నిన్ను పాడుచేయనివ్వను.

43:38.994 --> 43:40.120
సరే, దాన్ని ఆన్ చేయి.

44:06.939 --> 44:07.940
ఇదిగో.

44:20.494 --> 44:22.120
టోరీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు?

44:24.581 --> 44:26.917
- జేక్?
- అదే.

44:28.335 --> 44:29.378
అతను బయటపడతాడు.

44:30.879 --> 44:31.880
మరి టోరీ?

44:34.341 --> 44:36.885
తన కోపం తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది.
నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.

44:43.100 --> 44:44.351
నువ్వు నీలా లేవు, కూప్.

44:46.979 --> 44:50.107
చూడు, ఆ బార్బిక్యూ దగ్గర జరిగినదానికి సారీ.
నేను కొద్దిగా ఎక్కువ తాగాను.

44:50.190 --> 44:52.860
నేను బార్బిక్యూ గురించి మాట్లాడటం లేదు,
నువ్వు మన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద

44:52.943 --> 44:54.528
దాడి చేశావనే వాస్తవం గురించి మాట్లాడటం లేదు.

44:54.611 --> 44:56.738
- అది దారుణమే కానీ, దేవుడా.
- మరి దేని గురించి?

44:58.448 --> 44:59.533
నాకు తెలియదు.

44:59.616 --> 45:01.285
నువ్వు చాలా…

45:02.369 --> 45:03.370
ఒంటరితనం ఫీల్ అవుతున్నావు.

45:04.705 --> 45:09.877
అవును, సరే, నేను ఇక్కడ ఉంటాను, ఇంకా నువ్వు
అక్కడ మన ఇంట్లో మన పిల్లలతో కలిసి ఉంటావు.

45:09.960 --> 45:12.796
- నాకు తెలుసు.
- నువ్వు నన్ను వదిలేశావు. అది నన్ను…

45:14.965 --> 45:15.883
ఒంటరిని చేసింది.

45:15.966 --> 45:17.718
నేను దాని గురించి కూడా మాట్లాడటం లేదు.

45:19.720 --> 45:20.971
నాకు నీ గురించి ఆందోళనగా ఉంది.

45:26.685 --> 45:27.686
హేయ్.

45:29.521 --> 45:30.814
ఏం అయింది?

45:33.692 --> 45:35.903
ఇదిగో, చూడు, నువ్వు నాతో ఇప్పటికీ మాట్లాడచ్చు, కదా?

45:39.448 --> 45:40.449
నేను బాగానే ఉన్నాను.

45:42.034 --> 45:45.579
నేను బాగున్నాను. నా దారి ఏదో వెతుక్కుంటున్నాను.

45:53.962 --> 45:54.963
సరే.

46:01.053 --> 46:02.054
మంచిది.

46:10.145 --> 46:11.396
ఇలా వచ్చి కలిసినందుకు థాంక్స్.

46:12.856 --> 46:13.857
బీర్ ఇచ్చినందుకు థాంక్స్.

46:22.449 --> 46:23.450
మిస్ క్రాస్.

46:24.785 --> 46:27.788
- నీకు ఏం సాయం చేయగలను?
- నేను మీ నుంచి వివరణని ఆశిస్తున్నాను.

46:27.871 --> 46:29.081
ఆండ్రూ కూపర్ విషయంలో.

46:29.164 --> 46:30.499
నేను ఫిర్యాదు చేయలేదు.

46:30.582 --> 46:33.710
నీ పాత్ర గురించి ఎవరో హెచ్.ఆర్.కి ఫిర్యాదు చేశారు.

46:33.794 --> 46:36.129
- కానీ కంప్లయింట్ లేదు కదా.
- విస్కీ కావాలా?

46:36.213 --> 46:37.798
- వద్దు.
- కూర్చో.

46:41.218 --> 46:44.555
ఆ పదం అలా ఉపయోగించినందుకు సారీ,
కానీ ఫిర్యాదు చేసినా చేయకపోయినా,

46:44.638 --> 46:48.308
మిస్టర్ కూపర్ మా కంపెనీ నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించాడు.

46:48.392 --> 46:49.643
అతను ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు,

46:49.726 --> 46:52.312
ఇంకా మా సంస్థ ఉద్యోగుల్ని కాపాడుకోవడంలో
మేము చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తాము.

46:52.396 --> 46:54.273
నా ఉన్నతాధికారుల జాబితాలో అతని పేరు లేదు.

46:54.356 --> 46:55.941
అతనికి రిపోర్ట్ చేసే వారెవరికీ నేను రిపోర్ట్ చేయను.

46:56.024 --> 46:58.360
అతను తల్చుకుంటే నిన్ను ఉద్యోగం నుంచి
తప్పించలేడు అనుకుంటున్నావా?

46:58.986 --> 47:00.153
అతను ఉద్యోగం కోల్పోవలసిన అవసరం లేదు.

47:01.405 --> 47:04.908
నా కాన్ఫరెన్స్ రూమ్ నిండా ఉన్న కార్మిక చట్టాల లాయర్లు
మరొకలా వాదిస్తున్నారు.

47:09.496 --> 47:12.457
నువ్వు ఒక స్టార్ వి అని షెపర్డ్ నాకు చెప్పాడు.
నీకు ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నాడు.

47:12.541 --> 47:15.043
నీ డెస్క్ ని నువ్వే చూసుకోవాలని అతను ఆశిస్తున్నాడు.
అందుకు నువ్వు రెడీగా ఉన్నావా?

47:15.127 --> 47:17.004
దానికీ దీనికీ సంబంధం ఏంటి?

47:17.087 --> 47:18.797
అది పూర్తయిపోయింది.
ఇప్పుడు దీని గురించి అడుగుతున్నా.

47:19.506 --> 47:23.594
కూప్ గతం కంటే నీ భవిష్యత్తు మీదనే నాకు ఆసక్తి ఉంది.

47:28.223 --> 47:30.559
నీకు ఒక విషయం చెప్పాలి.
ఇంకో నిమిషంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి,

47:30.642 --> 47:33.854
కాబట్టి మనం ఈ వారంలో తరువాత ఎప్పుడైనా
డిన్నర్ కి వెళ్లి మాట్లాడుకుందాం.

47:33.937 --> 47:35.439
నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉండేదీ మేరీ చూస్తుంది.

47:36.148 --> 47:37.858
షెపర్డ్ మనతో చేరకూడదా?

47:40.235 --> 47:41.820
షెపర్డ్ కూడా మనతో రావచ్చు.

47:45.407 --> 47:46.241
థాంక్యూ.

48:57.771 --> 48:59.773
కూప్
నా కోరిక

49:49.364 --> 49:51.200
సరే, నీ దగ్గర అన్నీ ఉన్నాయా…

49:51.283 --> 49:52.951
ఒక నిర్దిష్టమైన దృష్టిలో చూస్తే,

49:53.035 --> 49:56.330
ఒకదానితో ఒకటి సంబంధం ఉండే కొన్ని నిర్ణయాల వల్ల
జీవితం క్రమంగా చప్పబడిపోతుంది.

49:56.914 --> 49:58.790
మిల్లర్స్ కుటుంబం బెలీజ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

50:01.001 --> 50:02.669
నేను మిల్లర్స్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

50:08.884 --> 50:11.512
వెస్ట్ మాంట్ విలేజ్ కి సొంత సెక్యూరిటీ గస్తీ ఉంది,

50:11.595 --> 50:13.639
అలాగే వెస్ట్ మాంట్ పోలీస్ డిపార్ట్మెంటుకి కూడా
ప్రత్యేక కాపలా వ్యవస్థ ఉంది.

50:14.389 --> 50:16.558
అక్కడ నేరాల సంఖ్య దాదాపుగా సున్నా.

50:18.393 --> 50:20.229
అటువంటి ప్రదేశంలో ఎక్కువ కాలం ఉంటే,

50:20.312 --> 50:22.689
ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా అనిపిస్తుంది.

50:23.440 --> 50:26.527
అలారం సిస్టమ్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం

50:27.236 --> 50:28.695
ఇంకా తలుపులన్నీ మూయడంలో నిర్లక్ష్యం వహిస్తాం.

51:16.243 --> 51:18.912
పాటెక్ ఫిలీప్ నౌటిలస్:
18 క్యారెట్ల తెల్ల బంగారంతో సీల్ చేసినది,

51:18.996 --> 51:19.997
నీలం రంగు మెరిసే డయల్,

51:20.080 --> 51:23.667
ముప్పై మీటర్ల వరకూ నీటిలో పడినా పని చేస్తుంది,
అలాంటి పరిస్థితే వస్తే.

51:23.750 --> 51:27.004
యాడ్స్ లో చెప్పిన విధంగా,
"మీరు నిజానికి పాటెక్ ఫిలీప్ వాచీని ఎప్పటికీ సొంతం చేసుకోలేరు,

51:27.087 --> 51:29.590
మీరు దానిని మీ తరువాత తరం కోసం
జాగ్రత్తగా భద్రపరుస్తారు."

51:32.134 --> 51:34.428
కానీ, తరువాత తరం వాళ్లు టైమ్ ని ఫోన్లలో చూస్తున్నారు,

51:34.511 --> 51:36.388
కాబట్టి ఎవరూ దీనిని మిస్ కారని నేను నిర్ణయించుకున్నాను.

52:18.847 --> 52:20.641
హాయ్, మిత్రులారా. అంతా బాగానే ఉందా?

52:20.724 --> 52:22.643
గుడ్ ఈవెనింగ్, సర్. మీరు ఇక్కడ నివసిస్తారా?

52:22.726 --> 52:23.977
అవును, అవును, ఇదే నా నివాసం.

52:24.061 --> 52:26.188
మీ ఇంట్లో వారు ఊరు వెళ్తూ,
ఈ రాత్రి నుంచి నిఘా ఉంచాలని చెప్పారు.

52:26.271 --> 52:29.399
వీధి చివర హోండా కారు పార్క్ చేసి ఉండటాన్ని చూశాము,
ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి…

52:29.483 --> 52:30.567
అందుకే తనిఖీ చేద్దామని వచ్చాం.

52:32.819 --> 52:34.196
అది మా అబ్బాయి కారు.

52:34.279 --> 52:36.615
మేము బయలుదేరే ముందు
దాన్ని గరాజ్ లో పెట్టమని వాడికి చెప్పాను.

52:36.698 --> 52:37.908
అయితే మీరు సెలవులకి ఊరు వెళ్తున్నారా?

52:37.991 --> 52:39.868
అవును. తెల్లవారుజామున
కాస్త వెలుతురు వచ్చాక బయలుదేరతాం.

52:39.952 --> 52:42.579
నా భార్య మీకు సమాచారం ఇచ్చినప్పుడు
తేదీని తప్పుగా చెప్పి ఉంటుంది.

52:42.663 --> 52:46.166
- ఏం ఫర్వాలేదు. మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి.
- థాంక్స్, మిత్రులారా.

52:46.250 --> 52:47.668
మిమ్మల్ని మెచ్చుకుంటాను.

53:07.771 --> 53:09.273
నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలియడం లేదు.

53:09.356 --> 53:10.566
కానీ, అది నిజం కాదు.

53:10.649 --> 53:13.652
పీటర్ ఇంకా డయాన్ మిల్లర్ బుద్ధిహీనులు అని.

53:13.735 --> 53:15.320
ఇంత సంపద పొందే అర్హత వాళ్లకి లేదు అనుకుంటున్నాను.

53:15.988 --> 53:18.907
ఇంకా అటువంటి మూర్ఖులు ఈ ఇంటి ఇరుగుపొరుగులో

53:18.991 --> 53:21.618
ఇంకా చాలామంది ఉన్నారని,
ఇటువంటి ఇళ్లు చుట్టుపక్కల ఉన్నాయని,

53:21.702 --> 53:25.163
ఇటువంటి ఖరీదైన వస్తువులతో
ఆ ఇళ్లు నిండిపోయి ఉన్నాయని అనుకుంటున్నాను.

53:25.247 --> 53:28.542
మర్చిపోయిన సంపద పేరుకుపోయి
సొరుగులలో వృథాగా పడి ఉంది

53:28.625 --> 53:30.794
అక్కడ అది ఎవరికీ ఉపయోగం లేకుండా పడి ఉంది.

53:30.878 --> 53:33.630
నాకు ఈ విషయం తెలుసు ఎందుకంటే,
కొంతకాలం కిందటి వరకూ,

53:34.214 --> 53:35.841
అటువంటి మూర్ఖులలో నేను కూడా ఒకడినే.

53:45.976 --> 53:47.603
మెకల్లాన్
25

53:47.686 --> 53:50.939
నేను భరణం గురించి ఆలోచిస్తున్నాను,
పిల్లల ఖర్చులు, లీగల్ ఫీజులు, రెండు ఇళ్లు,

53:51.023 --> 53:53.442
గరిష్టంగా హోమ్ ఈక్విటీ రుణం,
ట్యూషన్ ఫీజులు, ప్రాపర్టీ టాక్సులు,

53:53.525 --> 53:55.652
ఆరోగ్య బీమా ప్రీమియంలు, ఎస్.ఎ.టి. ట్యూటర్లు,

53:55.736 --> 53:57.529
పిల్లల సైకాలజిస్టులు, కారు పేమెంట్లు, తోటమాలులు,

53:57.613 --> 53:59.907
పారిశుధ్యం కార్మికులు, పైకప్పు కూలీలు,
పెయింటర్లు, ప్లంబర్లు, డ్రమ్ కిట్లు,

53:59.990 --> 54:03.035
విడాకుల తరువాత నుంచి బ్యాంక్ అకౌంట్
అప్పుల ఖాతాగా మారిపోయింది.

54:03.118 --> 54:05.370
కానీ ఏ ఒక్కరూ, చివరికి పోలీసులు కూడా,

54:05.454 --> 54:07.372
నాలాంటి వాడిని అనుమానించలేరు.

54:08.165 --> 54:10.167
ఇది మంచి ఐడియా అని నేను చెప్పడం లేదు.

54:10.250 --> 54:11.585
ఇది కేవలం తాత్కాలికమైనది.

54:11.668 --> 54:14.379
నా కాళ్ల మీద నేను నిలదొక్కుకునే వరకూ
కొన్ని చెల్లింపులు చేయడం కోసమే ఇది.

54:15.005 --> 54:18.425
ఇంకా నేను ఆలోచించాను,
ఈ పనిలో ఘోరమైనది ఏం జరిగే అవకాశం ఉంది? అని.

56:12.122 --> 56:14.124
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
