WEBVTT

00:01.160 --> 00:03.840
-[గంటలు మోగుతున్న ధ్వని]
-[ఈల శబ్దం]

00:07.120 --> 00:08.680
[గిలక ధ్వని]

00:08.760 --> 00:10.200
[గిలక ధ్వని]

00:10.280 --> 00:12.280
[నిదానమైన సంగీతం]

00:12.360 --> 00:14.360
[గాలి వీస్తున్న శబ్దం]

00:15.440 --> 00:19.560
దెబ్బ తగిలితే నొప్పి కలుగుతుంది.
అలాగే మనిషి పాఠం నేర్చుకుంటాడు.

00:19.640 --> 00:23.160
గాంధీ గారి 150వ జయంతి

00:23.880 --> 00:26.080
[కాగితం చప్పుడు]

00:30.600 --> 00:32.480
[వికాస్] సెక్రటరీ గారూ,
కొంచెం టీ తాగుతారా?

00:35.200 --> 00:36.200
వద్దు.

00:36.280 --> 00:38.080
చల్లటి బీర్ తాగుతారేంటి?

00:46.400 --> 00:48.840
[వికాస్] మీరు పరీక్ష రాసి
రెండు నెలలు అయ్యింది.

00:48.920 --> 00:50.920
ఎన్నాళ్ళు దాని గురించే చింత?

00:51.000 --> 00:54.240
మళ్లీ పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టండి.

00:54.320 --> 00:56.160
ఈసారి పాస్ అయిపోతారు ఖాయంగా.

00:56.920 --> 00:57.960
అయిపోతానా?

00:59.600 --> 01:00.600
అయిపోతానా?

01:01.600 --> 01:04.520
మంచి ఐఐఎమ్ లో చేరాలంటే
99 పెర్సెంటైల్ పైన ఉండాలి.

01:05.000 --> 01:06.240
90 వచ్చినా కూడా,

01:06.560 --> 01:08.760
పోనీ కష్టపడి వచ్చే
ఏడాది కొట్టేద్దాం అనుకోవచ్చు.

01:09.040 --> 01:10.200
నాకెంత వచ్చింది?

01:10.560 --> 01:12.240
ఎనభై రెండు శాతం.

01:12.920 --> 01:16.160
82 నుంచి 99 కి చేరుకుంటానా? ఈ జన్మలో.

01:17.120 --> 01:18.560
నేను వెధవని కనుక.

01:18.960 --> 01:20.160
నా బుర్ర వెధవది!

01:21.320 --> 01:23.280
[అభిషేక్] కనుక క్యాట్ పరీక్ష పాసవ్వలేను.

01:23.360 --> 01:26.600
ఈ అల్లాటప్పా ఉద్యోగాలే
జీవితాంతం చేసుకుంటూ బ్రతకాల్సిందే.

01:27.160 --> 01:30.720
నా నుదుటనే రాసుంది. అభిషేక్ త్రిపాఠీ,
పంచాయతీ కార్యదర్శి, ఫులేరా గ్రామం.

01:33.000 --> 01:34.880
జనవరి 26 కి బ్యానర్లు కట్టటం.

01:34.960 --> 01:36.200
అది కూడా ఒక ఉద్యోగమేనా?

01:36.680 --> 01:38.800
దా. తీసుకురా బ్యానర్లు!

01:39.800 --> 01:41.760
-నేను కడతాను సర్.
-బ్యానర్లు తీసుకురా!

01:41.840 --> 01:44.080
[ఉత్కంఠభరిత సంగీతం]

01:51.280 --> 01:53.720
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

01:57.240 --> 01:58.480
క్షమించు, కొంచెం ఎక్కువయ్యింది.

01:58.560 --> 01:59.800
[వికాస్ నవ్వుతున్న శబ్దం]

01:59.880 --> 02:01.080
ఏం పర్వాలేదు సర్.

02:01.160 --> 02:04.240
రెండు నెలలుగా మీలో మీరే మథనపడుతున్నారు.

02:04.320 --> 02:06.000
[వికాస్] ఈరోజు అదంతా బయటకి కక్కేశారు.
మంచిదే.

02:06.080 --> 02:07.800
ఇప్పుడు మీ మనసు తేలిక పడి ఉండచ్చు.

02:08.040 --> 02:10.680
-[హారన్ శబ్దం]
-[బైక్ సమీపిస్తున్న ధ్వని]

02:13.760 --> 02:15.120
నమస్కారం, సర్పంచ్ గారూ.

02:15.200 --> 02:17.600
నమస్కారం. బ్యానర్ బాగుంది.

02:18.160 --> 02:20.600
ఇక్కడ నుంచి ఏమీ కనిపించట్లేదు.

02:20.800 --> 02:24.280
దూరం నుంచి కనపడటానికి నువ్వేమైనా గ్రద్దవా?

02:25.160 --> 02:29.160
సర్పంచ్ గారూ, మీ బొమ్మ పెద్దగా ఉంది.
అందరికీ కనిపిస్తుంది.

02:29.240 --> 02:31.720
కానీ నాది చాలా చిన్నగా ఉంది.
ఎవరూ గుర్తుపట్టలేరు కూడా.

02:32.080 --> 02:33.240
-చిన్నగా ఉందా?
-అవును.

02:33.320 --> 02:34.480
గుర్తుపట్టేలా లేదా?

02:34.760 --> 02:36.040
నువ్వు మరీనోయ్, ప్రహ్లాద్.

02:36.360 --> 02:37.800
-ఓయ్, వికాస్!
-[వికాస్] చెప్పండి.

02:37.880 --> 02:39.880
ఇంకో బ్యానర్ మిగిలిందా?

02:39.960 --> 02:41.280
ఇంకొకటి ఉంది.

02:41.360 --> 02:43.280
ఈ కర్జూరం చెట్టుకి ఒకటి కట్టండి.

02:44.240 --> 02:46.440
-అలాగే సర్పంచ్ గారూ.
-ఇప్పుడే కట్టేయండి.

02:46.520 --> 02:47.840
-[వికాస్] అలాగే.
-సరే.

02:47.920 --> 02:49.880
-[మోటర్ సైకిల్ మొదలైన ధ్వని]
-[బ్రిజ్] పద.

02:49.960 --> 02:52.480
నేను తిరిగి వచ్చేసరికి కట్టేయాలి.

02:52.560 --> 02:54.800
-[వికాస్] అలాగే సర్పంచ్ గారూ.
-ఉంటాను.

03:03.720 --> 03:05.040
ఎక్కడకి వెళ్తున్నారు?

03:05.600 --> 03:07.760
[వికాస్] జనవరి 26 న జెండావందనం ఉంది కదా?

03:08.320 --> 03:11.040
ఫకౌలీ బజార్ కు వెళ్తున్నారేమో
కొత్త బట్టలు కొనుక్కోవటానికి.

03:12.240 --> 03:13.720
మంజు దేవి జెండా కూడా ఎగరవేయదా?

03:13.800 --> 03:14.880
లేదు.

03:15.200 --> 03:16.760
సర్పంచ్ గారే ఎగరవేస్తారు.

03:16.960 --> 03:18.440
ఆగస్ట్ 15 నాడు కూడా అంతే కదా?

03:19.240 --> 03:21.720
[వికాస్] క్రిందటిసారి మీరు సెలవు పెట్టి
ఊరు వెళ్ళారు కదా?

03:22.120 --> 03:23.120
మీరు ఉండి ఉంటే,

03:23.200 --> 03:25.000
మీకు తెలిసేది ఎవరు ఎగరేస్తారో.

03:25.080 --> 03:27.200
సరిగ్గా చెప్పాలంటే ఆ పని మంజు దేవి చేయాలి.

03:27.280 --> 03:28.600
ఆవిడే అధికారికంగా సర్పంచ్.

03:29.080 --> 03:30.800
సరిగ్గా చెప్పాలంటే ఆవిడే ఎగరేయాలి.

03:31.080 --> 03:32.760
కానీ ఆవిడ ఇవన్నీ పట్టించుకోరు.

03:34.160 --> 03:37.160
సీసీ రోడ్ కాయితాలపై మంజు దేవి గారి
వేలిముద్రలు తీసుకున్నావా?

03:38.040 --> 03:39.280
అది...

03:41.800 --> 03:43.800
తీసుకురా, నేనే తీసుకుంటాను.

03:44.760 --> 03:48.720
గ్రామ పంచాయతీ ఫులేరా

03:48.920 --> 03:51.280
[నిదానమైన సంగీతం]

04:01.200 --> 04:03.800
[మంజు] చదవకుండానే వేలిముద్ర
వేసేస్తున్నాను.

04:03.880 --> 04:05.920
-మీపై నమ్మకంతో.
-[అభిషేక్] అలాగే.

04:06.120 --> 04:07.160
చెప్పండి.

04:14.400 --> 04:15.520
అయిపోయింది.

04:21.840 --> 04:24.280
పరీక్షలో ఫెయిలయ్యారట కదా?

04:24.360 --> 04:26.480
[ఆవులు అరుస్తున్న శబ్దం]

04:27.720 --> 04:29.080
ఫెయిల్ అవ్వలేదు.

04:29.160 --> 04:30.520
మార్కులు తక్కువ వచ్చాయి అంతే.

04:30.960 --> 04:35.280
అంటే మీరు కావాలనుకున్న చోట
అడ్మిషన్ అయితే దొరకదు కదా?

04:36.480 --> 04:37.480
అక్కడయితే దొరకదు.

04:37.840 --> 04:39.280
అంటే ఫెయిల్ అయినట్టే కదా?

04:43.040 --> 04:44.160
[నవ్వుతున్న శబ్దం]

04:44.840 --> 04:46.480
బాధపడద్దు.

04:47.840 --> 04:49.880
ఎవరి సామర్ద్యం వాళ్ళది.

04:49.960 --> 04:53.120
[మంజు] కొందరు కలెక్టర్ అవ్వచ్చు,
కొందరు క్లర్క్ గా మిగిలిపోవచ్చు.

04:54.440 --> 04:55.440
ఊ.

04:55.520 --> 04:57.880
[హాస్యభరితమైన సంగీతం]

05:00.880 --> 05:03.480
మీరు జనవరి 26 కి జెండా ఎగరవేయట్లేదని
నేనూ విన్నానే.

05:03.560 --> 05:07.080
లేదు, ఆ పనులన్నీ రింకీ వాళ్ళ నాన్నగారు
చూసుకుంటారు.

05:07.880 --> 05:10.560
దగ్గరలోని గోపాల్ పూర్ పంచాయతీలోని
సర్పంచ్ కూడా ఒక స్త్రీనే.

05:11.200 --> 05:12.520
ఆవిడ జెండా ఎగరవేస్తుంది మరి.

05:14.600 --> 05:17.000
అంటే, ఆవిడ కార్యాలయానికి కూడా
వెళ్తుంది అనుకోండి.

05:17.080 --> 05:19.120
పనులన్నీ చూసుకుంటుంది.

05:19.840 --> 05:22.720
ఇలాంటి కాగితాలపై సంతకం కూడా చేస్తుంది.

05:24.680 --> 05:27.000
ఎవరి సామర్ధ్యం వాళ్ళకి ఉంటుందిలెండి.

05:27.520 --> 05:30.440
ఒక చోట మరచిపోయారు. ఇక్కడ వేలిముద్ర వేయండి.

05:32.040 --> 05:34.040
[హాస్యభరిత సంగీతం]

05:37.160 --> 05:39.240
[బైక్ మొదలైన శబ్దం]

05:51.280 --> 05:52.600
సర్పంచ్ గారు ఇంట్లో ఉన్నారా?

05:55.160 --> 05:56.320
చెప్పండి.

05:56.400 --> 05:57.560
సర్పంచ్ గారు లేరా?

05:57.640 --> 05:59.400
నేనే సర్పంచ్ ని. పనేమిటో చెప్పండి.

05:59.640 --> 06:02.360
నేను తర్వాతే వస్తాను లెండి. ఉంటాను.

06:05.560 --> 06:07.200
నేను సర్పంచ్ లా కనిపించట్లేదా?

06:08.680 --> 06:10.120
ఏమనుకుంటున్నాడో.

06:11.840 --> 06:13.840
[నేపథ్య సంగీతం]

07:04.440 --> 07:06.880
పంచాయత్

07:12.800 --> 07:15.080
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

07:15.160 --> 07:16.560
[బైక్ వేగం తగ్గుతున్న శబ్దం]

07:17.880 --> 07:19.400
ఇప్పుడు కనిపిస్తోందా?

07:19.960 --> 07:25.320
సర్పంచ్ గారూ, నాదొక ఆలోచన.
ఈ బ్యానర్ ని రహదారి దగ్గర కట్టిద్దాం.

07:25.920 --> 07:29.040
వెళ్ళే వాళ్ళు చూస్తే
మన కీర్తి పెరుగుతుంది.

07:29.560 --> 07:31.920
నువ్వు ఇలాగే ఎప్పుడూ
నా నెత్తికెక్కి కూర్చుంటావు.

07:32.440 --> 07:36.240
సర్పంచ్ గారూ, ఇంతవరకు నా ఫోటో ఉన్న బ్యానర్
ఏదీ రహదారి దగ్గర కట్టలేదు.

07:36.320 --> 07:37.320
రహదారి దగ్గర.

07:37.400 --> 07:38.440
ఒట్టు.

07:38.520 --> 07:40.880
లేదా? అయితే కట్టించమంటావా?

07:41.880 --> 07:44.280
-హే! వికాస్!
-[వికాస్] సర్పంచ్ గారూ!

07:45.000 --> 07:46.520
[బ్రిజ్] ఎక్కడ చచ్చావయ్యా?

07:47.080 --> 07:48.200
చెప్పండి.

07:49.240 --> 07:52.600
ఈ బ్యానర్ ని రహదారి దగ్గర మంచి చోటు చూసి
కట్టండి.

07:52.680 --> 07:53.800
అలాగే సర్పంచ్ గారూ.

07:53.880 --> 07:55.000
ఆనందమేనా?

07:55.080 --> 07:56.960
ఇప్పుడు రహదారి అంటావు.

07:57.040 --> 07:59.640
తర్వాత, నా గుండెలపై కట్టమంటావు.

08:00.200 --> 08:02.880
రాజకీయాల్లో ఇవన్నీ చాలా ముఖ్యమండీ.

08:02.960 --> 08:05.200
[ప్రహ్లాద్] జనానికి చూస్తేనే కదా తెలిసేది?

08:08.400 --> 08:10.600
[మృదు సంగీతం]

08:26.840 --> 08:28.120
ఎలా ఉన్నాను?

08:28.840 --> 08:29.880
చాలా బాగున్నారు.

08:30.800 --> 08:33.800
బాగుందనే ముందు ఒకసారి చూడవోయ్.

08:36.960 --> 08:38.040
చాలా బాగుంది.

08:38.120 --> 08:39.280
[బ్రిజ్] ఏమయ్యింది?

08:39.360 --> 08:42.200
నీకు కూడా ఒక చీర తీసుకురావలసింది అంటావా?

08:42.760 --> 08:44.200
నాకెందుకు లెండి చీర?

08:44.640 --> 08:46.360
నేనేమైనా జెండా ఎగరవేస్తానా ఏమిటి?

08:46.440 --> 08:47.960
అయితే ఎగరవేయి.

08:48.600 --> 08:50.240
[బ్రిజ్] అది ఏమంత పెద్ద విషయం?

08:50.760 --> 08:51.960
కానివ్వు.

08:52.960 --> 08:54.000
అలాగే.

08:54.080 --> 08:55.080
[బ్రిజ్] ఏంటి?

08:55.400 --> 08:56.840
నేనే ఎగరవేస్తాను.

08:57.480 --> 09:00.400
సరదాగా అన్నాను. నువ్వెలా ఎగరవేస్తావు?

09:00.480 --> 09:02.960
ఎందుకు కుదరదు? నేనే సర్పంచ్ ని?

09:03.480 --> 09:05.680
[హాస్యభరిత సంగీతం]

09:12.920 --> 09:15.520
-[బ్రిజ్] ఏమయ్యింది నీకు ఉన్నట్టుండి?
-ఏమీ లేదు.

09:16.480 --> 09:18.080
నువ్వెలా జెండా ఎగరవేస్తావు?

09:18.160 --> 09:21.160
ఏం? ఆ జెండా తాడు అంత బరువుంటుందా?

09:21.240 --> 09:23.520
రోజంతా ఇంట్లో పని చేస్తానుగా? ఇది చేయలేనా?

09:23.600 --> 09:25.800
జెండా ఎగరవేస్తే సరిపోతుందా?

09:26.160 --> 09:28.200
అది అయ్యాక జాతీయగీతం కూడా పాడాలి.

09:28.280 --> 09:29.320
పాడతాను.

09:29.720 --> 09:32.760
పెళ్లిళ్ళలో పాటలు పాడనా?
ఇదీ అలాగే పాడతాను.

09:32.840 --> 09:35.040
నీకు జాతీయగీతం ఏమిటో తెలుసా?

09:35.640 --> 09:36.720
ఏదైనా సరే, పాడేస్తాను.

09:36.800 --> 09:37.960
ఎలా పాడతావు?

09:38.040 --> 09:39.400
గుర్తుంటేనే కదా పాడగలవు?

09:40.600 --> 09:41.960
గుర్తు తెచ్చుకుంటాను.

09:42.040 --> 09:44.760
ఎలా తెచ్చుకుంటావు? ఎవరు గుర్తుచేస్తారు?

09:45.040 --> 09:46.720
[బ్రిజ్] రింకీ అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.

09:47.040 --> 09:50.240
నేనేమో రింకీ జాతకం తీసుకొని
రెండు రోజులపాటు మల్కోపూర్ వెళ్ళాలి.

09:50.560 --> 09:52.200
ఎల్లుండి సాయంత్రం వరకు తిరిగిరాను.

09:52.280 --> 09:53.800
ఆ మర్నాడే జనవరి 26.

09:54.120 --> 09:56.080
నేను లేనప్పుడు నీకు ఎవరు గుర్తుచేస్తారు?

09:56.720 --> 09:58.360
మీరు వెళ్ళండి మల్కోపూర్.

09:58.760 --> 10:01.200
వచ్చే దారిలో నాకో కొత్తచీర తీసుకురండి.

10:01.920 --> 10:02.920
ఏంటి?

10:03.880 --> 10:06.880
ఇక ఎవరు గుర్తుచేస్తారు అంటే...

10:07.960 --> 10:09.480
ఒకరున్నారులే.

10:15.200 --> 10:17.840
ఎవరు సాయం చేస్తారబ్బా?

10:19.880 --> 10:24.000
[మంజు] ♪వందేమాతరం♪

10:24.560 --> 10:28.560
♪వందేమాతరం♪

10:29.760 --> 10:30.760
♪వందే...♪

10:31.160 --> 10:35.440
అవును. మీరు పాడినది జాతీయ పాట.

10:36.160 --> 10:37.720
జాతీయ గీతం "జనగణమన."

10:37.800 --> 10:40.720
అవునవును. ఇది నేను విన్నాను సినిమా హాల్లో

10:40.800 --> 10:42.600
రింకీ వాళ్ళ నాన్నగారితో
బెనారస్ వెళ్లినప్పుడు.

10:42.680 --> 10:44.280
అవునవును. అంతే.

10:44.600 --> 10:46.440
-అవునా?
-జెండా ఎగరవేశాక ఇదే పాడాలి.

10:46.640 --> 10:48.360
-అలాగా?
-[అభిషేక్] ఊ.

10:49.400 --> 10:51.040
ఏమైనా గుర్తుందా అది?

10:51.120 --> 10:52.640
[మంజు] గుర్తున్నాయి మొదటి మూడు పదాలు.

10:53.080 --> 10:54.400
"జన గణ మన."

10:57.680 --> 10:58.800
అలాగే చేద్దాం.

10:59.160 --> 11:01.560
-[అభిషేక్] నేర్చుకుంటారు.
-మీరు నేర్పండి.

11:02.440 --> 11:04.920
-ఊ.
-[మంజు] నేను నేర్చుకుంటాను.

11:05.520 --> 11:06.640
అలాగే.

11:07.440 --> 11:10.520
జన గణ మన "అధినాయక" అనాలి. "వినాయక" కాదు.

11:10.600 --> 11:12.080
-"అధినాయక"
-"అధినాయక"

11:12.160 --> 11:13.480
మళ్లీ పాడండి.

11:14.040 --> 11:16.880
చాలా ఉంది గుర్తుపెట్టుకోవలసింది.
కూర్చొని నేర్చుకోవచ్చుగా?

11:16.960 --> 11:18.920
కూర్చొని పాడకూడదని చెప్పాను కదండీ?

11:19.000 --> 11:20.560
మనం పాడట్లేదు కదా?
గుర్తు తెచ్చుకుంటున్నాం.

11:20.640 --> 11:24.040
గుర్తు తెచ్చుకోవటం అయినాసరే
నుంచొనే చేయాలి.

11:24.560 --> 11:26.400
-చెప్పండి. పదిసార్లు.
-[గొంతు సవరించుకొన్న ధ్వని]

11:28.680 --> 11:29.840
[గొంతు సవరించుకొన్న ధ్వని]

11:29.920 --> 11:33.520
జన గణ మన అధినాయక జయహే.

11:34.640 --> 11:36.400
శభాష్. ఇంకా.

11:36.480 --> 11:40.120
జన గణ మన అధినాయక జయహే.

11:40.200 --> 11:41.280
మళ్లీ.

11:41.360 --> 11:45.600
జన గణ మన అధినాయక జయహో.

11:45.680 --> 11:49.120
-జయహో కాదు. హే. జయహే.
-హే. జయహే.

11:49.200 --> 11:52.840
జన గణ మన అధినాయక జయహే.

11:52.920 --> 11:57.520
-[అభిషేక్] మళ్లీ.
-[మంజు] జన గణ మన అధినాయక జయహే.

11:57.600 --> 11:58.920
గ్రామ పంచాయతీ ఫులేరా.

11:59.000 --> 12:01.240
[ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

12:01.760 --> 12:02.960
చెప్పండి సర్పంచ్ గారూ.

12:04.120 --> 12:06.000
లేదు. సెక్రెటరీ గారు ఇంకా రాలేదు.

12:07.760 --> 12:09.680
వెళ్లి మూడు నాలుగు గంటలయ్యింది.

12:10.600 --> 12:11.600
అవునండీ.

12:12.360 --> 12:14.560
గుర్తు వచ్చిందో లేదో నాకెలా తెలుస్తుందండీ?

12:15.440 --> 12:17.040
అలాగే. వస్తే తెలుస్తుంది.

12:18.400 --> 12:19.400
అలాగే అండీ.

12:20.440 --> 12:22.400
[ఉత్సాహకార సంగీతం]

12:29.920 --> 12:34.680
పంజాబ్, తర్వాత సింధు, గుజరాత్, మరాఠా,
తర్వాత?

12:34.920 --> 12:36.200
-మేడమ్.
-ఏంటి?

12:36.280 --> 12:40.400
పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా,
ద్రావిడ, ఉత్కల, వంగా.

12:40.480 --> 12:41.800
ఇప్పుడే చెప్పానుగా?

12:41.880 --> 12:43.920
[ఉత్సాహకార సంగీతం]

13:02.200 --> 13:04.440
[వేగవంతమైన సంగీతం]

13:13.560 --> 13:17.480
♪జయహే, జయహే, జయహే♪

13:17.560 --> 13:19.760
♪జయ, జయ, జయ, జయహే♪

13:20.360 --> 13:21.800
మూడు సార్లు "జయహే."

13:21.880 --> 13:23.720
నాలుగుసార్లు "జయ", అపుడు "హే."

13:24.680 --> 13:27.360
అర్థమయ్యిందా? ఇప్పుడు మళ్లీ మొదటినుంచి.

13:27.440 --> 13:28.440
[గొంతు సవరించుకున్న ధ్వని]

13:30.960 --> 13:33.880
-చెప్పండి.
-♪జన గణ మన వినాయక జయహే♪

13:33.960 --> 13:36.560
-ఏంటి...
-మళ్లీ అదే పొరపాటు చేస్తున్నారు.

13:36.640 --> 13:38.920
'వినాయక" కాదు, "అధినాయక" అని
ఎన్నిసార్లు చెప్పాను, మేడమ్?

13:39.000 --> 13:41.240
కనీసం పాతిక సార్లైనా చెప్పుకున్నాము.

13:41.480 --> 13:44.840
నాలుగు గంటల నుండి ఇదే పని చేస్తున్నాం.
"వినాయక" కాదు, "అధినాయక జయహే."

13:45.360 --> 13:47.800
అధినాయక. పాతిక సార్లు చెప్పాను.

13:51.520 --> 13:52.600
[నిట్టూర్పు శబ్దం]

13:56.480 --> 14:00.440
చూడండి మేడమ్, నేను చెప్పగలిగింది చెప్పాను.

14:00.800 --> 14:02.840
ఇక మీరే చూసుకోండి ఏం చేయాలో, ఎలా చేయాలో.

14:02.920 --> 14:04.080
సెక్రటరీ గారూ.

14:04.440 --> 14:07.360
మీరు వెళ్లిపోతే నాకు ఎవరు నేర్పుతారు?

14:08.280 --> 14:10.280
[నెమ్మదిగా సంగీతం]

14:12.240 --> 14:13.400
ఇలా చూడండి.

14:14.040 --> 14:16.480
[అభిషేక్] ఇది నొక్కితే వస్తుంది.

14:16.840 --> 14:18.720
మళ్లీ నొక్కితే ఆగిపోతుంది.

14:19.160 --> 14:20.280
సరే.

14:20.360 --> 14:21.680
రేపటి వరకు సమయం ఉంది.

14:22.320 --> 14:24.000
-కుదిరినంతగా వినండి.
-[మంజు] అలాగే.

14:25.480 --> 14:26.960
కొంచెం గుర్తుండచ్చేమో.

14:28.120 --> 14:29.280
[అభిషేక్] నేను బయల్దేరుతున్నాను.

14:30.560 --> 14:31.960
వినండి.

14:32.160 --> 14:34.880
వినేటప్పుడు కూడా నిలబడే ఉండాలా?

14:36.320 --> 14:37.320
కావచ్చు.

14:39.640 --> 14:40.720
చూసుకోండి.

14:42.360 --> 14:44.360
[సితార సంగీతం]

14:53.200 --> 14:57.400
♪జన గణ మన వినాయక జయహే♪

14:57.480 --> 15:01.200
[మంజు] ♪జన గణ మన అధినాయక జయహే♪

15:04.120 --> 15:05.400
రింకీ వాళ్ళమ్మా.

15:08.520 --> 15:10.120
రింకీ వాళ్ళమ్మా!

15:10.720 --> 15:12.840
-[బ్రిజ్] వినపడుతోందా?
-[గేట్ కొట్టిన శబ్దం]

15:15.600 --> 15:17.600
అంతా బానే ఉందా?

15:21.160 --> 15:22.160
ఇదిగో.

15:22.640 --> 15:24.720
[హాస్యభరిత సంగీతం]

15:25.000 --> 15:26.000
ఆ?

15:32.280 --> 15:34.000
[కోళ్ళ అరుపులు]

15:41.520 --> 15:43.160
[నీళ్ళ చప్పుడు]

15:45.920 --> 15:48.120
[హాస్యభరిత సంగీతం]

15:54.840 --> 15:57.160
నీ చీర.

16:08.280 --> 16:10.160
"జన గణ మన" నేర్చేసుకున్నావా?

16:11.400 --> 16:13.200
అంతా వచ్చేసిందా?

16:16.840 --> 16:17.840
ఏమిటిది?

16:17.920 --> 16:20.320
రేపే వేసుకుంటావుగా?
మళ్లీ పెట్టెలో పెట్టటం ఎందుకు?

16:21.280 --> 16:22.280
అరే?

16:24.240 --> 16:25.360
[నిట్టూర్పు శబ్దం]

16:26.120 --> 16:28.040
ఎందుకో, నాకు గుర్తుండట్లేదు.

16:28.120 --> 16:29.200
అయ్యయ్యో.

16:29.680 --> 16:30.800
ఏమయ్యింది?

16:31.920 --> 16:33.800
అంత నటించక్కరలేదు.

16:34.000 --> 16:35.600
లోపల ఆనందమే కదా?

16:35.880 --> 16:37.080
వెళ్లి జెండా ఎగరవేసుకోండి.

16:37.160 --> 16:38.640
అలా కాదు.

16:38.720 --> 16:40.880
లేకపోతే ఎంత గుర్తుంటే అంతే పాడతాను.

16:40.960 --> 16:42.560
[బ్రిజ్] తేడాపాడాగా పాడావంటే,

16:42.640 --> 16:45.840
ఎవడో ఒకడు వీడియో తీసి
ఇంటర్నెట్ లో వైరస్ చేస్తాడు.

16:45.920 --> 16:47.560
-ఏమిటది?
-[బ్రిజ్] వైరస్.

16:48.880 --> 16:50.880
[ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

16:53.360 --> 16:54.520
ఇదేమిటి?

16:54.600 --> 16:56.600
ఫోన్ తెర ఎలా విరిగిపోయింది?

16:56.880 --> 16:59.160
గుర్తు ఉండట్లేదని ఒళ్ళు మండి
నేల మీదకి విసిరి విరగ్గొట్టాను.

16:59.240 --> 17:00.240
విరగ్గొట్టేసిందట.

17:00.320 --> 17:01.960
-[మంజు] సెక్రటరీ గారూ.
-చెప్పండి మేడమ్.

17:02.360 --> 17:03.440
వచ్చేసిందా?

17:03.520 --> 17:05.680
[మంజు] లేదు సెక్రటరీ గారూ. ఇంకా రాలేదు.

17:05.760 --> 17:07.240
మీరూ ఆనందించండి ఇంక.

17:07.320 --> 17:09.280
అదేం లేదు, అడుగుతున్నా అంతే.

17:09.360 --> 17:11.320
రేపు జెండా ఎవరు ఎగరవేస్తున్నారో
తెలుస్తుందని.

17:11.400 --> 17:14.320
కంగారు పడకండి. రేపు జెండా ఎగరవేసేది
మీ సర్పంచ్ గారే.

17:16.120 --> 17:19.000
-[అభిషేక్] మంచిది.
-మీరంతా మంచిది అనే అనుకుంటారులే.

17:19.080 --> 17:20.120
పెట్టండి.

17:23.040 --> 17:25.920
జెండా ఎగరవేయలేకపోయాను.
ఫోన్ కూడా విరగ్గొట్టుకున్నాను.

17:27.000 --> 17:28.920
[మంజు] రాత్రికి తినటానికి ఏం వండను?

17:29.000 --> 17:31.400
లేకపోతే రేపు నాతో నువ్వు కూడా రా.

17:32.040 --> 17:33.400
వద్దులెండి.

17:33.920 --> 17:36.080
అంతకంటే ఇక్కడే టీవీలో ప్రధానమంత్రి

17:36.160 --> 17:37.480
జెండావందనం చేయటం చూడచ్చు.

17:37.560 --> 17:40.040
జనవరి 26 కి జెండా ఎగరవేసేది
దేశ రాష్ట్రపతి,

17:40.120 --> 17:41.880
ప్రధానమంత్రి కాదు.

17:43.120 --> 17:45.560
[మంజు] రాత్రికి ఏం చేయాలో
చెప్తున్నారా లేదా?

17:46.440 --> 17:47.760
ఎవ్వరిని చూడు, జ్ఞానబోధ చేసేవారే.

17:51.720 --> 17:52.720
[బిందె ఠంగుమన్న చప్పుడు]

17:55.800 --> 17:57.960
[ఉదాసీన సంగీతం]

18:07.120 --> 18:09.880
గ్రామ పంచాయతీ కార్యాలయం, ఫులేరా

18:12.920 --> 18:15.000
[జెండాల రెపరెపల ధ్వని]

18:19.280 --> 18:20.280
పద.

18:20.360 --> 18:22.600
సర్పంచ్ గారూ, ఇది ఇంకొకటి ఉందా?

18:23.520 --> 18:24.760
-ఇదా?
-[ప్రహ్లాద్] అవును.

18:25.120 --> 18:27.720
ప్రహ్లాద్, నువ్వున్నావే, పిల్లాడివే.

18:28.520 --> 18:29.680
ఇంకొకటి!

18:29.760 --> 18:30.760
ఇదిగో.

18:31.920 --> 18:33.000
రెండు తీసుకో.

18:33.480 --> 18:35.480
[బ్రిజ్] రెండు వైపులా పెట్టుకో.

18:38.080 --> 18:41.000
[అభిషేక్] సర్పంచ్ గారూ.
మేడమ్ ని ఒకసారి అడుగుదాం.

18:41.840 --> 18:45.360
జెండా ఎగరవేయకపోయినా
ఇక్కడకి వస్తే బాగుంటుంది కదా?

18:45.440 --> 18:47.840
నిన్ననే అడిగానయ్యా. రానంది.

18:47.920 --> 18:49.480
కావాలంటే అడుగు.

18:49.560 --> 18:50.960
ఒకసారి చెప్తాను ఆవిడకి.

18:51.280 --> 18:52.520
నువ్విక్కడే ఉండు.

18:53.680 --> 18:54.880
రెండు ఎక్కువైపోతాయేమో.

18:56.000 --> 18:57.200
[వ్యాఖ్యాత] రండి, సర్పంచ్ గారూ.

18:57.280 --> 18:59.440
[జనం కరతాళధ్వనులు]

19:00.320 --> 19:02.400
[జనం కరతాళధ్వనులు, జయజయ ధ్వానాలు]

19:18.080 --> 19:19.640
[జిల్లా మేజిస్ట్రేట్] డ్రైవర్,
కాస్త కార్ ఆపు.

19:21.560 --> 19:22.680
[జిల్లా మేజిస్ట్రేట్] వెనక్కి పద.

19:22.760 --> 19:24.760
[కార్ ఇంజిన్ ధ్వని]

19:32.680 --> 19:34.680
[ఉత్కంఠభరితమైన సంగీతం]

19:36.360 --> 19:38.760
-ఊరి వైపు తిప్పు బండిని.
-తిప్పు.

19:39.560 --> 19:41.800
[కార్ ఇంజిన్ ధ్వని]

19:56.160 --> 19:58.040
[అస్పష్ట సంభాషణల శబ్దం]

20:00.400 --> 20:02.200
ఎక్కడ ఆగిపోయిందయ్యా?

20:03.480 --> 20:04.800
ఇంకొంచెం సేపు ఆగుదాం.

20:05.200 --> 20:06.680
ఫోన్లో ఏమంది?

20:07.720 --> 20:08.840
"చూద్దాం" అన్నారు.

20:08.920 --> 20:12.480
తను అక్కడ చూస్తూ ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం.

20:12.560 --> 20:14.200
-పదండి.
-[ప్రహ్లాద్] జెండా ఎగరవేద్దాం.

20:17.000 --> 20:18.040
అందరూ నిశ్శబ్దం పాటించండి.

20:21.360 --> 20:23.360
[నేపథ్య సంగీతం]

20:31.320 --> 20:33.320
[కార్ హారన్ శబ్దం]

20:36.080 --> 20:38.280
[కార్ సమీపిస్తున్న శబ్దం]

20:48.640 --> 20:51.960
జిల్లా మేజిస్ట్రేట్

20:52.600 --> 20:54.760
[ఆర్భాట సంగీతం]

21:08.120 --> 21:11.800
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

21:12.360 --> 21:16.400
మీరేనా సర్పంచ్ గారి భర్త
బ్రిజ్ భూషన్ దూబే?

21:20.200 --> 21:21.240
అవును.

21:21.600 --> 21:25.640
అలాగా?
ప్రభుత్వం అటువంటి పోస్ట్ ఏమీ చేయలేదే.

21:25.880 --> 21:27.800
-అది, మేడమ్ ఊరికే...
-[డిస్ట్రిక్ మేజిస్ట్రేట్] ఊరికేనా?

21:27.880 --> 21:30.160
మీకు నచ్చినట్టు
ఉద్యోగం సృష్టించేసుకున్నారు.

21:30.240 --> 21:32.520
మీకు నచ్చినట్టు సర్పంచి కి బదులు
కార్యాలయానికి వస్తున్నారు.

21:32.600 --> 21:35.200
ఆమె బదులు జెండా కూడా ఎగరవేస్తున్నారు.

21:35.280 --> 21:36.640
ఏంటి తమాషానా?

21:41.600 --> 21:43.840
సర్పంచ్ మంజు దేవి ఎక్కడ?

21:44.440 --> 21:46.480
వస్తున్నారు. దారిలో ఉన్నారు.

21:47.840 --> 21:49.720
మీరు బయటకి నడవండి. నడవండి.

21:50.120 --> 21:52.400
[ఉదాసీన సంగీతం]

21:54.880 --> 21:55.880
ఇంకా బయటకి!

21:56.120 --> 21:57.960
కార్యాలయం పరిధి లోంచి బయటకి నడవండి!

21:59.040 --> 22:00.160
నడవండి!

22:05.760 --> 22:07.560
పరిధి బయటకి నడవండి!

22:12.120 --> 22:13.760
ఇక్కడి పంచాయతీ సెక్రటరీ ఎవరు?

22:15.000 --> 22:16.760
నేను ఉప అధ్యక్షుడిని.

22:16.840 --> 22:17.840
అధికారికమే.

22:19.440 --> 22:20.640
మేడమ్. నేను.

22:20.720 --> 22:22.200
-మీరా?
-అవునండీ.

22:22.280 --> 22:24.400
ఏంటి ఇక్కడ జరుగుతున్న తమాషా?

22:24.480 --> 22:26.120
ఇదంతా తప్పని మీకు తెలియదా?

22:26.920 --> 22:30.560
సర్పంచ్ పతి వ్యవస్థని రూపుమాపటానికి
ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

22:30.640 --> 22:32.160
మీకది ఏమీ పట్టదా?

22:32.240 --> 22:34.240
-నేనేం చేయగలను మేడమ్?
-నోరు ముయ్యండి!

22:34.600 --> 22:36.000
ఏం చేయగలనా?

22:36.080 --> 22:37.520
ఏమైనా చేసి ఉండచ్చు మీరు.

22:37.960 --> 22:39.520
ఫిర్యాదు చేసి ఉండచ్చు

22:39.600 --> 22:42.160
మంజు దేవి భర్త
ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని.

22:43.560 --> 22:46.080
ముందు బ్యానర్ ని పీకి పడేయండి!

22:50.800 --> 22:52.400
-మాధవ్ గారూ.
-చెప్పండి.

22:52.720 --> 22:54.560
ఇతని పేరు రాసుకోండి.
ఇతన్ని సస్పెండ్ చేయాలి.

22:54.640 --> 22:56.800
[ఉత్కంఠభరితమైన సంగీతం]

22:58.600 --> 23:00.240
-క్షమించండి మేడమ్.
-మీ పేరు చెప్పండి.

23:01.080 --> 23:04.760
-మంజు దేవి గారు వస్తూనే ఉంటారు.
-పేరు చెప్పండి!

23:08.680 --> 23:09.800
అభిషేక్ త్రిపాఠీ.

23:10.360 --> 23:11.760
-రాసుకోండి ఇతని పేరు.
-అలాగే మేడమ్.

23:11.840 --> 23:12.960
క్షమించండి మేడమ్.

23:13.720 --> 23:14.840
[మంజు] సెక్రటరీ గారూ.

23:15.760 --> 23:17.080
ఏం జరుగుతోంది ఇక్కడ?

23:23.640 --> 23:25.920
[మృదు సంగీతం]

23:30.120 --> 23:31.360
ఇక్కడేం జరుగుతోంది సెక్రటరీ గారూ?

23:33.200 --> 23:34.360
మీరెవరు?

23:36.720 --> 23:38.120
మీరెవరు?

23:40.720 --> 23:43.160
ఈవిడ జిల్లా మేజిస్ట్రేట్ మేడమ్.

23:43.240 --> 23:46.120
ఈవిడ మంజు దేవి. మా అధికారిక సర్పంచ్.

23:49.120 --> 23:50.200
ఓహో.

23:51.040 --> 23:53.280
రింకీ వాళ్ళ నాన్నా,
మీరు అక్కడెందుకు ఉన్నారు?

23:53.360 --> 23:54.520
ఇలా రండి.

23:54.600 --> 23:57.720
-పర్వాలేదు. ఇక్కడే బాగుంది.
-లేదు, ఇలా రండి.

24:01.600 --> 24:03.040
సెక్రటరీ గారూ, మీరిలా రండి.

24:05.200 --> 24:06.640
మేడమ్, వీళ్ళెవరు?

24:07.120 --> 24:09.520
నేను ఒంటరిగా ఎందుకు ముందుకెళ్ళాలి?
అందుకే వీళ్ళనీ తీసుకువచ్చాను.

24:10.080 --> 24:12.040
[మంజు] వీళ్ళు నిజమైన వార్డ్ సభ్యులు.

24:12.120 --> 24:14.000
వీళ్ళ స్థానంలో
వీళ్ళ భర్తలు పని చేస్తుంటారు.

24:14.080 --> 24:16.200
మీరూ కలిసే ఉంటారు కదా? ఇక్కడే ఉన్నారేమో.

24:16.280 --> 24:17.520
ఏం జరుగుతోంది అక్కడ?

24:19.240 --> 24:21.560
ప్రజాప్రతినిధితో మాట్లాడే విధానం ఇదేనా?

24:24.280 --> 24:25.280
చెప్పండి.

24:25.800 --> 24:27.680
సర్పంచ్ సర్ జెండా ఎగరవేయబోయారు.

24:27.760 --> 24:30.960
మేజిస్ట్రేట్ గారు నన్ను
సస్పెండ్ చేస్తానంటున్నారు.

24:32.240 --> 24:33.240
ఉండండి.

24:35.800 --> 24:37.680
[మంజు] మీరు ఈయన్ని
సస్పెండ్ ఎందుకు చేస్తున్నారు?

24:37.760 --> 24:40.600
ఎందుకంటే ఇతని సమక్షంలోనే
మీవారు మీ స్థానంలో

24:40.680 --> 24:42.000
జెండా ఎగరవేయబోయారు.

24:42.880 --> 24:45.520
మీకెవరు చెప్పారు ఆయన ఎగరవేస్తారని?

24:45.600 --> 24:47.600
నేనే ఎగరవేయబోతున్నాను.

24:47.680 --> 24:49.880
అవునా, మరి ఇంత ఆలస్యంగా వచ్చారేం?

24:50.720 --> 24:53.560
ఆడవాళ్ళు తయారవ్వటానికి సమయం పడుతుంది.

24:53.640 --> 24:54.840
మీకూ తెలిసే ఉంటుంది.

24:54.920 --> 24:56.600
అయితే ఏటా మీరే ఎగరవేసేవారా?

24:56.960 --> 25:00.440
అవును. కావాలంటే వాళ్ళని అడగండి.

25:06.640 --> 25:08.840
సరే. ఎగరవేయండి అయితే.

25:09.760 --> 25:11.880
మీరిక్కడే నుంచొని చూస్తారా?

25:12.400 --> 25:14.560
అవును. ఇక్కడే నుంచొని చూస్తాను.

25:15.000 --> 25:16.120
కానివ్వండి.

25:16.760 --> 25:18.320
[మేజిస్ట్రేట్] ఎగరవేయండి మరి.

25:18.400 --> 25:19.400
అలాగే.

25:20.840 --> 25:23.000
[నేపథ్య సంగీతం]

25:43.400 --> 25:45.680
[నేపథ్య సంగీతం]

25:53.800 --> 25:56.400
ఆ రెండో తాడుని లాగండి. రెండోది.

26:03.760 --> 26:06.000
[ఉత్సాహభరితమైన సంగీతం]

26:16.040 --> 26:18.520
ఇక జాతీయగీతం పాడండి.

26:24.000 --> 26:25.120
ఏంటి సంగతి?

26:25.200 --> 26:27.320
ఎప్పుడూ జెండా ఎగరవేస్తారు కదా?

26:27.400 --> 26:28.880
గుర్తే లేదా?

26:31.120 --> 26:32.320
ఇంకెవ్వరూ పాడకండి ఆవిడతో.

26:33.280 --> 26:34.520
ఈవిడే పాడతారు.

26:40.240 --> 26:41.720
మొదలుపెట్టండి.

26:43.920 --> 26:45.320
[గొంతు సవరించుకున్న ధ్వని]

26:49.680 --> 26:54.720
♪జన గణ మన అధినాయక జయహే♪

26:54.960 --> 26:57.080
♪భారత...♪

26:58.040 --> 27:01.240
-♪భాగ్య-విధాతా♪
-♪భారత భాగ్య-విధాతా♪

27:01.480 --> 27:05.280
♪పంజాబ-సింధు-గుజరాత-మరాఠా♪

27:05.760 --> 27:12.280
-♪మరాఠా ద్రావిడ-ఉత్కల-వంగా♪
-♪మరాఠా ద్రావిడ-ఉత్కల-వంగా♪

27:12.360 --> 27:17.280
♪వింధ్య-హిమాచల-యమునా-గంగా♪

27:17.360 --> 27:22.400
-♪ఉఛ్ఛల-జలధి-తరంగా♪
-♪ఉఛ్ఛల-జలధి-తరంగా♪

27:22.480 --> 27:26.760
♪తవ శుభ నామే జాగే♪

27:27.800 --> 27:32.560
-♪తవ శుభ ఆశిష మాగే♪
-♪తవ శుభ ఆశిష మాగే♪

27:33.040 --> 27:37.640
♪గాహే తవ జయగాథా♪

27:38.480 --> 27:43.160
♪జన గణ మంగళ దాయక జయహే♪

27:43.360 --> 27:47.840
♪భారత భాగ్య విధాతా♪

27:47.920 --> 27:52.200
♪జయహే, జయహే♪

27:52.280 --> 27:54.800
♪జయహే♪

27:54.880 --> 28:00.040
♪జయ జయ జయ జయహే♪

28:02.080 --> 28:03.080
[నిట్టూర్పు శబ్దం]

28:04.200 --> 28:05.200
[నిట్టూర్పు శబ్దం]

28:13.320 --> 28:15.400
[జనం కరతాళధ్వనులు]

28:30.320 --> 28:32.360
సర్పంచ్ పని ఇదే.

28:32.680 --> 28:34.440
ఈవిడకి ఏమైనా తెలియకపోతే,

28:34.520 --> 28:37.440
ఆమెకు వివరించి చెప్పాలి, నేర్పాలి.

28:37.520 --> 28:38.560
అలాగే అండీ.

28:38.640 --> 28:40.960
అంతేగానీ ఆవిడ బదులు పని చేసేయటం కాదు.

28:42.160 --> 28:46.280
ఇక మీరు. నాతో మాట్లాడటంలో మీరు చూపిన
ధైర్యం,

28:46.760 --> 28:49.560
పని చేయటంలో కూడా చూపించాలి.

28:49.880 --> 28:55.720
నేను మీ అంత చదువుకున్నదాన్ని కాదు.
కానీ ప్రయత్నిస్తాను.

28:56.080 --> 28:59.880
"జన గణ మన" నేర్చుకున్నట్టే.

29:02.360 --> 29:06.840
మొదట్లో అసలు
ఈ జన్మలో నేర్చుకోలేను అనుకున్నాను.

29:07.320 --> 29:08.680
కానీ ప్రయత్నించాను.

29:08.760 --> 29:12.000
అంత ప్రయత్నించినా,
పూర్తిగా నేర్చుకోలేకపోయారు.

29:12.480 --> 29:16.720
రెండు రోజుల్లో ఏమంత నేర్చుకోగలను?

29:17.520 --> 29:23.080
కానీ ఈసారి జనవరి 26 కో,
ఆగస్ట్ 15 కో మీరు వచ్చినప్పుడు

29:23.280 --> 29:26.200
నేనెలా పాడతానో మీరే చూడండి.

29:27.040 --> 29:31.480
[మంజు] ఎందుకంటే నా ఆశని సులభంగా
వదులుకోను, కృషి చేయటానికీ వెనుకాడను.

29:32.840 --> 29:35.200
మేడమ్, ఇతని సస్పెన్షన్ మాటేమిటి?

29:38.640 --> 29:40.960
[బ్రిజ్] మేజిస్ట్రేట్ గారూ,
అతన్ని మన్నించండి.

29:41.240 --> 29:44.640
ఈమె పాడిన "జన గణ మన" నేర్పినది అతనే.

29:44.720 --> 29:45.960
చాలా మంచివాడు పాపం.

29:47.080 --> 29:50.480
-అవును, మంచివాడు.
-మంచివాడు.

29:54.240 --> 29:55.320
సరే, కానివ్వండి.

29:59.320 --> 30:01.320
[సన్నగా సంగీతం]

30:09.480 --> 30:11.280
[కార్ ఇంజిన్ శబ్దం]

30:21.280 --> 30:23.400
[ఉల్లాసకరమైన సంగీతం]

30:24.640 --> 30:28.360
సర్, జిలేబీ, కచోరీ పంచమంటారా?
అందరూ ఇక్కడే ఉన్నారు.

30:28.440 --> 30:30.800
పదండి వెళ్దాం.

30:30.880 --> 30:33.680
సర్పంచ్ గారూ, డీఎమ్ మేడమ్ అసలు ఇక్కడకి
ఎలా వచ్చారో అర్థం కావట్లేదు.

30:34.040 --> 30:37.000
కార్లో వచ్చారు. ఇంకెలా వస్తారు? చూడలేదా?

30:39.000 --> 30:41.200
[ఉల్లాసకరమైన సంగీతం]

30:56.400 --> 30:58.640
[ఆనందకరమైన సంగీతం]

31:01.320 --> 31:04.040
["ఆనందంగా ఉందిలే" పాట వస్తోంది]

31:26.360 --> 31:29.120
[అభిషేక్] ఈసారి మళ్లీ ప్రిపేర్ అవ్వాలని
అనుకుంటున్నాను.

31:29.200 --> 31:30.720
ఈ ఏడాది సమయం దొరకలేదు.

31:31.360 --> 31:33.640
నాలుగైదు నెలల్లో ఏం తయారవుతాము?

31:34.120 --> 31:36.800
[ప్రతీక్] రెండు నెలలుగా ఇదే
నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

31:37.200 --> 31:38.800
నీకు అర్థమే కాలేదు.

31:38.880 --> 31:40.760
[అభిషేక్] అప్పుడు మనసు బాలేదు లేరా.

31:41.040 --> 31:43.520
[ప్రతీక్] ఉన్నట్టుండి నీ మనసు ఎలా మారింది?

31:44.080 --> 31:46.800
పోనీలే, ఎలాగైనా మంచికే జరిగింది.

31:46.880 --> 31:47.960
ఊ.

31:48.040 --> 31:50.960
ఏమిటా మూలుగు? ఆనందంగా ఉండు.

31:51.040 --> 31:52.400
ఏమి ఆనందం?

31:52.800 --> 31:54.760
ఈ ఊళ్ళో ఇంకో ఏడాది ఉండాల్సి వస్తుంది.

31:54.840 --> 31:57.280
కదా? ఏడాదంతా ఉండాలి.

31:57.800 --> 31:59.880
కనుక ఈ ప్రయాణాన్ని ఆస్వాదించటం
మొదలుపెట్టు.

31:59.960 --> 32:02.240
ఎందుకురా, ఎప్పుడూ ఉద్బోధ చేస్తూ ఉంటావు?

32:02.640 --> 32:03.680
[ప్రతీక్] తప్పు అన్నానా?

32:04.080 --> 32:06.200
టెడ్ టాక్ లో ఎప్పుడూ
అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పేది ఇదే కదా?

32:06.680 --> 32:08.160
నువ్వు చేసేది ఏదైనా దాన్ని ప్రేమించాలి.

32:08.240 --> 32:09.320
సరేనండీ.

32:09.680 --> 32:14.560
ఒక పని చెయ్యి. నిన్ను ఊరిని ప్రేమించేలా
చేయగల పని ఏదైనా చెయ్యి.

32:14.640 --> 32:15.960
ఇది ఎక్కువయ్యింది.

32:17.160 --> 32:18.800
ఈ ఊరిని ప్రేమించటం కష్టం.

32:22.800 --> 32:23.960
[ప్రతీక్] హలో?

32:24.880 --> 32:26.200
అభిషేక్ త్రిపాఠీ?

32:27.320 --> 32:29.160
ఏమంత అందమైనదో చూద్దాం.

32:29.880 --> 32:32.880
ట్యాంక్ ఎక్కి చూడమని ఎప్పటినుంచో
చెప్తున్నారు కదా?

32:34.280 --> 32:36.520
[ఉల్లాసకరమైన సంగీతం]

33:06.480 --> 33:08.800
[ఉల్లాసకరమైన సంగీతం కొనసాగుతుంది]

33:16.200 --> 33:17.520
ఏముంది, నా మొహం!

33:18.320 --> 33:20.480
అంత అందం ఏముంది? అలాగే ఉంది.

33:21.240 --> 33:22.600
ఊరిని ప్రేమించాలట.

33:22.680 --> 33:23.960
అనవసరంగా వచ్చాను.

33:24.840 --> 33:28.480
[రింకీ దగ్గుతున్న శబ్దం]

33:29.480 --> 33:30.560
[రింకీ గొంతు సవరించుకున్న ధ్వని]

33:33.640 --> 33:36.080
[మృదు సంగీతం]

33:46.400 --> 33:47.400
[అభిషేక్] ఎవరది?

33:49.440 --> 33:50.840
నేను రింకీ.

33:51.720 --> 33:52.960
సర్పంచ్ గారి కూతురిని.

33:56.720 --> 34:00.160
["పహేలీ" పాట వస్తోంది]

34:43.040 --> 34:46.320
["పహేలీ" పాట కొనసాగుతోంది]

35:06.720 --> 35:08.800
["పహేలీ" పాట కొనసాగుతోంది]
