WEBVTT

00:00.000 --> 00:01.080
[ఫొటోగ్రాఫర్] తల కిందకు వంచండి.

00:01.080 --> 00:03.160
కాస్త, మరికాస్త.

00:03.160 --> 00:04.360
మరీ కిందకైపోయింది.

00:04.360 --> 00:05.560
[నవ్వుతున్న శబ్దం]

00:05.560 --> 00:07.560
అయ్యో, కాస్త నవ్వండి.

00:07.560 --> 00:09.080
ఇంకాస్త. కొద్దిగా...

00:09.080 --> 00:10.480
-అదీ.
-[కెమెరా క్లిక్ మన్న శబ్దం]

00:10.480 --> 00:12.440
బాగుంది. మరొకటి తీద్దాం.

00:12.440 --> 00:14.080
-[కెమెరా క్లిక్ మన్న శబ్దం]
-[ఫోటోగ్రాఫర్] అద్భుతం.

00:14.080 --> 00:15.280
[అభిషేక్] ఎలా వచ్చిందో చూపించండి.

00:15.280 --> 00:16.320
చూడండి.

00:16.320 --> 00:17.960
-ఓ.
-[నవ్వుతున్న శబ్దం]

00:17.960 --> 00:19.200
మొదటిదే బాగుంది.

00:19.200 --> 00:20.840
అయితే, మొదటిదే చేద్దాం.

00:20.840 --> 00:22.600
బ్యాంక్ క్లర్క్ జాబ్ కి అప్లై
చేస్తున్నారా?

00:22.600 --> 00:24.120
కాదు, క్యాట్ ఎగ్జామ్ కి.

00:24.120 --> 00:25.320
ఎం.బి.ఏ. పరీక్షకి.

00:25.320 --> 00:26.720
అలాగా... మంచిది.

00:26.720 --> 00:28.760
-రేపు ఉదయం 11 గంటలకు తీసుకోండి.
-[వికాస్] కూర్చోవద్దని అనడం లేదు.

00:28.760 --> 00:30.400
[బబ్లూ] దీంతో ఏం చేద్దామనుకుంటున్నావు?

00:30.400 --> 00:32.680
[వికాస్] అరె, మంచిగా చెబుతుంటే
అర్థం చేసుకోవట్లేదు.

00:32.680 --> 00:33.840
[డబ్లూ] పోరా, నాకు అర్థం కావట్లేదు.

00:33.840 --> 00:34.880
[వికాస్] నన్ను తిట్టడం ఆపు.

00:34.880 --> 00:36.040
[బబ్లూ] నావైపు వేలు పెట్టి చూపించకు.

00:36.040 --> 00:37.720
కూర్చోవాలనుకుంటే, సరిగ్గా కూర్చో.

00:37.720 --> 00:40.120
నాకేం అభ్యంతరం లేదు.
కూర్చో, కానీ సరిగ్గా కూర్చో.

00:40.120 --> 00:42.280
[బబ్లూ] మోటార్ సైకిల్ పై ఎలా కూర్చోవాలో
నువ్వు నాకు నేర్పిస్తావా?

00:42.280 --> 00:43.600
-ఏం జరిగింది?
-రండి, సర్.

00:43.600 --> 00:45.280
వీళ్ళు మీ మోటర్ సైకిల్ పై కూర్చున్నారు.

00:45.280 --> 00:47.640
బైక్ సింగిల్ స్టాండ్ పై పార్క్ చేసి ఉంది,

00:47.640 --> 00:49.360
దానిపై బరువు పడితే విరిగిపోతుంది
అన్నానంతే.

00:49.360 --> 00:50.800
డబుల్ స్టాండ్ వేసి కూర్చోమన్నాను.

00:50.800 --> 00:51.840
-దానికే కోపం వచ్చేసింది.
-అలాగా?

00:51.840 --> 00:53.080
మోటార్ సైకిల్ పై కూర్చోవాలంటే...

00:53.080 --> 00:54.160
...డబుల్ స్టాండ్ వేసి కూర్చోవాలా?

00:54.160 --> 00:56.160
-లేకపోతే కూర్చోకు.
-అరే!

00:56.160 --> 00:57.680
ఓయ్. కాస్త గొంతు తగ్గించి మాట్లాడు.

00:57.680 --> 01:00.160
నా బైక్ పై కూర్చోవడమే కాకుండా
మతి లేకుండా మాట్లాడతావేంటి?

01:00.160 --> 01:02.520
ఏమన్నావు? నాకు మతి లేదా?

01:02.520 --> 01:04.080
మరి ఇంకేం అనాలి?

01:04.080 --> 01:05.320
ఆగు, బాబు. 10 నిముషాలు ఆగు.

01:05.320 --> 01:08.400
మతి లేకపోవడమంటే ఏంటో నీకు చూపిస్తా, ఆగు.

01:08.400 --> 01:10.200
[బబ్లూ] చాలా ఎక్కువ
మాట్లాడుతున్నావు నువ్వు.

01:10.200 --> 01:11.440
సర్పంచ్గారికి ఫోన్ ఇవ్వు.

01:11.440 --> 01:13.600
ముఖేశ్ అన్నా, నేను బబ్లూ.

01:13.600 --> 01:16.080
[బబ్లూ] సునీల్ షాప్ దగ్గరికి ఇప్పుడే
కొంతమంది కుర్రాళ్ళని పంపు.

01:16.080 --> 01:17.560
తొందరగా.

01:17.560 --> 01:18.880
పది నిముషాలు ఆగు. నేనేంటో చూపిస్తా.

01:18.880 --> 01:20.880
నేనెందుకు ఆగాలి? నాకింకేం పని లేదా?

01:20.880 --> 01:21.960
-తప్పుకో.
-[బబ్లూ] ఏంటి?

01:21.960 --> 01:22.960
తప్పుకోమంటున్నా.

01:22.960 --> 01:23.960
కూర్చో, వికాస్.

01:23.960 --> 01:26.800
సునీల్ భాయ్, వీళ్ళు ఫోటోలు తీసుకునేందుకు
రేపు ఎన్నింటికి వస్తారు?

01:26.800 --> 01:27.800
11 గంటలకి.

01:27.800 --> 01:30.240
రేపు 11 గంటలకి రారా, మతి లేకపోవడమేంటో
నీకు చూపిస్తా.

01:30.240 --> 01:32.160
ఆ ప్రతాపమంతా ఏమైంది? భయమేస్తోందా?

01:32.160 --> 01:33.840
-మేమేం భయపడట్లేదు.
-[బైక్ ఇంజన్ శబ్దం]

01:33.840 --> 01:35.920
-పోరా.
-తిట్టొద్దన్నానా?

01:35.920 --> 01:37.280
[బబ్లూ] పోరా.

01:37.280 --> 01:38.520
పొమ్మన్నానా?

01:38.520 --> 01:39.520
-[వికాస్] నువ్వే పో.
-అరే, ఫో.

01:39.520 --> 01:40.520
-[వికాస్] పోరా భాయ్.
-నువ్వే ఫో.

01:40.520 --> 01:41.560
ఛీ, ఫో.

01:41.560 --> 01:44.520
రారా. కొట్టు. కొట్టు.

01:44.520 --> 01:46.400
-కొట్టు, రా.
-వికాస్, రా, పోదాం.

01:46.400 --> 01:48.400
ఒక్క పది నిముషాలు ఆగరా.
ఎందుకు పారిపోతున్నార్రా?

01:48.400 --> 01:50.080
-ఫోరా.
-ఫో.

01:50.080 --> 01:52.200
-నువ్వే పో.
-రేపు 11 గంటలకి రారా. నీ సంగతి తేలుస్తా.

01:52.200 --> 01:53.400
-తడాఖా చూపిస్తా.
-[అభిషేక్] నీకు పిచ్చా?

01:53.400 --> 01:54.440
ఎందుకు గొడవల్లో తల దూరుస్తావు?

01:54.440 --> 01:56.120
[వికాస్] ఇది ఆత్మగౌరవానికి
సంబంధించిన విషయం సర్.

01:56.120 --> 01:57.320
వాళ్ళు మీతో ఆటలాడుతున్నారు.

01:57.320 --> 01:59.120
[అభిషేక్] అలాంటివాళ్ళ నోట్లో
నోరు పెట్టకూడదు.

01:59.120 --> 02:00.360
[వికాస్] మనకేం తక్కువ?

02:00.360 --> 02:02.360
[నేపథ్య సంగీతం]

02:02.360 --> 02:05.880
పంచాయత్

02:05.880 --> 02:08.760
రేపు 11 గంటలకు వెళ్లి,
వాళ్ళేం చేస్తారో చూద్దాం.

02:08.760 --> 02:10.200
-ఎవరికి ఫోన్?
-[వికాస్] సర్పంచ్ గారికి.

02:10.200 --> 02:12.640
నీకు పిచ్చా? ఎందుకు అనవసరంగా
గొడవని ఇంకా పెద్దది చేస్తున్నావు.

02:12.640 --> 02:14.800
వాళ్ళు అందరి ముందూ సవాల్ చేశారు, సర్.
మనం ఏదైనా చేయాల్సిందే.

02:14.800 --> 02:16.240
ఏమీ చేయక్కర్లేదు.

02:16.240 --> 02:17.720
ఎందుకంతగా బాధపడిపోతున్నావు?

02:17.720 --> 02:19.680
-నువ్వు దావూద్ ఇబ్రహీంవా?
-నేను దావూద్ ఇబ్రహీంని కాదు.

02:19.680 --> 02:21.800
కానీ, మీరెందుకు అంత భయపడుతున్నారో
నాకు అర్థం కావట్లేదు.

02:21.800 --> 02:23.000
భయపడటం లేదు.

02:23.000 --> 02:24.160
[వికాస్] మరయితే ఏంటి సర్?

02:24.160 --> 02:25.440
పరీక్షలు వస్తున్నాయి.

02:25.440 --> 02:27.480
చదువుకోనా, గొడవలు పడుతూ కూర్చోనా?

02:27.480 --> 02:28.840
అనవసరంగా టెన్షన్ పడటం దేనికి?

02:28.840 --> 02:31.480
మీరేం టెన్షన్ పడక్కర్లేదు.
అంతా సర్పంచ్ గారు చూసుకుంటారు.

02:31.480 --> 02:33.920
నాకు ఈ గొడవల్లో ఇరుక్కోవడం
ఇష్టం లేదంటే వినవేం?

02:33.920 --> 02:35.800
మీరు రేపు ఉదయం 11 గంటలకు వెళ్లినప్పుడు,

02:35.800 --> 02:37.880
వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని కొడితే,
అప్పుడేం చేస్తారు?

02:37.880 --> 02:39.680
ఆ సంగతి గురించి ఆలోచిద్దాం.
వాళ్ళకు కనిపించను.

02:39.680 --> 02:41.080
అసలు, 11 గంటలకు వెళ్ళకపోతే సరి.

02:41.080 --> 02:42.720
-రెండు గంటలకి వెళ్తా.
-బాగుంది, సర్.

02:42.720 --> 02:45.720
బాగుంది, రెండు గంటలకే వెళ్ళండి.
మీ ఎంబిఏ పరీక్షలకు బాగా చదువుకోండి.

02:45.720 --> 02:46.840
కానీ, సర్...

02:46.840 --> 02:48.760
...ఆత్మగౌరవం అనేది ఒకటుంటుంది.

02:48.760 --> 02:50.800
[నేపథ్య సంగీతం]

02:50.800 --> 02:54.160
కార్యదర్శి ఉద్యోగం చేసేవాడికి
ఆత్మ గౌరవం అనేదేం ఉండదు.

02:54.160 --> 02:56.320
[అస్పష్టమైన మాటలు]

02:56.320 --> 02:58.360
[బైక్ ఎంజిన్ శబ్దం]

02:58.360 --> 03:00.800
[అస్పష్టమైన మాటల శబ్దం]

03:00.800 --> 03:01.800
నా ఫొటోలివ్వండి.

03:01.800 --> 03:03.240
మీది భలే ఐడియా.

03:03.240 --> 03:04.840
నా ఫోటోలు ఇవ్వండి.

03:04.840 --> 03:06.120
[ఫోటోగ్రాఫర్] ఫోటోలు...

03:06.120 --> 03:07.160
-ఏంటి?
-[గొంతు సవరించుకున్న శబ్దం]

03:07.160 --> 03:11.880
చూడండి, బబ్లూ, డబ్లూ
మా గ్రామానికి చెందినవాళ్ళు.

03:11.880 --> 03:13.200
అయితే, ఏంటి తేడా?

03:13.200 --> 03:14.480
[ఫోటోగ్రాఫర్] తేడా ఉంది.

03:14.480 --> 03:17.840
వాళ్ళు మా గ్రామం వాళ్ళు,
వాళ్ళతో నువ్వు గొడవ పడ్డావు...

03:17.840 --> 03:19.680
...అంటే నాతోనూ నువ్వు గొడవ పడినట్టే అర్థం.

03:19.680 --> 03:21.600
ఏంటి వాగుతున్నావు?

03:21.600 --> 03:22.880
[పోటోగ్రాఫర్] నీకు అర్థం కాలేదు.

03:22.880 --> 03:25.680
ఈ గొడవలో నేను వాళ్ళ పక్షం ఉన్నాను.
నేను చెబుతున్నది అదే.

03:25.680 --> 03:26.800
[నవ్వుతున్న శబ్దం]

03:26.800 --> 03:29.680
ఇది మా గ్రామానికి చెందిన గొడవ కాబట్టి
నేను వాళ్ళకు ద్రోహం చేయలేను.

03:29.680 --> 03:31.400
ఏంటిదంతా? నా ఫోటో నాకివ్వు.

03:31.400 --> 03:33.880
నువ్వు 11 గంటలకు కదా రావాలి. కానీ రాలేదు.

03:33.880 --> 03:37.800
అందుకని బబ్లూ, డబ్లూ చెప్పినట్లు
నీ ఫోటోలు డిలీట్ చేసేశాను.

03:37.800 --> 03:39.720
[నేపథ్య సంగీతం]

03:39.720 --> 03:42.640
నువ్వొక చెత్తగాడివి, ఆ బబ్లూ, డబ్లూ
అంతకంటే వెధవలు.

03:42.640 --> 03:45.360
ఫకౌలీ మార్కెట్లో ఎన్నో దుకాణాలు
ఉన్నాయి. మరోచోట ఫోటో తీయించుకుంటాను.

03:45.360 --> 03:46.680
మీ ఇష్టం.

03:46.680 --> 03:48.120
చూడండి.

03:48.120 --> 03:49.800
[ఫోటోగ్రాఫర్] మీరు మార్కెట్లోనే
ఉంటారు కదా?

03:49.800 --> 03:52.760
ఎందుకంటే, మీరొస్తే, తమకు
చెప్పమని బబ్లూ, డబ్లూ అన్నారు.

03:52.760 --> 03:53.800
[నవ్వు]

03:53.800 --> 03:56.000
[ఫోటోగ్రాఫర్] మార్కెట్లోనే ఉంటారా,
పారిపోతున్నారా?

03:56.000 --> 03:57.560
[బైక్ మొదలైన శబ్దం]

03:57.560 --> 04:00.320
అరె, నా మాట వినండి. ఆగండి.

04:00.320 --> 04:01.680
పారిపోతున్నాడు.

04:01.680 --> 04:03.960
[నేపథ్య సంగీతం]

04:03.960 --> 04:05.720
[బైక్ ఆగిన శబ్దం]

04:05.720 --> 04:07.000
ఫోటోలు తీసుకున్నారా?

04:07.000 --> 04:09.200
రేపు పొద్దున ఆఫీసుకి వచ్చేటప్పుడు
తెల్లటి దుప్పట్లు తీసుకురా.

04:09.200 --> 04:10.680
తెల్ల దుప్పట్లు దేనికి?

04:10.680 --> 04:12.040
వెనకాల తెరగా వాడేందుకు.

04:12.040 --> 04:13.880
రేపు ఆఫీసులోనే నా ఫోటో తీసుకుంటా.

04:13.880 --> 04:15.000
ఆఫీసులోనా?

04:15.000 --> 04:17.840
ఆ వెధవలు నా ఫోటోలు డిలీట్ చేసేశారు.

04:17.840 --> 04:20.840
నా మాట విని, సర్పంచ్ గారికి చెబుదాం.
అంతా ఆయన చూసుకుంటారు.

04:20.840 --> 04:23.480
ఇప్పటికీ మీ రక్తం మరగడం లేదు.
మీలో ఉన్నది రక్తం కాదు, నీళ్ళు.

04:23.480 --> 04:25.880
[నెమ్మదైన సంగీతం]

04:25.880 --> 04:28.200
[కీటకాల రొద]

04:28.200 --> 04:32.480
[ఫోన్ మ్రోగుతున్న శబ్దం]

04:32.480 --> 04:33.480
హలో.

04:33.480 --> 04:35.480
[బైక్ హారన్ శబ్దం]

04:35.480 --> 04:36.480
హలో.

04:36.480 --> 04:38.480
-[బైక్ ఇంజిన్ శబ్దం]
-[అస్పష్టమైన మాటలు]

04:38.480 --> 04:40.960
వాడితో మాట్లాడరా.

04:40.960 --> 04:42.160
ఎవరు మాట్లాడుతున్నారు?

04:42.160 --> 04:45.000
నువ్వు రెండు గంటలకు వచ్చి,
ఫొటోలు తీసుకు వెళ్ళావని తెలిసింది.

04:45.000 --> 04:47.360
బాబూ, నావెంట ఎందుకు
పడుతున్నారు? మీకేం కావాలి?

04:47.360 --> 04:49.720
మతిలేకపోవడమంటే ఏంటో
నీకు చూపిద్దామనుకుంటున్నాం.

04:49.720 --> 04:51.840
బాబూ, చూపించేదేదో చూపించారు కదా?
ఇంకా ఏం చూపిస్తారు?

04:51.840 --> 04:53.360
అది చాలదురా.

04:53.360 --> 04:55.480
ఓసారి ఫకౌలీ మార్కెట్ కి రారా.
నీకు సరిగ్గా చూపిస్తాం.

04:55.480 --> 04:58.600
నేనేం మాట్లాడకుండా ఉంటే, మీరు
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే?

04:58.600 --> 05:00.400
మాట్లాడి ఏం పీకుతావురా నువ్వు?

05:00.400 --> 05:02.000
నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడు.

05:02.000 --> 05:06.160
లేకపోతే, ఏం చేస్తావురా? ఫకౌలీకి
వచ్చి, మమ్మల్ని చితక్కొడతావా?

05:06.160 --> 05:07.360
[నవ్వుల శబ్దం]

05:07.360 --> 05:08.400
ఆ, వస్తాను.

05:08.400 --> 05:11.160
అయితే రారా. నీకోసం వేచి చూస్తూ ఉంటాం.

05:11.160 --> 05:16.320
ఏంటి సంగతి? దమ్ము లేదా?

05:16.320 --> 05:19.520
-[డబ్లూ] ఏంటి, భయమేస్తోందా?
-[బబ్లూ] నేనింకేదో విన్నానులే.

05:19.520 --> 05:22.360
ఫులేరాలో ఎంతకాలం దాక్కుంటావురా?

05:22.360 --> 05:24.080
ఏదో ఒక రోజు ఫకౌలీ మార్కెట్ కు రావాలిగా?

05:24.080 --> 05:26.440
ఏమనుకుంటున్నార్రా మీరు? ఏమనుకుంటున్నారు?

05:26.440 --> 05:28.640
-ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పండి.
-[బబ్లూ] అలాగా?

05:28.640 --> 05:31.360
ఓ పని చెయ్యి, ఫకౌలీ మార్కెట్ వెనకాల
ఉన్న మైదానానికి రారా.

05:31.360 --> 05:32.800
మూడు గంటలకి. నేనేంటో చూపిస్తా.

05:32.800 --> 05:36.400
నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా. లేకపోతే
నా పేరు అభిషేక్ కాదు.

05:36.400 --> 05:37.960
[డబ్లూ] ఇప్పుడు చాలానే మాట్లాడుతున్నావురా.

05:37.960 --> 05:40.000
రారా. నీ సంగతి తేలుస్తాం.

05:40.000 --> 05:41.200
పోరా.

05:41.200 --> 05:43.680
[ఉత్కంఠభరితమైన సంగీతం]

05:43.680 --> 05:45.720
సరే, నేను చూసుకుంటానులే.

05:45.720 --> 05:48.320
-సరే, ప్రహ్లాద్.
-లేకపోతే, మాకేమన్నా భయమా?

05:48.320 --> 05:49.720
నేను చెప్పలేదా, సర్?

05:49.720 --> 05:51.360
మేం ఎవరినైనా తెచ్చుకోవాలా?

05:51.360 --> 05:53.320
నేను రైఫిల్ తీసుకొస్తాలే.
ఇంకెవరూ అక్కర్లేదు.

05:53.320 --> 05:54.560
రైఫిలా?

05:54.560 --> 05:56.360
గొడ్డలి కూడా తీసుకురానా?

05:56.360 --> 05:58.400
లేదు, రైఫిల్ అంటే మరీ ఎక్కువేమో.

05:58.400 --> 06:01.240
ఏదైనా బెల్టు, కర్ర వంటివయితే మంచిదనుకుంటా.

06:01.240 --> 06:04.320
ఓ పని చెయ్యి, నీ దగ్గర లెదర్ జాకెట్ ఉందా?

06:04.320 --> 06:05.360
ఆ, ఉంది.

06:05.360 --> 06:08.720
మంచిది. అది వేసుకుని,
రెండున్నరకి ఇక్కడికి వచ్చేయ్.

06:08.720 --> 06:12.640
లెదర్ జాకెట్లు వేసుకుంటే
దెబ్బలు గట్టిగా తగలవు.

06:12.640 --> 06:14.760
ఈలోగా నా రైఫిల్ శుభ్రం చేసుకుంటా.

06:14.760 --> 06:17.520
సర్పంచ్ గారూ, ఐదారు బులెట్లు
సరిపోతాయి కదా?

06:17.520 --> 06:18.840
ఇది మరీ ఎక్కువగా ఉంది.

06:18.840 --> 06:21.520
సర్పంచ్ గారూ, ఆ రైఫిల్ నాకివ్వండి,
నేను పట్టుకుంటాను.

06:21.520 --> 06:24.080
[ఉత్కంఠభరిత సంగీతం]

06:24.080 --> 06:25.160
[బైక్ ఇంజిన్ శబ్దం]

06:25.160 --> 06:29.160
[బైక్ ఇంజిన్ శబ్దం]

06:29.160 --> 06:31.680
[వీరోచిత సంగీతం]

06:31.680 --> 06:33.560
ఇంకా రాలేదు, ఫోన్ చెయ్యి.

06:33.560 --> 06:36.240
[ఉత్సాహకార సంగీతం]

06:36.240 --> 06:37.680
ఇద్దరూ ఏరి?

06:37.680 --> 06:39.880
ఏమో, మన వెనకాలే ఉండాలి.

06:39.880 --> 06:42.320
వీళ్ళకి పిచ్చయినా ఉండాలి,
లేక ధైర్యమైనా ఉండాలి.

06:42.320 --> 06:44.840
-ఒంటరిగానే వచ్చారు.
-చెత్త వెధవలు.

06:44.840 --> 06:46.040
పదండి చూద్దాం.

06:46.040 --> 06:48.000
[అబిషేక్] ఒక్క నిముషం.
మావాళ్ళు వస్తున్నారు.

06:48.000 --> 06:49.880
ఇప్పుడు పిలుస్తున్నారా?

06:49.880 --> 06:51.160
ఎవరికి ఫోన్ చేస్తున్నార్రా?

06:51.160 --> 06:53.680
రాంబోకి ఫోన్ చేసినా ఫరవాలేదు.
వాడి సంగతి కూడా చూద్దాం.

06:53.680 --> 06:55.120
[డబ్లూ] ఆ, ఎవడినయినా పిలుచుకోనీ.

06:55.120 --> 06:56.520
ఛీ.

06:56.520 --> 06:58.480
[ఫోన్ మ్రోగుతున్న శబ్దం]

06:58.480 --> 06:59.880
సెక్రటరీ గారు.

06:59.880 --> 07:01.680
-హలో.
-స్పీకర్ పెట్టండి.

07:01.680 --> 07:02.680
హలో.

07:02.680 --> 07:03.840
సర్పంచ్ గారూ, ఎక్కడున్నారు?

07:03.840 --> 07:05.840
భయపడకండి, దారిలోనే ఉన్నాం.

07:05.840 --> 07:09.280
టైరు పంచరయింది.
ప్రహ్లాద్ తోసుకుని వస్తున్నాడు.

07:09.280 --> 07:13.040
పంచరే కదా అయింది, సర్పంచ్ గారూ.
పెట్రోల్ అయిపోలేదు కదా?

07:13.040 --> 07:15.880
సెక్రటరీ గారూ, మేకు దిగబడి టైరు పంచరయింది.

07:15.880 --> 07:18.160
దానిమీద వస్తే, ట్యూబ్ పాడవుతుంది.

07:18.160 --> 07:22.960
ట్యూబ్ కూడా మార్చాలంటే ఎంతో ఖర్చవుతుంది.

07:22.960 --> 07:25.000
సర్పంచ్ గారూ, త్వరగా రండి.
వీళ్ళు వచ్చేశారు.

07:25.000 --> 07:26.240
వేచి చూస్తున్నారు.

07:26.240 --> 07:28.320
మూడుకి ఇంకా ఐదు నిమిషాలు ఉంది.

07:28.320 --> 07:31.640
వాళ్ళు ఇంత ఠంచనుగా వస్తారని తెలియదు.
వచ్చేశారు కదా? మీరు త్వరగా రండి.

07:31.640 --> 07:33.960
ఎవరండీ వాళ్ళు?

07:33.960 --> 07:36.360
గొడవకి అంత తొందరగా ఉందా? ఆ తుపాకీ ఇవ్వండి.

07:36.360 --> 07:37.720
-ఎక్కండి, ఎక్కండి.
-వస్తున్నాం, సర్.

07:37.720 --> 07:38.840
వాళ్ళ సంగతి చూద్దాం.

07:38.840 --> 07:40.640
ఆ, రండి. వాళ్ళు వస్తున్నారు.

07:40.640 --> 07:41.880
ఇంకా ఎంతసేపు?

07:41.880 --> 07:42.960
వస్తున్నారు.

07:42.960 --> 07:44.760
[ఆవలిస్తున్న శబ్దం]

07:44.760 --> 07:47.640
బబ్లూ అన్నా, వీళ్ళకు నాలుగు
తగిలించి పోదాం గురూ.

07:47.640 --> 07:49.240
ఓ పని చెయ్యి, నీ బెల్టు ఇవ్వు.

07:49.240 --> 07:51.800
నా ప్యాంటు లూజుగా ఉంది. నీదే తియ్యి.

07:51.800 --> 07:54.560
అరే, నాది రెగ్జిన్ బెల్టు. దానితో కొడితే
దెబ్బలు గట్టిగా తగలవు.

07:54.560 --> 07:57.200
అంత ఖర్చు పెట్టి కొన్నావు కదా,
నీ బెల్టే తియ్యి.

07:57.200 --> 08:00.920
అయితే నీ బెల్టు నాకియ్యి.
లేకపోతే, నా ప్యాంటు జారిపోతుంది.

08:00.920 --> 08:02.400
[బబ్లూ] అరే, తొందరగా తియ్యరా.

08:02.400 --> 08:03.840
నీకేం బాబూ, నీది సన్న నడుము.

08:03.840 --> 08:05.840
నిముషంలో తీసి ఇచ్చేస్తావు.

08:05.840 --> 08:08.400
[బబ్లూ] ముందు ఈ బెల్ట్ పెట్టుకో. లేకపోతే
నీ ప్యాంట్ జారిపోతుంది.

08:08.400 --> 08:09.640
[బెల్టు ఝళిపిస్తున్న శబ్దం]

08:09.640 --> 08:11.520
[వికాస్] ఏమయ్యా, కాస్త ఆగండయ్యా.

08:11.520 --> 08:13.520
గొడవకైనా కొన్ని నియమ నిబంధనలుంటాయి.

08:13.520 --> 08:15.880
మా వాళ్ళని రానీయండి.

08:15.880 --> 08:17.040
వీళ్ళని చుట్టుముట్టండిరా.

08:17.040 --> 08:19.040
-ఏమయ్యా.
-చుట్టూ నిలబడండి.

08:19.040 --> 08:21.720
-[డబ్లూ] ఇంకొందరు వస్తున్నారు.
-నా బట్టలిప్పి, పరుగెత్తిస్తావా, ఆ?

08:21.720 --> 08:22.960
నీతో బట్టలిప్పించి నాట్యం చేయిస్తా.

08:22.960 --> 08:24.200
అరే, ఏం చేస్తున్నారు మీరు?

08:24.200 --> 08:26.080
ముందు మీ బట్టలు విప్పండి.

08:26.080 --> 08:27.840
నీతో మాట్లాడానా? మాటలు జాగ్రత్తగా రానీ.

08:27.840 --> 08:29.960
-నేను బాగానే ఉన్నా.
-అతనితో మాట్లాడుతున్నా, మర్యాదగా ఉండు.

08:29.960 --> 08:31.760
[బబ్లూ] ఓ మర్యాద బాబూ,
ముందు బట్టలు విప్పు.

08:31.760 --> 08:34.960
లేకపోతే బెల్టుతో నీ తాట తీస్తా.

08:34.960 --> 08:36.800
మావాళ్ళు వస్తున్నారు, వాళ్ళని రానీయండి.

08:36.800 --> 08:39.280
వెధవా... మర్యాదగా చెబుతున్నాం.

08:39.280 --> 08:41.280
నీకు ఇంకో దారి లేదు.

08:41.280 --> 08:43.120
బట్టలు విప్పి, నాట్యం మొదలుపెట్టు.

08:43.120 --> 08:45.520
-తర్వాత నోర్మూసుకుని పొండి, అర్థమైందా?
-[వికాస్] నీకు కోపం ఎక్కువ గురూ.

08:45.520 --> 08:47.520
-కొట్టండిరా.
-వాళ్ళతో మాట్లాడి సమయం వృథా చేయకు.

08:47.520 --> 08:49.400
-[డబ్లూ] కొట్టండిరా, తన్నండి.
-త్వరగా విప్పండి.

08:49.400 --> 08:51.280
-ఏం చేస్తున్నావురా?
-ఇది కూడా దుస్తుల్లాంటిదే కదా?

08:51.280 --> 08:52.640
-నాటకాలాడుతున్నావురా?
-[కొడుతున్న శబ్దం]

08:52.640 --> 08:54.600
-[డబ్లూ] కొట్టండిరా.
-[బబ్లూ] మొదలుపెట్టండి!

08:54.600 --> 08:56.480
నువ్వేంటి నిలబడి చూస్తున్నావు?
త్వరగా బట్టలు విప్పరా.

08:56.480 --> 08:57.480
బట్టలు తీసేయ్.

08:57.480 --> 08:59.240
నగ్నంగా నాట్యం చేయిస్తానన్నా,
నా ఉద్దేశం అది కాదు.

08:59.240 --> 09:00.240
ఎవరైనా నిజంగా చేయిస్తారా?

09:00.240 --> 09:04.600
కోపంలో ఏవో అంటాం, వాటిని
మీరు సీరియస్ గా తీసుకోకూడదు.

09:04.600 --> 09:07.440
బట్టలు విప్పుతారా లేక
బెల్టుతో చావబాదమంటారా?

09:07.440 --> 09:10.440
-వాడికి సాయం చేయండిరా,
-లేదు, నేనే విప్పుతా.

09:10.440 --> 09:12.160
వాడిని చూడు, వాచీ, బెల్టు తీశాడు.

09:12.160 --> 09:13.960
-లేదు, లేదు.
-అన్నా, అన్నా.

09:13.960 --> 09:15.640
నీకు బొట్టు పెట్టి చెప్పాలా?

09:15.640 --> 09:18.680
బబ్లూ అన్నా, వీళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు
పాట ప్లే చేయాలా?

09:18.680 --> 09:19.880
"కజరారే" పాట పెట్టు.

09:19.880 --> 09:20.880
భలే బాగుంటుంది.

09:20.880 --> 09:23.400
-వీళ్ళకి ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయిరా.
-ఒక్క నిమిషం.

09:23.400 --> 09:24.960
సర్పంచ్ గారూ, ఎక్కడున్నారు?

09:24.960 --> 09:26.600
[బ్రిజ్] మేం వచ్చేశాం.

09:26.600 --> 09:28.400
ఎక్కడ? మేమైతే ఇక్కడే ఉన్నాం.

09:28.400 --> 09:30.000
మేం గుడి ఎదురుగా ఉన్నాం.

09:30.000 --> 09:32.720
గుడి నుంచి కుడివైపుకి తిరిగి,
వెనకాల ఉన్న గ్రౌండ్ కి నేరుగా రండి.

09:32.720 --> 09:35.280
ఎడమవైపుకి తిరిగితే అడ్డదారి,
వాళ్ళకి చెప్పు, త్వరగా రమ్మను.

09:35.280 --> 09:36.720
[అభిషేక్] ఎడమవైపు తిరగండి, అది అడ్డదారి.

09:36.720 --> 09:38.240
వీళ్ళు మాతో నగ్నంగా నాట్యం చేయిస్తున్నారు.

09:38.240 --> 09:39.880
నగ్నంగా నాట్యమా?
మీ బట్టలెందుకు విప్పించారు?

09:39.880 --> 09:42.080
-[అభిషేక్] ఏమో, మీరైతే తొందరగా రండి.
-పద.

09:42.080 --> 09:44.240
[బ్రిజ్] బట్టలు విప్పొద్దు.

09:44.240 --> 09:46.920
-వాళ్ళు వీడియో తీసి, అందరికీ పంపిస్తారు.
-కానీయండి.

09:46.920 --> 09:49.200
[వికాస్] విప్పుతున్నాం కదా, విప్పుతున్నాం.

09:49.200 --> 09:50.440
ఎక్కువ వాగకు.

09:50.440 --> 09:52.320
అర్ధమైందా? కానీ.

09:52.320 --> 09:54.720
[బ్రిజ్] ఒరేయ్, మా నుంచి తప్పించుకోలేరురా!

09:54.720 --> 09:57.000
వేసుకోండి, మీ బట్టలు వేసుకోండి.

09:57.000 --> 09:59.080
సర్పంచ్ గారూ, మా బట్టలు విప్పిస్తున్నారు.

09:59.080 --> 10:00.080
[అస్పష్టమైన మాటల శబ్దం]

10:00.080 --> 10:01.720
ఆగండి. వెనక్కి పొండి.

10:01.720 --> 10:03.040
వెనక్కి.

10:03.040 --> 10:06.040
లేదంటే బులెట్ దింపేస్తాను.

10:06.040 --> 10:08.160
[వికాస్] తుపాకీ చూస్తే, భయమేస్తోందా?
ఇప్పుడు రండిరా.

10:08.160 --> 10:12.280
బబ్లూ అన్నా, ఆ తుపాకీ పిట్టల్ని కొట్టేది
అనిపిస్తోంది.

10:12.280 --> 10:15.520
బోల్టు లేదు, బారెల్ సన్నగా ఉంది. పిట్టల్ని
కాల్చేందుకు తప్ప దేనికీ పనికిరాదు.

10:15.520 --> 10:18.400
చూడు, పచ్చ చొక్కావాడా, ఇది అసలు తుపాకీ.

10:18.400 --> 10:19.600
నీ చొక్కాకి తూట్లు పడతాయి.

10:19.600 --> 10:21.160
-అసలైనదే అయితే కాల్చు మరి.
-ఆ, కాల్చు చూద్దాం.

10:21.160 --> 10:22.960
-రా, కాల్చు.
-కాల్చు, కాల్చు.

10:22.960 --> 10:24.480
[బబ్లూ] ఆ, కాల్చు మరి.

10:24.480 --> 10:26.160
-[డబ్లూ] కాల్చు.
-[బబ్లూ] కాల్చు.

10:26.160 --> 10:28.120
మీ ఇద్దరి లోచెడ్డీలు విప్పిస్తా,
ఏమనుకుంటున్నారో?

10:28.120 --> 10:29.720
-అన్నా.
-ఏయ్.

10:29.720 --> 10:31.200
బబ్లూ ఎవడురా?

10:31.200 --> 10:32.800
-నేనే బబ్లూ.
-[బ్రిజ్] బబ్లూ నువ్వా?

10:32.800 --> 10:34.880
-మీ నాయన పేరేంట్రా?
-జగ్ మోహన్.

10:34.880 --> 10:35.880
మీది ఏ ఊరురా?

10:35.880 --> 10:37.520
ఏం? ఆధార్ కార్డు తయారుచేసి ఇస్తావా?

10:37.520 --> 10:39.640
[వెటకారపు నవ్వుల శబ్దం]

10:39.640 --> 10:43.400
లేదురా, లాగిపెట్టి కొట్టానంటే
కళ్ళు బైర్లు కమ్మి పడతావురా.

10:43.400 --> 10:44.840
[బబ్లూ] ముసలాయన కొడతాడటరా.

10:44.840 --> 10:48.920
బాబాయ్, ఈ వయసులో మాలాంటి
కుర్రాళ్ళతో పెట్టుకోకు.

10:48.920 --> 10:51.160
బెల్టుతో ఒక్కటి ఇచ్చానంటే
దిమ్మ తిరిగిపోతుంది నీకు.

10:51.160 --> 10:52.600
-అర్థమైందా, తప్పుకో.
-[బ్రిజ్ అరుపు]

10:52.600 --> 10:53.840
[పడిపోయిన శబ్దం]

10:53.840 --> 10:55.880
[నవ్వుల శబ్దం]

10:55.880 --> 10:57.880
[అస్పష్టమైన మాటలు]

10:57.880 --> 11:00.440
[డబ్లూ] అంకుల్ చాలాసేపు మొరిగాడురా.

11:00.440 --> 11:01.840
ఏంట్రా చూస్తున్నావు?

11:01.840 --> 11:03.760
-బాబాయ్ ని లేపి కూర్చోపెట్టు.
-వాడికి అంత్యక్రియలు చెయ్యి.

11:03.760 --> 11:05.080
[డబ్లూ] ఏంట్రా అలా చూస్తున్నావు?

11:05.080 --> 11:06.840
మాపై వేలు కూడా వేయలేవు.

11:06.840 --> 11:08.760
-వాడు రాంబోరా. కదా?
-[బబ్లూ] నిజంగా!

11:08.760 --> 11:09.920
[డబ్లూ] ఏంట్రా అలా చూస్తున్నావు?

11:09.920 --> 11:11.960
[అస్పష్టమైన మాటలు]

11:11.960 --> 11:13.920
వాడిని చూడండిరా.

11:13.920 --> 11:16.920
-నకిలీ తుపాకీతో చంపేస్తాడురా.
-[వెటకారపు నవ్వుల శబ్దం]

11:16.920 --> 11:19.080
[బబ్లూ] వీడు నిజంగానే పిచ్చివాడురా.

11:19.080 --> 11:21.480
[అస్పష్టమైన మాటల శబ్దం]

11:21.480 --> 11:23.120
-ఏయ్!
-వెనక్కి పొండిరా.

11:23.120 --> 11:24.960
నకిలీ తుపాకీతో ఎలా చంపాలో
నేను నేర్పుతాను, రండిరా.

11:24.960 --> 11:26.240
చచ్చిపోతాడురా.

11:26.240 --> 11:27.720
-వెధవల్లారా!
-కొట్టు, వాడిని కొట్టు.

11:27.720 --> 11:29.960
బబ్లూ అన్నా, బెల్టు తియ్యి.
ఏం చేస్తున్నావు నువ్వు?

11:29.960 --> 11:31.360
[మొదటివాడు] వాడికి పిచ్చి పట్టిందిరోయ్!

11:31.360 --> 11:33.600
తియ్యరా, తియ్యి, బెల్టు తియ్యి.

11:33.600 --> 11:35.000
రారా.

11:35.000 --> 11:36.280
కొట్టరా, వాడిని కొట్టు.

11:36.280 --> 11:37.720
నువ్వు వెళ్ళరా.

11:37.720 --> 11:39.440
[రెండో వ్యక్తి] ఏయ్, కొట్టద్దు.

11:39.440 --> 11:40.920
ఎవరైనా బబ్లూ అన్నని రక్షించండిరా.

11:40.920 --> 11:43.200
నీకు మతిపోయిందా? అతనికి పిచ్చి పెట్టింది.

11:43.200 --> 11:45.680
-నీ పని చెప్తా, ఆగరా.
-పరుగెత్తరా, పరుగెత్తు!

11:45.680 --> 11:47.960
-[బబ్లూ] పరుగెత్తండిరా!
-[అస్పష్ట మాటల శబ్దం]

11:47.960 --> 11:49.920
వీడు మనవెంట పడ్డాడేంటిరా?

11:49.920 --> 11:52.040
-మనపైకి వస్తున్నాడురా.
-పరుగెత్తు!

11:52.040 --> 11:54.080
వెనుక ఉన్నాడు, చూసుకో!

11:54.080 --> 11:55.960
కొట్టరా, ఇటుకతో కొట్టు.

11:55.960 --> 11:57.240
ఆగు అక్కడే.

11:57.240 --> 11:58.760
రారా, రా.

11:58.760 --> 12:00.360
కొట్టరా!

12:00.360 --> 12:02.600
-బెల్టుతో చీరేస్తా.
-ఆగరా!

12:02.600 --> 12:04.520
నీకేమైనా పిచ్చా?

12:04.520 --> 12:07.160
-[బబ్లూ] కొట్టకు, చచ్చిపోతా.
-అరవడం కాదు, వెళ్లి, అతనికి సాయం చెయ్యి.

12:07.160 --> 12:09.040
-అతను బాగానే చేస్తున్నాడుగా?
-విను, నా మాట విను.

12:09.040 --> 12:12.440
నీ పని చెప్తా. సర్పంచ్ గారిని
కొట్టడానికి నీకెంత ధైర్యంరా?

12:12.440 --> 12:14.120
-కొట్టనా?
-బబ్లూ, వాడిని తన్నరా.

12:14.120 --> 12:15.520
-నిన్ను తన్ననా?
-వద్దు, కొట్టద్దు.

12:15.520 --> 12:17.360
-మమ్మల్ని ఏడిపిస్తావా?
-లేదు,లేదు.

12:17.360 --> 12:19.600
-మమ్మల్ని ఏడిపిస్తావా?
-లేదు, ఏడిపించను.

12:19.600 --> 12:21.200
కొడతావా, ఎంత ధైర్యంరా?

12:21.200 --> 12:22.640
సర్పంచ్ గారిని కొడతావురా?

12:22.640 --> 12:24.920
తప్పయిపోయింది, క్షమించన్నా.

12:24.920 --> 12:27.400
నా క్యాట్ పరీక్ష పోతే పోయింది. వీడిని...

12:27.400 --> 12:30.360
వద్దొద్దు... ఆగు!

12:30.360 --> 12:32.480
-[అభిషేక్] వదిలేయ్.
-[వికాస్] వాడిని చంపకు.

12:32.480 --> 12:34.280
-మా బట్టలు ఊడదీయిస్తావా?
-వదిలేయ్ వాడిని.

12:34.280 --> 12:36.520
-మా బట్టలు విప్పిస్తావురా?
-వదిలేయ్.

12:36.520 --> 12:38.720
వాడొక జంతువు, వదలొద్దు.

12:38.720 --> 12:40.560
[బ్రిజ్] అరే, జంతువని ఎవర్ని అన్నారురా?

12:40.560 --> 12:43.640
-ఎవరిని అన్నారు జంతువని?
-పొండి ఇక్కడినుంచి.

12:43.640 --> 12:45.520
-వాళ్ళని పోనివ్వు.
-వీళ్ళకి భవిష్యత్తు లేదు, సర్.

12:45.520 --> 12:46.800
పోనీయండి వాళ్ళని.

12:46.800 --> 12:47.960
వాడికి బుద్ధి వచ్చింది.

12:47.960 --> 12:49.080
పోరా ఇక్కడినుంచి.

12:49.080 --> 12:51.160
వదిలేయి వాడిని.

12:51.160 --> 12:52.200
నీ కళ్ళద్దాలు తీసుకో.

12:52.200 --> 12:56.040
బైక్ మీద కూర్చోవద్దన్నాం, అంతే కదా?
అందుకే నీకు అహం దెబ్బతిందా?

12:56.040 --> 12:57.240
అది సింగిల్ స్టాండ్ వేసి ఉంది.

12:57.240 --> 12:58.680
దానిమీదనుంచి పడితే, నీ పళ్ళు రాలిపోతాయి.

12:58.680 --> 13:01.120
నేనొక వెధవనని నీ ఉద్దేశం.
ఇంతకుముందు ఎప్పుడూ కూర్చోలేదు మరి.

13:01.120 --> 13:03.240
-ఎలా పడిపోతాను?
-ఎలాగా? చూపిస్తా, ఆగు.

13:03.240 --> 13:05.320
ఎలా పడిపోతాడో ఈ వెధవకి చూపిస్తాను, ఆగండి.

13:05.320 --> 13:07.120
-పోనీరాదూ.
-ఎలాగో చూపిస్తా, చూడు.

13:07.120 --> 13:09.640
-లేదు, నన్ను చూపించనీయండి.
-నీ ఎముకలు విరిగిపోతాయి.

13:09.640 --> 13:11.640
[అస్పష్టమైన మాటల శబ్దం]

13:11.640 --> 13:13.560
పూర్తిగా పిచ్చివాడు.

13:13.560 --> 13:15.000
జంతువులాంటివాడు.

13:15.000 --> 13:18.040
పొండిరా, పొండి.
అతను లేవకముందే వెళ్లిపోండి.

13:18.040 --> 13:19.080
పొండిరా.

13:19.080 --> 13:20.720
[రెండోవాడు] నకిలీ తుపాకీ!

13:20.720 --> 13:21.920
వెధవలు.

13:21.920 --> 13:24.480
ఏంటది, నుదుటినుంచి ఎర్రెర్రగా కారుతోంది?

13:24.480 --> 13:26.800
[నేపథ్య సంగీతం]

13:26.800 --> 13:28.840
మరోచోట ఫోటో తీయించుకుంటానన్నారుగా?

13:28.840 --> 13:31.360
నా ఉద్దేశం, ఇక్కడికొచ్చి మంచి పని చేశారని.

13:31.360 --> 13:32.880
ఇది కూడా మీ దుకాణమే.

13:32.880 --> 13:34.000
[గొంతు సవరించుకుంటున్న శబ్దం]

13:34.000 --> 13:35.040
[గిటార్ తీస్తున్న చప్పుడు]

13:35.040 --> 13:36.400
వీలైతే కాస్త తల వంచండి.

13:36.400 --> 13:38.280
[ఫోటోగ్రాఫర్] బలవంతం ఏమీలేదు.
ఇష్టమైతేనే వంచండి.

13:38.280 --> 13:40.200
కావాలనుకుంటే, కిందకే చూడండి.
మరేం ఫరవాలేదు.

13:40.200 --> 13:41.880
అరే, ఏమైంది, అలా మాట్లాడుతున్నావేం?

13:41.880 --> 13:43.760
[ఫోటోగ్రాఫర్] లేదు, ఏం లేదు.

13:43.760 --> 13:46.440
మీ ఫోటో డిలీట్ చేసినందుకు క్షమించండి.

13:46.440 --> 13:47.720
సరే, ఫోటో తియ్యి.

13:47.720 --> 13:48.720
ముందు క్షమించానని చెప్పండి.

13:48.720 --> 13:51.000
-అబ్బా, ఫోటో...
-సరే, సరే. లేవకండి.

13:51.000 --> 13:52.120
తీస్తున్నాను.

13:52.120 --> 13:53.320
కాస్త నవ్వండి.

13:53.320 --> 13:54.440
[కెమెరా క్లిక్ మన్న శబ్దం]
