WEBVTT

00:00:01.880 --> 00:00:04.800 align:center
గ్రామ పంచాయతీ ఫులేరా

00:00:04.880 --> 00:00:08.880 align:center
[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

00:00:11.840 --> 00:00:13.120 align:center
హలో! ఆ అమ్మా.

00:00:15.160 --> 00:00:18.280 align:center
ఆ, అయ్యింది. ఇప్పుడు పదకొండు అయ్యింది.
పదకొండువరకు ఆకలితో ఉండను కదా?

00:00:20.720 --> 00:00:21.920 align:center
ఎప్పుడూ చేసేదే.

00:00:23.880 --> 00:00:28.520 align:center
అదే బ్రెడ్, జామ్, అరటిపండు.

00:00:30.040 --> 00:00:31.400 align:center
ఆ, పాలు తాగాను.

00:00:35.960 --> 00:00:37.080 align:center
అవును.

00:00:40.760 --> 00:00:43.560 align:center
నీకెందుకు అబద్దం చెప్తాను?

00:00:46.600 --> 00:00:49.120 align:center
నేను రోజూ పాలు పోయించుకోనని నీకెలా తెలుసు?

00:00:49.200 --> 00:00:50.360 align:center
తప్పకుండా పోయించుకుంటున్నాను.

00:00:52.400 --> 00:00:54.960 align:center
పాలు తాగేశాను. ఇప్పుడు ఫోటో ఎలా పంపను?

00:00:59.040 --> 00:01:01.480 align:center
తాగానమ్మా. నాకు పనుంది. వెళ్తున్నా.

00:01:01.920 --> 00:01:03.800 align:center
రేపు ఫోటో పంపిస్తాను. సరేనా?

00:01:06.240 --> 00:01:08.960 align:center
నోటికొచ్చినట్టు అబద్దాలు
చెప్పేస్తారు, సర్.

00:01:09.520 --> 00:01:11.840 align:center
ఇంటి నుండి దూరంగా ఉంటే నువ్వూ
నేర్చుకుంటావు. పద.

00:01:11.920 --> 00:01:14.680 align:center
కొత్తగా పెళ్ళయినవాడిని ఎందుకలా
శపిస్తారు, సర్?

00:01:15.880 --> 00:01:17.240 align:center
[తలుపు వేస్తున్న శబ్దం]

00:01:17.320 --> 00:01:18.600 align:center
ఇదేమిటి?

00:01:19.720 --> 00:01:21.720 align:center
[గొణుక్కుంటున్న స్వరం]

00:01:22.720 --> 00:01:24.680 align:center
ఇదిగోండి.

00:01:25.680 --> 00:01:26.920 align:center
తాళం చెవులు ఉన్నాయా?

00:01:27.000 --> 00:01:28.520 align:center
[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

00:01:31.120 --> 00:01:33.400 align:center
-చెప్పండి, సర్.
-[వీరేంద్ర] ఏంటి చెప్పేది?

00:01:33.480 --> 00:01:36.560 align:center
ముందు ఆ స్లోగన్ పని పూర్తి చేశారో లేదో
చెప్పండి అభిషేక్ గారు.

00:01:37.240 --> 00:01:39.120 align:center
లేదు, సర్. ఈరోజు పూర్తి చేయిస్తాను.

00:01:39.200 --> 00:01:41.120 align:center
[వీరేంద్ర] వారం రోజుల నుండి ఏవో
కుంటిసాకులు చెపుతున్నారు.

00:01:41.200 --> 00:01:43.360 align:center
డిఎమ్ ప్రతీ వారం ఫోన్ చేసి పని ఎంతవరకు
వచ్చిందని అడుగుతున్నారు.

00:01:43.440 --> 00:01:44.560 align:center
నేను ఆమెకు ఏమి చెప్పాలి?

00:01:44.880 --> 00:01:48.160 align:center
చూడండి అభిషేక్,
మీరు ఈ పని ఇవాళ పూర్తి చెయ్యకపోతే,

00:01:48.240 --> 00:01:50.560 align:center
మీ మీద క్రమశిక్షణా చర్య
తీసుకోవాల్సివస్తుంది.

00:01:50.640 --> 00:01:52.120 align:center
-అది తెలుసుకోండి.
-కంగారు పడకండి, సర్.

00:01:52.200 --> 00:01:54.000 align:center
ఇవాళ పూర్తి చేయిస్తాను. పెయింటర్
వచ్చేశాడు,

00:01:54.080 --> 00:01:55.200 align:center
నేను కూడా అక్కడికే వెళుతున్నాను.

00:01:57.400 --> 00:01:58.440 align:center
పద.

00:01:58.920 --> 00:02:00.360 align:center
మోటార్ సైకిల్ మీద వెళదాం పద.

00:02:00.440 --> 00:02:01.680 align:center
అది దగ్గరే. పద.

00:02:03.760 --> 00:02:05.760 align:center
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా

00:02:05.840 --> 00:02:08.440 align:center
ఇద్దరు పిల్లలే ముద్దు

00:02:10.360 --> 00:02:13.920 align:center
సెక్రటరీ గారు, ఇలా రాయటం వల్ల ఏమైనా
ఉపయోగముందా?

00:02:14.440 --> 00:02:16.760 align:center
జనాలు వాళ్ళకి నచ్చినంతమంది
పిల్లల్ని కంటారు.

00:02:16.840 --> 00:02:18.040 align:center
అవునా కాదా, సర్?

00:02:18.400 --> 00:02:19.880 align:center
ఇప్పుడు స్లోగన్ అయితే రాయించాం.

00:02:20.480 --> 00:02:22.640 align:center
అయినా ప్రహ్లాద్ గారు, ఇది ప్రభుత్వ ఆదేశం.

00:02:23.040 --> 00:02:25.520 align:center
దానివల్ల ఏమైనా జరిగినా జరక్కపోయినా
అది రాయించాల్సిందే.

00:02:25.600 --> 00:02:28.120 align:center
అయినా ఇలాంటివి ప్రజల్లో అవగాహన పెంచుతాయి.

00:02:28.200 --> 00:02:30.240 align:center
నీకు అవగాహన ఉందిగా?

00:02:30.320 --> 00:02:33.240 align:center
ఇది నీలా కొత్తగా పెళ్ళయిన జంటలకు,
అర్థమయ్యిందా?

00:02:33.320 --> 00:02:34.880 align:center
నాకు ఎప్పటినుండో ఈ సంగతి తెలుసు.

00:02:34.960 --> 00:02:36.720 align:center
[అభిషేక్] ఇంక మిగతావి చూద్దాం.
ఇది బాగానే ఉంది.

00:02:36.800 --> 00:02:39.320 align:center
-వెళ్ళాల్సిందే. మేల్కొలుపు అంటున్నారు.
-ఈరోజు మీరు ఈ సమయానికి మేల్కొంటారు?

00:02:39.400 --> 00:02:42.000 align:center
-నీకెంత తెలుసో చూపిస్తాను.
-మీరు మరీ అండీ. ప్రహ్లాద్ గారు.

00:02:42.080 --> 00:02:43.400 align:center
[బ్రిజ్] రా. ఇక్కడ చూడు.

00:02:44.840 --> 00:02:47.080 align:center
ఇక్కడొక చోటుంది. నీకు కావాలంటే.

00:02:47.160 --> 00:02:49.000 align:center
[ప్రహ్లాద్] అప్పుడప్పుడు స్నానం చేస్తూ
ఉండాలి, మాధవ్.

00:02:49.080 --> 00:02:50.080 align:center
అంకుల్.

00:02:50.760 --> 00:02:52.720 align:center
సర్పంచ్ గారు, నేను పాలు పోయించుకుందామని
అనుకుంటున్నాను.

00:02:52.800 --> 00:02:54.000 align:center
ఎక్కడనుండి కొనాలి?

00:02:54.080 --> 00:02:57.000 align:center
సర్పంచ్ గారినే అడగచ్చు కదా?
ఆయన దగ్గర బోలెడన్ని ఆవులు, గేదెలు ఉన్నాయి.

00:02:57.320 --> 00:02:59.360 align:center
సరే. నీకు ఆవు పాలు కావాలా, గేదె పాలా?

00:02:59.840 --> 00:03:00.920 align:center
ఏదైనా పర్వాలేదు.

00:03:01.120 --> 00:03:02.800 align:center
[బ్రిజ్] గేదె పాలు కొనుక్కోండి.

00:03:02.880 --> 00:03:04.360 align:center
గేదె పాలు చిక్కగా ఉంటాయి.

00:03:04.640 --> 00:03:06.040 align:center
పట్నం మనిషి.

00:03:06.120 --> 00:03:08.320 align:center
చిక్కటి పాలు జీర్ణించుకోలేకపోవచ్చు.

00:03:08.400 --> 00:03:10.440 align:center
దానికి కాస్త నీళ్ళు కలిపితే సరిపోతుంది.

00:03:10.520 --> 00:03:11.520 align:center
[ఆవు అరుపు]

00:03:11.600 --> 00:03:13.320 align:center
సరే అయితే, గేదె పాలు తీసుకుంటాను.

00:03:13.400 --> 00:03:17.240 align:center
నా దగ్గర మూడు రకాల గేదెలు ఉన్నాయి.

00:03:17.320 --> 00:03:20.160 align:center
ముర్రా, సుర్తి ఇంకా జఫ్రాబాది.

00:03:20.240 --> 00:03:22.160 align:center
-ఏ గేదె?
-సుర్తి అయితే మేలు.

00:03:22.240 --> 00:03:24.680 align:center
మీ దగ్గర సుర్తి గేదె పాలు కొనేవాడిని.
పాలు బాగుండేవి.

00:03:24.760 --> 00:03:26.320 align:center
జఫ్రాబాది ఇంకా బాగుండేది.

00:03:26.400 --> 00:03:27.400 align:center
నిశ్శబ్దంగా ఉండు.

00:03:27.480 --> 00:03:29.200 align:center
పాలు తాగేది ఆయన, నువ్వు కాదు.

00:03:29.280 --> 00:03:30.960 align:center
ఒక పని చేయండి. ఆ, నమస్తే.

00:03:31.040 --> 00:03:32.440 align:center
ముర్రా పాలు తీసుకోమని సలహా ఇస్తాను.

00:03:32.520 --> 00:03:34.680 align:center
-సరే, ముర్రా కానిద్దాం.
-సరే, అలాగే.

00:03:34.760 --> 00:03:36.080 align:center
అయితే, ఎంత?

00:03:36.800 --> 00:03:38.040 align:center
అర లీటరు చాలు.

00:03:38.120 --> 00:03:40.800 align:center
అయ్యో! అరలీటరు ఎవరు కొంటారు?

00:03:41.040 --> 00:03:43.120 align:center
కనీసం రెండు లీటర్లు అయినా కొనాలి.

00:03:43.200 --> 00:03:47.440 align:center
జిమ్ కి వెళ్లి కసరత్తు చెయ్యాలి
లేకపోతే బరువు పెరగలేవు.

00:03:47.520 --> 00:03:48.920 align:center
వద్దు, ధన్యవాదాలు, అరలీటరు చాలు నాకు.

00:03:49.000 --> 00:03:50.200 align:center
నెలకి ఎంత అవుతుంది?

00:03:50.280 --> 00:03:53.760 align:center
అరలీటరు పాలకి డబ్బులు ఏమి తీసుకుంటాను?

00:03:54.040 --> 00:03:55.880 align:center
కానీ అది సరైన పని కాదు.

00:03:55.960 --> 00:03:58.360 align:center
లేదు, నేను చెప్పేశాను. నేను తీసుకోను.

00:03:58.440 --> 00:04:00.720 align:center
-సర్పంచ్ గారు.
-సర్పంచ్ గారు ధనికులు, సెక్రటరీ గారు.

00:04:00.800 --> 00:04:03.360 align:center
పొలం, ఆవులు ఉన్నాయి. ఇంకేమి కావాలి?

00:04:03.440 --> 00:04:05.640 align:center
[బ్రిజ్] అవును, మీ నాన్న ఇచ్చిన ఆస్తి
కదా మరి?

00:04:05.720 --> 00:04:07.160 align:center
[బ్రిజ్] చెప్పొచ్చాడు.

00:04:08.160 --> 00:04:09.440 align:center
-[అందరి నవ్వులు]
-మీరు ధనవంతులు.

00:04:10.080 --> 00:04:11.240 align:center
ఇదేనండి.

00:04:11.720 --> 00:04:12.920 align:center
ఇదేమిటి?

00:04:13.360 --> 00:04:15.520 align:center
-పెయింటర్ ఎక్కడ?
-[పెయింటర్] ఇక్కడే ఉన్నాను, సర్.

00:04:16.560 --> 00:04:17.800 align:center
మూత్రవిసర్జనకి వెళ్ళాను.

00:04:18.240 --> 00:04:19.520 align:center
ఏం రాశావురా?

00:04:19.720 --> 00:04:21.960 align:center
"ఇద్దరు పిల్లలు ముద్దు

00:04:22.280 --> 00:04:24.240 align:center
మూడవ వారు మొద్దు."

00:04:24.520 --> 00:04:26.120 align:center
[పెయింటర్] నా అంతటా నేను రాయలేదు.

00:04:26.640 --> 00:04:29.080 align:center
సెక్రటరీ గారు రాయమన్నది రాశాను.

00:04:30.560 --> 00:04:32.560 align:center
బిడిఓ ఆఫీస్ ఇదే రాయమని ఆజ్ఞాపించింది.

00:04:33.320 --> 00:04:34.400 align:center
[ప్రహ్లాద్] సర్పంచ్ గారు,

00:04:35.000 --> 00:04:37.480 align:center
అవగాహన పేరుతో కాస్త అతిగా
చేస్తునట్టు మీకనిపించటం లేదా?

00:04:37.560 --> 00:04:39.040 align:center
ఏంటి అతి? నాకైతే బాగానే అనిపిస్తుంది.

00:04:41.120 --> 00:04:42.960 align:center
కాస్త ఎక్కువ కానీ, పర్వాలేదు.

00:04:43.440 --> 00:04:45.160 align:center
[బ్రిజ్] ఆ, ప్రహ్లాద్. ఇది బాగానే ఉంది.

00:04:45.240 --> 00:04:47.200 align:center
అసలు ఈ పల్లెటూరిలో ఇదెవరు చదువుతారు?

00:04:47.280 --> 00:04:49.320 align:center
సరే, మీ ఇద్దరికీ బాగానే ఉందనిపిస్తే
నాకు బాగానే ఉన్నట్టు.

00:04:49.600 --> 00:04:50.800 align:center
నాకు చెప్పాలనిపించింది, చెప్పాను.

00:04:51.200 --> 00:04:54.200 align:center
సరే సెక్రెటరీ గారు, బన్వారి ని పంపమంటారా?

00:04:54.480 --> 00:04:57.080 align:center
ప్రతీరోజు ఉదయం ఏడు గంటలకి అరలీటరు
పాలు తెచ్చిస్తాడు.

00:04:57.160 --> 00:04:58.560 align:center
సరే. మీరు వెళ్ళండి. నేను ఈ పని చూస్తాను.

00:04:58.640 --> 00:05:00.000 align:center
ముర్రా గేదె పాలు, కదా?

00:05:00.080 --> 00:05:02.240 align:center
ఇంకా నెలనెలా ఎంత కట్టాల్సి ఉంటాను?

00:05:02.320 --> 00:05:05.200 align:center
ఇంకా డబ్బు గురించే ఆలోచన.

00:05:05.280 --> 00:05:07.640 align:center
నేను మాట ఇచ్చాను కదా? అది మర్చిపో.

00:05:07.720 --> 00:05:09.320 align:center
-పద.
-నేను ఆఫీసుకి వెళతాను.

00:05:10.120 --> 00:05:13.240 align:center
-[అభిషేక్] ఒక గంట పడుతుంది అని చెప్పావు.
-[పెయింటర్] అవునండి.

00:05:13.320 --> 00:05:16.000 align:center
త్వరగా పూర్తి చెయ్యి. ఆ వైపు కూడా.

00:05:16.080 --> 00:05:23.080 align:center
ఇద్దరు పిల్లలు ముద్దు, మూడవ వారు మొద్దు

00:05:34.280 --> 00:05:36.280 align:center
[థీమ్ సంగీతం]

00:06:27.280 --> 00:06:29.440 align:center
పంచాయత్

00:06:49.120 --> 00:06:51.560 align:center
అర లీటరు పాల కోసం డబ్బు తీసుకుంటే
ఏమి బాగుంటుంది?

00:06:51.640 --> 00:06:54.200 align:center
[మంజు] అవును మరి, మీరు డబ్బులో మునిగి
తేలుతున్నారు.

00:06:54.280 --> 00:06:58.200 align:center
నెలకి 750 తక్కువే కదా మరి?

00:06:58.280 --> 00:07:00.680 align:center
ఎక్కడైనా లక్షలు దాచి ఉంచితే,

00:07:00.760 --> 00:07:02.320 align:center
నాక్కూడా చెప్పండి.

00:07:02.840 --> 00:07:04.640 align:center
ఏంటా పిచ్చివాగుడు?

00:07:04.720 --> 00:07:07.320 align:center
మన అమ్మాయి పెళ్లీడుకి వచ్చింది.
అదిలా ఇవ్వండి.

00:07:07.720 --> 00:07:10.120 align:center
ఆస్తుల గురించి మాట్లాడటానికే
ఉన్న సమయం సరిపోవటం లేదు మీకు.

00:07:10.680 --> 00:07:11.760 align:center
అవును.

00:07:12.440 --> 00:07:16.880 align:center
రోజు అరా లీటర్ పాలు ఇస్తే మన కూతురి
పెళ్లి ఆగిపోతుంది మరి.

00:07:16.960 --> 00:07:19.280 align:center
[మంజు] ఇది రింకీ పెళ్లి గురించి కాదు.

00:07:19.920 --> 00:07:23.320 align:center
మీ ఈ చెడ్డ అలవాటు ఉంది.

00:07:24.200 --> 00:07:27.040 align:center
కొన్ని సార్లు కూరగాయలు ఊరికే ఇస్తారు,
కొన్నిసార్లు పాలు.

00:07:27.440 --> 00:07:29.840 align:center
ఒక గేదెనే ఇచ్చెయ్యకూడదా అతనికి?

00:07:29.920 --> 00:07:31.280 align:center
ఎందుకలా అరుస్తావు?

00:07:31.360 --> 00:07:32.960 align:center
సెక్రెటరీ ని డబ్బు ఇవ్వమని చెప్తాలే.

00:07:33.160 --> 00:07:34.320 align:center
సంతోషమేనా?

00:07:35.320 --> 00:07:36.320 align:center
ఏమి సంతోషం?

00:07:36.720 --> 00:07:39.040 align:center
మీరేమీ నాకు సాయం చెయ్యటం లేదు.

00:07:39.880 --> 00:07:41.240 align:center
సరే మరి, నేను అడగను.

00:07:41.840 --> 00:07:44.200 align:center
[చమత్కారమైన సంగీతం]

00:07:46.360 --> 00:07:47.600 align:center
నేను అతన్ని డబ్బు అడుగుతాను అన్నాను.

00:07:48.040 --> 00:07:49.760 align:center
కానీ వెంటనే అడగలేను.

00:07:49.840 --> 00:07:53.880 align:center
ఎలా అడగాలో చూడాలి.
అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

00:07:53.960 --> 00:07:58.520 align:center
సెక్రటరీ దగ్గరికి వెళ్లి డబ్బు ఇవ్వు
అని అడగలేను.

00:07:58.600 --> 00:08:00.560 align:center
నేను అతనికి మాట ఇచ్చాను.

00:08:00.640 --> 00:08:03.160 align:center
నేను, నాయకుడిని కదా,

00:08:03.240 --> 00:08:05.200 align:center
నేను చేసే వాగ్దానాలన్నీ ఉట్టిమాటలే
అని చెప్పండి.

00:08:05.280 --> 00:08:06.800 align:center
నేను ఆషామాషీ నాయకుడిని కాను.

00:08:06.880 --> 00:08:08.080 align:center
అయితే ఎలాంటి నాయకులో?

00:08:08.560 --> 00:08:09.560 align:center
ఇలాంటి వాడిని.

00:08:12.120 --> 00:08:14.240 align:center
ఆ మురికివి ఇలా ఇవ్వండి.

00:08:16.840 --> 00:08:17.920 align:center
[కెమెరా షట్టర్ ధ్వని]

00:08:19.040 --> 00:08:21.440 align:center
ఇద్దరు పిల్లలు ముద్దు మూడవ వారు మొద్దు

00:08:22.920 --> 00:08:24.480 align:center
రెండు మూడు రోజుల్లో ఆఫీసుకి వచ్చి

00:08:24.560 --> 00:08:26.200 align:center
-నీ డబ్బులు తీసుకో.
-[పెయింటర్] అలాగే, సర్.

00:08:28.760 --> 00:08:30.840 align:center
[భూషణ్] ఏమి రాశారు, సెక్రెటరీ గారు?

00:08:34.000 --> 00:08:36.000 align:center
[బాధాతప్త సంగీతం]

00:08:40.320 --> 00:08:41.320 align:center
ఇది...

00:08:41.760 --> 00:08:43.640 align:center
ఇది ప్రభుత్వ పని, అంతే.

00:08:45.000 --> 00:08:46.080 align:center
ఇదేమిటి?

00:08:47.200 --> 00:08:48.720 align:center
నేను సొంతంగా రాసింది కాదు.

00:08:49.200 --> 00:08:51.400 align:center
సెక్రటరీ గారు రాయమన్నది రాశాను.

00:08:52.440 --> 00:08:54.280 align:center
[భూషణ్] మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

00:08:54.920 --> 00:08:56.720 align:center
ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే మొద్దులు.

00:08:56.800 --> 00:08:58.360 align:center
పింటూ మొద్దు అన్నమాట.

00:08:58.640 --> 00:09:00.280 align:center
♪ పింటూ మొద్దు ♪

00:09:00.360 --> 00:09:02.480 align:center
-♪ పింటూ మొద్దు ♪
-[భూషణ్] నోరు మూసుకోండి.

00:09:03.440 --> 00:09:06.400 align:center
నాన్న, మొద్దు అంటే ఏమిటి?

00:09:06.480 --> 00:09:09.080 align:center
ఏమీ లేదు, కన్నా. అంటే చాక్లెట్ అన్నమాట.

00:09:11.560 --> 00:09:13.440 align:center
సెక్రటరీ గారు, ఆ స్లోగన్ తీసేయించండి.

00:09:13.920 --> 00:09:14.920 align:center
తీసేయించండి.

00:09:15.360 --> 00:09:18.080 align:center
కుదరదు. పైనుంచి వచ్చిన ఆదేశం ఇది.

00:09:20.760 --> 00:09:22.920 align:center
సరే. ఇప్పుడు చూడండి.

00:09:24.800 --> 00:09:27.000 align:center
వినోద్ గారు, అన్నలూ.

00:09:27.080 --> 00:09:28.960 align:center
సర్పంచి గారి పాలనలో ఏం జరుగుతోందో చూడండి.

00:09:29.040 --> 00:09:30.320 align:center
[వినోద్] ఏమయ్యింది భూషణ్?

00:09:30.400 --> 00:09:31.920 align:center
-మీకు నలుగురు పిల్లలు కదా?
-అవును.

00:09:32.000 --> 00:09:35.040 align:center
వీళ్ళ లెక్క ప్రకారం మీ మూడవ,
నాల్గవ సంతానం మొద్దులు.

00:09:35.120 --> 00:09:36.120 align:center
ఏమిటి?

00:09:36.200 --> 00:09:39.320 align:center
-నేను అనటం లేదు. వీళ్ళు అంటున్నారు.
-భూషణ్, గోరంతని కొండంతలు చెయ్యకు.

00:09:39.400 --> 00:09:40.920 align:center
ఇది రాబోయే దానికి సూచిక.

00:09:41.000 --> 00:09:42.720 align:center
వెళ్లి సర్పంచ్ గారికి చెప్పండి,

00:09:42.800 --> 00:09:47.240 align:center
వచ్చే ఎలక్షన్ లో నా కుటుంబం నుండి
ఒక్క ఓటు కూడా రాదని.

00:09:47.320 --> 00:09:51.280 align:center
మాది పెద్ద కుటుంబం.
అందరికీ ముగ్గురు, నలుగురు పిల్లలున్నారు.

00:09:51.360 --> 00:09:52.920 align:center
నేను కూడా ఆయనకీ ఓటు వెయ్యను.

00:09:53.000 --> 00:09:55.400 align:center
నాన్న, నేను కూడా ఓటు వెయ్యను.

00:09:55.480 --> 00:09:57.640 align:center
ఖచ్చితంగా, బాబు. ఎవ్వరం ఓటు వెయ్యద్దు.

00:09:57.720 --> 00:09:59.400 align:center
18 ఏళ్ళు వచ్చేదాకా ఆగు.

00:09:59.680 --> 00:10:01.760 align:center
నచ్చింది చేస్తున్నారు.

00:10:03.960 --> 00:10:05.800 align:center
[ఉద్రిక్తమైన సంగీతం]

00:10:07.120 --> 00:10:09.520 align:center
[పెయింటర్] సెక్రెటరి గారు, ఇక్కడి
పరిస్థితి బాగుండేలా లేదు.

00:10:09.840 --> 00:10:11.640 align:center
నాకు నా డబ్బులు వస్తాయా?

00:10:11.920 --> 00:10:13.800 align:center
శుభ్రం చేసి ఇక్కడి నుండి బయలుదేరు.

00:10:25.480 --> 00:10:27.760 align:center
[బాధాతప్త సంగీతం]

00:10:31.880 --> 00:10:33.160 align:center
-వికాస్!
-ఆ.

00:10:33.240 --> 00:10:35.080 align:center
ఆ స్లోగన్లు తీయించేసేయ్.

00:10:35.520 --> 00:10:36.600 align:center
వికాస్.

00:10:36.680 --> 00:10:39.160 align:center
సర్పంచ్ గారు, ఆ స్లోగన్లు రాయించమని
పైనుంచి ఒత్తిడి ఉంది.

00:10:39.240 --> 00:10:41.080 align:center
మా మీదా కూడా ఒత్తిడి ఉంది, బాబు.

00:10:41.160 --> 00:10:42.240 align:center
ఒత్తిడంట.

00:10:42.320 --> 00:10:44.800 align:center
చూడండి, సెక్రటరీ గారు,
ఈ గ్రామంలో చాలా మందికి

00:10:44.880 --> 00:10:46.120 align:center
ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు.

00:10:46.200 --> 00:10:48.400 align:center
వాళ్ళంతా సర్పంచ్ గారికి వ్యతిరేకంగా
వెళితే?

00:10:48.480 --> 00:10:49.960 align:center
నేను ఏమి చెయ్యను, ప్రహ్లాద్ గారు?

00:10:51.080 --> 00:10:53.680 align:center
ఆదేశాలు పాటించకపోతే,
నా మీద క్రమశిక్షణా చర్య తీసుకుంటారు.

00:10:54.120 --> 00:10:55.360 align:center
ఏమి చర్య?

00:10:56.800 --> 00:10:58.680 align:center
నా ఉద్యోగం పోవచ్చు, సర్పంచ్ గారు.

00:11:03.520 --> 00:11:07.640 align:center
నీ ఉద్యోగమే పోతుంది, నా సర్పంచ్ పదవే
పోతుంది ఇక్కడ.

00:11:08.080 --> 00:11:10.160 align:center
ఏది ముఖ్యం?

00:11:10.480 --> 00:11:12.360 align:center
నీ ఉద్యోగమా, నా పదవా?

00:11:14.040 --> 00:11:18.200 align:center
సర్, ఆయనకీ ఆయన ఉద్యోగమే
ముఖ్యం అయ్యుంటుంది.

00:11:19.520 --> 00:11:23.320 align:center
[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

00:11:27.400 --> 00:11:28.440 align:center
హలో.

00:11:29.080 --> 00:11:30.480 align:center
ఆ, గజిందర్, చెప్పు.

00:11:31.360 --> 00:11:33.400 align:center
ఏమంటున్నావు? ఏమిటి?

00:11:34.680 --> 00:11:37.920 align:center
మేము నీ కొడుకుని మొద్దు అనటం లేదు.

00:11:38.000 --> 00:11:39.840 align:center
[బ్రిజ్] అది వేరు.

00:11:39.920 --> 00:11:42.480 align:center
ఎందుకు? ఎందుకు నీకు అర్ధం కావటం లేదు?

00:11:42.920 --> 00:11:45.880 align:center
లేదు, లేదు. ఇది నువ్వు అనుకున్నట్టు కాదు.

00:11:46.320 --> 00:11:47.320 align:center
అవును.

00:11:50.160 --> 00:11:51.880 align:center
[ప్రహ్లాద్] గజిందర్ కి ముగ్గురు
అన్నదమ్ములు.

00:11:52.160 --> 00:11:53.400 align:center
అంటే నాలుగు ఓట్లు.

00:11:53.480 --> 00:11:56.160 align:center
ఇంకా వారి భార్యలు. అంటే ఆ కుటుంబం నుండి
ఎనిమిది ఓట్లు.

00:11:56.240 --> 00:11:57.320 align:center
ఇంకా గజిందర్ నాన్నగారు.

00:11:57.400 --> 00:11:59.440 align:center
వచ్చే ఎలక్షన్ దాకా బతికుంటే అది ఒక ఓటు.

00:11:59.760 --> 00:12:00.840 align:center
తొమ్మిది ఓట్లు పోయాయి.

00:12:02.200 --> 00:12:06.040 align:center
మీరు బిడిఓ గారితో మాట్లాడండి, సెక్రటరీ
గారు. పరిస్థితి అర్ధమయ్యేలా చెప్పండి.

00:12:08.640 --> 00:12:10.400 align:center
సరే, ప్రయత్నిస్తాను.

00:12:10.480 --> 00:12:12.960 align:center
[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

00:12:13.040 --> 00:12:16.560 align:center
దేవుడా!
ప్రహ్లాద్, ఆ గోడలన్నీ చెరిపించవయ్యా.

00:12:16.640 --> 00:12:18.160 align:center
లేదంటే వీళ్ళు కాల్ చెయ్యటం ఆపరు.

00:12:20.240 --> 00:12:21.800 align:center
ప్రస్తుతానికి ఉండనివ్వండి, సర్పంచ్ గారు.

00:12:22.600 --> 00:12:24.520 align:center
ఎందుకంత కంగారు?

00:12:24.600 --> 00:12:25.880 align:center
బిడిఓ సర్ ఒప్పుకుంటారు కదా?

00:12:28.640 --> 00:12:29.840 align:center
మీరేమంటారు?

00:12:29.920 --> 00:12:31.160 align:center
బిడిఓ సర్ ఒప్పుకోరంటారా?

00:12:31.920 --> 00:12:34.120 align:center
[చమత్కారమైన సంగీతం]

00:12:43.560 --> 00:12:44.640 align:center
ఆ.

00:12:45.120 --> 00:12:47.840 align:center
ఇదెవరికి ఉచితంగా ఇవ్వబోతున్నారు?

00:12:47.920 --> 00:12:49.960 align:center
నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు.
అడ్డూ ఆపూ లేదు.

00:12:50.200 --> 00:12:51.200 align:center
[మంజు] ఆగండి.

00:12:51.560 --> 00:12:53.920 align:center
పాల డబ్బులు గురించి సెక్రటరీ తో
మాట్లాడారా లేదా?

00:12:54.000 --> 00:12:55.160 align:center
మాట్లాడతాను.

00:12:55.240 --> 00:12:57.880 align:center
750 రూపాయల కోసం నా ప్రాణం తీస్తున్నావు.

00:12:57.960 --> 00:13:00.360 align:center
-ఇంక తప్పుకో.
-పోనీ వద్దులే.

00:13:00.440 --> 00:13:03.360 align:center
మనకున్నదంతా ధారాదత్తం చేసేయకూడదు
పోనీ? అంతా పంచి పెట్టండి.

00:13:03.880 --> 00:13:05.280 align:center
మరీ జాలిగుణం పెరిగిపోయింది.

00:13:05.840 --> 00:13:07.920 align:center
[మోటార్ సైకిల్ ఎంజిన్ ధ్వని]

00:13:19.240 --> 00:13:21.960 align:center
అభిషేక్ గారు, మీరు ఇది బిడిఓ సర్ కి
అందజేయండి.

00:13:22.040 --> 00:13:24.200 align:center
నాకు కాస్త కంగారుగా ఉంది.

00:13:25.400 --> 00:13:28.720 align:center
నేను ఎప్పుడు సర్పంచ్ గారి తో మాట్లాడాలని
చూసినా, ఈ సొరకాయ ఇస్తారు.

00:13:29.960 --> 00:13:32.080 align:center
[అభిషేక్] సొరకాయలతో పనులు జరిగిపోతాయా?

00:13:41.360 --> 00:13:42.480 align:center
ఇదేమిటి?

00:13:44.520 --> 00:13:45.600 align:center
ఇది సొరకాయ.

00:13:46.560 --> 00:13:48.520 align:center
నేను కూడా చూడగలను. ఇది వంకాయ కాదు.

00:13:49.280 --> 00:13:53.080 align:center
నాకు కాయగూరలు ఇచ్చి మీ పని చేయించుకోవచ్చని
నిజంగా అనుకుంటున్నారా?

00:13:53.600 --> 00:13:55.160 align:center
నేను లంచగొండిని అనుకుంటున్నారా?

00:13:55.440 --> 00:13:58.160 align:center
సర్పంచ్ గారు నన్ను రాయనివ్వటం లేదు.
నేనేమి చెయ్యను?

00:13:58.240 --> 00:13:59.880 align:center
సరే అయితే, ఆ అపరాధం నా మీద
ఎందుకు వేసుకోవటం?

00:13:59.960 --> 00:14:01.440 align:center
డిఎమ్ మేడమ్ అడిగితే,

00:14:01.520 --> 00:14:04.600 align:center
ఫులేరా పంచాయతీ సెక్రటరీ ఆ పదవి కి
అయోగ్యుడు అని చెప్తాను.

00:14:04.680 --> 00:14:06.360 align:center
సర్, వాళ్ళకి నేను సర్దిచెప్పలేను అని

00:14:06.440 --> 00:14:08.160 align:center
మీకనిపిస్తే మీరే ఒకసారి చెప్పి చూడకూడదు?

00:14:08.240 --> 00:14:09.680 align:center
నేనెందుకు వివరించాలి ఆయనికి? ఆ?

00:14:09.880 --> 00:14:11.320 align:center
అయన మీ సర్పంచ్. మీరు చెప్పండి.

00:14:11.400 --> 00:14:14.320 align:center
-ఆయన నా చుట్టం కాదు.
-నా బామ్మరిది కూడా కాదు.

00:14:17.080 --> 00:14:18.200 align:center
సర్.

00:14:19.240 --> 00:14:23.640 align:center
సర్, "మొద్దు" అన్న పదం వాడకం
గ్రామస్తులకు నచ్చటం లేదు.

00:14:23.720 --> 00:14:25.080 align:center
అయితే, వేరే ఏదైనా ఉపయోగిద్దాము.

00:14:25.160 --> 00:14:26.720 align:center
అసలు అలా ఎలా అనగలవు?

00:14:27.080 --> 00:14:28.480 align:center
ఎలా మార్చవచ్చు?

00:14:28.560 --> 00:14:30.880 align:center
జనాలకి కోపం రావాలనే అలాంటి పదం వాడేది.

00:14:31.520 --> 00:14:32.840 align:center
మీకు అర్థమే కావట్లేదు.

00:14:34.080 --> 00:14:35.160 align:center
-[బెల్ మ్రోగిన ధ్వని]
-తివారి గారు.

00:14:35.240 --> 00:14:36.480 align:center
[తివారి] చెప్పండి, సర్.

00:14:41.880 --> 00:14:42.880 align:center
చూడండి!

00:14:43.840 --> 00:14:47.360 align:center
మనం దేశంలో పెరుగుతున్న జనాభా గురించి
డిఎమ్ మేడం ఆందోళన చెందుతున్నారు.

00:14:48.000 --> 00:14:49.440 align:center
అందుకే ఆమె నమ్ముతారు...

00:14:49.640 --> 00:14:52.600 align:center
"ఇద్దరు పిల్లలు ముద్దు మూడవ వారు మొద్దు."

00:14:52.880 --> 00:14:55.200 align:center
ఈ స్లోగన్ జనాల హృదయాలను తాకుతుంది.

00:14:55.560 --> 00:14:57.360 align:center
[వీరేంద్ర] వెళ్లి సర్పంచ్ గారికి చెప్పండి.

00:14:57.840 --> 00:14:59.520 align:center
మళ్ళీ స్లోగన్స్ రాయించండి.

00:15:01.160 --> 00:15:05.280 align:center
లేదంటే, డిఎమ్ మేడం నా ప్రాణం తీస్తుంది,
మీవి కూడా.

00:15:05.640 --> 00:15:07.360 align:center
సర్పంచ్ ఒప్పుకోకపోతే?

00:15:07.640 --> 00:15:08.840 align:center
అతని ప్రాణం కూడా తీస్తుంది.

00:15:11.200 --> 00:15:12.440 align:center
అతని ప్రాణం ఏమైనా గొప్పదా?

00:15:16.240 --> 00:15:17.280 align:center
ఆ?

00:15:17.880 --> 00:15:19.600 align:center
[గొంతు సవరించుకుంటూ] నాకు తెలియదు.

00:15:20.760 --> 00:15:21.840 align:center
వెళ్ళండి.

00:15:28.320 --> 00:15:29.360 align:center
ఉండనివ్వండి.

00:15:32.720 --> 00:15:34.720 align:center
[నిదానమైన సంగీతం]

00:16:01.360 --> 00:16:04.960 align:center
సర్పంచి గారు, మనం స్లోగన్ మళ్ళీ రాయాలి
లేదంటే డిఎమ్ గారు మన...

00:16:08.120 --> 00:16:11.280 align:center
డిఎమ్ మేడం మన మీద చర్య తీసుకుంటారు.

00:16:19.800 --> 00:16:21.280 align:center
సర్పంచ్ గారు, ఏదో ఒకటి చెప్పండి.

00:16:22.680 --> 00:16:24.440 align:center
వెళ్లి చదువుకో.

00:16:35.680 --> 00:16:38.400 align:center
[మంజు] మళ్ళీ రాయించండి. అందులో ఏముంది?

00:16:40.920 --> 00:16:42.560 align:center
నువ్వు వచ్చే ఎలక్షన్ లో ఓడిపోతావు.

00:16:43.080 --> 00:16:44.400 align:center
[మంజు] ఓడిపోతే ఏమవుతుంది?

00:16:45.200 --> 00:16:49.400 align:center
ఈ స్లోగన్ గురించి ఇలా గొడవ చేస్తున్న
వాళ్ళని వెళ్లి

00:16:49.720 --> 00:16:53.320 align:center
వాళ్ళ భార్యలని అడగమనండి

00:16:53.400 --> 00:16:56.920 align:center
ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లల్ని
కని పెంచటం ఎలా ఉంటుంది అని.

00:16:58.560 --> 00:17:01.120 align:center
సరే, "మొద్దు" మంచి పదం కాదని ఒప్పుకుంటాను.

00:17:01.520 --> 00:17:02.960 align:center
కానీ స్లోగన్ సరైనదే.

00:17:03.560 --> 00:17:05.560 align:center
మరీ తెలివిగా మాట్లాడకు, నాకు అంతా తెలుసు.

00:17:05.640 --> 00:17:08.760 align:center
అయితే వాళ్ళని ఎందుకు తిరిగి రాయనివ్వటం
లేదు? సరైన పని చెయ్యండి.

00:17:08.840 --> 00:17:12.480 align:center
సరైన పని చేసి మాత్రమే ఎవరూ ఎన్నికలు
గెలవలేరు.

00:17:12.560 --> 00:17:14.280 align:center
నీకు రాజకీయాల గురించి తెలియదు.

00:17:14.360 --> 00:17:15.680 align:center
మీకు ఇలాంటి కష్టతరమైన నిర్ణయం

00:17:15.760 --> 00:17:18.400 align:center
తీసుకునే దమ్ము లేదని ఎందుకు ఒప్పుకోరు?

00:17:19.280 --> 00:17:21.040 align:center
[మంజు] రండి, పడుకోండి.

00:17:21.560 --> 00:17:24.040 align:center
ఆ? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు.

00:17:25.880 --> 00:17:28.560 align:center
నీకు మీ తెలీదు, ఊరికే వాగుతావు.

00:17:28.880 --> 00:17:29.880 align:center
ఆ.

00:17:30.480 --> 00:17:33.240 align:center
సెక్రటరీ గారిని పాల డబ్బులు అడగలేరు,

00:17:33.320 --> 00:17:34.600 align:center
ఎందుకంటే ఆయన నొచ్చుకుంటారేమో అని.

00:17:35.400 --> 00:17:37.960 align:center
ఆ స్లోగన్ నిజమయినప్పటికీ, అది రాయించలేరు,

00:17:38.040 --> 00:17:39.840 align:center
గ్రామస్తులు నొచ్చుకుంటారేమో అని.

00:17:40.800 --> 00:17:44.880 align:center
అంత భయంగా ఉంటే ఒక పని చెయ్యండి.

00:17:44.960 --> 00:17:46.640 align:center
[మంజు] నా వైపు చూడండి.

00:17:46.840 --> 00:17:50.280 align:center
స్లోగన్ కింద నా పేరు రాయించండి.
నేను చెప్పినట్టు ఉంటుంది.

00:17:51.360 --> 00:17:54.280 align:center
పాల డబ్బుల గురించి నేను సెక్రటరీ తో
మాట్లాడతాను.

00:17:55.520 --> 00:17:57.480 align:center
నిజాన్ని కూడా నిర్భయంగా ఒప్పుకోలేరు గానీ

00:17:58.080 --> 00:17:59.800 align:center
నాయకులు అవ్వాలని అనుకుంటారు.

00:18:09.560 --> 00:18:11.560 align:center
[నిదానమైన సంగీతం]

00:18:30.480 --> 00:18:33.680 align:center
క్రమశిక్షణా చర్య అంటే సస్పెండ్
చెయ్యవచ్చేమో.

00:18:34.200 --> 00:18:36.080 align:center
[ప్రతీక్] ఎంతకాలం సస్పెండ్ చేస్తారు?

00:18:36.160 --> 00:18:38.280 align:center
ఇంతకాలమో నాకెలా తెలుస్తుంది?

00:18:38.360 --> 00:18:39.680 align:center
సస్పెండ్ అయినప్పుడు నాకు తెలుస్తుంది.

00:18:39.760 --> 00:18:42.240 align:center
[ప్రతీక్] పంచాయతీ హెచ్ఆర్ పాలసీ
చూడకూడదా? దానిలో ఏమైనా...

00:18:42.320 --> 00:18:43.520 align:center
ఒక్క నిముషం.

00:18:43.960 --> 00:18:45.960 align:center
[ప్రతీక్] హలో అభిషేక్? హలో?

00:18:47.320 --> 00:18:48.440 align:center
చెప్పండి, సర్.

00:18:48.520 --> 00:18:50.680 align:center
[బ్రీజ్] సెక్రటరీ గారు, ఒక పని చెయ్యండి,

00:18:50.760 --> 00:18:54.040 align:center
రేపు ఉదయం వార్డ్ మెంబర్ల సమావేశం
ఏర్పాటు చెయ్యండి.

00:18:55.160 --> 00:18:57.360 align:center
[నెమ్మదైన సంగీతం]

00:19:06.040 --> 00:19:11.120 align:center
చూడండి, మీరే మీమీ వార్డులకు వెళ్లి

00:19:11.200 --> 00:19:13.080 align:center
మనమందరం స్లోగన్ కి మద్దతు ఇస్తున్నాము
అని చెప్పండి.

00:19:13.600 --> 00:19:20.320 align:center
"ఇద్దరు పిల్లలు ముద్దు మూడవ వారు మొద్దు."

00:19:20.920 --> 00:19:23.400 align:center
అది నిజం కాబట్టి మనం స్లోగన్ కు పూర్తిగా
మద్దతు ఇస్తున్నాము.

00:19:24.560 --> 00:19:25.760 align:center
-[ప్రహ్లాద్] సర్పంచ్ గారు.
-ఊ.

00:19:25.840 --> 00:19:28.040 align:center
డిఎమ్ మేడం ఒత్తిడి వలన మీరు
ఈ నిర్ణయం తీసుకుంటున్నారా?

00:19:28.120 --> 00:19:29.920 align:center
లేదు, ఇది నా వ్యక్తిగత నిర్ణయం.

00:19:31.040 --> 00:19:34.240 align:center
కానీ సర్, వచ్చే ఎలక్షన్ లో దాని వలన
సమస్య కలగవచ్చు.

00:19:34.320 --> 00:19:35.560 align:center
నాకు అనవసరం.

00:19:35.920 --> 00:19:39.400 align:center
మీకే కాదు, మాకు కూడా సమస్యే.

00:19:39.480 --> 00:19:41.040 align:center
-అవును, మాకు కూడా సమస్యే.
-అవునవును.

00:19:41.120 --> 00:19:46.320 align:center
చూడండి, ఎవరైనా అడిగితే
ఇది నా నిర్ణయం అని చెప్పండి.

00:19:46.400 --> 00:19:48.280 align:center
మీకు దీనితో సంబంధం లేదు అని చెప్పండి.

00:19:48.360 --> 00:19:49.360 align:center
-అయితే సరేనండీ.
-సరే, సరే.

00:19:49.440 --> 00:19:51.480 align:center
[వ్యక్తి 2] పర్వాలేదు, సర్పంచ్ గారు.

00:19:51.560 --> 00:19:52.720 align:center
మీరు చెప్పినట్టే చేస్తాము.

00:19:52.800 --> 00:19:55.440 align:center
చూడండి, ఇది మా ఇద్దరి నిర్ణయం అని
మీరు చెప్పవచ్చు.

00:19:55.520 --> 00:19:57.160 align:center
సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరిదీ అని.

00:19:58.080 --> 00:19:59.440 align:center
నువ్వెందుకు తలదూరుస్తున్నావు?

00:19:59.720 --> 00:20:01.800 align:center
అదేమీ లేదు, సర్పంచ్ గారు. ఇదంతా రాజకీయమే.

00:20:01.880 --> 00:20:03.240 align:center
మీరు ఓడిపోయి నేను గెలిస్తే?

00:20:03.320 --> 00:20:05.520 align:center
-అదేమంత బాగోదు కదా?
-నువ్వొక వెధవవి.

00:20:06.880 --> 00:20:09.440 align:center
సర్పంచ్ గారు, నేను మీకు మద్దతుగా ఉంటాను.

00:20:10.880 --> 00:20:12.480 align:center
నన్ను ఎలక్షన్ లో ఎన్నుకోలేదు.

00:20:13.240 --> 00:20:14.880 align:center
కానీ నేను సర్పంచ్ గారికి మద్దతు
తెలుపుతున్నాను.

00:20:14.960 --> 00:20:16.000 align:center
సరే.

00:20:16.080 --> 00:20:20.160 align:center
మిగతావారికి ఈ బాధ్యతపై ఎటువంటి
ఒత్తిడీ లేదు.

00:20:20.240 --> 00:20:21.560 align:center
సరే, సర్, మీరేమంటే అదే.

00:20:21.840 --> 00:20:23.280 align:center
[అందరూ] సరేనండి.

00:20:23.360 --> 00:20:24.920 align:center
సరే, వెళదాం పదండి.

00:20:25.600 --> 00:20:28.360 align:center
ఆగండి, ఒక్క నిముషం.

00:20:29.000 --> 00:20:32.640 align:center
సెక్రటరీ గారు,
మీరు నిన్న నాకో వివరణ ఇచ్చారు కదా?

00:20:32.720 --> 00:20:33.760 align:center
సిగరెట్ పెట్టె గురించి.

00:20:33.840 --> 00:20:35.160 align:center
-అవును, నిజమే.
-అది కూడా వివరించండి.

00:20:35.520 --> 00:20:39.720 align:center
కూర్చోండి. నిల్చోనవసరం లేదు.
ఎప్పుడూ నుంచోవాలని ఆత్రం మీకు.

00:20:39.960 --> 00:20:41.520 align:center
-సరే, వినండి.
-వినండి.

00:20:41.600 --> 00:20:45.600 align:center
మీరు ఇది ఎవరికైనా వివరిస్తునప్పుడు ఎవరైనా
అర్థం చేసుకోకపోతే

00:20:45.680 --> 00:20:47.560 align:center
ఈ ఉదాహరణ ఇవ్వవచ్చు.

00:20:47.640 --> 00:20:50.800 align:center
సిగిరెట్ పెట్టెల మీద ఉన్న హెచ్చరిక లాగానే,

00:20:51.120 --> 00:20:54.040 align:center
ఈ స్లోగన్స్ మిమ్మల్ని బాధపెట్టటానికి
రాసినవే.

00:20:54.120 --> 00:20:56.440 align:center
దానివలన సరైన సందేశం ప్రజలకు చేరాలనే
మా ఉద్దేశం.

00:20:56.520 --> 00:20:57.840 align:center
మీకు అర్థం అయ్యిందా?

00:20:57.920 --> 00:21:01.920 align:center
సెక్రటరీ గారు మీకు వివరణ ఇచ్చినట్టే
మీరు కూడా ఇవ్వండి.

00:21:02.000 --> 00:21:03.640 align:center
-[వ్యక్తి 2] అర్థం అయ్యింది.
-[ప్రహ్లాద్] సరేనా?

00:21:03.720 --> 00:21:06.520 align:center
మక్కీ కి మక్కీ, అతను చెప్పినట్టుగానే.

00:21:06.720 --> 00:21:08.560 align:center
-సరేనా?
-సరే.

00:21:09.000 --> 00:21:11.400 align:center
వికాస్, ఆ స్లోగన్స్ తిరిగి రాయించు.

00:21:11.480 --> 00:21:12.480 align:center
మొత్తం అంతానా?

00:21:12.560 --> 00:21:14.520 align:center
సరే అయితే, వెళదాము.

00:21:14.600 --> 00:21:16.240 align:center
ఆ, కానివ్వండి.

00:21:16.880 --> 00:21:18.920 align:center
[అస్పష్టమైన మాటలు]

00:21:19.680 --> 00:21:22.520 align:center
సెక్రటరీ గారు, మీకు చాలా సంతోషంగా
ఉండి ఉండాలి.

00:21:22.600 --> 00:21:24.080 align:center
మీకు కావలిసిందే జరుగుతోంది.

00:21:25.560 --> 00:21:26.560 align:center
అలా ఏమీ కాదు.

00:21:26.640 --> 00:21:28.720 align:center
సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం సరైనది.

00:21:28.800 --> 00:21:30.880 align:center
వదిలెయ్యండి. ఇప్పుడిక అనవసరం.

00:21:31.240 --> 00:21:34.400 align:center
సరైన పని చెయ్యటం మన పదవికే
చేటు తెచ్చేలా ఉంది.

00:21:35.160 --> 00:21:36.280 align:center
[ప్రహ్లాద్] కదా?

00:21:36.480 --> 00:21:39.400 align:center
[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]

00:21:40.200 --> 00:21:41.920 align:center
-బిడిఓ చేస్తున్నారు.
-[ప్రహ్లాద్] స్పీకర్ లో పెట్టు.

00:21:42.000 --> 00:21:43.880 align:center
-[సెల్ ఫోన్ మ్రోగుతున్న ధ్వని]
-స్పీకర్ లో పెట్టు.

00:21:44.880 --> 00:21:46.640 align:center
అవును, సర్. సర్పంచ్ గారు ఒప్పుకున్నారు.

00:21:46.720 --> 00:21:48.800 align:center
అభినందనలు.

00:21:48.880 --> 00:21:51.440 align:center
సర్పంచి గారు ఒప్పుకోవటం మంచి విషయం.

00:21:51.720 --> 00:21:57.440 align:center
కానీ, అభిషేక్ గారు, ఇప్పుడు
ఆ మొద్దు స్లోగన్ తప్పనిసరి కాదు.

00:21:58.440 --> 00:22:00.840 align:center
ఎందుకు? ఏమయ్యింది?

00:22:01.560 --> 00:22:03.200 align:center
[వీరేంద్ర] ప్రత్యేకించి ఏమీ లేదు.

00:22:03.640 --> 00:22:05.880 align:center
పక్క ఊరిలో ఆరుగురు పిల్లలు ఉన్న ఒకతను

00:22:05.960 --> 00:22:08.760 align:center
ఆ స్లోగన్ చదివి పిచ్చి కోపం వచ్చి

00:22:08.840 --> 00:22:11.160 align:center
పంచాయతీ ఆఫీస్ తగలబెట్టాడని విన్నాము.

00:22:11.440 --> 00:22:13.600 align:center
అందుకే మీకు ఏది మంచిది అనిపిస్తే
అది చెయ్యండి.

00:22:16.520 --> 00:22:17.920 align:center
హ... హ... హలో?

00:22:18.680 --> 00:22:20.440 align:center
ఏమి చేద్దాము, సర్పంచ్ గారు?
వాళ్ళను ఆపుదామా?

00:22:20.520 --> 00:22:21.720 align:center
తప్పకుండా, వాళ్ళని ఆపాలి.

00:22:21.800 --> 00:22:23.760 align:center
సర్పంచ్ గారు, వాళ్ళు మన
ఆఫీస్ ని కూడా తగలబెడితే?

00:22:23.840 --> 00:22:25.680 align:center
నేను ఒక్కడినే పడుకుంటాను రాత్రి.

00:22:26.320 --> 00:22:27.440 align:center
ఫోన్ చెయ్యండి. వికాస్ కి కూడా.

00:22:27.520 --> 00:22:29.560 align:center
ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకున్నాము అన్నారు.

00:22:29.800 --> 00:22:31.720 align:center
అది సరైన నిర్ణయం అయితే, దానికి భయం దేనికి?

00:22:31.960 --> 00:22:35.120 align:center
సర్పంచి గారు, మరీ ఎక్కువగా
ఆలోచిస్తున్నారు. పనికొచ్చేలా ఆలోచించండి.

00:22:35.200 --> 00:22:36.880 align:center
ఈ ఆఫీస్ ని ఎవ్వరూ ఏమీ చేయరు.

00:22:36.960 --> 00:22:39.960 align:center
ఒకవేళ చేస్తే నాతో కలిసి వచ్చే ఎలక్షన్లలోనే
చేస్తారు. పద.

00:22:40.040 --> 00:22:41.040 align:center
కానీ...

00:22:41.120 --> 00:22:43.720 align:center
ప్రతీ నెలా పాలకి 750 రూపాయలు కట్టాలి మీరు.

00:22:43.800 --> 00:22:44.800 align:center
ఆ?

00:22:46.600 --> 00:22:48.080 align:center
ఏడు వందల యాభై రూపాయలు.

00:22:48.160 --> 00:22:50.840 align:center
[బ్రిజ్] ఇది ముర్రా గేదె.
తవుడు, మేత వేయాలి కదా?

00:22:50.920 --> 00:22:52.640 align:center
[అస్పష్టమైన మాటలు]

00:22:52.720 --> 00:22:57.160 align:center
[న్రిజ్] ఇప్పుడు నాకు సర్దార్ పటేల్ లా
అనిపిస్తోంది.

00:22:57.680 --> 00:22:59.800 align:center
[బ్రిజ్] మీకు సర్దార్ పటేల్ తెలుసా?

00:23:00.080 --> 00:23:01.880 align:center
భారత దేశపు ఉక్కు మనిషి.

00:23:01.960 --> 00:23:06.200 align:center
భారత దేశం కోసం కష్టతరమైన నిర్ణయాలు
తీసుకోవటం లో ఆయన వెనకడుగు వెయ్యలేదు.

00:23:06.280 --> 00:23:08.080 align:center
నేను కూడా ఆయనలా ఉండాలి ఎదో ఒక రోజు.

00:23:08.160 --> 00:23:11.480 align:center
ఇద్దరు పిల్లలు ముద్దు, మూడవ వారు మొద్దు.

00:23:16.840 --> 00:23:17.920 align:center
[కెమెరా షట్టర్ ధ్వని]

00:23:20.240 --> 00:23:22.520 align:center
[చమత్కారమైన సంగీతం]

00:23:44.600 --> 00:23:46.600 align:center
[ముగింపు థీమ్ సంగీతం]
ు, మూడవ వారు మొద్దు.

