WEBVTT

00:00:11.320 --> 00:00:13.880 align:center
-అభిషేక్ సార్!
-[తలుపు కొడుతున్న శబ్దం]

00:00:14.640 --> 00:00:15.680 align:center
అభిషేక్ సార్?

00:00:16.080 --> 00:00:17.880 align:center
[తలుపు కొడుతున్న శబ్దం]

00:00:24.840 --> 00:00:26.920 align:center
[చమత్కార సంగీతం]

00:00:27.120 --> 00:00:28.640 align:center
[వికాస్] ఇంకా నిద్రపోతున్నాడు కాబోలు.

00:00:30.440 --> 00:00:32.720 align:center
[చమత్కార సంగీతం]

00:00:37.200 --> 00:00:38.280 align:center
అభిషేక్ సార్?

00:00:40.320 --> 00:00:41.400 align:center
అభిషేక్ సార్!

00:00:43.200 --> 00:00:44.440 align:center
[వికాస్] అభిషేక్ సార్!

00:00:44.520 --> 00:00:46.520 align:center
-[కిటికీ తడుతున్న ధ్వని]
-[నిట్టూర్చడం]

00:00:48.880 --> 00:00:51.960 align:center
[వికాస్] మధ్యాహ్నమైంది.
మీరింకా నిద్రపోతున్నారు.

00:00:52.040 --> 00:00:53.040 align:center
నాకు చాలా భయమేసింది.

00:00:53.120 --> 00:00:54.680 align:center
చాలా సేపటినుంచి తలుపు తడుతూనే ఉన్నాను.

00:00:56.800 --> 00:00:58.920 align:center
పొద్దున్నే ఆరు గంటలకు అందరూ

00:00:59.400 --> 00:01:01.360 align:center
లేస్తే తొమ్మిది గంటలకు
మధ్యాహ్నం లాగే అనిపిస్తుంది.

00:01:02.320 --> 00:01:03.520 align:center
లోపలికి రా.

00:01:07.400 --> 00:01:08.760 align:center
మీ కొవ్వొత్తులు, సార్.

00:01:11.640 --> 00:01:12.840 align:center
ఎంత?

00:01:12.920 --> 00:01:15.680 align:center
నిజానికి, అర డజనుకి 50 రూపాయలు అడిగాడు.

00:01:16.040 --> 00:01:18.120 align:center
కానీ నేను తక్కువకే కొనుక్కొచ్చా.

00:01:18.640 --> 00:01:19.880 align:center
ఎంతకి?

00:01:20.680 --> 00:01:23.280 align:center
నలభై ఎనిమిది రూపాయలు.

00:01:30.960 --> 00:01:34.280 align:center
అతని దగ్గర రెండు రూపాయల చిల్లర లేదు
బదులుగా పేడా కొన్నాను.

00:01:34.640 --> 00:01:36.640 align:center
మీ బ్రేక్ ఫాస్ట్ కి పనికొస్తుందనుకున్నా.

00:01:38.280 --> 00:01:39.520 align:center
దీంతో నా బ్రేక్ ఫాస్ట్ అవుద్దా?

00:01:39.600 --> 00:01:41.240 align:center
శెనగలతో తినండి బాగుంటుంది.

00:01:41.480 --> 00:01:43.640 align:center
[చమత్కార సంగీతం]

00:01:49.160 --> 00:01:52.600 align:center
సార్, మీరు ఇంకొక ఎమర్జెన్సీ లైటు
ఎందుకు కొనకూడదు?

00:01:54.360 --> 00:01:56.120 align:center
అవును. షాపు పెట్టుకుంటా.

00:01:56.200 --> 00:01:59.200 align:center
పంచాయతీ ఆఫీసు ముందట ఎమర్జెన్సీ
లైట్ల వ్యాపారం మొదలుపెడతా.

00:01:59.840 --> 00:02:01.240 align:center
నేను లైట్లు అమ్ముతాను.

00:02:03.520 --> 00:02:05.600 align:center
-[ఘల్లుమని ధ్వని]
-[నీళ్లు పడుతున్న శబ్దం]

00:02:10.440 --> 00:02:13.160 align:center
[ఘల్లుమని ధ్వని]

00:02:15.120 --> 00:02:17.040 align:center
ఈ ఉద్యోగం మీకు ఇష్టం లేదు కదా, సార్?

00:02:19.240 --> 00:02:20.520 align:center
ఏం పర్లేదు, సార్.

00:02:20.600 --> 00:02:23.280 align:center
ఈ ఉద్యోగానికి ముందు నేను కూాడా
ఆర్మీ అంటూ తిరిగేవాడిని సార్.

00:02:23.880 --> 00:02:27.840 align:center
కానీ ఈ రెండు మోకాళ్ల కారణంగా
మెడికల్ పరీక్షల్లో తప్పాను, సార్.

00:02:29.880 --> 00:02:33.760 align:center
మనిషిగా పుట్టాక ఎప్పుడు మెరుగైన
దాని కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి, సార్.

00:02:34.640 --> 00:02:36.400 align:center
నేనేం చేయలేకపోయాను, సార్.

00:02:36.880 --> 00:02:38.640 align:center
కానీ మీలో ప్రతిభ ఉంది, సార్.

00:02:39.000 --> 00:02:40.480 align:center
మీ ఏదైనా గొప్పది చేయండి సార్.

00:02:40.560 --> 00:02:42.160 align:center
మనసు పెట్టి చదవండి సార్.

00:02:42.240 --> 00:02:44.080 align:center
[ఉదాసీన సంగీతం]

00:02:44.920 --> 00:02:46.640 align:center
చదవాలంటే ముందు కరెంటు ఉండాలి కదా?

00:02:47.400 --> 00:02:52.200 align:center
ఒకటి కాకపోతే మరొక ఎమర్జెన్సీ
లైట్లు చార్జింగ్ పెట్టడమే సరిపోతుంది.

00:02:52.280 --> 00:02:53.800 align:center
ఓసారి అది అంటించు, మరోసారి ఇది,
ఆ పని... ఈ పని,

00:02:54.640 --> 00:02:56.480 align:center
ఆఫీసు అయ్యాక నాకు దొరికేది నాలుగైదు గంటలే

00:02:56.560 --> 00:02:59.280 align:center
అవి కూడా లైట్లు సెట్
చేసుకోవడానికే సరిపోతోంది.

00:03:00.120 --> 00:03:02.400 align:center
[చమత్కార సంగీతం]

00:03:11.400 --> 00:03:12.400 align:center
సార్...

00:03:13.760 --> 00:03:17.520 align:center
ఎలాగూ ఇవాళ్టి పంచాయతీ మీటింగ్
సోలార్ లైట్ గురించే కదా.

00:03:25.640 --> 00:03:27.640 align:center
[థీమ్ సంగీతం]

00:04:19.040 --> 00:04:21.040 align:center
పంచాయత్

00:04:28.480 --> 00:04:29.480 align:center
[బ్రిజ్] ఇది ఉంచండి.

00:04:29.560 --> 00:04:32.120 align:center
పర్లేదు, సర్పంచ్ గారు. రాత్రి మిగిలింది
కొద్దిగా ఉంది.

00:04:32.200 --> 00:04:35.840 align:center
అయ్యో, ఉంచుకోండి. చూడండి
ఎంత బాగా నిగనిగలాడుతోందో.

00:04:35.920 --> 00:04:38.000 align:center
పర్లేదండీ.
పకోలీ బజార్ వెళ్లి కొనుక్కుంటాలెండి.

00:04:38.080 --> 00:04:40.960 align:center
పకోలీ బజారులో ఇంత తాజా సొరకాయ
ఎక్కడ దొరుకుతుంది? ఉంచండి.

00:04:41.040 --> 00:04:42.840 align:center
-ఉంచండి.
-కొన్ని డబ్బులైనా పొదుపు చేయొచ్చు.

00:04:42.920 --> 00:04:43.960 align:center
మొహమాటపడక్కర్లేదు.

00:04:44.040 --> 00:04:46.160 align:center
ప్రహ్లాద్ సిగ్గే పడడు.
మీరేమో సిగ్గు పడుతున్నారు.

00:04:46.240 --> 00:04:47.400 align:center
[బ్రిజ్] ఉంచండి.

00:04:47.640 --> 00:04:48.880 align:center
సెక్రెటరీ సార్!

00:04:49.640 --> 00:04:52.160 align:center
[వికాస్] వార్డు సభ్యులు అందరూ వచ్చారు.
మీటింగ్ మొదలుపెడదాం.

00:04:52.240 --> 00:04:54.280 align:center
నా కుర్చీ వేశావా?

00:04:54.880 --> 00:04:55.880 align:center
నేను...

00:04:57.640 --> 00:05:00.720 align:center
అందరూ వచ్చారు,
నువ్వేమో నా కుర్చీ వేయడం మర్చిపోయావ్.

00:05:00.800 --> 00:05:02.280 align:center
త్వరగా కానివ్వు.

00:05:02.720 --> 00:05:05.080 align:center
ముఖం మీద ఒక్కటిస్తా.

00:05:05.720 --> 00:05:07.080 align:center
[వికాస్] నా బుర్రకి తట్టలేదండి.

00:05:11.880 --> 00:05:13.600 align:center
రండి కూర్చోండి.

00:05:13.680 --> 00:05:14.960 align:center
[బ్రిజ్ నిట్టూర్పు]

00:05:19.320 --> 00:05:20.320 align:center
సరే.

00:05:22.520 --> 00:05:24.200 align:center
ఈసారి దేన్నీ వదిలేయొద్దు.

00:05:24.680 --> 00:05:26.000 align:center
[బ్రిజ్] ఆయన చూడు.

00:05:27.000 --> 00:05:30.360 align:center
భిండేశ్వర్, ఇంట్లో తినకుండా వచ్చారా?

00:05:30.440 --> 00:05:32.720 align:center
అది రెండోది. నేను చూస్తూనే ఉన్నా.

00:05:32.920 --> 00:05:35.160 align:center
మంగళ్ కనిపించట్లేదు. ఎక్కడున్నాడు?

00:05:35.240 --> 00:05:37.080 align:center
మూత్రం పోసుకోవడానికి వెళ్లాడు.

00:05:37.160 --> 00:05:38.520 align:center
పోయనివ్వు.

00:05:38.960 --> 00:05:41.440 align:center
సెక్రటరీ గారు, మీరు కానివ్వండి.

00:05:41.920 --> 00:05:43.680 align:center
-మొదలుపెడదామా?
-సరే.

00:05:43.880 --> 00:05:46.040 align:center
కూర్చునే ఉండండి. నిలబడక్కర్లేదు.

00:05:46.120 --> 00:05:48.720 align:center
-మాకు కూర్చున్నపుడు కూడా వినిపిస్తుంది.
-[అందరి నవ్వులు]

00:05:48.800 --> 00:05:49.800 align:center
కానివ్వండి...

00:05:51.360 --> 00:05:54.880 align:center
మీ అందరికీ తెలిసే ఉంటుంది.
ఫులేరా గ్రామంలో 13 సోలార్ లైట్లు

00:05:54.960 --> 00:05:56.720 align:center
అమర్చడానికి పార్లమెంట్
నిధులు కేటాయించింది.

00:05:56.800 --> 00:05:58.120 align:center
[అందరూ] తెలుసు.

00:05:59.120 --> 00:06:01.360 align:center
కాబట్టి, ఈ సమావేశంలో ఆ లైట్లను

00:06:01.440 --> 00:06:04.560 align:center
ఎక్కడెక్కడ మఖ్యమైన
ప్రదేశాల్లో అమర్చాలో నిర్ణయిద్దాం.

00:06:05.040 --> 00:06:09.360 align:center
మనం కేవలం 13వ లైటు గురించి
నిర్ణయించాలి. మిగిలినవి నిర్ణయించేశాం.

00:06:11.520 --> 00:06:13.280 align:center
సర్పంచ్ గారూ, మొత్తం 13 లైట్లు.

00:06:13.560 --> 00:06:17.960 align:center
13 లైట్లని తెలుసు మాకు, వాటికి
12 ప్రదేశాలను కూడా నిర్ణయించేశాం.

00:06:18.480 --> 00:06:21.960 align:center
10 వార్డు మెంబర్ల దగ్గర.
ఒకటి ప్రహ్లాద్ ఇంటి వద్ద

00:06:22.040 --> 00:06:23.280 align:center
ఇంకొకటి మా ఇంటి వద్ద.

00:06:23.360 --> 00:06:26.160 align:center
అలా 12 లైట్లు అయిపోయాయి.
మిగిలింది 13వ లైటే కదా. నిర్ణయిద్దాం.

00:06:26.240 --> 00:06:27.280 align:center
కానివ్వండి.

00:06:27.360 --> 00:06:28.880 align:center
ఎక్కడ పెడదామో చెప్పండి.

00:06:28.960 --> 00:06:30.240 align:center
-[ప్రహ్లాద్] వికాస్.
-హా?

00:06:30.320 --> 00:06:31.920 align:center
మీ ఇంటి బయట ఒకటి పెట్టించమంటావా?

00:06:32.000 --> 00:06:34.240 align:center
-[ముసిముసి నవ్వు]
-ఆ నవ్వు చూడండి.

00:06:36.040 --> 00:06:39.040 align:center
లేదు, మా ఇల్లు, భిండేశ్వర్ గారి ఇల్లు
ఎదురెదురుగానే ఉన్నాయి.

00:06:39.120 --> 00:06:41.560 align:center
కాబట్టి అక్కడ పెడితే మా ఇద్దరికీ
సరిపోతుంది.

00:06:41.640 --> 00:06:42.920 align:center
అవునా, భిండేశ్వర్.

00:06:43.000 --> 00:06:44.440 align:center
చాలా తెలివిగా చెప్పాడు.

00:06:45.480 --> 00:06:49.200 align:center
అలాగే, సెక్రెటరీ సార్,
మీ మనసులో ఏదన్నా ప్రదేశం ఉంటే

00:06:49.280 --> 00:06:51.160 align:center
ఇప్పుడే చెప్పండి.

00:06:51.440 --> 00:06:53.040 align:center
[వికాస్] ఎక్కువ ఆలోచించకండి,
వెంటనే చెప్పండి.

00:06:53.560 --> 00:06:57.280 align:center
ఆ లైటు చాలా గొప్పది. పగలంతా ఛార్జింగ్
అయ్యి రాత్రంతా వెలుగుతుంది.

00:06:58.520 --> 00:06:59.520 align:center
చెప్పండి.

00:07:01.920 --> 00:07:04.640 align:center
చెప్పండి. మీరు ఊరంతా చూశారు కదా.

00:07:04.720 --> 00:07:05.720 align:center
చెప్పండి. ఎక్కడ పెట్టాలో.

00:07:06.560 --> 00:07:08.880 align:center
-చెప్పండి. ఎక్కడో.
-అదీ, నేను అనుకుంటున్నా...

00:07:08.960 --> 00:07:10.240 align:center
[మంగళ్] సర్పంచ్ గారు.

00:07:11.280 --> 00:07:14.040 align:center
మరి, నేను అనుకుంటున్నా,

00:07:14.120 --> 00:07:18.400 align:center
ఊరి అవతల భూతాల చెట్టు దగ్గర
ఆ 13వ లైటు పెడదామని.

00:07:18.480 --> 00:07:19.520 align:center
మీరంతా ఏమంటారు?

00:07:19.600 --> 00:07:21.640 align:center
[అందరూ] అవునవును.

00:07:21.720 --> 00:07:24.160 align:center
అక్కడ కూడా లైటు చాలా అవసరం సర్పంచ్ గారు.

00:07:24.520 --> 00:07:26.160 align:center
ఏం చెట్టు, సర్పంచ్ గారు?

00:07:27.160 --> 00:07:29.840 align:center
వికాస్, సెక్రటరీ సార్ వచ్చి మూడు
వారాలు అయ్యింది.

00:07:29.920 --> 00:07:31.520 align:center
ఆయనకు నువ్వు ఇంకా భూతాల చెట్టు చూపించలేదా.

00:07:31.800 --> 00:07:33.960 align:center
అది చూపించాల్సినంత గొప్పదా, సర్పంచ్ గారు.
[ముసి ముసి నవ్వులు]

00:07:34.040 --> 00:07:37.000 align:center
-అదీ నిజమే.
-[అందరి నవ్వులు]

00:07:37.080 --> 00:07:39.440 align:center
అదేంటంటే, సెక్రెటరీ గారు,
మా ఊరికి తూర్పు దిక్కున

00:07:39.520 --> 00:07:41.280 align:center
ఒక భూతాల చెట్టు ఉంది.

00:07:41.640 --> 00:07:46.320 align:center
సాయంత్రం ఆరు గంటలకు చీకటి పడ్డాక
అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడతారు.

00:07:47.120 --> 00:07:48.800 align:center
ఎవరూ అక్కడికి వెళ్లరు.

00:07:50.040 --> 00:07:51.360 align:center
సర్పంచ్ గారు,

00:07:51.680 --> 00:07:54.280 align:center
అక్కడ లైటు పెడితే,
గ్రామస్థులకు మంచిగా ఉంటుంది.

00:07:54.360 --> 00:07:55.600 align:center
అది నిజమే.

00:07:55.680 --> 00:07:58.000 align:center
మంగళ్, చాలా మంచి సలహా ఇచ్చావ్.

00:07:58.080 --> 00:08:01.320 align:center
-మూత్రం పోస్తుంటే నాకు గుర్తొచ్చింది.
-[అందరూ నవ్వులు]

00:08:01.400 --> 00:08:03.280 align:center
[వ్యక్తి 1] అయితే, మంగళ్ నువ్వు
తరచుగా మూత్రం పోసుకోవాలి.

00:08:03.360 --> 00:08:05.040 align:center
-[అందరి నవ్వులు]
-[వ్యక్తి 1] ఖచ్ఛితంగా.

00:08:06.520 --> 00:08:08.920 align:center
[వ్యక్తి 2] అవసరమైతే, తోడుగా
బకెట్ తీసుకెళ్లు.

00:08:11.160 --> 00:08:15.560 align:center
[బ్రిజ్] సరేనా, భూతాల చెట్టు దగ్గర
లైటు పెడదాం మరి.

00:08:15.640 --> 00:08:18.200 align:center
వినండి. అక్కడే పెట్టండి.

00:08:20.200 --> 00:08:24.080 align:center
అక్కడొక గది ఉంది. అది చాలా మంచి గది.

00:08:24.360 --> 00:08:27.080 align:center
ఇప్పుడు మీ చట్టపరమైన పనులన్నీ
పూర్తి చేయండి.

00:08:27.160 --> 00:08:29.600 align:center
సరే. వీలైనంత త్వరగా 13వ లైటు తెప్పించండి.

00:08:35.240 --> 00:08:36.760 align:center
అలాగే వినండి, సెక్రెటరీ గారు.

00:08:36.840 --> 00:08:41.280 align:center
ఆ కూరగాయ కొద్దిగా లేతగానే ఉంది
కాబట్టి మూడు నాలుగు విజిళ్లకే ఉడుకుతుంది.

00:08:41.600 --> 00:08:43.720 align:center
రుచికరమైన వంట తయారుచేసుకుని తినండి.

00:08:47.080 --> 00:08:49.080 align:center
[అస్పష్టమైన మాటలు]

00:08:49.680 --> 00:08:51.960 align:center
[ఉదాసీన సంగీతం]

00:08:55.640 --> 00:09:02.440 align:center
గ్రామ పంచాయత్ ఫులేరా

00:09:09.440 --> 00:09:11.440 align:center
[కీచురాళ్ల ధ్వని]

00:09:20.400 --> 00:09:22.400 align:center
[కుక్కర్ ఆవిరి ధ్వని]

00:09:26.840 --> 00:09:28.960 align:center
[ఆవిరి ధ్వని]

00:09:34.560 --> 00:09:35.560 align:center
[ఆగిన ఆవిరి శబ్దం]

00:09:49.960 --> 00:09:51.840 align:center
[అభిషేక్] ఓరి, దేవుడా.

00:09:52.880 --> 00:09:54.120 align:center
[నిట్టూర్పు]

00:10:02.520 --> 00:10:05.480 align:center
కొవ్వొత్తులు ఎక్కడున్నాయి?

00:10:06.880 --> 00:10:08.040 align:center
[అగ్గిపుల్ల గీసిన శబ్దం]

00:10:14.680 --> 00:10:15.760 align:center
ఆ!

00:10:18.200 --> 00:10:20.480 align:center
[ఉదాసీన సంగీతం]

00:10:34.360 --> 00:10:35.400 align:center
[దబ్బుమని ధ్వని]

00:10:39.880 --> 00:10:41.880 align:center
[కోడిపుంజు కూత]

00:10:43.040 --> 00:10:45.040 align:center
[మృదు సంగీతం]

00:10:45.520 --> 00:10:47.960 align:center
[కీబోర్డు కొడుతున్న శబ్దం]

00:11:04.240 --> 00:11:06.280 align:center
[వికాస్] వాళ్లు ఇప్పుడు ఒప్పుకోరు సార్.

00:11:09.640 --> 00:11:10.840 align:center
ఎందుకు ఒప్పుకోరు?

00:11:11.400 --> 00:11:13.680 align:center
12 సోలార్ లైట్లను వాళ్ల ఇళ్ల
ముందే పెట్టుకుంటున్నారు.

00:11:14.120 --> 00:11:16.040 align:center
నేను కూడా నా స్వార్థం చూసుకోవాలి.

00:11:16.120 --> 00:11:18.000 align:center
13వ సోలార్ లైటు ఇక్కడే
ఆఫీసు ముందే పెట్టిస్తాను.

00:11:21.200 --> 00:11:22.200 align:center
[వికాస్ నిట్టూర్పు]

00:11:22.280 --> 00:11:24.480 align:center
ఈ విషయం మీ చేతి నుంచి జారి పోయింది సార్.

00:11:25.720 --> 00:11:26.880 align:center
అంటే?

00:11:28.280 --> 00:11:29.600 align:center
ఒక సీక్రెట్ చెప్పనా సార్?

00:11:31.680 --> 00:11:34.960 align:center
నిన్న ఇంటికి వెళ్లేటపుడు సర్పంచ్,
ఉపసర్పంచ్ మాటలను నేను విన్నాను.

00:11:35.600 --> 00:11:38.840 align:center
వాళ్లిద్దరూ ఈ 13వ లైటుని భూతాల
చెట్టు దగ్గర పెట్టించి,

00:11:38.920 --> 00:11:41.760 align:center
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో
ఓట్లు రాబట్టాలనుకుంటున్నారు.

00:11:42.200 --> 00:11:45.560 align:center
భూతాల చెట్టు భయం నుంచి గ్రామస్తులను
కాపాడినట్లు ప్రచారం చేయాలనుకుంటున్నారు.

00:11:46.440 --> 00:11:48.600 align:center
పాలిటిక్స్, సార్. పాలిటిక్స్.

00:11:56.160 --> 00:11:57.440 align:center
[నిట్టూర్పు]

00:11:57.640 --> 00:11:59.840 align:center
వాళ్ల నిర్ణయం మార్చే దారి ఏదో ఉంటుంది.

00:11:59.920 --> 00:12:01.360 align:center
[వికాస్] అవును, దారి ఉంది.

00:12:01.440 --> 00:12:03.440 align:center
ఆ భూతాల చెట్టు నుంచి భూతాలను పారద్రోలండి,

00:12:03.520 --> 00:12:04.960 align:center
అక్కడ సోలార్ లైట్ పెట్టాల్సిన పనే లేదు.

00:12:05.880 --> 00:12:08.000 align:center
[మృదు సంగీతం]

00:12:11.640 --> 00:12:12.680 align:center
ఏమైంది సార్?

00:12:14.640 --> 00:12:16.320 align:center
ఏం లేదు. ఇవాళ రాత్రికి ఏ పని పెట్టుకోకు.

00:12:19.360 --> 00:12:21.360 align:center
[మృదు సంగీతం]

00:12:24.400 --> 00:12:25.520 align:center
[వికాస్] ఖుష్బూ.

00:12:25.600 --> 00:12:28.320 align:center
నేను ఇంటికి తిరిగి రాకపోతే
వేరే పెళ్లి చేసేసుకో.

00:12:28.400 --> 00:12:30.880 align:center
మన ప్రయాణం ఇప్పటివరకేనని అర్థం చేసుకో.

00:12:31.200 --> 00:12:35.520 align:center
అలాగే పైన పెట్టెలో బాబా ఇచ్చిన 25 వెండి
నాణేలు పెట్టాను.

00:12:35.800 --> 00:12:38.840 align:center
వాటిని అమ్మితే కొన్ని రోజులు
ఖర్చులకు పనికొస్తాయి.

00:12:38.920 --> 00:12:40.480 align:center
[అభిషేక్] అరె ఏం కాదబ్బా.

00:12:40.560 --> 00:12:42.360 align:center
[వికాస్] ఎందుకు కాదు, సార్?

00:12:43.000 --> 00:12:44.000 align:center
ఏదో చెప్తున్నావ్?

00:12:45.040 --> 00:12:47.480 align:center
మోటార్ సైకిల్ నుంచి దూకలేను.

00:12:47.560 --> 00:12:49.120 align:center
నేను హెల్మెట్ పెట్టుకోలేదు.

00:12:49.560 --> 00:12:50.720 align:center
అవును.

00:12:51.480 --> 00:12:54.360 align:center
పెట్టుకోవాలని తెలుసు, కానీ మర్చిపోయా.

00:12:54.920 --> 00:12:56.280 align:center
[అభిషేక్] అదేనా చెట్టు?

00:12:57.280 --> 00:12:59.840 align:center
[వికాస్] ఏం చెప్పను,
వినాశకాలే విపరీత బుద్ధి.

00:13:00.200 --> 00:13:01.360 align:center
నువ్వు ఫోన్ పెట్టెయ్.

00:13:01.880 --> 00:13:03.520 align:center
-[అభిషేక్] అదేనా చెట్టు?
-[వికాస్ కూనిరాగాలు]

00:13:03.800 --> 00:13:05.240 align:center
[వికాస్] అవును, అదే చెట్టు.

00:13:05.320 --> 00:13:09.280 align:center
ఇంకా ముందుకు వెళ్తే,
నడిచే బండి మీది నుంచి దూకేస్తా సార్.

00:13:10.280 --> 00:13:13.240 align:center
ఆపండి. ఆపండి.

00:13:14.720 --> 00:13:16.040 align:center
జై హనుమాన్.

00:13:16.120 --> 00:13:18.600 align:center
[మోటార్ సైకిల్ ఇంజిన్ ఆగిపోయిన శబ్దం]

00:13:18.680 --> 00:13:20.480 align:center
-[దూరంగా కుక్కల అరుపు]
-[కీచురాళ్ల గోల]

00:13:26.160 --> 00:13:28.400 align:center
[అపశకున సంగీతం]

00:13:34.320 --> 00:13:35.720 align:center
[అభిషేక్] రా, ఏమైంది?

00:13:36.120 --> 00:13:38.120 align:center
ఏం జరిగినా సరే, ఒక్క ఇంచు కూడా కదలను.

00:13:38.200 --> 00:13:39.920 align:center
సస్పెండ్ చేసుకుంటే చేసుకోండి.

00:13:40.600 --> 00:13:41.680 align:center
టార్చి ఇవ్వు.

00:13:42.440 --> 00:13:45.360 align:center
మొబైల్ టార్చి వాడుకోండి.
మన దగ్గర ఒకటే టార్చి ఉంది.

00:13:50.680 --> 00:13:52.600 align:center
[గుడ్లగూబ కూత]

00:14:05.080 --> 00:14:07.000 align:center
అభిషేక్ సార్, చెట్లను ముట్టుకోకండి.

00:14:15.960 --> 00:14:19.360 align:center
[వికాస్] వెధవ లైటు కోసం ప్రాణం
పణంగా పెడుతున్నాం.

00:14:19.960 --> 00:14:21.440 align:center
[కీచురాళ్ల గోల]

00:14:24.080 --> 00:14:26.480 align:center
[అపశకున సంగీతం]

00:14:43.800 --> 00:14:46.360 align:center
[అపశకున సంగీతం కొనసాగింపు]

00:15:02.160 --> 00:15:03.200 align:center
[వికాస్] అభిషేక్ సార్!

00:15:06.400 --> 00:15:07.480 align:center
అభిషేక్ సార్!

00:15:28.360 --> 00:15:29.400 align:center
ఏం జరిగింది?

00:15:30.360 --> 00:15:31.600 align:center
[అభిషేక్] చెట్టు చాలా బాగుంది.

00:15:31.840 --> 00:15:32.960 align:center
ఏం చేయడం లేదుగా.

00:15:35.960 --> 00:15:39.560 align:center
మనం చెప్పినట్లు అంకుల్ దగ్గర
పాట పాడు, డ్యాన్స్ చెయ్యి అనగానే

00:15:39.640 --> 00:15:42.760 align:center
వినడానికి భూతం చిన్నపిల్లాడు కాదు.

00:15:43.400 --> 00:15:44.800 align:center
భూతం పాట పాడి, డ్యాన్స్ చేస్తుందా?

00:15:45.440 --> 00:15:47.080 align:center
ఏం మాట్లాడుతున్నారు, సార్?

00:15:47.160 --> 00:15:48.400 align:center
భూతం పాట పాడి, డ్యాన్స్ ఎలా చేస్తుంది?

00:15:49.000 --> 00:15:51.400 align:center
అది వెంటాడుతుంది.

00:15:52.480 --> 00:15:53.600 align:center
ఏం చేస్తుందీ?

00:15:53.680 --> 00:15:56.720 align:center
రాత్రి పూట ఈ దారిలో వచ్చిపోయే
వాళ్లను తరుముతుంది.

00:15:56.800 --> 00:15:58.720 align:center
ఇంత పెద్ద చెట్టు మిమ్మల్ని ఎలా తరుముతుంది?

00:15:58.800 --> 00:16:00.200 align:center
సైన్స్ చదువుకోలేదా ఏంటి?

00:16:00.720 --> 00:16:02.720 align:center
అమెరికా వాళ్లు సైన్స్ చదువుతారు.

00:16:03.200 --> 00:16:05.760 align:center
అలాగని వాళ్లు భూతాలను నమ్మరని కాదు కదా.

00:16:05.840 --> 00:16:07.760 align:center
నేను చాలా సార్లు టీవీలో చూశాను...

00:16:08.680 --> 00:16:10.400 align:center
ఓ కొత్త కుటుంబం ఇంట్లోకి అడుగుపెడతారు.

00:16:10.800 --> 00:16:13.440 align:center
తర్వాత వాళ్ల పిల్లకో,
పిల్లాడికో భూతం పడుతుంది.

00:16:13.760 --> 00:16:17.640 align:center
తర్వాత ఆ భూతాన్ని పోగొట్టడానికి
క్రైస్తవ ఫాదర్ ని పిలుస్తారు.

00:16:17.720 --> 00:16:20.200 align:center
-అతను హలేలూయా అంటాడు.
-అవును.

00:16:21.240 --> 00:16:23.440 align:center
ఈ చెట్టు చివరగా ఎవరిని, ఎప్పుడు తరిమింది?

00:16:23.760 --> 00:16:25.680 align:center
గత రెండేళ్లుగా ఎవరినీ తరమలేదు.

00:16:25.760 --> 00:16:26.760 align:center
ఎందుకు?

00:16:32.200 --> 00:16:33.480 align:center
దానికి ఇష్టం లేదు కావొచ్చు.

00:16:35.440 --> 00:16:38.480 align:center
అంటే, ప్రతి రెండు మూడేళ్లకొకసారి
తరుముతుంది.

00:16:38.560 --> 00:16:40.280 align:center
కానీ జనాలు చాలా భయపడుతుంటారు.

00:16:40.720 --> 00:16:44.680 align:center
ఎంతలా అంటే, దీని దగ్గరగా రాగానే
పరుగు అందుకుంటారు.

00:16:45.280 --> 00:16:51.640 align:center
ఆ విధంగానే సర్పంచ్ గారి భార్య మంజు దేవి
ఇక్కడే రెండు సార్లు కింద పడ్డారు.

00:16:53.360 --> 00:16:54.400 align:center
[వికాస్] అభిషేక్ సార్.

00:16:55.120 --> 00:16:58.800 align:center
మీరు ఆలోచిస్తున్నట్లైతే,
వేరే చోట ఎక్కడికైనా వెళ్లి ఆలోచిద్దాం.

00:17:00.160 --> 00:17:03.280 align:center
ఇది చెప్పు, చివరిగా ఈ చెట్టు ఎవరిని
తరిమింది?

00:17:03.960 --> 00:17:06.600 align:center
నాకు తెలియదు, తెలుసుకోవాలి.

00:17:07.120 --> 00:17:08.280 align:center
తెలుసుకో.

00:17:09.120 --> 00:17:11.440 align:center
[" అరే ఆగే హై " పాట వస్తోంది]

00:17:12.200 --> 00:17:16.680 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:17:21.840 --> 00:17:27.400 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:17:27.480 --> 00:17:29.400 align:center
రాత్రి ఎనిమిది అయింది.

00:17:30.600 --> 00:17:32.600 align:center
కాదు. 8:30.

00:17:33.280 --> 00:17:34.480 align:center
చెప్తున్నా కదా సార్.

00:17:34.560 --> 00:17:37.280 align:center
మూడు ఏళ్ల కింద జరిగింది కదా,
కొన్ని వివరాలు మర్చిపోయాను.

00:17:37.360 --> 00:17:39.680 align:center
ఏం పర్లేదు. సమయం అవసరం లేదు,
ఏం జరిగిందో చెప్పండి.

00:17:39.760 --> 00:17:42.360 align:center
సరే. నేను చెట్టు పక్క నుంచి వెళ్తున్నాను.

00:17:43.040 --> 00:17:45.320 align:center
లేదు, ఇంటికి వస్తున్నాననుకుంటా.

00:17:45.400 --> 00:17:47.320 align:center
బాబాయి, తర్వాతేంటో చెప్పండి.

00:17:47.400 --> 00:17:52.080 align:center
నేను చెట్టు దగ్గరికి రాగానే,
వెనక ఏదో కొట్టుకున్న శబ్దం వినిపించింది.

00:17:52.160 --> 00:17:55.280 align:center
చెట్టు నా వెనక వస్తుందని నాకు అర్థమైంది.

00:17:55.640 --> 00:17:59.520 align:center
ఇక వెంటనే నేను నా లుంగీ పైకి కట్టుకుని

00:17:59.600 --> 00:18:01.520 align:center
పరుగు మొదలుపెట్టి, ఇంటికి వచ్చేదాక ఆగలేదు.

00:18:01.600 --> 00:18:03.320 align:center
వెనక్కి తిరిగి, చెట్టు వెంటాడుతుందేమో
చూశారా?

00:18:03.400 --> 00:18:05.960 align:center
ఇందులో వెనక్కి తిరిగి చూడాల్సిన
అవసరమేముంది సార్.

00:18:06.360 --> 00:18:10.920 align:center
నాకంటే రెండేళ్లకు ముందు, నవల్ కిషోర్
అన్నని చెట్టు వెంటాడినప్పుడు,

00:18:11.000 --> 00:18:13.040 align:center
ఆయనకుకూడా ఏదో కొట్టినట్లు వినిపించిందట.

00:18:13.120 --> 00:18:16.280 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:18:19.480 --> 00:18:22.080 align:center
నాకు ఏదో కొట్టిన శబ్దం కాదు,
ఏదో విరిగిన శబ్దం వినిపించింది.

00:18:22.880 --> 00:18:25.360 align:center
కొట్టినట్లు వచ్చే శబ్దం కన్నా
విరిగిన శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.

00:18:25.440 --> 00:18:28.120 align:center
అంతపెద్ద చెట్టు మిమ్మల్ని
వెంటాడుతోందని ఊహించుకోండి.

00:18:28.200 --> 00:18:30.120 align:center
అప్పుడు కొట్టిన శబ్దం వస్తుందా
లేదా విరిగిన శబ్దమా?

00:18:30.200 --> 00:18:32.160 align:center
వెనక్కి తిరిగి, చెట్టు వెంటాడుతుందేమో
చూశారా?

00:18:32.240 --> 00:18:34.400 align:center
నేను చూడలేదు. కానీ నాకు శబ్దం మాత్రం
వినిపించింది.

00:18:35.320 --> 00:18:37.800 align:center
నాకంటే ముందు జటాయుని వెంటాడింది.

00:18:38.880 --> 00:18:40.240 align:center
అతనికి కూడా ఇదే శబ్దం వినిపించింది.

00:18:40.920 --> 00:18:43.320 align:center
కొట్టినట్లు కాదు, విరిగినట్లు కాదు.

00:18:43.400 --> 00:18:46.200 align:center
ఏదో పెద్ద శబ్దం మాత్రం వినిపించింది.

00:18:46.720 --> 00:18:50.200 align:center
అంతపెద్ద చెట్టు మిమ్మల్ని
వెంటాడుతోందని ఊహించుకోండి.

00:18:50.280 --> 00:18:51.760 align:center
అప్పుడు పెద్ద శబ్దమే వస్తుంది, కదా?

00:18:51.840 --> 00:18:53.720 align:center
మీరు వెనక్కి తిరిగి చూశారా?

00:18:53.800 --> 00:18:57.120 align:center
కొన్ని పుకార్లు విన్నాను,
అందుకే ధైర్యం చేయలేదు.

00:18:57.200 --> 00:18:58.320 align:center
ఏం విన్నారు?

00:18:58.400 --> 00:19:01.480 align:center
పరిగెత్తుతూ చెట్టును సూటిగా చూస్తే...

00:19:03.880 --> 00:19:06.960 align:center
అది మీతో పాటుగా మీ ఇంటి వరకి వచ్చేస్తుంది.

00:19:07.760 --> 00:19:09.080 align:center
మీకు అలాగే జరిగిందా?

00:19:09.160 --> 00:19:11.560 align:center
నేను వెనక్కి తిరిగి
చూసి ఉంటే అయ్యుండేదేమో?

00:19:13.280 --> 00:19:17.360 align:center
ఎందుకంటే నాకంటే ముందు వెంబడించినవారికి
అలాగే జరిగింది.

00:19:17.720 --> 00:19:20.480 align:center
లేదు, లేదు. నేనెప్పుడూ అలా అనలేదు.

00:19:20.960 --> 00:19:24.560 align:center
మా ఇంటికి వచ్చే చిన్న గల్లీలో
చెట్టు పట్టనే పట్టదు.

00:19:24.640 --> 00:19:26.640 align:center
చెట్టు పరిగెత్తడం మీరు మీ కళ్లతో చూశారా?

00:19:26.880 --> 00:19:28.720 align:center
నా కళ్లతో అయితే చూడలేదు.

00:19:30.080 --> 00:19:31.800 align:center
మీకంటే ముందు ఎవరిని వెంబడించింది?

00:19:31.880 --> 00:19:32.960 align:center
నాకంటే ముందా?

00:19:33.680 --> 00:19:35.600 align:center
ప్రమోద్ అనుకుంటా.

00:19:35.680 --> 00:19:37.960 align:center
ఎక్కు. ప్రతి చోట ఎందుకు దిగుతావ్?

00:19:38.040 --> 00:19:41.720 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:19:53.000 --> 00:19:54.400 align:center
నేను వెనక్కి తిరిగి చూడలేదు.

00:19:54.480 --> 00:19:56.520 align:center
ఎందుకంటే పరిగెత్తేటపుడు వెనక్కి చూస్తే

00:19:56.600 --> 00:19:58.280 align:center
భయంతో కిందపడే అవకాశం ఉంటుంది.

00:19:58.360 --> 00:20:00.800 align:center
అలాంటి సమయాల్లో కిందపడటం
ఏ మాత్రం మంచిది కాదు.

00:20:05.040 --> 00:20:07.080 align:center
మీరు టీచర్ ని కలవొచ్చు కదా?

00:20:07.920 --> 00:20:10.200 align:center
చెట్టు మొదట తరిమింది ఆయన్నే.

00:20:10.720 --> 00:20:11.920 align:center
పద్నాలుగేళ్ల క్రితం.

00:20:12.240 --> 00:20:15.000 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:20:15.080 --> 00:20:16.200 align:center
ఒక్కరే టీచర్ ఉన్నారు.

00:20:16.280 --> 00:20:19.400 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:20:30.240 --> 00:20:32.120 align:center
[" అరే ఆగే హై " పాట కొనసాగుతుంది]

00:20:50.560 --> 00:20:51.680 align:center
మాస్టర్ గారూ?

00:20:54.520 --> 00:20:57.240 align:center
[అభిషేక్] ఈ మాస్టర్ కూడా ఖచ్ఛితంగా
ఏదీ చూసి ఉండరు.

00:20:57.880 --> 00:20:59.440 align:center
ఇదంతా ఒక పిచ్చి పుకారు.

00:21:00.200 --> 00:21:02.200 align:center
ఇదంతా గ్రామస్తుల ముందు నిరూపిస్తా.

00:21:06.480 --> 00:21:07.520 align:center
నమస్తే, సార్.

00:21:10.880 --> 00:21:12.960 align:center
[మర్మ సంగీతం]

00:21:38.160 --> 00:21:40.560 align:center
అవును. నేను వెనక్కి తిరిగి చూశాను.

00:21:42.040 --> 00:21:44.000 align:center
చెట్టు గాలిలో మీటరు ఎత్తులో ఉంది.

00:21:45.640 --> 00:21:48.480 align:center
నెమ్మదిగా నా వెనకాలే వచ్చింది.

00:21:49.040 --> 00:21:51.640 align:center
చిన్న శబ్దం లేదు, ఎక్కడా ఏం లేదు.

00:21:51.720 --> 00:21:53.120 align:center
కేవలం నిశ్శబ్దం.

00:21:53.880 --> 00:21:58.040 align:center
చెట్టును గాలిలో చూడగానే ముందు
నా గొంతు ఎండిపోయింది.

00:21:59.440 --> 00:22:01.280 align:center
నేను నిశ్చేష్టుడినయ్యాను.

00:22:01.880 --> 00:22:03.360 align:center
కదల్లేకపోయాను.

00:22:04.760 --> 00:22:06.880 align:center
చెట్టు నా దగ్గరికి వచ్చి నిలబడింది.

00:22:07.360 --> 00:22:10.320 align:center
భయంతో నా ప్యాంటు తడిసిపోయింది.

00:22:11.440 --> 00:22:13.720 align:center
తర్వాత నా కళ్లముందు చీకట్లు కమ్ముకున్నాయి.

00:22:14.560 --> 00:22:17.120 align:center
కళ్లు తెరిచి చూసే సరికి, చెట్టు
దాని స్థానానికి వెళ్లిపోయింది.

00:22:17.720 --> 00:22:23.320 align:center
చెట్టు నాకు హాని కలిగించడానికి ముందే,
నేను లేచి, గ్రామం వరకు పరిగెత్తుకొచ్చాను.

00:22:24.160 --> 00:22:29.200 align:center
మీరు దీన్ని పుకారు అనుకుంటే అనుకోండి.

00:22:30.600 --> 00:22:33.400 align:center
లేదా నమ్మాలనుకుంటే నమ్మండి.

00:22:34.200 --> 00:22:37.800 align:center
[టీచర్] ఊ. జరిగింది మాత్రం ఇదే.

00:22:46.480 --> 00:22:48.160 align:center
నా ట్యూషన్ కి టైమైంది.

00:22:49.080 --> 00:22:50.080 align:center
నేను వెళ్లాలి.

00:23:00.720 --> 00:23:02.360 align:center
స్కూల్ ఎలా నడుస్తోంది, సార్?

00:23:03.320 --> 00:23:04.400 align:center
బాగానే నడుస్తోంది.

00:23:04.720 --> 00:23:05.720 align:center
ఎందుకు?

00:23:06.240 --> 00:23:08.400 align:center
ఏం లేదు. జిల్లాలో కొత్త డిస్ట్రిక్ట్
మేజిస్ట్రేట్ మేడం వచ్చారు.

00:23:09.040 --> 00:23:10.320 align:center
ఆమె కొద్దిగా స్ట్రిక్ట్.

00:23:10.720 --> 00:23:12.680 align:center
నా పనుల్లో భాగంగా తరచుగా కలుస్తుంటాను.

00:23:13.080 --> 00:23:15.280 align:center
ఊర్లో స్కూల్ గురించి ఆమె పదే పదే
అడుగుతుంటారు.

00:23:15.360 --> 00:23:17.520 align:center
అదంతా నాకెందుకు చెప్తున్నారు?

00:23:17.600 --> 00:23:20.080 align:center
ఈసారి ఆమెను కలిసినపుడు,
స్కూల్ బాగా నడుస్తుందని చెప్తాను.

00:23:20.560 --> 00:23:22.840 align:center
కానీ సైన్స్ టీచరుకి భూతాలు
కనిపించాయని చెప్తాను.

00:23:23.280 --> 00:23:25.440 align:center
[అభిషేక్] పూసగుచ్చినట్లు
మీ కథను ఆమెకు చెప్తాను.

00:23:25.520 --> 00:23:27.320 align:center
ఆమెకు కూడా ఆసక్తి కలగొచ్చు.

00:23:29.160 --> 00:23:30.880 align:center
ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

00:23:31.240 --> 00:23:33.160 align:center
అదేదో చెప్పిన తర్వాతే తెలుస్తుంది.

00:23:33.560 --> 00:23:34.560 align:center
[మోటార్ సైకిల్ ఇంజిన్ శబ్దం]

00:23:34.640 --> 00:23:36.480 align:center
-రేపు సిటీకి ఒక ట్రిప్ వేద్దాం.
-తప్పకుండా.

00:23:38.480 --> 00:23:41.000 align:center
[అభిషేక్] భయపడక్కర్లేదు.
ఆమె స్ట్రిక్ట్ అవొచ్చు, కానీ ఏం చేయదు.

00:23:41.080 --> 00:23:43.400 align:center
-అవును.
-[మోటార్ సైకిల్ ఇంజిన్ శబ్దం]

00:23:45.600 --> 00:23:49.120 align:center
చూద్దాం, అతనికి వార్నింగ్ అయితే ఇచ్చాం.

00:23:50.880 --> 00:23:52.680 align:center
కానీ పెద్దగా ప్రభావం చూపించిందనుకోను.

00:23:52.760 --> 00:23:55.200 align:center
బహుశా నిజంగానే చెట్టు అతడిని వెంటాడిందేమో.

00:23:55.280 --> 00:23:56.720 align:center
భూతాలు ప్రేతాలు ఉంటాయి.

00:23:56.800 --> 00:23:59.040 align:center
ఒకసారి మా ఆంటీకి కూడా భూతం పట్టింది.

00:23:59.120 --> 00:24:01.440 align:center
అంకుల్ నవ్వుతూ మంత్రగత్తె అని పిలిచేవారు.

00:24:01.520 --> 00:24:03.680 align:center
కానీ తాంత్రికుడు వచ్చి,
నిజంగా మంత్రగత్తె అని తేల్చాడు.

00:24:03.760 --> 00:24:04.800 align:center
అయ్యుండొచ్చు.

00:24:05.120 --> 00:24:06.600 align:center
[తలుపుకొడుతున్న ధ్వని]

00:24:07.360 --> 00:24:09.080 align:center
ఒక్క నిమిషం. ఎవరో తలుపు కొడుతున్నారు.

00:24:09.160 --> 00:24:10.840 align:center
ఈ సమయంలో ఎవరై ఉంటారు?

00:24:11.880 --> 00:24:13.560 align:center
ముందు కిటికీ నుంచి చూడు.

00:24:13.640 --> 00:24:16.160 align:center
పిచ్చి పట్టిందారా.
ఉండు ఒక నిమిషం ఆగి కాల్ చేస్తా.

00:24:17.400 --> 00:24:19.120 align:center
[తలుపుకొడుతున్న ధ్వని]

00:24:21.960 --> 00:24:24.440 align:center
[మృదు సంగీతం]

00:24:45.280 --> 00:24:46.280 align:center
సెక్రెటరీ గారు.

00:24:47.080 --> 00:24:49.040 align:center
దయచేసి డీఎం గారితో చెప్పకండి,

00:24:50.120 --> 00:24:51.920 align:center
లేదంటే నేను సస్పెండ్ అవుతాను.

00:24:52.280 --> 00:24:53.960 align:center
అయితే జరిగిన నిజమేంటో చెప్పండి.

00:24:54.800 --> 00:24:58.520 align:center
చూడండి, నేను చెప్పినదంతా నిజమే,

00:24:59.640 --> 00:25:02.080 align:center
కానీ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు.

00:25:03.200 --> 00:25:04.200 align:center
ఏ విషయం?

00:25:07.600 --> 00:25:08.600 align:center
ఆరోజు రాత్రి...

00:25:09.880 --> 00:25:13.800 align:center
జీవితంలో మొదటి సారి, ఆఖరిసారి,
నేను గంజాయి తీసుకున్నాను.

00:25:14.720 --> 00:25:17.840 align:center
[టీచర్] ఇక నా మతి తిరిగిపోయింది.

00:25:17.920 --> 00:25:19.960 align:center
చెట్టు నా వెనకాలే వచ్చినట్లు అనిపించింది.

00:25:21.080 --> 00:25:22.200 align:center
నిజం చెప్తున్నా సార్.

00:25:22.680 --> 00:25:25.120 align:center
ఎప్పుడైనా తీసుకొని చూడండి అలాగే అనిపి...

00:25:27.120 --> 00:25:29.120 align:center
పరిగెత్తుకుంటూ గ్రామం వైపు వెళ్లాను

00:25:29.200 --> 00:25:31.400 align:center
దారిలో జరిగిన సంఘటన ఎవరికో చెప్పేశాను

00:25:31.760 --> 00:25:33.080 align:center
అది రాత్రికి రాత్రి ఊరంతా పాకింది.

00:25:33.160 --> 00:25:36.360 align:center
మరి తర్వాతి రోజు మీరు హై లో ఉన్నారని
చెప్పాల్సింది కదా!

00:25:37.800 --> 00:25:40.120 align:center
-హై?
-అంటే మీరు మత్తులో ఉన్నారని.

00:25:40.200 --> 00:25:41.720 align:center
ఎలా చెప్పగలను సార్?

00:25:41.800 --> 00:25:43.480 align:center
నేను ఉద్యోగంలో కొత్తగా చేరాను.

00:25:43.560 --> 00:25:46.440 align:center
[టీచర్] ఎవరైనా ఫిర్యాదు చేస్తే,
నా ఉద్యోగం పోయుండేది. సార్...

00:25:47.480 --> 00:25:48.720 align:center
సెక్రెటరీ గారు.

00:25:50.200 --> 00:25:51.680 align:center
మీకు అర్థమవుతుందా?

00:25:52.360 --> 00:25:55.400 align:center
మీ కారణంగా 14 ఏళ్ల నుంచి
గ్రామస్తులు భయంతో బతుకుతున్నారు.

00:25:58.720 --> 00:25:59.880 align:center
పధ్నాలుగేళ్లు.

00:25:59.960 --> 00:26:01.000 align:center
భూతాల చెట్టు!

00:26:03.840 --> 00:26:08.720 align:center
దయచేసి డీఎం మేడంకి చెప్పకండి,
లేదంటే నేను సస్పెండ్ అవుతాను.

00:26:08.800 --> 00:26:09.920 align:center
[అభిషేక్] ఎందుకు?

00:26:10.560 --> 00:26:12.920 align:center
ఇంకో 14 ఏళ్లు జనాల్ని భయంలో బతికించడానికా?

00:26:13.360 --> 00:26:14.440 align:center
హా?

00:26:20.160 --> 00:26:21.240 align:center
గంజాయి తీసుకున్నాడు.

00:26:25.320 --> 00:26:27.400 align:center
[దుశ్శకున సంగీతం]

00:26:30.840 --> 00:26:32.760 align:center
[ఆవు అరుపు]

00:26:40.240 --> 00:26:42.840 align:center
[అపశకున సంగీతం]

00:26:58.440 --> 00:27:01.480 align:center
-[అందరూ గుర్రుగా ఉన్నారు]
-[దెబ్బల శబ్దం]

00:27:01.800 --> 00:27:02.840 align:center
మెల్లగా!

00:27:02.920 --> 00:27:05.640 align:center
-కొట్టొద్దు.
-ఆపండి! ఆపండి!

00:27:05.720 --> 00:27:06.760 align:center
శాంతించు!

00:27:06.840 --> 00:27:08.440 align:center
[మంజు] ఎలా శాంతించమంటారు, సెక్రెటరీ గారు?

00:27:08.520 --> 00:27:11.960 align:center
ఇతను చేసిన తప్పు వల్ల ఆ చెట్టు
దగ్గరగా వచ్చిన ప్రతిసారీ

00:27:12.040 --> 00:27:15.200 align:center
నా భర్త బండి వేగం పెంచడంతో
నేను రెండు సార్లు కిందపడ్డాను!

00:27:15.280 --> 00:27:16.840 align:center
ఒకసారి మోకాలు గీసుకుపోయింది.

00:27:16.920 --> 00:27:18.960 align:center
మరోసారి నాలుగు వేల రూపాయల చీర చిరిగింది.

00:27:19.040 --> 00:27:20.680 align:center
-అతన్ని ఎందుకు కొట్టొద్దు?
-[మూలిగిన శబ్దం]

00:27:20.760 --> 00:27:23.440 align:center
ఎన్ని సార్లు చెప్పాను,
నడుము పట్టుకుని కూర్చో అని.

00:27:23.520 --> 00:27:25.000 align:center
-[గుర్రుమనడం]
-[కొడుతున్నశబ్దం]

00:27:25.600 --> 00:27:27.560 align:center
నువ్వాగు. కాసేపు ఆగు.

00:27:27.640 --> 00:27:29.560 align:center
పాపం తన తప్పు ఒప్పుకున్నాడు కదా.

00:27:29.640 --> 00:27:35.560 align:center
సర్పంచ్ గారు, ఎంతైనా కొట్టండి,
కానీ గ్రామంలో విషయం తెలియనివ్వకండి.

00:27:35.640 --> 00:27:37.880 align:center
వెళ్లు. ఎవరికీ తెలియదులే. పో.

00:27:39.600 --> 00:27:41.840 align:center
-[గుర్రుమంటున్న మంజు]
-నువ్వు మరీ.

00:27:42.880 --> 00:27:43.880 align:center
పో!

00:27:44.240 --> 00:27:45.840 align:center
[ఆవు అరుపు]

00:27:47.120 --> 00:27:49.080 align:center
సర్పంచ్ గారు, గ్రామస్తులకు చెప్పకపోతే

00:27:49.160 --> 00:27:50.720 align:center
చెట్టును చూసి భయపడటం ఎలా ఆపగలం?

00:27:50.800 --> 00:27:52.480 align:center
ఒకదారి ఉంది.

00:27:52.560 --> 00:27:54.040 align:center
సెక్రెటరీ గారు ఆలోచించారు.

00:27:54.120 --> 00:27:55.360 align:center
చెప్పండి సెక్రటరీ గారు.

00:27:56.440 --> 00:27:58.640 align:center
గ్రామస్తుల భయం పోగొట్టడానికి...

00:27:59.320 --> 00:28:03.120 align:center
ఆ చెట్టు కింద సర్పంచ్ గారు
మూడు రాత్రులపాటు నిద్రపోతారు.

00:28:03.760 --> 00:28:05.080 align:center
మరి ఎన్నికల్లో...

00:28:06.280 --> 00:28:09.000 align:center
ఇక తర్వాతి ఎన్నికల్లో దీన్ని
ప్రచారం కోసం వాడుకోవచ్చు

00:28:09.080 --> 00:28:12.880 align:center
భూతాన్ని పోగొట్టడానికి సర్పంచ్ గారు
ప్రాణాన్ని పనంగా పెట్టారని చెప్పొచ్చు.

00:28:17.480 --> 00:28:18.640 align:center
మాస్టర్ స్ట్రోక్.

00:28:19.760 --> 00:28:22.240 align:center
[మంజు] మీరెందుకు రోజంతా
రాజకీయాలే మాట్లాడుతారు?

00:28:22.320 --> 00:28:23.880 align:center
నాకేమీ అర్థంకావడంలేదు.

00:28:24.400 --> 00:28:29.160 align:center
సర్పంచ్ గారు, ఇప్పుడు భూతాల చెట్టు దగ్గర
సోలార్ లైట్ అవసరం లేదనిపిస్తోంది.

00:28:29.600 --> 00:28:31.480 align:center
మరి 13వ లైటు ఎక్కడ పెడతారు?

00:28:32.600 --> 00:28:33.600 align:center
నేను అనుకుంటున్నా...

00:28:33.680 --> 00:28:36.160 align:center
అది కూడా మన ఇంటి ముందు పెట్టేసుకుందాం.

00:28:36.520 --> 00:28:37.640 align:center
సర్పంచ్ గారి ఇంటి ముందు రెండు

00:28:37.720 --> 00:28:40.520 align:center
సోలార్ లైట్లు ఉంటే, ఏదైనా
సమస్యా సెక్రెటరీ గారు?

00:28:44.680 --> 00:28:47.080 align:center
-సమస్య ఉంది.
-ఏం సమస్య?

00:28:48.640 --> 00:28:52.360 align:center
నా ఉద్దేశం, కొంచెం ఎక్కువవుతోందని...

00:28:52.440 --> 00:28:57.160 align:center
సార్, 13వ లైట్ పంచాయితీ ఆఫీసు ముందు పెడితే
బాగుంటుందనుకుంటున్నా.

00:28:57.240 --> 00:28:58.560 align:center
అది బాగుంటుంది.

00:28:58.640 --> 00:29:01.440 align:center
[వికాస్] రాత్రి కరెంటు పోయినపుడు
అక్కడ చాలా చీకటిగా ఉంటోంది.

00:29:01.680 --> 00:29:04.120 align:center
అంటే, చాలా భయమేస్తోంది.

00:29:05.440 --> 00:29:07.360 align:center
-పంచాయతీ ఆఫీసు ముందా?
-[వికాస్] అవును.

00:29:15.360 --> 00:29:18.520 align:center
చాలా మంచి ఆలోచన. ముందే ఎందుకు చెప్పలేదు?

00:29:18.600 --> 00:29:19.640 align:center
వాడికి ఒక్కటి వెయ్యి!

00:29:19.720 --> 00:29:21.520 align:center
-వీడు ఈ మధ్య చాలా తెలివిబారాడు.
-[ముసిముసి నవ్వులు]

00:29:22.520 --> 00:29:24.320 align:center
[బ్రిజ్] సరే, సెక్రెటరీ గారు.

00:29:24.400 --> 00:29:26.200 align:center
చట్టపరమైన కార్యకలాపాలు పూర్తి చేయండి

00:29:26.280 --> 00:29:28.440 align:center
13వ లైటుని ఆఫీసు ముందు పెట్టించండి.

00:29:28.920 --> 00:29:30.080 align:center
సరే, సర్పంచ్ గారు.

00:29:30.600 --> 00:29:32.400 align:center
[బ్రిజ్] వీడు గుంత తీస్తాడు.

00:29:32.480 --> 00:29:33.680 align:center
[ప్రహ్లాద్] గొప్ప ఆలోచన.

00:29:34.280 --> 00:29:36.520 align:center
[ఆశావాహ సంగీతం]

00:29:41.880 --> 00:29:43.880 align:center
[చమత్కార సంగీతం]

00:29:45.000 --> 00:29:52.000 align:center
గ్రామ పంచాయత్ ఫులేరా

00:29:58.640 --> 00:30:00.960 align:center
[ఉల్లాసకర సంగీతం]

00:30:26.680 --> 00:30:32.880 align:center
గ్రామ పంచాయత్ ఫులేరా

00:30:36.280 --> 00:30:38.360 align:center
[ఆహ్లాదకర సంగీతం]

00:30:52.960 --> 00:30:55.440 align:center
[ఆహ్లాదకర సంగీతం కొనసాగింపు]

