WEBVTT

00:00:05.280 --> 00:00:07.280 align:center
[ఆహ్లాదకరమైన సంగీతం]

00:00:17.960 --> 00:00:20.160 align:center
[బస్ ఇంజన్ శబ్ధం]

00:00:30.400 --> 00:00:32.120 align:center
[కండక్టర్] టికెట్. టికెట్.

00:00:32.320 --> 00:00:33.680 align:center
బీబీపూర్. బీబీపూర్.

00:00:34.720 --> 00:00:37.800 align:center
వెళ్ళండి, వెళ్ళండి,
తలుపు దగ్గరికి వెళ్ళండి.

00:00:37.880 --> 00:00:39.640 align:center
బాబాయ్, మీ కాలు లోపలికి పెట్టుకోండి.

00:00:40.760 --> 00:00:43.360 align:center
ఈ వయసులో ఏమైనా తగిలితే
మీకే ఇబ్బంది అవుతుంది.

00:00:44.880 --> 00:00:46.720 align:center
[కండక్టర్] టికెట్. టికెట్.

00:00:47.640 --> 00:00:49.480 align:center
టికెట్. టికెట్.

00:00:51.520 --> 00:00:53.640 align:center
కండక్టర్ గారు, ఫులేరా వెళ్లడానికి ఇంకా
ఎంత సమయం పడుతుంది?

00:00:53.960 --> 00:00:55.360 align:center
[కండక్టర్] టికెట్. టికెట్.

00:00:55.800 --> 00:00:57.320 align:center
సీట్లు చించకండి.

00:00:58.360 --> 00:00:59.760 align:center
పోనివ్వండి. పోనివ్వండి.

00:01:05.960 --> 00:01:07.800 align:center
టికెట్. టికెట్.

00:01:09.200 --> 00:01:11.520 align:center
కండక్టర్ గారు, ఫులేరా వెళ్లడానికి
ఇంకా ఎంత సమయం పడుతుంది?

00:01:12.120 --> 00:01:14.160 align:center
మీరు పద్దెనిమిదవ సారి అడుగుతున్నారు.

00:01:14.240 --> 00:01:17.920 align:center
వచ్చినప్పుడు నేను మీకు చెబుతాను.
మేమేమీ మిమ్మల్ని ఎత్తుకెళ్లిపోము.

00:01:20.760 --> 00:01:22.440 align:center
[కండక్టర్] టికెట్. టికెట్.

00:01:25.960 --> 00:01:27.080 align:center
టికెట్.

00:01:29.120 --> 00:01:31.400 align:center
[మృదువైన సంగీతం]

00:01:36.080 --> 00:01:37.760 align:center
[ప్రతీక్] నీకు ఈ ఉద్యోగం చేయడం
అంత ఇబ్బంది అయితే

00:01:37.840 --> 00:01:39.320 align:center
అసలు దీనికి ఎందుకు దరఖాస్తు చేశావు?

00:01:39.400 --> 00:01:40.600 align:center
నాకు వేరే దారి ఏముంది?

00:01:40.680 --> 00:01:42.520 align:center
మా కాలేజ్ ప్లేస్మెంట్ గురించి నీకు తెలుసు.

00:01:43.400 --> 00:01:46.680 align:center
ఉద్యోగం సులువుగా వస్తుందని, సురక్షితంగా
ఉండడానికి దీనికి దరఖాస్తు చేశాను.

00:01:46.760 --> 00:01:49.160 align:center
గ్రాడ్యుయేషన్ కి చూపించుకోడానికి
చేతిలో ఉద్యోగం ఉంటుందని చేశాను.

00:01:49.560 --> 00:01:51.600 align:center
దురదృష్టవశాత్తు, ఇప్పుడు చేతులో ఉన్నది
ఆ ఉద్యోగం ఒక్కటే.

00:01:52.720 --> 00:01:54.960 align:center
-ఏమయితేనేమి, ఉన్నంతలో మేలు.
-[లిఫ్ట్ శబ్ధం]

00:01:55.320 --> 00:01:57.320 align:center
[అభిషేక్] ఆ ఉన్నది బాగుండాలి కదా.

00:01:58.440 --> 00:02:02.400 align:center
చూడు, నిజం చెప్పాలంటే, నాకు ఈ ఉద్యోగం
అంత ఘోరంగా ఏమీ అనిపించడం లేదు.

00:02:03.400 --> 00:02:04.960 align:center
ఇరవై వేల రూపాయల జీతం.

00:02:05.040 --> 00:02:07.200 align:center
నాకు ఫులేరా గ్రామంలో పోస్టింగ్ ఇచ్చారు.

00:02:07.640 --> 00:02:09.480 align:center
ఇందులో ఏమి బాగుంది?

00:02:10.840 --> 00:02:12.680 align:center
నేను కష్టపడి చదివి ఉండవలసింది.

00:02:13.120 --> 00:02:14.880 align:center
నీలా మంచి కాలేజీలో చదివుంటే,

00:02:15.600 --> 00:02:17.640 align:center
ఇంకా నాకు కూడా పన్నెండు లక్షల
రూపాయల జీతం వచ్చేది.

00:02:17.720 --> 00:02:19.880 align:center
పన్నెండు లక్షలు నా సి.టి.సి.

00:02:19.960 --> 00:02:22.440 align:center
కోతలు పోను నా చేతికి వచ్చేది
ఎనభై వేలు మాత్రమే.

00:02:23.360 --> 00:02:26.280 align:center
నాకు వచ్చే జీతం నువ్వు కట్టే టాక్స్ కి
సమానమని నీకు అర్థమవుతుందా?

00:02:27.360 --> 00:02:29.200 align:center
[ప్రతీక్] నువ్వు ప్రతికూలతలను మాత్రమే
చూస్తున్నావు.

00:02:29.280 --> 00:02:30.560 align:center
సానుకూలతల పైన దృష్టి పెట్టు.

00:02:30.640 --> 00:02:32.720 align:center
నీ ఉద్యోగం ఎంత ఆసక్తికరంగా ఉందో చూడు.

00:02:32.800 --> 00:02:34.200 align:center
ఇందులో ఆసక్తికరంగా ఉండేది ఏముంది?

00:02:34.400 --> 00:02:36.280 align:center
ఇది ఆసక్తికరమైన ఉద్యోగం.

00:02:36.360 --> 00:02:38.760 align:center
నువ్వు గ్రామ పంచాయితీ సెక్రెటరీ
కాబోతున్నావు.

00:02:38.840 --> 00:02:41.600 align:center
అక్కడి సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్
ఇతర సభ్యులతో కలిసి,

00:02:41.680 --> 00:02:43.480 align:center
నువ్వు గ్రామాన్ని అభివృద్ధి చేస్తావు.

00:02:43.560 --> 00:02:47.280 align:center
ఊహించుకో, నువ్వు కాలువలు తవ్విస్తావు,
చేతి పంపులు, రోడ్లు వేయిస్తావు.

00:02:47.880 --> 00:02:50.720 align:center
"స్వదేశపు మోహన్ భార్గవ్"
అయ్యే అవకాశం నీకు వచ్చింది!

00:02:51.040 --> 00:02:53.240 align:center
ఇంకా నువ్వేమో భూమిపుత్రుడు అయ్యే
అవకాశం వదులుకుని,

00:02:53.320 --> 00:02:55.080 align:center
నాలా కార్పొరేట్ పరుగు పందెంలో
ఉండాలనుకుంటున్నావు.

00:02:55.160 --> 00:02:57.640 align:center
నీకు నా ఉద్యోగం అంతలా నచ్చితే,
అప్పుడు నువ్వు దరఖాస్తు చేసుకో.

00:02:57.960 --> 00:02:59.240 align:center
దగ్గరలోని ఊరులో ఉద్యోగంలో చేరు.

00:02:59.320 --> 00:03:00.840 align:center
[ప్రతీక్] ఎందుకు నిరుత్సాహపడుతున్నావు?

00:03:00.920 --> 00:03:03.600 align:center
కాలేజ్ చదువు ఇప్పుడే పూర్తయింది.
నీకు చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది.

00:03:03.680 --> 00:03:05.800 align:center
వెళ్ళి చూడు బాగుందో, లేదో.

00:03:06.120 --> 00:03:08.280 align:center
ఆ తరువాత ఏమి చేయాలో ఆలోచించవచ్చు.

00:03:08.920 --> 00:03:10.680 align:center
[సముదాయిస్తూ] ఇదే సరైన సమయం.

00:03:11.000 --> 00:03:12.560 align:center
నీకు అవకాశం దొరికింది.
వెళ్ళి సాహసం చెయ్యి.

00:03:12.640 --> 00:03:14.320 align:center
వెళ్ళి చూడు. గ్రామీణ భారతం.

00:03:14.400 --> 00:03:15.680 align:center
[ఇంగ్లీష్ లో] అసలైన భారతదేశం.

00:03:15.760 --> 00:03:17.920 align:center
నాకు మామూలు జీవితం కావాలి.
సాహసాలు చేయాలని లేదు.

00:03:18.320 --> 00:03:19.720 align:center
నాకు గ్రామీణ భారతం చూడాలని లేదు.

00:03:21.120 --> 00:03:23.320 align:center
[మృదువైన సంగీతం]

00:03:25.480 --> 00:03:27.720 align:center
ఉద్యోగం లేకుండా
ఇంట్లో కూర్చోవడం కంటే అదే మంచిది.

00:03:31.840 --> 00:03:34.280 align:center
[ప్రతీక్] నీ మూడ్ పాడుచేసుకోవద్దు.
నేను నీకు చారలు షర్ట్ కొంటాను.

00:03:34.800 --> 00:03:36.880 align:center
[అభిషేక్] వద్దు, కృతజ్ఞతలు.
నువ్వు నాకు కొనేది అదొక్కటే.

00:03:37.600 --> 00:03:38.600 align:center
పద వెళదాం.

00:03:40.280 --> 00:03:41.920 align:center
[కండక్టర్] ఫులేరా. ఫులేరా.

00:03:42.960 --> 00:03:44.920 align:center
అన్నయ్య, లేవండి. ఫులేరా వచ్చింది.

00:03:45.600 --> 00:03:47.240 align:center
అప్పటి నుండి ఫులేరా అని అడుగుతూ ఉన్నారు.

00:03:51.400 --> 00:03:53.680 align:center
-[సిలిండర్ లాగిన శబ్ధం]
-[అభిషేక్] జాగ్రత్తగా.

00:03:56.320 --> 00:03:57.320 align:center
ఇంకేమైనా ఉన్నాయా?

00:03:57.960 --> 00:03:59.280 align:center
పైన ఇంకొక సామాను ఉంది.

00:04:00.200 --> 00:04:02.320 align:center
[హాస్యభరితమైన సంగీతం]

00:04:03.200 --> 00:04:05.200 align:center
[బస్ ఇంజిన్ శబ్ధం]

00:04:10.320 --> 00:04:12.920 align:center
గ్రామ పంచాయితీ ఫులేరా
మీకు స్వాగతం పలుకుతుంది

00:04:42.880 --> 00:04:44.880 align:center
[బండి స్టార్ట్ చేసిన శబ్ధం]

00:05:06.080 --> 00:05:08.080 align:center
[నేపథ్య సంగీతం]

00:05:59.960 --> 00:06:02.320 align:center
పంచాయత్

00:06:13.320 --> 00:06:18.080 align:center
మేము మానసికంగా సిద్ధం అయ్యాము!
ఫులేరాని అత్యుత్తమమైనదిగా చేస్తాము!

00:06:23.920 --> 00:06:26.120 align:center
ఇరవై నిమిషాల్లో వస్తానని చెప్పాడు.

00:06:27.560 --> 00:06:29.080 align:center
[దూరంగా మేకల అరుపులు]

00:06:31.400 --> 00:06:32.480 align:center
[ఈగల శబ్ధం]

00:06:36.040 --> 00:06:37.200 align:center
ప్రహ్లాద్ గారు.

00:06:37.560 --> 00:06:40.360 align:center
నాలుగు స్వీట్ ముక్కల్లో ఎవరో ఒకటి
తీసుకున్నారని అతనికి తెలుస్తుంది.

00:06:40.920 --> 00:06:42.200 align:center
అతనికి ఎలా తెలుస్తుంది?

00:06:42.800 --> 00:06:44.680 align:center
-అతిథులకు ఎన్నడూ మూడు ముక్కలు పెట్టరు.
-[నోటితో ఊదిన శబ్ధం]

00:06:45.200 --> 00:06:47.040 align:center
వారికి రెండు లేదా నాలుగు ముక్కలు పెడతారు.

00:06:48.320 --> 00:06:49.360 align:center
పోవయ్యా.

00:06:51.280 --> 00:06:53.760 align:center
[మృదువైన సంగీతం]

00:07:11.920 --> 00:07:13.920 align:center
[బండి వస్తున్న శబ్ధం]

00:07:15.120 --> 00:07:16.200 align:center
[వికాస్] అది అతనే అనుకుంటాను.

00:07:19.960 --> 00:07:20.960 align:center
[వికాస్] అది ఆయనే. అది ఆయనే.

00:07:21.200 --> 00:07:22.240 align:center
[వికాస్] ఆయనే సెక్రెటరీ.

00:07:24.920 --> 00:07:27.120 align:center
[గతుకుల్లో సిలెండర్ కదులుతున్న శబ్ధం]

00:07:42.000 --> 00:07:43.160 align:center
దీన్ని పట్టుకో.

00:07:44.600 --> 00:07:47.200 align:center
[ఇంజిన్ శబ్ధం]

00:07:47.280 --> 00:07:48.440 align:center
[ఇంజన్ ఆగిన శబ్ధం]

00:07:58.280 --> 00:07:59.360 align:center
[వికాస్] జాగ్రత్త.

00:07:59.440 --> 00:08:05.000 align:center
గ్రామ పంచాయితీ ఫులేరా

00:08:06.800 --> 00:08:07.960 align:center
[వికాస్] నాకు ఇవ్వండి.

00:08:08.560 --> 00:08:09.560 align:center
కృతజ్ఞతలు.

00:08:09.640 --> 00:08:11.200 align:center
ఇది నా పని, అభిషేక్ సార్.

00:08:11.920 --> 00:08:13.840 align:center
నా పేరు వికాస్.
నేను మీ కార్యాలయం సహాయకుడిని.

00:08:13.920 --> 00:08:15.560 align:center
నేను ఫోన్లో మాట్లాడింది నీతోనే అన్నమాట.

00:08:15.640 --> 00:08:16.840 align:center
[నవ్వుతూ] అవును, అవును, అవును.

00:08:17.640 --> 00:08:19.640 align:center
[వికాస్] ఈయన ఫులేరా గ్రామ పంచాయితీ
డెప్యూటీ సర్పంచ్.

00:08:20.120 --> 00:08:21.320 align:center
[వికాస్] శ్రీ ప్రహ్లాద్ పాండే గారు.

00:08:21.560 --> 00:08:23.320 align:center
వాట్సాప్ లో నేను మీకు ఆయన ఫోటో పంపాను.

00:08:23.840 --> 00:08:25.880 align:center
-నమస్తే. నమస్తే.
-నమస్తే.

00:08:26.320 --> 00:08:27.880 align:center
[ప్రహ్లాద్] ప్రయాణంలో ఏమీ
ఇబ్బంది కలగలేదు కదా?

00:08:28.640 --> 00:08:30.280 align:center
లేదు, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు.

00:08:30.360 --> 00:08:32.200 align:center
-బ్యాగ్ పైన పెట్టు.
-సరే.

00:08:34.600 --> 00:08:35.680 align:center
కార్యాలయం ఇదేనా?

00:08:35.760 --> 00:08:37.360 align:center
[ప్రహ్లాద్] ఇదే మన చిన్న కార్యాలయం.

00:08:37.680 --> 00:08:40.440 align:center
మూడు గదులు ఉంటాయి,
అందులో ఒకటి సర్పంచ్ గారిది.

00:08:40.520 --> 00:08:42.440 align:center
మిగిలినవారు హాల్లో కూర్చుంటారు.

00:08:42.640 --> 00:08:45.400 align:center
ఖాళీగా ఉన్న మూడో గదిని
మీకోసం సిద్ధం చేశాము.

00:08:45.480 --> 00:08:47.120 align:center
అక్కడ మీకోసం పరుపు ఇంకా దిండు
ఏర్పాటు చేశాము.

00:08:47.200 --> 00:08:49.000 align:center
ఇక చేయవలసింది ఈ మంచం లోపల పెట్టించడం.

00:08:49.520 --> 00:08:52.280 align:center
[వికాస్] ఇది ఆరు బై మూడు అడుగుల మంచం.
మీకు సరిపోతుందో లేదో మీరు చూసుకోవచ్చు.

00:08:52.360 --> 00:08:53.600 align:center
ఆవసరం లేదు, నాకు సరిపోతుంది.

00:08:53.680 --> 00:08:56.160 align:center
[ప్రహ్లాద్] ఒకసారి చూడండి. ఏదైనా తేడా ఉంటే
సర్దుబాటు చేయవచ్చు.

00:08:56.240 --> 00:08:57.280 align:center
-అవును.
-అవును.

00:08:57.360 --> 00:08:59.080 align:center
లేదు, నాకు సరిపోతుంది.
దీని తాళంచెవి ఎక్కడ?

00:08:59.880 --> 00:09:01.640 align:center
తాళం సర్పంచ్ గారి దగ్గర ఉంది.
ఆయన వస్తూ ఉంటారు.

00:09:04.920 --> 00:09:06.320 align:center
ఆయన వస్తూ ఉంటారా?

00:09:06.400 --> 00:09:07.760 align:center
సర్పంచ్ గారు మహిళ కదా?

00:09:10.040 --> 00:09:11.800 align:center
సర్పంచ్ గారు పురుషులు.

00:09:12.320 --> 00:09:14.280 align:center
మంజు దేవి అంటే పురుషుడా?

00:09:14.360 --> 00:09:16.640 align:center
లేదు. సర్పంచ్ మంజు దేవి మహిళనే.

00:09:16.960 --> 00:09:18.160 align:center
ఆమె చీర కట్టుకుంటారు.

00:09:18.920 --> 00:09:21.640 align:center
[వికాస్] మేము మంజు దేవి భర్త
బ్రిజ్ భూషణ్ దూబే గురించి మాట్లాడుతున్నాం.

00:09:21.960 --> 00:09:23.200 align:center
మీకు అర్థం కాలేదా?

00:09:23.280 --> 00:09:27.080 align:center
గత ఎన్నికల్లో, ప్రభుత్వం ఈ సీటును
మహిళలకు కేటాయించింది.

00:09:27.160 --> 00:09:29.240 align:center
కానీ బ్రిజ్ భూషణ్ తెలివైనవారు.

00:09:29.320 --> 00:09:32.200 align:center
ఆయన తన స్థానంలో భార్యను నిలబెట్టి,
ఎన్నికల్లో గెలిచారు.

00:09:32.880 --> 00:09:36.560 align:center
అంటే, మంజు దేవి, అధికార సర్పంచ్.

00:09:37.480 --> 00:09:39.800 align:center
ఇంకా బ్రిజ్ భూషణ్ గారు సర్పంచ్ భర్త.

00:09:40.280 --> 00:09:43.040 align:center
[ప్రహ్లాద్] ఇక్కడ అన్నీ ఆయనే చూసుకుంటారు.

00:09:43.120 --> 00:09:45.080 align:center
అందుకే మేము ఆయన్ని సర్పంచ్ అంటాము.

00:09:45.360 --> 00:09:46.360 align:center
అర్థమయిందా?

00:09:47.000 --> 00:09:48.360 align:center
అదిగో ఆయన వస్తున్నారు.

00:09:48.440 --> 00:09:50.120 align:center
[ప్రహ్లాద్] నమస్కారం, సర్పంచ్ గారు.
నమస్కారం.

00:09:50.200 --> 00:09:51.400 align:center
నమస్తే.

00:09:51.480 --> 00:09:53.640 align:center
[ఉల్లాసభరితమైన సంగీతం]

00:09:54.520 --> 00:09:56.160 align:center
నమస్తే, సర్పంచ్ గారు.

00:09:56.240 --> 00:09:58.240 align:center
నమస్తే, నమస్తే.

00:09:58.320 --> 00:09:59.840 align:center
మీరేనా అభిషేక్ గారు?

00:10:01.160 --> 00:10:02.840 align:center
-అవును.
-మంచిది, మంచిది.

00:10:02.920 --> 00:10:04.360 align:center
నన్ను చేతులు కడుక్కోనివ్వండి.

00:10:04.440 --> 00:10:05.840 align:center
వికాస్, నాకు కొంచెం సాయం చెయ్యి.

00:10:07.000 --> 00:10:12.720 align:center
[బ్రిజ్ కూనిరాగం]

00:10:12.800 --> 00:10:15.200 align:center
హుమ్. నేను పొలం వైపు వెళ్ళాను.

00:10:15.480 --> 00:10:16.480 align:center
ఆహ్.

00:10:16.560 --> 00:10:17.800 align:center
పని ఎలా జరుగుతుందో చూద్దామని.

00:10:18.120 --> 00:10:20.520 align:center
ఇంకా పనిలో పని ఇది కూడా అయిపోతుందని
అనిపించింది.

00:10:20.600 --> 00:10:21.640 align:center
[బ్రిజ్] ఇంక అయిపోయింది.

00:10:22.320 --> 00:10:24.600 align:center
మా ఇంట్లో మరుగుదొడ్డి లేదనుకోవద్దు.

00:10:24.680 --> 00:10:26.000 align:center
మా ఇంట్లో రెండు మరుగుదొడ్లు ఉన్నాయి.

00:10:26.360 --> 00:10:27.920 align:center
కానీ విషయం ఏమిటంటే,

00:10:28.240 --> 00:10:30.840 align:center
పొలం వైపు వెళితే వ్యాయామం అవుతుంది,

00:10:30.920 --> 00:10:32.600 align:center
ఇంకా జీర్ణ ప్రక్రియకు కూడా మంచిది.

00:10:33.240 --> 00:10:35.040 align:center
మీరు ఎప్పుడైనా పొలం వెళ్ళారా?

00:10:35.800 --> 00:10:37.200 align:center
లేదు, నేను...

00:10:37.640 --> 00:10:39.120 align:center
ఇంతకుముందెన్నడూ నేను గ్రామంలో ఉండలేదు.

00:10:39.520 --> 00:10:43.120 align:center
మీరు ఉండలేదా? అయితే నేను మీకు
ఊరంతా తిప్పి చూపిస్తాను.

00:10:43.200 --> 00:10:44.200 align:center
-[ప్రహ్లాద్] సర్పంచ్ గారు.
-ఊ?

00:10:44.280 --> 00:10:46.000 align:center
ఈయనకు రోజంతా పడుతుంది.

00:10:46.080 --> 00:10:47.840 align:center
అవును, పడుతుంది మరి.

00:10:47.920 --> 00:10:49.160 align:center
నేను అంత సులువుగా వదిలిపెట్టను.

00:10:49.240 --> 00:10:51.960 align:center
ఇక్కడికి వచ్చాక,
మనం పూర్తి ప్రయోజనం పొందాలి కదా.

00:10:52.800 --> 00:10:54.480 align:center
నేను నిన్ను కూడా తీసుకెళతాను.

00:10:54.560 --> 00:10:57.800 align:center
-నువ్వు బాగా బరువు పెరిగావు.
-[వికాస్] ఇక్కడినుంచే తీసుకెళ్ళండి.

00:10:57.880 --> 00:10:59.240 align:center
ఇప్పుడు చేతులు కలపండి.

00:11:00.360 --> 00:11:01.360 align:center
రండి.

00:11:02.120 --> 00:11:03.120 align:center
ఇదేమిటి?

00:11:03.720 --> 00:11:06.040 align:center
రెండు స్వీట్లే తిన్నారా? హా?

00:11:08.160 --> 00:11:09.600 align:center
మీకు స్వీట్లు ఇష్టం లేదా?

00:11:09.880 --> 00:11:12.160 align:center
-ఏమిటి?
-నాకు అవంటే ప్రాణం.

00:11:12.520 --> 00:11:13.840 align:center
ఏమిటంటే, నేను బీడీ, సిగరెట్ కాల్చను.

00:11:13.920 --> 00:11:16.400 align:center
అందుకే నాకు తినాలి అనిపించినప్పుడల్లా
ఒకటి నోట్లో వేసుకుంటాను.

00:11:16.840 --> 00:11:19.640 align:center
సర్పంచ్ గారు, తాళంచెవి ఇవ్వండి.
సామాను లోపల పెడతాము.

00:11:19.720 --> 00:11:20.720 align:center
ఓ, అవును, తాళంచెవి.

00:11:20.800 --> 00:11:22.480 align:center
వికాస్ తాళంచెవి తీసుకో.

00:11:23.840 --> 00:11:26.920 align:center
తాళంచెవి తీయమన్నాను,జేబులో చెంబు
దూర్చమనలేదు. అది అక్కడ పెట్టు.

00:11:29.080 --> 00:11:30.240 align:center
అదెక్కడ ఉంది? ఇక్కడ లేదు.

00:11:30.320 --> 00:11:32.120 align:center
అప్పుడు అది ఇందులో ఉండి ఉంటుంది.
ఇక్కడ చూడు.

00:11:32.960 --> 00:11:34.120 align:center
తియ్యి.

00:11:36.800 --> 00:11:37.800 align:center
మొబైల్.

00:11:37.880 --> 00:11:40.520 align:center
దాన్ని అక్కడ పెట్టుకోకు.

00:11:42.360 --> 00:11:44.200 align:center
లేదు, అది ఇందులో కూడా లేదు.

00:11:44.920 --> 00:11:45.920 align:center
ఇది పట్టుకో.

00:11:48.600 --> 00:11:49.760 align:center
[బ్రిజ్] తాళంచెవి ఏమయింది?

00:11:51.200 --> 00:11:52.360 align:center
చేతి పంపు దగ్గర చూడు.

00:11:52.440 --> 00:11:53.440 align:center
పరిగెత్తు!

00:11:58.280 --> 00:11:59.680 align:center
అది చేతి పంపు దగ్గర కూడా లేదు.

00:12:00.640 --> 00:12:01.720 align:center
[ప్రహ్లాద్] దాన్ని పోగొట్టారా?

00:12:03.600 --> 00:12:05.800 align:center
[ఖంగారు కలిగించే సంగీతం]

00:12:13.680 --> 00:12:18.800 align:center
[బ్రిజ్] ఆ ప్రహ్లాద్ కి రెండు అడుగులు
వేయాలంటేనే ఆయాసం వస్తుంది.

00:12:19.000 --> 00:12:21.800 align:center
[వికాస్] మీరు పొలంలో పడేసి ఉంటారు.

00:12:21.880 --> 00:12:23.200 align:center
అది ఏ పొలం?

00:12:23.280 --> 00:12:26.160 align:center
అక్కడ ఉన్న, నీ పొలాల్లో ఒకటి.

00:12:26.240 --> 00:12:28.200 align:center
అప్పుడు అక్కడే పడిపోయి ఉంటుంది.

00:12:32.200 --> 00:12:34.480 align:center
[బ్రిజ్] అందరూ జాగ్రత్తగా
క్రింద చూస్తూ నడవండి.

00:12:34.560 --> 00:12:36.320 align:center
నేను దాన్ని దారిలోనే ఎక్కడో పడేసి ఉంటాను.

00:12:36.400 --> 00:12:37.480 align:center
అలాగే, సర్పంచ్ గారు.

00:12:40.240 --> 00:12:42.560 align:center
ఇంత పెద్ద రంధ్రాలు ఉన్నాయి.

00:12:42.800 --> 00:12:45.640 align:center
ఒకవేళ నేను ఈ రంధ్రాల్లో పడేసి ఉంటానా?
లేదు, ఇందులో పడే అవకాశం లేదు.

00:12:46.400 --> 00:12:47.760 align:center
[బ్రిజ్] సెక్రెటరీ గారు.

00:12:48.600 --> 00:12:50.800 align:center
ఆ కనిపిస్తున్న పొలం చూడండి.

00:12:51.560 --> 00:12:53.640 align:center
అది కూడా మాదే.

00:12:53.720 --> 00:12:54.840 align:center
అక్కడ.

00:12:56.400 --> 00:12:59.400 align:center
రండి, నేను మీకు ఇంకా చూపిస్తాను.

00:13:00.560 --> 00:13:02.360 align:center
నేను ఇటువైపు వెళ్ళాను.

00:13:05.360 --> 00:13:08.000 align:center
ఇది వికాస్ వాళ్ళ బాబాయ్ పొలం.

00:13:08.240 --> 00:13:09.320 align:center
అవును.

00:13:10.680 --> 00:13:13.560 align:center
పాపం కూతురి పెళ్లి కోసం ఈ పొలం అమ్మాడు.

00:13:14.920 --> 00:13:15.920 align:center
ఓ, అవునా?

00:13:16.880 --> 00:13:18.480 align:center
మరియు దాన్ని నేనే కొన్నాను.

00:13:18.560 --> 00:13:21.360 align:center
[చమత్కారమైన సంగీతం]

00:13:22.720 --> 00:13:24.360 align:center
[అభిషేక్] ఇంకా ఎంత దూరం సర్పంచ్ గారు?

00:13:24.440 --> 00:13:26.800 align:center
[బ్రిజ్] ఇదిగో వచ్చేసింది, దగ్గరలోనే ఉంది.

00:13:26.880 --> 00:13:31.760 align:center
సెక్రెటరీ గారు. అదిగో కనిపించే
ఆ పొలం కూడా మాదే.

00:13:32.720 --> 00:13:35.360 align:center
నీళ్ళు చిందుతాయి, జాగ్రత్త.

00:13:35.440 --> 00:13:38.000 align:center
[బ్రిజ్] చెవిలోకి వెళితే తీయడం కష్టం.

00:13:38.080 --> 00:13:41.240 align:center
దీన్ దయాళ్ చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిన
ప్రమాదంలో అతనికి చెవుడు వచ్చింది.

00:13:41.320 --> 00:13:43.960 align:center
అయినప్పటికీ, అతని ఒక చెవి పనిచేస్తుంది.

00:13:45.960 --> 00:13:47.840 align:center
ఈ పొలం ఎవరిది?

00:13:49.960 --> 00:13:50.960 align:center
[బ్రిజ్] ఎందుకు?

00:13:53.640 --> 00:13:54.800 align:center
ఊరికే అడిగాను.

00:13:55.320 --> 00:13:58.320 align:center
కోర్ట్ కూడా ఆ విషయం చెప్పలేకపోయింది.
నేనెలా చెప్పగలను?

00:13:58.720 --> 00:14:00.440 align:center
ఇద్దరు అన్నదమ్ములకు చెందినది.

00:14:00.520 --> 00:14:02.520 align:center
పొలం విషయంగా వారి మధ్య గొడవ జరుగుతూ ఉంది.

00:14:02.920 --> 00:14:05.080 align:center
ఇద్దరి మధ్యన రక్తపాతం కూడా జరిగింది.

00:14:05.400 --> 00:14:07.120 align:center
ఇంకా వారిలో ఒకరికి తలకాయ కూడా పగిలింది.

00:14:07.200 --> 00:14:08.440 align:center
[బ్రిజ్] పందొమ్మిది కుట్లు పడ్డాయి.

00:14:08.520 --> 00:14:10.160 align:center
అతన్ని సమయానికి ఆసుపత్రి తీసుకెళ్లాము,

00:14:10.240 --> 00:14:12.840 align:center
లేకపోతే, ఈరోజు ఈ పొలం అతని సోదరుడిది
అయిపోయి ఉండేది. ఆ.

00:14:12.920 --> 00:14:13.920 align:center
పదండి వెళదాం.

00:14:14.280 --> 00:14:16.880 align:center
[బ్రిజ్] ఈ పొలం గొడవల్లో పడవద్దు.

00:14:16.960 --> 00:14:18.840 align:center
తాళంచెవి కోసం వెతకండి చాలు.

00:14:19.080 --> 00:14:22.000 align:center
ఎందుకంటే పంచాయితీ కార్యాలయం తెరవకపోతే,

00:14:22.080 --> 00:14:25.320 align:center
అప్పుడు మీతో పాటు నేను కూడా
సమస్యల్లో చిక్కుకుంటాను.

00:14:25.520 --> 00:14:26.960 align:center
త్వరగా నడవండి.

00:14:27.240 --> 00:14:29.320 align:center
ఇక్కడ ఒక విష సర్పం కనిపించింది.

00:14:30.680 --> 00:14:31.880 align:center
[బ్రిజ్] సెక్రెటరీ గారు.

00:14:32.440 --> 00:14:35.480 align:center
మీకు కనిపించే ఆ నీటి కుంటలను,

00:14:36.080 --> 00:14:39.480 align:center
మన పంచాయితీ కార్యాలయమే తవ్వించింది.

00:14:40.480 --> 00:14:44.640 align:center
రాబోయే ఎన్నికల్లో మేము ఈ విషయాన్ని
చూపి ఓట్లు అడుగుతాము.

00:14:44.720 --> 00:14:46.600 align:center
-[వికాస్] ఈ విషయం లేవనెత్తుతాము.
-[బ్రిజ్] అవును, రండి.

00:14:46.680 --> 00:14:48.480 align:center
[అభిషేక్] ఇంకా ఎంత దూరం సర్పంచ్ గారు?

00:14:48.560 --> 00:14:51.360 align:center
[బ్రిజ్] నడుస్తూ ఉండండి.
దాదాపుగా వచ్చేశాం.

00:14:53.720 --> 00:14:55.680 align:center
[అభిషేక్] ఆయన పొలం అంతా
ఎందుకు వెతుకుతున్నారు?

00:14:56.280 --> 00:14:58.000 align:center
ఆయన చాలా చోట్ల కూర్చుని ఉంటారు.

00:15:02.160 --> 00:15:05.320 align:center
అది ఏమిటంటే సార్, చెంబు తీసుకుని
ఒక చోట కూర్చుంటే,

00:15:05.880 --> 00:15:08.720 align:center
-కొంచెం కొంచెంగా, దాని ఎత్తు పెరుగుతుంది.
-ఆపు. ఆపు.

00:15:10.000 --> 00:15:11.320 align:center
[అభిషేక్] సర్పంచ్ గారు దొరికిందా?

00:15:11.600 --> 00:15:13.560 align:center
ఇంకా లేదు.

00:15:14.080 --> 00:15:15.600 align:center
ఇక్కడే ఎక్కడో ఉంటుంది.

00:15:18.720 --> 00:15:20.760 align:center
[మృదువైన సంగీతం]

00:15:26.320 --> 00:15:27.400 align:center
మీరు దాన్ని పోగొట్టరా?

00:15:30.200 --> 00:15:32.240 align:center
మీ మొలతాడుకు కట్టుకుంటే
పోవడం కాకుండా ఇంకేమి అవుతుంది?

00:15:33.920 --> 00:15:36.120 align:center
లే. పైకి లే!

00:15:36.440 --> 00:15:38.160 align:center
[బ్రిజ్] వెళ్ళి అక్కడ కూర్చో.

00:15:38.560 --> 00:15:39.680 align:center
నాకు ఊపిరి అందడం లేదు.

00:15:39.760 --> 00:15:41.800 align:center
[బ్రిజ్] తాళం వెతకడం కోసం వెళ్లింది
నేనైతే, నీకు ఊపిరాడడం లేదు.

00:15:42.720 --> 00:15:44.600 align:center
పడుకున్నప్పుడు కూడా నీకు ఊపిరాడడం లేదు.

00:15:46.960 --> 00:15:48.240 align:center
-వికాస్.
-ఆ ఏమిటి?

00:15:48.320 --> 00:15:53.240 align:center
త్వరగా మార్కెట్ కి వెళ్ళి తాళాలు
తీసే వాడిని తీసుకునిరా.

00:15:54.160 --> 00:15:56.960 align:center
సర్పంచ్ గారు, కానీ నేను పదిహేను
కిలోమీటర్లు ఎలా పరిగెత్తగలను?

00:15:57.040 --> 00:15:58.520 align:center
సెక్రెటరీ గారి మోటర్ సైకిల్ తీసుకెళ్లు.

00:15:58.600 --> 00:15:59.800 align:center
తాళాలు ఇవ్వండి, సార్.

00:16:00.880 --> 00:16:02.120 align:center
అతనికి తాళాలు ఇవ్వండి.

00:16:06.400 --> 00:16:07.520 align:center
ఎంత సమయం పడుతుంది?

00:16:07.600 --> 00:16:09.560 align:center
మామూలుగా రాను పోను ఒక గంట పడుతుంది.

00:16:09.880 --> 00:16:13.480 align:center
తాళాలు తీసే వాళ్ళు సాదారణంగా
మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటారు.

00:16:13.560 --> 00:16:16.360 align:center
కాబట్టి గంటకు పైగా పట్టవచ్చు.

00:16:16.440 --> 00:16:18.880 align:center
[చమత్కారమైన సంగీతం]

00:16:19.320 --> 00:16:20.800 align:center
మనం తాళం పగలగొడదాం, సర్పంచ్ గారు.

00:16:21.640 --> 00:16:22.640 align:center
ఏమిటి?

00:16:23.080 --> 00:16:24.800 align:center
లేదు, తాళం పగలగొట్టడం కుదరదు.

00:16:25.080 --> 00:16:26.160 align:center
ఎందుకు?

00:16:26.600 --> 00:16:30.560 align:center
తాళం ఆయన భార్య మంజు దేవిది.

00:16:30.640 --> 00:16:31.840 align:center
అది ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చారు.

00:16:32.640 --> 00:16:33.720 align:center
మనం దాన్ని పగలగొడితే...

00:16:34.680 --> 00:16:36.200 align:center
లేదు, దాన్ని పగలగొట్టడం కుదరదు.

00:16:36.760 --> 00:16:38.440 align:center
కొత్తది కొంటే సమస్య ఏముంటుంది?

00:16:38.520 --> 00:16:41.360 align:center
నా సమస్య అర్థంచేసుకోండి.
పగలగొట్టడం సాధ్యం కాదు.

00:16:42.280 --> 00:16:44.320 align:center
నాకు తాళాలు ఇవ్వండి.

00:16:44.400 --> 00:16:45.600 align:center
అతనికి తాళాలు ఇవ్వండి.

00:16:52.800 --> 00:16:54.320 align:center
-త్వరగా వెళ్ళి, త్వరగా రా.
-[వికాస్] హా.

00:16:57.760 --> 00:16:58.880 align:center
ఎలా నడపాలో నీకు తెలుసా?

00:16:59.240 --> 00:17:00.520 align:center
గేర్లు ఎటు వైపు ఉంటాయి?

00:17:00.920 --> 00:17:02.840 align:center
-అన్నీ వెనక్కి.
-అన్నీ వెనక్కి, సరే.

00:17:03.360 --> 00:17:04.800 align:center
దేవుని దయ.

00:17:06.720 --> 00:17:08.760 align:center
[బండి ఇంజిన్ శబ్ధం]

00:17:15.200 --> 00:17:16.560 align:center
[బ్రిజ్] త్వరగా వెళ్ళిరా!

00:17:17.480 --> 00:17:19.440 align:center
-[హఠాత్తుగా పెరిగిన బండి ఇంజిన్ శబ్ధం]
-[ప్రహ్లాద్] జాగ్రత్త.

00:17:30.080 --> 00:17:32.560 align:center
అతను త్వరగా వచ్చేస్తాడు. దిగులుపడవద్దు.

00:17:32.640 --> 00:17:34.120 align:center
నేను దిగులుపడడం లేదు.

00:17:34.200 --> 00:17:35.680 align:center
అవును, మీరు కొంచెం దిగాలుగా ఉన్నారు.

00:17:37.200 --> 00:17:39.640 align:center
వికాస్ తిరిగి వచ్చేవరకు,
మీరు ఊరు చూసిరావచ్చు.

00:17:39.880 --> 00:17:41.920 align:center
ఇది అద్భుతమైన ఊరు, అందమైన పరిసరాలు.

00:17:42.000 --> 00:17:43.160 align:center
అక్కడ బావి ఉంది.

00:17:43.240 --> 00:17:44.840 align:center
[బ్రిజ్] ఇంకా అందమైన ఇళ్ళు ఉన్నాయి.

00:17:44.920 --> 00:17:47.040 align:center
పట్వారీ ఈ మధ్యనే క్రొత్త ఇల్లు కట్టాడు.
అది చూడండి.

00:17:48.920 --> 00:17:50.240 align:center
[ప్రహ్లాద్] ఆ నీటి ట్యాంక్ చూశారా?

00:17:50.480 --> 00:17:52.600 align:center
అక్కడి నుండి గ్రామం చూడటానికి
ఎంత అద్భుతంగా ఉంటుందంటే

00:17:52.680 --> 00:17:54.480 align:center
మీకు ఈ ఊరంటే ప్రేమ పుడుతుంది.

00:17:54.840 --> 00:17:56.480 align:center
దేవుడి మీద ఒట్టు. ఇప్పుడు చూస్తారా?

00:17:57.080 --> 00:17:59.040 align:center
-ఎక్కుతారా?
-[అభిషేక్] ఇప్పుడే ఎక్కాలా?

00:17:59.120 --> 00:18:03.280 align:center
[సెల్ ఫోన్ మోగుతున్న శబ్ధం]

00:18:03.800 --> 00:18:05.000 align:center
భార్య ఫోన్ చేస్తుంది

00:18:10.400 --> 00:18:11.440 align:center
హలో.

00:18:13.200 --> 00:18:14.200 align:center
చెప్పు.

00:18:15.600 --> 00:18:19.320 align:center
తాళంచెవి కనిపించడం లేదని
నీకు ఎవరు చెప్పారు?

00:18:20.920 --> 00:18:22.320 align:center
హలో.

00:18:24.120 --> 00:18:25.120 align:center
ప్రహ్లాద్.

00:18:26.120 --> 00:18:27.720 align:center
ఇంటికి వెళ్ళి ఒక కప్పు టీ తాగుదాం పద.

00:18:27.800 --> 00:18:31.040 align:center
నన్ను వదిలేయండి. నేను మా ఇంటికి వెళ్ళి
ప్రశాంతంగా ఒక కప్పు టీ తాగుతాను.

00:18:31.640 --> 00:18:33.640 align:center
[చమత్కారమైన సంగీతం]

00:18:34.560 --> 00:18:36.720 align:center
[దంచుతున్న శబ్ధం]

00:18:44.160 --> 00:18:47.400 align:center
తాళంచెవిని మీ మొలతాడుకు కట్టుకోమని
ఎన్నిసార్లు చెప్పాను?

00:18:47.480 --> 00:18:49.840 align:center
మొలతాడుకు కట్టుకోమని. కానీ కట్టుకోరు.

00:18:49.920 --> 00:18:51.440 align:center
[మంజు] మీకు ఫ్యాషన్ కావాలి.

00:18:51.520 --> 00:18:53.320 align:center
తాళంచెవి జేబులో పెట్టుకుంటారు.

00:18:53.680 --> 00:18:54.960 align:center
ఇప్పుడు పెట్టుకోండి జేబులో.

00:18:56.160 --> 00:18:57.720 align:center
-[దంచుతున్న శబ్ధం]
-[కోడి కూసిన శబ్ధం]

00:18:59.400 --> 00:19:01.400 align:center
తాళాలు బాగు చేసేవాడిని తీసుకురమ్మని
వికాస్ ని పంపాను.

00:19:01.720 --> 00:19:03.200 align:center
తాళం పగలగొట్టవలసిన అవసరం లేదు.

00:19:03.280 --> 00:19:05.600 align:center
పగలగొట్టనివ్వను కూడా.

00:19:06.040 --> 00:19:07.480 align:center
[మంజు దగ్గి, గొంతు సవరించుకున్న శబ్ధం]

00:19:07.680 --> 00:19:09.160 align:center
[దంచుతున్న శబ్ధం]

00:19:13.840 --> 00:19:15.120 align:center
విను.

00:19:15.880 --> 00:19:19.520 align:center
సెక్రెటరీని రాత్రికి భోజనానికి
పిలుద్దామని అనుకుంటున్నాను.

00:19:19.880 --> 00:19:21.960 align:center
[చమత్కారమైన సంగీతం]

00:19:22.040 --> 00:19:23.160 align:center
ఆ, తప్పకుండా పిలవండి.

00:19:23.840 --> 00:19:27.680 align:center
సెక్రెటరీని, ఆ తరువాత ప్రహ్లాద్,
ఇంకా వికాస్ ని పిలవండి.

00:19:27.760 --> 00:19:30.240 align:center
ఇంకా దారిలో మీకు కనిపించిన
మరో ముగ్గురు నలుగురిని పిలవండి.

00:19:30.320 --> 00:19:31.520 align:center
మనం ఒక విందు ఏర్పాటు చేద్దాం.

00:19:31.600 --> 00:19:33.080 align:center
[బ్రిజ్] అరే నువ్వు మరీను.

00:19:33.440 --> 00:19:35.760 align:center
ఆ విధంగా నువ్వు కూడా అతన్ని కలవవచ్చు.

00:19:35.840 --> 00:19:37.240 align:center
అతన్ని కలిసి నేనేమి చేయాలి?

00:19:37.520 --> 00:19:38.560 align:center
అరే?

00:19:39.080 --> 00:19:40.440 align:center
నువ్వు ఈ గ్రామానికి సర్పంచ్వి.

00:19:40.520 --> 00:19:42.040 align:center
[బ్రిజ్] పదే పదే
ఆ విషయం ఎందుకు మర్చిపోతావు?

00:19:42.120 --> 00:19:43.680 align:center
నేను సర్పంచ్ని కాను.

00:19:44.880 --> 00:19:47.120 align:center
[దంచుతున్న శబ్ధం]

00:19:48.560 --> 00:19:50.880 align:center
పాపం ఆకలిగా ఉండి ఉంటుంది.
పొద్దున నుండి ఏమీ తినలేదు

00:19:50.960 --> 00:19:52.240 align:center
రెండు స్వీటు ముక్కలు తప్పించి.

00:19:52.800 --> 00:19:54.880 align:center
[మంజు] అతను ఉదయం నుండి ఏమీ
తినకపోతే నేనేమి చేయను?

00:19:54.960 --> 00:19:56.480 align:center
దానికి నేను బాధ్యురాలిని కాను.

00:19:57.000 --> 00:19:58.000 align:center
తినిపించడం, తాగించడం.

00:20:01.240 --> 00:20:03.240 align:center
[మృదువైన సంగీతం]

00:20:22.520 --> 00:20:24.720 align:center
-[మేక అరిచిన శబ్ధం]
-[కోడి కూసిన శబ్ధం]

00:20:32.240 --> 00:20:35.760 align:center
దగ్గర్లో బిస్కెట్లు వంటివి దొరికే కొట్టు
ఏదైనా ఉందా?

00:20:37.120 --> 00:20:38.400 align:center
మీరు ఎవరి తరుపు?

00:20:38.480 --> 00:20:40.120 align:center
పంచాయితీ. నేను క్రొత్తగా
వచ్చిన సెక్రెటరీని.

00:20:40.640 --> 00:20:42.280 align:center
ఈ సందులోకి తిరిగి నేరుగా వెళ్ళండి.

00:20:42.360 --> 00:20:43.440 align:center
-ఇటు వైపా?
-అవును.

00:20:44.760 --> 00:20:46.480 align:center
-ఎంత దూరం?
-ఇక్కడే పక్కనే.

00:20:48.800 --> 00:20:51.120 align:center
నేను పది రూపాయల నూనె అమ్మలేను.

00:20:51.200 --> 00:20:53.080 align:center
మీరు కనీసం ముప్పై రూపాయలకు కొనాలి.

00:20:53.160 --> 00:20:56.320 align:center
కానీ ఇప్పుడు నేను ముప్పై రూపాయలు
ఎక్కడి నుండి తీసుకురావాలి?

00:20:56.400 --> 00:20:59.080 align:center
అప్పుడు బదులుగా మీరు ఒక కిలో ధాన్యం ఇచ్చి
పావు లీటర్ నూనె తీసుకెళ్ళండి.

00:21:00.200 --> 00:21:01.920 align:center
నా దగ్గర ధాన్యం కూడా లేదు.

00:21:02.360 --> 00:21:03.720 align:center
[అభిషేక్] క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు.

00:21:06.240 --> 00:21:07.800 align:center
మీరు ఎవరి తరుపు?

00:21:08.200 --> 00:21:09.440 align:center
నేను పంచాయితీ క్రొత్త సెక్రెటరీని.

00:21:11.240 --> 00:21:14.520 align:center
అయ్యా, మీరు క్రొత్తగా వచ్చిన
పంచాయితీ సెక్రెటరీనా?

00:21:14.840 --> 00:21:15.880 align:center
అవును.

00:21:17.440 --> 00:21:20.920 align:center
పంచాయితీ నాకు ఐదొందల ఇరవై ఐదు
రూపాయిలు బకాయి ఉంది.

00:21:21.320 --> 00:21:25.880 align:center
క్రొత్తగా వచ్చే సెక్రెటరీ బకాయిలు
అన్నీ చెల్లిస్తారని సర్పంచ్ చెప్పారు.

00:21:27.240 --> 00:21:28.320 align:center
బకాయి ఎందుకు ఉంది?

00:21:28.400 --> 00:21:31.640 align:center
మంగరీకా క్రింద సాగుబడి కాలువల తవ్వినందుకు.

00:21:32.480 --> 00:21:36.320 align:center
మహిందర్ గారి పొలం నుండి
నగీనా గారి పొలం వరకు.

00:21:36.600 --> 00:21:38.440 align:center
నేను మూడు రోజుల పాటు కూలీగా పని చేశానండి.

00:21:39.320 --> 00:21:41.920 align:center
ఇప్పుడు కార్యాలయం మూసివేసి ఉంది.
కార్యాలయం తెరిచాక వచ్చి నన్ను కలవండి.

00:21:42.000 --> 00:21:43.240 align:center
[ముసలాయన] అయ్యా, అయ్యా!

00:21:45.040 --> 00:21:46.640 align:center
మా ఇంట్లో వంట నూనె అయిపోయింది.

00:21:47.160 --> 00:21:48.440 align:center
ఇంకా డబ్బు కూడా లేదు.

00:21:49.800 --> 00:21:52.640 align:center
గత నాలుగు రోజులుగా,
మేము నూనె లేకుండా వంట చేసుకుంటున్నాము.

00:21:52.720 --> 00:21:55.600 align:center
బాబాయ్, నూనె కొని ఏమి చేస్తారు?

00:21:55.680 --> 00:21:57.840 align:center
డబ్బున్న వాళ్ళు నూనె తినడం తగ్గిస్తుంటే,

00:21:57.920 --> 00:21:59.680 align:center
-నువ్వు నూనె కావాలంటున్నావు.
-చిల్లర తిరిగి ఇవ్వండి.

00:21:59.760 --> 00:22:03.640 align:center
నేను తినగలను, కానీ పిల్లలు తినరు.

00:22:04.720 --> 00:22:05.920 align:center
నేను పేదవాడిని.

00:22:06.640 --> 00:22:07.720 align:center
నాకు సాయం చేయండి.

00:22:08.400 --> 00:22:10.560 align:center
నేను చెప్పినట్లుగా,
రేపు కార్యాలయం తెరిచాక వచ్చి నన్ను కలవండి.

00:22:10.640 --> 00:22:12.440 align:center
-[తల తగిలిన శబ్ధం]
-[షాపువాడు] జాగ్రత్త.

00:22:13.960 --> 00:22:15.920 align:center
[నిరుత్సాహకరమైన సంగీతం]

00:22:24.800 --> 00:22:26.880 align:center
[బండి వస్తున్న శబ్ధం]

00:22:35.240 --> 00:22:36.920 align:center
-[ఇంజిన్ ఆగిపోయిన శబ్ధం]
-తాళాలు తీసే వ్యక్తి ఎక్కడ?

00:22:39.080 --> 00:22:40.600 align:center
అరే ఈ ఇండికేటర్ ఎలా విరిగిపోయింది?

00:22:41.520 --> 00:22:42.520 align:center
హా?

00:22:43.520 --> 00:22:44.920 align:center
సార్, ముందు నేను ఏ విషయం చెప్పాలి?

00:22:45.000 --> 00:22:46.840 align:center
తాళాలవాడి గురించా
లేదా ఇండికేటర్ ఎలా విరిగిందనా?

00:22:50.560 --> 00:22:51.720 align:center
తాళాలు బాగుచేసే వాడు ఎక్కడ?

00:22:51.800 --> 00:22:55.120 align:center
నేను తాళాలు బాగు చేసేవాడిని తీసుకొస్తుంటే
అకస్మాత్తుగా అతని ఫోన్ మోగింది.

00:22:55.200 --> 00:22:59.440 align:center
అతని భార్య గర్భంతో ఉంది,
ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి.

00:22:59.840 --> 00:23:02.280 align:center
మానవతా దృక్పధం దృష్ట్యా, నేను
మోటార్ సైకిల్ వెనక్కి తిప్పవలసొచ్చింది.

00:23:02.360 --> 00:23:05.160 align:center
అది అత్యవసర పరిస్థితి కావడంతో,
నేను బండి వేగంగా నడుపుతున్నాను.

00:23:05.400 --> 00:23:08.520 align:center
కానీ అకస్మాత్తుగా, ఎక్కడి నుండో
ఒక గేదె వచ్చింది.

00:23:08.880 --> 00:23:11.280 align:center
నేను బ్రేక్ వేసే లోగా బండి గేదెను ఢీకొంది.

00:23:12.280 --> 00:23:16.680 align:center
నాకేమీ కాలేదు, కానీ తాళాలు బాగుచేసే వాడు
మరియు ఆయన భార్య ఒకే ఆసుపత్రిలో చేరారు.

00:23:18.600 --> 00:23:21.000 align:center
అభిసేక్ సార్, కంగారుపడకండి.
నేను ఏదో ఒకటి చేస్తాను.

00:23:21.080 --> 00:23:22.760 align:center
ముందుగా, నా పేరు అభిషేక్.

00:23:22.840 --> 00:23:25.080 align:center
అభిసేక్ కాదు. అభిసేక్ అభిసేక్ అంటూ...

00:23:27.120 --> 00:23:29.080 align:center
ఇంకా చేయడానికి ఏమీ లేదు.
తాళం పగలగొట్టాలి అంతే.

00:23:30.000 --> 00:23:31.040 align:center
అభిసేక్ సార్.

00:23:31.760 --> 00:23:33.800 align:center
-అభిషేక్!
-[వికాస్] అవును.

00:23:34.480 --> 00:23:35.960 align:center
అభిషేక్ సార్, తాళం పగలగొట్టడం సాధ్యం కాదు.

00:23:37.240 --> 00:23:39.040 align:center
సర్పంచ్ కి ఫోన్ చెయ్యి.
మనం తాళం పగలగొట్టాలి.

00:23:39.120 --> 00:23:40.800 align:center
[తాళం కదిలించిన శబ్ధం]

00:23:42.360 --> 00:23:44.600 align:center
సర్పంచ్ గారికి ఫోన్ చెయ్యి.
మనం తాళం పగలగొట్టాలి.

00:23:44.680 --> 00:23:46.200 align:center
[అభిషేక్] ఒక సుత్తి లేదా
ఇంకేదైనా తీసుకురా.

00:23:46.280 --> 00:23:48.400 align:center
[ఆందోళనకరమైన సంగీతం]

00:23:49.720 --> 00:23:51.800 align:center
సర్పంచ్ గారు, నమస్తే.

00:23:52.240 --> 00:23:55.120 align:center
నేను తాళాలు బాగుచేసే వాడిని తీసుకొస్తుంటే
అకస్మాత్తుగా అతని ఫోన్ మోగింది.

00:23:55.200 --> 00:23:57.160 align:center
విషయానికి రా. నేరుగా విషయం చెప్పు.

00:23:59.920 --> 00:24:01.880 align:center
తాళాలు బాగుచేసే వ్యక్తి కనీసం
మరో రెండు రోజులు రాలేడు.

00:24:01.960 --> 00:24:03.240 align:center
మనం తాళం పగలగొట్టాలి.

00:24:03.320 --> 00:24:05.720 align:center
ఏది ఏమైనా తాళం పగలగొట్టడానికి వీల్లేదు.

00:24:05.800 --> 00:24:08.920 align:center
మనం తాళం పగలగొట్టక పోతే,
కార్యాలయం తెరవడం సాధ్యం కాదు.

00:24:09.000 --> 00:24:10.320 align:center
అప్పుడు అది మూసే ఉండనివ్వండి.

00:24:10.400 --> 00:24:13.120 align:center
ఎలాగూ, అక్కడ పెద్దగా జరగాల్సిన
పనులు ఏమీ లేవు.

00:24:13.200 --> 00:24:16.200 align:center
నిజమే, కానీ అప్పటివరకూ
సెక్రెటరీ ఎక్కడ ఉంటారు?

00:24:16.280 --> 00:24:17.920 align:center
అతను ఎక్కడ ఉంటే నాకేమిటి?

00:24:18.000 --> 00:24:19.640 align:center
అతన్ని మన ఇంట్లో ఉండనిద్దామా?

00:24:20.960 --> 00:24:22.240 align:center
మనకు ఒక కూతురు ఉంది.

00:24:22.600 --> 00:24:24.680 align:center
ఇంకా ఒక అపరిచిత వ్యక్తిని మన ఇంట్లో
ఉంచుకుందామా?

00:24:24.760 --> 00:24:27.640 align:center
అతను అపరిచితుడు కాడు. అతను సెక్రెటరీ.

00:24:27.720 --> 00:24:30.200 align:center
ఇంకా మంచి విషయం ఏమిటంటే,
అతను మన కులం వాడు.

00:24:30.280 --> 00:24:32.160 align:center
అప్పుడు మన అమ్మాయిని
అతనికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా?

00:24:32.240 --> 00:24:34.520 align:center
వద్దు, అతని జీతం చాలా తక్కువ.

00:24:35.880 --> 00:24:37.680 align:center
[నిట్టూర్పు]

00:24:38.360 --> 00:24:39.680 align:center
-[మంజు] ఛా.
-[బ్రిజ్] ఏమయింది?

00:24:39.960 --> 00:24:41.600 align:center
నువ్వు రాకెట్ లా వేగంగా వెళ్లిపోతావు.

00:24:41.680 --> 00:24:46.440 align:center
చూడు, నేను తాళం పోగొట్టాను.

00:24:46.520 --> 00:24:49.080 align:center
కాబట్టి నేను అతను ఉండడానికి
చోటు ఏర్పాటు చేయాలి.

00:24:49.160 --> 00:24:51.800 align:center
మనం పింకీ ఇంకా అతను
ఎదురుపడకుండా చూసుకుందాం.

00:24:51.880 --> 00:24:55.240 align:center
మనం అతనికి ఒక దిండు ఇస్తే
పెరట్లో పడుకుంటాడు.

00:24:55.960 --> 00:24:58.400 align:center
[మృదువైన సంగీతం]

00:25:01.160 --> 00:25:04.520 align:center
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం,
మీరు మొదటసారి మా ఇంటికి వచ్చినప్పుడు,

00:25:04.600 --> 00:25:06.760 align:center
మీరు కూడా పెరట్లోనే పడుకున్నారు.

00:25:09.120 --> 00:25:10.360 align:center
[మంజు] అతను ఇక్కడ ఉండడం సాధ్యం కాదు.

00:25:10.440 --> 00:25:11.880 align:center
మీరు తాళం పగలగొట్టించండి.

00:25:13.440 --> 00:25:16.000 align:center
ఇంకా అతన్ని భోజనానికి పిలవండి.
నేను అతని కోసం ఒక కూర వండుతాను.

00:25:16.080 --> 00:25:17.680 align:center
విందు ఏర్పాటు చేస్తానని అనుకోవద్దు.

00:25:18.720 --> 00:25:20.920 align:center
[మృదువైన సంగీతం]

00:25:24.640 --> 00:25:26.720 align:center
[బండి ఇంజిన్ శబ్ధం]

00:25:33.240 --> 00:25:34.800 align:center
సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడ?

00:25:35.880 --> 00:25:37.840 align:center
నేను కొత్తగా వచ్చిన పంచాయితీ సెక్రెటరీని.

00:25:37.920 --> 00:25:39.800 align:center
అవునా. ముందుకెళ్ళి ఎడమ వైపుకు తిరగండి.

00:25:45.400 --> 00:25:47.240 align:center
-[తలుపు తట్టిన శబ్ధం]
-[అభిషేక్] సర్పంచ్ గారు.

00:25:49.760 --> 00:25:50.960 align:center
సర్పంచ్ గారు!

00:25:52.120 --> 00:25:54.440 align:center
[గడియ తీస్తున్న శబ్ధం]

00:25:55.840 --> 00:25:58.960 align:center
రండి. రండి సెక్రెటరీ గారు.

00:25:59.600 --> 00:26:01.400 align:center
మీరు మీ మోటార్ సైకిల్ బయటే పెడతారా?

00:26:01.480 --> 00:26:03.080 align:center
-[అభిషేక్] అవును.
-మీరు తాళం వేసి తీసుకున్నారా?

00:26:03.160 --> 00:26:04.280 align:center
-[అభిషేక్] హా
-అయితే మంచిది, పదండి.

00:26:04.920 --> 00:26:06.880 align:center
వికాస్ తాళం పగలగొడుతున్నాడా?

00:26:06.960 --> 00:26:08.880 align:center
-అవును, పగలగొడుతున్నాడు.
-మంచిది, బాగుంది.

00:26:10.720 --> 00:26:11.720 align:center
రండి.

00:26:12.560 --> 00:26:14.560 align:center
[ఆవు అరుపు శబ్ధం]

00:26:17.680 --> 00:26:19.240 align:center
అవి మావే. మీరు చూస్తారా?

00:26:19.320 --> 00:26:20.480 align:center
-లేదు.
-రండి.

00:26:20.560 --> 00:26:22.560 align:center
ఈ రోజు పొలం చూశాను కదా,
మరెప్పుడైనా చూద్దాం.

00:26:22.640 --> 00:26:23.640 align:center
పదండి వెళదాం.

00:26:25.760 --> 00:26:27.160 align:center
వినండి.

00:26:27.400 --> 00:26:29.480 align:center
లోపల పరిస్థితి చాలా సున్నితంగా ఉంది.

00:26:29.560 --> 00:26:31.520 align:center
కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి
మాట్లాడండి. సరేనా?

00:26:32.280 --> 00:26:34.280 align:center
ఒకటి చెప్పనా, మాట్లాడకుండా ఉంటే మంచిది.

00:26:34.360 --> 00:26:35.360 align:center
పదండి.

00:26:36.040 --> 00:26:38.400 align:center
[నూనెలో ఉడుకుతున్న శబ్ధం]

00:26:52.840 --> 00:26:54.280 align:center
భోజనం చాలా బాగుంది, సర్పంచ్ గారు.

00:26:56.760 --> 00:26:59.040 align:center
భోజనం చాలా రుచిగా ఉందని సెక్రెటరీ గారు
చెబుతున్నారు.

00:26:59.120 --> 00:27:01.240 align:center
గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను.

00:27:01.320 --> 00:27:02.560 align:center
రుచిగానే ఉంటుంది కదా?

00:27:02.920 --> 00:27:05.080 align:center
[చమత్కారమైన సంగీతం]

00:27:15.280 --> 00:27:16.520 align:center
[అభిషేక్] వద్దు, చాలు. నాకు సరిపోయింది.

00:27:17.120 --> 00:27:18.840 align:center
ఇప్పుడే కదా రుచిగా ఉందని అన్నారు?

00:27:20.520 --> 00:27:21.560 align:center
నాకొకటి వెయ్యండి.

00:27:23.880 --> 00:27:26.160 align:center
ఒకటి ఈ పేదోడి పళ్ళెంలో కూడా వెయ్యి.

00:27:29.840 --> 00:27:31.760 align:center
ఒకటంటే ఒకటే వేస్తావా?

00:27:35.840 --> 00:27:37.200 align:center
[రింకీ] అమ్మా, భోజనం సిద్ధమయిందా?

00:27:37.720 --> 00:27:38.880 align:center
పైనే ఉండు!

00:27:38.960 --> 00:27:40.320 align:center
నేను భోజనం నీ గదికి తీసుకొస్తాను.

00:27:41.160 --> 00:27:42.400 align:center
[తలుపు మూసిన శబ్ధం]

00:27:46.040 --> 00:27:50.120 align:center
[సెల్ ఫోన్ మో గుతున్న శబ్ధం]

00:27:53.600 --> 00:27:55.200 align:center
ఉమ్. హలో.

00:27:55.800 --> 00:27:56.880 align:center
[బ్రిజ్] వికాస్.

00:27:57.280 --> 00:27:58.360 align:center
ఏమిటి?

00:27:59.360 --> 00:28:00.400 align:center
విరిగిందా?

00:28:00.920 --> 00:28:02.760 align:center
-విరిగిందా?
-విరిగింది.

00:28:03.560 --> 00:28:05.920 align:center
[మృదువైన సంగీతం]

00:28:09.800 --> 00:28:11.680 align:center
[బ్రిజ్] విరిగింది!

00:28:13.120 --> 00:28:14.840 align:center
తలుపు పగలగొట్టమని ఎవరు చెప్పారు?

00:28:14.920 --> 00:28:16.240 align:center
[వికాస్] నేను తాళమే పగలగొడుతున్నాను.

00:28:16.320 --> 00:28:17.440 align:center
అప్పుడు?

00:28:18.120 --> 00:28:19.960 align:center
తలుపు కంటే తాళం బలంగా ఉంది.

00:28:21.400 --> 00:28:22.400 align:center
పదండి.

00:28:24.760 --> 00:28:25.920 align:center
పదండి, వెళదాం.

00:28:30.040 --> 00:28:31.800 align:center
[బ్రిజ్] నువ్వు బుల్ డోజరుతో
గుద్దినట్లు ఉన్నావు.

00:28:33.760 --> 00:28:34.960 align:center
లోపలికి రండి.

00:28:37.080 --> 00:28:38.120 align:center
ఒకసారి చూడండి.

00:28:38.800 --> 00:28:39.840 align:center
బాగుందా?

00:28:44.240 --> 00:28:45.520 align:center
సరిచేద్దాం.

00:28:46.280 --> 00:28:48.760 align:center
[అస్పష్టమైన మాటలు]

00:28:49.880 --> 00:28:54.160 align:center
[విచార సంగీతం]

00:29:47.560 --> 00:29:50.320 align:center
[విచార సంగీతం కొనసాగుతుంది]

00:29:56.000 --> 00:29:58.520 align:center
దెబ్బతగిలితే నొప్పి పుడుతుంది, మనిషి
ఆ విధంగానే గుణపాఠం నేర్చుకుంటాడు

00:29:58.600 --> 00:29:59.800 align:center
[బ్రిజ్] అంతా బాగానే ఉందా?

00:29:59.880 --> 00:30:02.080 align:center
ఆందోళన చెందకండి,
రేపు తలుపు బిగించేలా చూస్తాను.

00:30:02.160 --> 00:30:03.160 align:center
సరేనా?

00:30:04.040 --> 00:30:05.840 align:center
నేను మంచం లోపలికి తీసుకొస్తాను.

00:30:07.320 --> 00:30:08.800 align:center
ఇప్పుడు అది ముఖ్యం కాదు.

00:30:09.160 --> 00:30:10.440 align:center
అయితే మేము వెళతాము.

00:30:10.760 --> 00:30:12.560 align:center
ఇంకా మేము బయటికి వెళ్ళిన తరువాత

00:30:12.640 --> 00:30:16.040 align:center
మీరు ఈ సుత్తి ఉపయోగించి దీన్ని తలుపుకి
అడ్డంగా పెట్టవచ్చు.

00:30:16.520 --> 00:30:18.480 align:center
గాలి వీచినా తలుపు పడిపోకుండా
ఉంటుంది. ఇదిగో, తీసుకోండి.

00:30:19.040 --> 00:30:21.280 align:center
తలుపు వేసుకుని బాగా నిద్రపోండి.

00:30:21.360 --> 00:30:22.440 align:center
పద వెళదాం.

00:30:26.040 --> 00:30:28.920 align:center
[నిరుత్సాహకరమైన సంగీతం]

00:30:49.240 --> 00:30:51.640 align:center
[నిరుత్సాహకరమైన సంగీతం కొనసాగుతుంది]

00:30:59.680 --> 00:31:00.720 align:center
[కీప్యాడ్ నొక్కుతున్న శబ్ధం]

00:31:00.800 --> 00:31:03.160 align:center
[ఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం]

00:31:03.880 --> 00:31:06.680 align:center
[ప్రతీక్] లేదు. సిపి వెళ్లడానికి మెట్రో
సౌకర్యవంతంగా ఉండదు.

00:31:06.760 --> 00:31:07.880 align:center
దానికి బదులుగా క్యాబ్ లో వెళదాం.

00:31:07.960 --> 00:31:09.160 align:center
[సెల్ ఫోన్ మొగుతున్న శబ్ధం]

00:31:09.240 --> 00:31:12.680 align:center
హే, మోహన్ భార్గవ్.
స్వదేశ్ ఎలా ఉంది? పనిలో చేరావా?

00:31:13.800 --> 00:31:15.000 align:center
[ప్రతీక్] హలో.

00:31:15.080 --> 00:31:16.120 align:center
అభిషేక్.

00:31:16.560 --> 00:31:17.920 align:center
సోదరా, నేను ఇక్కడ నుండి బయటపడాలి.

00:31:20.040 --> 00:31:21.960 align:center
ఏమి జరిగింది? నువ్వు బాగానే ఉన్నావా?

00:31:23.400 --> 00:31:24.960 align:center
నేను ఇక్కడ ఉండలేను.

00:31:26.080 --> 00:31:27.360 align:center
నువ్వు ఉద్యోగం మానేస్తున్నావా?

00:31:28.640 --> 00:31:31.120 align:center
ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర కూర్చోలేను.
ఏమి చేయాలో అర్థంకావడం లేదు.

00:31:32.760 --> 00:31:35.000 align:center
[ప్రతీక్] నువ్వు ఉన్నతమైన ఉద్యోగం కోసం
చూస్తున్నావని నాకు తెలుసు,

00:31:35.280 --> 00:31:37.080 align:center
మరియు ఇప్పుడు నీకు దానికోసం
ఒకే ఒక్క దారి ఉంది.

00:31:37.880 --> 00:31:39.200 align:center
నువ్వు క్యాట్ పరీక్షలో పాస్ కావాలి.

00:31:39.600 --> 00:31:42.200 align:center
-నేను క్యాట్ లో ఎలా ఉత్తీర్ణం అవుతాను?
-[ప్రతీక్] ప్చ్.

00:31:42.280 --> 00:31:43.520 align:center
[ప్రతీక్] ఎందుకు అవ్వలేవు?

00:31:43.600 --> 00:31:46.440 align:center
మా నాన్న ఎప్పుడూ అంటుంటారు
నువ్వు నాకంటే తెలివైన వాడివని.

00:31:46.520 --> 00:31:48.000 align:center
నువ్వు కష్టపడవు అంతే.

00:31:49.840 --> 00:31:50.960 align:center
అయితేం ఏమి చేయను?

00:31:51.720 --> 00:31:53.120 align:center
నా ఉద్యోగం వదిలి పరీక్షకు సిద్ధమవ్వాలా?

00:31:53.200 --> 00:31:54.880 align:center
లేదు, ఉద్యోగం వదిలేయడం ఎందుకు?

00:31:54.960 --> 00:31:56.840 align:center
ఎమ్.బీ.ఏ. చదవాలంటే ఉద్యోగ అనుభవం
బాగా ఉపయోగపడుతుంది.

00:31:57.120 --> 00:31:59.400 align:center
ఇక్కడి ఉద్యోగ అనుభవం వలన
ఏమి ప్రయోజనం ఉంటుంది?

00:32:00.840 --> 00:32:03.120 align:center
[ప్రతీక్] నువ్వు ఇప్పుడు చెబుతుంటే,
నాకు అర్థమయింది...

00:32:04.000 --> 00:32:08.640 align:center
పంచాయితీ సెక్రెటరీగా నువ్వు మొత్తం
గ్రామ కార్యాలయంను చూసుకుంటావు, అవునా?

00:32:09.920 --> 00:32:10.920 align:center
అవును, అయితే?

00:32:11.000 --> 00:32:14.760 align:center
[ప్రతీక్] ఐ.ఐ.ఎమ్. ఇంటర్వ్యూలలో వేర్వేరు
రంగాల నుండి వచ్చిన అభ్యర్థుల కోసం చూస్తారు

00:32:15.200 --> 00:32:19.960 align:center
నువ్వు భారతదేశాన్ని దాని మూలాల నుండి
చూసిన వ్యక్తివి అవుతావు.

00:32:20.040 --> 00:32:22.480 align:center
నువ్వు అసలైన భారతదేశం అని
ఏదో చెబుతూ ఉంటావు ఎందుకు?

00:32:22.560 --> 00:32:23.760 align:center
అసలైన భారతదేశం అనేది ఏమీ లేదు.

00:32:23.840 --> 00:32:25.680 align:center
[అభిషేక్] గ్రామం నిండా వెధవలు ఉన్నారు.

00:32:25.760 --> 00:32:27.120 align:center
నిజానికి ఇది వెధవలు ఉన్న ఊరు.

00:32:27.200 --> 00:32:28.280 align:center
[ఇంగ్లీష్ లో] నన్ను నమ్ము,

00:32:28.480 --> 00:32:32.440 align:center
ఈ ఉద్యోగ అనుభవం నీకు ఐ.ఐ.ఎమ్.
ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సహాయపడుతుంది.

00:32:34.400 --> 00:32:35.960 align:center
ఆచరణాత్మకంగా ఇది చెప్పు,

00:32:36.480 --> 00:32:38.360 align:center
క్యాట్ కి సిద్దమవ్వడానికి
ఎంత సమయం పడుతుంది?

00:32:39.120 --> 00:32:42.720 align:center
[ప్రతీక్] అక్కడ నుండి బయటపడాలని ఎంత బలంగా
కోరుకుంటున్నావనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

00:32:43.000 --> 00:32:44.160 align:center
చాలా ఎక్కువగా.

00:32:44.440 --> 00:32:45.920 align:center
[ప్రతీక్] అప్పుడు నీకు ఒకే ఒక్క దారి ఉంది.

00:32:46.320 --> 00:32:47.960 align:center
ప్రతి రోజూ కార్యాలయం ముగిశాక...

00:32:48.600 --> 00:32:51.680 align:center
నువ్వు కనీసం మూడు నాలుగు గంటలు
అంకితభావంతో చదవడం ప్రారంభించాలి.

00:32:52.800 --> 00:32:54.240 align:center
నాకొక సహాయం చెయ్యి.

00:32:55.240 --> 00:32:57.200 align:center
నాకు క్యాట్ మెటీరీయల్ కొరియర్ చెయ్యి.

00:32:57.720 --> 00:33:00.000 align:center
సరే, ఖచ్ఛితంగా.
నేను నీకు అత్యుత్తమ పుస్తకాలు పంపిస్తాను.

00:33:00.080 --> 00:33:01.480 align:center
నాకు నీ చిరునామా చెప్పు.

00:33:01.840 --> 00:33:02.960 align:center
వ్రాసుకో.

00:33:03.600 --> 00:33:04.960 align:center
అభిషేక్ త్రిపాఠి.

00:33:06.160 --> 00:33:07.600 align:center
పంచాయితీ కార్యాలయం.

00:33:08.200 --> 00:33:10.040 align:center
గ్రామ్ ప్లస్ పోస్ట్, ఫులేరా.

00:33:10.280 --> 00:33:11.560 align:center
వి.ఖా. ఫక్వాలీ

00:33:11.640 --> 00:33:13.320 align:center
[ప్రతీక్] వి.ఖా... అంటే?

00:33:13.400 --> 00:33:15.440 align:center
-[అభిషేక్] వి.ఖా. అంటే వికాస్ ఖండ్.
-[ప్రతీక్] ఏమిటి?

00:33:15.520 --> 00:33:17.800 align:center
[అభిషేక్] నేను చెప్పింది వ్రాసుకో, అంతే.

00:33:17.880 --> 00:33:19.000 align:center
[ప్రతీక్] సరే బాబు.

00:33:19.080 --> 00:33:21.680 align:center
[ప్రతీక్] వి.ఖా. ఫక్వాలీ.

00:33:21.760 --> 00:33:23.480 align:center
[ప్రతీక్] అనటానికి కొంచెం గమ్మత్తుగా ఉంది.

00:33:23.560 --> 00:33:24.560 align:center
[ప్రతీక్] తరువాత?

00:33:24.640 --> 00:33:27.360 align:center
[అభిషేక్] బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్.

00:33:27.440 --> 00:33:33.040 align:center
[ప్రతీక్] బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్.
వ్రాసుకున్నాను.

00:33:33.360 --> 00:33:36.840 align:center
[అభిషేక్] రేపే పంపించు,
అవి ఇక్కడికి ఎలా వస్తాయో ఏమో!

00:33:36.920 --> 00:33:39.200 align:center
[ప్రతీక్] నువ్వు వెళ్ళావంటే
పుస్తకాలు కూడా వస్తాయి.

00:33:39.280 --> 00:33:40.680 align:center
నేను నీకు అత్యుత్తమ పుస్తకాలు పంపుతాను.

00:33:40.760 --> 00:33:41.760 align:center
[అభిషేక్] ధన్యవాదాలు, మిత్రమా.

00:33:41.840 --> 00:33:43.080 align:center
[ప్రతీక్] ఈ మర్యాదలు అన్నీ వదిలేయి.

00:33:43.160 --> 00:33:47.960 align:center
నువ్వు రోజూ రాత్రి పని ముగిశాక ఖచ్చితంగా
మూడు నాలుగు గంటలు చదవటం అలావాటుచేసుకో.

00:33:50.440 --> 00:33:52.200 align:center
-[అభిషేక్] అబ్బా.
-[ప్రతీక్] ఏమయింది?

00:33:52.280 --> 00:33:53.760 align:center
[అభిషేక్] ప్చ్!

00:33:53.840 --> 00:33:55.960 align:center
[అభిషేక్] ఏమీ లేదు. కరెంట్ పోయింది.

00:33:56.040 --> 00:33:57.520 align:center
[ప్రతీక్] ప్రతిరోజూ రాత్రిపూట పోతుందా?

00:33:57.600 --> 00:33:59.480 align:center
[అభిషేక్] అవును, ప్రతిరోజూ రాత్రిపూట
మూడు నాలుగు గంటలు.

00:33:59.560 --> 00:34:02.680 align:center
[విచార సంగీతం]

00:34:43.880 --> 00:34:45.880 align:center
[ముగింపు థీమ్ సంగీతం]
రోజూ రాత్రిపూట
మూడు నాలుగు గంటలు.

