WEBVTT

00:11.053 --> 00:12.596
నాన్సీ మరణానికి అయిదు రోజుల ముందు

00:20.270 --> 00:21.939
- ఐ లవ్ యు.
- ఐ లవ్ యు.

00:32.950 --> 00:35.494
నేను నీ అసలు రూపాన్ని చూసా.
అది అందరికీ చూపించగలను కూడా.

00:51.301 --> 00:52.469
ఛ!

00:58.517 --> 00:59.768
నేను నిన్ను కలవాలి.

01:42.311 --> 01:44.313
అరమింట హల్ వ్రాసిన పుస్తకం
ఆధారంగా రూపొందించబడింది

01:53.113 --> 01:58.076
బ్రేకింగ్ న్యూస్
డాష్ కామ్ లో కనిపించిన అనుమానితుడు

02:01.246 --> 02:02.497
శ్రీమతి సింప్సన్.

02:03.874 --> 02:06.292
నేను చెప్పిన లీగల్ ఎయిడ్.
ఆమె చాలా ప్రతిభావంతురాలు.

02:06.293 --> 02:08.835
మీకు రాత్రికి ఉండటానికి ఎక్కడైనా చోటు కావాలంటే,

02:08.836 --> 02:10.672
మీకు అవసరమైన సాయం మేము చేయగలం.

02:11.840 --> 02:13.716
హోవర్డ్, నేను చెప్పేది విను.

02:13.717 --> 02:15.718
- నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు.
- ఇంకేం మాట్లాడొద్దు.

02:15.719 --> 02:17.595
- అది నా పని కాదు.
- నా క్లయింట్ ఇక్కడి నుండి పిల్లల్ని

02:17.596 --> 02:19.013
- తీసుకెళ్లడానికి వచ్చారు.
- ఏంటి?

02:19.014 --> 02:21.182
అదేం సమస్య కాదు. ఇలా రండి.

02:21.183 --> 02:23.059
పోలీసులకు ఎలనోర్ ఫోన్ చేసి ఉంటుంది.

02:23.060 --> 02:24.560
నేను ఏం చెప్పలేదు.

02:24.561 --> 02:26.312
నువ్వు ఇంకెప్పుడూ అమ్మాయిలను చూడలేకుండా చేస్తా చూడు.

02:26.313 --> 02:29.315
లేదు, నువ్వు అలా చేయకూడదు. వాళ్ళకి నేను కావాలి.
వాళ్ళకి వాళ్ళ అమ్మ కావాలి.

02:29.316 --> 02:30.816
హేయ్, పిల్లలూ.

02:30.817 --> 02:32.986
- మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?
- ఇంటికి.

02:34.446 --> 02:36.030
హాయ్, బుజ్జి. ఏం కాదు.

02:36.031 --> 02:37.657
- ఇలా జరుగుతున్నందుకు క్షమించు.
- అమ్మ సంగతి ఏంటి?

02:37.658 --> 02:39.367
తను ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
పదా, బంగారం.

02:39.368 --> 02:41.369
హోవర్డ్, ప్లీజ్. నిన్ను బ్రతిమిలాడుకుంటున్నా. ప్లీజ్.

02:41.370 --> 02:43.871
- దయచేసి ఇలా చేయకు.
- ఇలా చేసింది నేను కాదు. నువ్వు.

02:43.872 --> 02:44.957
నేను కాదు. నువ్వు.

02:50.212 --> 02:52.339
- అమ్మా!
- ఏం కాదు, బంగారం.

03:04.268 --> 03:05.602
పదా, గాంజ్. ఫోన్ ఎత్తు.

03:08.939 --> 03:10.064
మిస్ బుషే.

03:10.065 --> 03:11.732
అసలు ఏం జరుగుతోంది?

03:11.733 --> 03:13.401
హోవర్డ్ విషయంలో అసలు ఏం జరిగింది?

03:13.402 --> 03:15.528
అతన్ని కస్టడీలో ఉంచడానికి మా దగ్గర ఏం లేవు.
మేము అతన్ని వదిలేశాం.

03:15.529 --> 03:16.655
ఛ.

03:17.489 --> 03:19.992
- ఛ.
- అది అతని పని కాదు. మీరు ఇక ఇది వదిలేయాలి.

03:49.146 --> 03:50.772
ఎలనోర్

04:19.218 --> 04:20.927
గత 12 గంటల్లో,

04:20.928 --> 04:24.889
మాతో కలిసి మిస్టర్ రీడ్ ని కనిపెట్టడానికి
పని చేస్తున్న స్థానిక పోలీసు

04:24.890 --> 04:27.475
అధికారుల నుండి మేము కొన్ని వాస్తవాలను సేకరించగలిగాం.

04:27.476 --> 04:31.395
మేము రాష్ట్రమంతా వెతుకులాటను విస్తరింపజేసి,
బోర్డర్ మీద కూడా కన్నేసి ఉంచాం.

04:31.396 --> 04:32.522
అంటే అతన్ని తప్పించుకోనిచ్చారు.

04:32.523 --> 04:35.942
మేము బేకర్స్ ఫీల్డ్ లోని అతని ఇంటి దగ్గర
కూడా యూనిట్స్ ని ఉంచాం.

04:35.943 --> 04:39.612
అలాగే అతను ఇంతకు ముందు పని చేసిన
ఆఫీసు దగ్గర కూడా యూనిట్స్ ని ఉంచాం.

04:39.613 --> 04:42.281
మా టిప్ లైన్ కి చాలా మంది
అతన్ని చూసినట్టు ఫోన్ చేసి చెప్పారు,

04:42.282 --> 04:45.201
కానీ ఇంతవరకు బలమైన ఆచూకీ ఏదీ దొరకలేదు.

04:45.202 --> 04:46.869
అలాగే ఇన్ని రోజులైనా మీరు ఇంకా
ఎందుకు ఏం చేయలేదు?

04:46.870 --> 04:49.288
- మేము మొదటి నుండి మిస్టర్ రీడ్ ని పెద్దగా అనుమానించలేదు.
- తెలుస్తోంది.

04:49.289 --> 04:51.249
ఎందుకంటే మీరు మీ పని చేయడం మాని దొబ్బి నా భార్య

04:51.250 --> 04:52.875
హత్యని నా మీద రుద్దడంలో బిజీగా ఉన్నారు కదా.

04:52.876 --> 04:55.670
ఈ మీటింగ్ ని ఏదో మర్యాదకు ఏర్పాటు చేసాం
అని మీకు మళ్ళీ గుర్తుచేయాలా?

04:55.671 --> 04:57.797
మీ కుటుంబం అడిగినందుకు చేసిన
అరెస్ట్ కారణంగా మిస్టర్ సింప్సన్ గనుక

04:57.798 --> 05:01.926
ఈ డిపార్ట్మెంట్ పై దావా వేయాలని
చూస్తే మేము ఎంత సమస్యలో

05:01.927 --> 05:04.304
పడతామో ఆలోచించి చూస్తే, అసలు
ఇలాంటి మీటింగ్ పెట్టాల్సిన పనే లేదు,

05:04.972 --> 05:06.890
కాబట్టి ఇక మీ సోది ఆపితే,

05:08.058 --> 05:09.518
- మేము చెప్పడం కొనసాగిస్తాం.
- ఒక్క నిమిషం.

05:10.102 --> 05:13.230
- మేరీ సింప్సన్. నాతో మీరు ఇక్కడే…
- అవును, అవును. ప్లీజ్, కూర్చోండి.

05:14.898 --> 05:15.982
డిటెక్టివ్.

05:15.983 --> 05:18.109
మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి ఉన్న ఒకే ఒక కారణం

05:18.110 --> 05:20.486
శ్రీమతి హెనెస్సీతో ఎక్కువ కాలం పరిచయం
ఉన్నోళ్లు మీరే కాబట్టి.

05:20.487 --> 05:22.864
మిస్టర్ రీడ్ మరియు శ్రీమతి హెనెస్సీల
మధ్య ఉన్న బంధం గురించి మీరు

05:22.865 --> 05:25.868
ఏమైనా సమాచారం అందించి అతన్ని కనిపెట్టడానికి
మీరు మాకు ఏమైనా సాయం చేయగలరా?

05:26.952 --> 05:31.914
మాకు తెలిసినంత వరకు, ఆమె తన కుటుంబంతో
చాలా రోజుల నుండి మాట్లాడటం లేదు.

05:31.915 --> 05:34.751
చాలా దశాబ్దాల నుండి.
వాళ్లతో తను అసలు ఎలాంటి సంబంధం పెట్టుకోదలచుకోలేదు.

05:35.878 --> 05:39.464
సరే, కానీ మేము మిస్టర్ రీడ్ అలాగే శ్రీమతి హెనెస్సీ
మాట్లాడుకునేవారని నమ్ముతున్నాం.

05:40.257 --> 05:44.969
మేము ఈ నంబర్ ఇంతకు ముందు మిస్టర్ రీడ్
కొని వాడి పడేసిన నంబర్ గా గుర్తించాం.

05:44.970 --> 05:48.055
శ్రీమతి హెనెస్సీ హత్యకు గురి కావడానికి అయిదు రోజుల ముందు

05:48.056 --> 05:49.932
అలాగే ఆమె చనిపోయిన రాత్రి కూడా అతనికి కాల్ చేసింది.

05:49.933 --> 05:52.101
ఈ కాల్స్ ఉద్దేశం ఏంటో మేము ఇంకా కనిపెట్టలేదు, కానీ…

05:52.102 --> 05:53.936
అయితే ఇప్పుడు చంపిన వాడిని కనిపెట్టడానికి బదులు

05:53.937 --> 05:55.981
నాన్సీ చావుకు తనే కారణం అంటున్నారు?

05:56.940 --> 06:00.277
మేము మీకు ఇంతకంటే ఎక్కువ సాయం
చేయలేకపోతున్నందుకు క్షమించండి.

06:02.779 --> 06:04.990
రాబర్ట్. ప్లీజ్ ఆగు.

06:05.574 --> 06:06.575
ఏంటి?

06:07.618 --> 06:10.786
ఇది చూడటానికి ఎలా ఉందో నాకు తెలుసు.
కానీ హోవర్డ్ గురించి నేను చెప్పింది కరెక్టే.

06:10.787 --> 06:12.955
ఇందులో స్కాట్ పాత్ర ఏంటో నాకు తెలీదు,

06:12.956 --> 06:14.874
కానీ బహుశా వాళ్ళు కలిసి పని చేశారేమో.
వాళ్ళు ఖచ్చితంగా…

06:14.875 --> 06:17.461
తనని స్కాటే చంపాడు, సరేనా? స్కాట్.

06:18.253 --> 06:19.545
హోవర్డ్ కాదు.

06:19.546 --> 06:22.716
మీ మధ్య నడుస్తున్నది ఏదైనా సరే, నన్ను అందులోకి లాగొద్దు.

06:28.472 --> 06:30.306
- వాళ్ళు నా పిల్లల ముందు నుండి తనని తీసుకెళ్లారు.
- సరే…

06:30.307 --> 06:31.849
- అది నీకు తెలుసా?
- వాళ్ళు అంత త్వరగా యాక్షన్

06:31.850 --> 06:33.309
- తీసుకుంటారని నాకు తెలీదు.
- అదే జరిగింది.

06:33.310 --> 06:34.393
అలా జరిగినందుకు నన్ను క్షమించు.

06:34.394 --> 06:37.188
- కానీ మనం ఒకటి అనుకున్నాం, నువ్వు వెనకడుగు వేశావు.
- నా పిల్లలు అతని దగ్గర ఉన్నారు, ఎల్లి.

06:37.189 --> 06:39.232
దానికి బదులు నా చేతులు, కాళ్ళను తీసేసినా నేను బాధపడను.

06:39.233 --> 06:42.902
వాళ్ళు లేకుండా నేను దేనికీ పనికిరాని మాంసపు ముద్దతో సమానం.

06:42.903 --> 06:44.904
అంటే ఏంటి అర్థం?
అందుకని అతను చేసిన దాన్ని మరచిపోయి వదిలేయాలా?

06:44.905 --> 06:46.114
నువ్వు ఆ వీడియో చూశావా?

06:47.824 --> 06:49.910
మనం అనుకునేది తప్పు అయితే? హ్మ్?

06:50.661 --> 06:53.287
- నాన్సీని స్కాటే చంపి ఉంటే?
- నువ్వు అది నమ్ముతున్నావంటే నమ్మలేకపోతున్నా.

06:53.288 --> 06:54.872
- నాకు తెలీదు!
- మేరీ,

06:54.873 --> 06:57.542
నువ్వు వాడిన ఆ ఆడెరాల్ నీ బుర్రను
పూర్తిగా చెడదొబ్బిందా?

06:57.543 --> 06:59.460
హోవర్డ్ ఒప్పుకున్నంత పని చేసాడు.

06:59.461 --> 07:03.798
అలాంటి వాడితో మార్కస్ ఇంకా అమ్మాయిలను వదలడం
కరెక్టు అని నువ్వు అనుకోకూడదు.

07:03.799 --> 07:07.094
మిగతా వాళ్ళ కుటుంబాల మీద పడటం మానేసి
నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు కదా?

07:15.561 --> 07:17.311
కోర్టు తేదీ సంగతి ఏంటి?

07:17.312 --> 07:18.563
వాదన జరుగుతుంది, అవును.

07:18.564 --> 07:20.648
అత్యవసర కస్టడీ ఆర్డర్ ని పొందడానికి.

07:20.649 --> 07:23.192
మీ భర్త ప్రక్రియను వేగవంతం చేయమని ఫైల్ చేశారు.

07:23.193 --> 07:25.070
జడ్జి డేవిస్ మంగళవారానికి వాదనని ఏర్పాటు చేశారు.

07:25.737 --> 07:28.198
అంటే ఆరు రోజులు ఉంది.
మీరు మనకు వారాలు ఉంటుంది అన్నారు.

07:28.740 --> 07:30.408
- అతను అలా చేయగలడా?
- అతను మీ నుండి

07:30.409 --> 07:33.452
"శారీరక హాని జరగవచ్చని నమ్ముతున్నాం" అని పేర్కొన్నాడు.

07:33.453 --> 07:35.830
అమ్మ నుండా? అది అబద్ధం.

07:35.831 --> 07:38.124
అతను తప్పనిసరి పరిస్థితులు
ఎదురయ్యాయి అని కూడా అంటున్నాడు.

07:38.125 --> 07:41.669
చూస్తుంటే అతను ఉద్యోగ రీత్యా ఒహయోకి వెళ్ళాలి అంట,
కాబట్టి అమ్మాయిలను తీసుకెళ్లాలని పిటిషన్ వేస్తున్నాడు.

07:41.670 --> 07:43.546
- అలా జరగకూడదు.
- సరే, కానీ అది జడ్జి డేవిస్ నిర్ణయం.

07:43.547 --> 07:45.298
లేదు, అది అన్యాయం.

07:45.299 --> 07:46.425
మార్కస్, కూర్చో.

07:51.930 --> 07:53.307
ఆయన ఈమెకు ద్రోహం చేస్తుంటాడు.

07:54.183 --> 07:55.517
చాలా ఏళ్లుగా చేస్తున్నాడు.

07:56.977 --> 07:58.478
నాకు తెలీదు అనుకుంటున్నావు, కానీ నాకు తెలుసు.

08:00.105 --> 08:01.106
బుజ్జి…

08:01.982 --> 08:04.775
మా నాన్న, ఆయన మంచోడిలా నటిస్తాడు.

08:04.776 --> 08:05.860
అందరినీ ఆయన అలాగే మోసం చేసాడు.

08:05.861 --> 08:07.529
ఆయన నిజంగా ఎలాంటోడో ఎవరికీ తెలీదు.

08:09.406 --> 08:11.240
మనం చేయగలది ఏదోకటి ఉండి ఉంటుంది.

08:11.241 --> 08:14.077
ఆయన మిమ్మల్ని వేధించినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

08:14.745 --> 08:15.746
లేదు. అతను…

08:17.789 --> 08:20.000
అతను అంత తెలిసేలా ఏం చేయడు.

08:22.503 --> 08:24.838
కాకపోతే అతను ఏమైనా చేయడానికి
తెగిస్తాడని నా నమ్మకం.

08:25.506 --> 08:27.883
అలాగే ఇన్నేళ్ళుగా మీరు పోలీసులకు ఏమైనా రిపోర్ట్ చేసారా?

08:30.427 --> 08:32.470
- లేదు.
- అది చాలా దురదృష్టకరం.

08:32.471 --> 08:34.764
సంఘటనకు తగిన రిపోర్టు ఏదైనా లేకపోతే

08:34.765 --> 08:37.600
హోవర్డ్ బలహీనత మీద దృష్టి పెట్టకపోవడం మంచి పని.

08:37.601 --> 08:38.683
మనకున్న బలం మీద దృష్టి పెడదాం.

08:38.684 --> 08:40.436
మీ గురించి మనకు బలమైన సాక్ష్యం చెప్పేవారు కావాలి.

08:40.437 --> 08:41.771
నేను చెప్తాను.

08:41.772 --> 08:43.481
మీ కుటుంబానికి చెందని వారి నుండి.

08:43.482 --> 08:45.733
మీకు చాలా ఏళ్లుగా తెలిసిన వారు
ఎవరైనా అయితే బాగుంటుంది.

08:45.734 --> 08:47.653
మీ గురించి సాక్షం చెప్పగలవారు
మీ జీవితంలో ఎవరు ఉన్నారు?

09:08.924 --> 09:09.925
మార్నింగ్.

09:34.616 --> 09:36.410
- హాయ్, బెర్నార్డ్.
- మిస్ ఎల్లి.

09:36.952 --> 09:38.871
- నిన్ను చూసి చాలా కాలం అవుతోంది.
- మిమ్మల్ని చూడటం సంతోషం.

09:39.955 --> 09:41.540
- ఇంటికి స్వాగతం.
- థాంక్స్.

09:47.129 --> 09:50.716
వాళ్ళు మూయాలని అనుకోకపోతే,
మనం మధ్యవర్తిని పెట్టుకోవాల్సిందే.

09:52.551 --> 09:53.677
ఒప్పుకుంటా.

09:57.681 --> 09:59.224
అయితే వాళ్లతో ఈ సంతకం చేయించు.

10:00.142 --> 10:01.226
థాంక్స్.

10:06.190 --> 10:07.191
హాయ్.

10:08.358 --> 10:09.359
అది…

10:10.485 --> 10:11.653
దాన్ని షాగ్ అంటారా లేక బాబ్ అంటారా?

10:12.738 --> 10:14.239
జుట్టు పొడవుని చూసి చెప్పడం కష్టంగా ఉంది.

10:17.659 --> 10:20.370
నిజానికి ఇది ఒక బిక్సి.

10:21.997 --> 10:22.998
నీకు బాగుంది.

10:24.583 --> 10:26.543
నేను ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా.

10:32.633 --> 10:35.552
నీ అన్న నువ్వు వస్తున్నావు అని చెప్పినప్పుడు
నేను ఆశ్చర్యపోయా.

10:36.553 --> 10:37.846
వాడు ఆటపట్టిస్తున్నాడు అనుకున్నా.

10:38.347 --> 10:39.890
సాధారణంగా నువ్వు వెళ్ళినప్పుడు, అది…

10:40.891 --> 10:42.559
నా వైపు రావు కదా.

10:44.811 --> 10:45.854
అవును.

10:54.029 --> 10:55.781
నాకు ఇంకెక్కడికి వెళ్ళాలో తెలీలేదు.

10:57.616 --> 11:02.162
నేను వెళ్ళడానికి నాకు వేరే చోటు లేదు.

11:21.974 --> 11:23.892
మిస్టర్ హెనెస్సీ. మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు.

11:24.393 --> 11:25.727
ఇప్పుడు కుదరదు, అడెల్.

11:28.522 --> 11:29.523
ఛ.

11:31.275 --> 11:32.401
హేయ్.

11:34.695 --> 11:35.779
నువ్వు వెళ్ళిపోతున్నావా?

11:38.156 --> 11:39.782
ఇంట్లో కొన్ని మార్పులు చేస్తున్నా.

11:39.783 --> 11:42.285
దీన్ని ఒక పాటరీ స్టూడియోగా
మార్చితే బాగుంటుంది అనుకున్నా.

11:42.286 --> 11:44.621
లేదా ఏదైనా ధ్యానం చేసే రూమ్ లాగ.

11:45.789 --> 11:47.499
అవును, ఇది చూస్తుంటే అలాగే ఉంది.

11:49.459 --> 11:50.586
నీకు ఏం కావాలి?

11:51.170 --> 11:52.546
నాకు కస్టడీ వాదన ఒకటి ఉంది,

11:53.422 --> 11:55.924
నా తరఫున సాక్ష్యం చెప్పేవారు నాకు కావాలి.

11:58.010 --> 12:02.681
ఒక తల్లిగా నేను మంచిదాన్ని అని చెప్పడానికి
నేను చాన్నాళ్లుగా తెలిసిన వాళ్లు కావాలి.

12:03.265 --> 12:04.348
ఓహ్, అబ్బా.

12:04.349 --> 12:07.685
నువ్వు నా దగ్గరకు వచ్చావంటే
ఇంతకంటే వేరే దారి లేనట్టు ఉంది.

12:07.686 --> 12:08.811
ఏంటి? కాదు, రాబర్ట్.

12:08.812 --> 12:13.566
నేను ఎలాంటి తల్లినో నువ్వు చూసావు, లేదా కనీసం
నాన్సీ నీకు చెప్పి ఉంటుంది, లేదా…

12:13.567 --> 12:14.860
మరి, ఎలనోర్ ని అడగొచ్చు కదా?

12:15.611 --> 12:16.820
ఇప్పుడు మా మధ్య మాటలు లేవు.

12:19.281 --> 12:20.949
నేను ఆ విషయం ఒక్క క్షణం కూడా నమ్మను.

12:21.450 --> 12:23.619
నువ్వు నమ్మాల్సిందే. మేము ఇక విడిపోయాం.

12:24.745 --> 12:28.331
తెలుసా, నీ భర్త గురించి ఆ పిచ్చి కథ చెప్పడానికి
ఆమె నా దగ్గరకి వచ్చినప్పుడు…

12:28.332 --> 12:29.916
ఆమె చాలా భయపడింది.

12:29.917 --> 12:30.918
నీ కోసం.

12:31.460 --> 12:32.920
అవునా?

12:35.839 --> 12:37.799
నీకు నేనంటే పెద్ద ఇష్టం లేదు.

12:38.300 --> 12:39.760
మొదటి నుండీ ఇష్టమే లేదు.

12:40.552 --> 12:41.553
ఎందుకు?

12:45.891 --> 12:48.434
చెప్పు. నీకు నా సాయం కావాలా?

12:48.435 --> 12:50.269
రాబర్ట్, నాకు ఇష్టం లేకపోవడం కాదు…

12:50.270 --> 12:52.355
చెప్పు. ఉత్తుత్తి మర్యాద వద్దు.

12:52.356 --> 12:54.024
నాకు ఈ అనవసర మంచితనం నచ్చడం లేదు.

12:55.400 --> 12:57.110
కానివ్వు, మేరీ. నిజం చెప్పు.

12:57.945 --> 12:58.946
నాకు అర్థం కాలేదు.

13:03.700 --> 13:05.869
వాళ్ళిద్దరికీ నువ్వంటే ఎందుకు అంత ఇష్టమని.

13:06.453 --> 13:08.413
అంటే, నువ్వు పొడవైన వాడివి…

13:09.498 --> 13:11.290
కెన్నెడీలాగ ఉంటావని తెలుసు, కానీ…

13:11.291 --> 13:12.667
కానీ ఇంకేంటి?

13:12.668 --> 13:13.794
నువ్వొక కొమ్మవి.

13:14.545 --> 13:15.546
చెట్టువి కాదు.

13:16.129 --> 13:18.422
నీకు ఇచ్చిందే నీ దగ్గర ఉంది.

13:18.423 --> 13:22.219
నువ్వు ఇతరులకు నీ మీద ఉన్న అంచనాల
ఆధారంగా ఎదిగినవాడివి అంతే.

13:24.263 --> 13:25.305
నువ్వు…

13:26.723 --> 13:28.392
నీ అసలు స్వరూపం…

13:31.937 --> 13:33.313
నీకంటూ అసలుతనం ఉన్నట్టే ఉండదు.

13:35.315 --> 13:38.151
రాబర్ట్, నాలుగు రోజులలో…

13:40.153 --> 13:42.489
నేను ఒక జడ్జి ముందు నిలబడాలి…

13:44.867 --> 13:45.993
నేను మళ్ళీ ఎప్పటికైనా

13:46.952 --> 13:51.331
నా పిల్లలని చూడగలనో లేదో నిర్ణయిస్తారు.

13:53.584 --> 13:54.834
మిస్టర్ హెనెస్సీ.

13:54.835 --> 13:56.170
పోలీసులు వచ్చారు, సర్.

13:58.881 --> 14:02.633
ఇవాళ ఉదయం 9:13 నాటికి,
మేము స్కాట్ రీడ్ ని అరెస్టు చేసాం.

14:02.634 --> 14:04.928
- ఆగండి… అయితే మీరు అతన్ని కనిపెట్టారా?
- అతన్ని కనిపెట్టాం.

14:06.597 --> 14:07.598
ఓహ్, దేవుడా.

14:09.933 --> 14:12.226
థాంక్స్. నా ఉద్దేశం, అది…

14:12.227 --> 14:14.812
- నిజంగా, థాంక్స్. నేను…
- ఇంకా ఉంది.

14:14.813 --> 14:17.982
మిస్టర్ రీడ్ ని పట్టుకున్నప్పుడు అతని
దగ్గర శ్రీమతి హెనెస్సీ ఫోన్ దొరికింది.

14:17.983 --> 14:19.817
సంఘటన స్థలంలో మాకు దొరకలేదు అన్నాం కదా?

14:19.818 --> 14:21.320
ఫోరెన్సిక్స్ వారు దాన్ని గుర్తించారు.

14:23.113 --> 14:24.156
అయితే, అది…

14:25.324 --> 14:26.449
అంతే. ఇదంతా ఇక పూర్తయినట్టే.

14:26.450 --> 14:30.162
ఇంకా చేయాల్సింది చాలా ఉంది, కానీ మాకు నమ్మకంగా ఉంది.

14:31.246 --> 14:32.580
అతను నేరం ఒప్పుకున్నాడా?

14:32.581 --> 14:35.417
నేను చెప్తున్నాను కదా, మాకు నమ్మకంగా ఉంది.

14:36.376 --> 14:38.836
సరే, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది?

14:38.837 --> 14:41.589
అతను కోర్టులో హాజరయ్యాడు,
అతన్ని మేము కౌంటీ జైలుకి తరలిస్తున్నాం.

14:41.590 --> 14:43.217
ఇప్పుడు నేను…

15:01.610 --> 15:03.153
- హలో?
- శ్రీమతి సింప్సన్?

15:03.654 --> 15:05.571
- ఎవరిది?
- ఆలివర్ నోక్.

15:05.572 --> 15:06.990
నేను స్కాట్ రీడ్ ప్రతినిధిని.

15:09.409 --> 15:10.661
మీకు నా నంబర్ ఎలా దొరికింది?

15:11.578 --> 15:14.247
నా క్లయింట్ మొదటి నుండి పోలీసులతో తాను
అమాయకుడిని అని చెప్తూనే వచ్చాడు,

15:14.248 --> 15:16.083
కానీ వాళ్ళు అదేం పట్టించుకోవడం లేదు.

15:17.292 --> 15:18.710
ఆయన మీతో మాట్లాడాలి అన్నాడు.

15:28.178 --> 15:30.597
నేను స్కాట్ రీడ్ ప్రతినిధిని.
అర్జెంటు విషయం, దయచేసి కాల్ చేయండి!

15:35.185 --> 15:36.686
కూర్చో.

15:36.687 --> 15:40.690
అకీ ఇంకా ఉప్పు చేప, అరటికాయ ఇంకా కల్లలూ.

15:40.691 --> 15:42.942
- నీకు ఇష్టమైనవి.
- నువ్వు వండావు.

15:42.943 --> 15:44.152
కూర్చో.

15:48.115 --> 15:49.949
చూడు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు…

15:49.950 --> 15:51.784
లేదు, లేదు, లేదు. థాంక్స్.

15:51.785 --> 15:54.162
కాదు. నాకు… నాకు ఒక కాల్ వచ్చింది.

15:55.581 --> 15:57.875
నాన్సీ వాళ్ళ సవితి తండ్రిని అరెస్ట్ చేశారు

15:59.001 --> 16:00.960
ఇప్పుడు అతను నాతో మాట్లాడాలి అంటున్నాడు.

16:00.961 --> 16:02.420
మరి అతనితో మాట్లాడటం నీకు ఇష్టం లేదా?

16:02.421 --> 16:05.882
అంటే, ఈ వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపిన వాడు కావొచ్చు.

16:05.883 --> 16:10.261
కాబట్టి నేను నేరుగా వెళ్లి అతని కళ్ళలోకి చూసి
ఎందుకో అడగాలి అనుకుంటున్నా, కానీ…

16:10.262 --> 16:11.638
కానీ ఏంటి?

16:12.222 --> 16:13.223
నా వల్ల కావడం లేదు.

16:14.433 --> 16:15.684
నేను వెనక్కి వెళ్ళలేను.

16:16.435 --> 16:21.981
నేను ఏదైనా మంచి పని చేయడానికి ట్రై చేసిన ప్రతీసారి,
ఇంకా పెద్ద రాద్ధాంతం జరుగుతోంది అనిపిస్తోంది.

16:21.982 --> 16:25.985
ఎలనోర్, నీ బెస్ట్ ఫ్రెండ్ భర్తతో పడుకున్నప్పుడు అసలు అది

16:25.986 --> 16:27.863
తప్పు అని నీకు ఎందుకు అనిపించలేదు?

16:29.239 --> 16:32.909
వావ్. ఎప్పుడూ ఇలా కఠినంగానే మాట్లాడాలా?

16:32.910 --> 16:35.077
మరి నన్ను ఇంకేం చేయమంటావు?
ఊరికే లాలిస్తూ మాట్లాడాలా?

16:35.078 --> 16:36.246
అవును. అవును.

16:36.788 --> 16:37.872
కనీసం ఈ ఒక్కసారైనా,

16:37.873 --> 16:41.918
నువ్వు నా తరఫున ఉన్నట్టు నటించినా
నాకు సంతోషంగానే ఉంటుంది.

16:41.919 --> 16:42.920
ఎందుకంటే అప్పుడు…

16:43.629 --> 16:45.130
నేను వెళ్ళిపోయింది అందుకే.

16:48.133 --> 16:50.761
నీకు అలాగే రాబర్ట్ కి మధ్య జరిగిన విషయం ఆధారంగా

16:51.595 --> 16:53.055
నువ్వు పలానా మనిషివి అని ఎవరూ అనలేరు.

16:53.722 --> 16:54.848
అది ఒక పొరపాటు.

16:55.349 --> 16:57.183
అందుకు నువ్వు మూల్యం చెల్లించావు.

16:57.184 --> 16:58.769
నేను నిన్ను చూస్తున్నాను కదా,

16:59.770 --> 17:01.188
నువ్వు పరిహారం చేసుకున్నావని నాకు తెలుసు.

17:03.690 --> 17:04.691
అమ్మా…

17:05.983 --> 17:07.653
నేను అది నిజం అనుకున్నాను.

17:08.945 --> 17:10.404
నిజంగా.

17:10.405 --> 17:13.658
కాబట్టి నన్ను నేను పూర్తిగా వాడికి ఇచ్చుకున్నాను.

17:13.659 --> 17:15.617
కానీ ఇంకెప్పుడూ నేను అలా చేయాలి అనుకోవడం లేదు.

17:15.618 --> 17:18.788
ఇంకెప్పుడూ ఎవ్వరితో నేను అలా ఫీల్ అవ్వాలి
అనుకోవడం లేదు.

17:18.789 --> 17:19.957
అలా అనుకోకు.

17:20.540 --> 17:22.291
అలా మనసును కట్టేసుకోకు.

17:23.961 --> 17:28.549
మీ నాన్న చనిపోయినప్పుడు, నేను ఆ బాధతోనే నిండిపోయా.

17:30.717 --> 17:32.636
నేను చేసిన తప్పు చేయకు.

17:34.346 --> 17:35.514
రాబర్ట్ నీకు సరైనవాడు కాదు.

17:36.557 --> 17:38.392
అంతే.

17:39.768 --> 17:41.353
కానీ నీ ఫ్రెండ్స్…

17:41.937 --> 17:43.354
ఎలనోర్,

17:43.355 --> 17:49.069
నువ్వు ప్రేమించే వారిని, నీతో జీవితాన్ని
పంచుకునేవారిని నువ్వు కనుగొన్నావు.

17:49.862 --> 17:52.572
నీకు ఈ విషయం నేను నేర్పలేదని తెలుస్తోంది,

17:52.573 --> 17:55.534
కానీ నీ అంతట నువ్వే అది నేర్చుకున్నావు.

17:56.743 --> 17:57.744
అలాగే వాళ్లంతా ఉన్నారు చూడు,

17:58.745 --> 18:00.998
నువ్వు నిజంగా వాళ్ళని ప్రేమించేటట్టు అయితే,

18:02.332 --> 18:04.585
అప్పుడు నువ్వు వాళ్లకి అది చూపించాలి.

18:06.545 --> 18:08.337
దానర్థం నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళాలి.

18:08.338 --> 18:11.675
వెళ్లి నువ్వు మొదలెట్టిన విషయాన్ని ముగించి రా.

18:12.718 --> 18:15.304
ఎందుకంటే నువ్వు అలా చేయలేదంటే, నన్ను నమ్ము,

18:16.471 --> 18:18.223
నువ్వు ఎలా అయితే కాకూడదు అనుకున్నావో అలాగే అవుతావు.

18:19.725 --> 18:23.270
మనసు రాయి చేసుకుని, తాను ప్రేమించే వ్యక్తితో
కనీసం భోజనం కూడా

18:24.980 --> 18:27.357
సరిగ్గా చేయలేని మనిషివి అవుతావు.

18:37.284 --> 18:38.826
నన్ను ఏం చేయమంటారు?

18:38.827 --> 18:40.370
అంటే, అవును, బేబీ.

18:43.498 --> 18:45.250
సరే. అయితే, నువ్వు వాడికి కాల్ చెయ్.

19:02.935 --> 19:04.603
- హలో.
- ప్లీజ్.

19:07.189 --> 19:08.815
అతను ఒక నిమిషంలో వస్తాడు.

19:30.754 --> 19:31.839
ఆమెను నేను చంపలేదు.

19:34.508 --> 19:35.717
నేను పోలీసులకు కూడా అదే చెప్పాను.

19:36.802 --> 19:38.302
వాళ్ళు నా మాటలు నమ్మడం లేదు.

19:38.303 --> 19:40.721
నేనే ఆమె వెంటబడినట్టు కథ సృష్టిస్తున్నారు.

19:40.722 --> 19:44.101
కానీ ఆమె చనిపోవడానికి రెండు రోజుల ముందు
తనే నాకు కాల్ చేసింది.

19:50.816 --> 19:53.485
భలే, స్వయానా ఫ్యాన్సీ నాన్సీ తారసపడిందే.

19:56.572 --> 19:58.323
నువ్వు ఇంకా అదే సెంట్ కొడుతున్నావు.

20:00.492 --> 20:01.493
బీర్.

20:06.832 --> 20:07.958
ఉంగరం చాలా బాగుంది.

20:16.925 --> 20:17.926
సరే, ఏంటి?

20:19.511 --> 20:21.388
కళ్ళలోకి చూసుకుంటూ గడిపేద్దామా?

20:28.520 --> 20:29.813
నేను చిన్నపిల్లని.

20:32.816 --> 20:34.483
నువ్వు నాకు చేసిన పనులు…

20:34.484 --> 20:35.652
నేను కేవలం ఒక చిన్న పిల్లని.

20:36.862 --> 20:37.945
టైమ్ వృధా.

20:37.946 --> 20:40.656
లేదు, నువ్వు మర్యాదగా కూర్చుని నా మాటలు వినాలి.

20:40.657 --> 20:41.658
శాంతించు, సరేనా?

20:46.747 --> 20:48.373
అవును, తను నాకు అంతా చెప్పింది.

20:48.874 --> 20:50.708
ఆమె నీ భర్తతో పడుకుంది.

20:50.709 --> 20:52.377
అందరికీ ఆ విషయంలో అబద్ధం చెప్పింది.

20:53.545 --> 20:54.963
అలాగే వాడొక కామకుక్క అని కూడా చెప్పింది.

20:55.631 --> 20:57.174
దేనికైనా వద్దు అంటే ఊరుకోడు అంట.

20:58.717 --> 21:01.219
చివరికి ఆమెకు ఆమె నగ్న ఫోటోలు కూడా పంపాడు అంట.

21:01.220 --> 21:02.429
ఆమె భర్త వాటిని చూసాడు.

21:03.472 --> 21:05.599
ఆమెకు కనీసం మాట చెప్పుకోవడానికి
ఎవరూ ఉన్నట్టు లేరు అనిపించింది.

21:06.475 --> 21:07.559
కాబట్టి మేము ఆ పని చేసాం.

21:09.770 --> 21:13.273
కొన్ని రోజుల తర్వాత ఆమె నాకు మళ్ళీ కాల్ చేసింది,
ఆమె ఎక్కడికో…

21:14.399 --> 21:15.525
ఒక పుట్టినరోజు పార్టీకి…

21:15.526 --> 21:17.276
లేదు. లేదు, క్షమించు.

21:17.277 --> 21:19.403
ఇది… నాకు ఇదేమి అర్థం కావడం లేదు.

21:19.404 --> 21:21.823
ఆమె నీకు అస్సలు కాల్ చేసి ఉండేది కాదు.
ఆమెకు నువ్వు అస్సలు గిట్టవు.

21:22.574 --> 21:24.158
నువ్వు తన జీవితాన్ని నాశనం చేసావు.

21:24.159 --> 21:26.244
ఆమె నా రక్షణ అడిగింది.

21:26.245 --> 21:27.328
ఎలా?

21:27.329 --> 21:29.247
నువ్వు తనని ఎలా కాపాడగలవు?

21:29.248 --> 21:30.541
వాడిని భయపెట్టమని నన్ను అడిగింది.

21:31.917 --> 21:33.584
వాడిని కొంచెం కొట్టమంది.

21:33.585 --> 21:35.170
వాడు వెనక్కి తగ్గేలా చేయమంది.

21:35.671 --> 21:37.380
నేను అదే చేయడానికి వెళ్ళా.

21:37.381 --> 21:38.674
ఆమెకు కనీసం ఆమాత్రం రుణపడి ఉన్నా.

21:49.434 --> 21:52.437
నాన్సీ మరణించిన రాత్రి

22:07.119 --> 22:08.786
- వెనక్కి రా.
- ఆగు…

22:08.787 --> 22:09.788
హేయ్.

22:10.414 --> 22:12.498
- మనం ఇది ఆపేయాలి.
- హలో?

22:12.499 --> 22:13.834
నేను తనకి చెప్పాలి.

22:14.793 --> 22:16.419
- నువ్వు అది నిజంగా అనడం లేదు.
- ఎక్కడున్నావు?

22:16.420 --> 22:18.504
తను ఇంకెప్పటికీ నాతో మాట్లాడకపోవచ్చు,
కానీ ఆమెకు కనీసం

22:18.505 --> 22:19.673
- నిజం తెలియాలి.
- నా మాటలు వినిపిస్తున్నాయా?

22:23.510 --> 22:24.636
ఛ.

22:45.365 --> 22:47.868
అతను… ఆమె మీద పడి ఉన్నాడు…

22:48.493 --> 22:49.494
ఆమె శరీరం మీద.

22:50.871 --> 22:54.082
ఆమె చేతికి ఏదో… చేతికి ఏదో చేసాడు.
అదేంటో నేను చూడలేదు.

22:56.710 --> 22:58.754
మరి నువ్వు ఆమెను అక్కడే వదిలేసావా?

22:59.463 --> 23:01.380
నన్ను ఇంకేం చేయమంటావు?

23:01.381 --> 23:02.549
సాయం కోసం పిలవాలి.

23:04.051 --> 23:05.301
పోలీసులకు చెప్పాలి.

23:05.302 --> 23:07.304
నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా?

23:08.138 --> 23:10.515
నీ భర్త నీ బెస్ట్ ఫ్రెండ్ ని చంపాడు.

23:10.516 --> 23:12.600
మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు?

23:12.601 --> 23:15.521
ఎందుకంటే నేను చెప్పడానికి ట్రై చేశా,
కానీ ఎవరూ నా మాటలు నమ్మలేదు.

23:19.650 --> 23:20.651
ఎక్కడికి వెళ్తున్నావు?

23:21.276 --> 23:22.361
పోలీస్ స్టేషన్ కి.

23:23.028 --> 23:24.154
నేను కూడా నీతో వస్తా.

23:25.113 --> 23:27.157
సిటీ హాల్

23:49.346 --> 23:51.597
వాళ్ళు హెనెస్సీ కేసు విషయంలో అర్జెంట్ సమాచారం
ఉంది అన్నారు.

23:51.598 --> 23:53.891
- అది నువ్వు వింటే మంచిది అనుకున్నా.
- నేనొక ప్రెస్ సమావేశానికి వెళ్ళాలి.

23:53.892 --> 23:55.434
- త్వరగా చెప్పండి.
- మేము స్కాట్ ని కలవడానికి వెళ్లాం.

23:55.435 --> 23:57.854
- నాకు తెలుసు.
- డిటెక్టివ్, అతను చెప్పేది నిజం.

23:57.855 --> 23:59.313
అందుకు మీ ఆధారం ఏంటి?

23:59.314 --> 24:01.315
అతను. అతనే. అతనే అసలు సాక్షి.

24:01.316 --> 24:02.441
హోవర్డ్ చంపడం అతను చూసాడు.

24:02.442 --> 24:04.360
నేరానికి సంబంధించిన విషయాలు అతనికి తెలియడానికి కారణం…

24:04.361 --> 24:06.320
- అవును, అది చేసింది అతనే కాబట్టి.
- కాదు.

24:06.321 --> 24:08.365
అతనే నేరస్థుడు అయ్యుండాలని
కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది ఎందుకు?

24:09.157 --> 24:11.325
మా పని ఎలా చేస్తామో చెప్తాను వినండి.

24:11.326 --> 24:15.371
ఇందులో, నా దగ్గర వెరిఫై చేయదగిన,
బలమైన ఫిజికల్ ఆధారాలు ఉన్నాయి.

24:15.372 --> 24:16.956
- అవును, కానీ మీరు…
- నా దగ్గర ఫోన్ రికార్డులు,

24:16.957 --> 24:18.165
బాధితురాలి ఫోన్ మీద ప్రింట్లు ఉన్నాయి.

24:18.166 --> 24:21.794
అలాగే మిస్టర్ రీడ్ ఆమెను బెదిరిస్తూ ఇంస్టాగ్రామ్ లో
పంపిన మెసేజిలు కూడా ఉన్నాయి.

24:21.795 --> 24:23.796
- అతనితో మాట్లాడి చూడు. అసలు…
- కాబట్టి అతనికి ఉద్దేశం ఉంది అనొచ్చు.

24:23.797 --> 24:27.425
డిఏ ఆఫీస్ లో సమర్పించడానికి నాకు కావాల్సినవి
అన్నీ నా దగ్గర ఉన్నాయి.

24:27.426 --> 24:30.928
అలాగే దారుణమైన నేరానికి బలైన బాధితురాలికి
న్యాయం జరుగుతోంది అనే మంచి వార్త

24:30.929 --> 24:33.306
వినడానికి బయట కోకొల్లలుగా రిపోర్టర్లు ఎదురుచూస్తున్నారు.

24:33.307 --> 24:37.768
కాబట్టి, ఇక్కడ ఉన్నదానికంటే మంచిది ఏదైనా
మీ దగ్గర ఉంటే తప్ప, ఇక మాట్లాడటానికి ఏం లేదు.

24:37.769 --> 24:40.272
- అతను…
- హోవర్డ్ ఫోన్ లేదా అతని ల్యాప్ టాప్ సంగతి ఏంటి?

24:41.273 --> 24:43.191
ఇంత వరకు మీరు చెప్పినవి అన్నీ
సందర్భానుసారంగా జరిగినవే.

24:43.192 --> 24:46.068
కానీ హోవర్డ్ ని నాన్సీతో కనెక్ట్ చేసేది
ఏదైనా మేము ఇవ్వగలిగితే?

24:46.069 --> 24:49.447
నాన్సీ నగ్న ఫోటోలు ఎవరో ఒకరు ఆమె ఫోన్ కి పంపారు.

24:49.448 --> 24:51.157
అవి ఖచ్చితంగా హోవర్డ్ దగ్గరే ఉండి ఉండాలి.

24:51.158 --> 24:53.368
అతని కంప్యూటర్ ని వెతకడానికి వారెంట్ తెప్పించగలవా?

24:54.286 --> 24:55.369
ఇక మాటలు లేవు.

24:55.370 --> 24:57.496
ఏంటి? డిటెక్టివ్, నిజంగా అంటున్నావా?

24:57.497 --> 24:59.540
- సరే. హేయ్, మేరీ! మేరీ.
- మీరు మీ పని చేయాలి!

24:59.541 --> 25:00.875
- ఆగు. నాకు తెలుసు.
- ఇదే తన ఉద్యోగం.

25:00.876 --> 25:03.086
- కానీ ఆమె అస్సలు లెక్క చేయడం లేదు.
- ఆపు. ఇక్కడ అరవకు.

25:03.879 --> 25:04.922
పదా.

25:05.839 --> 25:06.840
ప్లీజ్.

25:09.218 --> 25:10.718
నేను రేపు కోర్టుకు వెళ్ళాలి.

25:10.719 --> 25:12.678
కానీ నా దగ్గర ఏం లేదు.

25:12.679 --> 25:15.890
హోవర్డ్ నా కూతుళ్లను తీసుకుపోతాడు.
వాడు నా కూతుళ్లను తీసుకుపోతాడు, ఎల్లి.

25:15.891 --> 25:18.100
- నువ్వు మత్తులో ఉన్నావా?
- ఏంటి? లేదు!

25:18.101 --> 25:20.312
నువ్వు ఆ మాత్రలు వేసుకోవడం లేదని చెప్పావు.

25:20.979 --> 25:23.022
నాన్సీ చనిపోయే వరకు నేను వాటిని వేసుకోలేదు, సరేనా?

25:23.023 --> 25:25.526
- అంటే నువ్వు అబద్ధం చెప్పావు.
- నువ్వు అర్థం చేసుకుంటావు అనిపించలేదు.

25:26.777 --> 25:29.403
నువ్వు అప్పటికే చాలా బిజీగా ఉన్నావు.

25:29.404 --> 25:34.116
కానీ నువ్వు అదంతా ఇంకా చాలా
బాగా హ్యాండిల్ చేసావు. కానీ నేను…

25:34.117 --> 25:35.869
నేను ఉక్కిరిబిక్కిరైపోయాను.

25:36.453 --> 25:41.916
ప్రతీ విషయానికి ఇబ్బంది పడేదాన్ని,
పిల్లల విషయంలో దృష్టి పెట్టగలిగేదాన్ని కాదు.

25:41.917 --> 25:44.919
నేను… నేను ముందుకు కదలడానికి నాకు ఏదోకటి
కావాలి అనిపించింది.

25:44.920 --> 25:49.131
నువ్వు ఇదే సోఫా మీద కూర్చుని
నాకు హోవర్డ్ గురించి అంతా చెప్పావు,

25:49.132 --> 25:51.342
వాడి ద్రోహం గురించి, వాడు చేసింది అంతా.

25:51.343 --> 25:54.220
అయినా కూడా నువ్వు నా నుండి ఇంకా చాలా దాచావు.

25:54.221 --> 25:57.598
మేరీ, మనం ఇలా ఒకరి కళ్ళలోకి ఒకరం
చూసుకుని అబద్ధాలు ఎలా చెప్పుకుంటున్నాం?

25:57.599 --> 25:58.933
నాకు తెలీదు! నువ్వే చెప్పు.

25:58.934 --> 26:01.894
నాకు తెలీదు. నేను ఒక్కదాన్నే అలా చేయలేదు.
నువ్వు, నేను, నాన్సీ కూడా.

26:01.895 --> 26:03.980
నాన్సీ కూడా అబద్ధం చెప్పింది.

26:03.981 --> 26:07.484
తను స్కాట్ తో మాట్లాడుతున్నా మనకు తెలీలేదు!

26:08.068 --> 26:12.573
నిజమే. నిజమే. నిజమే. నిజమే.

26:16.118 --> 26:20.581
మేరీ, నీ బర్త్ డే డిన్నర్ నుండి వెళ్లిన తర్వాత

26:21.582 --> 26:24.209
నేను వ్యాలే దగ్గర ఎదురుచూస్తూ నిలబడ్డా.

26:25.210 --> 26:26.712
అప్పుడు నాన్సీ వచ్చింది.

26:28.422 --> 26:32.509
తను నన్ను కూడా తనతో రమ్మంది,
కానీ నేను రాను అన్నాను.

26:33.552 --> 26:39.473
తను నాకు నిజం చెప్పడానికి ట్రై చేసింది,
కానీ నేను తనని చెప్పనివ్వలేదు.

26:39.474 --> 26:44.854
కానీ ఇప్పుడు తను లేకుండా పోయింది, అప్పటి నుండి
ఈ మాట చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది.

26:44.855 --> 26:47.566
కానీ నాకు… నాకు ఈ విషయం ఇక దాయాలని లేదు.

26:58.118 --> 27:01.496
నేను నాన్సీ వస్తువులను దొంగిలించడం మాత్రమే చేయలేదు.

27:03.373 --> 27:05.292
హోవర్డ్ ఇంకా నేను కొన్నిసార్లు…

27:07.586 --> 27:09.420
మేము సెక్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడు

27:09.421 --> 27:12.549
మేము రోల్ ప్లే చేస్తూ వాళ్ళలా నటించేవారం.

27:13.300 --> 27:15.260
నేను తనలా నటించేదాన్ని.

27:16.887 --> 27:19.515
నిజమైన ఫ్రెండ్స్ అలా చేయరు. అవునా?

27:22.142 --> 27:26.312
అలాగే నాకు తెలిసి కొన్నిసార్లు
నేను కూడా దీనికి కారణమే అనిపిస్తుంది.

27:26.313 --> 27:27.940
హోవర్డ్ కి ఆమె మీద కోరిక పుట్టడానికి.

27:30.817 --> 27:32.818
నన్ను క్షమించు, కానీ నీకు ఇది తెలిసి ఉంటే,

27:32.819 --> 27:35.572
నువ్వు నన్ను ఇంకెప్పటికీ మామూలుగా చూసేదానివి కాదు.

27:37.824 --> 27:40.953
నాకు తెలిసి మనం అందరం ఒక్కటే
విషయానికి భయపడినట్టు ఉన్నాం.

27:50.587 --> 27:54.173
ప్రతీరోజు మూడు గంటలకు నేను ఆర్టీకి
ఒక యాపిల్ తొక్క తీసి, కోసి ఇస్తాను.

27:54.174 --> 27:56.426
అలాగే జూనికి మొత్తంగా అలాగే ఇస్తా.

27:57.094 --> 27:58.344
ప్రతీ రోజు.

27:58.345 --> 28:01.890
మా జీవితాలను ఊహించదగినట్టుగా, వాళ్లకు సురక్షితంగా

28:02.599 --> 28:08.522
అనిపించేలా చేయడానికి నేను చేసే
చాలా పనులలో అది కూడా ఒకటి.

28:12.276 --> 28:13.652
ఈ విషయం హోవర్డ్ కి తెలీదు.

28:18.657 --> 28:20.617
అది కనిపించే విషయం కాదు కాబట్టి ఎవరికీ తెలీదు.

28:27.749 --> 28:29.710
నా పిల్లలు నలిగిపోతారు.

28:39.094 --> 28:40.679
ఇప్పుడు మనం ఏం చేయాలి?

28:41.805 --> 28:43.473
మనం నిజంతో మొదలెట్టాలి.

28:51.315 --> 28:52.900
నేను కోరాతో మాట్లాడతాను.

28:54.067 --> 28:56.903
తన తండ్రిగా ఇది నీకు తెలిస్తే మంచిది అనుకున్నాను,

28:56.904 --> 29:00.114
నేను తనకి… తనకి మొత్తం చెప్పబోతున్నాను అని.

29:00.115 --> 29:02.325
మన గురించి, అలాగే నాన్సీ ఇంకా స్కాట్ గురించి.

29:02.326 --> 29:04.661
నాకు తెలిసి నాన్సీకి ఇంకొంచెం టైమ్ ఉండి ఉంటే,

29:05.329 --> 29:08.164
తన గతం గురించి ఆమె కోరాకి నిజం చెప్పేది.

29:08.165 --> 29:09.916
వద్దు. అస్సలు వద్దు.

29:09.917 --> 29:13.628
రాబర్ట్, నువ్వు హెనెస్సీవి కాబట్టి ఈ రహస్యాలు దాచడం నీకు

29:13.629 --> 29:17.257
ఇబ్బందిగా లేకపోవచ్చు, కానీ నేను అలా కాదు.

29:18.133 --> 29:20.801
నా వల్ల కాదు. నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదు.

29:20.802 --> 29:23.514
ఈ రహస్యాలే నాన్సీని చంపాయి.

29:24.681 --> 29:26.849
కోరాకి కూడా అలా కావడం నాకు ఇష్టం లేదు.

29:26.850 --> 29:30.436
నేను తనని బాధపెట్టా, కాబట్టి ఆమెకు నేను నిజం చెప్పాలి.

29:30.437 --> 29:32.313
నిజమా? అది ఇప్పటికే నేనొక వెధవని అనుకుంటోంది.

29:32.314 --> 29:33.732
ఇప్పుడు నీ వల్ల పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది.

29:34.691 --> 29:36.443
ఇది నీ గురించి కాదు.

29:37.110 --> 29:38.736
- ఓహ్, అవునా?
- అవును.

29:38.737 --> 29:41.281
ఇది నేను నువ్వు ఆశించింది
నీకు ఇవ్వడం లేదని చేసే పని కదా?

29:42.824 --> 29:44.368
నువ్వు మొదటి నుండి కోరుకున్నదాని కోసం?

29:46.662 --> 29:47.663
కాదు.

29:49.498 --> 29:50.499
కాదు.

29:51.625 --> 29:54.545
నేను ఒకప్పుడు నీ నుండి ఒకటి కావాలి అనుకునేదాన్ని.

29:56.129 --> 29:57.965
కానీ ఇప్పుడు అలా ఏం లేదు.

30:00.175 --> 30:02.135
నేను కోరాతో మాట్లాడబోతున్నాను.

30:03.470 --> 30:05.472
నిన్ను నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది.

30:05.973 --> 30:07.432
- ఎలనోర్.
- ఏంటి?

30:10.727 --> 30:12.145
నన్ను క్షమించు.

30:30.205 --> 30:31.622
నాకు ఇక్కడే ఉండాలని ఉంది.

30:31.623 --> 30:32.707
నాకు తెలుసు.

30:32.708 --> 30:36.753
ప్రస్తుతం నువ్వు నాకోసం చేయగల బెస్ట్ పని
నీ చెల్లళ్ళను జాగ్రత్తగా చూసుకోవడమే, సరేనా?

30:37.379 --> 30:38.797
ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నావా?

30:39.965 --> 30:41.842
నీ ఎల్లి ఆంటీ ఇంకా నాకు ఒక ప్లాన్ ఉంది.

30:43.302 --> 30:44.595
ఐ లవ్ యు, బంగారం.

30:45.137 --> 30:46.680
నా కోసం చెల్లెళ్లను హగ్ చేసుకో.

30:48.182 --> 30:49.224
అలాగే.

30:50.017 --> 30:51.977
- ఐ లవ్ యు టూ.
- బై.

30:56.523 --> 30:59.066
నేను మేరీ లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.

30:59.067 --> 31:00.234
మనం ఎవ్వరం చూసి ఉండము.

31:00.235 --> 31:04.198
ఆమె మనసు నిజంగా వెన్నలాంటిది.

31:04.865 --> 31:10.244
ఆమె విశాల హృదయంలో తనకు తెలిసిన
అందరికీ ఒక చోటు ఖచ్చితంగా ఉంటుంది.

31:10.245 --> 31:13.039
అన్నిటికంటే ముఖ్యంగా తన పిల్లల కోసం.

31:13.040 --> 31:17.961
మార్కస్, జూనిపర్ ఇంకా ఆర్టెమిస్లను మేరీ కన్నా
ఎవరూ ఎక్కువగా ప్రేమించలేరు.

31:19.004 --> 31:20.380
థాంక్స్, మిస్ బుషే.

31:23.509 --> 31:24.760
మిస్ బుషే,

31:26.220 --> 31:29.430
అక్టోబర్ 2025లో ప్రతివాది తన ఎనిమిది ఏండ్ల కూతురితో

31:29.431 --> 31:33.185
ఒక సంఘటనలో పడిన సంగతి మీకు ఏమైనా గుర్తుందా?

31:33.894 --> 31:35.436
నేను నా క్యాలెండర్ ని చెక్ చేయాలి.

31:35.437 --> 31:37.104
ఓహ్, అదేం పర్లేదు, నేను వివరంగా చెప్తాను.

31:37.105 --> 31:42.276
శ్రీమతి సింప్సన్ ఇల్లీగల్ గా పొందిన మాదక ద్రవ్యాలను తీసుకుని

31:42.277 --> 31:46.155
అక్టోబర్ 19, 2025 నాడు ఆర్కో గ్యాస్ స్టేషన్

31:46.156 --> 31:48.115
నుండి తన కూతురు జూనిపర్ ఇంకా మినీ-మార్ట్ లో ఉండగా

31:48.116 --> 31:50.869
డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయిన విషయం మీకు గుర్తుందా?

31:57.167 --> 31:58.502
అవును.

31:59.253 --> 32:00.921
అవును. ఏంటి?

32:02.256 --> 32:04.966
అవును, నాకు గుర్తుంది.

32:04.967 --> 32:06.509
తను కూడా ఒక మనిషే. తను ఒక పొరపాటు చేసింది.

32:06.510 --> 32:08.427
అలాగే జూన్ నాలుగవ తారీఖున,

32:08.428 --> 32:11.305
శ్రీమతి సింప్సన్ చీటీ లేకుండా తీసుకున్న ఆడెరాల్

32:11.306 --> 32:13.850
- ఓవర్ డోస్ కావడం వల్ల ఆమె చిన్న కూతురు…
- అది నా పని కాదని చెప్పాను కదా.

32:13.851 --> 32:15.309
- అది హోవర్డ్ తప్పు.
- …ఎమెర్జెన్సీలో అడ్మిట్

32:15.310 --> 32:17.187
చేయబడినప్పుడు మీరు అక్కడ ఉన్నారా?

32:21.483 --> 32:23.276
అవును, నేను హాస్పిటల్ లో ఉన్నాను.

32:23.277 --> 32:24.444
థాంక్స్.

32:25.279 --> 32:26.780
ఇక నాకు ప్రశ్నలు వేరే ఏమీ లేవు, యువర్ హానర్.

32:27.698 --> 32:29.074
మీరు ఇక వెళ్లొచ్చు.

32:31.285 --> 32:33.287
వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా, మిస్ టిస్డాల్?

32:35.414 --> 32:36.956
నిజానికి ఉన్నారు, యువర్ హానర్.

32:36.957 --> 32:38.584
ఆమె ఇప్పుడే వచ్చింది.

32:49.219 --> 32:52.306
నేను హోవర్డ్ తో ఎనిమిది సంవత్సరాలు సంసారం చేశా.

32:53.015 --> 32:54.349
మీకు పిల్లలు ఉన్నారా?

32:56.101 --> 33:00.689
లేరు, కారణంగా హోవర్డ్ తీవ్రంగా నిరాశ చెందాడు.

33:02.357 --> 33:05.319
నేను గర్భవతిని అయ్యాను, కానీ గర్భస్రావం జరిగింది.

33:05.944 --> 33:10.824
ఇప్పుడు అది తలచుకుంటే, అది నా జీవితంలో
అతిపెద్ద దీవెనగా అనిపిస్తోంది.

33:11.450 --> 33:13.702
ఎందుకు? మాకు చెప్పగలరా?

33:15.662 --> 33:17.956
ఎందుకంటే కొంతమంది పిల్లల్ని కనకపోతేనే

33:18.498 --> 33:20.709
మానవ జాతికి మేలు.

33:22.127 --> 33:25.213
మీ మాటలు వింటుంటే మీరు
మీ భర్త గురించి పెద్దగా లెక్క చేయలేదు అనిపిస్తోంది.

33:25.214 --> 33:27.131
మొదట్లో లెక్క చేశా.

33:27.132 --> 33:32.554
హోవర్డ్ వికర్షణ ద్వారా ఎలాంటోళ్ళనైనా పడేయగలడు.

33:33.764 --> 33:36.808
అతను నా మీద చెయ్ చేసుకోవడానికి ఎనిమిది ఏళ్ళు పడింది.

33:38.143 --> 33:39.436
ఒక్కసారే జరిగింది, కానీ…

33:41.355 --> 33:42.481
ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిగింది.

33:45.192 --> 33:48.194
అతను నన్ను కనిపెట్టి అతని పని పూర్తి చేస్తాడేమో

33:48.195 --> 33:51.865
అనే భయం వదలడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది.

33:53.158 --> 33:55.451
కానీ అతన్ని ఇప్పుడు చూస్తుంటే,

33:55.452 --> 33:58.664
తన సామాన్యతని చూసుకుని భయపడే

33:59.289 --> 34:03.669
ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తున్నాడు అంతే.

34:16.849 --> 34:18.225
అందరూ నిలబడండి.

34:22.771 --> 34:23.772
దయచేసి కూర్చోండి.

34:26.525 --> 34:27.692
సరే.

34:27.693 --> 34:30.903
పిల్లల్ని మరొక రాష్ట్రానికి తీసుకెళ్లడానికి

34:30.904 --> 34:35.367
అత్యవసర ఆర్డర్ కోసం
చేసిన అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది.

34:36.909 --> 34:38.619
అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్యోగం ఒహయోలో.

34:38.620 --> 34:40.037
అంటే ఇంకొక ఉద్యోగం సంపాదించుకోమని అర్థం.

34:40.038 --> 34:42.832
అలాగే ప్రతివాది పిల్లలకు ప్రమాదం కలిగించింది అనే

34:42.833 --> 34:44.793
పెండింగ్ లో ఉన్న ప్రస్తుత ఛార్జీల విషయానికి వస్తే,

34:45.585 --> 34:47.588
నేను మైనర్ పిల్లలైన ఆర్టెమిస్ మరియు జూనిపర్ సింప్సన్

34:48.338 --> 34:51.841
నిజంగానే హానికరమైన పరిస్థితుల్లో ఉన్నారని,
అలాగే ఇరువురు

34:51.842 --> 34:54.927
తల్లిదండ్రులతో ఉండటం సురక్షితం కాదని భావిస్తున్నాను.

34:54.928 --> 34:56.345
- ఏంటి?
- నేను ఈ వ్యవహారాన్ని

34:56.346 --> 34:59.098
బాలల మరియు కుటుంబ సర్వీసుల డిపార్ట్మెంట్ కి రెఫెర్ చేస్తూ

34:59.099 --> 35:00.600
- ప్రస్తుతానికి పిల్లల్ని…
- లేదు.

35:00.601 --> 35:02.810
…తాత్కాలికంగా వారి వద్ద ఉంచమని రిక్వెస్ట్ చేస్తున్నా.

35:02.811 --> 35:04.312
ఒకసారి కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత

35:04.313 --> 35:08.191
మేము దీర్ఘకాలిక నిర్ణయం కొరకు మా
అభిప్రాయాలను మరొకసారి పరిశీలిస్తాం.

35:08.192 --> 35:09.401
కోర్టు డిస్మిస్ చేయబడింది.

35:10.694 --> 35:11.819
మనకి వేరే దారులు ఉన్నాయి.

35:11.820 --> 35:12.987
ఏం కాదు.

35:12.988 --> 35:14.072
ఇప్పుడు ఏం జరుగుతుంది?

35:16.867 --> 35:19.118
- ఇది ఇలా జరిగి ఉండకూడదు.
- నాకు తెలుసు. నాకు తెలుసు.

35:19.119 --> 35:20.621
అసలు ఇలా జరిగి ఉండకూడదు.

35:21.830 --> 35:23.289
మనం పోరాడుదాం.

35:23.290 --> 35:25.416
- అసలు నీకు ఏమైంది?
- లేదు. లేదు, లేదు, లేదు.

35:25.417 --> 35:27.460
- అసలు నీకు పిచ్చి పట్టిందా?
- ఆగు.

35:27.461 --> 35:31.465
నేను హోటల్ కి వచ్చి నిన్ను తీసుకెళ్తాను,
నువ్వు నాతో ఉండు.

35:47.523 --> 35:48.565
ఎల్లి?

36:17.302 --> 36:18.428
మేర్?

36:23.725 --> 36:25.143
మేరీ?

36:39.241 --> 36:41.492
హేయ్, మీరు మేరీకి అలాగే జూనికి కాల్ చేశారు.

36:41.493 --> 36:42.910
అలాగే నాకు!

36:42.911 --> 36:43.996
పదా.

36:48.959 --> 36:50.293
ఎల్లి ఆంటీ?

36:50.294 --> 36:52.461
హేయ్, మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసా?

36:52.462 --> 36:53.546
మా అమ్మ? లేదు.

36:53.547 --> 36:54.964
మీ నాన్న అక్కడే ఉన్నాడా?

36:54.965 --> 36:56.717
లేదు, లేదు. నేను ఆయన్ని చూడలేదు.

36:57.384 --> 36:59.010
నేను జూని ఇంకా ఆర్టీలను చూసుకుంటున్నాను,

36:59.011 --> 37:01.637
అప్పుడు సోషల్ సర్వీసెస్ వారు వచ్చి
వాళ్ళని తీసుకెళ్లిపోయారు.

37:01.638 --> 37:03.639
నాకు ఏం చేయాలో తెలీడం లేదు.

37:03.640 --> 37:07.268
సరే, నేను డిటెక్టివ్ బేతని గాంజ్
ఫోన్ నంబర్ నీకు ఇస్తాను.

37:07.269 --> 37:08.394
నువ్వు వెంటనే ఆమెకు కాల్ చెయ్.

37:08.395 --> 37:11.230
నువ్వు నా నుండి ఒకటి ఆమె దగ్గరకి తీసుకెళ్లాలి. సరేనా?

37:11.231 --> 37:13.275
సరే. సరే, సరే, సరే, అలాగే.

37:18.655 --> 37:19.656
నన్ను చంపబోతున్నావా?

37:21.658 --> 37:22.951
లేదు, నువ్వే నిన్ను చంపుకుంటావు.

37:23.911 --> 37:25.037
పెద్దగా కవర్ చేయనక్కరలేదు.

37:25.621 --> 37:27.413
పిల్లల్ని కోల్పోయిన డ్రగ్స్ కి బానిసైన తల్లి.

37:27.414 --> 37:29.249
కొన్ని నెలలుగా మానసిక ఆర్యోగం బాగోలేదు.

37:29.833 --> 37:32.710
బ్రతకడానికి ఆశ లేదు.
కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్ హత్య చేయబడిన చోట

37:32.711 --> 37:35.214
మణికట్టు కోసుకుని రక్తస్రావం వల్ల మరణించింది.

37:38.342 --> 37:40.219
ఎలనోర్ ఇంకా నేను స్కాట్ తో మాట్లాడాం.

37:44.139 --> 37:45.140
అతను నిన్ను చూసాడు.

37:46.433 --> 37:49.019
నువ్వు ఆ పని అతను చూసాడు.
నువ్వు నాన్సీని చంపడం అతను చూసాడు.

37:50.062 --> 37:53.273
అతనితో తనని ఇక్కడ కలవమని ఆమె చెప్పింది.

37:54.024 --> 37:59.988
అలాగే నువ్వు ఆమెను ఒంటరిగా వదిలేసేలా చేయడం
కోసం నిన్ను కొట్టమని అతనికి చెప్పింది.

38:01.073 --> 38:02.157
నువ్వు అబద్ధం చెప్తున్నావు.

38:03.158 --> 38:05.994
అవునా? నేను అబద్ధం చెప్తున్నానా?

38:06.703 --> 38:09.748
నాన్సీ గురించి నాకంటే నీకే బాగా తెలుసు అన్నావు.

38:10.749 --> 38:12.542
ఆమె ఇలాంటి పని చేయగలుగుతుందా?

38:12.543 --> 38:14.628
వాడు జైలులో ఉండగా మరి
నేనెందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నాను?

38:15.254 --> 38:16.255
ఎందుకంటే…

38:17.506 --> 38:21.927
ఎందుకంటే నువ్వే ఈ పని చేసినట్టు నిరూపించే
బలమైన ఆధారం కావాలని డిటెక్టివ్ గాంజ్ చెప్పింది.

38:22.511 --> 38:24.179
అలాగే ఎల్లి ఇంకా నేను అది సంపాదించాలి.

38:25.097 --> 38:28.892
మేము… మేము ఇవాళ నా హోటల్ గదిలో
రాత్రికి కలవాల్సి ఉంది.

38:30.352 --> 38:31.687
కానీ ఇప్పుడు నేను అక్కడ ఉండను.

38:34.815 --> 38:39.069
నేను ఆత్మహత్య చేసుకున్నానని
డిటెక్టివ్ గాంజ్ అస్సలు అనుకోదు.

38:41.113 --> 38:43.615
ఇది నీ పనే అని ఆమెకు తెలుస్తుంది.

38:45.242 --> 38:46.534
నా మాట విను, హోవర్డ్.

38:46.535 --> 38:47.827
నా మాట విను.

38:47.828 --> 38:49.872
ఇక్కడ నువ్వు చేయగల పని ఒక్కటే ఉంది, సరేనా?

38:50.455 --> 38:52.248
నన్ను ఎల్లికి కాల్ చేయనివ్వు.

38:52.249 --> 38:56.044
నా మాట విను.
నేను రావడం కుదరదు అని తనతో చెప్తాను.

38:56.545 --> 38:57.880
నేను ఆ పని చేయలేను.

39:00.257 --> 39:01.550
అప్పుడు నువ్వు పారిపో.

39:03.760 --> 39:05.971
నువ్వు వెళ్ళిపో.

39:07.181 --> 39:09.183
నువ్వు అమ్మాయిలను తీసుకెళ్లాల్సిన పనిలేదు.

39:09.766 --> 39:11.268
నీకు అమ్మాయిలు అవసరమే లేదు.

39:14.521 --> 39:16.940
వెళ్ళిపో.

39:19.818 --> 39:23.113
నువ్వు ఇక ఆఖరికి ఫ్రీగా ఉండగలవు.

39:27.492 --> 39:28.744
నన్ను ఆమెకు కాల్ చేయనివ్వు.

39:29.745 --> 39:30.787
సరేనా?

39:32.581 --> 39:33.707
ఏం కాదు.

39:39.087 --> 39:40.547
ఛ! అయ్యో!

39:44.051 --> 39:45.052
మొబైల్
మేరీ

39:48.263 --> 39:50.348
ఛ! అయ్యో, హోవర్డ్!

39:50.349 --> 39:51.599
నువ్వు నన్ను డెడ్ జోన్ కి తీసుకొచ్చావు.

39:51.600 --> 39:53.392
ఈ ఫోన్ కనెక్ట్ కాదు.

39:53.393 --> 39:54.477
ఇక చాలు.

39:54.478 --> 39:56.813
మనం ముందు అనుకున్నదే చేద్దాం.
లెగు. పదా. నడువు.

39:58.690 --> 40:00.943
ద డెడ్ జోన్.
బాధితురాలు ఇక్కడే హత్య చేయబడింది.

40:02.069 --> 40:03.819
ఓహ్, దేవుడా. డెడ్ జోన్.

40:03.820 --> 40:05.155
ఛ!

40:08.659 --> 40:09.785
నడువు.

40:11.912 --> 40:14.830
- నన్ను ప్రేమించడం ఎప్పుడు మానేసావు, ఆహ్?
- ఓహ్, ఊరుకో. ఊరుకో.

40:14.831 --> 40:15.832
లేదు!

40:17.209 --> 40:20.086
నేను నీకు నా జీవితాన్ని ధారబోసాను

40:20.087 --> 40:23.130
అలాంటిది ఇవాళ రాత్రి చావబోతున్నాను అంటే,
నాకు అది తెలుసుకోవాలని ఉంది.

40:23.131 --> 40:24.298
సరే, నీకు తెలుసుకోవాలని ఉందా?

40:24.299 --> 40:28.136
నువ్వు నాకు టీఏగా పని చేసినప్పుడు
నీకు లెక్కలేనంత సామర్థ్యం ఉండేది.

40:28.804 --> 40:32.014
ప్రపంచాన్ని వెలిగించగలదు అనిపించిన మనసు నీకు ఉండేది.

40:32.015 --> 40:33.307
కానీ నువ్వలా ఏం చేయలేదు.

40:33.308 --> 40:36.728
నువ్వొక నీరసం మొహానివి, తలనొప్పి మనిషివి,
అలాగే మెద్దువి అయ్యావు.

40:37.229 --> 40:38.564
ఆ పని ఎందుకు చేసావు?

40:40.315 --> 40:42.400
చెప్పు, హోవర్డ్. నాన్సీని ఎందుకు చంపావు?

40:42.401 --> 40:45.529
ఎందుకంటే నేను ఆమెకు చూపించాలి అనుకున్నాను,
కానీ తను మాట వినలేదు.

40:53.787 --> 40:54.996
మనం ఇక్కడ ఏం చేస్తున్నాం?

40:54.997 --> 40:55.998
చూడు.

40:57.749 --> 40:58.916
నేనేం చూస్తున్నాను?

40:58.917 --> 41:00.043
ఇది!

41:00.878 --> 41:02.795
- బ్రిడ్జ్?
- ద కాలన్నెడ్.

41:02.796 --> 41:06.049
రాత్రి పూట దీనికంటే అందమైంది ఇంకొకటి ఉండదు.

41:07.217 --> 41:08.510
నాకు చలిగా ఉంది.

41:09.303 --> 41:11.263
ఇది ఇన్నాళ్లూ మన ఊర్లోనే ఉంది.

41:11.930 --> 41:14.599
కానీ నువ్వు దీన్ని ఈ యాంగిల్ లో
ఇంతకు ముందు చూసి ఉండవు.

41:14.600 --> 41:17.310
ఇప్పుడు నేను నీ రూపకాలు వినే మూడ్ లో లేను.

41:17.311 --> 41:18.394
మనం వెనక్కి వెళదామా?

41:18.395 --> 41:20.230
ఆగు, నేను నీతో ఒకటి చెప్పాలి.

41:22.691 --> 41:23.858
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

41:23.859 --> 41:26.612
- హోవర్డ్, ప్లీజ్…
- ఆగు, ఆగు, ఆగు. నన్ను చెప్పనివ్వు.

41:27.279 --> 41:29.655
మనం కలిసి ఉండొచ్చు. నేను ప్లాన్ చేశా.

41:29.656 --> 41:31.407
నేను డబ్బు పోగేసాను.

41:31.408 --> 41:33.201
నాకు అదంతా వద్దు.

41:33.202 --> 41:36.913
నువ్వు ఆ రాత్రి థియేటర్ లో నాతో ఉన్నప్పుడు
ఉన్నంత సంతోషంగా, ఉత్సాహంగా ఎప్పుడూ లేవు.

41:36.914 --> 41:38.206
- ఏంటి?
- నీలో ఆ అభిరుచిని

41:38.207 --> 41:40.334
- రేకెత్తించానని నాకు తెలుసు.
- నీకు బుర్ర దొబ్బింది!

41:43.337 --> 41:44.378
ఎత్తడానికి స్లైడ్ చేయండి

41:44.379 --> 41:45.380
వెనక్కి రా.

41:47.132 --> 41:48.133
లేదు.

41:49.259 --> 41:50.719
మనం ఇది ఆపేయాలి.

41:51.929 --> 41:53.055
నేను తనకి చెప్పాలి.

41:54.014 --> 41:55.015
నువ్వు అది నిజంగా అనడం లేదు.

41:55.641 --> 41:58.893
తను ఇంకెప్పటికీ నాతో మాట్లాడకపోవచ్చు,
కానీ ఆమెకు కనీసం నిజం తెలియాలి.

41:58.894 --> 42:00.729
ఓహ్, ఊరుకో.
నువ్వు మేరీ గురించి అస్సలు లెక్క చేయవు.

42:12.741 --> 42:14.743
నీ గురించి కాకపోయి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండి ఉండేది.

42:17.996 --> 42:19.455
నువ్వేం చేస్తున్నావు?

42:19.456 --> 42:21.333
బలహీనురాలు తను కాదు.

42:22.626 --> 42:23.669
నువ్వు.

42:27.297 --> 42:29.132
చెత్త ముండా!

42:35.430 --> 42:36.473
- దొరికావు.
- ఓహ్!

42:50.737 --> 42:51.738
నువ్వు అంతా నాశనం చేసావు.

42:52.489 --> 42:53.699
మనం కలిసి…

42:54.700 --> 42:56.910
మనం కలిసి… మనం కలిసి…

42:57.494 --> 42:58.745
మనం కలిసి…

43:24.021 --> 43:25.022
ఓహ్, దేవుడా.

43:25.606 --> 43:28.107
మేర్. మేరీ. మేరీ!

43:28.108 --> 43:30.902
ఓహ్, దేవుడా. లెగు, ప్లీజ్. దయచేసి లెగు.

43:30.903 --> 43:31.987
ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా.

43:39.828 --> 43:41.663
లేదు! లేదు!

43:59.139 --> 44:00.348
ఏం కాదు.

44:00.349 --> 44:01.350
మనకు ఇక ప్రమాదం లేదు.

44:01.975 --> 44:04.060
నీకేం కాదు. ఓహ్, దేవుడా.

44:04.061 --> 44:06.522
- ఓహ్, దేవుడా. మనం…
- మనకేం కాదు.

44:07.064 --> 44:08.190
మనకేం కాదు.

44:20.285 --> 44:21.286
థాంక్స్.

44:22.204 --> 44:25.749
- క్షమించాలి, మీరు కుటుంబికులా?
- అవును, నేను తనతో వెళ్తున్నా. మేరీ.

44:26.542 --> 44:27.543
ఎల్లి.

44:33.632 --> 44:34.633
నువ్వు బానే ఉన్నావా?

44:38.220 --> 44:39.555
నువ్వు?

44:41.473 --> 44:42.474
ఏమో.

44:45.978 --> 44:47.479
నాకు తెలీదు.

45:11.461 --> 45:13.463
మేము ముసలితనం వరకు కలిసి ఉండాల్సిన వారిమి.

45:14.131 --> 45:17.300
మేము అనుకున్నది అదే.
అది మేము చిన్నప్పుడు చేసుకున్న ప్రమాణం.

45:17.301 --> 45:19.177
నాన్సీ లారెన్ హెనెస్సీ
ప్రేమించిన భార్య, తల్లి అలాగే స్నేహితురాలు

45:19.178 --> 45:22.514
స్నేహానికి ఉన్న భయంకరమైన వ్యంగ్యం
గురించి తెలియని వయసులో.

45:23.348 --> 45:28.187
మనం ఎవరినైనా ఎంత గాఢంగా ప్రేమిస్తే,
వారు పోయాక ఆ బాధ అంత దారుణంగా ఉంటుంది.

45:35.110 --> 45:37.196
నాన్సీ

45:50.542 --> 45:54.045
మనసు దారుణంగా ముక్కలైనప్పుడు, ఒంటరిగా ఉండాలని

45:54.046 --> 45:55.756
చాలా బలంగా అనిపిస్తుంది.

45:56.465 --> 45:58.091
కానీ అలా చేయడం తప్పు.

45:59.301 --> 46:02.679
ప్రేమించే ధైర్యం చేయడం ఎంతైనా మనకు మంచిదే.

46:03.472 --> 46:09.560
సంతోషాన్ని అలాగే బంధాన్ని నిర్మించుకోవడానికి
ముందుకు అడుగులు వేయాలి.

46:09.561 --> 46:11.939
జూనిపర్ పుట్టినరోజు పార్టీ మధ్యాహ్నం రెండు గంటలు

46:15.108 --> 46:17.694
అందుకునేవారు: బుజ్జి జూని
పంపినది: ఎలనోర్ ఆంటీ

46:36.755 --> 46:40.342
మేము ఎదుర్కొన్న బాధ అంతా
ఆఖరికి మంచిదే అని చెప్పాలి అనుకుంటున్నా.

46:40.926 --> 46:42.635
అది మేము ఎంత బలమైనవారిమో మాకు నేర్పింది.

46:42.636 --> 46:43.887
మేము కోలుకోగలం అని చూపింది.

46:45.138 --> 46:49.600
కానీ మేము కలిసి ఇంత ఎదుర్కొన్న తర్వాత,
మా మధ్య ఉన్న బంధాన్ని ఎప్పటికీ కోల్పోలేము.

46:49.601 --> 46:51.520
మా స్నేహం అంత బలమైనది.

46:52.479 --> 46:55.399
అది దేన్నైనా ఎదుర్కొని నిలబడగలదు.

46:57.109 --> 46:59.987
కనీసం ప్రస్తుతానికి.

47:52.289 --> 47:54.291
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
