WEBVTT

00:10.010 --> 00:11.594
- …అరవై.
- ఏమైంది?

00:11.595 --> 00:16.432
- నాడి వేగం పెరుగుతోంది. 145. 160.
- తనకి ఏమవుతోంది?

00:16.433 --> 00:18.267
- బుజ్జి, నువ్వు బానే ఉన్నావా?
- మేడం.

00:18.268 --> 00:20.520
- నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ ఇక్కడే ఉంది.
- మేడం, మీరు వెనక్కి వెళ్ళాలి.

00:20.521 --> 00:22.439
- సరే.
- పిల్లని వీ-ఫిబ్ మీద పెట్టాం!

00:23.023 --> 00:25.149
- నర్స్, ఈమెను బయటకు పంపేయండి.
- ఏం జరుగుతోంది?

00:25.150 --> 00:26.275
ఓహ్, దేవుడా.

00:26.276 --> 00:27.568
మేడం, మీరు వెళితేనే మా పని జరుగుతుంది.

00:27.569 --> 00:28.987
- అది నీ వల్లే ఇక్కడ ఉంది.
- పదా.

00:29.613 --> 00:31.656
- వద్దు, ప్లీజ్.
- ఏం కాదు, ఏం కాదు.

00:31.657 --> 00:34.076
దానికి ఏం కాదు. దానికి ఏం కాదు.

00:35.244 --> 00:36.452
దానికి ఏం కాదు.

00:36.453 --> 00:37.787
- లేదు! అది…
- దానికి ఏం కాదు.

00:37.788 --> 00:39.163
- రెడీ.
- ప్లీజ్.

00:39.164 --> 00:40.499
యాభైకి ఛార్జ్ చేయండి. క్లియర్!

00:41.542 --> 00:43.000
ఆమె అసిస్టోల్ స్థితిలో ఉంది.

00:43.001 --> 00:44.086
రిథమ్ చెక్ చేస్తున్నాం.

00:44.878 --> 00:47.422
- ఇంకా వీ-ఫిబ్ లోనే ఉంది.
- వందకి ఛార్జ్ చేయండి. క్లియర్!

00:49.716 --> 00:51.426
నాడి అందింది. బీపీ పెరుగుతోంది.

00:53.637 --> 00:54.638
ఓహ్, దేవుడా.

00:58.308 --> 00:59.309
ఓహ్, దేవుడా.

01:10.612 --> 01:11.737
హలో.

01:11.738 --> 01:14.241
డాక్టర్ చెన్ ప్రమాదం తప్పింది అన్నారు.

01:14.908 --> 01:17.119
ఇప్పుడు పిల్ల విశ్రాంతి తీసుకోవాలి అంతే.

01:19.079 --> 01:21.206
ఇంటికి వెళితే మంచిది. తర్వాత రండి.

01:24.877 --> 01:26.295
మీ అమ్మాయి హాస్పిటల్ లో ఉందా?

01:29.047 --> 01:30.465
అయితే ఏది మంచిదో నాకు చెప్పొద్దు.

01:40.017 --> 01:43.936
మేరీకి మొదటి నుండీ జరిగింది చాలా వింతగా అనిపించింది.

01:43.937 --> 01:46.064
ఆమెకు మాత్రలు వేసుకోవడం ఏరోజూ
మిస్ అయినట్టు గుర్తులేదు.

01:47.566 --> 01:50.819
కానీ కంటి ముందు ఆధారం కనిపిస్తోంది. చెక్కు చెదరని లైన్స్.

01:52.196 --> 01:54.030
అప్పట్లో ఆమె చాలా చిన్న వయస్కురాలు.

01:54.031 --> 01:58.035
ఆమె వృత్తి, అది కూడా మంచి ఎదుగుదల సాధించగల
రంగంలో, అప్పుడే మొదలైంది.

01:58.994 --> 02:00.454
మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం కావాలి?

02:04.541 --> 02:07.753
చిన్నప్పటి నుండే మేరీకి ఏ విషయాన్నైనా
వర్ణించడం చాలా బాగా అబ్బింది.

02:08.252 --> 02:09.463
చాలా చక్కగా మాట్లాడగలదు.

02:10.422 --> 02:12.840
వాళ్ళ ఇంట్లో జరిగే గందరగోళం నుండి
తన తమ్ముడు చెల్లిని

02:12.841 --> 02:15.886
కాపాడటానికి వాళ్ళ దృష్టి మళ్లించడానికి
ఆ సామర్థ్యాన్ని వాడింది.

02:19.014 --> 02:22.767
కథలు, ముఖ్యంగా రేకెత్తించేవి, అలాగే రహస్యం అనిపించేవి

02:22.768 --> 02:23.977
ఆమెను సేదదీర్చేవి.

02:25.270 --> 02:26.562
విధి ఆడిన వింత నాటకం కారణంగా

02:26.563 --> 02:29.483
మేరీకి ఉన్న ఆ ఇష్టం ఆమెను హోవర్డ్ వైపు నడిపించింది.

02:31.318 --> 02:34.654
ఆమెను ఆఖరిగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి.

02:34.655 --> 02:37.782
ఆమెలోని ప్రతీ భాగాన్ని.
ఆమె ప్రపంచానికి చూపించే మంచి పైరూపాన్ని

02:37.783 --> 02:42.246
మాత్రమే కాకుండా ఆమె చాలా జాగ్రత్తగా
లోలోపల దాచి ఉంచిన తన అసలు రూపాన్ని కూడా.

02:43.872 --> 02:46.708
మేరీకి కథలు చెప్పడం సహజంగానే బాగా వచ్చు.

02:47.376 --> 02:50.920
కాబట్టి హోవర్డ్ తో పంచుకునే జీవితం,
ఒక భార్యగా అలాగే తల్లిగా కలకాలం

02:50.921 --> 02:54.800
సంతోషంగా జీవించడం అనే కథే ఆమె తన జీవితంలో
చెప్పగల అతిగొప్ప కథ అని ఆమెకు అనిపించింది.

03:36.300 --> 03:38.218
అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది

03:47.144 --> 03:48.228
మేరీ?

03:48.770 --> 03:49.771
మేరీ?

04:01.700 --> 04:02.950
టైమ్ ఎంత అయింది?

04:02.951 --> 04:04.745
ఇప్పుడే 2:00 దాటింది.

04:06.955 --> 04:08.749
బిడ్డ ఇంకా మేలుకోలేదు.

04:09.374 --> 04:12.294
పిల్లని చెక్ చేయడానికి నర్సులు వచ్చి పోతున్నారు.

04:13.754 --> 04:18.382
వాళ్ళు మనం సంప్రదించడం
కోసం చాలా మంది కార్డియాలజిస్టుల లిస్ట్ నాకు ఇచ్చారు.

04:21.970 --> 04:24.431
ఒకవేళ బిడ్డ గుండెకు ఏమైనా దీర్ఘకాలిక
సమస్య ఎదురైతే అని.

04:24.932 --> 04:26.600
ఓహ్, మేరీ. నన్ను క్షమించు.

04:28.727 --> 04:30.853
పిల్లలు ఎక్కడ? వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా?

04:30.854 --> 04:33.941
లేదు, నేను జూని ఇంకా మార్కస్ ని
రాత్రి ఇంటికి తీసుకెళ్ళాను.

04:35.400 --> 04:36.485
మరి హోవర్డ్?

04:37.194 --> 04:38.820
నేను అతన్ని రోజంతా చూడలేదు.

04:40.781 --> 04:43.617
మార్కస్ ఎలాగైనా దీన్ని నీకు ఇవ్వమన్నాడు.

04:44.326 --> 04:45.536
- థాంక్స్.
- సరే.

04:49.164 --> 04:51.083
మరి మనం మాత్రల గురించి మాట్లాడుకుందామా?

04:55.128 --> 04:56.421
మేరీ సింప్సన్?

04:57.005 --> 04:59.298
- ఏంటి?
- మీరు మాతో రావాలి.

04:59.299 --> 05:01.092
సరే. ఏంటి?

05:01.093 --> 05:02.927
నేనేం చేయాలి? నేను లాయర్ ని పిలవగలను.

05:02.928 --> 05:04.513
సరే, నువ్వు బిడ్డతో ఉండు.

05:05.764 --> 05:06.765
ఐ లవ్ యు.

05:08.183 --> 05:09.393
థాంక్స్.

05:10.435 --> 05:11.895
- నాకు కాల్ చెయ్.
- సరే.

05:14.690 --> 05:16.440
నేను నిజం కాని కొన్ని విషయాలు మాట్లాడా,

05:16.441 --> 05:20.027
అలా చేసి అసలు విషయం నుండి అందరి దృష్టి మళ్ళించాను.

05:20.028 --> 05:21.737
అదే మా అమ్మని ఎవరు చంపారు అనే విషయం.

05:21.738 --> 05:24.032
మా కుటుంబం అంతా ఈ పీడకల
ముగిస్తే చాలు అని చూస్తోంది.

05:25.033 --> 05:26.784
ఇవాళ ఉదయం పెట్టిన ఈ ప్రెస్ సమావేశంలో,

05:26.785 --> 05:28.035
- హెనెస్సీ కుటుంబం…
- మేడం?

05:28.036 --> 05:30.997
…నాన్సీ హెనెస్సీ మరణం వెనుక ఉన్న వ్యక్తి

05:30.998 --> 05:33.791
అరెస్టుకు దారి తీసే సమాచారం ఇచ్చే వారికి
50,000 డాలర్ల రివార్డు ప్రకటిస్తుంది.

05:33.792 --> 05:36.628
ఆ కుటుంబం వారు బాధితురాలి భర్త అమాయకుడు అంటోంది.

05:41.508 --> 05:44.385
శ్రీమతి సింప్సన్? నా పేరు కవిత సైని.

05:44.386 --> 05:47.680
నేను పిల్లలు మరియు కుటుంబ సర్వీసెస్
డిపార్ట్మెంట్ కి పనిచేస్తుంటా.

05:47.681 --> 05:51.142
మీ అమ్మాయికి ఏం జరిగింది అనే విషయంపై
మేము అధికారిక విచారణ మొదలెట్టాం.

05:51.143 --> 05:53.437
ఇది అత్యవసర రక్షణ ఆర్డర్.

05:55.063 --> 05:58.357
మా విచారణ కొనసాగుతున్న సమయంలో,
మీ పిల్లల భద్రత కోసం

05:58.358 --> 06:00.026
మీరు ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

06:00.027 --> 06:03.363
అలాగే మీరు పర్యవేక్షణ లేకుండా
ఎట్టి పరిస్థితుల్లో మీ మైనర్ పిల్లలను కలవకూడదు.

06:05.657 --> 06:06.658
ఏంటి?

06:07.451 --> 06:09.577
- ఈ కోర్ట్ ఆర్డర్ ని ధిక్కరిస్తే…
- మీరు అలా చేయలేరు.

06:09.578 --> 06:11.788
- మీరు అలా చేయలేరు.
- …మిమల్ని అరెస్ట్ చేస్తాం.

06:12.956 --> 06:14.332
లేదు, నేను…

06:14.333 --> 06:15.958
నేను మంచి తల్లిని.

06:15.959 --> 06:18.211
మీరు జడ్జి ముందు వాదన కోసం అభ్యర్థన పెట్టొచ్చు.

06:18.212 --> 06:21.547
ఈమెకు చెప్పు… హోవర్డ్, నేను మంచి తల్లిని
నువ్వు ఈమెకు చెప్పు.

06:21.548 --> 06:23.382
ఇది అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు మాత్రమే.

06:23.383 --> 06:25.219
- నేను నా భార్యతో కొంచెం మాట్లాడొచ్చా?
- సరే.

06:27.930 --> 06:29.096
మనం ఇది ఎదుర్కోగలం, హోవర్డ్.

06:29.097 --> 06:30.848
నువ్వు ఆమెతో చెప్పాలి…

06:30.849 --> 06:33.059
- ఎలనోర్ మనకు లాయర్ విషయంలో సాయం చేయగలదు.
- ఎక్కడ ఉంది?

06:33.060 --> 06:34.228
ఏది ఎక్కడ ఉంది?

06:35.646 --> 06:37.271
ఆర్టెమిస్ పక్క తడపడం వల్ల నన్ను నిద్ర లేపింది.

06:37.272 --> 06:38.607
అది నీకోసం వెతికింది.

06:39.775 --> 06:41.109
మేము ఇల్లంతా వెతికాం.

06:42.361 --> 06:44.946
నువ్వు సోఫా మీద పడుకున్నావు ఏమో అనుకున్నా,

06:44.947 --> 06:47.907
రాత్రి పూట పనిలేకుండా ఫోన్ చూస్తూ చస్తావు కదా అలా.

06:47.908 --> 06:50.327
ఆ తర్వాత ఆఫీస్ లో చెక్ చేశా.

06:51.036 --> 06:53.038
నువ్వు చేసిన గందరగోళం…

06:54.998 --> 06:57.251
నువ్వు నా అల్మారా నుండి ఏదో తీసుకున్నావు.

07:09.137 --> 07:11.390
ఆ మాత్రలు పైన షెల్ఫ్ లో ఉన్నాయి.

07:14.518 --> 07:16.728
పిల్లలు అంత పైకి ఎక్కి వాటిని తీసుకోలేరు.

07:17.563 --> 07:19.648
- అది నీకు తెలుసు.
- మేరీ.

07:20.232 --> 07:21.233
ఇది నీ పనే.

07:24.069 --> 07:27.280
మన పాపకి విషం పెట్టింది నువ్వే.

07:27.281 --> 07:28.948
అలాంటి పని నేనెందుకు చేస్తాను?

07:28.949 --> 07:32.285
ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, హోవర్డ్.

07:32.286 --> 07:36.372
నువ్వే నాన్సీని చంపావు అని.

07:36.373 --> 07:37.875
అలాగే ఇప్పుడు ఖచ్చితంగా

07:38.667 --> 07:43.713
అది నీ పనే అని నాకు అర్థమైంది.

07:43.714 --> 07:48.509
వాళ్ళు మింట్ బిళ్ళల డబ్బాలో దొరికిన మాత్రల
కారణంగా నిన్ను లోపల పడేయబోతున్నారు.

07:48.510 --> 07:50.846
కానీ వాళ్లకు విషయం అస్సలు తెలీదు.

07:52.306 --> 07:54.266
నువ్వు అమ్మాయిలను ఇంకెప్పటికీ చూడకపోవచ్చు.

07:55.517 --> 07:58.020
చెత్తనా కొడకా!

07:59.479 --> 08:01.480
అబద్ధాలా కోరు!

08:01.481 --> 08:03.232
- మేరీ! ప్లీజ్ ఆగు!
- నీచమైన రాక్షసుడా!

08:03.233 --> 08:04.400
- నువ్వు శాంతించాలి.
- అబద్ధాల కోరు!

08:04.401 --> 08:06.235
- వాళ్ళని నాకు దూరం చేయడానికి నీకెంత ధైర్యం?
- మేడం. మేడం!

08:06.236 --> 08:08.446
- నీకెంత ధైర్యం… వీడే నా బిడ్డకి విషం పెట్టాడు!
- హేయ్! ఏంటి…

08:08.447 --> 08:09.614
మీరు నా మాటలు వినాలి!

08:09.615 --> 08:12.158
- నా భార్య బాధలో ఉంది అంతే.
- వీడే నా బిడ్డకి విషం పెట్టాడు!

08:12.159 --> 08:13.868
ఆఫీసర్స్, నా భార్య బాధలో ఉంది అంతే.

08:13.869 --> 08:15.620
- నువ్వొక అబద్ధాల కోరువి!
- ప్లీజ్, శ్రీమతి సింప్సన్ ని తరలించండి…

08:15.621 --> 08:17.997
లేదు, లేదు, లేదు!
ఈమెను నేను తీసుకెళ్తా. తను నాతో రావొచ్చు.

08:17.998 --> 08:20.208
అమ్మాయిలను వీడితో నేను వదలను, ఎల్లి.

08:20.209 --> 08:22.293
- లేదు!
- అయితే నన్ను… ఆగు. మేరీ. ఆగు.

08:22.294 --> 08:24.170
- నన్ను చూడు! నన్ను చూడు! ఆగు. ఆగు!
- నా పిల్లలు…

08:24.171 --> 08:27.298
- నువ్వు ఆగాలి. మనం ఏదొక పరిష్కారం కనిపెడదాం.
- కానీ వాడు విషం…

08:27.299 --> 08:28.591
ఆగు.

08:28.592 --> 08:31.386
- నువ్వు పరిస్థితిని దిగజార్చుతున్నావు. ప్లీజ్.
- నా కూతుళ్లు, నా కూతుళ్లు…

08:31.970 --> 08:34.264
ఆమెను వదలండి. ప్లీజ్, ప్లీజ్.

08:35.349 --> 08:36.933
- వాడు విషం పెట్టాడు…
- ఏం కాదు, ఏం కాదు.

08:37.558 --> 08:38.559
ఏం కాదు.

08:40.687 --> 08:41.688
మేరీ…

08:50.697 --> 08:54.200
ఈ పుస్తకం బుక్ స్టోర్ కి వెళ్ళడానికి
ముందే ప్రింట్ తీయడం ఆపేసారు.

08:54.201 --> 08:57.537
ప్రపంచంలో ఈ 'కాటులూస్ అయిదు' అనువాద పుస్తకం ఉన్న
ఒకే ఒక్క వ్యక్తి హోవర్డ్ మాత్రమే.

08:57.538 --> 09:00.331
అలాగే దీన్ని అతను చాలా ఏళ్ల క్రితం మేము డేటింగ్
చేయడం ప్రారంభించినప్పుడు నాకు ఇచ్చాడు.

09:00.332 --> 09:03.543
నాన్సీకి కూడా అతను ఇదే ఇచ్చాడు.

09:03.544 --> 09:07.380
అయితే ఇదంతా నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తెలీదా?

09:07.381 --> 09:10.217
నువ్వు ఇంటి నుండి వెళ్లిన తర్వాతే నాకు ఇది తెలిసింది.

09:11.468 --> 09:13.095
వాడొక సోసియోపాత్.

09:14.012 --> 09:15.096
వాడొక అబద్ధాల కోరు.

09:15.097 --> 09:16.932
అది కూడా నీకు నిన్నే తెలిసిందా?

09:18.517 --> 09:22.563
ఒక్కొక్కసారి మనల్ని మనం ఎంతగా మోసపుచ్చుకోగలమో
తెలిస్తే నీకే ఆశ్చర్యంగా ఉంటుంది.

09:23.522 --> 09:25.816
మనం అనుకున్నదే తప్ప నిజాన్ని చూడలేకపోతాం.

09:26.400 --> 09:28.067
కానీ ఇది? ఈ రింగ్?

09:28.068 --> 09:31.028
దీన్ని సంభావ్య కారణంగా చూడొచ్చు, డిటెక్టివ్.
మీరు దీన్ని వాడుకోవచ్చు.

09:31.029 --> 09:33.030
మీరు అతన్ని అరెస్ట్ చేయొచ్చు.
అతని వేలిముద్రలు తీసుకోవచ్చు.

09:33.031 --> 09:35.867
నేరం జరిగిన సంఘటన స్థలంలో దొరికినవాటితో
ఆ వేలిముద్రలు పోల్చి చూడొచ్చు.

09:35.868 --> 09:37.077
నేను నిజం చెప్తున్నాను.

09:37.578 --> 09:40.789
నా భర్త నా బెస్ట్ ఫ్రెండ్ తో పడుకున్నాడు.

09:41.999 --> 09:43.041
అతనే ఆమెను చంపాడు.

09:44.918 --> 09:47.671
లేదంటే నాన్సీ రింగ్ నా ఇంట్లోకి ఎలా వస్తుంది?

09:50.132 --> 09:51.383
ఏమండీ.

09:53.218 --> 09:55.219
థాంక్స్, జోడి, ఆమెను తీసుకొచ్చినందుకు.

09:55.220 --> 09:58.598
- ప్లీజ్, రండి.
- లేదు, నేను ఇంకేం చెప్పదలచుకోలేదు.

09:58.599 --> 10:00.976
సరే. కానీ మనకు కొన్ని నిమిషాలు చాలు.

10:16.700 --> 10:20.579
మిస్ బుషే, ఈ ఐటమ్స్ లో దేన్నైనా మీరు గుర్తుపట్టగలరా?

10:21.830 --> 10:23.331
ల మెర్

10:23.332 --> 10:27.919
అవును, ఇవి నాన్సీ వస్తువులు.
అవును, నాన్సీ లారెన్ హెనెస్సీ.

10:27.920 --> 10:28.921
ఎన్.ఎల్.హెచ్

10:33.133 --> 10:35.302
నాకు అర్థం కావడం లేదు. ఇవి ఆధారాలా?

10:42.309 --> 10:43.726
ఏం జరుగుతోంది?

10:43.727 --> 10:45.645
హోవర్డ్ మిమ్మల్ని కలిశాడా?

10:45.646 --> 10:49.899
ఈ బాక్సులో ఉన్నవి నా దగ్గరకి ఎలా వచ్చాయా
అని అడుగున్నట్టు అయితే, మరి…

10:49.900 --> 10:52.528
అవును, నీ భర్త ఇవాళ ఉదయం నన్ను కలిసాడు, కానీ…

10:53.820 --> 10:55.071
నీకు ఒకటి స్పష్టం చేస్తాను విను.

10:55.072 --> 10:58.534
ఈ వస్తువులు నీ ఇంట్లోకి ఎలా వచ్చాయి?

10:59.368 --> 11:01.954
వీటిని శ్రీమతి హెనెస్సీ నుండి అతను దొంగిలించాడా
లేక నువ్వు దొంగిలించావా?

11:06.917 --> 11:08.544
అది మీరు అనుకునేటట్టు కాదు.

11:09.127 --> 11:13.047
- ఓహ్, మేరీ. నువ్వు ఏం చేసావు?
- ఆమెకు…

11:13.048 --> 11:16.342
ఆమెకు ఇవి కనిపించకపోయినా అస్సలు తెలిసేది కాదు.

11:16.343 --> 11:18.970
- నాన్సీకి ఎన్నో ఉండేవి.
- ఓహ్, దేవుడా.

11:18.971 --> 11:22.431
నీ భర్త నీకు శ్రీమతి హెనెస్సీ అంటే ఈర్ష్య అని,
అలాగే ఆమె గురించే మాట్లాడేదానివి అన్నాడు.

11:22.432 --> 11:23.516
అవునా?

11:23.517 --> 11:25.102
అతను మీరు ఇలా అనుకోవాలని అన్నాడు.

11:26.520 --> 11:29.647
- అతను మీ దృష్టి మళ్లిస్తున్నాడు.
- అందుకే ఆమెతో అతను అక్రమ సంబంధం

11:29.648 --> 11:32.650
- పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నావు అన్నాడు.
- లేదు, అతనే ఆమెను బుట్టలో వేసుకున్నాడు.

11:32.651 --> 11:36.113
అతనే ఆమెను చంపాడు. అతనే చెడ్డవాడు. నేను కాదు.

11:40.409 --> 11:43.996
ఒకటి చెప్పనా, నేను ఈ ఉద్యోగం చాలా ఏళ్లుగా చేస్తున్నా.

11:44.997 --> 11:49.041
రకరకాల బంధాలలో ఉన్న చాలా మంది
దగ్గరి వాళ్ళను చూసాను.

11:49.042 --> 11:53.296
కానీ ఇక్కడ, మీ ముగ్గురు మధ్య ఉన్నది,

11:53.297 --> 11:57.968
అసలు అదేంటో నాకు తెలీడం లేదు,
కానీ అది స్నేహం మాత్రం కాదు.

12:04.349 --> 12:05.559
వచ్చినందుకు థాంక్స్.

12:28.040 --> 12:30.625
- అమ్మా?
- హేయ్, హాయ్.

12:30.626 --> 12:33.211
అమ్మా. ఏం జరుగుతోంది?
నాన్న నువ్వు ఇంటికి రావడం లేదు అన్నాడు.

12:33.212 --> 12:34.795
- నువ్వు ఎక్కడ ఉన్నావు?
- నేను హాస్పిటల్ లో ఉన్నాను.

12:34.796 --> 12:36.381
జూని ఆర్టెమిస్ ని చూడాలి అంటోంది.

12:37.633 --> 12:39.592
- అది బాగానే ఉందా?
- అవును.

12:39.593 --> 12:40.801
అవును, అది నిద్ర లేచింది.

12:40.802 --> 12:43.555
డాక్టర్ దానికి ఏం కాదు అన్నారు.
అది రేపు రాత్రి ఇంటికి వచ్చేయొచ్చు అంట.

12:46.266 --> 12:48.100
- హమ్మయ్యా.
- ఏం జరుగుతోంది?

12:48.101 --> 12:51.480
నేను నాకు వీలైనంత వెంటనే నీకు అంతా వివరిస్తాను.
సరేనా, బుజ్జి?

12:52.272 --> 12:53.565
నాకోసం ఒక్క పని చేస్తావా?

12:55.192 --> 12:56.610
సరే, అలాగే. ఏంటి?

12:57.236 --> 12:59.613
మీ నాన్నతో ఒంటరిగా నీ చెల్లెళ్లను వదలకు.

13:00.239 --> 13:02.115
నీ కనుసన్నల నుండి వాళ్ళను వెళ్లనివ్వకు.

13:02.741 --> 13:03.909
ఆ పని చేయగలవా?

13:06.787 --> 13:08.829
అమ్మా, నేను… నేను వెళ్ళాలి.

13:08.830 --> 13:10.666
ఇది చాలా పెద్ద పనే అని నాకు తెలుసు.

13:11.625 --> 13:13.210
- నాకు తెలుసు.
- అమ్మా, ఇక్కడ ఏం జరుగుతున్నా…

13:14.002 --> 13:15.170
నేను నీ పక్షానే ఉంటా.

13:35.357 --> 13:36.775
నేను మార్కస్ తో మాట్లాడాను.

13:37.401 --> 13:40.362
ఆర్టీ నిద్ర లేచింది, దాని పరిస్థితి మెరుగైంది.

13:42.489 --> 13:43.574
పోనిలే మంచిదే.

13:50.581 --> 13:54.126
నేను నా లాయర్లతో కలిసి పని చేసే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తో
రేపు ఉదయం ఒక మీటింగ్ ఏర్పాటు చేశా.

13:55.711 --> 13:59.172
అతని దగ్గర నేరం జరిగిన చోట తీసిన ఫోటోలు ఉన్నాయి,

13:59.173 --> 14:03.677
కాబట్టి అతను హోవర్డ్ కి హత్యతో ఏమైనా
సంబంధం ఉన్నట్టు కనిపెడతాడు ఏమో చూద్దాం.

14:04.219 --> 14:08.890
ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి నిజమైన ఆధారాలను
చూపకపోతే వాళ్ళు నమ్మరు.

14:08.891 --> 14:14.021
అవును. నా వల్లే ఇప్పుడు వాళ్ళు
మనం ఏం చెప్పినా నమ్మేలా లేరు.

14:20.944 --> 14:21.987
నీకు నా మీద కోపంగా ఉంది.

14:22.571 --> 14:23.780
నాకేం లేదు.

14:24.656 --> 14:27.159
- నాకు నాన్సీ మీద కోపం లేదు.
- నీకు లేదని నాకు తెలుసు.

14:33.874 --> 14:36.834
నేను వాటిని ఎందుకు తీసుకున్నానో
తెలుసుకోవాలని ఉందా, ఎందుకంటే…

14:36.835 --> 14:40.756
అసలు ఎందుకో తెలుసా? నిజంగా?

14:46.261 --> 14:47.429
అది మా అమ్మ.

14:48.222 --> 14:51.849
నేనూ, రాబర్ట్ తో కలిసి పారిపోయానేమో, బుషే ఇంటి పరువు

14:51.850 --> 14:54.269
తీసేసానేమో అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తోంది.

14:56.063 --> 14:57.105
రాబర్ట్ ఎలా ఉన్నాడు?

14:57.648 --> 14:58.982
నాకు తెలీదు.

15:03.153 --> 15:05.030
రేపు మనం పొద్దున్నే లేవాలి.

15:18.919 --> 15:20.753
మీకు ఇంకేమైనా కావాలా? నేను మెన్యు తెస్తాను.

15:20.754 --> 15:21.838
ద బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

15:21.839 --> 15:23.714
వీళ్ళు మంచి క్వాలిటీ మిల్క్ షేక్ చేస్తారు.

15:23.715 --> 15:26.175
లేదు, వద్దు. అదేం అవసరం లేదు.

15:26.176 --> 15:27.760
మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా?

15:27.761 --> 15:29.429
విషయానికి వచ్చారు. బాగుంది.

15:30.889 --> 15:33.808
మీరు కొంచెం తట్టుకోగలరు కదా?
ఈ ఫోటోలు చాలా దారుణంగా ఉన్నాయి.

15:33.809 --> 15:35.561
వాడు ఆమెకు ఏం చేసాడో నేను చూడాలి.

15:56.707 --> 15:59.877
సరే. సరే. సరే. సరే.

16:00.961 --> 16:02.378
- థాంక్స్.
- సరే.

16:02.379 --> 16:05.591
మాకు వ్యక్తిగతంగా చూపించగలవా? నేరం జరిగిన స్థలాన్ని?

16:06.884 --> 16:10.094
మనం ముందుగా ఆ విషయం మాట్లాడుకోలేదు.
నా లైసెన్స్ పోయే ప్రమాదం ఉంది.

16:10.095 --> 16:12.638
మేరీ. మనకు కావాల్సింది అంతా ఫోటోలలో ఉంది.

16:12.639 --> 16:13.765
లేదు, అదేం కాదు.

16:14.850 --> 16:17.268
ఇక్కడ అసలు మీ లక్ష్యం ఏంటి?

16:17.269 --> 16:19.312
ఈ పని చేసినోడు ప్రొఫెషనల్ కాదు.

16:19.313 --> 16:21.523
నాకు… నాకు అతను తెలుసు.

16:22.691 --> 16:24.776
అలాగే అతను తప్పు చేసి ఉంటే, నేను కనిపెట్టగలను.

16:38.624 --> 16:40.833
ఇదే అది. ద డెడ్ జోన్.

16:40.834 --> 16:43.044
బాధితురాలు ఇక్కడే హత్య చేయబడింది.

16:43.045 --> 16:45.880
ఆమె పేరు నాన్సీ, "బాధితురాలు" కాదు.

16:45.881 --> 16:48.509
ఈ పని చేసేటప్పుడు ఆమె పేరు వాడమంటారా?

16:49.760 --> 16:51.470
మీ హంతకుడు బాధితురాలిని ఇక్కడికి తీసుకొచ్చాడు.

16:51.970 --> 16:55.432
రక్తం పడిన ఆచూకీని బట్టి అతను కనీసం
ఆరు అడుగుల మనిషి అని చెప్పొచ్చు.

16:56.099 --> 16:57.683
అతను ఆమెను ఈ చోటుకు తీసుకొచ్చాడు.

16:57.684 --> 17:00.937
ఆమె పరిగెత్తలేదు, అతను ఆమెను తోసిపడేసాడు.

17:00.938 --> 17:04.899
పుర్రేకి తగిలిన గాయాన్ని బట్టి, ఒకే ఒక్క
దెబ్బతో ఆమె చనిపోయింది అని చెప్పొచ్చు.

17:04.900 --> 17:06.817
అప్పుడు ఆమె ఇక్కడ పడింది.

17:06.818 --> 17:09.654
ఆగు, పోలీసులు ఆమె శరీరాన్ని నీటి దగ్గర
కనిపెట్టారు అనుకున్నానే.

17:09.655 --> 17:10.780
అవును.

17:10.781 --> 17:14.200
నిజమే. అతను ఆమె శరీరాన్ని తూర్పు వైపు 30
అడుగులు లాక్కెళ్లాడు.

17:14.201 --> 17:15.702
ఆమె శరీరాన్ని అక్కడ పడేసాడు.

17:16.744 --> 17:20.499
శవాన్ని కాలి మడమలు పట్టుకుని లాగడమే సులభం.

17:24.670 --> 17:26.629
కానీ ఆసక్తికరమైన విషయం చెప్తాను వినండి.

17:26.630 --> 17:30.758
సగం దూరం వెళ్లేసరికి,
అతను ఆమెను మడమతో లాగడం ఆపేసాడు.

17:30.759 --> 17:32.260
అది నీకెలా తెలుసు?

17:32.261 --> 17:36.430
అంటే, రక్తపు మరకల తీరు ఇక్కడ మారింది.

17:36.431 --> 17:37.682
నాది ఒక అంచనా ఉంది.

17:37.683 --> 17:40.685
బాధితురాలిని అంత దూరం రెండు చేతులతో లాక్కెళ్లడం

17:40.686 --> 17:43.605
బహుశా అతనికి బాగా భారంగా అనిపించింది అనుకుంట.

17:44.314 --> 17:48.986
మిగతా దూరం అంతా అతను ఆమెను
కుడి చేత్తో మాత్రమే లాక్కెళ్లినట్టు ఉంది.

17:50.153 --> 17:51.821
అతను బలహీనంగా ఉండటం వల్ల కాదు.

17:51.822 --> 17:54.949
కానీ నాకు తెలిసి హంతకుడికి ఏదొక గాయం అయినట్టు ఉంది.

17:54.950 --> 17:56.869
బహుశా నడుము నొప్పి లేదా భుజం లాగేయడం వల్ల ఏమో.

18:15.971 --> 18:17.513
ఖచ్చితంగా ఇంట్లో ఎవరూ లేరా?

18:17.514 --> 18:19.390
ఆర్టీని ఇంకా డిస్ ఛార్జ్ చేయలేదు,

18:19.391 --> 18:21.559
అలాగే మార్కస్ వాళ్లు అంతా ఇంకా
ఆమెతో హాస్పిటల్ లో ఉన్నారు అన్నాడు.

18:21.560 --> 18:23.227
నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు, మేరీ.

18:23.228 --> 18:25.229
అయితే మనం రేపు డాక్టర్ ఆఫీస్ కి వెళదామా?

18:25.230 --> 18:28.733
లేదు, నేను ఇది చేయగలను. నేను ఇది చేయగలను.

18:28.734 --> 18:31.319
నువ్వు నాకు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు.

18:31.320 --> 18:32.654
లేదని నాకు తెలుసు.

18:36.074 --> 18:37.366
వెళ్లి వచ్చేద్దాం.

18:37.367 --> 18:38.744
- సరే.
- నేను ఇక్కడే ఉంటా.

19:34.174 --> 19:35.926
భలే, ఇది చాలా పిచ్చి పని.

19:36.677 --> 19:39.679
చైల్డ్ సర్వీసెస్ వారు చెప్పకుండా
వచ్చారంటే ఏమవుతుందో ఊహించుకో.

19:39.680 --> 19:41.223
నువ్వు చాలా పెద్ద సమస్యలో పడతావు.

19:42.307 --> 19:43.725
ఇది ఇంకా నా ఇల్లు కూడా.

19:50.023 --> 19:51.024
అక్కడ ఏముంది?

19:55.112 --> 19:56.738
నాకు ఇది నచ్చడం లేదు, మేరీ.

19:57.531 --> 19:58.907
నీకు నన్ను చూసి భయంగా ఉంది.

19:59.700 --> 20:02.118
ఒకసారి నిన్ను నువ్వు చూసుకో.
నువ్వు ఆకులా అల్లాడిపోతున్నావు.

20:02.119 --> 20:03.453
నువ్వు నాన్సీని చంపేసావు.

20:04.204 --> 20:06.038
నువ్వు అలా అనడం ఆపితే బాగుంటుంది.

20:06.039 --> 20:08.875
వాళ్లకి తెలుసు. పోలీసులకు.

20:08.876 --> 20:13.297
హంతకుడికి ఎడమ భుజం మీద గాయం
ఉందని వాళ్ళకి తెలుసు.

20:14.047 --> 20:15.465
వాళ్ళకి తెలుసు.

20:16.967 --> 20:18.552
నా మెడికల్ రికార్డులు.

20:19.803 --> 20:21.013
ఇదేనా నీ ప్లాన్?

20:21.972 --> 20:25.808
ప్రపంచంలో అత్యంత కామన్ జిమ్ గాయం ఉందని చెప్పే

20:25.809 --> 20:27.936
రికార్డులు పోలీసులకు ఇచ్చి వాళ్ళకి పిచ్చెక్కిస్తావా?

20:30.689 --> 20:34.066
నువ్వు కొంచెం కూర్చుంటావా?
ఇలా నిలబడి మాట్లాడుకోవడం బాలేదు.

20:34.067 --> 20:36.486
నాకు మనం ఇన్నాళ్లూ మాట్లాడుకున్నట్టు
ఒక్క నిమిషం మాట్లాడాలని ఉంది.

20:38.447 --> 20:40.782
నువ్వు నాకు కనీసం ఆ అవకాశం ఇవ్వాలి.

20:41.825 --> 20:43.452
నా గురించి నీకు తెలిసినంత ఎవరికీ తెలీదు.

20:44.453 --> 20:45.454
నాకు కూడా తెలీదు.

20:46.455 --> 20:47.664
నాకు నువ్వు ఏంటో తెలీదు.

20:50.042 --> 20:52.127
నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి, అలాగే నన్ను…

20:54.379 --> 20:56.256
నేను ప్రేమలో పడిన వ్యక్తి.

20:57.925 --> 21:01.969
నువ్వు చేసిన ఈ దారుణమైన పనులు
అతను చేసి ఉండేవాడు కాదు.

21:01.970 --> 21:03.888
నేను ఎలాంటి దారుణమైన పనులు చేయలేదు.

21:03.889 --> 21:05.307
అది నువ్వు.

21:06.683 --> 21:09.644
నీకు తెలీడం లేదా?
నువ్వే ఈ కుటుంబాన్ని చీల్చేస్తున్నావు.

21:09.645 --> 21:11.354
లేదు, అలా మాట్లాడకు.

21:11.355 --> 21:12.522
ఆపు.

21:12.523 --> 21:15.107
- ఏంటి ఆపేది?
- నా చుట్టూ ఉన్న పరిస్థితులను తారుమారు చేయడం ఆపు.

21:15.108 --> 21:17.109
ఇక్కడ నీ అసలు ఉద్దేశం ఏంటి? నీకు ఏం కావాలి?

21:17.110 --> 21:21.114
నువ్వు నా ఇంట్లో నుండి పోవాలి,
అలాగే నువ్వు నా పిల్లలకు దూరంగా ఉండాలి.

21:22.324 --> 21:24.909
అలాగే నాకు నువ్వు చేసిన పనికి నువ్వు అనుభవించడం కావాలి.

21:24.910 --> 21:25.911
మరి ఆ తర్వాత ఏంటి?

21:26.495 --> 21:29.248
నేను గనుక లేను అంటే,
పిల్లలని నీకు అప్పగిస్తారని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు.

21:29.831 --> 21:32.709
లేదా వాళ్ళని స్థిమితం లేని నీ చెత్త కుటుంబంలో
ఎవరికీ కూడా ఇవ్వరు.

21:33.210 --> 21:37.630
ఆ పిల్లలు ఇంత ఎదుర్కొన్న తర్వాత కూడా
జడ్జి అమ్మాయిలను గంజాయితో నిండిన

21:37.631 --> 21:39.298
మీ అమ్మ ఇంటికి పంపరు.

21:39.299 --> 21:43.261
అలాగే ఆత్మీయ తల్లి అయిన ఎలనోర్ ని ఇంకా ఆమె ఫ్రెండ్ మరణంలో
అనుమానితురాలిగా చూస్తున్నారు కాబట్టి…

21:43.262 --> 21:44.554
పనికిమాలిన వెధవా.

21:44.555 --> 21:47.558
అప్పుడు వాళ్ళను అనాధ శరణాలయంలో పడేస్తారేమో.
కానీ అలా జరగడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు.

21:50.060 --> 21:52.104
నాకు నువ్వంటే ఇంకా ఇష్టమే, మేరీ,

21:52.813 --> 21:54.981
నీలో ఎన్ని లోపాలు ఉన్నా.

21:54.982 --> 21:57.817
మనం ఇంకా ఈ ఆటుపోటును తట్టుకుని
నిలబడగలం అని నాకు అనిపిస్తోంది.

21:57.818 --> 21:59.694
మళ్ళీ మొదటి నుండి, మళ్ళీ ఫ్రెష్ గా జీవితం మొదలెడదాం.

21:59.695 --> 22:01.279
నాకు కావాల్సింది అదే.

22:01.280 --> 22:04.575
ఈ చోటును వదిలేసి, ఒక కుటుంబంగా ఒహయోకి వెళదాం.

22:05.450 --> 22:06.994
పిల్లలు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు.

22:08.871 --> 22:10.162
అన్నిటికంటే ఎక్కువ.

22:10.163 --> 22:12.374
మనం ఇంకా ఒక కుటుంబంగా ఉండొచ్చు, నువ్వు ఇంకా నేను.

22:13.584 --> 22:16.170
క్లొయి ఇంకా డాప్నిస్ లాగ.

22:17.671 --> 22:20.424
సమస్యలు ఉన్నా కలిసి బ్రతకాల్సిన వాళ్ళం.

22:24.052 --> 22:25.554
దేవుడా, నేను ఈ మాటని ఎంతో బలంగా నమ్మేదాన్ని.

22:28.432 --> 22:30.142
ఆ తర్వాత నేను జెన్నీతో మాట్లాడా.

22:33.187 --> 22:34.688
ఆమె నాకు చూపించింది.

22:36.190 --> 22:37.858
నాకు ఆమె గాయాన్ని చూపించింది.

22:41.486 --> 22:44.656
ఒక రోజు రాత్రి ఆమె నిన్ను వదలడానికి ట్రై చేసినప్పుడు…

22:45.365 --> 22:46.658
ఆమెకు తగిలిన గాయం.

22:49.661 --> 22:52.331
నీ మాటలు. నీ కథలు.

22:54.750 --> 22:59.379
అది ఒకటైతే, శరీరం మీద గాయం మరోకటి.

23:00.589 --> 23:03.008
ఎందుకంటే నువ్వు చేసే పనే అది కదా? అవునా?

23:04.384 --> 23:06.136
నువ్వు ఒక సున్నితమైన మహిళని తీసుకుని,

23:07.095 --> 23:12.476
ఆఖరికి ఆమె జీవితంలో నువ్వు తప్ప
ఇంకేం లేకుండా మొత్తం తినేస్తావు.

23:14.895 --> 23:16.980
నాకు అర్థం కానీ విషయం ఒకటి ఉంది.

23:18.106 --> 23:21.527
నాన్సీని ఎందుకు ఎంచుకున్నావు, హోవర్డ్?

23:24.404 --> 23:26.156
నువ్వు ఎవరినైనా సొంతం చేసుకోగలిగేవాడివి.

23:27.866 --> 23:28.909
తననే ఎందుకు?

23:31.286 --> 23:32.996
నన్ను క్షమించు, మేర్.

23:38.210 --> 23:39.336
నన్ను క్షమించు.

23:44.258 --> 23:46.926
కానీ నాన్సీ మీద కన్ను వేసింది నేను కాదు.

23:46.927 --> 23:48.220
అది నువ్వు.

23:52.558 --> 23:55.018
- లేదు.
- నువ్వు ఆమెను ప్రేమించావని నాకు తెలుసు.

23:57.062 --> 23:59.063
ఆమె చాలా అందగత్తె అనుకునేదానివి.

23:59.064 --> 24:01.358
అందుకే నేను కూడా నీతో కలిసి ఆ ఆట ఆడాను.

24:05.070 --> 24:06.989
ఆమెలా ఉండటం గురించి

24:07.573 --> 24:12.995
నువ్వు ఊహలు కనడం చూస్తుంటే
నాకు భలే మూడ్ వచ్చేది.

24:15.581 --> 24:17.290
ఆమె బట్టలు వేసుకోవడం…

24:17.291 --> 24:19.000
తిరిగి స్వాగతం, మిస్టర్ అండ్ మిసెస్ హెనెస్సీ.

24:19.001 --> 24:20.711
ఆమె చెవిలీలు వేసుకోవడం…

24:24.089 --> 24:25.632
నువ్వు ఆఖరికి ఆమెలాగే వాసన రావాలి అనుకునేదానివి.

24:28.719 --> 24:29.720
దయచేసి వద్దు.

24:39.646 --> 24:41.190
మనం ఎంత ఎంజయ్ చేసేవాళ్ళమో గుర్తుందా?

24:44.610 --> 24:45.652
నన్ను వేసుకో.

24:51.700 --> 24:53.493
నీకు ఎంత కోరికగా ఉందో చెప్పు, నాన్సీ.

25:04.588 --> 25:08.175
ఇప్పుడు వీటిని డిటెక్టివ్ గాంజ్ దగ్గరకి తీసుకెళ్ళు

25:09.092 --> 25:11.345
ఆమెకు కథ మొత్తం చెప్పు.

25:13.514 --> 25:15.015
ఎందుకంటే నేను నేరస్తుడిని అయితే…

25:17.309 --> 25:18.519
నువ్వు కూడా అంతే.

25:36.620 --> 25:38.914
ఏమైంది? ఎందుకు ఇంత సేపు పట్టింది?

25:40.499 --> 25:41.500
పదా.

26:11.780 --> 26:13.031
కారు ఆపు.

26:14.575 --> 26:17.702
ఎల్లి, దయచేసి కారు ఆపు.
ఎల్లి, పక్కకి ఆపు! కారు ఆపు!

26:17.703 --> 26:19.662
- ఇక్కడా?
- కారు ఆపు!

26:19.663 --> 26:20.746
సరే.

26:20.747 --> 26:21.748
ఆపు.

26:22.499 --> 26:23.500
నువ్వు బానే ఉన్నావా?

26:24.585 --> 26:25.794
ఏం జరుగుతోంది?

26:28.589 --> 26:29.839
ఛ.

26:29.840 --> 26:31.133
మేరీ!

26:33.510 --> 26:34.845
ఏం చేస్తున్నావు?

26:35.762 --> 26:36.889
మేరీ, నువ్వు ఏం…

26:37.389 --> 26:39.016
ఏం జరిగింది?

26:40.017 --> 26:42.476
దయచేసి నాతో మాట్లాడు. ఏం జరిగిందో నాకు చెప్పు.

26:42.477 --> 26:43.812
ఇది నా వల్ల కాదు.

26:44.980 --> 26:46.522
- ఇది నా వల్ల కాదు.
- ఏంటి?

26:46.523 --> 26:48.733
ఇది నా వల్ల కాదు, ఏం చేయలేను.
నేను పోలీసుల దగ్గరకి రాలేను.

26:48.734 --> 26:50.068
ఏం మాట్లాడుతున్నావు?

26:50.569 --> 26:51.570
వాడే గెలిచాడు.

26:52.070 --> 26:53.655
- లేదు, అతను గెలవకూడదు.
- హోవర్డ్ గెలిచాడు.

26:55.282 --> 26:57.074
నా పిల్లలు నాకు కాకుండా పోవచ్చు, నీకు అర్థమవుతుందా?

26:57.075 --> 26:58.951
- నేను…
- కానీ వాడు జైలుకు వెళితే…

26:58.952 --> 27:00.786
వెళ్ళడు, నీకు అది తెలియడం లేదా?

27:00.787 --> 27:02.998
వాడు నాకంటే చాలా తెలివైనవాడు, ఎల్లి.

27:03.498 --> 27:05.750
నేను వేసే ప్రతీ ఎత్తుగడకు,
రెండు అడుగులు ముందు ఉంటున్నాడు.

27:05.751 --> 27:07.461
అతను నాకంటే చాలా తెలివైనవాడు.

27:08.086 --> 27:10.380
అసలు నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను?

27:11.465 --> 27:13.174
నాన్సీ నేనొక చేతకాని దద్దమ్మని అనుకుంది.

27:13.175 --> 27:14.800
లేదు, నాన్సీ నిన్ను ప్రేమించింది.

27:14.801 --> 27:17.428
అవును, నా భర్తతో పడుకుని!

27:17.429 --> 27:20.849
హోవర్డ్ ఒక పోరంబోకు అయ్యుండొచ్చు,
కానీ ఇందులో నాన్సీ తప్పు లేకపోలేదు.

27:21.600 --> 27:22.726
తను అమాయకురాలు కాదు.

27:23.310 --> 27:26.145
ఎల్లి, ప్లీజ్. నా వల్ల కాదు.
నేను ఇంతకంటే ఇంకేం కోల్పోలేను.

27:26.146 --> 27:28.232
నేను వాళ్ళని కోల్పోలేను, నా వల్ల కాదు… నా వల్ల కాదు.

27:29.441 --> 27:31.777
వాడు… వాడొక హంతకుడు!

27:32.277 --> 27:37.699
వాడొక కిరాతకమైన హంతకుడు.
వాడు మన బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశాడు.

27:38.200 --> 27:41.202
అంతే. అదొక్కటే మనకు ముఖ్యం.

27:41.203 --> 27:42.703
నువ్వు అలసిపోయావని నేను అర్థం చేసుకోగలను.

27:42.704 --> 27:45.456
నీకు భయంగా ఉందని అర్థం చేసుకోగలను,
నాకు కూడా భయంగానే ఉంది.

27:45.457 --> 27:48.042
మనం ఇంటికి వెళదాం, మనం ఎక్కుదాం, నిద్రపోదాం,

27:48.043 --> 27:50.127
రేపు పొద్దున్న మళ్ళీ కలిసి మేల్కొందాం.

27:50.128 --> 27:53.590
మనం అనుకున్నట్టే హోవర్డ్ మెడికల్ రికార్డులతో
పోలీసుల దగ్గరకు వెళదాం.

27:56.051 --> 27:57.219
ప్లీజ్.

29:28.352 --> 29:29.353
మేర్.

29:39.404 --> 29:40.405
మేరీ?

29:45.619 --> 29:46.620
ఓహ్, దేవుడా.

29:47.746 --> 29:48.747
మేరీ?

29:50.582 --> 29:52.542
- హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు.
- అలాగే జూనికి.

29:52.543 --> 29:53.626
- ఛ.
- అలాగే నాకు!

29:53.627 --> 29:55.837
- ప్రస్తుతం మేము ఫోన్ ఎత్తలేము…
- ఓహ్, లేదు.

29:55.838 --> 29:57.797
ప్లీజ్. మేరీ?

29:57.798 --> 29:59.924
- హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు.
- అలాగే జూనికి.

29:59.925 --> 30:01.385
- అలాగే నాకు!
- లేదు, ప్లీజ్

30:02.219 --> 30:03.594
హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు.

30:03.595 --> 30:05.096
- అలాగే జూనికి.
- అలాగే నాకు!

30:05.097 --> 30:07.348
ప్రస్తుతం మేము మీ ఫోన్ ఎత్తలేము,
కానీ మీ సందేశం చెప్పండి,

30:07.349 --> 30:10.269
- మేము మీకు తిరిగి కాల్ చేస్తాం.
- మేరీ, ఎక్కడ ఉన్నావు?

30:35.335 --> 30:37.129
నేను ఏం చెప్పను.

30:40.716 --> 30:42.342
నేను మంచిగా నడుచుకుంటా.

30:46.805 --> 30:48.265
ఒట్టు.

32:00.963 --> 32:01.964
మేరీ!

32:03.799 --> 32:05.383
- ఎలనోర్, ఓరి నాయనో.
- తను ఎక్కడ ఉంది?

32:05.384 --> 32:07.552
- మాకు పొరుగింటాళ్లు ఉన్నారని తెలుసు కదా?
- మేరీ ఎక్కడ?

32:07.553 --> 32:08.719
తనకి నిన్ను చూడాలని లేదు.

32:08.720 --> 32:10.973
ఏంటి? నువ్వు ఏం చేసావు?

32:11.473 --> 32:14.600
ఏం లేదు. అది ఆమె నిర్ణయం.
తనే స్వయంగా వెనక్కి వచ్చింది.

32:14.601 --> 32:16.102
అలా జరగదు.

32:16.103 --> 32:19.814
ఇది నీకు తెలిసి ఉండకపోవచ్చు,
కానీ సంసారం అన్నాక కష్ట సుఖాలు కామన్,

32:19.815 --> 32:22.817
మేరీ నా భార్య, నేను తన భర్తని, మాది ఒక కుటుంబం.

32:22.818 --> 32:23.901
మేరీ!

32:23.902 --> 32:25.945
అలాగే నువ్వు ఏం అనుకున్నా సరే, ఎలనోర్,

32:25.946 --> 32:27.489
నువ్వు ఈ కుటుంబంలో భాగం కాదు.

32:28.156 --> 32:30.157
ఇక నేను పోలీసులకు ఫోన్ చేసి
చొరబడుతున్నావని నిన్ను అరెస్ట్

32:30.158 --> 32:31.868
చేయించడానికి ముందు నా ఇంటి దగ్గర నుండి పో.

32:31.869 --> 32:33.245
ష్…

32:34.830 --> 32:35.831
మేరీ!

32:37.291 --> 32:39.293
ఓహ్, దేవుడా. మేరీ?

32:40.085 --> 32:42.336
- ఏమైంది?
- నా గుమ్మం ముందు నుండి పో.

32:42.337 --> 32:45.716
ఏం చేస్తున్నావు? వీడు ఏం చేసాడో నీకు తెలుసు.

32:46.425 --> 32:48.594
వీడు నాన్సీని చంపాడు.

32:49.553 --> 32:51.220
పిరికిదానిలా ప్రవర్తించకు, మేరీ.

32:51.221 --> 32:53.055
- వెళ్ళు.
- వీడు ఏం చేసాడొ వీడికి తెలుసు.

32:53.056 --> 32:54.308
- వెంటనే. వెళ్ళు.
- మేరీ!

33:02.232 --> 33:03.734
నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను.

33:27.925 --> 33:29.717
కాంటాక్టులు

33:29.718 --> 33:30.719
మేరీ

33:31.887 --> 33:33.054
హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు.

33:33.055 --> 33:34.597
- అలాగే జూనికి.
- అలాగే నాకు!

33:34.598 --> 33:37.559
ప్రస్తుతం మేము మీ ఫోన్ ఎత్తలేము,
కానీ మీ సందేశం చెప్పండి, మేము…

33:46.401 --> 33:48.611
మిస్ బుషే. మిస్టర్ హెనెస్సీకి మీరు వస్తున్నట్టు చెప్పారా?

33:48.612 --> 33:49.779
అతను ఇంట్లో ఉన్నాడా?

33:49.780 --> 33:52.074
- ఉన్నారు, కానీ ఒంటరిగా లేరు.
- నేను అర్జంటుగా కలవాలి.

33:53.242 --> 33:55.327
నేను నువ్వు అడిగిన పని చేయనిది ఏమైనా ఉందా?

33:56.703 --> 33:59.205
- క్షమించండి, సర్.
- ఎలనోర్, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు?

33:59.206 --> 34:00.581
నేను నీతో మాట్లాడాలి.

34:00.582 --> 34:02.166
- దురదృష్టవశాత్తు అది సాధ్యం కాదు.
- అది నిజ…

34:02.167 --> 34:04.752
చూస్తున్నావు కదా,
ప్రస్తుతం నా కొడుకు స్థితి అధ్వానంగా ఉంది.

34:04.753 --> 34:07.506
- ఇది ముఖ్యమైన విషయం.
- అయితే నీ లాయర్లను సంప్రదించమను.

34:08.130 --> 34:09.757
హోవర్డ్ నాన్సీని చంపాడు.

34:11.385 --> 34:12.386
ఏంటి?

34:16.849 --> 34:20.600
రాబర్ట్, నన్ను క్షమించు,
కానీ నాన్సీతో అక్రమ సంబంధం పెట్టుకున్నది వాడే.

34:20.601 --> 34:23.479
ఇది ఎలా మొదలైందో నాకు తెలీదు,
బహుశా వాళ్ళు కలిసి పని చేస్తున్నపుడు ఏమో.

34:23.480 --> 34:26.566
కానీ ఇది వాడి పనే. వాడే నాన్సీని చంపాడు.

34:26.567 --> 34:28.317
మేరీ దగ్గర ఆధారాలు ఉన్నాయ్.

34:28.318 --> 34:30.903
నాన్సీ పెట్టుకున్న ఆ క్లాడా రింగ్ గుర్తుందా?

34:30.904 --> 34:32.196
- అవును.
- తను ఆ రాత్రి కూడా అది పెట్టుకుంది.

34:32.197 --> 34:38.078
దాన్ని నాన్సీ శవం మీద నుండి హోవర్డ్ తీసుకుని
దాన్ని దాచాడు. దాన్ని మేరీ కనిపెట్టింది.

34:38.745 --> 34:39.996
సరే, అయితే అసలోడు దొరికినట్టే.

34:41.248 --> 34:44.082
ఇది నిజం అయ్యే అవకాశమే లేదు.
ఇది అర్థం లేని వాగుడు.

34:44.083 --> 34:45.334
రాబర్ట్,

34:45.335 --> 34:47.254
నేను మేరీని నమ్ముతున్నాను.

34:54.261 --> 34:56.846
ఇది పోలీసులకు ఎందుకు చెప్పలేదు?

34:56.847 --> 34:59.098
చెప్పాం. మేము ట్రై చేసాం, కానీ అది…

34:59.099 --> 35:03.352
ఇది క్లిష్టమైన విషయం. కానీ నువ్వు
చీఫ్ ఆఫ్ పోలీస్ కి ఒక్క కాల్ చేస్తే…

35:03.353 --> 35:04.604
అస్సలు కుదరదు.

35:04.605 --> 35:06.147
ఆ పని కాన్స్టన్స్ తో చేయించు.

35:06.148 --> 35:08.316
మీ అమ్మకు కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ లో
పట్టు ఉండే ఉంటుంది.

35:08.317 --> 35:10.736
బోస్టన్ లో అయితే సాధ్యమే. కానీ ఇది…

35:11.904 --> 35:16.449
మీకు అర్థం కావడం లేదు.
హోవర్డ్ ప్రమాదకరమైన వాడు. మేరీ ప్రమాదంలో ఉంది.

35:16.450 --> 35:18.034
- లేదు.
- ఎందుకు?

35:18.035 --> 35:21.038
ఇప్పటికే ఈ కుటుంబానికి వచ్చిన చెడ్డ పేరు
వల్ల మేము నానా తంటాలు పడ్డాం.

35:21.622 --> 35:23.248
నేను మళ్ళీ రిస్క్ చేయలేను.

35:24.208 --> 35:25.250
చేస్తావు.

35:25.876 --> 35:27.419
ఆ అమ్మాయి నీకు ద్రోహం చేసింది.

35:30.547 --> 35:34.551
ఆమెను నువ్వు కలిసిన మొదటిసారి నువ్వు
ఏమన్నావో నీకు గుర్తుందా?

35:36.053 --> 35:38.472
మన వంశానికి ఆమె కళంకం అవుతుంది అన్నావు.

35:39.056 --> 35:42.059
మన వంశమేదో పై నుండి దిగి వచ్చింది అన్నట్టు.

35:43.018 --> 35:45.354
అందరికంటే తను నిన్నే మెప్పించాలి అని చూసింది.

35:46.063 --> 35:50.149
తనకు తండ్రి అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దరిద్రుడు
ఆమెను లైంగికంగా

35:50.150 --> 35:51.276
వేధించిన రాక్షసుడు.

35:51.777 --> 35:55.447
తనను కాపాడతాను అని నేను మాట ఇచ్చా.

35:57.616 --> 36:02.788
నేను తనను సంతోషపెట్టగలను అనుకున్నా,
కానీ నా వల్ల కాలేదు.

36:04.081 --> 36:05.082
ఎందుకంటే…

36:07.084 --> 36:08.293
నువ్వు నన్ను చేయనివ్వలేదు.

36:10.462 --> 36:12.047
నన్ను చిన్న పిల్లాడిలా చూశావు.

36:13.048 --> 36:14.424
ఎప్పుడూ అంతే.

36:15.300 --> 36:18.219
నీ వల్ల, నాన్సీ నన్ను ఏనాడూ ఒక మగాడిలా చూడలేదు.

36:18.220 --> 36:19.721
నీకు మగాడిలా ఉండాలని ఉందా?

36:21.139 --> 36:22.391
అయితే అలా నడుచుకో.

36:26.895 --> 36:27.980
నాన్నా.

36:34.194 --> 36:35.696
నువ్వు చీఫ్ అల్బ్రెయిట్ కి కాల్ చేయాలి.

36:37.447 --> 36:38.657
ఎందుకంటే నువ్వు చేయకపోతే…

36:40.826 --> 36:42.536
నేను మొత్తం పబ్లిక్ లో పెడతా.

36:44.329 --> 36:48.040
ప్రతీ ఆఫ్ షార్ ఎకౌంట్, ప్రతీ ఇల్లీగల్ లావాదేవీ,

36:48.041 --> 36:49.543
ప్రతీ కవర్ అప్.

36:51.420 --> 36:54.338
మన లొసుగులు అన్నీ వచ్చే ఏడాది వరకు ప్రతీ న్యూస్ పత్రిక

36:54.339 --> 36:56.717
మొదటి పేజీలో పడేలా చేస్తా.

36:59.386 --> 37:01.220
అలాగే నా పని పూర్తయ్యేసరికి,

37:01.221 --> 37:04.516
హెనెస్సీ అనబడే పేరు అర్థ అణా కూడా
విలువ చేయనంతగా దెబ్బ తీస్తాను.

37:21.408 --> 37:23.452
కెన్నెత్. అవును.

37:24.953 --> 37:25.996
నాకు ఒక సాయం కావాలి.

37:37.674 --> 37:39.842
కానీ నాకు వారం పాటు కారులో ఇరుక్కుని ఉండాలని లేదు.

37:39.843 --> 37:43.471
ఊరుకో, జూన్ బ్లూమ్.
ఇదొక సాహసం అనుకో. అలాగే ఒక మాట చెప్పనా?

37:43.472 --> 37:45.848
మనం దారిలో వచ్చే ప్రతీ నేషనల్ పార్క్ కి వెళ్లొచ్చు.

37:45.849 --> 37:47.601
అమ్మ కూడా మనతో వస్తుందా?

37:48.560 --> 37:49.853
ఖచ్చితంగా వస్తుంది.

37:51.563 --> 37:54.358
ముందు మేము కొన్ని లీగల్ విషయాలను చక్కబెట్టాలి,

37:55.859 --> 37:57.694
కానీ మీ అమ్మా నేను ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాం.

38:06.453 --> 38:07.454
కూర్చో.

38:08.121 --> 38:09.373
ఏం జరుగుతోంది?

38:10.874 --> 38:12.500
నీ చెల్లెళ్ళతో ఉండు.

38:12.501 --> 38:13.919
ఏం లేదు, బుజ్జి. అది ఏంటో చూద్దాం.

38:16.046 --> 38:17.756
డిటెక్టివ్. ఆఫీసర్స్.

38:18.382 --> 38:21.801
మిస్టర్ సింప్సన్, ఏప్రిల్ ఎనిమిదిన జరిగిన నాన్సీ హెనెస్సీ హత్య

38:21.802 --> 38:25.264
విషయంలో మిమ్మల్ని ప్రశ్నించడానికి తీసుకురమ్మని
మాకు వారెంట్ అందింది.

38:27.182 --> 38:28.183
నన్ను చూడనివ్వండి.

38:30.978 --> 38:32.229
నేను రాను అంటే?

38:32.896 --> 38:34.731
అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెస్తాం.

38:36.775 --> 38:38.860
ఏం కాదు, అమ్మాయిలు. నేను రాత్రికి ఇంటికి వస్తా.

38:38.861 --> 38:41.612
హోవర్డ్, ఇది నా పని కాదు. ఇది నా పని కాదు.

38:41.613 --> 38:42.698
నేను ఏం చేయలేదు.

38:43.198 --> 38:44.907
ఎవరొకరు డిసిఎఫ్ఎస్ కి కాల్ చేయాలి.

38:44.908 --> 38:46.826
నా పిల్లల్ని మరొకరి పర్యవేక్షణలో పెట్టకుండా నేను రాలేను.

38:46.827 --> 38:49.121
లేదు, ప్లీజ్. వద్దు.

38:50.289 --> 38:51.706
ఇది నా పని కాదు, హోవర్డ్.

38:51.707 --> 38:54.251
ఈ విషయంతో నాకు సంబంధం లేదు. ప్లీజ్, హోవర్డ్.

38:55.419 --> 38:56.420
ప్లీజ్.

39:13.520 --> 39:16.022
నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ ఇక్కడే ఉంది.

39:16.023 --> 39:17.816
- ఇలా రండి.
- ఐ లవ్ యు.

39:25.532 --> 39:26.950
నేను ఇక్కడే ఉన్నాను.

39:34.458 --> 39:35.709
నేను ఏం చేయాలో చెప్పండి.

39:37.794 --> 39:38.879
నేను ఏం చేయాలి?

39:39.713 --> 39:41.423
అసలు ఇలా ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు.

39:41.965 --> 39:44.675
అన్నిటికంటే దారుణమైన పరిణామం,
నీ భర్తని అరెస్ట్ చేస్తారు,

39:44.676 --> 39:48.180
అప్పుడు అమ్మాయిలను తాత్కాలికంగా ఇంకొకరి
సంరక్షణలో ఉంచాల్సి ఉంటుంది.

39:50.974 --> 39:53.392
నువ్వు కస్టడీ వాదనలు వినిపించడానికి
కోర్టులో పిటిషన్ వేయొచ్చు.

39:53.393 --> 39:56.103
కానీ నీ కేసులో, అందుకు చాలా వారాలు లేదా
నెలలు కూడా పట్టొచ్చు.

39:56.104 --> 39:57.647
మరి మంచి పరిణామం ఏంటి?

39:57.648 --> 40:00.651
నీ భర్తని రిలీజ్ చేస్తారు, అతను వచ్చి
మీ పిల్లలని తీసుకెళ్లొచ్చు.

40:01.401 --> 40:02.818
అంతా సవ్యంగా జరగాలని కోరుకుందాం.

40:02.819 --> 40:06.114
మరి ఆత్మీయ తల్లి సంగతి? ఒక ఆత్మీయ తల్లి
వాళ్ళని చూసుకోగలదు, కదా?

40:06.615 --> 40:09.700
నేను లీగల్ సాయం కోసం నీకు ఒక నంబర్ ఇస్తాను, సరేనా?

40:09.701 --> 40:10.702
సరే.

40:12.746 --> 40:14.539
ఎలనోర్
వాయిస్ మెయిల్ - మిస్డ్ కాల్

40:14.540 --> 40:16.458
ఎలనోర్

40:17.543 --> 40:19.711
నేను నిన్ను నమ్మలేకపోతున్నా.

40:20.462 --> 40:23.673
అంత జరిగిన తర్వాత కూడా. వాడు తనని చంపాడు!

40:23.674 --> 40:26.468
మేరీ, వాడు తనని చంపేశాడు. వాడొక కిరాతకుడు.

40:27.511 --> 40:29.763
కానీ నువ్వు మళ్ళీ వాడి దగ్గరకే వెళ్ళావే?

40:30.264 --> 40:32.932
పిల్లలని తిరిగి మన దగ్గరకు తీసుకురావడానికి
మనం ఏదొక మార్గం కనిపెట్టగలిగి ఉండేవాళ్ళం.

40:32.933 --> 40:36.311
నేను అందుకు భూమిని ఆకాశాన్ని కూడా కదిలించి ఉండేదాన్ని.

40:36.937 --> 40:38.688
నేను న్యాయం జరిగేలా చేయాల్సిందే.

40:38.689 --> 40:41.775
నాన్సీ కోసం నేను న్యాయం జరిగేలా చేయాల్సిందే,
నువ్వు ఉన్నా, లేకపోయినా.

40:44.570 --> 40:47.864
నాన్సీ హెనెస్సీమర్డర్ కేసులో ఒక బ్రేకింగ్ న్యూస్ వెల్లడైంది.

40:47.865 --> 40:50.741
మాకు అందిన సమాచారం మేరకు ఒక
అపరిచితుడు టిప్ ఇవ్వడంతో ఇది జరిగింది.

40:50.742 --> 40:53.078
ఇప్పుడు నిజమైన ఒక వీడియో బయటపడింది.

40:53.620 --> 40:54.871
మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో

40:54.872 --> 40:58.165
పోలీసులు నాన్సీ హెనెస్సీ హత్యలో ప్రధాన నిందితుడిగా

40:58.166 --> 41:00.252
భావిస్తున్న వ్యక్తిని చూడవచ్చు.

41:01.962 --> 41:06.549
వీడియోలో కనిపించే వ్యక్తి బేకర్స్ ఫీల్డ్ వాస్తవ్యుడు,
స్కాట్ రీడ్ గా గుర్తించబడ్డాడు.

41:06.550 --> 41:09.051
ఈ ఫుటేజ్ అర్రోయో సెకో పార్క్ లో శ్రీమతి హెనెస్సీ హత్య

41:09.052 --> 41:10.636
జరిగిన రాత్రిన తీయబడింది.

41:10.637 --> 41:12.389
వెతుకులాట మొదలైంది.

41:13.307 --> 41:16.976
అధికారులు మిస్టర్ రీడ్ దగ్గర తుపాకీ ఉందని,
అలాగే ప్రమాదకరమైన వాడు అని హెచ్చరిస్తున్నారు.

41:16.977 --> 41:19.437
అతను ఎక్కడ ఉన్నాడని ఎవరికైనా సమాచారం తెలిస్తే
వెంటనే అత్యవసర

41:19.438 --> 41:21.440
సర్వీసెస్ వారికి తెలుపగలరని విజ్ఞప్తి.

42:13.575 --> 42:15.577
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
