WEBVTT

00:01.502 --> 00:04.670
గాయాలు, దెబ్బలు అలాగే త్యాగాలు నిజమైనవి.

00:04.671 --> 00:07.965
నిజమైన త్యాగం ఇప్పుడు నా భర్త ఒహాయోకి

00:07.966 --> 00:11.135
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళ్లడంలాగ ఉంటుంది,

00:11.136 --> 00:14.931
దానర్థం మేము అన్నీ వదిలేసి అక్కడికి
వెళ్లాల్సి రావొచ్చు. అది నిజమైన త్యాగం.

00:14.932 --> 00:17.768
నువ్వు మాత్రం ఇంకొక మహిళ భర్తతో
ఊహాగానాల్లో విహరిస్తున్నావు.

00:18.519 --> 00:19.769
నువ్వు వెళ్ళిపోతున్నావా?

00:19.770 --> 00:22.188
- అయితే ఏంటి?
- అంటే ఏంటి నీ ఉద్దేశం?

00:22.189 --> 00:24.023
- నువ్వు నా బెస్ట్ ఫ్రెండువి.
- అవును!

00:24.024 --> 00:27.068
నాన్సీ కూడా అంతే,
కానీ నువ్వు తన భర్తతో పడుకుంటున్నావు.

00:27.069 --> 00:29.821
మేరీ సింప్సన్ ఎదుటోళ్ళలో ఎప్పుడూ మంచినే చూసింది.

00:30.489 --> 00:33.074
ఇతరులు ఆమె అభిప్రాయం తప్పు
అని నిరూపించినా కూడా.

00:33.075 --> 00:34.993
- నా ఇంట్లో నుండి బయటకు పో.
- మేరీ.

00:35.577 --> 00:36.661
వెంటనే.

00:36.662 --> 00:38.246
ఆమె అమాయకురాలు కాదు.

00:38.247 --> 00:41.333
మనుషులు ఎంత దారుణంగా తయారవ్వగలరో
ఆమె దగ్గరగా చూసింది.

00:43.627 --> 00:46.338
కాబట్టి తనకంటూ ఒక కొత్త వాస్తవాన్ని
నిర్మించుకోవడం ఎలాగో నేర్చుకుంది.

00:48.382 --> 00:51.051
కానీ నిజ ప్రపంచానికి మేరీ పట్ల వేరే ప్లాన్ ఉంది.

00:55.097 --> 00:56.348
అది విన్నావా, నాన్స్?

00:59.810 --> 01:01.311
ఆఖరికి అది కోరుకున్నది దానికి దక్కింది.

01:02.396 --> 01:05.898
మూడవ చాప్టర్
మేరీ

01:05.899 --> 01:09.360
తనని తాను చివరిగా ఎప్పుడు
సర్ప్రైజ్ చేసుకుందో మేరీకే తెలీదు.

01:09.361 --> 01:11.947
ఒకప్పుడు ఆమెకి ఏమైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండేది.

01:12.531 --> 01:16.284
కాస్ట్కో చుట్టూ చెక్కర్లు కొట్టడం,
పీటీఏ వంట కార్యక్రమాలు మొదలుకావడానికి ముందు…

01:16.285 --> 01:18.202
"…అలాగే పనిచేసే లాన్జరే.

01:18.203 --> 01:22.623
మేరీకి ఒక కోరిక అలాగే లక్ష్యం ఉండేది.
ఆమెలో రహస్యంగా ఒక బలమైన అగ్ని రగిలేది.

01:22.624 --> 01:26.419
తనకు ఏం కావాలో బాగా తెలుసు, అందుకోసం ఏమైనా చేసేది.
హోవర్డ్ కి కూడా ఆమె అలాగే సంపాదించుకుంది.

01:26.420 --> 01:30.007
ఆమె తన పీ.హెచ్.డి మొదలెట్టి ఏడాది
కాకముందే అతనికి టీచింగ్ అసిస్టెంట్ అయింది.

01:31.091 --> 01:36.054
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి, ఆమె శరీరంపై
అతని బరువు పడింది,

01:36.847 --> 01:40.726
అలాగే ఆమె నగ్న శరీరానికి అతని
సోఫా గీరిన స్పర్శ తెలిసింది."

01:42.561 --> 01:44.521
"ఆమె…" సారీ.

01:45.772 --> 01:48.649
"అతని సంసారం ఎప్పుడో ముక్కలు చెక్కలైంది.

01:48.650 --> 01:50.234
ఆమె స్వీయ హాని చేసుకుంటుందేమో అని అతను భయపడి

01:50.235 --> 01:53.321
ఉండకపోతే ఈపాటికి ఆమెను ఎప్పుడో వదిలేసేవాడు. మళ్ళీ.

01:53.322 --> 01:56.407
పాపం ఆమెను చూసి జాలేస్తోంది అని మేరీ అనుకునేది.

01:56.408 --> 02:01.537
కానీ నిజం ఏంటంటే, వారి అక్రమ బంధం
కారణంగా ఆ అనుభవం ఆమెకు ఇంకా నచ్చింది.

02:01.538 --> 02:05.292
ఆమె అతన్ని ఇష్టపడింది.
అందుకు ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు."

02:08.252 --> 02:10.130
నాకు తెలిసి అదే ప్రారంభం అనుకుంట.

02:11.632 --> 02:13.926
నేను అనుకున్నదానికన్నా కాస్త వదరుగా ఉంది.

02:15.344 --> 02:17.637
ఆ విషయం చదివిన వారు చెప్తారులే.

02:17.638 --> 02:19.847
ఇందులో చాలా మంచి కథ ఉంది.

02:19.848 --> 02:23.518
"పనిచేసే లాన్జరే"? ఆమె ఎలాంటిదో ఇట్టే తెలుస్తోంది.

02:23.519 --> 02:27.147
- థాంక్స్.
- సరే. ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి?

02:28.023 --> 02:29.024
ఎవరైనా చెప్తారా?

02:29.942 --> 02:31.777
నీ నిజాయితీ నాకు నచ్చింది.

02:32.361 --> 02:37.448
నిజమే. మనల్ని మనం చెడ్డ వ్యక్తిగా
చూపించుకోవడానికి చాలా ధైర్యం కావాలి.

02:37.449 --> 02:41.245
చెడ్డ వ్యక్తిగా. అవును. అలాగే నచ్చలేని మనిషిగా.

02:42.412 --> 02:45.831
ప్రధాన పాత్ర అయిన మేరీ కథ ఇంకెవరికి నచ్చలేదు?

02:45.832 --> 02:48.459
అవును. ఆమె పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుని

02:48.460 --> 02:51.295
అతని భార్య ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని ఆశపడింది.

02:51.296 --> 02:54.006
అంటే, ఆమె అలా ఆశపడలేదు. క్షమించాలి.

02:54.007 --> 02:56.592
లేకపోతే చదివే వ్యక్తికి ప్రారంభంలో
ఆసక్తి పుట్టించడానికి మేరీ ఇంకేం చేయాలి?

02:56.593 --> 02:59.847
నన్ను అడిగితే, నాకు నాన్సీ గురించి వినాలి అని ఉంది.

03:00.597 --> 03:01.598
అవును.

03:02.099 --> 03:04.183
నేను ఆమె గురించే ప్రస్తావించలేదు.

03:04.184 --> 03:05.726
మిత్రులారా, దృష్టి పెట్టండి.

03:05.727 --> 03:08.229
ఆమె సోషల్ మీడియాలో మేము మీ ఫోటోలు చూసాం.

03:08.230 --> 03:10.523
నేను కూడా రస్సుల్ తో ఏకీభవిస్తున్నా.
నాన్సీ గురించి రాయి.

03:10.524 --> 03:13.442
నువ్వు కథకి మిస్టరీ కోణం చేర్చొచ్చు.
అలాగే థ్రిల్లర్ లాగ రాయొచ్చు.

03:13.443 --> 03:14.861
- అది సూపర్.
- అవును.

03:14.862 --> 03:17.029
నిజ జీవితంలో అది ఆమె భర్తా?

03:17.030 --> 03:19.240
- ఫ్రెండ్ కావొచ్చు.
- ఏ ఫ్రెండ్?

03:19.241 --> 03:21.117
- అంటే, అది…
- మనం కాస్త శాంతించాలి.

03:21.118 --> 03:22.785
కూతురు ఇవాళ ఉదయం వీడియో కూడా పెట్టింది.

03:22.786 --> 03:24.996
- ఏం వీడియో?
- అది వైరల్ అయింది.

03:24.997 --> 03:26.664
విషయం ఏంటంటే, ఆమె భర్త…

03:26.665 --> 03:28.749
- రాబర్ట్.
- రాబర్ట్,

03:28.750 --> 03:30.334
- చాలా అందంగా ఉంటాడు అనుకో…
- చాలా అందగాడు.

03:30.335 --> 03:33.505
…నాన్సీ బెస్ట్ ఫ్రెండ్
ఎలనోర్ తో పడుకుంటున్నాడు.

04:20.761 --> 04:22.721
అరమింట హల్ వ్రాసిన పుస్తకం
ఆధారంగా రూపొందించబడింది

04:30.479 --> 04:32.104
వాళ్ళు కలిసిన రోజు నుండి

04:32.105 --> 04:36.360
నాన్సీతో స్నేహం చేయడమే తన జీవితంలోని
అత్యంత ఆసక్తికరమైన విషయం అవుతుందని మేరీకి తెలుసు.

04:37.569 --> 04:39.111
మెరిసిపోయే చెర్మంతో సులువుగా

04:39.112 --> 04:41.989
ఎవరినైనా పడేయగల బ్లాండ్ జుట్టు అమ్మాయికి
ఉండే ఫాలోయింగ్ గురించి మేరీకి తెలుసు.

04:41.990 --> 04:43.449
నిజమైన నాన్సీ హెనెస్సీ ఎవరు?

04:43.450 --> 04:46.453
అలాగే ఆమెతో పోల్చితే తన స్థాయి
ఎలాంటిదో కూడా ఆమెకు తెలుసు.

04:54.253 --> 04:57.673
కానీ ప్రపంచం పరిపూర్ణతకి ఇచ్చిన నిర్వచనంపై
మేరీకి ఎలాంటి ఆసక్తి లేదు.

04:58.882 --> 05:02.803
1980లలో ఒక పొలంలో పెరిగిన అయిదుగురు
పిల్లల్లో ఆమె పెద్దది.

05:03.303 --> 05:04.972
అలాగే ఆమెకు ఏనాడూ కొదువ ఏర్పడలేదు.

05:06.139 --> 05:10.394
ఎందుకంటే కాస్త ఊహకి పని చెబితే ఆమె తన ముందు
ఉన్న వాస్తవాన్ని తనకు తగ్గట్టు మరల్చుకోగలదు.

05:11.687 --> 05:12.938
ఏమండీ, మీరు షాన్ కదా?

05:13.522 --> 05:15.773
- అవును.
- మీరు నాకు సాయం చేయగలరు అని చెప్పారు.

05:15.774 --> 05:18.110
నేను జలుబుకు మందులు వెతుకుతున్నా.

05:18.986 --> 05:20.736
మీ దగ్గర అది ఉందా?

05:20.737 --> 05:21.988
పగటి పూటకా లేక రాత్రికా?

05:21.989 --> 05:23.240
పగలు వేసుకునేదే.

05:23.991 --> 05:26.201
- నేను వెనుక రూమ్ లో చెక్ చేసి చూడాలి.
- మీకు ఇబ్బంది లేకపోతే చూడండి.

05:27.744 --> 05:28.828
థాంక్స్.

05:28.829 --> 05:29.912
ఎలనోర్ బుషే

05:29.913 --> 05:32.332
ఇతరులకు ఆస్తి ఇంకా అంతస్తు ఉంటే

05:33.208 --> 05:35.544
మేరీకి అంతకంటే ఉపయోగకరమైనది వేరేది ఉంది.

05:38.046 --> 05:39.673
నేర్పరితనం.

05:43.302 --> 05:45.012
- థాంక్స్.
- థాంక్స్.

05:47.222 --> 05:49.474
ఆడెరాల్

06:00.986 --> 06:02.070
సరే.

06:08.577 --> 06:15.249
టిల్లీ టుమారో యువరాణి తల పైకి ఎత్తి
సూర్యుడి పిరమిడ్ మెట్లను చూసింది.

06:15.250 --> 06:19.046
డ్రాగన్, సూర్యుడి పిరమిడ్ పైన ఏముంది?

06:20.130 --> 06:24.717
శ్వాస నుండి మంటలు వదులుతుంది,
కానీ స్నేహపూర్వకంగా అనుకోండి.

06:24.718 --> 06:29.222
ఇవాళ, నువ్వు మీ అమ్మను మళ్ళీ కలుస్తావు,

06:29.223 --> 06:35.478
పేరుగాంచిన ఆర్కియాలజిస్ట్ మరియు మహారాణి,
టాన్యా టుమారో.

06:35.479 --> 06:41.526
అప్పుడు టిల్లీ టుమారో యువరాణి
సూర్యుడి పిరమిడ్ మెట్ల మీద గెంతింది.

06:41.527 --> 06:44.238
పైకి వెళ్తున్నందుకు ఆమె చాలా సంతోషపడింది.

06:45.239 --> 06:46.532
ఆమె ఎగబీల్చింది.

06:49.076 --> 06:51.369
- మిగతా కథ రేపు చెప్తాలే.
- లేదు!

06:51.370 --> 06:52.703
అమ్మా, మొత్తం చెప్పు.

06:52.704 --> 06:55.790
చెప్తాను. రేపు.

06:55.791 --> 06:57.792
- డ్రాగన్ ఎవరికి కావాలి?
- నాకు!

06:57.793 --> 07:00.795
సరే. ఇప్పుడు జూని వంతు అనుకుంట, బుజ్జి.

07:00.796 --> 07:04.049
క్షమించాలి, కానీ నీకు యువరాణిని ఇస్తా. సరేనా?

07:04.550 --> 07:06.300
- ఇదుగో, తీసుకో.
- థాంక్స్.

07:06.301 --> 07:07.386
ఐ లవ్ యు.

07:07.886 --> 07:10.346
- ఐ లవ్ యు టూ.
- గుడ్ నైట్.

07:10.347 --> 07:12.974
అలాగే డ్రాగన్ ని గెలిచిన పాప.

07:12.975 --> 07:15.853
- గుడ్ నైట్. లవ్ యు.
- నైట్. లవ్ యు.

07:19.106 --> 07:21.357
ఇక స్థానిక వార్తలకు వస్తే, పాసడీనలోని గృహిణి,

07:21.358 --> 07:24.735
నాన్సీ హెనెస్సీ షాకింగ్ హత్య జరిగి
నేటికి దాదాపుగా రెండు నెలలు అవుతుంది.

07:24.736 --> 07:26.988
- ఇటీవల బయటపడిన విషయాల కారణంగా…
- చూడు, నాన్స్, నువ్వు టీవీలో పడ్డావు.

07:26.989 --> 07:29.282
…బాధితురాలి బెస్ట్ ఫ్రెండ్, ఎలనోర్ బుషేని,

07:29.283 --> 07:31.951
ఇప్పుడు అనుమానితురాలిగా పరిగణిస్తున్నారు.

07:31.952 --> 07:33.703
విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇన్వెస్టిగేటర్లు

07:33.704 --> 07:35.788
- అదే సమయంలో బాధితురాలి…
- బూటకం. ఏం ఆధారంగా?

07:35.789 --> 07:38.165
…భర్త రాబర్ట్ హెనెస్సీ పై కూడా
విచారణ చేస్తున్నారని చెప్తున్నారు.

07:38.166 --> 07:41.460
మిస్ బుషే, మరియు మిస్టర్ హెనెస్సీలు ఇద్దరూ
కామెంట్ చేయడానికి ఇవాళ అందుబాటులోకి రాలేదు,

07:41.461 --> 07:44.172
కానీ హెనెస్సీ కుటుంబం నుండి ఒక స్టేట్మెంట్…

07:44.173 --> 07:46.465
- మేరీ, మేరీ, అనుకోనిది జరిగింది.
- …రేపు వెల్లడవుతుందని ఆశిస్తున్నాం.

07:46.466 --> 07:48.342
- నీ తోట ఎలా పెరుగుతోంది?
- హాయ్, నిన్నే.

07:48.343 --> 07:53.682
వెండి గంటలతో, అందమైన అలంకరణతో,
అలాగే ఎలాంటి లోటు లేకుండా.

07:55.726 --> 07:57.727
నువ్వు నీ ఫ్లైట్ రేపు అన్నావు కదా. మరి అప్పుడే…

07:57.728 --> 08:00.104
వాళ్ళు ఉదయం ఉన్న ఈవెంట్ ని రద్దు చేశారు,
కాబట్టి నేను వచ్చేసా.

08:00.105 --> 08:01.523
నేనే నీకు స్వయంగా చెప్పాలి అనుకున్నా.

08:02.774 --> 08:03.775
నాకు ఉద్యోగం వచ్చింది.

08:04.776 --> 08:05.860
వావ్.

08:05.861 --> 08:07.362
టెన్యూర్ రాబోతోంది, బేబీ.

08:07.863 --> 08:09.238
డీన్ ఇవాళ లంచ్ సమయంలో చెప్పాడు.

08:09.239 --> 08:12.366
ఇతర అభ్యర్థులు భయపడిపోయారు అంట,
అలాగే వాళ్ళకి నేను బాగా నచ్చాను.

08:12.367 --> 08:13.618
అంటే, ఎంతైనా అందులో ఆశ్చర్యం ఏముంది?

08:13.619 --> 08:15.536
వాళ్లకు నా పని అర్థమైంది.

08:15.537 --> 08:18.080
అభినందనలు. అంటే, ఇది అద్భుతం.

08:18.081 --> 08:19.415
"ఇది అద్భుతమా"?

08:19.416 --> 08:22.627
ఈ కైసర్ రారాజు యుద్ధం చేసి విజేతగా తన మనుషులతో

08:22.628 --> 08:25.963
ఊరేగింపు చేస్తూ తిరిగి వస్తే నువ్వు,
"ఇది అద్భుతం" అని సరిపెట్టుకుంటావా?

08:25.964 --> 08:28.425
క్షమించు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది.

08:29.259 --> 08:31.929
విజయం సాధించిన హీరోకి జేజేలు!

08:34.306 --> 08:35.431
అయితే ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి?

08:35.432 --> 08:36.974
ఆగస్టు.

08:36.975 --> 08:38.519
మరి మనం మన నిర్ణయాన్ని ఎప్పటికి చెప్పాలి?

08:39.602 --> 08:40.894
ఏం నిర్ణయం?

08:40.895 --> 08:43.482
మనం మొత్తం కుటుంబంతో ఒహాయోకి వెళ్లాలా లేదా అని.

08:44.358 --> 08:46.275
నేను ఎప్పుడూ ఒహాయోకి వెళ్ళలేదు.

08:46.276 --> 08:48.486
అక్కడ బక్ఐస్ ఉంది, స్పెగట్టితో చిలీ దొరుకుతుంది…
నీకు అక్కడ నచ్చుతుంది.

08:48.487 --> 08:49.737
బుజ్జి, నేను నిజంగా అంటున్నా.

08:49.738 --> 08:52.073
ఆర్టీ ఆఖరికి స్కూల్ లో సెటిల్ అయింది.

08:52.074 --> 08:54.909
అలాగే జూని కూడా…
దానికి తన పియానో పాఠాలు నచ్చాయి.

08:54.910 --> 08:56.410
- మార్కస్…
- మార్కస్ పెద్దోడు అయ్యాడు.

08:56.411 --> 08:58.246
అలాగే ఎప్పుడూ అమ్మాయిలకు ఏం కావాలని
మాత్రమే ఆలోచించలేం.

08:58.247 --> 09:00.164
నేను కూడా ఈ కుటుంబంలో భాగమే, తెలుసా?

09:00.165 --> 09:01.833
ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది…

09:01.834 --> 09:03.751
నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా?

09:03.752 --> 09:06.087
నేను తప్పుడు ఇంట్లోకి వచ్చానా?

09:06.088 --> 09:07.630
ఈ ఉద్యోగం కోసం మనం కలలు కన్నాం.

09:07.631 --> 09:09.841
అవును, ఇతర పరిస్థితుల మధ్య అయితే మనం…

09:09.842 --> 09:13.261
నేను చివరిగా చేసిన పనిలో ఒక పిచ్చి
బ్యాలేకి ప్రోగ్రామ్ నోట్స్ రాసాను.

09:13.262 --> 09:15.388
నేనొక పండితుడిని. నేను ఇలాంటి వాటికే పరిమితం కాలేను.

09:15.389 --> 09:16.974
అంటే, మనకు డబ్బు ఎంత అవసరమో తెలుసు కదా?

09:17.641 --> 09:19.433
అంటే, నేను కూడా పని చేయగలను.

09:19.434 --> 09:21.769
- మనం అలా ఎప్పుడో అనుకున్నాం కదా.
- అవునా?

09:21.770 --> 09:25.565
అవును, నేను మార్కస్ తో గర్భవతిగా ఉన్నప్పుడు.
నీకు గుర్తులేదా?

09:25.566 --> 09:29.944
మనం… వాడి చిన్నప్పుడు నువ్వు నీ కెరియర్ పై
దృష్టి పెట్టొచ్చు అని మాట్లాడుకున్నాం.

09:29.945 --> 09:32.530
కానీ ఆ తర్వాత నా వంతు అనుకున్నాం.

09:32.531 --> 09:34.824
అది చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు చాలా మారింది, మేర్.

09:34.825 --> 09:37.578
నేను… దేవుడా, అప్పట్లో నేను సైకో
జెన్నీని పెళ్లి చేసుకుని ఉన్నా.

09:38.245 --> 09:39.954
నేను ఏదొక పరిష్కారం కనిపెట్టడానికి చూస్తున్నా, కాబట్టి…

09:39.955 --> 09:42.124
నువ్వు సృష్టించిన సమస్యకు. ఛ!

09:43.375 --> 09:47.128
నా ప్రొఫెషనల్ జీవితంలో అతిగొప్ప రోజు,
కానీ నీకు అది కూడా చాలడం లేదు.

09:47.129 --> 09:49.046
నువ్వు ఎందులో అయినా నన్ను ఎంతో ప్రోత్సహించేదానివి.

09:49.047 --> 09:51.382
అద్భుతం, మేరీ. నిజంగా సూపర్.

09:51.383 --> 09:53.593
నన్ను క్షమించు. నన్ను క్షమించు.

09:53.594 --> 09:55.928
నువ్వు అన్నది నిజమే. ఇది… నాకు సంతోషంగానే ఉంది.

09:55.929 --> 09:57.096
- నిజమా?
- అవును.

09:57.097 --> 10:00.183
అంతా నేను అనుకున్నదానికన్నా చాలా వేగంగా
జరుగుతోంది కదా.

10:00.184 --> 10:02.185
ఇది మనకు మంచే అవుతుంది.

10:02.186 --> 10:03.978
మనం అక్కడ సంతోషంగా ఉంటాం. ఒట్టు.

10:03.979 --> 10:05.397
సరే.

10:09.234 --> 10:10.735
నీకు నా మెసేజ్ అందిందా?

10:10.736 --> 10:13.322
- ఏం మెసేజ్?
- ఎలనోర్ గురించి.

10:14.489 --> 10:16.742
అవును. నేను దానికి స్పందించాను అనుకున్నా.

10:18.577 --> 10:20.995
అంటే, మేము ఒకరిని ఒకరం చాలా మాటలు అనుకున్నాం.

10:20.996 --> 10:23.623
మేము అలా ముందెప్పుడూ గొడవపడ్డదే లేదు.

10:23.624 --> 10:25.875
అంటే, మీ ఇద్దరికీ మధ్య కాస్త దూరం ఉంటే మంచిది.

10:25.876 --> 10:28.337
ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడటం మంచిది కాదు, తెలుసా.

10:31.131 --> 10:32.798
నేను చాలా అలసిపోయా.

10:32.799 --> 10:34.635
- పైకి వస్తున్నావా?
- అవును, కాసేపట్లో వస్తా.

11:09.503 --> 11:12.005
ఒక్కటే. ఎందుకంటే అంతా నీ కంట్రోల్ లోనే ఉంది.

11:19.471 --> 11:21.473
ఆరమింట్స్

11:39.449 --> 11:42.119
మేరీకి 'గృహిణి' అనే పదం మొదటి
నుండి అస్సలు నచ్చేది కాదు.

11:43.287 --> 11:44.788
'హోమ్ మేకర్' అనే పదం ఇంకా దారుణం.

11:46.373 --> 11:50.586
తన రోజులు ఎలా గడుపుతుంది అనే విషయాన్ని
ఆ రెండు పదాలు వివరించడానికి సరిపోవు.

11:51.753 --> 11:54.256
కానీ ఎవరైనా నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగితే

11:55.007 --> 11:57.009
ఆమె వివరించడానికి ఇబ్బంది పడేది.

11:57.593 --> 12:00.971
వాస్తవాలు అలాగే వివరాలను గుర్తుంచుకోవడం
ఆమెకు పెద్దగా అబ్బిరాలేదు.

12:02.055 --> 12:06.684
అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ హత్య చేయబడే వరకు
ఎవరూ ఆమెను ప్రశ్నించాలని అనుకోలేదు కూడా.

12:06.685 --> 12:08.269
చూసుకోండి, వేడిగా ఉంది.

12:08.270 --> 12:09.271
థాంక్స్.

12:10.397 --> 12:13.192
మేర్. డిటెక్టివ్ గాంజ్
మనల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంట.

12:13.775 --> 12:14.859
సరే.

12:14.860 --> 12:16.195
కొన్ని ప్రశ్నలే.

12:17.946 --> 12:18.947
హేయ్.

12:21.200 --> 12:25.203
మిస్టర్ హెనెస్సీ ఇంకా మిస్ బుషేల మధ్య అక్రమ సంబంధం,

12:25.204 --> 12:26.871
మీకు దాని గురించి ఎప్పుడు తెలిసింది?

12:26.872 --> 12:28.456
- నిన్న ఉదయం.
- మేరీ నాకు నిన్నే చెప్పింది.

12:28.457 --> 12:30.917
మీకు తెలిసినంత వరకు ఆ బంధం ఎప్పుడు మొదలైంది?

12:30.918 --> 12:32.210
నాన్సీ మరణం తర్వాత.

12:32.211 --> 12:34.587
- అలా అని ఖచ్చితంగా చెప్పగలరా?
- అవును.

12:34.588 --> 12:39.050
ఎలనోర్ చేసిన పని తప్పే,
కానీ ఆమె ఒకప్పుడు అతన్ని ఇష్టపడింది.

12:39.051 --> 12:41.845
అది… ఆమె దుఃఖంలో మునిగిపోవడం వల్ల అలా జరిగింది.

12:43.180 --> 12:44.681
వాళ్ళేమి కలిసి పారిపోయేది లేదు.

12:45.849 --> 12:47.600
అదేం పెద్ద విషయం కాదు.

12:47.601 --> 12:51.354
మీ ఇద్దరిలో ఎవరైనా వాళ్ళ కోపం కట్టలు తెంచుకోవడం,
అలాగే హింసాత్మకం కావడం చూశారా?

12:51.355 --> 12:54.274
ఎలనోర్? లేదు. లేదు.

12:55.192 --> 12:56.568
నిజమే, కానీ రాబర్ట్…

12:58.237 --> 13:00.154
కొంచెం తాగితే అతని ప్రవర్తన దురుసుగా ఉంటుంది.

13:00.155 --> 13:01.572
దురుసుగా అంటే?

13:01.573 --> 13:05.785
రాబర్ట్… ఎలా చెప్పను?
అతనికి కోరుకున్నది దక్కించుకోవడం అలవాటు.

13:05.786 --> 13:08.746
అంటే, మీరు అతన్ని కలిశారు కదా.
అందగాడు, ధనవంతుడు, కష్టం తెలీని వాడు.

13:08.747 --> 13:11.583
ఫ్యాన్సీ చదువులు చదివాడు, కానీ దురదృష్టవశాత్తు,
చూపించుకోవడానికి ఏం లేదు.

13:12.417 --> 13:17.840
అలాగే ఏదైనా తను అనుకున్నట్టు జరగకపోతే…
అవును, అతను స్పందన ఎలా ఉంటుందో… చూసా.

13:18.507 --> 13:21.384
- అతను నాన్సీకి లెటర్ రాసాడు.
- ఏం లెటర్?

13:21.385 --> 13:23.053
రాబర్ట్ కి అక్రమ సంబంధం గురించి తెలుసు.

13:23.637 --> 13:27.223
అతను తెలీనట్టు నటించాడు, కానీ అతనికి తెలుసు.

13:27.224 --> 13:31.979
అలాగే వాళ్ళు గొడవపడినప్పుడు,
నాన్సీ అతనికి భయపడింది.

13:32.646 --> 13:34.605
కాబట్టి అతను ఆమెను క్షమాపణలు అడుగుతూ లెటర్ రాసాడు.

13:34.606 --> 13:36.441
ఎలనోర్ నాకు అది నిన్నే చెప్పింది.

13:37.734 --> 13:38.735
నేను అది చెక్ చేసి చూస్తా.

13:39.403 --> 13:43.073
మీరు నాన్సీ సవితి తండ్రిపై విచారించారా? స్కాట్?

13:43.657 --> 13:45.157
మీరు మిస్టర్ రీడ్ గురించి అంటున్నారా?

13:45.158 --> 13:49.328
అవును. ఆమె చిన్నప్పుడు ఆమెను అతను
లైంగికంగా వేధించాడని తెలుసు కదా?

13:49.329 --> 13:50.663
మీరు అది చెక్ చేశారా?

13:50.664 --> 13:52.373
మేము మిస్టర్ రీడ్ ని సంప్రదించాం,

13:52.374 --> 13:55.168
అలాగే అతను గత 20 ఏళ్లుగా

13:55.169 --> 13:57.044
శ్రీమతి హెనెస్సీని సంప్రదించలేదు అని చెప్పాడు.

13:57.045 --> 13:58.671
మీకు వేరే విషయం ఏమైనా తెలిస్తే తప్ప.

13:58.672 --> 14:00.924
నాకైతే ఆమెకు అతనంటే భయం అని మాత్రం తెలుసు.

14:01.758 --> 14:04.635
ఆమె దగ్గర ఉండే స్క్రాప్ పుస్తకంలో
ఆమె అతని బొమ్మ గీసింది.

14:04.636 --> 14:05.804
అలాగే ఆమె… అది…

14:06.305 --> 14:07.806
ఆమెకు అతనంటే భయం అని స్పష్టంగా చెప్పొచ్చు.

14:09.183 --> 14:10.517
సరే.

14:11.518 --> 14:12.686
"సరే"?

14:13.812 --> 14:16.647
మీరు ఈ విషయాల ఆధారంగా విచారణ చేయొచ్చు,
డిటెక్టివ్, సరేనా?

14:16.648 --> 14:18.567
వీళ్ళలో ఒకడే నా ఫ్రెండ్ ని చంపాడు.

14:19.401 --> 14:21.069
ఖచ్చితంగా మగ వ్యక్తే అని ఎలా చెప్పగలరు?

14:22.070 --> 14:23.487
మీరు…

14:23.488 --> 14:26.449
డిటెక్టివ్ గాంజ్, నా భార్య ఇప్పటికే
మీతో చాలా మాట్లాడింది.

14:26.450 --> 14:30.204
అందుకు చాలా సంతోషం. కానీ…
నాకు ఇంకొక్క ప్రశ్న ఉంది.

14:31.205 --> 14:33.998
మీరు ఎన్నింటికి డిన్నర్ నుండి వెళ్లారని చెప్పారు?

14:33.999 --> 14:35.500
చెప్పాను కదా, దాదాపు 9:00 గంటలకు.

14:35.501 --> 14:38.253
మరి అక్కడి బార్టెండర్ మిగతావాళ్ళు వెళ్లిన తర్వాత
మీకు మూడు లేదా నాలుగు డ్రింక్స్

14:38.921 --> 14:41.882
పోసాను అని చెప్పడం అబద్ధం అంటారా?

14:42.966 --> 14:44.800
నేను ఒక డ్రింక్ కోసం అక్కడ ఉండి ఉండొచ్చు.

14:44.801 --> 14:48.638
అతను మాతో "మిమ్మల్ని ఉబర్ ట్యాక్సీలోకి
ఎక్కించాం" అని చెప్పాడు.

14:48.639 --> 14:51.433
మరి ఆ రాత్రి జరిగిన విషయాలు కొన్ని
మీకు జ్ఞాపకం లేకపోయే అవకాశం ఉందా?

14:52.684 --> 14:55.269
నా భార్య 10:30కి ఇంటికి వచ్చి
నేరుగా మంచం ఎక్కింది.

14:55.270 --> 14:56.772
నేను రాత్రంతా ఆమెతోనే ఉన్నాను.

14:58.065 --> 15:00.984
- అయ్యొ. నేను రాగలను.
- సరే. సరే.

15:05.364 --> 15:07.407
సరే, ఇక నేను లాయర్ ని పిలవాలా?

15:08.075 --> 15:10.244
రిలాక్స్. మా పని ముగిసింది.

15:28.554 --> 15:30.556
అది ఆమె బొమ్మల పుస్తకమా?

15:31.139 --> 15:33.099
నువ్వు డిటెక్టివ్ కి చెప్పింది?

15:33.100 --> 15:37.020
అవును. నాన్సీ దీన్ని రిహార్సల్ సమయంలో గీసినట్టు ఉంది.

15:37.771 --> 15:40.565
అయ్యుండొచ్చు. దీన్ని పోలీసులు చూశారా?

15:40.566 --> 15:42.150
అవును, వాళ్ళకు ఇది పనికొస్తుంది అనిపించలేదు.

15:43.360 --> 15:45.194
- మరి, పనికొస్తుందా?
- అవును, నాకు అలాగే అనిపిస్తుంది.

15:45.195 --> 15:48.907
కానీ నేను డ్రాయింగ్ గురించి చెప్పినప్పుడు
డిటెక్టివ్ గాంజ్ అస్సలు లెక్క చేయలేదు కదా.

15:49.491 --> 15:53.536
నేను గనుక బలమైన ఆధారం ఏదైనా కనిపెట్టగలిగితే…

15:53.537 --> 15:55.329
ఎలనోర్ మీద నుండి అనుమానాన్ని తొలగించడానికి.

15:55.330 --> 15:57.374
నాకు నాన్సీకి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది అంతే.

16:01.253 --> 16:05.464
సరే, నేను ఒహాయోలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో
ఒక కాల్ ఏర్పాటు చేశా.

16:05.465 --> 16:06.884
నేను దాన్ని క్యాన్సిల్ చేయాలంటే చెప్పు.

16:09.469 --> 16:10.679
లేదు. లేదు.

16:15.058 --> 16:16.143
ఇక దాన్ని పక్కన పెట్టెయ్.

16:16.727 --> 16:19.188
అంతా ఆ డిటెక్టివ్ కంట్రోల్ లో ఉన్నట్టు అనిపిస్తోంది.

16:20.105 --> 16:21.607
ఆమె పని ఆమెను చేసుకోనిద్దాం.

16:46.298 --> 16:49.092
నాన్సీ, నువ్వు నాకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు?

16:49.760 --> 16:52.679
మేరీకి ఎంత ట్రై చేసినా
ఏనాడూ దేవుడి మీద నమ్మకం ఏర్పడలేదు.

16:53.472 --> 16:56.849
కానీ కొన్ని అరుదైన, ఒళ్ళు గగుర్పొడిచే క్షణాల్లో

16:56.850 --> 17:01.230
ఒక శక్తి ఆమెను నడిపిస్తున్నట్టు ఆమెకు అనిపించేది.

17:02.064 --> 17:06.984
ఆ వెచ్చని, జూన్ నెల మధ్యాహ్నం రోజున,
మేరీకి ఆ శక్తి మళ్ళీ పని చేయడం తెలిసింది.

17:07.653 --> 17:09.029
లేదా అది నాన్సీ ఏమో.

17:09.530 --> 17:11.072
లేదా ఆడెరాల్ అయ్యుండొచ్చు.

17:11.073 --> 17:12.406
కానీ అది పని చేసింది.

17:18.288 --> 17:20.790
కాటులూస్ ఆరు

17:25.878 --> 17:27.548
నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు.

17:30.133 --> 17:31.467
ఆ తర్వాత మనిద్దరం లెక్క మర్చిపోతాం,

17:31.468 --> 17:32.844
అప్పుడు మన గాఢమైన ప్రేమ గురించి తెలిసిన

17:32.845 --> 17:34.263
ఏ ఒంటరి మగాడు ఈర్ష్య పడాల్సిన అవసరం ఉండదు.

18:02.291 --> 18:03.541
సెలెక్టెడ్ కాటులూస్
ఒక కొత్త అనువాదం

18:03.542 --> 18:05.544
డాక్టర్ హోవర్డ్ సింప్సన్, పీ.హెచ్.డి

18:15.929 --> 18:18.890
"నాకు వేయి ముద్దులు ఇవ్వు,
ఆపైన ఇంకొక వంద ఇవ్వు,

18:18.891 --> 18:21.893
ఆపైన మరొక వేయి, అలాగే మరొక వంద.

18:21.894 --> 18:24.604
మళ్ళీ ఇంకొక వేయి, అలాగే మరొక వంద."

18:24.605 --> 18:28.734
"నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు,

18:29.484 --> 18:31.153
ఆ తర్వాత మనిద్దరం లెక్క మర్చిపోతాం.

18:31.904 --> 18:37.242
అప్పుడు మన గాఢమైన ప్రేమ గురించి తెలిసిన
ఏ ఒంటరి మగాడు ఈర్ష్య పడాల్సిన అవసరం ఉండదు."

18:38.076 --> 18:42.581
పురాతన భాషల మీద నీకున్న పట్టు నిజంగా…
నిజంగా అద్భుతం.

18:43.332 --> 18:49.963
చిన్న కరెక్షన్. నాకు తెలిసి "కంటర్బో" అంటే "మర్చిపోవడం"
అనడం కంటే "తికమక పడటం" అంటే బాగుంటుంది.

19:00.182 --> 19:02.934
- జెన్నీ ఇంకా నా మధ్య ఇంకేం లేదు.
- ఆ విషయం ఆమెకు తెలుసా?

19:02.935 --> 19:04.102
ఆమె ఒక రోగి.

19:05.771 --> 19:09.023
అలాగే నాకు ఇలా అనడం ఇష్టం లేదు,
కానీ ఆమెకు కావాల్సింది భర్త కాదు.

19:09.024 --> 19:10.275
ఆమెకు ఒక డాక్టర్ కావాలి.

19:11.527 --> 19:13.946
ఆమె స్థితి కాస్త కుదురుగా ఉన్నప్పుడు నేను ఆమెతో విడిపోతా.

19:26.250 --> 19:27.876
- హాయ్, జెన్నీ.
- మేరీ, అతను లోపల ఉన్నాడా?

19:38.095 --> 19:40.430
నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు

19:55.362 --> 19:58.115
మంచిది. ఇళ్ల లిస్టు నాకు పంపండి,
నేను నా భార్యతో మాట్లాడతాను.

19:58.615 --> 20:00.200
థాంక్స్, రీటా. నువ్వు చాలా మంచిదానివి.

20:01.952 --> 20:03.953
ఎవరికో వారి సొంత ఆఫీస్ రాబోతోంది.

20:03.954 --> 20:05.581
నాకు నాన్సీ రఫ్ పుస్తకంలో ఇది దొరికింది.

20:08.584 --> 20:09.835
ఏంటది?

20:10.502 --> 20:13.046
ఇది నీ కాటులూస్ పుస్తకంలోని పేజీ.

20:13.714 --> 20:14.923
సరే, ఇప్పుడు ఏమంటావు?

20:15.591 --> 20:17.843
అదే లైన్ అండర్ లైన్ చేసి ఉంది.

20:19.636 --> 20:20.637
అది మంచి లైన్.

20:21.388 --> 20:25.975
హోవర్డ్, ఒక పురాతన రోమన్ కవికి చెందిన అంతుచిక్కని

20:25.976 --> 20:27.685
నీ అనువాదం నాన్సీకి ఎలా అర్థమైంది?

20:27.686 --> 20:29.145
ఏమో. ఇది అమెజాన్ లో ఉంది కదా.

20:29.146 --> 20:32.607
దాన్ని ఇంతవరకు ఎవరూ ప్రింట్ తీయలేదు.
ఎవరూ ఆ పుస్తకం ఎవరూ చదవలేదు.

20:32.608 --> 20:34.735
ఏమో. నేను ఆమెకు ఒక కాపీ ఇచ్చి ఉండొచ్చు.
నాకు గుర్తులేదు.

20:41.491 --> 20:43.827
నువ్వు కవిత్వం గురించి రాసిన పుస్తకాన్ని నాన్సీకి ఇచ్చావా?

20:45.495 --> 20:46.747
అవును.

20:47.331 --> 20:52.168
అవును, మేము రిహార్సల్ లో మాట్లాడుకునేటప్పుడు
నా పని గురించి ముచ్చటించాం,

20:52.169 --> 20:53.711
అప్పుడు నేను ఆమెకు ఒక కాపీ ఇస్తాను అన్నా.

20:53.712 --> 20:54.837
ఆమె చదివింది అంటే ఆశ్చర్యంగా ఉంది.

20:54.838 --> 20:55.922
మేరీ, నువ్వు బానే ఉన్నావా?

20:55.923 --> 20:57.673
ఏం జరుగుతుందో చెప్పు, హోవర్డ్.

20:57.674 --> 20:59.342
నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడగగలను.

20:59.343 --> 21:01.345
నువ్వు దీన్ని ఆమెకు ఎందుకు ఇచ్చావు?

21:05.432 --> 21:08.310
మేరీ, నీ కనుపాపలు పెద్దగా అయ్యాయి.

21:09.061 --> 21:11.812
మనం ఇదంతా ఇంతకు ముందే మాట్లాడుకున్నాం.
మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు అనుకున్నాం కదా.

21:11.813 --> 21:13.397
నువ్వు మళ్ళీ ఆ మాత్రలు వాడుతున్నావా?

21:13.398 --> 21:14.815
నువ్వు టాపిక్ మార్చుతున్నావు. నువ్వు…

21:14.816 --> 21:16.943
మేరీ, నువ్వు మళ్ళీ కంట్రోల్ కోల్పోకూడదు.

21:16.944 --> 21:19.320
ఇంతకు ముందు నువ్వు అదుపు తప్పినప్పుడు
ఏం జరిగిందో గుర్తుంది కదా?

21:19.321 --> 21:20.655
మనం ఎంత భయపడ్డామో గుర్తుందా?

21:20.656 --> 21:23.616
- లేదు, ఇది… లేదు, ఇది వేరు.
- నువ్వు మన పిల్లలని ప్రమాదంలోకి నెట్టావు.

21:23.617 --> 21:26.745
జూనికి ఏం కానందుకు దేవుడికే రుణపడి ఉన్నాం.
మళ్ళీసారి అలా కాకపోవచ్చు.

21:42.010 --> 21:45.012
మేరీ ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంది.

21:45.013 --> 21:49.016
ఆమె ఆ విషయాన్ని ప్రతీ కోణంలో ఆలోచించడానికి
ట్రై చేసింది కానీ ఏదీ కరెక్టు అనిపించలేదు.

21:49.017 --> 21:52.479
నాన్సీ ఇంకా హోవర్డ్. హోవర్డ్ ఇంకా నాన్సీ.

21:54.106 --> 21:57.149
మేరీకి హోవర్డ్ ఒక కొత్త మనిషిలా అనిపించాడు.

21:57.150 --> 22:00.737
కానీ అచ్చం అలాగే కూడా అనిపించాడు,
ఒక నకిలీ హోవర్డ్ లాగ.

22:03.365 --> 22:05.325
అతని దగ్గర మొదటి నుండీ ఇదే వాసన వచ్చేదా?

22:35.189 --> 22:37.524
నాన్సీ కూడా నకిలీదేనా?

22:38.901 --> 22:41.069
నిజమైన నాన్సీ హెనెస్సీ ఎవరు?

22:50.913 --> 22:52.623
ఆ చెత్త బ్యాలే.

22:54.374 --> 22:55.375
ఆ రాత్రే.

22:59.463 --> 23:01.381
ఆ రోజు రాత్రి ఆమెకు తెలిసి ఉండాల్సింది.

23:16.438 --> 23:18.524
మేరీ అప్పుడే హోవర్డ్ తో మాట్లాడి ఉండాల్సింది…

23:21.360 --> 23:23.946
…కానీ ఆతను సరైన మూడ్ లో లేడు.

23:28.575 --> 23:30.702
నాన్సీ అయితే బాధపడుతున్నట్టు కనిపించింది.

23:33.038 --> 23:34.705
మీరు నాన్సీ హెనెస్సీకి ఫోన్ చేశారు.

23:34.706 --> 23:36.999
ప్రస్తుతం నేను కాల్ ఎత్తలేను.

23:37.000 --> 23:40.003
అలాగే ఆందోళన కారణంగా
ఆసక్తి పెరుగుతుంది అనేది వాస్తవమే.

23:52.474 --> 23:55.727
తెరిచి ఉంది 24 గంటలు

24:11.618 --> 24:12.995
ఆమె కన్నీళ్లు నిజమైనవే.

24:14.162 --> 24:15.247
మేరీ?

24:16.707 --> 24:18.749
- మిగతాది అంతా అబద్ధమే.
- హేయ్.

24:18.750 --> 24:21.628
- మేరీ మొహం ముందే.
- హేయ్. ఏం కాదు. ఏం కాదు.

24:22.754 --> 24:23.880
ఏం కాదు.

24:23.881 --> 24:26.215
రాబర్ట్ తాగినప్పుడు మరొక వ్యక్తిలా మారిపోతాడు.

24:26.216 --> 24:29.427
ఇవాళ రాత్రి అతనికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు,
కానీ నేను అక్కడి నుండి వచ్చేయాల్సి వచ్చింది.

24:29.428 --> 24:30.971
నేను పలానా అనుకోలేదు, డ్రైవ్ చేసుకుని వచ్చేసా అంతే.

24:33.182 --> 24:36.894
నువ్వు నన్నో లేక ఎలనోర్ నో కాకుండా
హోవర్డ్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?

24:38.604 --> 24:40.314
మీరు రాబర్ట్ ని ద్వేషించుకోవడం నాకు ఇష్టం లేదు.

24:42.107 --> 24:43.441
అంటే, హోవర్డ్ అతనంటే ఎలాగూ నచ్చదు.

24:43.442 --> 24:47.154
అంతేకాక అతనికి అనుభవం ఉంది… కదా.

24:50.824 --> 24:54.118
ఊరుకో, నేనేం హెరాయిన్ కొట్టి పడిపోలేదు కదా.

24:54.119 --> 24:56.162
నాకు కాస్త ఓపిక తగ్గినట్టు అనిపించింది.

24:56.163 --> 24:59.624
- కాలేజ్ లో మనం అందరం అవి వాడాం.
- లేదు, నాకు తెలుసు. నాకు తెలుసు. నేను…

24:59.625 --> 25:02.293
హోవర్డ్ నాకేం పెద్దగా సాయం చేయలేకపోయాడు.

25:02.294 --> 25:05.713
అంటే… తెలిసిందే కదా, దిక్కుతోచని పరిస్థితి.

25:05.714 --> 25:07.715
అయితే మరి నువ్వు ఇంటికి వెళ్తావా?

25:07.716 --> 25:09.384
అంటే, ఎప్పటికైనానా? నా ఆశ కూడా అదే.

25:10.469 --> 25:12.261
నువ్వు రాత్రికి మా ఇంటికి రావొచ్చు కదా?

25:12.262 --> 25:13.387
- లేదు.
- సరే.

25:13.388 --> 25:15.389
లేదు, లేదు, లేదు. నేను…

25:15.390 --> 25:17.725
నేను బహుశా… ఒహాయ్ కి వెళ్తానులే.

25:17.726 --> 25:18.977
సరే.

25:22.689 --> 25:25.691
మేర్, ఇవాళ అంతా చాలా చక్కగా మొదలైంది.
కానీ అంతలోనే…

25:25.692 --> 25:28.319
నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్కత్తే నార్మ్స్ వారి హాట్ కేక్ మెన్యు మొత్తం

25:28.320 --> 25:32.073
తినడంతో ఈ రోజు ముగిసింది.

25:32.074 --> 25:34.618
ఇవాళ రాత్రి నీకు అలాగే గుర్తుంటుంది కదా?

25:35.327 --> 25:38.079
మంచిది. సరే, మనం చేయాల్సిన పని ఇంకొంచెం ఉంది, అది…

25:38.080 --> 25:41.207
సర్, హాట్ కేక్స్ మెన్యు ఇస్తారా ప్లీజ్?

25:41.208 --> 25:44.836
పాపం మేరీ,
మన మృదు స్వభావి, మంచి మనసు ఉన్న పిల్ల

25:44.837 --> 25:47.005
ఆ అబద్ధాలు అన్నీ నిజంగానే నమ్మేసింది.

25:49.049 --> 25:51.175
హేయ్, బుజ్జి. ఏం చేస్తున్నావు?

25:51.176 --> 25:52.552
నాకు నిద్ర పట్టలేదు.

25:52.553 --> 25:55.514
అయ్యో. సాధారణంగా నీకు నిద్ర రాకుండా ఉండదు కదా.

25:57.224 --> 25:58.307
అవును, అదేం లేదులే.

25:58.308 --> 25:59.935
సరే. ఏం లేదు అంటే?

26:02.896 --> 26:04.356
సరే, ముందు కోపపడను అని మాట ఇవ్వు.

26:05.899 --> 26:07.025
ఒట్టేసి చెప్తున్నాను.

26:10.487 --> 26:13.615
ఆంటీ ఎలనోర్ గురించి.
ఇవాళ డిటెక్టివ్ అన్న మాటలు నేను విన్నాను.

26:14.908 --> 26:15.992
నువ్వు మా మాటలు విన్నావా?

26:15.993 --> 26:19.329
పోలీసులు నాన్సీ ఆంటీని ఆమె చంపింది
అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ…

26:21.957 --> 26:23.083
ఆమె ఏం చేయలేదని నాకు తెలుసు.

26:27.588 --> 26:29.047
అది నీకెలా తెలుసు, మార్కస్?

26:29.673 --> 26:31.383
ఎందుకంటే నాన్సీ చనిపోయిన రాత్రి…

26:33.468 --> 26:34.927
ఆమె నాతో ఉంది.

26:34.928 --> 26:36.220
ఎవరు?

26:36.221 --> 26:39.391
ఎలనోర్. ఆమె నన్ను వాన్ నైస్ నుండి తీసుకురావడానికి వచ్చింది.

26:40.100 --> 26:41.518
వాన్ నైస్ లో నీకేం పని?

26:42.978 --> 26:45.479
అవును, వెళ్లడం తప్పు అని నాకు తెలుసు,
కానీ అక్కడ ఒకడికి నేను డబ్బు ఇవ్వాల్సి ఉంది, వాడు…

26:45.480 --> 26:46.856
మనం ఏదొక పరిష్కారం కనిపెట్టొచ్చు అన్నాడు.

26:46.857 --> 26:48.566
అబ్బా, మార్కస్. నువ్వు మళ్ళీ జూదం ఆడుతున్నావా?

26:48.567 --> 26:50.735
మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన అవసరం
ఉండకూడదు అనే నేను ఆ పని చేశా.

26:50.736 --> 26:51.819
ఏంటి?

26:51.820 --> 26:53.571
నువ్వు, నాన్న ఎప్పుడూ
డబ్బుల గురించి కంగారు పడుతూనే ఉంటారు.

26:53.572 --> 26:56.575
- నువ్వు ప్రొబేషన్ లో ఉన్నావు. నీకు అర్థం…
- అమ్మా. సరే, అమ్మా. నువ్వు మాట ఇచ్చావు.

27:00.454 --> 27:02.455
నేను డబ్బులు ఇచ్చే వరకు వాళ్ళు నన్ను పోనివ్వలేదు.

27:02.456 --> 27:07.043
ఓహ్, దేవుడా. అందుకని నువ్వు ఎలనోర్ కి కాల్ చేశావా?

27:07.044 --> 27:09.045
నాకు తెలిసిన అంత డబ్బు ఉన్న మనిషి ఆమె ఒక్కత్తే.

27:09.046 --> 27:10.630
నీ బుకీకి తను డబ్బులు ఇచ్చిందా?

27:10.631 --> 27:15.177
పోలీసులు నాన్సీ ఆంటీని తనే చంపింది అనుకుంటున్నారు,
కానీ ఆమె ఆలబైని నేనే.

27:15.969 --> 27:17.220
ఆమె నిన్ను కాపాడుతోంది.

27:17.221 --> 27:20.014
ఆ రాత్రి ఆమె వచ్చి ఉండకపోతే ఏమై ఉండేదో
నాకు అస్సలు తెలీదు.

27:20.015 --> 27:22.016
కానీ ఆమె సమస్యల్లో పడటం నాకు ఇష్టం లేదు, అలాగే…

27:22.017 --> 27:23.017
బుజ్జి.

27:23.018 --> 27:25.311
- నాకు… నాకు ఏం చేయాలో తెలీడం లేదు.
- బుజ్జి, ఏం కాదు.

27:25.312 --> 27:28.856
- అమ్మా, నాకు ఏం చేయాలో తెలీడం లేదు.
- ఇలా రా. ఏం కాదు.

27:28.857 --> 27:31.609
నా వల్ల నువ్వు అలాగే ఎల్లి ఆంటీ
గొడవపడటం నాకు ఇష్టం లేదు.

27:31.610 --> 27:34.154
మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ కాకుండా ఉండము.

27:35.531 --> 27:37.949
ఇప్పటికే మేమిద్దరం చాలా…

27:37.950 --> 27:39.659
- అవును.
- …ఎదుర్కొన్నాం. సరేనా?

27:39.660 --> 27:42.162
నువ్వు మంచి వాడివి, ఆ విషయం తెలుసా?

27:43.413 --> 27:45.373
ఈసారి దయచేసి నాకు కాల్ చెయ్, సరేనా?

27:45.374 --> 27:47.124
నాకు తెలుసు. నేను ఇంటికి వచ్చాక
నీకు చెబుదాం అనుకున్నా.

27:47.125 --> 27:50.170
అది… నువ్వు పడుకుని ఉన్నావు,
అలాగే నాన్న ఇంట్లో లేడు.

27:51.213 --> 27:52.214
నువ్వు ఏం…

27:53.090 --> 27:54.465
నాన్న ఎక్కడికి వెళ్ళాడు?

27:54.466 --> 27:56.885
ఏమో. ఆయన కారు ఇంటి ముందు లేదు.

28:06.186 --> 28:08.438
- అమ్మా?
- క్షమించు, అదేం పర్లేదు. అది…

28:09.898 --> 28:11.775
నువ్వు వెళ్లి కాసేపు పడుకో, సరేనా?

28:12.359 --> 28:14.736
మనం రేపు మాట్లాడుకుందాం. ఏం పర్లేదు.

28:27.791 --> 28:29.459
హోవర్డ్ అన్ని విషయాల గురించి అబద్ధం చెబుతున్నాడు.

28:38.969 --> 28:41.013
పోలీసులతో అతను ఇంట్లో ఉన్నాను అన్నాడు.

28:44.558 --> 28:45.893
మరి అతను ఎప్పుడు వెళ్లినట్టు?

28:52.608 --> 28:53.984
అతను ఆ కోట్ వేసుకున్నాడు.

30:31.498 --> 30:33.541
నువ్వు నేను నీకు ఇచ్చిన క్లాడా రింగ్ వేసుకున్నావా?

30:33.542 --> 30:35.794
ఇది నాకు నా గురించి గుర్తు చేస్తుంది అన్నావు కదా?

30:57.441 --> 30:59.401
నిన్ను చూస్తుంటే కోపంగా ఉన్నట్టు ఉన్నావు. కోపంగా ఉన్నావా?

30:59.902 --> 31:02.154
అవును, నేను కోపంగానే ఉన్నా… నీ మీద, నాన్సీ.

31:04.656 --> 31:08.202
మన స్నేహం అంటే నీకు ఏమాత్రం లెక్క లేదా?

31:08.869 --> 31:10.494
నువ్వు నాకు ఇలా ఎలా చేయగలిగావు?

31:10.495 --> 31:11.997
అంటే, నువ్వు కూడా అదే చేసావు కదా?

31:12.664 --> 31:14.124
హోవర్డ్ భార్యకి.

31:17.878 --> 31:21.756
ఏంటి? లేదు, అది పూర్తిగా వేరు.

31:21.757 --> 31:22.966
ఎలా?

32:34.830 --> 32:35.831
ఎవరది?

32:36.832 --> 32:37.875
జెన్నీ?

32:38.709 --> 32:39.834
నాకు నువ్వు తెలుసా?

32:39.835 --> 32:40.836
నేను మేరీని.

32:41.879 --> 32:43.255
మేరీ మెక్కొర్మాక్.

32:46.508 --> 32:48.177
ఓహ్, దేవుడా. మేరీ.

32:50.429 --> 32:54.558
- ఇలా అకస్మాత్తుగా వచ్చినందుకు క్షమించు.
- నన్నెలా కనిపెట్టావు?

32:55.475 --> 32:59.104
చెప్పుకోవడం సిగ్గు చేటే, కానీ నేను
నిన్ను ఫేస్ బుక్ లో ఫాలో అవుతుంటా.

32:59.938 --> 33:02.024
నిన్ను హోవర్డ్ పంపాడా?
వాడికి నేను ఎక్కడ ఉంటానో తెలుసా?

33:02.691 --> 33:03.942
నేను ఇక్కడికి వచ్చినట్టు అతనికి తెలీదు.

33:23.086 --> 33:24.338
ఏం జరిగింది, మేరీ?

33:26.507 --> 33:28.090
నేను ఇది నిజంగానే చేస్తున్నా.

33:28.091 --> 33:29.968
నువ్వు ఇంకా హోవర్డ్…

33:30.969 --> 33:32.304
లేదు, నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా.

33:34.723 --> 33:36.558
నువ్వు ఇంకా హోవర్డ్ డేటింగ్ మొదలెట్టిన ప్రారంభంలో…

33:39.311 --> 33:40.979
అతను నీకు కవితలు చదివి వినిపించేవాడా?

33:41.730 --> 33:42.940
నీ ప్రశ్న అదా?

33:47.194 --> 33:49.905
నేను ఒకటి అర్థం చేసుకోవడానికి నీ సాయం కావాలి.

33:54.076 --> 33:56.703
లేదు, అది… క్షమించు, అది వినడానికి నమ్మశక్యంగా లేదు.

33:57.496 --> 33:58.955
నేను పిచ్చిగా వాగుతున్నాను.

33:58.956 --> 34:00.582
నువ్వు నాకు ఏం రుణపడి లేవు.

34:01.291 --> 34:05.254
ఎందుకంటే నా కోసం నీ భర్త నిన్ను వదిలేసాడు,
కాబట్టి నీకు నేనంటే ద్వేషం ఉండి ఉండొచ్చు.

34:07.005 --> 34:08.756
వాడు నీకు అలా అని చెప్పాడా?

34:08.757 --> 34:10.050
అతను వదిలేసినట్టు?

34:11.134 --> 34:12.386
అవును, అవును.

34:14.721 --> 34:16.805
నేను గర్భవతిని అయినప్పుడు, అతను నీకు
విడాకులు ఇచ్చాడు, కాబట్టి…

34:16.806 --> 34:17.808
వావ్.

34:19.476 --> 34:20.978
నీకు నిజం తెలుసుకోవాలని ఉందా?

34:28.777 --> 34:31.655
అతని ఆడ విద్యార్థులలో నువ్వు మొదటిదానివి కాదు,

34:32.364 --> 34:33.532
కానీ నువ్వు వేరు.

34:34.074 --> 34:35.324
నువ్వు నా దగ్గరకు వచ్చావు.

34:35.826 --> 34:39.870
నువ్వు తెలివైన యువకురాలివి,
అద్భుతమైన కెరియర్ ఏర్పరచుకుని ఉండేదానివి.

34:39.871 --> 34:41.998
అది చూసి బుర్రలేని నేను నిన్ను గైడ్ చేయగలను అనుకున్నా.

34:44.126 --> 34:46.961
నేను నా జీవితంలోని నిన్ను రానిచ్చాను, కానీ

34:46.962 --> 34:49.839
నువ్వు అతనికి దగ్గర కావడానికి నన్ను వాడుకున్నావు అంతే.

34:49.840 --> 34:51.717
కాదు, జెన్నీ. అది నిజం కాదు.

34:52.676 --> 34:54.511
నేను నిన్ను చాలా గౌరవించా,

34:55.929 --> 34:58.849
అలాగే నీ పనిని చూసే నేను ఆ ఫీల్డ్ లోకి చేరాను.

34:59.474 --> 35:01.268
అలాగే నా భర్త మంచం మీదకి కూడా.

35:05.772 --> 35:08.650
మీ గురించి తెలిసినప్పుడు,
నేను విడిపోతున్నా అని వాడికి చెప్పా.

35:10.444 --> 35:12.112
తనని వదిలేయొద్దు అని వాడు బ్రతిమిలాడాడు.

35:14.948 --> 35:18.492
నిన్ను మరొక అర్థంలేని ఉంపుడుగత్తెవి అన్నాడు.

35:18.493 --> 35:24.041
అలాగే నేను తనతో ఉంటాను అంటే ఆ పుట్టిన
బిడ్డ తనది కాదు అంటాను అన్నాడు.

35:26.585 --> 35:29.588
లేదు, అతను నువ్వు స్థిరమైన మనిషివి కాదు అన్నాడు.

35:30.088 --> 35:31.715
నన్ను చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందా?

35:33.634 --> 35:38.096
నువ్వు చూసేది కాకుండా వాడు చెప్పేది
నమ్మాలని నువ్వే అనుకున్నావు.

35:38.931 --> 35:40.474
వాడు నీకు ఇంకేం చెప్పాడు?

35:41.391 --> 35:45.187
నువ్వు చేతులు కోసుకునేదానివి అని,

35:45.938 --> 35:47.564
అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసావని.

35:56.448 --> 35:58.200
వాడి వల్ల నాకు ఇదొక్కటి మిగిలింది.

35:59.660 --> 36:01.328
రెండు అంతస్తుల మెట్ల నుండి జారడం వల్ల.

36:01.912 --> 36:04.039
నేను వాడిని వదిలేస్తున్నాను
అని చెప్పిన రోజు రాత్రి ఇలా అయింది.

36:04.540 --> 36:05.791
మేము వాదన పెట్టుకున్నాం.

36:07.292 --> 36:10.587
హోవర్డ్ ని ఎవరైనా వదిలితే తట్టుకోలేడు.

36:11.463 --> 36:13.549
నేను చాలా ఏళ్లుగా నీ గురించి ఆలోచించాను.

36:14.550 --> 36:16.510
నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందా అని.

36:19.346 --> 36:20.973
వాడి గురించి నేను నిన్ను వారించి ఉండాల్సింది.

36:23.267 --> 36:24.726
నేను నిన్ను నమ్మేదాన్ని కాదు.

36:26.186 --> 36:27.688
హోవర్డ్ నీకు ఏం చేసాడు?

36:57.301 --> 36:58.760
డేవిడ్ ఎవరో నాకు తెలుసు.

37:02.097 --> 37:06.268
నేను మొదటి నుండీ ఈ కవిత మా కథలో ఒక భాగం అనుకున్నా…

37:07.186 --> 37:11.898
కానీ ఇప్పుడు అసలు ఇది ఎంత వరకు
నా గురించో తెలీడం లేదు.

37:11.899 --> 37:14.692
మేరీ, వాడొక కిరాతకుడు.

37:14.693 --> 37:17.112
వాడు దీన్ని నాన్సీకి చదవడాన్నే ఊహించుకుంటున్నా.

37:18.488 --> 37:24.243
అంటే, ఆమె దీన్ని స్పెషల్ గా చూసిందని చెప్పొచ్చు.
ఆమె దీన్ని చింపింది. ప్రత్యేకంగా ఉంచుకుంది.

37:24.244 --> 37:29.207
బహుశా ఏదొక రోజు నువ్వు కనిపెడతావు అని
ఆమె మనసులో ఎక్కడో అనుకుంది ఏమో.

37:29.208 --> 37:31.042
నేను పెద్ద సన్నాసిని అనుకుని ఉంటుంది.

37:31.043 --> 37:32.627
- లేదు.
- అదే నిజం.

37:32.628 --> 37:35.631
- దేవుడా. నీ దగ్గర ఆడ్విల్ లేదా ఏమైనా ఉందా?
- ఉంది.

37:36.673 --> 37:42.595
నువ్వు వెర్రిదానివి కాదు. నీకు ఇది
తెలిసి ఉండే అవకాశమే లేదు.

37:42.596 --> 37:45.223
ఊరుకో. అతను జెన్నీకి కూడా ఇలాగే చేసాడు.

37:45.224 --> 37:46.849
మరి నాకు కూడా ఎందుకు చేయడు?

37:46.850 --> 37:48.727
నిన్ను నువ్వు నిందించుకోవడం నాకు ఇష్టం లేదు.

37:52.648 --> 37:54.399
- ఇంకా చాలా మంది ఉన్నారు.
- అంటే ఏంటి నీ ఉద్దేశం?

37:57.152 --> 37:58.987
ఇతర మహిళలు కూడా ఉన్నారు.

37:59.988 --> 38:01.614
నువ్వు ఏనాడూ ఈ విషయం చెప్పనేలేదు.

38:01.615 --> 38:02.990
చెప్పినా ఏం లాభం ఉంటుంది?

38:02.991 --> 38:04.910
అతన్ని వదిలే ఉద్దేశమే నాకు లేదు.

38:05.410 --> 38:07.329
పిల్లలకు నేను అలా ఎప్పటికీ చేయలేను.

38:09.081 --> 38:10.623
అలాగే అతను ఎంత జరిగినా తిరిగి వచ్చేవాడు, తెలుసా?

38:10.624 --> 38:14.586
నాకు… అతనికి నేను, నాకు అతను కావాలి అనుకునేవాళ్లం,
నేను అదొక్కటే ఆలోచించేదాన్ని.

38:15.587 --> 38:18.047
అయిదు లేదా ఆరు ఏళ్ల క్రితం ఒకసారి

38:18.048 --> 38:20.925
నేను పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు
ఒక మహిళ ఇంటికి వచ్చింది.

38:20.926 --> 38:25.596
ఆమె 20ల ప్రారంభంలో ఉన్న యువతి. సన్నగా ఉంది.

38:25.597 --> 38:28.433
కానీ హోవర్డ్ ఆమె తన గ్రేడ్ గురించి బాధపడుతున్న
ఒక యువ గ్రాడ్యుయేట్ విద్యార్థి అన్నాడు అంతే.

38:29.309 --> 38:31.353
ఆమెను తన ఆఫీస్ కి తీసుకెళ్లి తలుపు మూసాడు.

38:33.522 --> 38:34.731
నువ్వు ఏం చేసావు?

38:36.358 --> 38:37.985
స్నానం చేయించడం పూర్తి చేశా.

38:41.905 --> 38:43.448
తర్వాత ఆ విషయం ప్రస్తావించలేదు.

38:44.157 --> 38:47.201
నువ్వు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అలా చేసావు.

38:47.202 --> 38:52.164
కానీ అప్పుడు నేను ఏమైనా అని ఉంటే, మరి…
నాన్సీ ఇంకా ప్రాణాలతో ఉండి ఉండేది.

38:52.165 --> 38:53.958
సరే, కానీ నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు.

38:53.959 --> 38:58.296
దేవుడా. ఈ రింగ్, అతను ఆమె శరీరం నుండి తీసాడు.

38:58.297 --> 38:59.338
దేవుడా

38:59.339 --> 39:03.426
ఎల్లి, హోవర్డ్ దీన్ని ఆమె శవం నుండి తీసాడు.

39:03.427 --> 39:06.679
అసలు ఇదంతా నిజమేనా?
నాకు నా జీవితంలో ఏదీ నిజం అనిపించడం లేదు.

39:06.680 --> 39:07.723
లేదు. నేను చెప్పేది విను.

39:08.891 --> 39:11.643
మనిద్దరం నిజమైన వాళ్ళమే.

39:12.269 --> 39:13.270
ఇదంతా నిజమే.

39:15.689 --> 39:16.982
నీకు నా అవసరం వచ్చింది,

39:18.692 --> 39:21.777
కానీ నేను నిన్ను నా ఇంట్లో నుండి పొమ్మన్నాను,
నన్ను క్షమించు.

39:21.778 --> 39:25.114
నేను రాబర్ట్ గురించి నీకు అబద్ధం చెప్పి ఉండకూడదు.

39:25.115 --> 39:27.284
లేదు, మార్కస్ నువ్వు చేసింది చెప్పాడు.

39:28.202 --> 39:33.247
నా కొడుకుని కాపాడటం కోసం నీ జీవితాన్ని
రిస్క్ లో పెడుతున్నావా? ఎందుకు?

39:33.248 --> 39:34.457
జోక్ చేస్తున్నావా?

39:34.458 --> 39:39.003
వాడు నా పిల్లాడు కూడా.
వాడు పుట్టినప్పుడు ఆ రూమ్ లో నేను కూడా ఉన్నా.

39:39.004 --> 39:42.132
వాడిని సురక్షితంగా ఉంచడానికి నేను చేయని పని ఏం లేదు.

39:42.841 --> 39:45.385
నాకు తెలుసు. నువ్వు అలాంటి దానివని నాకు తెలుసు.

39:48.847 --> 39:50.015
- ఎల్లి.
- ఏంటి?

39:50.516 --> 39:52.433
ఇది అతనే. ఓహ్, దేవుడా.
నేను నా ఫోన్ ని ఇంట్లో వదిలేసా.

39:52.434 --> 39:53.435
మొబైల్
హోవర్డ్

39:55.395 --> 39:56.396
నేను ఏం చేయాలి?

39:56.980 --> 39:58.564
- ఎత్తు.
- సరే.

39:58.565 --> 40:01.193
- అలాగే అతనికి ఏం తెలుసో నువ్వు కనిపెట్టాలి.
- సరే.

40:03.654 --> 40:04.737
హలో?

40:04.738 --> 40:06.698
ఎలనోర్, తను ఎక్కడ ఉంది? మేరీ ఎక్కడ ఉంది?

40:07.199 --> 40:09.617
ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో
నాకు తెలీడం లేదు, హోవర్డ్.

40:09.618 --> 40:11.118
ఇది అర్థరాత్రి.

40:11.119 --> 40:14.831
నేను ఆమెతో వెంటనే మాట్లాడాలి.
ఆర్టెమిస్ గురించి. పిల్ల హాస్పిటల్ లో ఉంది.

40:20.462 --> 40:22.631
సరే, వాళ్ళు ఎనిమిదవ రూమ్ అన్నారు.

40:27.386 --> 40:29.637
ఓహ్, దేవుడా. ఆర్టీ, బుజ్జి. అమ్మ వచ్చింది.

40:29.638 --> 40:31.265
తనకి ఏమైంది? ఏమైంది?

40:31.849 --> 40:33.641
మేడం, మీరు కొంచెం పక్కకి వెళ్ళాలి.

40:33.642 --> 40:35.977
- మేరీ, వాళ్ళని వాళ్ళ పని చేయనివ్వు.
- తనకి నేను కావాలి.

40:35.978 --> 40:38.187
ప్లీజ్, ఎవరైనా ఏం జరుగుతుందో చెప్పండి.

40:38.188 --> 40:39.981
ఇక్కడికి రండి. మేము బిడ్డని స్టెబిలైజ్
చేయడానికి ట్రై చేస్తున్నాం.

40:39.982 --> 40:41.148
- సరే.
- ఏంటి?

40:41.149 --> 40:42.692
మీ భర్త తను కొన్ని మాత్రలు మింగేసింది అన్నారు.

40:42.693 --> 40:44.527
- ఏం మాత్రలు?
- అవి ఇందులో ఉన్నాయి.

40:44.528 --> 40:45.904
ఇది ఏంటో మీకు తెలుసా?

40:46.697 --> 40:47.698
అవి ఏం మాత్రలు?

40:48.282 --> 40:50.700
మేడం, మేము మీ అమ్మాయికి సాయం చేయాలి
అంటే మీరు ఇవి ఏం మాత్రలో చెప్పాలి.

40:50.701 --> 40:55.496
అది… ఆడెరాల్.
పది మిల్లీగ్రాములు అనుకుంట. అది ఆడెరాల్.

40:55.497 --> 40:56.915
ఆడెరాల్, పది మిల్లీగ్రాములు.

40:57.749 --> 40:59.417
- మేరీ…
- నాడీ వేగం పెరుగుతోంది.

40:59.418 --> 41:02.044
145. 160.

41:02.045 --> 41:04.297
ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది?

41:04.298 --> 41:05.340
ఏం జరుగుతోంది? దానికి ఏం కాదు కదా?

41:06.091 --> 41:07.550
ఆర్టీ, అమ్మ ఇక్కడే ఉంది, సరేనా?

41:07.551 --> 41:08.968
మేడం, మీరు వెనక్కి వెళ్ళాలి.

41:08.969 --> 41:11.095
ఆర్టీ, అమ్మ ఇక్కడే ఉంది.
నన్ను ఇక్కడే ఉన్నాను, బుజ్జి.

41:11.096 --> 41:12.221
నీ అమ్మ ఇక్కడే ఉంది.

41:12.222 --> 41:13.764
నీకు ఏం కాదు, బుజ్జి.

41:13.765 --> 41:16.267
అమ్మ ఇక్కడే ఉంది, బుజ్జి. అమ్మ ఇక్కడే ఉంది.

41:16.268 --> 41:18.019
నీకు ఏం కాదు.

41:18.020 --> 41:20.438
నా బిడ్డకి ఏమవుతుంది?

41:20.439 --> 41:23.567
దయచేసి తనకి సాయం చేయండి. ప్లీజ్.

42:16.286 --> 42:18.288
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
