WEBVTT

00:10.344 --> 00:12.179
అమ్మా, ఏం జరుగుతోంది?

00:12.679 --> 00:16.183
నేను వెర్రిదాన్ని అనుకుంటున్నావా?
నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా?

00:20.062 --> 00:21.729
నా చిన్నప్పుడు

00:21.730 --> 00:24.525
నేను నాకు ఎగరగలిగే శక్తి ఉన్నట్టు పగటికలలు కనేదాన్ని.

00:26.151 --> 00:29.403
గాలి నీరు లాంటిది అని,
నేను అందులో ఈదగలను అని ఊహించుకొనేదాన్ని.

00:29.404 --> 00:33.992
పైకి, పైకి, పైకి, అలా కొండల మీద నుండి
ఒక కొత్త జీవితంలోకి ఎగురుతున్నట్టు.

00:36.620 --> 00:40.374
నేను నమ్మలేని విషయం ఏంటంటే,
ఒక విధంగా ఆ కల నిజమైంది.

00:41.416 --> 00:46.088
నా భర్తకు ఉన్న అధికారం ఇంకా డబ్బు
నన్ను ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకొచ్చాయి.

00:46.839 --> 00:50.050
అలాగే నేను ప్రతీ ఏడాది నూతన సంవత్సర
పార్టీ ఏర్పాటు చేసేదాన్ని.

00:52.427 --> 00:55.639
హింసతో నిండిన నా గతాన్ని గెలిచినందుకు
అదొక ప్రతీక లాంటిది.

00:57.641 --> 01:01.061
అందమైన పుష్పగుచ్చాలు, వింటేజ్
మందుతో దాన్ని వ్యక్తపరిచేదాన్ని.

01:03.814 --> 01:08.861
పద్దెనిమిది సంవత్సరాలగా నేను ఈ పార్టీలను
మరచిపోజాలని సందర్భాలుగా రూపొందించడం నేర్చుకున్నా.

01:09.403 --> 01:11.947
నేను ఎవరినో నీకు అస్సలు తెలీదు.

01:13.490 --> 01:16.076
ఇదే నా ఆఖరి పార్టీ అవుతుంది అని నాకు తెలియలేదు.

01:19.496 --> 01:21.915
రెండవ చాప్టర్
నాన్సీ

01:22.583 --> 01:25.835
కానీ నేను ఇంత దూరం ఎలా వచ్చానో
చెప్పాలంటే గతంలోకి వెళ్లాల్సిందే.

01:25.836 --> 01:28.505
పదిహేడు సంవత్సరాల క్రితం

01:33.385 --> 01:34.636
హేయ్.

01:36.138 --> 01:40.016
నేను నూతన సంవత్సర పార్టీ ఏర్పాటు చేయాలి.
నా పనికి అడ్డు రాకు.

01:40.017 --> 01:41.768
నువ్వే నా పనికి అడ్డు వస్తున్నావు.

01:42.644 --> 01:44.021
నువ్వు భలే సెక్సీగా ఉన్నావు.

01:46.982 --> 01:48.941
- నాకు పిచ్చెక్కించాలని ట్రై చేస్తున్నావా?
- లేదు.

01:48.942 --> 01:50.944
నేను ఈ సెంటర్ పీస్ లు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నా.

01:52.279 --> 01:53.363
హేయ్.

01:55.073 --> 01:56.365
ఏమైంది?

01:56.366 --> 02:00.453
అంటే, ఇది… ఈ రోజు…
నాకు చాలా ముఖ్యమైన రోజు.

02:00.454 --> 02:01.829
ఓహ్, నాన్స్.

02:01.830 --> 02:04.750
నిజమే, పెళ్లి అయిన జంటగా ఇది మన మొదటి పార్టీ.

02:05.375 --> 02:08.461
హెనెస్సీల హైక్లాస్ సీన్ లోకి
నేను అడుగుపెట్టబోయే సందర్భం.

02:09.588 --> 02:11.507
- హేయ్.
- ఇది ఆ స్థాయికి తగ్గట్టు లేకపోతే?

02:12.591 --> 02:16.011
నువ్వు నా భార్యవి. నువ్వు పర్ఫెక్ట్.

02:17.638 --> 02:20.641
అలాగే నీకు ఒత్తిడిగా అనిపించింది అంటే,
మనం పార్టీని ఆపేద్దాం.

02:21.183 --> 02:22.850
- ఓహ్, లేదు.
- ఒక్క మాట చెప్పు చాలు.

02:22.851 --> 02:24.102
- లేదు.
- సరే.

02:24.770 --> 02:26.438
నాకు నువ్వు తప్ప వేరే ఏది లెక్క లేదు.

02:32.694 --> 02:33.695
సరే.

02:39.743 --> 02:41.662
త్వరలోనే జనం రావడం మొదలవుతుంది.

02:42.704 --> 02:45.040
అయితే వచ్చినప్పుడు చూడటానికి ఒక షో చేద్దాం.

02:46.291 --> 02:49.503
ఆ రోజుల్లో రాబర్ట్ నన్ను చాలా గాఢంగా ప్రేమించాడు.

02:50.379 --> 02:52.798
ప్రారంభంలో మనం అందరం ఎలా బలంగా
ఇష్టాన్ని తెలుపుతామో అలా.

02:53.715 --> 02:57.636
మన మధ్య అంత బలమైన ప్రేమ రగులుతున్నప్పుడు,
ఆ మంటలో ప్రతీ లోపం కాలిపోయి,

02:58.345 --> 03:00.180
ప్రతీ గాయం నయమైనట్టు ఉంటుంది.

03:01.056 --> 03:03.350
అత్యంత పాతవైన, బలమైన గాయాలు కూడా.

03:07.271 --> 03:10.107
పెళ్ళైన మొదట్లో అతని దగ్గర ఉంటే
నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు అనిపించేది.

03:12.734 --> 03:15.779
పద్దెనిమిది సంవత్సరాల తర్వాత,
ఇప్పుడు ఆ కథ కొంచెం కొత్తగా అనిపిస్తోంది.

03:17.322 --> 03:19.323
బుజ్జి, నీకు ఏం అనిపిస్తోంది?

03:19.324 --> 03:22.952
ఈ ఏడాది నేను కొన్ని మార్పులు చేశా.
కొత్తదనం తీసుకురావాలని.

03:22.953 --> 03:26.582
నాకైతే ఈ నెల క్రెడిట్ కార్డు బిల్లు
కొంచెం గట్టిగా పేలేలా ఉంది అనిపిస్తోంది.

03:27.749 --> 03:29.835
బిల్లు అప్పుడే రాదు కదా?

03:30.919 --> 03:33.963
ఎంతైనా పార్టీ అంటే అంతే కదా?
హేయ్, కిట్ వస్తోంది.

03:33.964 --> 03:36.799
అతిథులు రావడానికి ముందు
కొన్ని వ్యాపార విషయాలు మాట్లాడాలి అనుకున్నా.

03:36.800 --> 03:38.926
ఇప్పుడా? ఇవాళ నూతన సంవత్సర దినం.

03:38.927 --> 03:42.054
సెలవులకు ముందే కదా మీరు ఆ పెద్ద మీటింగ్ కి
వెళ్లి వచ్చారు. ఏంటి…

03:42.055 --> 03:44.056
ఇంకా మాట్లాడాల్సింది ఏముంది?

03:44.057 --> 03:45.309
నేను నా ఆఫీస్ లో ఉంటా.

04:32.105 --> 04:34.024
అరమింట హల్ వ్రాసిన పుస్తకం
ఆధారంగా రూపొందించబడింది

04:48.789 --> 04:51.708
ఏమండీ, మీరు తప్పు ప్రదేశంలో
పెడుతున్నారు అనుకుంటున్నా.

04:52.251 --> 04:55.796
మీరు ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే
అది ఈవెంట్ కోర్డినేటర్ కి చెప్పాలి,

04:57.130 --> 04:58.464
కానీ త్వరపడండి.

04:58.465 --> 05:02.093
ఎందుకంటే ఈ పార్టీ ఆ హెనెస్సీ సన్నాసులకు
ఏడాదిలో అత్యంత ముఖ్యమైన పార్టీ.

05:02.094 --> 05:04.263
నా పేరు నాన్సీ హెనెస్సీ, నువ్వు?

05:05.138 --> 05:06.348
ఉద్యోగం ఊడిన వాడిని?

05:08.225 --> 05:09.434
డేవిడ్.

05:10.018 --> 05:14.605
డేవిడ్, నిజానికి ఈ బార్ ని అక్కడ ఉన్న
పెర్గోల క్రింద సెట్ చేయాలి.

05:14.606 --> 05:17.483
అప్పుడైతే అక్కడి విస్టీరియా మొక్క నీడ ఉండి
ఎండ తగలకుండా ఉంటుంది,

05:17.484 --> 05:19.610
అలాగే రోజ్ తోట కూడా కనిపిస్తుంది.

05:19.611 --> 05:21.864
అది నువ్వు గీసిన బొమ్మా? బానే ఉంది.

05:23.490 --> 05:26.325
నువ్వు నన్ను మెప్పించాల్సిన పనిలేదు.
నేను నీ ఉద్యోగం పీకను.

05:26.326 --> 05:28.829
ఇప్పటికిప్పుడు ఇంకొకరిని పనికి పెట్టడం కష్టం.

05:30.372 --> 05:31.706
శ్రీమతి హెనెస్సీ.

05:31.707 --> 05:34.417
- ఏంటి?
- మిసెస్ హెనెస్సీ, ఒక దారుణమైన సమస్య వచ్చింది.

05:34.418 --> 05:35.586
ఏమైంది?

05:36.503 --> 05:38.171
గిఫ్ట్ బ్యాగుల సమస్య.

05:38.172 --> 05:42.008
నేను రోజ్ పరేడ్ థీమ్ కి మ్యాచ్ అవ్వడం కోసమని
బ్లష్ ఇంకా ఎర్రని రంగు రిబ్బన్లు వాడమంటే

05:42.009 --> 05:43.801
వాళ్ళు తెలుపు నలుపు వాడారు.

05:43.802 --> 05:46.262
నేను వాటికి బదులు వేరే వాటిని ఏర్పాటు చేయించడానికి
గంట నుండి ట్రై చేస్తున్నా,

05:46.263 --> 05:47.889
కానీ సెలవు కావడంతో వేరే ఎవరూ ముందుకు రావడం లేదు.

05:47.890 --> 05:50.183
కారోలిన్, శ్వాస తీసుకో. సరేనా.
మనకు ఇంకా టైమ్ ఉంది.

05:50.184 --> 05:52.143
నేను బ్యాకప్ కోసం కాల్ చేస్తా, సరేనా?

05:52.144 --> 05:53.395
సరే, థాంక్స్.

05:55.898 --> 05:58.150
నా హీరో. లోనికి రండి, అమ్మాయిలు.

05:59.902 --> 06:01.736
లోనికి రా.

06:01.737 --> 06:04.198
- భలే.
- ఆహ్, బంగారం.

06:04.865 --> 06:08.075
సరే, నువ్వు వీటిని 45 డిగ్రీల యాంగిల్ లో కట్ చేయాలి,

06:08.076 --> 06:10.661
అప్పుడే ఇది సమంగా ఇంకా అందంగా కనిపిస్తుంది.

06:10.662 --> 06:13.080
నీకు పని లోపం లేకుండా చేయాలా
లేక పని పూర్తి చేయడం కావాలా?

06:13.081 --> 06:15.042
- రెండు కుదరవా?
- లేదు.

06:16.251 --> 06:20.589
రాబర్ట్ ప్రస్తుతం నేను పార్టీనీ మరీ…
అతిగా చేశా అనుకుంటున్నాడు.

06:21.632 --> 06:22.799
నాకు తను చెప్పింది కరెక్టే అనిపిస్తోంది.

06:23.675 --> 06:26.469
అమ్మాయిలు, మీరు ఈ బ్యాగ్స్ తీసుకెళ్లి
ఇంటి ముందు చేసిన అలంకారాల్లాగా

06:26.470 --> 06:28.262
వీటిని కూడా అలంకరించవచ్చు కదా?

06:28.263 --> 06:30.598
- అలా చేస్తే చాలా సంతోషం.
- ఒక్కొక్కరు రెండు తీసుకెళ్లండి. అంతే, సూపర్.

06:30.599 --> 06:31.892
చాలా థాంక్స్.

06:32.559 --> 06:33.852
వాళ్ళు చాలా అందంగా ఉన్నారు.

06:36.313 --> 06:39.815
నాన్సీ, నా మాట విను, నువ్వు అందరూ
ఎంజాయ్ చేయడానికి ఇష్టపడే అత్యంత అందమైన

06:39.816 --> 06:42.485
న్యూ ఇయర్ పార్టీని ఏర్పాటు చేస్తున్నావు.

06:42.486 --> 06:47.241
అలాగే ఇవాళ వేడుక చేసుకోవడానికి
మనందరికీ ఏదొక కారణం కావాలని నా ఉద్దేశం.

06:49.493 --> 06:50.911
మార్కస్ తో సమస్యా?

06:51.995 --> 06:52.996
హోవర్డ్ తో.

06:54.039 --> 06:57.500
వాళ్ళు మళ్ళీ అతని క్లాస్ లోడ్ ని తగ్గించారు,
కాబట్టి ఇప్పుడు వారానికి నాలుగు గంటలే పని చేస్తున్నాడు.

06:57.501 --> 06:58.710
- ఏంటి?
- అవును.

06:59.461 --> 07:01.629
మేము ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.

07:01.630 --> 07:02.713
నేను సాయం చేయగలను.

07:02.714 --> 07:04.590
లేదు, లేదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు… లేదు.

07:04.591 --> 07:08.512
నువ్వు ఇప్పటికే నాకు చాలా సాయం చేసావు.
నేను నీ నుండి ఇంకేమాత్రం తీసుకోలేను.

07:09.263 --> 07:11.180
అలాగే ఈ విషయంలో హోవర్డ్ కి అబద్ధం
చెప్పడం నాకు ఇష్టం లేదు.

07:11.181 --> 07:15.059
అయితే చెప్పకు. నీ పిల్లలకు తిండి పెట్టడానికి నీ భర్త ఈగో

07:15.060 --> 07:17.144
అడ్డుపడుతున్నట్టు అయితే నువ్వు…

07:17.145 --> 07:20.523
సరే, అంటే, అది ఈగో కాదు.
తనకి కొన్ని విలువలు ఉన్నాయి.

07:20.524 --> 07:23.067
యూనివర్సిటీ వారు అతనితో కొన్ని గిమ్మిక్కులు చేయమంటున్నారు,

07:23.068 --> 07:26.154
టిక్ టాక్ లో రోమ్ పతనం గురించి చెప్పమనడం, అంటే…

07:26.989 --> 07:30.325
అంటే, తను… తను తన స్థాయిని వదులుకుని
అలాంటివి చేసే రకం కాదు.

07:31.869 --> 07:33.494
ఊరుకో, ఇది కొత్త సంవత్సరం, సరేనా?

07:33.495 --> 07:35.830
మనం ఊహించని సమయాల్లోనే మనకు అవకాశాలు ఎదురవుతుంటాయి.

07:35.831 --> 07:38.916
నా ఫ్రెండ్, మేరీ, నిరంతరం ఆశాజనకంగా ఉండే మనిషి.

07:38.917 --> 07:40.001
నిజమే.

07:40.002 --> 07:42.086
ముఖ్యంగా తన కుటుంబం విషయంలో.

07:42.087 --> 07:43.713
నాన్సీ ఆంటీ, మేము కోరా బొమ్మలతో ఆడుకోవచ్చా?

07:43.714 --> 07:45.214
వద్దు. నాన్సీ ఆంటీకి చాలా పనులు ఉన్నాయి.

07:45.215 --> 07:47.049
తను ఇప్పుడు పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తోంది.
ఇదంతా చూడండి.

07:47.050 --> 07:49.302
దానికంటే ఇది చాలా ముఖ్యం.
ఒకసారి వెళ్లి తనని అడుగుతా, సరేనా?

07:49.303 --> 07:52.181
- థాంక్… థాంక్స్ చెప్పండి.
- థాంక్స్. థాంక్స్.

07:52.931 --> 07:56.351
తనలో నాకు నచ్చేది అదే. తనలో నాకు కావాల్సింది అదే.

07:57.644 --> 08:01.857
మేరీ నాకు లేని తల్లిలాంటిది,
నేను ఎలాంటి తల్లిగా ఉండలేకపోతున్నానో అలాంటి తల్లిలాంటిది.

08:03.567 --> 08:04.568
ఏంటి?

08:06.320 --> 08:07.487
అది నాన్న షర్ట్ కదా?

08:07.988 --> 08:10.824
నాన్నే నేను ఇది తీసుకోవచ్చు అని చెప్పారు.
నీకు ఏం కావాలి, అమ్మా?

08:11.533 --> 08:12.784
ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చా.

08:14.077 --> 08:18.039
అలాగే, మేరీ పిల్లలు నీ అమెరికన్ అమ్మాయి
బొమ్మలతో ఆడుకోవచ్చా అని అడుగుతున్నారు.

08:18.040 --> 08:19.123
ఇవ్వనా?

08:19.124 --> 08:20.791
సరే, నేను వాటిని పెద్దగా లెక్క చేయను.

08:20.792 --> 08:23.295
నువ్వు వాటిని కనిపెట్టగలిగితే,
ఆ పాత బొమ్మల్ని వాళ్ళకి ఇచ్చేసినా పర్లేదు.

08:27.883 --> 08:32.220
ఇంతకు ముందు నీకు అవి అంటే చాలా ఇష్టం ఉండేది
తెలుసా? ఒకప్పుడు.

08:32.221 --> 08:33.303
అవును.

08:33.304 --> 08:34.765
కోరా.

08:36.850 --> 08:39.143
ఇది నీకు పార్టీ కోసం తీసిన డ్రెస్.

08:39.144 --> 08:42.939
ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ స్టీమ్ చేయాలి.
నువ్వు నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

08:42.940 --> 08:44.398
లేదు, నేను పార్టీకి రావడం లేదు.

08:44.399 --> 08:46.817
హైల్యాండ్ పార్క్ లో ఉన్న నా ఫ్రెండ్స్
ఒక పోట్ లక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

08:46.818 --> 08:48.945
ఏంటి? అదెప్పుడు జరిగింది?

08:48.946 --> 08:50.322
నాన్న వెళ్లొచ్చు అన్నారు.

08:50.822 --> 08:51.823
అవునా?

08:52.324 --> 08:54.408
నువ్వు ఎందుకు ఇప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నావు?

08:54.409 --> 08:56.661
ఈ పార్టీ గురించి నువ్వు తప్ప వేరెవ్వరూ లెక్క చేయరు.

08:56.662 --> 08:59.080
లేదు, ఇప్పుడు నువ్వు కఠువుగా మాట్లాడుతున్నావు.

08:59.081 --> 09:00.289
నేను కఠువుగా మాట్లాడానా?

09:00.290 --> 09:04.043
నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చి వారం అవుతోంది,
నువ్వు నాతో రెండు మాటలు కూడా మాట్లాడలేదు.

09:04.044 --> 09:07.380
నువ్వు నీ సొంత కూతురితో కంటే ఆ క్యాటరర్ తో
ఎక్కువసేపు మాట్లాడావు.

09:07.381 --> 09:09.799
అంటే, అసలు నేను ఎలా ఉన్నానని కనీసం అడిగావా?

09:09.800 --> 09:11.634
అసలు నా జీవితంలో ఇప్పుడు
ఏం జరుగుతుందో నీకు తెలుసా?

09:11.635 --> 09:15.221
- బంగారం, నేను బిజీగా ఉన్నానని తెలుసు, నేను…
- వద్దు, అదేం పర్లేదు. నేను లెక్క చేయను.

09:15.222 --> 09:19.226
నేను… కఠువుగా ప్రవర్తించేది
నేను కాదు అంటున్నాను అంతే.

09:19.935 --> 09:23.104
సరే, ఈ పార్టీ అయిన వెంటనే నేను నీతోనే గడుపుతా.

09:23.105 --> 09:25.440
దేవుడి మీద ఒట్టు, వెంటనే నా రూమ్ నుండి వెళ్ళిపో, ప్లీజ్.

09:29.278 --> 09:33.866
సరే, కానీ ఒకసారి నువ్వు వచ్చి పోతే నాకు చాలా
సంతోషంగా ఉంటుంది, మీ నాన్నకి కూడా.

09:34.533 --> 09:37.327
నాన్నకి ఏది నచ్చుతుందో ఇప్పుడిక
నీకు తెలుసని నాకు అనిపించడం లేదు.

09:39.413 --> 09:42.833
కోరా మాటలు నన్ను చాలా బాధపెట్టాయి,
కానీ అందుకు నేను తనని నిందించలేను.

09:43.584 --> 09:47.837
ఈ ఫ్యాన్సీ బొమ్మలు అలాగే ఖరీదైన బట్టలతో
నిండిన ప్రపంచం ఆమెకు కొత్త కాదు.

09:47.838 --> 09:49.213
కానీ నేను మాత్రం ఈ పెద్ద ఇంట్లోకి

09:49.214 --> 09:52.508
అనుకోకుండా అడుగుపెట్టిన బయటిదాన్ని అనే
ఫీలింగ్ ని ఎప్పటికీ కోల్పోలేను.

09:52.509 --> 09:55.636
బేకర్స్ ఫీల్డ్ నుండి వచ్చి నటిస్తూ
బ్రతికేస్తున్న చేతకాని తెల్లజాతి పిల్లని.

09:55.637 --> 09:58.389
నా అసలు నైజం ఏ క్షణమైనా బట్టబయలు
కాగల అవకాశం ఉన్నదాన్ని.

09:58.390 --> 10:00.683
నేను దీని వల్ల ఎవరికీ బాధకలగకుండా
చేయడానికి ట్రై చేస్తున్నా.

10:00.684 --> 10:02.685
అవునా, బాబీ?
ఈ పార్టీ కోసం నువ్వు ఎంత ఖర్చు చేసావు?

10:02.686 --> 10:04.854
ఖర్చుల గురించి నాకు చెప్పకు, కిట్.

10:04.855 --> 10:06.440
ఇప్పటికే నాన్న నుండి ఎదురయ్యే విమర్శలు చాలు.

10:07.399 --> 10:11.195
అంతా నేను చూసుకుంటా.
నాకు… కొంచెం టైమ్ కావాలి అంతే.

10:14.573 --> 10:15.656
దేవుడా, నాన్సీ.

10:15.657 --> 10:18.701
- నా భర్తని చూడటానికి వచ్చా.
- ప్రస్తుతం వాడు ఎవరినీ

10:18.702 --> 10:21.580
- కలిసే మూడ్ లో లేడు అనుకుంటా.
- ఒకసారి ట్రై చేసి చూస్తాలే, థాంక్స్.

10:27.628 --> 10:28.962
తను నేను విజిటర్ ని అన్నట్టు మాట్లాడింది.

10:33.133 --> 10:34.134
సరే.

10:37.971 --> 10:41.141
హేయ్, బేబీ, ఏం జరుగుతోంది?
మనం ఏమైనా ఆర్థిక సమస్యలో పడ్డామా?

10:44.478 --> 10:46.396
లేదు. అది…

10:47.523 --> 10:51.026
మన ఖర్చులను చూసి నాన్న అరుస్తున్నాడు అంతే.
ఇదేం కంగారు పడాల్సిన విషయం కాదు.

10:51.735 --> 10:54.612
ఆ అరుపుల కారణంగా మధ్యాహ్నంలోగా
మూడవ పెగ్గు తాగుతున్నావు అంటే…

10:54.613 --> 10:55.781
ఊరుకో.

10:57.783 --> 11:01.244
దీని వెనుక మీరు అందరూ న్యూ యార్క్ లో
కలిసిన వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా?

11:01.245 --> 11:03.580
హేయ్. అంతా బానే ఉంది.

11:04.373 --> 11:06.959
నేను… నాకు పని కొంచెం ఎక్కువ ఉంది అంతే.

11:10.838 --> 11:11.880
సరే…

11:13.549 --> 11:15.717
నీ మనసును ఎలా మళ్ళించాలో నాకు తెలుసు.

11:21.473 --> 11:24.977
ఇది మంచి ఐడియా అనుకుంటున్నావా?
అంటే, అతిథులు రాబోతున్నారు కదా.

11:28.146 --> 11:30.315
అయితే వచ్చినప్పుడు చూడటానికి ఒక షో చేద్దాం.

11:32.359 --> 11:33.443
సరేనా?

12:40.260 --> 12:41.261
హేయ్.

12:41.845 --> 12:42.929
ఏం అనుకోకు.

12:42.930 --> 12:44.014
హేయ్.

12:45.307 --> 12:46.766
- నేను…
- కొన్ని రోజులు అయింది కదా.

12:46.767 --> 12:49.770
- ఏం జరుగుతుందో నాకు చెప్తావా?
- సరే. కాదు, అది…

12:51.522 --> 12:54.565
ప్రస్తుతం కొంచెం నన్ను ఒత్తిడి చేయకుండా ఉంటావా?

12:54.566 --> 12:57.486
ఇప్పుడు నా మనసులో చాలా మెదులుతున్నాయి.

13:11.333 --> 13:13.168
ఇవాళ నువ్వు చాలా బాగా డాన్స్ వేశావు, పాపా.

13:14.628 --> 13:16.546
నేను అక్కడ ఉన్నంత సేపు నిన్నే చూసా.

13:16.547 --> 13:20.676
నాకు తెలుసు. నువ్వు నాకోసమే డాన్స్ వేసినట్టు అనిపించింది.

13:30.561 --> 13:31.562
నేను మర్చిపోవడానికి ముందే తీసుకో.

13:33.981 --> 13:36.650
ఈ డబ్బు రానున్న రెండు నెలలకు
నీ క్లాసులకు సరిపోతుంది.

13:41.822 --> 13:43.907
నాకు ఆ కొత్త పాయింట్ షూస్ కావాలి.

13:47.327 --> 13:49.371
నువ్వు నిజంగానే ప్యాటీ కూతురివి.

13:56.086 --> 13:57.628
హలో.

13:57.629 --> 13:59.423
- నూతన సంవత్సర శుభాకాంక్షలు, తల్లి.
- మీకు కూడా.

14:00.465 --> 14:03.092
నాన్నకి ఆ రోజ్ తోట చాలా నచ్చింది.

14:03.093 --> 14:05.178
చూస్తుంటే నీ తోటమాలులు దాన్ని
బాగా చూసుకుంటున్నట్టు ఉన్నారు.

14:05.179 --> 14:09.223
నిజానికి ఆ తోటని చూసుకునేది నేనే.
అవును, ఆ పని నాకు హాయిగా అనిపిస్తుంది.

14:09.224 --> 14:11.058
చాలా మంచి మాట అన్నావు.

14:11.059 --> 14:13.686
నా పిల్లలు కూడా నీ నుండి
ఒకటి రెండు విషయాలు నేర్చుకోవచ్చు.

14:13.687 --> 14:16.982
వీళ్లకు నా నుండి అన్నీ అబ్బాయి, నా పనితనం తప్ప.

14:17.733 --> 14:19.108
అలా అనడం ఏం బాలేదు.

14:19.109 --> 14:21.195
నాకు తెలిసి రాబర్ట్ కూడా
మీకోసం చాలా గంటలు పని చేస్తాడు.

14:21.778 --> 14:23.821
ఖర్చు చేయడానికి అయితే ఖచ్చితంగా కష్టపడతాడు.

14:23.822 --> 14:26.449
మా కుటుంబంలో, ఘర్షణ బాహాటంగా జరిగేది…

14:26.450 --> 14:28.451
- వెళ్లి ఏమైనా తాగుదాం పదా.
- …కానీ రాబర్ట్ వాళ్ళ ఇంట్లో,

14:28.452 --> 14:30.578
చురక పెట్టినట్టు మాట్లాడి ఉద్దేశాన్ని బయటపెడతారు.

14:30.579 --> 14:31.996
స్వాగతం.

14:31.997 --> 14:34.790
అలాగే నా ఫ్రెండ్స్ లేకపోయి ఉంటే
నేను ఆ విషయాన్ని గ్రహించేదాన్ని కాదు.

14:34.791 --> 14:36.793
మీరు ఒక క్షణం ఇక్కడే ఉండండి.
నేను కాసేపట్లో వస్తా.

14:37.461 --> 14:39.630
స్వాగతం. వచ్చినందుకు థాంక్స్.

14:41.757 --> 14:43.382
- బానే ఉన్నావా?
- అవును.

14:43.383 --> 14:45.801
- అది చూడటానికి… ఆసక్తిగా అనిపించింది.
- అవును.

14:45.802 --> 14:48.096
రాబర్ట్ వాళ్ళ నాన్న మళ్ళీ నిన్ను ఆటపట్టిస్తున్నాడా?

14:48.597 --> 14:49.890
ఆయన నన్ను ఆటపట్టించడు.

14:50.724 --> 14:52.475
అమ్మో, ఒకవేళ అదే చేస్తున్నాడేమో.

14:52.476 --> 14:55.144
ఏమో, వాళ్ళ రహస్య భాష నాకు అర్థం కాదు.
నేను వాళ్ళ ఉద్దేశాలు అర్థం చేసుకోలేను.

14:55.145 --> 14:57.439
హేయ్, పిల్లలు. వాటితో జాగ్రత్తగా ఉండండి, సరేనా?

14:58.023 --> 14:59.690
అవి మన ఇంట్లో ఉన్న అన్నిటికంటే ఖరీదైనవి.

14:59.691 --> 15:02.861
అదేం పర్లేదు. కోరా వాటి గురించి ఇప్పుడు అస్సలు
లెక్క చేయడం లేదు. నా గురించి కూడా.

15:03.654 --> 15:05.238
- ఊరుకో. అలా ఏం కాదు.
- నాన్సీ!

15:05.239 --> 15:06.864
ఓహ్, దేవుడా. నాకు ఈ మనిషంటే అస్సలు నచ్చదు. బై.

15:06.865 --> 15:09.034
హాయ్, నిన్ను చూడటం చాలా సంతోషం.

15:09.743 --> 15:10.744
ఏమండీ.

15:11.912 --> 15:13.996
ఎలనోర్
నేను వస్తున్నాను…

15:13.997 --> 15:16.416
నాకు ఒక మార్టీని కావాలి…

15:20.254 --> 15:22.588
- ఎల్!
- హాయ్! హ్యాపీ న్యూ ఇయర్.

15:22.589 --> 15:24.882
నాకోసం నువ్వు ట్రిప్ మధ్యలో
ముగించుకుని వచ్చి ఉండాల్సింది కాదు.

15:24.883 --> 15:28.719
జోక్ చేస్తున్నావా?
ఇక్కడికి రావడం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు.

15:28.720 --> 15:32.473
ఓహ్, దేవుడా. 16 గంటల ఫ్లైట్ ప్రయాణం తర్వాత
ఎవరూ ఇంత ఫ్రెష్ గా కనిపించరు.

15:32.474 --> 15:36.978
నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? వోడ్కా. వర్మూత్. ఆలివ్స్.
వెంటనే నా ముందు ఉండాలి.

15:36.979 --> 15:39.064
నీ అదృష్టం బాగుంది, బార్టెండర్ నాకు తెలుసు.

15:41.859 --> 15:43.110
అదిరింది. థాంక్స్.

15:43.777 --> 15:45.153
నువ్వు కూడా బాగానే ఉన్నావు.

15:46.488 --> 15:48.573
- వీడు మామూలు వాడు కాదు.
- నాకు తెలుసు.

15:48.574 --> 15:49.907
- హాయ్.
- హాయ్.

15:49.908 --> 15:52.493
- హేయ్, ఎలా ఉన్నావు? బాగున్నా.
- బాగున్నా. నువ్వు?

15:52.494 --> 15:54.078
- నాకు కూడా ఇది ఒకటి ఇవ్వండి.
- నిజంగా?

15:54.079 --> 15:55.663
నువ్వెప్పటి నుండి మార్టిని త్రాగడం మొదలెట్టావు?

15:55.664 --> 15:58.291
నువ్వు ఊరు వెళ్లి రెండు వారాలు అవుతోంది.
ఇప్పుడు నేనొక కొత్త మనిషిని.

15:58.292 --> 15:59.500
వావ్!

15:59.501 --> 16:02.628
- నాన్సీ, అద్భుతం. ఇది భలే ఉంది.
- థాంక్స్.

16:02.629 --> 16:04.755
సూపర్. ఇంతకు మీ ఆయన ఎక్కడ?

16:04.756 --> 16:08.801
- ఓహ్, అవును. నేను రాబర్ట్ ని చూడనేలేదు.
- అవును. తనకి కొంచెం పని ఉంది.

16:08.802 --> 16:10.386
- ఇవాళ కూడా పని చేస్తున్నాడా?
- అవును.

16:10.387 --> 16:15.016
లేక మీరు ఇవాళ పార్టీకి ముందు
మీరు పార్టీకి ముందు సెక్స్ చేయడం వల్ల…

16:15.017 --> 16:16.601
- లేదు.
- …అతను అలసిపోయాడా?

16:16.602 --> 16:18.603
- ఏంటి?
- అవును, వీళ్ళకి ఇదొక ఆనవాయితీ.

16:18.604 --> 16:20.104
- అలా ఏం కాదు, అవునా? కాదు.
- అవును.

16:20.105 --> 16:22.523
- ఇంతకు ముందు చేసేవాళ్ళం.
- మరి… మరి ఇప్పుడేమైంది?

16:22.524 --> 16:24.817
ఈ మధ్య పరిస్థితి అంత బాలేదు.

16:24.818 --> 16:29.740
ఏమో, ఇందాక నేను ముందుకెళ్లా,
కానీ తనకి మనసు లేదు.

16:30.365 --> 16:32.450
నువ్వేం చేసావో నాకు అర్థమైంది.

16:32.451 --> 16:34.744
ఇది మామూలే. పెళ్లి జీవితంలో ఇది మామూలే, కదా?

16:34.745 --> 16:36.078
ఎల్లి, ఇది మామూలే అని దీనికి చెప్పు.

16:36.079 --> 16:37.288
- నాకు అవన్నీ తెలీదు…
- అవునా?

16:37.289 --> 16:38.956
…నేను సింగిల్ గా ఉండటానికి కారణం ఉంది.

16:38.957 --> 16:41.542
నీకు పెళ్లి అయి చాలా కాలం అవుతోంది.
ఏంటి, ఇంతకు ముందెప్పుడూ

16:41.543 --> 16:44.170
నీ మొగుడికి పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో సమస్య రాలేదా?

16:44.171 --> 16:45.296
వావ్. అమ్మో.

16:45.297 --> 16:49.467
అంటే, మాకు ఇతర మార్గాల్లో సమస్య ఎదురైంది,
కానీ… అలా ఎప్పుడూ కాలేదు.

16:49.468 --> 16:50.843
నేను… అంటే, నా ఉద్దేశంలో

16:50.844 --> 16:54.348
ఇదంతా వాళ్ళ నాన్న ఆఫీసులో తనపై ఒత్తిడి
ఎక్కువగా పెట్టడం వల్లే జరుగుతోంది అనుకుంటున్నా.

16:54.848 --> 16:56.974
- కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, అందువల్లే ఏమో కదా?
- అది…

16:56.975 --> 16:58.059
- ఒత్తిడి?
- అవును, నిజమే.

16:58.060 --> 17:00.478
సరే, ఏమీ లేనప్పుడు నువ్వు ఆలోచించుకుని
సమస్య తెచ్చుకోకు. అంతే.

17:00.479 --> 17:01.687
- ఎల్.
- చెప్పు.

17:01.688 --> 17:02.772
నేను…

17:02.773 --> 17:05.357
- నేను నీకు ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నా.
- వద్దు. వద్దు. వద్దు.

17:05.358 --> 17:08.736
- అవును. అవును, అవును, అవును. అవును.
- అతను విడాకులైన లాయర్.

17:08.737 --> 17:11.364
విడాకుల లాయర్ కాదు.
అతను విడాకులు తీసుకున్న లాయర్.

17:11.365 --> 17:14.366
అతను రాబర్ట్ తో కలిసి టెన్నిస్ ఆడతాడు,
కాకపోతే అతనొక డెమొక్రాట్.

17:14.367 --> 17:16.327
- ఇకపై ఇలా ఫిక్సింగులు చేయొద్దు అన్నా కదా.
- అవును.

17:16.328 --> 17:18.371
ఇదేమి ఫిక్సింగ్ కాదు, పరిచయం చేస్తున్నాం అంతే.

17:18.372 --> 17:20.206
- అలాగే అతనికి బియాన్సే తెలుసు.
- నేను నమ్మను.

17:20.207 --> 17:21.833
అవును, వాళ్ళు కలిసి ఒక ఫండ్ రైజర్ ఏర్పాటు చేశారు.

17:21.834 --> 17:23.417
నువ్వు లీడ్ ని దాచావు, కదా?

17:23.919 --> 17:25.211
- ఎడ్, హాయ్.
- బియాన్సే?

17:25.212 --> 17:26.629
ఒక్క నిమిషం.

17:26.630 --> 17:27.838
- అక్కడ ఉంది.
- హాయ్.

17:27.839 --> 17:29.048
ఇంకొక ఏడాది, ఇంకొక గొప్ప పార్టీ.

17:29.049 --> 17:30.299
- నువ్వు చాలా మంచోడివి.
- అందగాడే.

17:30.300 --> 17:32.635
ఈమె ఎలనోర్. నేను నీకు చెప్పిన నా ఫ్రెండ్.

17:32.636 --> 17:34.762
- ఎలనోర్, నిన్ను కలవడం చాలా సంతోషం.
- నాకు కూడా.

17:34.763 --> 17:36.597
- హ్యాపీ న్యూ ఇయర్.
- హ్యాపీ న్యూ ఇయర్.

17:36.598 --> 17:38.516
మీది బోస్టన్ అని నాన్సీ నాకు చెప్పింది.

17:38.517 --> 17:41.310
నేను లా చదవడానికి కేంబ్రిడ్జ్ కి వెళ్ళా.

17:41.311 --> 17:42.478
- వావ్!
- అవును.

17:42.479 --> 17:43.813
హోవర్డ్. నాకు తెలిసి మేము కొంచెం…

17:43.814 --> 17:44.897
- మేము మర్చిపోయాం…
- ఎందుకు?

17:44.898 --> 17:46.524
- మేము హోవర్డ్ కి డ్రింక్ ఇవ్వాలి.
- లేదు.

17:46.525 --> 17:48.401
- అవును. ఇవ్వాలి.
- నిజంగా? అవునా?

17:48.402 --> 17:49.403
అవును.

17:50.279 --> 17:51.988
నువ్వు భలే మంచిదానివి. అతను బాగున్నాడు.

17:51.989 --> 17:53.407
- అందంగా ఉన్నాడు కదా? అవును.
- అవును.

17:54.032 --> 17:57.869
దయచేసి చెప్పింది చెయ్. నేను ఇందాక హోవర్డ్
పని గురించి చెప్పింది ప్రస్తావించకు.

17:57.870 --> 18:00.246
నేను నీకు చెప్పానని తెలిస్తే
అతను బాధపడతాడు, అలాగే…

18:00.247 --> 18:02.331
- అదేం లేదు. నేను దాని గురించి మాట్లాడను.
- థాంక్స్.

18:02.332 --> 18:03.916
నేను కొంతమందికి హాయ్ చెప్తాను.

18:03.917 --> 18:05.251
- సరే, నేను ఇక్కడ ఉంటా.
- సరే.

18:05.252 --> 18:08.004
ఇప్పుడైతే ముందు బ్లాంచైన్ మీదే వేటు పడుతుంది,

18:08.005 --> 18:11.091
లేదా కనీసం తన మీద "సమస్యాత్మకమైన మనిషి" అని
ముద్ర వేస్తారు.

18:12.593 --> 18:14.510
కానీ అతనికైతే, నా ఉద్దేశంలో,

18:14.511 --> 18:18.014
డాన్స్ అనేది ఆడియన్స్ లేదా ఆర్టిస్టుల
సంతోషం కోసం చేసేది కాదు.

18:18.015 --> 18:21.434
అది పురికొల్పడానికి చేసేది. రేకెత్తించడానికి.

18:21.435 --> 18:23.896
అలాగే నీ గైడెన్స్ లో, ఫిల్, అలాగే జరుగుతుంది.

18:24.605 --> 18:26.689
శ్రీమతి హెనెస్సీ లాంటి ఉదాసీనమైన

18:26.690 --> 18:29.525
బోర్డు సభ్యుల సాయం లేకపోతే మేము అవేమి చేయగలిగేవాళ్ళం కాదు.

18:29.526 --> 18:31.652
కాసేపు ఈ మాస్టర్ గారిని తీసుకెళ్లొచ్చా?

18:31.653 --> 18:32.737
ఒక్క నిమిషం.

18:32.738 --> 18:37.033
కొత్త ప్రొడక్షన్ కోసం మన ప్రోగ్రామ్ నోట్స్ పై
పని చేయడానికి సరిపడే వ్యక్తి నాకు కనిపించాడు అనుకుంటున్నా.

18:37.034 --> 18:38.659
అతను పేరుగాంచిన ప్రొఫెసర్,

18:38.660 --> 18:41.413
అలాగే నాకోసం అతను తన షెడ్యూల్ ఫ్రీ
చేసుకుని పని చేయగలడు అనుకుంటున్నా.

18:42.122 --> 18:46.417
హాయ్, మేరీ, హోవర్డ్, ఇతను ఫిల్ డెలవీన్,
ఎల్ఏ మెట్రోపాలిటన్ బ్యాలేలో చేస్తుంటాడు.

18:46.418 --> 18:50.087
అతను అరియాడ్ని అనబడే ఒక కొత్త
అద్భుతమైన ఒరిజినల్ పీస్ మీద పనిచేస్తున్నాడు.

18:50.088 --> 18:52.673
అది మీ ఫీల్డ్ లోడ్ కదా, హోవర్డ్? గ్రీకు పురాణాం?

18:52.674 --> 18:55.092
అవును. అది… అందులోని చిక్కుముడి వెనుకున్న

18:55.093 --> 18:57.929
గూడార్థం ఎన్నో ఏళ్లుగా వ్యాఖ్యాన కళాకారులను ఆకర్షిస్తోంది.

18:57.930 --> 19:00.306
నేను ఈ పని చేసే మొదటివాడిని కాకపోవచ్చు.

19:00.307 --> 19:03.100
నేను… ఒక కొత్త కోణంలో చూపిద్దాం అనుకుంటున్నా.

19:03.101 --> 19:04.310
ఆర్టిస్టులు సాధారణంగానే…

19:04.311 --> 19:07.855
రాబర్ట్ వాళ్ళ కుటుంబం మాట్లాడుకునేటప్పుడు
నన్ను దూరం పెడుతున్నారు అనిపించేది.

19:07.856 --> 19:09.357
అది మన అందరికీ ఎదురయ్యే అనుభ…

19:09.358 --> 19:12.235
కానీ ఇది పడవల గురించో లేక గోల్ఫ్ ఆట గురించో కాదు.

19:12.236 --> 19:14.320
ఏదో సీరియస్ విషయం నడుస్తోంది.

19:14.321 --> 19:16.240
…మనిషి నైజంలో ఉన్నదే.

19:16.823 --> 19:18.699
ఒక్క నిమిషం ఉండండి.

19:18.700 --> 19:23.038
సరే, కానీ నిజానికి ఆ చిక్కుముడి గురించి
ఏమనిపిస్తుందో చెప్పండి… సూచిక అనొచ్చు కదా.

19:26.083 --> 19:28.960
హార్లన్. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది.

19:28.961 --> 19:30.878
ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాను, పాపా.
నిన్ను చూడటం సంతోషంగా ఉంది.

19:30.879 --> 19:32.172
లీన ఎలా ఉంది?

19:33.048 --> 19:35.800
నేను నీకు రాబర్ట్ చెప్పి ఉంటాడు అనుకున్నా.
లీన ఇంకా నేను…

19:35.801 --> 19:38.553
బుజ్జి, హాయ్. మనం కనిపించి వచ్చేయొచ్చు
అన్నావు కదా.

19:38.554 --> 19:40.722
నా ఫ్రెండ్స్ మన కోసం నోబులో ఎదురుచూస్తున్నారు.

19:42.224 --> 19:46.603
పైపర్, ఈమె నాన్సీ.
నా క్లయింట్ రాబర్ట్ గారి భార్య అలాగే ఈ పార్టీ ఏర్పాటు చేసినావిడ.

19:47.896 --> 19:49.814
మిమ్మల్ని కలవడం సంతోషం.

19:49.815 --> 19:51.941
మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది.

19:51.942 --> 19:53.193
థాంక్స్.

19:53.944 --> 19:55.654
పైపర్, ఒక్క క్షణం ఇస్తావా?

19:58.866 --> 20:00.741
ఆమె కూడా మాతో కలిసి కంపెనీలో పని చేస్తుంది.

20:00.742 --> 20:03.744
హార్లన్, నువ్వు మొదటి నుండి నాకు ఎంతో సాయం చేసావు,

20:03.745 --> 20:05.997
ఈ కుటుంబంలో ఎలా మసలుకోవాలో చెప్పావు.

20:05.998 --> 20:09.125
నాకు చేతనైంది చేశా. ఒక క్లయింట్ కి పనిచేసే
ఆస్తి మేనేజర్ కి ఏమాత్రం నైపుణ్యం ఉన్నా…

20:09.126 --> 20:11.253
న్యూ యార్క్ లో జరిగిన ఆ మీటింగ్ లో ఏం జరిగింది?

20:12.379 --> 20:14.130
నువ్వు… నువ్వు అది రాబర్ట్ నే అడగాలి.

20:14.131 --> 20:16.300
అడిగా. అతను నాకు ఏం చెప్పడం లేదు.

20:23.307 --> 20:25.433
- నా క్లయింట్ గౌరవం కోసం నేను చెప్పలేను.
- గౌరవం…

20:25.434 --> 20:27.977
నువ్వు నీ 25 ఏండ్ల సెక్రటరీతో పడుకుంటున్నావు.

20:27.978 --> 20:30.688
అలాంటప్పుడు నీకు లేని విలువల
గురించి ఇప్పుడు మాట్లాడకు.

20:30.689 --> 20:33.275
నేను విలువల కోసం చెప్పను అనడం లేదు.
నాకు తలనొప్పిగా మారకూడదని చెప్పడం లేదు.

20:33.984 --> 20:35.736
కాబట్టి నీ భర్తతో మాట్లాడు.

20:43.076 --> 20:44.327
ఇదేంటి?

20:44.328 --> 20:46.120
చూస్తే నీకు అవసరం ఉంటుందేమో అనిపించింది.

20:46.121 --> 20:48.039
ప్రస్తుతం నాకు ఇవ్వకూడనిది ఇదే.

20:48.040 --> 20:50.876
అంటే, నువ్వు కనిపెట్టింది కరెక్టే,
కానీ ఇది సరైన మందు కాదు.

20:51.710 --> 20:53.252
నేను అర్థం చేసుకోగలను.

20:53.253 --> 20:55.172
ఆ పచ్చబొట్టు చాలా బాగుంది. అది పువ్వా?

20:55.797 --> 20:59.468
ఇది ఒక ఫ్రాక్టల్. ఇది జామెట్రీకి సంబంధించింది.

21:00.219 --> 21:03.138
అది క్లిష్టమైన, ఎన్నటికీ మారని
రిపీట్ అయ్యే క్రమాలతో నిండి ఉంటుంది.

21:03.764 --> 21:07.017
మనం దాన్ని ఎంత దగ్గరగా చూసినా,
ఎంత దగ్గరకు జూమ్ చేసినా, దూరంగా చూసినా,

21:07.726 --> 21:09.186
ఒకేలా కనిపిస్తుంది.

21:10.646 --> 21:13.064
- నీకు మ్యాథ్ అంటే మొదటి నుండి ఇష్టమా?
- నిజం చెప్పాలంటే,

21:13.065 --> 21:16.484
ఆ పచ్చబొట్టు గురించి ఆర్టిస్టు నాకు వివరించేవరకు
ఇదేంటో కూడా నాకు తెలీదు.

21:16.485 --> 21:19.570
దీన్ని కోల్ మైన్ అనబడే ఒక చోట కిటికీ మీద
చూసినప్పుడు…

21:19.571 --> 21:24.117
ఆగు, కోల్… కోల్ మైన్,
అంటే పోటోమక్ పార్క్ దగ్గర బేట్స్ దాటితే వస్తుంది కదా?

21:24.910 --> 21:26.744
అమ్మో, నువ్వు బేకో అమ్మాయివా?

21:26.745 --> 21:28.956
నేను సాన్ లారెన్ లో పెరిగాను.

21:29.456 --> 21:32.209
నమ్మలేకపోతున్నా. నేను విస్టా వెస్ట్ లో చదివాను.

21:33.168 --> 21:34.253
వావ్.

21:35.420 --> 21:39.174
నీతో మాట్లాడాక నాకు ఏదో అనిపించింది.
నువ్వు చివరిగా వెనక్కి ఎప్పుడు వెళ్ళావు?

21:40.259 --> 21:41.510
నేను వెళ్ళను.

21:42.302 --> 21:43.637
ఆ చోటు నీ స్థాయికి సరిపోదా?

21:44.471 --> 21:46.098
కాదు, నిజం చెప్పాలంటే అందుకు వ్యతిరేకం.

21:47.182 --> 21:51.520
నేను అక్కడికి వెళితే ఇంకా ఏమాత్రం
నేను మారలేదని అనిపిస్తుందేమో అని భయం.

21:52.312 --> 21:55.065
నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ
అలాగే ఉన్నాను అనిపిస్తుందేమో అని.

21:56.233 --> 21:57.401
మరకపోయి ఉంటే తప్పేంటి?

21:59.945 --> 22:01.071
అది ప్రమాదకరం.

22:03.740 --> 22:04.783
థాంక్స్, స్కాట్.

22:05.701 --> 22:06.784
నేను లోనికి వెళ్ళాలి.

22:06.785 --> 22:08.287
- తను ఈపాటికి లేచి ఉంటుంది.
- హేయ్.

22:19.006 --> 22:20.381
ఒక క్లాస్ షాంపేన్ ఇవ్వు, బాబు.

22:20.382 --> 22:23.718
అయితే, ఆ హోవర్డ్ అనేవాడు. అతను క్లాసిక్స్ ప్రొఫెసరా?

22:23.719 --> 22:27.930
అతనికి పట్టు బానే ఉన్నట్టు ఉంది. కొంచెం ప్రాంతీయవాది.

22:27.931 --> 22:30.057
అతను కొంచెం సాయం అవసరమైన ఒక మంచి ఫ్రెండ్.

22:30.058 --> 22:33.519
సరే, కానీ మెట్రో బ్యాలే బడ్జెట్ అంతంత మాత్రమే
అని నీకు బాగా తెలుసు కదా.

22:33.520 --> 22:35.938
అయితే మా డొనేషన్ ని పెంచితే ఎలా ఉంటుంది అంటావు?

22:35.939 --> 22:39.276
అతనికి జీతం ఇవ్వడానికి. నేను నా భర్తతో మాట్లాడితే చాలు.

22:42.905 --> 22:44.865
- హాయ్. నువ్వు నాకన్నా ఎత్తుగా ఉన్నావు.
- హేయ్.

22:46.950 --> 22:48.618
బ్రిటిష్ ఐల్స్ చాలా అందంగా ఉన్నాయి.

22:48.619 --> 22:50.912
- కానీ తిండి మాత్రమే…
- ఓహ్, దేవుడా. నేను చచ్చానే.

22:50.913 --> 22:52.788
నేను అతనికి చాలా రోజులుగా నీ గురించి ఎంతో చెప్పా.

22:52.789 --> 22:54.332
కనీసం అతనితో కాసేపు మాట్లాడతావు అనుకున్నా.

22:54.333 --> 22:58.294
ట్రై చేశా, నిజంగా. వాడొక నీరసం మొహం.

22:58.295 --> 23:00.213
- లేదు.
- నేను ఏం మిస్ అవుతున్నాను?

23:00.214 --> 23:03.884
అవును. నీ అందమైన భార్య, దేవుడు దీన్ని చల్లగా చూడాలి,
నీ ఫ్రెండ్ ఎడ్ ని నాకు అంటగట్టాలని చూసింది.

23:04.968 --> 23:06.219
ఎడ్ హోలోకొంబ్?

23:06.220 --> 23:08.179
- ఎలా అన్నాడో చూసావా?
- ఏంటి?

23:08.180 --> 23:09.263
వాడు దీని టైప్ కాదు.

23:09.264 --> 23:11.474
- అది నీకెలా తెలుసు?
- ఊరుకో, నువ్వు చేసే పనేంటి?

23:11.475 --> 23:14.101
నా డేటింగ్ జీవితం సరిచేయాల్సిన బాధ్యత నీది కాదు, సరేనా?

23:14.102 --> 23:16.896
- నాకు నా స్వేచ్ఛ అంటే ఇష్టం.
- నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి.

23:16.897 --> 23:20.441
నేను సంతోషంగానే ఉన్నా. నాకు నువ్వు, మేరీ ఉన్నారు.
మీరే నా నిజమైన లవర్స్,

23:20.442 --> 23:22.611
ఇకపోతే నాకు అక్కడక్కడా సరదాకి
బోలెడంత మంది ఉన్నారు.

23:24.530 --> 23:27.032
- ఓహ్, దేవుడా. వస్తోంది.
- నాన్సీ.

23:28.617 --> 23:31.285
నాన్నకి ఈ స్పెషల్ డ్రింక్స్ తాగడం వల్ల
కొంచెం అదోలా ఉంది అంట.

23:31.286 --> 23:34.956
ఆయనకు నేను కొంచెం కాఫీ తీసుకెళ్లడానికి
నాకు సాయం చేయగలవా?

23:34.957 --> 23:36.124
తప్పకుండా.

23:39.795 --> 23:42.214
ఇందాక నువ్వు హార్లన్ తో మాట్లాడటం చూసా.

23:42.714 --> 23:45.384
అవును, అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ ని కలిసాను.
మేము మామూలుగా మాట్లాడుకున్నాం.

23:47.803 --> 23:49.972
అతనితో నువ్వు ఇంకేం మాట్లాడావు?

23:57.229 --> 23:58.939
అతను నాకు ఏం చెప్పలేదు.

24:00.691 --> 24:04.194
కొన్ని క్లిష్టమైన కుటుంబ వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి,

24:04.695 --> 24:06.612
నువ్వు వాటిలో తల దూర్చకుండా ఉంటే మంచిది.

24:06.613 --> 24:09.031
నేను కూడా ఈ కుటుంబంలో భాగమే, కిట్.

24:09.032 --> 24:11.576
సరే, నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నా.

24:11.577 --> 24:13.745
అసలు మీకు నాతో ఏంటి సమస్య?

24:14.496 --> 24:16.873
నేను ఇన్నాళ్లుగా నీతో కలవాలని ఎంతో ట్రై చేశా.

24:16.874 --> 24:19.960
మీ నాన్న నీకు బదులు ఇంటిని మాకు ఇచ్చారని కోపమా?

24:20.544 --> 24:22.336
ఎందుకంటే నీకు ఇదే కావాలి అంటే
నేను ఆయనతో మాట్లాడి…

24:22.337 --> 24:25.048
అసలు నన్ను ఇక్కడికి ఎవరు పంపారు అనుకుంటున్నావు?

24:27.551 --> 24:30.136
నాకు నీతో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాలి అని ఉందా?

24:30.137 --> 24:32.638
నువ్వు చేసేది ఏదైనా సరే లావాదేవీగానే చేస్తావు.

24:32.639 --> 24:37.561
మొదటి నుండీ నీ తంతు అంతే,
కానీ బాబీకి ఆ విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

24:54.453 --> 24:57.455
మీ ఫోన్ నంబర్ నాకు ఇమ్మని
మన పార్టీ ఏర్పాటు చేసినామెను అడుగుతా.

24:57.456 --> 24:59.833
- అంతకంటే మంచి ఐడియా చెప్తా విను.
- భలే.

25:00.876 --> 25:02.460
ఓహ్, దేవుడా! ఓహ్, దేవుడా!

25:02.461 --> 25:04.963
- నన్ను క్షమించండి.
- ఇది నీ పొరపాటు కాదు. నన్ను క్షమించు.

25:05.923 --> 25:08.758
- బానే ఉన్నావా?
- అవును, నేను బానే ఉన్నా.

25:08.759 --> 25:12.261
- నీకు రక్తం కారుతోంది.
- లేదు, లేదు. నేను బానే ఉన్నా.

25:12.262 --> 25:13.639
ఒక్క నిమిషం. మీరు ఎంజాయ్ చేయండి.

25:36.453 --> 25:37.579
బుజ్జి?

25:41.041 --> 25:42.042
నేను?

25:43.377 --> 25:44.378
మీరు ఏంటి?

25:48.215 --> 25:49.424
మీరు దారి తప్పి వచ్చారా?

25:50.384 --> 25:52.134
ఈ ఇంట్లో మీరు వాడుకోవడానికి
ఇంకా బోలెడన్ని బాత్రూమ్స్ ఉన్నాయి.

25:52.135 --> 25:55.055
లేదు, లేదు. నేను దారి తప్పిపోలేదు.

25:56.640 --> 25:59.226
అవునులే. మాకంటే ముందు
మీరు ఈ ఇంట్లోనే ఉండేవారు.

26:00.018 --> 26:01.103
నేను పెరిగింది ఈ ఇంట్లోనే.

26:02.688 --> 26:08.944
నారింజ తోటలు అలాగే ఆయిల్ ఫీల్డ్స్ కోసం
మా తాతయ్య స్వయంగా ఖాళీ చేసిన భూమి మీద.

26:09.820 --> 26:12.906
మా నాన్న కుటుంబాలను పెంచడం కోసమని
చక్కని ప్రదేశాలను అమ్మకుండా ఉంచారు.

26:16.702 --> 26:18.287
నాకు ఒక టవల్ ఇస్తావా, ప్లీజ్?

26:24.168 --> 26:27.086
జేన్ ఇంకా నేను ఎప్పుడూ రెండు సింకులు
అవసరం అవుతాయి అనుకోలేదు.

26:27.087 --> 26:29.631
ఎంతైనా మాకు బాగా పొసిగేది.

26:30.382 --> 26:32.801
మేము రీమోడల్ చేసినప్పుడు రెండవ సింక్ పెట్టించాం.

26:34.845 --> 26:37.638
మీరు మా ఖర్చులను చూసి కాస్త
కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది.

26:37.639 --> 26:39.224
బాబీ నీకు అలా అని చెప్పాడా?

26:41.435 --> 26:45.856
నాకు ఆ విషయం తెలుసు, కాబట్టి నేను
ఖర్చు తగ్గించబోతున్నాను,

26:46.398 --> 26:48.400
భవిష్యత్ పార్టీల మీద.

26:57.242 --> 26:59.077
నేను నీ పార్టీలలో నిజంగానే ఎంజాయ్ చేస్తుంటా.

27:00.579 --> 27:03.248
వచ్చే ఏడాది కూడా ఒకటి లేకపోతే బాధాకరం.

27:06.835 --> 27:11.088
జీవితంలో నాకు ఏది ఎదురైనా,
ఈ పార్టీ నాకు ఒక రీసెట్ లాగ పనిచేసేది.

27:11.089 --> 27:13.508
నా గాంభీర్యాన్ని బయటకు చూపడానికి ఒక అవకాశంలా.

27:13.509 --> 27:15.969
నిజంగానే నేను ఈ జీవితానికి సరిపోయేదాన్ని అని.

27:17.429 --> 27:19.056
ఇప్పుడిక అలా అనిపించలేదు.

27:24.686 --> 27:28.065
నా భర్త నా నుండి ఏం దాస్తున్నాడో
తెలుసుకునే టైమ్ అయింది.

27:39.701 --> 27:42.578
సెర్చ్

27:42.579 --> 27:43.789
చరిత్ర

27:56.051 --> 27:58.970
జానెట్ వచోస్కి
ఆస్తుల విభజన

27:58.971 --> 28:00.472
స్వీకర్త: రాబర్ట్ హెనెస్సీ

28:02.724 --> 28:08.313
మీ భార్య నుండి కావాలి
విడాకుల ప్రక్రియ

28:27.416 --> 28:29.084
అమ్మా, ఏం జరుగుతోంది?

28:29.793 --> 28:33.797
నేను వెర్రిదాన్ని అనుకుంటున్నావా?
నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా?

28:36.800 --> 28:40.304
- ఇక్కడ బాధితురాలివి నువ్వు కాదు…
- ఆపు… అమ్మా, ఆపు.

28:42.097 --> 28:43.682
అమ్మా, ఏం జరుగుతోంది?

28:45.809 --> 28:46.893
అమ్మా.

28:46.894 --> 28:48.645
నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా?

28:50.355 --> 28:53.400
అమ్మా, ఆపు! కారు ఆపు.

28:59.740 --> 29:00.823
అరేయ్…

29:00.824 --> 29:03.493
ఆ పొట్ట భలే భలే ఉంది. ఇది చాలా బాగుంది.

29:04.786 --> 29:06.871
కోరా. ఏంటిది?

29:06.872 --> 29:10.374
మేము బయటకు వెళ్తున్నాం. నువ్వు సూచించినట్టే
నేను నా డ్రైవ్ బై చేశా, కాబట్టి…

29:10.375 --> 29:12.044
కాదు, ఇదేంటి?

29:12.920 --> 29:14.420
ఇది తెల్లజాతి దద్దమ్మల థీమ్ పార్టీ.

29:14.421 --> 29:15.714
ఆగు, చూడు.

29:16.673 --> 29:18.049
భలే ఉంది, కదా?

29:18.050 --> 29:19.217
జోసీ దీన్ని ఏమంది?

29:19.218 --> 29:21.762
- పెకెర్ వుడ్ పాట్ లక్.
- నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు.

29:22.930 --> 29:25.557
- శాంతించు. సరేనా, మేము వెళ్తున్నాం.
- వెంటనే మార్చుకో.

29:27.100 --> 29:30.561
- అమ్మా, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు.
- నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు.

29:30.562 --> 29:31.646
నా సొంత కూతురా?

29:31.647 --> 29:33.231
ఏం మాట్లాడుతున్నావు?

29:33.232 --> 29:35.942
దీనికి నీతో ఎలాంటి సంబంధం లేదు.
మేము ఇదంతా సరదాగా చేస్తున్నాం.

29:35.943 --> 29:39.904
డబ్బున్న నీ ఫ్రెండ్స్ తో బీదరికాన్ని కాస్ ప్లే వేయడం
సరదా కాదు. ఇది పరమ నీచం.

29:39.905 --> 29:43.658
నువ్వు ఇన్స్టాలో ఫొటోలు పెట్టి నీ ఫ్రెండ్స్ కుళ్ళుకునేలా

29:43.659 --> 29:45.576
చేయడం కోసం వేల డాలర్లు ఖర్చు

29:45.577 --> 29:47.662
- చేయడం కంటే నీచమా?
- సరే. సరే, సారీ.

29:47.663 --> 29:50.081
- కొంచెం నిన్ను చూసుకుని మాట్లాడు, అమ్మా.
- మీరు ఇక వెళ్లొచ్చు. కోరా రాలేదు.

29:50.082 --> 29:51.499
- నేను వెళ్తున్నా. నన్ను వదులు.
- నువ్వు వెళ్ళడానికి లేదు.

29:51.500 --> 29:53.043
నువ్వు స్వార్థంతో నిండిన నకిలీ మనిషివి.

29:55.963 --> 29:58.632
నేను ఏంటో నీకు అస్సలు తెలీదు.

30:31.665 --> 30:33.166
ఎక్కడికి వెళ్ళావు?

30:33.917 --> 30:36.587
ఇవాళ స్టూడియో తెరిచారు. నేను రిహార్స్ చేయడానికి వెళ్ళా.

30:37.421 --> 30:38.589
స్కాట్ ఎక్కడ?

30:41.133 --> 30:42.384
అతను నడకకి వెళ్ళాడు.

30:44.094 --> 30:45.596
అలా ఒక డ్రైవ్ కి వెళదాం పదా.

30:50.684 --> 30:52.560
- నేను వెర్రిదాన్ని అనుకుంటున్నావా?
- కాదు.

30:52.561 --> 30:54.604
- నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా?
- లేదు!

30:54.605 --> 30:56.023
ఆహ్! అమ్మా!

31:03.197 --> 31:05.365
నువ్వేమి బాధితురాలివి కాదు, కాబట్టి నటించకు!

31:08.493 --> 31:11.663
- …పరిచయం మరిచిపోయి
- అమ్మా! ఆపు!

31:12.247 --> 31:14.498
ఇంకెప్పుడూ మనసుకు రాక…

31:14.499 --> 31:16.375
అమ్మా!

31:16.376 --> 31:19.880
పాత పరిచయం లాగ…

31:24.760 --> 31:27.678
- నాన్సీ, ప్లీజ్.
- నాన్సీ, ఆగు. ప్లీజ్.

31:27.679 --> 31:30.098
- ఓహ్, దేవుడా.
- నాన్సీ.

31:30.724 --> 31:33.768
- ఓహ్ దేవుడా, బుజ్జి.
- దేవుడి మీద ఒట్టు, నేను మర్చిపోయా.

31:33.769 --> 31:34.936
నేను ఎక్కడ ఉన్నానని మర్చిపోయా.

31:34.937 --> 31:36.855
- అదేం పర్లేదు. ఏం కాదు.
- నేను ఎవరినో మర్చిపోయా.

31:40.484 --> 31:43.194
- నీకేం కాలేదు. ఏం అవ్వదు.
- అది జరుగుతోంది.

31:43.195 --> 31:44.278
ఏంటి?

31:44.279 --> 31:46.447
అది జరుగుతోంది.
నేను మా అమ్మలాగ మారిపోతున్నాను.

31:46.448 --> 31:48.241
- లేదు. లేదు, లేదు, లేదు.
- లేదు, లేదు, లేదు.

31:48.242 --> 31:49.659
ఎంతైనా అలా ఎప్పటికైనా జరగాల్సిందే.

31:49.660 --> 31:51.744
- నేను చేయగలది ఏం లేదు.
- అలా అనొద్దు.

31:51.745 --> 31:55.748
మీ అమ్మ నిన్ను చంపడానికి ట్రై చేసింది, నాన్సీ.
అది పూర్తిగా వేరే విషయం.

31:55.749 --> 31:56.959
నువ్వు ఆమెలాంటి మనిషివి కాదు.

31:57.543 --> 32:00.837
- నేను ముందెప్పుడూ కోరాని కొట్టలేదు.
- ఇది ఒక పొరపాటు, సరేనా?

32:00.838 --> 32:02.713
- ఇది ఒక పొరపాటు.
- నువ్వు శ్వాస తీసుకోవాలి.

32:02.714 --> 32:05.384
నువ్వు దీన్ని సరిచేయగలవు. కూర్చో.
కానివ్వు. నీకేం కాదు.

32:06.593 --> 32:09.011
అంతే. ఏం కాదు.

32:09.012 --> 32:11.097
- రాబర్ట్ సంగతి ఏంటి?
- అంటే ఏంటి నీ ఉద్దేశం?

32:11.098 --> 32:12.474
అతను ఇప్పటికే నాకు దూరంగా ఉంటున్నాడు.

32:14.852 --> 32:16.727
నేను ఇప్పుడిక వెనక్కి వెళ్ళగలను అనిపించడం లేదు.

32:16.728 --> 32:17.812
నువ్వు వెళ్లాల్సిన పనిలేదు.

32:17.813 --> 32:19.564
- మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.
- లేదు.

32:19.565 --> 32:23.067
అలాగే నువ్వు అక్కడికి వెళ్లినా,
నువ్వు ఒంటరిగా ఉండవు. నీతో మేము ఉంటాం.

32:23.068 --> 32:25.571
నీకు మేము ఉన్నాం, సరేనా? నీకు మేము ఉన్నాం.

32:26.822 --> 32:28.991
ఇది ఒక చిన్న ఆటుపోటు మాత్రమే, సరేనా?
పెద్ద సమస్య కాదు.

32:30.492 --> 32:31.493
ఊపిరి పీల్చుకో.

32:34.705 --> 32:38.791
ఒక కాలేజీ పార్టీలో కలిసిన కొందరు అమ్మాయిలు
చివరికి మనకు ఏకైక ఆధారం అయితే ఇలాగే ఉంటుంది.

32:38.792 --> 32:40.209
నన్ను కాపాడే రక్షకులు.

32:40.210 --> 32:44.173
నాకున్న అన్ని లోపాలను చూసి కూడా నన్ను ప్రేమించేవాళ్ళు.

32:44.673 --> 32:46.049
మనల్ని ప్రేమించనిస్తే.

33:09.531 --> 33:11.782
తను నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది?

33:11.783 --> 33:14.035
నేను తన గతం గురించి అడిగినప్పుడల్లా
తను బిగుసుకుపోతుంది,

33:14.036 --> 33:16.162
తన గతం గురించి మాట్లాడటం ఇష్టం లేదు అంటుంది.

33:16.163 --> 33:17.872
- అవును, అంటే…
- తను నా సొంత తల్లి,

33:17.873 --> 33:19.665
కానీ నాకు తన గురించి ఏమీ తెలీదు.

33:19.666 --> 33:21.251
ఇది నీ పొరపాటు కాదు.

33:22.503 --> 33:23.670
హేయ్.

33:24.421 --> 33:25.671
ఇప్పుడు సరైన సమయం కాదు, నాన్స్.

33:25.672 --> 33:29.218
అదేం పర్లేదు, బంగారం. నేను… సంయమనం కోల్పోయా.

33:29.718 --> 33:31.470
నేను అన్నమాటలు నేను బాధపడుతున్నాను.

33:31.970 --> 33:33.305
బేబీ. ఇలా రా.

33:33.805 --> 33:34.806
ఏంటి?

33:35.891 --> 33:39.269
నాకు, నా కూతురికి మధ్య శాంతి ఏర్పరచడానికి
నాకు నీ సాయం అవసరం లేదు.

33:39.978 --> 33:43.397
నా మాట విను, ఇది గ్లాసుడు పాలు,
ఒక హగ్గుతో సరైపోయే విషయం కాదు.

33:43.398 --> 33:45.358
ఈ విషయం దానికి జీవితకాలం గుర్తుంటుంది.

33:45.359 --> 33:48.069
అందుకే ఇలాంటి సమయంలోనే క్షమాపణలు చెప్పడం ముఖ్యం.

33:48.070 --> 33:49.988
లేదు. నువ్వు దానికి కొంచెం టైమ్ ఇవ్వాలి.

33:50.572 --> 33:52.573
- ఏం జరుగుతోంది?
- దానికి కోపంగా ఉంది.

33:52.574 --> 33:54.826
మన మధ్య ఏం జరుగుతోంది?

33:55.744 --> 33:58.622
అంతా బానే ఉంది అనొద్దు.
అది నిజం కాదని నాకు తెలుసు.

33:59.331 --> 34:01.083
నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావు?

34:02.459 --> 34:03.877
ఇప్పుడు వాదన వద్దు.

34:19.810 --> 34:24.857
నేను నాకు ఎగరగలిగే శక్తి ఉన్నట్టు పగటికలలు కనేదాన్ని.

34:25.774 --> 34:30.611
పైకి, పైకి, పైకి, అలా కొండల మీద నుండి
ఒక కొత్త జీవితంలోకి ఎగురుతున్నట్టు.

34:30.612 --> 34:31.822
హేయ్.

34:32.322 --> 34:33.406
హాయ్.

34:33.407 --> 34:35.492
ఇలా చూడు, ఇవాళ నిన్ను కలవడం చాలా బాగుంది.

34:36.159 --> 34:40.163
అలాగే నేను ఏమనుకుంటున్నా అంటే,
నీకు కాఫీకి గాని లేదా డ్రింక్ కి కలవాలని ఉంటే…

34:42.583 --> 34:43.583
అలా అన్నందుకు సంతోషం.

34:44.710 --> 34:49.297
కానీ నా వల్ల కాదు. నేను… నేను తప్పుడు
ఐడియా వచ్చేలా చేసి ఉంటే క్షమించు.

34:50.757 --> 34:51.757
అవును.

34:53.010 --> 34:54.094
అవును, నువ్వు అదే చేసావు.

35:00.601 --> 35:04.730
కానీ నేను చేతులు ఆడించి ఎలా ఎగరలేనో
అలాగే నా గతం నుండి తప్పించుకోలేను.

35:06.648 --> 35:09.568
నా శరీరం మీద ఉన్న మచ్చల్లాగే
అది కూడా నాతోనే ఉంటుంది.

35:10.402 --> 35:13.322
నేను పూర్తిగా అర్థం చేసుకోలేని
మార్గాలలో నన్ను వెనక్కి లాగుతుంది.

35:19.786 --> 35:21.496
స్కాట్-రీడ్
స్కాట్ రీడ్

35:45.270 --> 35:46.271
హేయ్.

35:46.939 --> 35:48.022
హాయ్.

35:48.023 --> 35:50.400
అది ఇస్తావా? అది జూనిపర్ జాకెట్.

35:51.985 --> 35:53.070
ఇదుగో.

35:54.279 --> 35:57.282
ఉద్యోగ అవకాశం కల్పించినందుకు నీకు
థాంక్స్ చెప్పకపోతే తప్పు అవుతుంది.

35:58.450 --> 36:00.743
మేరీ ఏదో చెప్పింది కాబట్టే
నువ్వు అలా చేసావని నాకు తెలుసు.

36:00.744 --> 36:05.373
అవును. నా భార్య తను అనుకునేంత
పెద్ద గూఢచారి ఏం కాదు.

36:05.374 --> 36:08.251
నేనేం సాయం చేయలేదు.
నువ్వు ప్రొడక్షన్ కి చాలా సాయం చేయగలవు.

36:08.252 --> 36:11.380
నీకు అబద్ధాలు చెప్పడం రాదు.
కానీ కాదు, ఫిల్ నాకు ఉద్యోగం ఆఫర్ చేసాడు.

36:11.922 --> 36:14.298
అలాగే, అతను డేవిడ్ కి ఆఫర్ చేసాడు అనుకుంట.

36:14.299 --> 36:16.592
అతను నన్ను బార్ టెండర్ అనుకున్నాడు ఏమో.

36:16.593 --> 36:20.263
అవును, ఫిల్ అంతే. నేను వాడికి ఎన్నిసార్లు చెప్పినా

36:20.264 --> 36:23.099
- నన్ను ఇంకా లూయిస్ అని పిలుస్తాడు.
- లూయిస్?

36:23.100 --> 36:24.101
ఆ పేరు ఎలా వచ్చింది?

36:24.768 --> 36:27.687
నాకు తెలిసి వాడి బుర్రకి తోచిన
ముసలావిడ పేరు అదొక్కటే అనుకుంట.

36:27.688 --> 36:30.690
- నీ పేరు ముసలావిడ పేరు అనుకుంటున్నావా?
- అవును. అనుకుంటా.

36:30.691 --> 36:35.278
నాకు చనిపోయిన ఒక ఆంటీ పేరు పెట్టారు అనుకుంటుంటా.

36:35.279 --> 36:37.446
ఏమో, నాన్సీ అనే పేరులో నాకైతే పాతదనం ఏం కనిపించడం లేదు.

36:37.447 --> 36:42.911
దానికి… లయ లేకపోయినా,
నృత్యానికి ఉన్న సొగసు ఉంది.

36:44.454 --> 36:45.747
నువ్వొక డాన్సర్ వి కదా?

36:46.373 --> 36:48.041
ఒకప్పుడు. అవును.

36:49.918 --> 36:51.920
ఏమో. నాకు లూయిస్ అనే పేరే నచ్చింది అనుకుంట.

36:55.382 --> 36:57.301
సరే, అయితే నిన్ను బ్యాలేలో కలుస్తా, లూయిస్.

37:05.434 --> 37:06.643
అక్కడ కలుద్దాం, డేవిడ్.

38:40.070 --> 38:42.072
సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్
