WEBVTT

00:10.010 --> 00:11.428
నువ్వు బానే ఉన్నావా?

00:12.221 --> 00:15.724
నేను నిద్ర లేచేసరికి నువ్వు మంచం మీద కనిపించలేదు,
కాబట్టి ఏమైనా జరిగిందేమో అనిపించింది.

00:19.770 --> 00:22.230
ఏం చేస్తున్నావు?
తన వస్తువులు ఎందుకు చూస్తున్నావు?

00:22.231 --> 00:24.399
ఇంత సేపూ నేను నీ పక్కనే ఉన్నాను.

00:25.526 --> 00:27.527
చూడు, అది నువ్వు అనుకునేటట్టు కాదు.

00:27.528 --> 00:30.405
నేను తను నిన్ను బాధపెట్టిందేమో అనుకున్నా.

00:32.073 --> 00:34.158
చూడు, జరిగింది ఏంటో నీకు అర్థం కావడం లేదు.

00:34.159 --> 00:38.079
నీకు ముందే తెలిసినా కూడా నేను తన అక్రమ సంబంధం
గురించి నీకు చెప్పేలా చేసావు.

00:38.080 --> 00:39.580
నా మాట విను, నేను వివరించగలను, సరేనా.

00:39.581 --> 00:41.166
తనని నువ్వే చంపావా?

00:41.834 --> 00:43.000
నాన్సీని నువ్వే చంపావా?

00:43.001 --> 00:46.712
- అలాంటి ప్రశ్న నన్ను ఎలా అడుగుతున్నావు?
- మరి ఇది చూసి నన్ను ఏం అనుకోమంటావు?

00:46.713 --> 00:48.339
నేను ఇంకేం అనుకోవాలి?

00:48.340 --> 00:50.049
ఎలనోర్, నా భార్యని నేను చంపలేదు.

00:50.050 --> 00:51.217
నువ్వు ఏదో చేసావు.

00:51.218 --> 00:53.135
నువ్వు దేనికో క్షమాపణలు అడిగావు.

00:53.136 --> 00:55.388
- తనను ఎందుకు అంతగా భయపెట్టావు?
- అవును, మేము గొడవపడ్డాం.

00:55.389 --> 00:57.181
- నువ్వు తనని కొట్టావా?
- లేదు.

00:57.182 --> 01:00.226
ఓహ్, దేవుడా, మనం పడుకున్నాం.
పగతీర్చుకోవడానికే అలా చేసావా?

01:00.227 --> 01:02.728
నాన్సీ నీకు ద్రోహం చేసింది,
అందుకని బదులుగా ఇలా చేసావా?

01:02.729 --> 01:03.813
లేదు, లేదు.

01:03.814 --> 01:05.815
- ఎందుకు? నాకు అర్థం కావడం లేదు. ఎందుకు…
- ఆపు.

01:05.816 --> 01:06.984
ఆపు.

01:11.738 --> 01:13.031
ఛ.

01:17.494 --> 01:19.037
మేము అప్పుడే ఇంటికి వచ్చాము.

01:20.539 --> 01:22.748
అది అరియాడ్ని ఓపెనింగ్ రాత్రి.

01:22.749 --> 01:24.792
నాన్సీ అప్పుడు షవర్ లో ఉంది అనుకుంట.

01:24.793 --> 01:29.463
తన ఫోన్ ని నైట్ స్టాండ్ దగ్గర ఉంచి వెళ్ళింది,
అది వైబ్రేట్ అవ్వడం మొదలైంది.

01:29.464 --> 01:32.300
నేను సాధారణంగా తన ఫోన్ ని చెక్ చేయను,

01:32.301 --> 01:34.553
కానీ అది ఆగకుండా మోగడంతో నేను చూసా…

01:35.888 --> 01:40.100
ఆమె నగ్నంగా ఉన్న ఒక ఫోటో వచ్చింది.

01:40.601 --> 01:42.894
అప్పుడు నేను ఆ నంబర్ కి కాల్ చేయడానికి ట్రై
చేస్తే అది బ్లాక్ లో ఉందని వచ్చింది.

01:42.895 --> 01:47.315
ఆ తర్వాత నేను తనని నిలదీసినప్పుడు, ఆమె ఒప్పుకుంది.

01:47.316 --> 01:49.108
నాకు చాలా కోపం వచ్చింది.

01:49.109 --> 01:51.027
నేను అరిచాను. వస్తువులు విరగోట్టాను.

01:51.028 --> 01:53.279
నేను స్పందించిన విధానాన్ని తలచుకుంటే నాకే కోపం వస్తోంది.

01:53.280 --> 01:55.072
కానీ నేను తన మీదకి చెయ్ ఎత్తలేదు.

01:55.073 --> 01:58.452
నిజంగా. నాన్సీని బాధపెట్టడానికి బదులు
ముందు నేను ప్రాణాలైనా వదులుకుంటా.

01:59.119 --> 02:00.786
నీకు డేవిడ్ ఎవరో తెలుసా?

02:00.787 --> 02:04.624
లేదు. ఎవరో చెప్పమని నేను తనని బ్రతిమిలాడాను,
కానీ తను ఒప్పుకోలేదు.

02:04.625 --> 02:07.460
తెలుసా, నా సంసారం ఎంత దారుణమైన స్థితికి చేరుకున్నా,

02:07.461 --> 02:09.294
తను ఇంకా నా నుండి రహస్యాలు దాచింది.

02:09.295 --> 02:11.256
అయినంత మాత్రానా నువ్వు అబద్ధం చెప్పడం కరెక్టు కాదు.

02:11.882 --> 02:13.509
తను ఆ రోజు రాత్రి వాడిని కలుస్తాను అంది…

02:14.510 --> 02:15.718
బంధం తెంచుకుంటా అని చెప్పింది.

02:15.719 --> 02:17.970
తనతో పాటు నిన్ను కూడా రమ్మని అడిగిందా?

02:17.971 --> 02:21.766
లేదు, తను ఒక్కత్తే వెళ్లి మేనేజ్ చేస్తాను అని చెప్పింది,
కాబట్టి నేను…

02:21.767 --> 02:22.850
తనని పోనిచ్చా.

02:22.851 --> 02:24.352
అందుకే నేను నీకు అబద్ధం చెప్పా.

02:24.353 --> 02:30.691
తన అక్రమ సంబంధం గురించి తెలిసి కూడా నేను ఏం
చేయలేదని నీకో, పోలీసులకో నేను చెప్పలేను కదా.

02:30.692 --> 02:33.319
దానికి బదులు నేనే నేరస్థుడిని అని లొంగిపోవడం మేలు.

02:33.320 --> 02:34.403
ఎవరూ నా మాటలు నమ్మరు.

02:34.404 --> 02:36.197
కానీ తనని కాపాడటానికి నేను ఏదోకటి

02:36.198 --> 02:38.241
చేయగలిగినా ఏం చేయలేదని తెలుసుకోవడం,

02:38.242 --> 02:41.161
చాలా బాధగా ఉంది

02:42.454 --> 02:43.789
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?

02:54.591 --> 02:57.177
పోలీసులు ఈ జర్నల్ ని చూశారా?

02:59.513 --> 03:01.890
వాళ్ళు అది పెద్దగా పనికి రాదని చెప్పి తిరిగి ఇచ్చేసారు.

03:03.600 --> 03:07.104
అందులో గూడార్థాలతో నిండిన పద్యాలు,
వింత బొమ్మలు ఉన్నాయి.

03:08.272 --> 03:10.983
లెటర్ ని నువ్వు ఏం చేస్తావు?

03:12.526 --> 03:14.152
ఏమో తెలీదు.

03:16.530 --> 03:17.613
నేను వెళ్ళాలి.

03:17.614 --> 03:20.324
- ఆగు. ఎక్కడికి? ఎందుకు?
- నాకు ఆఫీసులో ఒక అవార్డు కార్యక్రమం ఉంది.

03:20.325 --> 03:22.618
- కానీ మనం కలిసి వచ్చాము కదా.
- నేను క్యాబ్ ని పిలుస్తా.

03:22.619 --> 03:24.705
- వెళ్లొద్దు. ప్లీజ్.
- రాబర్ట్.

03:26.456 --> 03:27.540
మనం చేసిన పని…

03:27.541 --> 03:29.458
అవును. మనం హద్దులు మీరాము.

03:29.459 --> 03:31.752
లేదు. మనం హద్దులు మీరడం కాదు.

03:31.753 --> 03:33.796
అసలు హద్దే లేకుండా చేసాం.

03:33.797 --> 03:36.049
ఇప్పుడిక హద్దు అంటూ ఏదీ లేదు.

03:36.884 --> 03:38.509
మనం ఇది కావాలని చేసింది కాదు కదా.

03:38.510 --> 03:41.013
ఏదో అలా జరిగిపోయింది.

03:43.849 --> 03:45.517
నేను చెడ్డవాడిని అనుకుంటున్నావా?

03:46.685 --> 03:48.269
లేదు, అలా ఏం లేదు.

03:48.270 --> 03:51.607
నువ్వు కూడా నన్ను నమ్మకపోతే, ఇంకెవరు నమ్ముతారు?

03:52.316 --> 03:53.692
నాకు చాలా గుణాలు ఉండి ఉండొచ్చు.

03:55.611 --> 03:57.196
కానీ నేను రాక్షసుడిని కాదు.

04:43.242 --> 04:45.160
అరమింట హల్ వ్రాసిన పుస్తకం
ఆధారంగా రూపొందించబడింది

05:28.036 --> 05:32.206
కోరా
మళ్ళీ ఏడుస్తూ నిద్రలేచాను.

05:32.207 --> 05:36.294
నా జుట్టు కత్తిరించేసుకుందాం అనిపించింది.

05:36.295 --> 05:41.716
ఎలనోర్ - దీర్ఘంగా శ్వాస తీసుకో.
కత్తెర క్రింద పెట్టు.

05:41.717 --> 05:44.218
నువ్వు తట్టుకోగలవు, కోరా.

05:44.219 --> 05:45.303
కోరా
థాంక్స్.

05:45.304 --> 05:47.431
నువ్వు లేకపోయి ఉంటే నేను తట్టుకోగలిగే దాన్ని కాదు.

05:49.266 --> 05:52.519
ఎలనోర్ కోసం డ్రిప్ కాఫీ ఇంకా వైట్ చాక్లెట్ మొక.

05:53.061 --> 05:54.062
నేనే. అది నాకే.

05:54.771 --> 05:55.855
థాంక్స్.

05:55.856 --> 06:00.026
పాసడీన పోలీసులు నాన్సీ హెనెస్సీ అనబడే స్థానిక మహిళ

06:00.027 --> 06:04.447
హత్యపై జరుగుతున్న విచారణకు సంబంధించి
ఏదైనా తెలిస్తే తెలియజేయమని పబ్లిక్ సహాయం కోరుతూ

06:04.448 --> 06:07.783
ఒక టిప్ లైన్ ని సెటప్ చేశారు.

06:07.784 --> 06:09.952
- ఆమె శరీరం ఏప్రిల్ తొమ్మిదిన…
- ఇది చాలా దారుణం.

06:09.953 --> 06:12.163
మళ్ళీ లేసి పీటర్సన్ కేసులాగే ఉంది.

06:12.164 --> 06:14.582
- ఇది ఆమె భర్త పనే అనుకుంటావా?
- ఖచ్చితంగా

06:14.583 --> 06:16.959
- దగ్గరి వారే అని మాత్రం చెప్పగలను.
- పోలీసులు అందరినీ

06:16.960 --> 06:19.545
- జాగ్రత్తగా ఉండమంటున్నారు.
- రాబర్ట్ తో వేగడం కష్టమే.

06:19.546 --> 06:21.631
ఇది పనికిరాదు అన్నాడు అంటే నమ్మలేకపోతున్నా.

06:21.632 --> 06:24.050
అంటే, ఒకసారి ఇది చూడు.

06:24.051 --> 06:25.176
ఇది ఒక గిఫ్ట్.

06:25.177 --> 06:29.472
మన ఫ్రెండ్ ఊహించిన అందమైన ప్రపంచాన్ని
ఇందులో చూడొచ్చు.

06:29.473 --> 06:31.015
అది సాయపడలేదు.

06:31.016 --> 06:32.309
ఏది సాయపడలేదు?

06:32.893 --> 06:35.019
పుస్తకం సాయపడలేదు, పనికిరాకపోవడం కాదు.

06:35.020 --> 06:37.605
అలాగే అలా అన్నది రాబర్ట్ కాదు, పోలీసులు అన్నారు.

06:37.606 --> 06:38.899
సరే.

06:39.775 --> 06:43.319
తెలుసా, డవీడ్ అన్నాడు కదా,
ఆ మాటలు నిజమేనేమో అని నాకు చాలా భయంగా ఉంది.

06:43.320 --> 06:45.905
తన గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాం అని.

06:45.906 --> 06:47.782
ఈ జ్ఞాపకాలను చూడు.

06:47.783 --> 06:49.243
ఎల్లి,

06:49.952 --> 06:51.537
తను మన మనిషి.

06:52.579 --> 06:57.668
మన నుండి కూడా రహస్యాలు ఉంచాలని
తను ఎందుకు అనుకుందో నాకు తెలీడం లేదు.

07:00.629 --> 07:02.339
ఇది కొన్ని రోజులు నేను ఉంచుకోవచ్చా?

07:03.131 --> 07:04.800
లేదు, అంటే అది…

07:05.300 --> 07:06.759
ఇవ్వడానికి అది నాది కాదు.

07:06.760 --> 07:07.761
అది తనది.

07:14.935 --> 07:16.686
నేను ఆఫీస్ కి వెళ్ళాలి.

07:16.687 --> 07:20.690
కానీ రాత్రి అవార్డు కార్యక్రమంలో నువ్వు ఇంకా
హోవర్డ్ నా టేబుల్ దగ్గర ఉండేలా ఏర్పాటు చేశా.

07:20.691 --> 07:24.110
- నేను ఒక్కదాన్నే రాబోతున్నాను.
- సరే. మనిద్దరికీ తాగడానికి ఇంకొంచెం ఉంటుంది.

07:24.111 --> 07:26.279
- అవును.
- సరే. అక్కడ కలుద్దాం.

07:26.280 --> 07:27.656
నిన్ను తర్వాత కలుస్తా.

07:41.378 --> 07:44.256
రాబర్ట్
మనం కొంచెం మాట్లాడుకోవచ్చా?

07:51.889 --> 07:53.306
- ఎల్లి.
- ఏంటి?

07:53.307 --> 07:54.765
- నేను… సారీ.
- హేయ్.

07:54.766 --> 07:56.309
లేదు, లేదు. అదేం పర్లేదు. అదేం పర్లేదు.

07:56.310 --> 07:58.686
నువ్వు చాలా బాగా పని చేస్తున్నావని విన్నాను.

07:58.687 --> 08:00.938
అంటే నేను చేసేదల్లా పేపర్లకి పిన్నులు కొట్టడమే,

08:00.939 --> 08:03.357
కానీ షాప్ లో సామాన్లు కవర్ లో పెట్టడం కంటే ఇదే మేలు.

08:03.358 --> 08:05.151
సామాన్లు కవర్లో పెట్టడం తక్కువ పనేం కాదు.

08:05.152 --> 08:06.485
ఆ పని నువ్వు చేయలేదు కాబట్టి అలా అంటావు.

08:06.486 --> 08:07.821
అది నీకెలా తెలుసు?

08:09.948 --> 08:12.325
- హేయ్, నా పేపర్ వర్క్ మీద సంతకం చేస్తావా?
- సరే.

08:12.326 --> 08:14.827
నా కేస్ వర్కర్ కి నా సూపర్ వైజర్ సంతకం కావాలి.

08:14.828 --> 08:17.998
తప్పకుండా. మీ అమ్మా నాన్నల మధ్య
అంతా బానే ఉందా?

08:18.707 --> 08:20.334
- అవును. అనుకుంట.
- అవునా?

08:21.084 --> 08:23.295
ఏమో, నేను పెద్దగా వాళ్లతో కల్పించుకోను.

08:23.795 --> 08:26.088
ఎందుకు? ఏం జరిగిందో మా అమ్మకి చెప్పావా?

08:26.089 --> 08:28.049
- ఎందుకంటే, తనకి తెలిసిందంటే మాత్రం…
- లేదు. లేదు, మార్కస్,

08:28.050 --> 08:29.800
నేను ఏం చెప్పలేదు. చెప్పను కూడా.

08:29.801 --> 08:31.302
మనం ఒక మాట అనుకున్నాం, కదా?

08:31.303 --> 08:33.803
కానీ నువ్వు ఆ రోజు రాత్రి జరిగింది మర్చిపోవాలి.

08:33.804 --> 08:35.807
దాన్ని నీ బుర్రలో నుండి తీసేయడానికి ట్రై చెయ్.

08:36.308 --> 08:37.392
సరే.

08:43.440 --> 08:45.817
చాలు! చాలు!

08:47.069 --> 08:49.862
చాలు. దయచేసి ఆపండి, ఆపండి.

08:49.863 --> 08:52.823
ప్లీజ్, నాకు ఇలా చేస్తే ఏం చెప్పాలో తెలీదని మీకు తెలుసు.

08:52.824 --> 08:59.080
చూడండి, ఈ గుర్తింపు మీరంతా కలిసి
చేసిన కష్టానికి ప్రతీక మాత్రమే, సరేనా?

08:59.081 --> 09:02.208
కాబట్టి, మీరు వేడుక జరుపుకోవాలి అనుకుంటే,
మీకోసం జరుపుకోండి.

09:02.209 --> 09:03.210
సరే.

09:05.170 --> 09:06.672
నాకు ఒక క్షణం ఇవ్వు.

09:07.256 --> 09:08.381
నువ్వు లేట్ గా వచ్చావు.

09:08.382 --> 09:10.466
- ఇది నా ఐడియా కాదు.
- నీకు ఇది నచ్చదని నాకు తెలుసు,

09:10.467 --> 09:12.635
- కానీ ఇది మన సంస్థకి మంచిది.
- నువ్వు ఎలా అంటే అలాగే.

09:12.636 --> 09:15.555
- హాయ్.
- ఎలనోర్, ఇది ఆండ్రూ.

09:15.556 --> 09:17.974
ఇతను లెగసీ మ్యాగజిన్ నుండి వచ్చాడు.
ఆండ్రూ, ఈమె ఎలనోర్ బుషే.

09:17.975 --> 09:20.226
- మిస్ బుషే, మిమ్మల్ని కలవడం సంతోషం.
- అదేం లేదు, నాకే చాలా సంతోషం.

09:20.227 --> 09:21.894
మీకు ఇబ్బంది లేకపోతే, నేను ఆఫీస్ లో మీ స్టాఫ్ తో

09:21.895 --> 09:24.939
కలిపి మీ ఫోటోలు కొన్ని తీద్దాం అనుకుంటున్నాను.

09:24.940 --> 09:26.566
సరే. మీరే చూపించండి.

09:26.567 --> 09:27.733
మంచిది.

09:27.734 --> 09:29.527
- ఇక్కడ ఉన్న కెమెరా దగ్గరకి రండి.
- సరే.

09:29.528 --> 09:31.196
ఆ తర్వాత కిటికీ బయటకు చూస్తూ ఒకటి తీద్దాం.

09:40.831 --> 09:43.499
- హేయ్.
- వారాంతం అంతా నీ నుండి ఒక్క మెసేజ్ కూడా లేదు.

09:43.500 --> 09:45.168
మనం కలుద్దాం అనుకున్నాం కదా.

09:45.169 --> 09:47.295
అవును, నేను ఒక పుట్టినరోజు పార్టీ పనిలో బిజీగా ఉన్నా.

09:47.296 --> 09:50.465
చూడు, ఎల్,
నీ సాకులు విని నాకు చిరాకు పుడుతోంది.

09:51.216 --> 09:53.051
నేను నీకు కావాలో వద్దో క్లియర్ గా చెప్పేయ్.

09:54.094 --> 09:55.344
నిజంగా?

09:55.345 --> 09:56.596
నువ్వు జోక్ చేస్తున్నావా?

09:56.597 --> 09:57.930
వేరే రోజు లేదన్నట్టు ఇవాళే అడుగుతున్నావు.

09:57.931 --> 10:00.057
ఇవాళ ఆఫీస్ కి ఒక జర్నలిస్టు వచ్చాడు.

10:00.058 --> 10:01.935
నువ్వు నాకు వేరే అవకాశం ఇవ్వడం లేదు మరి.

10:04.062 --> 10:06.439
- మనం కలవడం మానేస్తే బాగుంటుంది.
- అంటే ఏంటి నీ ఉద్దేశం?

10:06.440 --> 10:08.775
మనం ఇక నుండి ఒకరితో ఒకరం ప్రొఫెషనల్ గానే
నడుచుకుంటే మంచిది.

10:09.776 --> 10:10.777
ఇందులో నా అభిప్రాయం అవసరం లేదా?

10:12.446 --> 10:13.864
లేదు.

10:17.117 --> 10:19.327
ఇక్కడ నా ఆఫీస్ ఉంది. నన్ను ఎక్కడ ఉండమంటారు?

10:19.328 --> 10:22.163
సరే, మీ కుర్చిలో ఉన్నా చాలు.

10:22.164 --> 10:23.165
సరే.

10:23.749 --> 10:25.875
మీ ఫ్రెండ్ గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను.

10:25.876 --> 10:27.710
అది చాలా దారుణం.

10:27.711 --> 10:30.047
అందుకు కారణమైనవారిని పోలీసులు పట్టుకోవాలని ఆశిస్తున్నా.

10:31.089 --> 10:33.049
క్షమించండి. మీరు ఆమె స్నేహితురాలు కదా?

10:33.050 --> 10:34.884
నాన్సీ హెనెస్సీ? నేను…

10:34.885 --> 10:37.845
క్షమించండి, నేను మీరు ఒకరికి
ఒకరు తెలుసు అనుకున్నా…

10:37.846 --> 10:39.388
లేదు, మేము స్నేహితులమే. నేను… అంటే…

10:39.389 --> 10:42.433
మీరు ఇక్కడికి వచ్చిన విషయం
మీద దృష్టి పెడితే చాలా సంతోషిస్తా.

10:42.434 --> 10:44.269
సరే, అలాగే. తప్పకుండా.

10:46.688 --> 10:48.272
మనం 2012 గురించి మాట్లాడుకుందాం.

10:48.273 --> 10:49.607
మీరు దీన్ని 2012లో స్థాపించారు.

10:49.608 --> 10:51.400
ఆ ఏడాది ఏం జరిగిందో చెప్పండి.

10:51.401 --> 10:55.112
లెగసీ మ్యాగజిన్ వారి 2026 గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్

10:55.113 --> 11:01.245
అవార్డు గ్రహిత, ఎలనోర్ బుషేని
పురస్కరించడంలో నాతో కలిసి రండి.

11:08.836 --> 11:10.253
థాంక్స్.

11:10.254 --> 11:11.838
- ఇది మీదే.
- వావ్.

11:11.839 --> 11:14.049
- కొంచెం దీన్ని పట్టుకుంటారా?
- సరే, తప్పకుండా.

11:15.467 --> 11:17.426
థాంక్స్. అందరికీ చాలా థాంక్స్.

11:17.427 --> 11:19.762
లెగసీ మ్యాగజిన్ కి థాంక్స్.

11:19.763 --> 11:21.806
ఇది నేను మర్చిపోలేను. నేను…

11:21.807 --> 11:24.433
నేను హీరోలుగా కొలిచే వారితో ఇక్కడ నిలబడుతున్నాను,

11:24.434 --> 11:28.020
కారణంగా ఈ అనుభవం నాకు మరింత మధురమైందిగా నిలిచిపోతుంది.

11:28.021 --> 11:33.776
అవసరానికి తగిన విధంగా మీలో చాలా మంది పడే

11:33.777 --> 11:36.154
కష్టాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది.

11:36.989 --> 11:42.410
కొన్నిసార్లు ఈ పని చేయడానికి నేను సరైన మనిషినేనా
కాదా అని అనుమానం వస్తుంటుంది.

11:42.411 --> 11:43.745
నేను లోపాలు లేని దాన్ని కాదు.

11:44.621 --> 11:46.331
నిజానికి మనం ఎవరం లోపం లేనోళ్లమి కాదు.

11:47.499 --> 11:49.000
కానీ మనకు మనసు ఉంది, కదా?

11:49.001 --> 11:51.711
ప్రయత్నించడానికి మనసు ఉంది.

11:51.712 --> 11:52.837
నిలబడటానికి.

11:52.838 --> 11:57.008
నేనొక ఫ్రాడ్ ని, నేనొక రాక్షసిని అని
నాకు అనిపించినా సరే నిలబడటానికి.

11:57.009 --> 12:03.639
ఒక మంచి విషయం కోసం నన్ను నేను
ఇచ్చుకోవడానికి నాకు మనసు ఉంది.

12:03.640 --> 12:04.641
మరింత…

12:05.684 --> 12:07.311
మరింత మంచి చేయడానికి.

12:08.020 --> 12:12.607
అలాగే నాకు తెలిసి మనం అందరం
ఇక్కడికి వచ్చింది అందుకే, అవునా?

12:12.608 --> 12:16.068
ఎందుకంటే మనం అందరం ఎదుటోళ్లకు
మంచి చేయాలి అనుకునేవారిమే.

12:16.069 --> 12:18.154
కాబట్టి, థాంక్స్. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు.

12:18.155 --> 12:20.656
మీతో ఇలా, మనం అందరం కలిసి
ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

12:20.657 --> 12:21.867
థాంక్స్.

12:30.334 --> 12:31.335
బై.

12:33.754 --> 12:35.796
నువ్వు ఉండాల్సిన అవసరం లేదు.

12:35.797 --> 12:37.715
పిల్లల్ని మార్కస్ చూసుకుంటున్నాడు.
నేను అర్జంటుగా ఇంటికి వెళ్లనక్కరలేదు.

12:37.716 --> 12:39.134
ఇది నాకు ఒకటి ఇస్తావా?

12:40.344 --> 12:41.636
నాన్సీ నోట్ బుక్ లో నేను కనిపెట్టింది

12:41.637 --> 12:43.554
- ఒకటి చూపించాలి అనుకుంటున్నా.
- వద్దు, మేర్.

12:43.555 --> 12:45.933
- ప్లీజ్. ఎల్లి, ఒకసారి చూడు.
- ఇది సరైన చోటు కాదు.

12:46.725 --> 12:48.017
వీడిని చూడు.

12:48.018 --> 12:50.019
వీడి కళ్ళను చూడు,
ఆమె వాటిని గీసిన విధానం చూడు.

12:50.020 --> 12:53.689
కలలోకి వచ్చేలా ఉంది.
ఇది ఖచ్చితంగా ఆమెను బాగా భయపెట్టిన వ్యక్తే.

12:53.690 --> 12:58.612
అలాగే నాకు తెలిసి నాన్సీని అంతగా
భయపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి స్కాట్ మాత్రమే.

12:59.613 --> 13:00.614
ఏంటి?

13:01.532 --> 13:04.158
వీడు చర్చిలో కనిపించిన వ్యక్తిలా ఉన్నాడు.

13:04.159 --> 13:05.701
అంత్యక్రియల సమయంలో.

13:05.702 --> 13:07.578
ఎల్లి, మనం ఇది పోలీసులకు చెప్పాలి.

13:07.579 --> 13:09.789
- లేదు. లేదు. వెళ్లి ఏమని చెప్పాలి?
- అవును.

13:09.790 --> 13:12.875
నాన్సీ సవితి తండ్రి అయ్యుండే అవకాశం ఉన్న
ఒకడి బొమ్మ ఉంది,

13:12.876 --> 13:14.627
అతను అంత్యక్రియలకు వచ్చి ఉండొచ్చు అంటావా?

13:14.628 --> 13:15.795
కనీసం ఏదోకటి చెప్పినట్టు ఉంటుంది కదా.

13:15.796 --> 13:17.713
లేదంటే మనం ఏం చేయలేము, ఎల్లి.

13:17.714 --> 13:19.006
మనం చేయడానికి ఏం లేదు.

13:19.007 --> 13:20.466
ఇక్కడ ఉన్నావా, అతిముఖ్యమైన పిల్ల.

13:20.467 --> 13:22.009
- హేయ్.
- నేను మీ ముచ్చట్లు చెడగొట్టలేదు కదా.

13:22.010 --> 13:23.344
డొనోవన్, హాయ్!

13:23.345 --> 13:24.428
నువ్వు చాలా అందంగా ఉన్నావు.

13:24.429 --> 13:27.974
మావాడు హోవర్డ్ కి ఇంత అందంతో ఏం
చేయాలో తోచడం లేదని నా నమ్మకం. అమ్మో.

13:27.975 --> 13:29.517
నువ్విలా ఆటపట్టించడం ఆపుతావా?

13:29.518 --> 13:31.769
- నా వల్ల కాదు.
- అమాండా ఎలా ఉంది?

13:31.770 --> 13:32.896
నేను ఇచ్చే భరణాన్ని ఎంజాయ్ చేస్తోంది.

13:33.689 --> 13:34.939
అయ్యయ్యో.

13:34.940 --> 13:36.148
అదేం లేదు.

13:36.149 --> 13:37.651
నేను ఈ ఫోన్ మాట్లాడాలి.

13:38.277 --> 13:39.861
నువ్వు చాలా గర్వపడాల్సిన సమయం ఇది.

13:39.862 --> 13:41.822
నీ చెల్లి ఒక రాక్ స్టార్.

13:42.990 --> 13:44.741
దీనికి ఇదంతా పుట్టుకతోనే అబ్బింది.

13:45.784 --> 13:47.244
ఇన్విటేషన్ లో ఆరు గంటలకి అని చెప్పాం.

13:47.870 --> 13:49.121
నా మీటింగ్స్ ఎక్కువసేపు నడిచాయి.

13:51.748 --> 13:53.000
ఇది బాగుంది.

13:53.584 --> 13:55.918
స్పీచ్ ఇచ్చావా? ఏడ్చావా? మేరీ ఏడ్చిందా?

13:55.919 --> 13:57.170
మీరిద్దరూ ఏడ్చారు, అవునా?

13:57.171 --> 13:59.173
నువ్వు ఎంత చిరాకు తెప్పిస్తావో తెలుసా?

14:00.799 --> 14:02.091
అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా?

14:02.092 --> 14:05.887
ఓహ్, అవును. నన్ను మెచ్చుకుంటూ క్లుప్తంగా ఒక
చక్కని మెసేజ్ వచ్చింది.

14:05.888 --> 14:08.931
అది ఆమె ప్రేమను వివరించడానికి సరిగ్గా సరిపోతుంది.

14:08.932 --> 14:11.268
చక్కగా క్లుప్తంగా.

14:14.521 --> 14:15.647
అసలు నీకు ఏమైంది?

14:16.273 --> 14:20.234
ఇంత పెద్ద అవార్డు గెలిచినా కూడా
నీలో నాకు ఆ సంతోషం కనిపించడం లేదు.

14:20.235 --> 14:22.196
నువ్వు నీ జీవితంలో చేసిన అత్యంత దారుణమైన పని ఏంటి?

14:26.909 --> 14:29.660
వావ్. నేను ఇలా అంటావని అనుకోలేదు.

14:29.661 --> 14:30.913
- షాంపేన్?
- థాంక్స్.

14:33.040 --> 14:35.791
సరే, ఇవాళ అందరూ నేను చాలా గొప్పదాన్ని అంటున్నారు.

14:35.792 --> 14:38.462
ఎంతో ధైర్యం ఉన్నదాన్ని ఇంకా త్యాగశీలిని అని…

14:39.713 --> 14:42.048
నాకు మాత్రం వాళ్ళు వేరే ఎవరి గురించో
మాట్లాడుతున్నట్టే ఉంది.

14:42.049 --> 14:44.884
నువ్వు మరీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు అనుకుంట.

14:44.885 --> 14:49.180
అసలు, ఆలోచించు, ఈ.
నువ్వు మంచోళ్ళకే మంచిదానివి.

14:49.181 --> 14:50.264
నీ జీవితమంతా అలాగే బ్రతికావు.

14:50.265 --> 14:51.474
ఇప్పుడు నీ స్థాయి ఎలా ఉందో చూసుకో.

14:51.475 --> 14:53.227
ఏం మాట్లాడుతున్నావు?

14:55.395 --> 14:57.647
ఆగు, నువ్వు ఇలా వెళ్లిపోకూడదు. నేను ఇప్పుడే వచ్చా.

14:57.648 --> 14:59.525
నీ ఇన్విటేషన్ లో ఆరు గంటలకి రమ్మని చెప్పా.

15:00.442 --> 15:01.652
నువ్వు బానే ఉన్నావా?

15:02.653 --> 15:03.737
ఏమైనా జరిగిందా?

15:05.697 --> 15:09.075
లేదు. నేను బానే ఉన్నా.

15:09.076 --> 15:10.660
చెప్పాలంటే చాలా బాగున్నా, నేను…

15:10.661 --> 15:12.829
నేను గొప్పదాన్ని కదా?

15:18.752 --> 15:19.962
నీకు రేపు కాల్ చేస్తా.

15:31.348 --> 15:32.516
హేయ్, నేనే.

15:33.267 --> 15:34.517
నువ్వు ఫోన్ ఎట్టకపోవడంలో తప్పు లేదు.

15:34.518 --> 15:37.687
ఉమ్, నిన్న రాత్రి అంత జరిగాక,
నేను కూడా నాలాంటోడితో మాట్లాడాలి అనుకోను.

15:37.688 --> 15:41.441
కానీ, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే,
నాకు నీతో మాత్రమే మాట్లాడాలని ఉంది.

15:42.025 --> 15:44.862
అబద్ధం చెప్పినందుకు క్షమించు,
అలాగే నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నా.

15:46.905 --> 15:49.616
నాన్సీ నా నుండి రహస్యాలు దాచిందని
చాలా కోపపడ్డాను, అలాగే…

15:50.909 --> 15:53.161
ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నా.

15:53.662 --> 16:00.002
నీకు నిజం చెప్పనందుకు నాకు బాధగానే ఉంది, కానీ
మన మధ్య జరిగినదానికి నాకు అస్సలు బాధగా లేదు.

16:01.128 --> 16:07.176
నాన్సీ చనిపోయినప్పటి నుండి నిన్న రాత్రి మాత్రమే
నేను మొదటిసారిగా బాధకు బదులు వేరే అనుభూతిని పొందాను.

16:08.177 --> 16:09.553
నీకు కూడా అలాగే అనిపించిందని నాకు తెలుసు.

16:30.991 --> 16:32.284
నేను ఇంటికి బయలుదేరా…

16:34.203 --> 16:35.537
కానీ డ్రైవ్ చేసుకుంటూ ఇలా వచ్చేసా.

17:54.199 --> 17:56.200
నువ్వు మళ్ళీ ఎప్పుడైనా మీ నాన్న బోట్ మీదకి వెళ్ళావా?

17:56.201 --> 17:58.579
లేదు, చాలా ఏళ్ళు అవుతోంది.

17:59.329 --> 18:01.289
ఇప్పుడు అది డొనోవన్ దగ్గర ఉంది.

18:01.290 --> 18:02.457
అది చాలా దారుణం.

18:03.292 --> 18:04.459
అది చాలా అందంగా ఉంటుంది.

18:05.794 --> 18:07.129
డొనోవన్.

18:16.013 --> 18:18.598
నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు నీటి క్రింద ఊపిరి బిగబట్టే

18:18.599 --> 18:20.057
పోటీలో గెలిచానని చెప్పానా?

18:20.058 --> 18:21.059
లేదు.

18:21.602 --> 18:23.352
భలే గొప్ప విషయమే.

18:23.353 --> 18:26.272
నిజంగానే గొప్ప విషయం. రెండు నిమిషాల నలభై ఏడు సెకన్లు.

18:26.273 --> 18:27.356
- వావ్.
- అవును.

18:27.357 --> 18:28.692
నాకు సవాలు విసురుతున్నావా?

18:29.943 --> 18:30.944
ట్రూత్ ఆర్ డేర్?

18:31.528 --> 18:32.778
మన వయసు ఎంత?

18:32.779 --> 18:33.780
ట్రూత్ ఆర్ డేర్?

18:36.158 --> 18:38.242
- నిజం.
- నీ సమాధానం తప్పు.

18:38.243 --> 18:40.078
- వద్దు, వద్దు. వద్దు, వద్దు!
- ఊరుకో.

18:43.207 --> 18:44.790
- క్షమించు.
- నువ్వు ఉత్తినే అంటున్నావు.

18:44.791 --> 18:45.917
నీకు కాస్త ప్రోత్సాహం కావాలి అంతే.

18:45.918 --> 18:47.961
- అవునా? ఇలాగా?
- నీకు కొంచెం…

18:51.381 --> 18:52.382
నాన్నా?

18:55.969 --> 18:58.514
ఎల్లి? ఏం జరుగుతోంది?

19:01.600 --> 19:03.936
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
నువ్వు స్కూల్ లో ఉండి ఉండాలి కదా.

19:05.187 --> 19:06.479
మేము కొంచెం ముందు వచ్చేసాం.

19:06.480 --> 19:08.815
బాధలో ఉంది కాబట్టి డ్రైవ్ కి
వెళితే బాగుంటుందని నేనే అన్నాను.

19:09.525 --> 19:10.526
అది మందా?

19:11.109 --> 19:12.194
అంత బలమైంది కాదు.

19:12.819 --> 19:14.362
నువ్వు మా నాన్నతో పడుకుంటున్నావా?

19:14.363 --> 19:16.156
కోరా. కాదు, అది…

19:16.698 --> 19:19.575
ఇది అలా ఏం కాదు. ఎలనోర్ మీ అమ్మ వస్తువులు
సర్దడంలో సాయం చేయడానికి వచ్చింది.

19:19.576 --> 19:20.952
ఆ పని నిన్నే చేశారు కదా.

19:20.953 --> 19:24.247
అవును, కానీ అప్పుడు నాకు చాలా బాధ వేసింది.

19:24.248 --> 19:28.835
ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి,
అందుకని ఎలనోర్ ని ఇక్కడే ఉండమని అడిగాను.

19:28.836 --> 19:30.254
మా మధ్య ఏం నడవడం లేదు.

19:31.004 --> 19:32.505
ఏం లేదు, ఏం లేదు.

19:32.506 --> 19:35.508
అలాగే ఇవాళ కూడా మేము బాక్సులు సర్దాము,

19:35.509 --> 19:38.594
మళ్ళీ నాకు చాలా బాధగా అనిపించింది.

19:38.595 --> 19:40.471
మేము కాస్త విరామం తీసుకోవాలి అనుకున్నాం, సరేనా?

19:40.472 --> 19:43.058
మేము… మేము నీ అమ్మని చాలా మిస్ అవుతున్నాం.

19:43.559 --> 19:45.268
అయినంత మాత్రానా ఇలా చేయకూడదు.

19:45.269 --> 19:47.896
మేము పెద్దవాళ్ళం, కాబట్టి కొంచెం పెద్దోళ్లలాగ నడుచుకోవాలి.

19:49.022 --> 19:52.901
కోరా, నన్ను క్షమించు. ఇలా చేయడం తప్పే.

19:55.195 --> 19:58.614
కానీ స్కూల్ మానేసి రావడం కూడా తప్పే. సరేనా?

19:58.615 --> 19:59.824
మీరు రాత్రికి ఇక్కడ ఉండొచ్చు,

19:59.825 --> 20:02.703
కానీ రేపు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళాలి. సరేనా?

20:14.131 --> 20:15.424
ఓహ్, దేవుడా.

20:16.008 --> 20:18.092
- దానికి నా మీద చాలా కోపంగా ఉంది.
- లేదు, అదేం కాదు.

20:18.093 --> 20:20.637
అవును, దాని చూపు చూసావా?

20:21.430 --> 20:23.056
నేను ఇంతవరకు ఎప్పుడూ తనకి అబద్ధం చెప్పలేదు.

20:23.849 --> 20:25.725
తను మన మాటలు నమ్మిందని నాకు అనిపించడం లేదు.

20:25.726 --> 20:27.476
లేదు, అదేం పర్లేదు.

20:27.477 --> 20:28.604
అది హెనెస్సీ కుటుంబికురాలు.

20:29.188 --> 20:30.271
అంటే ఏంటి అర్థం?

20:30.272 --> 20:32.023
మా కుటుంబంలో మేము ప్రశ్నించం.

20:32.024 --> 20:35.818
కళ్ళ ముందు ఎలాంటి ఆధారం ఉన్నా
చెప్పింది చెప్పినట్టు వినడమే.

20:35.819 --> 20:37.279
ఆ గుణం దాని రక్తంలో ఉంది.

20:38.989 --> 20:40.949
అది పూర్తిగా హెనెస్సీ కాదు.

20:42.993 --> 20:44.786
దానిలో నాన్సీ రక్తం కూడా ఉంది.

20:46.997 --> 20:47.998
అవును.

20:50.167 --> 20:51.668
చాలా ప్రమాదకరంగా అనిపించింది.

20:52.169 --> 20:54.004
అలా దొరికిపోవడం.

20:56.673 --> 20:58.342
మనం ఇది ఆపేయాలి అనుకుంటున్నావా?

21:01.887 --> 21:03.972
నీకు ఆపేయాలని ఉందా?

21:07.351 --> 21:08.352
లేదు.

22:02.364 --> 22:04.073
అందరికీ గుడ్ మార్నింగ్.

22:04.074 --> 22:06.368
నిన్న రాత్రి అందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నా,

22:07.202 --> 22:11.290
అలాగే అందరూ తాగిన మత్తు దిగేంతవరకు పడుకుని ఉంటారని
కూడా ఆశిస్తున్నా.

22:12.040 --> 22:13.208
మేమేం అనుకోము, రోరి.

22:16.253 --> 22:18.421
ఒలీవియా, ఇవాళ నా షెడ్యూల్ ని
కొంచెం ప్రింట్ తీసి ఇస్తావా?

22:18.422 --> 22:19.964
- …మనం అది ఇవాళ మాట్లాడుకుందాం…
- థాంక్స్.

22:19.965 --> 22:21.799
- …అలాగే నాకు వీలైనంత త్వరగా…
- హేయ్.

22:21.800 --> 22:24.510
…నేను మిమ్మల్ని సంప్రదిస్తా,
కానీ సమస్య ఏంటంటే… సర్, సమస్య ఏంటంటే…

22:24.511 --> 22:26.262
జోర్డన్ రావడం ఆలస్యమైందా?

22:26.263 --> 22:27.930
వాడు ఒంట్లో బాలేదని సెలవు పెట్టాడు.

22:27.931 --> 22:28.932
అందరికీ ఏమైంది?

22:30.309 --> 22:31.434
నీకు తెలీదా?

22:31.435 --> 22:32.602
ఏంటి తెలీదు?

22:32.603 --> 22:34.145
ఒలీవియా, కొంచెం బయటకు వెళ్ళు.

22:34.146 --> 22:35.147
థాంక్స్.

22:35.814 --> 22:37.148
నాకు తెలియాల్సింది ఏమైనా ఉందా?

22:37.149 --> 22:38.232
ఏం జరుగుతోంది?

22:38.233 --> 22:42.195
నేను నీకు గౌరవం ఇచ్చి, బాధపడుతున్నావని ఏం చెప్పలేదు,

22:42.196 --> 22:44.113
కానీ నీ వ్యక్తిగత జీవితం మన బిజినెస్ కి
పెద్ద తలనొప్పి తీసుకొస్తోంది.

22:44.114 --> 22:45.741
ఏం మాట్లాడుతున్నావు?

22:48.243 --> 22:49.578
నువ్వు టిక్ టాక్ వాడవు, కదా?

22:50.329 --> 22:52.998
- ఇదేమైనా ప్రశ్నా?
- ఛ.

22:54.082 --> 22:56.376
ఇవాళ ఉదయం ఒక వీడియో పోస్ట్ చేయబడింది.

22:57.419 --> 22:58.878
అది రాబర్ట్ కూతురు, కోరా పని.

22:58.879 --> 23:01.672
ఆమె నువ్వు ఇంకా రాబర్ట్ పడుకుంటున్నారు అని చెప్పింది.

23:01.673 --> 23:03.382
నీ పేరు చెప్పలేదు అనుకో,

23:03.383 --> 23:05.886
కానీ ఇంటర్నెట్ లో విచారణ చేసేవాళ్ళు
అది నువ్వే అని కనిపెట్టారు.

23:06.929 --> 23:10.097
ఇది చాలా దారుణమైన ఆరోపణ.

23:10.098 --> 23:12.850
అవును, అది నిజమే కావొచ్చు,
కానీ నాకు ఎడతెరిపి లేకుండా కాల్స్ వస్తున్నాయి.

23:12.851 --> 23:15.353
లెగసీ వారు మెసేజ్ చేశారు.
మన ప్రొఫైల్ ని తీసేద్దాం అనుకుంటున్నారట.

23:15.354 --> 23:16.938
అలాగే మన ప్రోగ్రామ్ పార్ట్నర్ లు కొందరు

23:16.939 --> 23:19.650
- మనం సమస్యల్లో పడ్డాం అని కంగారు పడుతున్నారు.
- సరే. నేను వీడియో చూడాలి.

23:20.442 --> 23:23.236
- నువ్వు నాకు అది చూపించాలి, జో.
- ఎలనోర్, చెప్తున్నాను కదా…

23:23.237 --> 23:25.154
ఎవరైనా నాకు ఆ వీడియో చూపిస్తారా?

23:25.155 --> 23:27.114
నేను అది చూడాలి. ఎవరైనా ఇస్తారా ప్లీజ్?

23:27.115 --> 23:28.407
- ఎలనోర్.
- ఆపు!

23:28.408 --> 23:30.910
నేను వెంటనే ఆ చెత్త వీడియో చూడాలి!

23:30.911 --> 23:32.454
ప్లీజ్.

23:35.874 --> 23:37.292
థాంక్స్, మార్కస్.

23:37.960 --> 23:41.379
చనిపోయిన మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్నతో
పడుకుంటే భలే మండుతుంది కదా?

23:41.380 --> 23:42.964
నా ఒక్కదానికే ఇలా అనిపిస్తుందా?

23:42.965 --> 23:43.966
అద్భుతం.

23:46.009 --> 23:49.471
చనిపోయిన మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్నతో
పడుకుంటే భలే మండుతుంది కదా?

24:17.541 --> 24:19.084
డిటెక్టివ్ గాంజ్

24:25.465 --> 24:26.549
ఛ.

24:26.550 --> 24:27.551
డొనోవన్

24:28.051 --> 24:29.510
మన పేరు

24:29.511 --> 24:32.890
ఎప్పుడు పత్రికల్లో పడినా నాకు అలెర్ట్
అందుతుంది అని తెలుసా?

24:33.390 --> 24:35.183
ప్రస్తుతం ఇది అంత మంచి టైమ్ కాదు.

24:35.184 --> 24:37.894
రాబర్ట్ తో పడుకోవాలి అని కలలు కనడం ఒకటి.

24:37.895 --> 24:39.979
కానీ నిజంగానే ఆ పని చేసి, దొరికేసి తర్వాత

24:39.980 --> 24:42.607
హెడ్ లైన్స్ కి ఎక్కడం మరొకటి.

24:42.608 --> 24:45.359
కోరా కోపంలో అలా అంటోంది,
ఆ పిల్లకు తను చూసింది ఏంటో తెలీదు.

24:45.360 --> 24:48.321
ఇదంతా ఒక పెద్ద అపార్థం.

24:48.322 --> 24:52.366
ఇక వద్దు. అబద్ధాలు చెప్పి అనవసరంగా
మనిద్దరి పరువు తీయకు.

24:52.367 --> 24:53.743
నువ్వు న్యూస్ చూశావా?

24:53.744 --> 24:56.120
దేవుడా, లేదు, కానీ వాళ్ళు చెప్పేవి అన్నీ,

24:56.121 --> 24:58.331
…ఒక్క స్టేట్మెంట్ ఇస్తే క్లియర్ అయిపోతాయి.

24:58.332 --> 25:01.501
దయచేసి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయకు.

25:01.502 --> 25:04.128
లాయర్లు ఫోన్ చేస్తున్నారు.
అమ్మ వెనక్కి వస్తా అంటోంది.

25:04.129 --> 25:07.507
ఇది గనుక ఇంకేమాత్రం పెద్దది అయినా,
ఖచ్చితంగా అవుతుంది అనుకో,

25:07.508 --> 25:11.969
రాబర్ట్ వాళ్ళ కుటుంబం ఈ తలనొప్పి వాళ్ళను
చుట్టుకోకుండా ఉండటానికి ఏమైనా చేస్తారు,

25:11.970 --> 25:15.223
అప్పుడు ఆఖరికి నువ్వు బలిపశువువి అవ్వాలి.

25:15.224 --> 25:17.266
వాడి కోసం ఇంత రిస్క్ చేసినందుకు సంతోషంగా ఉందేమో.

25:17.267 --> 25:19.520
ఆపు! ఇక చాలు, సరేనా?

25:20.145 --> 25:22.939
నీ ఊహాగానాలు వినే మూడ్ నాకు లేదు, డొనోవన్.

25:22.940 --> 25:25.900
ఇది మనం ఆర్పాల్సిన ఒక చిన్న మంట మాత్రమే.

25:25.901 --> 25:28.402
ఇలాంటిదో ఏదో జరుగుతుందని నాకు తెలుసు.

25:28.403 --> 25:31.949
అసలు, ఆ దరిద్రుడు నిన్ను ఒక తెల్లపిల్లని
ఆడించినట్టు ఆడిస్తున్నాడు, అందుకు నువ్వు…

25:45.170 --> 25:48.005
హేయ్, లోనికి రా. క్షమించు, ఇల్లు అస్తవ్యస్థంగా ఉంది.

25:48.006 --> 25:49.799
పిల్లల్ని స్కూల్ కి పంపాను,

25:49.800 --> 25:53.135
అలాగే ఆర్టీ పక్క తడపడంతో బట్టలు ఉతికే పనిలో ఉన్నాను.

25:53.136 --> 25:56.264
గత కొన్ని వారాలుగా అది అప్పుడప్పుడు పక్క తడుపుతుంది.

25:56.265 --> 25:59.016
అంటే, అది హోవర్డ్ కి నచ్చడం లేదు, కాబట్టి నేను…

25:59.017 --> 26:01.186
అంటే, తను పిల్ల కొంచెం ఎదిగేవరకు

26:01.937 --> 26:03.563
ప్లాస్టిక్ షీట్స్ పెడదాం అంటున్నాడు,

26:03.564 --> 26:06.482
కానీ ఏమో, నాకు అలా చేయడం…

26:06.483 --> 26:07.651
ఏమైంది?

26:09.778 --> 26:10.779
ఏంటి?

26:12.865 --> 26:15.158
ఏం జరుగుతోంది? నువ్వు నన్ను భయపెడుతున్నావు.

26:16.994 --> 26:21.498
మేము కలిసి ఒహయ్ కి వెళ్ళినప్పుడు
నేను రాబర్ట్ తో పడుకున్నాను,

26:22.082 --> 26:24.376
అంతేకాక మమ్మల్ని అక్కడ కోరా చూసేసింది.

26:24.918 --> 26:28.880
నిన్న రాత్రి తను ఇంటికి వచ్చింది,
పైగా ఇవాళ ఉదయం ఆ విషయం మీద ఒక వీడియో పోస్ట్ చేసింది.

26:28.881 --> 26:31.591
ఇప్పుడది ఆన్లైన్ లో ఉంది,
కారణంగా రాబర్ట్ ఇంకా నాకు మధ్య

26:31.592 --> 26:34.552
ఏదైనా అక్రమ సంబంధం ఉందా, అలాగే బహుశా
మేమే నాన్సీని చంపేశామా అని

26:34.553 --> 26:37.389
బోలెడన్ని ఆర్టికల్స్ ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

26:43.937 --> 26:47.899
మేరీ, నేను నీకు ఈ విషయం చెప్పలేదు,
కానీ ఒక లెటర్ ఉంది.

26:47.900 --> 26:53.404
రాబర్ట్ కి డేవిడ్ తో సంబంధం గురించి తెలుసు,
అలాగే వాళ్ళు గొడవపడ్డారు కూడా.

26:53.405 --> 26:57.159
వాడు చాలా కోపపడ్డాడు, అలాగే నాన్సీ
చాలా భయపడింది, అంతేకాక నాకు తెలిసి…

26:57.743 --> 27:01.037
నాకు అంతా తెలీదు, వాడు
ఆమెకు క్షమాపణలు అడుగుతూ లెటర్ రాశాడు.

27:01.038 --> 27:05.500
ఇదంతా చూడటానికి ఆధారంలాగే ఉంది, కానీ వాడు
ఏం చేయలేదు, ఆమెను బాధపెట్టలేదు అన్నాడు.

27:05.501 --> 27:06.584
నన్ను క్షమించు.

27:06.585 --> 27:09.795
నేను ఇది నీకు ముందే చెప్పి ఉండాల్సింది, కానీ నేను…

27:09.796 --> 27:12.173
నేను ఈ విషయాన్ని జీర్ణించుకుందాం అనుకున్నా,
నీకు గనుక చెబితే

27:12.174 --> 27:14.259
- బహుశా నువ్వు…
- వాడు అబద్ధం చెప్పాడు.

27:15.052 --> 27:18.930
డేవిడ్ తో సంబంధం గురించి తనకు
తెలీదు అన్నట్టు నటించాడు.

27:18.931 --> 27:19.973
వాడు అబద్ధం చెప్పాడు.

27:21.141 --> 27:23.560
కాబట్టి మనం ఆ లెటర్ ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాలి.

27:24.228 --> 27:26.354
- మనం అలా చేయకూడదు.
- "చేయకూడదు" అంటే ఏంటి అర్థం?

27:26.355 --> 27:27.523
అది ఆధారం.

27:32.069 --> 27:34.278
అది బలమైన ఆధారం. వాడు నాన్సీని చంపేశాడు.

27:34.279 --> 27:37.281
- కానీ వాడు చంపలేదు.
- ఆ విషయం నీకు తెలీదు.

27:37.282 --> 27:39.700
- నాకు తెలుసు.
- నేరస్థులు అబద్ధాలే చెబుతారు, ఎల్లి.

27:39.701 --> 27:41.202
ఇది చూడటానికి దారుణంగా ఉందని నాకు తెలుసు.

27:41.203 --> 27:43.914
దారుణంగా ఉందా? ఇది ఉద్దేశాన్ని చూపుతోంది.

27:44.498 --> 27:46.999
దేవుడా, నువ్వు జైలుకి వెళ్లొచ్చు,
ఆ విషయం అర్థం అవుతుందా?

27:47.000 --> 27:50.878
మా దగ్గర లాయర్లు ఉన్నారు, వాళ్ళు ఇదంతా క్లియర్
చేయగలరు. అలాగే నాకు అలబై ఉంది.

27:50.879 --> 27:52.463
నువ్వు రాబర్ట్ తో పడుకున్నావు.

27:52.464 --> 27:56.218
దేవుడా, నేను ఈ మాటలు అంటున్నాను అంటే
నమ్మలేకపోతున్నాను. నేను…

27:58.178 --> 28:00.304
నీకు వాడి మీద ఉన్న ఈ వ్యామోహం పోయింది అనుకున్నా.

28:00.305 --> 28:02.391
ఇదేమి వ్యామోహం కాదు.

28:03.350 --> 28:05.434
మేము ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తాం.

28:05.435 --> 28:07.937
కానీ వాడు నిన్ను ఎన్నుకోలేదు, అవునా?

28:07.938 --> 28:09.146
వాడు నిన్ను ఎన్నుకోలేదు.

28:09.147 --> 28:10.899
వాడు నన్ను ఇప్పుడు ఎన్నుకున్నాడు.

28:11.567 --> 28:13.985
నువ్వు ఎందుకు పెద్ద పతివ్రతలాగ మాట్లాడుతున్నావు?

28:13.986 --> 28:15.903
నీ పెళ్లి కూడా అక్రమ సంబంధంతోనే మొదలైంది.

28:15.904 --> 28:17.530
- అవి రెండూ…
- వాడికి నాకు మధ్య ఇప్పుడు…

28:17.531 --> 28:18.865
- …ఒక్కటి కాదు.
- …నిజమైన బంధం ఏర్పడితే?

28:18.866 --> 28:21.367
నాకు ఎలాగూ కోరా అంటే ఇష్టం.
నేను దానికోసం ఏమైనా చేస్తా.

28:21.368 --> 28:22.577
నోరు మూసుకో!

28:22.578 --> 28:24.996
అసలు నీ మాటలు నువ్వైనా వింటున్నావా?

28:24.997 --> 28:27.540
నీకు, రాబర్ట్ కి మధ్య ఉన్నది ఏదీ నిజం కాదు.

28:27.541 --> 28:30.168
ఏది నిజమో, ఏది కాదో నీకు తెలీదు.

28:30.169 --> 28:33.296
నిజమైన బంధం అంటే నేల మీద పాత బట్టలు,
సింక్ లో ఎంగిలి గిన్నెలు

28:33.297 --> 28:38.217
డాక్టర్ అపాయింట్మెంట్స్ అలాగే ఎన్నో దెబ్బలు,
ఇంకా గాయాలతో నిండి ఉంటుంది, నిజమైన త్యాగాలు చేయాలి.

28:38.218 --> 28:44.640
ప్రస్తుతం నా భర్త ఒహయోలో ఉద్యోగం కోసం
ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాడు చూడు అది నిజం.

28:44.641 --> 28:48.269
దానర్థం మేము అన్నీ వదిలేసి
అక్కడికి వెళ్లాల్సి రావొచ్చు. అది నిజం.

28:48.270 --> 28:51.440
నువ్వు మాత్రం ఇంకొక మహిళ భర్తతో
ఊహాగానాల్లో విహరిస్తున్నావు.

28:56.904 --> 28:58.488
నువ్వు వెళ్ళిపోతున్నావా?

28:59.406 --> 29:00.656
అయితే ఏంటి?

29:00.657 --> 29:01.741
అంటే ఏంటి నీ ఉద్దేశం?

29:01.742 --> 29:03.075
- నువ్వు నా బెస్ట్…
- "బెస్ట్ ఫ్రెండ్"?

29:03.076 --> 29:04.703
- అవును.
- నాన్సీ కూడా అంతే.

29:07.831 --> 29:11.919
ఎల్లి, నువ్వు తన భర్తతో పడుకుంటున్నావు.

29:17.508 --> 29:19.050
వాడు నిన్ను వాడుకుంటున్నాడు.

29:19.051 --> 29:20.426
- లేదు.
- అవును.

29:20.427 --> 29:21.928
లేదు. నువ్వు చెప్పేది తప్పు.

29:21.929 --> 29:23.012
నా ఇంట్లో నుండి వెళ్ళిపో.

29:23.013 --> 29:25.723
మేరీ, ప్లీజ్. నీకు అర్థం కావడం లేదు.

29:25.724 --> 29:28.643
ఇది వేరు. ఇది నువ్వు అనుకునేలా కాదు. ఇది…

29:28.644 --> 29:29.811
నా ఇంట్లో నుండి వెళ్ళిపో.

29:31.980 --> 29:33.272
మేరీ?

29:33.273 --> 29:34.358
వెంటనే!

30:19.486 --> 30:21.487
- మిస్ బుషే.
- అవును.

30:21.488 --> 30:23.406
ఇది పెద్ద రాద్ధాంతంగా మారుతోంది కదా?

30:23.407 --> 30:24.949
అవును.

30:24.950 --> 30:27.034
- నేను మీకు ఫోన్ చేయడానికి ట్రై చేశా.
- ఇవాళ చాలా హడావిడిగా నడుస్తోంది.

30:27.035 --> 30:28.870
- మనం లోనికి వెళదామా?
- ఎక్కువ సేపు పట్టదు.

30:28.871 --> 30:32.624
మాకు టిప్ లైన్ లో జోర్డన్ థామస్ అనబడే వ్యక్తి నుండి
ఫోన్ వచ్చింది. అతను మీకు పని చేస్తున్నాడు అంట.

30:33.500 --> 30:34.584
అవును.

30:34.585 --> 30:36.961
అతను శ్రీమతి హెనెస్సీ హత్య చేయబడిన రాత్రి
మీరు తనతో ఉన్నారు అని చెప్పాడు.

30:36.962 --> 30:39.630
అలాగే మీ మధ్య లైంగిక సంబంధం ఉంది అన్నాడు.

30:39.631 --> 30:42.550
కాకపోతే అది హెచ్.ఆర్ సమస్య కదా?

30:42.551 --> 30:43.801
నేరం కాదు.

30:43.802 --> 30:45.803
అవును, కానీ ఒక సమస్య.

30:45.804 --> 30:50.683
విషయం ఏంటంటే, అతని స్టేట్మెంట్ లో
మీరు అతని ఇంటికి ఒంటిగంటకు వెళ్లారు అన్నాడు.

30:50.684 --> 30:54.312
ఫోరెన్సిక్స్ వారు శ్రీమతి హెనెస్సీ హత్య
అర్థరాత్రి సమయంలో జరిగింది అన్నారు.

30:54.313 --> 30:57.064
మిస్టర్ హెనెస్సీ ఎక్కడ ఉన్నారని ఎవరూ చెప్పలేకపోతున్నారు,

30:57.065 --> 30:59.358
అతనేమో మాట్లాడటానికి నిరాకరిస్తూ
ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడు.

30:59.359 --> 31:00.776
మీరేమో ఇంట్లో ఉన్నా అన్నారు.

31:00.777 --> 31:04.488
ఇప్పుడేమో మీ మధ్య లైంగిక సంబంధం
ఉంది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా?

31:04.489 --> 31:05.907
ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి

31:05.908 --> 31:08.451
నేను ఎవరితో పడుకుంటున్నా, ఎవరితో
పడుకోవడం లేదని ముచ్చటించాలా?

31:08.452 --> 31:10.828
లేక నాన్సీ ప్రేమికుడు డేవిడ్ కోసం
వెతికే ఉద్దేశం ఏమైనా ఉందా?

31:10.829 --> 31:14.498
మేము శ్రీమతి హెనెస్సీకి పరిచయం ఉన్న
ప్రతీ ఒక్కరిని సంప్రదించాం,

31:14.499 --> 31:16.292
కానీ ఎవరూ డేవిడ్ అనే మనిషి పేరు వినలేదు.

31:16.293 --> 31:19.212
అలాగే ఆలోచించి చూస్తే,
లవర్ ఒకరు ఉన్నారని చెప్పిన మొదటి వ్యక్తి మీరే.

31:19.213 --> 31:21.714
కాబట్టి, అయితే మీరు మా దృష్టి మళ్లించడానికి
ట్రై చేస్తున్నారు అనుకోవాలి,

31:21.715 --> 31:25.301
లేదా మేము డేవిడ్ అనే మారుపేరు వాడుతున్న
ఇంకొకరి కోసం వెతకాలి.

31:25.302 --> 31:27.304
ఏం చేయమంటారు, మిస్ బుషే?

31:32.559 --> 31:34.602
నేను లాయర్ ని ఏర్పాటు చేసుకునేవరకు

31:34.603 --> 31:36.854
- ఇంకేం మాట్లాడకపోతే మంచిది.
- సరే.

31:36.855 --> 31:39.608
ప్రస్తుతం మీరు లాయర్ ని పెట్టుకోవడమే మంచిదని నా ఉద్దేశం.

31:53.163 --> 31:54.289
మిస్ బుషే.

31:58.794 --> 32:00.962
నేను అనుకున్నట్టే జరిగిందే?

32:00.963 --> 32:03.589
- ఇబ్బందికర పరిస్థితులతో డీల్ చేయడం నీకు కష్టం కదా.
- కిట్.

32:03.590 --> 32:05.299
ఈమె రావడం మంచిది కాదు. ఆ విషయం నీకు తెలుసు.

32:05.300 --> 32:07.052
ఇప్పటికే నీ నెత్తిన చాలా ఒత్తిడి ఉంది.

32:09.596 --> 32:10.847
క్షమించు.

32:10.848 --> 32:12.932
చాలా గంటలుగా ఇంట్లో ఇలాగే ఉంది.

32:12.933 --> 32:14.101
మనం ఎక్కడ మాట్లాడుకోవచ్చు?

32:31.910 --> 32:33.161
కోరా ఎలా ఉంది?

32:34.204 --> 32:36.747
ఒక మాటలో చెప్పాలంటే చాలా కోపంగా ఉంది.

32:36.748 --> 32:39.209
ఎంత చెప్పినా ఇంకా విడియో తీయడానికి ఒప్పుకోవడం లేదు.

32:41.503 --> 32:42.837
నేను తనకి కాల్ చేయాలి.

32:42.838 --> 32:44.131
నేనైతే ఆ పని చేయను.

32:44.756 --> 32:47.092
నేను అంతా వివరించగలను.

32:47.759 --> 32:49.719
కొన్ని రోజులు ఇవ్వు.

32:49.720 --> 32:53.724
ఈ గందరగోళం శాంతించే వరకు తను
ప్రస్తుతానికి కిట్ తో ఉంటుంది.

32:54.933 --> 32:56.935
ఆ రాబందుల నుండి దాన్ని దూరంగా ఉంచాలి.

33:00.105 --> 33:01.106
నువ్వెలా ఉన్నావు?

33:02.149 --> 33:03.358
నువ్వు ఇది అడగడానికి రాలేదు.

33:04.109 --> 33:05.360
చెప్పాలంటే అందుకే వచ్చా.

33:06.987 --> 33:09.030
నేను ఇంకా అన్ని కోణాల్లో ఆలోచించలేదు,

33:09.031 --> 33:12.074
కానీ మనం కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది?

33:12.075 --> 33:13.743
అంటే, మనం ఆ పుకార్లు నిజం కాదని చెప్పొచ్చు,

33:13.744 --> 33:16.704
అలాగే కోరాని బాధపెట్టే విషయాలు ఏం మాట్లాడము అనుకో,

33:16.705 --> 33:19.165
కానీ మనం నాన్సీని చంపిన వాడు

33:19.166 --> 33:22.668
ఇంకా బయటే ఉన్నాడు, వాళ్ళు ఆలోచించాల్సిన విషయం
అదే అని అందరికీ తెలిసేలా చేయొచ్చు.

33:22.669 --> 33:24.295
ప్రస్తుతం అందుకు సమయం మించిపోయింది.

33:24.296 --> 33:25.588
ఎందుకు?

33:25.589 --> 33:28.591
మన లాయర్లు కలిసి జాయింట్ స్టేట్మెంట్ చేయగలరు,
అప్పుడు మనకు టైమ్ దొరికుతుంది,

33:28.592 --> 33:31.345
అలాగే మనం రెడీ అయ్యేవరకు పబ్లిక్ ముందుకు
వెళ్లాల్సిన పనిలేదు.

33:37.267 --> 33:38.602
ఏం జరుగుతోంది?

33:39.770 --> 33:45.108
నా లాయర్లు నీతో అన్ని విధాలుగా సంప్రదింపులు
కట్ చేయమని సలహా ఇస్తున్నారు.

33:52.407 --> 33:56.453
మరి నువ్వు ఆ సలహాని పాటిస్తావా?

33:58.872 --> 34:01.375
- నువ్వు మీ కుటుంబం కోసం ఇలా…
- అదేం కాదు.

34:03.919 --> 34:05.337
నిన్న రాత్రి, మనం…

34:06.171 --> 34:07.255
అదంతా…

34:07.256 --> 34:08.714
ఓహ్, దేవుడా.

34:08.715 --> 34:12.134
నువ్వు నేను అదంతా నిజం అనుకునేలా చేసావు.

34:12.135 --> 34:15.721
అంటే, ఇన్నేళ్ల తర్వాత కూడా మనం…

34:15.722 --> 34:17.265
నువ్వు నన్ను నమ్మించావు.

34:17.266 --> 34:18.516
నేను నా భార్యని కోల్పోయాను.

34:19.101 --> 34:21.060
జరిగింది అది. అంతకు మించి ఏం లేదు.

34:21.061 --> 34:23.312
అది అన్యాయం. నేను కూడా ఉన్నా.

34:23.313 --> 34:25.774
- ఇది… మన మధ్య ఒక బంధం ఉంది.
- "మనం" అనేది ఏం లేదు.

34:30.152 --> 34:32.572
నాకు నా లెటర్ కావాలి.

34:34.366 --> 34:38.285
నువ్వు, నీ ఆత్మనిగ్రహం సంకనాకిపోతాయి.

34:38.286 --> 34:40.706
నీ శ్వాస నుండి నాకు విస్కీ వాసన తెలుస్తోంది.

34:54.553 --> 34:58.640
మా నాన్న చనిపోయిన రాత్రి నేను మా అమ్మతోనే ఉన్నావు.

35:00.184 --> 35:01.935
ఆమె కళ్ళలో కన్నీరు కనిపించలేదు.

35:03.478 --> 35:07.064
ఆమె మనం స్వీయ సంతృప్తి కోసమే ఏడుస్తాం అంది.

35:07.065 --> 35:10.818
అలాగే ఆడవాళ్ళు నష్టం ఇంకా దుఃఖాలను
అలవాటు చేసుకోవాలి అంది.

35:10.819 --> 35:14.239
మనం మనకు వీలైనంత తీసుకోగలగాలి.

35:15.365 --> 35:17.910
కానీ నేను ఇంకెంత ఓర్చుకోవాలి?

35:25.959 --> 35:27.252
హేయ్.

35:36.929 --> 35:37.930
హేయ్.

35:45.979 --> 35:46.980
నన్ను క్షమించు.

35:50.442 --> 35:52.653
"నిన్ను అంత దారుణంగా భయపెట్టినందుకు క్షమించు."

35:54.780 --> 35:55.781
అబ్బా.

35:58.242 --> 36:02.996
ప్రతీ ఏడాది నాన్న వర్థంతి రోజున

36:03.705 --> 36:06.959
మా ఇద్దరం ఫిషింగ్ ట్రిప్ కి వెళ్ళడానికి
రాబర్ట్ ప్లాన్ చేసేవాడు.

36:09.419 --> 36:14.090
నేను ఏనాడూ వాడికి గుర్తు చేయలేదు,
వాడే వచ్చేవాడు, మేము కలిసి వెళ్ళేవాళ్ళం.

36:14.091 --> 36:19.887
మేము అలా నాకు తెలిసి పదేళ్లు వెళ్లాం ఏమో.

36:19.888 --> 36:23.517
నాన్న గురించి అందరూ మాట్లాడటం
మానేసిన తర్వాత కూడా.

36:25.269 --> 36:28.814
అలాగే నాన్సీ కూడా ఏం అనుకోలేదు.

36:29.982 --> 36:32.651
నాకు తెలిసి, బహుశా, అది మమ్మల్ని ప్రోత్సహించింది అనుకుంట…

36:34.111 --> 36:35.404
నా మీద జాలితో.

36:37.030 --> 36:40.742
దాని జీవితంలోని చిన్న భాగాన్ని నాకు
తను అరువు ఇచ్చినట్టు

36:41.243 --> 36:42.870
ఒక్క రోజుకు.

36:47.958 --> 36:53.964
నేను నాకు 18 ఏండ్ల వయసు నుండి రాబర్ట్ హెనెస్సీతో
ప్రేమలో ఉన్నాను.

36:55.340 --> 36:56.967
కానీ ఇక నా వల్ల కాదు.

36:58.260 --> 36:59.761
అదంతా ముగిసింది.

37:10.981 --> 37:13.692
ఇది వాడి పనే అనుకుంటున్నావా?

37:15.110 --> 37:19.489
వాడు చాలా సులువుగా కోరాకి
అబద్ధం చెప్పడం నేను చూసా.

37:20.532 --> 37:23.034
చాలా తేలికగా.

37:23.035 --> 37:26.121
అంటే, బాగా అలవాటు ఉన్నట్టు.

37:27.831 --> 37:32.127
సరే, ఇక నువ్వు నాకు అంతా చెప్పే టైమ్ అయింది.

37:33.545 --> 37:38.425
నాన్సీ చనిపోయిన రాత్రి
జరిగిన ప్రతీ విషయం నాకు చెప్పాలి.

37:42.930 --> 37:44.805
రాత్రి 9:00కి భోజనం ముగించుకున్నాం,

37:44.806 --> 37:50.102
అప్పుడు నేను జోర్డన్ థామస్ కి అతని ఇంటికి
వస్తున్నాను అని మెసేజ్ చేశా.

37:50.103 --> 37:52.314
మిస్టర్ థామస్ నా ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.

37:52.814 --> 37:58.569
మా మధ్య గత ఆరు నెలలుగా క్యాజువల్ బంధం నడిచింది.

37:58.570 --> 38:01.406
"నడిచింది," ఒకప్పుడు.

38:01.907 --> 38:05.953
నేను మిస్టర్ థామస్ ఇంటికి దాదాపు 10:15కి చేరుకున్నా,
కానీ లోనికి వెళ్ళలేదు.

38:06.828 --> 38:09.830
నాకు మార్కస్ సింప్సన్ నుండి మెసేజ్ వచ్చింది.

38:09.831 --> 38:13.836
మార్కస్ నా బెస్ట్ ఫ్రెండ్ మేరీ సింప్సన్ కొడుకు,
వాడు ఒక సమస్యలో పడ్డాడు.

38:14.670 --> 38:15.795
వాడికి నా సాయం అవసరం అయింది.

38:15.796 --> 38:17.630
వాడు కొందరు బుకీలకి డబ్బు ఇవ్వాలి.

38:17.631 --> 38:19.131
నేను వాడిని తీసుకురావడానికి వెళ్ళా.

38:19.132 --> 38:21.134
మీకు ఆ అడ్రెస్ కావాలంటే సంతోషంగా ఇస్తాను.

38:21.760 --> 38:24.053
ఆ తర్వాత నేను మిస్టర్ థామస్ ఇంటికి వెళ్లాను,

38:24.054 --> 38:26.139
అప్పటికి అర్థరాత్రి ఒంటిగంట అయింది.

38:28.267 --> 38:34.146
కొన్ని గంటలకు రాబర్ట్ హెనెస్సీ నాకు
నాన్సీ గురించి ఫోన్ చేసాడు.

38:34.147 --> 38:35.940
మిగతా విషయం అంతా పోలీసుల రికార్డులో ఉంది.

38:35.941 --> 38:37.024
హ్యారిస్, రైట్ & ఆలెన్

38:37.025 --> 38:40.778
కానీ మార్కస్ సింప్సన్ ప్రొబేషన్ లో ఉన్నాడు.

38:40.779 --> 38:43.489
కాబట్టి వాడు మళ్ళీ ఇబ్బందుల్లో పడకూడదు.

38:43.490 --> 38:48.077
మీరు నా ఆలబైలో ఏ భాగాన్ని అయినా వాడుకోండి,
కానీ దయచేసి వాడి పేరు బయటకు రాకుండా ఆపండి.

38:48.078 --> 38:53.916
ఇందులోకి వాడిని లాగితే మేరీ చాలా బాధపడుతుంది.

38:53.917 --> 38:56.878
అదేం పెద్ద సమస్య కాదు.
మేము అతని పేరును గోప్యంగా ఉంచుతాం.

38:56.879 --> 38:57.963
సరే.

39:01.341 --> 39:02.717
సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది?

39:02.718 --> 39:04.344
మమ్మల్ని మీ డిఫెన్స్ కేసు పై పని చేయనివ్వండి.

39:04.887 --> 39:06.679
మా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్

39:06.680 --> 39:08.639
నేరం జరిగిన ఘటన స్థలంలోని వివరాలను పరిశీలిస్తారు.

39:08.640 --> 39:10.726
అప్పుడు పోలీసులకు ఏం తెలుసో మనకు కూడా తెలుస్తుంది.

39:13.353 --> 39:16.939
గొప్ప మానవతావాదులు సాధారణంగా తమ
క్రింద పనిచేసే వారితో పడుకోరు.

39:16.940 --> 39:18.233
అవును, నువ్వు చాలా కథ నడిపావు.

39:19.902 --> 39:21.110
నిన్ను చూసి గర్వంగా ఉంది.

39:21.111 --> 39:22.653
ఇప్పుడు నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు.

39:22.654 --> 39:23.864
లేదు, నిజంగా.

39:24.448 --> 39:25.574
నువ్వు భయంతో పారిపోలేదు.

39:26.158 --> 39:27.618
ఇంకొకరిని దగ్గరకు రానిచ్చావు.

39:31.705 --> 39:34.123
సరే, నేను నీ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను.

39:34.124 --> 39:35.208
ఏ ప్రశ్న?

39:35.209 --> 39:36.502
నేను చేసిన అత్యంత దారుణమైన పని.

39:37.002 --> 39:38.836
నేను తాగిన మత్తులోగాని ఉన్నానా?

39:38.837 --> 39:40.171
నువ్వేం తాగలేదు.

39:40.172 --> 39:45.761
నేను చేసిన చెడ్డ పనుల
చిట్టా కొంచెం పెద్దదే అయినా, ఈ, నువ్వు…

39:47.513 --> 39:48.847
చాలా మంది కంటే మంచిదానివి.

39:49.473 --> 39:53.810
నువ్వేం మచ్చలేని మనిషివి కాదు,
అలాగే నువ్వు చేసిన పని తప్పే.

39:56.396 --> 40:00.107
సందేహం లేకుండా చెప్పగలను,
నీ ఫ్రెండ్స్ నీలో ఉన్న మంచి గుణాలను బయటకు తీస్తారు.

40:00.108 --> 40:06.823
నేను నీకు మాట ఇవ్వగలను,
నాన్సీకి నువ్వు తనని ఎంత ప్రేమించావో తెలుసు.

40:09.493 --> 40:11.620
అలా అన్నందుకు థాంక్స్.

40:16.250 --> 40:18.377
- నీకు ఎయిర్ పోర్ట్ నుండి కాల్ చేస్తా.
- సరే.

40:26.635 --> 40:30.472
నేనైతే నాన్సీకి తను నాకు ఎంత ముఖ్యమో చెప్పాను.
చాలా తరచుగా చెప్పా.

40:31.932 --> 40:34.977
కానీ ప్రేమ అంటే నోటితో చెప్పేది కాదు,
చేష్టల్లో చేసి చూపించేది.

40:35.602 --> 40:40.274
అలాగే ఆ రాత్రి నాన్సీ విషయంలో నేను చేయాల్సింది చేయలేదు.

40:43.026 --> 40:45.654
నాన్సీ మరణానికి మూడు గంటల ముందు

40:46.238 --> 40:47.488
హమ్మయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు.

40:47.489 --> 40:48.614
నేను నువ్వు వెళ్ళిపోయావు ఏమో అనుకున్నా.

40:48.615 --> 40:51.702
నా వల్ల కాదు… నేను ఒక్కదాన్నే ఇది చేయలేను.

40:53.287 --> 40:54.538
నువ్వు నాతో వస్తావా?

40:55.289 --> 40:57.832
నీ ప్రేమికుడితో బంధాన్ని తెంచడంలో సాయం చేయడానికా?

40:57.833 --> 40:59.125
- నేను ఇది నమ్మలేకపోతున్నా.
- అది…

40:59.126 --> 41:01.502
ఇది నువ్వు అనుకునేలా కాదు.
ఇది అంతకంటే చాలా దారుణమైన విషయం.

41:01.503 --> 41:02.670
నేను ఇది ఒంటరిగా చేయలేను.

41:02.671 --> 41:05.631
నువ్వు ఇంతకంటే పెద్ద సవాళ్ళను ఎదుర్కొన్నావు.

41:05.632 --> 41:06.925
నీకు ఏం కాదు.

41:08.260 --> 41:10.303
నువ్వే ఏదొక పరిష్కారం ఆలోచిస్తావులే. చాలా థాంక్స్.

41:10.304 --> 41:11.597
నాకు రేపు కాల్ చెయ్.

41:17.019 --> 41:18.312
నువ్వు ఏం చేస్తున్నావు?

41:18.812 --> 41:20.646
నువ్వు ఎందుకు నాతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు?

41:20.647 --> 41:21.939
నేను అలా ఏం చేయడం లేదు.

41:21.940 --> 41:26.402
నువ్వు వాడి గురించి మాట్లాడటం నేను చాలా సేపటి
నుండి వింటున్నాను. ఇక నా వల్ల కాదు.

41:26.403 --> 41:27.778
మేరీ అయితే నాతో వచ్చేది.

41:27.779 --> 41:29.989
- అయితే మేరీకి కాల్ చెయ్.
- నాకు నువ్వే కావాలి.

41:29.990 --> 41:32.992
నువ్వు కాస్త నీ జీవితాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి.

41:32.993 --> 41:35.204
నీకొక అద్భుతమైన సంసారం ఉంది.

41:35.829 --> 41:37.288
అందుకే రాను అంటున్నావా?

41:37.289 --> 41:39.624
- వద్దు.
- వావ్, ఎల్లి.

41:39.625 --> 41:41.376
ఇది చాలా దారుణం.

41:42.419 --> 41:44.086
ఏది చాలా దారుణమో తెలుసా?

41:44.087 --> 41:49.259
నీ భర్తకు ద్రోహం చేసి ఆ విషయాన్ని సరిచేయడానికి
ధైర్యం చేయలేకపోతున్నావు.

41:50.552 --> 41:51.719
మర్యాదగా నా కారు దిగు.

41:51.720 --> 41:53.263
- దయచేసి నాతో రా.
- లేదు.

41:53.889 --> 41:55.848
- దయచేసి నాతో రా.
- నా కారు దిగు.

41:55.849 --> 41:57.476
- దయచేసి నాతో రా.
- నా కారు దిగు!

42:31.802 --> 42:33.011
డేవిడ్ ఎవరో నాకు తెలుసు.

43:24.229 --> 43:26.231
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
