WEBVTT

00:52.970 --> 00:56.639
అసలు రాబర్ట్ కి ఈ విషయం
గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు,

00:56.640 --> 00:59.184
కానీ తనని మొదట కలిసింది నేనే.

00:59.935 --> 01:01.811
ఒక రాత్రి, చాలా ఏళ్ల క్రితం,

01:01.812 --> 01:06.024
చీప్ బీరు తాగిన మత్తులో కిచెన్ క్యాబినెట్స్ పై వాలుతూ…

01:07.317 --> 01:08.569
నేను అతన్ని నవ్వించాను,

01:09.152 --> 01:13.866
అది సహజంగా, అనుకోకుండా జరిగిపోయింది.

01:15.617 --> 01:17.202
అతను కూడా అది ఫీల్ అయ్యాడని నాకు తెలుసు.

01:18.495 --> 01:21.665
కానీ అంతలోనే ఆమె అక్కడికి వచ్చింది,
నేను వారిని ఒకరికి ఒకరిని పరిచయం చేశా.

01:22.291 --> 01:24.543
"రాబర్ట్, ఈమె నాన్సీ."

01:40.976 --> 01:42.269
ఏమైంది?

01:46.648 --> 01:48.025
ఓహ్, దేవుడా.

02:29.525 --> 02:31.443
అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది

02:42.454 --> 02:44.373
అది అసలు చూడటానికి ఆమెలాగే లేదు.

02:45.290 --> 02:48.794
అది ఖచ్చితంగా నాన్సీనే,
కానీ చూడటానికి ఆమెలాగ లేదు.

02:50.963 --> 02:53.130
నేను డవీడ్ ని వెనుకేసుకొచ్చా.

02:53.131 --> 02:56.301
నేను నిజంగానే అది అర్థం లేని విషయం అనుకున్నా.

02:58.011 --> 02:59.012
అదేం కాదు.

02:59.638 --> 03:01.556
ఇప్పుడు అందరూ ఇది చూసి

03:01.557 --> 03:04.141
నాకు కనీసం బాధపడటానికి కూడా టైమ్ ఇవ్వకుండా
ఎలా పడితే అలా మాట్లాడతారు…

03:04.142 --> 03:05.602
నాకు తెలుసు, కానీ…

03:07.980 --> 03:13.735
నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా అది నాకు చెప్పొచ్చని
అని నీకు తెలుసు కదా.

03:15.529 --> 03:16.613
అంటే, ఇది…

03:19.658 --> 03:21.951
ఆమెను ఇంకొకరితో అలా ఊహించుకోవడమే చాలా దారుణం,

03:21.952 --> 03:23.328
కానీ అలా చూసినా…

03:26.999 --> 03:29.751
నేను ఏమనుకున్నా అంటే, వాళ్ళు
వాడిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు, ఏమైనా…

03:31.545 --> 03:35.716
కాస్త ఊరటగా ఉంటుందనుకున్నా.

03:40.762 --> 03:41.763
కానీ అలా ఏం జరగలేదు.

03:43.515 --> 03:45.142
నీకు ఏమైనా ఊరటగా ఉందా?

03:47.102 --> 03:49.271
లేదు. అస్సలు లేదు.

03:50.189 --> 03:54.359
ఇంత జరిగినా కూడా… నాకు తనంటే ఇంకా ప్రేమే.

03:57.404 --> 03:59.573
తనని తిరిగి పొందడానికి నేను ఏమైనా చేస్తా.

04:01.200 --> 04:02.284
ఇది వెర్రితనమా లేక…

04:03.785 --> 04:04.786
కాదు.

04:07.497 --> 04:08.999
కాదు, ఇది వెర్రితనం కాదు.

04:16.089 --> 04:17.591
నేను ఇక్కడే దిగాలి.

04:22.554 --> 04:23.847
- హేయ్.
- ఏంటి?

04:27.226 --> 04:29.770
ఇవాళ నాతో కలిసి వచ్చినందుకు థాంక్స్.

04:30.604 --> 04:34.024
తను ఇష్టపడిన ప్రదేశానికి వెళ్లడం నాకు నచ్చింది.

04:34.775 --> 04:36.777
అది కొంత సమయానికే అయినా.

04:48.080 --> 04:49.540
- థాంక్స్.
- థాంక్స్.

04:55.712 --> 04:56.713
ఓహ్, ఛ.

04:58.757 --> 04:59.758
హేయ్.

05:01.885 --> 05:07.849
అంటే, నా మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడంతో
నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా, కానీ… వావ్.

05:07.850 --> 05:09.350
నన్ను క్షమించు.

05:09.351 --> 05:11.519
అంటే, నీకు వేరే ప్లాన్స్ ఉండి ఉంటే,
నాకు ఒక మాట చెబితే సరిపోయేది.

05:11.520 --> 05:14.272
నేను ఒక ఫ్రెండ్ తో కలిసి బ్యాలేకి వెళదాం అనుకున్నా,

05:14.273 --> 05:16.566
అలాగే నేను… నా… నా ఫోన్ సైలెంట్ లో పెట్టా.

05:16.567 --> 05:18.694
అంటే, నువ్వు నన్ను సీరియస్ గా
తీసుకోవడం లేదు అనిపిస్తోంది.

05:19.444 --> 05:23.531
నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోను అని
మనిద్దరం ముందే అనుకున్నా కదా, జే.

05:23.532 --> 05:25.116
నా ఉద్దేశం అది కాదు.

05:25.117 --> 05:28.828
నా ఉద్దేశం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయడం లేదని.

05:28.829 --> 05:29.913
అలా అస్సలు కాదు.

05:30.539 --> 05:33.249
జే, ప్రస్తుతం నా పరిస్థితి అంత బాలేదు.

05:33.250 --> 05:35.877
నేను ఇవాళ రాత్రి గురించి మాట్లాడటం లేదు, సరేనా?

05:35.878 --> 05:37.879
అంటే, సెయింట్ ప్యాట్రిక్స్ డే పార్టీ తర్వాత, నువ్వు…

05:37.880 --> 05:40.131
నువ్వు వస్తానని చెప్పిన టైమ్ కి
రెండు గంటల తర్వాత వచ్చావు.

05:40.132 --> 05:41.299
నీ ఫ్రెండ్ చనిపోయిన రోజు రాత్రి,

05:41.300 --> 05:43.634
అంటే, నువ్వు నాకు తొమ్మిదింటికి మెసేజ్ చేసి,
ఒంటిగంటకు వచ్చావు.

05:43.635 --> 05:46.470
- అదేం ప్రవర్తన?
- కాదు, నేను పది తర్వాత వచ్చా.

05:46.471 --> 05:48.639
- కాదు, అంతకంటే చాలా లేట్ అయింది.
- కాదు, అదేం కాదు.

05:48.640 --> 05:50.392
ఎల్, నేను నీకోసమని పడుకోలేదు.

05:52.811 --> 05:55.271
మనం ఇలా వీధిలో మాట్లాడుకోకూడదు.

05:55.272 --> 05:57.107
మనం పైకి వెళితే మంచిది.

05:57.816 --> 06:00.109
మనం ఒక బాటిల్ వైన్ తెరిచి

06:00.110 --> 06:03.113
ఎదిగిన మనుషుల్లా మాట్లాడుకుంటే మంచిదని నా ఉద్దేశం.

06:04.198 --> 06:06.365
- సరేనా?
- నువ్వు వైన్ అన్నావు కదా.

06:06.366 --> 06:09.286
వైన్ కోసం వస్తున్నావు, పెద్దోళ్లలా మాట్లాడటానికి కాదన్నమాట.

07:33.078 --> 07:34.079
మార్నింగ్.

07:34.788 --> 07:37.248
- హేయ్.
- పాలు లేవు. పంచదార లేదు.

07:37.249 --> 07:39.584
కాపీ పొడి అలాగే వేడి నీళ్లు మాత్రమే.

07:39.585 --> 07:41.085
- నీకు ఫేవరెట్.
- థాంక్స్.

07:41.086 --> 07:42.087
సరే.

07:43.547 --> 07:44.922
నువ్వు పనికి వెళ్లడం లేట్ అవుతుంది.

07:44.923 --> 07:46.842
సరే, నా బాస్ అర్థం చేసుకుంటుందిలే.

07:47.968 --> 07:50.052
ఓహ్, వావ్.

07:50.053 --> 07:52.805
తెలుసా, నీకు చేపల వేట అంటే
ఇష్టం అని నాకు తెలీదు. నీకు ఇష్టమా?

07:52.806 --> 07:53.891
అదేం కాదు.

07:55.767 --> 07:59.770
సరే, అయితే, నీకు అది నేర్చుకోవాలని ఉంటే,
నాకు లేక్ గ్రెగొరీలో మంచి చోటు తెలుసు…

07:59.771 --> 08:02.315
జే, నువ్వు ఇక ఆఫీసుకు వెళితే బాగుంటుంది.

08:02.316 --> 08:05.484
సరే. లేదు, నేను… నేను వెళ్తా.

08:05.485 --> 08:08.404
ఆ పని చేస్తాలే. నిన్ను… నిన్ను అక్కడ కలుస్తా.

08:08.405 --> 08:09.406
సరే.

08:22.044 --> 08:24.921
- చాక్లెట్ నాకు కావాలి.
- చాక్లెట్ నేను తిందాం అనుకున్నా.

08:24.922 --> 08:26.088
ఏం లేదు. ముందు నేను చెప్పా.

08:26.089 --> 08:28.675
క్షమించు, బంగారం. ముందు చెప్పింది కాబట్టి ఇవ్వాలి.

08:29.259 --> 08:33.221
ఇరవై నిమిషాలలో బ్యాగులు వేసుకోవాలి, పిల్లలు.
ఎల్లి ఆంటీకి ఏమని చెప్పాలి?

08:33.222 --> 08:34.805
- థాంక్స్, ఎల్లి ఆంటీ.
- వెల్కమ్.

08:34.806 --> 08:36.516
- థాంక్స్.
- పంచదార ఎక్కువ కాలేదు?

08:36.517 --> 08:37.643
అలాంటిది ఏం లేదు.

08:38.393 --> 08:39.726
నువ్వు నా అమ్మవైతే ఎంత బాగుండేదో.

08:39.727 --> 08:40.811
సరే, బ్యాలే గురించి నాకు

08:40.812 --> 08:42.187
- ఏం చెప్పబోయావు?
- అంతే.

08:42.188 --> 08:44.273
సరే, అయితే ఏంటి, నేను ఇక ఆ కారు వాడకూడదా?

08:44.274 --> 08:45.441
ఇలాగే జరుగుతుంది, మార్కస్.

08:45.442 --> 08:47.944
నా కార్లో కూర్చొని రహస్యంగా వేప్ చేస్తే ఇలాగే జరుగుతుంది,
అది పని చేయడం ఆగిపోతుంది.

08:47.945 --> 08:49.028
- నేను వేపింగ్ చేయలేదు.
- హేయ్, కుర్రాళ్ళూ.

08:49.029 --> 08:50.112
- హేయ్, ఎల్.
- ఎలనోర్.

08:50.113 --> 08:51.864
హేయ్, అమ్మా, ఈయన్ని కొంచెం
నా మీద పడొద్దని చెబుతావా?

08:51.865 --> 08:53.241
- నేను జంపర్ కేబుల్స్ అడుగుతున్నా.
- బుజ్జి.

08:53.242 --> 08:55.576
- మీ నాన్నతో కలిసి బయటకి వెళ్లొచ్చు కదా?
- జంపర్ కేబుల్స్ చూద్దాం పదా.

08:55.577 --> 08:57.995
- ఇదంతా చూడాల్సి వచ్చినందుకు సారీ.
- లేదు, అదేం పర్లేదు.

08:57.996 --> 09:00.039
నిజంగా చెబుతున్నా, ఇప్పుడు నా దృష్టి అంతా నీమీదే పెడతా.

09:00.040 --> 09:01.958
- నేను కొంచెం…
- కాస్త ఇవి పక్కకి పెడతా ఆగు.

09:01.959 --> 09:05.044
- ఓహ్, దేవుడా. క్షమించు.
- ఓహ్, లేదు, లేదు, అదేం పర్లేదు. నేను తీస్తా.

09:05.045 --> 09:06.463
నేను తీస్తాను, ఎల్లి, అవి నాకు…

09:11.134 --> 09:12.970
- ఇదేంటి?
- అదేం కాదు.

09:13.470 --> 09:15.596
ఏం కదా? ఇది పోలీస్ రిపోర్ట్.

09:15.597 --> 09:17.349
లాస్ ఏంజెలెస్ పోలీస్
సప్లమెంటల్ రిపోర్ట్

09:18.016 --> 09:19.684
ఇవి పబ్లిక్ రికార్డులు.

09:19.685 --> 09:21.727
అవును, కానీ ఇవి నీ దగ్గర ఎందుకు ఉన్నాయి?

09:21.728 --> 09:24.647
ఎందుకంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది.

09:24.648 --> 09:26.274
డవీడ్ ని అరెస్ట్ చేసారని నాకు తెలుసు,

09:26.275 --> 09:28.776
కానీ అతన్ని దొంగతనం చేసాడని అరెస్ట్ చేశారు,
హత్య కోసం కాదు,

09:28.777 --> 09:32.071
అది కూడా ఎవరో ముక్కూ మొహం తెలీని వారి సాక్ష్యంతో.

09:32.072 --> 09:33.781
అంటే, నువ్వే చెప్పు, అనుమానంగా ఉంది.

09:33.782 --> 09:37.785
న్యూస్ వాళ్ళు ఆ అరెస్ట్ ని నాన్సీకి లింక్ చేయడానికి
చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు.

09:37.786 --> 09:40.914
అందుకని నువ్వు ఈ విషయంలో బోలెడంత
టైమ్ వెచ్చిస్తున్నావు.

09:41.540 --> 09:45.002
అలా మాట్లాడకు. అలా అంటుంటే
నేను సున్నితమైనదాన్ని అన్నట్టు ఉంది.

09:46.211 --> 09:48.087
ఇప్పటికే ఈ ఇంట్లో అందరూ నన్ను అలాగే చూస్తున్నారు.

09:48.088 --> 09:49.089
సరే.

09:52.634 --> 09:53.760
నాన్సీ

10:01.268 --> 10:04.229
థాంక్స్. నేను నా అంతట అది చేయలేకపోయా.

10:05.480 --> 10:06.856
నేను అర్థం చేసుకోగలను.

10:06.857 --> 10:10.735
నేను కూడా తను నాకు పంపిన పాత మెసేజ్లను
డిలీట్ చేయకుండా వాటినే చూస్తూ ఉంటాను.

10:10.736 --> 10:11.737
సరే.

10:12.988 --> 10:15.281
- నీ బ్రేక్ ఫాస్ట్ ఇదేనా?
- నాకు పెద్దగా ఆకలి వేయలేదు.

10:15.282 --> 10:16.283
అల్టడేనా ఫరెవర్

10:16.867 --> 10:18.202
ఇంకేమైనా జరుగుతోందా?

10:19.161 --> 10:23.122
మిగతా విషయాలు చాలవన్నట్టు
ఇది కూడా నీ నెత్తిన పెట్టడం నాకు ఇష్టం లేదు.

10:23.123 --> 10:24.124
ఏంటది?

10:26.877 --> 10:31.589
ఈ వారాంతం కోరా పుట్టిన రోజుకి ఏం చేస్తున్నావని
నన్ను కిట్ అడిగింది.

10:31.590 --> 10:33.090
నేను దాని గురించి మర్చిపోయా.

10:33.091 --> 10:35.927
కాబట్టి ఇప్పుడు తనకు అసలు ఇష్టం ఉందో
లేదో కూడా తెలీని ఒక

10:35.928 --> 10:37.720
సైలెంట్ డిస్కో కోసం డీజేని పెడతామా వద్దా అని ఆలోచిస్తున్నా,

10:37.721 --> 10:40.890
పైగా "17 ఏండ్ల అమ్మాయి పుట్టినరోజు పార్టీ"
అని గూగుల్ చేస్తున్నాను.

10:40.891 --> 10:43.644
జాగ్రత్త. లేదంటే నిన్ను వాళ్ళు ఒక లిస్ట్ లో పెడతారు.

10:44.353 --> 10:47.105
థాంక్స్. ఇప్పుడు నేనొక సన్నాసిని
అలాగే పర్వర్ట్ ని అన్నట్టు అనిపిస్తోంది.

10:50.984 --> 10:53.779
అసలు సొంత కూతురి
పుట్టిన రోజుని మర్చిపోయే తండ్రి ఏం తండ్రి?

10:54.279 --> 10:55.613
నేను ఇది నమ్మలేకపోతున్నా.

10:55.614 --> 10:57.865
- నాన్సీని పెళ్లి చేసుకున్నోడు అంతే.
- అవును.

10:57.866 --> 10:59.825
నీకు ముందెప్పుడూ ఇవన్నీ
ఆలోచించాల్సిన అవసరం రాలేదు.

10:59.826 --> 11:01.869
అవును, కానీ నాకు కనీసం ట్రై చేయాలని ఉంది, సరేనా?

11:01.870 --> 11:04.706
పైగా ఇది తన మొదటి పుట్టిన…

11:08.752 --> 11:10.753
నాన్సీ ఆ పార్టీలను చాలా మ్యాజికల్ గా ఏర్పాటు చేసేది.

11:10.754 --> 11:13.047
నేనేమి స్పీచ్ ఇవ్వను, ఒట్టు.

11:13.048 --> 11:16.884
పదహారు ఏండ్ల క్రితం నా జీవితంలోకి
ఒక అతిగొప్ప గిఫ్ట్ అడుగుపెట్టింది,

11:16.885 --> 11:20.096
కాబట్టి ఇవాళ మనం తనకోసం కలుసుకున్నాం.

11:20.097 --> 11:23.599
కాబట్టి, ఇక ఆలస్యం చేయొద్దు,
పుట్టిన రోజు పాపని స్వాగతిద్దాం.

11:23.600 --> 11:25.394
నా బంగారుకొండ కోరా.

11:28.438 --> 11:29.815
ఇవాళ రాత్రి బాగా ఎంజాయ్ చెయ్.

11:37.948 --> 11:39.366
స్వీట్ 16

11:56.884 --> 11:58.552
నాకు ఎలాంటి తప్పు చేయాలని లేదు.

12:00.179 --> 12:01.888
నేను సాయం చేయగలను.

12:01.889 --> 12:05.641
అంటే, నేను నాన్సీ ఏర్పాటు చేసిన పార్టీలు చాలా చూసా.

12:05.642 --> 12:08.436
నేను కూడా అలాంటిది ఒకటి ఏర్పాటు చేయగలను అనుకుంటున్నా.

12:08.437 --> 12:11.772
- నిన్ను మరీ కష్టపెడుతున్నానా?
- ఇది కోరా కోసం. ఇందులో కష్టం ఏముంది?

12:11.773 --> 12:14.942
- దాని కోసం ఎంతైనా చేయొచ్చు.
- థాంక్స్.

12:14.943 --> 12:17.028
అవును. అవును. సరే.

12:17.029 --> 12:19.865
- ఇంత వరకు నువ్వు ప్లాన్ చేసినవి నాకు పంపు, సరేనా?
- సరే. అలాగే.

12:26.330 --> 12:29.833
డిటెక్టివ్ గాంజ్, ఈ ప్రాంతంలో ఇల్లు
కొందాం అనుకుంటున్నావా?

12:30.417 --> 12:32.753
దురదృష్టవశాత్తు నాకు ఇచ్చే జీతంతో అది సాధ్యం కాదు.

12:33.670 --> 12:34.755
కారు బాగుంది.

12:35.297 --> 12:37.382
- థాంక్స్.
- అద్భుతమైన డిజైన్.

12:38.008 --> 12:42.095
కాకపోతే ఒక వింటేజ్ 450 ఎస్ఎల్ కి కస్టమ్ పెయింట్
వేయించే వాళ్ళు ఎందరో ఉండరు.

12:42.721 --> 12:45.515
అయినా కూడా డబ్బు ఉన్నప్పుడు అద్భుతమైన కండిషన్ లో

12:45.516 --> 12:48.644
ఉన్న క్లాసిక్ కారు విలువ తగ్గించడానికి లెక్క చేయరు కదా?

12:50.270 --> 12:52.272
- ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం.
- అవును.

12:52.981 --> 12:53.982
నీ రోజును ఎంజాయ్ చెయ్.

12:54.566 --> 12:56.610
నిజానికి, ఏం అనుకోకపోతే…

12:58.445 --> 13:00.029
మీరు ఈ ఫోటో చూసి ఉంటారు.

13:00.030 --> 13:04.659
- అవును, న్యూస్ లో వచ్చింది.
- సరే. నేను కూడా ఈ ఫోటోని బాగా పరిశీలించా,

13:04.660 --> 13:10.582
కానీ నా మనసులో నిలిచిపోయిన విషయం ఏంటంటే…
శ్రీమతి హెనెస్సీ మొహంలోని లుక్.

13:11.542 --> 13:15.878
సరేనా? ఆమె చాలా రిలాక్స్ గా,
అలవాటు ఉన్న ప్రదేశంలో ఉన్నట్టు ఉంది.

13:15.879 --> 13:17.380
నాకు అర్థం కానీ విషయం అదే.

13:17.381 --> 13:21.843
పాసడీనలో పేరుగాంచిన ధనికురాలికి
సామాన్య ప్రజలతో ఉన్న కామన్ విషయం ఏంటి?

13:21.844 --> 13:24.263
ఆమె మొదటి నుండి ధనికురాలు కాదు.

13:25.055 --> 13:26.848
రాబర్ట్ ని పెళ్లి చేసుకోవడానికి ముందు తన జీవితం వేరే.

13:26.849 --> 13:28.267
ఎలాంటి జీవితం?

13:29.059 --> 13:30.351
ఇబ్బందులతో నిండింది.

13:30.352 --> 13:34.272
తాగుబోతు తల్లి, సవితి తండ్రి వేధింపులు,
ట్రైలర్ పార్క్ జీవితం.

13:34.273 --> 13:36.358
చాలా కష్టాలు పడింది.

13:36.859 --> 13:39.695
సరే, సరే.
నిజమే, మేము ఆమె చరిత్రని చెక్ చేసాం.

13:40.737 --> 13:42.613
అందుకే ఇప్పుడు ఈ కేసు మరింత వింతగా తయారైంది.

13:42.614 --> 13:45.199
- ఏంటి?
- అంటే, అలాంటి మహిళకి

13:45.200 --> 13:49.204
రాబర్ట్ ఇంకా అతని కుటుంబంతో
కామన్ గా ఉన్న పోలిక ఏంటి?

13:50.581 --> 13:51.915
లేదా నీతో?

13:52.708 --> 13:55.960
నా స్నేహం పై విచారణ చేస్తున్నారా?

13:55.961 --> 13:58.380
కాదు. అదేం కాదు.

13:59.089 --> 14:01.383
ఆ దొంగతనం కేసు బూటకమేనా?

14:02.092 --> 14:03.676
మీకు డవీడ్ మీద నిజమైన కేసు ఉండి ఉంటే

14:03.677 --> 14:05.721
నన్ను ఇవన్నీ అడిగేవారు కాదని నా ఉద్దేశం.

14:06.388 --> 14:08.390
ఇంకొకరిపై విచారణ చేస్తున్నారా?

14:10.767 --> 14:12.186
నీ సమయానికి థాంక్స్.

14:50.182 --> 14:52.351
- ఛ.
- అద్దాలు క్రిందకి దించు!

14:55.562 --> 14:58.481
నన్ను ఫాలో అవ్వడానికి నీకు ఎలాంటి హక్కు లేదు.
ఇది వేధింపు.

14:58.482 --> 15:01.234
నాకు నీ పేరు అలాగే నీ బ్యాడ్జ్ నంబర్ కావాలి.

15:01.235 --> 15:02.236
నేను పోలీస్ ని కాదు.

15:03.237 --> 15:04.821
నేను డొనోవన్ కి పని చేస్తున్నా.

15:09.868 --> 15:10.869
సరే.

15:12.913 --> 15:14.998
నువ్వు ఎప్పుడైనా యుద్ధ భూమిలోకి వెళ్ళావా?

15:15.624 --> 15:18.084
అక్కడి మరణాన్ని చూసాక నీ జీవితం మారిపోతుంది.

15:18.085 --> 15:20.711
కాబట్టి, నేను వాళ్లతో ఆశ్రయం కోసం అప్లై చేయించా,

15:20.712 --> 15:24.132
తర్వాత మనం మాట్లాడుకున్నట్టు ప్రభుత్వంలోని
వారిని ఒప్పించా, అలాగే…

15:24.716 --> 15:29.262
చిన్నగా చెప్పాలంటే, ఇప్పుడు
వాళ్ళు చక్కని డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు.

15:29.263 --> 15:32.807
వాళ్ళ కూతురు గత ఏడాది వస్సార్ నుండి పట్టా తీసుకుంది.

15:32.808 --> 15:34.059
అది అద్భుతమైన విషయం.

15:35.269 --> 15:39.273
అంటే, మన మనసు మనతో మాట్లాడినప్పుడు,
మనం ఖచ్చితంగా వినాలి.

15:40.190 --> 15:43.776
లేడీస్, నాకు వేరే పని ఒకటి ఉంది, కాబట్టి కాసేపు వెళ్ళాలి,

15:43.777 --> 15:45.779
నేను మిమ్మల్ని తర్వాత పూల్ దగ్గర కలుస్తా.

15:49.199 --> 15:52.619
భలే ఉంది. అమ్మాయిలను పట్టడానికి నా కథలు చెబుతున్నావా?

15:53.245 --> 15:54.329
అది మంచి కథ.

15:55.038 --> 15:57.456
అలాగే ఎంతైనా నేను, అమ్మా నీ చిట్టి చారిటికి
ఫండింగ్ ఇస్తున్నాము,

15:57.457 --> 15:59.041
కాబట్టి అది నా కథ కూడా.

15:59.042 --> 16:01.920
"చిట్టి చారిటి"? థాంక్స్, డానీ.

16:02.838 --> 16:05.256
కాకపోతే వాళ్ళ అమ్మాయి ఒహయో స్టేట్ కి వెళ్ళింది.

16:05.257 --> 16:06.424
వస్సార్ అంటే వినడానికి ఇంకా బాగుంది.

16:06.425 --> 16:10.428
- వావ్.
- సరే, నా మనిషి విన్ స్టన్ నువ్వు బాగా పరిగెడతావు అన్నాడు.

16:10.429 --> 16:12.346
అవును, పరిగెత్తాలి అనిపించినప్పుడు.

16:12.347 --> 16:15.308
కొన్ని కుటుంబాలలో, ఎవరి ఫ్రెండ్ అయినా చనిపోతే,

16:15.309 --> 16:18.645
వాళ్ళు పువ్వులో లేక ఒక బాస్కెట్ కొని ఇవ్వడమో
లేక హగ్ ఇవ్వడమో చేస్తారు.

16:19.396 --> 16:20.522
నాకు అలాంటివి తెలీదు.

16:21.190 --> 16:24.066
బాగా బలిసిన ధనవంతుల జీవితాలకు ఇదొక శాపం అంట.

16:24.067 --> 16:26.152
- సరే.
- హగ్స్ ఇచ్చుకోరు.

16:26.153 --> 16:27.987
ఎమోషన్స్ ఒలకపోయడం రాదు, సరేనా?

16:27.988 --> 16:31.282
సరే. ఇక నీ మనిషి విన్ స్టన్ నన్ను
వెంటాడటం పూర్తి అయింది కాబట్టి,

16:31.283 --> 16:34.203
నేను చాలా భద్రంగా, అలాగే
సురక్షితంగా ఉన్నానని తెలుస్తుంది కదా,

16:34.870 --> 16:36.413
ఇక మీరు మీ పని చూసుకుంటే బాగుంటుంది.

16:38.457 --> 16:39.750
నా ఆశ కూడా అదే.

16:40.501 --> 16:42.168
నిన్ను చూసుకోవడం కంటే ముఖ్యమైన పనులు
నాకు చాలా ఉన్నాయి.

16:42.169 --> 16:44.337
- కానీ…
- కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు,

16:44.338 --> 16:46.798
ఊహించని పనులు చేయడం నీకు అలవాటు.

16:47.591 --> 16:49.383
- ఇలా మాట్లాడటం ఏం బాలేదు.
- లేదా?

16:49.384 --> 16:50.468
లేదు.

16:50.469 --> 16:52.553
- నాన్న చనిపోయినప్పుడు…
- వద్దు… చాలు… అది ఎత్తకు.

16:52.554 --> 16:54.764
ఇందులోకి ఆయన్ని లాగకు.

16:54.765 --> 16:57.601
అప్పుడు నేను ఉన్న స్థితి వేరు.

16:59.853 --> 17:01.145
నిజంగా?

17:01.146 --> 17:03.564
నేను ఆధారం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఉంటే,
నువ్వు ఒప్పుకోవు.

17:03.565 --> 17:05.650
ఇది ఇద్దరు స్నేహితులు బాధను వ్యక్తపరచడం.

17:05.651 --> 17:06.901
అంత బాధలో కూడా ఇద్దరూ

17:06.902 --> 17:09.444
- గట్టిగానే నవ్వుతున్నారు.
- మేము ప్రేమించిన ఒక మనిషికి

17:09.445 --> 17:10.864
ఇష్టమైన చోటుకు వెళ్ళాం.

17:12.406 --> 17:15.827
ఈ, విరిగిన మనసులను బాగు చేయడం
నీకు ఇష్టం అని మనిద్దరికీ తెలుసు.

17:16.494 --> 17:18.412
అది కూడా అందంగా ఉండే తెల్లజాతి వాడిది.

17:18.413 --> 17:20.748
- బహుశా నువ్వు వీడికి బదులు…
- ఏంటి?

17:20.749 --> 17:22.415
- …బీ.ఎస్.యులోనో లేక…
- మళ్ళీ మొదలు.

17:22.416 --> 17:23.793
…ఏదైనా నల్లజాతి వాడితో అంటే జమాల్

17:23.794 --> 17:26.379
- లేదా టెర్రల్ అనే వాళ్లతో అయితే వేరు.
- నా వల్ల కాదు.

17:26.380 --> 17:28.005
నువ్వొక వెధవ్వి.

17:28.006 --> 17:32.176
రాబర్ట్ విషయానికి వస్తే నీ మనసులో ఎక్కడో
ఒక బలహీనత ఉందని ఎందుకు ఒప్పుకోవు?

17:32.177 --> 17:33.637
అది నిజమే.

17:35.222 --> 17:36.223
ఇక మాట్లాడటం అయిందా?

17:36.807 --> 17:38.809
నన్ను ఫాలో అవ్వడం ఆపు.

18:00.539 --> 18:02.540
రాబర్ట్ - పోలీసులు వచ్చారు
ఇల్లంతా సోదాలు చేస్తున్నారు.

18:02.541 --> 18:06.044
తట్టుకోలేకపోతున్నా. నువ్వు రాగలవా?

18:32.863 --> 18:33.864
సిఎస్ఐ

18:47.878 --> 18:48.879
వాళ్ళు వారెంట్ చూపించారు.

18:49.796 --> 18:51.965
వారెంట్ దేనికి?

18:52.758 --> 18:54.300
నాన్సీ వస్తువులు కొన్ని తీసుకోవడానికి.

18:54.301 --> 18:55.885
మా ఆర్ధిక రికార్డులు.

18:55.886 --> 18:59.389
నా భార్యను చంపించడం వల్ల నాకేమైనా
లాభం ఉంటుందేమో చూద్దామని.

19:00.098 --> 19:01.349
ఓహ్, దేవుడా.

19:01.350 --> 19:03.060
అలాగే నా ల్యాప్ టాప్ కూడా తీసుకెళ్లారు.

19:03.644 --> 19:05.811
నేను కిట్ కి కాల్ చేద్దాం అనుకున్నా,
కానీ తను మా నాన్నకి ఫోన్ చేసి ఉండేది,

19:05.812 --> 19:08.148
అప్పుడు ఆయన ఈ విషయాన్ని ఇంకా పెద్ద రాద్ధాంతం చేసేవాళ్ళు.

19:10.400 --> 19:12.527
వాళ్ళు చేయాల్సినది చేస్తున్నారు
అనుకుంటున్నా, రాబర్ట్.

19:12.528 --> 19:14.779
- వాళ్ళకి ఏమీ దొరకదులే.
- అది నాకు తెలుసు.

19:14.780 --> 19:17.281
నేను… నా ఉద్దేశం అది కాదు…
నేను ఏమంటున్నాను అంటే…

19:17.282 --> 19:18.449
నువ్వు అన్నది నిజం. క్షమించు.

19:18.450 --> 19:20.536
ఇది… ఈ విషయం అంతా…

19:22.955 --> 19:26.250
బహుశా ఇలాంటి టైమ్ లో పుట్టినరోజు పార్టీ
జరపడం మంచిది కాదేమో.

19:29.378 --> 19:30.754
నేను ఒప్పుకోను.

19:32.172 --> 19:35.175
మనం మన బ్రతుకును కొనసాగించాలి, సరేనా?

19:35.968 --> 19:37.761
కోరా కోసమైనా పరిస్థితి మామూలుగా అనిపించేటట్టు చేయాలి.

19:38.679 --> 19:39.763
నీకోసం కూడా.

19:41.390 --> 19:43.392
అలాగే నాన్సీ కూడా ఇలాగే జరగాలని
కోరుకుంటుందని నా ఉద్దేశం.

19:48.897 --> 19:50.899
అంతర్జాతీయ
రెస్క్యూ + రిలీఫ్

19:52.943 --> 19:56.946
సరే, మనం లైబీరియాలోని టీమ్ లో
ఎవరినైనా చేర్చాలి అనుకుంటే,

19:56.947 --> 19:58.699
నా ఓట్ చెల్సీకే.

19:59.449 --> 20:00.784
ఆమె ముందుకొచ్చిందా?

20:01.285 --> 20:03.077
లేదు, కానీ ఆమె కాస్త ఉత్సాహం చూపించింది.

20:03.078 --> 20:04.412
రాబర్ట్
వాళ్ళు డవీడ్ ని వదిలేసారు.

20:04.413 --> 20:06.582
ఆమెకు స్థానికంగా చాలా కనెక్షన్స్ ఉన్నాయి,
అవి మనకు పనికిరావొచ్చు.

20:09.960 --> 20:12.379
ఎల్… ఎల్.

20:13.797 --> 20:15.381
అవును, క్షమించు.

20:15.382 --> 20:16.842
సరే. లేదు, అదేం పర్లేదు.

20:17.551 --> 20:19.427
నీకు ఇష్టమైతే నేను ఆమెకు ఫోన్ చేస్తా.

20:19.428 --> 20:20.429
సరే.

20:22.389 --> 20:23.472
హేయ్, జే.

20:23.473 --> 20:25.141
ఇలా జరగపోవచ్చు,

20:25.142 --> 20:29.980
కానీ పోలీస్ విచారణ పెరుగుతోంది కాబట్టి…

20:31.523 --> 20:35.818
ఎవరైనా నిన్ను నా గురించి అడిగితే…

20:35.819 --> 20:38.238
అర్థమైంది. నేను చూసుకుంటా.

20:39.031 --> 20:40.531
నేను ఏం మాట్లాడను, సరేనా?

20:40.532 --> 20:41.700
లేదు, నువ్వు మాట్లాడొచ్చు.

20:42.618 --> 20:44.536
నేను నీ ఇంట్లో ఉన్నాను అని వాళ్ళకి చెప్పొచ్చు.

20:48.916 --> 20:51.000
- మనం ఇది రహస్యంగా ఉంచాలి అనుకున్నాం కదా.
- అవును.

20:51.001 --> 20:55.630
కానీ, ఎవరైనా అడిగారు అనుకో,
అప్పుడు ఇలా చెప్పేడమే మంచిది.

20:55.631 --> 20:56.881
- ఎల్లి.
- ఏంటి?

20:56.882 --> 20:58.049
ఒక క్షణం ఉందా?

20:58.050 --> 20:59.134
అవును, చెప్పు.

20:59.885 --> 21:01.719
నాకు ఒక క్షణం ఇస్తావా? సారీ.

21:01.720 --> 21:03.222
- ఓహ్, సరే. అలాగే.
- థాంక్స్.

21:05.766 --> 21:07.141
ఏంటి? ఏమైంది?

21:07.142 --> 21:08.143
అమ్మకు సమస్య.

21:09.019 --> 21:10.937
ఎవరైనా అమ్మని పోలీస్ స్టేషన్ నుండి విడిపించాలి.

21:10.938 --> 21:12.689
ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?

21:24.117 --> 21:25.619
పాసడీన పోలీస్ డిపార్ట్మెంట్

21:27.621 --> 21:29.664
నేను లాయర్ ని సంప్రదించా. ఆయన వస్తున్నాడు.

21:29.665 --> 21:32.375
ఆయన వచ్చే వరకు ఆమె ఎలాంటి ప్రశ్నలకు
సమాధానం చెప్పదు.

21:32.376 --> 21:33.668
మేము ఆమెను అరెస్ట్ చేయడం లేదు.

21:33.669 --> 21:36.128
ఎవరైనా ఆమెను మా దగ్గర నుండి
తీసుకెళ్లడమే మాకు కూడా కావాలి.

21:36.129 --> 21:37.505
నాకు అర్థం కావడం లేదు.

21:37.506 --> 21:41.300
నీ ఫ్రెండ్ నా ఆఫీసర్లను ఇబ్బంది పెడుతోంది అని తెలిసింది.

21:41.301 --> 21:42.718
- ఏంటి?
- కేవలం గత వారమే,

21:42.719 --> 21:46.889
ఆమె 20 పబ్లిక్ రికార్డు అభ్యర్థనలు పెట్టింది,

21:46.890 --> 21:48.850
కానీ ఇవాళ తన హద్దు మీరింది.

21:48.851 --> 21:50.853
మళ్ళీసారి ఇలా జరిగితే అరెస్ట్ చేస్తాం.

21:57.192 --> 21:59.569
- అసలు నువ్వు ఏం చేసావు?
- అదంతా వదిలేయ్.

21:59.570 --> 22:01.738
లేదు, వదలడం కుదరదు.

22:03.198 --> 22:04.783
- నేను బూతు మాట్లాడి ఉండొచ్చు.
- ఏంటి?

22:05.534 --> 22:07.785
- స్టాప్లర్ ని విసురుతూ.
- ఓహ్, దేవుడా.

22:07.786 --> 22:09.370
- గోడ మీదకి.
- సరే.

22:09.371 --> 22:11.081
- మనిషి మీదకి కాదు.
- నువ్వు బానే ఉన్నావా?

22:11.707 --> 22:14.542
చూడు, ఈ డవీడ్ విషయంలో వాళ్ళు చాలా టైమ్ వృధా చేశారు.

22:14.543 --> 22:17.879
కానీ వాళ్ళు నేను సంపాదించిన
ఆధారాలను అస్సలు లెక్క చేయడం లేదు.

22:17.880 --> 22:21.007
నేను మన కాలేజ్ ఇయర్ బుక్స్ లో
ఉన్న ప్రతీ డేవిడ్ ని చెక్ చేశా.

22:21.008 --> 22:23.801
తను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే
ప్రతీ డేవిడ్ ని కనిపెట్టా.

22:23.802 --> 22:27.221
చివరికి తను పిన్ ట్రస్ట్ లో లైక్ చేసిన
ఒక టెక్సాస్ లోని పువ్వుల షాప్

22:27.222 --> 22:29.932
నడిపించే ఒక విలియం డేవిడ్ అనే వాడిని కూడా కనిపెట్టా,
నేను అసలు…

22:29.933 --> 22:31.350
- వినడానికి పిచ్చిగా ఉందని తెలుసు, కానీ…
- అవును.

22:31.351 --> 22:33.478
- నిన్ను ఇలా అడుగుతున్నందుకు ఏం అనుకోకు.
- సరే.

22:34.771 --> 22:36.189
నువ్వు మళ్ళీ మొదలెట్టావా…

22:36.190 --> 22:37.565
లేదు, ఎల్. ఊరుకో.

22:37.566 --> 22:40.651
నేను గత ఆరు నెలలుగా ఆస్పిరిన్ కి
మించి ఇంకేం తీసుకోలేదు, సరేనా?

22:40.652 --> 22:41.653
సరే.

22:43.447 --> 22:45.115
క్షమించు. నేను ఈ విషయాన్ని వదల్లేకపోతున్నా.

22:47.409 --> 22:49.411
కానీ తను నీకు చెప్పింది, ఎల్.

22:50.537 --> 22:53.207
నాకు చెప్పలేదు, నీకు అంతా తెలిసింది…

22:54.875 --> 22:56.043
ఇప్పుడు నాకు ఎప్పటికీ తెలీదు.

22:56.877 --> 22:58.211
తను నా నుండి కూడా దాచింది.

22:58.212 --> 23:00.214
నాకు తెలీని విషయాలు కూడా చాలా ఉన్నాయి.

23:02.132 --> 23:05.177
నేను కూడా నీలాగే నా మనసును
వేరే వాటిపైకి మళ్లించగలిగితే బాగుండు.

23:06.887 --> 23:08.388
పని ఇంకా రాబర్ట్ తో.

23:11.016 --> 23:15.394
మనం రాత్రికి బాగా రిలాక్స్ అయితే బాగుంటుంది, సరేనా?

23:15.395 --> 23:16.479
నేను హోటల్ నుండి ఏమైనా తెస్తా.

23:16.480 --> 23:18.564
నేను నీకు, పిల్లలకి అలాగే హోవర్డ్ కూడా తీసుకొస్తా.

23:18.565 --> 23:20.984
అప్పుడు మనం… చిల్ అవుదాం.

23:21.610 --> 23:23.194
- సరే.
- సరేనా? సరే.

23:23.195 --> 23:24.779
ఇంకా ఆ పదం వాడుతున్నారని నాకు తెలీదు.

23:24.780 --> 23:26.197
నేను వాడతా.

23:26.198 --> 23:27.491
మనం చిల్ అవుదాం.

23:49.012 --> 23:51.098
హేయ్, నేను దించడానికి వచ్చా…

23:51.682 --> 23:53.934
రాబర్ట్. హేయ్.

23:55.102 --> 23:56.270
రాబర్ట్!

23:59.147 --> 24:01.358
- హేయ్.
- హేయ్.

24:02.067 --> 24:03.652
కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది.

24:04.361 --> 24:05.529
అవును.

24:06.446 --> 24:10.366
నాకు తాగాలని అనిపించినప్పుడు
నేను ఇక్కడికి వచ్చి కాసేపు ఆడతాను.

24:10.367 --> 24:12.160
నువ్వు ఎంత సేపటి నుండి ఆడుతున్నావు?

24:14.872 --> 24:16.999
చూస్తుంటే నాకు ఈసారి తాగాలని బలంగా అనిపించినట్టు ఉంది.

24:18.417 --> 24:19.876
అంతా బానే ఉందా?

24:19.877 --> 24:21.335
పోలీసులు ఏమైనా చెప్పారా?

24:21.336 --> 24:23.212
వాళ్ళు నాన్సీ బాక్సులు కొన్ని తెచ్చి ఇచ్చారు,

24:23.213 --> 24:24.506
అంతకు మించి ఇంకేం లేదు.

24:25.132 --> 24:26.800
కాకపోతే మీ అన్న ఫోన్ చేసాడు.

24:28.177 --> 24:29.595
జోక్ చేస్తున్నావా?

24:30.512 --> 24:31.846
అతను నాకు కాల్ చేసాడంటే నేనే షాక్ అయ్యా.

24:31.847 --> 24:33.015
చాలా… చాలా ఏళ్ల తర్వాత.

24:33.599 --> 24:36.143
ఏంటి… నాకు వ… ఇంతకీ ఎందుకు ఫోన్ చేసాడు?

24:36.977 --> 24:39.270
- సంతాపం తెలపడానికి.
- సరే.

24:39.271 --> 24:42.190
- వాడికి నేనంటే ఎప్పుడూ నచ్చలేదు.
- ఊరుకో.

24:42.191 --> 24:43.859
నేను… నాతో అన్నమాట నీకు ఎప్పుడైనా చెప్పానా?

24:44.776 --> 24:46.861
- లేదు.
- అది మీ నాన్నతో వెళ్లిన

24:46.862 --> 24:49.155
మొదటి ఫిషింగ్ ట్రిప్. మన మొదటి ఏడాది. స్ప్రింగ్ బ్రేక్.

24:49.156 --> 24:50.281
సరే.

24:50.282 --> 24:52.074
మనం చేరుకున్న గంట తర్వాత అనుకుంట,

24:52.075 --> 24:55.995
డొనోవన్ నన్ను పక్కకి లాగి నేను నీకు
ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాలి అన్నాడు.

24:55.996 --> 24:57.372
అంటే రొమాంటిక్ గా.

24:58.290 --> 25:00.082
అలా ఎందుకు అన్నాడు?

25:00.083 --> 25:02.835
బహుశా అన్నగా తను చేయాల్సింది చేస్తున్నా అనుకున్నాడేమో.

25:02.836 --> 25:04.254
అందుకు నేనైతే తనని ఏం అనను.

25:04.796 --> 25:06.506
నేను కాస్త షవర్ చేస్తా.

25:06.507 --> 25:07.508
నువ్వు ఉంటావా?

25:08.091 --> 25:09.718
- ఏమో చెప్పలేను.
- సరే.

25:24.775 --> 25:26.443
మనం ఇంకా ఏ దశాబ్దంలో ఉన్నాం అనుకుంటున్నావు?

25:28.320 --> 25:30.613
నేను చాలా సేపటిగా ఎండలో ఉన్నా.
తేరుకోవడానికి నాకు ఒక క్షణం ఇవ్వు.

25:30.614 --> 25:32.031
నేను ఎవరిని డేట్ చేయాలి,

25:32.032 --> 25:35.618
ఎవరిని డేట్ చేయకూడదని నువ్వు నిర్ణయించడానికి మనం
ఇంకా మధ్య యుగాలలో ఉన్నాం అనుకుంటున్నావా?

25:35.619 --> 25:38.496
ఎందుకంటే నువ్వు, అలాగే మన అమ్మ ఏమనుకున్నా,

25:38.497 --> 25:41.290
నేను ఇప్పుడు పెద్దదాన్ని. ఎదిగిన మనిషిని.

25:41.291 --> 25:43.960
ఇతరులు నన్ను చూసి, నా మీద ఆధారపడే స్థితిలో ఉన్న మనిషిని.

25:43.961 --> 25:47.130
నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలనే
విషయాలలో తగిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని.

25:48.257 --> 25:49.258
సరే.

25:50.259 --> 25:51.927
అలాగే, కొంచెం కూర్చోవచ్చు కదా?

25:52.469 --> 25:54.596
నువ్వు ఇవాళ ఎందుకు విరుచుకుపడుతున్నావో చెప్పు.

25:55.556 --> 25:56.640
నువ్వు రాబర్ట్ కి కాల్ చేసావు.

25:58.976 --> 26:01.144
వెంటనే తెలిసిందే. మీరు బాగా మాట్లాడుకుంటారు కదా, ఆహ్?

26:02.479 --> 26:06.440
నువ్వు తనని కలిసిన మొదటి సారి
ఏమన్నావో నాకు చెప్పాడు.

26:06.441 --> 26:08.944
నన్ను డేట్ చేయడానికి వీలు లేదని చెప్పావంట కదా.

26:09.736 --> 26:11.154
బాగా బాధ వేసినట్టు ఉంది.

26:11.989 --> 26:13.197
ఎందుకో చెప్పగలవా?

26:13.198 --> 26:14.365
ఊరుకో, ఈ. అది మనిద్దరికీ తెలుసు.

26:14.366 --> 26:17.619
లేదు, నాకు తెలీదు. నువ్వు చెబితే వినాలని ఉంది.

26:18.203 --> 26:19.204
సరే.

26:21.874 --> 26:22.875
నేను చూడగలను.

26:24.418 --> 26:29.255
మీరిద్దరూ తెలివైన వారు, సున్నితమైనవారు,
ఒకే విధమైన ఆలోచనలు ఉన్నోళ్లు.

26:29.256 --> 26:33.677
ప్రపంచంలో ఇంకేం లేకుండా, అంతా చక్కగా నడిస్తే,

26:34.803 --> 26:38.098
మీరిద్దరూ ఒక చక్కని అంతర్ జాతి
కెన్ ఇంకా బార్బీలుగా ఉండేవారు.

26:39.224 --> 26:41.310
- కానీ ప్రపంచం అలాంటిది కా…
- ప్రపంచం కాదు.

26:42.060 --> 26:44.478
- అతని కుటుంబం.
- లేదు, నీకు అతని కుటుంబం

26:44.479 --> 26:47.356
- గురించి ఏం తెలీదు.
- హెనెస్సీలు పాతకాలపు ధనవంతులు,

26:47.357 --> 26:49.066
అంతా తమదే అనే రకం మనుషులు.

26:49.067 --> 26:53.613
వాళ్ళ దృష్టిలో జవాబుదారీతనం అనేది లేదు,
నీతి అంటే వాళ్ళకి ఒక జోక్.

26:53.614 --> 26:56.200
డవీడ్ ని అరెస్ట్ చేయడానికి వెనుక నుండి
డొంక కదిలించింది ఎవరు అనుకుంటున్నావు?

26:56.992 --> 26:59.702
అలాంటి పనులు హెనెస్సీ కుటుంబమే చేస్తుంది.

26:59.703 --> 27:01.787
తమ వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు.

27:01.788 --> 27:04.458
లేదు. నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు.

27:05.000 --> 27:06.834
రాబర్ట్ నాన్సీని చంపలేదు.

27:06.835 --> 27:09.337
తనకు ఒక లవర్ ఉన్నాడు. వాడి పేరు డేవిడ్,

27:09.338 --> 27:10.922
అలాగే ఆ డేవిడే తనని చంపాడు.

27:10.923 --> 27:14.383
- అయితే బహుశా రాబర్ట్ కి డేవిడ్ గురించి తెలుసేమో.
- అతనికి డేవిడ్ గురించి తెలీదు.

27:14.384 --> 27:16.552
నేను తనకి చెప్పేవరకు అతనికి ఆ సంబంధం
గురించి కూడా తెలీదు,

27:16.553 --> 27:18.680
పైగా నేను తనకి చెప్పేసరికి నాన్సీ చనిపోయింది.

27:19.473 --> 27:20.682
ఒక్క క్షణం ఆగు. నువ్వు…

27:22.935 --> 27:26.729
నువ్వు అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని
రాబర్ట్ కి చెప్పావా?

27:26.730 --> 27:27.731
అవును.

27:28.524 --> 27:30.107
ఎందుకంటే అతను కంగారు పడ్డాడు.

27:30.108 --> 27:32.401
పోలీసులకు ఫోన్ చేయబోయాడు,
కానీ నేను సాయం చేయాలి అనుకున్నా.

27:32.402 --> 27:36.240
ఈ మధ్య నీకు నిరంతరం రాబర్ట్ కి సాయం
చేయడమే సరిపోతోంది అనిపిస్తోంది.

27:38.700 --> 27:40.535
నువ్వు వాడికి బ్యాకప్ ప్లాన్ కావాలి అనుకున్నావు.

27:40.536 --> 27:44.455
నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీడం లేదు.

27:44.456 --> 27:45.707
- ఓహ్, అవునా?
- అవును.

27:58.637 --> 28:00.638
అమ్మ జైలుకి వెళ్ళింది అంటే నమ్మలేకపోతున్నా.

28:00.639 --> 28:04.225
నేనేం వెళ్ళలేదు.
నేను పౌర అవిధేయతను కనుపరిచాను,

28:04.226 --> 28:06.353
ఆ హక్కు మనందరికీ ఉంది.

28:09.356 --> 28:11.357
కానీ మిమ్మల్ని భయపెట్టినందుకు క్షమించండి.

28:11.358 --> 28:12.942
- నాకేం భయం వేయలేదు.
- సరే.

28:12.943 --> 28:13.944
నాన్న భయపడ్డారు.

28:19.032 --> 28:21.200
ఏంటి? హేయ్, నేను ఇంకా అది తింటున్నా.

28:21.201 --> 28:22.493
ఇక తినడం ముగించుకుని పోదాం.

28:22.494 --> 28:24.370
ఎవరైనా నాకు శుభ్రం చేయడంలో సాయం చేస్తానంటే ఉండొచ్చు.

28:24.371 --> 28:25.496
- నాకు అవ్వదు!
- నాకు అవ్వదు.

28:25.497 --> 28:26.873
హేయ్, హేయ్. లేదు, లేదు. హా…

28:26.874 --> 28:28.375
ఇలా… జూని, వెనక్కి రా.

28:28.917 --> 28:30.919
- నేను సాయం చేస్తా. నేను సాయం చేస్తా.
- థాంక్స్.

28:32.629 --> 28:33.630
వాళ్ళు భయపడ్డారు.

28:34.214 --> 28:36.257
వాళ్లకు చెప్పడం ఇష్టం లేదు, కానీ భయపడ్డారు.

28:36.258 --> 28:39.428
నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా పోయావు,
పైగా పోలీసుల నుండి ఫోన్ వచ్చింది.

28:43.098 --> 28:44.516
తనంటే నీకు చాలా ప్రేమ అని నాకు తెలుసు,

28:45.392 --> 28:46.727
కానీ నీకు పిల్లలు కూడా అంతే.

28:48.604 --> 28:50.898
వాళ్ళు… వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు.
వాళ్ళకి నువ్వు కావాలి.

28:51.481 --> 28:53.567
- నువ్వు మాకు కావాలి.
- నాకు ఎలా ఆపాలో…

28:54.109 --> 28:56.236
నాకు అది ఎలా వదలాలో తెలీడం లేదు, సరేనా?

28:58.822 --> 29:02.242
థాంక్స్, ఎలనోర్,
నూడుల్స్ వండటానికి సాయం చేసినందుకు.

29:03.827 --> 29:04.870
అదేం పర్లేదు.

29:17.799 --> 29:19.175
అతనికి భయపడే హక్కు ఉంది.

29:19.176 --> 29:20.552
అవును. అవును.

29:22.179 --> 29:24.932
సరే, నేను చెప్పేది ఒక విషయం నువ్వు
విమర్శించకుండా వినాలి.

29:26.767 --> 29:27.850
దేని గురించి?

29:27.851 --> 29:31.313
నేను డవీడ్ అడ్రెస్ కనుగొన్నాను.

29:32.940 --> 29:35.775
- లేదు.
- మనం కేవలం తన ఫ్రెండ్స్ అన్న కారణంతో

29:35.776 --> 29:38.945
వాళ్ళు మనకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం
లేదన్నట్టు వ్యవహరించడం నీకు చిరాకు పుట్టడం లేదా?

29:38.946 --> 29:40.863
- అవును, వస్తోంది.
- అతను దాన్ని పెయింట్ చేసాడు.

29:40.864 --> 29:42.490
అతను దానితో కలిసి పెయింట్ చేసాడు.

29:42.491 --> 29:45.117
జరిగింది ఏంటో అతనికి కొంచెం తెలిసి ఉండొచ్చు.

29:45.118 --> 29:47.162
మనం విచారణకు భంగం కలిగించకూడదు.

29:51.667 --> 29:53.085
తను మాట్లాడటం లేదు.

29:54.253 --> 29:55.546
ఎవరు?

29:56.421 --> 30:00.259
యూట్యూబ్ లో మానసికబాధకు సంబంధించిన కౌన్సిలర్ ఒకామె ఉంది,

30:02.010 --> 30:06.515
ఆమె చనిపోయిన మన వారితో మాట్లాడమని చెబుతుంది.

30:07.474 --> 30:08.975
కాబట్టి నేను అదే చేసి చూసా.

30:08.976 --> 30:12.186
అంటే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు
లేదా అందరూ పడుకున్నప్పుడు,

30:12.187 --> 30:14.022
లేదంటే వాళ్ళు నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు.

30:15.607 --> 30:17.358
నేను తనతో మాట్లాడతాను అంతే.

30:17.359 --> 30:21.320
అంతా చెప్తాను, అంటే, ఆర్టీకి ఇంకొక పన్ను ఊడింది అని,

30:21.321 --> 30:24.658
అలాగే హోవర్డ్ కి ఒక కొత్త ఉద్యోగం వచ్చే
అవకాశం ఉందని, కానీ…

30:27.452 --> 30:28.620
కానీ అది ఏం మాట్లాడదు.

30:34.042 --> 30:35.377
తిరిగి ఒక్క మాట కూడా చెప్పదు.

30:39.256 --> 30:41.091
అలాగే నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.

30:43.177 --> 30:44.178
దయచేసి సాయం చెయ్.

30:54.855 --> 30:55.938
హలో.

30:55.939 --> 30:57.815
నన్ను ఒంటరిగా వదిలేయండి.

30:57.816 --> 31:01.569
సర్, మేము రిపోర్టర్లం కాదు,
మేము పోలీస్ ఆఫీసర్లం కాదు.

31:01.570 --> 31:03.613
మేము నాన్సీ స్నేహితురాళ్ళం మాత్రమే.

31:03.614 --> 31:05.032
మేము మాట్లాడాలి అనుకుంటున్నాం.

31:06.074 --> 31:07.575
వెళ్లిపోండి.

31:07.576 --> 31:08.701
లేదు.

31:08.702 --> 31:10.871
మేము ఎక్కడికీ వెళ్లము.

31:11.788 --> 31:14.333
- మమ్మల్ని లోనికి రానివ్వండి. ప్లీజ్.
- మేరీ.

31:15.000 --> 31:16.792
నీకు మతిపోయిందా?

31:16.793 --> 31:19.505
ప్లీజ్. ఆమె మా ఫ్రెండ్.

31:21.340 --> 31:22.341
ప్లీజ్.

31:54.581 --> 31:58.126
ఆమె ఒక కలెక్టర్ దగ్గర నా పెయింటింగ్ చూసి
నాకు ఫోన్ చేసింది.

31:58.710 --> 32:02.380
నేను ఆమె కూడా ఇతర తెల్లజాతి మహిళలలాంటిది అనుకున్నా,
ఏం అనుకోకండి,

32:02.381 --> 32:06.259
అంటే నా ఉద్దేశం తమ అసలుతనాన్ని పెయింట్
చేయమని అడిగే రకాలలో ఒకత్తె అని.

32:06.260 --> 32:07.553
కానీ కొన్నిసార్లు పెయింట్ చేసాక,

32:08.720 --> 32:10.721
ఆమె పూర్తిగా భిన్నమైన మనిషి అని అర్థమైంది.

32:10.722 --> 32:13.057
ఆమె తన గాయాల మచ్చలను పెయింట్ వేయమని అడిగింది.

32:13.058 --> 32:15.601
ఆమె కారణమైన ఒక ప్రమాదంలో
ఏర్పడిన గాయపు మచ్చలు అంది.

32:15.602 --> 32:18.229
ఆమె ఆ గాయాల మచ్చలు తన వల్ల ఏర్పడ్డాయి అందా?

32:18.230 --> 32:20.106
అవి ఖచ్చితంగా ఆమె కారణంగా ఏర్పడినవి కాదు.

32:20.107 --> 32:25.111
డవీడ్, ఆ ఫొటోలో, మీరిద్దరూ
ఒకరికి ఒకరు చాలా బాగా తెలుసు అన్నట్టు ఉంది.

32:25.112 --> 32:28.197
అసలు నాకు ఆ ఫోటో సరిగ్గా గుర్తు కూడా లేదు.

32:28.198 --> 32:29.949
ఆమె పార్టీలో ఉన్నదే తక్కువ.

32:29.950 --> 32:31.325
ఆమెతో పాటు వచ్చిన వాడికి

32:31.326 --> 32:33.077
- అక్కడ ఉండటం నచ్చలేదు.
- ఏంటి?

32:33.078 --> 32:34.745
ఆమెతో పాటు వచ్చినవాడు అంటే ఏంటి అర్థం?

32:34.746 --> 32:36.832
డవీడ్, అతను ఎలా ఉన్నాడో నీకు గుర్తుందా?

32:37.916 --> 32:38.917
అతను తెల్లవాడు.

32:39.751 --> 32:41.544
అంటే తను రాబర్ట్ తో కలిసి వెళ్లి ఉంటుందా?

32:41.545 --> 32:43.964
లేదు. లేదు, అతను ఆ ఫోటోని ముందెప్పుడూ చూడలేదు.

32:45.883 --> 32:46.966
ఒకసారి ఇది చూస్తావా…

32:46.967 --> 32:49.051
- అతను నాకు చెప్పి ఉండేవాడు.
- ఆగు.

32:49.052 --> 32:50.720
ఒకసారి నాకోసం ఈ ఫోటోని చూస్తావా?

32:50.721 --> 32:52.597
నువ్వు ఇతన్ని గుర్తుపట్టగలవా?

32:52.598 --> 32:55.391
నాకు అతని జాతికి మిన్నగా ఏమైనా గుర్తుండి ఉంటే,
నేను ముందే చెప్పేవాడిని.

32:55.392 --> 32:57.101
నేను పోలీసులకు చెప్పా. ఇప్పుడు అది వాళ్ళ బాధ్యత.

32:57.102 --> 32:59.770
- నువ్వు ఫోటోని సరిగ్గా చూడలేదు.
- లేదు, మీరు మీ ఆఖరి ప్రశ్న అడిగారు.

32:59.771 --> 33:00.856
ఇది…

33:01.690 --> 33:03.901
నన్ను జైలులో పెట్టారు. ఎందుకని?

33:04.651 --> 33:06.569
నేను ఏం చేయలేదు. ఏం చేయలేదు.

33:06.570 --> 33:09.489
సరే. ఇప్పటికీ మీ టైమ్ చాలా వృధా చేసాం.

33:10.741 --> 33:12.034
థాంక్స్.

33:15.412 --> 33:16.580
మీరు ఏమైపోయారు?

33:17.456 --> 33:18.582
ఏమన్నావు?

33:19.374 --> 33:21.460
మీ బెస్ట్ ఫ్రెండ్ మానసికంగా కృంగిపోయింది.

33:22.252 --> 33:24.337
తన దుఃఖంలో తానే మునిగిపోయింది.

33:24.338 --> 33:25.672
నాకు కనిపించింది అదే.

33:26.256 --> 33:27.673
నేను పెయింట్ చేసింది అదే.

33:27.674 --> 33:30.259
మరి, ఆమెకు మీరు అవసరమైన సమయంలో
మీరు ఏమైపోయారు?

33:30.260 --> 33:31.594
ఆమె ఆ బాధని దాచలేదు.

33:31.595 --> 33:35.098
మీరు అది చూడలేదంటే, దానర్థం కావాలనే చూడలేదు అని.

33:36.600 --> 33:38.769
పదా. పదా, నడువు.

33:42.397 --> 33:45.399
ఆ సెంటర్ పీస్ లు ఇంకాస్త
ఒకే రీతిగా ఉంటే బాగుంటుంది.

33:45.400 --> 33:48.486
అలాగే ప్రతీ మూల ముగ్గురు ఉండాలి.
జనం ఇరుక్కుని వెళ్ళకూడదు.

33:48.487 --> 33:50.780
- లేదు. కార్యక్రమం జరిగినంత సేపూ. సరేనా? థాంక్స్.
- …నీ తప్పే.

33:50.781 --> 33:52.073
నీ తప్పు.

33:52.074 --> 33:53.908
- తను కావాలని…
- నీకు నచ్చలేదు.

33:53.909 --> 33:55.160
నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పా…

34:04.294 --> 34:06.129
హేయ్. అంతా బానే ఉందా?

34:06.672 --> 34:08.381
నేను వద్దని ఎంత అరిచినా

34:08.382 --> 34:11.717
మా వాళ్ళు పోలీసులపై ఒత్తిడి పెట్టడానికి ఆ
విపత్తుల పీఆర్ కంపెనీని పనికి పెట్టారు.

34:12.469 --> 34:14.179
ఆ ఫోటోని లీక్ చేసినోళ్లు వాళ్ళే.

34:14.763 --> 34:16.014
అసలు నువ్వు ఇది నమ్మగలవా?

34:16.889 --> 34:19.476
డవీడ్ బోయెట్ ని అరెస్ట్ చేయడానికి
కారణం అదే. నా కుటుంబం.

34:20.101 --> 34:21.477
అది చాలా దారుణం.

34:21.478 --> 34:24.147
అలా చేస్తే ప్రెస్ వారు మా మీద పడకుండా
ఉంటారు అనుకున్నారు.

34:24.773 --> 34:26.189
ఎంతైనా ఒక అమాయకుడు జైల్లో వారాల పాటు

34:26.190 --> 34:29.069
గడపాల్సి వచ్చినా లెక్క చేసేవాడు ఎవడున్నాడు చెప్పు?

34:30.362 --> 34:34.533
అంటే నువ్వు అతన్ని ఎప్పుడూ కలవలేదు, కదా?

34:35.324 --> 34:36.408
ఎవరిని కలవలేదు?

34:36.409 --> 34:37.411
డవీడ్.

34:38.203 --> 34:40.289
అలాగే అతన్ని నువ్వు మొదటిసారి చూడటం
న్యూస్ లోనే కదా.

34:40.998 --> 34:43.541
ఎలనోర్, నువ్వు ఇక్కడే ఉన్నావు.
మనిద్దరం కలిసే వాడిని చూసాం.

34:43.542 --> 34:44.709
నువ్వు ఏం అంటున్నావు?

34:44.710 --> 34:47.295
నేను… లేదు, నేను ఏమీ అనడం లేదు. నేను…

34:49.047 --> 34:52.841
పరపతి ఉన్న కుటుంబంలో పుట్టడం ఎలా
ఉంటుందో నాకు తెలుసు.

34:52.842 --> 34:56.428
కొన్నిసార్లు వాళ్ళు వెనుక నుండి చేసే పనులు మనం చూడలేం.

34:56.429 --> 35:01.143
పోనిలే, నువ్వైతే ఎలాగో నీ సొంత ప్రపంచాన్ని
సృష్టించుకున్నావు కదా.

35:01.852 --> 35:03.520
- అలా అనిపిస్తుందా?
- అవును.

35:04.146 --> 35:08.567
నాకు నిరంతరం మా వాళ్ళు నా వెనుకే
ఉన్నట్టు అనిపిస్తోంది.

35:10.444 --> 35:12.529
అవును, కానీ నువ్వు నీ మనసుకు
దగ్గరైన పనులు చేస్తున్నావు.

35:15.073 --> 35:17.075
నాకు అది చాలా నచ్చింది.

35:17.576 --> 35:18.952
నువ్వు మొదటి నుండీ అంతే.

35:20.287 --> 35:21.288
నాన్నా?

35:22.206 --> 35:23.207
నాన్నా!

35:26.919 --> 35:28.836
- హేయ్.
- అమ్మ వస్తువులను ఎందుకు బాక్స్ లో పెట్టారు?

35:28.837 --> 35:30.881
నేను… నేను వాడిని సర్దుతున్నాను.

35:31.465 --> 35:33.299
నువ్వు వాటిని తీసేయకూడదు.

35:33.300 --> 35:35.051
కోరా, నేను అలా ఏం చేయలేదు.

35:35.052 --> 35:36.344
నువ్వు అర్థం చేసుకోవాలి,

35:36.345 --> 35:38.930
ఆమె వస్తువులు నిరంతరం నా చుట్టూనే
ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది.

35:38.931 --> 35:40.933
అయితే ఏంటి? అందుకని ఆమె జ్ఞాపకాలు చెరిపేస్తావా?

35:42.351 --> 35:44.810
లేదు. లేదు, తను అలా చేయలేడు.

35:44.811 --> 35:46.354
అది అసాధ్యం, కోరా.

35:46.355 --> 35:48.105
నాకు మిగిలింది ఇదే!

35:48.106 --> 35:51.400
నా తల్లికి సంబంధించి నాకు మిగిలింది
ఈ బాక్సుల్లో ఉన్నవే.

35:51.401 --> 35:52.735
నేను అర్థం చేసుకోగలను, బంగారం. నేను…

35:52.736 --> 35:54.696
కోరా. ఇలా రా.

36:02.955 --> 36:06.959
నా కారు మా నాన్న చనిపోకముందు
వాడిన కారు అని తెలుసా?

36:08.335 --> 36:12.339
అలాగే ఈ నెక్లేస్ కూడా ఆయన ఇచ్చిందే.

36:13.757 --> 36:17.844
చివరికి ఆయన వాడిన చేపల గాలం
కూడా గోడకి తగిలించి పెట్టుకున్నా,

36:17.845 --> 36:20.179
ఎందుకంటే ఆయన ఉనికి నాకు తెలియాలని.

36:20.180 --> 36:22.766
అందుకే నా మనసుకు దగ్గరైన
వస్తువులు అన్నీ నా దగ్గరలో ఉంచుకుంటా.

36:24.434 --> 36:25.602
నువ్వు కూడా అలాగే చేయొచ్చు.

36:26.436 --> 36:29.272
నువ్వు వీటిని చూస్తూ,

36:29.273 --> 36:33.110
ఆమెను నీకు గుర్తు చేసే ప్రతీ దాన్ని తీసుకో.
దాన్ని నీకు దగ్గరగా ఉంచుకో.

36:34.444 --> 36:35.945
మిగతావాటిని,

36:35.946 --> 36:38.949
ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చోట పెడతాం.

36:39.491 --> 36:42.744
అంటే, ఓహాయ్ ఇంట్లో పెడతాంలే.

36:43.912 --> 36:47.249
అప్పుడు నీకు ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా
అక్కడికి వెళ్లొచ్చు.

36:48.458 --> 36:49.459
సరే.

36:51.712 --> 36:53.796
నువ్వు మీ అమ్మను ఎప్పటికీ వదలాల్సిన అవసరం లేదు.

36:53.797 --> 36:56.633
మీ నాన్న ఎప్పుడూ నిన్ను అలా చేయమని అడగడు.

37:07.436 --> 37:08.437
బంగారం.

37:11.982 --> 37:13.066
హేయ్, థాంక్స్.

37:19.781 --> 37:21.742
వద్దు అన్నందుకు నేను దాన్ని నిందించను.

37:22.451 --> 37:24.870
స్కూల్ లో ఖచ్చితంగా ఇక్కడి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది.

37:27.289 --> 37:29.123
ఈ పుట్టినరోజుని నేను దారుణంగా పాడు చేశా.

37:29.124 --> 37:32.084
ఆమె కోసం పార్టీ పెట్టమని పట్టుబట్టింది నేనే కదా.

37:32.085 --> 37:34.129
నువ్వు చాలా సాయం చేసావు.

37:34.713 --> 37:36.465
నాకు తెలిసి కోరాకి కొంత సమయం కావాలి అనుకుంట.

37:37.633 --> 37:39.050
ఇది చాలా సహజంగా ఉంది, తెలుసా?

37:39.051 --> 37:41.178
ఎవరూ ఒక బిడ్డని తల్లిలేని లోటుకి రెడీ చేయలేదు.

37:41.720 --> 37:43.347
ఎవరూ మనల్ని రెడీ చేయలేదు.

37:46.141 --> 37:49.561
తెలుసా, పోలీసులు వచ్చి ఆమె వస్తువులు
తీసుకెళ్లినప్పుడు, నాకు ఎందుకో కాస్త హాయిగా అనిపించింది.

37:50.395 --> 37:54.106
నాకు తన జ్ఞాపకాలు తుడిచేయాలని లేదు,
కానీ నేను ఎక్కడ చూసినా

37:54.107 --> 37:58.819
ఆమె వస్తువులలో ఒకటి తనకున్న రహస్య
జీవితం గురించి నాకు అరిచి చెప్పినట్టు ఉండేది.

37:58.820 --> 38:00.948
తను నా నుండి దాచిన ఆ దారుణమైన అక్రమ సంబంధం.

38:02.783 --> 38:05.619
నాకు మతిపోతోంది. నా చుట్టూ అదే కనిపిస్తోంది.

38:09.498 --> 38:13.252
పోనిలే, ఈ వస్తువులు అన్నీ పెట్టడానికి
ఆ ఓహాయ్ ఇల్లు సరిగ్గా సరిపోతుంది.

38:14.002 --> 38:15.003
అవును.

38:15.629 --> 38:18.048
ఇకపై అక్కడికి ఒంటరిగా వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది.

39:15.981 --> 39:17.983
ఆర్ట్ సరఫరాలు
ఇతర

39:31.079 --> 39:32.581
ఆర్ట్ పుస్తకాలు

40:05.322 --> 40:08.157
ఆమె దానితో నా కుటుంబంలో ఉన్న అందరినీ భయపెట్టింది.

40:08.158 --> 40:09.826
ఇది ఎవరికీ నచ్చేది కాదు.

40:10.327 --> 40:11.994
కానీ ఇంతకంటే తనని నవ్వించిన విషయం ఇంకొకటి లేదు.

40:11.995 --> 40:14.915
ఆమె దాన్ని వాడిన ప్రతీసారి
గంటల తరబడి నవ్వేది.

40:22.714 --> 40:24.007
భలే ఉంది.

40:33.976 --> 40:36.395
తను ఎంత బాధలో ఉందో నేను చూడలేకపోయా.

40:37.938 --> 40:43.150
తను పడుతున్న బాధని నేను ఎలా చూడలేకపోయా?

40:43.151 --> 40:44.820
హేయ్, మనలో ఎవరూ చూడలేదు.

40:46.196 --> 40:47.447
నేను మిస్ అయ్యాను.

40:48.198 --> 40:50.200
నేను అది… అది మిస్ అయ్యాను.

40:51.451 --> 40:54.161
హేయ్, అదేం పర్లేదు. నేను కూడా మిస్ అయ్యాను.

40:54.162 --> 40:55.247
ఓహ్, దేవుడా.

44:06.396 --> 44:09.441
నాకు రాబర్ట్ నచ్చాడా అని ఆమె ఒకసారి నన్ను అడిగింది.

44:14.404 --> 44:16.823
నేను ఎంత త్వరగా కాదు అన్నానో నాకు ఇంకా గుర్తుంది.

44:22.412 --> 44:27.084
నేను అబద్ధం చెప్తున్నాను అని తనకి తెలిసి ఉంటుంది.
తెలీకుండా ఎలా ఉంటుంది చెప్పండి?

44:31.922 --> 44:36.802
నాకు తనలా నటించడం అస్సలు రాదు.

44:37.761 --> 44:40.347
నా సొంత వాస్తవాన్ని నిర్మించుకోవడంలో.

44:43.308 --> 44:45.894
కాబట్టి బహుశా ఇదే నా అవకాశం ఏమో.

44:47.521 --> 44:49.398
అలాగే బహుశా తను అర్థం చేసుకుంటుందేమో.

44:50.190 --> 44:53.109
ఎందుకంటే తను కూడా అబద్ధం చెప్పింది.

44:53.110 --> 44:55.069
రాబర్ట్ కి అబద్ధం చెప్పింది.

44:55.070 --> 44:56.446
మా అందరికీ అబద్ధం చెప్పింది.

45:07.082 --> 45:11.086
నాన్సీ, నేను క్షమాపణలతో మొదలెట్టాలి.

45:11.837 --> 45:14.256
నేను చాలా అతిగా స్పందించాను.

45:15.424 --> 45:16.507
నేను నిన్ను చాలా బాధపెట్టా…

45:16.508 --> 45:17.592
రాబర్ట్ హెనెస్సీ

45:17.593 --> 45:19.928
…అలాగే నిన్ను దారుణంగా భయపెట్టినందుకు క్షమించు.

45:20.470 --> 45:22.889
కానీ నువ్వు ఇంకొకరితో పడుకుంటున్నందుకు

45:22.890 --> 45:24.641
నేను కోపపడినందుకు నన్ను నిందించకూడదు.

45:28.145 --> 45:30.981
హేయ్. నువ్వు బానే ఉన్నావా?

46:25.494 --> 46:27.496
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
